venkatadri express
-
ప్రేమతో ఆదరించారు
‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో తెలుగులో తొలి విజయాన్ని అందుకున్నారు రకుల్ ప్రీత్‌సింగ్. ఈ సినిమా విడుదలై ఏడేళ్లు అవుతోంది. ఈ సందర్భంగా తన తొలి విజయాన్ని గుర్తు చేసుకున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ‘‘ఏడేళ్ల క్రితం ఇదే రోజు నవ్వుతూ ఉన్నాను. ఇప్పుడూ అదే నవ్వు నా మొహం మీద ఉంది. దీనంతటికీ కారణం నన్ను ఎంతో ప్రేమతో ఆదరించిన, అభిమానించిన ప్రేక్షకుల వల్లే. ఎక్కడో ఢిల్లీ అమ్మాయిని అయినా అచ్చ తెలుగు అమ్మాయిగా ఈ ప్రయాణం అద్భుతంగా సాగింది. ఈ జర్నీలో నన్ను నమ్మిన దర్శకులు, నిర్మాతలు, యాక్టర్స్, ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఇంకా మంచి నటిగా, మనిషిగా మారడానికి మీ సలహాలు, సూచనలు, విమర్శలు చాలా ఉపయోగపడ్డాయి. అలానే నా కుటుంబం, నా టీమ్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు’’ అన్నారు. కాగా రకుల్ ప్రస్తుతం హిందీలో రెండు సినిమాలు, తమిళంలో ‘భారతీయుడు 2’, ‘అయాలన్’, తెలుగులో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారామె. -
వెంకటాద్రి రైలులో తుపాకీ కలకలం!
సాక్షి ప్రతినిధి కడప: అక్కడ ప్రయాణికులెవ్వరూ లేరు.. తుపాకీ మాత్రమే ఉంది. ఎవరైనా వస్తారేమో, ఆయుధం గురించి వాకబు చేస్తారామోనని సిబ్బంది వేచి ఉన్నారు. ఎవ్వరూ రాలేదు. తుపాకీ రైళ్లోకి ఎలా వచ్చింది.. ప్రభుత్వ ఆయుధమా...అక్రమ ఆయుధమా అని సిబ్బంది మదనపడుతున్నారు. ఎంతకీ తెలియడం లేదు. ట్రైన్ ఆఖరు స్టేషన్ రానే వచ్చింది. వెంటనే సిబ్బంది రైల్వే పోలీసులకు తుపాకీ విషయం చేరవేశారు. తుపాకీ స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. తుదకు ఏఆర్ కానిస్టేబుల్ చక్రి ఆయుధంగా గుర్తించారు. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వెంకటాద్రి రైలులో కలకలం రేపింది. ఏఆర్ కానిస్టేబుల్ చక్రి ఎంపీ రమేష్‌కు గన్‌మెన్‌గా విధుల్లో ఉన్నారు. సోమవారం రాత్రి ఎంపీతో పాటు గన్‌మెన్ హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్లకు వెంకటాద్రి రైల్లో ప్రయాణించారు. రాత్రి 4.30గంటలకు ట్రైన్ ఎర్రగుంట్ల చేరుకుంది. ఎంపీ రమేష్‌తో పాటు గన్‌మెన్ చక్రి ట్రైన్ దిగారు. ఎంపీ లగేజీ పట్ల జాగ్రత్త వహించి, చేతబట్టుకున్న గన్‌మెన్ తన ఆయుధం ట్రైన్లోనే మర్చిపోయారు. ఆయుధం మర్చిపోయిన విషయం అసలు గుర్తించలేదు. ట్రైన్ కడప, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరు, రేణిగుంట చేరుకుంది. ఆయుధం మాత్రమే ప్రయాణిస్తోంది. ప్రయాణికులెవ్వరూ లేకపోగా, తుపాకీ మాత్రమే ఉన్న విషయాన్ని గుర్తించిన క్లినింగ్ సిబ్బంది రైల్వే పోలీసులకు తిరుపతిలో సమాచారం ఇచ్చారు. తుపాకీ స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి, ఎంపీ రమేష్ గన్‌మెన్ చక్రి ఆయుధంగా గుర్తించి సమాచారం చేరవేశారు. 8.30 గంటలకు వరకూ తన ఆయుధం మిస్ అయ్యిందన్న విషయాన్ని గన్‌మెన్ చక్రి గుర్తించలేదు. రైల్వే పోలీసుల నుంచి సమాచారం రాగానే హుటాహుటిన పయనమయ్యారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ చిట్టచివర స్టాపింగ్ చిత్తూరు కావడంతో అక్కడికి చేరుకొని రైల్వేపోలీసులకు ఏఆర్ కానిస్టేబుల్ చక్రి వివరాలు తెలియజేశారు. అసలు కంటే కొసరుకే ప్రాధాన్యత.... ప్రజాప్రతినిధుల గన్మెన్లు నాయకుని వ్యక్తిగత భద్రత కంటే ఆ నాయకుని మెప్పు కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. అధికారపార్టీ నేతల వద్ద విధులు నిర్వర్తించేవారు ఈ కోవలో మరింత దూకుడుగా వ్యవహారిస్తున్నారు. అందుకు అనేక ఘటనలు నిదర్శనంగా ఉన్నాయి. మంత్రి ఆదినారాయణరెడ్డి కనుసైగల మేరకు ఆయన గన్మెన్లు ఏకంగా ఓ వ్యాపారిని కిడ్నాప్‌కు పాల్పడిన ఉదదంతం జిల్లా పాఠకులకు విధితమే. వ్యాపారి ఫిర్యాదు మేరకు మంత్రి గన్‌మెన్‌పై కేసు నమోదు కాగా, ప్రస్తుతం వారిలో ఒకరు సస్పెన్షన్ ఎదుర్కొన్నారు. అలాగే ప్రభుత్వ హోదాలో ఉన్నా మరో నాయకుడి గన్‌మెన్ ఏకంగా రాజకీయప్రత్యర్థి పార్టీ గ్రామస్థాయి నాయకులను బెదిరింపులకు పాల్పడ్డారు. మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి గన్‌మెన్ చంద్రశేఖర్‌రెడ్డి తుపాకీ తన కుమారుని అప్పగించిన ఘటనలో ఏకంగా తన ప్రాణాలే పోగొట్టుకున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యుడు రమేష్‌నాయుడు గన్‌మెన్ చక్రికి ఎంపీ లగేజీ పట్ల ఉన్న శ్రద్ద తన ఆయుధంపై లేకపోయింది. ఈ ఘటనలన్నీ గన్మెన్లు విధులు, అంకితభావానికి ప్రశ్నార్థకంగా నిలుస్తోండడం విశేషం. -
నిర్మాతగా మారిన మరో యంగ్ హీరో
డిఫరెంట్ సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సందీప్ కిషన్ స్టార్ ఇమేజ్ ను మాత్రం అందుకోలేకపోయాడు. హీరోగా కోలీవుడ్ లో కాస్త పరవాలేదనిపించుకున్నా టాలీవుడ్ లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ డైరెక్షన్లో నెక్ట్స్ ఏంటి సినిమా చేస్తున్న ఈయంగ్ హీరో మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ జనరేషన్ హీరోలు నటనతో పాటు నిర్మాతలుగానూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే బాటలో సందీప్ కిషన్ కూడా తన సూపర్ హిట్ సినిమా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ పేరు వచ్చేలా వెంకటాద్రి టాకీస్ బ్యానర్‌ను స్థాపించి నిర్మాతగా మారాడు. తానే స్వయంగా హీరోగా నటిస్తూ ‘నిను వీడని నీడను నేనే’ సినిమాను నిర్మిస్తున్నాడు.తమిళ దర్శకుడు కార్తీక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతోంది. -
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు
20 నిమిషాలు నిలిచిపోయిన రైలు రాజంపేట: తిరుపతి నుంచి కాచిగూడ వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో సోమవారం రాత్రి ఎస్–11 బోగి వద్ద పొగలు రావడంతో రైలు 20 నిమిషాలు నిలిచిపోయింది. రాత్రి 8.50 నిమిషాలకు రైలు వైఎస్సార్ జిల్లా రాజంపేట స్టేషన్ హోం సిగ్నల్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ఎస్–11 బోగీ బ్రేక్ బైండింగ్ పట్టుకుపోయింది. దీంతో కొద్దిపాటి మంటలు, పొగలు వచ్చాయి. రాజంపేట రైల్వేస్టేషన్ హోం సిగ్నల్ వద్ద ఈ పరిస్థితి తలెత్తింది. బోగీ కింద పొగలు, మంటలను చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే చైన్ లాగడంతో డ్రైవర్ రైలును ఆపారు. ఆగ్రహంతో ఉన్న ప్రయాణికులు బోగి వద్దకు వచ్చిన గార్డుతో వాదులాటకు దిగారు. వాకీటాకీ లాక్కున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. గార్డు బ్రేక్‌ను సరిచేయడంతో ప్రయాణికులు శాంతించి, వాకీటాకీని తిరిగి ఇచ్చారు. రైలు 9.10 నిమిషాలకు బయలుదేరింది. బ్రేక్ బైండింగ్ పట్టుకుపోవడం సహజమేనని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందిలేదని రైల్వే అధికారి ఒకరు చెప్పారు. రైలు లూప్లైన్లోకి వెళ్లేటప్పుడు డ్రైవర్ బ్రేక్ వేసిన సమయంలో బ్రేక్ బైండింగ్‌లో స్పార్క్ వస్తుందని తెలిపారు. కాగా తరచుగా వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎక్స్ ప్రెస్ రైల్లో దోపిడీ దొంగల బీభత్సం
తిరుపతి : వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు.శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్1, ఎస్7, ఎస్9 భోగీల్లో నిద్రిస్తున్న ప్రయాణికుల వద్ద నుంచి నగలు, నగదు లాక్కెళ్లారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జరిగింది. దీంతో ప్రయాణికులు తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మలుపు ఖాయం!
‘‘ప్రతి విషయంలోనూ ఎంతో శ్రద్ధ తీసుకుని ‘బీరువా’ సినిమా చేశాను. నా మీద ప్రేక్షకులు పెట్టుకున్న నమ్మకాన్ని ఈ సినిమా ఏమాత్రం వమ్ము చేయదు’’ అని సందీప్‌కిషన్ నమ్మకంగా చెబుతున్నారు. కణ్మణి దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘బీరువా’ నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో సందీప్ ముచ్చటించారు. కేవలం కథను నమ్మి ఈ సినిమా చేశా. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విజయం తర్వాత నేను ఒప్పుకున్న కథ ఇది. అగ్రనిర్మాణ సంస్థలైన ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కూడా కథ నచ్చే సంయుక్తంగా ఈ సినిమా నిర్మించాయి. హేమాహేమీలైన ఛోటా కె. నాయుడు, థమన్, గౌతంరాజులు ఈ సినిమాను పెద్ద స్థాయికి తీసుకెళ్లారు. నాక్కూడా సినిమా మీద నమ్మకంతో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నా. కథలోని కొత్తదనం తెలియాలనే ‘బీరువా’ టైటిల్ పెట్టాం. సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్ లేని ఇల్లు అయినా ఉంటుందేమో కానీ, బీరువా లేని ఇల్లు ఏదీ ఉండదు. ఈ సినిమాలో బీరువా కూడా ఓ కీలకపాత్ర పోషించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’లో రైలు ఎలా కీలకమైందో, ఇందులోని ప్రేమకథకు బీరువా కీలకమన్నమాట. ప్రస్తుతం ‘టైగర్’ సినిమా చేస్తున్నా. ‘బీరువా’, ‘టైగర్’ చిత్రాలు నా కెరీర్‌ని కచ్చితంగా మలుపు తిప్పడం ఖాయం. ఈ రెండు సినిమాల ఫలితాలను బట్టి నా భవిష్యత్ కెరీర్‌ను ఎలా డిజైన్ చేసుకోవాలో నిర్ణయించుకుంటా. -
కొత్తగా చూపించారు!
‘‘సందీప్ కిషన్ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా పాటల సీడీని నేనే విడుదల చేశాను. ఆ సినిమా పెద్ద హిట్. ఈ సినిమా అంతకు మించి విజయాన్ని సాధించాలి’’ అని దర్శకుడు వి.వి.వినాయక్ అన్నారు. సందీప్‌కిషన్, సురభి జంటగా ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘బీరువా’. ఎస్.ఎస్.తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు, ప్రచార చిత్రాల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నిర్మాత రామోజీరావు ఆవిష్కరించి వి.వి.వినాయక్‌కి అందించారు. ప్రచార చిత్రాలను రకుల్ ప్రీత్‌సింగ్ విడుదల చేశారు. సినిమా విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు. తమన్ మంచి సంగీతం ఇచ్చారనీ, దర్శకుడు కణ్మణి తనను కొత్తగా చూపించాడనీ, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తర్వాత మళ్లీ జెమినీ కిరణ్‌గారి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాననీ సందీప్ కిషన్ అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కణ్మణి కృతజ్ఞతలు తెలిపారు. పాటలతో పాటు సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని తమన్ నమ్మకం వెలిబుచ్చారు. -
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు అదనపు బోగీ
సాక్షి, హైదరాబాద్: కాచిగూడ-చిత్తూరు మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12797/12798) కు శాశ్వత ప్రాతిపదికన ఒక స్లీపర్‌క్లాస్ బోగీని అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాచిగూడ-చిత్తూరు ప్రయాణికులకు శని వారం (నవంబరు 29) నుంచి, చిత్తూరు-కాచిగూడ ప్రయాణికులకు ఆదివారం (నవంబరు 30)నుంచి ఈ అదనపు బోగీ సదుపాయం అందుబాటులోకి రానుంది. -
వచ్చే ఏడాది హిందీ సినిమా చేస్తా!
ప్రస్థానం, స్నేహగీతం, రొటీన్ లవ్‌స్టోరీ, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, రారా కృష్ణయ్య.. ఇలా సినిమా సినిమాకీ నటునిగా పరిణతి సాధించుకుంటూ ముందుకెళ్తున్నారు హీరో సందీప్ కిషన్. ఆయన కథానాయకునిగా ‘గుండెల్లో గోదారి’ ఫేం కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘జోరు’ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించారు. ‘గుండెల్లో గోదారి’ టైమ్‌లోనే కుమార్ నాగేంద్ర, నేనూ ఓ సినిమా చేయాలనుకున్నాం. ఎలాంటి సినిమా చేయాలనే విషయంపై ఎన్నో రకాలుగా ఆలోచించాం. పూర్తి స్థాయి కామెడీ సినిమా చేద్దామని చివరకు నాగేంద్రే అన్నాడు. నాక్కూడా ఆ ఆలోచన నచ్చింది. ప్రయోగాల జోలికి వెళ్లకుండా, ప్రేక్షకుల్ని నవ్వించడమే పరమావధిగా ఈ సినిమా చేశాం. కామెడీ కథల పరంగా ఇప్పటి వరకూ రాని కథాంశంతో ఈ సినిమా చేశాం. చెబితే వింతగా అనిపిస్తుంది కానీ... ఈ సినిమాలో రాశి ఖన్నా, సుష్మ, ప్రియా బెనర్జీ కథానాయికలు. ఈ ముగ్గురూ ఒకే పాత్ర పోషించడం విశేషం. ఆ పాత్ర పేరు అన్నపూర్ణ. చెబితే వింతగా అనిపిస్తుంది కానీ, చూస్తేనే మజా ఉంటుంది. అలాగే... ఇందులో నాకు ఇద్దరు అమ్మానాన్నలుంటారు. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ చిత్రాల శైలిలో కన్ఫ్యూజన్తో కూడిన కామెడీ ఉంటుంది. బ్రహ్మానందం, సప్తగిరి పాత్రలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణలు. అక్కడ మంచి పేరు తెచ్చింది ‘షోర్ ఇన్ ది సిటీ’ చిత్రం బాలీవుడ్లో నాకు మంచి పేరు తెచ్చింది. అయితే... తెలుగులో బిజీగా ఉండటం వల్ల మళ్లీ బాలీవుడ్లో సినిమా చేయలేకపోయాను. వచ్చే ఏడాది ఓ హిందీ సినిమా చేస్తా. ఇక ఇక్కడి విషయానికొస్తే - కన్మణి దర్శకత్వంలో ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్నాను. అలాగే ఎ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వి.ఆనంద్ దర్శకత్వంలో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న చిత్రం చేస్తున్నా. మరో తమిళ సినిమా కూడా ‘ఓకే’ చేశా. -
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో చోరీ
హైదరాబాద్: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం మధ్యాహ్నం దోపిడి జరిగింది. అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు రైల్వే కంపార్ట్మెంట్లోకి ప్రవేశించి దంపతుల నుంచి 2.5 లక్షల రూపాయల విలువైన నగలు దోచుకున్నారు. అనంతరం దొంగలు చైను లాగి రైలు దిగి పారిపోయారు. బాధితులు ఈ సంఘటన గురించి గుత్తి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దొంగల కోసం గాలిస్తున్నారు. -
సాంకేతిక లోపంతో నిలిచిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
చిత్తూరు: చిత్తూరు-కాచిగూడ మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తంది. దీంతో చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలోని మామండూరు వద్ద నిలిచిపోయింది. మూడు గంటలుగా రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా మరో ఇంజిన్ ఏర్పాటు చేసేందుకు రైల్వే అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్ రాక
-
నేడు పులివెందులకు వైఎస్ జగన్ రాక
పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం పులివెందులకు రానున్నారు. ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి బుధవారం ఉదయం ముద్దనూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి పులివెందులకు వెళతారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటారు. అనంతరం లింగాల మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోయిన వేరుశెనగ, అరటి, చీనీ, కరివేపాకు పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత వేంపల్లెకు చేరుకుని ఇటీవల వివాహమైన వేంపల్లె ముస్లిం మైనార్టీ నాయకుడు మునీర్ బాషా సోదరుని కుమార్తె షిమియా, మహబూబ్ బాషా దంపతులను ఆశీర్వదిస్తారు. గురువారం వేముల మండలంలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. -
మేకింగ్ ఆఫ్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'
-
గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నా
తిరుమల : ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో త్వరలో ఓ సిని మాలో నటించనున్నట్లు యువ హీరో సుశాంత్ తెలిపారు. సోమవారం ఉదయం నైవేద్య విరామసమయంలో ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడి యాతో మాట్లాడారు. దర్శకుడు గాంధీ వివాహం సందర్భంగా తిరుపతికి వచ్చానన్నారు. అనంతరం తాను స్వామి ఆశీస్సులకోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. అందరూ సంతోషంగా ఉండేలా చూడాలని స్వామిని ప్రార్థించానని చెప్పారు. కాగా, ఆలయం వెలుపల హీరో సుశాంత్‌ను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అంతకుముందు ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ సుశాంత్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
పెళ్లి కొడుకు కానున్న వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ దర్శకుడు
హైదరాబాద్: వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన మేర్లపాక గాంధీ ఓ ఇంటివాడు కానున్నాడు. తన మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్తూరు జిల్లాలోని రేణిగుంట గ్రామానికి చెందిన గాంధీ ఆగస్టు 11 తేది సోమవారం పెళ్లి కొడుకు కానున్నాడు. గత ఏడాది సినీ ప్రస్తానానికి నాంది పలికిన గాంధీ తొలి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రముఖ నవలా రచయిత మేర్లపాక మురళి ,విజయల కుమారుడైన గాంధీకి రేణిగుంట మండలం జీవగ్రామ్ ప్రాంతానికి చెందిన సుష్మతో ఏడు అడుగులు వేయనున్నాడు. మరో మూడు రోజుల్లో అంటే.. సోమవారం తెల్లవారుజామున తిరుపతి, తిరుచానురు రోడ్డులో ఉన్న అర్బన్ హబ్స్(శిల్పారామం)లో వీరి వివాహానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ విభిన్న ప్రయత్నంగా పేరు తెచ్చుకోవడమే కాకుండా, వాణిజ్య పరంగా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమై టాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించారు. మేర్లపాక గాంధీ తన రెండో చిత్రాన్ని సుశాంత్ హీరోగా చేయబోతున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ సిద్ధం అయిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. -
పవన్‌కళ్యాణ్‌తో నటించాలనుంది: రకుల్ ప్రీత్ సింగ్
సినిమాల్లో బిజీ వల్ల గోల్ఫ్ ఆడటమే మరిచిపోయానని గారాలు పోతోంది ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఫేం రకుల్ ప్రీత్ సింగ్. శుక్రవారం సాయంత్రం ఓ హోటల్ జరిగిన ‘టాక్సిఫర్ ష్యూర్’ కార్యక్రమంలో రుకుల్ సందడి చేసింది. బాలీవుడ్ కంటే నాకు తెలుగు పరిశ్రమే ఇష్టమంటున్న రకుల్ ‘సిటిప్లస్’కు పలు ముచ్చట్లు చెప్పింది. తాను జాతీయ స్థాయిలో గోల్ఫ్ ఆడానని, ఇప్పుడు సినిమాలతో ఆటకు దూరమయ్యానంది. తెలుగు సినిమా ప్రతి ఒక్కటి చూస్తానంటూ టాలీవుడ్‌పై తన అభిమానాన్ని ఒలకబోసింది. పవన్‌కళ్యాణ్, బన్ని అంటే తనకు చాలా ఇష్టమని వారితో కలిసి నటించాలనుందని మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం తెలుగులో మూడు సినిమాలు చేస్తున్నానని, తెలుగులో మాట్లాడటం కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నానని చెప్పింది. బాలీవుడ్, టాలీవుడ్‌కు మధ్య కేవలం భాష మాత్రమే తేడా అని.. పరిశ్రమ ఏదైనా శ్రమ ఒక్కటేనని అభిప్రాయపడింది. రాత్రివేళల్లో టాక్సీలో ప్రయాణించేటప్పుడు మహిళలు చాలా అప్రమత్తంగా ఉండాలని రకుల్ జాగ్రత్తలు చెప్పింది. తాను చాలా సార్లు టాక్సీలో ప్రయాణించినా ఎలాంటి అవాంఛిత సంఘటన ఎదురుకాలేదని చెప్పింది. - సుమన్ -
బ్రేక్ కోసం ఎదురుచూస్తోన్న ఆది
-
అలసిపోయినా ఫర్వాలేదు కానీ... ఖాళీగా ఉండలేను!
సినీ నటి కావాలని కలలుగన్న అమ్మాయి... అందుకోసం మోడలింగ్‌లో కృషి చేసిన అమ్మాయి... కన్నడంలో మొదలుపెట్టి, తెలుగులోకి వచ్చి... ఆ పైన తమిళం మీదుగా హిందీ దాకా వెళ్ళిన నటి... అందం, కళ్ళతోనే భావాలు పలికించగల అభినయ నైపుణ్యమున్న ఇరవై మూడేళ్ళ రకుల్ ప్రీత్ సింగ్. ఒక్క ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ హిట్‌తో నాలుగు తెలుగు చిత్రాలతో బిజీగా మారిన నవతరం నాయిక. బిజీ బిజీగా గడుపుతున్న రకుల్‌తో కాసేపు... ఒకేసారి నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నారు.. హఠాత్తుగా కెరీర్ ఇలా మలుపు తీసుకుంటుందని ఊహించారా? నిజం చెప్పాలంటే అస్సలు ఊహించలేదు. ఎప్పుడో రెండు మూడేళ్ల తర్వాత ఇలా బిజీ అవుతానేమో అనుకున్నా. కానీ, ఎప్పుడో జరుగుతుందనుకున్నది ఇప్పుడే జరిగినందుకు ఆనందంగా ఉంది. మీ తొలి చిత్రం ‘గిల్లి’ (కన్నడ - 2009)కీ, మీ మలి చిత్రం ‘కెరటం’ (తెలుగు -2011)కీ మధ్య గ్యాప్. ఆ తర్వాత కూడా కొంత విరామం తీసుకుని తెలుగులో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ (2013) చేశారు. కారణం ఏంటి? డిగ్రీ పూర్తి చేయాలనే ఆకాంక్షతో కావాలనే విరామం తీసుకున్నా. వాస్తవానికి ‘కెరటం’ ఒప్పుకున్నప్పుడు సినిమాల్లో కొనసాగాలా, లేదా అని తర్జనభర్జన పడ్డాను. ఎందుకలా.. సినిమాలంటే ఇష్టం లేదా? చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. హీరోయిన్ కావాలన్నదే నా ఆశయం. అయితే, డిగ్రీ పూర్తి చేయకుండా సినిమాల్లో కొనసాగడం మంచిది కాదనిపించింది. అందుకే విరామం తీసుకున్నా. హీరోయిన్ అవుతానంటే మీ ఇంట్లో ఏమన్నారు? నన్ను హీరోయిన్గా చూడాలని అమ్మ కల. అందుకే, ఎండల్లో తిరగనిచ్చేది కాదు. నూనె వంటకాలు తింటే, బరువు పెరుగుతావని హెచ్చరించేది. నేను ‘మిస్ ఇండియా’ టైటిల్ గెల్చుకున్నప్పుడు అమ్మ ఎంత సంతోషపడిందో ఎప్పటికీ మర్చిపోలేను. అలాగే, నన్ను వెండితెరపై చూసి, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. మరి... టైటిల్ గెలుచుకున్నప్పుడు మీకేమనిపించింది? ఆ క్షణాలను మాటల్లో చెప్పలేను. ఎందుకంటే, ‘ఈ దేశానికే ఈమె అందగత్తె... మిస్ ఇండియా’ అని తీర్మానించారు. అందుకే అది చాలా చాలా విలువైన బిరుదు. ఆ టైటిల్ సంపాదించిన తర్వాత హిందీ రంగంలోకి అడుగుపెట్టి, అవకాశాల కోసం ప్రయత్నం చేయాలనుకున్నా. హిందీ సినిమాలే చేయాలని ఎందుకనుకున్నారు? నేను ఢిల్లీ అమ్మాయిని కదా! హిందీ బాగా వచ్చు. దక్షిణాది భాషలు, ఇక్కడి సంప్రదాయం నాకు తెలియదు. అందుకే హిందీ సినిమాల మీద దృష్టి పెట్టా. డిగ్రీ పూర్తి చేశారు కాబట్టి, ఇక దృష్టంతా సినిమాలపైనేనా? అవును. కాకపోతే ‘కెరటం’ చేసినప్పుడు చిత్ర నిర్మాణం గురించి, నటన గురించి నాకేం తెలియదు. అలా వచ్చి.. ఇలా నటించేసి, అలా వెళ్లిపోయేదాన్ని. మొదటి సినిమాతో ఎలాంటి సినిమాలు చేయాలనే విషయంపై అవగాహన వచ్చింది. అందుకే, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అవకాశం రాగానే ఒప్పుకున్నాను. నాకు మంచి సినిమా అవుతుందనిపించింది. నా నమ్మకం నిజమైంది. ఆ సినిమా విజయం వల్లే మీరింత బిజీ అయ్యారనొచ్చా? అనుకోవచ్చు. ఒక సినిమా విజయం సాధిస్తే, అందులో నటించిన నటీనటులకు మరింత గుర్తింపు లభిస్తుంది. ఆ విధంగా నాకు ఆ సినిమా లాభించింది. ప్రస్తుతం మీరు చేస్తున్న నాలుగు సినిమాల్లో ‘కరెంటు తీగ’, ‘పండగ చేస్కో’ నిజానికి నటి హన్సిక చేయాల్సినవి. మరి, ఆ అవకాశాలు మీకు వచ్చినప్పుడు ఎలా అనిపించింది? అది కాకతాళీయంగా జరిగింది. ఒక హీరోయిన్ను ముందు అనుకొని, ఆ తర్వాత ఆ స్థానంలో వేరే హీరోయిన్ను తీసుకున్న సందర్భాలు, సినిమాలు చాలా ఉన్నాయి. నాకు ఆ రెండు సినిమాల కథ, నా పాత్రలు నచ్చాయి. అందుకని అంగీకరించా. పగలు ‘కరెంట్ తీగ’, రాత్రి ‘పండగ చేస్కో’ షూటింగ్లలో పాల్గొన్న రోజులున్నాయి. పగలూ రాత్రీ షూటింగ్ చేయడం ఇబ్బందిగా అనిపించలేదా? ఒక్కరోజు నాకు పని లేకపోతే జీవితమే వ్యర్థం అయినట్లుగా ఫీలై పోతా. వరుసగా షూటింగ్స్ చేసి, అలసిపోయినా ఫర్వాలేదు కానీ, ఖాళీగా మాత్రం ఉండలేను. హిందీ చిత్రం ‘యారియాన్’లో లిప్‌లాక్ సీన్లో నటించారు. మరి తెరపై బికినీ కూడా ధరిస్తారా? కథ డిమాండ్ చేస్తే ఓ నటిగా ఏదైనా చేస్తా. అది నా బాధ్యత. ‘యారియాన్’ చూసినవాళ్లు, లిప్‌లాక్ సీన్ అనవసరం అని అనరు. ఆ సినిమాలో ఆ సన్నివేశం లేకపోతే ఏదో లోపించినట్లుగా అనిపిస్తుంది. ఇక, బికినీ విషయానికి వస్తే... ఒకవేళ నేను చేస్తున్నది పల్లెటూరి అమ్మాయి పాత్ర అనుకోండి.. అప్పుడు బికినీ ధరించమంటే అందులో లాజిక్ లేదు. కావాలని ఆ సన్నివేశం పెట్టినట్లు ఉంటుంది. అదే గనక ఆధునిక యువతి పాత్రలో బికినీ ధరిస్తే, సందర్భానికి అతికినట్టు ఉంటుంది. ఏమైనా, కథ, సన్నివేశంలో అవసరముంటే, బికినీ ధరించడానికి సిద్ధం. మొదట్లో హిందీ సినిమాలే చేయాలనుకున్నారు కదా! మరి, ఇప్పుడేమనుకుంటున్నారు? తెలుగు సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నా. ఎందుకంటే, ఇక్కడ మంచి మంచి పాత్రలు చేసే అవకాశం వస్తోంది. తెలుగు అర్థమవుతోంది. కొంచెం కొంచెం మాట్లాడుతున్నాను కూడా! త్వరగా తెలుగు భాష నేర్చుకోవాలనుకుంటున్నా. అందుకే ఇక్కడ షూటింగ్ లొకేషన్లో నాతో తెలుగులోనే మాట్లాడమని అందరితో చెబుతున్నా. మీకంటూ ఏదైనా డ్రీమ్ రోల్ ఉందా? కొన్ని పాత్రలు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఉదాహరణకు ‘బొమ్మరిల్లు’ సినిమాలో జెనీలియా పోషించిన హాసిని పాత్ర. అలా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది. అలాంటి పాత్ర వస్తే ఎంత కష్టపడడానికైనా నేను సిద్ధం. సినీ తారగా పేరొచ్చింది. ఈ సెలబ్రిటీ లైఫ్ ఎలా ఉంది? వ్యక్తిగా నాలో మార్పు రాలేదు. స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్‌తో టచ్‌లోనే ఉన్నా. వీలు కుదిరినప్పుడు వాళ్లను కలుస్తున్నా. కాకపోతే అంతకు ముందు అందం, శరీరం గురించి పెద్దగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరంలేదు. కానీ, ఇప్పుడు తప్పనిసరిగా శరీరాకృతిని కాపాడుకోవాలి. అంటే... నచ్చిన ఆహారానికి దూరంగా ఉంటున్నారన్నమాట? ఐస్‌క్రీమ్‌లు, స్వీట్స్‌కు వీలైనంత దూరంగా ఉంటున్నా. ఒకవేళ ఎప్పుడైనా తిన్నా, అదనంగా వర్కవుట్ చేసేస్తా. మీలాంటి అందమైన అమ్మాయిలకు సహజంగానే బోల్డన్ని ప్రేమలేఖలు వస్తాయి కదా! మరి మీకు? వచ్చాయండి. వాటిని చదువుతా కానీ, జవాబివ్వను. అంటే... మీ జీవితంలో ఇంకా ఎవరూ లేరన్నమాట? లేరు. ప్రస్తుతం సినిమాలే నా జీవితం. - డి.జి. భవాని -
'ఎక్స్‌ప్రెస్' వేగంతో దూసుకెళ్తున్న సందీప్
-
వెంకటాద్రిలో పొగలు
రాజంపేట, న్యూస్‌లైన్ : కాచిగూడ నుంచి తిరుపతికి వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్(12797)రైలులో గురువారం పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. అలాగే బ్రేక్‌బైడింగ్‌తో హస్తవరం రైల్వేస్టేషన్లో అరగంట పాటు నిలిచిపోయింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలు రాజంపేట-నందలూరు మధ్య ఉన్న హస్తవరం రైల్వేస్టేషన్ దాటిన తర్వాత ఎస్-1బోగీకి సంబంధించి వీల్ వద్ద బ్రేక్‌బ్లాక్ జామ్ అయింది. పాస్‌త్రూలో వెళుతున్న రైలులో స్వల్పంగా మంటలు రావడంతో స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది గమనించారు. వెంటనే డ్రైవర్‌కు సమాచారం ఇవ్వడంతో నిలిపివేశారు. బ్రేక్‌బైడింగ్‌లో సాంకేతికలోపం తలెత్తడంతో రైలు వేగం కూడా తగ్గిపోయింది. వెంటనే అప్రమత్తమైన రైలు రన్నింగ్‌స్టాప్ ఎస్-1బోగీ వద్దకు చేరుకొని బ్రేక్‌రిలీజ్ చేశారు. అనంతరం రైలుకు క్లియరెన్స్ ఇచ్చారు. -
'వెంకట్రాద్రి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు'
కడప జిల్లా రాజంపేట సమీపంలో గురువారం ఉదయం వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లోని ఓ బోగీ నుంచి ఆకస్మాత్తుగా పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు వెంటనే ట్రైన్ చైయిన్ లాగీ నిలిపివేశారు. కొంతమంది ప్రయాణికులు భయంతో ట్రైన్ వదిలి పరుగులు తీశారు. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బోగీలో పొగలు వ్యాపించడానికి గల కారణాలపై కనుగొన్నారు. బ్రేక్ స్ట్రక్ అవడంతోనే పొగలు వ్యాపించాయని డ్రైవర్ తెలపడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 15 నిముషాల అనంతరం ట్రైన్ అక్కడి నుంచి బయలుదేరింది. వెంకట్రాది ఎక్స్‌ప్రెస్ రైలు కాచిగూడ నుంచి చిత్తూరు వెళ్తుండగా ఆ ఘటన చోటు చేసుకుంది. -
‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’లో..!
ఇంకొన్నాళ్ల పాటు నా ప్రయాణం తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లోనే అంటున్నారు కృతి కర్భందా. వచ్చే నెల 3న సుమన్ శైలేంద్రతో కలిసి ఆమె ఈ రైలు ప్రయాణం చేయబోతున్నారు. వీళ్లతో పాటు అశోక్, బుల్లెట్ ప్రకాష్, వీణా సుందర్, సాధు కోకిల తదితర తారలు కూడా తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో వెళతారు. విషయం ఏంటంటే.. సందీప్‌కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా రూపొందిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రం కన్నడంలో ‘తిరుపతి ఎక్స్‌ప్రెస్’ పేరుతో రీమేక్ కానుంది. సుమన్ శైలేంద్ర, కృతి జంటగా పొన్‌కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇటీవలే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చూశాననీ, చాలా నచ్చిందని కృతి తెలిపారు. ఇదిలా ఉంటే ఈ రీమేక్‌తో పాటు తెలుగు ‘కిక్’ రీమేక్ ‘సూపరో రంగా’లో కూడా ఆమె కథానాయికగా నటిస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు రీమేక్స్‌లో నటించడం థ్రిల్లింగ్‌గా ఉందని, ‘కిక్’లో ఇలియానా, ‘వెంకటాద్రి...’లో రకుల్ నటనను అనుకరించకుండా నా శైలిలో యాక్ట్ చేస్తానని కృతి తెలిపారు. -
పైరసీ సీడీ చూసి సందీప్ కిషన్ షాక్!!
టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్‌కు షాక్ తగిలింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా మంచి విజయం సాధించడంతో సంతోషంగా ఉన్న సందీప్.. ఉన్నట్టుండి దాని పైరసీ సీడీలు నేరుగా తన కంట్లోనే పడటంతో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న సందీప్ కిషన్.. తాను ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనంలో ఉన్నట్టుండి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సీడీ చూసి అవాక్కయ్యాడు. సినిమా విడుదలై ఇప్పటికి రెండు వారాలే కావడం, ఇంతలోనే సీడీ చూడటంతో హతాశుడయ్యాడు. అందులో ఇటీవలే విడుదలైన తన చిత్రంతో పాటు.. బన్నీ అండ్ చెర్రీ, మసాలా సినిమాలు కూడా ఉన్న సీడీ ఉంది. దాంతో చక్కటి విజయం సాధించిన సంతోషం కాస్తా ఒక్కసారిగా ఉసూరుమంది. ఇలా ఉంటే సినిమాలు ఎలా బాగుపడతాయంటూ ట్విట్టర్లో తన ఆవేదన పంచుకున్నాడు. తనకు ఇది చాలా డిప్రెసింగ్‌గా అనిపిస్తోందన్నాడు. అయితే, పైరసీ వచ్చినా కూడా తన సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అందుకు వారికి సెల్యూట్ అంటూ మరో ట్వీట్ చేశాడు. పైరసీ వల్ల సినీ పరిశ్రమ కుదేలు అవుతోందని తెలిసినా, ఇప్పటికీ సినిమా విడుదలైన రెండు మూడు రోజుల్లోనే పైరసీ సీడీలు మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. అత్తారింటికి దారేది సినిమా అయితే విడుదలకు ముందే పైరసీ కాపీ బయటకు వచ్చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. దీంతో సినీ ప్రముఖులు వాపోతున్నారు. Found this in the Innova I m Traveling to Vijayawada in..Ila unte Cinemalu ela bagupaduthayi..it's depressing :( pic.twitter.com/AQ4BkR3VWb — Sundeep Kishan (@sundeepkishan) December 22, 2013 Inspite of piracy VenkatadriExpress is still declared a superhit..adhi purely Telugu audience gopathanammu :) salute to you — Sundeep Kishan (@sundeepkishan) December 22, 2013 -
జంధ్యాలగారిలా క్లీన్ మూవీస్ చేయాలనేది నా లక్ష్యం
ప్రస్తుతం సినిమాలు ఎక్కువగా చూస్తోంది యువతరమే. అందుకే దర్శక, నిర్మాతలు యూత్నే టార్గెట్ చేస్తున్నారు. కొందరైతే, కుర్రకారుని వలలో వేసుకోడానికి ద్వందార్థ సంభాషణలకు కూడా తెగబడుతున్నారు. కానీ.. ఈ మధ్య ఓ సినిమా వచ్చింది. దాన్ని యువతరం సినిమా అనలేం, కుటుంబ కథాచిత్రం అని కూడా అనలేం. పోనీ ప్రేమకథ అందామా! అంటే.. అది కూడా కరెక్ట్ కాదు. అది అందరి కథ, అందరికీ నచ్చే కథ. అశ్లీలత అనేది మచ్చుకైనా కనిపించని కథ. అదే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. తొలి సినిమాతోనే... అందరి మనసుల్నీ దోచేసిన ఆ చిత్ర దర్శకుడు మేర్లపాక గాంధీతో ‘సాక్షి’ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ... ఇండస్ట్రీలో హిట్ రాగానే... నిర్మాతలు అడ్వాన్సులతో ముంచెత్తేస్తారు. మరి మీ పరిస్థితి ఎలా ఉంది? అడ్వాన్సులు అందుకుంటున్నారా? నా పరిస్థితి అచ్చం మీరు చెప్పినట్టే ఉంది. అయితే.. అడ్వాన్సులు మాత్రం అందుకోవడం లేదు. ‘నా తొలి సినిమా ప్రమోషన్ పనులే ఇంకా పూర్తవ్వలేదు. ఇప్పుడే నెక్ట్స్ సినిమా గురించి ఆలోచించలేను’ అని గట్టిగా చెప్పేస్తున్నా. కెరీర్‌ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నా. నా తర్వాత సినిమా ఏంటో త్వరలో తెలియజేస్తా. కథ రెడీగా ఉందా? ప్రస్తుతం అదే పనిలో ఉన్నా. కథ ఓ కొలిక్కి వచ్చింది. ఇది కూడా తొలి సినిమా లాగా భిన్నమైన కథాంశమే. లిటిల్బిట్ జర్నీ కూడా ఉంటుంది. ప్రేమ నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ ఇది. హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. కొందరు దర్శకులు ఎఫర్ట్ మొత్తం తొలి సినిమాకే పెట్టేస్తున్నారు. మలి సినిమాకొచ్చేసరికి దెబ్బ తింటున్నారు. ఈ విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు? కథ ఫర్ఫెక్ట్గా ఉండాలి. స్క్రీన్‌ప్లే ఇంటిలిజెంట్‌గా ఉండాలి. ‘వీడు ఏదో గమ్మత్తు చేశాడ్రా’ అనిపించాలి. అలా ఉంటే విజయం తథ్యం. యువతరం చూస్తున్నారు కదా.. అని ప్రేమకథల వెంటే పడకూడదు... ఎప్పటికప్పుడు కొత్తగా వెళ్లాలనేది నా అభిమతం. సాధ్యమైనంత వరకూ నా సినిమాల్లో హ్యూమర్, మెసేజ్ ఉండేలా చూసుకుంటాను. జంధ్యాలగారు తీసిన సినిమాల్లా క్లీన్ మూవీస్ తీయాలనేది నా లక్ష్యం. నాకు తొలి విజయం కంటే మలి విజయమే ఇంపార్టెంట్. మీ నాన్నగారు మేర్లపాక మురళి రచయిత కదా. ఆయన ప్రభావం మీపై ఎంత? చాలా ఉంది. కళలపట్ల ఆసక్తి నాకు ఆయన నుంచే సంక్రమించింది. చిన్నప్పట్నుంచీ నాకు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు నాన్న. బుక్ కంప్లీట్ చేస్తే ఇరవై రూపాయలు ఇచ్చేవారు. పోనుపోనూ పుస్తకాలు చదవడం నాకు వ్యసనంలా మారింది. చివరకు నేనే ఆయనకు డబ్బులిచ్చి పుస్తకాలు తెమ్మనేవాణ్ణి. చలం, బుచ్చిబాబు, శ్రీశ్రీ, తిలక్ ఇలా మహామహుల పుస్తకాలు చదివేశాను. అనుకోకుండా డెరైక్టర్ అయ్యారా? లేక మీ లక్ష్యం కూడా ఇదేనా? నా లక్ష్యం ఇదే. ఇంటర్ టైమ్‌లోనే డెరైక్టర్ని అవుతానని నాన్నతో చెప్పాను. ‘బీటెక్ పూర్తి చేశాక నీ ఇష్టం వచ్చినట్లు చేయ్’ అన్నారాయన. ఆళ్లగడ్డలో ఇంజినీరింగ్ బయోటెక్నాలజీ చేశాను. కోర్స్ పూర్తవ్వగానే, అన్నమాట ప్రకారం చెన్నయ్ ఎల్వీప్రసాద్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌లో చేర్పించారు నాన్న. అయితే, డెరైక్షన్ కోర్స్ అంటే సెల్ఫ్ సెక్యూరిటీ ఉండదని నాన్న ఫీలింగ్. అందుకే.. నాన్న కోసం సినిమాటోగ్రఫీ కోర్స్‌లో చేరాను. కానీ, ఎక్కువగా డెరైక్షన్ క్లాసుల్లోనే ఉండేవాణ్ణి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అవకాశం ఎలా వచ్చింది? చెన్నయ్‌లో కోర్స్ పూర్తి చేసుకొని హైదరాబాద్ రాగానే.. ‘ఖర్మరా దేవుడా’ అనే షార్ట్ ఫిలిం చేశాను. అది బాగా పాపులర్ అయ్యింది. వాసవి ఇంజినీరింగ్ కాలేజ్ చిత్రోత్సవాలో బెస్ట్ షార్ట్ఫిలింగా ఎంపికైంది. దర్శకుడు హరీష్‌శంకర్ చేతులపై జ్ఞాపిక అందుకున్నాను. తర్వాత తన సినిమాకు పనిచేయమని హరీష్ అడిగారు. కలుద్దామనుకునేలోపు ఆయన ఫారిన్ వెళ్లిపోయారు. ఈ గ్యాప్‌లో తయారు చేసుకున్న ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ కథను సందీప్‌కిషన్‌కి చెప్పాను. తనకు బాగా నచ్చేసింది. తనే కథ వినిపించమని నన్ను పలువురు నిర్మాతల వద్దకు పంపారు. కథ అయితే.. అందరికీ నచ్చేది కానీ, సందీప్ అనగానే.. బడ్జెట్ వర్కవుట్ అవుతుందా అని భయపడేవారు. ఓసారి మా ఊరు రేణిగుంటలో ఉండగా, ‘చోటా కె.నాయుడు కథ వింటారట’ రమ్మని సందీప్ నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లి చోటాగారికి కథ చెప్పాను. ఆయనకు కథ తెగ నచ్చేసింది. వెంటనే.. జెమినీ కిరణ్‌గారికి చెప్పించారు. ఆయనకూ నచ్చడంతో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ పట్టాలెక్కింది. ఈ సినిమా విడుదలవ్వగానే మీకు దక్కిన గొప్ప కాంప్లిమెంట్? సినిమా విడుదలైన రోజు ఓ ఫిలిం జర్నలిస్ట్ అన్నారు.. ‘నేను మంచి దర్శకుల మీద ఇటీవలే ఓ బుక్ రాశాను. మీ సినిమా నెల రోజులు ముందు విడుదలైనట్లయితే... నా బుక్‌లో మీరూ ఉండేవారు’ అని. ఈ సినిమా విషయంలో ఎన్ని ప్రశంసలు దక్కినా... ఆయన అన్నమాట మాత్రం నాకు అమితానందాన్నిచ్చింది. -
దూసుకెళ్తున్న వెంకటాద్రి
-
సోలోగా నా తొలి విజయం ఇది - సందీప్
‘‘మామూలుగా కొన్ని సినిమాలకు డివైడ్ టాక్ వస్తుంది. కానీ ఈ సినిమా ‘హిట్’ అని అందరూ అంటున్నారు. ఆ పదం వింటుంటే, మంచి అనుభూతి కలుగుతోంది. నన్ను ‘బోయ్ నెక్ట్స్ డోర్’ అంటారు. అందుకేనేమో తమ అబ్బాయిలా భావించి, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూస్తున్నారు. సోలోగా నేను సాధించిన తొలి విజయం ఇది’’ అన్నారు సందీప్‌కిషన్. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సందీప్‌కిషన్, రకుల్‌ప్రీత్ జంటగా కిరణ్ నిర్మించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ గత వారం విడుదలైంది. హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్లో దర్శకుడు మాట్లాడుతూ-‘‘సినిమా బాగుందని చాలామంది ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. మంచి చిత్రానికి ఆదరణ లభిస్తుందని మరోసారి ప్రూవ్ అయ్యింది’’ అన్నారు. ‘‘మామూలుగా నేనో సినిమాకి పని చేస్తే, కెమెరా వర్క్ బాగుందని ఫోన్ చేస్తారు. కానీ ఈ సినిమాకి డెరైక్టర్ అద్భుతం అని ఫోన్స్ వస్తున్నాయి. సందీప్ బాగా చేశాడు’’ అని ఛోటా కె.నాయుడు అన్నారు. ఆస్ట్రేలియా, కెనడా నుంచి వచ్చిన తన స్నేహితులు తెలుగు తెలియకపోయినా ఈ సినిమా చూసి, ఎంజాయ్ చేశారని రమణ గోగుల చెప్పారు. ఇంకా బ్రహ్మాజీ, రకుల్, సప్తగిరి తదితరులు ఆనందం వ్యక్తం చేశారు. -
వందో తప్పు చేయకుండా..?
‘‘శిశుపాలుడు వంద తప్పులు చేస్తే శ్రీకృష్ణుడు శిక్షిస్తాడు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తయారు చేసిన కథ ఇది’’ అన్నారు మేర్లపాక గాంధీ. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సందీప్‌కిషన్ హీరోగా కిరణ్ నిర్మించిన చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘వంద తప్పులు చేస్తే కొడుకుని ఇంట్లోంచి పంపించడానికి రెడీగా ఉంటాడు ఓ తండ్రి. 99 తప్పులు చేసిన ఆ కొడుకు ఒక్క తప్పు చెయ్యకుండా ఉండటానికి ఏం చేశాడు? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది. కిరణ్‌గారు ఈ కథ వెంటనే సినిమా చేద్దామన్నారు. ఛోటాగారు కూడా ఈ కథ విని బాగా ఎంజాయ్ చేశారు. ఈ కథలో ఎగ్జయిట్మెంట్ ఉంది కాబట్టే, వీరితో పాటు ఇతర చిత్రబృందానికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నన్ను, కథను నమ్మి సందీప్ ఈ చిత్రం అంగీకరించాడు. రమణ గోగులగారు స్వరపరచిన పాటలు విజయం సాధించాయి. మూడు పాటలూ సందర్భానుసారంగా సాగుతాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ చిత్రం ఇది’’ అన్నారు. -
‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’తో అస్సలు సంబంధం లేదు
‘ఫొటోలు చేతపట్టుకుని చెన్నయ్‌లో సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగిన రోజుల్ని మరిచిపోలేన’ని గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు యువ కథానాయకుడు సందీప్‌కిషన్. ప్రస్థానం, స్నేహగీతం, రొటీన్ లవ్‌స్టోరి, గుండెల్లో గోదారి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. త్వరలో ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సందీప్.. శనివారం హైదరాబాద్‌లో విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. నువ్వు జ్యోతిక అన్నయ్య ఏంటని నవ్వారు... మా నాన్నగారు ఓ సాధారణ ఉద్యోగి. అమ్మ.. ఆలిండియా రేడియోలో ఇంజినీర్. సినిమా ఇండస్ట్రీలో నాకు తెలిసిన ఏకైక వ్యక్తి మామయ్య చోటా కె.నాయుడు. ఆయన నన్ను సిఫార్సు చేయాలన్నా... ముందు నా దగ్గర విషయం ఉండాలి కదా. అందుకే నన్ను నేను నిరూపించుకోవడానికి ఫొటోలు పట్టుకొని చెన్నయ్‌లోని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. ‘భద్ర’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నారని తెలియగానే.. ‘హీరోయిన్ అన్నయ్య పాత్రయినా దొరక్కపోతుందా’ అని ట్రై చేశా. ‘నువ్వు జ్యోతిక అన్నయ్య ఏంటి?’ అని అందరూ నవ్వారు. అలాంటి అవమానాలు ఎన్నో. ఆ రోజుల్లో నాతో పాటు అవకాశాల కోసం తిరిగిన వాళ్లు ఇంకా అదే పనిలో ఉన్నారు. నాపై మాత్రం నిర్మాతలు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇదంతా నా అదృష్టం. ఇప్పటివరకూ తొమ్మిది సినిమాలు చేశాను. అన్నింటిలోనూ మంచి పాత్రలే చేశాను. కానీ సోలో హీరోగా చెప్పుకోదగ్గ సినిమా మాత్రం చేయలేదు. ఆ లోటు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తీర్చేసింది. కథ ఆద్యంతం రైల్లో నడుస్తుంది. అందుకే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ అని నామకరణం చేశాం. అంతేతప్ప ‘చెన్నయ్ ఎక్స్‌ప్రెస్’ సినిమాకు, దీనికీ అస్సలు సంబంధం లేదు. ఓ పెయింటింగ్‌లా మలిచారు... మామయ్య చోటా కె.నాయుడు కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇందులో హీరోని నేను కాబట్టి ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. కథను ప్రేమించి, ఈ చిత్రాన్ని ఓ పెయింటింగ్‌లా మలిచారు. దర్శకుడు గాంధీ వయసులో చిన్నవాడైనా... అనుభవం ఉన్న దర్శకునిగా చిత్రాన్ని తెరకెక్కించారు. రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుంది. అలా చేస్తే జనాలు కూడా నమ్మరు ఏ సినిమా చేసినా అందులో కొత్తదనం కోసం తాపత్రయపడతాను. అనవసరపు ఆర్భాటాలకు వెళ్లడం నాకూ, నిర్మాతలకు కూడా శ్రేయస్కరం కాదని నా అభిప్రాయం. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఓ వందమందిని కొట్టేశానంటే జనాలు కూడా నమ్మరు. అందుకే నా ఇమేజ్‌కి, వయసుకు తగ్గ పాత్రలనే ఎంచుకుంటున్నాను. డి ఫర్ దోపిడి, డి.కె బోస్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘రారా కృష్ణయ్య’ చిత్రం నిర్మాణంలో ఉంది. -
‘వెంకటాద్రి...’కి వాయిస్ ఓవర్
కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన అల్లరి నరేష్... ఇప్పుడు ఓ కొత్త అవతారం ఎత్తారు. ఓ చిత్రం కోసం తన గాత్రాన్ని అరువిచ్చేశారాయన. అల్లరి నరేష్ ఏంటి? గాత్రదానం చేయడమేంటి? అనుకుంటున్నారా? గాత్రదానం అంటే వాయిస్ ఓవర్. ఇంతకీ ఈ ‘సుడి గాడు’ వాయిస్ ఓవర్ ఇచ్చింది ఏ సినిమాకు అనుకుంటున్నారా? ఆ సినిమానే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. సందీప్ కిషన్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై జెమినీ కిరణ్ నిర్మించారు. గాంధీ మేర్లపాక దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఇందులో హీరోహీరోయిన్లు, కీలక పాత్రధారులను పరిచయం చేయడం కోసం నరేష్ వాయిస్ఓవర్ అందించారు. అల్లరి నరేష్ వాయిస్ఓవర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, ఇప్పటికే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని దర్శక, నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రమణ గోగుల, కెమెరా : చోటా కె.నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు. -
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వలపు ప్రయాణం
హైదరాబాద్, తిరుపతి మధ్య నడిచే అనేక ఎక్స్‌ప్రెస్‌లలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఈ రైలులో వెళుతోన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి జీవితాన్ని ఈ ప్రయాణం ఏ విధంగా మలుపు తిప్పింది? వలపులూ ఆ మలుపులూ తెలియాలంటే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వచ్చేవరకూ ఆగాల్సిందే. సందీప్ కిషన్, రకుల్‌ప్రీత్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కిరణ్ నిర్మించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. రమణ గోగుల సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం’’ అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు. -
కదులుతున్న ‘సమైక్య’దండు
=సమైక్య శంఖారావానికి సిద్ధమైన సమైక్యవాదులు =అన్ని సంఘాల నుంచి సర్వత్రా మద్దతు =పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు నుంచి ప్రత్యేక రైలు =భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి నుంచి 55 బస్సులు =చెవిరెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డిల నేతృత్యంలో మరో రైలు తిరుపతి, న్యూస్‌లైన్: జిల్లా నుంచి శుక్రవారం అన్ని దారులూ హైదరాబాద్ వైపే మళ్లనున్నాయి. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగే సమైక్య శంఖారావానికి పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్దయెత్తున వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం బయలుదేరి శనివారం ఉదయానికల్లా రాజధానికి చేరుకోవడానికి ఏ ర్పాట్లు చేసుకున్నారు. తిరుపతి నుంచి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో 50 మినీ, ఐదు ఓల్వో బస్సు లు బయలుదేరనున్నాయి. కొంతమంది రైళ్లలో రిజర్వేషన్ చేయించుకున్నారు. మాజీ మంత్రి, పుంగనూరు మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పార్టీ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు మిథున్‌రెడ్డి ఆధ్వర్యం లో చిత్తూరు నుంచి శుక్రవారం సాయంత్రం 4.30 గం టలకు ప్రత్యేక రైలు బయలుదేరనుంది. ఇది 5.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక్కడున్న వారిని ఎక్కించుకుని హైదరాబాదుకు వెళుతుంది. పీలేరు నుంచి పది బస్సులు ఏర్పాటు చేశారు. పార్టీ చంద్రగిరి, శ్రీకాళహస్తి ని యోజకవర్గాల సమన్వయకర్తలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రైలు చంద్రగిరి నుంచి సాయంత్రం 6 గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి మీదుగా శ్రీకాళహస్తికి రాత్రి 8గంటలకు చేరుకుంటుంది. శ్రీకాళహస్తి నుంచి ఆరు ప్రత్యేక రైలు బోగీలను ఏర్పాటు చేశారు. పలమనేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, శ్రీకాళహస్తి, సత్యవేడు, పుత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు నియోజకవర్గాల నుంచి ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల ఆ ద్వర్యంలో వెళ్లేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా నుంచి వెళ్లే రైళ్లు శనివారం రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరి ఆదివారం ఉదయానికి తిరిగి చేరుకుంటాయి. హాజరుకానున్న వివిధ సంఘాల నేతలు పార్టీ శ్రేణులతోపాటు జిల్లాకు చెందిన వివిధ సంఘాల నేతలు, సభ్యులు సమైక్య శంఖారావానికి హాజరుకానున్నారు. తిరుపతి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు, టీటీడీ యూనియన్ నాయకులు, ఎస్వీ యూనివర్సిటీకి చెందిన వెయ్యి మంది విద్యార్థులు బయలుదేరుతున్నారు. చిత్తూరు నుంచి ఎన్జీవో నాయకులు, విద్యార్థులు వెళుతున్నారు. పలమనేరు జేఏసీ నాయకులు చిత్తూరు నుంచి వెళ్లే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌కు రిజర్వేషన్ చేయించుకున్నారు. కొన్ని ప్రయివేటు బస్సులను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో మండలానికి రెండు వందల మంది చొప్పున వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. మదనపల్లె నుంచి ఉపాధ్యాయ, ఇతర సంఘాల నేతలు సిద్ధమవుతున్నారు. సత్యవేడు ప్రాంతానికి చెందిన జేఏసీ నాయకులు జిల్లాలో బస్సులు దొరక్క తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెప్పించుకుంటున్నారు. -
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' స్టిల్స్
సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జెమినీ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. రమణ గోగుల సంగీతం అందించారు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడిన ప్రణయానుభవాలతో ఈ సినిమా రూపొందింది. -
రైలు ప్రయాణంలో ప్రణయం
‘‘హైదరాబాద్ నుంచి తిరుపతి బయలుదేరిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో ఓ అమ్మాయి, అబ్బాయి ప్రయాణం చేస్తుంటారు. ఈ ప్రయాణంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన ప్రణయానుభవాలతో ఈ సినిమా రూపొందింది. పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఉంటుంది’’ అని దర్శకుడు మేర్లపాక గాంధీ చెప్పారు. సందీప్ కిషన్, రకుల్ ప్రీత్ జంటగా ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై జెమినీ కిరణ్ నిర్మిస్తున్న చిత్రం ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ఛోటా కె.నాయుడు మాట్లాడుతూ -‘‘నాలుగేళ్లుగా తన సినిమాకు ఫొటోగ్రఫీ చేయమని సందీప్ అడుగుతున్నాడు. మంచి కథ దొరికితే చేస్తానన్నాను. ఈ కథ వినగానే వెంటనే ఇంప్రెస్ అయ్యాను’’ అని తెలిపారు. తన కెరీర్లో చాలా స్పెషల్ సినిమా ఇదని సందీప్‌కిషన్ పేర్కొన్నారు. ఈ నెల 25న పాటల్ని విడుదల చేస్తున్నామని సంగీత దర్శకుడు రమణ గోగుల చెప్పారు. ఇందులో పిసినారి అమ్మాయిగా నటిస్తున్నానని రకుల్ ప్రీత్ తెలిపారు. చిత్రీకరణ పూర్తయిందని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి పాటలు: భాస్కర్ భట్ల, శ్రీమణి, కాసర్ల శ్యామ్. -
ప్రయాణం.. నరకం!
సాక్షి, చిత్తూరు: సమైక్యరాష్ట్రం కోసం రెండు నెలలుగా జిల్లాలో జరుగుతున్న ఆందోళనలు అత్యవసర ప్రయాణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఆర్టీసీ బస్సులు సైతం లేకపోవడంతో దూరప్రాంతాల ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడం నరకప్రాయంగా మారుతోంది. దీనికి తోడు శుక్రవారం నుంచి 72 గంటల పాటు సీమాంధ్ర బంద్‌కు వైఎస్సార్ సీపీ పిలుపు ఇవ్వటంతో ప్రయాణికులకు మరిన్ని అవస్థలు తప్పడం లేదు. ప్రత్యామ్నాయ ప్రజా రవాణా వ్యవస్థగా ఉన్న రైల్వేశాఖ సామాన్యుని కడగండ్లు పట్టించుకునే పరిస్థితిలో లేదు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు రైలు బోగీల్లో కనీసం కాలుమోపే స్థలం లేకున్నా అవస్థలు పడుతూ వెళుతున్నారు. దీంతో తిరుపతి నుంచి వచ్చిపోయే రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. దీనికి తోడు తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం అ య్యాయి. ఏటా ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది ఇలా వచ్చే వారికి రైలు తప్ప మరో ప్రత్యామ్నాయ మార్గం లేదు. అయినా దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్యాసిం జర్ రైళ్లకు ఇంతవరకు అదనపు బోగీలు అమర్చలేదు. కేవలం ఆదాయం సమకూరే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మరికొన్ని సూపర్‌ఫాస్టు రైళ్లకు మాత్రమే ఒకటి రెండు అదనపు బోగీలు వేసి చేతులు దులుపుకుంది. ఇక తిరుపతి కాట్పాడి మార్గంలో అయితే ప్యాసింజర్ రైలు బోగీల్లో లోపల స్థలం లేక డోర్‌వద్ద వేలాడుతూ, ఒక్కొక్కసారి ట్రైన్‌పైకి ఎక్కి ప్రయాణం చేస్తున్నారు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి మీదుగా విజయవాడ వరకు నడిచే ప్యాసింజర్ రైళ్లకు కూడా అదనపు బోగీలు లేవు. టిక్కెట్లు మాత్రం అడిగినంతమందికి ఇస్తున్నారు. చెన్నయ్ రూట్లోనూ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఒక్క అదనపు బోగీ వేయలేదు. ఈ క్రమంలో అత్యవసర పనులపై వెళ్లేవారు నరకం చవిచూస్తున్నారు. దోచేస్తున్న ప్రైవేట్ వాహనాలు రైళ్లతో పాటు నిత్యం వేలాదిమంది సుమోలు, టెంపోలు, సెవెన్‌సీటర్ ఆటోలను ఆశ్రయించి ప్రయాణం చేస్తున్నారు. బస్సులు లేకపోవడం, ప్రయాణికుల అవసరాలను అదనుగా తీసుకున్న ప్రైవేట్ వాహనాలవారు కనీస దూరానికి కూడా రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తున్నారు. చిత్తూరు నుంచి పీలేరుకు సెవెన్సీటర్లు, ఇతర మామూలు వాహనాల్లో రూ.100, ప్రైవేట్ ట్రావెల్స్ కార్లలో రూ.150 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రయాణికుల జేబులకు చిల్లు తప్పడం లేదు.