స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం | SpaceX Lands Its 250th Rocket | Sakshi
Sakshi News home page

SpaceX: స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం

Published Sat, Dec 2 2023 11:14 AM | Last Updated on Sat, Dec 2 2023 11:37 AM

SpaceX Lands Its 250th Rocket - Sakshi

స్పేస్ ఎక్స్ 250వ రాకెట్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్‌ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి  విజయవంతంగా ప్రయోగించింది.  ఐర్లాండ్‌కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్..  వాండెన్‌బర్గ్‌లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద  సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్‌లలో ఇది 250వది కావడం గమనార్హం.  ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు.  

దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్‌ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను  కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు  ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది.

ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement