ప్రేమతో ఆదరించారు | Rakul Preet Singh on completing seven years in Tollywood | Sakshi
Sakshi News home page

ప్రేమతో ఆదరించారు

Published Mon, Nov 30 2020 12:35 AM | Last Updated on Mon, Nov 30 2020 12:35 AM

Rakul Preet Singh on completing seven years in Tollywood - Sakshi

‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకున్నారు రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తన తొలి విజయాన్ని గుర్తు చేసుకున్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ‘‘ఏడేళ్ల క్రితం ఇదే రోజు నవ్వుతూ ఉన్నాను. ఇప్పుడూ అదే నవ్వు నా మొహం మీద ఉంది. దీనంతటికీ కారణం నన్ను ఎంతో ప్రేమతో ఆదరించిన, అభిమానించిన ప్రేక్షకుల వల్లే. ఎక్కడో ఢిల్లీ అమ్మాయిని అయినా అచ్చ తెలుగు అమ్మాయిగా ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది.

ఈ జర్నీలో నన్ను నమ్మిన దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్, ఫ్రెండ్స్‌ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇంకా మంచి నటిగా, మనిషిగా మారడానికి మీ సలహాలు, సూచనలు, విమర్శలు చాలా ఉపయోగపడ్డాయి. అలానే నా కుటుంబం, నా టీమ్‌ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు’’ అన్నారు. కాగా రకుల్‌ ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు, తమిళంలో ‘భారతీయుడు 2’, ‘అయాలన్‌’, తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారామె.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement