pslv
-
అంతరిక్షంలో జీవం ‘పురుడు’ పోసుకుంది!
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతరిక్షంలో అద్భుతాలతో ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న ఇస్రో మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో జీవసృష్టి చేసి చూపించింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా పీఎస్ఎల్వీ–సి60 ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్ (పోయెమ్–4) ద్వారా డిసెంబర్ 30న అంతరిక్షంలోకి పంపిన అలసంద విత్తనాలు కేవలం 4 రోజుల్లోనే మొలకెత్తాయి! కాంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటాల్ ప్లాంట్ స్టడీస్ (సీఆర్‌ఓపీఎస్) టెక్నాలజీ ద్వారా ఈ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో విత్తనాల అంకుర, మనుగడ ప్రక్రియను అధ్యయనానికి ఉద్దేశించిన ఆటోమేటెడ్ వ్యవస్థ అయిన సీఆర్‌ఓపీఎస్ పేలోడ్‌ను విక్రం సారాబాయ్ అంతరిక్ష కేంద్రం అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా ఎనిమిది అలసంద విత్తనాలను నియంత్రిత వాతావరణంతో కూడిన బాక్సులో ఉంచారు. వాటికి నిరంతరం కచ్చితత్వంతో కూడిన వెలుతురు అందేలా జాగ్రత్త తీసుకున్నారు. విత్తనాల్లో జరుగుతున్న మార్పుచేర్పులను అత్యంత హై రిజల్యూషన్‌తో కూడిన కెమెరా ఇమేజింగ్, ఉష్ణోగ్రత, సీఓటూ సాంద్రత, ఆర్ద్రత వంటివాటి తనిఖీ తదితరాల ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వచ్చారు. నాలుగు రోజుల్లోనే విత్తనాలు మొలకెత్తడంతో సైంటిస్టులు ఆనందోత్సాహాల్లో తేలిపోతున్నారు. ‘‘అంతరిక్షంలో జీవం పురుడు పోసుకుంది. ప్రయోగం విజయవంతమైంది. విత్తనాలు విజయవంతంగా మొలకెత్తాయి’’ అంటూ ఇస్రో హర్షం వెలిబుచి్చంది. ‘‘త్వరలో వాటికి ఆకులు కూడా రానున్నాయి. అంతరిక్ష అన్వేషణ యాత్రలో అదో కీలక మైలురాయిగా నిలవనుంది’’అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.స్పేడెక్స్ నుంచి పుడమి ఫొటోలు స్పేడెక్స్ జంట ఉపగ్రహాల్లో ఒకటైన చేజర్ భూమిని తొలిసారి ఫొటోలు, వీడియోలు తీసింది. దాన్ని ఇస్రో శనివారం విడుదల చేసింది. చేజర్ 470 కి.మీ. ఎత్తున దిగువ కక్ష్యలో పరిభ్రమిస్తూ తీసిన ఈ వీడియోలో భూమి అత్యంత అందంగా కని్పస్తోంది. ఉపగ్రహం తాలూకు అత్యంత అధునాతనమైన ఇమేజింగ్ సామర్థ్యంతో పాటు అత్యంత కీలకమైన తదుపరి దశ పరీక్షలకు దాని సన్నద్ధతకు ఈ వీడియో నిదర్శనమని ఇస్రో ఒక ప్రకటనలో పేర్కొంది. త్వరలో కీలక డాకింగ్ (ఉపగ్రహాల అనుసంధాన) పరీక్షకు చేజర్, టార్గెట్ శాటిలైట్లు సన్నద్ధమవుతున్నాయి. వీలైతే దాన్ని జనవరి 7న నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించడం తెలిసిందే. ఈ పరీక్ష విజయవంతమైతే డాకింగ్ పరిజ్ఞానమున్న అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ సగర్వంగా చేరుతుంది. గగన్‌యాన్ మొదలుకుని పలు భావి అంతరిక్ష పరీక్షలకు డాకింగ్ పరిజ్ఞానం కీలకం కానుంది. -
ఇస్రో పీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం. కక్ష్యలోకి స్పాడెక్స్ జంట ఉపగ్రహాలు. జనవరి 7న డాకింగ్ ప్రక్రియ
-
డాకింగ్ దిశగా... ఇస్రో తొలి అడుగు
సూళ్లూరుపేట: అంతరిక్షంలో ఉపగ్రహాల అనుసంధానం, విడదీత సామర్థ్యాన్ని సమకూర్చుకునే దిశగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వేసిన తొలి అడుగు విజయవంతమైంది. స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పేడెక్స్)లో భాగంగా ఛేజర్, టార్గెట్ జంట ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ–సీ60 రాకెట్ సోమవారం విజయవంతంగా నిర్ధారిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. దాంతో ప్రయోగంలో తొలి అంకం దిగి్వజయమైంది. అతి కీలక మైలురాయికి ఇస్రో కేవలం అడుగు దూరంలో నిలిచింది. రెండో దశలో జంట ఉపగ్రహాలను అంతరిక్షంలో అనుసంధానం (డాకింగ్) చేయడం స్పేడెక్స్ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియ జనవరి 7న జరగవచ్చని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. అది సఫలమైతే అమెరికా, చైనా, రష్యా తర్వాత అతి సంక్లిష్టమైన డాకింగ్ టెక్నాలజీ కలిగిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది. ఇస్రో నిర్వహించబోయే మానస సహిత గగన్‌యాన్, చంద్రయాన్–4 ప్రయోగాలతో పాటు భారతీయ స్పేస్ స్టేషన్ నిర్మాణం తదితరాల్లో ఈ టెక్నాలజీది కీలక పాత్ర కానుంది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఏపీ సీఎం మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వెలిబుచ్చారు. ఇలా జరిగింది... ప్రయోగం ముందు నిర్ణయించినట్టు సోమవారం రాత్రి 9.58కు బదులు 2 నిమిషాల ఆలస్యంగా పదింటికి జరిగింది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం రెండు ఉపగ్రహాలతో పీఎల్ఎల్వీ–సి60 తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లోని తొలి ప్రయోగవేదిక నుంచి నింగికెగిసింది. మామూలుగా 320 టన్నులుండే పీఎస్ఎల్వీ రాకెట్ స్ట్రాపాన్ బూస్టర్లు లేకపోవడంతో 229 టన్నులతోనే దూసుకెళ్లింది. 111.12 సెకన్లకు తొలి దశ, 262.06 సెకన్లకు రెండో దశ, 511.22 సెకన్లకు మూడో దశ, 792.48 సెకన్లకు నాలుగో దశ విజయవంతంగా పూర్తయ్యాయి. 15.15 నిమిషాలకు టార్గెట్, 15.20 నిమిషాలకు ఛేజర్ ఉపగ్రహాలను 470 కి.మీ. ఎత్తులో నూతన సెమీ మేజర్ యాక్సిస్ వృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీల వాలులో విజయవంతంగా ప్రవేశపెట్టారు. తర్వాత పీఎస్–4లో అమర్చిన పలు స్టార్టప్ కంపెనీలకు చెందిన 24 పేలోడ్లను కూడా కక్ష్యలోకి ప్రవేశపెట్టడంతో ప్రయోగం పూర్తయింది. 2024లో చివరిదైన ఈ ప్రతిష్టాత్మక ప్రయోగం విజయవంతం కావడంతో సైంటిస్టుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. షార్ కేంద్రం నుంచి ఇది 99 ప్రయోగం. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 62వది. వాటిలో 60 విజయాలే కావడం విశేషం! వారంలోనే పని మొదలు స్పేడెక్స్ ఉపగ్రహాలు వారంలోనే పని చేయడం ఫ్రారంభిస్తాయని ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్ చెప్పారు. సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయ సందర్శన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2025 మార్చిలోపు రెండు పీఎస్ఎల్వీ, ఒక జీఎస్ఎలీ్వ, రెండు ఎల్వీఎం3 రాకెట్ ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. గగన్‌యాన్ ప్రయోగమూ వీటిలో ఉంది’’ అని వివరించారు.స్పేడెక్స్ ఉపయోగాలెన్నో... స్పేడెక్స్ జంట ఉపగ్రహాలను ఇస్రో పూర్తిగా సొంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించింది. ఒక్కోదాని బరువు 220 కిలోలు. ఇవి రెండేళ్ల పాటు సేవలందిస్తాయి. వీటి అనుసంధానం సాంకేతికంగా అత్యంత సవాలుతో కూడింది. అత్యంత వేగంగా ప్రయాణించే రెండు ఉపగ్రహాలు వేగాన్ని నియంత్రించుకుంటూ క్రమంగా పరస్పరం చేరువవుతూ సున్నితంగా అనుసంధానం కావాలి. ఏమాత్రం తేడా వచ్చినా ఢీకొని పేలిపోతాయి. — అంతరిక్షంలో భారత స్పేస్ స్టేషన్ నిర్మాణానికి స్పేడెక్స్ ప్రయోగం తొలి అడుగు. — రోదసీలో వ్యోమనౌకల మధ్య వస్తు మారి్పడి తదితరాలకు డాకింగ్ టెక్నాలజీ వీలు కలి్పస్తుంది. — ఇస్రో చేపట్టే మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌కు ఎంతో దోహదపడుతుంది. — చంద్రయాన్–4 ద్వారా చంద్రుడి ఉపరితలంపై సేకరించిన నమూనాలను భూమికి తేవడాన్ని సులభతరం చేస్తుంది. ఇందుకోసం రెండు రాకెట్ల ద్వారా భిన్న మాడ్యూల్స్‌ను పంపి భూమి, చంద్రుడి కక్ష్యలో డాకింగ్ చేయనున్నారు. — కక్ష్యలో ఉపగ్రహాల మరమ్మతులు, వాటిలో ఇంధనం నింçపడం తదితరాలకు ఉపయోగపడుతుంది. — ఈ టెక్నాలజీ వల్ల ఉపగ్రహాల జీవితకాలమూ పెరుగుతుంది. — జంట ఉపగ్రహాల్లో అమర్చిన హై రిజల్యూషన్ కెమెరా మెరుగైన భూ పరిశీలనకు తోడ్పడుతుంది. — మినియేచర్ మల్టీ స్పెక్ట్రల్ పేలోడ్ మానవసహిత అంతరిక్ష యాత్రలకు తోడ్పడుతుంది. ISRO has successfully launched PSLV-C60 with SpaDeX and innovative payloads from Sriharikota, Andhra Pradesh 🚀A MASSIVE STEP IN SPACE EXPLORATION 🙌pic.twitter.com/vLdIIyOghN— The Khel India (@TheKhelIndia) December 30, 2024 -
నేడు పీఎస్ఎల్వీ సీ60కి కౌంట్‌డౌన్ ప్రారంభం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఆదివారం రాత్రి 8.58 గంటలకు శాస్త్రవేత్తలు కౌంట్‌డౌన్ ప్రారంభించనున్నారు. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం రాత్రి 9.58 గంటలకు పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇందుకోసం ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆదివారం రాత్రికి బెంగళూరు నుంచి షార్కు చేరుకోనున్నారు. ఆయన ఆధ్వర్యంలోనే కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 62వ ప్రయోగం కాగా.. పీఎస్ఎల్వీ కోర్ అలోన్ దశతో చేసే 18వ ప్రయోగమిది. పీఎస్ఎల్వీ విజయాలకు చిహ్నంగా మారిపోయింది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59 ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించారు. పీఎస్ఎల్వీ రాకెట్ 44.5 మీటర్లు ఎత్తు, 320 టన్నుల బరువు ఉంటుంది. కానీ పీఎస్ఎల్వీ 60కి స్ట్రాపాన్ బూస్టర్లు లేనందున 229 టన్నుల బరువే ఉంటుంది. కోర్ అలోన్ దశతోనే ఈ ప్రయోగాన్ని ప్రారంభిస్తారు. రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో ఘన ఇంధనం, నాలుగో దశలో ద్రవ ఇంధనంతో రాకెట్‌ను ప్రయోగిస్తారు. చంద్రయాన్–4కు ఉపయోగపడేలా.. ఇస్రో సొంత సాంకేతిక పరిజ్ఞానంతో స్పాడెక్స్ అనే జంట ఉపగ్రహాలను రూపొందించింది. వీటికి ఛేజర్, టార్గెట్ అని పేర్లు పెట్టింది. ఈ రెండు ఉపగ్రహాలు 440 కిలోల బరువు ఉంటాయి. ఇవి స్పేస్ డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్, మానవ అంతరిక్షయానం, తదితర సేవలకు ఉపయోగపడతాయని ఇస్రో తెలిపింది. భవిష్యత్తులో నిర్వహించే చంద్రయాన్–4లో భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన డాకింగ్ టెక్నాలజీని పరీక్షించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడతాయని పేర్కొంది. స్పాడెక్స్లో అమర్చిన జంట ఉపగ్రహాలు ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తాయి. -
రేపు రాత్రి పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న రాత్రి 9.58 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌కు 25 గంటలకు ముందు అంటే 29న రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 220 కిలోలు బరువు కలిగిన స్పాడెక్స్లో ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను భూమికి 470 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీలు వంపులో ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు సమాంతర కక్ష్యలోకి వెళ్లిన తరువాత ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తూ సేవలను అందిస్తాయి. అయితే ఉపగ్రహం బరువు మొత్తం 400కేజీలు అయినప్పటికీ ఇందులో రెండు ఉపగ్రహాల బరువు 220 కిలోలు మాత్రమే. మిగిలిన 180 కిలోలు ఉపగ్రహాల్లో ఇంధనం ఉంటుంది. అయితే ప్రస్తుతం రాకెట్‌కు అన్ని దశలను పూర్తిచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తరువాత ఎంఆర్ఆర్ సమావేశం, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
ISRO: ప్రోబా-3 మిషన్ సక్సెస్
-
పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగం సక్సెస్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ–సీ59 రాకెట్ ప్రయోగం విజయంతమైంది. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్–షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి గురువారం సాయంత్రం 4.04 గంటలకు రాకెట్‌ను ప్రయోగించారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన 550 కిలోల బరువైన ప్రాజెక్ట్ ఫర్ ఆన్‌బోర్డు అటానమీ(ప్రోబా)–3 మిషన్‌ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చారు. ఇందులో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి. భూమి దూరంగా 60,530 వేల కిలోమీటర్లు, దగ్గరగా 600 కిలోమీటర్ల ఎత్తులోని జియో ఎలిప్టికల్ ఆర్బిట్‌లోకి ప్రోబా–3 చేరుకుంది. వాస్తవానికి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు చేపట్టాల్సిన ఈ ప్రయోగాన్ని 25.30 గంటల ముందు.. అంటే మంగళవారం మధ్యాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. బుధవారం ప్రయోగం నిర్వహించబోయే 48 నిమిషాలకు ముందు ప్రోబా–3 నుంచి సిగ్నల్స్ అందలేదు. సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. ఉపగ్రహంలో ఏర్పడిన సాంకేతిక లోపాన్ని యూరోపియన్ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు కలిసి సరిచేశారు. 24 గంటల్లోపే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించి ప్రశంసలందుకున్నారు. గురువారం ఉదయం 8.04 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. 8 గంటల అనంతరం సాయంత్రం 4.04 గంటలకు రాకెట్ నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ దూసుకెళ్లింది. సరిగ్గా 18.39 నిమిషాలకు ప్రోబా–3ని కక్ష్యలోకి విడిచిపెట్టింది. షార్ నుంచి ఇది 95వ ప్రయోగం కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 61వ ప్రయోగం. సూర్యుడిపై పరిశోధనల కోసమే యూరోపియన్ స్పేస్ ఏజెన్నీ రూపొందించిన 550 కిలోల బరువైన ప్రోబా–3లో రెండు వేర్వేరు ఉపగ్రహాలను అమర్చి పంపారు. సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించిన విషయం తెలిసిందే. యూరోపియన్ స్పేస్ ఏజెన్నీ వారు ఈ తరహా పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ప్రోబా–3 కూడా ఆదిత్య ఎల్1 ఉపగ్రహంతో అనుసంధానమై పని చేస్తుంది. ఇందులో కరోనాగ్రాఫ్ స్పేస్‌క్రాఫ్ట్, ఆకల్టర్ అనే మరో స్పేస్‌క్రాఫ్ట్‌లను అమర్చి పంపించారు. సూర్యుడి బాహ్య వాతావరణమైన కరోనా వలయంలో పరిశోధనలు చేయడం వీటి ముఖ్య ఉద్దేశం. ప్రోబా–3లో అమర్చిన రెండు ఉపగ్రహాలు పరస్పరం సమన్వయంతో ఒక క్రమ పద్ధతిలో భూకక్ష్యలో పరిభ్రమిస్తూ పని చేస్తాయి. ఈ తరహా ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే ఇదే మొదటిసారి. ప్రోబా–3 నుంచి ఆ్రస్టేలియాలోని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ శాటిలైట్ స్టేషన్‌కు సంకేతాలు అందడం మొదలైనట్లు సైంటిస్టులు తెలిపారు. రాకెట్ ప్రయాణమిలా... → 44.5 మీటర్లు ఎత్తు కలిగిన పీఎస్ఎల్వీ–సీ59 రాకెట్ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో నింగి వైపునకు దూసుకెళ్లింది. ళీ మొదటిదశ అయిన కోర్ అలోన్ దశలో 139 టన్నుల ఘన ఇంధనం, దీనికి చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు, ఒక్కో స్ట్రాపాన్ బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం, ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో కలిపి 73.5 టన్నుల ఇంధనం, మొదటిదశలో మొత్తం కలిపి 212.5 టన్నుల ఘన ఇంధనాన్ని వినియోగించి 109 సెకండ్లకు పూర్తి చేశారు. → 41 టన్నుల ద్రవ ఇంధనం సాయంతో 262 సెకండ్లలో రెండోదశ పూర్తయ్యింది.→ 7.65 టన్నుల ఘన ఇంధనంతో 489 సెకండ్లకు మూడో దశ ముగిసింది. → 2.5 టన్నుల ద్రవ ఇంధనంతో 1,015 సెకండ్లకు నాలుగో దశను కటాఫ్ చేశారు. ప్రోబా–3 మిషన్‌ను ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 👏 Celebrating Success!The PSLV-C59/PROBA-3 Mission reflects the dedication of NSIL, ISRO and ESA teams. This achievement highlights India’s critical role in enabling global space innovation.🌍 Together, we continue building bridges in international space collaboration! 🚀✨…— ISRO (@isro) December 5, 2024 -
ప్రోబా-3 రెడీ.. పీఎస్ఎల్వీ సీ-59 కౌంట్‌డౌన్ ప్రారంభం
సాక్షి, తిరుపతి జిల్లా: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో అంతర్భాగమైన న్యూస్పెస్ ఇండియా వాణిజ్యపరంగా యూరోపియన్ స్పెస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా–3 ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. పీఎస్ఎల్వీ సీ-59కి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.సతీష్‌ధవన్ స్పెస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తిచేశారు. సోమవారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించారు. అనంతరం లాంచ్ అథరైజేషన్ బోర్డు సమావేశమై ప్రయోగ సమయాన్ని ప్రకటించారు. ప్రయోగానికి 25.30 గంటల ముందు.. అంటే మంగళవారం మధాహ్నం 2.38 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. బుధవారం సాయంత్రం 4.08 గంటలకు పీఎస్ఎల్వీ–సీ59 ప్రయోగం నిర్వహిస్తారు. -
PROBA-3: అభినవ రాహు కేతువులు!
సూర్యగ్రహణం వేళ భానుడిని రాహువు అమాంతం మింగేస్తాడని, చంద్రగ్రహణం కాలంలో నెలరేడును కేతువు కబళిస్తాడని జ్యోతిషం చెబుతుంది. కానీ సూర్యుడికి, భూమికి నడుమ చంద్రుడు అడ్డొస్తే సూర్యగ్రహణం; సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డొస్తే చంద్రగ్రహణం ఏర్పడతాయని సైన్స్ వివరిస్తుంది. తాజాగా శాస్త్రవేత్తలు మాత్రం కృత్రిమ రాహు కేతువుల సాయంతో కావాల్సినప్పుడల్లా సంపూర్ణ సూర్యగ్రహణాలు సృష్టించే పనిలో పడ్డారు. ఎవరా రాహుకేతువులు అనుకుంటున్నారా? యూరోపియన్ అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) త్వరలో ప్రయోగించనున్న జంట ఉపగ్రహాలు! ఈ స్పేస్ మిషన్ పేరు ‘ప్రాజెక్ట్ ఫర్ ఆన్–బోర్డ్ అటానమీ–3 (ప్రోబా–3). ఇందులో రెండు ఉపగ్రహాలుంటాయి. ఇవి కక్ష్యలో పరస్పరం అతి దగ్గరగా మోహరిస్తాయి. మొదటి ఉపగ్రహం సూర్యుడిని పూర్తిగా అడ్డుకుంటుంది. తద్వారా రెండో ఉపగ్రహం నుంచి సూర్యుడు కనబడకుండా చేస్తుంది. అలా కొన్ని గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణాలను ఏర్పరచడం ఈ స్పేస్ మిషన్ లక్ష్యం. రెండు ఉపగ్రహాలు... ఒకటిగా! ‘ప్రోబా–3’ రెండేళ్లు పనిచేసే జంట శాటిలైట్ల వ్యవస్థ. ఇది అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న మిషన్ అని యూనివర్సిటీ కాలేజీ లండన్ సౌర భౌతిక శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో డీగో తెలిపారు. మిషన్ ప్రణాళికకు పదేళ్లకు పైగా వ్యవధి పట్టిందన్నారు. భూమి చుట్టూ కక్ష్యలో పరిభ్రమించేటప్పుడు ప్రోబా–3లోని జంట ఉపగ్రహాలు ఒకదానికొకటి కేవలం 144 మీటర్లు ఎడంగా ఉంటాయి. మిల్లీమీటరు కూడా తేడా రానంత కచి్చతత్వంతో వాటిని అతి దగ్గరగా లాక్ చేసేందుకు కాంప్లెక్స్ సెన్సర్ల శ్రేణిని అభివృద్ధి చేశారు. ఇవి రెండూ వేర్వేరు ఉపగ్రహాలైనా 144 మీటర్ల పొడవుండే ఒకే అబ్జర్వేటరీలా పనిచేయడం ఈ ప్రయోగంలోని విశేషం. ఇందులో సౌరగోళాకృతితో సూర్యకాంతిని అడ్డుకునే 200 కిలోల బరువైన ‘అకల్టర్’ ఉపగ్రహం, కరోనాపై అధ్యయనం చేసే 340 కిలోల బరువైన ‘కరోనాగ్రాఫ్’ ఉపగ్రహం ఉంటాయి. అవి రెండూ భూమి చుట్టూ అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో సరైన ప్రదేశంలోకి వచి్చనప్పుడు అకల్టర్ తన ముందు భాగంలో 1.4 మీటర్ల వ్యాసంలో ఉండే ఓ గోళం లాంటి పరికరాన్ని ఆవిష్కరిస్తుంది. కరోనాగ్రాఫ్ నుంచి చూసినప్పుడు సూర్యుడు కనిపించకుండా ఆ పరికరం సూర్యున్ని పూర్తిగా కప్పేస్తుంది. అంటే కరోనాగ్రాఫ్లోని టెలిస్కోప్ మీద సూర్యకాంతి నేరుగా పడదు. అలా రోజులో ఆరు గంటలపాటు కృత్రిమ సూర్యగ్రహణం ఆవిష్కృతమవుతుంది. అప్పుడు అకల్టర్ ఛాయలో సూర్యుడి కరోనాను కరోనాగ్రాఫ్ నిశితంగా పరిశీలిస్తుంది. ఈ విశేషాలతో బ్రిటన్ పత్రిక ‘ది అబ్జర్వర్’ తాజాగా ఓ కథనం ప్రచురించింది. ఎందుకీ ప్రయోగం? సంపూర్ణ సూర్యగ్రహణాలు భూమిపై సగటున రెండేళ్లకోసారి మాత్రమే వస్తాయి. వాటి అధ్యయనానికి పరిశోధకులు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ‘‘అంత కష్టపడినా వాతావరణం అనుకూలించకుంటే ప్రయత్నాలన్నీ వృథాయే. అనుకూలించినా కొద్ది నిమిషాలు మాత్రమే సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అధ్యయనం చేసే అవకాశం లభిస్తుంది. కూలంకషమైన పరిశోధనలకు అది చాలదు. సూర్యగ్రహణాలను అనుకరించేలా టెలిస్కోపులకు కరోనాగ్రాఫ్స్ అమర్చి సౌర కరోనాను అధ్యయనం చేస్తుంటారు. కానీ అంతర కరోనాను అవి క్షుణ్నంగా అధ్యయనం చేయలేవు’’ అని ‘ప్రోబా–3’ ప్రాజెక్టు మేనేజర్ డేమియన్ గలీనో వివరించారు. సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత 6 వేల డిగ్రీల సెల్సియస్ కాగా బాహ్య పొర అయిన కరోనా ఉష్ణోగ్రత పది లక్షల డిగ్రీల దాకా ఉంటుంది. ‘‘సూర్యుడి నుంచి దూరంగా వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత తగ్గాలి. కానీ కరోనా విషయంలో అలా జరగదు. దీనికి కారణాలు తెలుసుకోవడానికి అంతర కరోనాను దీర్ఘకాలం సవివరంగా పరిశోధిస్తాం’’ అని ‘ప్రోబా–3’ కరోనా ప్రయోగ ప్రధాన పరిశోధకుడు ఆండ్రూ జుకోవ్ తెలిపారు. కొన్ని గంటలపాటు సూర్యగ్రహణాలను సృష్టించడం ద్వారా శాస్త్రవేత్తలు ఈ మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన డేటాను ఇది అందిస్తుందని చెప్పారు.ఉపయోగాలేమిటి? → సూర్యుడిని లోతుగా అధ్యయనం చేయడానికి ప్రోబా–3 ప్రయోగం ఎంతగానో దోహదపడుతుందని పరిశోధకులు అంటున్నారు. → విద్యుత్ లైన్లు, గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ ఉపగ్రహాలు, ఇతరత్రా భూ సంబంధ టెక్నాలజీకి సూర్యు డు కలిగించే సమస్యలు, అంతరాయాలపై అవగాహన పెంచడానికి ఉపకరిస్తుందని భావిస్తున్నారు. → గురుత్వ తరంగాలు, కృష్ణబిలాలు, సౌరకుటుంబం వెలుపలి నక్షత్ర వ్యవస్థల్లో గ్రహాలకు సంబంధించి భవిష్యత్తులో చేపట్టే అధ్యయనాలకు ప్రోబా–3 మిషన్ మార్గదర్శి కాగలదని ఈఎస్ఏ శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. → కరోనల్ మాస్ ఎజెక్షన్ (సీఎంఈ) ప్రక్రియలో సూర్యుడు అంతరిక్షంలోకి భారీగా ప్లాస్మాను వెదజల్లుతాడు. ఆ విద్యుదావేశిత కణాలతో కూడిన ప్లాస్మా భూ ఎగువ వాతావరణాన్ని ఢీకొని ధ్రువకాంతులైన అరోరాలను సృష్టించడంతో పాటు భూమిపై విద్యుత్ ప్రసారాలకు అవాంతరాలు కలిగిస్తుంది. వీటిపై ప్రోబా–3 అవగాహనను పెంచుతుందని, అది పంపే ఫలితాలు సౌర భౌతికశా్రస్తాన్ని సమూలంగా మార్చేస్తాయని భావిస్తున్నారు. త్వరలో శ్రీహరికోట నుంచి ప్రయోగం! ‘ప్రోబా–3 జంట శాటిలైట్ల ప్రయోగం త్వరలో శ్రీహరికోటలోని షార్ వేదిక నుంచి జరగనుంది. పీఎస్ఎల్వీ (ఎక్స్ఎల్) వెర్షన్ రాకెట్ సాయంతో ఇస్రో ఈ ప్రయోగం చేపట్టనుంది. ప్రతి 19.7 గంటలకోసారి భూమి చుట్టూ పరిభ్రమించే ఈ ఉపగ్రహాలను భూమికి 600 గీ 60,530 కిలోమీటర్ల అతి దీర్ఘవృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. యూరోపియన్ అంతరిక్ష సంస్థకు చెందిన ‘వేగా–సి’ రాకెట్‌కు అంత సామర్థ్యం లేకపోవడం, ఏరియన్–6 రాకెట్ ఖర్చు ఎక్కువగా ఉండటంతో ప్రయోగానికి ఇస్రోను ఈఎస్ఏ ఎంచుకుంది. ప్రయోగ తేదీలను ఖరారు చేయాల్సి ఉంది. – జమ్ముల శ్రీకాంత్ -
ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్: ఇస్రో
బెంగళూరు/హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్షంలో ఉపగ్రహాలు తదితరాలకు నిరంతర ఇంధన సరఫరాలో కీలకం కాగల ప్యూయల్ సెల్ పనితీరును విజయవంతంగా పరీక్షించినట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పేర్కొంది. ‘‘జనవరి 1న పీఎస్ఎల్వీ–సి58 ద్వారా భూ దిగవ కక్ష్యలోకి చేర్చిన ఫ్యూయల్ సెల్ ఆధారిత ఇంధన వ్యవస్థ (ఎఫ్‌సీపీఎస్)లోని పాలీమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ పరీక్ష విజయవంతమైంది. దీనిద్వారా కొద్ది సమయం పాటు 180 వాట్ల విద్యుదుత్పత్తి జరిగింది’’ అని శుక్రవారం తెలిపింది. సంప్రదాయ బ్యాటరీ సెల్స్‌తో పోలిస్తే ఈ ఫ్యూయల్ సెల్స్‌కు చాలా తక్కువ ఖర్చవుతుంది. పైగా ఇవి అధిక సామర్థ్యంతో పని చేస్తాయి. పూర్తిగా పర్యావరణహితం కూడా. వీటిని అంతరిక్షంతో పాటు భూమిపై కూడా పలురకాలుగా వాడుకోవచ్చు’’అని వివరించింది. భావి అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన డిజైన్లపై అవగాహనకు వచ్చేందుకు తాజా పరీక్ష దోహదపడుతుందని చెప్పింది. కృష్ణబిలాలపై పరిశోధనల నిమిత్తం జనవరి 1న ప్రయోగించిన ఎక్స్‌పోశాట్ బాగా పని చేస్తోందని ఇస్రోర చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. -
Isro: ఫ్యూయెల్ సెల్ టెస్ట్ సక్సెస్
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ కొత్త(ఇస్రో) ఏడాదిలోనూ దూసుకుపోతోంది. కొత్త సంవత్సరం తొలిరోజున పీఎస్ఎల్వీ-సీ58తోపాటు గగనతలంలోకి పంపిన ఫ్యుయల్ సెల్‌ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. అంతరిక్షంలో దాని పని తీరుకు సంబంధించిన డేటాను సేకరించింది. ఈ డేటాతో ఫ్యుయెల్ సెల్ పనితీరును పూర్తిస్థాయిలో విశ్లేషించనుంది. ఈ విషయాన్ని ఇస్రో శుక్రవారం ‘ఎక్స్’లో ప్రకటించింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రాల్లో వాడే విద్యుత్ ఉత్పత్తి కోసం ఇస్రో ఫ్యుయెల్ సెల్‌ను రూపొందించింది. వంద వాట్ల క్లాస్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ ఫ్యుయెల్‌సెల్‌ను విజయవంతంగా పరీక్షించి విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు ఇస్రో తెలిపింది. ఈ రసాయన చర్యలో ఫ్యుయెల్ సెల్ కేవలం నీటిని మాత్రమే బై ప్రోడక్ట్‌గా విడుదల చేసింది. ఇదే లాంచ్ వెహికిల్లలో ఇస్రో ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహం ఎక్స్‌పోశాట్‌ను కూడా నింగిలోకి తీసుకెళ్లింది. దీంతో పాటు మరో 10 పరికరాలను కూడా నింగిలోకి మోసుకెళ్లింది. అంతరిక్షంలో వెలువడే ఎక్స్-రే కిరణాల మూలాలపై పరిశోధించేందుకు ఎక్స్‌పోశాట్‌ను ఇస్రో నింగిలోకి పంపింది. నాసా తర్వాత అంతరిక్షంలో వెలువడే ఎక్స్‌రే కిరణాలపై పరిశోధన చేస్తున్నది ఇస్రోనే కావడం విశేషం. ఎక్స్‌రే కిరణాల మీద పరిశోధనకుగాను అమెరికా 2021లో ఐఎక్స్‌పీఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపింది. POEM-3 on PSLV-C58: VSSC/ISRO successfully tests a 100 W class Polymer Electrolyte Membrane Fuel Cell on PSLV-C58's orbital platform, POEM3.https://t.co/f5SGqh1ZUR Powering missions with efficiency and emitting only water, these fuel cells are the future for power production in… pic.twitter.com/lCbsZF9UIB — ISRO (@isro) January 5, 2024 ఇదీచదవండి..15 మంది భారతీయులున్న షిప్ హైజాక్.. రంగంలోకి ‘ఐఎన్ఎస్ చెన్నై’ -
గగనాంతర గవేషణ
కొత్త ఏడాది మొదలవుతూనే భారత్ మరో మైలురాయికి చేరుకుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు చెందిన అంతరిక్ష ప్రయోగవాహక నౌక పీఎస్ఎల్వీ–సీ58 సోమవారం విజయవంతంగా నింగిలోకి దూసుకుపోవడంతో రోదసీ శోధనలో మన దేశం మరో ముందడుగు వేసింది. ‘ఎక్స్–రే పోలారిమీటర్ శాటిలైట్’ (ఎక్స్పో శాట్)నూ, మరో 10 ఇతర ఉపగ్రహాలనూ మోసుకుంటూ నింగిలోకి సాగిన ఈ ప్రయోగం అనేక విధాల ప్రత్యేకమైనది. ఖగోళంలోని కృష్ణబిలాలను (బ్లాక్ హోల్స్) అధ్యయనం చేసి, కొత్త అంశాల్ని వెలికితీసేందుకు ‘ఎక్స్‌పోశాట్’ ఉపకరిస్తుంది. ఈ తరహా శాస్త్రీయ శోధనకే పూర్తిగా అంకితమైన ఉపగ్రహాన్ని ఇస్రో పంపడం ఇదే తొలిసారి. దీంతో, అమెరికా తర్వాత రోదసిలోని ఇలాంటి దృగ్విషయాలపై ప్రయోగాలు జరుపుతున్న రెండో దేశమనే ఖ్యాతి భారత్‌కు దక్కింది. ఇక, వివిధ ప్రైవేట్ సంస్థల, విద్యార్థుల, ఇస్రో కేంద్రాలకు చెందిన మిగతా ఉపగ్రహాలు మన శాస్త్రవేత్తల, ప్రైవేట్ రంగ ఆలోచనలనూ, ఆకాంక్షలనూ ప్రతిబింబిస్తున్నాయి. గత ఏడాది చరిత్రాత్మక చంద్రయాన్3 మిషన్‌తో మనం చంద్రునిపై జెండా పాతాం. చంద్ర యాన్3 విజయం తర్వాత గత అయిదు నెలల్లో ఇస్రో విజయవంతం చేసిన రెండు మిషన్లూ శాస్త్రీయ స్వభావమున్నవే కావడం గమనార్హం. సూర్యుడి అధ్యయనానికి ముందుగా ఆదిత్య ఎల్1ను నింగిలోకి పంపింది. తాజాగా ఖగోళ–భౌతిక శాస్త్ర ఘటనలో భాగంగా వెలువడే ధ్రువీకృత ఎక్స్‌రేల అధ్యయనానికి ఈ ‘ఎక్స్పో శాట్’ను తెచ్చింది. ‘ఆదిత్య ఎల్1’ లాగా ‘ఎక్స్పో శాట్’ సైతం పూర్తిగా అంతరిక్ష పరిశోధన–ప్రయోగశాలే. ఇది రెండు పేలోడ్లను నింగిలోకి మోసుకుపోయింది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించిన ‘పోలిక్స్’ పేలోడ్ రాగల అయిదేళ్ళలో దాదాపు 50 మూలాల నుంచి వచ్చే ఉద్గారాలను పరిశీలిస్తుంది. 8 నుంచి 30 కిలో ఎలక్ట్రాన్ ఓల్ట్ (కేఈవీ) శక్తి పరిధిలోని ఎక్స్‌రేల గమనాన్ని గమనిస్తుంది. ఇక, ఇస్రోకు చెందిన యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ రూపొందించిన ‘ఎక్స్పెక్ట్’ అనే రెండో పేలోడ్ 0.8 నుంచి 15 కేఈవీల శక్తి గల ఎక్స్‌రేలను పరిశీలిస్తుంది. నిరంతర ఎక్స్‌రే ఉద్గారాల్లోని మార్పులను అధ్యయనం చేస్తుంది. వెరసి రెండు పేలోడ్లూ ప్రబల మైన ఎక్స్రేస్కు ఉత్పత్తిస్థానాలైన కృష్ణబిలాలు, పల్సర్ల విషయంలో కొత్త అంశాల్ని వెలికి తీస్తాయి. గగనాంతర సీమలో మన తాజా గవేషణ... అమెరికా, చైనా, రష్యాలదే ఆధిపత్యమైన అంతరిక్ష యాన రంగంలో భారత్ స్థానాన్ని సుస్థిరం చేస్తుంది. 2021 డిసెంబర్లోనే అమెరికా ‘నాసా’ చేసిన ఈ తరహా ఐఎక్స్‌పీఈ మిషన్‌కు ఏకంగా 188 మిలియన్ డాలర్లయితే, మన తాజా ఎక్స్పో శాట్ కేవలం 30 మిలియన్ డాలర్ల (రూ. 250 కోట్ల)కే సిద్ధమవడం విశేషం. అమెరికా ఉపగ్రహ జీవిత కాలం రెండేళ్ళే. మనది అయిదేళ్ళు. ఇలా అగ్రరాజ్యంతో పోలిస్తే అతి తక్కువ బడ్జెట్లో మరింత సమర్థమైన రాకెట్లు, ఉపగ్రహాలు రూపొందించి మన ‘ఇస్రో’ మరోసారి సత్తా చాటింది. మిగతా దేశాల్ని ఆశ్చర్యపరిచింది. నిజానికి ఎక్స్కిరణాల ధ్రువీభవనాన్ని కొలిచేందుకు సాగుతున్న ప్రయత్నాలు తక్కువ. ‘నాసా’ చేస్తున్నవీ బెలూన్ ఆధారిత, స్వల్పకాలిక ప్రయోగాలే. 2015 సెప్టెంబర్‌లో మనం ప్రయోగించిన ఆస్ట్రోశాట్ ద్వారానే భారతీయ ఖగోళ శాస్త్రజ్ఞులు గతంలో ఎక్స్‌రే ఉత్పత్తి స్థానాల బ్రాడ్‌బ్యాండ్ వర్ణపటమాపనం చేస్తూ వచ్చారు. అతి సున్నితమైన, కచ్చితమైన ఉపకరణాలు అవసరం గనక ఎక్స్‌రేల ధ్రువీభవనాన్ని కొలిచే ప్రయత్నాలెప్పుడూ పెను సవాలే. ఇస్రో చేసిన ఎక్స్పో శాట్ ప్రయోగం ఆ సవాలుకు సరైన జవాబవుతుందని ఆశంస. ఇలాంటి అనేక సవాళ్ళను ఇస్రో భుజానికెత్తుకుంది. పలు అంతరిక్ష ప్రయోగాలు, మిషన్లతో ఈ ఏడాది పొడుగూతా ఇస్రో క్యాలెండర్ నిండిపోయి ఉంది. సగటున నెలకు కనీసం ఒక అంతరిక్ష ప్రయోగమో, ప్రయత్నమో చేయనుంది. ఈ జోరు ఇలాగే సాగితే, ఈ జోరులో ఇస్రో ఈ ఏడాది జరిపే ప్రయోగాల సంఖ్య డజను దాటేసినా ఆశ్చర్యం లేదు. వాణిజ్య విభాగమైన ‘న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్’ (ఎన్ఎస్ఐఎల్) కోసం రెండు పీఎస్ఎల్వీ వాణిజ్య మిషన్లను సైతం ఇదే ఏడాది ఇస్రో చేపడుతోంది. అలాగే, నిరుడు చేసిన పునర్వినియోగ ప్రయోగవాహక నౌక ప్రయోగాన్ని మరింత కఠోర పరిస్థితుల మధ్య విజయవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొన్నేళ్ళ క్రితం హైడ్రోజన్‌ను ఇంధనంగా చేసుకొని శ్క్రామ్జెట్ ప్రయోగాత్మక పరీక్ష చేసిన ఇస్రో ఈసారి కిరోసిన్ వాడి, పరీక్షించనుంది. అలాగే, నిరుడు సెప్టెంబర్ 2న ఆరంభమైన భారత తొలి సౌరయాత్ర ‘ఆదిత్య ఎల్1’ సైతం తుది విన్యాసం అనంతరం ఈ జనవరి 6 నాటికి లక్షిత ఎల్1 గమ్యానికి చేరుకోనుంది. మొత్తం మీద ఈ కొత్త ఏడాది అంతా ఇస్రో తీరిక లేకుండా ప్రయోగాలు చేయనుంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ మాటల్లో చెప్పాలంటే ఈ 2024 ‘గగన్‌యాన్’ సన్నాహక సంవత్సరం. అంతేకాదు... తాజా రోదసీ ప్రయోగంలో భాగంగా నింగిలోకి పంపిన ఇతర ఉపగ్రహాలలో ‘ఉయ్ శాట్’ పూర్తిగా కేరళలోని మహిళలే తీర్చిదిద్దినది కావడం విశేషం. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళల ముందంజకు అది ఓ ప్రతీక. ఇతర ప్రైవేట్ ఉపగ్రహాల వ్యవహారం అంతరిక్ష రంగంలో వస్తున్న సంస్కరణల్ని ప్రతిఫలిస్తోంది. ఈ ఆవిష్కరణలు, అతి తక్కువ ఖర్చు ప్రయోగాలు ప్రైవేట్ రంగానికి రోదసి తలుపుల్ని బార్లా తీస్తున్న భారత్‌కు కలిసొచ్చే అంశం. ఇప్పటికే దేశంలోని అంకుర సంస్థలు విదేశీ సంస్థలతో జత కలిసి ఉపగ్రహ నిర్మాణ వ్యాపారంలో దూసుకొస్తున్నాయి. ఖగోళ శోధనలో పురోగతికీ, ఉపగ్రహ నిర్మాణ సాధనలో భారత్ కేంద్రంగా మారడానికీ ఇవన్నీ శుభ శకునాలే! నూతన సంవత్సరం తొలి రోజున సాగిన విజయవంతమైన ప్రయోగం అందులో ఒకటి. -
నింగిలోకి ఎక్స్‌పోశాట్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని దిగ్విజయంగా ఆరంభించింది. సోమవారం చేపట్టిన పీఎస్‌ఎల్‌ఎవీ సీ58 60వ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ రాకెట్ తొలుత కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించిన ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం వియ్శాట్నూ రోదసిలోకి ప్రవేశపెట్టింది. అనంతరం చివరిదైన నాలుగో దశలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు మొత్తం పది పరికరాలను దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత్ నిర్మించబోయే సొంత అంతరిక్ష కేంద్రానికి ఇంధన లభ్యత కోణంలో ఎఫ్‌సీపీఎస్ ఎంతో కీలకం కానుంది. ప్రయోగం దిగి్వజయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. 2024కు అద్భుత ఆరంభాన్నిచి్చనందుకు శాస్త్రవేత్తలకు అభినందనలన్నారు. నిప్పులు చిమ్ముతూ... సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగం జరిగింది. ఆదివారం మొదలైన 25 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే సోమవారం ఉదయం 9.10 గంటలకు ముగిసింది. ఆ వెంటనే 44.4 మీటర్లు పొడవున్న పీఎస్ఎల్వీ రాకెట్ 260 టన్నుల బరువుతో మంచు తెరలను చీల్చుకుంటూ, నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం ప్రయోగం నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తయింది. ముందుగా ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని భూమికి 650 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అనంతరం కిలో బరువున్న వియ్‌శాట్‌ను కూడా కక్ష్యలోకి నిర్దేశిత సమయంలో ప్రవేశపెట్టారు. ఏడాది తొలి రోజే చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకున్నారు. ఇస్రో ప్రయోగాల పరంపరకు శ్రీకారం చుట్టి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తయ్యాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లోనూ ఇది 60వ ప్రయోగం కావడం విశేషం! మొత్తమ్మీద షార్ నుంచి ఇది 92వ ప్రయోగం. ఫ్యూయల్ సెల్ ప్రయోగం... ఎక్స్‌పోశాట్, వియ్శాట్లను నిరీ్ణత కక్ష్యలోకి ప్రవేశపెట్టాక ప్రయోగ చివరి దశలో పీఎస్ఎల్వీ వ్యోమ నౌకను రెండుసార్లు మండించి దాని ఎత్తును 650 కి.మీ. నుంచి 350 కి.మీకి తగ్గించారు. 10 కీలక పరికరాలను ఆ భూ దిగువ కక్ష్యలోకి విజయవతంగా చేర్చారు. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు బెలిఫ్శాట్, గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్ బెలాట్రిక్స్ వంటివి వీటిలో ఉన్నాయి. పీఎస్‌ఎలవీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్–3 (పోయెం) ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టారు. 2023 ఏప్రిల్‌లో పీఎస్ఎల్వీ–సీ55 ప్రయోగం సందర్భంగా కూడా పోయెం–2 ద్వారా ఇలాంటి ప్రయోగాన్నే ఇస్రో చేపట్టింది. ► ఇస్రో నిర్మించనున్న భారత అంతరిక్ష కేంద్రానికి ఎఫ్‌సీపీఎస్ కీలకం కానుంది. ► రోదసిలో సుస్థిర శక్తి వనరును సమకూర్చుకోవడం దీని లక్ష్యం. ► ఇందులోని టెక్నాలజీ ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ సాయంతో రసాయన శక్తిని నేరుగా విద్యుచ్ఛక్తిగా మారుస్తుంది. ► తద్వారా మన అంతరిక్ష కేంద్రానికి కావాల్సిన ఇంధనాన్ని ఇది సుదీర్ఘ కాలం పాటు అందించగలదు. ఎక్స్‌పోశాట్‌తో ఉపయోగాలివీ... ► ఉపగ్రహం బరువు 469 కిలోలు. ► ఇది ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది. ► గతంలో ప్రయోగించిన ఆస్ట్రోశాట్‌తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టనుంది. ► ఇవి రెండూ విశ్వంతారాల్లో పరిణామాలపై, ముఖ్యంగా కృష్ణ బిలాలపై పరిశోధనలు చేస్తాయి. ► ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పేలోడ్ పోలిక్స్ (ఎక్స్–పోలారిమీటర్ పరికరం)ను 8.3 కిలోవాట్ల ఫోటాన్ల మధ్య వ్యవస్థ ఎక్స్‌రే శక్తి శ్రేణిలో ధ్రువణ పరామితులను, ప్రత్యేకంగా వాటి డిగ్రీ, ధ్రువణ కోణాలను కొలిచేందుకు రూపొందించారు. రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఆర్ఐ) బెంగళూరు ఇస్రో కేంద్రం దీన్ని రూపొందించింది. ► ఇందులోని మరో పేలోడ్ ఎక్స్పెక్ట్ (ఎక్స్ రే స్పెక్ట్రోస్కోపీ, టైమింగ్) 0.8–15 కిలోవాట్స్ శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ రూపొందించింది. ► ఈ రెండు పేలోడ్లు విశ్వాంతరాల్లో కృష్ణ బిలాలపై లోతుగా అధ్యయనం చేసి విలువైన సమాచారం అందిస్తాయి. ► ఇక కేరళ వర్సిటీ విద్యార్థినులు తయారు చేసిన వియ్‌శాట్ కేజీ బరువున్న సూక్ష్మ ఉపగ్రహం. ► కేరళలో మారిన వాతావరణ పరిస్థితుల అధ్యయనం దీని ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 12 ప్రయోగాలు: సోమనాథ్ ఈ ఏడాది 12 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ‘‘2024ను గగన్‌యాన్ ఏడాదిగా నిర్దేశించుకున్నాం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది నాలుగు మానవరహిత ప్రయోగాలు చేయనున్నాం. అనంతరం 2025లో మానవసహిత ప్రయోగం ఉంటుంది. నాసాతో సంయుక్తంగా రూపొందించిన ఇన్శాట్–త్రీడీ ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగిస్తాం. ఈ నెల 26న, లేదా ఫిబ్రవరి తొలి వారంలో నావిక్–02 ఉపగ్రహ ప్రయోగం ఉటుంది’’ అని ఆయన వివరించారు. -
PSLV-C58 XPoSat: ఇస్రో పీఎస్ఎల్వీ-సీ58 రాకెట్ ప్రయోగం విజయవంతం (ఫొటోలు)
-
పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం
Live Updates.. పీఎస్ఎల్వీ సీ-58 విజయవంతపై సీఎం జగన్ హర్షం ►ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ► నూతన సంవత్సరంలో మంచి విజయాన్ని సాధించారు ►అనుకున్న రీతిలోనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టటం సంతోషకరం ►భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలి ►పీఎస్ఎల్వీ సీ-58 ప్రయోగం విజయవంతం. ►2021లో IXPE పేరిట ఈ తరహా ప్రయోగం నిర్వహించిన అమెరికా ►అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన దేశంగా ఘనత దక్కించుకున్న భారత్ ►కొత్త ఏడాదిలో ఇస్రో తొలి ప్రయోగం సక్సెస్ ►శ్రీహరికోటలో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు ►శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ 58. #WATCH | PSLV-C58 XPoSat Mission launch | ISRO launches X-Ray Polarimeter Satellite (XPoSat) from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh. (Source: ISRO) pic.twitter.com/ua96eSPIcJ — ANI (@ANI) January 1, 2024 ►ఎక్స్‌పోశాట్ ఉపగ్రహ జీవితకాలం ఐదేళ్లు. ఎక్స్-రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ప్రయోగం. ►2024 నూతన సంవత్సరం ప్రారంభం రోజునే ఇస్రో తొలి ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలుపెట్టింది. తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నిర్వహించనున్న పీఎస్ఎల్వీ-సీ58 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ఆదివారం ఉదయం 8:10 గంటలకు ప్రారంభమైంది. ఇస్రో ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్(ఎక్స్పో శాట్)ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్ మిషన్ కావడం విశేషం. ►కౌంట్‌డౌన్ అనంతరం సోమవారం ఉదయం 9:10 గంటలకు షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో మన దేశానికి చెందిన 480 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతున్నారు. ప్రయోగం తర్వాత 21 నిమిషాలకు ఎక్స్‌పోశాట్ నిర్ణీత కక్ష్యలోకి చేరుకోనుంది. ►అనంతరం రాకెట్లో నాలుగో స్టేజ్ అయిన పీఎస్4 అక్కడి నుంచి దిగువ కక్ష్యకు వస్తుంది. ఇందులో తిరువనంతపురం ఎల్బీఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కాలేజ్ విద్యార్థినులు తయారుచేసిన విమెన్ ఇంజినీర్డ్ శాటిలైట్ సహా వివిధ ఉపకరణాలు ఉంటాయి. వీటి సాయంతో శాస్త్రవేత్తలు పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. #WATCH | PSLV-C58 XPoSat Mission launch | Sriharikota, Andhra Pradesh: The launch of the X-Ray Polarimeter Satellite (XPoSat) is set for today at 09:10 am from the first launch-pad, SDSC-SHAR, Sriharikota in Andhra Pradesh. (Visuals from Satish Dhawan Space Centre) pic.twitter.com/c5LkajQEpU — ANI (@ANI) January 1, 2024 ►కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్‌రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికిగాను ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ►ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్యతరహా ఎక్స్‌రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్‌హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాల స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
ISRO: కొత్త ఏడాది తొలిరోజే కీలక ప్రయోగం
సాక్షి, బెంగళూరు: కొత్త ఏడాదిలో తొలిరోజే ఇస్రో సరికొత్త ప్రయోగానికి తెర తీసింది. నూతన సంవత్సరం సందర్భంగా సోమవారం(జనవరి 1) ఉదయం 9.10 గంటలకు ఎక్స్ రే పొలారి మీటర్ శాటిలైట్(ఎక్స్పో శాట్)ను ప్రయోగించనుంది. ఇది భారత అంతరిక్ష చరిత్రలో తొలి పొలారిమీటర్ మిషన్ కావడం విశేషం. పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించనున్న ఈ ప్రయోగం కౌంట్‌డౌన్ ఇప్పటికే ప్రారంభమైంది. కాంతివంతమైన అంతరిక్ష ఎక్స్‌రే కిరణాల మూలాల సంక్లిష్టతను, అసాధారణ పరిస్థితుల్లో వాటి ప్రభావాన్ని ఎక్స్ పో శాట్ అధ్యయనం చేయనుంది. ఈ అధ్యయనానికిగాను ఎక్స్‌పోశాట్‌లో రెండు అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను అమర్చారు. ఇవి తక్కువ ఎత్తులో గల భూ కక్ష్య నుంచి అధ్యయనాన్ని కొనసాగిస్తాయి. ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పరికరం పోలిక్స్ మధ్యతరహా ఎక్స్‌రే కిరణాలను వెదజల్లే మూలాలపై పరిశోధన చేస్తుంది. ఇక మిగిలిన ఎక్స్‌స్పెక్ట్ పేలోడ్ అంతరిక్షంలోని బ్లాక్‌హోళ్లు, న్యూట్రాన్ నక్షత్రాలు, యాక్టివ్ గలాటిక్ న్యూక్లై, పల్సర్ విండ్, నెబ్యులా తదితరాల నుంచి వెలువడే ఎక్స్‌రే కిరణాల స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందించనుంది. గడిచిన ఏడాది 2023లో ఇస్రో చంద్రయాన్ 3, ఆదిత్య ఎల్ 1 ప్రయోగాలతో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..అయోధ్య రామ మందిర వేడుకలు..కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు -
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నూతన సంవత్సరం 2024, జనవరి ఒకటో తేదీ ఉదయం 9.10 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి.. ఎంఎస్టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్ ఆ«థరైజేషన్ సమావేశం నిర్వహించి రిహార్సల్స్ చేసి ప్రయోగసమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు.. అంటే ప్రయోగానికి 25 గంటల ముందు కౌంట్‌డౌన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. 260 టన్నుల బరువు.. పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువుంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు. రాకెట్ దూసుకెళుతున్న తరుణంలోనే 175 సెకెండ్లకు శాటిలైట్‌కు రక్షణ కవచంగా ఉన్న హీట్ షీల్డ్ విడిపోతుంది. అనంతరం 41.9 టన్నుల ద్రవ ఇంధనంతో 261.50 సెకెండ్లకు రెండో దశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 586.26 సెకెండ్లకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 1258.92 సెకెండ్లకు నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం నాలుగో దశలో ద్రవ ఇంధన మోటార్ 1315.92 సెకెండ్లకు(21.55 నిమిషాల్లో) ఎక్స్‌ఫోశాట్ అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ అనే ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కి.మీ. ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. -
2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనుందని కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో వెల్లడించింది. ఇందులో ఆరు పీఎస్ఎల్వీ మిషన్లు, మూడు జీఎస్ఎల్వీ ప్రయోగాలు, ఒక లాంచ్ వెహికల్ మార్క్–3 వాణిజ్య ప్రయోగం ఉందని తెలియజేసింది. ఈ మేరకు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఇస్రో అభివృద్ధి చేసిన నూతన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ) ద్వారా ఒక ఉపగ్రహాన్ని ప్రయోగాత్మకంగా నింగిలోకి పంపించనున్నట్లు వివరించారు. ప్రతిష్టాత్మక గగన్‌యాన్ కార్యక్రమంలో భాగంగా కక్ష్య మాడ్యూల్‌ను నిర్ధారించుకొనేందుకు రెండు మానవ రహిత మిషన్లు చేపట్టాలని ఇస్రో భావిస్తోందని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి.. కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం ఇస్రో చైర్మన్ సోమనాథ్ షార్కు రానున్నారు. సహచర శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలిస్తారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం.. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. అక్కడికి చేరుకోవాలంటే 175 రోజుల సమయం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
రేపు ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల నిమిత్తం ‘ఇస్రో’ శనివారం తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. రెండో ప్రయోగ వేదిక నుంచి శనివారం ఉదయం 11.50 గంటలకు ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం శుక్రవారం ఉదయం 11.50 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ సంసిద్ధత సమావేశం నిర్వహించారు. పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌కు అన్ని పరీక్షలు నిర్వహించి లాంచ్ ఆథరైజేషన్ బోర్డు(ల్యాబ్)కు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ రాజరాజన్ రాకెట్‌కు మరోసారి పరీక్షలు నిర్వహించి కౌంట్‌డౌన్, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. సూర్యుడు ఒక మండే అగ్నిగోళం. అక్కడికి ఉపగ్రహాన్ని పంపిస్తే కాలిపోతుంది కదా.. అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. వాస్తవానికి ఈ ప్రయోగంలో భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీనివల్ల గ్రహణాలతో సంబంధం లేకుండా సౌరగోళంపై నిరంతరం అధ్యయనం చేసేందుకు అవకాశం లభిస్తుంది. ఇది కూడా చదవండి: మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. తెరపైకి వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లు? -
త్వరలో ఆదిత్య–ఎల్1 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనల కోసం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి ఈ నెలాఖరులో గానీ సెప్టెంబర్ మొదటివారంలో గానీ పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ ద్వారా ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రాకెట్ అనుసంధానం పనులు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది చేసిన ఆరు ప్రయోగాలు వరుసగా విజయాలు సాధించడంతో.. రెట్టించిన ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. -
ISRO PSLV-C56: ఇస్రో మరో వాణిజ్య విజయం
సూళ్లూరుపేట: పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌక ఆదివారం ఉదయం 6.31 గంటలకు విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. దీంతో ఈ ఏడాదిలో ఇస్రో మూడో వాణిజ్య విజయాన్ని సొంతం చేసుకున్నట్లయింది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సంయుక్తంగా తిరుపతి జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి దీనిని ప్రయోగించాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో చేపట్టిన 58 ప్రయోగాల్లో ఇది 56వ విజయం కావడం గమన్హాం. పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌కు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 6.31 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. నాలుగు దశల ప్రయాణాన్ని విజయవంతంగా సాగిస్తూ 23 నిమిషాల వ్యవధిలో (1,381 సెకన్లకు) సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులోని నియో ఆర్బిట్ (భూ సమీప కక్ష్య)లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 352 కిలోలు బరువు కలిగిన డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోల ఆర్కేడ్, 23 కేజీల బరువున్న వెలాక్స్–ఏఎం, 12.8 కిలోల ఓఆర్బీ–12 స్ట్రయిడర్, 3.84 కేజీల గలాసియా–2, 4.1 కేజీల స్కూబ్–11, 3.05 కేజీల బరువైన న్యూలయన్ అనే ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. షార్ నుంచి చేసిన 90వ ప్రయోగమిది. అంతరిక్ష వ్యర్థాలను తొలగించే కొత్త ప్రయోగం పీఎస్ఎల్వీ సీ–56 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో అంతరిక్షంలో పెరిగిపోతున్న వ్యర్థాలను తొలగించేందుకు సరికొత్త ప్రయోగం చేపట్టినట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భూమికి 535 కిలోమీటర్లు ఎత్తులో ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన తర్వాత పీఎస్–4 అక్కడ నుంచి 300 కిలోమీటర్ల స్థాయికి దిగి వస్తుంది. ఈ ఎత్తులో ఉండటం వల్ల ఇది త్వరగానే భూ కక్ష్యలోకి ప్రవేశించి మండిపోతోంది. దీంతో అంతరిక్షంలో ఇలాంటి ప్రయోగాల తదుపరి చెత్త తగ్గుతుంది. ఒకవేళ 530కి.మీ.ల ఎత్తులోనే ఉంటే కింది కక్ష్యలకు వచ్చి పడిపోవడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఇప్పుడు కిందిస్థాయిలోనే ఉంది కనుక కేవలం రెండునెలల్లో పడిపోతుంది. ఆ కీలక భాగాల తయారీదారు హైదరాబాద్ సంస్థే పీఎస్ఎల్వీ సి–56లోని కీలక భాగాలు, వ్యవస్థలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్(ఏటీఎల్) రూపొందించినవే కావడం విశేషం. ఈ విషయాన్ని ఆ సంస్థ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. పీఎస్ఎల్వీ సి–56 లాంఛ్ వెహికల్లో వాడిన నావిగేషన్ ఇంటర్ఫేస్ మాడ్యూళ్లు, ఇనెర్షియల్ సెన్సింగ్ యూనిట్లు, ఇంట్రా మాడ్యూల్ హార్నెస్, కంట్రోల్ ఎల్రక్టానిక్స్, పైరో కంట్రోల్ సిస్టమ్స్, ట్రాకింగ్ ట్రాన్స్‌పాండర్, ఇంధన వ్యవస్థల రూపకల్పనలో తమ సంస్థ భాగస్వామ్యం ఎంతో ఉందన్నారు. ఇస్రో లాంఛ్ వెహికల్స్, శాటిలైట్లు, స్పేస్ క్రాఫ్ట్ పేలోడ్స్, గ్రౌండ్ సిస్టమ్స్‌ను తాము ఉత్పత్తి చేస్తున్నామన్నారు. పీఎస్ఎల్వీ సి–56తో కలిపి ఇప్పటి వరకు అయిదు పీఎస్ఎల్వీ మిషన్లలో అత్యంత కీలకమైన సబ్ అసెంబ్లీ ప్రక్రియను ఏటీఎల్ నిపుణులు చేపట్టినట్లు వివరించారు. -
పీఎస్ఎల్వీ సీ-56 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్ఎల్వీ సీ-56 వాహకనౌక ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు పీఎస్ఎల్వీ-సి56 ప్రయోగం నిర్వహించారు. నాలుగు దశల్లో రాకెట్ ప్రయోగం జరిగింది. కాగా, 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్‌తో నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-56 విజయవంతంగా కక్షలోకి దూసుకెళ్లింది. ఇక, సింగపూర్‌కు చెందిన 420 కిలోల బరువు గల ఏడు ఉపగ్రహాలను దీని ద్వారా కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. #PSLVC56 | The mission is successfully accomplished. PSLV-C56 vehicle launched all seven satellites precisely into their intended orbits: ISRO — ANI (@ANI) July 30, 2023 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఇక, ఈనెలలో ఇస్రోకు ఇది రెండో ప్రయోగం కావడం విశేషం. ఒకే నెలలో 2 ప్రయోగాలను సక్సెస్ చేసిన ఇస్రో. కాగా, పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 58వ ప్రయోగం. అనంతరం శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా సోమనాథ్ మాట్లాడుతూ.. నిర్దేశించిన కక్ష్యలో రాకెట్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టాం. సెప్టెంబర్‌లో మరో పీఎస్ఎల్వీ ప్రయోగం చేపడతాం. అది కూడా పూర్తిగా కమిర్షియల్ ప్రయోగమని స్పష్టం చేశారు. #WATCH | Indian Space Research Organisation (ISRO) launches its PSLV-C56 with six co-passenger satellites from Satish Dhawan Space Centre (SDSC) SHAR, Sriharikota. (Source: ISRO) pic.twitter.com/2I1pNvKvBH — ANI (@ANI) July 30, 2023 -
నేడే పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్ సాగుతుంది. శుక్రవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ షార్కు చేరుకున్నారు. శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాకెట్‌కు నాలుగో దశలో 0.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శనివారం రాత్రికి రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింõపుతారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. -
మరో ‘వాణిజ్య సవాలు’కు... ఇస్రో సన్నద్ధం
బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య ప్రయోగాల పరంపరలో మరో ముందడుగు. సింగపూర్‌కు చెందిన సమాచార ఉపగ్రహం సింథటిక్ అపర్చర్ రాడార్ (డీఎస్–ఎస్ఏఆర్)తో పాటు మరో 6 బుల్లి ఉపగ్రహాలను సంస్థ పీఎస్ఎల్వీ–సి56 ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది. జూలై 30న ఉదయం శ్రీహరికోటలో మొదటి లాంచింగ్ ప్యాడ్ నుంచి జరిగే ఈ ప్రయోగం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎస్ఏఆర్ను సింగపూర్ ప్రభుత్వ డిఫెన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సింగపూర్ టెక్నాలజీస్ సంయుక్తంగా ఇంజనీరింగ్ లిమిటెడ్ అభివృద్ధి చేశాయి. ఇది పూర్తి వాణిజ్య ప్రయోగమని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సోమవారం పేర్కొన్నారు. ► తొలుత జూలై 26న తలపెట్టిన ఈ ప్రయోగం 30కి వాయిదా పడింది. ► 360 కిలోల ఎస్ఏఆర్తో పాటు మొత్తం ఏడు ఉపగ్రహాలను భూమి నుంచి 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్ ఈక్విటోరియల్ ఆర్బిట్ (ఎన్ఈఓ–నియో) కక్ష్యలోకి పీఎస్ఎల్వీ–సి56 ప్రవేశపెట్టనుంది. ► మిగతా ఆరు ఉపగ్రహాలు వెలోక్స్–ఏఎం (23 కిలోలు), ఆర్కేడ్, స్కూబ్–2, న్యూలియోన్, గలాసియా–2, ఆర్బి–12 స్ట్రైడర్. -
30న పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న ఉదయం 6.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగాన్ని నిర్వహించనున్నామని షార్ వర్గాలు తెలిపాయి. ఈ ప్రయోగాన్ని ఈనెల 23న నిర్వహింయాల్సి ఉంది. చంద్రయాన్–3 మిషన్‌ను లూనార్ ఆర్బిట్‌లోకి పంపే ప్రక్రియలో ఇస్రో శాస్త్రవేత్తలంతా నిమగ్నమై ఉండడంతో ఈ ప్రయోగాన్ని 30కి పొడిగించారు. ఈ ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 351 కిలోల డీఎస్–ఎస్ఏఆర్ (షార్ట్ ఫర్ సింథటిక్ ఆపార్చర్ రాడార్) అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్, 23.58 కిలోలు బరువు కలిగిన ఆర్కేడ్, 23 కేజీల వెలాక్స్–ఏఎం, 12.8 కిలోలు బరువు కలిగిన ఓఆర్బీ–12 స్ట్రైడర్, 3.84 కేజీల బరువున్న గలాసియా–2, 4.1 కేజీల బరువైన స్కూబ్–11, 3.05 కేజీల నులయన్ అనే ఉపగ్రహాలను లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగం పూర్తిగా వాణిజ్యపరమైంది కావడం విశేషం. -
చంద్రయాన్-3 దేశ అంతరిక్ష చరిత్రలో ప్రత్యేకంగా నిలవనుంది: ప్రధాని మోదీ ట్వీట్
న్యూఢిల్లీ: చందమామను ఇక్కడి నుంచి చూస్తూ మనకు తెలిసిన ఎన్నో కథలను చెప్పుకున్నాం. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఆ వెన్నెల రాజ్యాన్ని శోధించాలని తపన మానవవాళిలో మొదలైంది. ఈ క్రమంలో కొన్ని అగ్రరాజ్యాలు చకచకా వెళ్లి జెండాలు పాతి వచ్చినా.. చంద్రుని పూర్తి గుట్టు మాత్రం విప్పలేకపోయాయి. వాటితో పోలిస్తే జాబిల్లిపై పరిశోధనలను భారత్ కాస్త ఆలస్యంగా ప్రారంభించినా అద్భతాలను చేయాలని ప్రయత్నిస్తోంది. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలోనే చంద్రయాన్–3 మిషన్‌ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్ ఎల్వీఎం–3 సిద్ధమవుతోంది. దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్వీఎం3–ఎం4 ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మిషన్ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023న బంగారు అక్షరాలతో లిఖించనుంది. చంద్రయాన్-3, మన మూడవ చంద్ర మిషన్, మరికాసేపట్లో దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశపు ఆశలు, కలలను ముందుకు తీసుకువెళుతుందని ట్వీట్ చేశారు. 14th July 2023 will always be etched in golden letters as far as India’s space sector is concerned. Chandrayaan-3, our third lunar mission, will embark on its journey. This remarkable mission will carry the hopes and dreams of our nation. pic.twitter.com/EYTcDphaES — Narendra Modi (@narendramodi) July 14, 2023 చదవండి: Himachal Pradesh Floods: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్ విషయాలు -
PSLV-C 55 రాకెట్ ప్రయోగం సక్సెస్
సాక్షి, తిరుపతి/నెల్లూరు: శ్రీహరికోట షార్(సతీష్ ధావన్ స్పేస్‌సెంటర్) నుంచి పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ISRO ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగం శనివారం మధ్యాహ్నం జరగ్గా.. రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది వాహననౌక. దీంతో షార్ కంట్రెల్ సెంటర్లో ఇస్రో శాస్త్రవేత్తలు సంబురాల్లో మునిగిపోయారు. రాకెట్ ప్రయోగం కౌంట్‌డౌన్ ప్రక్రియ ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షించారు. 20.35 నిమిషాల ప్రయాణం తర్వాత కక్ష్యలోకి ప్రవేశించాయి శాటిలైట్స్. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్-2, 16 కేజీల బరువు ఉన్న లూమిలైట్-4 ఉపగ్రహాంను సన్ సింక్రనస్ ఆర్బిట్(సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి ప్రవేశట్టింది రాకెట్. పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్.. బరువు 44.4 మీటర్ల పొడవు. 228 టన్నుల బరువు. సముద్ర భద్రతను పెంచడం కోసం లూమిలైట్‌ను ప్రవేశపెట్టింది సింగపూర్. ఉపగ్రహాలను నిర్ణీతీ కక్ష్యలోకి వదిలేసిన తర్వాత.. ఆరిస్-2, పైలెట్, ఆర్కా-200, స్టార్‌బెర్రీ, డీఎస్‌వోఎల్, డీఎస్‌వోడీ-3యూ, డీఎస్‌వోడీ-06.. అనే చిన్నపాటి పేలోడ్లను సైతం ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. ఈ తరహా ప్రయోగం ఇక్కడ జరగడం ఇదే తొలిసారని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇక.. ఇప్పటివరకు 424 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించింది ఇస్రో. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 57వ రాకెట్. #WATCH | Andhra Pradesh: Indian Space Research Organisation (ISRO) launches its PSLV-C55 with two Singaporean satellites for Earth observation, from Sriharikota. (Source: ISRO) pic.twitter.com/oKByHiqXjD — ANI (@ANI) April 22, 2023 Poetic launch of #PSLVC55 ; congrats @isro ! 🚀#TeLEOS2 #POEM #ISRO https://t.co/UEx7WMGHcG — Unni Sankar (@UnniSankar) April 22, 2023 ఏపీ సీఎం జగన్ హర్షం తాడేపల్లి: PSLV-C55న రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఇస్రో బృందాన్ని అభినందించిన ఆయన.. రెండు సింగపూర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో చేర్చటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. ఇస్రో బృందం మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారాయన. -
శ్రీచంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
సాక్షి, తిరుపతి: పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగం నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ డాక్టర్ సోమనాథ్ సూళూరుపేట శ్రీచంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. ప్రయోగానికి ముందు అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. రాకెట్ నమూనాతో సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, శనివారం మధ్యాహ్నం 2.20 లకు పీఎస్ఎల్వీ సీ–55 నింగిలోకి దూసుకెళ్లనుంది. ప్రయోగానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12.50 గంటలకి కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. పూర్తి 25 గంటల 30 నిమిషాల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. పూర్తిగా విదేశీ పరిజ్ఞానం, సింగపూర్‌కి చెందిన వాణిజ్య ప్రయోగం ఇది. ఈ రాకెట్ ద్వారా 741 కిలో బరువు కలిగిన లియోన్-2 తో పాటు 16 కిలోల లూమ్ లైట్-4 శాటిలైట్లను రోదసిలోకి ఇస్రో పంపనుంది. ఈ ప్రయోగ నేపథ్యంలో తిరుపతిజిల్లా శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి చేరుకున్నారు విదేశీ శాస్త్రవేత్తల బృందం. అక్కడ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. భూ, ఉపరితలం, సముద్ర తీరంలోనూ సీఐఎస్ఎఫ్ బలగాల విస్తృత తనిఖీలు చేపట్టారు. షార్ పరిసర ప్రాంతాల్లో ఇతరులకు ప్రవేశాన్ని నిషేధించారు. చదవండి: చింతమనేని ప్రభాకర్ వింత ప్రవర్తన.. ఐసీయూలోకి తోపుడు బండ్లు.. -
22న పీఎస్ఎల్వీ సీ55 ప్రయోగం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ నెల 22న మధ్యాహ్నం 2.19 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–55 ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధం చేస్తోంది. ఇస్రో అంతర్భాగంగా ఉన్న న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వారి వాణిజ్య ఒప్పందం మేరకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్–02 అనే ఉపగ్రహంతో పాటు లూమిలైట్–4 అనే 16 కేజీల బుల్లి ఉపగ్రహాన్ని రోదశీలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ రాకెట్లో నాలుగోదశ (పీఎస్–4)ను ఒక ఎక్స్పర్మెంటల్ చేయనున్నారు. ఈ రాకెట్లో ఆర్బిటల్ ఎక్స్పర్మెంటల్ మాడ్యూల్ (పీవోఈఎం) అమర్చి పంపిస్తున్నారు. అంటే పోలార్ ఆర్బిట్‌లో ఇంకా ఎన్ని రకాల కక్ష్యల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టవచ్చో పరిశోధన చేయడానికి ఈ ఎక్స్పర్మెంటల్ ప్రయోగాన్ని చేస్తున్నారు. -
ఇస్రో సరికొత్త ప్రయోగం.. భూమిపైకి ‘మేఘాట్రోఫిక్–1’ పునరాగమనం
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): నియంత్రిత పునరాగమన పద్ధతిలో సరికొత్త ప్రయోగానికి ‘ఇస్రో’ సిద్ధమైంది. 2011 అక్టోబర్ 12న పీఎస్ఎల్వీ–సీ18 రాకెట్ ద్వారా పంపించిన మేఘాట్రోఫిక్ ఉపగ్రహం కాలపరిమితికి మించి పనిచేసి, ప్రస్తుతం అంతరిక్షంలో నిరుపయోగంగా మారింది. దాదాపు 1,000 కిలోల బరువైన మేఘాట్రోఫిక్–1 (ఎంటీ–1) ఉపగ్రహాన్ని ఉçష్ణమండలంలోని వాతావరణం, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం కోసం ఇస్రో, ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థ (సీఎన్ఈఎస్) సంయుక్తంగా తయారుచేసి ప్రయోగించాయి. దీని కాలపరిమితి మూడేళ్లు. కానీ, 2021 దాకా సేవలందించింది. ప్రస్తుతం వ్యర్థంగా మారిన ఈ ఉపగ్రహంలో 125 కిలోల ద్రవ ఇంధనముంది. ఇది అంతరిక్షంలో పేలిపోయి ఇతర ఉపగ్రహాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని ఇస్రో అంచనా వేసింది. ఈ నేపథ్యంలో దానిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చి, పసిఫిక్ మహాసముద్రంలో కూల్చేందుకు మంగళవారం సరికొత్త ఆపరేషన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. భూమిపైకి మేఘాట్రోఫిక్–1 రీఎంట్రీ కోసం అందులో ఉన్న ఇంధనం సరిపోతుందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. 26న ఎల్వీఎం3–ఎం3 ప్రయోగం లాంచ్ వెహికల్ మార్క్3–ఎం3 (ఎల్వీఎం3–ఎం3) ప్రయోగాన్ని ఈ నెల 26న నిర్వహించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. యునైటెడ్ కింగ్డమ్కు చెందిన నెట్వర్క్ యాక్సెస్ అసోసియేట్ లిమిటెడ్, ఇండియన్ భారతి ఎంటర్ప్రైజెస్ సంయుక్త భాగస్వాములుగా వన్‌వెబ్ ఇండియా–2 పేరుతో 5,796 కిలోల బరువైన 36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను రెండోసారి వాణిజ్యపరంగా ప్రయోగిస్తున్నాయి. సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ‘షార్’లోని రెండో ప్రయోగ వేదిక దీనికి వేదిక కానుంది. షార్‌లోని వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో రెండు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేశారు. క్రయోజనిక్ దశ మాత్రమే పెండింగ్‌లో ఉంది. ప్రయోగించబోయే 36 ఉపగ్రహాలు ఇప్పటికే షార్కు చేరుకున్నాయి. వీటికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. హీట్‌షీల్డ్‌లో అమర్చే పనులు జరుగుతున్నాయి. -
ఆజాదీ శాట్–2ను రూపొందించిన ‘ప్రభుత్వ’ విద్యార్థినులు
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఎస్ఎస్ఎల్వీ డీ2 ప్రయోగం ద్వారా ఇస్రో అంతరిక్షంలోకి పంపించిన ఆజాదీశాట్–2 ఉపగ్రహాన్ని పూర్తిగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులే తయారు చేశారు. అంతరిక్ష ప్రయోగాలపై విద్యార్థి దశనుంచే అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న 75 పాఠశాలలను.. వాటిలో విద్యనభ్యసిస్తున్న 750 మంది విద్యార్థినులను ఎంపిక చేశారు. చెన్నైకి చెందిన స్పేస్ కిడ్ ఇండియా సీఈవో కేశన్ ఆధ్వర్యంలో ఈ విద్యార్థినులు ఆజాదీశాట్–2ను రూపొందించారు. ఇందులో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం ప్రభుత్వ పాఠశాల విద్యార్థినులు కూడా భాగస్వాములయ్యారు. స్పేస్ కిడ్ ఇండియాలో భాగంగా విద్యార్థినులంతా 6 నెలలు పాటు శ్రమించి రూ.86 లక్షల ఖర్చుతో ఈ బుల్లి ఉపగ్రహాన్ని తయారుచేశారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
తాడేపల్లి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ54 విజయవంతం కావడంపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాగా, శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు.సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం. చదవండి: ఇస్రో జైత్రయాత్ర: పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం -
PSLV C-54 ప్రయోగం సక్సెస్
-
ఇస్రో జైత్రయాత్ర: పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం
సాక్షి, సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు. సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితం పీఎస్ఎల్వీ సీ54 ప్రయోగం విజయవంతం కావడంతో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నో ఏళ్ల కృషికి ఫలితమే ఈ విజయమని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. నీటి వనరుల పర్యవేక్షణ, తుపాను అంచనా, భూవాతవరణంపై పీఎస్ఎల్వీ సీ54 అధ్యయనం చేయనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. చదవండి: (క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ రాజ్యాంగం: సీఎం జగన్) -
PSLV-C54 Launch: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ54
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సతీష్‌ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి పీఎస్ఎల్వీ సీ54 నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగం ద్వారా 9 ఉప గ్రహాలను భూమికి 720 కిలోమీటర్ల ఎత్తులో సన్‌సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. కాగా, పీఎస్ఎల్వీ సీ–54 రాకెట్‌కు శుక్రవారం ఉదయం 10.26 నిమిషాలకు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్, లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగంరాజరాజన్లు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. శుక్రవారం సాయంత్రం రాకెట్‌లోని నాల్గో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. అనంతరం రాకెట్‌కు సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
పీఎస్ఎల్వీ సీ54’కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ54 ఉపగ్రహ వాహక నౌకకు శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ కొనసాగాక శనివారం ఉదయం 11.56 గంటలకు పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాల్లో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ(ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో తుది విడతగా రాకెట్‌కు తనిఖీలు నిర్వహించి లాంచ్ రిహార్సల్స్ చేపట్టారు. అనంతరం కౌంట్‌డౌన్ సమయాన్ని శుక్రవారం ఉదయం 10.26 గంటలకు, ప్రయోగ సమయాన్ని శనివారం ఉదయం 11.56 గంటలకని అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రయోగం ద్వారా తొమ్మిది ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. ఇందులో ఇస్రోకు చెందిన ఈఓఎస్–06 ఉపగ్రహంతో పాటు ఎనిమిది ఉప గ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగిస్తోంది. శుక్రవారం ఉదయం 10.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమయ్యాక రాకెట్ నాలుగో దశ, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. షార్ నుంచి ఇది 87వ ప్రయోగం. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో 56వ ప్రయోగం. పీఎస్ఎల్వీ ఎక్స్‌ల్ వెర్షన్లో 24వ ప్రయోగం కావడం విశేషం. షార్ కేంద్రానికి చేరుకోనున్న ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ శుక్రవారం బెంగళూరు అంతరిక్ష కేంద్ర ప్రధాన కార్యాలయం నుంచి శ్రీహరికోటకు చేరుకోనున్నారు. పీఎస్ఎల్వీ సీ54 రాకెట్‌కు ఆయన మరోమారు తనిఖీలు నిర్వహించి కౌంట్‌డౌన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ-సీ53ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో ఇస్రో బృందం మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. చదవండి: పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం. -
పీఎస్ఎల్వీ-సీ53 రాకెట్ ప్రయోగం విజయవంతం
సాక్షి, శ్రీహరికోట: నింగిలోకి పీఎస్ఎల్వీ-సీ53 దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ53.. కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 55వ ప్రయోగం. చదవండి: సెట్టింగ్ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది.. ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి. -
పీఎస్ఎల్వీ సీ53 ప్రయోగానికి రంగం సిద్ధం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ53 ఉపగ్రహ వాహకనౌక ప్రయోగానికి సంబంధించిన 25 గంటల కౌంట్‌డౌన్ బుధవారం మొదలైంది. సాయంత్రం 4.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. గురువారం సాయంత్రం 6.02 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ–53 నింగిలోకి దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన డీఎస్–ఈఓ అనే 365 కేజీల ఉపగ్రహం, 155 కేజీల న్యూసార్, 2.8 కేజీల స్కూబ్–1 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ప్రయోగాల్లో పీఎస్ఎల్వీ టాప్ ఇస్రో వాణిజ్య పరంగా పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా 33 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. 2016లో పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను పంపి చరిత్ర సృష్టించారు. వాణిజ్యపరంగా తక్కువ ఖర్చుతో విదేశీ ఉపగ్రహాలను పంపించే వెసులుబాటు వుండడంతో చాలా దేశాలు భారత్ నుంచే ప్రయోగాలకు మొగ్గుచూపుతున్నాయి. -
పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం
-
ISRO: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్–04, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు. కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలివే.. ►వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్ఐశాట్-1 ఉపగ్రహం ►భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం ఐఎన్ఎస్-2టీడీ ►భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం ఐఎన్ఎస్-2టీడీ ఉపగ్రహం ►భూమి అయానోస్పియర్ అధ్యయనం కోసం ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహం స్పందించిన ఇస్రో చైర్మన్ పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. దీంతో శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. -
ఇస్రో సూపర్ సక్సెస్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చేపట్టిన పీఎస్ఎల్వీ సీ51 ఉపగ్రహ వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఈ ఏడాది మొట్టమొదటగా ఆదివారం ఉదయం 10.24 గంటలకు ప్రయోగించిన రాకెట్ విజయంతో శుభారంభమైంది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 53వ ప్రయోగంతో షార్ కేంద్రం నుంచి ఇస్రో చేపట్టిన 78వ ప్రయోగం ఇది. 44.4 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ సీ51 రాకెట్‌కు సంబంధించి శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించారు. 25.30 గంటల కౌంట్‌డౌన్ అనంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నిప్పులు చిమ్ముతూ నింగి వైపు దూసుకెళ్లింది. 1.38 గంటల వ్యవధిలో 19 ఉపగ్రహాలను భూమికి 537 నుంచి 637 కిలో మీటర్లు పరిధిలోని వివిధ సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టింది. ఇటీవల ఏర్పాటైన ఇస్రో అనుబంధ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాణిజ్యపరంగా చేపట్టిన ఈ మొట్టమొదటి మిషన్‌లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01 ఉపగ్రహం ప్రధానమైంది. 637 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని 17.23 నిమిషాల్లో సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశ పెట్టారు. ఆ తర్వాత పీఎస్ఎల్వీ సీ51 రాకెట్లో నాలుగో దశలో అమెరికాకు చెందిన స్పేస్‌బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12 చిన్న తరహా ఉపగ్రహాలు, సాయ్–1 కాంటాక్ట్–2 అనే మరో ఉపగ్రహంతో కలిపి 13 ఉపగ్రహాల శ్రేణిని ఒకసారి, తమిళనాడు కోయంబత్తూరులోని శ్రీశక్తి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన శ్రీ శక్తిశాట్, శ్రీపెరంబుదూర్‌లోని జెప్పియర్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జిట్‌శాట్, మహారాష్ట్ర నాగపూర్‌లోని జీహెచ్ రాయ్సోనీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు తయారు చేసిన జీహెచ్ఆర్సీ ఈశాట్ మూడు ఉపగ్రహాలను యూనిటిశాట్స్‌ను, న్యూ స్పేస్ ఇండియాలో భాగంగా భారత ప్రైవేట్ సంస్థలు రూపొందించిన సింధునేత్ర, సతీష్ ధవన్ శాట్‌లను కలిపి మరో శ్రేణిగా చేర్చి రోదసీలోకి విజయవంతంగా ప్రవేశ పెట్టడంతో ప్రయోగం పూర్తయింది. ఈ మిషన్‌తో ఇస్రో ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 342 ఉపగ్రహాలను ప్రయోగించినట్లయింది. 14 మిషన్ల ప్రయోగమే లక్ష్యం: డాక్టర్ కె.శివన్, ఈ ఏడాదిలో 14 మిషన్లు ప్రయోగించాలనే లక్ష్యంతో పని చేయాలని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఇస్రో శాస్త్రవేత్తలకు, ఇంజినీర్లకు పిలుపునిచ్చారు. పీఎస్ఎల్వీ సీ51 ప్రయోగం విజయవంతమైన అనంతరం శివన్ షార్‌లోని మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ 14 మిషన్ల ప్రయోగంలో భాగంగా 7 లాంచింగ్ వెహికల్స్, ఆరు ఉపగ్రహాలు, ఒక మానవరహిత ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. 2020లో కోవిడ్–19 వల్ల ప్రయోగాల విషయంలో వెనుకబడ్డామని, ఇకపై వేగం పెంచుతామని తెలిపారు. బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–01ను ఇక్కడ నుంచి ప్రయోగించడం సంతోషంగా ఉందన్నారు. అనుకున్న ప్రకారం 17.23 నిమిషాలకు అమెజానియా–01 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశ పెట్టిన కొద్ది నిమిషాలకు సోలార్ ప్యానెల్స్ పనిచేయడం ప్రారంభించాయని చెప్పారు. పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా అమెజానియా–01 ఉపగ్రహం సక్సెస్ పుల్గా కక్ష్యలోకి చేరుకున్నందుకు సంతోషంగా ఉందని బ్రెజిల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి మార్కోస్ కెసార్ పొంటీస్ అన్నారు. ప్రయోగం విజయం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడుతూ పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ అమోఘం అని, ఈ రాకెట్ తయారు చేసిన టీంను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. భారత్‌లో ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం పలికేందుకు న్యూ స్పేస్ ఇండియాను ఏర్పాటు చేశామని సీఎండీ నారాయణన్ తెలిపారు. భారత్‌లో ప్రైవేట్ సంస్థలకు చెందిన వారు ఉప గ్రహాలను తయారు చేసుకుంటే వాటిని ఇస్రో ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రముఖుల అభినందనలు వాణిజ్యపరంగా మొట్టమొదటిసారిగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైనందుకు ప్రధాని మోదీ శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. దేశం చేపట్టిన సంస్కరణలు అంతరిక్ష ప్రయోగాల్లో కొత్త శకానికి నాందిపలికాయన్నారు. అమెజానియా ప్రయోగం విజయవంతం కావడంపై బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సనారోకు ప్రధాని అభినందనలు తెలిపారు. అంతరిక్ష రంగంలో రెండు దేశాల మధ్య సహకారానికి నాందికానుందన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఇస్రోకు ఏపీ గవర్నర్ అభినందనలు సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సి–51 రాకెట్ ప్రయోగం విజయవంతంకావడంపట్ల గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. ఏపీ ముఖ్యమంత్రి అభినందనలు పీఎస్ఎల్వీ –సీ 51 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ఇస్రో భవిష్యత్‌లో చేపట్టే అన్ని ప్రయోగాల్లోనూ విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
అంతరిక్ష సంస్కరణల్లో కొత్తశకం: మోదీ
సాక్షి, శ్రీహరి కోట : పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతం అవ్వటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇస్రో, ఎన్ఎస్ఐఎల్కు అభినందనలు తెలియజేశారు. అంతరిక్ష సంస్కరణల్లో కొత్తశకం ప్రారంభమైందని, 19 ఉపగ్రహాల ప్రయోగం కొత్త ఆవిష్కరణలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. పీఎస్ఎల్వీ సీ-51 ప్రయోగం విజయవంతంపై గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. ఇస్రో చీఫ్ శివన్ మాట్లాడుతూ.. బ్రెజిల్ బృందానికి అభినందనలు తెలియజేశారు. ఇస్రో, బ్రెజిల్ అనుసంధానంతో తొలి ప్రయోగం గర్వంగా ఉందన్నారు. 19 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టామని తెలిపారు. కాగా, శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.19 ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లింది. వీటిలో దేశీయ ప్రైవేట్ సంస్థలకు చెందిన 5 ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలు ఉన్నాయి. ఉపగ్రహం ద్వారా అంతరిక్షంలోకి మొదటిసారి ప్రధాని మోదీ ఫొటో, భగవద్గీత కాపీ, 25 వేల మంది పేర్లను పంపింది. వాటిలో వెయ్యి మంది విదేశీయుల పేర్లతో పాటు చెన్నై విద్యార్ధుల పేర్లు ఉన్నాయి. -
శ్రీహరికోట: నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51
-
నేడు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-51 రాకెట్
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-51
సూళ్లూరుపేట/తిరుమల/శ్రీకాళహస్తి: శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదివారం ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించింది. పీఎస్ఎల్వీ సీ 51 ద్వారా బ్రెజిల్ దేశానికి చెందిన అమెజానియా–1 ఉపగ్రహం(637 కిలోల బరువు), అమెరికాకు చెందిన స్పేస్ బీస్ ఉపగ్రహాల శ్రేణిలో 12, సాయ్–1 నానో కాంటాక్ట్–2 ఉపగ్రహాలు, న్యూ స్పేస్ ఇండియా పేరుతో భారత ప్రైవేట్ సంస్థలకు చెందిన సతీష్ ధవన్ శాట్, సింధు నేత్ర, దేశంలోని మూడు వర్సిటీలకు చెందిన శ్రీ శక్తి శాట్, జిట్ శాట్, జీహెచ్‌ఆర్‌సీఈ శాట్‌లను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వీటిలోని ఒక శాటిలైట్‌లో తొలిసారిగా మోదీ ఫొటో, భగవద్గీత అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. వైఎస్ జగన్ అభినందనలు.. ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. -
28న ‘ప్రైవేట్’తో ఇస్రో తొలి ప్రయోగం
సాక్షి, సూళ్లూరుపేట: ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో తొలి ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రంగం సిద్ధంచేసింది. ఈ నెల 28న ఉ.10.24 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ51తో తొలి అడుగు వేయనుంది. ఇందులో భాగంగా ఈ నెల 28న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ ద్వారా దేశంలోని ప్రైవేట్ సంస్థలకు చెందిన ఐదు ఉపగ్రహాలు, 14 విదేశీ ఉపగ్రహాలను రోదసీలోకి పంపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 19 ఉపగ్రహాల్లో బ్రెజిల్‌కు చెందిన అమెజానియా–1 ప్రధాన ఉపగ్రహం కాగా.. అమెరికాకు చెందిన స్పేస్ బీస్ పేరుతో 12 ఉపగ్రహాలు, సాయ్–1 నానో కాంటాక్ట్–2 అనే ఒక ఉపగ్రహంతో పాటు యూనిటీశాట్ పేరుతో మూడు యూనివర్సిటీ విద్యార్థులు తయారుచేసిన మూడు ఉపగ్రహాలు, సతీష్ ధవన్ శాట్, సింధునేత్ర అనే ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. కాగా, పీఎస్ఎల్వీ సీ51 రాకెట్‌కు అన్ని పరీక్షలను పూర్తిచేసి సిద్ధంచేశారు. ప్రయోగ బాధ్యతలను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (లాబ్)కు గురువారం అప్పగించనున్నారు. 27వ తేదీ శనివారం ఉ.9.24 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. -
నింగిలోకి ప్రధాని మోదీ ఫొటో
న్యూఢిల్లీ: భగవద్గీత పుస్తకం, ప్రధాని మోదీ చిత్రపటం, 25 వేల మంది పౌరుల పేర్ల జాబితాను ఈ దఫా నింగిలోకి తీసుకుపోయేందుకు ఇస్రో సిద్ధమైంది. ఇస్రో 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా దేశీయ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను నింగిలోకి పంపనుంది. వీటిలోని ఒక శాటిలైట్‌లో మోదీ ఫొటో, భగవద్గీత కాపీ, పౌరుల పేర్లను అంతరిక్షంలోకి పంపనున్నారు. ఫిబ్రవరి 28న పీఎస్ఎల్వీ సీ–51 ద్వారా బ్రెజిల్‌కు చెందిన అమెజోనియా–1, భారత ప్రైవేటు సంస్థలు రూపొందించిన ఆనంద్, సతీశ్ ధావన్, యునిటీశాట్ ఉపగ్రహాలతో పాటు మొత్తం 21 శాటిలైట్లను ప్రయోగించనుంది. వీటిలో ఆనంద్‌ను బెంగళూరుకు చెందిన అంకుర సంస్థ పిక్సెల్, సతీశ్ ధావన్(ఎస్డీ శాట్)ను చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్ ఇండియా, యునిటీశాట్‌ను జిట్‌శాట్ (శ్రీపెరంబుదూర్), జీహెచ్‌ఆర్‌సీఈ శాట్(నాగ్‌పుర్), శ్రీశక్తి శాట్ (కోయంబత్తూరు) కళాశాలల విద్యార్థులు రూపొందించారు. వీటిలో సతీష్‌ధావన్ శాటిలైట్‌లో మోదీ పేరు, ఫొటో, ‘ఆత్మనిర్భర్ మిషన్’∙పదాలు, భగవద్గీత కాపీ, 25000 మంది పౌరుల పేర్ల జాబితాను తీసుకెళ్లనున్నట్లు స్పేస్ కిడ్జ్ సీఈవో డాక్టర్ శ్రీమతి కేసన్ తెలిపారు. అంతరిక్షంలోకి పేర్లను పంపేందుకు అడిగిన వారం రోజుల్లోనే 25వేల ఎంట్రీలు వచ్చాయి. వీటిలో 1000 పేర్లు విదేశీయులవి ఉన్నాయన్నారు. వీరందరికీ బోర్డింగ్ పాస్‌లు ఇచ్చామన్నారు. ప్యానెల్ దిగువన ఇరువైపులా ఇస్రో చైర్మన్ శివన్, సైంటిఫిక్ సెక్రటరీ ఉమామహేశ్వరన్ పేర్లను చెక్కినట్లు తెలిపారు. విదేశాలకు చెందిన కొన్ని ప్రయోగాల్లో ఆయా దేశాలు బైబిల్‌ను అంతరిక్షంలోకి పంపాయి. ఇదే తరహాలో హిందువుల పవిత్ర గ్రంథమైన భగవద్గీతను అంతరిక్షంలోకి పంపించాలనుకుంటున్నామని డాక్టర్ శ్రీమతి వెల్లడించారు. పీఎస్ఎల్వీ సీ–51 వాహకనౌకను శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ఫిబ్రవరి 28న ఉదయం 10.24 గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో అధికారులు తెలిపారు. -
నిప్పులు కక్కుతూ నింగిలోకి..
సాక్షి,అమరావతి/శ్రీహరికోట(సూళ్లూరుపేట ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీస్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహక నౌకను గురువారం సాయంత్రం 3.41 గంటలకు విజయవంతంగా ప్రయోగించి ఈ ఏడాది రెండో విజయాన్ని అందుకుంది. 25 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. 20.11 నిమిషాల వ్యవధిలో 1,410 కిలోలు బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహంలో కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరు సమీపంలోని ఉపగ్రహాల నియంత్రణ కేంద్రం వారు అదుపులోకి తీసుకున్నారు. ఉపగ్రహానికి ఉన్న సోలార్ ప్యానెల్స్ కూడా వెంటనే విచ్చుకున్నట్టు వారు చెప్పారు. 320 టన్నుల బరువుతో ప్రయాణం 44.4 మీటర్ల పొడవు గల పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగ సమయంలో 320 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమైంది. కౌంట్‌డౌన్ ముగిసే సమయం దగ్గర పడడంతో మిషన్ కంట్రోల్ రూమ్‌లో శాస్త్రవేత్తలు టెన్ నుంచి వన్ దాకా అంకెలు చెబుతూ జీరో రాగానే మంచు తెరలతో కూడిన మబ్బులను చీల్చుకుంటూ పీఎస్ఎల్వీ సీ–50 ఉపగ్రహ వాహకనౌక విజయవంతంగా నింగి వైపునకు దూసుకెళ్లింది. అది ఒక్కో దశను విజయవంతంగా దాటి వెళుతుంటే శాస్త్రవేత్తల వదనాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ కంట్రోల్ రూంలోని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ సంతోషంగా లేచి సహచర శాస్త్రవేత్తలతో కరచాలనం చేశారు. విజయ పరంపర: ఇస్రోకు బ్రహ్మాస్త్రం లాంటి పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ 52వ సారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయబావుటా ఎగురవేసింది. షార్ నుంచి 77వ ప్రయోగం, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 52 ప్రయోగాలు జరగ్గా.. 50 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. గగన్‌యాన్–01 ప్రయోగానికి ప్రణాళికలు సిద్ధం 2021 ప్రారంభంలో పీఎస్ఎల్వీ సీ–51 ప్రయోగాన్ని ఫిక్సల్ ఇండియా పేరుతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆనంద్ అనే రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం, యూనిటిశాట్ అనే ఉపగ్రహాన్ని పంపనున్నట్టు చెప్పారు. స్పేస్ కిడ్స్ ప్రోగ్రాం కింద దేశంలోని యూనివర్సిటీ విద్యార్థులు తయారు చేసే ఉపగ్రహాలను పంపిస్తామని చెప్పారు. చంద్రుడిపై అధ్యయనం చేసేందుకు చంద్రయాన్–3, సూర్యుడిపైనా పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్–01 గ్రహాంతర ప్రయోగాలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ తర్వాత గగన్‌యాన్–01 పేరుతో మానవ సహిత ప్రయోగానికీ ప్రణాళికలు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ) పేరుతో సరికొత్త ప్రయోగాలు చేపడుతున్నట్టు వెల్లడించారు. జీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ మార్క్–3 వంటి ప్రయోగాలు చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు. అనంతరం ప్రయోగాన్ని విజయంతం చేసేందుకు కృషిచేసిన మిషన్ టీం, శాటిలైట్ టీంలను అభినందించారు. పీఎస్ఎల్వీ సీ–50 ద్వారా ప్రయోగించిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) ఉపగ్రహం సేవలు ఎంతో మెరుగ్గా ఉంటాయన్నారు. 11 ఏళ్ల కిందట ప్రయోగించిన జీశాట్–12 స్థానంలో ఈ ఉపగ్రహం సేవలందిస్తుందని తెలిపారు. సీఎంఎస్–01 ఉపగ్రహాన్ని విజయవంతంగా సబ్ జీటీవో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టామని, శుక్రవారం నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు సార్లు మండించి సబ్ జీటీవో ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతామన్నారు. ఈ ప్రక్రియ నాలుగు రోజుల పాటు నిర్వహించి 21వ తేదీన భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని జియో ఆర్బిట్‌కు పంపిస్తామని శివన్ వివరించారు. ప్రయోగంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, పలు సెంటర్ల డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంల అభినందనలు.. పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినదందనలు తెలిపారు. భారీ ప్రయోగాలే లక్ష్యం : ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ ఈ ఏడాది కోవిడ్–19 పరిస్థితుల దృష్ట్యా 8 నెలల పాటు ప్రయోగాలన్నింటికీ బ్రేక్ పడ్డాయని, ప్రస్తుతం ఆ పరిస్థితులను అధిగమించి రెండు ప్రయోగాలను విజయ వంతం చేయగలిగామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ చెప్పారు. 2021 సంవత్సరం స్పేస్ రీఫామ్ ఇయర్‌గా ఉంటుం దని తెలిపారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–50 ప్రయోగం విజయవంతం కావడంతో ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి ప్రసంగించారు. -
ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్ ప్రయోగాలు విజయవంతం కావాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. (నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్) ఇస్రో మరో మైలురాయిని అధిగమించింది.. పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీబీ హరిచందన్ అభినందించారు. అంతరిక్ష ప్రయోగాల్లో ఇస్రో మరో మైలురాయిని అధిగమించిందని అన్నారు. కోవిడ్ సమయంలో కూడా ప్రయోగాలను విజయవంతం చేయడం ఇస్రో శాస్త్రవేత్తల అంకిత భావానికి నిదర్శనమని కొనియాడారు. భవిష్యత్‌లో ఇస్కో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
ఇస్రో చైర్మన్ హర్షం..
-
నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్
-
నింగికెగిసిన పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్
సాక్షి, సూళ్లూరుపేట: శ్రీహరికోట సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈ రోజు 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ-50 ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది.1410 కిలోల బరువుగల కమ్యూనికేషన్ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. నాలుగు దశల రాకెట్ ప్రయాణాన్ని 20.11 సెకన్లలో ప్రయోగం ముగిసేటట్లుగా శాస్త్రవేత్తలు రూపకల్పన చేశారు. సీఎంఎస్-01 కమ్యూనికేషన్ శాటిలైట్‌ను నింగిలోకి ఇస్రో పంపింది. సీ-బ్యాండ్ సేవల విస్తరణకు సీఎంఎస్-01 దోహదపడనుంది. ఏడేళ్లపాటు సేవలందించనుంది. జిశాట్-12 స్థానాన్ని సీఎంఎస్-01 శాటిలైట్ భర్తీ చేయనుంది. సీఎంఎస్ -01 దేశానికి చెందిన 42వ కమ్యూనికేషన్ ఉపగ్రహం కాగా, పీఎస్ఎల్వీ సీ-50 ప్రయోగం మొదటి దశ విజయవంతం అయ్యింది. (చదవండి: ఏపీలో మరో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్) ఇస్రో చైర్మన్ హర్షం.. పీఎస్ఎల్వీ సీ-50 రాకెట్ ప్రయోగం విజయవంతంపై ఇస్రో చైర్మన్ కే శివన్ హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. శాటిలైట్ అద్భుతంగా పని చేస్తోందని, నాలుగు రోజుల్లో నిర్ణీత స్లాట్‌లో ప్రవేశపెడతామని శివన్ పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా రూపొందించిన పీఎస్ఎల్వీ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్తోంది. రెండు టన్నులకు మించి బరువు కలిగిన అతి పెద్ద ఉపగ్రహాలను ఫ్రాన్స్, రష్యా అంతరిక్ష సంస్థల నుంచి ఇస్రో పంపిస్తోంది. అతి చిన్న విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీల ద్వారా ప్రయోగించి వాణిజ్యపరంగా ఇస్రోకు ఆదాయాన్ని తీసుకొచ్చేగనిగా మారింది. చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి గ్రహాంతర ప్రయోగాలు, ఒకేసారి పది ఉపగ్రహాలు, 20 ఉపగ్రహాలు, ఆ తరువాత 104, మళ్లీ 38 ఉపగ్రహాలను సునాయాసంగా మోసుకెళ్లి అంతరిక్ష కక్ష్యలో ప్రవేశపెట్టగలిగిన ఘనత పీఎస్‌ఎలీ్వకే సొంతం. ఇప్పటి వరకు 51 పీఎస్ఎల్వీ రాకెట్లను ప్రయోగించగా అందులో రెండు మాత్రమే విఫలమయ్యాయి. గురువారం నాటి ప్రయోగంతో మరో కీలక ఘట్టానికి షార్ వేదికైంది. (చదవండి: దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్) ♦పీఎస్ఎల్వీ రాకెట్‌ను ఇస్రో రెండు రకాలుగా ఉపయోగిస్తోంది. తక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను తీసుకెళ్లేటప్పుడు స్ట్రాఫాన్ బూస్టర్లు లేకుండా చేస్తారు. దీన్ని కోర్ అలోన్ ప్రయోగమని ఇస్రో పరిభాషలో అంటారు. ♦ఎక్కువ బరువు కలిగిన ఉపగ్రహాలను మోసుకెళ్లాలంటే అత్యంత శక్తివంతమైన స్ట్రాపాన్ బూస్టర్లతో చేస్తారు. ఈ తరహా ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో ఇప్పటికి 21 ప్రయోగాలు చేశారు. ♦ఇటీవలి కాలంలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ – క్యూఎల్, నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లతో చేసే ప్రయోగాన్ని పీఎస్ఎల్వీ – డీఎల్ అనే పేర్లతో చేస్తున్నారు. ♦వీటి ద్వారా కమ్యూనికేషన్ ఉపగ్రహాలు, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు (దూర పరిశీలన ఉపగ్రహాలు), చంద్రయాన్ ∙1, మంగళ్యాన్ – 1 లాంటి గ్రహాంతర ప్రయోగాలు, భారత క్షేత్రీయ దిక్సూచి వ్యవస్థ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపించి దేశ ప్రజలకు అత్యంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంలో పీఎస్ఎల్వీ అగ్రగామిగా ఉంది. ♦ఎక్కువ ఉపగ్రహాలను మోసుకెళ్లి సూర్యానువర్తన ధ్రువకక్ష్యలో వివిధ రకాల కక్ష్యల్లో ప్రవేశపెట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండే రాకెట్ కూడా ఇదే కావడం గమనార్హం. ఓకే ఆర్బిట్.. ఎనిమిది రకాల కక్ష్యలు ఒకే ఆర్బిట్‌లో ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించి ఎక్కువ ఉపగ్రహాలను తీసుకెళ్లిన ఘనత పీఎస్‌ఎలీ్వదే. గతేడాది జనవరి 24న పీఎస్ఎల్వీ సీ – 44 రాకెట్లో నాలుగో దశను ప్రయోగాత్మకంగా చేసి రెండు రకాల కక్ష్యల్లో మూడు ఉపగ్రహాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగమిచ్చిన విజయంతో ఏప్రిల్ 1న పీఎస్ఎల్వీ సీ – 45 ప్రయోగంలో నాలుగోదశ (పీఎస్ – 4) ద్వారా మూడు రకాల కక్ష్యల్లో 29 ఉపగ్రహాలను విడివిడిగా ప్రవేశపెట్టగలిగారు. ♦జనవరి 24న ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ – 44 ద్వారా పీఎస్ – 4 దశలో సూర్యానువర్తన ధ్రువకక్ష్యలోనే ఎనిమిది రకాల కక్ష్యలను గుర్తించింది. ♦భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఉపగ్రహాలను భూమికి 800 కిలోమీటర్ల ఎత్తు నుంచి 504 కిలోమీటర్లు తగ్గించుకుంటూ వస్తే 8 రకాల కక్ష్యల్లోకి ప్రవేశపెట్టే వీలుంటుందని గుర్తించింది పీఎస్ఎల్వీ రాకెట్టే కావడం గమనార్హం. పీఎస్ఎల్వీ సీ – 45లోని పీఎస్ – 4 దశ ముందుగా 753 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో ఈఎంఐ శాట్ అనే ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టాక పీఎస్ – 4 దశను మండించి మళ్లీ కిందికి తీసుకొచ్చి 508 కిలోమీటర్ల ఎత్తులో కొన్ని ఉపగ్రహాలు, 505 కిలోమీటర్ల ఎత్తులో మరికొన్ని ఉపగ్రహాలను ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించింది కూడా పీఎస్ఎల్వీ రాకెట్టే కావడం గమనార్హం. -
నేడు పీఎస్ఎల్వీ సీ50 ప్రయోగం
సూళ్లూరుపేట/తిరుమల/శ్రీకాళహస్తి: సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహక నౌకకు బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్‌డౌన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం మధ్యాహ్నం మిషన్ సంసిద్ధతా సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. ల్యాబ్ చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి ప్రయోగానికి 25 గంటల కౌంట్‌డౌన్‌ను ప్రారంభించారు. ఈ ప్రయోగం ద్వారా 1,410 కిలోల బరువు గల సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ ఎత్తులో, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని దీర్ఘ వృత్తాకార జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశ పెట్టనున్నారు. ప్రయోగం విజయవంతం కావాలని.. పీఎస్ఎల్వీ–సీ50 ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో డిప్యూటీ సెక్రటరీ లక్ష్మణ్ బుధవారం తిరుమల,శ్రీకాళహస్తీశ్వరాలయంలో పూజలు నిర్వహించారు. పీఎస్ఎల్వీ–సీ50 నమూనాను శ్రీవారి పాదాల చెంత, శ్రీకాళహస్తి ఆలయంలోని స్వామి, అమ్మవార్ల సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. నింగివైపు దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహక నౌక -
రాకెట్ రెడీ: పీఎస్ఎల్వీ సీ50
సాక్షి, సూళ్లూరుపేట: షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి ఈనెల 17న సాయంత్రం 3.41 గంటలకు పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు ఇస్రో ఏర్పాట్లు చేస్తోంది. 1,410 కేజీల బరువు కలిగిన సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే సరికొత్త కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో (వ్యాబ్)లో రాకెట్ అనుసంధానం చేసిన దృశ్యాలను ఇస్రో శుక్రవారం విడుదల చేసింది. చదవండి: గగనం.. దూరం -
పీఎస్ఎల్వీ సీ49 సూపర్ సక్సెస్
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ49 (పీఎస్ఎల్వీ–డీఎల్) ప్రయోగం విజయవంతమైంది. ముందుగా నిర్ణయించిన కాలం ప్రకారం మధ్యాహ్నం 3:02 గంటలకు ప్రయోగించాల్సి ఉండగా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా 3:11 గంటలకు ప్రయోగించారు. ఏకంగా 10 ఉపగ్రహాలు ఈ ప్రయోగం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు 630 కిలోల బరువు కలిగిన పది ఉపగ్రహాలను 575 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్త ధ్రువకక్ష్యలోకి (సన్ సింక్రనస్ ఆర్బిట్) విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం ద్వారా దేశీయ అవసరాల నిమిత్తం రూపొందించిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) అనే ఉపగ్రహంతో పాటు లిథువేనియాకు చెందిన ఆర్–2, లక్జెంబర్గ్‌కు చెందిన కేఎస్ఎం–1ఏ, కేఎస్ఎం–1బీ, కేఎస్ఎం–1సీ, కేఎస్ఎం–1డీ, అమెరికాకు చెందిన లిమూర్ అనే ఉపగ్రహాల శ్రేణిలో నాలుగు ఉపగ్రహాలను నిరీ్ణత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) ఉపగ్రహాన్ని మన దేశ అవసరాల కోసం రూపొందించారు. ఇది రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహమే అయినప్పటికీ, ఇందులో ఉన్న శక్తిమంతమైన కెమెరాలు రైతులకు ఉపయోగపడేలా, వ్యవసాయానికి సంబంధించిన పలు విషయాల పూర్తిస్థాయి సమాచారాన్ని అందిస్తుంది. అద్భుతమైన ప్రయోగం: ఇస్రో చైర్మన్ ఇదొక అద్భుతమైన ప్రయోగమని ఇస్రో చైర్మన్ డాక్టర్ శివన్ అన్నారు. 10 ఉపగ్రహాలను ముందుగా అనుకున్న ప్రకారమే విజయవంతంగా ప్రయోగించామని తెలిపారు. ఈఓఎస్–01 కక్ష్యలోకి ప్రవేశించిన కొద్ది సేపటికే సోలార్ ప్యానల్స్ కూడా విజయవంతంగా విచ్చుకున్నామని తెలిపారు. కోవిడ్–19 పరిస్థితులను అ«ధిగమించి విజయం సాధించామన్నారు. రాకెట్ అనుసంధానం చేసేటపుడు కభౌతిక దూరాన్ని పాటించినట్లు చెప్పారు. అభినందనల వెల్లువ పీఎస్ఎల్వీ–సీ49 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు, ప్రయోగంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ప్రధాని మోదీ అభినందించారు. 10 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి పంపేందుకు కృషి చేసిన శాస్త్రవేత్తలను ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ అభినందించారు. ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. దేశంలో వ్యవసాయం, అటవీ, విపత్తుల నిర్వహణకు ఈఓఎస్–01 ఉపగ్రహం ఎంతో తోడ్పడుతుందని గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తం చేశారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-49
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ-49
సాక్షి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం ఈ ప్రయోగం చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ద్వారా స్వదేశానికి చెందిన ఎర్త్ అబ్జర్వేషన్(ఈవోఎస్ 01) శాటిలైట్‌తో పాటు అమెరికాకు చెందిన నాలుగు ఉపగ్రహాలు, లక్స్‌ంబర్గ్‌కు చెందిన నాలుగు ఉపగ్రహాలు, తిథువేనియాకు చెందిన ఒక చిన్న తరహా ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. వ్యవసాయం, ప్రకృతి వైపరిత్యాలపై ఈవోఎస్ 01 అధ్యయనం చేయనుంది. షార్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రయోగ ప్రక్రియను చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ-49 ప్రయోగం విజయవంతం అయిన సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. Hearty congratulations to the team at @isro behind the successful launch of #PSLVC49, carrying #E0S01 and nine international customer satellites. My best wishes to the scientists for their future endeavours. — YS Jagan Mohan Reddy (@ysjagan) November 7, 2020 WATCH ISRO launches EOS01 and 9 customer satellites from Satish Dhawan Space Centre in Sriharikota pic.twitter.com/2ifOeAYIpx — ANI (@ANI) November 7, 2020 -
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
సాక్షి, నెల్లూరు: ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. శ్రీహరి కోట నుంచి శనివారం మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1.02 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. పీఎస్ఎల్వీ సీ-49 రాకెట్ ద్వారా నింగిలోకి పది ఉపగ్రహాలను పంపనున్నారు. ఈఓఎస్-01 అనే ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనుంది. ఇప్పటికే ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు శ్రీహరికోట షార్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీహరి కోట రాకెట్ ప్రయోగ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా మిగతా ఎవ్వరికీ ఇస్రో అనుమతించడం లేదు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం కాగా, షార్ నుంచి 76వ ప్రయోగం కావడం గమనార్హం. (ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీల ఆసక్తి) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి రేపు సాయంత్రం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇవాళ నమూనా రాకెట్‌కు తిరుమల శ్రీవారి ఆలయంలో ఇస్త్రో శాస్ర్తవేత్తల బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శాటిలైట్ ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను నింగిలోకి పంపుతోంది ఇస్రో. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. తొలుత ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా శనివారం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. -
7న పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగం
సాక్షి, సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి నవంబర్ 7న సాయంత్రం 3.02 గంటలకు పీఎస్ఎల్వీ సీ49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (ఈఓఎస్–01) అనే ఉపగ్రహంతో పాటు విదేశాలకు చెందిన 9 చిన్న తరహా ఉపగ్రహాలను ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను రూపొందించి ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలుత ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా నవంబర్ 7న నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చదవండి: అస్సాంలో జేఈఈ టాపర్ అరెస్టు -
మిధాని సీఎండీగా సంజయ్ కుమార్ ఝా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రక్షణ రంగ సంస్థ మిశ్ర ధాతూ నిగమ్ (మిధాని) నూతన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా డాక్టర్ సంజయ్ కుమార్ ఝా శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన మిధానిలోనే ఉత్పత్తి, మార్కెటింగ్ విభాగపు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. లోహశాస్త్ర ఇంజనీరింగ్‌లో బీఎస్సీ (1988) తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో చేరిన అనంతరం ఆయన హైదరాబాద్‌లోనే ఉన్న న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో చేరారు. అణు ఇంధనాల తయారీ విషయంలో పలు సాంకేతిక సృజనలు చేశారు. అంతరిక్ష ప్రయోగాలకు ఉపయోగించే పీఎస్ఎల్వీ రాకెట్‌కు అవసరమైన కీలక విడి భాగాలను కూడా తయారు చేశారు. న్యూక్లియర్ ఫ్యుయల్ కాంప్లెక్స్‌లో అందించిన సేవలకు పలు అవార్డులు పొందారు. 2006లో కేంద్ర అణు శక్తి విభాగం సంజయ్ కుమార్‌ను ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవార్డుతో సత్కరించింది. ఇదే విభాగం నుంచి ఐదుసార్లు గ్రూపు అవార్డులు కూడా పొందిన ఆయన 2016లో మిధానిలో చేరారు. -
కరోనా ఎఫెక్ట్:PSLVC-49 ప్రమోగం వాయిదా
-
విదేశీ ఉపగ్రహ మార్కెట్‌పై ఇస్రో దృష్టి
సాక్షి, అమరావతి: ఉపగ్రహ ప్రయోగాలకు ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్ వైపు చూస్తున్నాయి. ఈ ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట వేదిక కావడం గమనార్హం. అతి తక్కువ వ్యయంతో ఒకేసారి పలు ఉపగ్రహాలను నింగిలోకి పంపే సామర్థ్యాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) కలిగి ఉండటంతో విదేశాలు ఇక్కడికి క్యూ కడుతున్నాయి. 1999లో తొలిసారిగా జర్మనీకి చెందిన డీఎల్ఆర్–టబ్‌సాట్ రిమోట్ సెన్సింగ్ మైక్రో శాటిలైట్‌ను విజయవం తంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇస్రో ఇక వెనుతిరిగి చూసుకోలేదు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 319 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. ఇస్రో స్వయం ప్రతిపత్తి... విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా ఇస్రో 2018–19లో రికార్డు స్థాయిలో రూ.324.19 కోట్ల ఆదాయం ఆర్జించింది. 2017–18లో రూ.232.56 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. గడిచిన ఐదేళ్లలో రూ.1,245.17 కోట్ల నికర ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇస్రో తన ప్రయోగాలకు సొంతంగానే నిధులను సమకూర్చుకునే స్థితికి చేరుకుంటోంది. విదేశీ ఉపగ్రహా ప్రయోగాల కోసం బెంగళూరు కేంద్రంగా ఆంట్రిక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసింది. 1992లో ఏర్పాటైన ఈ సంస్థ గడిచిన మూడేళ్లలో 239 ఒప్పందాల ద్వారా రూ.6,280 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని సముపార్జించింది. విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి పంపడంలో పీఎస్ఎల్వీ కీలకపాత్ర పోషిస్తోంది. ఇంతవరకు పీఎస్ఎల్వీ 52.7 టన్నుల శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. గత నెలలోనే పీఎస్ఎల్వీ–ఎక్స్ఎల్ అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. వచ్చే మార్చిలోగా ఆరుసార్లు ఉపగ్రహలను నింగిలోకి పంపే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. పదేళ్లలో రూ.20,300 కోట్లు రానున్న పదేళ్లలో అంతర్జాతీయ శాటిలైట్ మార్కెట్ వేగంగా విస్తరించనుందని బీఐఎస్ రీసెర్చ్ సంస్థ అంచనా వేసింది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 17,000కుపైగా మినీ శాటిలైట్లను ప్రయోగిస్తారని చెబుతోంది. ప్రస్తుతం రూ.3,591 కోట్లుగా ఉన్న శాటిలైట్ లాంచింగ్ మార్కెట్ విలువ 2030 నాటికి రూ.20,300 కోట్లకు చేరుతుందని బీఐఎస్ లెక్కగట్టింది. ప్రస్తుతం ఈ మార్కెట్లో ఇస్రో వాటా కేవలం 2 శాతమే. ఈ వ్యాపార అవకాశాలను ఒడిసి పట్టుకోవడానికి ఆంట్రిక్స్కు అనుబంధంగా న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్) పేరిట 2019లో మరో సంస్థను ఇస్రో ఏర్పాటు చేసింది. ఈ సంస్థ విదేశాలకు చెందిన ఉపగ్రహ ప్రయోగాలు, శాటిలైట్ అభివృద్ధి వ్యాపారంపై దృష్టి సారిస్తుంది. -
శ్రీహరికోట నుండి నింగిలోకి పీఎస్ఎల్వీ సీ- 48
-
రేపు సా.3.25 గంటలకు పీఎస్ఎల్వీ సీ–48 ప్రయోగం
-
ఇస్రో విజయ విహారం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి జయ కేతనం ఎగురవేసింది. విజయాల పరంపరను కొనసాగిస్తూ షార్ నుంచి 74వ ప్రయోగాన్ని బుధవారం విజయవంతంగా ముగించింది. నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ ద్వారా 1625 కిలోలు బరువు కలిగిన కార్టోశాట్–3 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. 14 ఉపగ్రహాలను భూమికి 509 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సర్క్యులర్ సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో వివిధ దశల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగ విజయంతో ఈ ఏడాది అయిదు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్లయింది. ప్రయోగానంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ బృందాన్ని ఆలింగనం చేసుకోగా, శాస్త్రవేత్తలు తమ సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. వచ్చే మార్చిలోపే 13 మిషన్ల ప్రయోగం 2020 ఏడాది మార్చి 31లోపు 13 మిషన్లను ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఇందులో ఆరు లాంచింగ్ వెహికల్స్, 7 ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు. రాబోయే నాలుగు నెలలు ఇస్రో కుటుంబం తీరికలేకుండా పనిచేయాల్సి ఉంటుందన్నారు. షార్ నుంచి 74 ప్రయోగాలు చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్‌ను 49సార్లు ప్రయోగించగా 47సార్లు సక్సెస్ అయ్యింది. పీఎస్ ఎల్వీ ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో 21 ప్రయోగమిది. ఈ ఏడాది 5వ ప్రయోగం కావడం విశేషం. కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో ఈ ప్రయోగం తొమ్మిదవది. మనదేశ ఖ్యాతి మరింత పైకి: జగన్ సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భూతల మ్యాపింగ్, ఛాయాచిత్రాలను మరింత అత్యాధునికంగా తీసి సమాచారాన్ని పంపే ఈ ఉపగ్రహాల ప్రయోగంతో ప్రపంచంలోనే మన దేశ ఖ్యాతిని శాస్త్రవేత్తలు అగ్రభాగాన నిలిపారని జగన్ ప్రశంసించారు. ఈ ప్రయోగాలను విజయవంతం చేయడం ద్వారా ఇస్రో మరో మైలురాయిని చేరుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కేసీఆర్ అభినందనలు.. సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ సీ47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు. భారతీయ శాస్త్రవేత్తల నైపుణ్యం, కృషికి ప్రస్తుత విజయం తార్కాణంగా నిలుస్తుందన్నారు. దేశీయ అవసరాలకే కార్టోశాట్–3 దేశీయ బౌగోళిక అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. కార్టోశాట్ సిరీస్‌లో ఇప్పటికే ఎనిమిది ఉపగ్రహాలను పంపించగా, ఇది తొమ్మిదవది. కార్టోశాట్–3 థర్డ్ జనరేషన్ ఉపగ్రహం కావడం విశేషం. గతంలో ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహాల కంటే ఈ ఉపగ్రహం అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన ప్రాంకోమాటిక్ మల్టీ స్ప్రెక్ట్రరల్ కెమెరాలు అత్యంత శక్తిమంతమైనవి. దీనిద్వారా పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌లు తయారు చేయడం, విపత్తులను విస్తృతిని అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రత్యేకించి నిఘాలో సైనిక అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతోంది. ఈ ఉపగ్రహం అయిదేళ్లుపాటు సేవలు అందిస్తుంది. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ- సీ 47 రాకెట్
సాక్షి, నెల్లూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి పీఎస్ఎల్వీ- సీ 47 వాహక నౌక దూసుకెళ్లింది. 14 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ- సీ 47 వాహకనౌక మోసుకెళ్లింది. ఈ వాహననౌక భూమిని వీడిన అరగంటలోపే కార్టోశాట్-3తో పాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ- సీ 47 వాహకనౌక నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. అంటార్కిటికాలోని ఇస్రో కేంద్రం పీఎస్ఎల్వీ సంకేతాలను అందుకోనుంది. కార్టోశాట్-3 ఉపగ్రహం భూవాతావరణం, విపత్తులను హెచ్చరించనుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రణాళికలు, రహదారుల నెట్వర్క్ పరిశీలన, నీటి సరఫరాపై అధ్యయనానికి ఇది ఉపయోగపడనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో కార్టోశాట్-3ని రూపొందించింది. 1,625 కిలో బరువున్న కార్టోశాట్-3 జీవితకాలం ఐదేళ్ల పాటు సేవలందించనుంది. ఉపగ్రహం తయారీకి ఇస్రో రూ.350 కోట్లు ఖర్చు చేసింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ.. ప్రయోగంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. వచ్చే మార్చి లోగా మరో 6 రాకెట్లతో 13 మిషన్లు ప్రయోగించనున్నట్లు తెలిపారు. ఈ విజయం భవిష్యత్ ప్రయోగాలకు మరింత స్పూర్తినిస్తుందని ఇస్రో చైర్మన్ డా. శివన్ అన్నారు. పీఎస్ఎల్వీ సీ-47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ప్రయోగ పర్వంలో ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషిని చూసి దేశం మొత్తం గర్విస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఇస్రో బృందానికి ఇలాంటి మరెన్నో అద్భుతమైన విజయాలు దక్కాలని ఆయన మనసారా ఆకాంక్షించారు. -
పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం నేడే
సూళ్లూరుపేట/తిరుమల: పీఎస్ఎల్వీ సీ47 ఉపగ్రహ వాహకనౌక బుధవారం నింగిలోకి ఎగరనుం ది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.28కి ఈ ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మంగళవారం ఉదయం 7.28కి కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభిం చారు. సోమవారం ఎంఆర్ఆర్ కమిటీ ఆధ్వర్యం లో మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం నిర్వహించి రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించారు. అనంతరం ప్రయోగపనులు లాంచ్ ఆథరైజేషన్ బోర్టు (ల్యాబ్)కు అప్పగించారు. కౌంట్‌డౌన్‌లో భాగంగా నాలుగోదశ, రెండోదశలో ద్రవ ఇందనాన్ని నింపే ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం రాకెట్‌లోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసే ప్రక్రియను చేపట్టారు. పీఎస్ఎల్వీ సీ 47 ద్వారా 714 కిలోల బరువున్న కార్టోశాట్–3 ఉపగ్రహంతో పాటు అమెరికాకు చెందిన 12 ఫ్లోక్–4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపుతున్నా రు. మంగళవారం ఇస్రో చైర్మన్ శివన్ షార్కు చేరుకుని రాకెట్ కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. తిరుమలలో ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ కె.శివన్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని పీఎస్ఎల్వీ సీ–47 నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి, పూజలు చేయిం చారు. అనంతరం శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సూళ్లూరుపేట చేరుకుని చెంగాళమ్మను దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ చంద్రయాన్ – 2 ప్రయోగానికి ఇస్రో మరోమారు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. -
పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం : శ్రీవారిని దర్శించుకున్న శివన్
సాక్షి, శ్రీహరి కోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. బుధవారం చేపట్టనున్న పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 5 గంటల 28 నిమిషాలకు ప్రారంభమైన ఈ కౌంట్‌డౌన్ 26 గంటలపాటు కొనసాగనుంది. బుధవారం ఉదయం 9.28 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ సీ-47ను నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్ ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. అలాగే అమెరికాకు చెందిన 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలు రోదసిలోకి పంపించనున్నారు. ఇందులో 12 ఫ్లోక్-4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహం ఉండనుంది. ఇది షార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 74వ ప్రయోగం. పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం నేపథ్యంలో ఇస్రో చైర్మన్ శివన్ మంగళవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పీఎస్ఎల్వీ సీ-47 ప్రయోగం విజయవంతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. -
రేపు పీఎస్ఎల్వీ సీ47 ప్రయోగం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష ప్రయోగకేంద్రం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28కి పీఎస్ఎల్వీ సీ47ను నింగిలోకి పంపనున్నారు. సోమవారం బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్)లో ఇస్రో శాస్త్రవేత్తలు అధికారికంగా నిర్ణయించారు. ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో సోమవారం రాకెట్‌కు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాక ప్రయోగానికి అంతా సిద్ధం అని ప్రకటించారు. ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజే షన్ బోర్డుకు అప్పగించారు. బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించి ప్రయోగానికి 26 గంటల ముందు అంటే మంగళ వారం ఉదయం 7.28కి కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు. పీఎస్ఎల్వీ సీ47 ద్వారా 714 కిలోల బరువు కలిగిన కార్టోశాట్–3 సిరీస్‌లో ఎనిమిదో ఉపగ్రహంతో పాటు అమెరికా 12 ఫ్లోక్–4పీ అనే బుల్లి ఉపగ్రహాలు, మెష్‌బెడ్ అనే మరో బుల్లి ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఇది షార్ నుంచి 74వ ప్రయోగం. -
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
సాక్షి, బెంగళూరు : వరుస విజయాలతో దూసుకుపోతూ, అంతరిక్ష పరిశోధన రంగంలో భారత పతాక గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్ 2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలమైనా.. నిరుత్సాహపడకుండా ఈ నెల 25న ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ47 రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. దీనిద్వారా కార్టోశాట్3 ఉపగ్రహంతో పాటు మరో 13 కమర్షియల్ నానో శాటిలైట్లను కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. హై రెజల్యూషన్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా భూ ఉపరితల చిత్రాలను ఈ శాటిలైట్ తీస్తుంది. కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని 97.5 డిగ్రీల వంపులో 509 కిలోమీటర్ల కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు ఇస్రో చెబుతున్నట్లు అమెరికాకు చెందిన 13 నానో శాటిలైట్లను కూడా నింగిలోకి పంపనున్నారు. -
నిఘా ఉపగ్రహం..నింగికేగింది!
సూళ్లూరుపేట: అంతరిక్ష ప్రయోగాల్లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తిరుగులేని శక్తిగా అవతరించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సి–46 ప్రయోగం విజయవంతమైంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ)సి–46 ఉపగ్రహ వాహక నౌక 615 కిలోల బరువైన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–2బీ)ను విజయవంతంగా రోదసీలోకి మోసుకెళ్లింది. నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టి శాస్త్రవేత్తలు తమ సత్తాచాటారు. ప్రయోగానికి 25 గంటలకు ముందు అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఇది ముగిసిన వెంటనే పీఎస్ఎల్వీ సి–46 నింగిలోకి దూసుకెళ్లింది. దీంతో షార్‌లో ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్న ఐదు వేల మంది కరతాళ ధ్వనులు చేశారు. ప్రయోగించిన తర్వాత 15.25 నిమిషాలకు పీఎస్ఎల్వీ సి–46 రాకెట్.. రీశాట్ ఉపగ్రహాన్ని భూమికి 556 కిలోమీటర్ల ఎత్తులో లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరిన వెంటనే బెంగళూరులో ఇస్ట్రాక్ భూకేంద్రం శాస్త్రవేత్తలు ఉపగ్రహాన్ని తమ అధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నామని ప్రకటించారు. ఉపగ్రహానికి అమర్చిన 3.6 మీటర్లు వ్యాసార్థం కలిగిన రాడియల్ రిబ్ యాంటెన్నా విచ్చుకోవడంతో ఉపగ్రహం పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రయోగ విజయంతో షార్ శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ కె.శివన్ ఆనందాన్ని పంచుకున్నారు. నాలుగు దశల్లో.. పీఎస్ఎల్వీ రాకెట్‌ను నాలుగు దశల్లో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా ప్రయోగించారు. స్ట్రాపాన్ బూçస్టర్లు లేకుండా చేసిన ప్రయోగాన్ని కోర్ అలోన్ ప్రయోగం అంటారు. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభించింది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు మొదటి దశను విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత 41 టన్నుల ద్రవ ఇం«ధనంతో 4.22 నిమిషాలకు రెండో దశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగో దశను పూర్తి చేశారు. 15.25 నిమిషాలకు 615 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీ ఉపగ్రహాన్ని భూమికి 556 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 37 డిగ్రీల వాలులో సన్ సింక్రనస్ ఆర్బిట్‌లోని లోయర్ ఎర్త్ ఆర్బిట్‌లో విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం ఐదేళ్లపాటు సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ రాకెట్ కోర్ అలోన్ దశతో ఇది 14వ ప్రయోగం. అదేవిధంగా ఈ ఏడాది మూడో ప్రయోగం, మొదటి ప్రయోగ వేదిక నుంచి 36వ ప్రయోగం, పీఎస్ఎల్వీ సిరీస్‌లో 48వ ప్రయోగం, షార్ కేంద్రం నుంచి 72వ ప్రయోగం కావడం విశేషం. నిఘా అవసరాలను గుర్తించి.. పీఎస్ఎల్వీ సి–46 రాకెట్ ద్వారా రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ (రీశాట్–2బీ) ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టారు. భారతదేశ సరిహద్దుల్లో ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఇది ఉపకరించనుంది. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన రీశాట్–2బీలో ఎక్స్ బాండ్ అపార్చర్ రాడార్ అనే ఉపకరణాన్ని అమర్చారు. ఈ ఉపగ్రహం దట్టమైన మేఘాలు కమ్ముకుని భూమి కనిపించకపోయినా అత్యంత నాణ్య మైన ఛాయా చిత్రాలను తీసి పంపుతుంది. ఉగ్ర కదలికలే కాకుండా వ్యవసాయ రంగానికి, అటవీ శాఖకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యవసర సేవలు అందిస్తుంది. భూమిపై ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నా అత్యంత నాణ్యమైన ఛాయాచిత్రాలను అందించడం ఉపగ్రహం ప్రత్యేకత. ఇప్పటివరకు రీశాట్–1, రీశాట్–2, స్కాట్‌శాట్ అనే మూడు ఉపగ్రహాలు సేవలు అందిస్తున్నాయి. రీశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో ఇప్పుడు ప్రయోగించింది నాలుగోది కావడం విశేషం. జూలైలో చంద్రయాన్–2 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్–2 ప్రయోగాన్ని జూలై 9 నుంచి 16 లోపు నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. పీఎస్ఎల్వీ సి–46 ప్రయోగం విజయం అనంతరం మిషన్ కంట్రోల్ రూమ్‌లో శివన్ ఇతర శాస్త్రవేత్తలతో విజయానందాన్ని పంచుకున్నారు. ప్రయోగం విజయవంతం కావడం పట్ల వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ భారతదేశ నిఘాకు సంబంధించిన ఉపగ్రహాన్ని ప్రయోగించినందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రయోగంలో రోదసీలోకి పంపిన రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించామని చెప్పారు. ఇందులో అమర్చిన ఎక్స్ బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్ అనే పరికరం వ్యవసాయ రంగానికి, అటవీ శాఖకు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అత్యంత విలువైన సమాచారాన్ని అందిస్తుందన్నారు. పీఎస్ఎల్వీ రాకెట్లు ఇప్పటివరకు 50 టన్నులు బరువు కలిగిన 354 ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్లాయన్నారు. పీఎస్ఎల్వీ రాకెట్‌కు విడిభాగాలను అందజేస్తున్న ప్రైవేటు కంపెనీలు అద్భుతమైన సాయాన్ని అందజేస్తున్నాయని చెప్పారు. ఎలాంటి ఉపగ్రహాలనైనా సునాయాసంగా రోదసీలోకి తీసుకెళ్లగలిగే అద్భుతమైన రాకెట్లని పీఎస్ఎల్వీని అభివర్ణించారు. చంద్రయాన్–2 ప్రయోగానికి సంబంధించి మంగళవారం ఎంఆర్ఆర్ సమావేశాన్ని నిర్వహించామన్నారు. చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా ల్యాండర్, రోవర్‌ను సెప్టెంబర్ 6 నాటికి చంద్రుడిపై దించుతామని తెలిపారు. దాదాపు రెండు నెలల పాటు చంద్రయాన్–2 ప్రయాణం చేసి చంద్రుడిపై దిగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఎస్.పాండ్యన్, వీఎస్ఎస్సీ డైరెక్టర్ ఎస్.సోమనాథ్, యూఆర్ఎస్సీ డైరెక్టర్ పి.కున్హికృష్ణన్, ఐపీఆర్సీ డైరెక్టర్ టి.మూకయ్య, ఎల్పీఎస్సీ డైరెక్టర్ డాక్టర్ వి.నారాయణన్, శాక్ డైరెక్టర్ డీకే దాస్, మిషన్ డైరెక్టర్ ఎస్ఆర్ బిజూ, శాటిలైట్ డైరెక్టర్ నాడ గౌడ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ సి–46 ఉప గ్రహాన్ని విజయవం తంగా అంతరిక్షం లోకి ప్రయోగించినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను అభినందించారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని మనసారా ఆకాంక్షించారు. -
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ- 46
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ- 46 రాకెట్
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ- 46
సాక్షి, శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఖాతాలో మరో విజయం వచ్చి చేరింది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-46 వాహక నౌక దూసుకెళ్లింది. 615 కిలోల బరువు గల రీశాట్-2బీఆర్1 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ46 వాహక నౌక 557 కి.మీ ఎత్తులోని కక్షలోకి ప్రేవేశపెట్టింది. దీంతో పీఎస్ఎల్వీ-సీ46 ప్రయోగం దిగ్విజయమైంది. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ-46ఉపగ్రహ వాహక నౌకను శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు. ఇందుకు సంబంధించి మంగళవారం తెల్లవారుజామున 4.30గంటలకు కౌంట్ డౌన్‌ను ప్రారంభమయ్యింది. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమైంది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 41 టన్నుల ద్రవ ఇంధనంతో 4.22 నిమిషాలకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడోదశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగోదశ పూర్తి చేసిన అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రిశాట్–2బీఆర్1 ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో 37 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహం అయిదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది. పీఎస్ఎల్వీ ప్రయోగాలలో ఇది 48వ ప్రయోగం. రీశాట్ 2 బీఆర్1 ఉపగ్రహం సరిహద్దుల్లో ఉగ్రశిబిరాలు, కదలికలను పసిగట్టనుంది. అలాగే ప్రకృతి వైపరిత్యాలపై అధ్యయనం చేస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ జగన్ అభినందనలు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందలు తెలిపారు. బుధవారం ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-46 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని ప్రయోగాలు చేపట్టాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. -
రెడీ.. 3, 2, 1
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–46 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తి చేశారు. ప్రయోగానికి 25 గంటల ముందు అంటే మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను లాంఛనంగా ప్రారంభించారు. మంగళవారం 4.30 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. 25 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా నాలుగోదశలో 1.6 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను మంగళవారం రాత్రి పూర్తి చేశారు. మళ్లీ మంగళవారం రాత్రే రెండోదశలో 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను కూడా చేస్తున్నారు. మంగళవారం నాడు ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ చెంగాళమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను పర్యవేక్షించారు. రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి సహచర శాస్త్రవేత్తలతో సమావేశమై ప్రయోగ పనులు సమీక్షించారు. – సూళ్లూరుపేట ప్రయోగం ఇలా... షార్ నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–46 ఉపగ్రహ వాహకనౌక ద్వారా 615 కిలోల బరువు కలిగిన రీశాట్–2బీ అనే (రిమోట్ సెన్సింగ్ శాటిలైట్) దూర పరిశీలనా ఉపగ్రహాన్ని 15.29 నిమిషాల్లో భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో ప్రవేశపెట్టేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ రాకెట్‌ను నాలుగు దశల్లో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా చేస్తున్నారు. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగ సమయంలో 290 టన్నుల బరువుతో ప్రయాణం ప్రారంభమవుతుంది. 139 టన్నుల ఘన ఇంధనంతో 1.50 నిమిషాలకు పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. 41 టన్నుల ద్రవ ఇం«ధనంతో 4.22 నిమిషాలకు రెండోదశ, 7.65 టన్నుల ఘన ఇంధనంతో 9.23 నిమిషాలకు మూడోదశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 14.42 నిమిషాలకు నాలుగోదశ పూర్తి చేసిన అనంతరం 15.29 నిమిషాలకు 615 బరువు కలిగిన రిశాట్–2బీ ఉపగ్రహాన్ని భూమికి 557 కిలోమీటర్ల ఎత్తులోని సన్ సింక్రనస్ ఆర్బిట్‌లో 37 డిగ్రీల అక్షాంశంలో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేశారు. ఈ ఉపగ్రహం అయిదేళ్ల పాటు అంతరిక్షంలో ఉండి సేవలు అందిస్తుంది. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని ఇస్రో చైర్మన్ కె.శివన్ మంగళవారం దర్శించుకున్నారు. ఉదయం తోమాల సేవలో పాల్గొని పీఎస్ఎల్వీ సీ–46 నమూనాను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో శివన్‌కు వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయాధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్క రించారు. బుధవారం ఉదయం 5.30 గంటలకు పీఎస్ఎల్వీ సీ–46 శాటిలైట్‌ను కక్ష్యలోకి పంపనున్నట్లు శివన్ తెలిపారు. తదుపరి ప్రాజెక్ట్‌గా జూలై 9, 16 తేదీల్లోపు చంద్రయాన్–2 మిషన్‌ను కూడా ప్రయోగించనున్నట్లు, చంద్రునిపైకి సెప్టెంబర్ 6న చంద్రయాన్–2 ల్యాండ్ అవుతుందని పేర్కొన్నారు. -
మరో ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో
-
వినీలాకాశంలో బ్రహ్మాస్త్రం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు మరోమారు విజయగర్వంతో రెపరెపలాడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ–సీ45 ఉపగ్రహ వాహక నౌక స్వదేశీ ఎమిశాట్ (ఈఎంఐశాట్) ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దీంతోపాటు 28 విదేశీ ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి మోసుకెళ్లింది. షార్ కేంద్రం నుంచి 71వ ప్రయోగాన్ని, పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సిరీస్‌లో 47వ ప్రయోగాన్ని, పీఎస్ఎల్వీ–క్యూఎల్ సిరీస్‌లో తొలి ప్రయోగాన్ని నిర్వహించి ఇస్రో శాస్త్రవేత్తలు తమ విజయవిహారాన్ని కొనసాగించారు. మొత్తంగా ఈ ఏడాది ఇస్రో చేపట్టిన రెండో ప్రయోగం ఇది కావడం విశేషం. ప్రయోగం తీరిలా.. ఆదివారం ఉదయం 6.27 గంటలకు ప్రారంభమైన పీఎస్ఎల్వీ సీ–45 ప్రయోగ కౌంట్‌డౌన్ 27 గంటలపాటు నిర్విఘ్నంగా కొనసాగింది. ఇస్రో శాస్త్రవేత్తలు సరికొత్తగా రూపొందించిన మొట్టమొదటి పీఎస్ఎల్వీ సీ45 (పీఎస్ఎల్వీ–క్యూఎల్) సోమవారం ఉదయం 9.27 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ నాలుగో దశ (పీఎస్04 మోటార్)ను రెండుసార్లు రీస్టార్ట్ చేసి రెండు సార్లు ఆఫ్ (నిలుపుదల) చేసేలా రూపొందించారు. పీఎస్4 దశలో అమర్చిన 436 కిలోల బరువు కలిగిన ఎమిశాట్ ఉపగ్రహాన్ని భూమికి 748 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన «ధృవ కక్ష్యలోకి 17.18 నిమిషాలకు ప్రవేశపెట్టారు. ఆ తరువాత పీఎస్4 దశను 3,611 సెకన్లకు మొదటిగా రీస్టార్ట్ చేసి 3,621 సెకన్లకు కటాఫ్ చేశారు. మళ్లీ 6,530 సెకన్లకు మళ్లీ రెండోసారి రీస్టార్ట్ చేసి 6,541 సెకన్లకు కటాఫ్ చేశారు. ఆ తర్వాత 6,626 సెకన్లకు (1.50 గంటలకు) 504 కిలోమీటర్ల ఎత్తులో 14 ఉపగ్రహాలను, 6,901 (1.55 గంటలకు) 508 కిలోమీటర్ల ఎత్తులో మరో 14 ఉపగ్రహాలను ప్రవేశపెట్టారు. ఆ తరువాత కూడా పీఎస్4 దశను రెండుసార్లు ఆర్బిట్ చేంజ్ అనే పేరుతో మరో సరికొత్త ప్రయోగం చేశారు. ఉపగ్రహాలను వదిలిపెట్టిన తరువాత మరో గంటపాటు దీన్ని ఎక్స్‌పర్‌మెంటల్‌గా చేయడంతో ప్రయోగం పూర్తయ్యేసరికి సుమారు 3 గంటల సమయం తీసుకుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రయోగం విజయవంతంకావడంతో ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ అభినందించారు. వీక్షణకు గ్యాలరీ ప్రయోగాలను వీక్షించేందుకు షార్ కేంద్రంలో ప్రత్యేకంగా గ్యాలరీ ఏర్పాటు చేశారు. ఈ ప్రయోగాన్ని మూడు వేలమంది వచ్చి తిలకించేలా ఏర్పాటు చేశామన్నారు. వచ్చే ప్రయోగానికి ఐదు వేలు, తర్వాత పదివేల మంది చూసే అవకాశం కల్పించనున్నారు. శత్రు రాడార్ల పనిపట్టే ఎమిశాట్ ప్రయోగంలో ప్రధాన ఉపగ్రహమైన ఎమిశాట్ బరువు 436 కిలోలు. దీన్ని 748 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టారు. శత్రు దేశాల రాడార్లు, సెన్సర్లను గుర్తించే సామర్థ్యం ఎమిశాట్ సొంతం. దీని సాయంతో శత్రు దేశాల రాడార్లను పసిగట్టడంతోపాటు దానికి తగ్గట్టుగా దేశ భద్రతా చర్యలు చేపట్టొచ్చు. ఈ తరహా ఉపగ్రహాన్ని భారత్ చేయడం ఇదే ప్రథమం. మిగతా 28 ఉపగ్రహాల్లో 24 అమెరికావి. ఈ 24 ఉపగ్రహాలు నౌకల కదలికను గుర్తించడంలో ఆ దేశానికి సాయం అందించనున్నాయి. మిగిలిన 4 ఉపగ్రహాలు లిథువేనియా, స్పెయిన్, స్విట్జర్లాండ్‌కి చెందినవి. నింగిలోకి 29 ఉపగ్రహాలు ఈ ఉపగ్రహ వాహక నౌక 436 కిలోలు బరువు కలిగిన ఎమిశాట్ (ఈఎంఐశాట్) అనే మిలటరీ ఉపగ్రహంతోపాటు 220 కిలోలు బరువు గల అమెరికాకు చెందిన ఫ్లోక్–4ఏ పేరుతో 20 చిన్న ఉపగ్రహాలు, లీమూర్ పేరుతో మరో 4 చిన్న ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన ఎం–6పీ, బ్లూవాకర్–1 అనే రెండు చిన్న తరహా ఉపగ్రహాలు, స్విట్జర్లాండ్‌కు చెందిన ఆస్ట్రోకార్ట్–1 ఉపగ్రహం, స్పెయిన్‌కు చెందిన ఎయిస్ టెక్శాట్ అనే చిన్న తరహా 28 ఉపగ్రహాలను అలవోకగా రోదసీలోకి మోసుకెళ్లింది. అనంతరం వాటిని భూమికి 748, 504 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోని 3 రకాల కక్ష్యల్లో విజయవంతంగా ప్రవేశపెట్టిన పీఎస్ఎల్వీ రాకెట్ మరోమారు గ’ఘన’ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇస్రో చరిత్రలో సువర్ణ అధ్యాయం: శివన్ ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం ఒక సువర్ణ అధ్యాయమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కే శివన్ అన్నారు. ఈ రాకెట్లో నాలుగోదశ(పీఎస్–4)తో కొత్త ప్రయోగం చేశామని, అది సక్సెస్ కావడంతో భారతీయ విద్యార్థులు సొంతంగా శాటిలైట్ తయారుచేసి తెస్తే ఎలాంటి ఖర్చు లేకుండా ప్రయోగిస్తామన్నారు. ఒకే ప్రయోగం ద్వారా సన్ సింక్రనస్ ఆర్బిట్లోనే 3 రకాల కక్ష్యల్లోకి 29 ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో సువర్ణ అధ్యాయమన్నారు. 4స్ట్రాపాన్ బూస్టర్లతో చేసిన ఈ ప్రయోగానికి పీఎస్ఎల్వీ క్యూఎల్ అని పేరుపెట్టారు. విద్యార్థులకు ప్రయోగాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్రానికి 9 మంది హైస్కూల్ విద్యార్థులను సెలెక్ట్ చేసి వారికి ప్రత్యేక అవగాహన కల్పిస్తామని అన్నారు. భవిష్యత్తులో హ్యూమన్ మిషన్ ప్రోగ్రాం గురించి కూడా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇందులో బాగా ప్రతిభ కనపరిచిన వారికి స్పేస్ ట్రెక్నాలజీలో సీటు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటామని తెలిపారు. మే రెండో వారంలో పీఎస్ఎల్వీ సీ46 ద్వారా రీశాట్–2బీ, పీఎస్ఎల్వీ సీ47 ద్వారా కార్టోశాట్, ఆ తరువాత చంద్రయాన్–2 ప్రయోగాలుంటాయని తెలిపారు. శ్రీహరికోటలో గ్యాలరీలో కూర్చుని ప్రయోగాన్నిచూస్తున్న వీక్షకులు -
పీఎస్ఎల్వీ సీ 45 విజయవంతం
-
నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-45 రాకెట్
-
పీఎస్ఎల్వీ సీ 45 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ సీ 45 వాహక నౌక ప్రయోగం విజయవంతమైంది. ఇస్రోలోని రెండో ప్రయోగ వేదిక నుంచి సోమవారం ఉదయం 9.27 గంటలకు పీఎస్ఎల్వీ సీ45 (పీఎస్ఎల్వీ–క్యూఎల్) ఉపగ్రహ వాహక నౌకను శాస్త్రవేత్తలు రోదసీలోకి పంపారు. ఇందుకు సంబంధించి ఆదివారం ఉదయం 6:27 గంటలకు కౌంట్ డౌన్‌ను ప్రారంభమయ్యింది. మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) కమిటీ ఆధ్వర్యంలో శనివారం సమావేశమై రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగపనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (ల్యాబ్) వారికి ఇస్రో శాస్త్రవేత్తలు అప్పగించారు. పీఎస్ఎల్వీ రాకెట్లలో సరికొత్త రాకెట్ ఇది. నాలుగు స్ట్రాపాన్ బూస్టర్లు సాయంతో చేస్తున్న ప్రయోగం కాబట్టి దీనికి పీఎస్ఎల్వీ –క్యూఎల్ అని నామకరణం చేశారు. ఈ తరహా రాకెట్‌ను మొట్టమొదటిసారిగా ఇస్రో ప్రయోగిస్తోంది. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఇది 47వ ప్రయోగం కాగా, షార్ కేంద్రం నుంచి 71వ ప్రయోగం. -
ఇస్రో చరిత్రలో మరో మైలు రాయి
-
నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ-సీ44
సాక్షి, శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో చారిత్రక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పీఎస్ఎల్వీ-సీ44 రాకెట్‌ను ఇస్రో నింగిలోకి ప్రవేశపెట్టింది. గురువారం రాత్రి 11 గంటల 37 నిమిషాలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. రెండు ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ-సీ44 కక్ష్యలోకి తీసుకెళ్లింది. తమిళనాడుకు చెందిన విద్యార్థులు రూపొందించిన కలాంశాట్‌తో పాటు మైక్రోశాట్ ఉపగ్రహాలను కూడా నిగింలోకి పంపారు. మైక్రోశాట్ ఉపగ్రహాలు దేశ రక్షణ రంగానికి సమాచారాన్ని అందించనుంది. డీఆర్డీవో రక్షణ విభాగంలో మైక్రోశాట్ ఉపగ్రహాల సేవలను వినిమోగించనున్నారు. కాగా పీఎస్ఎల్వీ సీరిస్‌లో ఇది 46వ ప్రయోగం తెలిసిందే. నూతన సంవత్సరంలో (2019) ఇస్రో ప్రయోగించిన తొలి ప్రయోగం విజయవంతం కావడం విశేషం. దీనికి కృషిచేసిన విద్యార్థులకు, శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్ శివన్ అభినందనలు తెలిపారు. -
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ– సీ 44 రాకెట్
-
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ– సీ 44
శ్రీహరికోట (సూళ్లూరుపేట)/ టీ.నగర్ (చెన్నై): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం రాత్రి 11.37 గంటలకు పీఎస్ఎల్వీ– సీ 44 (పీఎస్ఎల్వీ– డీఎల్) ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం సాయంత్రం ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ బీఎన్ సురేష్ ఆధ్వర్యంలో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్ఆర్) సమావేశం నిర్వహించనున్నారు. కాగా, ఈ ఏడాది అంతరిక్షంలోకి 17 శాటిలైట్స్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. సోమవారం రాత్రి ఆయన చెన్నై విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థుల కోసం కొత్త పథకం రూపొందించామన్నారు. దీని ప్రకారం 8, 9 తరగతులకు వెళ్లే విద్యార్థుల్లో జిల్లాకు ముగ్గురిని ఎంపికచేసి అంతరిక్షానికి సంబంధించిన శిక్షణ అందిస్తామన్నారు. -
‘షార్’కు చేరుకున్న మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 24న నిర్వహించనున్న పీఎస్ఎల్వీ సీ44 ప్రయోగానికి సంబంధించి మైక్రోశాట్–ఆర్ అనే ఉపగ్రహం ఆదివారం షార్కు చేరుకుంది. బెంగళూరులోని యూఆర్ శాటిలైట్ స్పేస్ సెంటర్ నుంచి శనివారం బయల్దేరిన ఈ ఉపగ్రహం ఆదివారం సాయంత్రానికి షార్కి చేరుకుంది. మొదటి ప్రయోగవేదికపై పీఎస్ఎల్వీ సీ44 రాకెట్ అనుసంధానానికి సంబంధించి నాలుగుదశల పనులను పూర్తి చేశారు. ఈ వారంలోనే రాకెట్ శిఖరభాగాన ఉపగ్రహాన్ని అమర్చేందుకు సిద్ధమవుతున్నారు. -
ఇస్రోకు మరో ‘పీఎస్ఎల్వీ’ విజయం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన గెలుపుగుర్రం పీఎస్ఎల్వీతో మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. పీఎస్ఎల్వీ–సీ43 రాకెట్ ద్వారా హైసిస్ (హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్) అనే అత్యాధునిక భూ పర్యవేక్షక ఉపగ్రహంతోపాటు ఎనిమిది దేశాలకు చెందిన మరో 30 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 28 గంటల కౌంట్‌డౌన్ తర్వాత గురువారం ఉదయం 9.57 గంటలకు పీఎస్ఎల్వీ సీ–43 రాకెట్ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి నిప్పులు చిమ్ముతూ, మేఘాలను చీల్చుతూ నింగికి దూసుకెళ్లింది. సరిగ్గా 17 నిమిషాల 27 సెకన్లలో హైసిస్‌ను భూమికి 636.3 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత సూర్యానువర్తన ధృవ కక్ష్యలో ప్రవేశపెట్టింది. అనంతరం మరో గంటలో మిగిలిన 30 ఉపగ్రహాలను ఒక్కొక్కటిగా వివిధ కక్ష్యల్లోకి చేర్చింది. ఇస్రో చరిత్రలో అత్యంత సుదీర్ఘ సమయం సాగిన ప్రయోగం ఇదే. ఇస్రో అభివృద్ధి చేసిన హైసిస్ ఉపగ్రహంతో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం వ్యవసాయం, అడవులు, భూ సర్వే, భూగర్భ శాస్త్రం, తీర ప్రాంతాలు, దేశీయ జల మార్గాలు, పర్యావరణ పర్యవేక్షణ, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం గుర్తింపు తదితర రంగాల్లో హైసిస్ సేవలనందించనుంది. వైఎస్ జగన్ అభినందనలు పీఎస్ఎల్వీ–సీ 43 ప్రయోగం విజయవంతం అయినందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. భవిష్యత్తులో వారికి అన్నీ విజయాలే చేకూరాలనీ, అంతరిక్షరంగంలో భారతదేశం వెలిగి పోవాలని ఆయన ఆకాంక్షించారు. 15 రోజుల్లోనే మరో అద్భుత విజయం: శివన్ ఇటీవలే భారీ రాకెట్ జీఎస్ఎల్వీ–మార్క్3–డీ2 ద్వారా జీశాట్ 29 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. ఆ తర్వాత 15 రోజుల్లోనే ప్రయోగించిన పీఎస్ఎల్వీ–సీ43 రాకెట్ విజయవంతంగా ఉపగ్రహాలను కక్ష్యల్లోకి ప్రవేశపెట్టడం అద్భుతమని ఇస్రో చైర్మన్ శివన్ అన్నారు. వచ్చే నెల 5వ తేదీనే ఇస్రో మరో ప్రయోగం చేపడుతోంది. ఫ్రెంచ్ గయానా నుంచి జీశాట్ 11 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న జీశాట్–7ఏ ఉపగ్రహాన్ని కూడా డిసెంబర్లోనే ప్రయోగించే అవకాశం ఉంది. చంద్రయాన్– ఐఐ సహా వచ్చే ఏడాది తామెన్నో ప్రయోగాలను చేయనున్నామన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టును వీలైనంత ఎక్కువ స్వదేశీ పరిజ్ఞానంతో చేపడతామని ఆయన చెప్పారు. గగన్‌యాన్ కింద 2020 డిసెంబర్ నాటికి మానవ రహిత, 2022 నాటికి మానవసహిత ప్రయోగాలను చేపట్టనున్నామని శివన్ వెల్లడించారు. -
పీఎస్ఎల్వీ సీ-43 ప్రయోగం విజయవంతం
-
పీఎస్ఎల్వీ సీ-43 ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-43 రాకెట్ ప్రయోగం విజయవంతమయింది. భారత్‌కు చెందిన హైసిస్ ఉపగ్రహంతో పాటు 8 దేశాలకు చెందిన 30 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ-43 రాకెట్ నిర్దిష్ట కక్ష్యలోకి చేర్చినట్టు ఇస్రో ప్రకటించింది. ఇస్రో సిబ్బంది సమిష్టి కృషి వల్లే ప్రయోగం విజయవంతం అయిందని ఇస్రో చైర్మన్ డా. కె శివన్ తెలిపారు. కాగా, 28 గంటల కౌంట్ డౌన్ అనంతరం గురువారం ఉదయం 9.58 గంటలకు సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం మొదటి లాంచ్ పాడ్ నుంచి ఇస్రో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ వాహననౌక 31 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. ఈ ప్రయోగంలో 380 కిలోల హైసిస్ స్వదేశీ ఉపగ్రహంతో పాటు 261.5 కిలోల బరువు కలిగిన 8 దేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టారు. హైసిస్ భూ ఉపరితల పరిస్థితులను అధ్యయనం చేయనుంది. ఇది ఐదేళ్ల పాటు సేవలు అందించనుంది. డీడీ రిపోర్టర్ కన్నుమూత పీఎస్ఎల్వీ సీ-43 రాకెట్ ప్రయోగం కవరేజ్ కోసం వచ్చిన చెన్నైదూరదర్శన్ రిపోర్టర్ రవీంద్రన్ గుండెపోటుతో మృతిచెందారు. ఆయన విధుల్లో భాగంగా బుధవారం రాత్రి శ్రీహరికోటకు వచ్చారు. నిన్న రాత్రి మీడియా సెంటర్లో గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపట్ల ఇస్రో శాస్త్రవేత్తలు సంతాపం తెలిపారు. -
పీఎస్ఎల్వీ సీ43 రెడీ
భారత అంతరిక్ష ప్రయోగకేంద్రమైన సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)నుంచి నింగిలోగి ఎగిరేందుకు పీఎస్ఎల్వీ సీ43 వాహన నౌక సిద్ధమయింది. గురువారం ఉదయం 9.58 గంటలకు ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పూర్తి చేసుకుని నింగికెగిరేందుకు లాంచ్ పాడ్ వద్దకు వెళుతున్న రాకెట్.. శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి గురువారం ఉదయం 9.57 గంటలకు పీఎస్ఎల్వీ సీ – 43 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించనున్నారు. దీనికి సర్వం సిద్ధం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం జరిగిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశంలో ప్రయోగ తేదీని ఇస్రో అధికారికంగా ప్రకటించింది. బుధవారం తెల్లవారుజామున 5.57 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఉదయం 9.57 గంటలకు నింగివైపునకు దూసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ – 43 రాకెట్ సిద్ధంగా ఉంది. నాలుగు దశల రాకెట్ అనుసంధానాన్ని పూర్తి చేసి మొబైల్ సర్వీస్ టవర్ (ఎంఎస్టీ)æ నుంచి రాకెట్‌ను ప్రయోగవేదికపై వదిలిపెట్టి వెనక్కి వచ్చింది. 44.4 మీటర్ల ఎత్తున పీఎస్ఎల్వీ సీ – 43 రాకెట్ ప్రయోగ సమయంలో ఇంధనంతో కలిపి 320 టన్నుల బరువుతో నింగికి పయనమవుతుంది. ప్రయోగంలో 380 కిలోల హైసిస్ స్వదేశీ ఉపగ్రహంతో పాటు 261.5 కిలోల బరువు కలిగిన 8 దేశాలకు చెందిన చిన్న తరహా ఉపగ్రహాలను సన్ సింక్రోనస్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. ఉపగ్రహాల బరువు 641.5 కిలోలు కావడంతో స్ట్రాపాన్ బూస్టర్లు లేకుండా ప్రయోగించనున్నారు. దీన్ని కోర్ అలోన్ ప్రయోగం అంటారు. షార్‌లోని మొదటి ప్రయోగవేదికకు సంబం«ధించిన మొబైల్ సర్వీస్ టవర్‌లో రాకెట్‌ను అనుసంధానించిన కొన్ని దృశ్యాలను ఇస్రో మంగళవారం విడుదల చేసింది. రాకెట్‌లోని కోర్ అలోన్ దశ(ప్రథమ) ప్రయోగవేదికపై అనుసంధానం రాకెట్ మొదటి దశను కేరళలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో డిజైన్ చేసి తీసుకొచ్చి ఇక్కడ అనుసంధానం చేశారు. ఈ దశలో రాకెట్ నింగికి దూసుకెళ్లడానికి 138.2 టన్నుల ఘన ఇంధనాన్ని నింపుతారు రాకెట్ రెండోదశలో విడి భాగాలను అమరుస్తున్న దృశ్యం రాకెట్ రెండోదశలో 2.8 వ్యాసార్థంలో ఉన్న మోటార్లో 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపుతారు. ఈ దశనూ వీఎస్సెస్సీలోనే తయారు చేశారు. మూడో దశ రాకెట్ విడిభాగాల అమరిక ఈ దశ రెండు మీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది. మూడో దశలో 7.6 టన్నుల ఘన ఇంధనం, నాలుగోదశలో 2.5 ద్రవ ఇంధనాన్ని నింపుతారు. నాలుగో దశకు పైభాగంలో 641.5 కిలోల బరువు కలిగిన 31 ఉపగ్రహాల పొందికను అమర్చి అనుసంధానం చేస్తున్న దృశ్యం శిఖరభాగంలో నాలుగో దశ రాకెట్ అనుసంధానం ఈ దశలోనే ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. ఈ దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపుతారు. రాకెట్ అనుసంధానం పూర్తయ్యాక మొబైల్ సర్వీస్ టవర్ నుంచి రాకెట్ వదిలిపెట్టి వెనక్కి వెళ్తున్న దృశ్యం -
పీఎస్ఎల్వీ–సీ42 రాకెట్ ప్రయోగం సక్సెస్
-
ఇస్రోకు మరో వాణిజ్య విజయం
శ్రీహరికోట(సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో–ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) పీఎస్ఎల్వీ–సీ42 రాకెట్ ద్వారా బ్రిటన్‌కు చెందిన రెండు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. భూ పర్యవేక్షక ఉపగ్రహాలైన నోవాఎస్ఏఆర్, ఎస్1–4లను 230.4 టన్నుల బరువున్న పీఎస్ఎల్వీ(పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్)–సీ42 వాహక నౌక ఆదివారం రాత్రి సరిగ్గా 10.08 గంటలకు రోదసిలోకి మోసుకెళ్లింది. 33 గంటల కౌంట్‌డౌన్ అనంతరం నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్ మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి వాహక నౌక దూసుకెళ్లిన తర్వాత నాలుగు దశల్లో, 17.44 నిమిషాల్లో రెండు ఉపగ్రహాలు భూమికి 583 కి.మీ. దూరంలోని సూర్యానువర్తన ధృవ కక్ష్యలోకి చేరాయి. ఆ వెంటనే మిషన్ కంట్రోల్‌రూంలో శాస్త్రవేత్తలు కరతాళధ్వనులతో సంబరాలు చేసుకున్నారు. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తల్ని ప్రధాని మోదీ అభినందించారు. అంతరిక్ష వ్యాపారంలో భారత సామ ర్థ్యాన్ని ఈ ప్రయోగం చాటిచెప్పిందన్నారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో వాణిజ్యపరంగా మరో మైలురాయిని చేరుకుంది. ఇప్పటికే 23 దేశాలకు చెందిన 241 విదేశీ ఉపగ్రహాలను షార్ నుంచి పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారానే ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టారు. ఆదివారం నాటి ప్రయోగంతో కలిపి మొత్తంగా 243 విదేశీ ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా రోదసిలోకి పంపింది. ప్రయోగం ముగిసిన అనంతరం ఇస్రో చైర్మన్ శివన్ ప్రయోగంలో పాలుపంచుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రయోగానికి ముందు శివన్ దంపతులు సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరిని దర్శించుకున్నారు. పీఎస్ఎల్వీ–సీ42 ప్రయోగం విజయవంతం కావాలని అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ఉపగ్రహాల విశేషాలివీ.. 445 కిలోల బరువున్న నోవాఎస్ఏఆర్ ఉపగ్రహంలో ఎస్–బాండ్ సింథటిక్ అపార్చర్ రాడార్, ఆటోమేటిక్ ఐడింటిఫికేషన్ రిసీవర్ అనే ఉపకరణాలను అమర్చారు. అడవుల మ్యాపింగ్, భూ వినియోగం, మంచు కప్పబడిన ప్రాంతాలను పర్యవేక్షిచడం, వరదలాంటి విపత్తులను గుర్తించడం, సముద్రంలో ఓడలు ఎక్కడున్నాయో కనిపెట్టి, గమ్యస్థానాలకు వెళ్లేందుకు వాటికి సూచనలు ఇవ్వడం ఈ ఉపగ్రహం చేస్తుంది. ఇక ఎస్1–4 ఉపగ్రహం 444 కిలోల బరువు ఉంది. ఇది సర్వే వనరులు, పర్యావరణ పర్యవేక్షణ, పట్టణాల నిర్వహణకు ప్రణాళికల తయారీ విపత్తులను గుర్తించడం చేస్తుంది. శాస్త్రవేత్తలకు జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ–42 రాకెట్‌తో రెండు బ్రిటన్ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఇస్రో భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఆరు నెలల్లో 18 ఉపగ్రహాలు శ్రీహరికోట (సూళ్లూరుపేట): రాబోయే ఆరు నెలల్లో 18 ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ తెలిపారు. ఆదివారం పీఎస్ఎల్వీ సీ–42 ప్రయోగం విజయవంతమైన తర్వాత షార్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో జీఎస్ఎల్వీ మార్గ్– డీ1 ద్వారా జీశాట్–19 ఉపగ్రహాన్ని, జీఎస్ఎల్వీ మార్గ్– డీ2 ద్వారా జీశాట్–29 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తామన్నారు. వీటితో పాటు జీఎల్ఎల్వీ మార్గ్–2 ద్వారా జీశాట్–20 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపుతామన్నారు. అలాగే ఏరియన్–5 రాకెట్ ద్వారా జీశాట్–11ను ప్రయోగించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నట్లు శివన్ వెల్లడించారు. ఈ నాలుగు భారీ ఉపగ్రహాలతో దేశంలో కనెక్టివిటీ 100 జీబీపీఎస్‌కు చేరుతుందనీ, తద్వారా సమాచార రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు. 2019, జనవరి 3 నుంచి ఫిబ్రవరి 16లోపు చంద్రయాన్–2 ప్రయోగం చేపట్టేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా ఇస్రో ఏటా రూ.220 కోట్లు అర్జిస్తోందన్నారు. వచ్చే అక్టోబర్‌లో మరో 30 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని శివన్ వెల్లడించారు. నాలుగేళ్ల క్రితం ప్రయోగించిన మంగళయాన్–1 ఇప్పటికీ చక్కగా పనిచేస్తూ కీలక సమాచారాన్ని పంపిస్తోందని పేర్కొన్నారు. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ -
కలవరపెడుతున్న ఉపగ్రహాల విఫలం
సాక్షి, శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపడుతున్న ప్రయోగాల్లో ఇటీవల రాకెట్లు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లి ఉపగ్రహాలను నిర్ణీత క్షక్ష్యలోకి ప్రవేశపెడుతున్నాయి. అయితే క్షక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలు విఫలం కావడం శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది. గతంలో రాకెట్లు విఫలమై ఉపగ్రహాలు సముద్రం పాలయ్యేవి. ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ రాకెట్ల పరిజ్ఞానంలో కొంత సాంకేతిక పరిపక్వత చెందకపోవడంతో మిశ్రమ విజయాలను మాత్రమే సాధించగలిగారు. ఆ తరువాత పీఎస్ఎల్వీ రాకెట్ల తయారీకి పూనుకుని చేసిన మొదటి ప్రయోగం పూర్తిగా విఫలమైంది. ఆ తరువాత 40 రాకెట్లు విజయవంతంగా ప్రయోగించగా, రెండు ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. ఇందులో పీఎస్ఎల్వీ డీ1 రాకెట్ పూర్తిగా విఫలం కాగా, పీఎస్ఎల్వీ సీ39 రాకెట్ క్షక్ష్యలోకి ఐఆర్ఎన్ఎస్ఎస్–1 హెచ్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టడంలో విఫలమైంది. అలాగే జీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. 2010లో రెండు జీఎస్ఎల్వీ ప్రయోగాలు విఫలమయ్యాయి. 2006లో జీఎస్ఎల్వీ ఎఫ్–02 ప్రయోగం కూడా విఫలమైంది. 2007లో జీఎస్ఎల్వీ ఎప్–04 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లినా ఇన్శాట్–4సీఆర్ ఉపగ్రహం సాంకేతికలోపంతో నిరుపయోగంగా మారింది. గత నెల 29న జీఎస్ఎల్వీ ఎఫ్08 రాకెట్ జీశాట్–6ఏ ఉపగ్రహాన్ని నిర్దేశిత సమయంలో నిర్ణీత కక్ష్యలో దిగ్విజయంగా ప్రవేశపెట్టింది. ఉపగ్రహ విద్యుత్‌వ్యవస్థ పూర్తిగా విఫలమై సిగ్నల్స్ అందకుండా పోయి వృథాగా మారింది. ముఖ్యంగా పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ సిరీస్ రాకెట్ ప్రయోగాల్లో నాలుగు రాకెట్లు సాంకేతికలోపంతో విఫలమవగా, మూడు ఉపగ్రహాలు సాంకేతిక లోపంతో నిరుపయోగంగా మారాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఒకింత కలవర పాటుకు గురై గురువారం నిర్వహించబోయే ప్రయోగానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇస్రో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన కే శివన్‌కు మొదటి ప్రయోగం చేదు అనుభవాన్ని మిగిల్చింది. రెండో ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. -
పిఎస్ఎల్వీ సీ-41 రాకెట్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్
-
12న పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ – షార్ లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈ నెల 12న తెల్లవారు జామున 4.04 గంటలకు పీఎస్ఎల్వీ సీ41 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు శనివారం ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్‌లో ఎనిమిదో ఉపగ్రహాన్ని రోదసీలోకి ప్రవేశపెట్టనుంది. తొలుత నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ సిరీస్‌లో 7 ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీలోకి పంపారు. పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 43వ రాకెట్, ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో 20వ ప్రయోగం కావడం విశేషం. రాకెట్‌కు నాలుగు దశల అనుసంధానం పనులను పూర్తిచేసి తుది విడత పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న ఎంఆర్ఆర్ (మెషీన్ రెడీనెస్ రివ్యూ) సమావేశం నిర్వహించి, 10న కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, నెల్లూరు : జీఎస్ఎల్వీ -ఎఫ్8 రాకెట్ ప్రయోగం విజవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ డా.శివన్ బుధవారం చెంగాల పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల పాటు కౌంట్‌డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 4 గంటల 56 నిమిషాలకు జీఎల్‌ఎస్‌వీ-ఎఫ్8 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్రవేత్తలతో డా. శివన్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది చివర్లో చంద్రయాన్-2 ప్రయోగం చేయాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగంచనున్నట్లు తెలిపారు. కాగా ఇస్రో చైర్మన్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. శివన్‌కు ఇది తొలి ప్రయోగం. -
శ్రీహరికోటకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1 ఉపగ్రహం
సాక్షి, నెల్లూరు : ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్-1 (ఐఆర్ఎన్ఎస్ఎస్-1) ఉపగ్రహాన్ని జిల్లాలోని శ్రీహరికోటకు తరలించారు. శుక్రవారం ఉదయం భారీ భద్రత మద్య ఐఆర్ఎన్ఎస్ఎస్-1 ఉపగ్రహాన్ని బెంగళూరు నుంచి షార్ కేంద్రానికి తరలించారు. వచ్చే నెల 12న పీఎస్ఎల్వీ సీ-41 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. -
పీఎస్ఎల్వీ సీ–41లో సాంకేతిక లోపం
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : శ్రీహరికోటలో రాకెట్ ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో మొదటి ప్రయోగ వేదికపై పీఎస్ఎల్వీ సీ–41 రాకెట్ అనుసంధానం పనుల్లో సోమవారం రాత్రి సాంకేతిక లోపం తలెత్తి పీఎస్–2 దశను వెనక్కి తీసుకొచ్చేశారు. రాకెట్ మొదటి దశను (పీఎస్–1) ఇటీవల పూర్తి చేసి రెండో దశను (పీఎస్–2) అనుసంధానం చేసేందుకు సోమవారం లాంచ్ ప్యాడ్ వద్దకు తీసుకెళ్లారు. పీఎస్–1 నుంచి పీఎస్–2కు కనెక్షన్ ఇచ్చే ఎలక్ట్రానిక్స్ కేబుల్స్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అనుసంధానాన్ని నిలిపేశారు. -
వినువీధిన విజయాల వందనం
గ‘ఘన’ కీర్తి గడించిన ఇస్రో మరో అద్భుతాన్ని ఆవిష్క రించింది. త్రివర్ణ పతాకాన్ని వినువీధిన రెపరెపలాడించి విజయాల ‘వంద’నం చేసింది. 56 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో శుక్రవారం నాటి పీఎస్ఎల్వీ సీ–40 ప్రయోగంతో అంతరిక్షంలోకి 62 రాకెట్లను ప్రయోగిం చింది. వాటిద్వారా 100 స్వదేశీ ఉపగ్రహాలను కక్ష్యల్లో ప్రవేశపెట్టిన ఘనతను నమోదు చేసుకుంది. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా పంపించిన విదేశీ ఉపగ్రహాలతో కలిపితే ట్రిపుల్ సెంచరీకి చేరువ అవుతోంది. గతేడాది ఫిబ్రవరి 15న 104 ఉపగ్రహాలను ప్రయోగించి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన భారత శాస్త్రవేత్తలు శుక్రవారం మరో అద్భుతాన్ని ఆవిష్కరించి చరిత్ర సృష్టించారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం ఉదయం 9.29 గంటలకు ఇస్రో తన అంతరిక్ష కదనాశ్వం పీఎస్ఎల్వీ సీ – 40 రాకెట్ ద్వారా 1,323 కిలోల బరువైన మూడు స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత సమయంలో నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటివరకు రిమోట్ సెన్సింగ్, కమ్యూనికేషన్, గ్రహాంతర, నావిగేషన్, ఖగోళాన్ని అధ్యయనం చేసేందుకు మరో తరహా ఉపగ్రహాలను తయారు చేసుకొని ప్రయోగించే వారు. ఇప్పుడు మైక్రో, నానో ఉపగ్రహాల ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఉద యం ప్రయోగించిన పీఎస్ ఎల్వీ రాకెట్ ద్వారా 100 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్, 11 కిలోల ఇండియన్ నానో శాటిలైట్‌ను రోదసీలోకి పంపించారు. ఇండియన్ నానో శాటిలైట్స్ సిరీస్‌లో ఇది మూడో ఉపగ్రహం కావడం విశేషం. నానో శాటిలైట్స్ పనితీరు ఇస్రో ఐఎన్ఎస్ – 1సీ ఉపగ్రహాన్ని ప్రయోగంలో పంపారు. అహ్మదాబాద్‌లో స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు ఈ చిన్న తరహా ఉపగ్రహాన్ని తయారు చేసి ప్రయోగించారు. 11 కిలోల ఉపగ్రహంలో మూడు కిలోల బరువు కలిగిన పేలోడ్స్‌ను అమర్చారు. ఇది కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కావడం విశేషం. పేలోడ్‌తో భూమ్మీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది. భూమ్మీద రేడియేషన్ ఎనర్జీని మదింపు చేస్తుంది. ఉపగ్రహంలో అమర్చిన పేలోడ్స్ టోపోగ్రాఫిక్ మ్యాప్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. విజిటేషన్ మానిటరింగ్, ఎయిర్‌సోల్ స్కాటరింగ్ స్టడీస్‌తో పాటు మేఘాలను అధ్యయనం చేస్తుంది. మైక్రోశాట్ ఉపగ్రహ పనితీరు పీఎస్ఎల్వీ సీ 40లో 100 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్‌ను పంపించారు. అయితే ఉపగ్రహాన్ని మాత్రం భూమికి 393 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టారు. 30 ఉపగ్రహాలను 27.10 నిమిషాల్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత నాలుగోదశను మండించి మళ్లీ సుమారు 200 కిలోమీటర్లు కిందికి తీసుకొచ్చి 1.44 గంటలకు కక్ష్యలోకి విజయంతంగా ప్రవేశపెట్టారు. భవిష్యత్తులో రోదసీలోకి పంపే ఉపగ్రహాలు టెక్నాలజీ డిమానిస్ట్రేటర్‌గా ఉపయోగపడతాయి. ఇస్రో శాస్త్రవేత్తలకు ఎంపీ, ఎమ్యెల్యే అభినందనలు సూళ్లూరుపేట: శ్రీహరికోట రాకెట్కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ సీ 40 రాకెట్ ద్వారా 31 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించిన శాస్త్రవేత్తలను తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాదరావు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి అభినందించారు. చైర్పర్సన్ నూలేటి విజయలక్ష్మి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పరసా వెంకటరత్నయ్య, జెడ్పీ ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, చెంగాళమ్మ ఆలయ పాలకమండలి చైర్మన్ ముప్పాళ్ల వెంకటేశ్వర్లురెడ్డి, మాజీ చైర్మన్ ఇసనాక హర్షవర్ధన్‌రెడ్డి అభినందనలు తెలిపారు. -
నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్
-
నేడు నింగిలోకి వందో శాటిలైట్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తన వందో ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు రంగం సిద్ధమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో శుక్రవారం ఉదయం 9.29 గంటలకు పీఎస్ఎల్వీ సీ–40 వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది. ఇందుకు సంబంధించి 28 గంటల కౌంట్‌డౌన్ గురువారం ప్రారంభమైంది. కార్టోశాట్–2 సిరీస్‌లోని మూడో ఉపగ్రహంతో పాటు మరో 30 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ సీ–40 ఒకేసారి నింగిలోకి మోసుకెళ్లనుంది. ఇందులో మూడు భారత్‌వి, కాగా మిగిలినవి విదేశాలకు చెందిన మైక్రో, నానో ఉపగ్రహాలు. దేశీయ అవసరాల కోసం భౌగోళిక పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి కార్టోశాట్ ఉపగ్రహ వ్యవస్థను 2005లో ప్రారంభించారు. భూమికి 505 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తూ నాణ్యమైన ఛాయాచిత్రాలను ఈ వ్యవస్థ పంపుతోంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, సముద్ర తీర ప్రాంతాల పర్యవేక్షణ, నీటి పంపిణీపై కీలక సమాచారాన్ని సమకూరుస్తోంది. భారత్‌కు చెందిన చివరి ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే ఇప్పటి వరకు ఇస్రో పంపిన స్వదేశీ ఉపగ్రహాల సంఖ్య వందకు చేరుతుంది. కౌంట్‌డౌన్ సందర్భంగా గురువారం రాకెట్‌కు నాల్గో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనం నింపారు. -
30 ఉపగ్రహాలు ఒకేసారి నింగిలోకి!
బెంగళూరు: వచ్చే డిసెంబర్ ద్వితీయార్థంలో పీఎస్ఎల్వీ వాహకనౌక ద్వారా 30 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలోకి పంపిస్తామని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ తెలిపారు. భారత్‌కు చెందిన కార్టోశాట్–2తో పాటు 25 నానో ఉపగ్రహాలు, మూడు మైక్రో ఉపగ్రహాలు, ఓ వర్సిటీకి చెందిన శాటిలైట్‌ను పీఎస్ఎల్వీ–సీ40 ద్వారా ప్రయోగిస్తామని వెల్లడించారు. ‘భారతీయ అంతరిక్ష కార్యక్రమం– పరిశ్రమ సరళి, అవకాశాలు’ అన్న అంశంపై వచ్చే నెల 20 నుంచి 21 వరకు ఢిల్లీలో జరిగే అంతర్జాతీయ సదస్సు వివరాలను కిరణ్ సోమవారం మీడియాకు తెలియజేశారు. మార్చిలో చంద్రయాన్–2: వచ్చే మార్చిలో చంద్రయాన్–2ను ప్రయోగిస్తామని కిరణ్ తెలిపారు. 2008లో ప్రయోగించిన చంద్రయాన్–1 పంపిన ఫొటోల ద్వారానే చంద్రునిపై నీటి ఆనవాళ్లు ఉన్నాయని ప్రపంచానికి తొలిసారిగా తెలిసింది. జీఎస్ఎల్వీ మార్క్–ఐఐ ద్వారా ప్రయోగించనున్న చంద్రయాన్–2తో జాబిల్లిపై మంచు, నీటి అణువులతోపాటు ఇతర మూలకాల గురించి పరిశోధించవచ్చని వెల్లడించారు. -
వచ్చే నెలలో 3 అంతరిక్ష ప్రయోగాలు
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి మే నెలలో మూడు ప్రయోగాలు నిర్వహించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా షార్‌లోని మొదటి ప్రయోగవేదికపై పీఎస్ఎల్వీ సీ38 రాకెట్ అనుసంధానం పనులను శరవేగంగా శాస్త్రవేత్తలు చేస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహంతో పాటు మరికొన్ని విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తారు. ఇప్పటికే నాలుగైదు దేశాలకు చెందిన ఉపగ్రహాలు షార్కు చేరుకున్నాయి. ఈ ప్రయోగాన్ని మే 25న నిర్వహించేందుకు లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు. రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌లో జీఎస్ఎల్వీ ఎఫ్–09 అనుసంధానం పనులు కూడా త్వరితగతిన చేస్తున్నారు. ఈ ప్రయోగంలో అత్యంత కీలకంగా భావిస్తున్న క్రయోజనిక్ ఇంజిన్(సీ–25) తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్ సెంటర్ (ఎల్పీఎస్సీ) నుంచి ఇప్పటికే షార్కు చేరుకుంది. ఈ ప్రయోగంలో సుమారు రెండు టన్నులు బరువు కలిగిన జీశాట్–9 అనే సమాచార ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రయోగాన్ని మే 5న నిర్వహించేందుకు ముహూర్తం నిర్ణయించారు. మే 30న జీఎస్ఎల్వీ మార్క్–3 ప్రయోగాన్ని కూడా చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. శుక్రవారం షార్కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ ఈ విషయమై శాస్త్రవేత్తలతో చర్చించినట్లు తెలుస్తోంది. -
భవిష్యత్తులో మనకు ముప్పే!
ఇస్రో పీఎస్ఎల్వీ–సీ37 ప్రయోగంపై మాధవన్ నాయర్ బెంగళూరు: ఏకకాలంలో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు ప్రశంసలు కురిపిస్తుంటే.. ఆ సంస్థ మాజీ చైర్మన్ జి.మాధవన్ నాయర్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగం విజయవంతమైన రోజున.. ఇస్రోకు 400 ఉపగ్రహాలను కూడా పంపే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని కొనియాడిన ఆయన.. ముందుచూపు లేకుండా ఇటువంటి ప్రయోగాలు చేపట్టడం సరికాదంటూ పరోక్షంగా ఇస్రో పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేశారు. ఐఏఎన్ఎస్ వార్తాసంస్థ ప్రతినిధితో ఫోన్ ద్వారా మాట్లాడిన నాయర్.. ఇస్రో ప్రయోగం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలను వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ఇటీవల ఇస్రో ప్రయోగంతో మన సామర్థ్యం ప్రపంచానికి తెలిసొచ్చింది. అయితే ఇలాంటివి వందేం ఖర్మ 400 ఉపగ్రహాలను కూడా పంపే సామర్థ్యం మనకుంది. అయితే ఇలాంటి ప్రయోగాలు చేపట్టే ముందు వాటివల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలపై కూడా దృష్టి సారించాలి. మొన్న మనం ప్రవేశపెట్టిన 104 ఉపగ్రహాల్లో కేవలం మూడు మాత్రమే మనవి. మిగతా 101 ఉపగ్రహాలు విదేశాలవే. అందులో 88 నానో ఉపగ్రహాలు అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ఓ స్టార్టప్ కంపెనీకి చెందినవే. డబ్బులు వస్తున్నాయి కదా.. అని ఇష్టమున్నట్లుగా ఉపగ్రహాలను పంపుకుంటూ పోతే.. భవిష్యత్తులో అవి మనకే ముప్పుగా పరిణమించవచ్చు. (ఒకేసారి 104 ఉపగ్రహాలు కక్ష్యలోకి అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన భారత్) ముఖ్యంగా భారత్ ప్రవేశపెట్టే ఉపగ్రహాల మనుగడనే అవి ప్రశ్నార్థకం చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రవేశపెట్టిన ఉపగ్రహాలన్నీ నిర్ణీత కాలపరిమితి మేరకు మాత్రమే పనిచేస్తాయి. ఆ తర్వాత అవి అంతరిక్షంలో తుక్కు వస్తువులుగా మారిపోతాయి. ఇలా తుక్కువస్తువులుగా మారుతున్న ఉపగ్రహాల సంఖ్య పెరిగిపోతే.. వాటిని నియంత్రించేవారు లేక అవి విచ్చలవిడిగా అంతరిక్షంలో ఓ దిశ లేకుండా తిరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి పనిచేస్తున్న ఉపగ్రహాలను సైతం ఢీకొట్టే అవకాశం ఉంది. అప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంపిన ఉపగ్రహాలు కూడా పనికి రాకుండా పోయే ప్రమాదముంది. ప్రస్తుతం డబ్బు వస్తుందనే ఆశతో ఇతరుల ఉపగ్రహాలను కూడా మనం మోసుకెళ్తే... మన అవసరాల కోసం పంపిన ఉపగ్రహాలు సైతం నిరుపయోగంగా మారే ప్రమాదముంది. -
విజయోత్సాహం!
– ర్యాలీలు నిర్వహించిన విద్యార్థులు – జాతీయజెండాతో ప్రదర్శన పాఠశాలలు – ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పీఎస్ఎల్వీసీ–37 ప్రయోగం విజయవంతం కావడంతో జిల్లాలో ఆనందోత్సాహాలు మిన్నంటాయి. రష్యా రికార్డును బద్దలు కొడుతూ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ 104 ఉపగ్రహాలతో నింగి కెగసింది. ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శాస్త్రవేత్తల కృషిని అభినందిస్తూ జిల్లాలోని పాఠశాలల విద్యార్థులు స్వీట్లు పంచారు. ఇస్రోకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. జాతీయ జెండా ప్రదర్శనతో ఆనందం వ్యక్తం చేశారు. పీఎస్ఎల్వీ సీ37 విజయవంతంతో ప్రపంచంలో భారత నంబర్ వన్ స్థానాన్ని సంపాదించుకోవడం ఎంతో గర్వకారణమని మేధావులు అభిప్రాయపడ్డారు. ఈ విజయం దేశాభివృద్ధిలో ఎంతో కీలకం కానున్నదని వ్యాఖ్యానించారు. -
నింగినంటిన సంబరం
సాక్షి అనంతపురం : పీఎస్ఎల్వీ సీ 37 ప్రయోగం విజయవంతం కావడంతో జిల్లాలో సంబరాలు అంబరాన్నంటాయి. ఒకేసారి 104 ఉపగ్రహాలను రోదసీలోకి పంపడం ద్వారా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మనదేశ సత్తాను ప్రపంచానికి చాటిచెప్పిందని పలువురు ప్రశంసించారు. అనంతపురం, హిందూపురం, కదిరి, రాయదుర్గం, కణేకల్లు, తాడిపత్రి, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో విద్యార్థులు, ప్రజలు విజయోత్సవాలు నిర్వహించారు. -
ఇస్రో విజయం నూతన శకానికి నాంది
హైదరాబాద్: పీఎస్ఎల్వీసీ-37 ప్రయోగం విజయవంతం అయినందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ హర్షం వ్యక్తం చేశారు. చరిత్రాత్మక ప్రయోగంతో అంతరిక్ష ప్రయోగాల్లో చరిత్ర సృష్టించిన ఇస్రో శాస్త్రవేత్తల బృందానికి గవర్నర్ అభినందనలు తెలిపారు. ప్రపంచంలో తొలిసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టి ఇస్రో చరిత్ర సృష్టించిందని చెప్పారు. అంతరిక్ష ప్రయోగాల్లో నూతన శకానికి ఈ ప్రయోగం నాంది అని చెప్పారు. భారత కీర్తి పతాకను రోదశిలో సగర్వంగా ఎగురవేయడం భారతావనికి గర్వకారణమన్నారు. ఇస్రో ప్రపంచ వ్యాప్తంగా అంతరిక్ష ప్రయోగాలకు కేంద్ర బిందువు కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. -
కొత్త చరిత్రను లిఖించిన ఇస్రో
శ్రీహరికోట (సూళ్లూరుపేట) : అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) వేదికగా ఇస్రో తన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా బుధవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. మొదటి ప్రయోగవేదిక మీద నుంచి పీఎఎస్ఎల్వీ రాకెట్ 104 ఉపగ్రహాలను నిప్పులు చిమ్ముతూ నింగివైపునకు మోసుకెళ్ళింది. అన్ని దశల్లోనూ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. నాల్గవ దశలో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతూ రాకెట్ పయనించింది. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసుకున్న పీఎస్ఎల్వీ సీ37 రాకెట్ ద్వారా 2007లో 10 ఉపగ్రహాలు, 2016 జూన్ 22 పీఎస్ఎల్వీ సీ 34 రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను పంపించి స్వీయ చరిత్ర తిరగరాసుకుంది. అయితే అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2013లో 29 ఉపగ్రహాలను, 2014లో రష్యా ఏకంగా 39 ఉపగ్రహాలను పంపించి అగ్రస్థానాల్లో ఉండగా.. నేడు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ ఏకంగా 104 ఉపగ్రహాలను పంపించడంతో సరికొత్త రికార్డు సాధించింది. 1378 కిలోల బరువు కలిగిన 104 ఉపగ్రహాలను మోసుకెళ్లేందుకు పీఎస్ఎల్వీ సీ37 రాకెట్‌కు మంగళవారం ఉదయం 5.28 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈ ప్రయోగం బుధవారం ఉదయం 9.28 గంటలకు ప్రారంభమై 28.42 నిమిషాల్లోనే పూర్తి అయింది. వాణిజ్యపరంగా ఇప్పటి వరకు 79 విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా పంపించారు. ప్రయోగం విజయవంతం కావడంతో షార్ కేంద్రంలో శాస్త్రవేత్తలు ఆనందోత్సాహాలు వ్యక్తంచేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. (చదవండి: నింగిలోకి దూసుకెళ్లిన సీ-37) ఉపగ్రహాలతో ఉపయోగాలు.. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి బుధవారం ఉదయం 9.28గంటలకు పీఎస్ఎల్వీ సీ-37 ఉపగ్రహ వాహకనౌక ద్వారా మూడు స్వదేశీ ఉపగ్రహాలతో పాటు 101 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రయోగించింది. 1378 కిలోలు బరువు కలిగిన 104 ఉపగ్రహాలను భూమికి 505 కి.మీ నుంచి ఎత్తు నుంచి 524 కి.మీలోని సూర్యానువర్తన ధృవ కక్ష్య (సన్ సింక్రోనస్ ఆర్బిట్)లోకి ప్రవేశపెట్టారు. ఇందులో ప్రధానంగా కార్టోశాట్–2డీ ఉపగ్రహం 510 కిలోమీటర్లు ఎత్తు నుంచి భూమి మీద జరిగే మార్పులను ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. అదే విధంగా ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్ఎస్–1ఏ, ఐఎన్ఎస్–1బీ) 6 నెలలు మాత్రమే ఉపయోగపడతాయి. కార్టోశాట్–2డీ.. భౌగోళిక సమాచారం కోసం కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌ను 2005లోనే రూపొందించారు. కార్టోశాట్–1, 2, 2ఏ, 2బీ, 2సీ ఉపగ్రహాలను పీఎఎల్‌వీ రాకెట్లు ద్వారానే పంపారు. తాజాగా కార్టోశాట్–2డీను బుధవారం రోదసీలోకి దూసుకెళ్ళింది. 714 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహం 510 కిలోమీటర్లు ఎత్తులోని సూర్యానువర్తన ధృవకక్ష్యలో పరిభ్రమిస్తూ బౌగోళిక పరమైన సమాచారాన్ని అందజేస్తుంది. ముఖ్యంగా అందులో అమర్చిన ఫ్రాంక్రోమాటిక్ మల్టీ స్ప్రెక్ట్రల్ కెమెరా భూమిని పరిశోధిస్తూ అత్యంత నాణ్యమైన చాయాచిత్రాలను అందిస్తుంది. పట్టణ, గ్రామీణాభివృద్ధి, తీర ప్రాంతపు భూములు, మ్యాప్‌లు తయారు చేయడం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం, సాగునీటి పంపిణీ, రోడ్లు గురించిన సమాచారాన్ని క్షుణ్ణంగా అందిస్తుంది. ఈ ఉప గ్రహ చిత్రాలు ఆధారంగా పట్టణాభివృద్దిని చేసుకోవడానికి వీలుకలుగుతుంది. భూమి మీద జరిగే మార్పులను ఎప్పటికప్పుడు ఛాయా చిత్రాలు తీసి పంపుతుంది. ఈ ఉపగ్రహం అయిదేళ్లుపాటు పనిచేస్తుంది. ఇస్రో నానోశాటిలైట్స్ పనితీరు.. ఇస్రో నానో శాటిలైట్స్ (ఐఎన్ఎస్–1ల, ఐఎన్ఎస్–1బీ) ఉపగ్రహాలను కూడా ఈ ప్రయోగంలో పంపారు. అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ వారు ఈ రెండు చిన్న తరహా ఉపగ్రహాలను తయారు చేశారు. రెండు ఉపగ్రహాలు కలిపి 18. 1 కేజీలు బరువు వున్నాయి. 8.4 కేజీల బరువు కలిగిన ఐఎన్ఎస్–1ఏ ఉపగ్రహంలో 5 కేజీల బరువు కలిగిన పేలోడ్స్‌ను అమర్చారు. ఇందులో బిడిరెక్షనల్ రెఫ్లెక్టెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ రేడియో మీటర్ (బీఆర్‌డీఎప్), సింగల్ ఈవెంట్ అప్సెట్ మానిటర్ (ఎస్‌ఈయూఎం) పేలోడ్స్ అమర్చారు. ఇది కూడా రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ కావడం విశేషం. ఈ పేలోడ్‌తో భూమిమీద పడే సూర్య ప్రతాపాన్ని తెలియజేస్తుంది. భూమి మీద రేడియేషన్ ఎనర్జీని మధింపు చేస్తుంది. ఇది కేవలం ఆరు నెలలు మాత్రమే పనిచేస్తుంది. 9.7 కేజీలు బరువు కలిగి ఐఎన్ఎస్–1బీ ఉపగ్రహం ఎర్త్ ఎక్సోస్పియర్ లేమాన్ ఆల్ఫా అనాలసిసర్ (ఈఈఎల్‌ఏ), ఆర్గామీ కెమెరా పేలోడ్స్ పంపారు. రిమోట్ సెన్సింగ్ కలర్ కెమెరా ఇది కూడా భూమికి సంబంధించిన సమాచారం అందజేస్తుంది. డౌవ్ శాటిలైట్స్, లీమూర్ ఉపగ్రహాల పనితీరు.. ఆమెరికాకు చెందిన డౌవ్ ఫ్లోక్–3పీ శాటిలైట్స్‌లో 88 చిన్న తరహా ఉపగ్రహాలుంటాయి. ఇవన్నీ ఒక బాక్స్‌లో అమర్చి ఉంచారు. ఈ బాక్స్ స్పేస్‌లోకి వెళ్లగానే అమెరికా అంతరిక్ష సంస్థ భూకేంద్రం వారు దీన్ని గ్రౌండ్ స్టేషన్ నుంచి ఓపెన్ చేయడంతో అందులో వున్న 88 ఉపగ్రహాలు స్పేస్‌లోకి వస్తాయి. వీటి ద్వారా వాణిజ్యపరమైన, వాతావరణ సంబంధమైన సమాచారాన్ని ప్రతి రోజు తెలియజేస్తాయి. లీమూర్ ఉపగ్రహాల వ్యవస్థలో మొత్తం 8 ఉపగ్రహాలుంటాయి. వీటిని కూడా ఓపెన్ చేసిన తరువాత పనిచేయడం ప్రారంభిస్తాయి. ఇవి కూడా భూమికి సంబంధించిన సమాచారాన్నే అందిస్తాయి. విదేశీ ఉపగ్రహాలు... నెదర్లాండ్‌కు చెందిన 3 కేజీల బరువైన పీయాస్, స్విట్జర్లాండ్‌కు చెందిన 4.2 కేజీల డిడో–2, ఇజ్రాయెల్‌కు చెందిన 4.3 బీజీయూ శాట్, కజికిస్తాన్‌కు చెందిన 1.7 కేజీల ఆల్–ఫరాబి–1, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన 1.1 కేజీల బరువు కలిగిన నాయిప్ అనే ఉపగ్రహాలు కూడా టెక్నాలజీ డిమానుస్ట్రేషన్‌కు ఉపయోగించారు. చిన్న చిన్న అప్లికేషన్స్ తయారు చేసేందుకు ఈ చిన్న తరహా ఉపగ్రహాలను వినియోగించారు. ప్రముఖుల అభినందనలు ప్రపంచ దేశాల్లో భారత్‌ను ఎదురులేని శక్తిగా నిలబెట్టిన ఇస్రోకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు అభినందనలు తెలిపారు. Congratulations to @isro for the successful launch of PSLV-C37 and CARTOSAT satellite together with 103 nano satellites! — Narendra Modi (@narendramodi) February 15, 2017 I urge ISRO to continue to strive for the progress of our space capabilities #PresidentMukherjee — President of India (@RashtrapatiBhvn) February 15, 2017 Congrats to ISRO on the record breaking launch of PSLV–C37 with 104 satellites. A truly proud moment for India. — YS Jagan Mohan Reddy (@ysjagan) February 15, 2017 Overwhelmed to witness this magnificent feat by @isro in launching 104 satellites. A proud moment for all Indians. Salute to the team! #ISRO — N Chandrababu Naidu (@ncbn) February 15, 2017 -
కొత్త చరిత్రను లిఖించిన ఇస్రో
-
నింగిలోకి దూసుకెళ్లిన సీ-37
శ్రీహరికోట: భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ సీ-37(104 ఉపగ్రహాల ప్రయోగం) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. బుధవారం ఉదయం 9.28 నిమిషాలకు నిప్పులు చిమ్ముతూ సీ-37 గగనతలంలోకి ప్రయాణం మొదలు పెట్టింది. మొత్తం నాలుగు దశల్లో ప్రయోగం పూర్తవుతుంది. ఈ ప్రయోగం ద్వారా మూడు స్వదేశీ, 101 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిస్తున్నారు. ప్రయోగం ద్వారా అంతరిక్షంలోకి చేరేవి 714 కిలోల బరువైన కార్టోశాట్ 2డీ, ఇస్రో నానో శాటిలైట్స్ అయిన ఐఎన్ ఎస్–1ఏ, ఐఎన్ ఎస్–1బీలు స్వదేశీ ఉపగ్రహాలు. విదేశీ ఉపగ్రహాల్లో 96 అమెరికాకు చెందినవి కాగా, ఇజ్రాయెల్, కజకిస్తాన్ , నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యూఏఈ దేశాలకు చెందిన ఒక్కో ఉపగ్రహం కూడా ఈ ప్రయోగంలో పాలుపంచుకుంటున్నాయి. కార్టొశాట్ 2డీ ఉపగ్రహం రిమోట్ సెన్సింగ్ సేవలను ఐదేళ్ల పాటు అందిస్తుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే ఒకే రాకెట్‌తో 104 ఉపగ్రహాలను పంపిన తొలిదేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది. గతంలో రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ఒకే రాకెట్‌తో 37 ఉపగ్రహాలను విజయవంతంగా పంపించింది. జూన్ 2015లో ఇస్రో సైతం ఒకే ప్రయోగంలో 23 శాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. మంగళవారం ఉదయం కౌంట్‌డౌన్ ప్రారంభమైన వెంటనే రాకెట్‌కు నాలుగో దశలో అవసరమైన 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ దశలో మోనో మిథైల్ హైడ్రోజన్ (ఎంఎంహెచ్), మిక్స్డ్ ఆక్సిడైజడ్ ఆఫ్ నైట్రోజన్ (ఎంఓఎన్ –3) ఇంధనాన్ని నింపారు. అనంతరం నాలుగో దశకు అన్ని పరీక్షలు చేసి బాగుంది అని నిర్ధారించుకున్నాక సోమవారం రాత్రి రెండోదశలో అవసరమైన 42 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. అనంతరం ఇంధనం నింపే ప్రక్రియను పూర్తి చేసి రాకెట్‌కు అవసరమైన హీలియం, నైట్రోజన్ గ్యాస్ ఫిల్లింగ్.. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేసి ప్రయోగానికి సిద్ధమయ్యారు. -
విశ్వంలో చరిత్ర సృష్టించనున్న ఇస్రో!
ముంబై: భారత అంతరిక్ష పరిశోధనా సంస్ధ(ఇస్రో) కొత్త చరిత్ర సృష్టించనుంది. ఒకేసారి 82 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జనవరి 15న ఈ ప్రయోగం చేయనున్నట్లు మార్స్ ఆర్బిటార్ మిషన్(మామ్) ప్రాజెక్టు డైరెక్టర్ సుబ్బయ్య అరుణన్ తెలిపారు. అయితే ఇది వాణిజ్య ప్రయోగమని పేర్కొన్నారు. బ్రాండ్ ఇండియా సమ్మిట్ 2016కు హాజరైన అరుణన్ మాట్లాడారు. ఇస్రో పంపనున్న ఉపగ్రహాల్లో 60 అమెరికాకు చెందినవి కాగా 20 యూరప్‌కు, 2 యూకేకు చెందినవి. ఇప్పటివరకూ కేవలం రష్యా మాత్రమే 37 ఉపగ్రహాలను ఒకేసారి విశ్వంలోకి పంపి చరిత్ర సృష్టించింది. 2014లో జరిగిన ఈ ప్రయోగం విజయవంతంకావడంతో రష్యా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మొగిపోయింది. ఆ తర్వాతి స్ధానంలో అమెరికా 29 ఉపగ్రహాలు, భారత్ 20 ఉపగ్రహాలు ఉన్నాయి. జనవరిలో ఇస్రో చేపట్టే ప్రయోగం విజయవంతమైతే అత్యధిక ఉపగ్రహాలను ఒకేసారి విశ్వంలో పంపిన తొలిదేశంగా భారత్ పేరు చరిత్రకెక్కుతుంది. అతి తక్కువ ఖర్చుతో మామ్ మిషన్ ను తొలి ప్రయోగంతోనే విజయం సాధించి భారత్ ప్రపంచదృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే ఎన్నో ఘనవిజయాలను అందించిన పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్(పీఎస్ఎల్వీ)తో ఈ ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ప్రయోగం జరిగిన 20 నుంచి 25 నిమిషాల్లో 580కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలార్ సన్ సింక్రనస్ కక్ష్యలో 82శాటిలైట్లను ప్రవేశపెడతారు. 2020లో మామ్-2ను ప్రయోగించాలని నిర్ణయించినట్లు అరుణన్ వెల్లడించారు. అరుణ గ్రహంపై పరిశోధనలకు ఇప్పటివరకూ 40 ప్రపోజల్స్ వచ్చినట్లు చెప్పారు. చంద్రయాన్-2 2018లో చంద్రునిపై దిగుతుందని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే పరిశోధనలు ప్రారంభమైనట్లు వివరించారు. -
పీఎస్ఎల్వీ సీ 35 విజయంలో సూర్యాపేట వాసి
సూర్యాపేట : పీఎస్ఎల్వీ సీ35 ప్రయోగం విజయవంతంలో సూర్యాపేట పట్టణానికి చెందిన శాస్త్రవేత్త చెరుకుపల్లి వెంకటరమణ కీలక భాగస్వామ్యంతో సూర్యాపేట ప్రతిష్ట అంబరాన్నింటింది. సోమవారం ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ35 కోసం పట్టణంలోని గణేష్‌నగర్‌కు చెందిన చెరుకుపల్లి లింగయ్య – సరోజినిల పెద్ద కుమారుడు వెంకటరమణ సహకారం అందించారు. మారిషస్ భూ కేంద్రంలోని రాకెట్ ట్రాకింగ్ ద్వారా ముఖ్యమైన డేటాను శ్రీహరికోటకు అందించారు. గతంలో పీఎస్ఎల్వీ సి30 ప్రయోగ సమయంలో కూడా అతడు అల్కాటారా నుంచి టెలియాస్–1 ఉపగ్రహ సమాచారాన్ని అందించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్య వెంకటరమణ సూర్యాపేట పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల (నెం – 2)లో విద్యనభ్యసించారు. అనంతరం హైదరాబాద్‌లోని ఈస్ట్ మారెడుపల్లిలో ట్రిపుల్ ఈ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అనంతరం లక్నోలోని అంతరిక్ష కేంద్రంలో 15 సంవత్సరాలు పని చేశారు. ప్రస్తుతం శ్రీహరి కోటలోని అంతరిక్ష కేంద్రంలో పనిచేస్తున్నారు. కాగా వెంకటరమణను రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అభినందించారు. అంతరిక్ష ప్రయోగాల్లో జిల్లా వాసి భాగస్వామి కావడం సంతోషించదగ్గ విషయమని మంత్రి అన్నారు. -
పీఎస్ఎల్వీ సక్సెస్
భూస్థిర కక్ష్యలో చేరిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహం శ్రీహరికోట (సూళ్లూరుపేట): పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్ ఉపగ్రహాన్ని గురువారం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి ఇస్రో 33వ సారి విజయబావుటా ఎగురవేసింది. ఇస్రో స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహాల శ్రేణిలో 1,425 కిలోల ఈ ఉపగ్రహాన్ని 20.2 నిమిషాలకు పెరిజీ (భూమికి దగ్గరగా) 284 కిలోమీటర్లు, అపోజి (భూమికి దూరంగా) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర బదిలీ కక్ష్యలో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రవేశపెట్టారు. దీనికి సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) గురువారం వేదికైంది. దిగ్విజయంగా కక్ష్యలోకి.. మంగళవారం ఉదయం 9.30కి ప్రారంభమైన కౌంట్‌డౌన్ 54.30 గంటల పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. కౌంట్‌డౌన్ ముగిశాక టెన్ టు వన్ అంకెలు చెబుతూ జీరో అనగానే సాయంత్రం 4.01 గంటలకు రాకెట్ ఎరుపు నారింజ రంగు మంటలు చిమ్ముతూ నింగికి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. ఇక ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహాల శ్రేణిలో ఒక ప్రయోగం మాత్రమే మిగిలి వుందని ఆయన అన్నారు. ప్రయోగం జరిగింది ఇలా.. 44.4 మీటర్ల ఎత్తున్న పీఎస్ఎల్వీ సీ32 రాకెట్‌ను ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్ల సాయంతో4 దశలతో ప్రయోగించారు. ప్రయోగం ప్రారంభమైన సమయం నుంచి ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 73.2 టన్నుల ఘన ఇంధనం, కోర్‌అలోన్ దశలో నింపిన 138.2 టన్నుల ఇంధనంతో 108.6 సెకన్లకు మొదటిదశను, 42 టన్నుల ద్రవ ఇంధనంతో 259.8 సెకన్లకు రెండోదశ, 7.6 టన్నుల ఘన ఇంధనంతో 655.3 సెకన్లకు మూడోదశ, 2.5 టన్నుల ఇంధనంతో 1,175.3 సెకన్లకు నాలుగోదశను పూర్తిచేశారు. సొంత వ్యవస్థ కోసం దేశీయ అవసరాల కోసం స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థకు 2006లో శ్రీకారం చుట్టి 2013 జూలైలో తొలిఉపగ్రహం (ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ)ను పీఎస్ఎల్వీ సీ22 రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు. 2014 ఏప్రిల్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ, అక్టోబర్‌లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1సీ, 2015లో ఐఆర్ఎన్ఎస్ఎస్-1డీ, 2016 జనవరిలో ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈ, గురువారం ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఎఫ్‌తోపాటు ఇప్పటికి ఆరు ఉపగ్రహ ప్రయోగాలను పూర్తి చేశారు. ప్రధాని మోదీ అభినందన ప్రయోగం విజయవంతమవడంపై రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ సంతోషం వ్యక్తంచేశారు. ఇస్రో శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. మన శాస్త్రవేత్తల విశేష కృషికి సెల్యూట్ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇస్రోకు వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ-సీ32 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించినందుకు ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ ప్రయోగంతో దేశం అంతరిక్ష రంగంలో మరింత దూసుకెళ్లిందని, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని జగన్ ఆకాంక్షించారు. -
ఆస్ట్రోశాట్ ప్రయోగానికి రెడీ
నేడు పీఎస్ఎల్వీ సీ-30 ద్వారా ప్రయోగం.. ఖగోళ పరిశోధనల కోసం తొలి ప్రయత్నం భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మొట్టమొదటి సారిగా ఖగోళ పరిశోధన కోసం సోమవారం ఉదయం 10 గంటలకు పీఎస్ఎల్వీ సీ30 ఉపగ్రహ వాహక నౌక ద్వారా 1,513 కిలోల బరువు కలిగిన ఆస్ట్రోశాట్‌ను ప్రయోగించేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ ప్రక్రియ నిర్విఘ్నంగా కొనసాగుతోంది. శనివారం, ఆదివారం వివిధ దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. ఆదివారం రాత్రి రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను అప్రమత్తం చేశారు. - శ్రీహరికోట/హైదరాబాద్ పదేళ్ల శ్రమ ఫలితమే ఆస్ట్రోశాట్.. ఖగోళ పరిశోధనల కోసం ఇస్రో చేస్తున్న తొలి ప్రయోగం ఇది. విశ్వంలోని సుదూర పదార్థాలను అధ్యయనం చేయడానికి దీన్ని ప్రయోగిస్తున్నారు. నక్షత్రాల ఆవిర్భావం గురించి, న్యూట్రాన్‌స్టార్స్, బ్లాక్‌హోల్స్, వాటి అయస్కాంత క్షేత్రాల అధ్యయనం కోసం, మన గెలాక్సీ ఆవల పరిస్థితుల గురించి అధ్యయనం కోసం ఆస్ట్రోశాట్‌ను ప్రయోగిస్తున్నారు. ఆస్ట్రోశాట్ వెనుక ఇస్రో శాస్త్రవేత్తల పదేళ్ల కష్టం ఉంది. ఈ ఉపగ్రహంలో ట్విన్స్ అల్ట్రావయొలెట్ టెలిస్కోప్, లార్జ్ ఏరియా క్సెనాన్ ప్రొపోర్షన్ కౌంటర్, సాప్ట్ ఎక్స్‌రే టెలిస్కోప్, కాడ్‌మిమ్స్-జింక్-టెల్యూరైడ్ కోడెడ్- మాస్క్ ఇమేజర్, స్కానింగ్ స్కై మానిటర్ అనే ఐదు రకాల ఉపకరణాలను అమర్చారు. ఆస్ట్రోశాట్‌లో అమర్చిన ఐదు పేలోడ్స్ విషయంలో ఇస్రో శాస్త్రవేత్తలతో పాటు నాలుగు యూనివర్సిటీల, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ భాగస్వామ్యం ఉంది. ఈ శాటిలైట్ జీవితకాలాన్ని ఐదేళ్లుగా అంచనా వేస్తున్నారు. ఇది ఆరంభం మాత్రమే... ఆస్ట్రోశాట్ ఉపగ్రహ ప్రయోగం అంతరిక్ష పరిశోధకులకు మంచి అవకాశం అని ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ఇలాంటి శాస్త్రీయ ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది ప్రారంభం మాత్రమే అని ఆయన అన్నారు. కిరణ్‌కుమార్ ఆదివారం షార్కు చేరుకుని పీఎస్ఎల్వీ సీ30 కౌంట్‌డౌన్ ప్రక్రియను పరిశీలించారు. మొదటి ప్రయోగ వేదికపై ఉన్న రాకెట్‌ను పరిశీలించారు. అనంతరం సహచర శాస్త్రవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమై ప్రయోగ పనులను సమీక్షించారు. విదేశీ శాటిలైట్స్ ప్రయోగంలో హాఫ్ సెంచరీ! ఈ ప్రయోగంలో పీఎస్ఎల్వీ సీ-30 ఆరు విదేశీ శాటిలైట్స్‌ను కూడా తీసుకెళుతోంది. ఇండోనేసియాకు చెందిన 76 కిలోల లపాన్-ఏ2, కెనడాకు చెందిన 14 కిలోల ఎన్ఎల్ఎస్14, అమెరికాకు చెందిన 28 కిలోల లీమూర్ అనే నాలుగు చిన్నతరహా ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ఈ ఆరు విదేశీ ఉపగ్రహాలతో ఇస్రో ప్రయోగించిన విదేశీ ఉపగ్రహాల సంఖ్య 50 ని దాటుతుంది. ఇప్పటి వరకూ ఇస్రో 45 విదేశీ ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఫీజు తీసుకుని ఇస్రో ఇలా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తూ వస్తోంది. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను ప్రయోగించడం ఇస్రో చరిత్రలో ఇది మూడో సారి. -
10న పీఎస్ఎల్ వీ సీ28 ప్రయోగం
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఈనెల 10వ తేదీ రాత్రి 9.58 గంటలకు పీఎస్ఎల్వీ సీ28 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శుక్రవారం ప్రకటించింది. దీనికి సంబంధించి ఈ నెల ఎనిమిదిన ఉదయం 7.30 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఈ ప్రయోగంలో కెనడాకు చెందిన ఐదు ఉపగ్రహాలను రోదసీలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగం ద్వారా ఇస్రోకి రూ.1,440 కోట్ల ఆదాయం లభించనుంది. -
ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా రఘురామ్ రాజన్
సైన్స్ అండ్ టెక్నాలజీ పీఎస్ఎల్వీ-సీ 26 ప్రయోగం విజయవంతం ఐఆర్ఎన్ఎస్ఎస్-1సి ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ 26 నౌక శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి అక్టోబరు 16న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నావిగేషన్ కోసం ప్రయోగించిన మూడో ఉపగ్రహం ఇది. అర్ధరాత్రి రాకెట్ ప్రయోగించడం ఇది రెండోసారి. విజయవంతమైన నిర్భయ్ క్షిపణి ప్రయోగం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి దీర్ఘశ్రేణి సబ్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. దీన్ని అక్టోబరు 17న ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించారు. ఇది 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వస్త్రాలను కూడా మోసుకుపోగలదు. భూమి, ఆకాశం, సముద్రంపైనుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇది కనిష్టంగా ఐదు మీటర్ల ఎత్తులో, గరిష్టంగా ఐదు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ప్రస్తుతం బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి 290 కి.మీ మాత్రమే ప్రయాణిస్తుంది. నిర్భయ్‌ను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన ఏరో నాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థ (బెంగళూరు) అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందిన తోమహాక్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ క్షిపణులకు నిర్భయ్ పోటీగా నిలుస్తుంది. జాతీయం భారత్‌లో యూఎన్ ఉమెన్ ప్రచారం ప్రారంభం మహిళల హక్కులు, లింగ సమానత్వం పెంపొందించడంలో పురుషుల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో యూఎన్ ఉమెన్ కార్యక్రమాన్ని ఐక్యరాజ్య సమితి అక్టోబరు 11న ప్రారంభించింది. 2030 నాటికి లింగ అసమానత్వాన్ని అంతమొందించేందుకు హి ఫర్ షి ఉద్యమాన్ని చేపట్టింది. శ్రమయేవ జయతే ప్రారంభం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్రమయేవ జయతే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ అక్టోబరు 16న న్యూఢిల్లీలో ప్రారంభించారు. దీని కి ంద ఐదు పథకాలను ప్రారంభించారు. 1. శ్రమ సువిధ పోర్టల్: ఇందులో ప్రతి కార్మికుడికి ప్రత్యేక కార్మిక గుర్తింపు సంఖ్య ఉంటుంది. 2. ర్యాండమ్ ఇన్స్పెక్షన్ పథకం: పరిశ్రమల తనిఖీ పారదర్శకంగా ఉండేందుకు ఈ పథకాన్ని కార్మిక శాఖ రూపొందించింది. 3. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్): ఉద్యోగ భవిష్య నిధి సభ్యుల కోసం సార్వత్రిక ఖాతా సంఖ్య (యూనివర్సల్ అకౌంట్ నంబర్) శాశ్వతంగా ఒకటే ఉంటుంది. 4. అప్రెంటీస్ షిప్ ప్రోత్సాహన యోజన: యువతలో నైపుణ్యాల వృద్ధి కోసం ఉద్దేశించిన పథకమిది. 5. సవరించిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా: అవ్యవస్థీకృత రంగంలోని కార్మికులకు ఆరోగ్య భద్రత కోసం ఇచ్చిన కార్డులకు రెండు సామాజిక భద్రత పథకాలను చేరుస్తారు. వ్యాపారవేత్తలకు ఇబ్బందులు పెట్టే ఇన్స్పెక్టర్ రాజ్ విధానాన్ని రద్దు చేశారు. సిగరెట్ ప్యాకెట్లపై హెచ్చరికలు పొగ తాగటం వల్ల అనర్థాలను హెచ్చరిస్తూ సిగరెట్ ప్యాకెట్లపై 85 శాతం స్థలంలో చట్టబద్ధమైన హెచ్చరికలను విధిగా ముద్రించాలని తయారీ కంపెనీలను కేంద్ర ఆరోగ్యశాఖ అక్టోబర్ 15న ఆదేశించింది. సిగరెట్ పెట్టెపై 60 శాతం స్థలంలో ధూమపానం వల్ల కలిగే నష్టాలపై రేఖా చిత్రాలు, 25 శాతం స్థలంలో హెచ్చరికలను ముద్రించాలంటూ స్పష్టం చేసింది. డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేత డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేస్తూ కేంద్రం అక్టోబరు 18న నిర్ణయం తీసుకుంది. దీంతో నవంబర్ నుంచి అంతర్జాతీయ ధరలకనుగుణంగా డీజిల్ ధరలు ఉంటాయి. ఇటీవల ముడి చమురు ధరలు తగ్గడంతో అక్టోబరు 18న డీజిల్ ధరను చమురు సంస్థలు తగ్గించాయి. డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడం వల్ల ప్రభుత్వం కానీ, చమురు సంస్థలు కానీ ఇకపై ఎటువంటి రాయితీ అందించవు. 2010లో పెట్రోల్‌పై ప్రభుత్వం ధరల నియంత్రణ ఎత్తివేసింది. అప్పటి నుంచి అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధరలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర, హర్యానా శాసనసభలకు అక్టోబరు 15న జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. మహారాష్ట్రలో 288 స్థానాలకు 122 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. హర్యానాలో 90 స్థానాలకు 47 స్థానాలు గెలుచుకొని పూర్తి మెజారిటీ సాధించింది. మహారాష్ట్రలో బీజేపీ-122, శివసేన -63, కాంగ్రెస్-42, ఎన్సీపీ- 41, స్వతంత్రులు -7, ఇతరులు-12 గెలుచుకున్నారు. హర్యానాలో బీజేపీ-47, ఐఎన్ఎల్డి-19, కాంగ్రెస్-15, హెచ్జేసీ-2, ఇతరులు-7 స్థానాలు సాధించారు. అవార్డులు ఆస్ట్రేలియా రచయితకు బుకర్ ప్రైజ్ ప్రతిష్టాత్మక సాహితీ పురస్కారం మ్యాన్ బుకర్ ప్రైజ్ -2014 ఆస్ట్రేలియా రచయిత రిచర్డ్ ప్లనగన్ (53) ను వరించింది. ‘ది నేరో రోడ్ టు ది డీప్ నార్త్‘ అనే నవల రచనకు ఈ పురస్కారం దక్కింది. బర్మా-థాయ్‌లాండ్ రైల్వే నిర్మాణం నేపథ్యమే ఈ నవల ఇతివృత్తం. రెండో ప్రపంచ యుద్ధ ఖైదీలు, బానిసలతో ఈ రైల్వే లైన్ నిర్మించిన సమయంలో నాటి దారుణమైన పరిస్థితులు, కార్మికుల మధ్య ఉన్న అనుబంధాలను ఈ నవలలో రిచర్డ వివరించారని బుకర్ కమిటీ తెలిపింది. ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్‌గా రాజన్ యూరోమనీ మ్యాగజైన్ ఉత్తమ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అవార్డును వాషింగ్టన్లో అక్టోబరు 10న భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అందుకున్నారు. భారీ లోటుతో ఉన్న ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు రాజన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని యూరోమనీ రాజన్‌ను కొనియాడింది. జమ్మూకాశ్మీర్ పోలీసు శక్తిదేవికి ఐరాస అవార్డు జమ్మూకాశ్మీర్‌కు చెందిన మహిళా పోలీసు శక్తిదేవి (38)కి ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మహిళా శాంతి పరిరక్షకురాలు-2014 అవార్డు లభించింది. కెనడాలోని విన్నిపెగ్‌లో అక్టోబరు మొదటివారంలో జరిగిన మహిళా పోలీసుల అంతర్జాతీయ సంఘం సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఐరాస తరపున అఫ్గానిస్థాన్‌లో ఆమె పనిచేస్తున్నారు. శక్తిదేవి మహిళా కౌన్సిళ్లు ఏర్పాటు చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. లైంగిక దాడులు, లింగ వివక్ష వేధింపు బాధితులకు సేవలు అందించారు. ఈ అవార్డును ఐక్యరాజ్యసమితి పోలీసు డివిజన్ ఏర్పాటు చేసింది. భారత శాస్త్రవేత్తకు ప్రపంచ ఆహార బహుమతి ప్రముఖ భారత శాస్త్రవేత్త సంజయ రాజారాం ప్రతిష్టాత్మక ప్రపంచ ఆహార బహుమతి (వరల్డ్ ఫుడ్ ప్రైజ్)-2014కు ఎంపికయ్యారు. అమెరికాలో డెస్ మోయిన్స్‌లో అక్టోబరు 16న జరిగిన 2014 బోర్లాగ్ డైలాగ్ సదస్సులో ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా గోధుమ దిగుబడులు పెంచడంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ అవార్డు వరించింది. ప్రస్తుతం అంతర్జాతీయ పొడినేలల, వ్యవసాయ పరిశోధన కేంద్రం (ఐసీఏఆర్డీఏ) సీనియర్ శాస్త్రీయ సలహాదారుగా రాజారాం వ్యవహరిస్తున్నారు. దాదాభాయ్ నౌరోజీ అవార్డులు భారత్-బ్రిటన్ సంబంధాలను బలోపేతం చేయడంలో కృషి చేసిన వారికి గుర్తింపుగా బ్రిటన్ ప్రభుత్వం దాదాభాయ్ నౌరోజీ పేరుతో ఏర్పాటుచేసిన అవార్డులను అక్టోబరు 10న ప్రదానం చేసింది. వాణిజ్య రంగంలో యునెటైడ్ కింగ్డమ్ ఇండియా కౌన్సిల్ చైర్మన్ పాట్రికా హెవిట్, విద్యారంగంలో ఆశా ఖేమ్కా, కళారంగంలో నటుడు మాధవ్ శర్మలను అవార్డులు వరించాయి. బ్రిటన్ పార్లమెంట్లో తొలి ఆసియా సభ్యుడు, భారత వాణిజ్యాన్ని బ్రిటన్‌కు తీసుకువచ్చిన తొలి భారతీయునిగా నిలిచిన నౌరోజీకి అంకితం ఇస్తూ బ్రిటన్ ఈ అవార్డులను ప్రకటించింది. వార్తల్లో వ్యక్తులు యూఎస్ హక్కుల విభాగంలో వనితా గుప్తా భారతీయ అమెరికన్ మహిళా న్యాయవాది, అమెరికా పౌర హక్కుల సంఘం డిప్యూటీ లీగల్ డెరైక్టర్ వనితా గుప్తా (39) అరుదైన గౌరవం పొందారు. అమెరికా న్యాయశాఖలో కీలకమైన పౌర హక్కుల విభాగం సహాయక అటార్నీ జనరల్‌గా అక్టోబరు 15న నియమితులయ్యారు. తద్వారా ఈ పదవి పొందిన తొలి దక్షిణాసియా అమెరికన్‌గా వనితా గుప్తా గుర్తింపు పొందారు. మోల్లీ మోరాన్ స్థానంలో నియమితులైన ఆమె ఈ నెల 20న పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆర్థిక సలహాదారుగా అరవింద్ ప్రముఖ ఆర్థిక వేత్త, విద్యావేత్త అరవింద్ సుబ్రమణియన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా అక్టోబరు 16న బాధ్యతలు చేపట్టారు. ఆయన మూడేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. గతంలో ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఆర్థికవేత్తగా పనిచేశారు. బొలీవియా అధ్యక్షుడిగా మొరాల్స్ బొలీవియా అధ్యక్ష ఎన్నికల్లో ఎవో మొరాల్స్ మూడోసారి విజయం సాధించారు. అక్టోబరు 12న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 60 శాతం ఓట్లు లభించాయి. ప్రత్యర్థి డోరియా మెడినాకు 25 శాతం దక్కాయి. ఆర్థిక, రాజకీయ సుస్థిరతను అందించేందుకు మొరాల్స్కు మూడోసారి ప్రజలు పట్టం కట్టారు. గతంలో దక్షిణ అమెరికాలో అత్యంత పరిపాలించలేని దేశాల్లో బొలీవియా ఒకటి. క్రీడలు. సాకేత్‌కు ఇండోర్ ఓపెన్ టైటిల్ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ మైనేని ఇండోర్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. అక్టోబరు 19న జరిగిన సింగిల్స్ ఫైనల్లో అలెగ్జాండర్ (కజకిస్థాన్)ను సాకేత్ ఓడించాడు. ఇది అతనికి తొలి ఏటీపీ చాలె ంజర్ టోర్నీ టైటిల్. జాతీయ సీనియర్ ఆర్చరీ చాంప్ జాతీయ సీనియర్ ఆర్చరీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ కైవసం చేసుకుంది. అక్టోబరు 16న జరిగిన మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఫైనల్లో పూర్వాషా షిండేపై ఆమె విజయం సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌ను జ్యోతి రెండుసార్లు గెలుచుకుంది. భారత్‌కు సుల్తాన్ జొహర్ కప్ హాకీ సుల్తాన్ జొహర్ కప్ అండర్ -21 టోర్నమెంట్‌ను భారత జట్టు గెలుచుకుంది. మలేసియాలో జరిగిన ఫైనల్లో బ్రిటన్ను భారత్ ఓడించింది. దీంతో ఈ టోర్నమెంట్‌ను వరుసగా రెండు సార్లు సాధించిన తొలి జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. అంతర్జాతీయం కాశ్మీర్‌పై జోక్యానికి ఐరాస విముఖత కాశ్మీర్ సరిహద్దు అంశంపై జోక్యం కోసం పాకిస్థాన్ చేసిన ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి తిరస్కరించింది. ఈ అంశాన్ని భారత్, పాక్‌లు చర్చలు ద్వారా పరిష్కరించుకోవాలంటూ సూచించింది. సరిహద్దులో పరిస్థితిని చక్కదిద్దేందుకు, కాశ్మీర్ సమస్య పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని పాక్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు లేఖ రాసింది. అయితే ఈ వివాదాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. రాష్ట్రపతి నార్వే, ఫిన్లాండ్ పర్యటన భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నార్వే పర్యటనలో ఈ నెల 14న ఇరుదేశాల మధ్య 13 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటిలో ఇరు దేశాల మధ్య రక్షణ, విద్య, పరిశోధన సంస్థల మధ్య ఒప్పందం, భారత్‌లో అత్యాధునిక చేపల పెంపకం కేంద్రం ఏర్పాటుతో పాటు 13 ఒప్పందాలు ఉన్నాయి. అక్టోబరు 15న ఫిన్లాండ్లో పర్యటించిన రాష్ట్రపతి ఆ దేశ అధ్యక్షుడు సాయులి నీనిస్తోతో అధికారిక చర్చలు జరిపారు. అసోంలోని నుమాలిఘర్‌లో బయో రిఫైనరీ ఏర్పాటుతోపాలు 19 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. భారత ప్రభుత్వం నూతనంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియాలో భాగం కావాలని నార్వే కంపెనీలను ప్రణబ్ ఆహ్వానించారు. రాష్ట్రీయం తెలంగాణలో ఐదు స్మార్ట్ సిటీలు తెలంగాణ రాష్ట్రంలోని.. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం నగరాలను స్మార్ట సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రానికి రాష్ట్రం ప్రతిపాదించనుంది. జలవనరుల శాఖ సలహాదారుగా శ్రీరాం తెలంగాణకు చెందిన శ్రీరాం వెదిరె కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ సలహాదారుగా అక్టోబర్ 16న నియమితులయ్యారు. గంగానదీ ప్రక్షాళన, నదుల అభివృద్ధి, వాటి అనుసంధానం, సాగునీటి సరఫరా వంటి అంశా ల్లో కేంద్ర జలవనరుల శాఖకు ఆయన సలహాలు ఇస్తా రు. నల్లగొండ జిల్లాకు చెందిన శ్రీరాం..‘నీటి నిర్వహణ లో గుజరాత్ విజయగాథ’, ‘గోదావరి, కృష్ణాలను విని యోగిస్తూ తెలంగాణకు వాటర్‌గ్రిడ్’,‘దేశానికి నీటి నిర్వహణలో కొత్త పద్ధతులు అనివార్యం’ వంటి గ్రంథాలను రచించారు. అలాగే జాతీయ నీటి విధానం-2012 రూపకల్పనలో భాగస్వామిగా వ్యవహరించారు. -
పదిలమైన కెరీర్‌కు పట్టుగొమ్మలైన బ్రాంచ్‌లు
శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని మనిషికి నిత్య జీవితంలో అవసరమయ్యే నిర్మాణాలు, యంత్రాలు, వస్తులు, పదార్థాలు తయారు చేసేందుకు ఉపయోగపడే అధ్యయన శాస్త్రమే ఇంజనీరింగ్! నాడు పారిశ్రామిక విప్లవానికి చోదకశక్తిగా నిలిచిన జేమ్స్ వాట్ ఆవిరియంత్రం నుంచి నేడు అంతరిక్ష ప్రయోగాలకు ఊపిరిగా నిలుస్తున్న పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ నౌకల వరకు అన్నీ జనీరింగ్ నిపుణుల పనితనానికి తార్కాణాలే. మనిషి మనుగడ దిశ, దశలను మార్చడంలో ఇంజనీరింగ్‌ది కీలక పాత్ర. అలాంటి ఇంజనీరింగ్‌కు పట్టుగొమ్మలుగా ఉన్న బ్రాంచ్‌లు, కెరీర్ అవకాశాలపై ఫోకస్.. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ భారత్‌లో టెలికం మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. వీఎల్ఎస్ఐ/ఎంబెడెడ్ సిస్టమ్స్ హబ్‌గా మారుతుండటంతో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్లకు అవకాశాలు పెరుగుతున్నాయి. మన నిత్యజీవితంలో భాగమైన కంప్యూటర్లు, ఎంపీ3 ప్లేయర్లు, సెల్ఫోన్లు, టీవీలు వంటి వాటిలో ఉపయోగించే ట్రాన్సిస్టర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు (పీసీబీ) వంటివి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ల కృషి ఫలితమే! కోర్సులు: బ్యాచిలర్ స్థాయిలో ఈసీఈ కోర్సులో చేరేందుకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి. రాష్ట్రంలో ఎంసెట్ ఆధారంగా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. రాష్ర్టంలో 70 వేలకు పైగా సీట్లున్నాయి. ఐఐటీలు, నిట్లు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కళాశాలలు, మరికొన్ని ఇతర ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించాలంటే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబరచాలి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.కోర్ సబ్జెక్టులు: ఎలక్ట్రో మ్యాగ్నటిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అండ్ మెషీన్స్, సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్, డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్, మైక్రో ప్రాసెసర్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, ఆప్టికల్ సిస్టమ్స్, వీఎల్ఎస్ఐ. కెరీర్: ఈసీఈ కోర్సు పూర్తిచేసిన వారు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్ అండ్ ఏవియానిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, కమ్యూనికేషన్స్, ట్రాన్స్‌పోర్టేషన్, టెలీ కమ్యూనికేషన్స్, రేడియో అండ్ టీవీ, కంప్యూటర్ అప్లికేషన్స్, హాస్పిటల్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్, ఆఫ్‌షోర్ ఇండస్ట్రీలు తదితరాలతో సంబంధమున్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల్లో ప్రతిభ కనబరిచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నత ఉద్యోగాలను పొందొచ్చు. సాధారణంగా ట్రైనీ ఇంజనీర్‌కు ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ.20 వేల వేతనం లభిస్తుంది. టాప్ రిక్రూటర్స్: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఇన్ఫోసిస్, టీసీఎస్, మోటరోలా, శాంసంగ్, టెక్ మహీంద్ర ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్డీఆర్డీవో ఇస్రో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ఉన్నతవిద్య: బీటెక్‌లో ఈసీఈ పూర్తయితే ఎంఎస్/ఎంటెక్ చేసి, ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. తర్వాత పరిశోధన రంగంలోకి అడుగుపెట్టొచ్చు. ఈసీఈ మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మంచి డిమాండ్ ఉన్న బ్రాంచ్. విభిన్న రంగాల్లో అవకాశాలు లభిస్తుండటం దీనికి కారణం. బీటెక్ ఈసీఈ పూర్తిచేసిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు, వాటి అనుబంధ సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. ప్రత్యేక పరీక్షల్లో ప్రతిభ కనబరచడం ద్వారా వీటిని చేజిక్కించుకోవచ్చు. టెలికం కంపెనీలు, త్రివిధ దళాలు, సివిల్ ఏవియేషన్, డీఆర్డీవో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ తదితర సంస్థల్లో ఎక్కువ అవకాశాలుంటాయి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ దిశగా సాగితే ఉన్నత కెరీర్ సొంతం చేసుకోవచ్చు.- ప్రొఫెసర్ కె.రాజరాజేశ్వరి, రిటైర్డ ప్రిన్సిపాల్, ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఉమెన్). కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ).. సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ ప్రక్రియలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత సమాచార వ్యవస్థల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ వంటి వాటిని వివరిస్తుంది. నేటి ఆధునిక ప్రపంచంలో కంప్యూటర్ల వినియోగం బాగా పెరిగింది. కంప్యూటర్ ఆధారిత సేవలు మానవ జీవితంలో భాగమైపోయాయి. దీంతో సీఎస్ఈ కోర్సు చేసిన వారికి అవకాశాలు పెరిగాయి.కోర్సులు: గ్రాడ్యుయేషన్ స్థాయిలో సీఎస్ఈ బ్రాంచ్ లో చేరేందుకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి. రాష్ట్రం లో ఎంసెట్ ద్వారా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్రంలో దాదాపు 67 వేల సీట్లున్నాయి. ఐఐటీలు, నిట్లు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కళాశాలలు, మరికొన్ని ఇతర ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించాలంటే జేఈఈ మెయిన్/అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబరచాలి.కోర్ సబ్జెక్టులు: కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్; డేటాబేస్ సిస్టమ్స్; ఎలక్ట్రానిక్స్;ఆపరేటింగ్ సి స్టమ్స్; నెట్వర్కింగ్;ఫౌండేషన్స్ ఆఫ్ కంప్యూటర్సిస్టమ్స్; జావా ప్రోగ్రామింగ్ అండ్ వెబ్సైట్ డిజైన్; ఈ-కామర్స్ - ఈఆర్పీ అండ్ మల్టీమీడియా అప్లికేషన్స్. కెరీర్: నేటి ఆధునిక టెక్నాలజీ ప్రపంచంలో సీఎస్ఈ కోర్సు పూర్తిచేసిన వారికి అవకాశాలకు కొదవలేదు. కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, కంప్యూటర్ హార్డ్‌వేర్ సిస్టమ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలు, కంప్యూటర్ నెట్వర్కింగ్ కంపెనీలు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ తదితర కంపెనీల్లో టెక్నికల్ రైటర్, సాఫ్ట్వేర్ డిజైనర్, మల్టీమీడియా ప్రోగ్రామర్, అప్లికేషన్ ప్రోగ్రామర్, టెక్నికల్ ఆర్కిటెక్ట్, సిస్టమ్స్ ప్రోగ్రామర్, సిస్టమ్స్ అనలిస్ట్, గేమ్ డిజైనర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, వెబ్సైట్ డెవలపర్/ డిజైనర్ వంటి ఉద్యోగాలు ఉంటాయి. ప్రారంభంలో రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు వేతనం రూపంలో అందుతుంది. టాప్ రిక్రూటర్స్: టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, అసెంచర్, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టెక్ మహీంద్ర... ఉన్నత విద్య: బీటెక్-సీఎస్ఈ పూర్తిచేసిన వారు కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్; డేటాబేస్ సిస్టమ్స్ వంటి స్పెషలైజేషన్లతో ఎంటెక్/ఎంఎస్ చేసి ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. మేనేజ్మెంట్ కోర్సును పూర్తిచేసి, వ్యాపార నిర్వహణ దిశగా అడుగులేయొచ్చు. ఉన్నత కెరీర్‌కు ఉజ్వల అవకాశం నేడు కంప్యూటర్ మనిషి జీవితంలో భాగమైపోతోంది. అందుకే ఈ రంగంలో గణనీయమైన అభివృద్ధి నమోదవుతోంది. శరవేగంగా కంప్యూటర్ రంగం దూసుకెళ్తున్నా ఇప్పటికీ కంప్యూటరీకరణ జరిగింది కేవలం 20 శాతమే. అంటే జరగాల్సిన అభివృద్ధి చాలా ఉందన్నమాట. ఈ నేపథ్యంలో అందిపుచ్చుకునే ఓర్పు, నేర్పు ఉండాలేగానీ యువతకు అద్భుత అవకాశాలు అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఇంటర్ డిసిప్లినరీ కోర్సు లు చేయడం వల్ల కొత్త ఆవిష్కరణలకు, తద్వా రా ఉన్నత వృత్తి జీవితానికి బాటలు వేసుకునే అవకాశముంటుంది. కానీ, ఇలాంటి కోర్సులు ఇప్పుడు అందుబాటులో లేవు. ఉదాహరణకు బీటెక్ (సీఎస్ఈ)/ మెకానికల్ పూర్తిచేసిన వారు ఎంబీబీఎస్‌లోని అంశాలున్న కోర్సులు చేస్తే కొత్త ఆవిష్కరణలకు (ఉ్ఠ: వివిధ వ్యాధులకు శస్త్రచికిత్సలో రోబోటిక్ పరిజ్ఞానం వినియోగానికి సంబంధించి)అవకాశముంటుంది. ఇలాంటి కోర్సులను తక్కువ కాల వ్వవధితో, పీజీ స్థాయిలో ఏర్పాటు చేసి, కరిక్యులం ప్రాథమిక అంశాల నుంచి మొదలయ్యేలా ఉండాలి. ఇలాంటి కోర్సులను ప్రారంభించేందుకు విశ్వవిద్యాలయాలు ముందుకు రావాలి. - ఎం.వెంకట్ దాస్, హెచ్‌వోడీ, సీఎస్ఈ, ఉస్మానియా యూనివర్సిటీ. సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్.. రహదారులు, భవంతులు, విమానాశ్రయాలు, వంతెనలు, కాలువలు.. ఇలా వివిధ నిర్మాణాలకు సంబంధించి ప్రణాళికల రచన, రూపకల్పన, నిర్వహణ, పర్యవేక్షణ వంటి అంశాలను వివరిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతుల ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో అదే స్థాయిలో ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ పెరుగుతోంది. కోర్సులు: బీటెక్ సివిల్ ఇంజనీరింగ్‌లో ప్రవేశించాలంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2/తత్సమాన అర్హత ఉండాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ తదితర ఎంట్రన్స్‌లతో కోర్సులో ప్రవేశించవచ్చు. రాష్ట్రంలో 27 వేలకు పైబడి సీట్లున్నాయి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. కోర్ సబ్జెక్టులు: సర్వేయింగ్, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్, బిల్డింగ్ టెక్నాలజీ, స్ట్రక్చరల్ అనాలసిస్ అండ్ డిజైన్, డిజైన్ ఆఫ్ హైడ్రాలిక్ స్ట్రక్చర్స్, ఆర్కిటెక్చర్ అండ్ టౌన్ ప్లానింగ్. సివిల్ ఇంజనీరింగ్- ముఖ్యమైన విభాగాలు: కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్, హైడ్రాలిక్ ఇంజనీరింగ్, కోస్టల్ అండ్ ఓషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, మెటీరియల్స్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఎర్త్‌కేక్ ఇంజనీరింగ్, అర్బన్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్. కెరీర్: బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి రహదారులు, భవనాల శాఖ, నీటి పారుదల శాఖ, పంచాయతీరాజ్ విభాగం, ఇండియన్ రైల్వే, నేషనల్ హైవేస్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బోర్డు, కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ తదితర విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఫ్రీలాన్సింగ్ సేవలు అందించవచ్చు. ప్రారంభంలో సివిల్ ఇంజనీర్లకు రూ.15,000 నుంచి రూ.25,000 వరకు వేతనం వస్తుంది. అనుభవం, అదనపు అర్హతలతో నాలుగైదేళ్లలో 40 వేల వరకు సంపాదించవచ్చు. టాప్ రిక్రూటర్స్: ఎల్ అండ్ టీ; రిలయన్స్ ఇన్ఫ్రా; ఎల్ఎన్జే భిళ్వారా గ్రూప్; జైపీ గ్రూప్; గామన్ ఇండియా లిమిటెడ్.. ఉన్నత విద్య: బీటెక్ (సివిల్ ఇంజనీరింగ్) అనంతరం ఎంటెక్/ఎంఈ చేసి, ఉన్నత అవకాశాలను చేజిక్కించుకోవచ్చు. నిర్మాణ రంగంపై ఆసక్తి ఉండాలి సివిల్ ఇంజనీరింగ్ కెరీర్లో రాణించాలంటే నిర్మాణ రంగంపై ఆసక్తి, డిజైనింగ్‌లో సృజనాత్మకత, కమ్యూనికేషన్ స్కిల్స్, బృంద స్ఫూర్తి అవసరం. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన వారికి ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగంలోనూ విసృ్తత అవకాశాలుంటాయి. ఉన్నత విద్య పరంగా చూస్తే ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, రిమోట్ సెన్సింగ్, హైడ్రాలిక్ అండ్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్, జియోటెక్నికల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ వంటి స్పెషలైజేషన్లతో ఎంటెక్/ఎంఎస్ పూర్తి చేసి ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. - డాక్టర్ ఎం.వి.శేషగిరిరావు, ప్రొఫెసర్, సివిల్ ఇంజనీరింగ్, జేఎన్టీయూహెచ్. కెమికల్ ఇంజనీరింగ్ కెమికల్ ప్లాంట్ల నిర్వహణ, రసాయన ముడిపదార్థాలను పెద్ద ఎత్తున వినియోగ వస్తువులుగా మార్చే ప్రాసెసింగ్ విధానం మొదలైన అంశాలు కెమికల్ ఇంజనీరింగ్‌లోకి వస్తాయి. రసాయనాలు, వాటికి సంబంధించిన ఉప ఉత్పత్తుల తయారీకి రసాయనిక విజ్ఞానాన్ని ఇంజనీరింగ్ టెక్నిక్స్ ద్వారా వినియోగించుకుంటారు. బయోటెక్నాలజీ నుంచి నానోటెక్నాలజీ, మినరల్ ప్రాసెసింగ్‌ల వరకు కెమికల్ ఇంజనీరింగ్‌తో సంబంధం లేని రంగమంటూ లేదు. కోర్సులు: బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్‌లో ప్రవేశించాలంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో 10+2/తత్సమాన అర్హత ఉండాలి. ఎంసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్డ్ తదితర ఎంట్రన్స్‌లతో కోర్సులో ప్రవేశించవచ్చు. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు. కోర్ సబ్జెక్టులు: కెమికల్ ప్రాసెస్ ప్రిన్సిపుల్స్, ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫ్లూయిడ్ అండ్ పార్టికల్ మెకానిక్స్, కెమికల్ ఇంజనీరింగ్, థర్మోడైనమిక్స్, ప్రాసెస్ డైనమిక్స్ అండ్ కంట్రోల్, బయో కెమికల్ ఇంజనీరింగ్. కెరీర్: ప్రస్తుతం కెమికల్ ఇంజనీర్ల అవసరం బాగా పెరుగుతోంది. పెట్రోలియం, పెట్రోకెమికల్స్ నుంచి ఆహార పరిశ్రమల వరకు, అలాగే మెటీరియల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ప్లాస్టిక్స్, పవర్ ప్రొడక్షన్, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్, వేస్ట్ మేనేజ్మెంట్, బయోటెక్నాలజీ రంగాల్లో కెమికల్ ఇంజనీర్లకు అవకాశాలుంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్ ప్రిపరేషన్, మినరల్ ప్రాసెసింగ్, ఎక్స్‌ప్లోజివ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫెర్టిలైజర్ పరి శ్రమలు, పెయింట్లు, డైలు, ల్యూబ్రికెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ, ఫొటోగ్రాఫిక్ ఎక్విప్మెంట్ తయారీ పరిశ్రమలు, క్లాథింగ్, పల్ప్, పేపర్ తయారీ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు అనేకం. వేతనాలు: విద్యార్హతలు, పని అనుభవం ఆధారంగా వేతనాల్లో వ్యత్యాసం ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ప్రారంభంలోనే ఇతర అలవెన్సులు మినహాయించి నెలకు 15 వేల నుంచి 25 వేల రూపాయల వేతనం అందుతోంది.టాప్ రిక్రూటర్స్: ఐఓసీఎల్, ఓఎన్జీసీ, హెచ్‌పీసీఎల్, బార్క్, డీఆర్డీఓ, ఇస్రో, సీఎస్ఐఆర్ ల్యాబ్స్, ఎన్‌పీసీఎల్, ఎన్ఎఫ్సీ, ఫ్యాక్ట్, బీపీసీఎల్, ఆర్ఐఎల్, హిందుస్థాన్ ఫోటో ఫిల్మ్స్, ర్యాలీస్, బీఏఎస్ఎఫ్, నాల్కో, బాల్కో, సెయిల్, ఈఐఎల్.. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అత్యంత ప్రతిష్టాత్మక రంగాల్లో ఒకటి. ఈ బ్రాంచ్ చదివిన విద్యార్థులకు కెరీర్ వృద్ధి బాగుంటుంది. ఈ కోర్సులో విమానాల నిర్మాణం, స్పేస్ వెహికల్స్ డిజైన్‌ను కంప్యూటర్ టెక్నాలజీ ఉపయోగించి ఎలా డిజైన్ చేయాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తారు. ఇది చాలా ప్రాధాన్యం ఉన్న కెరీర్. ఇందులో ఏరోడైనమిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్, ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ వంటి స్పెషలైజేషన్లను ఎక్కువ మంది ఎంపిక చేసుకుంటున్నారు. అర్హత: ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు కనీస అర్హత 10+2/ ఇంటర్. మన రాష్ట్రంలో ఎంసెట్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో ప్రవేశాలను కల్పిస్తారు. నిట్, ఐఐటీలకు జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్ తప్పనిసరి. రాష్ట్రంలో 1,200కు పైగా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయి. కోర్ సబ్జెక్టులు: ఫ్లూయిడ్ మెకానిక్స్, మెటీరియల్స్ సైన్స్, స్ట్రక్చరల్ అనాలిసిస్, ప్రొపల్షన్, ఆటోమేటిక్ కంట్రోల్ అండ్ గెడైన్స్, ఎయిర్‌క్రాఫ్ట్ పెర్ఫార్మెన్స్ అండ్ ఎయిర్‌క్రాఫ్ట్ స్ట్రక్చర్స్.కెరీర్: ఏరోనాటికల్ ఇంజనీర్స్కు విమానయాన సంస్థల్లో, విమానాల తయారీ విభాగాల్లో, ఎయిర్ టర్బైన్ ప్రొడక్షన్ ప్లాంట్స్, ఏవియేషన్ పరిశ్రమలో డిజైన్ అండ్ డెవలప్మెంట్లో మంచి డిమాండ్ ఉంది.టాప్ రిక్రూటర్స్: హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీస్, సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, డీఆర్డీవో, ఇస్రో, ఎయిరిండియా, జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్.ఉన్నత విద్య: ఎంటెక్/ఎంఎస్ చేయొచ్చు. స్పెషలైజేషన్లు: ఏరోడైనమిక్స్, డైనమిక్స్ అండ్ కంట్రోల్, ఏరోస్పేస్ ప్రొపల్షన్. మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన పురాతన బ్రాంచ్‌ల్లో మెకానికల్ ఇంజనీరింగ్ ఒకటి. ప్రాచీన కాలంలోని దాదాపు అన్ని ఆవిష్కరణలు, ఆధునిక యుగంలోని అధిక భాగం ఆవిష్కరణలు ప్రత్యక్షంగా మెకానికల్ ఇంజనీరింగ్ అప్లికేషన్స్‌తో సంబంధం ఉన్నవే. ఇంజిన్లు; యంత్రాలు; వేడి పుట్టించే, చల్లబరిచే వ్యవస్థలు; రోబోటిక్స్ తదితరాల రూపకల్పన (డిజైన్), తయారీ, ఏర్పాటు, నిర్వహణ వంటివి మెకానికల్ ఇంజనీరింగ్‌కు సంబంధించినవే. చిన్నపాటి సైకిళ్ల నుంచి, సూపర్ సానిక్ జెట్ యుద్ధ విమానాల వరకు అవసరమైన యంత్రాల రూపకల్పన, అభివృద్ధి మెకానికల్ ఇంజనీరింగ్‌తోనే ముడిపడి ఉంటుంది. ఓ అంచనా ప్రకారం 2020 నాటికి భారత్ ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆటోమొబైల్ పరిశ్రమగా గుర్తింపు సాధించనుంది. ఈ తరుణంలో మెకానికల్ ఇంజనీరింగ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని చెప్పొచ్చు. కోర్సులు: బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్‌లో చేరేందుకు 10+2 లేదా తత్సమాన అర్హత ఉండాలి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో ఎంసెట్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. ఎంసెట్‌కు 75 శాతం, ఇంటర్ గ్రూప్ సబ్జెక్టుల మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి తుది ర్యాంకును నిర్ణయిస్తారు. దీనిద్వారా సీటు కేటాయిస్తారు. రాష్ట్రంలో 30 వేలకు పైగా మెకానికల్ సీట్లున్నాయి. ఐఐటీలు, నిట్లు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే కళాశాలలు, మరికొన్ని ఇతర ప్రముఖ కళాశాలల్లో ప్రవేశించాలంటే జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ప్రతిభ కనబరచాలి. కోర్సు కాల వ్యవధి నాలుగేళ్లు.కోర్ సబ్జెక్టులు: స్టాటిక్స్ అండ్ డైనమిక్స్ కంట్రోల్, థర్మో డైనమిక్స్ అండ్ హీట్ ట్రాన్స్ఫర్, ఫ్లూయిడ్ మెకానిక్స్, మెషీన్ డిజైన్, స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, మెటీరియల్స్ సైన్స్, థియరీ ఆఫ్ డిజైన్ వంటివి. కెరీర్: కోర్సు పూర్తయ్యాక ఆటోమోటివ్, ఏరోస్పేస్, స్టీల్, పవర్ జనరేషన్, బయో మెకానికల్, మ్యానుఫ్యాక్చరింగ్ తదితర ప్రభుత్వ/ప్రైవేటు సంస్థల్లో అవకాశాలు పొందొచ్చు. యూపీఎస్సీ, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఇతర ఉద్యోగ నియామక సంస్థలు నిర్వహించే పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ప్రారంభంలో రూ.15 వేల నంచి రూ.25 వేల వరకు వేతనాలు అందుకోవచ్చు.టాప్ రిక్రూటర్స్: టాటా మోటార్స్, మహీంద్ర అండ్ మహీంద్ర, హోండా, అశోక్‌లే లాండ్, డీఆర్డీవో, ఇండియన్ ఆయిల్, గెయిల్, ఎన్టీపీసీ...ఉన్నత విద్య: బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత టర్బో మెకానిక్స్, మెకట్రానిక్స్, టూల్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ తదితర స్పెషలైజేషన్లతో ఎంటెక్ చేసి, ఉన్నత అవకాశాలు పొందొచ్చు. విస్తృత అవకాశాలకు వారధి మెకానికల్ ఇంజనీరింగ్‌లో విసృ్తత అవకాశాలుంటాయి. కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు (పీఎస్‌యూ).. ఎంట్రీ లెవల్ (ట్రైనీ ఇంజనీర్) పోస్టుల భర్తీలో గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. అందువల్ల బీటెక్ తర్వాత గేట్లో మంచి స్కోర్ సాధించడం ద్వారా ఆకర్షణీయమైన ఉద్యోగాలను అందుకోవచ్చు. బీటెక్ పూర్తయిన వారికి ఆటోమొబైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ జనరేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ తదితరాలతో సంబంధమున్న సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి. - వి.ఉమామహేశ్వర్, ప్లేస్మెంట్ ఆఫీసర్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్(ఓయూ) -
నింగిలోకి రెండో దిక్సూచి
స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధనలో భారత్ మరో ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ24 ప్రయోగం విజయవంతమైంది. భారత ప్రాంతీయ దిశానిర్దేశ ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషనల్ శాటిలైట్ సిస్టం -ఐఆర్ఎన్ఎస్ఎస్) శ్రేణిలో భాగంగా ఉపయోగించాల్సిన ఏడు ఉపగ్రహాలలో రెండోదైన ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీని ఇస్రోపీఎస్ఎల్వీ-సీ 24 ద్వారా దిగ్విజయంగా నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 4న సాయంత్రం 5.14 గంటలకు పీఎస్ఎల్వీ-సీ24 నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఇస్రో నిర్వహించిన పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇది 26వది. అంతేకాకుండా 25వ వరుస విజయవంతమైన ప్రయోగం. లిఫ్ట్‌ఆఫ్ జరిగిన 19.26 నిమిషాలకు ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీని 283 కి.మీ. పెరీజీ, 20,630 కి.మీ. అపోజీ పరిధి ఉన్న దీర్ఘవృత్తాకార కక్ష్యలోకి పీఎస్ఎల్వీ-సీ24 ప్రవేశించింది. ఈ ప్రయోగం కోసం ఇస్రో మొత్తం రూ.225 కోట్లను ఖర్చు పెట్టింది. ఇందులో వాహకనౌక తయారీకి రూ. 125 కోట్లు కాగా ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ రూపకల్పనకు రూ.125 కోట్లు వెచ్చించారు. ఇస్రో అభివృద్ధి చేస్తున్న పూర్తి స్వదేశీ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ (ఐఆర్ఎన్ఎస్ఎస్) లోని ఏడు ఉపగ్రహాల్లో రెండోది ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ. 2013, జూలై 1న పీఎస్ఎల్వీ-సీ22 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ రూపకల్పనలో 140 మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. భారత శాటిలైట్ నావిగేషన్ వ్యవస్థ ఐఆర్ఎన్ఎస్ఎస్లో మొత్తం ఏడు ఉపగ్రహాలు ఉంటాయి. భారత భూభాగంతోపాటు అదనంగా సరిహద్దు బయట 1,500 కి.మీ. పరిధి వరకు ఈ ఏడు ఉపగ్రహాల సముదాయం నుంచి సంకేతాలు (సిగ్నళ్లు) లభిస్తాయి. ఫలితంగా ఈ విస్తీర్ణంలో సేవలు అందుతాయి. ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ తో ఇప్పటికి రెండు ఉపగ్రహాలను ఈ వ్యవస్థలో ఇస్రో ప్రయోగించింది. 2015-16 నాటికి మిగతా 5 ఉపగ్రహాలను కూడా ఇస్రో ప్రయోగించనుంది. ఏడుకు అదనంగా భవిష్యత్‌లో మరో నాలుగు ఉపగ్రహాలను కూడా ఈ వ్యవస్థలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ - ప్రయోజనాలు: నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఉపగ్రహాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రవాణా రంగంలో వ్యక్తులు తాము చేరాల్సిన చోటును తెలుసుకోవడం, లక్ష్యం ఎంతదూరంలో ఉందో నిర్ధారించుకోవడంలోనూ ఈ వ్యవస్థ ఉపయోగపడుతుంది. మెరుగైన ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి వీలవుతుంది. సుదూర ప్రాంతాల్లో ఉన్న పర్యావరణ పరిశోధన కేంద్రాలను అనుసంధానించేందుకు ఇది అక్కరకు వస్తుంది. పర్వతారోహకులకు, ఓడల గమనానికి కూడా ఉపయోగపడుతుంది. మొదటిసారిగా 1970లో అమెరికా సైనికులకు కావాల్సిన దిశానిర్దేశం కోసం ప్రారంభించిన గ్లోబల్ పొజిషనింగ్ వ్యవస్థ నేడు సైనిక అవసరాలతోపాటు, అనేక సైనికేతర అవసరాలకు ప్రయోజనకారిగా నిలుస్తుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్ ద్వారా బ్యాంకింగ్, వాణిజ్యం, కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగవుతాయి. ఇతర దేశాల ఉపగ్రహాలపై ఆధారపడటం కంటే దేశీయ నావిగేషన్ వ్యవస్థ ద్వారా పూర్తి భద్రతతో కూడిన సైనిక రక్షణ కార్యకలాపాలను నిర్వహించడానికి ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుంది. గగన్ (ఎఅఎఊ): ఉపగ్రహ ఆధారిత విమాన నావిగేషన్ కోసం ఇస్రో, ఎయిర్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సౌజన్యంతో గగన్ (ఎ్క ఎయిడెడ్ జియో ఆగ్మెంటెడ్ నావిగేషన్) అనే వ్యవస్థను ఐఆర్ఎన్ఎస్ఎస్ వెలుపల అభివృద్ధి చేసింది. అంతర్జాతీయ పౌరవిమానయాన రంగం (ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్) ఒత్తిడితో భారత్ గగన్‌ను అభివృద్ధి చేసింది. గగన్‌కు సంబంధించిన రెండు పేలోడ్లను ఇప్పటికే ఇస్రో జీశాట్-8, జీశాట్-10 ఉపగ్రహాలతో ప్రయోగించింది. విమానయానంలో జీపీఎస్ సేవలను గగన్ మరింత అభివృద్ధి చేస్తుంది. దీనివల్ల విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లో స్పష్టతపెరుగుతుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ: ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థలో ఇది రెండోది. దీని బరువు 1,432 కిలోలు జూలై 1, 2013న పీఎస్ఎల్వీ-సీ22 ద్వారా ఇస్రో ప్రయోగించిన ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ నిర్మాణం ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీను పోలి ఉంటుంది. ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏను ప్రయోగించిన ఏడు నెలల్లోనే ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీను అభివృద్ధి చేయడం విశేషం. ఐఆర్ఎన్ఎస్ఎస్-1 బీలో రెండు రకాల పేలోడ్లు ఉంటాయి. ఒకటి నావిగేషన్ పేలోడ్, రెండోది రేంజింగ్ పేలోడ్. వినియోగదారులకు జీపీఎస్ సిగ్నళ్లను నావిగేషన్ పేలోడ్ అందిస్తుంది. ఎల్5 బ్యాండ్ (1176.45 మెగాహెర్ట్జ), ఎస్-బ్యాండ్ (2492.028 మెగాహెర్ట్జ) పరిధిలో నావిగేషన్ పేలోడ్ పని చేస్తుంది. పూర్తిస్థాయి నిర్దిష్టతతో పనిచేసే రుబిడియం అణు గడియారం ఇందులో ఉంటుంది. రేంజింగ్ పేలోడ్‌లో ఒక సీ-బ్యాండ్ ట్రాన్‌సపాండర్ ఉంటుంది. లేజర్ రేంజింగ్‌కు ఉద్దేశించిన కార్నర్ క్యూబ్ రెట్రో రిఫ్లెక్టర్లూ ఐఆర్ఎన్ఎస్.ఎస్-1బీలో ఉన్నాయి. పీఎస్ఎల్వీ-సీ24: పీఎస్ఎల్వీ-సీ24 నౌక ఇస్రో ప్రయోగించిన 26వ పీఎస్ఎల్వీ.సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని మొదటి లాంచ్‌ప్యాడ్ నుంచి దీన్ని పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రూపంలో ప్రయోగించారు. ఈ రూపంలో స్ట్రాప్-ఆన్ మోటార్ల పరిమాణం పెంచుతారు. లిఫ్ట్‌ఆఫ్ సమయంలో పీఎస్ఎల్వీ-సీ24 బరువు 320 టన్నులు, పొడవు 44.5 మీటర్లు. పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రూపంలో పీఎస్ఎల్వీని ప్రయోగించడం ఇది ఆరోసారి. వడివడిగా అడుగులు: ప్రపంచవ్యాప్తంగా భారత అంతరిక్ష కార్యక్రమం ఘనత చాటడంలో పీఎస్ఎల్వీ కీలకమైంది. పీఎస్ఎల్వి కార్యక్రమం 1982లో ప్రారంభమైంది. అప్పటికే ఇస్రో ఎస్ఎల్వీ-3, ఎఎస్ఎల్వీ అనే రెండు పరిశోధన నౌకలను విజయవంతంగా అభివృద్ధి చేసింది. పీఎస్ఎల్వీ నమూనా పొడవు 44.4 మీటర్లు, బరువు 294 టన్నులు. ఇది నాలుగు అంచెల నౌక. మొదటి, మూడో దశలో ఘన ఇంధనాన్ని 2, 4వ దశల్లో ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తారు. దీని మొదటి దశ చుట్టూ ఆరు స్ట్రాప్ ఆన్ మోటార్లు ఉంటాయి. ధ్రువ కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రయోగించడానికి దీన్ని రూపొందించారు. భూస్థిర కక్ష్యలోకి ఉపగ్రహాలను, చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-1 అదే విధంగా మంగళయాన్‌ను కూడా పీఎస్ఎల్వీ ప్రయోగించింది. ఇప్పటివరకు చేపట్టిన 26 పీఎస్ఎల్వీ ప్రయోగాల్లో మొదటి మూడు అభివృద్ధి ప్రయోగాలు. మిగతా 23 కార్యాచరణ ప్రయోగాలు. 1993 సెప్టెంబర్ 20న చేపట్టిన మొదటి పీఎస్ఎల్వీ అభివృద్ధి ప్రయోగం మాత్రమే విఫలమైంది. ఆ తర్వాత నిర్వహించిన 25 ప్రయోగాలు (పీఎస్ఎల్వీ-సీ 24తో కలిపి) వరుసగా విజయవంతమయ్యాయి. ప్రపంచంలోని విజయవంతమైన కొన్ని రాకెట్లలో పీఎస్ఎల్వీ ఒకటి. అనేక దేశాలు తమ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. త్వరలో ఫ్రాన్సకు చెందిన స్పాట్-7, ఇతర 4 విదేశీ ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ ద్వారా ఇస్రో ప్రయోగించనుంది. పీఎస్ఎల్వీ అనుసంధానంతో విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించడంలో ఇస్రో సఫలమైంది. ఇలాంటి అంతరిక్ష సేవలను ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించడానికి 1992లో ఇస్రో వాణిజ్య విభాగం అంత్రిక్స్ కార్పొరేషన్ కూడా ఏర్పాటైంది. ఇతర దేశాల నావిగేషన్ వ్యవస్థలు: ప్రపంచంలో అధిక ప్రాముఖ్యతను సంతరించుకున్న నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ అమెరికాకు చెందిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్. ఇది రెండు దశాబ్దాల క్రితమే అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థలో 24 ఉపగ్రహాలు ఆరు అక్షాల్లో పరిభ్రమిస్తూ మొత్తం భూమిని కవర్ చేస్తూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఇదే తరహాలో అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ జీఎల్ఓఎన్ఏఎస్ఎస్-గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)లో కూడా 24 ఉపగ్రహాలు ఉంటాయి. యూరప్‌లోనూ గెలీలియో పేరుతో 27 ఉపగ్రహాల సముదాయం ఏర్పాటవుతోంది. చైనాలో అభివృద్ధి చెందుతున్న వ్యవస్థ బీడోయ్ నావిగేషనల్ వ్యవస్థ, జపాన్‌కు చెందినది, క్వాసీ జెనిథ్ శాటిలైట్ సిస్టం. ఇదివరకటి పి.ఎస్.ఎల్.వి-ఎక్స్ఎల్ ప్రయోగాలు పీఎస్ఎల్వీ-సీ11/ చంద్రయాన్-1 పీఎస్ఎల్వీ-సీ17 జీశాట్-12 పీఎస్ఎల్వీ-సీ19 రీశాట్-1 పీఎస్ఎల్వీ-సీ22/ ఐ.ఆర్.ఎన్.ఎస్.ఎస్-1ఏ పీఎస్ఎల్వీ-సీ23/ మంగళయాన్ పీఎస్ఎల్వీ ప్రయోగాలు పీఎస్ఎల్వీ {పయోగ తేదీ {పయోగించిన ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-డీ1 సెప్టెంబర్ 20, 1993 ఐఆర్ఎస్-1 ఈ ప్రయోగం విఫలం పీఎస్ఎల్వీ-డీ2 అక్టోబర్ 15, 1994 ఐఆర్ఎస్-పీ2 పీఎస్ఎల్వీ-డీ3 మార్చి 21, 1996 ఐఆర్ఎస్-పీ3 పీఎస్ఎల్వీ-సీ1 సెప్టెంబర్ 29, 1997 ఐఆర్ఎస్-1డీ పీఎస్ఎల్వీ-సీ2 మే 26, 1999 ఐఆర్ఎస్-పీ4 (ఓషన్ శాట్-1)+కిట్‌శాట్-3 (కొరియా) డీఎల్ఆర్-ట్యూబ్‌శాట్ (జర్మనీ) పీఎస్ఎల్వీ-సీ3 అక్టోబర్ 22, 2001 టెక్నాలజీ ఎక్స్పెరిమెంట్ శాటిలైట్, బర్డ(జర్మనీ),ప్రోబా(బెల్జియం) పీఎస్ఎల్వీ-సీ4 సెప్టెంబర్ 12, 2002 కల్పన-1 పీఎస్ఎల్వీ-సీ5 అక్టోబర్ 17, 2003 ఐఆర్ఎస్-పీ6 (రిసోర్‌సశాట్-1) పీఎస్ఎల్వీ-సీ6 మే 5, 2005 కార్టోశాట్-1, హోమ్శాట్ పీఎస్ఎల్వీ-సీ7 జనవరి 10, 2007 కార్టోశాట్-2, ఎస్ఆర్ఈ-1, లాపాన్ ట్యూబ్‌శాట్ (ఇండోనేసియా) పేహున్‌శాట్ (అర్జెంటీనా) పీఎస్ఎల్వీ-సీ8 ఏప్రిల్ 23, 2007 ఎజైల్ (ఇటలీ), అడ్వాన్సడ్ ఏవియోనిక్స్ మాడ్యూల్ (ఏఏఎం) పీఎస్ఎల్వీ-సీ10 జనవరి 21, 2008 టెక్సర్ (ఇజ్రాయెల్) పీఎస్ఎల్వీ-సీ9 ఏప్రిల్ 28, 2008 కార్టోశాట్-2ఎ, ఇండియన్ మినీ శాటిలైట్-1 (ఐఎంఎస్-1)+ ఎనిమిది ఇతర దేశాల ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ- సీ11 అక్టోబర్ 22, 2008 చంద్రయాన్-1 పీఎస్ఎల్వీ-సీ12 ఏప్రిల్ 20, 2009 రీశాట్-2+అనుశాట్ పీఎస్ఎల్వీ-సీ14 సెప్టెంబర్ 23, 2009 ఓషన్ శాట్-2+ ఆరు విదేశీ ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-సీ15 జూలై 12, 2010 కార్టోశాట్-2బి+స్టడ్‌శాట్+అల్‌శాట్ (అల్జీరియా)+ రెండు విదేశీ నానోశాట్+ఒక పికోశాట్ పీఎస్ఎల్వీ-సీ16 ఏపిల్ ్ర20, 2011 రిసోర్స్ శాట్-2+యూత్ శాట్+ఎక్స్‌శాట్ (సింగపూర్) పీఎస్ఎల్వీ-సీ17 జూలై 15, 2011 జీశాట్12 పీఎస్ఎల్వీ-సీ18 అక్టోబర్ 12, 2011 మేఘట్రాపిక్స్+ఎస్‌ఆర్‌ఎంశాట్+జుగ్ను+వెస్సెల్‌శాట్ (లక్సెంబర్గ్) పీఎస్ఎల్వీ-సీ19 ఏప్రిల్ 26, 2012 రీశాట్-1 పీఎస్ఎల్వీ-సీ20 ఫిబ్రవరి 25, 2013 సరళ్+ఆరు ఇతర విదేశీ ఉపగ్రహాలు పీఎస్ఎల్వీ-సీ21 సెప్టెంబర్ 9, 2012 స్పాట్-6 (ఫ్రాన్స్)+ప్రొయిటెరిస్ (జపాన్) పీఎస్ఎల్వీ-సీ22 జూలై 1, 2013 ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఏ పీఎస్ఎల్వీ-సీ23 నవంబర్ 5, 2013 మంగళయాన్ -
అంగారక యానంలో తొలి గెలుపు
-
అంగారక యానంలో తొలి గెలుపు
‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగంలో తొలి దశ విజయవంతం అరుణగ్రహం దిశగా భారత్ ప్రయాణం మొదలు శ్రీహరికోట నుంచి విజయవంతంగా రోదసిలోకి మార్స్ ఆర్బిటర్ మిషన్ పీఎస్ఎల్వీ-సీ25లో ‘మామ్’ ప్రయోగం వరుసగా 24వ సారీ పీఎస్ఎల్వీ సక్సెస్ రాకెట్ 4 దశలను 49.56 నిమిషాల్లో పూర్తి చేసుకొని కక్ష్యలోకి ‘మామ్’ ఇరవై ఐదు రోజులపాటు భూమి చుట్టూనే పరిభ్రమించనున్న ఆర్బిటర్ తర్వాత 300 రోజుల పాటు ప్రయాణించి అరుణగ్రహ కక్ష్యలోకి ఇస్రోకిది 109వ ప్రయోగం.. గ్రహాంతర పరిశోధనల్లో ఇదే మొట్టమొదటిది మహావిశ్వంలో మన దేశం మరో అడుగు ముందుకేసింది. అంతరిక్ష ప్రయోగంలో చరిత్రాత్మక అధ్యాయానికి నాంది పలికింది. గ్రహాంతర పరిశోధనలకు వినువీధిలో మహాయానం మొదలుపెట్టింది. అంగారక గ్రహంపై పరిశోధనల కోసం మార్స్ ఆర్బిటర్ మిషన్(ఎంవోఎం-మామ్)ను ఇస్రో దిగ్విజయంగా నింగిలోకి పంపింది. మంగళవారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి రాకెట్ లాంచర్ సాయంతో ‘మంగళ్యాన్’ మొదలైంది. ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి మంగళగ్రహాన్ని చేరుకుంటుంది. చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ అరుణగ్రహంపై జీవాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది. అంతా సవ్యంగా సాగితే అరుణగ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. ఇప్పటివరకూ ఈ ఘనతను సాధించిన అమెరికా, రష్యా, ఐరోపాల సరసన నిలుస్తుంది. సాక్షి, నెల్లూరు/సూళ్లూరుపేట: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం.. మంగళవారం మధ్యాహ్నం 2:38:26 గంటల సమయం.. మిషన్ కంట్రోల్ రూంలోని శాస్త్రవేత్తల్లో నరాలు తెగే ఉత్కంఠ.. షార్‌లోని అన్ని భవనాలపై నిల్చుని ఆత్రుతగా చూస్తున్న జనం.. నిశ్శబ్ద వాతావరణంలో మైక్‌లో కౌంట్ డౌన్.. త్రీ, టూ, వన్, జీరో.. ఒక్కసారిగా భీకరంగా గర్జిస్తూ.. దట్టమైన పొగలు కక్కుతూ, నిప్పులు చిమ్ముకుంటూ ఓ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. లోపల శాస్త్రవేత్తలు కంప్యూటర్ల ముందు అదే ఉత్కంఠతో పర్యవేక్షిస్తున్నారు.. బయట జనం నింగిలోకి దూసుకెళుతున్న రాకెట్కేసి తదేకంగా చూస్తున్నారు. రాకెట్ ఒక్కో దశ దాటుకుంటూ పోతోంది.. మూడు దశల వరకూ శాస్త్రవేత్తల్లో ఉత్కంఠ తగ్గుతూ వస్తోంది.. కానీ నాలుగో దశలో కొన్ని నిమిషాల పాటు మళ్లీ ఉత్కంఠ.. చివరికి అంతా సవ్యంగానే ఉందన్న సమాచారం. సరిగ్గా 49.56 నిమిషాల తర్వాత.. మధ్యాహ్నం 3.22 గంటలకు రాకెట్‌లోని ఉపగ్రహం అంతరిక్ష కక్ష్యలోకి నిర్విఘ్నంగా ప్రవేశించింది. అంతే.. ఒక్కసారిగా శాస్త్రవేత్తల కేరింతలు.. ఒకరినొకరు కౌగిలించుకుని పరస్పర అభినందనలు.. వారి వదనాల్లో ఎప్పటికన్నా ఎంతో విజయగర్వం.. వారికి దేశ నేతల నుంచే కాదు.. ప్రపంచ ప్రముఖుల నుంచీ అభినందనల వెల్లువ! భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇప్పటివరకూ శతాధిక ప్రయోగాలు చేపట్టింది. నిన్నగాక మొన్న ‘చంద్రయాన’ం కూడా చేసింది. అయినా మంగళవారం నాటి ప్రయోగం అంతకన్నా విశిష్టమైనది.. ఇది ‘మంగళయానం’. గ్రహాంతర ప్రయోగం. ఇరవై కోట్లకు పైగా కిలోమీటర్ల దూరంలోని అరుణగ్రహంపై పరిశోధనలకు భారత్ ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంఓఎం - మామ్)నే ఈ రాకెట్ నింగిలోకి పంపింది. దేశ అంతరిక్ష పరిశోధనలో సరికొత్త చరిత్రకు తొలి అంకం దిగ్విజయంగా లిఖించింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మంగళ్యాన్’ ప్రయోగానికి ఆదివారం ఉదయం 6.08 గంటలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 56.30 గంటలు నిర్విఘ్నంగా కొనసాగింది. ఉపగ్రహాల ప్రయోగానికి భారత్ తిరుగులేని ఆయుధమైన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - సీ25 (పీఎస్ఎల్వీ-సీ25)లో మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను ఉంచి.. మంగళవారం మధ్యాహ్నం 2.38.26 గంటలకు ఆకాశంలోకి ప్రయోగించింది. 44.5 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ ఉపగ్రహ వాహకనౌక 1,337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్‌ను మోసుకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. ఆర్బిటర్‌ను భూమికి దూరంగా భూ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి వుండటంతో.. రాకెట్లో అత్యంత శక్తివంతమైన ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లను వినియోగించారు. ఆరు స్ట్రాపాన్ బూస్టర్లలో 75 టన్నుల ఘన ఇంధనం, దీని తరువాత 139 టన్నుల ఘన ఇంధనంతో 112.75 సెకన్లలో 57.678 కిలోమీటర్ల ఎత్తులో మొదటి దశ, ఆ తర్వాత 42 టన్నుల ద్రవ ఇంధనంతో 264.74 సెకన్లలో 132.311 కిలోమీటర్ల ఎత్తులో రెండో దశ, 7.5 టన్నుల ఘన ఇంధనంతో 583.60 సెకెన్లలో 194.869 కిలోమీటర్ల ఎత్తులో మూడో దశ, 2.5 ద్రవ ఇంధనంతో 2,619.72 సెకన్లకు 342.515 కిలోమీటర్ల ఎత్తులో నాలుగో దశను దిగ్విజయంగా పూర్తి చేసింది. తొలి మూడు దశలను విజయవంతంగా పూర్తి చేయటంతో నాలుగో దశ మాత్రం 1,600 సెకెండ్ల పాటు అందరిలోనూ ఉత్కంఠ. ఎందుకంటే ఈ దశలో దక్షిణ ఫసిఫిక్ మహాసముద్రంలో నలంద, యమున నౌకల మీద ఏర్పాటు చేసిన రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు రాకెట్ గమనాన్ని పర్యవేక్షించాయి. అయితే ఈ 1,600 సెకెండ్ల పాటు నౌకల్లో ఏర్పాటు చేసిన రాడార్ ట్రాకింగ్ సిస్టం అద్భుతంగా పనిచేయడంతో ఎక్కడా ఎలాంటి తడబాటు జరగకుండా ప్రయోగం దిగ్విజయంగా జరిగింది. మొత్తం 49.56 నిమిషాల్లో మార్స్ ఆర్బిటర్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అక్కడి నుంచి ఉపగ్రహంలో వుండే ఇంధనం సాయంతో నాలుగు సార్లు భూ కక్ష్యలో ఉపగ్రహం పరిభ్రమించిన అనంతరం అంగారకుడివైపుకు మళ్లించే ప్రక్రియను చేపడతారు. ఆ తరువాత 310 రోజుల ప్రయాణం అనంతరం.. అంటే 2014 సెప్టెంబర్ 24 నాటికి అంగారకుడి కక్ష్యలో తిరుగుతూ ఆ గ్రహంపై పరిశోధనలను ప్రారంభిస్తుంది. ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగా అనుకున్నది అనుకున్నట్టుగా ప్రయోగం జరగడం, మొట్టమొదటి గ్రహాంతర ప్రయోగం విజయవంతం కావడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ విజయం జాతికి అంకితం: రాధాకృష్ణన్ ఇది సమిష్టి విజయమని.. ఈ విజయం జాతికి అంకితమని ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మార్స్ ఆర్బిటర్ ప్రయోగం అనంతరం ఆయన షార్‌లో మాట్లాడుతూ.. ఇది గ్రహాంతర ప్రయోగం కావడంతో ముందునుంచి అచితూచి అడుగులు వేశామన్నారు. అయితే ప్రయోగం విషయంలో 5 నిమిషాలు పెంచి చేశామన్నారు. భూ కక్ష్యనుంచి అంగారకగ్రహం కక్ష్యలోకి చేరుకోవడానికి ఈ 5 నిమిషాల వ్యవధిని పెంచామని చెప్పారు. ఈ ప్రయోగాన్ని అక్టోబర్ 28న చేయాలని నిర్ణయించామని రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందులతో వారం రోజులు వాయిదా వేసుకున్నామని చెప్పారు. ఈ ప్రయోగంలో 9 రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలు ఊహించినదానికంటే ఎక్కువగా పనిచేశాయన్నారు. పీఎస్ఎల్వీ మరోమారు తనసత్తా చాటుకుని ఈ ప్రయోగంతో రజతోత్సవ పీఎస్ఎల్వీగా గుర్తింపు పొందిందని చెప్పారు. అంగారకప్రయోగం ఇస్రో చరిత్రలో చరిత్రాత్మకమైన ప్రయోగమన్నారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రయోగాలకు శ్రీకారం చుడతామని వెల్లడించారు. ప్రధానమంత్రి కార్యాలయ వ్యవహారాల మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. అంగారక ప్రయోగం విజయవంతం కావటం దేశానికే గర్వకారణమన్నారు. మిషన్‌కంట్రోల్ రూంలో శాస్త్రవేత్తలు ఎస్.రామకృష్ణన్, ఎం.వై.ఎస్.ప్రసాద్, ఎం.చంద్రదత్తన్, కున్నికృష్ణన్, ఎస్.కె.శివకుమార్, ఎ.ఎస్.కిరణ్‌కుమార్, అరుణన్, ప్రొఫెసర్ యు.ఆర్.రావు, ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ కె.కస్తూరిరంగన్, సీనియర్ ప్రొఫెసర్ యశ్పాల్ తదితర శాస్త్రవేత్తలు ప్రయోగ విశేషాలను వివరించారు. -
పీఎస్ఎల్వీ సీ-22 రాకెట్ ప్రయోగం విజయవంతం