India ISRO To Launch Seven Singaporean Satellites Abroad Its PSLV-C56 On July 30th, 2023 Sakshi
Sakshi News home page

ISRO PSLV-C56 Mission: మరో ‘వాణిజ్య సవాలు’కు... ఇస్రో సన్నద్ధం

Published Tue, Jul 25 2023 4:03 AM | Last Updated on Tue, Jul 25 2023 8:05 AM

India to launch seven satellites from Singapore on 30 July 2023 - Sakshi

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య ప్రయోగాల పరంపరలో మరో ముందడుగు. సింగపూర్‌కు చెందిన సమాచార ఉపగ్రహం సింథటిక్‌ అపర్చర్‌ రాడార్‌ (డీఎస్‌–ఎస్‌ఏఆర్‌)తో పాటు మరో 6 బుల్లి ఉపగ్రహాలను సంస్థ పీఎస్‌ఎల్‌వీ–సి56 ద్వారా అంతరిక్షంలోకి పంపనుంది.

జూలై 30న ఉదయం శ్రీహరికోటలో మొదటి లాంచింగ్‌ ప్యాడ్‌ నుంచి జరిగే ఈ ప్రయోగం కోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఎస్‌ఏఆర్‌ను సింగపూర్‌ ప్రభుత్వ డిఫెన్స్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సింగపూర్‌ టెక్నాలజీస్‌ సంయుక్తంగా ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌   అభివృద్ధి చేశాయి. ఇది పూర్తి వాణిజ్య ప్రయోగమని ఇస్రో చైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ సోమవారం
పేర్కొన్నారు.

► తొలుత జూలై 26న తలపెట్టిన ఈ ప్రయోగం 30కి వాయిదా పడింది.
► 360 కిలోల ఎస్‌ఏఆర్‌తో పాటు మొత్తం ఏడు ఉపగ్రహాలను భూమి నుంచి 535 కిలోమీటర్ల ఎత్తులో నియర్‌ ఈక్విటోరియల్‌ ఆర్బిట్‌ (ఎన్‌ఈఓ–నియో) కక్ష్యలోకి పీఎస్‌ఎల్‌వీ–సి56 ప్రవేశపెట్టనుంది.
► మిగతా ఆరు ఉపగ్రహాలు వెలోక్స్‌–ఏఎం (23 కిలోలు), ఆర్కేడ్, స్కూబ్‌–2, న్యూలియోన్, గలాసియా–2, ఆర్బి–12 స్ట్రైడర్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement