ఇస్రో హ్యాట్రిక్‌.. ‘పుష్పక్‌’ ప్రయోగం విజయవంతం | ISRO Hat Trick In India's RLV Pushpak Safe Landing | Sakshi
Sakshi News home page

ఇస్రో హ్యాట్రిక్‌.. ‘పుష్పక్‌’ ప్రయోగం విజయవంతం

Published Sun, Jun 23 2024 11:42 AM | Last Updated on Sun, Jun 23 2024 12:18 PM

ISRO Hat Trick In India's RLV Pushpak Safe Landing

బెంగళూరు: దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన రీ-యూజబుల్‌ లాంచ్‌ వెహికిల్‌ (ఆర్‌ఎల్‌వీ ఎల్‌ఈఎక్స్-03) రాకెట్‌ పుష్పక్‌ను ఆదివారం ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఎయిరో నాటికల్‌ టెస్టింగ్‌ రేంజ్‌లో ఈ ప్రయోగం నిర్వహించింది. ఇందులో భాగంగా పుష్పక్‌ తనంతట తానుగా రన్‌వేపై విజయవంతంగా ల్యాండ్‌ అయింది. ఈ విషయాన్ని ఇస్రో ‘ఎక్స్‌’ వేదికగా తెలిపింది.

 

‘ఆర్‌ఎల్‌వీ-ఎల్‌ఈఎక్స్‌ రాకెట్‌ ప్రయోగంతో ఇస్రో హ్యాట్రిక్‌ విజయం సాధించింది. ఇస్రో మూడో, చివరి ఆర్‌ఎల్‌వీ-ఎల్‌ఈఎక్స్‌ రాకెట్‌ ప్రయోగం జూన్‌ 23న విజయవంతం అయింది. ‘పుష్పక్’ రాకెట్‌ సమాంతరంగా ల్యాండింగ్‌ను విజయవంతంగా అమలు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో అధునాతన స్వయంప్రతిపత్తి సామర్థాన్ని ప్రదర్శించింది. పుష్పక్‌ రాకెట్‌ ఇస్రో ఆర్బిటాల్‌ పునర్వినియోగ వాహనంలోకి చేరుకుంది’ అని ఇస్రో తెలిపింది. ఇక.. పునర్వినియోగ ల్యాండింగ్ వెహికల్ (RLV) LEX-01, LEX-02 పుష్పక్‌ రాకెట్‌ ప్రయోగాలు విజయవంతమైన విషయం తెలిసిందే.

 

ఈ ప్రయోగం విజయవంతం కావటంపై ఇస్రో చైర్మన్‌ సోమనాథ్‌ అభినందనలు తెలిపారు. ‘ ఈ ప్రయోగం విజయవంతం కావటంతో.. పుష్పక్‌ అర్బిటాల్‌ టెస్ట్‌కు వేదికగా నిలిచింది. అంతరిక్షంలోకి ఈ రాకెట్‌ను ప్రయోగిస్తే.. తిరిగి భూమికి సేఫ్‌గా ల్యాండ్‌ కానుంది. దీంతో అంతరిక్ష  ఖర్చును  తగ్గించటంలో ఇది ఒక గేమ్ ఛేంజర్‌ టెక్నాలజీగా నిలుస్తుంది’ అని ఆయన ‘ఎక్స్‌’లో తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement