Chandrayaan 3: PM Narendra Modi Tweet Ahead Of Its Launch - Sakshi
Sakshi News home page

చంద్రయాన్‌-3 ప్రయోగం ప్రత్యేకంగా నిలవనుంది: ప్రధాని మోదీ ట్వీట్‌

Published Fri, Jul 14 2023 12:10 PM | Last Updated on Fri, Jul 14 2023 2:04 PM

Chandrayaan 3: Pm Narendra Modi Tweet Ahead On Chandrayaan 3 Launch - Sakshi

న్యూఢిల్లీ: చందమామను ఇక్కడి నుంచి చూస్తూ మనకు తెలిసిన ఎన్నో కథలను చెప్పుకున్నాం. అయితే టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ఆ వెన్నెల రాజ్యాన్ని శోధించాలని తపన మానవవాళిలో మొదలైంది. ఈ క్రమంలో కొన్ని అగ్రరాజ్యాలు చకచకా వెళ్లి జెండాలు పాతి వచ్చినా.. చంద్రుని పూర్తి గుట్టు మాత్రం విప్పలేకపోయాయి. వాటితో పోలిస్తే జాబిల్లిపై పరిశోధనలను భారత్‌ కాస్త ఆలస్యంగా ప్రారంభించినా అద్భతాలను చేయాలని ప్రయత్నిస్తోంది. జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో మరోసారి సన్నద్ధమవుతోంది.

ఈ క్రమంలోనే చంద్రయాన్‌–3 మిషన్‌ను నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి మోసుకెళ్లేందుకు ఇస్రో గెలుపు గుర్రం, బాహుబలి రాకెట్‌ ఎల్‌వీఎం–3 సిద్ధమవుతోంది. దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న  ప్రతిష్టాత్మక చంద్రయాన్‌–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు సర్వం సిద్దమైంది. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగవేదిక నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు ఇస్రో బాహుబలి రాకెట్‌గా పేరొందిన ఎల్‌వీఎం3–ఎం4  ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఈ ప్రయోగం జరగనుంది.

ఇందుకు అన్ని ఏర్పాట్లనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పటికే పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ మిషన్‌ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌ చేశారు. అందులో.. భారతదేశ అంతరిక్ష రంగానికి సంబంధించినంత వరకు 14 జూలై 2023న బంగారు అక్షరాలతో లిఖించనుంది. చంద్రయాన్-3, మన మూడవ చంద్ర మిషన్, మరికాసేపట్లో దాని ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ అద్భుతమైన మిషన్ మన దేశపు ఆశలు, కలలను ముందుకు తీసుకువెళుతుందని ట్వీట్‌ చేశారు.


చదవండి: Himachal Pradesh Floods: ఉత్తరాది అతలాకుతలం.. వరదలపై ముందస్తుగా హెచ్చరికలేవీ? షాకింగ్‌ విషయాలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement