పరిశోధనల కోసం రాకెట్లను, శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంఛ్ చేయడం సహజం. కానీ, ఇక్కడో రాకెట్ చంద్రుడ్ని ఢీ కొట్టే దూసుకెళ్తుండగా.. స్పేస్ ఏజెన్సీలన్నీ ఆసక్తిగా పరిశీలించబోతున్నాయి. అందుకు కారణాలు.. ఆ రాకెట్ ఎప్పుడో ఏడేళ్ల కిందట ప్రయోగించింది కావడం, ఇన్నాళ్లు స్పేస్‌లో కక్క్ష్య తప్పి అస్తవ్యస్తంగా సంచరించి ఇప్పుడు చంద్రుడి వైపు దూసుకెళ్లడం!.
స్పేస్‌ఎక్స్ కంపెనీ ద్వారా ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించడానికి ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. మొదటి దశలో విజయవంతమైనప్పటికీ.. రెండో దశలో ఈ ప్రయోగం ప్లాప్ అయ్యింది. అయితే ఫాల్కన్ 9 బూస్టర్ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్క్ష్యను అనుసరించింది. దీంతో అదుపు తప్పి జాడ లేకుండా పోవడంతో స్పేస్ జంక్‌గా దాదాపు ఒక నిర్ధారణకు వచ్చేశారు సైంటిస్టులు.
ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆశ్చర్యకరరీతిలో ఈ రాకెట్ ట్రాక్ ఎక్కగా.. చంద్రుడి మీదకు క్రాష్ దిశగా దూసుకెళ్తుంది. నాసా అంచనాల ప్రకారం.. మార్చ్ 4వ తేదీన ఈ క్రాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మిలియన్ మైళ్ల ట్రెక్‌లో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహాన్ని పంపడం ద్వారా తన మొదటి డీప్-స్పేస్ మిషన్‌ను ప్రారంభించినప్పటికీ.. ఫాల్కన్ 9 బూస్టర్ కొంత అస్తవ్యస్తమైన కక్ష్యలో తిరుగాడింది. దీంతో ఈ రాకెట్ సంగతి పట్టించుకోవడం మానేశారు!.
అయితే ఇన్నేళ్లకు ఇది చంద్రుడి వైపు కక్క్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. సుమారు 4వేల కేజీల బరువున్న పాల్కన్ 9 బూస్టర్ రాకెట్.. ప్రస్తుతం గంటకు 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు పయనిస్తోంది.
నాసా లునార్ ఆర్బిటర్(Lunar Reconnaissance Orbit)తో పాటు భారత్ చంద్రయాన్-2 స్పేస్‌క్రాఫ్ట్‌లు ఈ క్రాష్ ల్యాండ్‌ను అతి సమీపంగా గమనించనున్నాయి. అసలు ఈ క్రాష్ ల్యాండ్‌తో ఒరిగేది ఏముంటుందనే అనుమానం రావొచ్చు. చంద్రుడి ఉపరితలం మీది పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ఈ క్రాష్‌ల్యాండ్‌ను పరిశీలించనున్నారు. 2009లో నాసా కావాలనే ఒక రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ లాంఛ్ చేసింది. అయితే పాల్కన్ విషయంలో అనుకోకుండా చంద్రుడి ఉపరితలంపైకి ఢీ కొడుతుండడం విశేషం. ఇది చంద్రుడ్ని ఢీ కొట్టడం ద్వారా జరిగే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని స్పేస్ రీసెర్చర్లు భావిస్తున్నారు.
క్లిక్ చేయండి: 5జీతో విమానాలకు ముప్పు పొంచి ఉందా? నిపుణుల మాటేంటంటే..
Comments
Please login to add a commentAdd a comment