గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నా | i am acting in the gandhi directed film, says sumanth | Sakshi
Sakshi News home page

గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నా

Published Tue, Aug 12 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:43 AM

గాంధీ దర్శకత్వంలో  ఓ సినిమాలో నటించనున్నా

గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నా

తిరుమల : ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో త్వరలో ఓ సిని మాలో నటించనున్నట్లు యువ హీరో సుశాంత్ తెలిపారు. సోమవారం ఉదయం నైవేద్య విరామసమయంలో ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడి యాతో మాట్లాడారు. దర్శకుడు గాంధీ వివాహం సందర్భంగా తిరుపతికి వచ్చానన్నారు.

అనంతరం తాను స్వామి ఆశీస్సులకోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. అందరూ సంతోషంగా ఉండేలా చూడాలని స్వామిని ప్రార్థించానని చెప్పారు. కాగా, ఆలయం వెలుపల హీరో సుశాంత్‌ను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అంతకుముందు ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ సుశాంత్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement