Rocket
-
స్పేస్ఎక్స్ స్టార్‌షిప్ రాకెట్... ప్రయోగం విఫలం
టెక్సాస్: అంతరిక్ష ప్రయోగాల్లో దూసుకెళ్తున్న ఎలాన్ మస్క్ సంస్థ ‘స్పేస్ఎక్స్’కు చేదు అనుభవం ఎదురైంది. స్పేస్ఎక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారీ పునరి్వనియోగ రాకెట్ ‘స్టార్‌షిప్’ ప్రయోగం విఫలమైంది. 123 మీటర్ల (400 అడుగులు) పొడవైన ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన కొద్దిసేపటికే పేలిపోయింది. శకలాలు కరీబియన్ సముద్రంలో పడిపోయాయి. రాకెట్ బూస్టర్ మాత్రం క్షేమంగా భూమిపైకి తిరిగివచ్చింది. టెక్సాస్‌లోని లాంచ్‌ప్యాడ్ హస్తాలు బూస్టర్‌ను చక్కగా ఒడిసిపట్టుకున్నాయి. టెక్సాస్‌లో మెక్సికో సరిహద్దులోని బొకా చికా బీచ్ నుంచి స్థానిక కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 4.37 నిమిషాలకు స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించారు. ఇది 10 డమ్మీ శాటిలైట్లను నింగిలోకి మోసుకెళ్లింది. 8 నిమిషాల తర్వాత రాకెట్‌తో సంబంధాలు తెగిపోయాయి. స్పేస్‌క్రాఫ్ట్‌లోని ఆరు ఇంజన్లు ఒకదాని తర్వాత ఒకటి పనిచేయడం ఆగిపోయింది. రాకెట్ భూమిపైకి తిరిగివస్తూ గాల్లోనే పేలిపోయింది. శకలాలు నిప్పుల వర్షాన్ని తలపించాయి. కేవలం ప్రయోగాత్మకంగానే స్టార్‌షిప్‌ను ప్రయోగించినట్లు స్పేస్ఎక్స్ అధికార ప్రతినిధి డాన్ హౌట్ చెప్పారు. బూస్టర్ క్షేమంగా తిరిగిరావడం సంతోషకరమే అయినప్పటికీ రాకెట్ పేలిపోవడం బాధాకరమని అన్నారు. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్‌షిప్ విశ్వసనీయతను మరింత పెంచిందని తెలిపారు. ఇలాంటి వైఫల్యాలు పునరావృతం కాకుండా జాగ్రత్తవహిస్తామని పేర్కొన్నారు. డమ్మీ శాటిలైట్లను అంతరిక్షంలో ఎలా వదిలిపెట్టాలన్న దానిపై సాధనకోసం స్టార్‌షిప్‌ను ప్రయోగించామని వివరించారు. మరోవైపు రాకెట్ శకలాలు సముద్రంలో పడిపోతున్న దృశ్యాలను స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.SpaceX Starship breaking up and re-entering over Turks and Caicos this afternoon. pic.twitter.com/LbpJWewoYB— Molly Ploofkins™ (@Mollyploofkins) January 16, 2025 విజయం సంగతి ఏమోగానీ వినోదం మాత్రం లభించిందని చమత్కరించారు. ఇంధనం లీకేజీ వల్లే రాకెట్ ప్రయోగం విఫలమైనట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్దది, శక్తివంతమైనది అయిన స్టార్‌షిప్ రాకెట్‌కు సంబంధించి ఇది ఏడో ప్రయోగం కావడం విశేషం. ఈ రాకెట్ సాయంతోనే అంగారక గ్రహంపై అడుగు పెట్టాలని ఎలాన్ మస్క్ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ రెండు స్టార్‌షిప్ రాకెట్ల కోసం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది.🚨#BREAKING: Debris was seen over the Caribbean after SpaceX's Starship broke apart during a test flight, creating a spectacular show in the sky.📌#Caicos | #IslandsWatch as multiple footage shows debris lights up the skies as SpaceX successfully launched Starship Flight 7… pic.twitter.com/ZWIUr22USV— R A W S A L E R T S (@rawsalerts) January 16, 2025 -
సముద్రంలో నౌక నుంచి చైనా ఉపగ్రహ ప్రయోగం
బీజింగ్: చైనా తన అంతరిక్ష సామర్థ్యాన్ని మరోసారి చాటుకుంది. సముద్రంలోని వేదికపై నుంచి చేపట్టిన ప్రయోగంలో ఏకంగా ఎనిమిది ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. షాండోంగ్ ప్రావిన్స్‌లోని హయియాంగ్ సముద్రంలో చేపట్టిన ఈ ప్రయోగంలో జియెలాంగ్–3 రాకెట్‌ను ప్రయోగించింది. ఈ ఘన ఇంధన రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లడం ఇది రెండోసారి. సముద్రంలోని వేదికల పైనుంచి వాణిజ్య ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు చైనా ప్రత్యేకంగా ఈ రాకెట్‌ను అభివృద్ధి చేసుకుంది. ఓ షిప్‌నే ఇలా రూపుమార్చి మొబైల్ లాంచ్ పాడ్గా తయారు చేసింది. అంతర్జాతీయ జలాల్లో అనువైన స్థానాల నుంచి ప్రయోగాలు చేపట్టేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుంది. డ్రోన్ యుద్ధ తంత్రం కోసం కొత్త యుద్ధ నౌక యుద్ధ నౌకను డ్రోన్లతో మిళితం చేసి అభివృద్ధి పరిచిన కొత్త రకం యుద్ధ నౌకను చైనా నేవీ సోమవారం ప్రారంభించింది. డ్రోన్ క్యారియర్లా పనిచేస్తూ సైనికులతో అవసరం లేకుండా జరిగే నేలపైనా, నీటిలోనూ పోరాట పటిమను పెంచుతుందని ఓ అధికారి తెలిపారు. -
రేపు రాత్రి పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌కు కౌంట్‌డౌన్
సూళ్లూరుపేట: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగవేదిక నుంచి ఈనెల 30న రాత్రి 9.58 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ60 రాకెట్‌కు 25 గంటలకు ముందు అంటే 29న రాత్రి 8.58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రయోగం ద్వారా 220 కిలోలు బరువు కలిగిన స్పాడెక్స్లో ఛేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను భూమికి 470 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార కక్ష్యలో 55 డిగ్రీలు వంపులో ప్రవేశపెట్టనున్నారు. ఈ రెండు ఉపగ్రహాలు సమాంతర కక్ష్యలోకి వెళ్లిన తరువాత ఒకదానితో ఒకటి అనుసంధానమై పనిచేస్తూ సేవలను అందిస్తాయి. అయితే ఉపగ్రహం బరువు మొత్తం 400కేజీలు అయినప్పటికీ ఇందులో రెండు ఉపగ్రహాల బరువు 220 కిలోలు మాత్రమే. మిగిలిన 180 కిలోలు ఉపగ్రహాల్లో ఇంధనం ఉంటుంది. అయితే ప్రస్తుతం రాకెట్‌కు అన్ని దశలను పూర్తిచేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలన్నీ నిర్వహించిన తరువాత ఎంఆర్ఆర్ సమావేశం, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం ప్రయోగాన్ని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. -
దూసుకెళ్లే రేసుగుర్రం.. రాకెట్ వన్ బైక్ (ఫోటోలు)
-
పునర్వినియోగ రాకెట్ రూమీ–1
చెన్నై: పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ రూమీ–1ను భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించింది. 80 కిలోల ఈ రాకెట్ తమళినాడులోని చెన్నై తీరం నుంచి శనివారం ఉదయం హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్‌ప్యాడ్ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. అతి తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో ఉపగ్రహాలను కక్ష్యలోకి మోసుకెళ్లింది. వాతావరణ మార్పులు, పర్యావరణ పరిస్థితులు, ఓజోన్ పొరలో మార్పులు, గ్లోబల్ వారి్మంగ్ వంటి అంశాలపై ఈ ఉపగ్రహాలు అధ్యయనం చేస్తాయి. భూమిపైకి విలువైన సమాచారం చేరవేస్తాయి. తమిళనాడులోని స్పేస్‌జోన్ అనే స్టార్టప్ కంపెనీ మారి్టన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌తో కలిసి రూమీ–1 రాకెట్‌ను అభివృద్ధి చేసింది. మిషన్ రూమీ–2024 విజయవంతం కావడం వెనుక ఆయా సంస్థ కృషి ఉంది. ఈ ప్రయోగంలో 1,500 మంది పాఠశాల విద్యార్థులు సైతం పాలుపంచుకున్నారు. రూమీ–1 రాకెట్ 35 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని, ఉపగ్రహాలను ఉపకక్ష్య ప్రాంతంలో విడిచిపెట్టిందని స్పేస్‌జోన్ ప్రతినిధులు చెప్పారు. సాధారణంగా ఉపగ్రహ ప్రయోగం పూర్తయిన తర్వాత రాకెట్ వాతావరణంలో మండిపోవడమో లేక సముద్రంలో కూలిపోవడమో జరుగుతుంది. కానీ, పారాచూట్ల సాయంతో రాకెట్‌ను భూమికి చేర్చి, మళ్లీ వినియోగి ంచుకోవడం పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రత్యేకత. రాకెట్ ప్రయోగాల ఖ ర్చును తగ్గించాలన్న లక్ష్యంతో పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్‌ను తయారు చేసినట్లు స్పేస్‌జోన్ కంపెనీ వెల్లడించింది. -
ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి పేలిన చైనా రాకెట్
లాంచ్‌ప్యాడ్ వద్ద ఉంచిన ఓ రాకెట్ ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరి పేలిపోయిన ఘటన చైనాలో చోటుచేసుకొంది. అయితే పర్వత ప్రాంతంలో ఈ రాకెట్ పడిపోవడంతో నష్టం తప్పింది. Chinas kommerzielle Trägerrakete Tianlong-3 ist bei einem Teststart abgestürzt.#China #XiJinping #Rocket #Space #SecretStory #Taiwan #Breaking #news #Explosion #USA pic.twitter.com/uIqaCFZHVG— Brennende Frage (@brennende_frage) July 1, 2024బీజింగ్ తియాన్‌లాంగ్ టెక్నాలజీ అండ్ కో సంస్థ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించింది. తాము అభివృద్ధి చేస్తున్న తియాన్‌లాంగ్3 అనే రాకెట్ తొలి దశ భాగం ప్రమాదవశాత్తూ గాల్లోకి ఎగిరిపోయిందని, గాంగ్యీ పర్వత ప్రాంతంలో భారీ పేలుడుతో పడిపోయిందని వెల్లడించింది. అయితే అక్కడ జనావాసాలు లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.పేలుడు తర్వాత అగ్నిమాపక బృందాలు ఆ మంటల్ని ఆర్పేశాయి. తాజాగా దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.చైనాలో రాకెట్ ప్రయోగ రంగంలోకి ప్రైవేటు సంస్థలకు అనుమతులు ఇచ్చారు. దీంతో పలు కంపెనీలు తమ ప్రయోగశాలలను ఏర్పాటుచేశాయి. తియాన్‌లాంగ్3 రాకెట్‌ను చైనా స్కైడ్రాగన్ 3 పేరిట అభివృద్ధి చేస్తోంది.ఇదిలా ఉంటే.. జూన్ 22న చైనా సిచువాన్ ప్రావిన్స్‌లో ఓ గ్రామంపై రాకెట్ శిథిలాలు కూలాయి. షీఛాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి లాంగ్‌మార్చ్2 రాకెట్ ప్రయోగం జరిగిన కొద్దిసేపటికే అవి జనావాసాలపై పడ్డాయి. -
ఇస్రో హ్యాట్రిక్.. ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం
బెంగళూరు: దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన రీ-యూజబుల్ లాంచ్ వెహికిల్ (ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్-03) రాకెట్ పుష్పక్‌ను ఆదివారం ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఎయిరో నాటికల్ టెస్టింగ్ రేంజ్లో ఈ ప్రయోగం నిర్వహించింది. ఇందులో భాగంగా పుష్పక్ తనంతట తానుగా రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని ఇస్రో ‘ఎక్స్’ వేదికగా తెలిపింది.RLV-LEX3 Video pic.twitter.com/MkYLP4asYY— ISRO (@isro) June 23, 2024 ‘ఆర్ఎల్వీ-ఎల్ఈఎక్స్ రాకెట్ ప్రయోగంతో ఇస్రో హ్యాట్రిక్ విజయం సాధించింది. ఇస్రో మూడో, చివరి ఆర్ఎల్వీ-ఎల్ఈఎక్స్ రాకెట్ ప్రయోగం జూన్ 23న విజయవంతం అయింది. ‘పుష్పక్’ రాకెట్ సమాంతరంగా ల్యాండింగ్‌ను విజయవంతంగా అమలు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో అధునాతన స్వయంప్రతిపత్తి సామర్థాన్ని ప్రదర్శించింది. పుష్పక్ రాకెట్ ఇస్రో ఆర్బిటాల్ పునర్వినియోగ వాహనంలోకి చేరుకుంది’ అని ఇస్రో తెలిపింది. ఇక.. పునర్వినియోగ ల్యాండింగ్ వెహికల్ (RLV) LEX-01, LEX-02 పుష్పక్ రాకెట్ ప్రయోగాలు విజయవంతమైన విషయం తెలిసిందే.Hat-trick for ISRO in RLV LEX! 🚀🇮🇳ISRO achieved its third and final consecutive success in the Reusable Launch Vehicle (RLV) Landing EXperiment (LEX) on June 23, 2024."Pushpak" executed a precise horizontal landing, showcasing advanced autonomous capabilities under… pic.twitter.com/cGMrw6mmyH— ISRO (@isro) June 23, 2024 ఈ ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో చైర్మన్ సోమనాథ్ అభినందనలు తెలిపారు. ‘ ఈ ప్రయోగం విజయవంతం కావటంతో.. పుష్పక్ అర్బిటాల్ టెస్ట్‌కు వేదికగా నిలిచింది. అంతరిక్షంలోకి ఈ రాకెట్‌ను ప్రయోగిస్తే.. తిరిగి భూమికి సేఫ్‌గా ల్యాండ్ కానుంది. దీంతో అంతరిక్ష ఖర్చును తగ్గించటంలో ఇది ఒక గేమ్ ఛేంజర్ టెక్నాలజీగా నిలుస్తుంది’ అని ఆయన ‘ఎక్స్’లో తెలిపారు. -
అగ్నికుల్ కాస్మోస్ అనే స్మార్టప్ కంపెనీ సాధించిన విజయం
-
చంద్రునిపై చైనా ల్యాండర్
బీజింగ్: చైనాకు చెందిన లూనార్‌ల్యాండర్ చాంగే-6 చంద్రునిపై మనకు కనిపించని అవతలి వైపు ల్యాండ్ అయింది. ఈ విషయాన్ని చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చైనా కాలమానం ప్రకారం ఆదివారం(జూన్2) ఉదయం అయిట్కిన్ బేసిన్ అనే పేరుతో పిలుచుకునే ప్రాంతంలో చాంగే-6 సురక్షితంగా దిగినట్లు తెలిపింది. చాంగే-6 అక్కడి శాంపిల్స్ తీసుకున్న తర్వాత తిరిగి భూమికి బయల్దేరనుండటం విశేషం. మే3వ తేదీన చాంగే-6 భూమి నుంచి బయలుదేరి 53 రోజులు ప్రయాణించి చంద్రున్ని చేరింది. రోబోల సాయంతో చంద్రునిపై తవ్వకాలు జరిపి రెండు కిలోల మట్టి శాంపుల్స్ తీసుకోనుంది. తర్వాత లూనార్ ల్యాండర్‌లోని అసెండర్ మాడ్యూల్ చంద్రుడిపైకి లేచి చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న ఆర్బిటర్‌తో అనుసంధానమవతుంది. ఆర్బిటర్ మళ్లీ భూమి దిశగా ప్రయాణం మొదలు పెడుతుంది. ఆర్బిటర్‌లోని రీఎంట్రీ మాడ్యూల్ శాంపుల్స్ తీసుకుని భూమిపైన దిగుతుంది. చంద్రుడి అవతలివైపు మొత్తం గోతులతో నిండి ఉండటం వల్ల అటువైపు ల్యాండ్ అయి వ్యోమనౌకలు తిరిగి రావడం అంత సులువు కాదు. అయితే చైనా ఈ ఫీట్‌ను సాధిస్తే 2030లో చంద్రునిపై వ్యోమగాములను పంపేందుకు మార్గం సుగమం అయినట్లే. -
ప్రపంచాన్ని వణికిస్తున్న ఇరాన్ రాకెట్ ఫోర్స్?
ఒకప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ సత్సంబంధాలు కలిగిన దేశాలు. ఇప్పుడు దానికి విరుద్ధంగా ఇరు దేశాలు బద్ధశత్రువులుగా మారాయి. ఈనెల (ఏప్రిల్) ఒకటిన సిరియా రాయబార కార్యాలయంపై జరిగిన దాడిలో 13 మంది ఇరాన్ సైనికులు మరణించారు. ఈ దాడిపై స్పందించిన ఇరాన్.. ఇజ్రాయెల్‌ను నిందించింది. ఇజ్రాయెల్‌పై చర్య తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది. అయితే ఈ ఆరోపణలను ఇజ్రాయెల్ ఖండించింది. దీని తరువాత ఏప్రిల్ 13న ఇరాన్ తన క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. నిజానికి ఇరాన్ నుండి ఇజ్రాయెల్‌కు వేల కిలోమీటర్ల దూరం ఉంది. అయినా ఇరాన్ దాడులను విజయవంతంగా నిర్వహించింది. దీనిని చూస్తే ఇరాన్ రాకెట్ ఫోర్స్ ఎంతో శక్తివంతమైనదని అర్థమవుతుంది. ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన తొమ్మిది బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇవి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇజ్రాయెల్‌పై దాడి చేసే శక్తిని కలిగివున్నాయి. ఈ క్షిపణుల్లో అత్యంత ప్రమాదకరమైనది ‘సెజిల్’. ఈ క్షిపణి గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో 2,500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యంపై దాడి చేయగలదు. ఖిబార్ క్షిపణి పరిధి రెండు వేల కిలోమీటర్లు. దీనితో పాటు, హజ్-ఖాసేమ్ దాడి పరిధి 14 వందల కిలోమీటర్లు. ఇరాన్ వద్ద హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. గత సంవత్సరం ఇరాన్ తన స్వదేశీ హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ధ్వని కంటే ఐదు రెట్లు వేగంగా ప్రయాణించే వాటిని హైపర్సోనిక్ క్షిపణులు అంటారు. ఈ క్షిపణులను వాటి వేగం కారణంగా అడ్డుకోవడం అసాధ్యం. ఇరాన్ దగ్గర అణుశక్తితో రూపొందిన క్రూయిజ్ క్షిపణి కూడా ఉంది. దీని పరిధి మూడు వేల కిలోమీటర్లు. ఇరాన్‌కు డ్రోన్ల ఆయుధాగారం కూడా ఉంది. ఇరాన్ వద్ద మొహజిర్-10 అనే ప్రాణాంతక డ్రోన్ ఉంది. దీని పరిధి రెండు వేల కిలోమీటర్లు. ఇది 300 కిలోల బరువును మోయగలదు. ఇరాన్ దగ్గరున్న రాకెట్ ఫోర్స్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. -
నేడు నింగిలోకి అగ్నిబాన్ రాకెట్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అగ్నికుల్ కాస్మోస్ ప్రయివేట్ లిమిటెడ్ (చెన్నై) అనే ప్రయివేట్ అంతరిక్ష సంస్థకు చెందిన అగ్నిబాన్ ఎస్ఓఆర్ టీఈడీ మిషన్–01 అనే చిన్న తరహా రాకెట్‌ను సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని అగ్నికుల్ ప్రయోగవేదిక నుంచి శనివారం ఉదయం 6గంటలకు ప్రయోగించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఈ విషయాన్ని షార్ శుక్రవారం మీడియాకు తెలిపింది. ఇస్రోలోని వాణిజ్యవిభాగమైన ఇన్‌స్పేస్ సంస్థ ఆహ్వానం మేరకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ లాంచ్పాడ్ నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభమవుతుంది. ఈ ప్రయోగంలో సుమారు వంద కిలోలు బరువు కలిగిన పేలోడ్ (ఉపగ్రహం)ను లోయర్ ఎర్త్ ఆర్బిట్ (లియో)లోకి పంపించనున్నారు. అయితే రాకెట్‌కు సంబంధించిన అన్ని విషయాలను అగ్నికుల్ సంస్థ చూసుకుంటుండగా, షార్ అధికారులు, ఇంజినీర్లు ప్రయోగాన్ని పర్యవేక్షిస్తున్నారు. అందుకే ఈ రాకెట్‌కు సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదు. అయితే షార్ వేదికగా ప్రయివేట్ అంతరిక్ష సంస్థల్లో స్కైరూట్, అగ్నికుల్ అనే రెండు సంస్థలకు చెందిన చిన్న తరహా ప్రయోగాలకు ఇస్రో వీలు కల్పిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రయోగ వేదికలను కూడా కల్పించి మరీ ప్రయివేట్ అంతరిక్ష సంస్థలకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. అందుకే అగ్నికుల్ సంస్థకు షార్కేంద్రంలో ఒక ప్రయోగవేదికను కూడా కేటాయించారు. అగ్నిబాన్ రాకెట్ వివరాలివి పేటెంట్ పొందిన అగ్నిలెట్ ఇంజన్లతో ఈ రాకెట్ నడవడం విశేషం. ఇది త్రీడీ–ప్రింటెడ్ 6 కేఎన్ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ సాయంతో నిలువునా నింగిలోకి ఎగురుతుంది. అగ్నికుల్ రాకెట్ 18 మీటర్లు ఎత్తు కలిగి 1.3 మీటర్లు వెడల్పు ఉంది. ప్రయోగ సమయంలో 14వేల కిలోల బరువు కలిగి ఉంటుంది. ఈ అగ్నిలెట్ ఇంజిన్లలో ద్రవ ఆక్సిజన్, ద్రవ ఆక్సిడైజర్ అనే ఇంధనం సాయంతో మూడు దశలుగా రాకెట్‌ను ప్రయోగిస్తారు. అగ్నికుల్ కాస్మోస్ సంస్థ గతేడాది ఆగస్టు 15న ఒకసారి ప్రయోగాన్ని నిర్వహించగా, రెండోసారి శనివారం ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. -
మనల్నీ మోసుకెళ్తుంది!
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భవిష్యత్‌లో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో.. అందుకు తగ్గట్లుగా అత్యాధునిక రాకెట్ తయారీకి శ్రీకారం చుట్టింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) అని నామకరణం చేసింది. ఇస్రో తొలినాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తర్వాత.. 40 కిలోల నుంచి 5,000 కిలోల బరువున్న ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం3, ఎస్ఎస్ఎల్వీ అనే ఆరు రకాల రాకెట్లను ఇప్పటివరకు అభివృద్ధి చేసింది. త్వరలో మానవ సహిత ప్రయోగంతో పాటు వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లి.. తిరిగి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్ని కూడా చేపట్టాలని ఇస్రో భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి పంపేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ 20 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో ఆర్బిట్‌లోకి, 10 వేల కిలోల బరువుండే ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీని ఇస్రో చేపట్టింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008 డిసెంబర్ 22న కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశ అభివృద్ధితో పాటు రాకెట్ భాగాలను రూపొందించేందుకు ఇస్రో కృషి చేస్తోంది. ఎన్జీఎల్వీ రాకెట్‌లోని అన్ని దశలను విడివిడిగా ప్రయోగించి.. పరీక్షించనుంది. 2028 నాటికల్లా మొదటి టెస్ట్ వెహికల్‌ను, దాని సామర్థ్యాన్ని పరీక్షించి.. 2035 నాటికి పూర్తి స్థాయిలో ఎన్జీఎల్వీ రాకెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు.. ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► రాకెట్ వెడల్పు 5 మీటర్లు ► దశల్లోనే రాకెట్ ప్రయోగం ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలో ఎన్జీఎల్వీ రాకెట్‌కు ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. కోర్ అలోన్ దశలో 160 టన్నుల సెమీ క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► క్రయోజనిక్ దశలో 30 టన్నుల క్రయోజనిక్ ఇంధనాన్ని వినియోగిస్తారు ► ఇది ఫాల్కన్ రాకెట్, అట్లాస్–వీ, ప్రోటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ఇటీవల ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. 2030–35 నాటికి మానవ సహిత అంతరిక్షయానం, అత్యంత బరువైన సమాచార ఉపగ్రహాల ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. షార్‌లో మూడో లాంచ్‌ప్యాడ్ షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. ఇప్పటికే శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో రెండు ప్రయోగ వేదికలు, 4 వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఎన్జీఎల్వీ కోసం మూడో ప్రయోగ వేదిక అవసరమని ఇస్రో గుర్తించింది. ఇప్పటికే శ్రీహరికోటలో స్థలాన్ని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. భవిష్యత్‌లో మ్యాన్ ఆన్ ద మూన్ ప్రయోగంతో పాటు అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపించి.. సురక్షితంగా తీసుకువచ్చే ప్రయో గాలు, చంద్రయాన్–4లో చంద్రుడి మీదకు రోబోను పంపించే ప్రయత్నాలు వంటి ప్రయోగాల కోసం మూడో ప్రయోగ వేదికను నిర్మించేందుకు ఇస్రో సిద్ధమైంది. -
Reusable Launch Vehicle: పుష్పక్.. తగ్గేదేలే!
సాక్షి బెంగళూరు/సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): అంతరిక్ష ప్రయోగాల ఖర్చును తగ్గించేందుకు వినూత్న పద్ధతులను అనుసరిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఈ విషయంలో మరో మైలురాయిని అధిగమించింది. పుష్పక్ రాకెట్ ల్యాండింగ్ ప్రక్రియను శుక్రవారం విజయవంతంగా నిర్వహించింది. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి మోసుకెళ్లే లాంచింగ్ వెహికల్స్ (రాకెట్లు)ను మళ్లీ వినియోగించుకోవడమే ఈ ప్రయోగం లక్ష్యం. రీయూజబుల్ లాంచింగ్ వెహికల్‌ను ఇస్రో తయారు చేయడమే కాకుండా ముద్దుగా ‘పుష్పక్’ అని పేరు పెట్టుకుంది. ఈ పుష్పక్‌కు సంబంధించి తొలి ధపాలో గతేడాది నిర్వహించిన ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–01 మిషన్ పరీక్ష విజయవంతమైంది. తాజాగా రెండో దఫాలో పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగం సైతం విజయవంతమైంది. శుక్రవారం ఉదయం 7.10 గంటలకు కర్ణాటక చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్(ఏటీఆర్) నుంచి ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్–02 మిషన్ పరీక్ష నిర్వహించారు. నింగిలోకి పంపిన రాకెట్‌కు స్వయంగా ల్యాండింగ్ సామర్థ్యం ఉందా లేదా అనేది పరీక్షించారు. పుష్పక్‌ను భారత వైమానిక దళానికి చెందిన చిన్నూక్ హెలీకాప్టర్ ఆకాశంలో 4.5 కిలోమీటర్ల ఎత్తుకు తీసుకెళ్లి కిందకు వదిలేసింది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా, స్వతహాగా డిజైన్ చేసిన ప్రోగ్రామ్ ప్రకారం రన్‌వే మీద పుష్పక్ సురక్షితంగా దిగింది. బ్రేక్ పారాచ్యూట్, ల్యాండింగ్ గేర్ బ్రేక్స్, నోస్‌వీల్ సిస్టమ్ సాయంతో పుష్పక్ తనంతట తానే వచ్చి నిలిచిపోవడం గమనార్హం. పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందాన్ని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అభినందించారు. -
Srinath Ravichandran: స్పేస్ టెక్ స్టార్టప్ - అంతరిక్షంలో అగ్ని సంతకం!
ఏరో స్పేస్ టెక్నాలజీ అనగానే విదేశాల వైపు చూసే ఎంతోమందికి మన సత్తా చూపించిన స్టార్టప్‌లలో ‘అగ్నికుల్ కాస్మోస్’ ఒకటి. ఆకాశమంత కలతో బయలుదేరిన ‘అగ్నికుల్’ అమ్ముల పొదిలో దివ్యాస్త్రం అగ్నిబాణ్.. ‘అగ్నికుల్’ అంటే భారత అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భర్ విజయగాథ. ఐఐటీ–మద్రాస్ కేంద్రంగా పని చేస్తున్న ‘అగ్నికుల్ కాస్మోస్’ త్రీడీ ప్రింటెట్ రాకెట్ ఇంజిన్‌ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ప్రశంసలు అందుకుంది. స్నేహితుడు మోహిన్, ప్రొఫెసర్ చక్రవర్తిలతో కలిసి 2017లో ‘అగ్నికుల్’ను లాంచ్ చేశాడు శ్రీనాథ్ రవిచంద్రన్. మన దేశంలోని ఫస్ట్ ప్రైవేట్ స్మాల్ శాటిలైట్ రాకెట్ ‘అగ్నిబాణ్’ను నిర్మించింది అగ్నికుల్. 30 కిలోల నుండి 300 కిలోల బరువు ఉన్న పేలోడ్‌ను తక్కువ భూకక్ష్యలోకి (సుమారు ఏడువందల కిలోమీటర్ల ఎత్తు) తీసుకువెళ్లే సామర్థ్యం దీని సొంతం. 2020లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)తో ఒప్పందం కుదర్చుకున్న తొలి భారతీయ కంపెనీగా ప్రత్యేకత సాధించింది అగ్నికుల్. ఒప్పందం ద్వారా ‘అగ్నిబాణ్’ నిర్మాణంలో ‘ఇస్రో’ సహాయ, సహకారాలను తీసుకుంది. ప్లగ్–అండ్–ప్లే ఇంజిన్ కాన్ఫిగరేషన్ సామర్థ్యం ఉన్న అగ్నిబాణ్, మిషన్ అవసరాలకు ఖచ్చితంగా సరిపోయేలా కాన్ఫిగర్ చేయగలదు. ప్రతి క్లయింట్‌కు సంబంధించిన ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా కాన్ఫిగర్ చేయవచ్చు. 3డీ సాంకేతికతతో రూపొందించిన ఈ రాకెట్ ఉపగ్రహ ప్రయోగాల ఖర్చును తగ్గిస్తుంది. మొదట్లో వారానికి కనీసం రెండు రాకెట్ ఇంజిన్లను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఆ తరువాత నాలుగు ఇంజిన్లకు విస్తరించింది అగ్నికుల్. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లింది. ‘మోర్ యాక్సెసబుల్ అండ్ అఫర్డబుల్’ లక్ష్యంతో బయలు దేరిన శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు మరిన్ని లక్ష్యాలు నిర్దేశించుకోవడానికి రెడీ అవుతున్నారు. "శ్రీహరి కోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ నుంచి ఈరోజు లాంచ్ చేయాల్సిన ‘అగ్నిబాణ్’ సాంకేతిక కారణాల వల్ల వాయిదా పడింది." ఆత్మవిశ్వాసమే అద్భుత శక్తి.. 2017లో ‘అగ్నికుల్’తో శ్రీనాథ్ రవిచంద్రన్, మోయిన్‌లు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు ఇన్వెస్టర్ల నుంచి విశ్లేషకుల వరకు ‘మన దేశంలో ఇది సాధ్యమా? ఈ కుర్రాళ్ల వల్ల అవుతుందా’ అనే అనుమాన నీడ ఉండేది. అయితే శ్రీనాథ్, మోహిన్లు ఎప్పుడూ ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం అనే అద్భుతశక్తితో ముందుకు కదిలారు. నాలుగు వందల వరకు పిచ్ మీటింగ్‌లు నిర్వహించిన తరువాతే ఫస్ట్ రౌండ్ ఫండింగ్ 2018లో వచ్చింది. అనుమాన నీడ వెనక్కి వెళ్లి ‘అగ్నికుల్’ పేరు ప్రపంచానికి పరిచయం కావడానికి ఎంతోకాలం పట్టలేదు. మన దేశంలో స్పేస్ టెక్ స్టార్టప్‌ల విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ‘ఏరోస్పేస్ డిగ్రీలు చేయడానికి చాలామంది విదేశాలకు వెళ్లాలనుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇక్కడే ఉండాలనుకుంటున్నారు’ అంటున్నాడు ‘అగ్నికుల్’ కో–ఫౌండర్, సీయివో శ్రీనాథ్ రవిచంద్రన్. — శ్రీనాథ్ రవిచంద్రన్, ‘అగ్నికుల్ కో–ఫౌండర్, సీయివో. -
గాల్లోకి ఎగిరిన క్షణాల్లోనే పేలిన జపాన్ తొలి ప్రైవేటు రాకెట్..!
టోక్యో: వాణిజ్యపరంగా అంతరిక్ష ప్రయోగాల రంగంలోకి ప్రవేశించాలన్న జపాన్ ప్రయత్నాలకు ఆదిలోనే చుక్కెదురైంది. బుధవారం ఉదయం కుషిమోటో పట్టణంలోని లాంచ్ సెంటర్ నుంచి నింగిలోకి బయల్దేరిన దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ కైరోస్ లాంచ్ అయిన కొద్ది సెకన్లలోనే పేలిపోయింది. ఈ రాకెట్ నింగిలోకి ఎగిరితే జపాన్ చరిత్రలోనే తొలి ప్రైవేట్ రాకెట్ నింగిలోకి ఎగిరిన రికార్డు క్రియేట్ అయ్యేది. JUST IN: Space One rocket in Japan explodes after takeoff during its “inaugural launch.” The Kairos rocket was attempting to make Space One the first Japanese company to put a satellite in orbit. (Reuters) The 59 ft, four-stage solid-fuel rocket was launched from the Kii… pic.twitter.com/BJAAWXGsCy — Collin Rugg (@CollinRugg) March 13, 2024 ఈ రాకెట్‌ను స్పేస్ వన్ అనే స్టార్టప్ కంపెనీ తయారు చేసింది. 59 అడుగుల పొడవైన కైరోస్ రాకెట్ ఘన ఇంధనంతో పనిచేస్తుంది. కైరోస్ రాకెట్ ప్రభుత్వానికి చెందిన సాటిలైట్ను నింగిలోకి మోసుకెళ్లాల్సి ఉంది. రాకెట్ పేలిపోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. శిథిలాలు సమీపంలోని పర్వతాలు, సముద్రం మీద చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ రాకెట్ మార్చ్ 9వ తేదీనే లాంచ్ కావల్సి ఉండగా పలు కారణాల వల్ల లాంచింగ్ వాయిదాపడింది. రాకెట్ పేలిపోవడంతో స్పేస్ వన్ కంపెనీ షేర్లు జపాన్ స్టాక్మార్కెట్లో ఒక్కరోజే 13 శాతం పడిపోయాయి. ఇదీ చదవండి.. చైనాలో భారీ పేలుడు -
స్టాలిన్ బర్త్‌డే.. బీజేపీ ‘కౌంటర్’ విషెస్
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బీజేపీ తమిళనాడు విభాగం కూడా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పింది. కానీ, అందులో ఆయనకు కౌంటరే వేసింది. ఇటీవల ఇస్రో కొత్త కాంప్లెక్స్ శంకుస్థాపన సందర్భంగా డీఎంకే ప్రభుత్వం ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనలో చైనా జెండా ఉండడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అయితే ఈ యాడ్‌పై రాష్ట్ర మత్స్య మంత్రి అనిత ఆర్ రాధాకృష్ణన్ వివరణ కూడా ఇచ్చారు. ‘ప్రకటనలో చిన్న పొరపాటు జరిగింది. మాకు వేరే ఉద్దేశ్యం లేదు. మా హృదయాల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉంది’ తెలిపారు. అయితే.. వివాదాన్ని కొనసాగిస్తూ.. సీఎం స్టాలిన్‌కు మాండరీన్ భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది బీజేపీ. ఆయనకు(స్టాలిన్‌కు) ఇష్టమైన భాషలో శుభాకాంక్షలు తెలుపుతున్నామని ‘ఎక్స్’(ట్విటర్)లో బీజేపీ కౌంటర్ వేసింది. On behalf of @BJP4Tamilnadu, here’s wishing our Honourable CM Thiru @mkstalin avargal a happy birthday in his favourite language! May he live a long & healthy life! pic.twitter.com/2ZmPwzekF8 — BJP Tamilnadu (@BJP4TamilNadu) March 1, 2024 అంతకు ముందు.. తిరునెల్వేలిలో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ డీఎంకేపై విమర్శలు సంధించారు. ‘ప్రస్తుతం హద్దులు దాటేశారు. ఇస్రో లాంచ్ చేసే రాకెట్‌కు చైనా స్టిక్కర్‌ను అతికించారు. ఇది మన అంతరిక్ష శాస్త్రవేత్తలు, అంతరిక్ష రంగాన్ని అవమానించడమే. ప్రజల పన్ను, డబ్బు, దేశాన్ని అవమానించటమే’అని ప్రధాని మోదీ అన్నారు. అయితే ప్రధాని వ్యాఖ్యలకు డీఎంకే ఊరుకోలేదు.. కౌంటర్ ఇచ్చింది. తూర్పు లడఖ్‌లోని నియంత్రణ రేఖ వెంబడి చైనా చొరబాట్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటి చూపు కూడా సన్నగిల్లిందేమో.. మోదీ చైనా జెండాను పేపర్ యాడ్‌లో నిశిత దృష్టితో చూడగలరు. కానీ, గత పదేళ్లలో భారత భూభాగంలో చైనా జెండా పాతిందనే నివేదికలు ఆయన కళ్లను కప్పేశాయయేమో అని డీఎంకే ఎంపీ పి విల్సన్ విమర్శించారు. -
రేపు నింగిలోకి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): నూతన సంవత్సరం 2024, జనవరి ఒకటో తేదీ ఉదయం 9.10 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. నాలుగు దశల రాకెట్ అనుసంధానం పనులు పూర్తి చేసి.. ఎంఎస్టీ నుంచి ప్రయోగ వేదికకు అనుసంధానం చేశారు. ఈ ప్రయోగానికి సంబంధించి శనివారం ఎంఆర్ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డుకు అప్పగించారు. అనంతరం లాంచ్ ఆ«థరైజేషన్ సమావేశం నిర్వహించి రిహార్సల్స్ చేసి ప్రయోగసమయాన్ని, కౌంట్‌డౌన్ సమయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఆదివారం ఉదయం 8.10 గంటలకు.. అంటే ప్రయోగానికి 25 గంటల ముందు కౌంట్‌డౌన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లో ఈ ప్రయోగం 60వది కావడం విశేషం. 260 టన్నుల బరువు.. పీఎస్ఎల్వీ సీ58 రాకెట్ 44.4 మీటర్లు పొడవు కలిగి ప్రయోగ సమయంలో 260 టన్నుల బరువుంటుంది. ఈ ప్రయోగాన్ని నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తి చేస్తారు. రాకెట్ మొదటి దశలో రెండు స్ట్రాపాన్ బూస్టర్లలో నింపిన 24.4 టన్నుల ఘన ఇంధనం, కోర్ అలోన్ దశలో నింపిన 138 టన్నుల ఘన ఇంధనంతో 109.40 సెకెండ్లను పూర్తి చేస్తారు. రాకెట్ దూసుకెళుతున్న తరుణంలోనే 175 సెకెండ్లకు శాటిలైట్‌కు రక్షణ కవచంగా ఉన్న హీట్ షీల్డ్ విడిపోతుంది. అనంతరం 41.9 టన్నుల ద్రవ ఇంధనంతో 261.50 సెకెండ్లకు రెండో దశ, 7.66 టన్నుల ఘన ఇంధనంతో 586.26 సెకెండ్లకు మూడో దశ, 1.6 టన్నుల ద్రవ ఇంధనంతో 1258.92 సెకెండ్లకు నాలుగో దశను పూర్తిచేస్తారు. అనంతరం నాలుగో దశలో ద్రవ ఇంధన మోటార్ 1315.92 సెకెండ్లకు(21.55 నిమిషాల్లో) ఎక్స్‌ఫోశాట్ అనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రయోగాన్ని పూర్తి చేస్తారు. ఈ ప్రయోగంలో 469 కిలోల బరువు గల ఎక్స్‌పోశాట్ అనే ఖగోళ పరిశోధనలకు ఉపయోగపడే ఉపగ్రహాన్ని భూమికి 350 నుంచి 450 కి.మీ. ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. -
ఆవు పేడతో రాకెట్ ప్రయోగం.. జపాన్ ఆవిష్కరణ
టోక్యో: అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ఇంజినీర్లు ఆవుపేడతో అద్బుతం సృష్టించారు. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇంధన కొరత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. BIG BREAKING NEWS - Japan tests Rocket Engine powered by Cow Dung 🔥🔥 Japanese engineers have successfully test-fired a space rocket engine which runs on Cow Dung ⚡ This is REVOLUTIONARY because it will combat pollution, reduce emissions and also address energy needs in… pic.twitter.com/3qzJ6TGyQz — Times Algebra (@TimesAlgebraIND) December 19, 2023 జపానీస్ స్పేస్ స్టార్టప్ ఇంటర్స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ హక్కైడో స్పేస్‌పోర్ట్ ద్వారా ఆవుపేడతో నడిచే రాకెట్‌ను ప్రయోగించారు. ఆవు పేడ నుంచి తయారయ్యే బయోమీథేన్ వాయువును ఈ రాకెట్ ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. సహజవనరుల నుంచి తయారు చేసిన ఈ రాకెట్ ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది. సాంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోల్చితే.. బయోమీథేన్‌తో అతి తక్కువ ఖర్చులో రాకెట్ ప్రయోగాలు పూర్తి కానున్నాయి. / Breaking news from the test stand🔥 \ Here's a short footage of IST's first static fire test using Liquid Biomethane🚀 pic.twitter.com/695ld0kGmo — Interstellar Technologies (@istellartech_en) December 7, 2023 -
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్‌ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఐర్లాండ్‌కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్బర్గ్లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్లలో ఇది 250వది కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. Congrats to the @SpaceX team on the 250th landing of a Falcon rocket pic.twitter.com/U3KoKGmUOm — Elon Musk (@elonmusk) December 2, 2023 ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
ఆకాశానికి నిచ్చెనొద్దు.. చంద్రునికి తాడు బిగించి..
చందమామపై నుంచి బలమైన తాడును ఆకాశం మీదుగా భూమి మీదకు వదిలితే.. మనం అంతరిక్షంలో ఈజీగా చెక్కర్లు కొట్టొచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. ‘స్పేస్ లైన్’ ఏర్పాటు ద్వారా అసాధ్యాలు సుసాధ్యమవుతాయని నొక్కివక్కాణిస్తున్నారు. ఇందుకు భారీగా ఖర్చు కూడా కాబోదని చెబుతున్నారు. ఇంతకాలం ఆకాశానికి నిచ్చెన వేయాలనుకుంటున్న మనం ఇప్పుడు దానికి రివర్స్‌లో.. అంటే చంద్రునికి తాడు బిగించే ప్రయత్నం చేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. అంతరిక్షయానానికి సంబంధించి శాస్త్రవేత్తలకు ఎదురవుతున్న అతి పెద్ద ప్రతిబంధకం భూ గురుత్వాకర్షణ శక్తిని అధిగమించేందుకు అధిక వ్యయం కావడం. అయితే యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన జెఫిర్ పెనోయ్రే, న్యూయార్క్‌లోని కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ శాండ్ఫోర్డ్ల అభిప్రాయం ప్రకారం ప్రస్తుతం మనం వినియోగిస్తున్న రాకెట్ ఇంజిన్ల పనివిధానాల సూత్రాలే అంతరిక్ష ప్రయోగాలకు అధికవ్యయం అయ్యేందుకు కారణంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతమున్న విధానంలో వ్యోమనౌక భూమ్యాకర్షణకు వ్యతిరేక దిశలో ప్రయాణించేందుకు అవసరమయ్యే శక్తిని ఉత్పత్తి చేయడానికి గణనీయమైన మొత్తంలో ఇంధనం అవసరమవుతుంది. ఇందుకోసం అధికవ్యయం చేయాల్సివస్తుంది. దీనికి ప్రతిపాదిత పరిష్కారం స్పేస్ ఎలివేటర్‌ను నిర్మించడం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఈ విధానంలో భూమి ఉపరితలం నుండి నిర్ణీత కక్ష్య వరకు విస్తరించిన ఒక కేబుల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది అంతరిక్షంలోకి అధిరోహించడానికి ఒక మార్గాన్ని అందిస్తుంది. ఈ వ్యవస్థ అందించే ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, అధిరోహణ ప్రక్రియ కోసం సౌరశక్తిని ఉపయోగించుకునే అవకాశం కలిగివుండటం. తద్వారా అత్యధిక ఇంధన వినియోగం అవసరమవదు. అయితే స్పేస్ ఎలివేటర్ ఆపరేషన్ కోసం వినియోగించే కేబుల్ అసాధారణమైన బలాన్ని కలిగి ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలలో ఇందుకు అవసరమైన సామర్థ్యం లేదు. అయితే ఆధునిక శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్ స్పేస్ ఎలివేటర్ భావనకు ప్రత్యామ్నాయంగా ‘స్పేస్‌లైన్’ అనే సంస్కరణను ప్రతిపాదించారు. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న పరికరాలను ఉపయోగించి దీనిని నిర్మించవచ్చని వారు అంటున్నారు. కాగా స్పేస్ ఎలివేటర్ ఏర్పాటులో భూమి లోతుల్లో ఒక కేబుల్ ఉంటుంది. అది భూమికి దాదాపు 42 వేల కిలోమీటర్లు (26,098 మైళ్ళు) దూరంలో ఉన్న జియోసింక్రోనస్ కక్ష్య దాటి విస్తరించి ఉంటుంది. ఈ రకమైన కేబుల్ గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అప్పుడే స్పేస్ ఎలివేటర్ ప్రయోగం విజయవంతమవుతుంది. దశాబ్దాలుగా భౌతిక శాస్త్రవేత్తలు, సైన్స్ ఫిక్షన్ రచయితలు తమ స్పేస్ ఎలివేటర్ ఆలోచనలకు ఊపిరి పోస్తున్నారు. అయితే ఈ ప్రయోగానికి తగిన సామర్థాన్ని అందించే పరికరాల లోపంతో ప్రయోగాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇంతలో శాస్త్రవేత్తలు పెనోయ్రే, శాండ్ఫోర్డ్లు స్పేస్ ఎలివేటర్‌కు ప్రత్యామ్నాయంగా తాము ప్రతిపాదించిన ‘స్పేస్‌లైన్’ను సూచిస్తున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రుడిపై అత్యంత బలమైన తీగ(తాడు) లాంటిదాన్ని బిగించి, దాన్ని భూమి కక్ష్య వరకు వేలాడేలా చేయాలి. దీంతో భూమిపై నుంచి వెళ్లే రాకెట్లు ఈ బలమైన తీగ సహాయంతో అవతలి ఎండ్‌కు చేరుకుంటాయి. సరిగ్గా ఆ ఎండ్ దగ్గరే రాకెట్లు పార్క్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆస్ట్రోనాట్లు ఈ తీగ వెంబడి మరో రాకెట్లో స్పేస్ ట్రావెల్ చేసి, ఈజీగా చంద్రుణ్ణి చేరుకోవచ్చు. సాధారణంగా రాకెట్ ద్వారా స్పేస్‌లో ప్రయాణించాలంటే ఈ మార్గంలో ఎన్నో అడ్డంకులను ఎదుర్కోవలసి వస్తుంది. మధ్యలో ఎప్పుడైనా ఏ ఆస్టరాయిడ్ అయినా వచ్చి తగిలే అవకాశం ఉంటుంది. అదే ఈ బలమైన తీగ వెంబడి ప్రయాణిస్తే అటువంటి ప్రమాదం ఉండదని శాస్త్రవేత్తలు చెబున్నారు. అంతేకాకుండా ఇటువంటి ప్రయోగం ద్వారా తక్కువ ఇంధనంతోనే ఎక్కువ దూరం ప్రయాణించవచ్చని కూడా చెబుతున్నారు. పైగా ఇందుకు అవసరమయ్యే శక్తిని సౌరశక్తితో అప్పటికప్పుడే జనరేట్ చేసుకోవచ్చంటున్నారు. ఇటువంటి స్పేస్‌లైన్‌ను నిర్మించేందుకు కావాల్సిన అన్ని టెక్నాలజీలు, మెటీరియల్స్ మనకు అందుబాటులోనే ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అమెరికా, చైనా, రష్యా లాంటి అగ్రరాజ్యాలు ఇప్పటికే చంద్రునిపై పాగా వేయాలని చూస్తూ, అందుకు తగిన ప్రయోగాలు కూడా చేస్తున్నాయి. ఇదే ఆలోచనతో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ ఇంకో నాలుగేళ్లలో అంగారకునిపై కాలనీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. భవిష్యత్‌లో ఈ స్పేస్‌లైన్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే స్పేస్‌లో పలు అంతరిక్ష పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేసుకునేందుకు కూడా అవకాశముంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: కన్నీళ్లకే కన్నీళ్లొచ్చె: సోదరి మృతదేహాన్ని నడుముకు కట్టుకుని.. -
రూ.225 కోట్ల నిధులు సమీకరించిన స్కైరూట్
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న అంకుర సంస్థ, స్కైరూట్ ఏరోస్పేస్ ‘ప్రీ సిరీస్-సీ ఫైనాన్సింగ్ రౌండ్’లో భాగంగా రూ.225 కోట్లు సమీకరించింది. అంతరిక్ష రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్న దేశీయ అంకుర సంస్థ నిధులు సేకరించడం ఇది రెండోసారి. గతంలో 2022లో రూ.400 కోట్లు నిధులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్ నేతృత్వంలోని ప్రీ-సిరీస్ సి ఫండింగ్ ద్వారా రూ.225 కోట్ల మేర నిధులు సమీకరించినట్లు సంస్థ ప్రకటన విడుదల చేసింది. అయితే ఫండ్‌రైజింగ్ ద్వారా వచ్చిన సొమ్మును రాకెట్ లాంచింగ్ సమయంలో ప్రయోగ ఫ్రీక్వెన్సీ, సామర్థ్యాలను పెంపొందించడానికి ఉపయోగించే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ఖర్చు చేస్తామని తెలిపారు. దాంతోపాటు నైపుణ్యాలు కలిగిన ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించడానికి వెచ్చిస్తామని చెప్పారు. రానున్న రోజుల్లో సంస్థ మరింత వృద్ధి సాధిస్తుందని కంపెనీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. గతంలో సమీకరించిన నిధులతోపాటు తాజా ప్రకటనతో కలిపి కంపెనీ మొత్తం రూ.790కోట్లను సేకరించింది. రానున్న రెండేళ్లలో సంస్థ ప్రయోగిస్తున్న రాకెట్ల అవసరాల కోసం ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతాయని స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ కుమార్ చందన అన్నారు. చంద్రయాన్ 3 మూన్ ల్యాండింగ్ మిషన్ విజయవంతం కావడంతో భారతదేశ అంతరిక్ష రంగంపై ప్రపంచం ఆసక్తిగా ఉందన్నారు. గ్లోబల్ శాటిలైట్ లాంచ్ మార్కెట్లోకి ప్రవేశించే లక్ష్యంతో కంపెనీ పనిచేస్తుందని తెలిపారు. టెమాసెక్ వంటి ప్రసిద్ధి చెందిన పెట్టుబడి సంస్థ తమపై విశ్వాసాన్ని ఉంచి నిధులు కూడగట్టడంపై స్కైరూట్ సహ వ్యవస్థాపకుడు, సీఓఓ భరత్ డాకా హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో తమ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు తోడ్పడుతుందని చెప్పారు. గతేడాది స్కైరూట్ సంస్థ విక్రమ్ ఎస్ రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో విక్రమ్ 1ను ప్రయోగించనుంది. -
స్వదేశీ ప్రైవేట్ రాకెట్ విక్రమ్–1 సిద్ధం
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగ సంస్థ, హైదరాబాద్‌కు చెందిన ‘స్కైరూట్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్’ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. పూర్తిగా దేశీయంగా రూపొందించిన ఏడంతస్తుల పొడవైన, బహుళ దశల లో–ఎర్త్ ఆర్బిట్ రాకెట్ విక్రమ్–1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సుమారు 300 కిలోల వరకు బరువుండే పేలోడ్లను ఈ రాకెట్ అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్ ఈ రాకెట్‌ను ఆవిష్కరించారు. అలాగే 60 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఆ సంస్థ నూతన కేంద్ర కార్యాలయం ‘మ్యాక్స్–క్యూ’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జితేంద్రసింగ్ మాట్లాడుతూ స్కైరూట్ ఏరోస్పేస్ను దేశంలోకెల్లా ఒకే గొడుగు కింద ఉన్న అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ అభివృద్ధి కేంద్రంగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు పవన్ చందన తదితరులు పాల్గొన్నారు. 2024 తొలినాళ్లలో ప్రయోగం విక్రమ్–1 పూర్తిగా కార్బన్–ఫైబర్‌తో తయారైన రాకెట్. ఇందులో 3డీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్లను అమర్చారు. ఇది బహుళ ఉపగ్రహాలను కక్ష్యలో ఉంచగలదు. 2024 తొలినాళ్లలోనే విక్రమ్–1ను ప్రయోగించాలని సంస్థ నిర్ణయించింది. ఇప్పటికే స్కైరూట్ 2022 నవంబర్ 18న విక్రమ్–ఎస్ రాకెట్‌ని విజయవంతంగా ప్రయోగించింది. -
మరో రాకెట్‌ను ప్రయోగించనున్న స్కైరూట్.. తేదీ ఎప్పుడంటే..
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను తీసుకువెళ్లటంలో రాకెట్లది ఎంతో కీలకమైన పాత్ర. అంతర్జాతీయంగా స్పేస్ఎక్స్ వంటి ప్రైవేట్ కంపెనీలు రాకెట్లును పంపుతున్నాయి. కానీ ఇప్పటి వరకూ మనదేశంలో ఇస్రో తప్పించి రాకెట్లు తయారు చేసిన సంస్థ మరొకటేదీ లేదు. తొలిసారిగా హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ గతేడాది విక్రమ్-ఎస్‌ను విజయవంతంగా ప్రయోగించింది. వచ్చే ఏడాది ప్రారంభంతో విక్రమ్-1ను లాంచ్‌చేసేందుకు సిద్ధమవుతుంది. స్కైరూట్ సంస్థ రూపొందించిన ‘విక్రమ్-1’ను కేంద్రమంత్రి జితేంద్రసింగ్ మంగళవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. స్కైరూట్ ఏరోస్పేస్ ప్రధానకార్యాలయం(మ్యాక్స్-క్యూ)ను మంత్రి సందర్శించి మాట్లాడారు. అభివృద్ధి చెందుతున్న స్పేస్, బయోటెక్, అగ్రికల్చర్ రంగాల్లో యువతకు అపారఅవకాశాలు ఉన్నాయని తెలిపారు. సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో స్టార్టప్ సంస్థల సామర్థ్యాలకు అంతర్జాతీయ గుర్తింపు లభించాలని ప్రధాని మోదీ కాంక్షిస్తున్నారని చెప్పారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ పవన్ చందన మాట్లాడుతూ అసాధారణమైన వాటిని సాధించినపుడే గుర్తింపు లభిస్తుందన్నారు. సంస్థ సీఓఓ భరత్ డాకా మాట్లాడుతూ విక్రమ్-1 డిజైన్ దేశీయంగా తయారుచేసినట్లు చెప్పారు. విక్రమ్-1 దాదాపు 300కిలోల పేలోడ్‌ను భూదిగువ కక్ష్యలోకి మోసుకెళ్లే రాకెట్. ఈ ప్రయోగం వివిధ దశల్లో జరుగుతుంది. దీన్ని పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో తయారు చేసినట్లు సంస్థ తెలిపింది. విక్రమ్-1ను 2024లో ప్రయోగించనున్నారు. స్కైరూట్ క్యార్యాలయం అయిన మ్యాక్స్-క్యూలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ఇంటిగ్రేటెడ్ డిజైన్‌తో స్పేస్ లాంచ్ భవనం, టెస్టింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 300 మంది పనిచేసేలా దీన్ని రూపొందించినట్లు సంస్థ తెలిపింది. -
గగన్‌యాన్‌కు ముందు నింగిలోకి టీవీ–డీ1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే మానవ సహిత గగన్‌యాన్ ప్రాజెక్టుకు ముందు ఈనెల 21న మానవ రహిత ప్రయోగం చేపట్టనున్నారు. దీనిలో భాగంగా మొట్టమొదటి క్రూ మాడ్యూల్ సిస్టం (వ్యోమగాముల గది)తో కూడిన గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)ను శనివారం ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు. సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని మొదటి ప్రయోగ వేదికనుంచి ప్రయోగించనున్నారు. ఇప్పటికే పలు రకాల భూస్థిర పరీక్షలను నిర్వహించారు. ఇందులోని మోటార్ల పనితీరును నిర్థారించుకున్నారు. ఎంఎస్‌టీలో టీవీ–డీ1 రాకెట్ అనుసంధానం పనులన్నీ పూర్తి చేశారు. ఈ టీవీ–డీ1 రాకెట్ ద్వారా క్రూ మాడ్యూల్ సిస్టంను భూమికి సుమారు 17 కిలో మీటర్ల దూరంలోని అంతరిక్షంలోకి పంపించి తిరిగి దాన్ని సురక్షితంగా తీసుకురావడమే ఈ ప్రయోగం ఉద్దేశం. రాకెట్ శిఖరభాగంలో అమర్చిన క్రూ మాడ్యూల్ సిస్టంను అంతరిక్షంలో వదిలిపెట్టిన తరువాత దానికి పైభాగంలో అమర్చిన 10 పారాచూట్ల సాయంతో శ్రీహరికోట తీరం నుంచి 10 కిలో మీటర్ల దూరంలో బంగాళాఖాతంలో దించి.. నేవీ సాయంతో ప్రత్యేక బోట్లో అక్కడ నుంచి సురక్షితంగా తీసుకువచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగాములను తిరిగి క్షేమంగా తీసుకువచ్చే ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహించే ప్రయోగం ఇది అని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ ఇటీవల ఓ సమావేశంలో తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగం ఇప్పటికే ఒక రూపానికి వచ్చిందని, ఆ ప్రయోగంలో టీవీ–డీ1 మొట్టమొదటి అంకమని ఆయన చెప్పారు. టీవీ–డీ1 ప్రయోగమిలా.. ♦ టీవీ–డీ1 ప్రయోగాన్ని 531.8 సెకన్లకు పూర్తి చేయనున్నారు. 34.954 మీటర్లు పొడవు కలిగిన టీవీ–డీ1 రాకెట్ ప్రయోగ సమయంలో 44 టన్నుల బరువు ఉంటుంది. ♦ ప్రయోగం ప్రారంభమైన 60.6 సెకన్లకు టెక్నికల్ వెహికల్ నుంచి క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం విడిపోతుంది. ♦ 90.6 సెకన్లకు క్రూమాడ్యూల్ ఎస్కేప్ సిస్టం నుంచి క్రూ మాడ్యూల్ విడిపోతుంది. ♦ ఆ తరువాత 95.9 సెకన్లకు ఏసీఎస్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్ను సురక్షితంగా భూమివైపుకు తీసుకొస్తుంది. ♦ 96.2 సెకన్లకు అపెక్స్ కవర్ విడిపోతుంది. 98.2 సెకన్లకు డ్రోగ్ పారాచూట్ విచ్చుకుంటుంది. ♦ 296.1 సెకన్ల తరువాత డ్రోగ్ పారాచూట్ విడిపోతుంది. ♦ 296.3 సెకన్లకు పైలట్ పారాచూట్ విచ్చుకుంటుంది. ♦ 296.5 సెకన్లకు మెయిన్ పారాచూట్ విచ్చుకుని క్రూమాడ్యూల్ను సురక్షితంగా భూమివైపునకు తీసుకొస్తుంది. ♦ 531.8 సెకన్లకు క్రూమాడ్యూల్ బంగాళాఖాతంలో దిగడంతో టీవీ–డీ1 ప్రయోగం పూర్తవుతుంది. -
మెరి‘సాయి దివ్య’ ప్రయోగాలు
తెనాలి: తెనాలికి చెందిన బుల్లి ఉపగ్రహాల రూపశిల్పి కొత్తమాసు సాయిదివ్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. తాను రూపొందించిన క్యూబ్‌శాట్–బీడబ్ల్యూశాట్‌ను స్పెయిన్ దేశంలో అక్కడి బీ2 స్పేస్ కంపెనీ సాయంతో బుధవారం స్ట్రాటో ఆవరణలోకి ప్రయోగించారు. ఉపగ్రహ కమ్యూనికేషన్ రంగంంలో పీహెచ్డీ స్కాలర్ అయిన సాయిదివ్య ప్రయోగించిన పేలోడ్లలో ఇది మూడోది కావటం విశేషం. 280 గ్రాముల ఈ పేలోడ్‌ను ఇక్కడి తన సొంత ‘ఎన్–స్పేస్‌టెక్’ అనే సంస్థలో తన బృందంతో కలిసి ఆమె తయారుచేశారు. ఇదీ నేపథ్యం శాటిలైట్ కమ్యూనికేషన్ రంగంలో రీసెర్చ్ స్కాలర్‌గా పనిచేస్తున్న కొత్తమాసు సాయిదివ్య బాపట్ల ఇంజినీరింగ్ కాలేజిలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ చేశారు. కేఎల్ యూనివర్సిటీలో కమ్యూనికేషన్ అండ్ రాడార్ సిస్టమ్స్‌లో ఎంటెక్ చేశారు. తన థీసిస్‌లో భాగంగా తన నివాసంలోనే ‘ఎన్–స్పేస్‌టెక్’ అనే సొంత కంపెనీని ఆరంభించారు. అంతరిక్ష సాంకేతికతను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావ టం, తక్కువ ఖర్చుతో బుల్లి ఉపగ్రహాల తయారీని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. తొలిగా లక్ష్యశాట్ పేరుతో క్యూబ్‌శాట్‌ను తయారుచేసి, గతేడాది మార్చిలో యునైటెడ్ కింగ్డమ్ నుంచి బీ2 స్పేస్ సహకారంతోనే స్ట్రాటో ఆవరణలోకి విజయవంతంగా ప్రయోగించారు. ఎక్కువ ఎత్తుకు వెళ్లగలిగిన బెలూన్ సాయంతో పంపిన 400 గ్రాముల లక్ష్యశాట్, భూతలం నుంచి 26 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లి, స్ట్రాటో అవరణలో కొన్ని గంటల ఉండగలిగింది. ప్రైవేట్ ర్యాకెట్ ప్రయోగంలో భాగస్వామి తర్వాత కొద్దినెలల్లోనే దేశంలో జరిగిన తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగంలో సాయిదివ్య భాగస్వామి కాగలిగారు. స్కై రూట్ అనే ప్రైవేటు సంస్థ విక్రమ్–ఎస్ రాకెట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి సబ్ ఆర్బిట్‌లోకి ప్రయోగించారు. ఆ రాకెట్ తీసుకెళ్లిన మూడు పేలోడ్లలో తెనాలిలో సాయిదివ్య రూపొందించిన లక్ష్యశాట్–2 పేలోడ్ ఒకటి కావటం గమనించాల్సిన అంశం. స్ట్రాటో ఆవరణలో అధ్యయనానికి బీడబ్ల్యూశాట్ ఆ క్రమంలోనే సాయిదివ్య తమిళనాడుకు చెందిన శక్తిప్రియ, బాపట్ల, కాకినాడలకు చెందిన రెహమాన్, ఉత్తేజ్‌తో కలిసి బీడబ్ల్యూశాట్‌ను తయారుచేశారు. మయన్మార్ దేశంలోని ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులకు శాటిలైట్ టెక్నాలజీపై వీరు ఇక్కణ్ణుంచే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ బోధనలో భాగంగానే తయారుచేసిన బీడబ్ల్యూశాట్‌ను మయన్మార్ తీసుకెళ్లి అక్కడి విద్యార్థులకు ప్రదర్శించారు. డిమాన్స్ట్రేషన్ ఇచ్చారు. అనంతరం బీ2 స్పేస్ కంపెనీ సహకారంతో స్పెయిన్‌లో ప్రయోగించారు. తాజా పేలోడ్‌తో స్ట్రాటో ఆవరణంలోని ఉష్ణోగ్రత, తేమ, ఆల్డిట్యూడ్ ప్రెషర్, యూవీ ఇంటెన్సిటీ, ఎంత వెలుతురు ఉంది అనే డేటా సేకరణ వీలవుతుందని బుధవారం సాయంత్రం సాయిదివ్య స్థానిక విలేకరులకు తెలిపారు. స్కైరూట్ సంస్థతో కలిసి త్వరలో జరగనున్న విక్రమ్–1 రాకెట్ ప్రయోగంలో భాగస్వామ్యం కానున్నట్టు చెప్పారు. రాకెట్లో ప్రయోగించే ఐయూ క్యూబ్‌శాట్ పేలోడ్ రూపకల్పనలో ఉన్నట్టు వివరించారు. తన తొలి పేలోడ్ నుంచి ఇప్పటివరకు తన భర్త రఘురామ్, అత్తమామలు కొత్తమాసు కుమార్, చంపకవల్లి, తండ్రి కేఎన్ ప్రసాద్ సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.