'వంట చేయడం గొప్ప టాలెంట్‌'..!: థైరోకేర్ వ్యవస్థాపకుడు | Thyrocare Founder On Significance Of Cooking As Crucial Life Skill | Sakshi
Sakshi News home page

'వంట చేయడం గొప్ప టాలెంట్‌'..!: థైరోకేర్ వ్యవస్థాపకుడు

Published Thu, Mar 6 2025 6:31 PM | Last Updated on Thu, Mar 6 2025 6:37 PM

Thyrocare Founder On Significance Of Cooking As Crucial Life Skill

వంట చేయడం లేదా వంట వృత్తిని తక్కువగా లేదా తేలిగ్గా చూస్తారు చాలామంది. పైగా గబగబ ఏదో ఒకటి టైంకి వండిపెట్టేవాళ్లు లేకపోతే అల్లాడిపోతాం. అలాంటిది ఆ వృత్తిని మాత్రం చీప్‌గా చూస్తాం. ఇప్పుడు నెట్టింట థైరోకేర్‌ వ్యవస్థాపకుడు షేర్‌ చేసిన ట్వీట్‌ చూసి కచ్చితంగా మనసు మార్చుకుంటారు. ఎందుకుంటే వంట ప్రాముఖ్యతను హైలెట్‌ చేస్తూ వివరించిన విధానం నెటిజన్ల మనసును హత్తుకుంది. ఇంతకీ ఆయన ఏం అన్నారంటే..

థైరోకేర్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎ వేలుమణి ఇటీవల రెండు రకాల వ్యక్తులపై తన దృక్పథాన్ని గురించి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ పోస్ట్‌లో వంట ప్రాముఖ్యతను ఆయన హైలెట్‌ చేయడంతో ఒక్కసారిగా నెట్టింట ఈ పోస్ట్‌ హాట్‌టాపిక్‌గా మారింది. వేలుమణి వంట చేయడం నేర్చుకునేవారు, వంట చేయడాన్ని టైం వేస్ట్‌ పనిగా భావించే వారు అంటూ రెండు విరుద్ధ అభిప్రాయల గల వ్యక్తుల గురించి పోస్ట్‌లో రాశారు. 

వంటను రుచికరంగా చేసేవారు వైవాహిక జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారని, అత్యంత సంపన్న కుటుంబ నేపథ్యం ఉండి, వంట చేయడాన్ని టైం వేస్ట్‌గా భావించేవారికి వైవాహిక జీవితంలో సత్సంబంధాలు సవ్యంగా ఉండవని అన్నారు. అంటే ధనవంతుడైనా భాగస్వామి దొరికినా.. ఆమెకు వంట చేయడం పట్ల సరైన ఆసక్తి లేకపోతే ఇరువురి మధ్య సరైన సత్సంబంధాలు లేక ఇబ్బంది పడతారని అన్నారు వేలుమణి. 

అంతేగాదు తన పోస్ట్‌లో థైరోకేర్ వ్యవస్థాపకుడు వేలుమణి తన భార్య సుమతి వేలుమణి ఇరు కుటుంబాలను చక్కగా చూసుకునేదని అన్నారు. ఆమె స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో ఉద్యోగం చేస్తూ కూడా కుటుంబ బాధ్యతలను చక్కగా నిర్వహించేదని, వంట చక్కగా చేసేదంటూ తన దివంగత భార్యతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. 

ఆహారమే ఓ వ్యక్తి ప్రేమను మరింత హృదయానికి హత్తుకునేలా చేస్తుందని అన్నారు. అందుకే ప్రతి తల్లిదండ్రులు తమ పిలల్లకు వంట నేర్పించండి. ఆ విషయంలో పేరెంట్స్‌గా విఫలమై ఆ తర్వాత పశ్చాత్తాపం పడినా ‍ప్రయోజనం లేదంటూ రాసుకొచ్చారు వేలుమణి ఆ పోస్ట్‌లో.

 

(చదవండి: ఆ వ్యక్తికి 16 మంది భార్యలు, 104 మంది పిల్లలు..! కుటుంబమే..)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement