సాక్షి,హైదరాబాద్ : చంద్రయాన్-3 విజయంతో అంతరిక్ష పరిశోధనల్లో భారత్ కీర్తి పెరిగింది. ఆ రికార్డుకు గుర్తుగా ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవం జరుపుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ అంశాలపై నెల రోజులుగా వేడుకలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అంతర్జాతీయ అధునాతన పరిశోధన కేంద్ర పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ), డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ సెంటర్ విభాగం ఉద్యోగులు రెండ్రోజుల పాటు నేషనల్ స్పేస్‌డే వేడుకల్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు విద్యార్ధులు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాలవైపు మొగ్గు చూపేలా ప్రోత్సహించారు. నేషనల్ స్పేస్ డే వేడుకల్ని పుస్కరిచుకొని తొమ్మిది పాఠశాలల విద్యార్ధులను ఆహ్వానించారు. వారికి మోడల్ మేకింగ్ పోటీ, క్విజ్, డ్రాయింగ్/పెయింటింగ్ పోటీలతో సహా అనేక రకాల పోటీలను నిర్వహించారు.
దీంతో పాటు హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) ‘స్పేస్ ఆన్ వీల్స్’ పేరుతో ప్రదర్శించిన వాహనం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. ఈ వాహనంలో స్పేస్‌కి సంబంధించిన కీలక అంశాలను ఇందులో ప్రదర్శించారు. ఎన్‌ఆర్‌ఎస్‌సి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ ఈ మొబైల్ ఎగ్జిబిషన్‌ను కోఆర్డినేట్ చేయగా.. విద్యార్థులు, ఎన్‌ఆర్‌సీఐ ఉద్యోగులు,యువ సైంటిస్ట్‌లు వీక్షించారు.
ఏఆర్‌సీఐ డైరెక్టర్ డాక్టర్ ఆర్.విజయ్ విజేతలకు బహుమతులు అందించారు. నేషనల్ స్పేస్ డే వేడుకల్లో పాల్గొన్న అన్ని పాఠశాలలకు ప్రశంసా పత్రంగా ‘స్పేస్ ఎన్‌సైక్లోపీడియా’ పుస్తకాలను బహుమతిగా అందించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ పాపియా బిశ్వాస్,డాక్టర్ సంజయ్ ధాగే, మనీష్ తక్,డాక్టర్ నవీన్, ఎం.చవాన్, ఎన్.అపర్ణరావు,ఎం.ఇళయరాజా, ఎన్.అరుణ,ఎం.ఆర్.రెంజు,రీ డి.రమేష్, పి.అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment