చే‘నేత’లో గొప్ప నైపుణ్యం | Chenetalo great skill | Sakshi
Sakshi News home page

చే‘నేత’లో గొప్ప నైపుణ్యం

Published Fri, Aug 5 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM

చే‘నేత’లో గొప్ప నైపుణ్యం

చే‘నేత’లో గొప్ప నైపుణ్యం

  • దరీలకు కేరాఫ్‌ కొత్తవాడ  
  • రేపు జాతీయ చేనేత దినోత్సవం
పోచమ్మమైదాన్‌ :
దేశంలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తున్నది చేనేత వృత్తిపైనే. చేనేతల పనిలో గొప్ప నైపుణ్యం ఉం టుంది. అగ్గిపెట్టెలో పట్టే చీర నేసిన ఘనత వారి కే దక్కుతుంది. చేనేత దినోత్సవాన్ని ప్రకటించి, అధికారికంగా నిర్వహించాలని చేనేత కార్మికు లు పలుమార్లు ప్రధానమంత్రికి చేసిన వినతుల ను పరిగణనలోకి తీసుకొని ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రధాని నరేంద్రమోదీ గత ఏడాది ప్రకటించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఉత్తమ చేనేత కార్మికులకు జాతీయ అవార్డులను సైతం ఇస్తున్నారు.
కొత్తవాడలో దరీల తయారీ
వరంగల్‌ నగరంలోని కొత్తవాడలో అద్భుతమై న చేనేత దరీలు తయారవుతుంటాయి. దేశం న లుమూలల నుంచే కాకుండా ఇతర దేశాల వా రు సైతం ఇక్కడి హ్యాండ్‌లూమ్స్‌పై అమితమైన ఆసక్తి కనబరుస్తున్నారు. ఇక్కడి నుంచి ప్రపంచంలోని పలుచోట్లకు ఎగుమతి అవుతుండటం విశేషం. కొత్తవాడలో సుమారు 1800 మంది చేనేత కార్మికులు రకరకాల హ్యాండ్‌ మేడ్‌ వస్తువులు తయారు చేస్తుంటారు. ఎర్రతివాచి పుట్టిం ది కూడా ఇక్కడే. ఢిల్లీలోని పార్లమెంట్‌లో వాడే తివాచీలు కొత్తవాడవే.
హ్యాండ్‌లూమ్స్‌.. అనేక రకాలు
కొత్తవాడలో అనేక రకాల హ్యాండ్‌లూమ్స్‌ తయారవుతున్నాయి. చేనేత మగ్గం, జనపనార, కాటన్‌ వినియోగించి డోర్‌ మ్యాట్స్, ఫ్లోర్‌ దగ్స్, జూట్‌ దరీస్, కార్పెట్‌లు, టెంట్‌హౌస్‌ సామగ్రి తదితర హోమ్‌నీడ్‌ దరీలు నేస్తున్నారు. వీటిని ఇంటర్‌లాక్, కలంకారి ప్రింటింగ్‌ కస్టమర్‌ కోరుకున్న రంగులో కోరుకున్న డిజైన్‌లో తయారు చేసి ఇస్తున్నారు.
ఇతర దేశాలకు ఎగుమతి
కొత్తవాడలో తయారు చేసిన చేనేత దరీలకు దేశంలోని పలు ప్రాంతాల్లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ డిమాండ్‌ ఉంది. ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కత్తా, చెన్నై, బెంగుళూరు, ఇండోర్‌ ప్రాంతాలతోపాటు కెనడా, యూఎన్‌ఏ, జర్మనీ, సింగపూర్‌ తదితర దేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. పలు కార్పొరేట్‌ కంపెనీలు కొనుగోలు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కొన్ని దేశాల నుంచి నేరుగా కొత్తవాడ చేనేత కార్మికులకు ఆర్డర్‌లు వస్తున్నాయి.
దరీల తయారీ విధానం
కొత్తవాడ ప్రాంతంలో అనేక రకాల హ్యాండ్‌లూమ్‌(చేనేత) దరీలు తయారవుతున్నాయి. ఇందుకు తొలుత చేనేత కార్మికులు నేషనల్‌ హ్యాండ్‌లూమ్‌ కార్పొరేషన్‌ నుంచి సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఈ సామగ్రి అధికంగా కోయంబత్తూరు నుంచి దిగుమతి అవుతుంది. వీటిని ఒక పద్ధతిలో అమర్చిన వాటిని ప్రింటింగ్‌ వేసి విక్రయిస్తున్నారు.
కలంకారి ప్రింటింగ్‌  
కలంకారి ప్రింటింగ్‌ పద్ధతిలో రూపొందించిన దరీలను అధికంగా ఇళ్లలో వినియోగిస్తారు. తొలుత కొత్తవాడలో చేనేత దరీలు తయారు చేస్తారు. తర్వాత వాటిని మచిలీపట్నం పంపించి వివిధ డిజైన్లు ప్రింటింగ్‌ వేయిస్తారు. అక్కడ వేజిటేబుల్‌ డైయింగ్‌లో (సహజ సిద్ధమైన) దరీలను ప్రింట్‌ చేస్తారు. ఈ తరహాలో దరీలను అత్యంత డిమాండ్‌ ఉంటుంది. డోర్‌ కర్టన్‌లకు, టెంట్‌లకు, వాల్‌ బ్యానర్‌లకు తదితర కలంకారి ప్రింటింగ్‌లనే అధికశాతం ఇష్టపడుతుంటారు.
జ కోట్‌ (జూట్‌ పద్ధతి)  
జకోట్‌ దరీలను జనపనారతో తయారు చేస్తారు. దరీలు తయారు చేసిన అనంతరం కాళ్లతో తొక్కుతూ డిజైన్‌ను రూపొందిస్తారు. ఇందులో కూడా నచ్చిన డిజైన్‌ను రుపొందిస్తారు. ఈ తరహా దరీలను అధికంగా ఫ్లోర్‌కు వినియోగిస్తారు.
రాములుకు జాతీయ ఉత్తమ చేనేత అవార్డు 
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న వారాణాసిలో జాతీయ ఉత్తమ చేనేత కార్మికుడి అవార్డును కొత్తవాడకు చెందిన పిట్ట రాములు అందుకోనున్నారు. కొన్నేళ్లుగా చేనేత వృ త్తిలో కొనసాగుతూ ఎంతో అందమైన దరీలను తయారుచేస్తున్నారు. మెుఘల్‌ హంటింగ్‌ కళాఖండాన్ని దరీపై రూపొందించి ఔరా అనిపించారు. తెలుగు రాష్ట్రాల్లో చేనేత రంగంలో దరీ వి భాగంలో ఉత్తమ చేనేత కార్మికుడు అవార్డును అందుకోవ డం ఇదే తొలిసారి. రాములు తయారు చేసిన దరీలు ఇతర దేశాలకు సైతం పంపిస్తున్నారు. ఇతర దేశాల నుంచి ఆర్డర్‌లు తీసుకొని ఎంతో అందమైన డిజైన్లు రూపొందిస్తున్నారు. దేశం లో జరిగే అన్ని చేనేత ఎగ్జిబిషన్‌లలో ఆయన తయారుచేసిన వాటిని అమ్మకాలకు పెడుతున్నారు.
ఇంటర్‌ లాకింగ్‌ సిస్టమ్‌  
దరీల తయారీలో ఇంటర్‌ లాకింగ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. దరీల తయారు చేసి వాటిపై చేతితో పలు రకాల డిజైన్లు వేసే పద్ధతినే ఇంటర్‌ లాకింగ్‌ అంటారు. ఈ పద్ధతిలో దరీలపై ఫొటోలు, డిజైన్‌ వస్తాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement