
హైదరాబాద్: ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఆన్ డిమాండ్ స్కిల్స్ వేగంగా మారిపోతున్నాయి. ఉద్యోగం తెచ్చుకునేందుకు మాత్రమే కాదు.. ఆ ఉద్యోగంలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే కూడా ఎప్పటికప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న నైపుణ్యాలు అవసరం. వీటిపై అగ్రగామి ప్రొఫెషనల్ నెట్‌వర్క్ సంస్థ లింక్డ్ఇన్.. ‘స్కిల్స్ ఆన్ ది రైజ్ 2025’ పేరుతో జాబితాను విడుదల చేసింది. వృత్తి నిపుణులు తమ ఉద్యోగ విధులలో ముందడుగు వేయడానికి నేర్చుకోవాల్సిన 15 నైపుణ్యాలను వెల్లడించింది.
భారతదేశంలో 2030 నాటికి చాలా ఉద్యోగాలలో ప్రస్తుతం ఉపయోగించే 64% నైపుణ్యాలు మారుతాయని అంచనా. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్ పరిశోధన ప్రకారం.. 25% మంది వృత్తి నిపుణులు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు తమకు లేవని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్‌లోని దాదాపు 10 మందిలో నలుగురు (46%) నిపుణులు ఉద్యోగానికి తాము సరిపోతామో లేదో నిర్ణయించుకోవడమే కష్టంగా భావిస్తున్నారు. 31% మందికి తమ నైపుణ్యాలలో ఏవి ఉద్యోగ అవసరాలకు సరిపోతాయో తెలియకపోవడంతో, ఏ నైపుణ్యాలు డిమాండ్‌లో ఉన్నాయో అర్థం చేసుకోవడం మరింత కష్టంగా మారింది.
మరోవైపు, భారతదేశంలో 69% మంది రిక్రూటర్లు నిపుణులకు ఉన్న నైపుణ్యాలకు, కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలకు మధ్య నైపుణ్య అంతరాలను నివేదిస్తున్నారు. చాలా పనులను ఏఐ ఆటోమేట్ చేస్తున్న నేపథ్యంలో మానవ నైపుణ్యాలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇందులో సృజనాత్మకత, ఆవిష్కరణ, సమస్య పరిష్కారం, వ్యూహాత్మక ఆలోచన వంటి స్కిల్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఉద్యోగ విధుల్లో ఏఐ అక్షరాస్యత అనేది ఒక ప్రాథమిక అంచనాగా మారుతోంది.
టాప్ 15 నైపుణ్యాలు
1. సృజనాత్మకత, ఆవిష్కరణ
2. కోడ్ సమీక్ష
3. సమస్య పరిష్కారం
4. ప్రీ-స్క్రీనింగ్
5. వ్యూహాత్మక ఆలోచన
6. కమ్యూనికేషన్
7. అనుకూలత
8. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (LLM)
9. ఏఐ అక్షరాస్యత
10. డీబగ్గింగ్
11. కస్టమర్ ఎంగేజ్‌మెంట్
12. గణాంక డేటా విశ్లేషణ
13. ప్రాంప్ట్ ఇంజనీరింగ్
14. మార్కెట్ విశ్లేషణ
15. స్టేక్‌హోల్డర్ నిర్వహణ
హైదరాబాద్‌లో కొత్త ఉద్యోగాల అన్వేషణ
లింక్డ్ఇన్ నుంచి వచ్చిన తాజా పరిశోధన ప్రకారం.. హైదరాబాద్‌లోని 82% మంది వృత్తి నిపుణులు ఈ సంవత్సరం కొత్త ఉద్యోగం కోసం వెతకాలని యోచిస్తున్నారు. అయితే నగరంలో 56% మంది నిపుణులు తాము గతంలో కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నామని చెబుతున్నారు. కానీ స్పందన మాత్రం తక్కువగా ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో లింక్డ్ఇన్ తమ వార్షిక ‘జాబ్స్ ఆన్ ది రైజ్’ జాబితాలో భాగంగా గత మూడేళ్లలో ఎలాంటి ఉద్యోగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయో కూడా వివరించింది.
హైదరాబాద్‌లో అభివృద్ధి చెందుతున్న ఉద్యోగాలు
1. సేల్స్ డెవలప్‌మెంట్ ప్రతినిధి
2. కార్పొరేట్ రిలేషన్స్ మేనేజర్
3. సోర్సింగ్ మేనేజర్
4. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్
5. సేల్స్ మేనేజర్
6. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్
7. సోషల్ మీడియా మేనేజర్
8. హ్యూమన్ రిసోర్సెస్ ఆపరేషన్స్ మేనేజర్
9. పైపింగ్ డిజైనర్
10. కమర్షియల్ మేనేజర్
Comments
Please login to add a commentAdd a comment