రోదసీ ప్రయోగాల్లో భారత్ కీలకం
రోదసీ ప్రయోగాల్లో భారత్ కీలకం
Published Thu, Jul 6 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM
గైట్‌లో ప్రారంభమైన ఇస్రో అవగాహన సదస్సు
రాజానగరం : భవిషత్తులో నిర్వహించే రోదసీ ప్రయోగాలకుభారత్ కీలకం కానుందని స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు ఏసీ మా«ధూర్ అన్నారు. గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, అహ్మాదాబాద్‌లోని స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో ‘అంతరిక్ష సాంకేతికరంగంలో మెకానికల్ ఇంజనీరింగ్ సవాళ్లు’ అనే అంశం పై రెండు రోజులపాటు నిర్వహించే అవగాహన సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఏసీ మాధూర్ మాట్లాడుతూ భారతదేశం భూ మధ్యరేఖకు దగ్గరగా ఉండటం ప్రకృతి ప్రసాదించిన గొప్పవరంగా పేర్కొన్నారు. నిరంతర పరిశోధన, నిరంతర కృషితో ముందుకుసాగితే 103 ఉపగ్రహాలనే కాదు 301 ఉపగ్రహాలనైనా ఏకకాలంలో అంతరిక్షంలోకి పంపించగల నేర్పు, ఓర్పు మనకుందన్నారు. అహ్మదాబాద్‌లోని డీఈఎల్‌యు మాజీ డైరెక్టర్ విక్రమ్‌దేశాయ్ ‘ఇస్రో’ సాధించిన విజయాలను వివరించారు. అంతరిక్ష పరిశోధనా మండలి మాజీ హెడ్ ఎస్.జి. వైష్టవ్ మాట్లాడుతూ శాటిలైట్ కమ్యూనికేషన్స్ మూలాలను, అవి ఏకక్షలో ఎలా ప్రయోగిస్తాయో వివరించారు. ఎన్‌వైనింగ్ టెక్నాలజీస్ ఎండీ, ఇస్రో మాజీ డైరెక్టరు డాక్టర్ గజిబీర్‌సింగ్ మాట్లాడుతూ అంతరిక్షంలో మిశ్రమ పదార్థాల అనవర్తనాల గురించి వివరించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎల్‌ఎస్ గుప్త అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అంతరిక్ష పరిశోధనా కేంద్రం మాజీ హెడ్ ఏవి ఆప్టే, ఎస్‌ఎస్‌ఎంఈ ఎల్‌ఎం, అత్రి కన్సల్టెంట్ కేపీ భల్‌సా«ద్, ఇస్రో పీఆర్వో గురుప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, డీన్ డాక్టర్ ఎం.వరప్రసాదరావు, హెచ్‌ఓడీలు డాక్టర్ టి.జయానంద్‌కుమార్, డాక్టర్ డి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement