అంతరిక్షంలో అద్భుతం ఆవిష‍్కృతమైంది. సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్) వేదికగా ఇస్రో తన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఏకంగా 104 ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా బుధవారం ఉదయం విజయవంతంగా ప్రయోగించింది. మొదటి ప్రయోగవేదిక మీద నుంచి పీఎఎస్‌ఎల్‌వీ రాకెట్ 104 ఉపగ్రహాలను నిప్పులు చిమ‍్ముతూ నింగివైపునకు మోసుకెళ్ళింది. అన్ని దశల‍్లోనూ రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్ళింది. నాల‍్గవ దశలో ఉపగ్రహాలను నిర్ణీత కక్ష‍్యలోకి ప్రవేశపెడుతూ రాకెట్ పయనించింది. ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసుకున్న పీఎస్‌ఎల్‌వీ సీ37 రాకెట్ ద్వారా 2007లో 10 ఉపగ్రహాలు, 2016 జూన్ 22 పీఎస్‌ఎల్‌వీ సీ 34 రాకెట్ ద్వారా 20 ఉపగ్రహాలను పంపించి స్వీయ చరిత్ర తిరగరాసుకుంది.