crucial
-
చంద్రయాన్-3 ప్రయాణంలో కీలక దశ.. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు..
చంద్రుడిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన ‘చంద్రయాన్-3 నౌక కీలక దశలోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన ఈ నౌకకు ఐదో కక్ష్య పెంపును ఇస్రో మంగళవారం విజయవంతంగా నిర్వహించింది. భూకక్ష్య నుంచి చంద్రుడి వైపునకు చంద్రయాన్-3 ప్రయాణం సాగిస్తోంది. క్రమంగా ఒక్కో దశ పూర్తి చేసుకుంటూ చంద్రుడి దిశగా సాగిపోతోంది. ఆగస్టు 23 లేదా 24న చంద్రుడిపై ల్యాండ్ అయ్యే అవకాశం ఉంది. భూమి చుట్టూ తిరిగే చంద్రయాన్-3కి సంబంధించి ఇది చివరి కక్ష్య కాగా, అనంతరం చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ ఆపరేషన్‌ను ఆగస్టు 1న చేపట్టనున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇప్పటివరకు దశలవారీగా ఐదుసార్లు పెంచారు. భూకక్ష్య పూర్తయిన అనంతరం ఈ నౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్లనుంది. కాగా, జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 640 టన్నులు, 43.43 అడుగుల పొడవున్న ఎల్వీఎం3–ఎం4 రాకెట్ 3,920 కిలోల చంద్రయాన్–3 మిషన్ మోసుకెళ్లింది. చంద్రయాన్–3లో 2,145 కిలోల ప్రొపల్షన్ మాడ్యూల్, 1,749 కిలోల ల్యాండర్ (విక్రమ్), 26 కిలోల రోవర్ (ప్రజ్ఞాన్)ల్లో ఆరు ఇండియన్ పేలోడ్స్, ఒక అమెరికా పేలోడ్ అమర్చి పంపారు. ఎల్వీఎం3–ఎం4 రాకెట్ తొలి దశలో ఇరువైపులా అత్యంత శక్తిమంతమైన ఎస్–200 బూస్టర్ల సాయంతో నింగికి దిగ్విజయంగా ప్రయాణం ప్రారంభించింది. చదవండి: చంద్రయాన్–3లో తెలుగు రక్షణ కవచం! ఈ దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో 400 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 127 సెకెండ్లలో తొలి దశను విజయవంతంగా పూర్తి చేశారు. ద్రవ ఇంజిన్ మోటార్లతో కూడిన రెండో దశ (ఎల్–110) 108.10 సెకన్లకే మొదలైంది. 194.96 సెకన్లకు రాకెట్ అగ్ర భాగాన అమర్చిన చంద్రయాన్–3 మిషన్ హీట్ షీల్డులు విజయవంతంగా విడిపోయాయి. 110 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి 305.56 సెకన్లకు రెండోదశను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. అత్యంత కీలకమైన మూడో దశలో 307.96 సెకన్లకు క్రయోజనిక్ (సీ–25) మోటార్లను మండించారు. 954.42 సెకన్లకు 25 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగించి మూడో దశను విజయవంతంగా పూర్తి చేశారు. రాకెట్ అగ్ర భాగాన అమర్చిన త్రీ ఇన్ వన్ చంద్రయాన్–3 ఉపగ్రహాన్ని ఈ దశలోనే 969 సెకన్లకు (16.09 నిమిషాల వ్యవధిలో) భూమికి దగ్గరగా (పెరిజీ)170 కిలోమీటర్లు, దూరంగా (అపోజి) 36,500 కిలోమీటర్ల ఎత్తులో హైలీ ఎసెంట్రిక్ అర్బిట్ (అత్యంత విపరీత కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ల్యాండర్ నుంచి రోవర్ చంద్రుని ఉపరితలంపై దిగేందుకు 4 గంటల సమయం తీసుకుంటుందని అంచనా. రోవర్ సెకనుకు సెంటీమీటర్ వేగంతో కదులుతుంది. రోవర్ ఒక లూనార్ డే (చంద్రుని రోజు–మన లెక్కలో 14 రోజులు) పని చేస్తుంది. ఆ 14 రోజుల వ్యవధిలో రోవర్ 500 మీటర్లు ప్రయాణించి చంద్రుని ఉపరితలంపై మూలమూలలనూ శోధించి భూ నియంత్రిత కేంద్రానికి కీలక సమాచారం చేరవేస్తుంది. ఇప్పటిదాకా చంద్రుడిపై పరిశోధనలు చేసే దేశాల్లో మనది నాలుగో స్థానం. గతంలో రష్యా, అమెరికా, చైనా మాత్రమే ఇలాంటి ప్రయోగాలు చేశాయి. చంద్రయాన్–1తో ఉపగ్రహాన్ని చంద్రుని చుట్టూ పరిభ్రమించేలా చేసిన తొలి దేశంగా భారత్ నిలిచింది. చంద్రయాన్–2 ద్వారా ల్యాండర్, రోవర్‌తో చంద్రుని ఉపరితలంపై పరిశోధనలు చేయాలని సంకల్పించగా ఆ ప్రయోగం దురదృష్టవశాత్తూ చివరి రెండు నిమిషాల్లో చంద్రుని ఉపరితలాన్ని ఢీకొని సిగ్నల్స్ అందకుండా పోయాయి. దీన్ని ఇస్రో శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకుని నిరంతరం శ్రమించి చంద్రయాన్–2 సాంకేతిక లోపాలను సరిదిద్దుకుని నాలుగేళ్ల తరువాత చంద్రయాన్–3ని దిగ్విజయంగా చంద్రుని కక్ష్యలోకి పంపారు. -
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదు
-
ఆధారాల చోరీ ఘటనలో ఇద్దరు అదుపులోకి!?
నెల్లూరు (క్రైమ్): నెల్లూరు కోర్టులో ఆధారాల అపహరణ కేసుకు సంబంధించిన దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇద్దరు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. కోర్టులో చోరీ జరగడం, అదీ ఓ కీలక కేసుకు సంబంధించిన ఆధారాలు దొం గిలించడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాజకీయరంగు పులుముకున్న ఈ కేసును ఛేదించేం దుకు జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో కేసును విచారిస్తున్నారు. కోర్టు ప్రాంగణాన్ని శుక్రవారం పరిశీలించి కీలకపత్రాలు ఎక్కడున్నాయి? ఎక్కడ నుంచి దొంగిలించారు? తదితర వివరాలను ఆరా తీశారు. వివరాలివీ.. 2016 డిసెంబర్లో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీ నేత, ప్రస్తుత మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డితోపాటు మరికొందరిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నెల్లూరు 4వ అదనపు ఫస్ట్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ సాగింది. అనంతరం విజయవాడలో ప్రజాప్రతినిధుల స్పెషల్ కోర్టులో సాగుతోంది. అయితే, కేసు కు సంబంధించిన కీలక ఆధారాలు ల్యాప్‌టాప్, ట్యాబ్, సెల్ఫోన్లు, నకిలీపత్రాలు, రబ్బర్‌స్టాంపులు తదితరాలన్నీ నెల్లూరు కోర్టులోనే ఉన్నాయి. తాళాలు పగులగొట్టి దొంగతనం బుధవారం అర్థరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కోర్టు ప్రాంగణంలోకి వెళ్లి తాళాలు పగులగొట్టి లోనికి చొరబడ్డారు. బీరువాలో ఉంచిన కీలక ఆధారాలున్న బ్యాగ్‌ను తస్కరించారు. బ్యాగ్‌తోపాటు కాగితాలను కోర్టు బయటపడేసి అందులో ఉన్న ట్యాబ్, ల్యాప్ టాప్, నాలుగు సెల్ఫోన్లు, నకిలీ పత్రాలు, రబ్బర్ స్టాంప్‌లను అపహరించుకు వెళ్లారు. దీంతో కోర్టు బెంచ్‌క్లర్క్ వి.నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. నగర ఇన్చార్జ్ డీఎస్పీ వై. హరినా«థ్‌రెడ్డి నేతృత్వంలో చిన్నబజారు ఇన్స్పెక్టర్ వీరేంద్రబాబు దర్యాప్తు ప్రా రంభించారు. కోర్టు ఆవరణలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసు దర్యాప్తు క్లిష్టతరంగా మారింది. దీంతో కోర్టుకు వచ్చే రహదారులన్నింటిలోని సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో.. గురువారం తెల్లవారుజామున రెండుగంటల ప్రాం తంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా వెళ్లడాన్ని గుర్తించారు. వారు ఖుద్దూస్‌నగర్‌కు చెందిన పాత నేరస్తుడు, పొర్లుకట్టకు చెందిన అతని స్నేహితుడని తేలడంతో వారిద్దర్నీ అదుపులోకి తీసుకుని విచారించి..చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. రెండునెలల కిందట ఓ వృద్ధురాలిని కట్టేసి నగలు దొంగలించిన ఘటనలో పోలీసులు వీరిని అరెస్టు చేశారనీ, పదిరోజుల కిందటే వారు బయటకు వచ్చారని సమాచారం. -
పట్టుకున్న చెయ్యే పేల్చిందా..?
సాక్షి, హైదరాబాద్ : ‘కీలక ఆధారాల సేకరణ కోసం నలుగురినీ తీసుకువెళ్లాం. తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితులు పోలీసుల వద్ద తుపాకులు లాక్కుని కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురు కాల్పుల్లో వారు చనిపోయారు’ . ఇది ‘దిశ’ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి పోలీసులు చెబుతున్న మాట. అయితే ఈ వ్యవహారంలో గన్ షాట్ రెసిడ్యూ(జీఎస్సార్)విధానం అత్యంత కీలకంగా మారనుంది. ప్రాథమిక ఆధారాలు, ఇతర అంశాలను బట్టి పోలీసులు చెప్పింది నిజమేనని కనిపిస్తున్నా.. సాంకేతికంగా నిరూపించడంతోపాటు పోలీసులపై ఉన్న అనుమానాలు పూర్తిగా నివృత్తి కావడానికి ఎన్కౌంటర్ కేసులో జీఎస్సార్ నివేదికలే కీలకంగా మారనున్నాయి. రెండుగా బుల్లెట్.. తుపాకీలో ఉండే తూటా పైకి ఒకటిలానే కనిపించినా.. అందులో రెండు భాగాలుంటాయి. పేల్చిన వెంట నే దూసుకుపోయే ముందు భాగమైన బుల్లెట్ ఒకటి కాగా.. అలా దూసుకుపోవడానికి అవసరమైన శక్తిని అందించే క్యాట్రిడ్జ్ (బుల్లెట్ కేస్) మరొకటి. రివాల్వర్ విషయానికి వస్తే సిలిండర్‌లో లోడ్ అయి ఉండే తూటాను కాల్చాలని భావించిన వ్యక్తి తన చూపుడు వేలితో ట్రిగ్గర్ను నొక్కుతాడు. ఆ వెంటనే తుపాకీపైన వెనుక భాగంలో ఉండే హేమర్ తూటా వెనుక భాగంలో మధ్యలో ఉండే ప్రైమర్‌ను హిట్ చేస్తుంది. దీంతో బుల్లెట్ కేస్‌లో ఉండే ప్రొపెల్లెంట్గా పిలిచే గన్ పౌడర్ మండుతుంది. ఫలితంగా ఉత్పన్నమయ్యే శక్తి బుల్లెట్‌ను ముందుకు దూసుకుపోయేలా చేస్తుంది. ఇలా కాల్చిన తర్వాత మిగిలే ఎమ్టీ క్యాట్రిడ్జ్ రివాల్వర్ సిలిండర్‌లోనే ఉండిపోతుంది. పిస్టల్ విషయానికి వస్తే కుడివైపు పైభాగాన ఉండే ప్రత్యేక అర నుంచి బయటకు పడిపోతుంది. జీఎస్సార్ అంటే.. తూటాను కాల్చినప్పుడు హేమర్ ధాటికి ప్రైమర్ ప్రేరేపితమై బుల్లెట్ కేస్‌లో ఉండే గన్ పౌడర్‌ను మండిస్తుంది. అత్యంత స్వల్ప వ్యవధిలోనే ముందు భాగంలో ఉండే బుల్లెట్ దూసుకుపోవడంతో గన్ పౌడర్ పూర్తిగా కాలిపోదు. బుల్లెట్ కేస్ నుంచి స్వల్ప మొత్తంలో బయటకు చిమ్ముతుంది. అది ఆ తుపాకీని కాల్చిన వ్యక్తి చేతి బొటన వేలు, చూపుడు వేళ్ల మధ్య భాగంలో పడుతుంది. దీన్నే సాంకేతిక పరిభాషలో జీఎస్సార్ అంటారు. కంటికి కనిపించని ఈ జీఎస్సార్‌ను స్వాబ్స్ ద్వారా సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపిస్తారు. ఫలానా తుపాకీని, ఫలానా వ్యక్తే ఫైర్ చేశారు అని అధికారికంగా, సాంకేతికంగా నిర్ధారించడానికి ఈ జీఎస్సార్ నివేదికలు ఎంతో కీలకం. వేరే వ్యక్తులు ఎవరైనా సదరు ఆయుధాన్ని వినియోగించి ఓ వ్యక్తిని హత్య చేసి, ఆపై తుపాకీని చనిపోయిన వ్యక్తి చేతుల్లో పెట్టే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు చనిపోయిన వ్యక్తి చేతి వేళ్లపైన జీఎస్సార్ కనిపించదు. ఇలా కీలకం.. దిశ కేసులో నిందితులుగా ఉన్న నలుగురిలో ప్రధాన నిందితుడు ఆరిఫ్‌తోపాటు నాలుగో నిందితుడు చెన్నకేశవులు పోలీసులపై దాడికి దిగారు. అధికారుల వద్ద ఉన్న సర్వీస్ తుపాకులైన పిస్టల్స్ లాక్కుని ఇద్దరూ కాల్పులు జరిపారన్నది పోలీసులు చెబుతున్న అంశం. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ స్థలికి వెళ్లిన క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆ ఇద్దరి కుడి చేతి బొటన, చూపుడు వేళ్ల మధ్య నుంచి నమూనాలు సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిన అధికారులు.. ఆ నివేదికల ఆధారంగా నిందితులు కాల్పులు జరిపినట్లు నిర్ధారించనున్నారు. ‘ఆ తుపాకులపై ఉన్న నిందితుల వేలిముద్రల్ని బట్టి వాళ్లు వాటిని పట్టుకున్నారని మాత్రమే చెప్పగలం. జీఎస్సార్ నివేదికల ఆధారంగానే ఆ తుపాకీని వాళ్లే కాల్చారా? లేదా? అనేది తేల్చగలం’అని ఫోరెన్సిక్ విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు. -
రోదసీ ప్రయోగాల్లో భారత్ కీలకం
గైట్‌లో ప్రారంభమైన ఇస్రో అవగాహన సదస్సు రాజానగరం : భవిషత్తులో నిర్వహించే రోదసీ ప్రయోగాలకుభారత్ కీలకం కానుందని స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు ఏసీ మా«ధూర్ అన్నారు. గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, అహ్మాదాబాద్‌లోని స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో ‘అంతరిక్ష సాంకేతికరంగంలో మెకానికల్ ఇంజనీరింగ్ సవాళ్లు’ అనే అంశం పై రెండు రోజులపాటు నిర్వహించే అవగాహన సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఏసీ మాధూర్ మాట్లాడుతూ భారతదేశం భూ మధ్యరేఖకు దగ్గరగా ఉండటం ప్రకృతి ప్రసాదించిన గొప్పవరంగా పేర్కొన్నారు. నిరంతర పరిశోధన, నిరంతర కృషితో ముందుకుసాగితే 103 ఉపగ్రహాలనే కాదు 301 ఉపగ్రహాలనైనా ఏకకాలంలో అంతరిక్షంలోకి పంపించగల నేర్పు, ఓర్పు మనకుందన్నారు. అహ్మదాబాద్‌లోని డీఈఎల్యు మాజీ డైరెక్టర్ విక్రమ్దేశాయ్ ‘ఇస్రో’ సాధించిన విజయాలను వివరించారు. అంతరిక్ష పరిశోధనా మండలి మాజీ హెడ్ ఎస్.జి. వైష్టవ్ మాట్లాడుతూ శాటిలైట్ కమ్యూనికేషన్స్ మూలాలను, అవి ఏకక్షలో ఎలా ప్రయోగిస్తాయో వివరించారు. ఎన్వైనింగ్ టెక్నాలజీస్ ఎండీ, ఇస్రో మాజీ డైరెక్టరు డాక్టర్ గజిబీర్సింగ్ మాట్లాడుతూ అంతరిక్షంలో మిశ్రమ పదార్థాల అనవర్తనాల గురించి వివరించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎల్ఎస్ గుప్త అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అంతరిక్ష పరిశోధనా కేంద్రం మాజీ హెడ్ ఏవి ఆప్టే, ఎస్ఎస్ఎంఈ ఎల్ఎం, అత్రి కన్సల్టెంట్ కేపీ భల్సా«ద్, ఇస్రో పీఆర్వో గురుప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, డీన్ డాక్టర్ ఎం.వరప్రసాదరావు, హెచ్ఓడీలు డాక్టర్ టి.జయానంద్‌కుమార్, డాక్టర్ డి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
యూపీలో తప్పని అసంతృప్తి రాజకీయాలు
-
ఆ మూడు గంటలే కీలకం!
సాక్షి, హైదరాబాద్: పక్షవాతం వచ్చిన మూడు గంటల్లోగా న్యూరోఫిజీషియన్ లేదా న్యూరోసర్జన్ వద్దకు వచ్చి టీపీఏ (టిష్యూ ప్లాస్మనేషన్ ఆక్టివేటర్) ఇంజెక్షన్ చేయించుకోగలిగితే వాళ్లు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందని ప్రముఖ న్యూరో ఫిజీషియన్లు డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, డా.సీహెచ్ రత్నకిషోర్ అన్నారు. బుధవారం మెడిసిటీ ఆస్పత్రిలోని సిటీ న్యూరో సెంటర్లో పక్షవాత అవగాహన దినోత్సవం సందర్భంగా జరిగిన సదస్సులో వైద్యులు మాట్లాడారు. పెదాలు పక్కకు లాగడం, కాలు, చెయ్యి పడిపోయినట్టు అనిపించడం, ఉన్నట్టుండి చూపు మందగించడం, భరించలేనంతగా తలనొప్పి రావడం, ఇలా అకస్మాత్తుగా వచ్చే ఏ లక్షణాన్నైనా బ్రెయిన్ స్ట్రోక్‌గా పరిగణించి తక్షణమే వైద్యులను సంప్రదించాలని వారు సూచించారు. మనదేశంలో ప్రతి లక్ష మందిలో 200 మంది పక్షవాతం బారినపడుతున్నారని, వీరిలో 45 ఏళ్లలోపు వారే 15 శాతం మంది ఉండటం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కూడా పెరాలసిస్ వచ్చినా, మూడు గంట ల్లోపే వచ్చే రోగుల శాతం 1కన్నా తక్కువే ఉందన్నారు. ఉప్పు కొంపముంచుతోంది: ఉప్పు వాడకం మోతాదు మిం చితే విషంగా మారుతోందని, ఉప్పు వాడకం తగ్గించాలని వైద్యులు సూచించారు. పక్షవాతం రావడానికి అధిక రక్తపోటు కారణమైతే, అధిక రక్తపోటుకు ఉప్పు కారణమన్నారు. -
నేడు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
-
ముఖ్యమంత్రి కిరణ్ తో తెలంగాణ మంత్రులు భేటీ