న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో ఆరు పీఎస్‌ఎల్‌వీ మిషన్లు, మూడు జీఎస్‌ఎల్‌వీ ప్రయోగాలు, ఒక లాంచ్ వెహికల్ మార్క్–3 వాణిజ్య ప్రయోగం ఉందని తెలియజేసింది.
ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇస్రో అభివృద్ధి చేసిన నూతన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్‌ఎస్‌ఎల్‌వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపించనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకొనేందుకు రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని ఇస్రో భావిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment