experiments
-
2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో ఆరు పీఎస్ఎల్వీ మిషన్లు, మూడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు, ఒక లాంచ్ వెహికల్ మార్క్–3 వాణిజ్య ప్రయోగం ఉందని తెలియజేసింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇస్రో అభివృద్ధి చేసిన నూతన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపించనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకొనేందుకు రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని ఇస్రో భావిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
మువ్వన్నెల చంద్రహాసం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా)/బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంçస్థ(ఇస్రో) ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను క్షేమంగా దించిన నాలుగో దేశంగా మరో ఘనత సాధించింది. రష్యా ల్యాండర్ లూనా–25 విఫలమైన చోటే భారత్ విజయపతాక ఎగురవేసింది. భూమి నుంచి చంద్రుడి దిశగా 41 రోజులపాటు సాగించిన తన ప్రయాణాన్ని చంద్రయాన్–3 మిషన్ ఘనంగా ముగించింది. దేశ ప్రజలను ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. ప్రతి ఇంటా పండుగను తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసింది. చందమామపై పరిశోధనల కోసం ఇస్రో చేపట్టిన చంద్రయాన్–3 మిషన్ విజయవంతమైంది. ఈ ప్రయోగంలో అంతర్భాగమైన ల్యాండర్ మాడ్యూల్ ‘విక్రమ్’ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చందమామను సున్నితంగా ముద్దాడింది. చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్ ఎలాంటి అవాంతరాలు లేకుండా సురక్షితంగా అడుగుపెట్టింది. దేశ ప్రజలంతా ఈ అద్భుతాన్ని ఉత్కంఠతో వీక్షించారు. చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రోను వివిధ దేశాల అధినేతలు భారత్‌కు అభినందనలు తెలియజేశారు. ల్యాండింగ్ పూర్తయ్యాక 4 గంటల అనంతరం రోవర్ ‘ప్రజ్ఞాన్’ ఆరు చక్రాల సాయంతో ల్యాండర్ నుంచి సురక్షితంగా బయటకు అడుగుపెట్టింది. జాబిల్లి ఉపరితలంపైకి చేరుకొని తన కార్యాచరణ ప్రారంభించింది. రెండు వారాల పాటు ఉపరితలంపై సంచరిస్తూ పరిశోధనలు చేస్తుంది. విలువైన సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. అత్యంత అరుదైన ఘనత ప్రపంచంలో ఇప్పటిదాకా 12 దేశాలు చంద్రుడి మీదకు 141 ప్రయోగాలు చేశాయి. ఏ దేశం కూడా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేకపోయింది. అత్యంత అరుదైన ఈ ఘనతను భారత్ తన ఖాతాలో వేసుకుంది. చంద్రయాన్–2 వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని, పొరపాట్లను సరిదిద్దుకొని చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసింది ఇస్రో. అన్ని అవరోధాలను అధిగమించి నిర్దేశిత సమయానికే ల్యాండర్‌ను సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై భద్రంగా దించి ప్రపంచాన్ని అబ్బురపర్చింది. 140 కోట్ల మంది ఆశలను నెరవేర్చింది. టీవీలకు అతుక్కుపోయి ఏమవుతుందో అని ఆతృతగా ఎదురుచూసిన వారికి అంతులేని ఆనందాన్ని పంచింది. భారత్‌తోపాటు ప్రపంచ దేశాలు ఈ విన్యాసాన్ని ఎంతో ఆసక్తితో వీక్షించాయి. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదురుకాకపోవడంతో అనుకున్న సమయానికే ప్రయోగం పూర్తయ్యింది. ల్యాండింగ్‌ను వాయిదా వేయాల్సిన పరిస్థితి తలెత్తకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. నిమిషాలు తీవ్ర ఉత్కంఠ చంద్రయాన్–3 మిషన్‌ను ఇస్రో గత నెల 14న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించిన సంగతి తెలిసిందే. తొలుత భూమికి, చంద్రుడికి మధ్యలోని భూ మధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్ని మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని పెంచారు. ఈ నెల 5న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. అనంతరం ప్రొపల్షన్ మాడ్యూల్‌లోని ఇంధనాన్నే మండించి ఐదుసార్లు కక్ష్య దూరాన్ని తగ్గించారు. దాంతో చంద్రయాన్–3 మిషన్ చంద్రుడికి దగ్గరవుతూ వచి్చంది. ఈ నెల 17న ప్రొపల్షన్ మాడ్యూల్ తన నుంచి ల్యాండర్ మాడ్యూల్‌ను విజయవంతంగా విడిచిపెట్టింది. ఆ తరువాత ల్యాండర్ మాడ్యూల్‌ను చంద్రుడికి మరింత సమీపానికి చేర్చారు. బుధవారం సాయంత్రం 5.27 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియ ప్రారంభించారు. 37 నిమిషాలపాటు ఈ ప్రక్రియ కొనసాగింది. సరిగ్గా 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. కొద్దిసేపటికే ల్యాండర్‌లోని ల్యాండర్ హొరిజాంటల్ వెలాసిటీ కెమెరా (ఎల్‌హెచ్‌వీసీ) చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీసి, భూమిపైకి పంపించింది. జాబిల్లిపై దిగిన కొద్దిసేపటి తర్వాత ల్యాండర్‌కు, బెంగళూరులోని మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్‌కు మధ్య కమ్యూనికేషన్ లింక్ ఏర్పడింది. ఇప్పటికే చంద్రయాన్–1 ప్రయోగంలో చంద్రుడిపై నీటి జాడలను కనుగొన్నారు. స్ఫటికాల రూపంలో నీరు ఉన్నట్లు గుర్తించారు. చంద్రయాన్–3 ద్వారా చంద్రుడి మూలాలను మరింత లోతుగా అధ్యయనం చేయనున్నారు. సాఫ్ట్ ల్యాండింగ్ అంటే? చంద్రయాన్–3 ప్రయోగంలో అత్యంత కీలకఘట్టం సాఫ్ట్ ల్యాండింగ్. అధిక పీడనంతో గ్యాస్‌ను విరజిమ్ముతూ ల్యాండర్ చంద్రుడిపై దిగిన సమయంలో దుమ్ము ధూళీ పైకి లేచి కెమెరాల అద్దాలను, సెన్సార్లను కమ్మేస్తుంది. దీంతో ఇతర సైంటిఫిక్ పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో ల్యాండర్ క్రాష్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. అందుకే దుమ్ము పైకి లేవకుండా ల్యాండర్‌ను మృదువుగా దించే ప్రక్రియనే సాఫ్ట్ ల్యాండింగ్ అంటారు. దీన్ని నాలుగు దశల్లో చేపట్టి, ల్యాండర్‌ను సురక్షితంగా చంద్రుడి ఉపరితలంపైకి దించారు. బయటకు వచి్చన రోవర్ సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): చంద్రయాన్–3 ల్యాండర్ బుధవారం సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై సురక్షితంగా దిగింది. ల్యాండర్లో నుంచి రాత్రి 10.04 గంటలకు రోవర్ బయటకు వచి్చంది. ఆరు చక్రాలతో కూడిన రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై సెకనుకు ఒక సెంటీమీటర్ వేగంతో ముందుకు కదులుతోంది. సుమారు 500 మీటర్ల దూరం దాకా ప్రయాణించి అక్కడున్న స్థితిగతుల గురించి భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని చేరవేస్తుంది. ల్యాండర్ దిగిన సందర్భంగా అందరూ పండుగ చేసుకునేలోపే రోవర్ కూడా విజయవంతంగా బయటకు రావడంతో ఇస్రో శాస్త్రవేత్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. జాబిల్లిపై గర్జించిన సింహాలు..! చంద్రుడిపై విజయవంతంగా దిగి చరిత్ర సృష్టించిన చంద్రయాన్–3... ఆ చరిత్ర తాలూకు ఆనవాళ్లను కూడా జాబిల్లి ఉపరితలంపై శాశ్వతంగా, సగర్వంగా ముద్రించింది. ప్రజ్ఞాన్‌గా పిలుస్తున్న రోవర్ వెనక చక్రాలు మన జాతీయ చిహ్నమైన మూడు సింహాలతో కూడిన అశోక చక్రాన్ని, ఇస్రో అధికారిక లోగోను చందమామ దక్షిణ ధ్రువం మీద ముద్రించాయి. తద్వారా చందమామ చెక్కిలిపై చెరగని సంతకం చేశాయి. ఇందుకు సంబంధించి ఇస్రో బుధవారం మధ్యాహ్నమే ముందస్తుగా విడుదల చేసిన కర్టెన్ రైజర్ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అన్నట్టూ లాండర్, రోవర్ పని చేసేది కేవలం ఒక్క చంద్ర దినం పాటు మాత్రమేనట! అంటే భూమిపై 14 రోజులన్నట్టు!! అన్నీ అనుకూలించి, కాస్త అదృష్టమూ కలిసొస్తే అవి రెండూ మరో చంద్ర దినంపాటు పని చేసే అవకాశాన్ని కొట్టి పారేయలేమని ఇస్రో అంటోంది. -
సరికొత్త ప్ర‘యోగం’!
విశాఖ విద్య: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను సైన్స్ ప్రయోగాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు ప్రయోగాలపై ఆసక్తిని పెంపొందించి సమాజానికి ఉపయోగపడే నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 26 జిల్లాల సైన్స్ అధికారులు (డీఎస్వో), ఎస్సీఈఆర్టీ, యునిసెఫ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, సమగ్ర శిక్ష విభాగాలకు చెందిన నోడల్ అధికారులతో కూడిన బృందాన్ని మహారాష్ట్రలోని పుణే సమీపాన పాబల్ అనే గ్రామంలో ఉన్న విజ్ఞాన ఆశ్రమానికి పంపించింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధిశాఖ నిర్వహిస్తున్న విజ్ఞాన ఆశ్రమంలోని సైన్స్ ప్రయోగాలకు సంబంధించిన ఫ్యాబ్ ల్యాబ్‌లో సోమవారం ప్రారంభమైన ప్రతిష్టాత్మక వర్క్‌షాప్‌లో ఈ బృందం పాల్గొన్నది. నాలుగు రోజులు నిర్వహించనున్న ఈ వర్క్‌షాప్‌లో నిపుణుల అనుభవాలు, సూచనలు తెలుసుకోవడంతోపాటు ఫ్యాబ్ ల్యాబ్‌లో స్థానికంగా లభించే ముడిసరుకుతో విద్యార్థులు వినూత్న పరికరాలను ఎలా తయారు చేయాలి... అవి స్థానిక ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి... అనే అంశాలపై జిల్లా సైన్స్ అధికారులు అధ్యయనం చేయనున్నారు. అనంతరం జిల్లా సైన్స్ అధికారుల నేతృత్వంలో అన్ని జిల్లాల్లోనూ డివిజన్, మండలాల వారీగా పాఠశాలల్లో సదస్సులు ఏర్పాటుచేసి ఫ్యాబ్ ల్యాబ్‌లో అధ్యయనం చేసిన ఉత్తమ నమూనాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ విధంగా రాష్ట్రంలోని 26 జిల్లాల సైన్స్ అధికారులు ఇతర రాష్ట్రాలకు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లడం విద్యాశాఖ చరిత్రలో ఇదే తొలిసారి అని ఉమ్మడి విశాఖ, కృష్ణా జిల్లాల సైన్సు అధికారులు కప్పాల ప్రసాద్, మైనం హుస్సేన్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల ల్యాబ్‌లలో ఉత్తమ ఫలితాలు రాష్ట్రంలోని 713 ప్రభుత్వ పాఠశాలల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యాన ఇప్పటికే అటల్ టింకరింగ్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో పాఠశాలలో రూ.20లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ఈ ల్యాబ్‌లలో సైన్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, గణితం వంటి అంశాల్లో విద్యార్థులను వినూత్న ఆలోచనలవైపు మళ్లించేలా తర్ఫీదు ఇస్తున్నారు. ఈ ల్యాబ్‌ల ద్వారా మెరుగైన ఫలితాలు సాధిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు ముందుకేసి ‘నాడు–నేడు’ ద్వారా అభివృద్ధి చేస్తున్న అన్ని పాఠశాలల్లో ఇంగ్లిష్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తోంది. తద్వారా ఇంగ్లిష్ మీడియం చదువుతోపాటు సైన్స్, టెక్నాలజీ రంగాల్లో విద్యార్థులు రాణించేలా పాఠశాలల్లోని ల్యాబ్‌లు ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు. -
Elon Musk: చిక్కుల్లో న్యూరాలింక్!
శాన్ ఫ్రాన్సిస్కో: ఎలన్ మస్క్ సొంత కంపెనీ న్యూరాలింక్ చిక్కులను ఎదుర్కొబోతోందా?.. అవుననే అంటున్నాయి విదేశీ మీడియా సంస్థలు. మెడికల్ డివైస్ కంపెనీ అయిన న్యూరాలింక్ ద్వారా జంతువులపై ఘోరమైన ప్రయోగాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందడంతో ఫెడరల్ దర్యాప్తు జరుగుతున్నట్లు సమాచారం. అయితే.. ఈ ఫిర్యాదులు చేసింది న్యూరాలింక్‌లో పని చేసే ఉద్యోగులే కావొచ్చని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ తాజాగా ఓ కథనం ప్రచురించింది. మనిషి మెదడులో చిప్ అమర్చడం ద్వారా అద్భుతానికి తెర తీయాలని మస్క్ ఉవ్విళ్లూరుతున్నాడు. చిప్ ద్వారా పక్షవాతానికి గురైన వాళ్లు సైతం నడవొచ్చని, నాడీ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రకటించుకున్నాడు కూడా. ఈ క్రమంలో.. ఇప్పటికే చాలాసార్లు డెడ్‌లైన్ ప్రకటిస్తూ వచ్చాడు. తాజాగా తన మెదడులో చిప్ అమర్చుకునేందుకు రెడీ అని ప్రకటించాడు కూడా. అయితే డెడ్‌లైన్స్‌ను చేరుకునే క్రమంలో ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, జంతువులపై జరిగిన ప్రయోగాలు వాటికి నరకం చూపించాయని, లెక్కకు మించి జంతువుల మరణం కూడా సంభవించిందని రాయిటర్స్ ఓ కథనం ప్రచురించింది. 2018 నుంచి న్యూరాలింక్ చిప్ ప్రయోగాల పేరిట.. 280 గొర్రెలు, పందులు, ఎలుకలు, కోతులు, చిట్టెలుకలను చంపింది. వీటి మొత్తం సంఖ్య పదిహేను వందలకు పైనేనని రాయిటర్స్ లెక్క గట్టింది. అయితే.. నిర్లక్ష్య పూరితంగా జరిపిన నాలుగు ప్రయోగాలపై స్పష్టత ఇచ్చే యత్నం చేసింది సదరు కథనం. ఈ నాలుగు ప్రయోగాల ద్వారా 86 పందులు, రెండు కోతులు చనిపోయినట్లు తెలిపింది. అయితే.. ఫెడరల్ దర్యాప్తు ఇవే అంశాలపై జరుగుతుందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు జంతువుల మరణాల సంఖ్యను కూడా ఏనాడూ న్యూరాలింక్ ప్రకటించింది లేదు కూడా. సుమారు ఏడాది కిందట న్యూరాలింక్ బ్రెయిన్లో చిప్ అమర్చిన ఓ కోతి కంప్యూటర్ గేమ్ ఆడిన వీడియోను ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
స్పేస్‌లో మనిషి: మనుగడకోసం ఇస్రో మరో ముందడుగు
బెంగళూరు: అంతరిక్షంలో జరిపే జీవసంబంధిత ప్రయోగాలకు ఉపయోగపడే ఒక సాధనాన్ని ఇస్రో, ఐఐఎస్సీ సైంటిస్టులు రూపొందించారు. ఈ మాడ్యులర్ సాధనంతో జీవప్రయోగాలకు అవసరమైన సూక్ష్మజీవులను అభివృద్ధి చేస్తారు. అక్టా ఆస్ట్రోనాటికాలో ఈ పరిశోధన వివరాలు ప్రచురించారు. స్పొరోసార్సినా పాశ్చురై అనే బ్యాక్టీరియాను చాలా రోజులపాటు పెంచి పోషించేందుకు కొత్త సాధనం ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పరిశోధనలో వివరించారు. అంతరిక్షంలో ఎదురయ్యే విపరీత పరిస్థితుల్లో సదరు సూక్ష్మజీవులు ఎలా స్పందిస్తాయన్న విషయాలను అవగతం చేసుకోవడంలో ఈ ప్రయోగాలు కీలకపాత్ర పోషిస్తాయి. వీటి స్పందనల ఆధారంగా మనిషికి ఎదురయ్యే సవాళ్లను పసిగట్టవచ్చు. గగన్‌యాన్ పేరిట త్వరలో స్వదేశీయ అంతరిక్ష యాత్రకు ఇస్రో సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త సాధనంలో ఎల్ఈడీ, ఫొటోడయోడ్ సెన్సార్లతో బ్యాక్టీరియా పెరుగుదలను గమనిస్తారు. కొత్త పరికరం వంద శాతం లీక్ప్రూఫ్ అని, ప్రయాణంలో ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుంటుంది.జీవేతర ప్రయోగాలకు సైతం దీన్ని ఉపయోగించుకోవచ్చని పరిశోధకుల్లో ఒకరైన కుమార్ చెప్పారు. చదవండి: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఖాయం! -
ఆనందయ్య మందుపై త్వరలో ప్రయోగాలు ప్రారంభం
-
చెట్లకు కూడా చెవులుంటాయి!
చెట్లు కూడా ప్రాణమున్న జీవులేనని భారతీయ శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ ప్రయోగపూర్వకంగా వివరించారు. అయితే వీటిలో ఇతర జీవుల్లో కనిపించే చలనావయవాలుండవు. మొక్కలకు ప్రాణముందని తెలిసినా, ఇతర జీవజాతుల్లాగా చేతన(కాన్షియస్నెస్) ఉండదని ఎక్కువమంది భావిస్తారు. కానీ తాజాగా జరిపిన అధ్యయనాల్లో మొక్కల్లో కూడా చేతనత్వం, స్మృతి, వివేకం ఉంటాయట..! లండన్, స్పెయిన్, కెనెడాలోని వేర్వేరు యూనివర్సిటీలు మొక్కల్లో చేతనపై ప్రయోగాలు జరిపాయి. 20 బీన్స్ మొక్కలను కుండీల్లో నాటి, వాటిలో కొన్నింటిని ఒంటరిగా వదిలేశారు, కొన్నింటికి 30 సెంటీమీటర్ల దూరంలో చిన్న కర్రముక్కను పాతారు. వీటి కదలికలను టైమ్‌లాప్స్ ఫొటోగ్రఫీ ద్వారా అధ్యయనం చేశారు. కర్రముక్క దగ్గరగా ఉన్న మొక్కలు, ఆ కర్రముక్క ఆనవాలు పసిగట్టి తదనుగుణంగా చిగుర్లు వేస్తూ గ్రోత్ ప్యాట్రన్స్‌ను నిర్దేశించుకున్నట్లు అధ్యయనంలో తెలిసింది. అంటే మొక్కలు తమ దగ్గరలో ఉండే వస్తువుల ఉనికిని గుర్తిస్తాయని తెలుస్తోంది. జ్ఞానేంద్రియాలు లేకున్నా.. ప్రత్యేకంగా జంతువుల్లో ఉన్నట్లు మొక్కల్లో చెవుల్లాంటి అవయవాలు లేకున్నా, పక్కన ఆబ్జెక్ట్స్ ఉనికినైతే గుర్తించగలవని నిరూపితమైంది. అంతమాత్రాన వీటికి పూర్తిస్థాయి చేతన ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని ఈపరిశోధనల్లో పాల్గొన్న సైంటిస్టు డా. విసెంటె రాజా చెప్పారు. ఒకవేళ మొక్కలకు చేతన ఉండేట్లయితే అది ఎక్కడ నుంచి వస్తుందనే విషయమై ఎంతోకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 2006 నుంచి ప్లాంట్ న్యూరోబయాలజీ అనే శాఖను అధికారికంగా ప్రారంభించారు. జంతువుల్లోలాగే మొక్కల్లో కూడా విద్యుదయిస్కాంత సిగ్నలింగ్ ద్వారా చేతన పుడుతుందని ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. ఈ భావనను వ్యతిరేకించే పరిశోధకులు కూడా ఉన్నారు. మొక్కలకు ఎలాంటి చేతన ఉండదని కాలిఫోర్నియా యూనివర్సిటీ సైంటిస్టు లింకన్ టైజ్ చెబుతున్నారు. అలాంటి వ్యవస్థకు తగిన నిర్మితి ఏదీ చెట్లలో ఉండదని, అందువల్ల చెట్లకు చేతన అనేది వట్టిమాటని ఆయన అభిప్రాయం. కానీ మొక్కలకు కూడా చేతన ఉంటుందనేది నిర్విదాంశమని, ఇకపై జంతువులకు మాత్రమే ఇది సొంతమని భావించే వీలు లేదన్నది ఎక్కువమంది సైంటిస్టుల మాట. సో.., ఈ సారి చెట్ల దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్త! అవి వింటాయేమో! -
30 నిమిషాల్లో హ్యాకింగ్, విస్తుపోయే నిజాలు!
ఏదైనా లోకల్ నెట్‌వర్క్‌లోకి ప్రవేశించడానికి హ్యాకర్లకు కేవలం 30 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ విషయం పాజిటివ్ టెక్నాలజీస్ అనే సంస్థ జరిపిన అధ్యయనాలలో తేలింది. లోకల్ నెట్‌వర్క్‌లు ఎంత తేలికగా హ్యాకింగ్‌కు గురవుతున్నాయి అనే విషయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో పాజిటివ్ టెక్నాలజీస్ ఈ ప్రయోగం చేసింది. దీంట్లో ఎంత తేలికగా హ్యాక్ చేయొచ్చొ తెలిసేలా చేసింది. హాస్పటళ్లు, కార్పొరేట్ కంపెనీలు, ఫినాన్స్, ఐటీ, టూరిజం ఇలా అన్నింటికి సంబంధించిన వాటి మీద టెస్ట్ చేసింది. దీనిలో కొన్ని విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. ప్రతి ఆరుకంపెనీలలో ఒక కంపెనీ తేలికగా హ్యాంకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. పాజిటివ్ టెక్నాలజీస్‌కు సంబంధించిన వారు నిజమైన హ్యాకర్లు ఎలా అయితే దాడికి పాల్పడతారో అలాగే చేశారు. ఇలా చేయడానికి పెంటెస్ట్ అని పేరు పెట్టారు. హ్యాకర్లను పెంటెస్టర్లు అని పిలుస్తారు. పాజిటివ్ టెక్నాలజీస్ పరీక్షించిన సంస్థలలో 93 శాతం స్థానిక నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయగలిగింది. ఈ ప్రయోగంలో కొన్ని సంస్థల డేటా గతంలో హ్యాకింగ్ బారిన పడినట్లు తెలిసింది. స్థానిక నెట్వర్క్ని హ్యాక్ చేయడానికి కనీసం 30 నిమిషాల నుంచి గరిష్టంగా 10 రోజుల వరకు పట్టొచ్చని నిపుణులు తెలిపారు. చాలా సందర్భాల్లో, దాడి సంక్లిష్టత తక్కువగా ఉంటుందని, ఇది ప్రాథమిక నైపుణ్యాలు కలిగిన హ్యాకర్ లోపలికి ప్రవేశించడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు. వీటిలో కనీసం ఒక డొమైన్ ఖాతా పాస్‌వర్డ్‌ను హ్యాకర్ విజయవంతంగా ఛేదించ గలిగితే వారు ఇతర వినియోగదారుల పాస్‌వార్డులను ఆఫ్‌లైన్‌లో హ్యాక్ చేయవచ్చని తేలింది. ఈ ప్రయోగంలో ఇదేవిధంగా చేసి పాజిటివ్ టెక్నాలజీస్ వారు 90,000 ఈ మెయిల్స్‌ను కనుగొంది. చదవండి: ఖాతాల హ్యాకింగ్‌పై వివరణ ఇవ్వండి -
ఆ తరువాత ఏంజరిగిందో తెలుసా?
కోతికి మనిషి మెదడు: చైనా శాస్త్రవేత్తల ప్రయోగాలు – నేషనల్ సైన్స్ రివ్యూ జనరల్ కొన్ని సంవత్సరములు తరువాత.... తలకోన అడవిలో... కోతులు ఎర్లీ మార్నింగ్ లేచాయి. చెట్టుకింద ఉన్న పండ్లు, చెట్టు మీద ఉన్న పండ్లను తిన్నాయి. ఆ తరువాత కబుర్లు చెప్పుకున్నాయి. ఆ తరువాత కీచుకీచుమంటూ కీచులాడుకున్నాయి. ఆ తరువాత కొంచెంసేపు జోకులు వేసుకొని నవ్వుకున్నాయి. ఆ తరువాత మూకుమ్మడిగా తునికిచెట్టు కిందికి వెళ్లి కూర్చున్నాయి. సరిగ్గా అప్పుడే కళ్లకు ఖరీదైన అద్దాలు, భుజానికి అంతకంటే ఖరీదైన నల్లబ్యాగ్ వేసుకున్న ఒక కోతి అక్కడికి వచ్చింది.‘‘హాయ్ అండీ...నా పేరు కోతికుమార్. నల్లమల అడవి నుంచి వస్తున్నాను. నేను రియల్ ఎస్టేట్ బ్రోకర్ని. ‘వానర లోక’ అనే కొత్త వెంచర్‌ను స్టార్ట్ చేశాము. సిటీకి దగ్గర ఉండేలా ప్లాన్ చేశాం. రోడ్లు, ట్రాన్స్పోర్ట్, వాస్తు...అన్ని బ్రహ్మాండం...’’ నాన్‌స్టాప్‌గా చెప్పుకుపోతున్నాడు కోతికుమార్.కోతులగుంపుకి రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాట్లాడుతున్నాదేమిటో ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు.‘‘రియల్ ఎస్టేట్ ఏమిటి? కొత్త వేంచర్ ఏమిటి?’’ ఆశ్చర్యంగా అడిగింది ఒక కోతి.‘‘ఎక్కడున్నారయ్యా మీరు! ఒకవైపు మన కోతులు కనివిని ఎరుగని అభివృద్ధి వైపు దూసుకువెళుతుంటే...మీరు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నారు. మనిషి మెదడును కోతిలో ఎప్పుడైతే ప్రవేశపెట్టారో.... మన కోతులు ఎక్కడికోవెళ్లిపోయాయి! మన నుంచే వచ్చిన మనిషి మన కంటే ఎంతో ఎత్తున ఉన్నాడు. ఇప్పుడు ఇక అంత సీన్ లేదు. మనిషితో సమానంగా మనం డెవలప్ అవుతున్నాం. ఈ క్రమంలో భాగంగానే మన కోతుల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఊపందుకుంది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఇంకా ఎంతకాలం బతుకు వెళ్లదీస్తాం? మనకు మాత్రం భద్రత ఉండొద్దా? ఈ విశాల అడవిలోమీకంటూ కొంప ఉండొద్దా? అందుకే వచ్చింది మా వానరలోక....’’ఈలోపు అక్కడికి మరొక కొత్త కోతి వచ్చింది.‘‘నా పేరు మంకీస్ రాజ్. ఆదిలాబాద్ అడవుల్లో నుంచి వస్తున్నాను. దయచేసి మీరు వీడి మాటలు నమ్మకండి. రియల్ ఎస్టేట్ పేరుతో ఎన్నో అడవుల్లో ఎందరో అమాయక కోతుల చేత డబ్బు కట్టించుకొని, కంటికి కనిపించకుండా తిరుగుతున్నాడు. నాది కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్సే. కాని నమ్మకమే మా ప్రాణం. విశ్వాసమే మా ఆయుధం...మీ సౌకర్యమే మా శ్వాస...డబ్బులు ఊరకే రావు...’’ అని దంచుకుంటూ పోతున్నాడు మంకీస్ రాజ్.‘‘ఎవడ్రా నువ్వు?’’ అని రాజ్‌పై తన తోకతో దాడి చేశాడు కోతికుమార్. ‘‘నాపైనే తోక చేసుకుంటావా! ఎన్ని గుండెల్రా నీకు...రేయ్ వచ్చేయండ్రా’’ అని అరిచాడు కోతికుమార్.అంతే... తెల్లలుంగీ వేసుకున్న కోతుల గుంపు అక్కడికి వచ్చింది. వాటి చేతిలో పదునైన వేటకోడవళ్లు ఉన్నాయి.ప్రమాదాన్ని పసిగట్టిన మంకీస్ రాజ్...‘‘కమాన్ గయ్స్...బయటికి వచ్చేయండి’’ అని అరిచాడు. అంతే...చెట్ల చాటు దాక్కున కోతుల గుంపు అరుస్తూ బయటికి వచ్చింది. జీన్స్ ధరించిన ఆ కోతుల చేతిలో నాటుబాంబులు ఉన్నాయి. ఇక చూడండి.... రెండు వర్గాలు... డిష్యూం డిష్యూం డిష్యూం!‘‘రెండు గంటల నుంచి ఫైట్ చేసుకుంటున్నారు... ఒక్కరూ గాయపడడం లేదేమీటి?’’ అన్నది తలకోన కోతి కాస్త గట్టిగానే. ఈమాట వినబడగానే రెండు గ్రూప్‌లు స్విచ్ఆఫ్ చేసినట్లు ఆగిపోయాయి.‘‘రేయ్... ఎవడ్రా ఈ బాంబులు కొన్నది’’ తోడగొట్టి గట్టిగా అరిచాడు మంకీస్ రాజ్.‘‘నేనేనయ్యా’’ భయంభయంగా అంది ఒక బక్కప్ప కోతి.‘‘అసలేం జరిగింది?’’ గర్జించాడు మంకీస్ రాజ్.‘‘కమీషన్‌కు కక్కుర్తి పడి...మనం ఎప్పుడూ కొనే చోట కాకుండా....ఆ చెడ్డప్ప దగ్గర కొన్నానయ్యా...వాడు ఈ డూప్లికేట్ బాంబులు, పేలని బాంబులు ఇచ్చి మోసం చేస్తాడని అనుకోలేదయ్యా.నన్ను క్షమించండయ్యా’’ అని ఘొల్లుమన్నాడు బక్కప్ప.అవతలి వైపు... ‘‘రేయ్...ఈ వేటకోడవళ్లు కొన్నది ఎవరు?’’ భయంకరంగా గర్జించాడు కోతికుమార్.అందరూ సైలెన్స్ అయ్యారు.‘‘ఏమ్రా.... నేనంటే భయం తగ్గిందా...లేక బలుపు పెరిగిందా... కమాన్ టెల్ మీ... చెప్పండ్రా... వేటకొడవళ్లు కొన్నది ఎవరు?’’ మళ్లీ గర్జించాడు కోతికుమార్.‘‘ఎవరో కాదయ్యా.... మీ తమ్ముడే...’’ అన్నది ఒక కోతి.నిజమా!’ అన్నట్లుగా తమ్ముడి వైపు చూశాడు కోతికుమార్. ‘నిజమే’ అన్నట్లు పశ్చాత్తాప హృదయంతో కళ్లు నేలకేశాడు ఆ తమ్ముడు.‘‘ఇంత ద్రోహం చేస్తావని కలలో కూడా ఎక్స్పెక్ట్ చెయ్యలేదు తమ్ముడూ....అసలు నువ్వు నా తమ్ముడి వేనా....ఎందుకు చేశావు ఈ పాపిష్టి పని?’’ గుండె పట్టుకొని బాధగా అరుస్తున్నాడు కోతికుమార్.‘‘నన్ను క్షమించన్నయ్యా. దేవుడిలాంటి అన్నయ్యను మోసం చేశాను. నన్ను ఎవరూ క్షమించ లేరు...క్షమించినా నేను తట్టుకోలేను...’’ కళ్లనీళ్లు పెట్టుకుంటున్నాడు తమ్ముడు కోతి.‘‘డైలాగుల సంగతి సరే, అసలు ఏంజరిగిందో చెప్పు...’’ గద్దించాడు కోతికుమార్కి బాడీగార్డ్ కోతి.‘‘చెబుతాను....సరిగ్గా నెల రోజుల క్రితం ‘కోతిని’ అనే అమ్మాయితో లవ్‌లో పడ్డాను. ఆమె లేకుండా జీవించలేను. ఒకరోజు ఆమె నా దగ్గరకు వచ్చి కొంత డబ్బు అడిగింది. లేదంటే పరువు పోతుందని, మా అన్న పరమ పినాసి...ఏనాడు ఒక్క పైసా ఇచ్చిన పాపాన పోడు...అంటే వంశగౌరవం మంటగలుస్తుందని...అబద్ధం ఆడాను...నువ్వు ఎంత అడిగినా సరే ఇస్తాను అన్నాను.అన్నాను సరే... నా దగ్గర డబ్బెక్కడిది!అన్నను అడిగితే ‘ఎందుకు?’ అని గద్దిస్తాడు.‘నా గర్ల్‌ఫ్రెండ్ కోసం అన్నయ్యా..’ అంటాను.‘నీ ఫేస్‌కు గర్ల్ఫ్రేండా....హాహాహా...’ అని గబ్బరుసింగులా నవ్వుతాడు.‘అన్న నవ్విండు కాబట్టి మనం నవ్వకపోతే బాగుండదు’ అని మీరు కూడా కోరస్‌గా ‘హోహోహో’ అని నవ్వుతారు.నా ఇజ్జత్ కబ్జా అయిపోతది. ఇంత అవసరమా?వంద అబద్ధాలాడైనా సరే ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు..ఒకే ఒక్క మోసం చేసి నా ప్రేమను గెలుచుకోవాలనుకున్నాను.అందుకే ఈ మోసం చేశాను. ఎప్పుడూ కొనే చోట కాకుండా...ఈసారి వేటకొడవళ్లను వేటపాలెంలో కొన్నాను. అక్కడమోసప్ప అనే రౌడీ దగ్గర ఈ వేటకొడవళ్లు కొని మిగిలిన సొమ్ము జేబులో వేసుకున్నాను. ఇవి మరీ....బొమ్మ వేటకొడవళ్లా ఉన్నాయి! అని అడిగితే...ఏదో మాట వరుసకు ఇవి మీ చేతుల్లో ఉండాలిగానీ....ఎప్పుడైనా ఫైట్ చేసి చచ్చారా? మీ గురించి నాకు తెలియదా...ఫైట్ చేయనప్పడు బొమ్మ వేటకొడవళ్లు అయితే ఏంటి? నిజమైనవి అయితే ఏమిటి? అన్నాడు. నిజమే కదా అనిపించింది’’ స్టోరీ అంతా చెప్పి కర్చీప్‌తో కన్నీళ్లు తుడుచుకున్నాడు తమ్ముడు కోతి! (సశేషం) – యాకుబ్ పాషా -
చౌకగా ఔషధాల ఉత్పత్తే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: కొత్త ఔషధాల తయారీ ఖర్చులను గణనీయంగా తగ్గించేందుకు హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ)లు చేతులు కలిపాయి. జంతువులపై ప్రయోగాలను పూర్తిగా పరిహరించేం దుకు ఉన్న అవకాశాలను ప్రామాణీకరించడం.. ఫార్మా రంగంలోని అన్ని వర్గాల వారిని ఒక ఛత్రం కిందకు తీసుకొచ్చేందుకు సీసీఎంబీ అనుబంధ సంస్థ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, హ్యూమన్ సొసైటీలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మందుల తయారీలో జరిపే అనేక పరీక్షలు జంతువులపై చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే చాలా సందర్భాల్లో కచ్చితంగా చెప్పాలంటే 90–92 శాతం వరకు ఈ జంతువులపై ప్రయోగాల్లో సత్ఫలితాలిచ్చిన మందులు మానవ ప్రయోగాల్లో మాత్రం సరైన ఫలితాలివ్వవు. ఈ క్రమంలోనే అనేక జంతువులు ప్రాణాలు కోల్పోతాయి. అయితే శాస్త్ర రంగంలో వచ్చిన మార్పుల కారణంగా ప్రస్తుతం జంతువుల అవసరం లేకుండా మందుల సామర్థ్యాన్ని, విషతుల్యతలను పరీక్షించేందుకు కొన్ని పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అధిక శాతం మందులు జీర్ణమయ్యే కాలేయాన్ని మానవ కణాల సాయంతో సూక్ష్మస్థాయిలో అభివృద్ధి చేసి పరీక్షించడం వీటిల్లో ఒకటి. సీసీఎంబీ, హ్యూమన్ సొసైటీల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఇలాంటి ప్రత్యామ్నాయాలన్నింటినీ అధ్యయనం చేస్తారు. వాటిని అందుబాటులోకి తెచ్చేందుకు చట్టాలు, మార్గదర్శకాల్లో చేయాల్సిన మార్పులు/చేర్పులనూ సిద్ధం చేస్తారు. కణ ఆధారిత మాంసం తయారీ పరిశోధన కేంద్రం ఏర్పాటు మాసం కోసం జంతువులను వధించడం వల్ల ఒక వైపు వాటి సంఖ్య తగ్గుతుండగా మరోవైపు ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. అయితే ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు గాను శాస్త్రవేత్తలు మొక్కల నుంచి శుద్ధమైన మాంసం (క్లీన్ మీట్) తయారు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), జాతీయ మాంస పరిశోధనా సంస్థలు సంయుక్తంగా పరిశోధనలు సాగించేందుకు గాను సీసీఎంబీలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో ఒక కణ ఆధారిత మాంస తయారీ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో పరిశోధనలు చేసి కణాధారిత మాంసాన్ని ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం ముందుకొచ్చింది. అందుకు సంబంధించిన పత్రాలపై గురువారం సంతకాలు కూడా చేసింది. తక్కువ సమయంలోనే: సీసీఎంబీ డైరెక్టర్ ‘జంతువులపై ప్రయోగాలనేవి లేకపోతే మందుల తయారీకి అయ్యే ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా.. మొత్తం వ్యవహారమంతా అతి తక్కువ సమయంలో పూర్తవుతుంది..’అని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా అన్నారు. గతేడాది తాము పరిశోధనశాలలోనే కణ ఆధారిత మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టామని.. కేంద్ర బయో టెక్నాలజీ విభాగం ఈ ప్రాజెక్టుకు రూ.4.5 కోట్ల నిధులు కేటాయించిందని తెలిపారు. అటల్ ఇంక్యుబేషన్ కేంద్రంలో కణ ఆధారిత మాంసాన్ని ఉత్పత్తి చేసేందుకు గాను అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు అందించేందుకు ఒప్పుకుందన్నారు. ఒప్పందం కుదిరిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో çహ్యూమన్ సొసైటీ ప్రతినిధులు జయసింహ, అలోక్పర్ణ సేన్‌గుప్తా, అటల్ ఇంక్యుబేషన్ సింటెర్ సీఈవో మధుసూదనరావు పాల్గొన్నారు. -
కరవును తట్టుకునేందుకు కొత్త టెక్నిక్..
తక్కువ నీటితో ఎక్కువ పంట పండించగలిగితే పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడం సాధ్యమవుతుంది. సరిగ్గా ఇదే దిశగా బిల్ అండ్ మెలిండా గేట్స్‌తో పాటు కొన్ని అంతర్జాతీయ సంస్థలు చేస్తున్న పరిశోధనలు సత్ఫలితాలు సాధిస్తోంది. మొక్కల్లో సూర్యరశ్మిని ఇంధనంగా మార్చుకునే కిరణజన్య సంయోగ ప్రక్రియను మరింత సమర్థంగా జరిగేలా చేయడం ద్వారా పంటల దిగుబడి పెంచవచ్చునని.. అదేసమయంలో నీటి వాడకాన్ని తగ్గించవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ లంగ్ ఇకెన్బెర్ర తెలిపారు. మొక్కల్లోని ఒక ప్రొటీన్ మోతాదును పెంచడం ద్వారా అవి ఆకుల్లోని స్టొమాటాను మూసుకునేలా చేయగలిగామని.. తద్వారా నీరు ఆవిరి కాకుండా ఆపగలిగామని ఆయన వివరించారు. ఈ స్టొమాటా తెరుచుకున్నప్పుడు గాల్లోని కార్బన్ డయాక్సైడ్ లోనికి చేరి ఇంధనంగా మారుతుంది. అదేసమయంలో నీరు ఆవిరి రూపంలో బయటకు వెళ్లిపోతుంది. ప్రోటీన్ మోతాదు పెరగడం వల్ల స్టొమాటా పూర్తిగా తెరుచుకోదని.. తగినంత కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకోగలగదని వివరించారు. ఈ క్రమంలోనే దిగుబడి కూడా 20 శాతం వరకూ ఎక్కువవుతుందని గతంలో జరిగిన పరిశోధనలు రుజువు చేశాయని చెప్పారు. తాము పొగాకు మొక్కను నమూనాగా తీసుకుని ప్రయోగాలు చేశామని.. ఫలితాలను ఇతర ఆహార పంటల్లోనూ సాధించగలమని వివరించారు. -
రోదసీ ప్రయోగాల్లో భారత్ కీలకం
గైట్‌లో ప్రారంభమైన ఇస్రో అవగాహన సదస్సు రాజానగరం : భవిషత్తులో నిర్వహించే రోదసీ ప్రయోగాలకుభారత్ కీలకం కానుందని స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ అధ్యక్షుడు ఏసీ మా«ధూర్ అన్నారు. గైట్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, అహ్మాదాబాద్‌లోని స్పేస్ సొసైటీ ఆఫ్ మెకానికల్ ఇంజనీర్స్ ఆధ్వర్యంలో భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సహకారంతో ‘అంతరిక్ష సాంకేతికరంగంలో మెకానికల్ ఇంజనీరింగ్ సవాళ్లు’ అనే అంశం పై రెండు రోజులపాటు నిర్వహించే అవగాహన సదస్సు గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఏసీ మాధూర్ మాట్లాడుతూ భారతదేశం భూ మధ్యరేఖకు దగ్గరగా ఉండటం ప్రకృతి ప్రసాదించిన గొప్పవరంగా పేర్కొన్నారు. నిరంతర పరిశోధన, నిరంతర కృషితో ముందుకుసాగితే 103 ఉపగ్రహాలనే కాదు 301 ఉపగ్రహాలనైనా ఏకకాలంలో అంతరిక్షంలోకి పంపించగల నేర్పు, ఓర్పు మనకుందన్నారు. అహ్మదాబాద్‌లోని డీఈఎల్యు మాజీ డైరెక్టర్ విక్రమ్దేశాయ్ ‘ఇస్రో’ సాధించిన విజయాలను వివరించారు. అంతరిక్ష పరిశోధనా మండలి మాజీ హెడ్ ఎస్.జి. వైష్టవ్ మాట్లాడుతూ శాటిలైట్ కమ్యూనికేషన్స్ మూలాలను, అవి ఏకక్షలో ఎలా ప్రయోగిస్తాయో వివరించారు. ఎన్వైనింగ్ టెక్నాలజీస్ ఎండీ, ఇస్రో మాజీ డైరెక్టరు డాక్టర్ గజిబీర్సింగ్ మాట్లాడుతూ అంతరిక్షంలో మిశ్రమ పదార్థాల అనవర్తనాల గురించి వివరించారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎల్ఎస్ గుప్త అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో అంతరిక్ష పరిశోధనా కేంద్రం మాజీ హెడ్ ఏవి ఆప్టే, ఎస్ఎస్ఎంఈ ఎల్ఎం, అత్రి కన్సల్టెంట్ కేపీ భల్సా«ద్, ఇస్రో పీఆర్వో గురుప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, డీన్ డాక్టర్ ఎం.వరప్రసాదరావు, హెచ్ఓడీలు డాక్టర్ టి.జయానంద్‌కుమార్, డాక్టర్ డి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఫలితాలు కాదు.. పరిశోధనలు కావాలి
విశ్వవిద్యాలయాల పరిస్థితిపై రాష్ట్రపతి ప్రణబ్ - ప్రాచీన కాలంలో ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నాం - ఇప్పుడు దేశంలో ఆశించిన స్థాయిలో పరిశోధనలు జరగడం లేదు - నూతన ఆవిష్కరణలకు వర్సిటీలు వేదిక కావాలి - విద్యా సంస్థలు పరిశ్రమలతో అనుసంధానం కావాలి - పరిశోధనల్లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని వ్యాఖ్య - ఘనంగా ఉస్మానియా శతాబ్ది వేడుకలు ప్రారంభం - జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించిన రాష్ట్రపతి సాక్షి, హైదరాబాద్: దేశంలోని విశ్వవిద్యాలయాలు కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలకు వేదిక కావాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా అంతర్జాతీయ సమాజంలో మెరుగైన ర్యాంకులను కైవసం చేసుకోవాలని అభిలషించారు. వర్సిటీలను ఉన్నత విద్యకు సంబంధించిన దేవాలయా లుగా తీర్చిదిద్దాలని, అవి జ్ఞానాన్ని బోధించే నిలయాలు గా ఉండాలని పేర్కొన్నారు. బుధవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలను రాష్ట్రపతి ప్రారంభించారు. క్యాంపస్‌లో నిర్మించనున్న శతాబ్ధి భవన్‌కు శంకుస్థాపన చేసి, వేదికపై నుంచి శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. ‘‘ఉస్మానియా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. శాంతియుత సహజీవనాన్ని చాటేందుకు అనువైన ఒక శ్రేష్టతా నిలయాన్ని ఆవిష్కరించాలనే కలతోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏర్పడింది. వందేళ్ల క్రితం ఇదే రోజు ఒక విజన్‌తో ప్రారంభమైంది. ఈ వందేళ్లలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఉన్నత విద్యలో భారతదేశం వందల ఏళ్ల కిందటే ప్రపంచానికిæ ఆదర్శంగా నిలిచింది. ఉన్నత విద్యలో ఇప్పటికే ఎంతో అభివృద్ధి సాధించాం. ఇంకా విప్లవాత్మక మార్పులు వస్తాయి. మేధావుల ఆలోచనలకు విశ్వవిద్యాలయాలు వేదికలుగా నిలుస్తున్నాయి. మరిన్ని కొత్త ఆలోచనలు, పరిశోధనలకు విశ్వవిద్యాలయాలు వేదికలు కావాలి. దేశంలో మరిన్ని ఐఐటీలు, ఎన్ఐటీలు ఏర్పాటు కావాలి. విశ్వవిద్యాలయాలను ఉన్నత విద్యకు సంబంధించిన దేవాలయాలుగా తీర్చిదిద్దాలి. విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని బోధించే నిలయాలుగా ఉండాలి. అక్కడ ఆలోచనలు స్వేచ్ఛగా పంచుకోవాలి. అటు గురువులు, ఇటు విద్యార్థుల తమ మేధస్సుకు పదునుపెట్టాలి. నిర్భందానికి తావులేని మేధోమథనంతో సంభాషించుకోవాలి..’’అని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. ప్రపంచంలోనే పేరు పొందాం.. ప్రాచీనకాలంలో ఉన్నత విద్యా రంగంలో భారత్ ప్రభావవంతమైన పాత్ర పోషించిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఉన్నత విద్యలో ప్రపంచానికి మార్గదర్శిగా నిలిచామన్నారు. 15వ శతాబ్దంలోనే నలంద యూనివర్సిటీ ఏర్పాటైందని.. తక్షశిల, విక్రమశిల వంటి విశ్వవిద్యాలయాలు మేధో సంపదతో ఆకట్టుకున్నాయని చెప్పారు. 1956లో అప్పటి ప్రధాని నెహ్రూ నేతృత్వంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పాటై వర్సిటీలన్నీ దాని కిందకొచ్చాయని.. విద్యా సంబంధ మౌలిక వసతులు, సదుపాయాల వృద్ధి జరిగిందని పేర్కొన్నారు. పరిస్థితిలో మార్పు రావాలి దేశ విద్యా రంగంలో కొన్ని అంశాలు ఇప్పటికీ ఆందోళన కలిగిస్తున్నాయని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ‘‘ఒకసారి ఖరగ్‌పూర్ ఐఐటీ స్నాతకోత్సవానికి వెళ్లాను. అక్కడ విద్యార్థుల ఫలితాలు, ప్లేస్‌మెంట్స్ గురించి అడిగితే... వందకు వంద శాతమని బదులిచ్చారు. మరి కొత్త పరిశోధనలెన్ని జరిగాయని ప్రశ్నిస్తే.. చాలా మంది విదేశాల్లో పరిశోధనలు చేస్తున్నారనే సమాధానం వచ్చింది. ఈ పరిస్థితిలో మార్పు రావాలి. వందకుపైగా ఉన్నత విద్యా సంస్థలను సందర్శించాను. పదేపదే ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. ఆశించిన స్థాయిలో పరిశోధనలు జరగడం లేదు. మేధావులు, విద్యార్థులు కొత్త ఆవిష్కరణలు, సాంకేతిక అంశాలపై దృష్టి సారించాలి..’’అని సూచించారు. విద్యా బోధనతోపాటు పరిశోధనలపైనా శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. దేశంలోని విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ స్థాయిలో సముచిత స్థానాన్ని కైవసం చేసుకోవాలని చెప్పారు. ఉన్నత విద్యలో పెట్టుబడులు అవసరం విద్యా సంస్థలు కేవలం ప్రభుత్వ సహకారంతోనే ముందుకు సాగవని రాష్ట్రపతి స్పష్టం చేశారు. పరిశ్రమలతో ప్రభావవంతమైన చర్చలు జరపాలని, వాటితో అనుసంధానం కావాలని సూచించారు. పరిశోధనలు, ఆవిష్కరణల కోసం పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకత ఉందని... అది జరిగినప్పుడే మనం అంతర్జాతీయ సమాజంలో సముచిత స్థానాన్ని దక్కించుకోగలుగుతామని చెప్పారు. ఈ ఆలోచనలకు ఆచరణాత్మకమైన రూపం ఇవ్వాలని ఆకాంక్షించారు. -
నాకు నాన్నే గుండు గీశారు
‘‘గుండు గీయించుకోవడానికి నేను రెడీ! మరి, దర్శక–నిర్మాతలు రెడీనా? నన్ను గుండుతో చూపిస్తారా?’’ అని ప్రశ్నిస్తున్నారు కమల్‌హాసన్ చిన్న కూతురు అక్షరా హాసన్. ప్రశ్నించడమే కాదండోయ్... పక్కా స్క్రిప్ట్‌తో వస్తే గుండు గీయించుకుంటానని స్పష్టం చేశారామె. సాధారణంగా అమ్మాయిలు గుండు చేయించుకోవడం అరుదు. కొందరు హీరోలు పాత్రలో పర్ఫెక్షన్ కోసం గుండు గీయించుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ, హీరోయిన్లు అలా చేయడం మహా అరుదు. ఈ నేపథ్యంలో అక్షర వ్యాఖ్యలు తండ్రి కమల్‌హాసన్ తరహాలో నేనూ ప్రయోగాలకు సిద్ధమనే సంకేతం అనుకోవాలేమో! అక్షరా హాసన్ మాట్లాడుతూ – ‘‘గుండుతో నటించే పాత్రల కోసం నేను ఎదురు చూస్తున్నాను. కానీ, ఇప్పటివరకూ అలాంటి ఛాన్స్ రాలేదు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడండి. జుత్తుని త్యాగం చేసేస్తా’’ అన్నారు. గతంలో ఓసారి గుండు చేయించుకున్నానని ఆమె తెలిపారు. అది చేసింది కూడా ఎవరో కాదు... కమల్‌హాసనే అట! ‘‘చిన్నప్పుడు నా హెయిర్ షార్ట్‌గా ఉండేది. ఓసారి క్యాజువల్‌గా నాన్నతో ‘గుండు చేయించుకుంటే ఎలా ఉంటుంది?’ అనడిగా. వెంటనే బాత్రూమ్లోకి తీసుకువెళ్లి ఆయనే గుండు గీశారు. క్లీన్‌గా నా తలనంతా షేవ్ చేశారు. అప్పుడు నా వయసు ఏడేళ్లు. అప్పుడప్పుడూ మేం ఇలాంటి క్రేజీ థింగ్స్ చేస్తుంటాం’’ అన్నారు అక్షర. -
ఇస్రో జయహో
నేడు ఆకాశ వీధిలో అరుదైన ఘట్టం 104 ఉపగ్రహాల ప్రయోగం విజయవంతం కావాలని ఆకాంక్ష భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ధవ¯ŒS స్పేస్ సెంటర్ షార్(శ్రీహరి కోట) నుంచి పంపనున్న పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్– సీ37(పీఎస్ఎల్వీ) బుధవారం ఉదయం 9.28 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది. వాహన నౌక విదేశాలకు చెందిన 101 ఉపగ్రహాలతో పాటు మన దేశానికి చెందిన కార్టోశాట్ 2డి, ఐఎ¯ŒSఎస్–1ఏ, ఐఎ¯ŒSఎస్– 1బీ ఉపగ్రహాలను మోసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ప్రయోగం సక్సెస్ కావాలని జిల్లావాసులు పలువురు ఆకాంక్షించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ఈ ప్రయోగం దేశానికి గర్వకారణం పి.గన్నవరం : పీఎస్ఎల్వీ–సీ37 ప్రయోగం విజయవంతమై.. భారతదేశం అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచ రికార్డు సృష్టించనుంది. నేను 2012 సెప్టెంబర్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తగా చేరా. అప్పటి నుంచి తిరువానంతపురంలోని విక్రం సారాభాయ్ స్పేస్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నా. ఈ ప్రయోగంపై ప్రపంచ దేశాలన్నీ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నాయి. సీ37 ప్రయోగం భారతదేశ ప్రజలకు ఎంతో గర్వకారణం. మొత్తం 104లో భారత దేశానికి చెందిన మూడు ఉపగ్రహాలతో మనకు ఎంతో కీలమైన సమాచారం లభిస్తుంది. రానున్న రోజుల్లో మన ఇస్రో మరింత ముందుకు దూసుకుపోతుంది. ఇస్రో ప్రయోగాలతో రోజు, రోజుకీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత సద్వినియోగం చేసుకుని, దేశాభివృద్ధికి పాటుబడుతూ, ఉన్నత శిఖరాలను అధిరోహించాలి. ప్రస్తుతం తిరువానంతపురం స్పేస్ సెంటర్లో మార్చి నెలలో ప్రయోగించనున్న ఎఫ్09 మిష¯ŒSకు సంబంధించిన ప్రాజెక్టులో పనిచేస్తున్నా. – ఆదిమూలం సూర్యతేజ, ఇస్రో శాస్త్రవేత్త, ఆదిమూలంవారిపాలెం, పి.గన్నవరం మండలం యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకం తుని రూరల్ : ‘‘దేశ యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా పీఎస్ఎల్వీ సీ–37 రాకెట్ ప్రయోగం నిలుస్తుంది. శాస్త్ర పరిశోధనలు, ప్రయోగాల్లో ప్రపంచదేశాల్లో భారత్ అగ్రభాగాన నిలువనుంది. అరుదైన ఈ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా ప్రపంచ అంతరిక్ష శాస్త్ర పరిశోధనల్లో భారత్ ఆధిపత్యం వహించగలదు. సాప్‌్టవేర్, హార్డ్‌వేర్ రంగాలపై పరుగులు తీస్తున్న యువత అంతరిక్ష పరిశోధనలపై మళ్లే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ద్వారా మనదేశం శాస్త్రీయ, విజ్ఞాన, వ్యవసాయపరంగా అన్ని రంగాల్లో ముందంజ వేస్తుంది. మోడల్ రాకెట్రీ ప్రయోగంలో.. విఫ్టెక్ ద్వారా 2014 నవంబరు 17 నుంచి నాలుగు రోజులు చెన్నైలో జరిగిన మోడల్ రాకెట్రీ వర్క్‌షాపులో పాల్గొన్నా. ఈ సందర్భంలో రాకెట్ లక్ష్యం, అందుకు అనుగుణంగా ఏవిధంగా తయారు చేయాలి? అన్న అంశాలపై శిక్షణ, అవగాహన, ప్రయోగం కార్యక్రమాల్లో పాల్గొన్నా. రాకెట్ లాంచ్ ప్యాడ్, శాస్త్రవేత్తలతో సమావేశాలు, మ్యాప్‌ల పరిశీలన, పరిశోధనల్లో సహచరులతో సమన్వయం వంటి విలువైన విషయాలు తెలుసుకున్నా. వాటిని తమ స్కూల్లో విద్యార్థులకు వివరించా. ప్రతి పౌరుడు షార్‌ను పరిశీలించేందుకు ఠీఠీఠీ.ఠిజీpn్ఛ్ట.ఛిౌఝ వెబ్‌ను సందర్శించాలి. – సుర్ల సత్యనారాయణమూర్తి, మోడల్ రాకెట్రీ ప్రయోగకర్త, సై¯Œ్స ఉపాధ్యాయుడు, జెడ్పీ హైస్కూల్, తేటగుంట విజయవంతం కావాలని మానవహారం, ర్యాలీ పెద్దాపురం : ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ పెద్దాపురం పట్టణంలో జన విజ్ఞాన వేదిక, యూటీఎఫ్, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐల ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ, మానవహారం నిర్వహించారు. స్థానిక ఆంజనేయ స్వామి గుడి వద్ద మానవహారం నిర్వహించి, ఇస్రో సంస్థ, ఇస్రో శాస్త్రవేత్తలు, సై¯Œ్స అభివృద్ధి చెందాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో జేవీవీ రాష్ట్రనాయకులు బి.అనంతరావు, నాయకులు బుద్ధా శ్రీనివాస్, వంగలపూడి శివకృష్ణ, యూటీఎఫ్ నాయకులు వెంకట్రావు, రామ్‌కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఈశ్వరరావు, టి.శివదుర్గ, శివ, భరత్, పెద్దాపురం ఫేస్బుక్ టీం సభ్యులు ముక్తార్ అలీ, హర్ష నెల్లూరి, నీలపాల రవి, డి.క్రాంతికుమార్, అలీ, కాటంరాజు, డి.కృష్ణ, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఆల్ ద బెస్ట్.. కోటనందూరు : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు బుధవారం ఉదయం ప్రయోగించే సీ–37 ప్రయోగం విజయవంతం కావాలని శ్రీసాయి విద్యాసంస్థల అధినేత బి.లక్ష్మి ఆకాంక్షించారు. మంగళవారం విద్యాసంస్థల్లో ఇస్రో ప్రయోగంపై విద్యార్థులతో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ ప్రయోగంతో భారతదేశ గొప్పతనం ప్రపంచదేశాలకు తెలియనుందన్నారు. పాఠశాల ఆవరణలో ఈ ప్రయోగానికి సంబంధించి చిత్రాన్ని గీసి అది నింగిలోకి ప్రవేశించే విధానంపై విద్యార్థులకు వివరించారు. సీ–37 ప్రయోగం విజయవంతం కావాలని అధినేత లక్షి్మతో పాటు విద్యార్థులు ‘ఆల్ ద బెస్ట్’ తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సోమేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. అబ్దుల్ కలాంను కలసిన వేళ.. దేశం గర్వించదగ్గ వ్యక్తి ప్రముఖ శాస్త్రవేత్త అబ్దుల్ కలాం నేరుగా నేను తయారు చేసిన ప్రాజెక్టు చూసేందుకు వచ్చి సలహాలు ఇవ్వడం జీవితంలో మరువలేనిది. నేను 2024లో మార్చి మూడు నుంచి ఏడో తేదీ వరకు జమ్మూకశ్మీర్‌లో జరిగిన జాతీయ సై¯Œ్స కాంగ్రెస్‌లో సోలార్ పెస్ట్ కంట్రోల్ తయారు చేశా. దానిని చూసిన అబ్దుల్ కలాం నన్ను ప్రశంసించారు. కలాం లాంటి మేధావులు ఇస్రోలో ఉన్నారు. ప్రయోగం తప్పకుండా ఫలిస్తుంది. – ఎ.ఇక్వాక్వర్మ, శ్రీషిర్డీసాయి విద్యానికేత¯ŒS, రాజమహేంద్రవరం పందలపాక విద్యార్థుల అభినందనలు పందలపాక(బిక్కవోలు) : మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంతరిక్ష విజేతగా నిలవాలని పందలపాక శ్రీ పడాల పెదపుల్లారెడ్డి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆకాంక్షిస్తున్నారు. బుధవారం ఉదయం 9.28 గంటలకు ఇస్రో పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా ఒకే సారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్న నేపథ్యంలో ప్రపంచదేశాలకు దీటుగా ప్రయోగం సఫలం కావాలని, ఇస్రో జయహో అంటూ పీఎస్ఎల్వీ–సీ37 అనే అక్షరరూపంలో విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డీవీవీఎస్ఎ¯ŒS మూర్తి, సై¯Œ్స ఉపాధ్యాయుడు ఎస్ రమేష్, పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్తిరాజు, వ్యాయామ ఉపాధ్యాయుడు దార్వంపూడి యువరాజారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
పకడ్బందీగా పంటకోత ప్రయోగాలు
–సీపీఓ ఆనంద్‌నాయక్ కర్నూలు(అగ్రికల్చర్): పంటకోత ప్రయోగాలను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి ఆనంద్‌నాయక్ తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని సనయన ఆడిటోరియంలో వ్యవసాయశాఖ ఏడీలు, అసిస్టెంటు స్టాటిస్టికల్ ఆఫీసర్లు తదితరులకు పంటకోత ప్రయోగాల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా సీపీఓ మాట్లాడుతూ...పంటకోత ప్రయోగాలను వ్యవసాయశాఖ, జిల్లా ప్రణాళిక విభాగం చెరి సగం చేపడుతాయని వివరించారు. జిల్లాలో గ్రామం యూనిట్‌గా వరికి బీమా అమలు చేస్తున్నామని, ప్రతి 100 హెక్టార్లను ఒక యూనిట్‌గా తీసుకొని పంట కోత ప్రయోగాలు నిర్వహించాలన్నారు. వరిలో 5‘5 మీటర్లు, కందిలో 10‘10 మీటర్ల ప్లాట్‌లో పంటకోత ప్రయోగం నిర్వహించాలని వివరించారు. జేడీఏ ఉమామహేశ్వరమ్మ మాట్లాడుతూ..ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ప్రీమియంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యెజనను అమలు చేస్తోందన్నారు. నష్టపోయిన రైతులకు ఈ పథకం కింద పరిహారం రావాలంటే పంటకోత ప్రయోగాలు అత్యంతకీలకమన్నారు. సమావేశంలో ఎల్‌డీసీఎం నరసింహారావు, ఉద్యానశాఖ సహాయ సంచాలకులు రఘునాథరెడ్డి, జిల్లా ప్రణాళిక విభాగం డీడీ కష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
'నిఖిల్‌ను ప్రయోగవస్తువుగా వాడుకున్నారు'
గాజులరామారం: ఎత్తు పెరగాలన్న యువకుడి ఆసక్తిని అవకాశంగా తీసుకుని గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు అతనిపై ఆపరేషన్ పేరుతో ప్రయోగాలు చేసి బలి పశువుని చేశారని బీజేపీ శాసన సభ పక్ష నేత కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఎంఎన్ రెడ్డి నగర్‌లోని నిఖిల్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇంతకుముందు ఎవరికీ చేయని ఆపరేషన్‌ను నిఖిల్‌పై ప్రయోగాత్మకంగా చేసి అతని భవిష్యత్‌ను నాశనం చేశారన్నారు. 6 నెలలుగా ఎత్తు పెరగాలని తమను సంప్రదిస్తున్న నిఖిల్‌ను వైద్యులు తప్పుదారి పట్టించి అపరేషన్ చేసి చేతులు దులుపుకున్నారన్నారు. శస్త్ర చికిత్సకు ముందు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాలన్న నిబంధనను కూడా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీనిపై బీజేపీ తరపున ప్రభుత్వ ఛీప్ సెక్రెటరీని కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమస్యను మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ గుర్తింపును రద్దు చేయడంతో పాటు గ్లోబల్ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధితునికి వైద్యం అందించాలని, నష్టపరిహారం చెల్లించాలని, భవిష్యత్‌లో ఎవరూ ఇలాంటి చికిత్సలను చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. -
మేఘాలకంటే పైన తేలుతూ ప్రయోగాలు
న్యూఢిల్లీ: ప్రపంచమంతా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నా నిరంతర అభివృద్ధితో దూసుకెళుతున్న భారత్ తన మైలేజ్ కు మరింత ఉపకరించే మరో చర్యను తీసుకుంటోంది. వాతావరణం ఎలా ఉందో ముందుగానే పరీక్ష చేసి దానికి తగిన చర్యలు తీసుకునేందుకు అవసరమైన సలహాలు సూచనలు ఇచ్చేందుకు ఒక ప్రత్యేక విమానం కొనుగోలు చేయనుంది. ఇది ప్రస్తుతం భూమికి సమీపంలో ఉన్న వాయు పొరపైకి వెళ్లి పరీక్షలు చేయనుంది. దీనిని పుణెకి చెందిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియోరాలజీ(ఐఐటీఎం-పుణె) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ద్వారా దాదాపు రూ.150కోట్లు వెచ్చించి కొనుగోలు చేయనుంది. వ్యవసాయానికి ఆధారమైనది మేఘం. దాని లక్షణాలు, అందులోని వాయువులు, అవి మారుతున్న తీరును ముందే పసిగడితే దానికి తగిన జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. పైగా వర్షం ఎప్పుడు పడుతుందో ఎప్పుడు పడదో పడితే ఎక్కడ పడుతుందో అనే సమాచారం పక్కాగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అలాంటి పరీక్షలు చేసేందుకు అనువైన ఓ ప్రత్యేక విమానం కొనుగోలు చేస్తున్నారు. ఈ విమానంలో వాతావరణ శాస్త్రజ్ఞులు ప్రస్తుతం మన కళ్లకు కనిపిస్తున్న మేఘాలకన్నా పైకి వెళ్లి పరీక్షిస్తారు. ఈ విమానం కొనుగోలుకు, ప్రాజెక్టుకు వచ్చే నెలలో టెండర్లు పిలిచి మొత్తం రెండేళ్లలో పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించనున్నారు. ఇదే జరిగితే అగ్ర దేశాల సరసన భారత్ చేరుకోవడంతోపాటు ఈ తరహా విమానం కలిగి పరీక్షలు చేసే దక్షిణాసియా దేశాల్లోని ప్రధాన దేశం అవుతుంది. -
ప్రయోగాలపై కొత్త చట్టం
నిరుపేదల, నిరక్షరాస్యుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఔషధ ప్రయోగాలకు సంబంధించి ఎట్టకేలకు సమగ్రమైన నిబంధనలతో కేంద్ర ప్రభుత్వం సవరణ బిల్లు తీసుకురానున్నదన్న వార్త అనేకమందికి ఊరట కలిగిస్తుంది. ఈ ప్రయోగాల విష యంలో నిర్దిష్టమైన నిబంధనలు లేకపోవడంవల్ల ఆచరణలో ఎన్నో సమస్యలు తలె త్తుతున్నాయి. ప్రయోగాలు వికటించినప్పుడు ఫిర్యాదులొస్తే తప్ప అసలు అలాం టివి నిర్వహిస్తున్నారన్న సంగతి ప్రభుత్వాలకు తెలియడంలేదు. ఆ ప్రయోగాల్లో మరణాలు సంభవించినప్పుడు లేదా దుష్ఫలితాలు ఏర్పడినప్పుడు మీడియాలో వెల్లడవుతాయి. బ్రిటిష్ వలసపాలకుల కాలంలో రూపొందిన డ్రగ్స్ అండ్ కాస్మొ టిక్స్ చట్టం నిబంధనలు ఔషధ ప్రయోగాలకు సహకరించడంలేదన్న ఉద్దేశంతో 2005లో దాన్ని సవరించారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫార్మసీ సంస్థలు మన దేశంలో ప్రయోగాలకు క్యూ కట్టాయి. ఈ సవరణకు ముందూ తర్వాతా ఔషధ ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలు బేఖాతరవుతూనే ఉన్నాయి. మూడేళ్లక్రితం సుప్రీంకోర్టులో ఈ తరహా ఘటనలపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలయ్యాకగానీ ఇందులోని తీవ్రత బయటి ప్రపంచానికి అర్థం కాలేదు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 2005-12 మధ్య 475 ప్రయోగాల పర్యవ సానంగా 2,644మంది మరణించగా...11,972మందిలో తీవ్ర దుష్ర్పభావాలు కనబడ్డాయి. ఈ ఉదంతాలపై విచారణ జరిగాక అందులో 80 మరణాలు ఔషధ ప్రయోగాలకు సంబంధించినవని తేల్చారు. ఇక రోగులు తీవ్ర దుష్ర్పభావాలకు లోనైన కేసుల్లో దాదాపు 500 కేసులు ప్రయోగాలతో ముడిపడి ఉన్నాయని నిర్ధారిం చారు. అయితే, ఈ కేసులన్నిటిలోనూ విచారణ సవ్యంగా సాగిందని చెప్పలేం. కేన్సర్‌కు దారితీసే హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్‌పీవీ) నివారణకు రూపొం దించిన వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడటం కోసం 2010లో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ లలో 24,777మంది యువతులను ఎంచుకున్నప్పుడు ఇలాంటి సమస్యే తలెత్తిం ది. వ్యాక్సిన్‌ను తీసుకున్నవారిలో ఏడుగురు యువతులు మరణించారని తెలియ గానే ఆపేశారు. అనంతరం ఔషధ నియంత్రణ జనరల్ మరికొన్న మార్గదర్శ కాలను జారీచేశారు. అయినప్పటికీ సమస్య ఎప్పటిలానే ఉండటంవల్ల, కేంద్రం నుంచి సరైన స్పందన లేని కారణంగా 2012లో పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టులో పిల్ దాఖలుచేశాయి. ఒకపక్క సుప్రీంకోర్టులో విచారణ సాగుతుండగానే 2013-14 మధ్య మరో 370మంది ఔషధ ప్రయోగాల తర్వాత చనిపోయారు. ఇందులో 21 చావులు మాత్రమే ప్రయోగాలతో ముడిపడి ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. కనుక ఆ కేసుల్లో మాత్రమే సవరించిన నిబంధనల ప్రకారం బాధిత కుటుంబాలకు పరిహా రం దక్కింది. చిత్రమేమంటే ప్రయోగాలు వికటించినప్పుడు బాధిత కుటుంబా లకు నామమాత్రంగా ఆయా ఔషధ సంస్థలతో పరిహారం ఇప్పించడం తప్ప ఆ సంస్థలపై చర్య తీసుకొనేందుకు అవసరమైన చట్ట నిబంధనలు లేవు. ఈ లోపాలు ఔషధ సంస్థలకు వరాలుగా మారాయి. అసలు ఔషధ ప్రయోగాలకు సంబంధిం చిన నిబంధనలే సరిగా లేవనుకుంటే...వాటి ప్రమేయంలేని ప్రయోగాలు కూడా యథేచ్ఛగా సాగిపోతున్నాయి. మరోపక్క ఆ నిబంధనల విషయంలో ఏం చెబుతా రని సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు చాన్నాళ్లపాటు కేంద్రంనుంచి సరైన జవాబు లేదు. రాష్ట్రాలను అడిగి చెబుతామని అనడం తప్ప ఆ విషయంలో ఎలాంటి ప్రగతీ లేదు. ఒక దశలో సుప్రీంకోర్టు తీవ్ర అసహసనం వ్యక్తంచేసి తానే ఒక నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి దాని సిఫార్సుల ఆధారంగా కొన్ని మార్గదర్శకాలను రూపొం దించి కొత్త చట్టం వచ్చేవరకూ ఆ మార్గదర్శకాలే అమల్లో ఉంటాయని ప్రకటిం చింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉండే పార్లమెం టరీ స్థాయీ సంఘం నిరుడు సమర్పించిన నివేదిక భారతీయ వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్యశాఖల తీరుతెన్నుల్ని తీవ్రంగా తప్పుబట్టింది. ఔషధ ప్రయోగాల వెనక ఓ పెద్ద వ్యాపారం ఉంది. దాదాపు రూ. 3,500 కోట్ల ఈ వ్యాపారం ఏటా 10 నుంచి 12 శాతం పెరుగుతుంటుందని అంచనా. ఇందులో ప్రయోగాలకు సిద్ధపడేవారికి నామమాత్రంగా దక్కుతుంది. ఆ ప్రయోగాల నిర్వహణ బాధ్యత తీసుకునేవారికీ, దళారులకూ అధిక భాగం వెళ్తుంది. ఇక్కడి జనాభాలో జన్యు వైవిధ్యం ఉన్నదని ఔషధ సంస్థలు చెప్పే మాట నిజమే కావొచ్చు గానీ... పర్యవేక్షణ సరిగా లేకపోవడం, నిరక్షరాస్యత, పేదరికమే ప్రధానంగా వాటిని భారత్ వైపు నడిపిస్తున్నాయి. గ్రామీణుల్ని, గ్రామీణ ప్రాంతాలనూ ప్రయో గాలకు ఎంచుకోవడంలోని ఆంతర్యం ఇదే. ఔషధ ప్రయోగాలకు సంసిద్ధులయ్యే వారికి వాటి వినియోగంవల్ల కలిగే ప్రభావాన్ని సరిగా వివరించకపోవడం, అనా రోగ్యం తలెత్తినప్పుడు పట్టించుకోకపోవడంవంటివి ఎన్నో సమస్యలు తెస్తున్నా యి. పాశ్చాత్య దేశాల్లో ఈ నిబంధనలను చాలా కఠినంగా అమలు చేస్తారు. అంతే కాదు...అక్కడ ప్రయోగాలకు సిద్ధపడేవారికిచ్చే మొత్తం చాలా ఎక్కువుంటుంది. ఇప్పుడు తీసుకురాబోయే సవరణ బిల్లులో పకడ్బందీ నిబంధనలున్నాయం టున్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ప్రయోగాలు జరపడంవల్ల రోగికి ఆరోగ్యపరంగా తీవ్ర సమస్య ఎదురైందని తేలితే ఏడాది జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. ప్రయోగాల నిర్వహణ తీరు సరిగా లేదని తేలినా, అది లోపభూయిష్టంగా ఉన్నదని రుజువైనా రూ. 3 లక్షల వరకూ జరిమానా విధిస్తారు. అయితే, ఈ తరహా ప్రయోగాలకు అనుమతించాల్సిన యంత్రాంగమేదో, ఆ ప్రయోగాలను పర్యవేక్షించాల్సిన వారెవరో నిర్దిష్టంగా పేర్కొని...వారి విధి నిర్వహణ సక్రమంగా లేనప్పుడు అమలులోకొచ్చే చర్యలేమిటన్న విషయంలో కూడా స్పష్టత ఉండాలి. బాధితులకివ్వాల్సిన పరిహారం గురించి కూడా నిర్దిష్టంగా ఉండాలి. అలాగే ప్రయోగాలు ఎక్కడో మారుమూల పల్లెలు, చిన్న పట్టణాల్లో కాక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండే నగరాల్లోనే జరపాలన్న నిబంధన చేర్చాలి. అందువల్ల బాధితులకు సకాలంలో వైద్యసాయం అందడం తేలికవుతుంది. వీటితోపాటు రోగుల సంతకాలు తీసుకునే పత్రాలు ఇంగ్లిష్‌లో కాక స్థానిక భాషల్లో ఉండేలా చూడాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే కొత్త చట్టంవల్ల సత్ఫలితాలు కలుగుతాయి. విచక్షణారహితమైన ప్రయోగాలకు బ్రేకుపడుతుంది. -
ప్రయోగాలతోనే సృజనాత్మకత
వేంపల్లె : విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాం కానీ.. వారిలో ఉన్న ృజనాత్మకత శక్తిని వెలికి తీసేందుకు మరిన్ని ప్రయోగాలు అవసరమని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి వైస్ చెర్మైన్ విజయ్ ప్రకాష్ అభిప్రాయపడ్డారు. శనివారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో నిర్వహిస్తున్న అభియంత్ టెక్ ఫెస్టివల్-15 కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన విద్యార్థులు, అధ్యాపకులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాం కానీ.. వారిలో ఉన్న ృజనాత్మకత శక్తిని వెలికి తీయడంలో వైఫల్యం చెందుతున్నామన్నారు. ృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇంకుబేషన్ సెంటర్ ఏర్పాటు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను 2029 నాటికి సన్‌రైజ్ స్టేట్‌గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. ఆ టార్గెట్ రీచ్ కావాలంటే విద్యార్థులలో ృజనాత్మకత శక్తి పెరగాలన్నారు. ఇప్పటికే విశాఖపట్టణంలో సన్‌రైజ్ విలేజ్ ప్రారంభమైందన్నారు. 2029 నాటికి 5వేల సన్‌రైజ్ విలేజ్‌లు ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ ఆలోచనగా ఉందన్నారు. ఇది సాధ్యం కావాలంటే ఇలాంటి ఇంజనీరింగ్ విద్యార్థులే కీలకం అని చెప్పారు. బూత్ క్యాంపులు ఏర్పాటు చేసి వారిలో ఉన్న ృజనాత్మకత శక్తిని వెలికి తీయాలని అధికారులకు సూచించారు. గ్లోబల్ స్థాయిలో జరిగే కాంపిటీషన్లో నెగ్గేలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. ట్రిపుల్ ఐటీలలో మిగతా కళాశాలలకు భిన్నంగా అధ్యాపకులకు బదులు మెంటార్స్ ఉండటం విశేషమన్నారు. వీరివలన విద్యార్థులలో నైపుణ్యత శక్తి పెరుగుతోందన్నారు. ట్రిపుల్ ఐటీల్లో వార్షికోత్సవం సందర్భంగా ఇలాంటి ఫెస్టివల్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇక్కడ టీం స్పిరిట్ ఎంతో బావుందన్నారు. ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంవల్ల విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులను సమీపంలోని పరిశ్రమలకు తీసుకెళ్లి.. అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పిస్తే బావుంటుందన్నారు. మైనింగ్ ఓపెన్ కాస్ట్‌పై పరిశోధనలు జరపడానికి క్షేత్ర స్థాయి పర్యటనలు విద్యార్థుల చేత చేయించాలన్నారు. ప్రజలకు సాంకేతికత మరింత దగ్గర కావాలన్నారు. అందుకు సంబంధించిన డిజైన్‌ను తయారు చేసుకొని ముందుకు వెళ్తే విజయం తథ్యం అన్నారు. గురువుకు బదులు గూగుల్ అనే పదం వినపడుతోందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు కష్టపడి చదవడంతోపాటు ృజనాత్మకతను కలిగి భావి భారత శాస్త్రవేత్తలు ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డెరైక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఏవో విశ్వనాథరెడ్డి, ఎఫ్‌వో కె.ఎల్.ఎన్.రెడ్డి, స్టూడెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. -
విశ్వ రహస్యాలు తెలుసుకోండి
ఇస్రో శాస్త్రవేత్త నాగేశ్వరరావు పులివెందుల టౌన్ : విద్యార్థులు పలు ప్రయోగాలు చేసి వాటి ద్వార విశ్వరహస్యాలు తెలుసుకోవాలని బెంగుళూరు ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) శాస్త్రవేత్త పి.నాగేశ్వరరావు సూచించారు. లయోలా డిగ్రీ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహిస్తున్న సైన్స్ ఇన్స్పైర్ శిబిరంలో భాగంగా మూడో రోజైన శనివారం ఆయన పాల్గొని విద్యార్థులకు బోధించారు. ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రాలపై జరుగుతున్న పరిశోధనలపై అనేక విషయాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రయోగాలతో విశ్వ రహస్యాలు తెలుసుకోవాలన్నారు. విశ్వ రహస్యాలు, విశ్వం ఏర్పడిన విధానం, విశ్వం వయస్సు, భౌతిక శాస్త్ర సూత్రాల ఆధారంగా తెలిపారు. ఖగోళ శాస్త్రం అభివృద్ధి - భారతదేశం పాత్ర గురించి చెప్పారు. విశ్వంలో జరిగే మార్పులు, బయో ఆస్ట్రానమీ అంటే భూమి మీద జీవులు పుట్టుక నుంచి నేటి వరకు ఇస్రో చేసిన, చేస్తున్న కృషి గురించి ప్రొజెక్టర్ ద్వారా విద్యార్థులకు వివరించారు. అలాగే మామ్(మార్జి అర్బిటల్ మిషన్), ఖగోళ శాస్త్రాలపై కూడా వివరించారు. విద్యార్థుల సందే హాలకు సమాధానమిచ్చి వారికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ముందుగా విద్యార్థులు భౌతిక, రసాయన, బాటనీ, జువాలజీ, జియాలజీలతో పాటు వివిధ అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు. సాయంత్రం హైదరాబాద్ జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త వి.శేషసాయి విద్యార్థులకు భూమి పుట్టుక నుంచి నేటి వరకు ఏర్పడిన వివిధ రకాల శిలలు, ఆర్థిక ఖనిజాలు, జీవుల గురించి వివరించారు. యువ శాస్త్రవేత్తలు పలు విషయాలపై పరిశోధన చేసి దేశ పురోగతిని సాధించాలన్నారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవాలన్నారు. శాస్త్ర విజ్ఞానంలో నిష్ణాతులు కావాలన్నారు. యువ శాస్త్రవేత్తలు దేశానికి ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. కావున పరిశోధనా రంగంపై దృష్టిసారించాలన్నారు. కార్యక్రమంలో ఇన్స్పైర్ ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ రామకృష్ణారెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ అమల్‌రాజు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
మన భాగ్యనగరం... పరిశోధనల భాండాగారం
టాప్ స్టోరీ: ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే పరిశోధనలు-ఆవిష్కరణల్లో ముందుండాలి. పరిశోధనల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. దేశవ్యాప్తంగా ఎన్నో రీసెర్చ సెంటర్లను ఏర్పాటు చేసింది. మేటి విద్యా సంస్థలకు నిలయమైన హైదరాబాద్.. ఎన్నో పరిశోధన సంస్థలకు కేంద్రంగా విరాజిల్లుతోంది. వీటిని ఆసరాగా చేసుకుని నగర యువత పరిశోధనల్లో రాణిస్తోంది. మానవాళి ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారాలను చూపుతోంది. తద్వారా అత్యుత్తమ కెరీర్‌కు బాటలు వేసుకుంటోంది. కొత్త విద్యా సంవత్సరంలో పరిశోధనలకు నోటిఫికేషన్లు విడుదలవుతున్న నేపథ్యంలో.. నగరంలో కొలువుదీరిన పరిశోధన సంస్థలు, కోర్సుల వివరాలు.. పరిశోధనాంశాలెన్నో.. హైదరాబాద్‌లో సామాజిక శాస్త్రాలు మొదలుకొని బేసిక్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్ వరకూ.. ఆహార ధాన్యాల నుంచి ఫార్మాస్యూటికల్ సెన్సైస్ వరకూ అన్ని రకాల పరిశోధలు సాగుతున్నాయి. సామాజిక సమస్యలపై, వివిధ వ్యాధులకు కారణాలు, దేశ రక్షణకు అవసరమైన పరికరాల తయారీ, పశువుల వ్యాధులు వంటి ఎన్నో అంశాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ టూ పీహెచ్డీ ఆయా పరిశోధన సంస్థల్లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ నుంచి పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్.. అజీం ప్రేమ్‌జీ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌తో కలిసి ఎడ్యుకేషన్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఫిల్ - పీహెచ్డీ, ఉమెన్స్ స్టడీస్‌లో పీహెచ్డీ కోర్సును అందిస్తోంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో.. ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ, పీహెచ్డీ, కెమిస్ట్రీలో పీహెచ్డీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మిగిలిన సంస్థలు వివిధ అంశాల్లో పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నాయి. పరిశోధనలతోపాటు ప్రోత్సాహం.. జేఆర్‌ఎఫ్‌నకు అర్హత సాధించి పీహెచ్డీ చదివే అభ్యర్థులకు ఆయా సంస్థల నియమ నిబంధలను బట్టి మొదటి రెండేళ్లు ప్రారంభంలో నెలకు రూ.12,000 నుంచి రూ.16,000 వరకు అందిస్తున్నాయి. తర్వాత మూడేళ్లు నెలకు రూ.14,000 నుంచి రూ.20,000 వరకు చెల్లిస్తున్నాయి. ప్రతి ఏటా కాంటిన్జెన్సీ గ్రాంట్‌ను కూడా ఇస్తున్నాయి. ఈ మొత్తం రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు ఉంటు ంది. విద్యార్ధులు కేవలం అకడెమిక్స్కే పరిమితం కాకుండా.. పరిశోధనలు చేస్తే అద్భుత కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చని ఎన్జీఆర్ఐ చీఫ్ సైంటిస్ట్ ఆర్.కె.చద్ధా సూచించారు. ఐఐటీ- హైదరాబాద్ విద్యార్థుల ప్రతిభ రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రతను పసిగట్టే మ్యాగ్నటిక్ సెన్సార్ అభివృద్ధిలో కీలకంగా మారారు ఐఐటీ-హైదరాబాద్ పీహెచ్డీ విద్యార్థులు. ఇలాంటి ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించేందుకు తమ విద్యార్థులు సిద్ధంగా ఉన్నారని ఐఐటీ హైదరాబాద్ డెరైక్టర్ యు.బి.దేశాయ్ తెలిపారు. వివిధ అంశాలపై క్యాంపస్‌లో 400 మంది పీహెచ్‌డీలు చేస్తున్నారని చెప్పారు. సిటీలోని పలు ఇంజనీరింగ్ క్యాంపస్‌లు కూడా పరిశోధనలకు కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ప్రాజెక్టులు, వర్క్‌షాప్స్, ఫెస్ట్‌ల వంటివి విద్యార్థుల్లో అంతర్గతంగా దాగిన ఇన్నోవేషన్‌ను వెలికితీసేందుకు వారధిగా ఉపయోగపడతాయని ఐఐటీ మద్రాస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆర్.డేవిడ్ కొయిల్ పిళ్లై చెప్పారు. కోర్సులు.. అర్హతలు.. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ కోర్సుల్లో ప్రవేశించాలంటే.. నిర్దేశిత మార్కులతో సంబంధిత/అనుబంధ సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. పీహెచ్డీ కోర్సులో ప్రవేశానికి నిర్దేశిత మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా పరిశోధన సంస్థల నిబంధనలకు అనుగుణంగా సీఎస్ఐఆర్-నెట్, గేట్, యూజీసీ-నెట్, ఐసీఎంఆర్ - జేఆర్ఎఫ్, డీబీటీ-జేఆర్ఎఫ్, డీఎస్టీ-ఇన్స్పైర్ వంటివాటిలో అర్హత సాధించాలి. వీటి ఆధారంగా వివిధ పరిశోధన సంస్థలకు దరఖాస్తు చేసుకోవాలి. ఇవేకాకుండా.. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ(డీబీటీ), డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(డీఎస్టీ), ఐసీఎంఆర్ వంటివి కూడా పరీక్ష/మౌఖిక పరీక్ష ఆధారంగా అభ్యర్థులను జేఆర్ఎఫ్కు ఎంపిక చేస్తాయి. సిటీలో పరిశోధన సంస్థలు.. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ(సీసీఎంబీ) సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్(సీడీఎఫ్‌డీ) నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ సెంట్రల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ నేషనల్ అకాడెమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ అండ్ మేనేజ్మెంట్ డెరైక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ డెరైక్టరేట్ ఆఫ్ ఆయిల్ సీడ్ రీసెర్చ్ డెరైక్టరేట్ ఆఫ్ సోర్గమ్ రీసెర్చ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్(టిస్) ఫుడ్ అండ్ డ్రగ్ టాక్సికాలజీ రీసెర్చ్ సెంటర్ నేషనల్ సెంటర్ ఫర్ లేబొరేటరీ సెన్సైస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ అటామిక్ మినరల్స్ డెరైక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఇండియన్ ఓషన్ స్టడీస్. భవిష్యత్తులో నూతన ఆవిష్కరణలు ‘‘నాణ్యమైన విద్యతోనే నిపుణులు తయారవుతారు. గతంతో పోల్చితే విద్యార్థులు ప్రస్తుతం ప్రయోగాలు, పరిశోధనల వైపు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఎన్నో కొత్త ఆవిష్కరణలు భారతదేశం నుంచి వెలుగుచూస్తాయి. అకడమిక్స్, ప్లేస్‌మెంట్స్.. ఈ రెండే కాకుండా విద్యార్థులు రీసెర్చలోనూ పాల్గొనాలి. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను విరివిగా అందిపుచ్చుకోవాలి. -ప్రొఫెసర్ దేవేంద్ర జలిహల్, ఐఐటీ-మద్రాస్ -
రెడీ.. 1.. 2.. 3.. గో
‘స్పేస్’లో భారత్ ధూమ్ అగ్రరాజ్యాలకు దీటుగా ఇస్రో ప్రయోగాలు సాక్షి, హైదరాబాద్: ‘‘ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. రాకెట్ పైకి ఎగిరిందా? లేదా?..’’ అదేంటి.. పాపులర్ సినిమా డైలాగ్ మారిపోయిందే? ఏం కాదు.. శ్రీహరికోట కేంద్రంగా నింగికెగిరిన జీఎస్ఎల్వీని గుర్తుకు తెచ్చుకోండి.. భారతంలో అర్జునుడి పాశుపతాస్త్రానికి ఏమాత్రం తీసిపోని ఆయుధమిది అంతర్జాతీయ స్థాయిలో మరో ఖగోళ పోరుకూ అక్కరకొస్తున్నదీ ఇదే! రసవత్తరంగా సాగనున్న ఈ స్పేస్ రేస్ విశేషాలు ఇవిగో.. {Vహాలను దాటి విశ్వపు లోతుల్ని కొలవాలన్న మనిషి ఆకాంక్షకు కొత్త ఊపిరులూదుతున్న కాలమిది. అమెరికా, సోవియట్ రష్యా ప్రచ్ఛన్న యుద్ధకాలంనాటి ఆధిపత్య పోరులో భాగంగా పుట్టుకొచ్చిన అంతరిక్ష ప్రయోగాలు.. ఇప్పుడు దేశాల సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యానికి, అంతర్జాతీయ వేదికలపై గౌరవానికి ప్రతీకలవుతున్నాయి. చిత్రమేమిటంటే.. నిన్నమొన్నటివరకూ ఈ పోరులో తలపండిన ఆటగాళ్లుగా పేరుపడ్డ అమెరికా, రష్యాలు కొంచెం వెనుకపడిపోగా భారత్, చైనాలాంటి కొత్త ఆటగాళ్లు గోదాలోకి దిగి అగ్రరాజ్యాలకు సవాల్ విసురుతుండటం! ఇక్కడ ఒక్క విషయం మాత్రం సుస్పష్టం. ఈ పోటీలో ఎవరు ఓడినా... చివరకు గెలిచేది మాత్రం మనిషే!! లేటుగానైనా, లేటెస్టుగా... అంతరిక్ష ప్రయోగాల విషయంలో భారత్, మన పొరుగుదేశం చైనాలది లేట్ ఎంట్రీనే. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గత ఏడాది నవంబర్ 5న అరుణగ్రహంపైకి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను విజయవంతంగా ప్రయోగించింది. దాదాపు 20 ఏళ్లుగా కొరకరాని కొయ్యలా మిగిలిన క్రయోజెనిక్ ఇంజిన్ టెక్నాలజీ మిస్టరీలను ఛేదించిన భారత్ అదే ఊపుతో జీఎస్ఎల్వీ ప్రయోగాన్ని సక్సెస్ చేసి అగ్రరాజ్యాల సరసన నిలిచింది. ఈ విజయమిచ్చిన ఉత్సాహంతో మరో మూడేళ్లలో చంద్రయాన్-2 ద్వారా చంద్రుడిపైకి లాండర్‌ను, రోవర్‌ను కూడా పంపించాలని ఇస్రో నిర్ణయించింది. అంతేకాదు... మరో మూడు నెలల్లో జీఎస్ఎల్వీ ద్వారానే ఇస్రో మరో బృహత్తర ప్రయత్నానికి పూనుకుంటోంది. మానవులను అంతరిక్షంలోకి పంపించేందుకు ఉద్దేశించిన మాడ్యూల్‌ను జీఎస్ఎల్వీ మార్క్-3 రాకెట్ ద్వారా ప్రయోగాత్మకంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ రెండు ప్రయోగాలు విజయవంతమైతే అంతరిక్ష పోరులో భారత్ ఎంత మాత్రం తీసిపోమన్న సందేశం అగ్రరాజ్యాలకు ఇచ్చినట్లవుతుంది. ఇక చైనా విషయాన్ని తీసుకుంటే... భారీ ప్రణాళికలకు పెట్టింది పేరైన ఈ దేశం అంతరిక్ష ప్రయోగాలనూ అదే పంథాలో కొనసాగుతోంది. మార్స్ ఆర్బిటర్ విఫలమైనప్పటికీ లూనార్ రోవర్ సక్సెస్‌తో మానవసహిత అంతరిక్ష ప్రయోగాలతో కొంచెం ముందంజలో నిలిచింది. మరోవైపు జపాన్ కూడా చంద్రుడితోపాటు గ్రహశకలాలపై దృష్టి పెట్టింది. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాది జపాన్ రెండోసారి ఓ చిన్ని గ్రహశకలాన్ని భూమ్మీదకు తీసుకురానుంది. అగ్రరాజ్యాలు ఎక్కడ? 2020కల్లా అంగారకుడిపైకి అమెరికన్ వ్యోమగామి అడుగుపెట్టాలి అన్నది మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఇచ్చిన పిలుపు. కానీ ఓడలు బళ్లు అవుతాయన్నట్టు.. ఆర్థికమాంద్యం నేపథ్యంలో అగ్రరాజ్యం అంతరిక్ష ప్రయోగాల వేగం తగ్గించింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నిర్మాణంతోపాటు, అనేక ఉపగ్రహ ప్రయోగాలకు ఉపయోగ పడ్డ స్పేస్ షటిళ్లలో కొన్ని ప్రమాదాలకు గురి కావడం, మరికొన్నింటి కాలపరిమితి తీరిపోవడం, అదే సమయంలో కొత్త షటిళ్ల రూపకల్పనకు బడ్జెట్ పరిమితులు రావడం అమెరికా దూకుడు తగ్గిందనేందుకు నిదర్శనాలు. మార్స్ రోవర్ క్యూరియాసిటీ అంగారకుడిపై నీటిజాడలను గుర్తించేందుకు ‘మౌంట్‌షార్ప్’ వైపు వెళ్తుంటే.. నాసా ఇటీవలే ఈ గ్రహంపైకి ‘మావెన్’ను ప్రయోగించింది. ‘స్పేస్ ఎక్స్’ ‘ఆర్బిటల్ సైన్స్ కార్పొరేషన్’ వంటి ప్రైవేట్ కంపెనీలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి విజయవంతంగా సరుకులు రవాణా చేస్తూండటం కూడా అమెరికా అంతరిక్ష ప్రయోగాల జోరుకు కళ్లెం వేస్తున్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ తనదైన శైలిలో పడుతూ లేస్తూ అంతరిక్ష ప్రయోగాలను ముందుకు తీసుకెళ్తోంది. రానున్న పదేళ్లలో అంగారకుడిపైకి రెండుసార్లు రోవర్లు పంపేందుకు, ఈ ఏడాది ఓ తోకచుక్కపైకి రాకెట్‌ను పంపేందుకు ప్రణాళికలు రచించుకుంది. సోవియట్ రష్యా విచ్ఛిన్నం తరువాత ఆర్థికంగా చితికిపోయిన రష్యా ఇటీవలి కాలంలో తిరిగి తన ముద్రను వేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అంతరిక్ష ప్రయోగాలకు బడ్జెట్ కేటాయింపులు మూడు రెట్లు ఎక్కువ చేయడం గమనార్హం. ఎందుకింత పోటీ? అంతరిక్ష ప్రయోగాల్లో ఇంతటి పోటీ నెలకొన డానికి కారణం ఏమిటి? దీన్ని మూడు కోణాల్లో చూడాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితినైనా తట్టుకునేందుకు ఆయా దేశాలు చేస్తున్న ప్రయత్నంగా చూడొచ్చు. అదే సమయంలో సాంకేతిక పరిజ్ఞాన సామర్థ్యాన్ని చాటిచెప్పడం ద్వారా వాణిజ్య ప్రయోజనాలు పొందడమూ ఒక లక్ష్యం. అంతరిక్ష పర్యాటకం మరో అంశం. ప్రైవేట్ కంపెనీల రంగ ప్రవేశంతో అంతరిక్ష ప్రయోగాల తీరుతెన్నులు మారిపోయాయి. బ్రిటిష్ పారిశ్రామిక వేత్త రిచర్డ్ బ్రాస్నన్.. ‘వర్జిన్ గెలాటిక్’ పేరుతో అంతరిక్ష పర్యాటకానికి తెరదీశారు. దీంతో అనేక ఇతర కంపెనీలూ ఇదే మార్గం పట్టాయి. ‘ప్లానెటరీ రిసోర్సెస్’ వంటి కంపెనీలు మాత్రం అంతరిక్ష ప్రయోగాలను ఫక్తు వాణిజ్య దృక్పథంతో చూస్తున్నాయి. భూమ్మీదకు లేదా దగ్గరగా వస్తున్న గ్రహ, ఉల్కా శకలాల మైనింగ్‌కు సిద్ధమవుతోంది ఈ కంపెనీ. కీలకమైన ప్లాటినమ్ లోహంతోపాటు అంతరిక్షంలోనే రాకెట్ ఇంధనాలు సేకరించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. కొటేషన్స్... ‘‘అంతరిక్ష రంగంలో భారత్ ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. అధిగమించాల్సిన సవాళ్లు ముందున్నాయి’’ - కె.రాధాక్రిష్ణన్, ఛైర్మన్, ఇస్రో ‘‘చైనా ఉపగ్రహా విధ్వంసక క్షిపణి ప్రయోగం (2007) భారత్ నిద్దుర వదిలించింది.’’ - రాజేశ్వరి పిళ్లై రాజగోపాలన్, సీనియర్ ఫెలో, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ‘‘భారత్ లాంటి దేశాలకు అంతరిక్ష ప్రయోగాలు లగ్జరీ కాదు.. అత్యవసరం’’ సుష్మితా మహంతి, సీఈవో ఎర్త్2ఆర్బిట్ (దేశంలో తొలి ప్రైవేట్ స్పేస్ కంపెనీ) ‘‘అంతరిక్ష పోరులో తామూ ఉన్నామని చెప్పేందుకు ఇదో దారి’’ - రసెల్ బాయ్సీ, ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సెన్సైస్