Falcon 9
-
స్పేస్ఎక్స్ మిషన్‌లో... స్వల్ప సమస్య
వాషింగ్టన్: స్పేస్ఎక్స్ సంస్థ క్రూ–9 డ్రాగన్ అంతరిక్ష ప్రయోగంలో చిరు వైఫల్యం చోటుచేసుకుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ను క్షేమంగా వెనక్కి తీసుకొచ్చేందుకు నాసాతో కలిసి స్పేస్ ఎక్స్ శనివారం ఈ మిషన్ చేపట్టడం తెలిసిందే. అమెరికాలో ఫ్లోరిడాలోని కేప్ కెనవెరాల్ నుంచి ఫాల్కన్9 రాకెట్ ద్వారా క్రూ–9 డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను ప్రయోగించింది. ఇది విజయవంతమైనట్టు ఆదివారం ‘ఎక్స్’లో పోస్టు చేసింది. అయితే, ‘‘డ్రాగన్ వ్యోమనౌక రాకెట్ నుంచి విజయవంతంగా విడిపోయి ఐఎస్ఎస్ వైపు సాగింది. అనంతరం ఫాల్కన్9 రాకెట్ క్షేమంగా భూమిపైకి తిరిగివచి్చంది. అందులోని రెండో దశ మాత్రం సముద్రంలో పడాల్సిన చోటికి కాస్తంత దూరంలో పడిపోయింది’’ అని స్పేస్ఎక్స్ వెల్లడించింది. ఇందుకు కారణాలపై పరిశోధన చేస్తున్నట్లు పేర్కొంది. ఫాల్కన్9 పునరి్వనియోగ రాకెట్. ఇందులోని రెండో దశ విఫలం కావడం ఇది రెండోసారి. ఇది స్పేస్ఎక్స్కు ఇబ్బందికరంగా మారింది. పొరపాట్లు సరి చేసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆ సంస్థ చెబుతోంది. క్రూ–9 రాకెట్లో నాసా వ్యోమగామి నిక్ హేగ్, రోస్కోస్మాస్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ ఐఎస్ఎస్కు పయనమయ్యారు. సునీత, విల్మోర్లను వెనక్కు తీసుకొచ్చేందుకు వీలుగా రెండు సీట్లను ఖాళీగా ఉంచారు. వారిద్దరూ జూన్‌లో స్టార్‌లైనర్ తొలి ప్రయోగంలో భాగంగా ఐఎస్ఎస్ చేరుకోవడం తెలిసిందే. -
Jared Isaacman: మొట్టమొదటి ప్రైవేట్ స్పేస్‌వాక్
కేప్ కెనావెరాల్: ప్రైవేట్ అంతరిక్ష నౌకలో నింగిలోకి వెళ్లి, స్పేస్‌వాక్ చేసిన మొట్టమొదటి నాన్–ప్రొఫెషనల్ వ్యోమగామిగా బిలియనీర్, టెక్నాలజీ వ్యాపారవేత్త జేర్డ్ ఐజాక్మాన్(41) రికార్డు సృష్టించారు. గురువారం భూమి నుంచి దాదాపు 1,400 కిలోమీటర్ల ఎగువన ‘డ్రాగన్’ స్పేస్ క్యాప్సూల్ నుంచి బయటకు వచి్చ, దాదాపు 15 నిమిషాల పాటు అంతరిక్షంలో విహరించారు. అక్కడి నుంచి భూగోళాన్ని తిలకించారు. పరిపూర్ణమైన ప్రపంచాన్ని కళ్లారా దర్శించానని ఆయన పేర్కొన్నారు. ఐజాక్మాన్ తర్వాత స్పేస్ఎక్స్ ఇంజనీర్ సారా గిల్లిస్ స్పేస్‌వాక్ చేశారు. అనంతరం మరో ఇద్దరు డ్రాగన్ క్యాప్సూల్ నుంచి బయటికొచ్చి అంతరిక్ష నడకలో పాల్గొన్నారు. స్పేస్ఎక్స్ తలపెట్టిన ‘పోలారిస్ డాన్’ ప్రాజెక్టులో భాగంగా ఫాల్కన్–9 రాకెట్ ద్వారా మంగళవారం ఐజాక్మాన్ సహా మొత్తం నలుగురు అమెరికాలోని ఫ్లోరిడా నుంచి అంతరిక్షంలోకి బయలుదేరారు. గురువారం తమ లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఇప్పటిదాకా ప్రొఫెషనల్ వ్యోమగాములకు మాత్రమే పరిమితమైన స్పేస్‌వాక్‌ను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడానికి స్పేస్ఎక్స్ సంస్థ వ్యాపారాత్మకంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో ఎలాన్ మస్క్‌తోపాటు ఐజాక్మాన్ భారీగా∙పెట్టుబడి పెట్టారు. ఆయన పెట్టుబడి ఎంత అనేది బహిర్గతం చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి ప్రైవేట్ అంతరిక్ష యాత్రలు ఊపందుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
Florida: ఐఎస్ఎస్కు వ్యోమగాముల ప్రయాణం వాయిదా
ఫ్లోరిడా: అంతర్జాతీయ స్పేస్ సెంటర్‌కు(ఐఎస్ఎస్) ముగ్గురు వ్యోమగాములను తీసుకెళ్లాల్సిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ‘ఎండీవర్’ ప్రయాణం శనివారం వాయిదా పడింది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్లే ప్రయాణం వాయిదా పడిందని ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ ఎక్స్’ కంపెనీ వెల్లడించింది. పై గాలులు వీయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని తెలిపింది. అన్నీ అనుకూలిస్తే ఆదివారం రాత్రి రాకెట్‌ను నింగిలోకి పంపించేందుకు నాసా ఏర్పాట్లు చేస్తోంది. ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్లో క్రూ డ్రాగన్ ఎండీవర్‌ను ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కు పంపించనున్నారు. ఈ ప్రయాణం ఇప్పటికే ఫిబ్రవరి22న తొలిసారి వాయిదా పడింది. స్పేస్ఎక్స్ కంపెనీ 2020 నుంచి వ్యోమగాములను ఐఎస్ఎస్కు పంపిచే విషయంలో నాసాకు వాణిజ్యపరమైన సేవలందిస్తోంది. ఈ విషయంలో స్పేస్ ఎక్స్‌తో ప్రముఖ ఏవియేషన్ కంపెనీ బోయింగ్ త్వరలో పోటీపడనుంది. ఇదీ చదవండి.. అమెరికాలో భారతీయుని హత్య -
పక్కకు ఒరిగిన ‘ఒడిస్సియస్’.. ఆసక్తికర విషయం వెల్లడించిన ‘నాసా’
కాలిఫోర్నియా: జాబిల్లిపై 50 ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన అమెరికా ల్యాండర్ ఒడిస్సియస్కు సంబంధించి ఆసక్తికర విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా వెల్లడించింది. ల్యాండ్ అయ్యే సమయంలో ఒడిస్సియస్ చంద్రుని ఉపరితలాన్ని నిర్దేశించని రీతిలో తాకింది. దీంతో ల్యాండర్ కాస్త పక్కకు ఒరిగినట్లు నాసా తెలిపింది. చంద్రుని దక్షిణ ధృవంలోని క్రేటర్(గోయి) మలాపెర్ట్ సమీపంలో ఒడిస్సియస్ గురువారం ఉదయం ల్యాండ్ అయింది. ఇంట్యూటివ్ మెషీన్స్(ఐఎమ్) అనే ప్రైవేట్ స్పేస్ కంపెనీ, నాసా సంయుక్తంగా ఒడిస్సియస్‌ను ఎలాన్‌మస్క్ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్లో చంద్రునిపైకి పంపాయి. ల్యాండ్ అయిన తర్వాత భూమికి సిగ్నల్స్ పంపేందుకు ఒడిస్సియస్ కొంత సమయం తీసుకుంది. అయితే ల్యాండింగ్ సమయంలో తలెత్తిన ఇబ్బందితో కాస్త పక్కకు ఒరిగినప్పటికీ ఒడిస్సియస్‌లోని అన్ని కమ్యూనికేషన్ వ్యవస్థలు చక్కగా పనిచేస్తున్నట్లు ఇంట్యూటివ్ మెషిన్స్ సీఈవో స్టీవ్ ఆల్టిమస్ తెలిపారు. ఒడిస్సియస్ ల్యాండ్ అయిన చోట నీరు గడ్డకట్టి మంచు రూపంలో ఉండటంతో భవిష్యత్తు పరిశోధనలకు ఇది ఒక లూనార్ బేస్‌గా పనికొస్తుందని సైంటిస్టులు భావిస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో చాలా గోతులుండటం వారిని కొంత కంగారు పెడుతోంది. ఒడిస్సియస్ భూమి నీడలోకి వెళ్లేముందు వారం రోజుల పాటు పరిశోధనలు సాగించి డేటా పంపనుంది. ఇదీ చదవండి.. ఎక్స్ మెయిల్ వచ్చేస్తోంది -
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్ సేఫ్ ల్యాండ్.. ఎలాన్ మస్క్ హర్షం
స్పేస్ ఎక్స్ 250వ రాకెట్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. తాజాగా ఫాల్కన్ 9 రాకెట్‌ను కాలిఫోర్నియా తీరంలో వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి విజయవంతంగా ప్రయోగించింది. ఐర్లాండ్‌కు చెందిన మొదటి ఉపగ్రహాన్ని, దక్షిణ కొరియా నిఘా ఉపగ్రహాన్ని ఈ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మొదటి దశ ఫాల్కన్ 9 రాకెట్.. వాండెన్బర్గ్లోని ల్యాండింగ్ జోన్ 4 వద్ద సురక్షితంగా ల్యాండింగ్ అయింది. కాగా.. నింగి నుంచి క్షేమంగా స్పేస్ ఎక్స్ ల్యాండింగ్ చేసిన రాకెట్లలో ఇది 250వది కావడం గమనార్హం. ఈ సందర్భంగా స్పేస్ ఎక్స్ బృందానికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. Congrats to the @SpaceX team on the 250th landing of a Falcon rocket pic.twitter.com/U3KoKGmUOm — Elon Musk (@elonmusk) December 2, 2023 ఈ ప్రయోగంలో మొత్తం 25 ఉపగ్రహాలను రాకెట్ మోసుకెళ్లింది. యూనివర్సిటీ కాలేజ్ డబ్లిన్ విద్యార్థులు నిర్మించిన ఎడ్యుకేషనల్ ఐరిష్ రీసెర్చ్ శాటిలైట్-1 (EIRSAT-1) ఇందులో ఒకటి. దక్షిణ కొరియాకు చెందిన ఐదు ఉపగ్రాహాలను 2025 నాటికి నింగిలోకి పంపించాలని స్పేస్ ఎక్స్ ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దక్షిణ కొరియాకు చెందిన 425 ప్రాజెక్ట్ EO/IR ఉపగ్రహం 1,700 పౌండ్లు (800 kg) ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది. ఇన్ఫ్రారెడ్, ఎలక్ట్రో-ఆప్టికల్ సామర్థ్యాలను కలిగి ఉంది. అంతరిక్షంలోకి గూఢచారి ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా మోహరించినట్లు ప్రకటించిన కొద్ది రోజులకే దక్షిణ కొరియా ఉపగ్రహం కూడా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ఇదీ చదవండి: యూపీ అబ్బాయి.. డచ్ అమ్మాయి.. ఖండాంతరాలు దాటిన ప్రేమ -
జాబిలి వైపు రాకెట్.. లాంఛ్ కాదు ఢీ కొట్టడానికి!
పరిశోధనల కోసం రాకెట్లను, శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంఛ్ చేయడం సహజం. కానీ, ఇక్కడో రాకెట్ చంద్రుడ్ని ఢీ కొట్టే దూసుకెళ్తుండగా.. స్పేస్ ఏజెన్సీలన్నీ ఆసక్తిగా పరిశీలించబోతున్నాయి. అందుకు కారణాలు.. ఆ రాకెట్ ఎప్పుడో ఏడేళ్ల కిందట ప్రయోగించింది కావడం, ఇన్నాళ్లు స్పేస్‌లో కక్క్ష్య తప్పి అస్తవ్యస్తంగా సంచరించి ఇప్పుడు చంద్రుడి వైపు దూసుకెళ్లడం!. స్పేస్ఎక్స్ కంపెనీ ద్వారా ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించడానికి ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. మొదటి దశలో విజయవంతమైనప్పటికీ.. రెండో దశలో ఈ ప్రయోగం ప్లాప్ అయ్యింది. అయితే ఫాల్కన్ 9 బూస్టర్ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్క్ష్యను అనుసరించింది. దీంతో అదుపు తప్పి జాడ లేకుండా పోవడంతో స్పేస్ జంక్‌గా దాదాపు ఒక నిర్ధారణకు వచ్చేశారు సైంటిస్టులు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆశ్చర్యకరరీతిలో ఈ రాకెట్ ట్రాక్ ఎక్కగా.. చంద్రుడి మీదకు క్రాష్ దిశగా దూసుకెళ్తుంది. నాసా అంచనాల ప్రకారం.. మార్చ్ 4వ తేదీన ఈ క్రాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మిలియన్ మైళ్ల ట్రెక్‌లో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహాన్ని పంపడం ద్వారా తన మొదటి డీప్-స్పేస్ మిషన్‌ను ప్రారంభించినప్పటికీ.. ఫాల్కన్ 9 బూస్టర్ కొంత అస్తవ్యస్తమైన కక్ష్యలో తిరుగాడింది. దీంతో ఈ రాకెట్ సంగతి పట్టించుకోవడం మానేశారు!. అయితే ఇన్నేళ్లకు ఇది చంద్రుడి వైపు కక్క్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. సుమారు 4వేల కేజీల బరువున్న పాల్కన్ 9 బూస్టర్ రాకెట్.. ప్రస్తుతం గంటకు 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు పయనిస్తోంది. నాసా లునార్ ఆర్బిటర్(Lunar Reconnaissance Orbit)తో పాటు భారత్ చంద్రయాన్-2 స్పేస్‌క్రాఫ్ట్‌లు ఈ క్రాష్ ల్యాండ్‌ను అతి సమీపంగా గమనించనున్నాయి. అసలు ఈ క్రాష్ ల్యాండ్‌తో ఒరిగేది ఏముంటుందనే అనుమానం రావొచ్చు. చంద్రుడి ఉపరితలం మీది పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ఈ క్రాష్‌ల్యాండ్‌ను పరిశీలించనున్నారు. 2009లో నాసా కావాలనే ఒక రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ లాంఛ్ చేసింది. అయితే పాల్కన్ విషయంలో అనుకోకుండా చంద్రుడి ఉపరితలంపైకి ఢీ కొడుతుండడం విశేషం. ఇది చంద్రుడ్ని ఢీ కొట్టడం ద్వారా జరిగే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని స్పేస్ రీసెర్చర్లు భావిస్తున్నారు. క్లిక్ చేయండి: 5జీతో విమానాలకు ముప్పు పొంచి ఉందా? నిపుణుల మాటేంటంటే.. -
ఉల్కాపాతంతో పెనువిధ్వంసం.. రష్యాలో జరిగింది గుర్తుందిగా? రిపీట్ కాకూడదనే..
Nasa Dart Launch: అది ఫిబ్రవరి 15, 2013. రష్యాలో చలికావడంతో జనాలు దాదాపుగా ఇళ్లకు పరిమితం అయ్యారు. పూర్తి సూర్యోదయం తర్వాత కొన్ని నిమిషాలకు సుమారు 9గంటల 20 నిమిషాల సమయంలో ఆకాశంలో ఒక అద్భుతం. ఫైర్‌బాల్ లాంటి ఓ భారీ రూపం.. సూర్యుడి కంటే రెట్టింపు కాంతితో యూరల్ రీజియన్ వైపు దూసుకొస్తోంది. చెల్యాబిన్స్క్, కుర్గన్తో పాటు మరికొన్ని రీజియన్లలో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అదేంటో అనుకునేలోపే భారీ శబ్దంతో విధ్వంసం. అయితే.. అదృష్టవశాత్తూ అది నివాస ప్రాంతాల్లో పడలేదు. కానీ, దాని ప్రభావం వందల కిలోమీటర్ల పరిధిలో చూపించింది. భారీ పేలుడు, దట్టమైన దుమ్ము, ధూళి అలుముకోవడంతో పాటు గన్ పౌడర్ వాసనతో ఆ రేంజ్ మొత్తం కొన్ని రోజులపాటు గుప్పుమంటూనే ఉంది. ప్రజల హాహాకారాలతో ఆ చుట్టుపక్కల ప్రాంతాలు హోరెత్తాయి. ఈ బీభత్సం సృష్టించిన ఉల్కకి ఉన్న శక్తి.. షిరోషిమా అణుబాంబు కంటే 30 రెట్లు కలిగి ఉందని తర్వాత నాసా గుర్తించింది. 54 వేల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఆ ఉల్క.. 60 అడుగుల వెడల్పు, పదివేల టన్నుల బరువు ఉంది. 1908 టుంగుష్క ఈవెంట్ తర్వాత నమోదైన అతిపెద్ద ఘటన ఇదే. 1986లో గ్రేట్ మాడ్రిడ్ ఉల్కాపాతం ఘటనలో గాయపడిన వాళ్ల సంఖ్యతో పోలిస్తే.. చెల్యాబ్నిస్క్ ఘటనలో గాయపడిన వాళ్లే ఎక్కువ. ప్రాణ నష్టం లేకపోయినా.. సుమారు 1600 మంది గాయపడ్డారు. వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. విధ్వంసం తాలుకా ఆనవాలు ప్రస్తుతం ఆ ప్రాంతం కోలుకున్నా, ఏళ్లు గడుస్తున్నా.. ప్రాణ భయం ఇప్పటికీ అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉంది. అంతరిక్షం నుంచి ఎప్పుడు ఎటు నుంచి ఇలాంటి ముప్పు పొంచి ఉందో అనే ఆందోళన ప్రపంచం మొత్తం నెలకొంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఇలాంటి ఘటనలు తప్పించేందుకే నాసా ఇప్పుడు డార్ట్‌ను లాంఛ్ చేసింది. Asteroid Dimorphos: we're coming for you! Riding a @SpaceX Falcon 9 rocket, our #DARTMission blasted off at 1:21am EST (06:21 UTC), launching the world's first mission to test asteroid-deflecting technology. pic.twitter.com/FRj1hMyzgH — NASA (@NASA) November 24, 2021 గ్రహశకలాలు, ఉల్కలు.. ఎప్పటికైనా భూమికి ప్రమాదకరమైనవే. అంతరిక్షంలో వాటిని స్పేస్ క్రాఫ్ట్‌ల ద్వారా ఢీకొట్టే ఆలోచనే డార్ట్. డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్. నాసా ఆధ్వర్యంలో Double Asteroid Redirection Test missionను(DART) నవంబర్ 24న(ఇవాళ) ప్రయోగించారు. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కాలిఫోర్నియాలోని స్పేస్ స్టేషన్ నుంచి డార్ట్‌ను లాంఛ్ చేశారు. ఇందుకోసం ఎలన్ మస్క్ ప్రైవేట్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్‌ను ఉపయోగించారు. Launch of the @SpaceX Falcon 9 carrying the DART spacecraft - starting a nearly one-year journey to crash into a distant asteroid as a test! Keep checking back for more images! #DARTMission #PlanetaryDefense More: https://t.co/SNUSFf9Ukq pic.twitter.com/qJmffF2wIo — NASA HQ PHOTO (@nasahqphoto) November 24, 2021 సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాల్ని, ఉల్కలను నాశనం చేసేందుకు న్యూక్లియర్ వెపన్స్‌ను ఉపయోగిస్తుంటారు. అప్పుడు అవి ఆకాశంలోనే నాశనం అవుతాయి. ఒక్కోసారి అవి సముద్రంలో పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా ప్రాంతంలో పడి తక్కువ మోతాదులో డ్యామేజ్ చేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులకు వీలులేని గ్రహశకలాలు, ఉల్కల సంగతి ఏంటి?.. అవి గమనం మార్చుకోవాలనే ప్రార్థిస్తుంటారు అంతా. కానీ, వాటిని స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీ కొట్టించి నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA. డిడైమోస్(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్) ఆస్టరాయిడ్.. దాని చుట్టూరా తిరిగే డైమోర్ఫోస్(బుల్లి చందమామగా అభివర్ణిస్తుంటారు).. ఈ రెండింటిని నాశనం చేయడమే డార్ట్ మిషన్ లక్ష్యం. NASA's First Planetary Defense Mission 2022 లేదంటే 2023 మధ్యకల్లా పూర్తవ్వొచ్చని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇది గనుక సక్సెస్ అయితే భవిష్యత్తులో ప్రమాదకరమైన గ్రహశకలాలు, ఉల్కాపాతాల నుంచి భూమికి జరిగే డ్యామేజ్‌ను తప్పించొచ్చనేది నాసా ఆలోచన. అయితే asteroid deflection technology ద్వారా భూమిని కాపాడాలనే నాసా ప్రయత్నం గురించి పలువురికి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ టార్గెట్ రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే స్పేస్‌క్రాఫ్ట్ గురితప్పదని, గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాత అది నాశనం కాకపోయినా.. కనీసం గమనాన్నైనా మళ్లిస్తుందని నాసా సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. - సాక్షి, వెబ్‌స్పెషల్ -
ఆస్టరాయిడ్ ముప్పు.. నాసా స్కెచ్ వర్కవుట్ అయ్యేనా?
ఆస్టరాయిడ్ ఢీ కొడితే ఏం జరుగుతుంది?.. సర్వం నాశనం అవుతుంది. ఈ భూమ్మీద డైనోసార్ల అంతానికి కారణం ఇదేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవాళి ఎలాంటి విపత్తునైనా(సాధ్యాసాధ్యాలను పరిగణనలోకి తీసుకుని) ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. ఈ తరుణంలో భూమి వైపు దూసుకొస్తున్న ఓ భారీ గ్రహశకలాన్ని నాశనం చేసేందుకు నాసా అదిరిపోయే స్కెచ్ అమలు చేయబోతోంది. సాధారణంగా తక్కువ పరిమాణంలో ఉండే గ్రహశకలాల్ని నాశనం చేసేందుకు న్యూక్లియర్ వెపన్స్‌ను ఉపయోగిస్తుంటారు. అప్పుడు అవి ఆకాశంలోనే నాశనం అవుతాయి. ఒక్కోసారి అవి సముద్రంలో పడిపోతుంటాయి. లేదంటే ఏదైనా ప్రాంతంలో పడి తక్కువ మోతాదులో డ్యామేజ్ చేస్తుంటాయి. కానీ, ఈ పరిస్థితులకు వీలులేని ఆస్టరాయిడ్ల సంగతి ఏంటి?.. అవి గమనం మార్చుకోవాలనే ప్రార్థిస్తుంటారు అంతా. అయితే ఓ భారీ గ్రహశకలం ఇప్పుడు భూమి దిశగా దూసుకువస్తోంది. అందుకే స్పేస్‌క్రాఫ్ట్‌తో ఢీ కొట్టించి నాశనం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది అమెరికన్ స్పేస్ ఏజెన్సీ NASA. డిడైమోస్(నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్) చుట్టూరా తిరిగే డైమోర్ఫోస్(బుల్లి చందమామగా అభివర్ణిస్తుంటారు)ను నాశనం చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ మిషన్‌కు నాసా పెట్టిన పేరు డార్ట్(Double Asteroid Redirection Test mission). నవంబర్ 24న స్పేస్ఎక్స్ రాకెట్ ఫాల్కన్ 9 ద్వారా ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. తద్వారా ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను గ్రహశకలం మీదకు ప్రయోగించి నాశనం చేయాలన్నది నాసా ప్లాన్. NASA's First Planetary Defense Mission 2022 లేదంటే 2023 మధ్యకల్లా పూర్తవ్వొచ్చని నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. asteroid deflection technology ద్వారా భూమిని కాపాడాలనే నాసా ప్రయత్నం గురించి పలువురికి అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ స్పేస్ క్రాఫ్ట్ టార్గెట్ రీచ్ కాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే స్పేస్‌క్రాఫ్ట్ గురితప్పదని, గ్రహశకలాన్ని ఢీకొట్టిన తర్వాత అది నాశనం కాకపోయినా.. కనీసం గమనాన్నైనా మళ్లిస్తుందనేది నాసా సైంటిస్టులు చెబుతున్న మాట. ఈ ‘ఆస్టరాయిడ్ మూన్’ను స్పేస్వాచ్ ప్రాజెక్టులో భాగంగా 1996లో ఆరిజోనా యూనివర్సిటీకి చెందిన జోయ్ మోంటనీ మొదటగా గుర్తించారు. ☄️ #PlanetaryDefense at @NASA entails finding, tracking, and characterizing near-Earth #asteroids and objects. Here’s what we've found thus far. Our #DARTMission, launching this November, will also be our first test for planetary defense. Learn more at https://t.co/1wL4ifObpp pic.twitter.com/8JryeeWQjG — NASA Asteroid Watch (@AsteroidWatch) October 1, 2021 ఇది భూమిని కచ్చితంగా ఎప్పుడు ఢీ కొడుతుందో తెలియనప్పటికీ.. అది చేసే డ్యామేజ్ మాత్రం భారీ స్థాయిలో ఉంటుందనే సైంటిస్టులు భావిస్తున్నారు. అందుకే దాన్ని అంతరిక్షంలోనే నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఇక సౌర వ్యవస్థలో గ్రహ శకలాల వయసును 4.6 బిలియన్ సంవత్సరాలుగా భావిస్తుంటారు. మొత్తం 26 వేల ఆస్టరాయిడ్స్‌ను గుర్తించిన నాసా.. ఇందులో వెయ్యి గ్రహశకలాలను మాత్రం భూమికి ప్రమాదకరమైన వాటిగా ప్రకటించింది. ఇది చదవండి: ఎనిమిదేళ్లకే పరిశోధన.. రికార్డుల్లోకి ఎక్కిన బుల్లి సైంటిస్ట్ -
స్పేస్ఎక్స్: నలుగురు మనుషులు,కక్ష్యలో 3 రోజుల ప్రయాణం
అపరకుబేరుడు ఎలాన్ మస్క్ తన చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే పనిలో పడ్డారు. స్పెస్ ఎక్స్ తయారు చేసిన ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో 'ఇన్స్పిరేషన్4' పేరుతో నలుగురిని కక్ష్య(orbit)లోకి పంపనున్నారు. అలా కక్ష్యలోకి వెళ్లిన ఆ నలుగురు మూడురోజుల పాటు ప్రయాణించి తిరిగి భూమిపైకి రానుడంగా ఈ స్పేస్ ప్రయాణానికి సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 15నే ప్రయాణం యుఎస్ ఎయిర్ ఫోర్స్ స్కూల్ ఆఫ్ అడ్వాన్స్డ్ ఎయిర్ అండ్ స్పేస్ స్టడీస్ కు చెందిన స్ట్రాటజీ అండ్ సెక్యూరిటీ స్టడీస్ ప్రొఫెసర్ వెండి విట్మన్ కాబ్ ఆధ్వర్యంలో ఓ కాన్వర్జేషన్ జరుగుతుంది. ఈ కాన్వర్జేషన్ సందర్భంగా సెప్టెంబర్ 15న నలుగురు ప్రైవేట్ వ్యోమగాములు స్పేస్ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో ప్రైవేట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సాయంతో కక్ష్యలోకి వెళ్లేందుకు అంతరిక్ష ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారని అమెరికాకు చెందిన పైలెట్, షిప్ట్4 పేమెంట్ సంస్థ అధినేత ఐజాక్మన్ తెలిపారు. క్యాన్సర్ హాస్పిటల్ కోసమే ఐజాక్మన్ నేతృత్వంలో జరగనున్న అంతరిక్ష ప్రయాణంలో ఐజాక్మన్తో పాటు సియాన్ ప్రొక్టర్,హేలీ ఆర్సెనియాక్స్,క్రిస్టోఫర్ సెంబ్రోస్కీ లు ఈ ప్రాజెక్ట్‌లో పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం సెయింట్ జూడ్ చిల్డ్రన్స్ క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్ ఫండింగ్ కోసమేనని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్పేస్ టూరిజంలో భాగంగా 2021,జులై 20న దిగ్గజ సంస్థ ఆమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష ప్రయాణం చేసిన విషయం తెలిసిందే. స్పేస్‌క్రాఫ్ట్ ‘న్యూ షెఫర్డ్’ సాయంతో వ్యోమ నౌకలో జెఫ్ బెజోస్‌తో పాటు అతని సోదరుడు మార్క్ బెజోస్, 82 ఏళ్ల వాలీ ఫంక్, 18 ఏళ్ల ఫిజిక్స్ విద్యార్థి ఆలివర్ డెమెన్ కలిసి ప్రయాణించారు. ఈ నలుగురు భూమి నుంచి సుమారు 100 కి.మీ.ల ఎత్తున ఉన్న కార్మన్ లైన్‌కు ఆవలికి తీసుకువెళ్లి సరిగ్గా 10 నిమిషాల తరువాత తిరిగి భూమిపైకి వచ్చారు. పోటాపోటీ ఎలాన్ స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ సాయంతో నలుగురు కక్ష్యలోకి వెళ్లి 3 రోజుల పాటు ప్రయాణించి .. తిరిగి భూమిని చేరుకోవడం ఆసక్తికరంగా మారింది. చదవండి: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు కేంద్రం శుభవార్త -
విజయవంతమైన స్పేస్ ఎక్స్ ప్రయోగం
వాషింగ్టన్: హైక్వాలిటీ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ను అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తోన్న ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ స్టార్‌లింక్ మిషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్-9 రాకెట్‌తో 60 స్టార్‌లింక్ ఉపగ్రహాల కొత్త బ్యాచ్‌ను నిర్ణీత భూకక్ష్యలోకి ఆదివారం ప్రవేశపెట్టింది. స్పేస్ఎక్స్ తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 14న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ కాంప్లెక్స్ 39ఎ(ఎల్సి-39ఎ) నుంచి ఫాల్కన్ 9 రాకెట్ సహాయంతో 60 స్టార్‌లింక్ ఉపగ్రహాలను మోసుకెళ్లింది. 2019 మే 24న స్పేస్ఎక్స్ 'స్టార్‌లింక్ మిషన్'కు శ్రీకారం చుట్టింది. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా 60 శాటిలైట్లను అంతరిక్షంలోకి మోసుకెళ్లింది. జనవరి 21, 2021 నాటికి 1,035 శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపించింది. ప్రస్తుతం మరో 60 శాటిలైట్లను పంపింది. దశాబ్దకాలంలో దాదాపు 12 వేల శాటిలైట్లను స్పేస్‌లోకి పంపించనుంది. (చదవండి: ఒక్క రోజులోనే మస్క్ సంపద ఎంత పెరిగిందో తెలుసా?) Targeting Sunday, March 14 at 6:01 a.m. EDT for Falcon 9's next launch of 60 Starlink satellites. The first stage booster supporting this mission has completed eight flights to date https://t.co/bJFjLCzWdK pic.twitter.com/aTNacxYAiE — SpaceX (@SpaceX) March 13, 2021 Deployment of 60 Starlink satellites confirmed pic.twitter.com/AMLK4R9dMn — SpaceX (@SpaceX) March 14, 2021 -
ఎలోన్ మస్క్ 'స్పేస్ఎక్స్' సరికొత్త రికార్డ్!
ఎలోన్ మస్క్ కు చెందిన 'స్పేస్ఎక్స్' కంపెనీ మరో చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 'ఇస్రో' పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బ్రేక్ చేసి.. ఇప్పుడు స్పేస్ఎక్స్ సరికొత్త రికార్డును తన పేరున లిఖించుకుంది. ఎలోన్ మస్క్ యొక్క స్పేస్ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ విజయవంతంగా ఒకేసారి 143 ఉపగ్రహాలను అంతరిక్షకక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. దీంతో 2017 ఫిబ్రవరిలో 104 శాటిలైట్స్ ను ప్రవేశ పెట్టి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో పేరిట ఉన్న రికార్డ్ బద్దలైంది. ఇప్పడు అంతరిక్షంలోకి అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించే విషయంలో యుద్ధం మొదలైనట్లు అనిపిస్తుంది.(చదవండి: ఆకాశ్-ఎన్జీ క్షిపణి పరీక్ష విజయవంతం) అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని కేప్ కెనవరాల్ నుంచి ఈ ప్రయోగాన్ని స్పేస్ఎక్స్ చేపట్టింది. ఈ ప్రయోగం పేరు ట్రాన్స్పోర్టర్-1. ఈ ప్రయోగంలో భాగంగా ప్రైవేట్, ప్రభుత్వానికి చెందిన మొత్తం 143 ఉపగ్రహాలను 90 నిమిషాల్లో అంతరిక్షంలోకి ప్రవేశ పెట్టారు. ఈ ఉపగ్రహాలలో క్యూబ్‌శాట్స్, మైక్రోసాట్స్, 10 స్టార్‌లింక్ ఉపగ్రహాలు ఉన్నాయి. సుమారు 30 నిమిషాల లిఫ్ట్-ఆఫ్ తర్వాత ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడం జరిగింది. స్పేస్ఎక్స్ తన స్మాల్‌శాట్ రైడ్ షేర్ ప్రోగ్రాం కింద ఈ ప్రయోగాన్ని మొదటిసారిగా చేపట్టింది. ఈ ప్రయోగంలో భాగంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి 200కిలోగ్రాములకు లక్ష్య డాలర్ల రుసుము వసూలు చేసినట్లు సమాచారం. స్పేస్ఎక్స్ తక్కువ ధరకే ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తుంది. -
రాకెట్‌ని నిలబెట్టిన మన అమ్మాయి
భూమి నుంచి 408 కి.మీ. ఎత్తులో ఆకాశంలో అంతరిక్ష కేంద్రం ఉంది. అది ఆమెరికా వాళ్లది. రష్యా వాళ్లది. జపాన్ వాళ్లది, ఐరోపా వాళ్లది. కెనడా వాళ్లది. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు నిరంతరం పైన ప్రయోగాలు జరుపుతూ ఉంటారు. ప్రస్తుతం ఆ కేంద్రంలో ఏడుగురు అంతరిక్ష పరిశోధకులు ఉన్నారు.. నాసా నుంచి ఈ ఆదివారం వెళ్లిన డో హర్లీ, బాబ్ బెన్కెన్ లను కూడా కలుపుకుని. అయితే ఆ ఇద్దరిని ‘నాసా’ గానీ, మిగతా నాలుగు అంతరిక్ష సంస్థలు గానీ పైకి పంపలేదు. ‘స్పేస్ ఎక్స్’ అనే ఒక అమెరికన్ ప్రైవేటు సంస్థ పంపింది! అంతరిక్షయాన చరిత్రలోనే ఒక ప్రైవేటు సంస్థ ఇలా రోదసీలోకి మనుషుల్ని పంపడం ఇదే మొదటిసారి. వాళ్లను ‘క్రూ డ్రాగన్’ అనే వ్యోమనౌకలో పైన వదిలిపెట్టిన ‘ఫాల్కన్ 9’ రాకెట్ వెంటనే భూమి మీదికి తిరిగి వచ్చేసింది కూడా! టు అండ్ ఫ్రో.. రాకెట్ ప్రయాణం సక్సెస్. ఆ సక్సెస్‌లో కణిక అనే 24 ఏళ్ల భారతీయ విద్యార్థిని వాటా కూడా ఉంది! కణిక లక్నో అమ్మాయి. ప్రస్తుతం బోస్టన్లోని ఎం.ఐ.టి.లో మాస్టర్స్ డిగ్రీ చేస్తోంది. 2018లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విద్యార్థినిగా ఉన్నప్పుడు ‘స్పేస్ ఎక్స్’ లో ఇంటెర్న్‌గా పని చేసింది. భూమిపై నుంచి లేచేందుకు, తిరిగి భూమి మీద దిగేందుకు ఫాల్కన్ 9కు బలమైన కుదురు కాళ్లను (ల్యాండింగ్ లెగ్స్) డిజైన్ చేసిన ఆనాటì స్పేస్ ఎక్స్ బృందంలోని ఎనిమిది మందిలో కణికా గఖర్ కీలక సభ్యురాలు!(చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్) లక్నోలోని ఇందిరానగర్‌లో 86 ఏళ్ల వయసున్న కణిక బామ్మగారు రాజకుమారి ఇప్పుడు కణిక ఇండియా రాక కోసం చూస్తున్నారు. ‘ఆ రాకెట్‌ను డిజైన్ చేసింది నా మనుమరాలే’ అని ఇప్పటికే ఆ బామ్మ గారు తన ఆనందాన్ని తెలిసిన వారందరితోనూ పంచుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు. ‘స్పేస్ ఎక్స్’ తక్కువ సంస్థేమీ కాదు. ‘నాసా’కు యంగర్ వెర్షన్. అందులోనే మూడు నెలలు ఇంటెర్న్‌గా చేశారు కణిక. ఫాల్కన్ 9 ల్యాండింగ్ లెగ్స్ డిజైనింగ్‌లో ప్రధానమైన బాధ్యతలు ఆమెకే అప్పగించారు. మూడుసార్లు దరఖాస్తు చేసి, మూడుసార్లు ఇంటర్వ్యూకు వెళితేగానీ సాధించలేకపోయిన ఇంటెర్న్షిప్ అది. అందుకే పెద్ద బాధ్యత అని భయపడలేదు కణిక. టీమ్‌లో సీనియర్స్ ఉన్నారన్న తడబాటు లేకుండా టీమ్‌ని నడిపించారు. ఇంటెర్న్‌గా ఉన్నప్పుడు ‘స్పేస్ ఎక్స్’ యజమాని ఎలాన్ మస్క్‌తో, ఇప్పుడు అంతరిక్ష కేంద్రంలోకి వెళ్లిన ఇద్దరు వ్యోమగాములు డో హర్లీ, బాబ్ బెన్కెన్తో కూడా ఫాల్కన్ 9 డిజైనింగ్‌లోని మార్పు చేర్పుల గురించి తరచు మాట్లాడేవారు కణిక. ‘‘వాళ్లిచ్చే మోటివేషన్ ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటుందో చెప్పలేను’’ అని ఎం.ఐ.టి.లోని సహ విద్యార్థులతో అంటుంటారు కణిక. ఈ ఏడాది ఆగస్టులో ఆమె చదువు అయిపోతుంది. వెంటనే ఉద్యోగం. ఎక్కడో కాదు. తనకెంతో నచ్చిన ‘స్పేస్ఎక్స్’లోనే! పిల్లలందరికీ ఎగరాలనే ఆశ ఉంటుంది. కణిక కూడా ఐదేళ్లకే ఆకాశం వైపు చెయ్యి చూపించింది. ‘పెద్దయ్యాక ఏం అవుతావు?’ అని ప్రతి తల్లీ తండ్రి అడిగినట్లే నాన్న సందీప్, అమ్మ సిమీ అడిగినప్పుడు ‘రాకెట్లో రయ్‌న ఎగిరిపోతా’ అంది కణిక. అదిప్పుడు ఇంకోలా నెరవేరింది. రాకెట్‌ను రయ్‌న ఎగరనిస్తోంది! కణిMý, కణిక అక్క (ప్రస్తుతం ఫిలడెల్ఫియాలో డాక్టర్) యు.ఎస్. చదువుల కోసం తల్లిదండ్రులు బెంగళూరు నుంచి హ్యూస్టన్ వచ్చేశారు. పదవ తరగతి వరకు బెంగళూరులోనే చదివారు కణిక. తర్వాత సింగపూర్‌లో ఐ.బి.స్కూల్లో చేరారు. టెక్సాస్‌లోని ఎ అండ్ ఎం యూనివర్సిటీలో డిగ్రీ చేశారు. కణిక బామ్మగారు పెద్దగా చదువుకోలేదు. అయితే చదువు ఎంత ఉత్తేజకరంగా ఉంటుందో మనవరాలు ఎప్పటికప్పుడు తనకు పంపే వీడియోలలో చూస్తుంటారు. ‘‘ఆ చిన్న పిల్ల ఇంత పెద్దదయిందా..’ అని.. ఆకాశంలో ఎప్పుడైనా కనిపించే పెద్ద నక్షత్రాన్ని చూసి ఆశ్చర్యపోయే చిన్నపిల్లలా.. బుగ్గలు నొక్కుకుంటుంటారు బామ్మగారు. ఇప్పుడా పెద్ద నక్షత్రం బుగ్గలు పుణకడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. స్పేస్ ఎక్స్.. ఎలాన్ మస్క్ ‘స్పేస్ ఎక్స్’ అనేది అమెరికాలోని ప్రఖ్యాత ప్రైవేటు అంతరిక్షయాన, సాంకేతిక పరిజ్ఞాన సంస్థ. కాలిఫోర్నియాలోని హాథోర్న్‌లో ఉంది. ఆ సంస్థ అధిపతి ఎలాన్ మస్క్. ఏరోస్పేస్ టెక్నాలజీ అంతా ఇందులో అందుబాటులో ఉంటుంది. స్పేస్ ఎక్స్ వ్యోమనౌకల్ని తయారు చేస్తుంది. అంతరిక్షయానానికి ఏర్పాట్లు చేస్తుంది. అంగారకుడిలో మానవుల కోసం ఒక కాలనీ నిర్మించేందుకు, అక్కడికి భూగోళం నుంచి మనుషుల్ని తీసుకెళ్లేందుకు ఏళ్లుగా స్పేస్ ఎక్స్ ప్రయోగాలు చేస్తోంది. ‘నాసా’ వంటి సంస్థే తన వ్యోమగాముల్ని రోదసీలోకి పంపేందుకు స్పేస్ ఎక్స్ సహకారం తీసుకుందంటే ఎలాన్ మస్క్ ఏ స్థాయి అంతరిక్ష పారిశ్రామికవేత్తో స్పష్టం అవుతోంది. 48 ఏళ్ల ఎలాన్ మస్క్ పద్దెనిమిదేళ్ల క్రితం ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. అంటే తన ముప్పై ఏళ్ల వయసులో! అతడికి మూడు దేశాల పౌరసత్వం ఉంది. (దక్షిణాఫ్రికా, కెనడా, అమెరికా). టెస్లా కార్ల తయారీ కంపెనీ అతడిదే. ఇంకా రాబడినిచ్చే అనేక వాణిజ్య సంస్థలు, వ్యాపకాలు ఉన్నాయి. ఆరుగురు పిల్లలు. మొదటి భార్య రచయిత్రి. రెండో భార్య బ్రిటిష్ నటి. ఇద్దరికీ విడాకులిచ్చాడు. ప్రస్తుతం గ్రైమ్స్ అనే కెనడా గాయనితో కలిసి ఉంటున్నాడు. గ్రైమ్స్కి మే 4న మగ బిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకు అంకెలు, ఆల్ఫాబెట్స్ కలిపి ‘ఎక్స్ యాష్ ఎ ట్వెల్’ అని ఎలాన్ పేరు పెట్టుకున్నాడు. -
చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్
వాషింగ్టన్: అంతరిక్షయానంలో మరో కొత్త అధ్యాయానికి తెరలేచింది. ప్రైవేటు కంపెనీ స్పేస్ ఎక్స్ నిర్మించిన వ్యోమనౌక తొలిసారి రోదసిలోకి వెళ్లింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.22 గంటలకు లాంచ్ ప్యాడ్ 39ఏ నుంచి క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను మోసుకెళ్లిన ఫాల్కన్ రాకెట్9 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. అమెరికాకు చెందిన వ్యోమగాములు బాబ్ బెహంకన్ (49), డో హార్లీ (53)లను తీసుకొని ఈ రాకెట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) బయల్దేరింది. నింగిలోకిదూసుకెళ్లిన 19గంటల తర్వాత ఐఎస్ఎస్కు చేరుకుంది. నలుపు తెలుపు రంగుల్లో బుల్లెట్ ఆకారంలో ఉన్న డ్రాగన్ కాప్సూ్యల్ నింగికి ఎగరడానికి ముందు ‘లెట్స్ లైట్ దిస్ క్యాండిల్’అంటూ వ్యోమగామి హార్లీ ఉద్నిగ్నంగా అరిచి చెప్పారు. ఇప్పటికే ఐఎస్ఎస్లో ఉన్న వ్యోమగాములతో వీరూ పనిచేస్తారు. ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్లో జరిగిన ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని అధ్యక్షుడు ట్రంప్ నేరుగా వీక్షించారు. స్పేస్ ఎక్స్ సీఈవో ఎలన్ మస్క్‌తో ట్రంప్ ముచ్చటించారు. ఆయనని ఒక మేధావి అంటూ ప్రశంసించారు. ఒక ప్రైవేటు సంస్థ వ్యోమగాముల్ని తీసుకొని రోదసి యాత్ర చేయడం ఇదే తొలిసారి. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా ప్రభుత్వాలు మాత్రమే ఈ ఘనత సాధించాయి. అగ్రరాజ్యానికి ఊరట కరోనా వైరస్ విజృంభణతో లక్ష మందికిపైగా మరణించడం, ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై కోట్లాదిమంది ఉద్యోగాలు కోల్పోయిన తరుణంలో స్పేస్ ఎక్స్ సాధించిన విజయం అగ్రరాజ్యానికి బాగా ఊరటనిచ్చింది. వాస్తవానికి బుధవారమే ఈ ప్రయోగం జరగాల్సి ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితులు అనుకూలించక వాయిదా పడింది. 2011 తర్వాత మానవసహిత అంతరిక్ష ప్రయాణాలు అమెరికా నేల మీద నుంచి జరగలేదు. చంద్రుడు, అంగారకుడిపైకి మనుషుల్ని పంపే ప్రయోగాలపైనే నాసా దృష్టి సారించింది. రష్యాకు చెందిన సూయజ్ అంతరిక్ష నౌకలో అమెరికా వ్యోమగాముల్ని రోదసిలోకి పంపిస్తోంది. ఇంచుమించుగా దశాబ్దం తర్వాత అమెరికా గడ్డ మీద నుంచి ఒక ప్రైవేటు సంస్థ రోదసిలోకి మనుషుల్ని పంపడంతో అమెరికా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నట్టయింది. స్పేస్ ఎక్స్.. అంగారక గ్రహంపై నివసించడానికి వీలుగా కాలనీలు నిర్మించాలని, అంతరిక్ష ప్రయాణానికయ్యే వ్యయ భారాన్ని తగ్గించాలన్న లక్ష్యంతో స్పేస్ ఎక్స్ సంస్థ ప్రారంభమైంది. అమెరికాకు చెందిన బిలియనీర్ ఎలన్ మస్క్ 2002లో కాలిఫోర్నియాలో ఈ సంస్థను ప్రారంభించారు. అప్పట్నుంచి వ్యోమనౌకల తయారీ పనులు, ఇతర అంతరిక్ష పరిశోధనల్లో ఈ సంస్థ నిమగ్నమైంది. 2011 తర్వాత ఐఎస్ఎస్ కేంద్రానికి సరకు రవాణా చేసిన అనుభవం కూడా ఉంది. ప్రయోగ బృందంలో భారతీయుడు ఈ మధ్య కాలంలో చరిత్ర సృష్టించే అన్ని ప్రయోగాల్లోనూ భారత్ భాగస్వామ్యం ఏదో విధంగా ఉంటోంది. అలాగే స్సేస్ ఎక్స్ డెమో–2 ప్రయోగంలోనూ భారత ఇంజనీర్ ఒకరు ఉండడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పేస్ క్రూ ఆపరేషన్స్ అండ్ రీసోర్సెస్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బాల రామమూర్తి ఈ ప్రయోగం సమయంలో కెన్నడీ లాంచ్ కంట్రోల్ సెంటర్ ఫైరింగ్ రూమ్ 4లో విధులు నిర్వర్తించారు. చెన్నైకి చెందిన రామమూర్తి అన్నా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశారు. తొమ్మిదేళ్లుగా ఆయన స్పేస్ ఎక్స్‌లో పనిచేస్తున్నారు. ఇవాళ అద్భుతమైన రోజు. దేశం సంక్లిష్టపరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ స్పేస్ ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం ఎందరికో స్ఫూర్తినిస్తోంది. అందుకే నేను స్వయంగా దీనిని వీక్షించడానికి వచ్చాను. నాసాకు, ఎలన్ మస్క్‌కు అభినందనలు. డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు పట్టరాని భావోద్వేగంతో నోట మాట రావడం లేదు. నేను కన్న కలలు, స్పేస్ ఎక్స్‌లో ప్రతీ ఒక్కరి కల నిజమైన రోజు. స్పేస్ ఎక్స్ బృందం చేసిన కృషితో అత్యుత్తమ ఫలితాన్ని సాధించింది. నాసా, ఇతర భాగస్వాముల సహకారంతో ఇది సాధ్యమైంది. ఎలన్ మస్క్, స్పేస్ ఎక్స్ సీఈవో నింగిలోకి దూసుకెళ్తున్న ఫాల్కన్ రాకెట్ -
చరిత్ర సృష్టించిన ‘స్పేస్ఎక్స్’
కాలిఫోర్నియా: అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్ఎక్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఒకేసారి 60 ఉపగ్రహాలను నింగిలోకి ప్రయోగించింది. ఫాల్కన్–9 అనే రాకెట్ ద్వారా ఈ ప్రయోగం చేపట్టారు. ఫ్లోరిడాలోని కేప్ కనరవల్ నుంచి 60 ఉపగ్రహాలను ప్రయోగించారు. ఈ శాటిలైట్స్ ద్వారా ఇక నుంచి హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందనున్నాయి. స్టార్‌లింక్ నెట్‌వర్క్‌లో భాగంగా సుమారు 12వేల స్పేస్‌క్రాఫ్ట్‌లను నింగిలోకి పంపాలని ఎలన్ మస్క్ కంపెనీ భావిస్తోంది. ఇంటర్నెట్ సేవల కోసం స్పేస్ఎక్స్ సంస్థ ప్రైవేటుగా శాటిలైట్లను ప్రయోగిస్తుంది. -
అది ఉత్తర కొరియా న్యూక్లియర్ ఏలియన్..!
-
ఉత్తరకొరియా న్యూక్లియర్ ఏలియన్..!
లాస్ ఏంజెల్స్ : సమయం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలు కావొస్తోంది. అమెరికాలో అత్యంత ధనిక నగరం లాస్ ఏంజెల్స్ క్రిస్మస్ షాపింగ్ హడావుడిలో ఉంది. ఇంతలో పసిఫిక్ మహా సముద్రం మీదుగా వచ్చిన ఓ వెలుగు నగరప్రజలను సంభ్రమశ్చార్యాలకు గురి చేసింది. ఆకాశంలో చిన్న దీపంలా మొదలై భారీగా ఆకారంలోకి మారి విశ్వంలోకి దూసుకువెళ్తున్నది ఏంటో తెలీక అందరూ అయోమయంలో పడిపోయారు. పలువురు ఆ దృశ్యాన్ని తమ మొబైళ్లలో బంధించి ఏలియన్లు భూమి మీదకు వచ్చేశాయా? అంటూ సోషల్‌మీడియలో పోస్టులు చేయడం ప్రారంభించారు. అలా పోస్టులు చేసిన వారిలో స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. అది ఉత్తరకొరియాకు చెందిన న్యూక్లియర్ ఏలియన్ అంటూ మస్క్ ట్విట్టర్లో పోస్టు చేశారు. స్పేస్ ఎక్స్ కంపెనీ తన ప్రముఖ రాకెట్ లాంచర్ ఫాల్కన్-9తో మరోమారు ప్రయోగం చేసింది. దాని వెలుగే ఆకాశంలో చిన్న దీపంలా మొదలై భారీ స్థాయికి చేరి నగరవాసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఉత్తరకొరియా న్యూక్లియర్ ఏలియన్..! -
స్పేస్ఎక్స్ ప్రయోగంలో భారీ పేలుడు
-
స్పేస్ఎక్స్ ప్రయోగంలో భారీ పేలుడు
ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న నాసా ప్రయోగ కేంద్రం సమీపంలో స్పెస్ఎక్స్ లాంచింగ్ సందర్భంగా పెద్ద పేలుడు కలకలం సృష్టించింది. రొటీన్ రాకెట్ ప్రయోగం సందర్భంగా.. ఉదయం 9 గంటల సమయంలో మానవరహిత స్పేస్ ఎక్స్‌ను పరీక్షిం చేందుకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నాసా వెల్లడించింది. కెన్నెడీ అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రం పక్కనే ఉన్న కేప్ కార్నివాల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో జరిగిన ఈ పేలుడుతో కొన్ని మైళ్ల దూరం వరకున్న భవనాల్లో అద్దాలు పగిలిపోయాయి. కాగా, మొదటి పేలుడు జరిగిన కాసేపటికే మరో రెండుసార్లు పేలుళ్లు జరిగాయంటున్నా.. పూర్తి వివరాలింకా వెల్లడికాలేదు. -
తిరిగొచ్చిన రాకెట్!
* విజయవంతంగా ల్యాండ్ అయిన ‘ఫాల్కన్ 9’ * అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఓ ప్రైవేటు కంపెనీ అద్భుతం * 11 శాటిలైట్స్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి తిరుగుబాట మియామీ(యూఎస్): రాకెట్లు ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడతాయి.. కానీ అవి తిరిగి రావని ఇప్పటి వరకుతెలుసు. అయితే ఇక విమానాల్లాగే రాకెట్లూ మళ్లీ తిరిగొస్తాయి.. వాటిని మళ్లీ వాడుకోవచ్చు కూడా. అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లిన ‘ఫాల్కన్ 9’ అనే రాకెట్ విజయవంతంగా భూమిపైకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్ప్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కంపెనీ(స్పేస్-ఎక్స్)అనే ప్రైవేట్ సంస్థ దీన్ని రూపొందించింది. ఎన్నో విఫల యత్నాల తర్వాత భూమిపై ఫాల్కన్ నేరుగా ల్యాండ్ అయినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రాకెట్ మొదటి దశ ఫ్లోరిడాలోని కేప్‌కెనవరల్ వద్ద సోమవారం నేలపై దిగినట్లు పేర్కొన్నారు. ఆర్బ్‌కాం కంపెనీకి చెందిన 11 కృత్రిమ ఉపగ్రహాలను ఫాల్కన్ భూ సమీప కక్ష్యలో ప్రవేశపెట్టిందన్నారు. ‘నింగిలోకి దూసుకెళ్లిన 10 నిమిషాల్లోనే రాకెట్ మొదటి దశ నేలపై ల్యాండ్ అయింది’ అని స్పేస్-ఎక్స్ పేర్కొంది. స్పేస్-ఎక్స్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అభినందించింది. కృత్రిమ ఉపగ్రహాలను (పేలోడ్) అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రతిసారి కొన్ని వేల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయి. ఎంతో విలువైన రాకెట్ సామగ్రి కూడా నాశనం అవుతోంది. ఇప్పుడు స్పేస్-ఎక్స్ చేపట్టిన ప్రయోగంతో రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అమెజాన్ కంపెనీకి చెందిన బ్లూ ఆరిజిన్ అనే రాకెట్ల తయారీ కంపెనీ ఈ ఏడాది నవంబర్‌లో ఈ తరహా ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. అయితే ఈ ప్రయోగంలో నేరుగా భూమిపై ల్యాండ్ కాకుండా పారాచూట్ సహయంతో నేలపైకి వచ్చింది.