Skill
-
ఉపాధి కల్పనలో గేమ్ ఛేంజర్!
మన సంప్రదాయ విద్యావ్యవస్థ తయారు చేస్తున్న విద్యావంతులు నైపుణ్యాల లేమితో కునారిల్లుతున్నారు. ఒకవైపు ఏటికేడాది నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూ ఉంటే... మరోవైపు పరిశ్రమలు నైపుణ్యం గలవారు దొరక్క సమస్యల నెదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని మార్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ని స్థాపించింది. విద్యా సంస్థలు– పరిశ్రమల సమన్వయం ఆధారంగా ఇది పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. మొత్తం మీద రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కాని లాంటి దార్శనిక సంస్థ ఇది. భారతదేశం ఇప్పుడు ఓ పరివర్తన దశలో ఉంది. నవ నవోన్మేషంతో ఉరకలెత్తే యువత అభివృద్ధిలో మరింత ఎత్తుకు ఎదిగే అవకాశం ఒకపక్క ఉంటే... నిరు ద్యోగం మునుపెన్నడూ లేనంత స్థాయిలో ఉండటం, నైపుణ్యాలతో కూడిన మానవ వనరుల కోసం కర్మాగారాలు సమస్యలను ఎదుర్కో వడం ఇంకో పక్కన ఉన్నాయి. ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సి టీ’ని స్థాపించడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఈ సవాలును ఎదు ర్కొనేందుకు సిద్ధమైంది. దేశంలో మునుపెన్నడూ లేని చందంగా విద్య, ఉపాధుల మధ్య వారధిగా నిలవడంతోపాటు... రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు దారి చూపే ఒక చుక్కానిలాంటి దార్శనిక సంస్థ ఇది. నైపుణ్యాలతో కూడిన మానవ వనరులను అందించి పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ వర్సిటీ ఎంతగానో ఉపకరిస్తుంది. ఎందుకంటే... ఇక్కడ పరిశ్రమలే తమకు అవసరమైన నైపు ణ్యాల్లో యువతకు శిక్షణ ఇచ్చి కార్మికులుగా, ఉద్యోగులుగా, ఇంజ నీర్లుగా ఉద్యోగాలిస్తాయి.దేశంలో ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు పట్టభద్రులు అవు తున్నారు. పట్టభద్రుల్లో 47 శాతం మందికి పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేని కారణంగా ఉద్యోగార్హత లేదని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే ఏటా రెండు లక్షల మంది ఇంజినీర్లు, మరో రెండు లక్షల మంది సాధారణ డిగ్రీలు, ఐటీఐ, డిప్లోమా కోర్సులు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దురదృష్టవశాత్తు సంప్రదాయ విద్యా వ్యవస్థలో సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫలితంగా ఈ వ్యవస్థ నుంచి బయ టకు వచ్చేవారికి నిజ జీవిత సవాళ్లను ఎదుర్కోవడం కష్టసాధ్య మవుతోంది. పాతబడిపోయిన పాఠ్యాంశాలు, ప్రాక్టికల్ ట్రెయినింగ్ తక్కువగా ఉండటం, సాఫ్ట్ స్కిల్స్‌కు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటివి... నైపుణ్యాల కొరతను ఎక్కువ చేశాయి. ఐటీ, ఉత్పాదన, ఆరోగ్య రంగం, సంప్రదాయేతర విద్యుత్తు... ఇలా ఏ రంగం తీసు కున్నా చాలామంది తాజా పట్టభద్రుల్లో నైపుణ్యాల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఫలితంగా ఓ విచిత్రమైన ద్వైదీభావం ఏర్పడుతోంది. విద్యార్థులేమో ఉద్యోగాల కోసం... పరిశ్రమల వారేమో శిక్షణ, తగిన నైపుణ్యాలున్న వారి కోసం నిత్యం వెతుకుతూనే ఉన్న పరిస్థితి ఉంది. అందుకే నైపుణ్యాలే కేంద్ర బిందువుగా ఉండే విద్యా వ్యవస్థలోభాగంగా పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్యాలను ప్రోదిచేసే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఈ యూనివర్సిటీ దేశంలోనే మొట్ట మొదటిది మాత్రమే కాదు, విప్లవాత్మకమైంది కూడా. నిరుద్యోగ యువత సాధికారత కోసం ఉద్దే శించింది. వివిధ రంగాల్లో డిమాండ్ ఉన్న నైపుణ్యాలను గుర్తించి వాటిల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. ఆధునిక టెక్నాలజీలను నిజ జీవిత పరిస్థితుల్లో విద్యార్థులకు ప్రాక్టికల్‌గా ట్రెయినింగ్ ఇస్తారు. తద్వారా విద్యార్థులు కేవలం పట్టభద్రుల్లా కాకుండా... అసలైన వృత్తి నిపుణుల్లా తయారవుతారు. విద్యా సంస్థలు, పరిశ్రమల సమన్వయం ఆధారంగానే ఈ వర్సిటీ పనిచేస్తుంది. విద్యార్థులు సంప్రదాయ పరీక్షల విధానంలోనే కాకుండా... ఫ్యాక్టరీల్లో, పెద్ద పెద్ద కంపెనీల్లో ‘ఆన్ హ్యాండ్’ పద్ధతిలో నైపుణ్యాలను నేర్చుకుంటారు. అప్రెంటిస్‌లుగా పనిచేస్తారు. అది కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సంప్రదాయేతర ఇంధన వనరుల వంటి అత్యాధునిక టెక్నాలజీరంగాల్లో! పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా బోధనాంశాలను రూపొందించడం వల్ల తెలంగాణ విద్యార్థులకు డిమాండ్ పెరుగుతుంది. మంచి జీతం వచ్చే అవకాశం ఉంటుంది. వీరంతా ఉద్యోగాల్లో స్థిరపడితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించిన వారవుతారు. ఈ ఏడాది నవంబరు 4న ఏడు కోర్సులతో అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం తెలిసిందే. పూర్తి స్థాయిలో కార్యకలాపాలు మొదలు పెడితే తయారీ, సేవా రంగాలకు చెందిన 18 అంశాల్లో కోర్సులు ఉంటాయి. వర్సిటీ నిర్మాణం కోసం ముచ్చెర్ల వద్ద ‘నెట్‌జీరో సిటీ’లో 150 ఎకరాల స్థలం కేటాయించాం. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ. 200 కోట్లతో వర్సిటీ నిర్మాణాన్ని చేపట్టింది. దేశంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్త ఆనంద్ మహింద్రా ఇప్పటికే వర్సిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు కూడా. ఆనంద్ మహింద్రా నాయకత్వం, దార్శనికతలు ఈ విశ్వవిద్యాలయాన్ని నైపుణ్యాభివృద్ధి విషయంలో దేశానికే ఆదర్శంగా నిలుపుతాయనడంలో సందేహం లేదు. మరో పక్క రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐల ఆధునికీకరణ కూడా చేపట్టాం. అడ్వాన్స్డ్ ట్రెయినింగ్ సెంటర్లుగా వీటిని ఇప్పటికే అప్ గ్రేడ్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇకపై ఈ సెంటర్లు స్కిల్స్ యూనివర్సిటీ సిలబస్ ప్రకారం విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్నిఅందిస్తూ... ప్రస్తుతం పరిశ్రమల్లో అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణఅందిస్తాయి. ఈ ఆధునికీకరణ కారణంగా నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణలో ఒక సమగ్రమైన ప్రతిభావంతుల వ్యవస్థ ఏర్పాటు అవుతుంది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పరిశ్రమలు కూడా పాలుపంచు కునేలా చేస్తున్నాం. తద్వారా వారు తమకు అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చుకునే వీలేర్పడుతుంది. అంటే పరిశ్రమలే తమకు అవసర మైన మానవ వనరులను తయారు చేసుకుంటాయన్నమాట. ప్రత్యేక కార్యక్రమాలు, కోర్సుల ద్వారా పరిశ్రమల అవసరాల న్నింటినీ వర్సిటీ తీరుస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, టీమ్ వర్క్, నాయకత్వం వంటి సాఫ్ట్ స్కిల్స్‌పై కూడా శిక్షణ ఇస్తుండటం వల్ల పరిశ్రమలకు అన్ని నైపుణ్యాలున్న మానవ వనరులు లభిస్తాయి. యువత సొంతంగా పరిశ్రమలు స్థాపించుకునేలా ప్రోత్సహించేందుకు కూడా ఈ వర్సిటీ చర్యలు తీసుకుంటుంది. ఉపాధి అవకాశాల్లో గేమ్ ఛేంజర్స్కిల్స్ యూనివర్సిటీ ఉద్యోగ ప్రపంచంపై చూపే ప్రభావాన్ని ఏమాత్రం తక్కువ చేయలేం. ఆధునిక నైపుణ్య శిక్షణకు వాస్తవిక విద్య కూడా తోడవడం వల్ల నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనేందుకు ఇదో మేలిమి సాధనంగా మారనుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు లక్షల్లో ఉంటే ఖాళీలు వేలల్లో మాత్రమే ఉంటా యన్నది తెలిసిన విషయమే. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు ఉన్న అవకాశం 0.1 నుంచి ఒక శాతం మాత్రమే అన్నమాట. ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాల అవసరాన్ని ఈ అంకెలే చెబు తున్నాయి. ప్రైవేట్ రంగంలో నైపుణ్యాలున్న వారికి ఉద్యోగ అవ కాశాలు మెండు. అందుకే తెలంగాణ ప్రభుత్వపు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ దేశానికి ఒక మోడల్‌గా ఉపయోగపడుతుందని చెప్పడం! స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సులు రెండు వేల మందితో మొద లవుతాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్య పదివేలకు చేరుతుంది. క్రమంగా ఇది 30 వేలకు చేరుతుంది. యూనివర్సిటీ భవన నిర్మాణాలు పూర్త య్యేంత వరకు గచ్చిబౌలిలోని ‘ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ఇండియా’ (ఈఎస్సీఐ), హైటెక్ సిటీలోని ‘నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్’ ప్రాంగణాల్లో ప్రస్తుతం శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. వర్సిటీ ఫీజుల విషయంలోనూ తెలంగాణ ప్రభుత్వం చాలా స్పష్టతతో ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాల వారందరికీ ఫీజుల్లో రాయితీ ఉంటుంది. వర్సిటీ కార్యకలాపాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ. 100 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. ఇది ప్రారంభమే కాదు... ఉపాధి విప్లవానికి రాచబాట!- వ్యాసకర్త తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి- దుద్దిళ్ల శ్రీధర్ బాబు -
అనుభవానికే ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ నియామకాల్లో ఐటీ ఉద్యోగం సంపాదించాలనేది దాదాపు అందరు విద్యార్థుల కోరిక. కానీ 2025లో క్యాంపస్ నియామకాలు అరకొరగానే ఉంటాయని స్కిల్ ఇండియా రిపోర్ట్–2025 అంచనా వేసింది. ఫ్రెషర్స్‌ను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ఐటీ కంపెనీలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. సంస్థలు గతంలో కొత్త ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఎంపిక చేసుకుని, వారికి అవసరమైన శిక్షణ ఇచ్చేవి. ఇప్పుడా పరిస్థితి లేదని పరిశ్రమ వర్గాలను ఉటంకిస్తూ ఈ రిపోర్ట్స్పష్టం చేసింది. కృత్రిమ మేధ సాంకేతికత వినియోగంవైపు కంపెనీలు మొగ్గుచూపటమే ఇందుకు ప్రధాన కారణమని తెలిపింది. ప్రస్తుతం ఐటీ పరిశ్రమలో అనుభవం ఉన్నవాళ్లకే ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి. 2025లో 33 శాతం కంపెనీలు ఏఐ టెక్నాలజీపై పట్టున్న నిపుణులనే ఉద్యోగాల్లోకి తీసుకొంటాయని అంచనా వేశారు. ఐటీ రంగంలో కనీసం ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి మంచి అవకాశాలుంటాయని నివేదికలో పేర్కొన్నారు.ఫ్రెషర్స్‌లో నైపుణ్యం కొరతకొత్తగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులను ఏ ప్రశ్న వేసినా.. చాట్ జీపీటీలో సెర్చ్ చేస్తున్నారని ప్రధాన కంపెనీలు పేర్కొంటున్నాయి. స్వతహాగా ఆలోచించే శక్తి వారిలో కన్పించడం లేదని అంటున్నాయి. భారత పరిశ్రమల సమాఖ్య, పలు యూనివర్సిటీలు, ప్రముఖ ఐటీ కంపెనీలు కలిసి నూతన ఇంజనీరింగ్ పట్టభద్రుల నైపుణ్యాలను పరీక్షించాయి. 86 శాతం విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం అవసరాలకు తగ్గట్టుగా లేదని గుర్తించాయి. 2025లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి అవకాశాలు 14 శాతానికి మించి ఉండకపోవచ్చని అంచనా వేశాయి. ఇంజనీరింగ్ సిలబస్‌లో ప్రస్తుత తరానికి పనికివచ్చే అంశాలు ఉండటం లేదని నిపుణులు గుర్తించారు. వీరికన్నా ఏఐ టెక్నాలజీ పది రెట్లు ఎక్కువ ఉపయోగపడుతుందని పలు సంస్థలు అంటున్నాయి. అయితే, ఐటీ సంస్థల్లో ఫ్రెషర్స్‌కు అవకాశం వస్తే మాత్రం.. వారికి వేతనాలు భారీగానే ఉండొచ్చని నివేదిక వెల్లడించింది. మెరుగు పెట్టేందుకు మండలి కృషిప్రాంగణ నియామకాలు తగ్గిపోయే పరిస్థితి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు నైపుణ్య కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. వారి స్కిల్స్‌ను పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. జేఎన్టీయూహెచ్ ఇన్చార్జ్ వీసీగా బాధ్యతలు చేపట్టిన ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి ముందుగా ఆ వర్సిటీ నుంచే ఈ ప్రయోగం మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఏఐ టెక్నాలజీతో కూడిన ఉద్యోగాలు పెరిగే అవకాశం ఉండటంతో ఇందుకు సంబంధించిన కొత్త కోర్సులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. -
తప్పక నేర్చుకోవాల్సిన 7 నైపుణ్యాలు
వేగంగా మారిపోతున్న ఈ ప్రపంచంలో టీనేజర్లు సంతోషంగా ఉండాలంటే, సక్సెస్ సాధించాలంటే కేవలం మార్కులు, ర్యాంకులు, సోషల్ మీడియా లైకులు, ఫాలోయింగ్లు మాత్రమే సరిపోవు. వాటికి మించి ఏడు నైపుణ్యాలు అవసరం. అవేమిటో ఈ రోజు తెలుసుకుందాం.ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే తన భావోద్వేగాలను గుర్తించడం, అర్థం చేసుకోవడం, నియంత్రించడం, అలాగే ఇతరుల భావాలను అంగీకరించడం. కౌమారంలో భావోద్వేగాలు చాలా వేగంగా మారుతుంటాయి. వాటిని అర్థం చేసుకోవాలంటే ఈక్యూ అవసరం. తమ బంధాలను నిలబెట్టుకోవడంలో, ఒత్తిడిని నిర్వహించడంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. ఈక్యూను అభివృద్ధి చేసుకున్న టీనేజర్లు ఆరోగ్యకరమైన బంధాలు ఏర్పరచుకుంటారు. వివాదాలను సానుకూలంగా పరిష్కరించుకుంటారు. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు.టైమ్ మేనేజ్మెంట్స్మార్ట్ ఫోన్ నుంచి సోషల్ మీడియా వరకు టీనేజర్లను పక్కదారి పట్టించే అంశాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ డిస్ట్రాక్ష¯Œ ్స నుంచి తప్పించుకుని చదువుపై, కెరీర్ పై ధ్యాస నిలపాలంటే టైమ్ మేనేజ్మెంట్ తప్పనిసరిగా నేర్చుకోవాల్సిందే. తమ పనులను ప్రాధాన్యక్రమంలో అమర్చుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది అవకాశం ఇస్తుంది. ప్రణాళికలను రూపొందించుకుని, లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్చుకున్న టీనేజర్లు తమ బాధ్యతలను బ్యాలె¯Œ ్స చేసుకుంటారు. ఒత్తిడి లేకుండా ఉత్సాహంగా తమ లక్ష్యాలను సాధిస్తారు.క్రిటికల్ థింకింగ్ఈ రోజుల్లో సమాచారం సులువుగా లభిస్తోంది. అందులో ఏది నమ్మదగినదో, ఏది కాదో చెప్పలేం! అందుకే క్రిటికల్ థింకింగ్ అవసరం. ఇది టీనేజర్లలో స్వతంత్రతను పెంచుతుంది. అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, అనుసరించకుండా, విశ్లేషించి, వివిధ కోణాలను అంచనా వేసి, సమర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అందుకే టీనేజర్లు ఈ స్కిల్‌ను అలవరచుకోవడం చాలా ముఖ్యం, అవసరం. దీనివల్ల వారు చదువులో, జీవితంలో మెరుగైన అవకాశాలను ఎంచుకుంటారు.కమ్యూనికేషన్ స్కిల్స్ మానవ సంబంధాలు ఏర్పరచుకోవడంలో, సక్సెస్ సాధించడంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇతరులు చెప్పేది సరిగా వినడం, తమ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం, ఉపయుక్తమైన సంభాషణలు నెరపడం వంటివి నేర్చుకోవడం టీనేజర్లకు అత్యవసరం. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న టీనేజర్లు మంచి సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. గ్రూప్ డిస్కషన్స్‌లో బెరుకులేకుండా పాల్గొనగలుగుతారు. ఇది బడి, పని లేదా సామాజిక వాతావరణాల్లో ఎంతో ఉపయోగపడుతుంది.ఫైనాన్షియల్ లిటరసీఆర్థిక సాక్షరతను టీనేజర్లే కాదు పెద్దలు కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు. దాంతో ఆర్థిక చిక్కుల్లో పడతారు. బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం, ఆదా చేయడం, పెట్టుబడులు పెట్టడం, అప్పులను మేనేజ్‌చేయడం వంటివి టీనేజ్లోనే నేర్చుకుంటే ఆ తర్వాత మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. డబ్బును తెలివిగా ఉపయోగించుకునేవారు త్వరగా ఆర్థిక స్వాతంత్య్రం సాధించగలుగుతారు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు.రెజిలియెన్స్ అండ్ అడాప్టబులిటీ జీవితం ఎప్పుడూ ఊహించినట్లుగా జరగదు, ఎత్తుపల్లాలు ఉంటాయి. టీనేజ్‌లో ఇవి మరీ ఎక్కువ. చదువుల ఒత్తిడి, రిలేషన్షిప్ సవాళ్లు, వ్యక్తిగత పరాభవాలను ఎదుర్కొంటారు. వీటన్నింటినీ తట్టుకుని నిలబడగలగడం అవసరం. ఫెయిల్యూర్ ముగింపు కాదని, విజయానికి మొదటి అడుగని అర్థం చేసుకోవడం ద్వారా సవాళ్లను సానుకూలంగా ఎదుర్కొంటారు. మార్పుకు అనుకూలంగా ఉండటం, అడ్డంకులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని నేర్చుకోవడం మానసిక శక్తిని పెంచుతుంది.సెల్ఫ్ డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, తాత్కాలిక టెంప్టేషన్స్‌ను అర్థం చేసుకుని నియంత్రించడం, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించడం, వ్యక్తిగత విలువలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం. ఇది అకడమిక్ సక్సెస్‌కు మాత్రమే కాదు, వ్యక్తిగత వికాసానికీ అనివార్యమైన నైపుణ్యం. స్వీయ నియంత్రణ ఉన్న టీనేజర్లు అవరోధాలను సులువుగా అధిగమిస్తారు. పరీక్షల కోసం చదవడం, లేదా స్నేహితుల ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి పనులు సులవుగా నిర్వహించగలుగుతారు. -
పది రోజుల్లో పనులు షురూ‘
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ భవనాల నిర్మాణాలకు మరో ముందడుగు పడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐల్) అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఈ క్యాంపస్‌ను నిర్మించేందుకు అంగీకరించింది. అంతేకాదు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ఇందుకు రూ.200 కోట్ల భూరి విరాళాన్ని కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. నవంబర్ 8న అకాడమిక్, పరిపాలన, ల్యాబొరేటరీ, గ్రంథాలయం, పార్కింగ్, ఫుడ్‌కోర్టు, 700 మంది కూర్చొనే సామర్థ్యం గల ఆడిటోరియం, భద్రతా సిబ్బంది వసతి గృహాలు, క్రీడా మైదానాల పనులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే టీఎస్ఐఐసీ, జిల్లా రెవెన్యూ యంత్రాంగాలు ఆయా భూములను సేకరించి, చదును చేసి వర్సిటీకి అప్పగించాయి. 17 కోర్సులు.. ఏటా 20 వేల మందికి శిక్షణకందుకూరు మండలం మీర్ఖాన్పేట సర్వే నంబర్ 112లోని 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్ల అంచనా వ్యయంతో ‘యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ’ నిర్మాణానికి ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. వర్సిటీలో ఫార్మా, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, బ్యాంకింగ్, ఫైనాన్స్, రిటైల్, ఈ కామర్స్, లాజిస్టిక్, ప్యాకింగ్, హార్డ్‌వేర్, ఎలక్ట్రీషిన్ వంటి 17 రంగాల్లోæ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్, మూడేళ్ల డిగ్రీ, డిప్లొమా, సర్టిఫికెట్ ఆన్లైన్/ ఆఫ్‌లైన్ కోర్సులను అందించనున్నారు.ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ కోర్సులను నిర్వహించనున్నారు. ఏటా 20 వేల మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ‘యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ బిల్లు–2024’ను కూడా ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే .గవర్నర్/ సీఎం ఈ వర్సిటీకి చాన్స్‌లర్‌గా వ్యవహరించనున్నారు. వీసీ సహా 15 మందితో పాలకమండలి ఉంటుంది. ఇందులో ఏడుగురు సభ్యులు పరిశ్రమలకు చెందిన వారే ఉంటారు. వర్సిటీ మూడేళ్ల నిర్వహణకు రూ.312 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. రూ.170 కోట్లు కేవలం కోర్సుల ఫీజుల రూపంలో సమకూరనున్నాయి. -
కొత్తగా 60 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యం భివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని యువతకు స్కిల్‌కోర్సులు అందించి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఐటీఐ (పారిశ్రామిక శిక్షణ సంస్థ)లను ఏటీసీ(అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్)లుగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రస్తుతం ఈ ఏటీసీలు పరిమిత సంఖ్యలో ఉండగా, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనీసం ఒకటి చొప్పున ఉండేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఏటీసీలు లేని సెగ్మెంట్లను గుర్తిస్తూ... అక్కడ కొత్తగా వాటి ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేసింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 59 నియోజకవర్గాల్లో 65 ఏటీసీలున్నాయి.ఒకట్రెండు చోట్ల రెండేసి ఏటీసీలు ఉండగా, 60 నియోజకవర్గాల్లో మాత్రం వీటి ఊసే లేదు. ఈ నేపథ్యంలో ఏటీసీలు లేని చోట కొత్తగా నెలకొల్పేందుకు కారి్మక ఉపాధి కల్పన శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్థల లభ్యత, ఇతర వసతులను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు పంపాలని కోరింది. ప్రస్తుతం వరంగల్ రీజియన్ పరిధిలో 35, హైదరాబాద్ రీజియన్ పరిధిలో 30 ఏటీసీలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్‌లో ఉన్న వాటిల్లో అత్యాధునిక ట్రేడ్లను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చారు. హైదరాబాద్ జిల్లాలోని ఆరు ఏటీసీలను ఇప్పటికే మారుతి, హ్యుందాయ్, ఏషియన్ పెయింట్స్ లాంటి సంస్థలు దత్తత తీసుకున్నాయి. దీంతో ఆయా సంస్థల్లోని ట్రేడ్లలో చేరేందుకు అభ్యర్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.తాజాగా అన్ని చోట్ల అడ్వాన్స్డ్ టెక్నాలజీ ట్రేడ్లను అందుబాటులోకి తేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం... 2వేల కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆధునీకరణ పనులు చేపట్టడంతో ఐటీఐ ట్రేడ్లకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో క్షేత్రస్థాయి నుంచి జిల్లా కలెక్టర్లు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఇప్పటికే 20కి పైగా కొత్త ఏటీసీల ఏర్పాటు కోసం ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిపాదనలు రూపొందించగా, అవి కార్మిక ఉపాధి కల్పన, శిక్షణ విభాగానికి చేరాయి. అతి త్వరలో పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తాం
సాక్షి, అమరావతి: ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నేరేవేర్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నైపుణ్య శిక్షణ శాఖ, ఎంఎస్ఎంఈ, పరిశ్రమలు, సెర్ప్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు సమకూర్చాలని సూచించారు.నైపుణ్యాలను పెంచడం ద్వారా పెద్దఎత్తున అవకాశాలు పొందే అవకాశం ఉందని, హైబ్రిడ్ విధానంలో ఇంటినుంచే పనిచేసే కార్యక్రమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. బహుళజాతి కంపెనీలతో శిక్షణ కేంద్రాల ఏర్పాటు ప్రక్రియ చేపట్టాలన్నారు. విజయవాడ వరదల్లో సర్వం కోల్పోయిన బాధితులు ఉపాధి చూపించాలని కోరారని, వారికి ఎటువంటి ఉపాధి కల్పన చేపట్టవచ్చనే అంశంపై పరిశీలన జరిపి కార్యాచరణ అమలు చేయాలన్నారు. వివిధ కారణాలతో గ్రామాల్లో ఉండిపోయిన వారికి పనిచేసే అవకాశాలు కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని, ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు కలిసి ఈ పని చేయాలని కోరారు. క్రీడా హబ్‌లుగా తిరుపతి, అమరావతి, విశాఖ మౌలిక సదుపాయాల కల్పనతో క్రీడా రంగానికి తిరిగి ప్రోత్సాహం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను కోరారు. యువజన సర్వీసులు, క్రీడల శాఖపై సమీక్షిస్తూ.. గతంలో నిలిచిపోయిన 35 క్రీడా వికాస కేంద్రాలను పూర్తి చేసేందుకు రూ.23 కోట్లు మంజూరు చేస్తున్నట్టు సీఎం తెలిపారు.గ్రామాల్లో కబడ్డీ వంటి ఆటలకు క్రీడా మైదానాలు అందుబాటులోకి తేవాలని సూచించారు. తిరుపతి, అమరావతి, విశాఖ నగరాలను క్రీడా హబ్‌లుగా మార్చాల్సిన అవసరం ఉందని, ఆ మూడు ప్రాంతాల్లో అన్ని క్రీడల నిర్వహణకు సకల సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. క్రీడా నగరంగా అమరావతిని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని, ఇక్కడ అతిపెద్ద స్టేడియం నిర్మాణం చేపడతామని చెప్పారు. 2027లో జాతీయ క్రీడా పోటీలను మన రాష్ట్రంలో నిర్వహించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర సచివాలయం, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ స్పోర్ట్స్ సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో మంత్రి మండిపల్లి రామ్‌ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. -
ఉపాధి ఓకే.. నైపుణ్యాలేవి..?
సాక్షి, అమరావతి: దేశంలోని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉపాధికి తగిన నైపుణ్యాలు కొరవడుతున్నాయి. ఇంజనీరింగ్ రంగంలో గ్లోబల్ పవర్‌హౌస్‌గా భారతదేశం కీర్తి గడిస్తున్నా.. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడం లేదు. పారిశ్రామిక, ఐటీ సంస్థల డిమాండ్ తీర్చడానికి అవసరమైన పరిజ్ఞానాన్ని సాధించలేకపోతున్నారు. ఏటా దేశంలో 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డిగ్రీ పట్టాలు తీసుకుని బయటకు వెళ్తుంటే.. వారిలో కొందరికే ఉపాధి దొరుకుతోంది. ఈ క్రమంలోనే దేశంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల సంఖ్యకు, ఉపాధికి మధ్య గణనీయమైన అంతరం కొనసాగుతోంది. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రోగ్రామ్‌ల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, నాణ్యమైన విద్య లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. లాభాపేక్షతో కూడిన యాజమాన్యాలు, నైపుణ్య విద్య లేకపోవడం, రోట్–లెర్నింగ్ పద్ధతులపై దృష్టి పెట్టడం, అధ్యాపకుల కొరత ఉన్నత విద్యను వేధిస్తున్న ప్రధాన సమస్యలుగా మారాయి. నైపుణ్య లేమికి కారణాలివీ..» పాత సిలబస్‌తోనే పాఠాలు: కోర్సు కంటెంట్ ఉపాధి తర్వాత ఉద్యోగ పరిశ్రమలో వాస్తవికతకు సహాయపడేలా ఉండటం లేదు. మార్కెట్‌కు ఏది అవసరమో భారతీయ విద్య అందించలేకపోతోంది. » నాణ్యమైన అధ్యాపకుల కొరత: భారతదేశంలో 33వేల కంటే ఎక్కువ కళాశాలలు ఇంజనీరింగ్ డిగ్రీలు మంజూరు చేస్తున్నాయి. ఈ విద్యాసంస్థలన్నిటికీ నాణ్యమైన ఉపాధ్యాయులు లేరు. బహుళజాతి కంపెనీలు, చిన్న ఇంజనీరింగ్ కంపెనీల్లో వడపోత తర్వాత అధ్యాపకుల ఎంపిక జరుగుతోంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో మాదిరిగా కాకుండా భారతీయ అధ్యాపకులు తెలివైన విద్యార్థులను సృష్టించే నైపుణ్యాలను అందించలేకపోతున్నారు. విద్యావంతులైన ఇంజనీర్లు ఉపాధ్యాయ వృత్తిలో అభిరుచితో కాకుండా జీవనోపాధి కోసమే చేరుతున్నారు. » ఆవిష్కరణలు, పరిశోధన లేకపోవడం: విద్యార్థులు తమను తాము నిరూపించుకునేందుకు, ఆలోచించడానికి తగినంతగా ప్రేరణ లభించడం లేదు. » తప్పు విద్యా విధానం: సెమిస్టర్ విధానంతో నిరంతరం విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పట్టడానికే పరిమితమై మూల్యాంకన ప్రక్రియపైన, నిరంతర అభ్యాసంపైన ఆసక్తి చూపడం లేదు. వారు మంచి గ్రేడ్లను మాత్రమే కోరుకుంటున్నారు. » నైపుణ్యం–ఆధారిత విద్య లేకపోవడం: నైపుణ్యం ఆధారిత విద్య ఉండటం లేదు. ఇంజనీరింగ్ విద్యార్థులు వాస్తవ ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యల ఆధారంగా శిక్షణ పొందటం లేదు. » సరైన ఆంగ్ల నైపుణ్యాలు లేకపోవడం: ఇంగ్లిష్ కమ్యూనికేటివ్ నైపుణ్యాలు లేకపోవడం, విశ్లేషణాత్మక, పరిమాణాత్మక నైపుణ్యాలు నిరుద్యోగానికి కారణం అవుతున్నాయి. అంతర్జాతీయ కస్టమర్లతో కమ్యూనికేట్ చేయాల్సిన ఐటీ ఉద్యోగులకు ఇంగ్లిష్ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రస్తుత ఉద్యోగ పరిశ్రమలో సాఫ్ట్ స్కిల్స్ చాలా ముఖ్యమైనవిగా మారాయి. అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో పరిశ్రమ అవసరాలకు తగిన నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడానికి వృత్తిపరమైన శిక్షణతోనే సాంకేతిక విద్యను జత చేయాలని టీమ్‌లీజ్ నివేదిక పేర్కొంది. తద్వారా యువ ఇంజనీర్లు తొలిరోజు నుంచీ పరిశ్రమల్లో పని చేయడానికి సిద్ధంగా ఉంటారని చెబుతోంది. అందుకే అప్రెంటిస్ షిప్, ఇంటర్న్‌షిప్ అనివార్యంగా చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వాస్తవానికి కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేసుకున్న తర్వాత శిక్షణ కోసం వారిపై ఎక్కువ ఖర్చు చేయకూడదని భావిస్తున్నాయి. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లోని సమస్యలతో పాటు ఇంగ్లిష్ భాషకు సంబంధించిన సమస్యలు ఉద్యోగానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఇక్కడ టైర్–1 నగరాల నుంచి వచ్చే విద్యార్థులతో పోలిస్తే టైర్–2 నగరాల నుంచి వచ్చిన విద్యార్థులకు తక్కువ ఉద్యోగ అవకాశాలు దక్కుతున్నాయి. టైర్–2 నగరాల్లోని విద్యార్థులకు 24 శాతం తక్కువ ఉద్యోగ అవకాశాలతో పాటు జీతంలోనూ చాలా వ్యత్యాసం ఉంటోంది. 15 లక్షల్లో 10 శాతం మందికే ఉద్యోగాలుప్రముఖ రిక్రూటింగ్ కంపెనీ టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్íÙప్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకొస్తుంటే.. వారిలో కేవలం 10 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయని పేర్కొంది. దేశంలో ఇంజనీరింగ్ రంగంలో 60 శాతం కంటే ఎక్కువగా ఉద్యోగావకాశాలు ఉంటే.. వాటిలో 45 శాతం మందికి పైగా పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. వాస్తవానికి పరిశ్రమలు సైబర్ సెక్యూరిటీ, ఐటీ, రో»ొటిక్స్, డేటా సైన్స్ వంటి డొమైన్లలో నైపుణ్యాన్ని ఎక్కువగా కోరుకుంటున్నాయి. దీనికితోడు కృత్రిమ మేధ (ఏఐ)తో పోటీపడి పని చేయాల్సిన పరిస్థితుల్లో విద్యార్థులు సంప్రదాయ విద్య ఒక్కటే నేర్చుకుంటే సరిపోదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు మూడేళ్లలో ‘ఏఐ’, కట్టెడ్జ్ సాంకేతికతలో అధునాతన నైపుణ్యాలు కలిగిన సుమారు 10 లక్షల మంది ఇంజనీర్లు అవసరమని ప్రభుత్వేతర ట్రేడ్ సంస్థ ‘నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్–సర్వీస్ కంపెనీస్’ (నాస్కామ్) అంచనా వేసింది. డిజిటల్ ప్రతిభలో డిమాండ్–సరఫరా అంతరం ప్రస్తుతం 25 శాతం నుంచి 2028 నాటికి 30 శాతానికి పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏఐ, ఆటోమేషన్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో వస్తున్న మార్పులు సైతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధించడంలో సవాల్‌గా మారుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
తెలంగాణ వడ్డించిన విస్తరి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి వంటిదని.. చైనా బయట పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా నిలిచేందుకు అనేక అనుకూలతలు ఉన్నాయని ముఖ్యమంత్రి ఎను ముల రేవంత్‌రెడ్డి చెప్పారు. సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) రంగం బలోపేతంతో వేగంగా ఆర్థికాభివృద్ధి సాధిస్తామని పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చి.. ప్రస్తుతం రూ.3 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను 2028 నాటికి రూ.7 లక్షల కోట్లకు చేర్చడం లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ శిల్ప కళావేదికలో ‘తెలంగాణ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పాలసీ–2024’ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ అధికారులు, పారిశ్రామిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్న ఈ భేటీలో పారిశ్రామిక ప్రగతికి సంబంధించిన పలు అంశాలను సీఎం ప్రస్తావించారు. పెట్టుబడులతో సంపద పెంచుతాం ‘‘ఏ రంగంలోనైనా పాలసీ లేకుండా పురోగతి సాధ్యం కాదు. ఎంఎస్ఎంఈలో పెట్టుబడులు రాబడుతూ సంపద పెంచడంతోపాటు దళితులు, గిరిజనులు, మహిళలను ప్రోత్సహించే వాతా వరణం సృష్టిస్తాం. భేషజాలకు పోకుండా గత ప్రభుత్వం చేసిన మంచి పనులు కొనసాగిస్తూ.. నష్టం చేసే విధానాలను తొలగిస్తాం. పారిశ్రామిక అభివృద్ధితోనే తెలంగాణ ఆర్థికంగా బలోపేతం అవుతుంది..’’ అని సీఎం రేవంత్ చెప్పారు. వ్యవసాయ రంగంపై ఎక్కువ మంది ఆధారపడటంతో రైతులకు ప్రభుత్వపరంగా ఎన్ని విధాలుగా సాయం అందించినా వారి పరిస్థితి మెరుగుపడటం లేదని పేర్కొన్నారు. వ్యవసాయ కుటుంబాలు ఉద్యోగ, ఉపాధి కల్పన, వ్యాపార రంగాల్లోనూ ఎదగాలన్నారు. గతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎకరం అమ్మితే తెలంగాణలో పది ఎకరాలు కొనే పరిస్థితి ఉండేదని.. తెలంగాణ యువత ఐటీ రంగంలో అడుగుపెట్టి సిలికాన్ వ్యాలీని శాసించే స్థాయికి ఎదగడంతో ఇప్పుడు పరిస్థితి తారుమారైందని, ఇక్కడ ఎకరా అమ్మితే ఆంధ్రాలో వంద ఎకరాలు కొనొచ్చని వ్యాఖ్యానించారు. స్కిల్ యూనివర్సిటీకి విరాళాలు సేకరిస్తాం నైపుణ్య శిక్షణ కోసం ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్వహణకోసం యూనివర్సిటీ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో రూ.300 కోట్ల నుంచి రూ. 500 కోట్ల కార్పస్ ఫండ్ సేకరిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. భూములు కోల్పోయే వారిని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. అమెరికాలో హడ్సన్, లండన్‌లోని థేమ్స్ తరహాలో మూసీ నదిని అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్ష కోట్లను సున్నా వడ్డీపై రుణాలుగా ఇస్తామని ప్రకటించారు. శిల్పారామంలో మహిళా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మూడు ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పారు. సామాజిక న్యాయానికి పునాది: భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతోనే రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ రంగం వేళ్లూనుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. దేశవ్యాప్తంగా ఎంఎస్ఎంఈలు మూతపడుతున్నా తెలంగాణలో ఆ రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. చిన్న పరిశ్రమల టేకోవర్ల సమస్య కూడా తక్కువగా ఉంటోందని తెలిపారు. తాము ఎంఎస్ఎంఈ పాలసీ ద్వారా సామాజిక న్యాయానికి పునాదులు వేశామని... గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.2వేల కోట్ల సబ్సిడీని ఎంఎస్ఎంఈలకు విడతల వారీగా చెల్లిస్తామని ప్రకటించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలసీ: మంత్రి శ్రీధర్‌బాబు అంతర్జాతీయ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఎంఎస్ఎంఈలను తీర్చిదిద్దే లక్ష్యంతో కొత్త విధానం తెస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఎంఎస్ఎంఈలను గ్రోత్ సెంటర్లుగా మారుస్తామన్నారు. అన్ని జిల్లాల్లో ఎంఎస్ఎంఈలు, పారిశ్రామిక పార్కులు, స్టార్టప్‌ల కోసం ప్రత్యేక పార్కులు ఏర్పాటు చేసి... మహిళలకు 5శాతం, ఎస్సీ, ఎస్టీ ఎంట్రప్రెన్యూర్లకు 15శాతం రిజర్వు చేస్తామని ప్రకటించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ ‘ఫ్లాట్ ఫ్యాక్టరీలు’, ఎస్ఎంఎస్ఈ క్లస్టర్లలో పది చోట్ల కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈలకు సులభంగా ఆర్థికసాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.100 కోట్లతో యంత్రాల ఆధునీకరణకు నిధి ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఎంఎస్ఎంఈల ఉత్పత్తుల కొనుగోలు కోసం ‘ప్రొక్యూర్మెంట్ పాలసీ’, బహుళ జాతి కంపెనీలతో భాగస్వామ్యాలు, పాలసీ అమలు కోసం టాస్‌్కఫోర్స్, లీజు పాలసీ వంటివాటిని కొత్త విధానంలో పొందుపర్చామని వెల్లడించారు. కేంద్ర పథకంపై ఒప్పందం..కేంద్ర చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) శాఖ ప్రపంచ బ్యాంకు సహకారంతో దేశంలో ఎంఎస్ఎంఈల పనితీరును మెరుగుపర్చడం, వేగవంతం చేయడం కోసం పథకాన్ని అమలు చేస్తోంది. కరోనా సమయంలో దెబ్బతిన్న ఎంఎస్ఎంఈలు తిరిగి కోలుకునేందుకు ఉద్దేశించిన ఈ పథకంలో భాగంగా.. రాష్ట్రంలో స్టేట్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ యూనిట్ ఏర్పాటు కోసం బుధవారం ఎంఓయూ కుదుర్చుకున్నారు.కాగా.. పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు నిర్మల జగ్గారెడ్డి, రాయల నాగేశ్వర్రావు, ఐత ప్రకాశ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రిలయన్స్ స్కిల్లింగ్ అకాడమీ ప్రారంభం
దేశంలో జాబ్ మార్కెట్‌కు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచేందుకు రిలయన్స్ ఫౌండేషన్ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీని ప్రారంభించింది. స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, విద్యా శాఖల సహాయ మంత్రి జయంత్ చౌదరి ఈ అకాడమీని ప్రారంభించారు.నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NSDC) సహకారంతో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహించిన ‘భవిష్యత్ ఉద్యోగాల కోసం యువతకు సాధికారత’ అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఈ కొత్త చొరవను ఆవిష్కరించారు. స్కిల్ బిల్డింగ్, పర్సనలైజ్డ్ ఎక్స్పర్ట్ గైడెన్స్ అందించే ఫ్యూచర్ రెడీ కోర్సులను స్కిల్లింగ్ అకాడమీ అందిస్తుందని రిలయన్స్ ఫౌండేషన్ తెలిపింది. పరిశ్రమల అనుసంధానంతో కెరీర్ డెవలప్మెంట్కు తోడ్పాటునందిస్తుందని పేర్కొంది.నైపుణ్యాలను నేర్పించడం, పెంపొందించడం ద్వారా వచ్చే సంవత్సరంలో 6 లక్షల మంది భారతీయ యువతకు సాధికారత కల్పించడం అకాడమీ లక్ష్యమని వెల్లడించింది. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ స్కిల్లింగ్ అకాడమీ తన కోర్సుల పరిధిని విస్తరిస్తుందని, స్కిల్ ఇండియా మిషన్‌కు మద్దతునిస్తుందని వివరించింది. -
ఎస్‌ఏపీతో క్యాప్‌జెమినీ జట్టు.. 8,000 మందికి ట్రైనింగ్
ముంబై: ఐటీ దిగ్గజం క్యాప్‌జెమినీ తాజాగా ఎస్ఏపీ ల్యాబ్స్‌తో చేతులు కలిపింది. వచ్చే మూడేళ్లలో దేశీయంగా 8,000 మంది వెనుకబడిన యువతకు ఉపాధి ఆధారిత నైపుణ్యాల్లో శిక్షణ కల్పించేందుకు క్యాప్‌జెమినీ–ఎస్ఏపీ డిజిటల్ అకాడెమీ ప్రోగ్రాంను అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.దీని ప్రకారం ఇరు సంస్థలు సంయుక్తంగా వనరుల సమీకరణ, నెట్‌వర్క్‌లు మొదలైన వాటిపై ఇన్వెస్ట్ చేస్తాయని క్యాప్‌జెమినీ ఇండియా సీఈవో అశ్విన్ యార్డి తెలిపారు. తమ కెరియర్లలో విజయాలను అందుకునేందుకు దేశ యువతకు సాధికారత కల్పించేందుకు ఈ భాగస్వామ్యం సహాయకరంగా ఉండగలదని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా ఎండీ సింధు గంగాధరన్ పేర్కొన్నారు. -
ఉద్యోగాలున్నా నైపుణ్యాలేవీ..?
ఉపాధి అవకాశాలున్నా సరైన నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులు లేక కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దేశంలో ఏటా అత్యధిక మంది గ్యాడ్యుయేట్లను అందించే రాష్ట్రం ఇది. కానీ కంపెనీల అవసరాలకు తగిన నైపుణ్యాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నిర్వహించిన పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) ప్రకారం..జులై 2022 నుంచి జూన్ 2023 ఏడాదికిగాను పని చేస్తున్న, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవారిని పరిగణించి శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు(ఎల్ఎఫ్పీఆర్)ను లెక్కించారు. అందులో గరిష్ఠంగా 46 శాతంతో తమిళనాడు మొదటిస్థానంలో ఉంది. దేశంలో సగటున ఈ ఎల్ఎఫ్పీఆర్ 42.4 శాతంగా ఉంది. వర్కర్ పాపులేషన్ రేటు తమిళనాడులో 44 శాతంగా ఉంటే దేశంలో సరాసరి 41.1 శాతంగా నమోదైంది.ఇదీ చదవండి: ఇల్లు కొంటున్నారా..? ఒక్క క్షణం..!దేశవ్యాప్తంగా మొత్తం ఫ్యాక్టరీల్లో పనిచేసే జనాభాలో తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్రలోనే 40 శాతం ఉంది. అయితే తమిళనాడులోని కంపెనీల్లో భారీగా ఖాళీలున్నాయని, కానీ ఆయా పోస్టులకు తగిన నైపుణ్యాలు అభ్యర్థుల వద్ద లేవని సంస్థలు చెబుతున్నాయి. రోజూ కొత్త టెక్నాలజీలు పుట్టుకొస్తున్నాయి. అందుకు తగినట్లు నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దానివల్ల ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెబుతున్నారు. -
గాడి తప్పిన వర్సిటీలు..! పడిపోతున్న విద్యా ప్రమాణాలు
కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు నామ్‌కే వాస్తేగా మారిపోతున్నాయి. పరిశోధనల మాటేమోగానీ.. సాధారణ విద్యా ప్రమాణాలే నానాటికీ పడిపోతున్నాయి. ప్రభుత్వాల నిర్లక్ష్యం, నిధుల కొరత, మౌలిక సదుపాయాల లేమికితోడు అధ్యాపకుల పోస్టుల్లో చాలా వరకు ఖాళీగా ఉండటంతో.. యూనివర్సిటీల్లో చదువు గతి తప్పుతోంది. విశ్వవిద్యాలయాలు ఇచ్చే సర్టిఫికెట్లతో మార్కెట్లో ఉద్యోగాలు రావడం లేదని సీఎం రేవంత్ ఇటీవల స్వయంగా పేర్కొన్నారు కూడా. ఇలాంటి సమయంలో స్కిల్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలపైనా దృష్టిపెడితే బాగుంటుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు. నిధులు లేక.. పట్టించుకోక.. వందేళ్లపైన చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిదా్యలయం కూడా ‘నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)’ గుర్తింపులో వెనుకబడి ఉంది. ర్యాంకు ఏటా దిగజారుతోంది. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల పరిస్థితీ ఇదే. ఎన్నో సమస్యలున్నాయని ప్రతీ ప్రభుత్వం చెప్తున్నా.. నిధులు మాత్రం ఇవ్వడం లేదు. ఫలితంగా మౌలిక వసతుల కల్పన అంతంత మాత్రంగానే ఉంటోంది. కొత్త వీసీలు వస్తేగానీ.. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లతోపాటు బోధనేతర సిబ్బంది ఖాళీలు కూడా భారీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వం జీవో ఇచ్చింది. వీసీల ద్వారా కాకుండా.. కమిటీ ద్వారా నియామకాలు చేపట్టాలని భావించింది. కానీ అది ముందుకు పడలేదు. నిజానికి రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వీసీలే లేరు. ఈ ఏడాది మేలోనే వీసీల పదవీకాలం పూర్తయింది. కొత్తవారి నియామకానికి సెర్చ్ కమిటీలు వేశారు. దరఖాస్తులూ తీసుకున్నారు. కానీ సెర్చ్ కమిటీలు ఇంతవరకు సమావేశం కాలేదు. వీసీల నియామకం జరిగితే తప్ప ఖాళీల భర్తీ కుదరదు. ఖాళీలు భర్తీ చేస్తే తప్ప బోధన గాడినపడేందుకు ఆస్కారం లేదు. చదువు చేప్పేవాళ్లెక్కడ? రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 2,828 పోస్టులు ఉండగా.. అందులో 1,869 పోస్టులు ఖాళీయే. అంటే 70శాతం వరకు బోధనా సిబ్బంది లేరు. ఇలా ఉంటే విశ్వవిద్యాలయాల్లో బోధన ఎలా సాగుతుంది? పరిశోధనలు ఎలా సాధ్యమవుతాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 2017లోనే వర్సిటీల్లో 1,528 ఖాళీలున్నట్టు గుర్తించింది. 1,061 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో నియామకాలు ఆగిపోయాయి. 2021 జనవరి నాటికి ఖాళీల సంఖ్య 1,869కు పెరిగింది. ఇందులో 248 ప్రొఫెసర్, 781 అసోసియేట్ ప్రొఫెసర్, 850 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. తర్వాత మరిన్ని పోస్టులూ ఖాళీ అయ్యాయి. మరోవైపు బోధనేతర సిబ్బంది ఖాళీలూ భారీగానే ఉన్నాయని.. మొత్తంగా 4,500కు పైగా పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నాయి. కాంట్రాక్టు లెక్చరర్లపై ఒత్తిడి.. రాష్ట్రంలోని 11 యూనివర్సిటీల్లో 1,365 మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. అదీ సరిపడా లేకపోవడంతో వారిపై విపరీతమైన పనిభారం ఉంటోంది. అసలే చాలీచాలని వేతనాలకుతోడు పనిభారం వల్ల ఇబ్బందిపడుతున్నామని కాంట్రాక్టు లెక్చరర్లు వాపోతున్నారు. తమను రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వాలు ఎన్నోసార్లు హామీ ఇచ్చినా నిలబెట్టుకోలేదని అంటున్నారు. ఏ వర్సిటీ చూసినా.. అన్నీ ఖాళీలే..! కీలకమైన ఉస్మానియా యూనివర్సిటీలోనూ ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా ఉంది. అన్ని విభాగాల్లోనూ కాంట్రాక్ట్, పార్ట్‌టైం అధ్యాపకులతో బోధన చేయిస్తున్నారు. సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడంతో పరిశోధనలేవీ ముందుకు సాగడం లేదు. పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలో బోధన మొక్కుబడిగా ఉందనే విమర్శలున్నాయి. ల్యాబ్‌లలో అవసరమైన పరికరాలు, రసాయనాలు, ఇతర మౌలిక వసతులు లేవు. జేఎన్టీయూహెచ్లోనూ ఇదే దుస్థితి. నిజాం కాలేజీ, కోఠిలోని విమెన్స్ యూనివర్సిటీలోనూ చాలా కోర్సులకు ఫ్యాకల్టీ లేదు. – కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీలో మ్యాథ్స్, ఫార్మసీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేరు. – మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, ఎంబీఏ, ఎంఎస్‌డబ్ల్యూ విభాగాలకు ఒక్క రెగ్యులర్ ఫ్యాకల్టీ కూడా లేరు. కాంట్రాక్టు లెక్చరర్లతో అరకొరగా కొనసాగిస్తున్నారు. – ఉస్మానియా యూనివర్సిటీ తర్వాత చెప్పుకోదగ్గ వర్సిటీ కాకతీయ విశ్వవిద్యాలయం. ఇక్కడ పొలిటికల్ సైన్స్, ఎడ్యుకేషన్ వంటి విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులు ఒక్కరూ లేరు. ఈ వర్సిటీ పరిధిలోని కొత్తగూడెం ఇంజనీరింగ్ కాలేజీలో చాలా పోస్టులు ఖాళీయే. – నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కొన్ని విభాగాల్లో ఒక్క ప్రొఫెసర్ కూడా లేని పరిస్థితి. కీలకమైన ఇంజనీరింగ్ విభాగంలో 48 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మిగతా విభాగాల్లోనూ రెగ్యులర్ అధ్యాపకులు నామమాత్రమే. – నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో మేథ్స్, ఎకనామిక్స్, ఫార్మస్యూటికల్స్, కెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. సదుపాయాలూ సరిగా లేక.. చాలా యూనివర్సిటీల్లో మౌలిక వసతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాగునీటి సౌకర్యం కూడా సరిగా ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. హాస్టళ్లు, టాయిలెట్ల పరిస్థితి దారుణంగా ఉంటోందని అంటున్నారు. పాలమూరు వర్సిటీ హాస్టళ్లలో గదుల తలుపులు, కప్‌బోర్డులు విరిగిపోయాయి. శాతవాహన వర్సిటీలో ఫార్మసీ కళాశాల భవనాలు నామమాత్రంగా ఉన్నాయి. ఉస్మానియా వర్సిటీ భవనాల నిర్వహణ సరిగా లేదు. కొన్ని శిథిలావస్థకు చేరాయి. వీటిని బాగు చేయాలంటే నిధుల కొరత వెంటాడుతోందని అధికారులు చెప్తున్నారు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులే.. విశ్వవిద్యాలయాల్లో 11 ఏళ్లుగా బోధన సిబ్బంది నియామకాలు చేపట్టలేదు. 70శాతం కాంట్రాక్టు అధ్యాపకులతోనే నడిపిస్తున్నారు. వారిపైనా విపరీతమైన పనిభారం ఉంటోంది. 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని పరి్మనెంట్ చేయలేదు. తక్షణమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపట్టి, ఉన్నత ప్రమాణాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలి. – డాక్టర్ ఎం.పరమేశ్వర్ (తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫ్యాకల్టీస్ సంఘం నేత) -
ఉద్యమ స్ఫూర్తితో ఉపాధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: నీళ్లు, నిధులు, నియామ కాల పేరుతో సాధించుకున్న తెలంగాణలో ఉద్యమ స్ఫూర్తితో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలి్పంచనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోతున్న వర్సిటీలో ప్రవేశం పొందిన ప్రతి ఒక్కరికీ గ్యారంటీగా ఉపాధి లభిస్తుందని హామీ ఇచ్చారు.రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో 57 ఎకరాల విస్తీర్ణంలో రూ.150 కోట్లతో నిర్మించతలపెట్టిన ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’కి గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తదితరులతో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. తర్వాత నెట్ జీరో సిటీలో భాగంగా బేగరికంచె గ్రామ పరిధిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్ల నిర్మాణాలకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు. నాలుగో నగరంగా బేగరికంచె అభివృద్ధి ‘హైదరాబాద్‌ను నవాబులు, సికింద్రాబాద్‌ను బ్రిటిషర్లు, సైబరాబాద్‌ను చంద్రబాబు, వైఎస్సార్‌లు నిర్మిస్తే.. నాలుగో నగరంగా బేగరికంచెను మేము అభివృద్ధి చేయబోతున్నాం. నాలుగేళ్లలోనే న్యూయార్క్‌ను మించిన నగరంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. హెల్త్, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, హాస్పిటాలిటీ టూరిజంగా అభివృద్ధి చేస్తాం. ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, జాతీయ, అంతర్జాతీయ కంపెనీలను ఇక్కడికి తీసుకొస్తాం. నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కలి్పస్తాం. తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్యపై కొనసాగింది. అందులో యువత కీలక పాత్ర పోషించింది.ఏటా లక్ష మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు బయటికి వస్తున్నా ఆశించిన స్థాయిలో ఉపాధి లభించడం లేదు. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులు ఖర్చు పెడుతూ అశోక్‌నగర్ చౌరస్తాలోని కోచింగ్ సెంటర్లలో చేరినా, సరైన నైపుణ్యం లేక ఉద్యోగాలు దొరకడం లేదు. పీజీ, పీహెచ్డీ పట్టాలు పొంది కూడా నిరుద్యోగులుగా మిగులుతున్న యువతకు ఈ స్కిల్స్ యూనివర్సిటీలో డిప్లొమా, డిగ్రీ సరి్టఫికెట్ కోర్సులు అందించడంతో పాటు ఆయా సంస్థల్లో ఉపాధి కలి్పస్తాం. ఇక్కడ అడ్మిషన్ పొందితే చాలు.. జాబ్ గ్యారంటీ. జాతీయ, అంతర్జాతీయ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించి ఉపాధి కలి్పస్తాం..’అని సీఎం చెప్పారు. 3 నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులు షురూ ‘రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒకప్పుడు వేలల్లో ఉన్న భూముల ధరలు ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ రాకతో ప్రస్తుతం కోట్లకు చేరాయి. మరో మూడు నెలల్లో ఆర్ఆర్ఆర్ పనులను ప్రారంభిస్తాం. నెట్ జీరో సిటీ నుంచి ఓఆర్ఆర్ వరకు 200 అడుగుల ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు సహా మెట్రో రైలు నిర్మాణానికి భూసేకరణ పనులు చేపడతాం. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ ఆస్పత్రి, చాంద్రాయణగుట్ట, ఎయిర్‌పోర్టు మీదుగా బేగరికంచె వరకు మెట్రో రైలును విస్తరింపజేస్తాం. కడ్తాల్ అడవుల్లో నైట్ సఫారీ కడ్తాల్, ఆమనగల్లు అడవుల్లో నైట్ సఫారీ ఏర్పాటు చేస్తాం. ఈ ప్రాంతాన్ని ప్రపంచ పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాం. ఫార్మాసిటీ కోసం భూములు త్యాగం చేసిన రైతులు అధైర్యపడొద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలను చదివించి వారికి మంచి భవిష్యత్తును ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వమే తీసుకుంటుంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలోనే అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. విమానం కొనాలన్నా, ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అవకాశాలు ఉంటాయి.ఈ ప్రాంతానికి తాగునీరు సహా రోడ్లు, పార్కులు ఇతర మౌలిక సదుపాయాలు కలి్పంచి అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతాం..’అని రేవంత్ చెప్పారు. ‘పండిట్ జవహర్లాల్ నెహ్రూ విద్య, నీటి పారుదలకే ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చొరవతోనే అనేక యూనివర్సిటీలు, ప్రాజెక్టులు వచ్చాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, భాక్రానంగల్ తదితర నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడంతో రైతాంగానికి సాగు నీరు అందుతోంది..’అని అన్నారు. ప్రపంచానికే తలమానికం: డిప్యూటీ సీఎం భట్టి ‘స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడమే కాకుండా శంకుస్థాపన కూడా చేసుకోవడం సువర్ణ అక్షరాలతో లిఖించదగినది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌లకు మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఇది ప్రపంచానికే తలమానికం కాబోతోంది. భూములు కోల్పోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఆలోచనతో 600 ఎకరాల్లో అద్భుతమైన కమ్యూనిటీ భవనాలను నిర్మిస్తున్నాం. ప్లాట్లు పొందిన ప్రతి రైతు ఇక్కడే ఇల్లు కట్టుకుని జీవించే విధంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం. ఇందిరమ్మ పథకం ద్వారా ఇంటిì నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తాం..’అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మాది చేతల ప్రభుత్వం: మంత్రి కోమటిరెడ్డి తమది మాటల ప్రభుత్వం కాదు..చేతల ప్రభుత్వమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో వందలకొద్దీ కాలుష్య కారక ఫార్మా కంపెనీలు ఒకే చోట వస్తున్నాయని తెలిసి అప్పట్లో ఎంపీగా ఆందోళన చెందానని అన్నారు. ఫార్మాను రైతులతో పాటు తాను కూడా వ్యతిరేకించానని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేసి దాని స్థానంలో ఫార్మా విలేజ్‌లు చేపట్టామని తెలిపారు. కొత్త ఆలోచన, కొత్త గమ్యం: మంత్రి శ్రీధర్‌బాబు కొత్త ఆలోచన, కొత్త గమ్యం, కొత్త నగరం ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు. ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు చేసిన యువత కల నెరవేరబోతోందన్నారు. ఇప్పటికే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, రాష్ట్రంలో మిగిలిన మరో 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కలి్పంచాలనే ఆలోచనతో స్కిల్స్ యూనివర్సిటీని తీసుకొచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. -
స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. స్కిల్ యూనివర్సిటీతో పాటు మరో నాలుగు సెంటర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర నరసింహ, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో కలిసి సీఎం శంకుస్థాపన చేశారు. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, మోడ్రన్ స్కూల్, కమ్యూనిటీ సెంటర్లకు భూమి పూజ చేశారు.ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ నిర్మించనున్నారు. 57 ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. యువతకు సాంకేతిక నైపుణ్యాలు అందించి ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తోందన్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిరుద్యోగులకు పట్టించుకోలేదన్నారు. పరిశ్రమల్లో యువతకు అవకాశాలు కల్పించడం కోసమే ఈ స్కిల్ యూనివర్శిటీ అన్నారు. ఈ ఏడాదిలో ఈ నగరం రూపురేఖలు మారిపోతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. -
చైనా నిపుణులకు వీసాల జోరు పెంచండి
న్యూఢిల్లీ: చైనా నిపుణుల కొరత దేశీ కంపెనీలను వేధిస్తోంది. ముఖ్యంగా టాటా పవర్ సోలార్, రెన్యూ ఫోటోవోల్టాయిక్ , అవాడా ఎలక్ట్రో వంటి సోలార్ మాడ్యూల్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చైనా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల వీసా అప్లికేషన్లను వేగంగా అనుమతించాలంటూ ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా నుంచి నిపుణుల రాక ఆలస్యం కావడంతో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను పెంచలేకపోతున్నామని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మూడు కంపెనీలు తమ సోలార్ మాడ్యూల్ ప్లాంట్లలో అవసరమైన 36 మంది చైనా నిపుణుల కోసం బిజినెస్ వీసాల కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేయగా.. ఇప్పటిదాకా వాటికి అనుమతులు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో టాటా పవర్ సోలార్ అత్యధికంగా 20 మంది చైనా నిపుణుల కోసం వీసాలివ్వాల్సిందిగా కోరింది. ఈ కంపెనీ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 4 గిగావాట్ల (జీడబ్ల్యూ) గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, 4 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను నెలకొల్పుతోంది. దీనికోసం సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇక రెన్యూ పవర్ గుజరాత్‌లోని ధోలెరాలో, అవాడా కంపెనీ ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమబుద్ధ నగర్లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 500 జీడబ్ల్యూ లక్ష్యం.. 2030 నాటికి దేశంలో సౌరశక్తి, గాలి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా 500 జీడబ్ల్యూ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అధునాతన పరికరాలు, సాంకేతికత కోసం చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీ ఎగుమతుల్లో చైనా ప్రపంచంలోనే టాప్‌లో ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు ముదరడంతో పాటు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు చైనా యాప్‌లను నిషేధించింది. పెట్టుబడులపై కూడా డేగకన్ను వేస్తోంది ప్రభుత్వం. చైనీయులు భారత్‌లో రాకపోకలను కూడా కఠినతరం చేసింది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యంతో పాటు వ్యయాలు పెరిగిపోయేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
నమ్మరు గానీ... ఈ మహిళల రూటే సెపరేట్!
పుట్టుకతో అందరూ ఒకలా ఉండరు. అయితే తమలోని ప్రత్యేకను గుర్తించి, దాన్ని అద్భుతంగా మలుచుకునే వారు చాలా తక్కువ మందే ఉంటారు. తమ ప్రత్యేకతను మరింత స్పెషల్‌గా మలుచుకుని పాపులర్ అవుతారు. రికార్డులకెక్కుతారు. అదీ నమ్మశక్యంగాని రీతిలో. అలాంటి వండర్ విమెన్ గురించి చూద్దాం! న్యాకిమ్ గట్వేచ : 1993 జనవరి 27న పుట్టింది ఈ బ్యూటీ దక్షిణ సూడానీస్ సంతతికి చెందిన ఇథియోపియన్-జన్మించిన అమెరికన్ మోడల్. భూమిపై అత్యంత ముదురు చర్మపు రంగును కలిగి ఉన్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ప్రవేశించింది. తన ప్రత్యేకమైన అందంతో ఇన్‌స్టాలో చాలా పాపులర్ ఈ బ్యూటీ.మాకీ కర్రిన్ : ప్రపంచంలోనే అత్యంత పొడవాటి కాళ్లను కలిగి ఉన్న మహిళగా రికార్డు ఈమె సొంతం. నాలుగు సంవత్సరాలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను ఎవరూ బ్రేక్ చేయడం లేదు. యుక్తవయసులోనే అంటే 17 ఏళ్ల వయసులోనే ఈరికార్డుసాధించింది. ఆరడుగులమంచిన ఈ అందగత్తె ఎడమ కాలు పొడవు 53.255 అంగుళాలు, కాగా కుడి కాలు 52.874అంగుళాలు.కాథీ జంగ్ ప్రపంచంలోనే అతి చిన్న నడుము ఉన్న సన్నజాజి తీగ. 1999లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించింది. 5 అడుగుల 8 అంగుళాలు పొడవుండే ఈ సుందరి నడుము 38.1 సెంటీమీటర్లు (15.0 అంగుళాలు)యు జియాన్క్సియా: చైనాకు చెందిన యు జియాన్క్సియా కనురెప్పలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. 12.4 సెం.మీ. ఎడమకంటిరెప్పమీ ఉంటే వెంట్రుక పొడవుతో 2016లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ టైటిల్ కొట్టేసింది. 20.5 సెంటీమీటర్ల పొడవుతో తరువాత తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఆ సమయంలో, ఆమె కనురెప్ప ఆమె ఎడమ కన్ను ఎగువ కనురెప్పపై బుద్ధుడు ఇచ్చిన బహుమతి అని నమ్ముతుంది.బీ మెల్విన్ జాంబియన్ మోడల్. పుట్టుకతోనే వెండిలాంటి మెరిసి తెల్లటి జుట్టుతో పుట్టింది. ఈ ప్రత్యేకతే ఆమెను మోడల్‌గా నిలబెట్టింది. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్‌గా ఎదిగింది. వలేరియా వాలెరీవ్నా లుక్యానోవా (Valeria Valeryevna Lukyanova) అచ్చం బార్బీ బొమ్మలా కనిపించే పాపులర్ రష్యన్ మోడల్. ఆమె ప్రస్తుతం మెక్సికోలో నివసిస్తోంది. బార్బీలా మరింత సహజంగా ఆకుపచ్చ/బూడిద/నీలం కళ్లపై మేకప్ , కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంది.లిబర్టీ బారోస్: ఎటు కావాలంటే పాములా మెలికలు తిరిగే ప్రపంచంలోనే తొలి అమ్మాయి. బాల్యంలో వచ్చే ఊబకాయాన్ని అధిగమించేందుకు వ్యాయామం మొదలు పెట్టి అద్భుతంగా రాణించింది. 2024 గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కెక్కింది. అంతేకాదు ఫ్లెక్సిబుల్ బ్యాక్ బెండ్ లో మూడు ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. అబ్బి అండ్ హెన్సెల్: వీరు అవిభక్త కవలలు. 1996లో ఓప్రా విన్ఫ్రే షో ద్వారా వెలుగులోకిచ్చింది. వీరికి గుండె, ఊపిరితిత్తులు, వెన్నుపాము ఒకటే. కానీ తినడానికి నోరు వేరుగా ఉన్నాయి. అలాగే చేతులు మూడు. ఆ తరువాత వీరికి 12 ఏళ్ల వయస్సున్నపుడు ఆపరేషన్ చేసి మూడో చేతిని తొలగించారు. వీరిద్దరూ కలిసి బైక్, కారు నడపడంలాంటి కలిసే చేస్తారు. 2021లో మాజీ సైనిక అధికారిని పెళ్లి కూడా చేసుకున్నారు.నటాలియా కుజ్నెత్సోవ్ : రష్యన్ పవర్‌లిఫ్టర్. 14 ఏళ్ల వయస్సులో బాడీబిల్డింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 33 ఏళ్ల కుజ్నెత్సోవ్ కండలు తిరిగిన దేహంతో తన సత్తా చాటుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక టైటిళ్లను కైవసం చేసుకుంది. బాడీబిల్డర్ వ్లాడిస్లావ్ కుజ్నెత్సోవ్ను వివాహం చేసుకుంది. -
ఆటోవాలా ఆంగ్లం : అదుర్స్ అంటున్ననెటిజన్లు, వైరల్ వీడియో
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు ఇదే విషయాన్ని ఒక ఆటో ఆటోడ్రైవర్ మరోసారి నిరూపించాడు. అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తున్న సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఒక ఆటోడ్రైవర్ తన అత్యద్భుతమైన ఇంగ్లిష్ స్కిల్స్‌తో అటు ప్రయాణీకులను, ఇటు ఇంటర్నెట్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విదేశాల్లో చదువుకుని వచ్చినట్టుగా ఈ ఆటోవాలా ఇంగ్లీష్ భాషను దంచి పడేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన ప్యాసెంజర్, ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘ఆయన ఇంగ్లిష్‌లో అంత సులువుగా మాట్లాడుతుండటం చూసి నేనే ఆశ్చర్యపోయాను.కొద్దిసేపు అలా ఉండిపోయాను’’వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్లు ఆటోవాలా ఇంగ్లిష్‌కు ఫిదా అవుతున్నారు. వావ్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by BHUSHAN🐻🧋 (@kon_bhushan1222)అంతేకాదు ఇది ఇంటర్నేషన లాంగ్వేజ్.. ఇంగ్లీష్ వస్తే లండన్, అమెరికా, ప్యారిస్ లాంటి ప్రాంతాలకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. -
స్కిల్ వర్సిటీ ఏర్పాటుపై ప్రాజెక్టు రిపోర్టు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాల నాటికి స్పష్టమైన ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. ప్రతిపాదనలు అందించిన 24 గంటల్లోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో ఈ అంశంపై వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రి గురువారం చర్చించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అధికారులతోపాటు ప్రముఖుల అభిప్రాయాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. ఉపాధి అవకాశాలే లక్ష్యం యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందించేలా నైపుణ్య విశ్వవిద్యాలయం కృషి చేయాల్సిన అవసరముందని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని, ఇందుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఐఎస్బీ తరహాలో ఒక బోర్డు ఏర్పాటు అంశం ఈ సందర్భంగా చర్చకొచ్చింది. స్కిల్ యూనివర్సిటీలో ఉండాల్సిన కోర్సులు, బోధన ప్రణాళికపై సమగ్ర అధ్యయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్థికపరమైన అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో, కరికులమ్, కోర్సులకు సంబంధించి మంత్రి శ్రీధర్‌బాబుతో చర్చించాలని తెలిపారు. నిర్ణీత గడువు పెట్టుకొని ప్రతిపాదనలు రూపొందించాలని, కేవలం 15 రోజుల వ్యవధి ఉన్నందున, ప్రతీ ఐదు రోజులకోసారి సమావేశం కావాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమా..? ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది? ప్రభుత్వమే ఈ బాధ్యతలను చేపట్టగలదా అనే అంశాలపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు, ప్రాజెక్టు రిపోర్టులన్నీ తయారు చేసేందుకు ఆ రంగంలో నిపుణులతో కన్సల్టెన్సీ ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. యూనివర్సిటీ వ్యవహారాలకు పరిశ్రమలశాఖ నోడల్ డిపార్ట్మెంట్గా ఉంటుందని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ జయేష్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం స్పెషల్ సెక్రెటరీ అజిత్‌రెడ్డి, విష్ణువర్దన్డ్డి, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ చైర్మన్ సతీష్‌రెడ్డి, భారత్ బయోటెక్ హరిప్రసాద్, క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్‌రెడ్డి, ఐ ల్యాబ్స్ శ్రీనిరాజు పాల్గొన్నారు. సమావేశానికి ముందు ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో నిర్మిస్తున్న కన్వెన్షన్ సెంటర్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. అక్కడున్న సిబ్బందితో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, శ్రీధర్‌బాబు తదితరులు గ్రూపు ఫొటో దిగారు. -
నో లెర్నింగ్.. నో అప్డేట్
సాక్షి, హైదరాబాద్: చేసే పనిలో అప్డేట్ కావాలంటే...తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకోవాలి. కానీ తొంభైశాతం మంది భారత వృత్తి నిపుణులు అందుకు పూర్తిస్థాయిలో సిద్ధం కావడం లేదు. కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగత కమిట్మెంట్లు, బిజీ వర్క్‌షెడ్యూళ్లు తదితర కారణాలతో వెనుకడుగు వేస్తున్నట్టు స్పష్టమైంది. తాము పనిచేస్తున్న సంస్థలు, కంపెనీల యాజమాన్యాలు వివిధ రూపాల్లో నైపుణ్యాలు పెంచేందుకు సానుకూల దృక్పథంతోనే ఉన్నా, దీనికి సంబంధించి తమ ప్రాధాన్యతలను నిర్ధారించుకోవడంలో దేశంలోని దాదాపు 80 శాతందాకా వృత్తి నిపుణులు విఫలమవుతున్నారు. కుటుంబ బాధ్యతలు, ఇతర రూపాల్లోని ప్రతిబంధకాలు అధిగమించి కొత్తవి నేర్చుకునే విషయంలో అత్యధికుల అనాసక్తి కనబరుస్తున్నారు. 2030 సంవత్సరం నాటికల్లా ప్రపంచస్థాయిలోనే కాకుండా భారత్‌లోనూ ప్రస్తుతమున్న ఉద్యోగాలు, బాధ్యతలు, విధుల స్వరూపం 64 శాతం మేర మారిపోయే అవకాశాలున్నాయని నిపుణులు, కంపెనీవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వృత్తినిపుణులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలను తప్పనిసరిగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త విషయాలు నేర్చుకోవడం, చేసే పని పద్ధతులు, విధానాల్లో మార్పులపై అధిక దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. తాజాగా నెట్వర్కింగ్ సంస్థ ‘లింక్డ్ ఇన్’ విడుదల చేసిన నివేదికలో వివిధ అంశాలు వెల్లడయ్యాయి. వెనుకబాటుకు కారణాలు.. వృత్తి నిపుణులు కొత్త విషయాలు నేర్చుకోవడం, నైపుణ్యాలు పెంచుకోవడంలో వెనుకబాటుకు పలు కారణాలు నివేదికలో పొందుపరిచారు. 34 శాతం మంది కుటుంబ బాధ్యతలు, వ్యక్తిగతంగా నిర్దేశించుకున్న లక్ష్యాలు 29 శాతం మంది చేస్తున్న పనిలో బిజీ వర్క్ షెడ్యూ ల్26 శాతం మంది నేర్చుకునేందుకు వనరులు, విధానాలు లెక్కకు మించి ఉండడంతో ఏదీ తేల్చుకోలేకపోవడంఈ పరిస్థితిని అధిగమించాలంటే ‘లౌడ్ లెర్నింగ్’» పని ప్రదేశాల్లో లేదా ఆఫీసుల్లో విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో అక్కడే మౌఖికంగా లేదా ఇతర కొత్త విషయాలను అర్థమయ్యేలా చేయగలిగితే అధిక ప్రయోజనం ఉంటుందన్నారు. » తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఈ విధానం తమకు ఉపయోగపడుతుందని 81 శాతం మంది చెప్పారు. » ఈ విధానంలో నిమగ్నమై కొత్త విషయాలను నేర్చుకుంటున్నవారు 64 శాతం ఉన్నట్టుగా నివేదిక చెబుతోంది.» ‘లౌడ్ లెర్నింగ్’లో భాగంగా తమ టీమ్ సభ్యుల నుంచి మెళకువలు నేర్చుకోవచ్చునని 40 శాతం మంది చెప్పగా, 35 శాతంమంది తాము నేర్చుకునే విషయాలకు సంబంధించి టీమ్ సభ్యులకు వివరించడం ద్వారా అంటున్నారు. » అనుభవజ్ఞులైన వృత్తినిపుణుల గైడెన్స్‌లో నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా 28 శాతం మంది తమ కెరీర్లో ముందుకెళ్లేందుకు దోహదపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. » నైపుణ్యాల మెరుగుదలతో కొత్త వృత్తుల్లో అవకాశాలు లభిస్తాయని 27 శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. » తమతో పనిచేస్తున్న వృత్తినిపుణులు, ఉద్యోగుల అనుభవసారం, ఆయా అంశాలపై వారికున్న విషయ దృష్టిని గ్రహించడం ద్వారా ప్రయోజనం చేకూరుతోందంటున్న 26 శాతం మంది చెప్పారు. -
ఈ ఏఐ స్కిల్‌కి క్రేజీ డిమాండ్.. రూ.లక్షల్లో జీతాలు!
కృత్రిమ మేధకు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అన్నింటా ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై అనేక భయాలు, సందేహాలు, ఆందోళనలు నెలకొన్నాయి. ఏఐ మన భవిష్యత్తును ఎలా మార్చబోతోంది.. దానికి సిద్ధంగా ఉన్నామా.. వెనుకబడిపోతామా అన్న భయంతో అవసరమైన ఏఐ నైపుణ్యం కోసం వేట కొనసాగుతోంది. ఈ క్రమంలో గ్లోబల్ టెక్నాలజీ ఇన్నోవేటర్ ఐబీఎం ఎగ్జిక్యూటివ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.సీఎన్‌బీసీ నివేదిక ప్రకారం, దాదాపు 96 శాతం మంది కంపెనీల అధినేతలు తమ సంస్థల నిర్వహణలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను తీసుకొచ్చే పనిలో ఉన్నారు. 2024 మార్చిలో స్లాక్ వర్క్‌ఫోర్స్ ల్యాబ్ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. మూడింట రెండు వంతుల మంది కార్యాలయ ఉద్యోగులు తాము ఎప్పుడూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేయలేదని అంగీకరిస్తున్నారు.ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవడం మానేసే వారు కెరీర్ పురోగతిని కోల్పోతారని ఐబీఎం గ్లోబల్ ఎడ్యుకేషన్ అండ్ వర్క్ ఫోర్స్ డెవలప్మెంట్ వైస్ ప్రెసిడింట్ లిడియా లోగాన్ హెచ్చరిస్తున్నారు. అత్యధిక డిమాండ్ ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యం ప్రాంప్ట్ ఇంజనీరింగ్‌ను నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఈ స్కిల్ నేర్చుకోవడానికి బ్యాచిలర్ డిగ్రీ కూడా అక్కర్లేదని ఆమె చెబుతున్నారు.అంత డిమాండ్ ఎందుకంటే..ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొందిన ఏఐ సాధనాలలో ఒకటైన చాట్‌జీపీటీని మీరు ఉపయోగించినట్లయితే, మీ ప్రాంప్ట్ లు ఎంత కచ్చితమైనవి అయితే, ప్రతిస్పందనలు అంత మెరుగ్గా ఉంటాయని మీరు గమనించే ఉంటారు. అందుకే బోల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కు ఇంత డిమాండ్ ఉంది. సింపుల్‌గా చెప్పాలంటే, ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ తన ఎంప్లాయర్ లేదా క్లయింట్లకు విలువైన సమాచారాన్ని పొందడానికి చాట్‌జీపీటీ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్ఎల్ఎం) వంటి ఏఐ చాట్బాట్లకు సరైన ప్రశ్నలు లేదా సూచనలను రూపొందిస్తారు. ఈ జాబ్ కోసం బ్యాచిలర్ డిగ్రీ కూడా అవసరం లేకపోవచ్చు. ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ ప్రొడక్ట్ మేనేజర్లు వంటి సరికొత్త ఉద్యోగాలకు సాంప్రదాయ డిగ్రీల కంటే టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్‌కే ప్రాధాన్యత ఉంటుందని లోగాన్ వివరించారు.ప్రాంప్ట్ ఇంజనీర్‌కు భారత్‌లో జీతాలు ఇలా..లింక్డ్ఇన్, జాబ్-సెర్చ్ సైట్ ఇన్డీడ్లోని లిస్టింగ్స్ ప్రకారం కంపెనీలు ప్రాంప్ట్ ఇంజనీర్‌కు సంవత్సరానికి రూ .93 లక్షల నుంచి రూ .16 లక్షల వరకు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాయి. భారత్‌లో 2-5 ఏళ్ల అనుభవం ఉన్న ఇంజినీర్ ఏడాదికి రూ.6 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు సంపాదించవచ్చు. 5 సంవత్సరాల కంటే ఎక్కువ అనుభవం ఉన్న సీనియర్ ఇంజనీర్లకు వార్షిక వేతనం రూ .12 లక్షలు దాటి రూ .20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. -
పట్టణ యువతలో 61శాతం మందికి కంప్యూటర్ నైపుణ్యం
సాక్షి, అమరావతి : దేశంలో కంప్యూటర్ నైపుణ్యం పట్టణ యువతలో 61 శాతం ఉండగా అదే గ్రామీణ యువతలో కేవలం 34 శాతమే ఉందని ఇండియా ఎంప్లాయిమెంట్ రిపోర్ట్–24 వెల్లడించింది. కంప్యూటర్ నైపుణ్యాల సామర్థ్యం రాష్ట్రాల మధ్య వైవిధ్యం స్పష్టంగా కనిపిస్తోందని ఆ నివేదిక తెలిపింది. కెమెరా, మోడమ్, ప్రింటర్ వంటి పరికరాలు ఇన్స్టాల్ చేసే సామర్థ్యం పట్టణ యువతలో ఉందని.. అయితే గ్రామీణ యువతలో అది ఎనిమిది శాతమేనని పేర్కొంది.ఇలా వివిధ రకాల కంప్యూటర్ నైపుణ్యాల్లో దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉన్నాయని వివరించింది. ఇక ఫైళ్లను బదిలీచేసే సామర్థ్యం మినహా చాలా నైపుణ్యాల్లో కర్ణాటక ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉంది. ఫైల్ లేదా ఫోల్డర్‌ను కాపీ చేయగల లేదా తరలించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 45.56 శాతం ఉంటే కేరళ యువతలో 90.28 శాతం.. తమిళనాడు యువతలో 72.28 శాతం, కర్ణాటక యువతలో 64.36 శాతం, తెలంగాణలో 53.83 శాతం ఉన్నట్లు రిపోర్ట్ తెలిపింది.అలాగే, డూప్లికేట్ లేదా టూల్స్‌ను కాపీచేసి పేస్ట్ చేయగల సామర్థ్యంతో పాటు సమాచారాన్ని ట్రాన్స్ఫర్ చేయగల నైపుణ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 43.30 శాతం ఉందని ఆ నివేదిక తెలిపింది. ఇది కేరళ యువతలో 89.30 శాతం, తమిళనాడు యువతలో 70.45 శాతం, కర్ణాటక యువతలో 60.24 శాతం, తెలంగాణలో 50.40 శాతం ఉంది.ప్రెజెంటేషన్ల సామర్థ్యం కేరళలో ఎక్కువ..ఇక జోడించిన ఫైల్‌తో ఈ–మెయిల్ పంపగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 36.38 శాతం ఉంటే కేరళ యువతలో అత్యధికంగా 73.34 శాతం, తమిళనాడులో 55.33 శాతం, కర్ణాటకలో 45.04 శాతం, తెలంగాణలో 45.46 శాతం సామర్థ్యం ఉంది. ప్రెజెంటేషన్ సాఫ్ట్‌వేర్‌తో ఎలక్ట్రానిక్ ప్రెజెంటేషన్లను సృష్టించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్ యువతలో 10.18 శాతం ఉండగా కేరళ యువతలో 40.33 శాతం, తమిళనాడులో 26.10 శాతం, కర్ణాటకలో 22.33 శాతం, తెలంగాణలో 14.27 శాతం ఉందని రిపోర్ట్ వెల్లడించింది.గ్రామీణంలో ‘నెట్’ వినియోగం 25 శాతమే..అలాగే, దేశంలో 15 ఏళ్ల వయస్సు నుంచి 29 ఏళ్లలోపు యువత ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 25.30 శాతం ఉండగా పట్టణ ప్రాంతాల్లో 57.53 శాతం ఉందని తెలిపింది. వర్గాల వారీగా ఇంటర్నెట్ వినియోగాన్ని పరిశీలిస్తే.. ఎస్టీ వర్గాల్లో 20.39 శాతం, ఎస్సీల్లో 24.96 శాతం, వెనుకబడిన వర్గాల్లో 34.28 శాతం, సాధారణ వర్గాల్లో 50.15 శాతం ఇంటర్నెట్ ఉందని రిపోర్ట్ తెలిపింది. మెజారిటీ యువత మాధ్యమిక లేదా ఉన్నతస్థాయి విద్యను అభ్యసిస్తున్నారని, దీంతో పాటు కంప్యూటర్లు, ఇంటర్నెట్, డిజిటల్ నైపుణ్యాల యాక్సెస్ యువత జనాభాలో కూడా పెరిగిందని.. అయితే సాంకేతిక నైపుణ్యాలను, సామర్థ్యాన్ని పెంచేందుకు యువతకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉందని ఆ నివేదిక అభిప్రాయపడింది. -
కథర్నాక్.. స్టోరీ టెల్లింగ్ మంత్ర
‘కథలు చెప్పకు’ అని పేరెంట్స్‌తో, ఫ్రెండ్స్‌తో సుతిమెత్తని తిట్లు తినని వారు యూత్‌లో తక్కువగానే ఉంటారు. అయితే ప్రసిద్ధ బ్రాండ్స్ మాత్రం ‘కథలు చెప్పండి ప్లీజ్’ అంటూ యంగ్ టాలెంట్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రకటనలకు సంబంధించి ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. రకరకాల బ్రాండ్లకు సంబంధించి భావోద్వేగాలతో మిళితమైన యాడ్స్ యువ సృజనకారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అమూల్ బ్రాండ్ ‘అమూల్ గర్ల్’ ద్వారా సమకాలీన సంఘటనలతో కనెక్ట్ కావడానికి చేస్తున్న టాపికల్ యాడ్స్ పాపులర్ అయ్యాయి. నగల బ్రాండ్ ‘తనిష్క’ తమ వ్యాపార ప్రకటనల్లో ‘స్టోరీ టెల్లింగ్’ ఫార్మట్‌ను బలంగా ఉపయోగించుకుంటుంది. ఇక ‘లైఫ్‌బాయ్’ దగ్గరకు వస్తే... ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది ్ర పాడక్ట్ను ప్రమోట్ చేయడానికే కాదు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ విషయంలోనూ ఉపయోగపడుతుందనేది అర్థమవుతుంది. శాస్త్ర, సాంకేతిక విషయాలపై వినియోగదారుల్లో ఆసక్తి కలిగించడానికి, పెంచడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టేజ్డ్ విజువల్స్‌ను ఉపయోగించుకుంటుంది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్. బ్రాండ్లు విస్తృత స్థాయిలో కన్జ్యూమర్లతో కనెక్ట్ కావడానికి తమ ప్రాడక్ట్‌కు సంబంధించిన అడ్వర్టైజింగ్ విషయంలో భావోద్వేగాలతో కూడిన ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్‌ను కోరుకుంటున్నాయి. అడ్వర్టైజింగ్ ప్రపంచంలో స్ట్రాటజిక్ స్టోరీ టెల్లింగ్ అనేది కీలకంగా మారింది. ఈ పవర్ఫుల్ టూల్ బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. సర్వేల ప్రకారంప్రాడక్ట్లకు సంబంధించి సంప్రదాయ అడ్వర్టైజింగ్ల కంటే మిత్రుల మాటలనే విశ్వసిస్తోంది యువత. వారిలో నమ్మకం కలిగించాలంటే యాడ్ అనేది యూత్‌ఫుల్‌గా, మిత్రుడు కొత్త విషయం చెప్పినట్లుగా ఉండాలి. ఇందుకోసం బ్రాండ్స్ యువ స్టోరీ టెల్లర్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. వారి స్టోరీ టెల్లింగ్లోని తాజాదనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. థీమ్‌ను గుర్తించడం, సెంట్రల్ క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసుకోవడం, కస్టమర్ల హృదయాలను తాకేలా యాడ్‌ను తీర్చిదిద్దడం అనేవి స్టోరీ టెల్లింగ్‌లో కీలక విషయాలు. ఇలాంటి విషయాలలో యువ సృజనకారులు తమలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ డిజిటల్ శకంలో స్టోరీ టెల్లింగ్ అనేది కొత్త రూ పాలతో సృజనాత్మకంగా వికసిస్తోంది. వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), గేమింగ్ టెక్నాలజీ... మొదలైనవి స్టోరీ టెల్లింగ్‌లో కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. ‘స్టోరీ టెల్లింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బలమైన సాధనం. టార్గెట్ ఆడియెన్స్‌ను మెప్పించేలా స్టోరీ టెల్లింగ్ కోసం ఏ.ఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉనేది బలమైన భావోద్వేగాల సమ్మేళనం’ అంటున్నాడు ‘పోకో’ ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్. సినిమాల నుంచి ఇంటర్వ్యూల వరకు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు ప్రకటనలు ప్రత్యక్షమైతే చిరాగ్గా అనిపిస్తుంది. కోల్‌కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నివేదిత మాత్రం పనిగట్టుకొని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ను చూస్తుంటుంది. ‘ఒకప్పటి వ్యా పార ప్రకటనల్లో వారి బ్రాండ్‌కు సంబంధించిన గోల మాత్రమే ప్రధానంగా కనిపించేది. ఇప్పటి ప్రకటనల్లో మాత్రం ఇంటలెక్చువల్ ఫ్లేవర్, క్రియేటివిటీ కనిపిస్తోంది. వాటిని చూస్తుంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు కూడా రకరకాల ఐడియాలు వస్తుంటాయి’ అంటుంది నివేదిత. ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ వికాస్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో ‘నేను అయితే ఈ యాడ్‌ను ఇలా తీస్తాను’ అంటూ నోట్స్ రాసుకోవడం అలవాటు. ఒక్కముక్కలో చె΄్పాలంటే నివేదిత, వికాస్లాంటి యువ ఉత్సాహవంతులను బ్రాండ్స్ కోరుకుంటున్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతిభను నిరూపించుకుంటే ఇక వారికి తిరుగేలేదు. స్టోరీ టెల్లింగ్ మంత్ర యాడ్‌లో స్టోరీ టెల్లింగ్ ఫార్మట్ అనేది కంపెనీకి, కస్టమర్లకు మధ్య భావోద్వేగాలతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ.. ఎలా... ఎంత చెప్పాలో అంతే చెప్పాలనేది స్టోరీ టెల్లింగ్‌లో భాగం. మిస్ ఫైర్ అయితే మొదటికే మోసం వస్తుంది. ప్రకటనలకు సంబంధించి కొన్ని కంపెనీలు విఫలం కావడానికి కారణం... తమ ప్రాడక్ట్ గురించి తప్ప కన్జ్యూమర్ గురించి పట్టించుకోకపోవడం. అందుకే కన్జ్యూమర్‌ను హీరో చేసేలా స్టోరీ బిల్డ్ చేయాలి అనేది ముఖ్యమైన స్టోరీ టెల్లింగ్ మంత్ర. ‘ఫలానా యాడ్ ఎందుకు విఫలమైంది’ అనే విషయంలో యువ సృజనకారులు పోస్ట్‌మార్టం చేయడంతో పాటు ఒక యాడ్ సూపర్ డూపర్ హిట్ కావడంలోని కీలక అంశాలను ఔ పాసన పడుతున్నారు. ‘వాట్ మేక్స్ ఏ గ్రేట్ స్టోరీ’ అనే కోణంలో కస్టమర్ ఛాలెంజ్‌లను అధ్యయనం చేస్తున్నారు. -
బాబు తెలివిని మ్యాచ్ చెయ్యలేక పోయిన కేసీఆర్, అరవింద్
-
త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అంతర్జాతీయ ప్రమాణాలతో త్వరలో నైపుణ్య విశ్వవిద్యాలయాన్ని (స్కిల్ యూనివర్సిటీ) ఏర్పాటు చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సహచరులు, అధికారులు చిత్తశుద్ధితో ఉన్నట్లు ఆయన వివరించారు. విద్యా శాఖ, ఉన్నత విద్యామండలి, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ‘‘తెలంగాణలో ఉద్యోగ–ఉపాధి అవకాశాలు, ఇంటర్న్‌షిప్, ఉద్యోగాల కల్పన, విద్యార్థుల అభివృద్ధి’’అనే అంశంపై గురువారం అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్రం విద్య, ఐటీ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉందని అన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే ఏ విద్యార్థి కూడా నైపుణ్య లేమితో ఉపాధి అవకాశాలు కోల్పోరాదని, ఆ దిశగా ఉన్నత విద్యా మండలి, విద్యా శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు. డిగ్రీ స్థాయిలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడే విద్యార్థులు రాష్ట్రంలోని ప్రఖ్యాత పరిశ్రమల్లో ఇంటర్న్‌షిప్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు ఆయా కోర్సుల్లో నైపుణ్యాభివృద్ధికోసం ప్రత్యేక శిక్షణను ఇచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నత విద్య స్థూల నమోదు జాతీయ స్థాయి సగటు కంటే ఎక్కువగా ఉందని, రాష్ట్ర విద్యారంగంలో అమలు అవుతున్న కార్యక్రమాలు ఉన్నతమైన గుర్తింపు పొందాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొ. వెంకట రమణ, ప్రొ. ఎస్.కె. మహమూద్ తదితరులు ప్రసంగించారు. -
యువతరానికి దిక్సూచి ‘భవిత’
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలోని యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చూపిస్తున్న చొరవకు పారిశ్రామికవేత్తలు ఫిదా అయ్యారు. ‘భవిత’ పేరుతో ప్రారంభించిన స్కిల్ కాస్కేడింగ్ కార్యక్రమం.. యువత భవిష్యత్తుకు దిక్సూచిగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీలో నైపుణ్య శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన మ్యాన్ పవర్ దొరుకుతోందని.. ఇక్కడ విద్యార్థుల్ని సానబెడితే అన్ని రంగాల్లోనూ రాణించగల సత్తా ఉందని సూచించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం.. తమలాంటి ఎందరో యువతీ యువకుల జీవన స్థితిగతుల్ని మార్చేసిందని ఉద్యోగాలు పొందిన యువత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నేను కోరుకున్న ఫీల్డ్‌లో స్థిరపడ్డాను మాది విశాఖపట్నం పెదగంట్యాడ. మా నాన్న లిఫ్ట్ ఆపరేటర్, అమ్మ గృహిణి, నాకు ఒక సోదరి కూడా ఉంది. మేం ఇద్దరం జగనన్న ప్రభుత్వం ఇచ్చిన విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా లబ్ధిపొంది చదువుకున్నాం. నా గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆటోమేషన్‌లో స్ధిరప డాలని సీడాప్ ద్వారా స్కిల్ కాలేజ్‌లో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు గురించి తెలుసుకొని రిజిస్టర్ చేసుకొని ట్రైనింగ్ తీసుకున్నాను. మాకు టెక్నికల్ స్కిల్స్‌తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ నేర్పించారు. అనేక ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. నేను రెండు కంపెనీలలో మంచి ప్యాకేజ్‌కు ఎంపికయ్యాను. చెన్నైలోని రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలో 4 రౌండ్ల ఇంటర్వ్యూ తర్వాత గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీగా సెలక్ట్ అయ్యాను. – దీపిక, గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, రాయల్ ఎన్ఫీల్డ్ మోటర్ కంపెనీ, చెన్నై స్కిల్లింగ్ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేసిన ఏపీ.. ఏపీలో యంగ్ సీఎం ఉన్నారు. అందుకే యువతకి అవకాశాలు ఎక్కువగా కల్పించాలన్న ఆలోచనలతో అడుగులు వేస్తున్నారు. సింగపూర్‌లో స్కిల్లింగ్కి ఏజ్ బార్ లేదు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. దేశంలో స్కిల్లింగ్ ఎకోసిస్టమ్‌ని అభివృద్ధి చేసిన రాష్ట్రం ఆంధప్రదేశ్ మాత్రమే. పదిస్థాయిల్లో శిక్షణ అందించేలా స్కిల్ పిరమిడ్‌ను కూడా సీఎం జగన్ రూపొందించారు. యువతకి నైపుణ్యాన్ని పెంపొందించే ప్రోగ్రామ్ని కూడా తయారు చేశారు. పరిశ్రమలతో అనుసంధానం చేయడంతో వారికి కావాల్సిన సాంకేతిక నైపుణ్యం ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. – బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర ఆర్థిక, స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖ మంత్రి ప్రభుత్వం ఎంతో ప్రోత్సహిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం మా సంస్థని, పెట్టుబడుల్ని ఎంతగానో ప్రోత్సహి స్తోంది. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రావాలని ఆశిస్తున్నాం. స్కిల్ సెక్టార్ కు ఇది గొప్ప అడుగు. స్కిల్ ఎకో సిస్టమ్‌ని అభివృద్ధి చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రభుత్వం చర్యలకు నిజంగా అభినందనలు. కియా మోటార్స్ ఇండియా ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్‌స్టిట్యూట్‌ని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు చేశాం. స్కిల్ డెవలప్మెంట్ సంస్థల ద్వారా అద్భుత అవకాశాలు ఏపీలో ఉన్న యువతకు అందుతున్నాయి. –కె.గ్వాంగ్లీ, కియా మోటర్స్ ఎండీ కమిట్మెంట్ ఉన్న సీఎం జగన్ దేశంలో ఇప్పటి వరకూ చాలా స్కిల్ డెవలప్ మెంట్ కార్యక్రమాలకు హాజరయ్యాను. ఇలాంటి కమిట్మెంట్ ఉన్న ప్రభుత్వాన్ని ఇంతవరకూ చూడలేదు. యువత ముందే పారిశ్రామికవేత్తల్ని కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పడం అద్భుతం. మా సంస్థ విమానాలు తయారు చేస్తుంది. భవిష్యత్తులో విమానయానంలో ఎన్నోరకాల ఉపాధి అవకాశాలున్నాయి. లెర్నింగ్ వింగ్స్ ఫౌండేషన్ అనే స్కిల్లింగ్ భాగస్వామితో పని చేస్తున్నాం. మా సంస్థ సామర్థ్యం మేరకు స్కిల్ ఎకో సిస్టమ్‌కు మద్దతు అందిస్తాం. – ప్రవీణ యజ్ఞంభట్, బోయింగ్ ఇండియా చీఫ్ ఆఫ్ స్టాఫ్ కెమికల్ ఇంజినీర్స్ అవసరం చాలా ఉంది ఏపీ సెజ్ అచ్యుతాపురంలో మా సంస్థని ఏర్పాటు చేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆటమిక్ రీసెర్చ్ ఉత్పత్తుల్లో ఎంతో ఉన్నతి సాధించాం. కెమికల్ ప్రాసెసింగ్ వైపు కూడా మా సంస్థ అడుగులు వేస్తోంది. ఈ తరుణంలో మాకు కెమికల్ ఇంజినీర్స్ అవసరం ఎంతో ఉంది. నేరుగా నియామకం చేసుకోవాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాష్ట్ర స్కిల్ డెవలప్ మెంట్ సొసైటీతో కలిసి పనిచేస్తున్నాం. విద్యార్థులకు మాకు అవసరమైన రీతిలో శిక్షణ అందించి ఉపాధి కల్పిస్తాం. పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల్ని అందించడంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషి అనిర్వచనీయం. – కొయిచీ సాటో, టొయేట్సు రేర్ ఎర్త్ ప్రై.లి., ఎండీ సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు నేను మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమా పూర్తిచేశాను. అప్పుడు ఏపీఎస్ఎస్డీసీ స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో 45 రోజులు శిక్షణ తీసుకున్నాను. శిక్షణలో నేను చాలా నేర్చుకున్నాను. మెషిన్ ఆపరేటింగ్, సాఫ్ట్‌స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పారు. 2021లో ఏషియన్ పెయింట్స్ వారి ఇంటర్వ్యూలకు హాజరై ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా ఏడాదికి రూ. 5 లక్షల ప్యాకేజ్‌లో సెలక్ట్ అయ్యాను. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్‌గా ఏడాదికి రూ. 7.2 లక్షల ప్యాకేజీ తీసుకుంటున్నాను. మా కుటుంబానికి నేను ఇప్పుడు చాలా ఆసరాగా ఉన్నాను. ఈ విధమైన శిక్షణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి, సీఎంకు నా కృతజ్ఞతలు. – భార్గవ్, విశాఖపట్నం మానవవనరుల్లో మనమే ముందంజ.. అత్యధికంగా నైపుణ్యంతో కూడిన మానవ వనరులున్న రాష్ట్రంగా ప్రభుత్వం తీర్చిదిద్దడంతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఏపీ ముందు వరసలో ఉంది. స్కిల్ ట్రైనింగ్ అనేది కేవలం ఉపాధి అవకాశాల్ని అందిస్తోంది. ఐదేళ్లలో 15 లక్షల మంది యువతకు శిక్షణ ఇవ్వగా.. 3.8 లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఇంకొందరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా రాణిస్తున్నారు. సీఎం జగన్ 27 స్కిల్ కాలేజీలు, 192 స్కిల్ హబ్స్, 55 స్కిల్ స్కోప్స్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. భవిత పేరుతో శిక్షణని అప్‌గ్రేడ్ చేస్తున్నాం. – సురేష్‌కుమార్, ఏపీ స్కిల్‌డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ