seven years
-
ఇరాన్లో మహిళా జర్నలిస్టులకు ఏడేళ్ల జైలు
దుబాయ్: ఇద్దరు మహిళా జర్నలిస్టులకు ఇరాన్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. గతేడాది ఇరానీ మహిళ మహసా అమినీ కస్టడీ మరణం పెను సంచలనం సృష్టించడం, దాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగడం తెలిసిందే. ఆ కస్టడీ మరణంపై రిపోరి్టంగ్ చేసినందుకు సదరు మహిళా జర్నలిస్టులు ఆలాహే మొహమ్మది (36), నిలోఫర్ హమెదీ (31)లను దోషులుగా న్యాయ శాఖ నిర్ధారించింది. అలాహేకు ఆరు సంవత్సరాలు, హమెదీకి ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. వారిద్దరూ 2022 సెపె్టంబర్ నుంచీ టెహ్రాన్‌లోని ఎవిన్ జైలులో మగ్గిపోతున్నారు. గత మే నెలలో వారిపై విచారణ మొదలైంది. తాజా తీర్పుపై వారు అప్పీల్‌కు వెళ్లేందుకు అవకాశం కలి్పంచామని న్యాయ శాఖ పేర్కొంది. -
ఆ ఒక్క నిర్ణయంతో రూ.2800 కోట్ల ఆదాయం - కేవలం ఏడేళ్లలో..
ఇండియన్ రైల్వే దినదినాభివృది చెందుతున్న విషయం తెలిసిందే.. ఇందులో భాగంగానే కొత్త ట్రైన్లు ప్రారంభించడమే కాకుండా కొత్త కొత్త సర్వీసులను కూడా అందిస్తోంది. అయితే ఇటీవల రైల్వే ఆదాయానికి సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. భారతీయ రైల్వే గత ఏడు సంవత్సరాలలో పిల్లల టికెట్లు (చైల్డ్ ట్రావెలర్స్) విక్రయించి ఏకంగా రూ. 2800 కోట్లకు పైగా ఆదాయాన్ని పొందినట్లు తెలుస్తోంది. 2022 - 23 ఆర్థిక సంవత్సరంలో మాత్రమే రూ. 560 కోట్లు ఆర్జించినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) వెల్లడించింది. ట్రైన్లో 5 సంవత్సరాల కంటే ఎక్కువ, 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్త్‌లు లేదా రిజర్వ్ కోచ్‌లో సీట్లు ఎంచుకోవచ్చు. అలాంటి వారు సాధారణ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నియమం 2016 ఏప్రిల్ 21 నుంచి అమలులోకి వచ్చింది. అంతకు ముందు రైల్వేలో 5 నుంచి 12 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకు ప్రత్యేక బెర్తులు అందించే వారు. ఆ సమయంలో సగం చార్జీలే వసూలు చేసేవారు. ఈ నియమాలు సవరించిన తరువాత రైల్వే మరింత లాభాలను ఆర్జించడం మొదలుపెట్టింది. ఇదీ చదవండి: బైజూస్ కొత్త సీఈఓగా అర్జున్ మోహన్ - ఇతని బ్యాగ్రౌండ్ ఏంటంటే? 2016 - 17 ఆర్థిక సంవత్సరం నుంచి 2022 - 23 ఆర్థిక సంవత్సరం వరకు దాదాపు 3.6 కోట్లమంది పిల్లలు రిజర్వ్డ్ సీటు లేదా కోచ్ ఎంచుకోకుండా సగం చార్జీల మీద ప్రయాణిస్తే.. 10 కోట్లమంది పిల్లలు ప్రత్యేక బెర్త్/సీటును ఎంచుకుని పూర్తి చార్జీలు చెల్లించినట్లు తెలిసింది. మొత్తం మీద సుమారు 70 శాతం మంది పూర్తి చార్జీలు చెల్లించి బెర్త్ పొందటానికి ఇష్టపడుతున్నట్లు చంద్ర శేఖర్ గౌర్ తెలిపారు. -
జాబిలి వైపు రాకెట్.. లాంఛ్ కాదు ఢీ కొట్టడానికి!
పరిశోధనల కోసం రాకెట్లను, శాటిలైట్లను అంతరిక్షంలోకి లాంఛ్ చేయడం సహజం. కానీ, ఇక్కడో రాకెట్ చంద్రుడ్ని ఢీ కొట్టే దూసుకెళ్తుండగా.. స్పేస్ ఏజెన్సీలన్నీ ఆసక్తిగా పరిశీలించబోతున్నాయి. అందుకు కారణాలు.. ఆ రాకెట్ ఎప్పుడో ఏడేళ్ల కిందట ప్రయోగించింది కావడం, ఇన్నాళ్లు స్పేస్‌లో కక్క్ష్య తప్పి అస్తవ్యస్తంగా సంచరించి ఇప్పుడు చంద్రుడి వైపు దూసుకెళ్లడం!. స్పేస్ఎక్స్ కంపెనీ ద్వారా ఫాల్కన్ 9 బూస్టర్ రాకెట్‌ను 2015 ఫిబ్రవరిలో అంతరిక్షంలోకి పంపించిన విషయం తెలిసిందే. అంతరిక్షంలోని లోతైన పరిస్థితుల్ని పరిశీలించడానికి ఈ రాకెట్‌ను ఫ్లోరిడా నుంచి ప్రయోగించారు. మొదటి దశలో విజయవంతమైనప్పటికీ.. రెండో దశలో ఈ ప్రయోగం ప్లాప్ అయ్యింది. అయితే ఫాల్కన్ 9 బూస్టర్ అప్పటి నుంచి అస్తవ్యస్తమైన కక్క్ష్యను అనుసరించింది. దీంతో అదుపు తప్పి జాడ లేకుండా పోవడంతో స్పేస్ జంక్‌గా దాదాపు ఒక నిర్ధారణకు వచ్చేశారు సైంటిస్టులు. ఇప్పుడు ఏడేళ్ల తర్వాత ఇప్పుడు ఆశ్చర్యకరరీతిలో ఈ రాకెట్ ట్రాక్ ఎక్కగా.. చంద్రుడి మీదకు క్రాష్ దిశగా దూసుకెళ్తుంది. నాసా అంచనాల ప్రకారం.. మార్చ్ 4వ తేదీన ఈ క్రాష్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి మిలియన్ మైళ్ల ట్రెక్‌లో అంతరిక్ష వాతావరణ ఉపగ్రహాన్ని పంపడం ద్వారా తన మొదటి డీప్-స్పేస్ మిషన్‌ను ప్రారంభించినప్పటికీ.. ఫాల్కన్ 9 బూస్టర్ కొంత అస్తవ్యస్తమైన కక్ష్యలో తిరుగాడింది. దీంతో ఈ రాకెట్ సంగతి పట్టించుకోవడం మానేశారు!. అయితే ఇన్నేళ్లకు ఇది చంద్రుడి వైపు కక్క్ష్యను మార్చుకుని దూసుకెళ్తోంది. సుమారు 4వేల కేజీల బరువున్న పాల్కన్ 9 బూస్టర్ రాకెట్.. ప్రస్తుతం గంటకు 9,000 కిలోమీటర్ల వేగంతో చంద్రుడి వైపు పయనిస్తోంది. నాసా లునార్ ఆర్బిటర్(Lunar Reconnaissance Orbit)తో పాటు భారత్ చంద్రయాన్-2 స్పేస్‌క్రాఫ్ట్‌లు ఈ క్రాష్ ల్యాండ్‌ను అతి సమీపంగా గమనించనున్నాయి. అసలు ఈ క్రాష్ ల్యాండ్‌తో ఒరిగేది ఏముంటుందనే అనుమానం రావొచ్చు. చంద్రుడి ఉపరితలం మీది పరిస్థితులను మరింత లోతుగా అధ్యయనం చేయడం కోసం ఈ క్రాష్‌ల్యాండ్‌ను పరిశీలించనున్నారు. 2009లో నాసా కావాలనే ఒక రాకెట్‌ను చంద్రుడి మీదకు క్రాష్ లాంఛ్ చేసింది. అయితే పాల్కన్ విషయంలో అనుకోకుండా చంద్రుడి ఉపరితలంపైకి ఢీ కొడుతుండడం విశేషం. ఇది చంద్రుడ్ని ఢీ కొట్టడం ద్వారా జరిగే ప్రభావం అంతగా ఉండకపోవచ్చని స్పేస్ రీసెర్చర్లు భావిస్తున్నారు. క్లిక్ చేయండి: 5జీతో విమానాలకు ముప్పు పొంచి ఉందా? నిపుణుల మాటేంటంటే.. -
Andhra Pradesh: ఏడేళ్లు.. 10 వరదలు.. 6 తుపానులు
సాక్షి, అమరావతి: వరుస విపత్తులతో ఆంధ్రప్రదేశ్ వణుకుతోంది. తుపానులు, వరదలు, కరువు తరచూ ప్రజలకు కడగండ్లు మిగుల్చుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి ఇప్పటివరకు పదిసార్లు వరదలు ముంచెత్తి రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని కలిగించాయి. ఆరుసార్లు తుపానులు విరుచుకుపడ్డాయి. అల్పపీడనాలు, వాయుగుండాలు ఏటా మూడు, నాలుగుసార్లు పలకరించి నష్టాన్ని కలిగిస్తూనే ఉన్నాయి. చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో ప్రస్తుత వరదలు బీభత్సం సృష్టించాయి. 2015 నవంబర్లోనూ ఇప్పటి మాదిరిగానే చిత్తూరు, వైఎస్సార్, నెల్లూరు జిల్లాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అయ్యాయి. నవంబర్ 9 నుంచి 23 వరకు నెల్లూరు జిల్లా బలయపల్లెలో 100.5 సెంటీమీటర్లు, వైఎస్సార్ జిల్లా కోడూరులో 99.9, చిత్తూరు జిల్లా ఏర్పేడులో 87.5 సెంటీమీటర్ల వర్షం పడడంతో వరదలు ముంచెత్తాయి. ఆ వరదల్లో 81 మంది మృత్యువాతపడ్డారు. 2014లో వచ్చిన హుద్‌హుద్ తుపాను ఉత్తరాంధ్రలో పెను బీభత్సం సృష్టించింది. 2014 నుంచి 2018 వరకు వరుస కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. 2018లో భారీ వర్షాలు, రెండు తుపాన్లు, ఖరీఫ్–రబీ సీజన్లలో కరువు విరుచుకుపడ్డాయి. వీటిని ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు ప్రణాళికలు మార్చుకుంటున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. ముప్పు ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఏపీకి రెండో స్థానం దేశంలో ప్రకృతి వైపరీత్యాల ముప్పు ఎక్కువగా ఉన్న మూడు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని కౌన్సిల్ ఆఫ్ ఎనర్జీ (ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్) అధ్యయనం తేల్చింది. వరదలు, తుపానుల తీవ్రత ఏపీలో ఎక్కువని, విపత్తుల తీవ్రత అసాధారణంగా ఉన్న దేశంలోని ఐదు జిల్లాల్లో విజయనగరం ఒకటని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాలు తరచూ విపత్తుల బారిన పడుతున్నాయని పేర్కొంది. 2005 నుంచి దేశంలో విపత్తుల తీవ్రత 200 శాతం పెరిగిందని, వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌తోపాటు ఆ జిల్లాల్లోని భౌగోళిక పరిస్థితుల్లో మార్పులే దీనికి కారణమని వివరించింది. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ ఫలితం రాష్ట్రానికి అనేక శతాబ్దాల నుంచి తుపానుల ముప్పు వుంది. కానీ.. కొన్నేళ్లుగా సముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్ దీనికి కారణం. దీనివల్ల తుపానుల ఉధృతి ఎక్కువగా ఉంటోంది. మరోవైపు వర్షం కురిసే రోజులు తగ్గిపోతున్నాయి. 30 రోజులు కురవాల్సిన వర్షాలు పది రోజుల్లోనే కురుస్తున్నాయి. దీనివల్ల వరదలు వస్తున్నాయి. ఎక్కువ రోజులు వర్షం పడకపోవడం (డ్రై స్పెల్స్) వల్ల కరువు వస్తోంది. రాష్ట్రంలో గత పదేళ్లుగా వర్షం కురిసే రోజులు తగ్గి డ్రై స్పెల్స్ పెరిగాయి. అందుకే కరువు వస్తోంది. వేడి గాలుల తీవ్రత పెరిగింది. మారుతున్న వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణం. – డీవీ భాస్కరరావు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఆంధ్రా యూనివర్సిటీ మెటిరియలాజికల్ విభాగం -
Narendra Modi: దేశం గర్వించదగిన క్షణాలెన్నో!
న్యూఢిల్లీ: ఏడేళ్ల పాలనలో దేశం గర్వించదగిన ఎన్నో విజయాలు సాధించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన 2014 నుంచి దేశం గర్వించే ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయన్నారు. ఈ ఏడేళ్లలో విజయాలతో పాటు పలు సవాళ్లను కూడా ఎదుర్కొన్నామని వివరించారు. వాటిలో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న కరోనా సంక్షోభం అత్యంత తీవ్రమైనదన్నారు. మాసాంతపు రేడియో ప్రసంగం ‘మన్ కీ బాత్’లో ఆదివారం ఈ విషయాలను ప్రధాని దేశ ప్రజలతో పంచుకున్నారు. దేశ భద్రతతో పాటు పలు ఇతర రంగాలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కరోనా కారణంగా వేలాది ప్రజల ప్రాణాలను కోల్పోయామని, ఆర్థిక వ్యవస్థను ఈ సంక్షోభం భారీగా దెబ్బతీసిందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రాణాంతక వైరస్‌పై కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడు సంవత్సరాలు సమిష్టిగా, జనులందరి అభివృద్ధి లక్ష్యంగా, అందరి విశ్వాసాన్ని చూరగొంటూ పాలన సాగించామన్నారు. ‘సబ్ కాసాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ తాము పాటించే మంత్రమన్నారు. ఇతర దేశాల ఒత్తిడి మేరకు కాకుండా.. స్వీయ ప్రయోజనాలు లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మనకు వ్యతిరేకంగా కుట్రలు చేసినవారికి తగిన బుద్ధి చెప్పామని గుర్తు చేశారు. ‘దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో రాజీ పడనప్పుడు, మన భద్రతా బలగాల శక్తి సామర్థ్యాలు పెరిగినప్పుడు.. సరైన మార్గంలోనే వెళ్తున్నాం అనిపిస్తూ ఉంటుంది’ అన్నారు. దశాబ్దాల సమస్యలకు పరిష్కారం దశాబ్దాల తరబడి సాగుతున్న సమస్యలను కూడా శాంతియుతంగా పరిష్కరించగలిగామన్నారు. ఈ ఏడేళ్ల పాలనలో ఈశాన్యం నుంచి కశ్మీరం దాకా ప్రజల్లో శాంతి, పురోగతితో కూడిన విశ్వాసాన్ని పెంపొందించగలిగామన్నారు. స్వాతంత్య్రం తరువాత ఏడు దశాబ్దాల్లో కేవలం 3.5 కోట్ల గ్రామీణ నివాసాలకు మాత్రమే తాగునీటి కనెక్షన్లు అందించగలిగారని, తాము గత 21 నెలల్లోనే 4.5 కోట్ల ఇళ్లకు సురక్షిత తాగునీటి సదుపాయం కల్పించగలిగామని తెలిపారు. ఆ 21 నెలల్లో 15 నెలలు ఒకవైపు కరోనాతో పోరాడుతూ మరోవైపు ఈ కార్యక్రమం చేపట్టామని గుర్తు చేశారు. రికార్డుస్థాయిలో గ్రామాలకు విద్య, వైద్యం, రహదారి, విద్యుత్, బ్యాంకింగ్ సౌకర్యాలు కల్పించామని వివరించారు. ఈ సదుపాయాలు పొందిన ఎంతోమంది ప్రజలు ఆ వివరాలు తెలుపుతూ సందేశం పంపించారని తెలిపారు. ప్రభుత్వ పథకం కింది గృహ నిర్మాణం చేసుకున్న లబ్ధిదారులు గృహ ప్రవేశాలకు తనను ఆహ్వానించారన్నారు. డిజిటల్ లావాదేవీల విషయంలో ప్రపంచదేశాలకు దిక్సూచిగా నిలిచామన్నారు. మరోవైపు, 2014 నుంచి ఎన్నో కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామని, అయినా, ప్రతీసారి మరింత బలోపేతమవుతూ వచ్చామని తెలిపారు. కరోనా మహమ్మారి పెద్ద పెద్ద దేశాల్లోనూ మారణహోమం సృష్టించిందన్న ప్రధాని.. మొదటి వేవ్‌ను భారత్ సమర్థ్ధవంతంగా ఎదుర్కొన్నదని, ఈ రెండో వేవ్‌పై కూడా విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. వికాస యాత్ర ఏడేళ్ల పాలనలో చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ‘వికాస యాత్ర’ పేరుతో ఒక ప్రకటనను ప్రభుత్వం రూపొందించింది. ఆ ప్రకటనను ప్రధాని మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. తమ ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసేది సేవాస్ఫూర్తి మాత్రమేనని అందులో పేర్కొన్నారు. కరోనా గడ్డుకాలంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించినా, రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచి గిట్టుబాటు ధర చెల్లించి సేకరించినా, కార్మికులకు మెరుగైన పని పరిస్థితులు కల్పించినా.. అన్నిటికీ ఆ సేవాస్ఫూర్తే కారణమన్నారు. సంక్షోభంలోనూ వ్యవసాయం సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సంక్షోభంలోనూ పేదలకు వ్యవసాయం ఎంతో చేయూతనిచ్చిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రికార్డు స్థాయిలో రైతులు ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసిన కారణంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ ఇవ్వగలిగామని ప్రధాని పేర్కొన్నారు. కరోనా దేశంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేసిందని, అయితే ఈ దాడి నుంచి వ్యవసాయ రంగం తనను తాను రక్షించుకోవడమే కాకుండా పురోగతి సాధించిందన్నారు. కోవిడ్‌పై దేశం పూర్తి శక్తితో ఎలా పోరాడుతుందో అందరూ చూస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. వందేళ్ల కాలంలో కరోనాయే అతి పెద్ద మహమ్మారి అన్నారు. సెకండ్ వేవ్‌లో కరోనాతో పోరాటంలో ప్రముఖపాత్ర పోషించిన వారు చాలా మంది ఉన్నారన్నారు. క్రయోజెనిక్ ట్యాంకర్ల డ్రైవర్లు, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్, వైమానిక దళ పైలట్లు, ల్యాబ్ టెక్నిషియన్లు తదితరులు చాలామంది సంక్షోభ సమయంలో పనిచేసి లక్షలాది మంది ప్రాణాలు రక్షించారని మోదీ పేర్కొన్నారు. ‘‘ఈ యోధుల సేవలకు దేశం వారికి నమస్కరిస్తోంది. లక్షలాది మంది రాత్రింబవళ్లు కరోనా సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. ఆక్సిజన్‌ను కొరత ఏర్పడటంతో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్ఎంవో) ఉత్పత్తిని రోజుకు 900 మెట్రిక్ టన్నులు నుంచి 10 రెట్లు పెంచి రోజుకు 9,500 టన్నులకు తీసుకెళ్లాం. దేశం ఇప్పుడు రోజుకి 20 లక్షలుపైగా కరోనా పరీక్షలు చేసే స్థాయికి చేరింది’’ అని మోదీ పేర్కొన్నారు. విజయనగరం మామిడి ప్రస్తావన ప్రధాని మోదీ మన్‌కీ బాత్‌లో విజయనగరం మామిడిని ప్రస్తావించారు. కిసాన్ రైలు ద్వారా విజయనగరం నుంచి ఢిల్లీకి మామిడి వస్తోందన్నారు. దీని వల్ల ఉత్తరాది వారికి విజయనగరం మామిడి తినడానికి లభిస్తోం దని, విజయనగరం రైతులకు మంచి ఆదా యం వస్తోందన్నారు. కిసాన్ రైళ్లు ఇప్పటి వరకు సుమారు 2 లక్షల టన్నుల ఉత్పత్తులను రవాణా చేశాయని ప్రధాని తెలిపారు. కిసాన్ రైలు ద్వారా తక్కువ రవాణా ఖర్చులతో రైతులు తాము పండించిన పండ్లు, కూరగాయలు, ఆహారధాన్యాలను దేశం నలు మూలకు పంపగలుగుతున్నారని అన్నారు. -
ప్రేమతో ఆదరించారు
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తన తొలి విజయాన్ని గుర్తు చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ‘‘ఏడేళ్ల క్రితం ఇదే రోజు నవ్వుతూ ఉన్నాను. ఇప్పుడూ అదే నవ్వు నా మొహం మీద ఉంది. దీనంతటికీ కారణం నన్ను ఎంతో ప్రేమతో ఆదరించిన, అభిమానించిన ప్రేక్షకుల వల్లే. ఎక్కడో ఢిల్లీ అమ్మాయిని అయినా అచ్చ తెలుగు అమ్మాయిగా ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది. ఈ జర్నీలో నన్ను నమ్మిన దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్, ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇంకా మంచి నటిగా, మనిషిగా మారడానికి మీ సలహాలు, సూచనలు, విమర్శలు చాలా ఉపయోగపడ్డాయి. అలానే నా కుటుంబం, నా టీమ్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు’’ అన్నారు. కాగా రకుల్ ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు, తమిళంలో ‘భారతీయుడు 2’, ‘అయాలన్’, తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారామె. -
మతిస్థిమితం లేక.. ఏడేళ్ల తర్వాత స్వగ్రామానికి
సాక్షి, నార్నూర్: మండలంలోని జామ్డా గ్రామానికి చెందిన పూసం మల్కు-సీతాబాయి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పూసం రాధ (36) మతిస్థిమితం సరిగ్గా లేక 2013లో ఇంటి నుంచి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు ఎంత వెతికినా జాడ కానరాలేదు. 2014లో ఛత్తీస్‌ఘడ్ రాయపూర్‌లో రోడ్డుపై వచ్చిపోయే వారిని రాళ్లతో కొడుతుండగా గమనించిన అక్కడి రిమ్స్ మెంటల్ ఆస్పత్రి సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె మానసికస్థితిని గమనించిన వైద్యులు ప్రత్యేక వైద్యం అందించారు. పరిస్థితి మెరుగుపడడంతో వివరాలు సేకరించి ఈ నెల 6న స్థానిక ఎస్సై విజయ్‌కు ఆస్పత్రి సూపరింటెండెంట్ సమాచారాన్ని అందించారు. విషయాన్ని తెలుసుకున్న స్థానిక సర్పంచ్ మడావి ముక్తా రూప్‌దేవ్ స్థానిక ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌లకు విషయాన్ని తెలియజేశారు. నిరుపేద కుటుంబం ఆర్థిక స్థోమత లేకపోవడంతో ప్రత్యేక చొరవ తీసుకొని ఎమ్మెల్యే, జిల్లా పరిషత్ చైర్మన్ వాహనాన్ని సమకూర్చి ఆమెను స్వగ్రామానికి రప్పించారు. ఏడేళ్ల తర్వాత స్వగ్రామానికి పూసం రాధా ఆరోగ్యంగా చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఆమె రాక కోసం ప్రత్యేక చొరవ తీసుకున్న ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్లకు ఆదివాసీ, రాయిసెంటర్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రాయి సెంటర్ జిల్లా సార్మేడి మెస్రం దుర్గు తెలిపారు. మంత్రి అవగాహన లేకుండా మాట్లాడడం సరికాదు కైలాస్‌నగర్(ఆదిలాబాద్): రాష్ట్ర దేవాదాయన, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న చట్టాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు పరచటం లేదని అవగాహన రహిత్యంగా మాట్లాడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ విమర్శించారు. మంగళవారం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ రైతులు కష్టాలను తొలగించేందుకు నూతన వ్యవసాయ చట్టాని తీసుకువస్తే ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. గతేడాది సీసీఐ ద్వారా అత్యధికంగా పత్తి కొనుగోలు చేయడం జరిగిందని, ఈ నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఎంతో లాభం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర మంత్రి వర్గంలో ఉంటూ రైతులను మోసం చేసే విధంగా వాక్యాలు చేయడం సమాంజసం కాదన్నారు. నూతన వ్యవసాయ చట్టం ద్వారా రైతులు దేశంలో ఎక్కడైనా పంటలు అమ్ముకోవచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు పంట దిగుబడులను కొనుగోలు చేసి నెలల తరబడి రైతులు డబ్బులు ఇవ్వలేదని, గతేడాది సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసి వారంలోగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా రికార్డు స్థాయిలో సీసీఐ ద్వారా కొనుగొల్లు చేపట్టి తీరుతామని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాంపెల్లి వేణుగోపాల్, ఉపాధ్యక్షులు జోగు రవి, దినేష్ మటోలియా, నాయకులు అంకత్ రమేష్, లోక ప్రవీణ్ రెడ్డి, సోమ రవి, రాకేష్, సంతోష్ పాల్గొన్నారు. -
షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం
సాక్షి, ఇచ్ఛాపురం: కుటిల రాజకీయాలు జఠిల సమస్యలు సృష్టిస్తున్నప్పుడు, ఒక నాయకుడిని ఒంటరిని చేసి వేధిస్తున్నప్పుడు, ఒక కుటుంబాన్ని లక్ష్యంగా పెట్టుకుని దాడులు చేస్తున్నప్పుడు ఆ అన్న కు అండగా, కుటుంబానికి తోడుగా, పార్టీకి ఓ ధైర్యంగా ఓ అతివ అడుగులు వేశారు. తండ్రి చూపిన బాటలో రాష్ట్రమంతా కలియదిరిగారు. అన్న పెట్టిన పార్టీ సంస్థాగతంగా బలోపేతం కావడానికి తన నడకతోనే ఇంధనం నింపారు. ఆమే వైఎస్ షర్మిల. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు ఆమె సాగించిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నేటితో ఏడేళ్లు పూర్తి చేసుకుంది. చెల్లెమ్మలకు అండగా ఉండే అన్నల కథలు అందరికీ తెలిసినవే. కానీ అన్నకు బలంగా నిలిచిన చెల్లెలి కథ ఆమెది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం అందరూ బాగానే ఉండేవారు. కానీ ఆయన హఠాన్మరణం తర్వాత రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోయాయి. అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అది మొదలు ఆయనపై కుట్రలు మొదలైపోయాయి. ఒక్కడినే చేసి అన్ని రాజకీయ పక్షాలు తమకు తోచిన విధాన దాడు లు చేయడం మొదలుపెట్టాయి. అలాంటి దుర్మార్గ, దుశ్చర్యలకు నిరసనగా అన్నకు తోడుగా నిలిచి జగనన్న విడిచిన బాణంగా ప్రజల మధ్య నడిచి నాయకులకు భరోసా కలిగించింది వైఎస్ షర్మిల. ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా అన్న వదిలిన బాణంలా అన్ని గ్రామాలు కలియదిరిగారు. 2012 అక్టోబర్ 18న ఇడుపుల పాయ నుంచి మరోప్రజాప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్ర ప్రారంభించారు. షర్మిలమ్మతో కలసి పాదయాత్ర చేస్తున్న ధర్మాన కృష్ణదాస్(ఫైల్) నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజలతో మమేకమై వారి కష్టాలను తెలుసుకుంటూ, కన్నీళ్లు తుడుస్తూ పాదయాత్ర కొనసాగించారు. అప్పటి రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 నియోజకవర్గాల గుండా 230 రోజుల పాటు 3112 కిలోమీటర్ల పాదయాత్రను కొనసాగించి 2013 ఆగస్టు 4 వ తేదీన ఇచ్ఛాపురంలో ముగించారు. అన్నకిచ్చిన మాటకోసం ప్రజల శ్రేయస్సును కోరి ప్రపంచ చరిత్రలో మొట్టమొదటి సారిగా సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసిన మహిళగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు. నేటి వైఎస్సార్సీపీ అఖండ విజయానికి అప్పుడే బలమైన పునాదులు వేశారు. ఆ పాదయాత్రను ముగింపునకు గుర్తుగా ఇచ్ఛాపురం పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానానికి ఆనుకొని మరోప్రజాప్రస్థానం పేరిట విజయ స్థూపం ఏర్పాటు చేశారు. ఇచ్ఛాపురంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతున్న వైఎస్ షర్మిలమ్మ షర్మిలమ్మ పాదయాత్ర చారిత్రక ఘట్టం ఒక మహిళ వేల కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేయడమనేది చరిత్రలో నిలిచిపోయే ఘట్టం. వైఎస్ షరి్మలమ్మ అప్పడు పాదయాత్ర ద్వారా నాటి న విత్తనమే ఇప్పుడు మహావృక్షంగా ఈ స్థాయి లో ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి, షర్మిలమ్మ, వైఎస్ జగన్ అందరూ ఇచ్ఛాపురంలోనే పాదయాత్ర ముగించారు. ఆ కుటుంబంతో ఇచ్ఛాపురానికి విడదీయలేని అనుబంధం ఉంది. – పిరియా సాయిరాజ్, డీసీఎంఎస్ చైర్మన్, నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
డయల్ 100కు ఏడేళ్లు!
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి ఆపద వచ్చినా.. అందరికీ గుర్తుకు వచ్చే నంబరు డయల్ 100. ఈ డయల్ 100 కంట్రోల్ రూముకు శనివారంతో ఏడేళ్లు పూర్తయ్యాయి. 2013 ఏప్రిల్ 11న ఉమ్మడి రాష్ట్రంలోనే ఈ కంట్రోల్ రూమును ఏర్పాటు చేశారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత దీన్ని కూడా విభజించారు. కేవలం నేరాలకు సంబంధించిన కాల్స్ మాత్రమే కాదు.. రోడ్డు ప్రమాదాలు, తగాదాలు, చోరీలు, కొట్లాటలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలు, అగ్ని ప్రమాదాలు ఇలా సమస్య ఏదైనా ముందు ఫోన్ వెళ్లేది ‘100’కే. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో అత్యంత కీలకమైనది డయల్ 100. అందుకే, ఇక్కడ పనిచేసే సిబ్బంది నిత్యం చాలా అప్రమత్తంగా ఉంటారు. ప్రతి కాల్ని వెంటనే రిసీవ్ చేసుకుంటారు. అందులో కొన్ని అనవసరమైనవి, బ్లాంక్ కాల్స్, ఫేక్ కాల్స్, చిన్నపిల్లలు, ఆకతాయిలు చేసే కాల్స్ అలా అనేక రకమైన కాల్స్ వస్తుంటాయి. 2017లో అత్యధికంగా 4.5 కోట్ల కాల్స్.. ఈ ఏడేళ్లలో కంట్రోల్ రూము సిబ్బంది 15.9 కోట్లు, అంటే దాదాపుగా 16 కోట్ల ఫోన్ కాల్స్ స్వీకరించారు. ఈ లెక్కన రోజుకు దాదాపు 62 వేల కాల్స్, గంటకు 2,597, నిమిషానికి 43 కాల్స్ చొప్పున కంట్రోల్ రూముకు కాల్స్ వెళ్తున్నాయి. 2017లో అత్యధికంగా 4.5 కోట్ల కాల్స్ వచ్చాయి. అంటే రోజుకు 1.25 లక్షల కాల్స్ ఆన్సర్ చేశారన్నమాట. మూడు షిఫ్టుల్లో పని చేసే ఈ సిబ్బందికి ఆ ఏడాది మొత్తం నిమిషానికి 86 కాల్స్‌కు పైగానే సమాధానం చెప్పాల్సి వచ్చింది. ఈ కాల్స్‌కు స్పందించిన సిబ్బంది వెంటనే బాధితులు ఎక్కడున్నారో కనుక్కుని వారికి తక్షణ సాయం అందజేశారు. ఈ క్రమంలో వందలాది మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఫోన్ కాల్స్‌ని విశ్లేషిస్తే.. 2018 నుంచి తగ్గాయి. కానీ, అత్యవసర కాల్స్ పెరగడం గమనార్హం. పోలీసులకు సమాచారం అందించేందుకు ఫోన్లు, హాక్ ఐ, సోషల్ మీడియా మాధ్యమాలు పెరగడం ఇందుకు కారణం. ఏడేళ్లలో డయల్ 100కు వచ్చిన కాల్స్ వివరాలు -
అప్పట్లో ఎమ్మెల్యే పదవి ఏడేళ్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 1957లో జరిగిన సాధారణ ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. 1953 అక్టోబర్ 1న ఆంధ్ర, రాయలసీమ జిల్లాలు కలిసి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడ్డాయి. టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. ఆయన స్వల్పకాలంలోనే పదవీచ్యుతులు కాగా.. రాష్ట్రపతి పాలన అనంతరం 1955 మార్చిలో 196 అసెంబ్లీ నియోజకవర్గాలకు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 1956లో ఆంధ్ర, తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడ్డాయి. నీలం సంజీవరెడ్డి మొదటి సీఎం అయ్యారు. 1957లో దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఆంధ్రప్రాంతంలోని 196 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అప్పటికే మధ్యంతర ఎన్నికలు జరిగినందున తెలంగాణలోని 104 అసెంబ్లీ నియోజకవర్గాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఆంధ్ర, రాయలసీమకు చెందిన 196 మంది ఎమ్మెల్యేలు 1962 వరకూ ఏడేళ్లు ఎమ్మెల్యేలుగా కొనసాగారు. -
జపాన్ సునామీ బీభత్సానికి ఏడేళ్లు
-
ఏడేళ్లు.. 8 ప్యాక్
కండలు తిరిగిన దేహం కావాలంటే కసరత్తులు చేయాల్సిందే. ఇందుకోసం బాలీవుడ్, టాలీవుడ్ హీరోలు జిమ్‌లలో పడుతున్న కష్టాలను అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాం. సిక్స్ ప్యాక్‌లో మా హీరో ఎంత స్టైలిష్‌గా ఉన్నాడో చూడండి.. అంటూ అభిమానులు చెప్పుకోవడం వింటూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రపంచమంతా ఓ బుడతడి దేహదారుఢ్యాన్ని చూసి ముచ్చటపడుతోంది. ఎందుకంటే ఏడేళ్లు కూడా నిండకుండానే పలక చేతిలో పట్టుకోవాల్సిన వయసులో ఎనిమిది పలకల దేహంతో అలరిస్తున్నాడు ఓ చైనా కుర్రోడు. పేరు.. చెన్ యి. హాంగ్ఝౌ నగరానికి చెందిన ఈ బుడ్డోడు ఇటీవల చైనాలో జరిగిన ఓ జిమ్నాస్టిక్ టోర్నమెంట్లో విజేతగా నిలవడమే కాదు, ఇప్పటిదాకా ఆరు బంగారు పతకాలు, ఓ వెండి పతకాన్ని కూడా గెలుచుకున్నాడు. టోర్నమెంట్లో విజేతగా నిలిచిన విషయాన్ని చెప్పేందుకు 8 ప్యాక్ బాడీతో ఓ ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా మరుక్షణమే 25,000 మంది లైక్‌లు కొట్టారు. 500 మంది ఈ ఫొటోలను షేర్ చేశారు. ఇక ఈ 8 ప్యాక్ వెనుక సీక్రెట్ ఏంటని చెన్ను అడిగితే.. ఐదేళ్ల నుంచే ప్రొఫెషనల్ జిమ్నాస్ట్‌గా ప్రాక్టీస్ మొదలు పెట్టానని, అదే కంటిన్యూ చేస్తుండడంతోనే 8 ప్యాక్ బాడీ సాధించగలిగానని చెబుతున్నాడు. -
హత్య కేసులో మహిళకు ఏడేళ్ల జైలు
అనంతపురం సెంట్రల్ : అనంతపురం రూరల్ మండలం సోములదొడ్డిలో జరిగిన ఓ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ అదనపు ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పినట్లు రూపల్ సీఐ కృష్ణమోహన్ గురువారం తెలిపారు. సోములదొడ్డిలో 2014 మే 6న వినాయకుని విగ్రహాల తయారీ విషయంలో రెండు వర్గాల వారు ఘర్షణకు దిగారు. ఘటనలో చిన్న తిమ్మరాజు అనే వ్యక్తిని శ్రీనివాసులు భార్య మీనాక్షి, ఆమె కుమారుడు(మైనర్) దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని సీఐ తెలిపారు. బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అప్పట్లో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. కేసు పూర్వపరాల పరిశీలన, సాక్షుల విచారణ అనంతరం మీనాక్షిపై నేరం రుజువు కావడంతో ఆమెకు ఏడేళ్ల జైలు శిక్ష సహా రూ.10 వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారన్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న మైనర్‌కు సంబంధించిన కేసు జువైనల్ జస్టిస్ బోర్డు(జేజేబీ)లో విచారణలో ఉంది. -
భార్య మృతికి కారణమైన భర్తకు ఏడేళ్ల జైలు
రంగారెడ్డి: కట్నం వేధింపులతో భార్య బలవన్మరణానికి కారకుడైన భర్తకు న్యాయస్థానం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం... మీర్పేట్ త్రివేణి నగర్లో నివాసముండే దీపక్‌బాబు, సుచరిత దంపతుల వివాహం 2010 జూన్ నెలలో జరిగింది. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. వీరికి ఒక పాప కూడా ఉంది. దీపక్‌బాబు మరింత కట్నం తేవాలంటూ సుచరితను శారీరకంగా, మానసికంగా వేధించాడు. ఈ క్రమంలో 2013 ఏప్రిల్ 24న దంపతుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన సుచరిత అదే రోజు రాత్రి ఇంట్లోనే ఊరేసుకుని మరణించింది. ఆమె తండ్రి ప్రకాష్ ఫిర్యాదు మేరకు మీర్‌పేట పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కోర్టులో అభియోగపత్రం నమోదు చేశారు. కేసు సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి గురువారం తీర్పునిచ్చారు. దీపక్బాబుకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. -
ఏడేళ్లుగా గృహ నిర్బంధం !
విముక్తి కల్గించిన పోలీసులు బెంగళూరు: దాదాపు ఏడేళ్లుగా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న ఓ బాలికను పోలీసులు రక్షించి ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఆశ్రయం కల్పించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... నగరంలోని డీ.జే హళ్లికి చెందిన షేక్‌సుభాన్, బాను దంపతులకు 12 మంది పిల్లలు. వీరిలో పద్నాలుగేళ్ల (ప్రస్తుతం) సల్మా (పేరుమార్చబడింది) తొమ్మిదో సంతానం. పేదరికంతో బాధపడుతున్న షేక్‌సుభాన్, బానులు బ్రిగేడ్ రోడ్డులో ఉంటున్న నస్రీన్ తాజ్ అనే ఆమెకు సల్మా (అప్పుడు ఆమెకు ఏడేళ్లు)ను దత్తత ఇచ్చారు. రెండేళ్లు నస్రీన్ తాజ్ సల్మాను బాగానే చూసుకున్నారు. అయితే ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. దీంతో కాక్స్టౌన్లో నివాసం ఉంటున్న తనకు అక్క వరుస అయ్యే ఫరీదాకు.. సల్మా బాధ్యతలను నస్రీన్ అప్పగించింది. అప్పటి నుంచే సల్మా కష్టాలు మొదలయ్యాయి. ఫరీదా...ఇంటి పనులన్నింటినీ సల్మా చేత చేయించేది. చీటికి, మాటికీ కొడుతూ గాయాలపై కారం పొడిని కూడా చల్లేది. సరైన తిండి కూడా పెట్టేది కాదు. అంతే కాకుండా ఈ ఏడేళ్ల కాలంలో సల్మాను ఒంటరిగా ఒక్కసారి కూడా ఇంటి నుంచి బయటికి పంపించేది కాదు. ఎప్పుడైనా సల్మాను బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి వస్తే ఫరీదా కూడా సల్మాతో పాటు ఉండేది. ఇలా దాదాపు ఏడేళ్ల కాలం పాటు సల్మాకు ఫరీదా ప్రత్యక్ష నరకం చూపించింది. ఇదిలా ఉండగా నస్రీన్ తాజ్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. సల్మాను చూడాలని ఉందని ఫరీదాను పదిరోజుల ముందు నస్రీన్ కోరారు. దీంతో తప్పని పరిస్థితుల్లో సల్మాను తీసుకుని ఫరీదా...నస్రీన్ ఇంటికి ఆటోలో బయలు దేరారు. హలసూరు పోలీస్‌స్టేషన్ వద్దకు ఆటో చేరుకోగానే సిగ్నల్ పడింది. దీంతో ఆటోలో ఉన్న సల్మా ఒక్కసారిగా కిందికి దిగి పోలీస్‌స్టేషన్‌లోకి పరుగెత్తింది. అక్కడ పోలీసులకు తన పరిస్థితి మొత్తం వివరించింది. హలసూరు పోలీస్‌స్టేషన్ సిబ్బంది డీ.జే హళ్లిలోని మసీదు వద్దకు వెళ్లి అక్కడి స్థానికుల సహాయంతో సల్మా తల్లిదండ్రులను గుర్తించారు. అయితే నిబంధనల ప్రకారం సల్మాను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని బాలికల వసతి గృహంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫరీదాను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
మాజీ మహిళా ప్రొఫెసర్‌కు ఏడేళ్ల జైలు
తిరుపతి: వ్యభిచారం కేసులో మాజీ మహిళా ప్రొఫెసర్‌తో పాటు ఆమె సహాయకుడికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 22 వేలు జరిమానా విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును జిల్లా కోర్టు సమర్థించింది. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ఓ మహిళ... తిరుపతిలో సులువుగా బతకొచ్చంటూ నమ్మబలికి ఓ బాలికను, యువతిని రేణిగుంటకు తీసుకువచ్చింది. అక్కడ బీటీఆర్ కాలనీకి చెందిన సి.తేజ అలియాస్ శ్రీకాంత్‌కు వారిని అప్పగించింది. శ్రీకాంత్ వారిని బెదిరించి వ్యభిచారం కూపంలోకి దింపాడు. కొన్నాళ్ల తర్వాత వారిని ఎస్వీ యూనివర్సిటీ వయోజన విద్యా విభాగం ప్రొఫెసర్ పి.వసంతకుమారి ఇంటికి పంపి అక్కడ వ్యభిచారం చేయించాడు.ఈ క్రమంలో ఓ యువతి తిరుపతి వెస్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2005 ఆగస్టు 2వ తేదీ వెస్టు స్టేషన్ పోలీసు అధికారులు డీఎస్పీ అనుమతితో సెర్చ్ వారెంట్ తీసుకుని మహిళా ప్రొఫెసర్ ఇంటిని తనిఖీ చేశారు. అక్కడ మరికొందరు యువతులు ఉన్నట్టు గుర్తించారు. నిందితురాలు వసంతకుమారి సహా 16 మందిపై వ్యభిచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు వసంతకుమారి, ఆమె సహాయకుడు శ్రీకాంత్‌కు మాత్రం శిక్ష విధిస్తూ 2007 ఆగస్టు 21న తీర్పు చెప్పింది. శిక్షపడిన ఇద్దరు వేర్వేరుగా తిరుపతి ఐదో అదనపు జిల్లా జడ్జి కోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు. దీనిపై న్యాయమూర్తి కింది కోర్టు తీర్పును అమలు చేయాలని సూచించింది. -
రెండేళ్లా.. ఏడేళ్లా?
-
రెండేళ్లా.. ఏడేళ్లా?
రెండేళ్లలో పూర్తి చేస్తాం.. ముఖ్యమంత్రి మాట! నాలుగేళ్లలో పూర్తవుతుంది.. ప్రభుత్వ ఉత్తర్వు! ఏడేళ్ల సమయం పడుతుంది.. ప్రపంచబ్యాంకుకు నివేదిక!! పాలమూరు ప్రాజెక్టు పూర్తిపై ఏమాట నిజం? - రెండేళ్లలో పూర్తి చేస్తామంటున్న రాష్ట్ర ప్రభుత్వం - తాజాగా జారీ చేసిన ఉత్తర్వులో నాలుగేళ్లు - ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఏడేళ్లు - ప్రభుత్వ ప్రకటనలపై అంతా అయోమయం - పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే - 7 లక్షల ఎకరాలకు నీరిచ్చే అవకాశం - అయినా వాటిపై మౌనముద్ర సాక్షి, హైదరాబాద్: పది లక్షల ఎకరాలకు సాగునీరు.. జంట నగరాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తవుతుందన్న అంశంపై ప్రభుత్వం పొంతనలేని ప్రకటనలు చేస్తోంది. రూ.35,200 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి ఒక మాట, ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో మరో మాట, ప్రపంచబ్యాంకుకు ఇచ్చిన నివేదికలో ఇంకో విషయం ఉండడంతో ఏది నిజమో తెలియక అటు అధికారులు, ఇటు పాలమూరు నేతలు, ప్రజలు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటికే 80 శాతానికిపైగా పూర్తయి ఏడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చే నాలుగు ప్రాజెక్టుల పూర్తిపై మౌనం దాల్చి.. కొత్తగా పాలమూరు ప్రాజెక్టును అందలమెక్కించడంపైనా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒక్కోమారు ఒక్కోలా... పాలమూరుపై ప్రభుత్వం ఒక్కో వేదికపై ఒక్కోలా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టు సత్వర పూర్తికి ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తూ ఈ నెల ఒకటిన ఇచ్చిన జీవో 143లో 48 నెలల(నాలుగేళ్లు) కాలంలో పూర్తి చేయాలని నీటి పారుదల శాఖకు సీఎం మార్గదర్శనం చేశారని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లే ప్రాజెక్టుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేసి నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని వివరించారు. ఈ లెక్కన ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఏటా రూ.9 వేల కోట్ల మేర ఖర్చు చేయాలి. శనివారం ప్రాజెక్టుపై సమీక్షించిన ముఖ్యమంత్రి.. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు. అంటే ఏటా రూ.18 వేల కోట్లు కేటాయించాలి. ఇప్పటికే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి(జూన్ 11) మూడు నెలలు గడుస్తున్నా.. పూర్తిస్థాయి సర్వేనే పూర్తికాలేదు. అలాంటిది ప్రాజెక్టును రెండే ళ్లలో పూర్తి చేయడం ఎలా సాధ్యమని నీటి పారుదల రంగ నిపుణులే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం నిర్మాణంలో 25 ప్రాజెక్టులతో పాటు, కొత్తగా చేపడుతున్న పాలమూరు, నక్కలగండి తదితర పథకాలకు కలిపి మొత్తంగా రూ.1,03,051 కోట్ల అవసరాలు ఉన్నాయని ప్రభుత్వం నెల రోజుల కిందట ప్రపంచబ్యాంకుకు తెలిపింది. ఇందులో కొత్తగా చేపడుతున్న పాలమూరుకు రూ.35,200 కోట్లు అంచనా వే సింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి రూ.13,400 కోట్లు, తర్వాతి మూడేళ్లలో 2021-22 నాటికి మరో రూ.21,800 కోట్లు ఖర్చు చేయాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం ఆ నివేదికలో పేర్కొంది. అంటే ఈ ప్రభుత్వ గడువు ముగిసే నాటికి(2018-19) పాలమూరులో కేవలం మూడో వంతు పనులు మాత్రమే పూర్తయ్యే అవకాశం ఉంటుందని వివరించింది. ఇలా పొంతనలేకుండా చేస్తున్న ప్రకటనల్లో దీనిలో ఏది నిజమో? ఏది అబద్ధమో తెలియని పరిస్థితి నెలకొంది. పాత ప్రాజెక్టుల సంగతేంటీ? పాలమూరు జిల్లాలోనే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. 85 శాతానికి పైగా పూర్తయ్యాయి. అయితే అపరిషృ్కతంగా ఉన్న భూసేకరణ, పునరావాసం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వెరసి ఏడాదిన్నరగా ముందుకు కదల్లేదు. దీంతో ఆయకట్టు లక్ష్యాలు ఏడాదికేడాది తగ్గుతున్నాయి. ఈ ప్రాజెక్టుల కింద మొత్తంగా 8 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ నాటికే 3 లక్షలకు పైగా ఎకరాలకు నీరివ్వాలని నిర్ణయంచినా సాధ్యం కాలేదు. రైల్వే, రహాదారుల క్రాసింగ్ సమస్య, ఎస్కేలషన్ చార్జీలను పెంచాలన్న కాంట్రాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం తేల్చకపోవడం వంటి అంశాలూ గుదిబండగా మారాయి. దీంతో ప్రస్తుత బడ్జెట్లో రూ.660 కోట్ల మేర కేటాయింపులు జరిపినా ఇప్పటివరకు రూ.20 కోట్ల మేర కూడా ఖర్చు జరుగలేదు. తాజాగా ఈ ప్రాజెక్టుల కింద.. వచ్చే ఏడాది ఖరీఫ్ నాటికి 7 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తామని చెబుతున్నారు. కేవలం వెయ్యి కోట్ల మేర ఖర్చు చేస్తే 7 లక్షల ఆయకట్టును ఇచ్చే ప్రాజెక్టులపై మౌనం దాల్చి.. కొత్త ప్రాజెక్టుతో మహబూబ్‌నగర్‌లో 7 లక్షల ఆయకట్టుకు నీరిస్తామనడంలో ఆతర్యమేమిటో అర్థంగాక పాలమూరు రైతులు తలలు పట్టుకుంటున్నారు. -
జనహితం.. సాక్షి అభిమతం
‘ప్రజాభ్యుదయమే ధ్యేయంగా ఆవిర్భవించిన ‘సాక్షి’ దినపత్రిక నేటితో ఏడు వసంతాలు పూర్తి చేసుకుంది. ఎనిమిదో వసంతంలోకి అడుగిడింది. ప్రజాభిప్రాయానికి పట్టం కడుతూ, నిజాలను నిర్భయంగా వెల్లడిస్తూ, అక్రమాలపై అక్షర సమరం సాగిస్తోంది. నీతిమాలిన రాజకీయాలను కడిగిపారేస్తూ అక్షర ప్రస్థానాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తోంది. తద్వారా అన్ని వర్గాల ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ ప్రజల మనస్సాక్షిగా విరాజిల్లుతోంది. ప్రజల కష్టనష్టాల్లో వెన్నంటి నిలుస్తూ వారి ఆత్మీయ‘సాక్షి’గా నిలుస్తోంది. పని చేయని అధికారులను వెలేత్తిచూపుతూ పని చేయిస్తోంది. కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్న ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ఊతకర్రలా నిలుస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప : ప్రభుత్వ పథకాల అమలులో చోటు చేసుకుంటున్న జాప్యాన్ని, అర్హు ల పొట్ట కొడుతూ అనర్హులకు పెద్దపీట వేస్తున్న వైనాన్ని నిలదీస్తూ అర్హులకు పక్కా న్యాయం జరిగేందుకు ‘సాక్షి’ పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ‘హాస్పిటల్ విజిట్’ పేరుతో జిల్లాలోని పీహెచ్‌సీల పనితీరును వేలెత్తి చూపింది. ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌సెల్‌లో ప్రజలు విన్నవించుకున్న సమస్యలు పరిష్కారం కాని వైనాన్ని తెలియజేస్తూ.. బాధితుల ఆవేదనకు అక్షర రూపం ఇస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల పాట్లను ‘ఫోకస్’ చేస్తూ పరిస్థితిలో మార్పు తేవడానికి కృషి చేస్తోంది. ఇదే తరుణంలో బాగా పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తూ స్ఫూర్తిదాయక కథనాలు ప్రచురిస్తోంది. మహిళలకు అండగా.. ఇంట్లో మహిళ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తేనే ఆ కుటుంబం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఈ దిశగా మహిళలను ప్రోత్సహిస్తూ ఎన్నో స్ఫూర్తిదాయక కథనాలు ప్రచురిస్తోంది. మహిళల కష్టనష్టాలు, విజయగాధలు, జీవనపోరాటాలను ఆవిష్కరిస్తోంది. ‘నా కూతురే నా జీవితం’ శీర్షిక ద్వారా భర్తలను కోల్పోయిన మహిళలు తమ బిడ్డల భవిత కోసం తపిస్తున్న వైనాన్ని కళ్లకు కట్టింది. ఎందరో మహిళలు తమ కూతుళ్లను టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులుగా తీర్చిదిద్దిన వైనాన్ని వెలుగులోకి తెచ్చింది. ఎన్నెన్నో సమస్యలకు పరిష్కారాలు.. ప్రజా అవసరాలను క్షేత్ర స్థాయిలో ఎప్పటికప్పుడు గుర్తించి, వారికి తగిన సమాచారాన్ని కమ్యూనిటీ పేజీల రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటిలో ప్రచురితమైన కథనాల వల్ల అధికారుల్లో జవాబుదారీతనం పెరిగింది. అనేక సమస్యలు పరిష్కారమయ్యా యి. ‘అటెన్షన్ ప్లీజ్’ శీర్షిక కింద ప్రచురితమైన అనేక ఫొటో కథనాలకు అధికారులు స్పందించి.. వెంటనే పరిష్కార మార్గం చూపారు. ప్రజల వద్దకే అధికారులను తీసుకొచ్చి, వారి సమస్యలను వినేలా ‘సాక్షి’ నిర్వహించిన బృహత్తర కార్యక్రమం ‘జన సభలు’. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జనసభలు నిర్వహించింది. వీటికి పురపాలక, విద్యుత్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులను ఆహ్వానించింది. ప్రజలు తమ సమస్యలను నేరుగా, అర్జీల రూపంలో అందించేందుకు తోడ్పడింది. వాటిని పరి శీలించిన అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. పలుచోట్ల అక్కడికక్కడే పలు సమస్యలు పరిష్కారమయ్యాయి. ‘సాక్షి’ ఫోకస్ శీర్షికన చాలా అంశాలను, సమస్యలను వెలుగులోకి తెచ్చింది. చాలా సమస్యలను పరిష్కరించాల్సిన అవశ్యకతను అధికారులకు తెలియజెపుతూ ప్రభుత్వ వైఫల్యాన్నీ ఎండగట్టింది. నిరక్షరాస్యులకు విద్యాబుద్ధులు నేర్పిన ‘అక్షర సాక్షి’ నిరక్షరాస్యత అభివృద్ధికి అవరోధం. ఈ విషయాన్ని గుర్తించిన ‘సాక్షి’ గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకుంది. ‘అక్షరసాక్షి’ పేరుతో సాక్షరతా ఉద్యమాన్ని చేపట్టింది. ఇందుకోసం నియమించిన కో ఆర్డినేటర్.. పల్లె పల్లె తిరుగుతూ... చదువు లేకపోవడం వల్ల కలుగుతున్న ఇబ్బందులు, చదువుకుంటే కలిగే లాభాలను మహిళలకు వివరించారు. దీంతో వందలాది మంది నిరక్షరాస్య మహిళల్లో చదువుపై ఆసక్తి కల్గింది. చాలా మంది దినపత్రికలు చదివే స్థాయికి ఎదిగేలా కృషి చేసింది. వ్యవ‘సాయం’ జిల్లా రైతన్నలకు ‘సాక్షి’ ప్రతి నిత్యం చేదోడువాదోడుగా నిలుస్తోంది. ఈ అక్షరసత్యాన్ని జి ల్లాలో ఏ మారుమూల గ్రామానికి చెందిన రైతు ను అడిగినా ఇట్టే చెబుతాడు. ఖరీఫ్, రబీ సీజన్లకు అనుగుణంగా ఎప్పుడు ఏ పంట సాగు చేసుకోవాలి.. పాటించాల్సిన జాగ్రత్తలు.. ఇతరత్రా యాజమాన్య పద్ధతుల గురించి అర్థమయ్యే రీతిలో ‘పాడిపంట’ ద్వారా వివరిస్తోంది. పంటలకు ఆశించే చీడపీడలు, తెగుళ్లు, వాటి నివారణ పద్ధతులను పేరెన్నికగన్న శాస్త్రవేత్తలు, అధికారుల సాయంతో రైతులకు తెలియజేస్తోంది. భూసార పరీక్షల ప్రాముఖ్యత గురించి వివరించి.. రైతుల్లో చైతన్యా న్ని రగిల్చింది. అవసరానికి మించి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం వల్ల కలిగే అనర్థాలను తెలియజెప్పింది. సేంద్రియ ఎరువుల వాడకం దిశగా రైతులను ప్రోత్సహించింది. అక్షర యజ్ఞం ద్వారా వ్యవ‘సాయాన్ని’ నేటికీ కొనసాగిస్తూనే ఉంది. ‘సాక్షి‘ చొరవ.. పరిశోధక సీట్ల పెంపు - వైవీయూ చరిత్రలోనే గొప్ప మలుపు యోగివేమన విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థుల ప్రవేశపరీక్ష -2011లో జరిగిన అవినీతి, అక్రమాలను ‘ఇష్టారాజ్యం’ పేరుతో 2012 జనవరి 23న సాక్షి దినపత్రిక వెలుగులోకి తెచ్చింది. ప్రవేశాల్లో చోటు చేసుకున్న అక్రమాలు, రిజర్వేషన్ ప్రక్రియలో లోపాలు, సాక్షాధారాలతో ప్రచురించింది. దీంతో విద్యార్థి లోకం వైవీయూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా తీవ్ర స్థాయిలో ఉద్యమ బాట పట్టింది. వైవీయూ వైస్ చాన్స్‌లర్, అధ్యాపక బందం కలిసి చర్చించి అప్పటి వరకు ఉన్న 100 సీట్లతో పాటు అదనంగా మరో 100 సీట్లు అర్హులైన వారికి కేటాయించారు. ఈ సంఘటన వైవీయూ చరిత్రలో పెనుమార్పులకు కేంద్ర బిందువైంది. -
ఏడేళ్లుగా రిజిస్ట్రేషన్లు లేవు
సాక్షి, నరసరావుపేట: ఏడేళ్లుగా ఆ గ్రామంలోని భూములు రిజిస్ట్రేషన్లకు నోచుకోవడంలేదు. గ్రామంలోని భూములన్నీ తమవేనంటూ పుష్పగిరి పీఠాధిపతులు దేవాదాయశాఖను ఆశ్రయించడంతో ఆ భూములకు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలంటూ దేవాదాయశాఖ, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు 2007లో జిల్లా రిజిస్ట్రార్‌కు ఆదేశాలు ఇచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులకు కష్టాలు మొదలయ్యాయి. పుష్పగిరి మఠానికి లింగంగుంట్లలో 1 నుంచి 335 సర్వే నంబర్లలోని 1452 ఎకరాల భూమి ఉందని, వీటి రిజిస్ట్రేషన్లు ఆపాలని దేవాదాయశాఖ అధికారులు ఇచ్చిన ఆర్డర్లో ఉంది. దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తమవద్ద నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలని నిబంధన విధించారు. లింగంగుంట్లలోని 1 నుంచి 72 బ్లాకులలో ఉన్న 1959 ఎకరాల భూమికి నరసరావుపేట రిజిస్ట్రార్ కార్యాలయంలో వందేళ్లుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. పుష్పగిరి పీఠాధిపతులకు సంబంధించిన 1452 ఎకరాలు పోను మిగతా భూములకు రిజిస్ట్రేషన్లు చేయాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించినా కమిషనర్ నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఎకరాకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ పొందాలన్నా హైదరాబాద్‌లోని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రెవెన్యూ అధికారుల ద్వారా రికార్డులు తెప్పించుకుని స్వయంగా విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నా కమిషనర్ పట్టించుకోలేదు. గ్రామకంఠం భూములు, ఈనాం బీ రిజిస్టర్ ప్రకారం రైతులవేనని చెబుతున్న 507 ఎకరాల భూములకు తమకు ఎటువంటి సంబంధమూ లేదని పుష్పగిరి పీఠాధిపతులు అధికారులకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. పీఠాధిపతులకు ఎంత భూమి ఉంది, రైతులకు ఎంత ఉంది అనే విషయాన్ని తేల్చకుండా రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తుండటంతో సమస్య జఠిలంగా తయారైంది. తమ భూములు తమకు ఇప్పించాలని గ్రామ రైతులు అప్పటి కలెక్టర్ ఆలీ రఫత్‌కు విన్నవించగా గ్రామంలోని భూములకు సర్వే నిర్వహించాలని ఆయన ఆదేశాలిచ్చారు. తమ 1452 ఎకరాల్లో సర్వే నిర్వహించవద్దని పుష్పగిరి పీఠాధిపతులు కోర్టును ఆశ్రయించడాన్ని అధికారులు సాకుగా చూపుతూ మిగిలిన భూముల్లో సైతం సర్వే నిర్వహించకుండా వదిలేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో పిల్లల చదువులు, పెళ్లిళ్లు, వైద్యం తదితర అవసరాలకు భూమిని విక్రయించుకునే అవకాశం లేకుండా పోయింది. బ్యాంకుల నుంచి రుణాలు అందక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జగన్ సీఎం అయితే పరిష్కారం.. మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి చొరవతో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గ్రామస్తుల సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో లింగంగుంట్ల గ్రామస్తుల సమస్య ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయింది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కావడంలేదని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని గ్రామస్తులు అంటున్నారు. బడాబాబుల పైరవీలు.. పైరవీలతో చిక్కుముడులను సరిచేసుకొని తక్కువ ధరలకు విలువైన భూములు కాజేసేందుకు కొందరు బడాబాబులు రంగంలోకి దిగారు. అధికార పార్టీ నాయకులతో ప్రభుత్వ అధికారులకు చెప్పించుకొని ఫైళ్లను చక చకా కదుపుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇన్నేళ్లుగా తాము పోరాటం చేస్తున్నా పట్టించుకోని అధికారులు, బడాబాబులకు మాత్రం కొమ్ము కాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇటీవల గ్రామాన్ని సందర్శించి బడాబాబులకు అనుకూలంగా నివేదికలు అందించేందుకు సమాయత్తమైనట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. దేవాదాయశాఖ ఆర్జేసీ శ్రీనివాస్ ఇటీవల గ్రామాన్ని సందర్శించినప్పటికీ గ్రామస్తులకు సమాచారం ఇవ్వలేదు. స్థానిక దేవదాయశాఖ అధికారులు సైతం ఆయన రాకను గోప్యంగా ఉంచడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి తమ సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు.