Sushanth
-
టీఎంసీ నేతపై అటాక్ ప్లాన్.. సీన్ రివర్స్ కావడంతో..
కోల్కత్తా: పశ్చిమ బెంగాల్లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. అధికార టీఎంసీ నేతను టార్గెట్ చేసి దుండగులు చంపే ప్రయత్నం చేయగా.. ప్లాన్ విఫలమైంది. దీంతో, సదరు నేత.. వారికి పట్టుకోవడంతో సంచలన నిజాలు బయటకు వచ్చాయి. ఈ ఘటన బెంగాల్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.వివరాల ప్రకారం.. టీఎంసీ నేత సుశాంత ఘోష్ కోల్కత్తా మున్సిపల్ కార్పొరేషన్లో 108 వార్డుకు కౌన్సిలర్‌గా ఉన్నాడు. సుశాంత.. శుక్రవారం సాయంత్రం తన ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం, ఇంటి బయటే వారందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఇద్దరు షూటర్లు బైక్‌పై వచ్చి సుశాంతను తుపాకీతో కాల్చే ప్రయత్నం చేశారు. ఒక వ్యక్తి తన జేబులో నుంచి తుపాకీ తీసి గురిపెట్టి కాల్చే ప్రయత్నం చేశాడు.అయితే, అది పనిచేయకపోవడంతో మరోసారి కాల్చేందుకు ప్రయత్నించాడు. అయినప్పటికీ అది మొరాయించింది. అప్పటికి తేరుకున్న సుశాంత వెంటనే లేచి అతడిని పట్టుకున్నాడు. అక్కడే ఉన్న మరికొందరు టీఎంసీ నేతలు కూడా అలర్ట్ అయ్యి.. వారిద్దరినీ పట్టుకున్నారు. అనంతరం, వారిని ఎవరు పంపారని ప్రశ్నించగా.. తనకెవరూ డబ్బులు ఇవ్వలేదని, ఫొటో ఇచ్చి చంపమని అడిగారని చెప్పడం వినిపించింది. ఆ తర్వాత వారిని పోలీసులకు అప్పగించారు.దీంతో, కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కౌన్సిలర్‌ను చంపేందుకు బీహార్ నుంచి కిల్లర్లను రప్పించినట్టు విచారణలో తేలింది. దీని వెనుక స్థానిక ప్రత్యర్థులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే, తనను చంపేందుకు ప్లాన్ చేసిన వారు ఎవరో తెలియదని కౌన్సిలర్ పేర్కొన్నారు. తాను పుష్కర కాలంగా కౌన్సిలర్‌గా ఉన్నానని, తనపై దాడి జరుగుతుందని ఊహించలేకపోయానని చెప్పుకొచ్చారు. తన సెక్యూరిటీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటానని తెలిపారు. #Shocking| #CCTV| Miraculous escape for #TMC leader Sushanta Ghosh after two bike borne youths appeared in front of him & one of them tried to shoot him at point blank range this evening in #Kolkata. However, the 9mm pistol got locked & he couldn’t open fire. Ghosh escaped unhurt… pic.twitter.com/onSn1TxYcd— Pooja Mehta (@pooja_news) November 15, 2024 -
కవల పిల్లలతో నయన్.. భర్తతో కలిసి వేడుకల్లో అమలాపాల్!
►క్రిస్మస్ వేడుకల్లో కవల పిల్లలతో నయన్ ►పెళ్లి తర్వాత తొలిసారి భర్తతో క్రిస్మస్ జరుపుకున్న అమలాపాల్ ►పండుగ వేళ చిల్ అవుతోన్న రాశి ఖన్నా ►కుటుంబంతో కలిసి క్రిస్మస్ వేడుకలో హీరో సుశాంత్ ►తన ఇద్దరు పిల్లలతో లాస్య క్రిస్మస్ సెలబ్రేషన్స్ ►ఫెస్టివ్ మోడ్‌లో మాళవిక మోహనన్ ►క్రిస్మస్ వేడుకలో తారకరత్న ఫ్యామిలీ View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Shiva Jyothi (@iam.savithri) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
యువ హీరో తల్లిపై పోలీస్ కేసు.. ఏం జరిగింది?
హీరో అక్కినేని నాగార్జున 'బిగ్‌బాస్'తో పాటు ఓ సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు అతడి సోదరి నాగసుశీలపై పోలీస్ కేసు నమోదైందనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఎందుకంటే కొడుకుని హీరోగా పెట్టి పలు చిత్రాల్ని నిర్మించిన ఈమెపై ఎవరు కేసు పెట్టారు? అయినా ఎందుకు పెట్టారు? నాగార్జున చెల్లెలు నాగసుశీల. ఈమె కొడుకే నటుడు సుశాంత్. గతంలో తెలుగులో పలు సినిమాల్లో హీరోగా చేశాడు. కొన్నాళ్ల నుంచి మాత్రం అల వైకుంఠపురములో, రావణాసుర, భోళా శంకర్ తదితర చిత్రాల్లో కీలకపాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. గతంలో ఇతడిని హీరోగా పెట్టి.. తల్లి నాగసుశీల 'కరెంట్', 'అడ్డా', 'ఆటాడుకుందాం రా' తదితర చిత్రాల్ని నిర్మించారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 20 సినిమాలు రిలీజ్) ఈమె చింతలపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తితో కలిసి సినిమాలు నిర్మించారు. అలాంటిది 2019లో నాగసుశీలనే అతడిపై పోలీస్ కేసు పెట్టారు. అప్పట్లో వీళ్లిద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేశారు. తనకు తెలియకుండా శ్రీనివాసరావు.. భూముల్ని అమ్మేసుకుని, ఆ డబ్బు దుర్వినియోగం చేశాడని ఈమె ఆరోపణలు చేశారు. అలాంటిది ఇప్పుడు అదే శ్రీనివాసరావు.. నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. ఈమెతోపాటు మరో 12మంది కలిసి తనపై దాడి చేశారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. గత నాలుగేళ్లుగా వీళ్లిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అదికాస్త మరోసారి కేసుల వరకు వెళ్లడం.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా అయిపోయింది. (ఇదీ చదవండి: అసిస్టెంట్ పెళ్లిలో స్టార్ హీరో సందడి.. వీడియో వైరల్!) -
మగధీర టైమ్‌లో చూడాలనుకున్న ప్రదేశానికి వెళ్లిన రాజమౌళి
► నార్వేలో మగధీర కోసం పరిశోధన చేస్తున్నప్పుడు చూడాలనుకున్న పల్పిట్ రాక్ ప్రదేశాన్ని తాజాగ చూసేశాం అంటున్న రాజమౌళి ►ట్రెండీ శారీతో హీట్ పెంచుతున్న విష్ణు ప్రియ ►అరియానతో సోహైల్ లుక్ అదుర్స్ ►చెరువు గట్టు వద్ద కూర్చోని చేపలకు ఆహారం వేస్తున్న గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ ►ఫ్యామిలీ ఫోటోను విడుదల చేసిన సుశాంత్ View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) View this post on Instagram A post shared by Vishnupriyaa bhimeneni (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Shriya Saran (@shriya_saran1109) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Lasya Manjunath (@lasyamanjunath) View this post on Instagram A post shared by RamCharan.k 🔵 (@ramcharankonidella.k) View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Hamsa Nandini (@ihamsanandini) View this post on Instagram A post shared by Sadaa (@sadaa17) View this post on Instagram A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) -
‘భోళా శంకర్’ మూవీ రివ్యూ
టైటిల్: భోళా శంకర్ నటీనటులు: చిరంజీవి, తమన్నా, కీర్తీ సురేశ్, సుశాంత్, తరుణ్ అరోరా, మురళీ శర్మ, బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిశోర్ గెటప్ శ్రీను తదితరులు నిర్మాణ సంస్థ: ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామబ్రహ్మం సుంకర దర్శకత్వం: మెహర్ రమేష్ సంగీతం: మహతి స్వరసాగర్ సినిమాటోగ్రఫీ: డూడ్లీ ఎడిటర్: మార్తాండ్ కే. వెంకటేశ్ విడుదల తేది: ఆగస్ట్ 11, 2023 ‘భోళా శంకర్’ కథేంటంటే.. శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మీ అలియాస్ మహా(కీర్తి సురేశ్) చదువు కోసం హైదరాబాద్ నుంచి కోల్కత్తా వస్తాడు. చెల్లిని ఓ కాలేజీలో జాయిన్ చేసి, అదే నగరంలో టాక్సీ డ్రైవర్ ఉద్యోగంలో చేరుతాడు. అక్కడ ఓ గ్యాంగ్ నగరంలోని యువతులను కిడ్నాప్ చేసి బయటి దేశాలకు అమ్మేస్తుంటారు(ఉమెన్ ట్రాఫికింగ్). ఈ కేసు చేధించడంలో పోలీసులు ఆటో, క్యాబ్ డ్రైవర్ల సహాయం తీసుకుంటారు. అనుమానితుల ఫోటోలను చూపించి, వాళ్లలో ఎవరైనా కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరతారు. శంకర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కొంతమంది అమ్మాయిలను రక్షిస్తారు. పోలీసులకు సమాచారం ఇచ్చింది క్యాబ్ డ్రైవర్ శంకర్ అనే విషయం మహిళల అక్రమ రవాణా(ఉమెన్ ట్రాఫికింగ్) చేసే గ్యాంగ్ లీడర్ అలెగ్జాండర్‌కు తెలుస్తుంది. దీంతో అతన్ని శంకర్‌ని టార్గెట్ చేస్తారు. శంకర్ కూడా అలెగ్జాండర్ మనుషులను ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. అసలు శంకర్ నేపథ్యం ఏంటి? హైదరాబాద్‌లో భోళా భాయ్‌గా పిలవబడే శంకర్.. కోల్‌కత్తాకు ఎందుకు వచ్చాడు? ఉమెన్ ట్రాఫీకింగ్ గ్యాంగ్‌తో శంకర్‌కు ఉన్న వైరం ఏంటి? అనేదే తెలియాలంటే థియేటర్లో ‘భోళా శంకర్’ సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ రోజుల్లో రీమేక్ చిత్రాలు చేయడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఒక వేళ రీమేక్ చేసిన ఎలాంటి చిత్రాలు చేయాలి? ఒక భాషలో సక్సెస్ అయి.. ఆ కథ మన ప్రేక్షకులను మెప్పించగలదనే నమ్మకం ఉంటే చేయాలి. అంతేకానీ అక్కడ హిట్ అయింది కదా.. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అనుకుంటే పొరపాటే. ‘భోళా శంకర్’టీమ్ కూడా ఆ పొరపాటు చేశారేమో అనిపిస్తుంది. ఎనిమిదేళ్ల కిందట రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తమిళ సినిమా ‘వేదాళం’చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఈ కథ అప్పట్లో అక్కడి ప్రేక్షకులకు కొత్తగా అనిపించొచ్చు కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం ఈ తరహా సినిమాలు చాలానే చూశారు. అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి ఇటీవల నటించిన ‘వాల్తేరు వీరయ్య’లో ఈ ఛాయలు కనిపిస్తాయి. అక్కడ బ్రదర్ సెంటిమెంట్ అయితే.. ఇక్కడ సిస్టర్ సెంటిమెంట్. అంతే తేడా. కథలో మెయిన్ ట్విస్ట్ ‘ఊసరవెళ్లి’ చిత్రాన్ని గుర్తుకు తెస్తుంది. కథ పాతదైన కథనం అయినా కొత్తగా ఉందా అంటే అదీ లేదు. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు ఇచ్చి పదేళ్లుగా సినిమాలు తీయని మెహర్ రమేష్‌కు మెగాస్టార్ చిరంజీవితో సినిమా అవకాశం ఇస్తే... దానిని ఎంత సద్వినియోగం చేసుకోవాలి? కానీ మెహర్ రమేశ్ మాత్రం ఆ అవకాశాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. రొటీన్ సన్నివేశాలతో బోరింగ్‌గా సినిమాను తెరకెక్కించాడు. ఒక్కటంటే ఒక్క సీన్ కూడా ఫ్రెష్‌గా, వావ్ అనిపించేలేలా తెరకెక్కించలేదు. ఉమెన్ ట్రాఫికింగ్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కాసేపటికే చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. అయితే ఈ ఎంట్రీ కూడా చాలా రొటీన్‌గా ఉంటుంది. ఇక ఆ తర్వాత వెన్నెల కిశోర్‌తో వచ్చే కామెడీ సీన్ అయితే నవ్వించకపోగా, చిరాకుగా అనిపిస్తుంది. బ్రహ్మానందం కోర్టు సీన్ కూడా అంతే. ఒక్క సీన్ తర్వాత ఒకటి వచ్చి వెళ్తుంది కానీ ప్రేక్షకుడు మాత్రం కథలో లీనం కాడు. ఉన్నంతలో ఒకటి, రెండు యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. ఇంటర్వెల్ సీన్ కూడా అంతగా ఆకట్టుకోదు. ఇక సెకండాఫ్‌లో భోళా భాయ్‌గా చిరంజీవి చేసే యాక్షన్ అదిరిపోతుంది. అయితే అక్కడ కూడా కామెడీ వర్కౌట్ కాలేదు. శ్రీముఖి కాంబినేషన్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారుతాయి. ‘ఖుషీ’ సీన్ అయితే మరీ ఘోరం. అలాంటి వాటికి మెగాస్టార్ దూరంగా ఉండడమే బెటర్. చిరంజీవితో మాట్లాడించిన తెలంగాణ యాస కూడా అంతగా ఆకట్టుకోదు. దర్శకుడిగా మెహర్ రమేశ్‌ని మెచ్చుకోదగ్గ అంశం ఏంటంటే.. చిరంజీవిని స్టైలీష్‌గా చూపించడంతో పాటు యాక్షన్స్ బ్లాక్స్‌ని చక్కగా తెరకెక్కించాడు. కానీ కామెడీ, ఎమోషన్ని హ్యాండిల్ చేయడంలో మాత్రం ఘోరంగా విఫలం అయ్యాడు. ఎవరెలా చేశారంటే.. మెగాస్టార్ నటన గురించి ఏం చెప్పగలం? ఎలాంటి పాత్రలో అయినా ఆయన పరకాయ ప్రవేశం చేస్తాడు. ఈ చిత్రంలో కూడా శంకర్, భోళా భాయ్‌గా రెండు ఢిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించిన చిరు... ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. డ్యాన్స్ విషయంలోనూ ఎక్కడా తగ్గలేదు. కానీ అక్కడక్కడ అతని వయసు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక లాయర్ లాస్యగా తమన్నా పాటలకే పరిమితం అయింది. ఆమెతో కొన్ని సనివేశాలు ఉన్నా.. అవి అంతగా ఆకట్టుకోలేవు. ఇక ఈ సినిమాలో చిరు తర్వాత బాగా పండించిన పాత్ర కీర్తి సురేశ్‌ది. చిరంజీవి చెల్లెలు మహాగా ఆమె చక్కగా నటించింది. ఆమె వల్లే కొన్ని ఎమెషనల్ సీన్స్ వర్కౌట్ అయ్యాయి. కీర్తి సురేశ్‌ని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి శ్రీకర్‌గా సుశాంత్ ఉన్నంతలో తన పాత్రకి న్యాయం చేశాడు. అతనికి కూడా స్క్రీన్ స్పేస్ తక్కువే. ఇక విలన్‌గా తరుణ్ అరోరా పాత్ర రొటీన్‌గా ఉంటుంది. వెన్నెల కిశోర్, రఘుభాబు, గెటప్ శ్రీను, హర్ష లాంటి కమెడియన్స్ ఉన్నా కామెడీ అంతగా పండలేదు. ఇక బ్రహ్మానందం ఒక సీన్‌కే పరిమితం అయ్యాడు. జడ్జీగా ఆయన చేసిన కామెడీ కూడా వర్కౌట్ కాలేదు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. మహతి స్వరసాగర్ సంగీతం సినిమాకు మైనస్ అనే చెప్పాలి. పాటలు అంతగా ఆకట్టుకోకపోగా కథకి అడ్డంకిగా అనిపిస్తాయి. నేపథ్య సంగీతం కూడా చిరంజీవి స్థాయిలో లేదు. డూడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగానే ఉంది. ఎడిటర్ పనితీరు కూడా అంతే. నిర్మాణ విలువలు మాత్రం సినిమా స్థాయికి తగ్గట్లు చాలా రిచ్‌గా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడం నా అదృష్టం: సుశాంత్
‘మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించాలని ప్రతి ఒక్క నటుడికి ఉంటుంది. కానీ కొద్ది మందికి మాత్రమే ఆయనతో సినిమా చేసే చాన్స్ వస్తుంది. ఆ అవకాశం నాకు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’ అని యంగ్ హీరో సుశాంత్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషించారు. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా హీరో సుశాంత్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► చిరంజీవి గారితో పని చేయాలనే ఆలోచనే చాలా ఎక్సయిటింగ్ నాకు. చిన్నప్పటినుంచి చిరంజీవి గారి సినిమాలు చూస్తూ ఆయనకి అభిమానులుగా పెరిగాం. చిన్నప్పటి నుంచి ఆయన డ్యాన్స్ అంటే పిచ్చి. చిన్నప్పుడు ఆయన సాంగ్ షూటింగ్ కి రెండు మూడుసార్లు వెళ్లాను. ఆయన డ్యాన్సులు చూస్తూ ప్రాక్టీస్ చేసేవాడిని. మెహర్ రమేష్ ఫోన్ చేసి ఈ భోళా శంకర్ సినిమా గురించి చెప్పారు. చాలా నచ్చింది. అందులోనూ ఒక సాంగ్ కూడా ఉంటుందని చెప్పారు. మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకోవడమే ఒక అదృష్టం. ఆయనతో డ్యాన్స్ చేసే అవకాశం ఎంతమందికి దొరుకుతుంది. అందుకే మెహర్ రమేష్ చెప్పినప్పుడే చిరంజీవి గారితో డ్యాన్స్ స్టెప్స్ ఉండాలని ఆయన దగ్గర మాట తీసుకున్నాను. సినిమా కోసం చాలా ఎక్సయిటెడ్ గా ఉన్నాను. ► ఈ చిత్రంలో నాది క్యామియో రోల్. చిరంజీవి గారు, కీర్తి సురేష్, తమన్నా తో నాకు కీలకమైన సన్నివేశాలు ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశా. నా మొదటి సినిమా హీరోయిన్ తమన్నా. భోళాలో మాత్రం బ్రదర్ సిస్టర్ గా చేశాం. కీర్తి సురేశ్‌తో సీన్స్ చేస్తునప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. చిరంజీవి గారితో సీన్స్ చేస్తున్నపుడు మాత్రం చాలా ఎక్సయిమెంట్ అనిపించింది. చిరంజీవి గారిలోని ప్రత్యేక ఏమిటింటే .. అందరితో సరదాగా ఉంటూ జోక్స్ వేస్తూ అందరినీ కంఫర్ట్ జోన్ లో ఉంచుతారు. ► చిరంజీవితో కలిసి డ్యాన్స్ అనగానే కాస్త భయమేసింది. నా బాడీ యీజ్ కోసం శేఖర్ మాస్టర్ టీంతో రెండు గంటలు ప్రాక్టీస్ చేశాను. సెట్స్ లోకి వెళ్ళిన తర్వాత కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. చిరంజీవి గారు మాత్రం కూర్చొని మైండ్ లో ప్రాక్టీస్ చేసేస్తున్నారు. తమన్నా కీర్తి కూడా మంచి డ్యాన్సర్స్. నలుగురం ఫ్రేమ్ లో వున్నప్పుడు నా మూలంగా స్టెప్ మార్చకూడదు కదా. అందుకే ప్రతి స్టెప్ ని చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది. చాలా కలర్ ఫుల్ గా వుంది. సినిమాలో ఈ పాట ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ► కీర్తి అద్భుతమైన నటి. మహానటి సావిత్రి బయోపిక్ తో అందరి మనసులో చెరగని ముద్ర వేశారు. భోళా శంకర్ లో మా కెమిస్ట్రీ నేచురల్ గా వచ్చింది. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. అది మీకు తెరపై కనిపిస్తుంది. ► మెహర్ రమేష్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. దాదాపు మూడేళ్ళు ఈ ప్రాజెక్ట్ తో ప్రయాణించారు. ఆయనపడిన కష్టం చూశా. చిరంజీవి గారిని ఎలా ప్రజంట్ చేయాలి, అభిమానులని ఎలా అలరించాలి, కొత్తగా ఎలా చూపించాలనే ఆలోచనతో వుండేవారు. అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన కోసం ఈ సినిమా తప్పకుండా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ► సోలో హీరోగా రెండు కథల మీద వర్క్ జరుగుతోంది. ఈ సినిమా విడుదల తర్వాత అనౌన్స్ చేస్తాం. -
తమన్నాకు వింత పరిస్థితి.. ఒకే హీరోకి లవర్, సిస్టర్‌గా!
ఈ మధ్య కాలంలో తమన్నా గురించి మాట్లాడుకున్నంతగా మరే హీరోయిన్ కోసం మాట్లాడుకుని ఉండరు. ఎందుకంటే ఇక ఈమె కెరీర్ అయిపోయిందని అందరూ అనుకుంటున్న టైంలో వెబ్ సిరీసులతో తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ముద్దులు, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించడమే దీనికి కారణం. త్వరలో 'జైలర్', 'భోళా శంకర్' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ గురించిన ఓ విషయం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) సాధారణంగా హీరోహీరోయిన్‌గా నటిస్తే, వేరే రిలేషన్ ఉండే పాత్రలు చేయడానికి పెద్దగా సాహసించరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఈ విషయం భయపడట్లేదు. నయనతారని తీసుకుంటే.. 'సైరా'లో చిరుకు భార్యగా నటించింది. 'గాడ్‌ఫాదర్'లో వరసకు చెల్లెలి అయ్యే పాత్రలో నటించి, ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు నయనతార తర్వాత ఈ లిస్ట్‌లోకి మిల్కీబ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది. తమన్నా హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. ఇందులో చిరంజీవికి జోడీగా నటించింది. అయితే ఇదే సినిమాలో చిరుకు చెల్లెలిగా కీర్తి సురేశ్ యాక్ట్ చేయగా, ఆమెకి బాయ్ ఫ్రెండ్‌లా యంగ్ హీరో సుశాంత్ కనిపించబోతున్నాడు. దీన్నిబట్టి చూస్తే తమన్నా, సుశాంత్.. అన్నచెల్లిగా కనిపిస్తున్నట్లే. అయితే గతంలో వీళ్లిద్దరూ 'కాళిదాసు' చిత్రంలో హీరోహీరోయిన్‌గా చేశారు. అంటే కెరీర్ ప్రారంభంలో ప్రేమికులుగా, ఇప్పుడు తోబుట్టువులుగా నటిస్తున్నారు. మరి ఇది విశేషమే కదా! (ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?) -
ఎంగేజ్మెంట్ చేసుకున్న టాలీవుడ్ నటుడు.. ఫోటో వైరల్!
ఈ నగరానికి ఏమైంది? సినిమా చూడనివారు ఉండరు. ఈ చిత్రంలో సాయి సుశాంత్ రెడ్డి తన నటనతో అందరినీ మెప్పించాడు. ఈ చిత్రంలో అతని పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. చిన్న సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇటీవలే ఈ చిత్రం రిలీజై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రి రీలీజ్ కూడా చేశారు. (ఇది చదవండి: అందరినీ వేడుకుంటున్నా.. అర్థం చేసుకోండి: నిహారిక ) అయితే తాజాగా ఈ నగరానికి ఏమైంది? చిత్ర నటుడు సాయి సుశాంత్ రెడ్డి నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. తనకు కాబోయే అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఉంగరం పెడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ కాబోయే జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా తెగ వైరలవుతోంది. అయితే ఆ అమ్మాయి ఎవరు అనే వివరాలు తెలియరాలేదు. కాగా.. సుశాంత్ రెడ్డి గతేడాది నాగచైతన్య నటించిన థ్యాంక్యూ చిత్రంలో నటించారు. (ఇది చదవండి: బలగం మూవీ అరుదైన ఘనత.. ఇంతవరకు ఏ సినిమాకు దక్కలేదు!) View this post on Instagram A post shared by Sai Sushanth Reddy (@saisushanthreddy) -
మెగాస్టార్ సినిమాలో అక్కినేని హీరో.. ఆ పాత్రకు ఓకే!
చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150 మినహాయిస్తే ప్రతి సినిమాలో యంగ్ హీరో సపోర్ట్ తీసుకుంటున్నాడు.సైరా సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తే... ఆచార్యలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించాడు. ఇక గాడ్ ఫాదర్ సత్యదేవ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. చిరంజీవి స్టామినా ఎంటో బాక్సాఫీస్‌కి చూపించిన వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా భోళా శంకర్. ఈ సినిమాలో కూడా ఓ యంగ్ హీరో నటించనున్నాడు. ఈ ఛాన్స్ అక్కినేని హీరో దక్కించుకున్నాడు. వాల్తేరు వీరయ్య సక్సెస్ తర్వాత చిరంజీవికి.. ప్రేక్షకులు తన నుంచి ఏమి కోరుకుంటున్నారో బాగా అర్థమైనట్లుంది. అందుకే తను మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా మాస్ ఎంటర్టైన్మెంట్ ఉండే విధంగా చిరంజీవి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాల్తేరు వీరయ్య సక్సెస్ కావటంతో.. భోళాశంకర్‌పై హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా తమిళ్ హీరో అజిత్ నటించిన వేదాళం సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరు తనదైన స్టైల్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఖుషి సినిమాలోని ఇంటర్వెల్ సీన్‌ను చిరంజీవి- శ్రీముఖి మధ్య రీ క్రియేట్ చేసి షూట్ చేసినట్లు ఫిల్మ్ నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే చూడాలని ఉంది సినిమాలోని రామ్మా చిలకమ్మ హిట్ సాంగ్‌ను కూడా భోళాశంకర్‌లో రీమిక్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవికి హీరోయిన్గా తమన్నా నటిస్తోంది. సిస్టర్‌గా కీర్తి సురేశ్ కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో చిరంజీవి మరో యంగ్ హీరోతో కలిసి సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ఈ సారి చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం అక్కినేని హీరో సుశాంత్‌కు దక్కింది. కాళిదాసు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. ప్రజెంట్ హీరోగా సినిమాలు చేస్తూనే.. ప్రత్యేక పాత్రల్లో కూడా నటిస్తున్నాడు. అలా వైకుంఠపురంలో సినిమాలో నటించిన సుశాంత్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు. ఇలా తనదైన పాత్రలు చేస్తూ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటున్న సుశాంత్ రవితేజ రావణసుర మూవీలో కూడా ఓ ఇంపార్టెంట్లో రోల్ చేయనున్నారు. రావణసుర సినిమాలో రవితేజతో పాటు.. సుశాంత్ రోల్ కూడా కీలకంగా ఉంటుందని చిత్రబృందం చెబుతోంది. తాజాగా చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్‌లో సుశాంత్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో కీర్తి సురేశ్ లవర్‌గా సుశాంత్ కనిపించబోతున్నాడట. అయితే వేదాళం మూవీలో ఈ క్యారెక్టర్ చాలా చిన్నగా ఉంటుంది. అయితే తెలుగులో సుశాంత్ కోసం ఈ పాత్ర లెంగ్త్ కొంచెం పెంచారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సుశాంత్ ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పాడట. ఇక అధికారికంగా ప్రకటించడమే మిగిలి ఉందని టాక్ వినిపిస్తోంది. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే చిరంజీవి సినిమాలో సుశాంత్ నటించనున్నాడనే విషయం తెలియటంతో అక్కినేని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. -
మాస్ హీరో రవితేజ ‘రావణాసుర’ టీజర్ స్టిల్స్ (ఫోటోలు)
-
నేను మరో సుశాంత్ కావాలనుకోవడం లేదు: రాఖీ సావంత్ భర్త
బాలీవుడ్ నటి రాఖీ సావంత్- ఆదిల్ దురానీ ఎపిసోడ్ ఎన్నో మలుపులు తిరిగిన సంగతి తెలిసిందే. ఇటీవలే ఆదిల్‌కు మరో అమ్మాయితో సంబంధముందని రాఖీ ఆరోపించారు. అయితే రాఖీ చేసిన ఆరోపణలపై ఆదిల్ ఖాన్ దురానీ స్పందించారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. ఇటీవల తన భర్త ఆదిల్ ఖాన్ దురానీకి వివాహేతర సంబంధం ఉందని రాఖీ ఆరోపించింది. ఆదిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నేను మరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కావాలనుకోవడం లేదు. నేను స్త్రీల గురించి మాట్లాడకపోతే తప్పుగా అర్థం కాదు. నేను నా మతాన్ని గౌరవిస్తాను. అలాగే స్త్రీలను గౌరవించడం నేర్చుకున్నా. నేను అలా చేసినట్లు ఆమె చెప్పే విధానం నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లా ఉండటానికి ఇష్టపడను.' అని అన్నారు. కాగా.. అంతలోనే రాఖీ మరో సమావేశంలో తనకు, ఆదిల్ మధ్య ఇప్పుడు అంతా బాగానే ఉందని తెలిపింది. -
సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు
సమంత ఆరోగ్య పరిస్థితిపై సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు. ఆమె రెట్టింపు శక్తితో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సామ్యే స్వయంగా తెలిపింది. దీంతో సామ్ త్వరగా కోలుకుకోవాలని కోరుకుంటూ ఇటూ ఫ్యాన్స్, అటూ సినీ సెలబ్రెటీలు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆమె అనారోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అక్కినేని హీరో అఖిల్, నటి వరలక్ష్మి శరత్ కుమార్, కీర్తి సురేశ్‌తో పాటు పలువురు నటీనటులు స్పందిస్తు ఆమెకు ధైర్యం చెబుతున్నారు. చదవండి: సిద్దార్థ్, అదితిల సీక్రెట్ డేటింగ్? వైరల్‌గా హీరో పోస్ట్ అలాగే దగ్గుబాటి వారసురాలు, విక్టరి వెంకటేశ్ కూతురు అశ్రిత సైతం సామ్ పోస్ట్‌పై స్పందించింది. సమంత పోస్ట్‌కు అశ్రిత ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ‘నీ గురించి నీకు తెలియదు.. నీలో ఎంతో బలం ఉంది.. నీ శక్తి గురించి నీకు తెలియదు.. అనంతమైన ప్రేమను నీకు పంపుతున్నా’ అంటూ రెడ్ హాట్ ఎమోజీలను జత చేసింది. అలాగే మరో అక్కినేని హీరో సుశాంత్ కూడా సామ్ పోస్ట్‌పై స్పందించాడు. ‘నువ్వు మరింత శక్తి, బలంతో ఉండాలని కోరుకుంటున్నా. త్వరలోనే నువ్వు దీన్ని అదిగమిస్తావు సామ్’ అంటూ ధైర్యం ఇచ్చాడు. దీంతో వారి కామెంట్స్ చూసి సామ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. ఇదిలా ఉంటే సామ్ ఆనారోగ్యంపై ఆమె మాజీ భర్త, హీరో నాగ చైతన్య స్పందన కోసం సమంత ఫ్యాన్స్‌తో పాటు అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) చదవండి: సమంతకు సోకిన మయోసైటిస్ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయంటే.. Rambha Car Accident: హీరోయిన్ రంభ కారుకు ప్రమాదం, ధ్వంసమైన కారు.. ఫొటోలు వైరల్ -
మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం
Hero Sushanth Fire On Anchor: యంగ్ హీరో సుశాంత్ తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టాడు. 'మా నీళ్ల ట్యాంక్' అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వెబ్ సిరీస్‌ను 'వరుడు కావలెను' ఫేమ్ లక్ష్మీ సౌజన్య డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్‌లో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించగా.. సుదర్శన్, ప్రేమ్ సాగర్, బిగ్‌బాస్ ఫేమ్ దివి, రామరాజు, అన్నపూర్ణమ్మ, నిరోషా, అప్పాజీ అంబరీష ముఖ్యపాత్రలు పోషించారు. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో జులై 15 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే దీనికి ముందు గురువారం (జులై 14) నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్‌పై హీరో సుశాంత్ ఫైర్ అయ్యాడు. 'సినిమాల్లేకపోతేనే సిరీస్‌లు చేయాలా? మంచి కథలు ఉన్నప్పుడు సినిమాలే కాదు.. వెబ్ సిరీస్‌లు కూడా చేస్తాను. మా నీళ్ల ట్యాంక్ వెబ్ సిరీస్‌లో మంచి కంటెంట్ ఉందా? లేదా? అనేది చూశాక మాట్లాడు' అంటూ యాంకర్‌పై అసహనం వ్యక్తం చేశాడు హీరో సుశాంత్. అయితే ఇదంతా నిజంగా కాదులేండి. ఈ సిరీస్ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా హీరో సుశాంత్, నటుడు, కమెడియన్ సుదర్శన్ సరదాగా ఓ స్కిట్ చేశారు. ఇందులో సుశాంత్‌ను ఇంటర్వ్యూ చేసే యాంకర్‌గా స్టేజ్‌పైకి వచ్చి సందడి చేశాడు. ఈ క్రమంలో వెబ్ సిరీస్ గురించి సుశాంత్ చెబుతుంటే 'మనలో మన మాట సినిమాల్లేవా?' అని సుదర్శన్ ప్రశ్నించడంతో 'సినిమాల్లేకపోతేనే ఓటీటీలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయాలా? చూస్తేనే కదా ఇది ఎలా ఉందో తెలిసేది. చూడకుండా ఎలా మాట్లాడుతున్నావ్? కంటెంట్ ఉందో లేదో సిరీస్ చూస్తేనే తెలుస్తుంది' అని కోపంతో సమాధానమిచ్చాడు సుశాంత్. అయితే దీనికి సంబంధించిన వీడియోను సుశాంత్ ఇన్‌స్టా వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట ఆకట్టుకుంటుంది. కాగా ఇటీవల జరిగిన'లడ్కీ: ఎంటర్ ది డ్రాగన్ గర్ల్' ప్రీరిలీజ్ ఈవెంట్లో యాంకర్ శ్యామలపై సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం (జులై 13) ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించింది శ్యామల. మార్షల్ ఆర్ట్స్ బేస్డ్ మూవీ కాబట్టి ఓ గేమ్ ఆడదామని అడిగింది. ఇప్పటివరకూ ఇతర భాషల్లో వచ్చిన మార్షల్ ఆర్ట్స్ సినిమాలను తెలుగులో చెప్తాను, ఆ సినిమా టైటిల్ ఏంటో కరెక్ట్‌గా గెస్ చేయాలంది. దీనికి వర్మ ఏమీ సమాధానమివ్వకుండా మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. చంపూ రశీదు సినిమా ఒరిజినల్ టైటిల్ ఏంటో చెప్పమని శ్యామల మొదటి ప్రశ్న అడిగింది. దీనికి వర్మ ఆ పేరెప్పుడూ వినలేదే అని తల గోక్కున్నాడు. దీంతో శ్యామల కిల్ బిల్ అని ఆన్సరిస్తూ నవ్వేసింది. ఇది జోకా? అని ఓ చూపు చూసిన వర్మ.. ప్రస్తుతం నేను ఎమోషనల్‌గా ఉన్నాను. ఇది సీరియస్ సినిమా. ఇలాంటి జోకులు వద్దు అంటూ స్టేజీపై నుంచి విసురుగా వెళ్లిపోయాడు. దీంతో శ్యామల.. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీ అంటూ క్షమాపణలు చెప్పింది. View this post on Instagram A post shared by Sushanth A (@iamsushanth) -
నువ్వు వర్జినా? అంటూ నెటిజన్ ప్రశ్న, సుశాంత్ ఆన్సరేంటంటే?
హీరో సుశాంత్ ప్రస్తుతం రవితేజ రావణాసుర మూవీలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. అలాగే జీ5లో ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు. తాజాగా ఆయన అభిమానులతో ముచ్చటించాడు. చాలాకాలమవుతోంది, మీరు ప్రశ్నలు సంధించండి, సమాధానాలు చెప్తానన్నాడు. దీంతో దొరికిందే ఛాన్స్ అనుకున్న ఫ్యాన్స్ వరుస ప్రశ్నలతో హీరోను ఉక్కిరిబిక్కిరి చేశారు. అయినప్పటికీ సుశాంత్ అన్నింటికీ నిదానంగా, ఓర్పుగా సమాధానాలిచ్చాడు. ఎప్పటిలాగే ఈసారి కూడా సుశాంత్‌కు పెళ్లికి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. మీరు పెళ్లి చేసుకునే తారీఖు చెప్పండని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి హీరో స్పందిస్తూ ఎవరనేది డిసైడ్ కాకుండానే పెళ్లి డేట్ చెప్పాలా? అని ఫన్నీ కౌంటరిచ్చాడు. అల్లు అర్జున్‌తో మళ్లీ ఎప్పుడు చేస్తారు? అన్నదానికి బహుశా అల వైకుంఠపురములో సెకండ్ పార్ట్లోనేమో, బన్నీనే అడగండి అన్నాడు. చై, అఖిల్ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకోమంటే అసలు ఈ ప్రశ్నే రాంగ్ అని కొట్టిపారేశాడు. నువ్వు వర్జినా అని అడిగిన ఓ నెటిజన్‌కు తాను నిప్పు అని అర్థం వచ్చేలా వెలుగుతున్న దీపం ఫొటోను షేర్ చేశాడు. చదవండి: సీఎంను కలిసిన నయనతార.. ఫొటో వైరల్.. 'జన గణ మన' మూవీ రివ్యూ -
చై-సామ్ విడాకుల తర్వాత.. ఫస్ట్ గ్రూప్ ఫోటో ఇదే!
అక్కినేని ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యకంగా చెప్పక్కర్లేదు. ఏఎన్ఆర్ తర్వాత నాగార్జున, నాగచైతన్య,అఖిల్, సుశాంత్, సుమంత్ హీరోలుగా ప్రస్తుతం ఇండస్ట్రీలో సత్తా చాటుతున్నారు. అయితే తాజాగా అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో కనిపించి కనువిందు చేశారు. రీసెంట్గా నాగార్జున ఇంట్లో జరిగిన గెట్ టుగెదర్ పార్టీలో అక్కినేని వారసులంతా ఒకేచోట కనిపించారు.ఈ ఫోటోలను సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా క్షణాల్లో ఆ ఫోటో వైరల్‌గా మారింది. అయితే ఇందులో అఖిల్ మాత్రం మిస్సయ్యాడు. మాల్దీవులకు వెళ్లిన అఖిల్ ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఓల్డ్ పిక్ ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు సమంతను మిస్సవుతున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్యతో పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ వేడుకల్లో సమంత సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచేది. కానీ విడాకుల నేపథ్యంలో సమంత దూరమవడం అక్కినేని ఫ్యాన్స్‌ను నిరాశ పరుస్తుంది. ❤️ pic.twitter.com/QnIMBoaLkh — Sushanth A (@iamSushanthA) May 16, 2022 -
'రావణాసుర' చిత్రంలో సుశాంత్ సీరియస్ రోల్
రవితేజ హీరోగా సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘రావణాసుర’. ఈ చిత్రంలో సుశాంత్ ముఖ్య పాత్ర చేస్తున్నారు. శుక్రవారం సుశాంత్ బర్త్‌డే సందర్భంగా ఆయన పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ఈ పోస్టర్ సుశాంత్ సీరియస్ రోల్ చేస్తున్నారని స్పష్టం చేస్తోంది. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ కథానాయికలు. అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. మరోవైపు సుశాంత్ తొలిసారి ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. ‘జీ 5’ ఒరిజినల్ వెబ్ సిరీస్ షూటింగ్లో పాల్గొన్నారాయన. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ప్రవీణ్ కొల్లా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో సుశాంత్ లుక్‌ని రిలీజ్ చేశారు. -
మొక్కలు కూడా యుద్ధం చేస్తాయా..?
ఒడిశా: మొక్కలు సాధారణంగా ఎవరినీ నొంపించవనే మనకు తెలుసు. కానీ వుడ్ సోరెల్ అని పిలవబడే ఓ మొక్క ఉంది. అయితే దానిని ఎవరైనా ముట్టుకుంటే దానికి కోపం వస్తుంది. ఎంతలా అంటే దాని దగ్గరున్న ఆయుదాలతో ఆపకుండా యుద్ధం చేస్తుంది. అదేంటి మొక్క యుద్ధం చేయడమేంటనుకుంటున్నారా..? ఇది నిజమే ఆ మొక్కను ఎవరైనా ముట్టుకుంటే వారి బారి నుంచి కాపాడుకోవడానికి మిస్సైళ్లను పేల్చుతుంది. మిస్సైల్స్ అంటే ఎలాంటి బాంబులనో కాదు. ఆ మొక్క విత్తనాలనే బాంబుల్లా విసిరేస్తుందన్నమాట. వుడ్ సోరెల్ కాయలు చూడటానికి అచ్చం బెండకాయల్లా ఉంటాయి. ఎవరైనా దానిని తాకిన వెంటనే ఆపకుండా వరుసగా విత్తనాలను విసురుతుంది. ఒక్కటి రెండో కాదు కాసేపు అలా వాటిని వదులుతూనే ఉంటుంది. మిస్సైళ్ నుంచి బాంబులను వదిలినట్టుగా ఈ మొక్క విత్తనాలను వదలుతుంది. ఇలా దాదాపు నాలుగు మీటర్ల వరకు విత్తనాలను విసరగలిగే శక్తి ఈ వుడ్ సోరెల్ మొక్కలకు ఉంటుంది. ఒత్తిడితో పాటు దానికున్న శక్తి వల్ల అది విత్తనాలను విసరగలుగుతుంది. అయితే ఈ విత్తనాలు తగిలితే మనుషులకు పెద్దగా నొప్పి లేకపోవచ్చు కానీ చిన్నచిన్న కీటకాలకు తగిలితే వాటికి మాత్రం నొప్పి పుడుతుంది. తాజాగా ఈ మొక్కకు సంబంధించిన ఓ వీడియోను ఒడిశాకు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా ట్విట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఇక ఈ వుడ్ సోరెల్ మొక్క బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో మినహా ఈ మొక్క ప్రపంచంలోని అనేక దేశాల్లో ఉంటుందని తెలుస్తుంది. మన దేశంలో కూడా కొన్ని ప్రదేశాల్లో వుడ్ సోరెల్ కనిపిస్తుందని సమాచారం. Ballistic missiles as seen in the on going war are not humans prerogative only.. Wood Sorrel plant explodes & goes ‘ballistic’ when touched. Seeds are thrown as far as 4 metres away due to stored strain energy, with the plant targeting the object that agitated it. 🎥Arun Kumar pic.twitter.com/uRVWO2MOut — Susanta Nanda IFS (@susantananda3) February 26, 2022 -
'రావణాసుర'లో యంగ్ హీరో.. ఇంటెన్సివ్‌గా ఫస్ట్ లుక్
Akkineni Sushanth First Look Out From Ravanasura Movie: మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీతోపాటు డైరెక్టర్ సుధీర్ వర్మతో 'రావణాసుర' చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేయగా జనవరి 14న లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీమ్ వర్క్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా, శ్రీకాంత్ విస్సా కథ అందించారు. ఈ సినిమాలో రవితేజ లాయర్ పాత్రతో పాటు పది గెటప్‌లలో అలరించనున్నాడని టాక్ వినిపిస్తోంది. పలు ఆసక్తికర అంశాలతో మూవీ అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా ఈ సినిమాలోని మరో పాత్రను పరిచయం చేసింది చిత్రబృందం. ఇందులో యంగ్ హీరో అక్కినేని సుశాంత్ కీలక పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. సుశాంత్.. రామ్ పాత్రలో అలరించనున్నట్లు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఆ ఫస్ట్ లుక్ చూస్తుంటే సుశాంత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. రెడ్ అండ్ బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌లో లాంగ్ హెయిర్‌తో ఇంటెన్సివ్ లుక్‌లో కనిపించాడు సుశాంత్. ఈ లుక్ చూస్తుంటే సినిమాపై భారీ అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మూవీలో అందాల తార దక్షా నాగర్కర్ విలన్‌గా చేయనున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఈ సినిమా గురించి ఇంకెన్ని ఆసక్తికర విషయాలు రివీల్ చేస్తారో చూడాలి. Into the World of DEMONS! 👺 Thank you for this sizzling welcome as #RAM in #RAVANASURA 🔥 Mass Maharaja @RaviTeja_offl Sir,@sudheerkvarma @AbhishekPicture @SrikanthVissa @RTTeamWorks 🎉🤗 Hope you guys like #RAMFirstLook ! pic.twitter.com/jDu6IAoOLw — Sushanth A (@iamSushanthA) January 11, 2022 Such a cool edit! 🙌 https://t.co/PJjakwAaqA — Sushanth A (@iamSushanthA) January 11, 2022 ఇదీ చదవండి: లాయర్‌గా రవితేజ సందడి.. విలన్‌గా అందాల తార ఢీ -
Ichata Vahanamulu Nilupa Radu Review: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ రివ్యూ
-
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ రివ్యూ
టైటిల్ : ఇచ్చట వాహనములు నిలుపరాదు జానర్ : రొమాంటింగ్ యాక్షన్ థ్రిల్లర్ నటీనటులు : సుశాంత్, మీనాక్షి చౌదరి,వెంకట్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, అభినవ్ గోమతం తదితరులు నిర్మాణ సంస్థలు :ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ నిర్మాతలు : రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల దర్శకత్వం : ఎస్. దర్శన్ సంగీతం : ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ : ఎం.సుకుమార్ ఎడిటింగ్: గ్యారీ బి.హెచ్ విడుదల తేది : ఆగస్ట్ 27,2021 టాలీవుడ్ కింగ్ నాగార్జున మేనల్లుడు, యంగ్ హీరో సుశాంత్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి పుష్కరకాలం కాలం దాటింది. కానీ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడనే చెప్పాలి. తొలి సినిమా కాళిదాసుతో పాటు కరెంట్, అడ్డా లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించినా, సుశాంత్‌కు మాత్రం స్టార్‌డమ్‌ని తీసుకురాలేకపోయాయి. దీంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈ యంగ్ హీరో.. ‘చిలసౌ’తో సెకండ్ ఇన్నింగ్స్‌ని ప్రారంభించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో పాటు సుశాంత్ నటనపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఆ తర్వాత ‘అల వైకుంఠపురములో’ సుశాంత్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. హీరోగా చేసినా రాని గుర్తింపు ఆ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించడంతో ద్వారా వచ్చింది. ఇలా సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఈ అక్కినేని హీరో.. తాజాగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. కరోనా వైరస్ కారణంగా దాదాపు పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం(ఆగస్ట్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్, చిత్రంలోని పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడం ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఆ అంచనాలను సుశాంత్ అందుకున్నాడా? లేదా?, ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన సుశాంత్‌ను ప్రేక్షకులను ఏ మేరకు ఆదరించారు? సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న సుశాంత్‌కు మరో హిట్‌ని తనఖాతాలో వేసుకున్నాడా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే హైదరాబాద్‌కు చెందిన అరుణ్ (సుశాంత్) ఒక ఆర్కిటెక్ట్. అతను పనిచేసే ఆఫీస్‌లోనే మీనాక్షి అలియాస్ మీను (మీనాక్షి చౌదరి) కూడా ఎంప్లాయ్‌గా జాయిన్ అవుతుంది. తొలి చూపులోనే మీనాక్షితో ప్రేమలో పడిపోతాడు అరుణ్. ఆమె కోసం డ్రైవింగ్ నేర్చుకొని మరీ కొత్త బైక్‌ని కొంటాడు. ఒక రోజు మీనాక్షి ఇంట్లో ఎవరు లేరని తెలుసుకొని, కొత్త బైక్ వేసుకొని ఆమె ఇంటికి వెళ్తాడు అరుణ్. అదే సమయంలో ఆ ఏరియాలో ఓ సీరియల్ నటిపై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. ఇది అరుణే చేశాడని భావించి ఆ ఏరియా జనాలంతా అరుణ్ కోసం వెతకడం ప్రారంభిస్తారు. వారిని నుంచి అరుణ్ ఎలా తప్పించుకున్నాడు? అరుణ్‌ని కాపాడడం కోసం మీనాక్షి ఏం చేసింది? అసలు సీరియల్ నటిపై హత్యాయత్నం చేసిందెవరు? పులి(ప్రియదర్శి)కి అరుణ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? ఇందులోకి నర్సింహ యాదవ్(వెంకట్) ఎలా ఎంటర్ అయ్యాడు? ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’అనే టైటిల్‌కి ఈ కథకి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే? అరుణ్ పాత్రలో సుశాంత్ అద్భుత నటనను ప్రదర్శించాడు. డాన్స్‌తో పాటు ఫైటింగ్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. గత తన సినిమాల్లో కంటే ఇందులో సుశాంత్ కొత్త లుక్ తో ఫ్రెష్ గా కనిపించాడు. ఇక మీను పాత్రలో మీనాక్షి చౌదరి ఒదిగిపోయింది. తెరపై చాలా అందంగా కనిపించింది. ఓ ఏరియా కార్పొరేటర్‌గా వెంకట్ పర్వాలేదనించాడు. హీరో ప్రాణ స్నేహితుడు పులి పాత్రలో ప్రియదర్శి అద్భుత నటనను కనబర్చాడు. బైక్ షోరూం ఎంప్లాయ్‌గా వెన్నెల కిశోర్ తనదైన కామెడితో నవ్వించే ప్రయత్నం చేశాడు.అభినవ్ గోమతంతో పాటు మిగిలిన నటీ నటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే? ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’అనే కొత్త టైటిల్ పెట్టి సినిమాపై ఆసక్తి పెంచిన దర్శకుడు దర్శన్.. కథనంలో మాత్రం కొత్తదనం లేకుండా, సాదాసీదాగా నడిపించాడు. కథలో పెద్దగా స్కోప్ లేకపోవడంతో కొన్ని అనవసరపు సీన్స్‌ని అతికించి అతి కష్టం మీద రెండున్నర గంటల పాటు సినిమాను లాగాడు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ అయితే ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడతాయి. అసలు సస్పెన్స్‌ని ఇంటర్వెల్ వరకు రివీల్ చేయకపోవడం సినిమాకు కాస్త ప్రతికూల అంశమే. ఇక సెకండాఫ్‌లో అయినా ఆకట్టుకునే అంశాలేమైనా ఉంటాయకునే ప్రేక్షకుడికి అక్కడా నిరాశే ఎదురవుతుంది. సినిమాలో చాలా సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువగా ఉంటుంది. కానీ, నిర్లక్ష్యంగా చేసే చిన్న తప్పుల వల్ల ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనే ఓ మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్న దర్శకుడి ఆలోచనను ప్రశంసించాల్సిందే. ఇక ఈ సినిమా ప్రధాన బలం ఏదైనా ఉందంటే అని ప్రవీణ్ లక్కరాజు సంగీతమనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం అదరగొట్టేశాడు. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎం.సుకుమార్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ గ్యారీ బి.హెచ్ చాలా చోట్ల తన కత్తెరకు పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మా సినిమా సక్సెస్‌పై పూర్తి నమ్మకం ఉంది: సుశాంత్
సుశాంత్ హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకత్వంలో లెజెండ్రీ నటి భానుమతి రామకృష్ణ మనవడు రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 27న సినిమా విడుదలకానుంది. ఈ సందర్భంగా హీరో సుశాంత్ మీడియాతో ముచ్చటించారు. ‘ఇచట వాహనములు నిలుపరాదు’ మూవీ గురించి ఆయన మాటల్లో విందాం.. ⇔ చిలసౌ సినిమాను బన్నీ ఫస్ట్ చూశారు.. ఆయన త్రివిక్రమ్ గారికి చెప్పారు. ఆయన ఆ సినిమాను చూసిన వెంటనే ఫోన్ చేశారు. అలా అప్పుడు అల వైకుంఠపురములో సినిమాకు చాన్స్ ఇచ్చారు. అలా చిలసౌ ద్వారా అల వైకుంఠపురములో వచ్చింది.. ఆ మూవీ తరువాత స్ప్రైట్ యాడ్ వచ్చింది. అలా నాకు దగ్గరకు వచ్చిన వాటిని చేస్తూ ఉన్నాను. ⇔ చిలసౌ విడుదలకంటే ఓ రెండు నెలల ముందే ఈ కథను డైరెక్టర్ దర్శన్ వినిపించారు. నూటొక్క జిల్లాల అందగాడు సాగర్.. హరీష్ ప్రొడ్యూసర్ ద్వారా దర్శన్‌ను పంపించారు. కాలనీలో జరిగే సంఘటనలు.. తన ఫ్రెండ్ జీవితంలో జరిగిన సంఘటనలు అని కథను నెరేట్ చేశారు. చిలసౌ కంటే ముందే ఈ కథను చేస్తాను అని చెప్పాను. కానీ మధ్యలో అల వైకుంఠపురములో చేశాను. నాకోసం చాలా వెయిట్ చేశారు. ఈ కథకు నిరంజన్ రెడ్డి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు. ఆయన బిజీగా ఉండటం వల్ల అది సెట్స్ మీదకు వెళ్లలేదు. మీరు పర్మిషన్ ఇస్తే వింటాను అని నిరంజన్ రెడ్డి గారిని నేను అడిగాను. ఈ కథ నాకైతే బాగుంటుందని ఆయన కూడా చెప్పారు. అలా ఈ సినిమా ముందుకు వచ్చింది. ఈ కథ విన్నప్పుడు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇంతకు ముందు విన్నట్టు ఎక్కడా అనిపించలేదు. కాంప్లికేటెడ్ కథ అయితే కాదు.. ఎంతో రియలిస్టిక్ ఉంటుంది. ఎంటర్టైనింగ్గానూ ఉంటుంది. కమర్షియల్ టచ్ కూడా ఉంటుంది. ⇔ ఫిబ్రవరి 1న ప్రారంభించినా.. మార్చి 15 వరకు చాలానే పూర్తి చేసేశాం. జూన్‌లోనే విడుదల చేద్దామని అనుకున్నాం. మేజర్ పార్ట్ షూటింగ్ అయిపోయింది. కృష్ణా నగర్లో ఒక్కరోజు షూటింగ్ మాత్రమే మిగిలింది. కానీ లాక్డౌన్ ముగిసిన తరువాత వెళ్తే అక్కడ పరిస్థితి అంతా మారిపోయింది. సినిమా మీదున్న పాజిటివ్ వైబ్ మమ్మల్ని నడిపించింది. ఫస్ట్ లాక్డౌన్ మామూలుగా గడిచింది. అయితే జనవరిలో వద్దామని అనుకున్నాం కానీ.. పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అయింది. ఆ తరువాత మళ్లీ సెకండ్ వేవ్ వచ్చింది. అది చాలా కష్టంగా గడిచింది. ఓటీటీ ఆఫర్లు రావడం ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఓపెన్ అవుతాయో లేదో.. జనాలు వస్తారో లేదో అనే అనుమానాలు వచ్చాయి. నిర్మాతలను కూడా ఎక్కువగా ఒత్తిడి పెట్టలేం. వాళ్లు కూడా సినిమాను నమ్మి.. థియేటర్లోనే చూడాల్సిన సినిమా అని వెయిట్ చేశారు. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఆఫర్‌తోనే నిర్మాతలు సేఫ్ అయ్యారు. అందుకే మేం కూడా విడుదలకు సిద్దమయ్యాం. ⇔ సినిమా సక్సెస్ మీద నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ వర్క్. ఈ సినిమాను దాదాపు 50 మందికి చూపించాం. అందరూ బాగానే ఉందని అన్నారు. డిజిటల్ ఆఫర్ ఇచ్చిన వారు కూడా సినిమాను చూసే తీసుకున్నారు. కొన్ని సీన్స్ గుర్తుండిపోయాయని అందరూ అన్నారు. ఈ చిత్రంలో ప్రతీ ఒక్క క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంటుంది. మా వైపు నుంచి చేయాల్సిందంతా చేశాం. ఇక జనాలు తీర్పునివ్వాలి. ⇔ ముందు తమిళ్లో టైటిల్ చెప్పారు. నో పార్కింగ్ అని అనుకున్నాం. కానీ తెలుగులో ఉండాలని.. ఇచ్చట వాహనములు నిలుపరాదు అని అనుకున్నాం. అందరూ కూడా టైటిల్ బాగా ఉందని అన్నారు. తెలుగు వచ్చినా, రాకపోయినా కూడా అందరికీ అర్థం అవ్వాలని నో పార్కింగ్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టేశాం. ⇔ రుహానీ శర్మ ఓ వర్క్ షాప్ గురించి చెప్పారు. అప్పుడు ముంబైకి వెళ్తే అక్కడ మీనాక్షి చౌదరి కనిపించారు. ఆమె మిస్ ఇండియా అని నాకు తెలీదు. నేను యాక్టర్ అని ఆమెకు కూడా తెలీదు. అయితే అక్కడ క్లాస్‌లో ఓ టఫ్ సీన్ చేశారు. తెలుగు సినిమాలో చాన్స్ వస్తే చేస్తారా? అని అడిగాను. అలా మీనాక్షి ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ఆమె టాలెంట్‌కు కచ్చితంగా బిజీ అవుతుందని అనుకున్నాను. కానీ ఈ మూవీ విడుదల కాకముందే.. తమిళ, తెలుగు, హిందీలో ఆఫర్లు వచ్చేశాయి. ⇔ నేను ఎప్పుడూ సినిమాలు త్వరగానే పూర్తి చేయాలని అనుకుంటాను. అల వైకుంఠపురములో సినిమాకు ఇచ్చిన డేట్స్ వల్ల ఈ మూవీ లేట్ అయింది. అల వైకుంఠపురములో, ఇచ్చట వాహనములు రెండు కూడా ఒకే సంవత్సరంలో వస్తాయని అనుకున్నాను. కానీ పాండమిక్ వల్ల అది మిస్ అయింది. *ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేషన్ ఇవన్నీ ఎంత ముఖ్యమో ఈ పాండమిక్ వల్ల తెలుసుకున్నాను. ఒత్తిడిగా ఫీలవ్వడం కంటే.. మనం మన వాళ్లతో, మనం ప్రేమించే వాళ్లతో ఉన్నామని అనుకోవడం బెటర్. మెడిటేషన్ చేయడం ప్రారంభించాను. పియానో నేర్చుకున్నాను. కుకింగ్ కూడా కొద్దిగా నేర్చుకున్నాను. అలా అని బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే పిచ్చెక్కుతుంది. అన్నింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నాను. ⇔ త్రివిక్రమ్, బన్నీ ఇద్దరి కెమిస్ట్రీ, ర్యాపో బాగుంటుంది. ఆయన ఒకటి చెబుతారు.. ఈయన ఇంకోటి యాడ్ చేస్తారు. సీన్లు ఇంప్రూవ్ చేస్తుంటారు. నాకు సరదాగా అనిపిస్తుంటుంది. సెట్ అంతా కూడా సందడిగా ఉంటుంది. పెళ్లిపై సుశాంత్ ఏమన్నాడంటే.. ⇔పెళ్లి కూడా సినిమాలానే నేను ఏదీ ప్లాన్ చేయలేదు. అలాంటి వాళ్లను ఇలాంటి వాళ్లను చేసుకోవాలని అనుకోలేదు. కరెక్ట్ పర్సన్ దొరికితే చేసుకోవాలని అనుకున్నాను. నా ఇంట్లో కూడా పెళ్లి గురించి ఒత్తిడి చేయరు. ⇔ ఈ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ బాగుందని, చాలా నవ్వుకున్నామని అన్నారు. ఎంటర్టైనింగ్గా ఉందని చెప్పారు. చాలా ఓపెన్ అయ్యావని అన్నారు. కామెడీ టైమింగ్, స్పాంటేనిటీ బాగుందని అన్నారు ఆఫీస్‌లో ఎవ్వరూ లేనప్పుడు డ్యాన్స్ చేస్తుంటాను. ఇంత వరకు ఏ సినిమాలోనూ అలా చేయలేదు. ఈ సినిమాలో కొత్త సుశాంత్ కనిపించాడని అన్నారు. అదే బెస్ట్ కాంప్లిమెంట్. ⇔ చాలా కథలు విన్నాను. కానీ ఓ ద్విభాష కథ బాగా నచ్చింది. ఎన్ని విన్నా కూడా మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. అది చిలసౌ, ఇచ్చట వాహనములు నిలుపరాదకు భిన్నంగా ఉంటుంది. ఇప్పుడే వివరాలేవీ చెప్పలేను. -
థియేటర్స్‌కి వచ్చేందుకు సాహసిస్తున్న వారు తెలుగువారు మాత్రమే: త్రివిక్రమ్
‘నాకు తెలిసి ప్రపంచం మొత్తంలో థియేటర్స్‌కి వచ్చేందుకు సాహసిస్తున్న జాతి... తెలుగుజాతి మాత్రమే. ‘ఇలా లాంచ్ అవ్వాలి.. ఇలాంటి సినిమాలు’ చేయాలనే చట్రంలో సుశాంత్ ఇరుక్కుపోయాడా? అనే ఫీలింగ్ నాకు ఉండేది. కానీ ‘చిలసౌ’ సినిమాతో తనను తాను ఆవిష్కరించుకున్నాడు. ఈ సినిమా చూసే ‘అల.. వైకుంఠపురములో’ సినిమా చేయమని అడిగాను. ‘చిలసౌ’, ‘అల.. వైకుంఠపురములో...’ తర్వాత సుశాంత్‌కు ‘ఇచట వాహనములు నిలుపరాదు’ హ్యాట్రిక్ ఫిల్మ్ అవుతుంది’’ అని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ అన్నారు. సుశాంత్, మీనాక్షి జంటగా ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో త్రివిక్రమ్ పాల్గొన్నారు. ఈ వేడుకలో త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఫస్ట్ టైమ్ డైరెక్టర్ అంటే... సినిమా వెళుతుంటే మన ఇంటి ఆడపిల్లను వేరే ఇంటికి పంపినట్లు ఉంటుంది. కాకపోతే వేరే ఇంటికి వెళ్లి సెపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందని ఎలా ఆడపిల్లను పంపిస్తామో... సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని థియేటర్స్‌లో, కామెడీ సీన్స్‌లో, టీవీలో, షోస్‌లో ఇలా ఎక్కడపడితే అక్కడ స్పాన్ పెంచుకుంటున్నప్పుడు మరింత ఆనందంగా, గర్వంగా ఉంటుంది. అలాంటి అనుభవాలు దర్శన్‌కు ఎదురు కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలోని ‘బండి తీయ్..’ పాటను ఒక్క రోజులో తీశారు. విజువల్‌గా నేను చూసినప్పుడు వాళ్లలో ఆనందం కనిపించింది. ఆ చిరునవ్వులోనే సగం సక్సెస్ కనిపిస్తోంది’’ అన్నారు. హీరో సుశాంత్ మాట్లాడుతూ – ‘‘త్రివిక్రమ్‌గారు చెప్పింది నిజమే. కెరీర్ స్టార్టింగ్‌లో..కష్టపడాలి అని తెలుసు కానీ క్లారిటీ లేదు. ఏ డైరెక్షన్లో వెళ్లాలో మొదట్లో అర్థం కాలేదు. రాంగ్ ఇన్‌ఫ్లుయెన్స్‌లో పడ్డాను. అదీ నా తప్పే. ‘చిలసౌ’ సినిమా అప్పుడు. ..‘సినిమాలు ఆడినా,ఆడకపోయినా ఇండిపెండెంట్‌గా ఉండమని’ నాగార్జున గారు సలహా ఇచ్చారు. గట్ ఫీలింగ్‌తో నిర్ణయాలు తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ సినిమాలో దర్శన్ ఓ కొత్త సుశాంత్‌ను చూపించారు’’ అన్నారు. ‘‘నిర్మాతలు రవిశాస్త్రి (దివంగత నటి భానుమతిగారి మనవడు), ఏక్తాలగారిది ఒక లెగసీ, హీరో సుశాంత్‌గారిది మరో లెగసీ. వీరి కాంబినేషన్లో సినిమాకు అసోసియేట్ అవ్వడాన్ని అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు నిర్మాత హరీశ్. ఈ కార్యక్రమంలో దర్శకుడు వీఎన్ ఆదిత్య, శ్రీనివాసరెడ్డి, జెమినీ కిరణ్, అవసరాల శ్రీనివాస్, ప్రియదర్శి, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ కు సెన్సార్ పూర్తి
సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదల తేది దగ్గరవుతుండటంతో మేకర్స్ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్‌ను పొందింది. (చదవండి: వైష్ణవ్ తేజ్, క్రిష్ సినిమా: రిలీజ్ డేట్ ఫిక్స్.. టైటిల్ అదేనా!) ఫ్రెష్ కంటెంట్, యాక్షన్, రొమాన్స్ సహా ఇతర అంశాలతో ఇచ్చట వాహనములు చిత్రాన్ని కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందించిన చిత్ర యూనిట్‌ను సెన్సార్ సభ్యులు అభినందించారు. రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్లలతో కలిసి ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. -
సుశాంత్ మూవీ సాంగ్‌ను రిలీజ్ చేసిన బుట్టబొమ్మ
సుశాంత్, మీనాక్షి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఎస్. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి “నీ వల్లే నీ వల్లే” మెలోడీ సాంగ్‌ను హీరోయిన్ పూజా హెగ్డే రిలీజ్ చేసింది. వాస్తవ ఘటనల ఆధారంగా హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్. -
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ రిలీజ్‌కు రెడీ
సుశాంత్, మీనాక్షీ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఎస్.దర్శన్ దర్శకత్వం వహించారు. ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్‌పై రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మించిన ఈ చిత్రాన్ని ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సందర్భంగా దర్శకుడు దర్శన్ మాట్లాడుతూ– ‘‘వాస్తవ ఘటనల ఆధారంగా హిలేరియస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో విడుదలైన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాయి. అదే విధంగా సెకండ్ వేవ్ తర్వాత ప్రేక్షకులు థియేటర్స్‌కు వచ్చి సినిమాలను సక్సెస్ చేస్తున్నారు. మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్. -
ఇచ్చట టీజర్ వచ్చింది
సుశాంత్, మీనాక్షి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. ఎస్. దర్శన్ దర్శకత్వంలో ఏఐ స్టూడియోస్, శాస్త్ర మూవీస్ పతాకాలపై రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను ప్రభాస్ విడుదల చేశారు. ఈ టీజర్లో నో పార్కింగ్ అని బోర్డ్ ఉన్నచోట తన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌ను సుశాంత్ పార్క్ చేస్తే, కాలనీవాసులు దాన్ని ధ్వంసం చేస్తారు. ఆ తర్వాత కథ ఏంటనేది సినిమాలో చూడాల్సిందే. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
టీజర్: సుశాంత్‌కు ప్రభాస్ విషెస్
తన లైఫ్‌లో అమ్మకు.. అమ్మాయికి.. బైక్‌కు మధ్య అవినాభావ సంబంధం ఉందంటూ యువ నటుడు సుశాంత్ చెబుతున్నాడు. డి.దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా టీజర్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేశాడు. సుశాంత్‌కు, చిత్రబృందానికి నా శుభాకాంక్షలు అంటూ సినిమా టీజర్‌ను ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఇక చూస్కోండి అంటూ టీజర్‌ను వదిలాడు. ఈ సినిమా బైక్ పార్కింగ్ నేపథ్యంలో సినిమా కొనసాగుతుందని టీజర్‌ను బట్టి తెలుస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ వాహనం కొనుగోలు చేయడం.. దానిపై హీరోయిన్ను ఎక్కించుకోవడం.. అనంతరం నో పార్కింగ్ స్థలంలో బండి నిలపడం ప్రధాన కథగా ఉండనుందని టీజర్‌ను చూస్తే అర్థమవుతోంది. రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాణంలో ఏ1 స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సుశాంత్‌కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా వెన్నెల కిశోర్, ప్రియదర్శి తదితరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నాడు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తీర్చిదిద్దుతున్నారు. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. -
నో పార్కింగ్
సుశాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉపశీర్షిక. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 20న అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఈ చిత్రంలోని సుశాంత్ కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘మార్చి పోయి సెప్టెంబర్ వచ్చింది.. గేర్ మార్చి బండి తియ్’ (షూటింగ్ మొదలుపెడుతున్న విషయాన్ని ఉద్దేశిస్తూ) అని ట్వీట్ చేశారు సుశాంత్. హీరో సుమంత్ సైతం ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఆప్యాయత నిండిన అన్ని జ్ఞాపకాలు ఈ రోజు ఎక్కువగా మెదులుతున్నాయి తాతా.. మీ జీవితంలో ఒక చిన్న భాగమైనందుకు జీవితాంతం రుణపడి ఉంటాను, కృతజ్ఞుడనై ఉంటాను’ అని భావోద్వేగపూరితంగా రాసుకొచ్చారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కెమెరా: ఎం. సుకుమార్. -
ఓ మై గాడు.. బొంభాట్ పోరడు..
'ఈ నగరానికి ఏమైంది' ఫేమ్ సుశాంత్ హీరోగా, సిమ్రాన్, చాందిని హీరోయిన్సుగా నటించిన చిత్రం "బొంభాట్". సైన్స్ ఫిక్షనల్ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. గతేడాది నవంబర్‌లో దర్శకుడు పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదల చేసిన ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి స్వామి నాథ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయింది. "బుద్ధిగా కలగన్నా.. బుజ్జిగా ఎదపైనా.. సర్జికల్ స్ట్రైక్ ఏదో జరిగిందిగా.." అంటూ ప్రియురాలి కోసం హీరో పాట పాడుతుంటే "ఓ మై గాడు.. బొంభాట్ పోరడు.. అంటూ ప్రేయసి కూడా రాగమెత్తుకుంది. (సుందరమ్మ.. కామ్రేడ్ భారతక్క) క్లాసికల్, రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను చందన బాల కల్యాణ్, కార్తీక్, హరిని ఆలపించారు. జోష్.బి సంగీతం సమకూర్చాడు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది. రాఘవేంద్ర వర్మ(బుజ్జి) దర్శకత్వంలో విశ్వాస్ హన్నూర్కర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'బొంభాట్' సినిమాను గతేడాది చివర్లో విడుదల చేయాలనుకున్నప్పటికీ పలు కారణాల రీత్యా వాయిదా పడింది. ఇంతలో కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో దీని విడుదల మరింత ఆలస్యం కానుంది. (నా బర్త్‌డే కేక్ నేనే తయారు చేసుకున్నా) -
నో పార్కింగ్
సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అన్నది క్యాప్షన్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నారు. యస్. దర్శన్ దర్శకత్వంలో ఈ సినిమాను రవి శంకర్, హరీష్ కోయలగుండ్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సుశాంత్ లుక్ ను సోమవారం రిలీజ్ చేశారు. -
‘అర్జున్ రెడ్డి పార్ట్-2’ అని పెట్టాను..
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు వచ్చిన ‘అల.. వైకుంఠపురములో..’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రంలో సుశాంత్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి డిలీట్ చేసిన ఓ సీన్‌ను చిత్ర బృందం సోషల్ మీడియాలో విడుదల చేసింది. అల్లు అర్జున్, సుశాంత్ మధ్య సాగే సన్నివేశాలను ఆ వీడియోలో చూపించారు. స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్న సుశాంత్ వద్దకు వచ్చిన బన్నీ.. తను షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నానని చెప్తాడు. సుశాంత్ మద్యం సేవిస్తున్న వీడియోని చూపించి.. దీనికి అర్జున్‌రెడ్డి పార్ట్ 2 అని పేరు పెట్టానని చెప్తాడు. దీంతో కంగారు పడిపోయిన సుశాంత్ నేనేం చేయాలి అని బన్నీని అగుడుతాడు. ఆ తర్వాత సుశాంత్ సిటీ బస్సు వెనక పరుగెడతాడు. అయితే ఈ వీడియోను చూసిన అభిమానులు ఈ సీన్ సినిమాలో పెట్టి ఉండాల్సిందని కామెంట్లు చేస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరెకెక్కిన ఈ చిత్రంలో టబు, మురళీ శర్మ, సుశాంత్, సముద్రఖని, జయరామ్, నివేదా పేతురాజు ముఖ్య పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ (చినబాబు)లు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతమందించాడు. -
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ ప్రారంభం
-
ఇచ్చట.. గ్యారంటీ ఇస్తున్నా
సుశాంత్, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ‘నో పార్కింగ్’ అనేది ఉప శీర్షిక. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, హరీష్ కొయలగుండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి వెంకటరత్నం కెమెరా స్విచాన్ చేయగా, యోగేశ్వరమ్మ క్లాప్ ఇచ్చారు. నాగసుశీల గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సుశాంత్ మాట్లాడుతూ– ‘‘కొత్తరకం సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో కూడా కొత్తదనం ఉంటుందని గ్యారంటీ ఇవ్వగలను. దర్శన్ మంచి స్క్రిప్ట్‌ను రెడీ చేశారు’’ అన్నారు. ‘‘ప్రపంచమంతా తిరిగినా మళ్లీ ఇంటికే రావాలని మా గ్రాండ్‌మదర్ భానుమతి (దివంగత నటి, గాయని, దర్శకురాలు) గారు నాకు చెప్పేవారు.. అలా కొంతకాలం తర్వాత నేను తిరిగి ఇండస్ట్రీకి వచ్చాను. మా ఫ్యామిలీకి, మా హీరో సుశాంత్ ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. మా కాంబినేషన్ సక్సెస్ అవుతుంది’’ అన్నారు రవిశంకర్శాస్త్రి. ‘‘నటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన నేను నిర్మాతగా మారతానని ఊహించలేదు. అందులోనూ భానుమతిగారి మనవడు రవిశంకర్శాస్త్రిగారితో కలిసి ఈ సినిమా చేయడాన్ని గొప్ప విజయంగా భావిస్తున్నాను. ఇదంతా సుశాంత్‌గారి వల్లే’’ అన్నారు హరీష్. ‘‘2010లో నా స్నేహితుల జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలకు కొన్ని సినిమాటిక్ అంశాలను ఈ కథలో జోడించాం. ఈ సినిమా విజయం సాధిస్తుందని అనుకుంటున్నాం’’ అన్నారు దర్శన్. ‘‘తెలుగు పరిశ్రమకు హీరోయిన్గా పరిచయం కావాలనే నా కల నిజమైనందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు మీనాక్షి. ‘‘ఈ సినిమాలో హీరోయిన్ అన్న పాత్ర చేస్తున్నాను’’ అన్నారు వెంకట్. ఇంకా నటులు అభినవ్ గోమటం, ప్రియదర్శి, చైతన్య మాట్లాడారు. -
సుశాంత్ కొత్త సినిమా షురూ
సుశాంత్ హీరోగా, మీనా చౌదరి హీరోయిన్గా నటిస్తున్న సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ . ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, హరీష్ కోయిలగుండ్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ గురువారం ప్రారంభమైంది. హీరో, హీరోయిన్‌పై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, తదితరులు నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందిస్తున్నారు. కాగా సుశాంత్ రీసెంట్గా ‘అలవైకుంఠపురములో’ సినిమాలో నటించారు. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చిలసౌ’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమాను జాతీయ అవార్డు వరించింది. -
ఇచ్చట వాహనములు నిలుపరాదు
సుశాంత్ హీరోగా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘చిలసౌ’ చిత్రానికి మంచి ప్రేక్షకాదరణ దక్కింది. ఈ సినిమాను జాతీయ అవార్డు వరించింది. ఇక సుశాంత్ హీరోగా నటించనున్న తాజా చిత్రానికి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఎస్. దర్శన్ దర్శకత్వంలో రవిశంకర్ శాస్త్రి, హరీష్ కోయిలగుండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమా టైటిల్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను శనివారం విడుదల చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా సాగే రొమాంటిక్ థ్రిల్లర్ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు. -
సైంటిఫిక్ బొంబాట్
‘ఈ నగరానికి ఏమైంది’ ఫేమ్ సుశాంత్, సిమ్రాన్, చాందినిలు ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘బొంబాట్’. కె. రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ పతాకంపై విశ్వాస్ హన్నూర్కర్ నిర్మించారు. సైన్స్ ఫిక్షన్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి రాఘవేంద్రవర్మ దర్శకుడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన సందర్భంగా పూరి మాట్లాడుతూ– ‘‘యంగ్ బ్లడ్ కలిసి చేసిన ‘బొంబాట్’ ఫస్ట్ లుక్ బావుంది. ఈ చిత్ర సంగీత సారథి జోష్. బి నాకు మంచి మిత్రుడు. ఈ సినిమా విజయం సాధించి కలెక్షన్స్‌లో బొంబాట్ చేయాలని కోరుకుంటున్నా’’ అన్నారు. -
రాములో రాములా...
అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘అల...వైకుంఠపురములో...’. ఈ చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్, నివేతా పేతురాజ్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. రాజ్ పాత్రలో నటిస్తున్న సుశాంత్ లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘రాజ్ పాత్ర పోషిస్తున్నాను. ‘అల...వైకుంఠపురములో...’ నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు సుశాంత్. ఈ సినిమాలోని ‘రాములో.. రాములా...’ పాట టీజర్ ఈ రోజు సాయంత్రం విడుదలవుతోంది. పూర్తి పాటను దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నాను. ఈ పాట చాలా క్యాచీగా ఉంటుందంటున్నారు అల్లు అర్జున్. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలో ‘సామజవరగమన...’ పాటకు మంచి స్పందన లభిస్తోంది. అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. టబు, జయరామ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కానుంది. -
అల... ఓ సర్ప్రైజ్
వెండితెర వైకుంఠపురములోని తన బంధువులందర్నీ దగ్గర చేసే పనిలో ఉన్నారట అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమా ‘అల.. వైకుంఠపురములో...’. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. సుశాంత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రధారులు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలో ఓ ఫారిన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారని తెలిసింది. విదేశాల్లోని అందమైన ప్రదేశాల్లో హీరో హీరోయిన్లపై పాటను చిత్రీకరించే ఆలోచనలో ఉన్నారట టీమ్. ఇటీవల వినాయక చవితి సందర్భంగా ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. నవంబరు 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్ప్రైజ్ ప్లాన్ చేశారట. ఆ రోజు ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేస్తారని ఊహించవచ్చు. జయరాం, టబు, సముద్రఖని, మురళీ శర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు తమన్ స్వరకర్త. అల్లు అరవింద్, రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. -
ఫుల్ స్పీడ్
సగానికి పైనే ప్రయాణాన్ని పూర్తి చేసింది ‘అల వైకుంఠపురములో’ టీమ్. మిగతా భాగాన్ని కూడా ఫుల్ స్పీడ్‌లో పూర్తి చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అరవింద్, యస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయిక. టబు, జయరామ్, నివేదా పేతురాజ్, సుశాంత్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్ మరికొన్ని రోజులు సాగుతుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమన్ సంగీత దర్శకుడు. -
సంక్రాంతికి సై
సంక్రాంతి బరిలో తాను ఉన్నానంటున్నారు అల్లు అర్జున్. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు బుధవారం చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు పీడీవీ ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. టబు, సుశాంత్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు చేస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ‘జులాయి’ (2012), ‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) సినిమాల తర్వాత త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. -
మళ్లీ సెట్లో అడుగుపెట్టిన సుశాంత్
‘చి.ల.సౌ’ చిత్రంతో డీసెంట్ హిట్ కొట్టాడు అక్కినేని హీరో సుశాంత్. ఈ మూవీ సక్సెస్ కావడంతో సుశాంత్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో సోలో హీరోగానే కాకుండా, ప్రాధాన్యం ఉన్న అతిథి ప్రాతలను కూడా పోషించేందుకు రెడీ అయ్యాడు. సుశాంత్ ప్రస్తుతం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో ఓ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న సుశాంత్.. తాజాగా మళ్లీ షూటింగ్లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ట్వీట్ చేస్తూ.. మళ్లీ చిత్రబృందంతో కలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రముఖ నటుడు రాహుల్ రామకృష్ణతో కలిసి ఉన్న పిక్‌ను పోస్ట్ చేశాడు. బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి హిట్ చిత్రాల తరువాత హ్యాట్రిక్ హిట్‌కు ఈ ద్వయం రెడీ అవుతున్నారు. One of the many awesome reunions on set today! @eyrahul #AA19 pic.twitter.com/6M9zxixGEI — Sushanth A (@iamSushanthA) June 24, 2019 -
కాజల్ స్పెషల్?
‘నేను పక్కా లోకల్ పక్కా లోకల్’ అంటూ ‘జనతా గ్యారేజ్’లో స్పెషల్ సాంగ్ చేశారు కాజల్ అగర్వాల్. ఈ పాట సూపర్ హిట్. కాజల్ స్టెప్స్‌కి ఫ్యాన్స్ విజిల్స్ మీద విజిల్స్ కొట్టారు. ఆ తర్వాత మళ్లీ ప్రత్యేక పాటలోనూ కనిపించలేదు కాజల్. లేటెస్ట్గా మరో స్పెషల్ సాంగ్‌లో కనిపిస్తారని తెలిసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేక పాట ఉందట. ఆ పాటకు కాజల్ స్టెప్పేస్తే అదిరిపోతుందని చిత్రబృందం భావించిందట. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, నివేతా పేతురాజ్ కథానాయికలుగా కనిపిస్తారు. టబు, సుశాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హారికా హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. -
జెట్ స్పీడ్‌లో!
అల్లు అర్జున్ టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరుగా సెట్లో జాయిన్ అవుతున్నారు. దీంతో సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో సాగుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. ఇందులో మరో హీరోయిన్గా నివేధా పేతురాజ్‌ను తీసుకున్నారు. ఈమె గతంలో ‘మెంటల్‌మదిలో, చిత్రలహరి’ సినిమాల్లో హీరోయిన్గా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. మరో కీలక పాత్ర కోసం నటుడు సుశాంత్‌ను సెలక్ట్ చేసుకున్నారు టీమ్. ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం శుక్రవారం వెల్లడైంది. ‘‘లొకేషన్లో నా ఫస్ట్‌డే మొదలైనందుకు ఆనందంగా ఉంది. ‘చిలసౌ’ తర్వాత మంచి అమేజింగ్ టీమ్‌తో వర్క్ చేస్తున్నందుకు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. సినిమా గురించి ఎక్కువగా ఇప్పుడే చెప్పలేను’’ అని సుశాంత్ అన్నారు. ఈ సినిమాలో టబు ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: పీడీవీ ప్రసాద్. ఈ సినిమా కాకుండా సుకుమార్, వేణు శ్రీరామ్ దర్శకత్వాల్లో హీరోగా నటించనున్నారు అల్లు అర్జున్. -
బన్నీ-త్రివిక్రమ్ మూవీ షూటింగ్.. సుశాంత్ ఎంట్రీ
చిలసౌ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న హీరో సుశాంత్. కెరీర్లో కాళిదాసు, కరెంట్ చిత్రాల తర్వాత సక్సెస్ చూడని సుశాంత్.. చాలా ఏళ్ల తరువాత చిలసౌ సినిమాతో మళ్లీ ట్రాక్‌లోకి వచ్చాడు. అయితే చిలసౌ వచ్చి ఏడాది అవుతున్నా.. తన కొత్త సినిమా అప్డేట్ రావడం లేదని అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా తన తదుపరి ప్రాజెక్ట్ విషయాలను వెల్లడించారు. తన తరువాతి సినిమా అప్డేట్స్ గురించి ఇంతకాలం ఎదురుచూసిన అభిమానులకు ధన్యవాదాలు అంటూ ఈ వారంలో తాను కొన్ని అప్డేట్లు, అనౌన్స్మెంట్స్ చేస్తానని ప్రకటించాడు సుశాంత్. అందులో భాగంగానే.. తాను అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నట్లు హీరో సుశాంత్ ప్రకటించారు. ఈరోజే షూటింగ్ సెట్లో అడుగుపెట్టానని.. తనకెంతో ఇష్టమైన త్రివిక్రమ్ డైరెక్షన్లో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని.. ప్రస్తుతానికి ఈ మూవీ గురించి ఇంతకంటే ఏం చెప్పలేనని అన్నారు. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలో నటించడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్గా నటిస్తుండగా.. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. And with all your good wishes, here goes the first update! #AA19 !#Trivikram Sir, @alluarjun #Tabu @hegdepooja @MusicThaman @haarikahassine @GeethaArts pic.twitter.com/JSSKGpbIlT — Sushanth A (@iamSushanthA) June 7, 2019 -
అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా ప్రారంభం
-
గెట్.. సెట్... గో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో ముచ్చటగా మూడో సినిమా ప్రారంభమైంది. ‘జులాయి, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన కాంబినేషన్ కాబట్టి హ్యాట్రిక్ పై గురి పెట్టారని ఊహించవచ్చు. హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ నిర్మాతలు. శనివారం ఉదయం ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఏప్రిల్ 24న హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్ ఆరంభమవుతుంది. అల్లు అర్జున్‌కు ఇది 19వ చిత్రం. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటించనున్నారు. చాలాకాలం తర్వాత ప్రముఖ నటి టబు తెలుగులో నటిస్తుండటం విశేషం. ప్రత్యేక పాత్రలో హీరో సుశాంత్ కనిపిస్తారు. సత్యరాజ్, రాజేంద్రప్రసాద్, సునీల్, నవదీప్, బ్రహ్మాజీ, రావు రమేష్, మురళీ శర్మ, రాహుల్ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యస్.యస్ తమన్. కెమెరా: పి.యస్ వినోద్, ఆర్ట్: ఏయస్ ప్రకాశ్, ఫైట్స్: రామ్–లక్ష్మణ్, ఎడిటర్: నవీన్ నూలి. -
విద్యతోనే ఉన్నత శిఖరాలు
హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రం: ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ప్రముఖ నటుడు సుశాంత్ అనుమోలు అన్నారు. శుక్రవారం ఆర్టీసి కళ్యాణ మండపంలో అరోరా రామంతాపూర్ డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ఆలాప్ పేరిట సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హాజరైన సుశాంత్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువుపైనే దృష్టి సారించకుండా అన్ని రంగాల్లో రాణించాలని కోరారు. మానవ విలువలను పెంపొందించాల్సిన అవసరం ఎంతైన ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల కార్యదర్శి ఎన్.రమేష్ బాబు, కెఎంవి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాసన్, ప్రముఖ విద్యావేత్త బాలాజి వీరమనేని, ప్రముఖ సినీ దర్శకులు పరశురాం, సంగీత దర్శకులు వివేక్ సాగర్, కళాశాల వైస్ చైర్మన్ ఎన్.అనుదీప్, డైరెక్టర్ డాక్టర్ ఎం.మాధవి, డాక్టర్ మోహన్ కుమార్, డాక్టర్ పి.జనార్ధన్ రెడ్డి, డిపార్ట్మెంట్ అధిపతులు సతీష్‌కుమార్, దేవేందర్ రావు,అర్పిత, శుభప్రద తదితరులు పాల్గొన్నారు. -
ఆ పేరు పెట్టినప్పుడే నమ్మకం వచ్చేసింది
‘‘ప్రేక్షకులకు దగ్గర కావడానికి కొత్తగా ఏదైనా ట్రై చేస్తే బావుంటుందని అనుకున్నా. ‘చి..ల..సౌ’ కథ వినగానే నాకు మరో కొత్త మెట్టు అవుతుందనిపించింది. నా నమ్మకం నిజమైంది. కరెక్ట్ సినిమా చేశావని చాలామంది అభినందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అని హీరో సుశాంత్ అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల..సౌ’. అక్కినేని నాగార్జున, భరత్ కుమార్, జస్వంత్ నడిపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 3న విడుదలైంది. హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో సుశాంత్ మాట్లాడుతూ– ‘‘చి..ల..సౌ’ చిత్రానికి నాకు అభినందనలు వచ్చాయంటే ఆ క్రెడిట్ రాహుల్‌కే దక్కుతుంది. బయటి బ్యానర్లో సినిమా చేద్దామని అనుకున్నప్పుడు నాతో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన సిరుని సినీ క్రియేషన్స్ వారికి థ్యాంక్స్. సమంత, చైతన్యకు సినిమా నచ్చడం, సినిమాలో భాగమవుతానని చైతన్య చెప్పడం హ్యాపీగా అనిపించింది. నిర్మాతగా నాగార్జునగారి పేరు కూడా పెట్టినప్పుడే సినిమాపై నమ్మకం వచ్చేసింది’’ అన్నారు. ‘‘ప్రీమియర్ షో నుంచి సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది. టాక్ వచ్చినంతగా ప్రేక్షకులు థియేటర్‌కి రావడం లేదేమో అనిపించేది. ఈ సినిమా స్లోగా ఎక్కుతుందని నాగార్జునగారు అన్నారు. ఆయన అన్నట్లుగానే ఫస్ట్ డేతో పోల్చితే తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువయ్యాయి’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘సినిమా చేసేటప్పుడు రిస్క్ చేస్తున్నానని చాలామంది అన్నారు. కానీ ‘చి..ల..సౌ’ రిలీజ్ తర్వాత ఫోన్ చేసి అభినందిస్తున్నారు. సుశాంత్‌కు ఒక వే క్రియేట్ అయింది’’ అన్నారు నిర్మాత జస్వంత్. -
‘చి.ల.సౌ.’ మూవీ రివ్యూ
టైటిల్ : చి.ల.సౌ. జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : సుశాంత్, రుహాని శర్మ, వెన్నెల కిశోర్, రోహిణి, అను హసన్, సంజయ్ స్వరూప్ సంగీతం : ప్రశాంత్ విహారి దర్శకత్వం : రాహుల్ రవీంద్రన్ నిర్మాత : అక్కినేని నాగార్జున, జస్వంత్ నాడిపల్లి, భరత్ కుమార్ అందాల రాక్షసి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాహుల్ రవీంద్రన్ తరువాత నటుడిగా కొనసాగుతూనే దర్శకుడిగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా ‘చి.ల.సౌ.’ సినిమాను తెరకెక్కించాడు రాహుల్. సెన్సిబుల్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా నచ్చటంతో అన్నపూర్ణ బ్యానర్‌పై అక్కినేని నాగార్జున ఈ సినిమాను రిలీజ్ చేశారు. నాగ్‌ను అంతగా మెప్పించిన అంశాలు చి.ల.సౌ.లో ఏమున్నాయి..? ఈ సినిమాతో సుశాంత్ హిట్ ట్రాక్‌లోకి వచ్చాడా..? దర్శకుడిగా తొలి ప్రయత్నంలో రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడా..? కథ ; ఐదేళ్ల వరకు పెళ్లే వద్దని పట్టుపట్టి కూర్చున్న అర్జున్ (సుశాంత్)ని ఎలాగైన పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటారు అమ్మానాన్నలు (అను హసన్, సంజయ్ స్వరూప్). ఇంట్లో పోరు సరిపోలేదన్నట్టుగా తన బెస్ట్ ఫ్రెండ్ సుజిత్ (వెన్నెల కిశోర్) కూడా అర్జున్ను పెళ్లి చేసుకోమని బలవంతపెడుతుంటాడు. వీళ్ల పోరు పడలేక ఓ అమ్మాయితో పెళ్లిచూపులుకు ఒప్పుకుంటాడు అర్జున్. రొటీన్ పెళ్లి చూపులు లా కాకుండా కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేసిన పేరెంట్స్.. (సాక్షి రివ్యూస్) అర్జున్ను ఒక్కడినే ఇంట్లో ఉంచి అమ్మాయి వస్తుంది మాట్లాడమని చెప్తారు. అంజలి (రుహాని శర్మ) ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. చిన్నతనంలోనే తండ్రి చనిపోవటంతో కుటుంబానికి తానే పెద్ద దిక్కు అవుతుంది. అంజలిని చూసిన అర్జున్ పెళ్లికి ఒప్పుకున్నాడా..? లేక తన మాట ప్రకారం ఐదేళ్ల వరకు పెళ్లి వాయిదా వేశాడా..? అసలు వాళ్ల పెళ్లి చూపులు ఎలా జరిగింది..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; చెప్పుకోవటానికి చాలా మంది నటులు ఉన్న హీరో హీరోయిన్లు తప్ప మిగత అన్ని పాత్రలు దాదాపు అతిథి పాత్రలే. సినిమా అంతా అర్జున్, అంజలిల చుట్టూనే తిరుగుతుంది. అర్జున్ పాత్రలో సుశాంత్ సహజంగా నటించాడు. గత చిత్రాలతో పోలిస్తే మంచి పరిణతి కనబరిచాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ప్రేమకథ కావటంతో డ్యాన్స్‌లు, ఫైట్లు చేసే ఛాన్స్ రాలేదు. నటన పరంగా మాత్రం ఫుల్ మార్క్ సాధించాడు సుశాంత్. హీరోయిన్ గా పరిచయం అయిన రుహాని శర్మ తొలి సినిమాతోనే సూపర్బ్ అనిపించింది. (సాక్షి రివ్యూస్) అర్జున్ మీద ఇష్టమున్నా కుటుంబ బాధ్యతల కారణంగా అవుననలేక, కాదనలేక మదన పడే పాత్రలో మంచి నటన కనబరిచింది. అందం, అభినయం రెండింటితోనూ మెప్పించింది. వెన్నెల కిశోర్ తన మార్క్ కామెడీ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్‌తో నవ్వించాడు. హీరోయిన్ తల్లిగా రోహిణి, హీరో తల్లి దండ్రులుగా అను హసన్, సంజయ్ స్వరూప్, ఇతర పాత్రల్లో విద్యుల్లేఖ రామన్, జయప్రకాష్ తమ పరిధిమేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రాహుల్ రవీంద్రన్. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా పెళ్లిచూపులతో మొదలయ్యే ప్రేమకథతో ఆకట్టుకున్నాడు. దర్శకుడిగానే కాదు రచయితగానూ మంచి మార్కులు సాధించాడు. టేకింగ్‌లోనూ కొత్త దనం చూపించాడు. అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక్క పూటలో జరిగే సంఘటనలు నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు, కథనాన్ని కాస్త నెమ్మదిగా నడిపించాడు. (సాక్షి రివ్యూస్)ఫస్ట్ హాఫ్‌లో వెన్నెల కిశోర్, సుశాంత్‌ల కాంబినేషన్లో వచ్చే కొన్ని సీన్స్ బోరింగ్‌గా అనిపిస్తాయి. పెళ్లిచూపులు సీన్ మొదలైన తరువాత కథనం ఇంట్రస్టింగ్ మారుతుంది. సినిమాకు సినిమాటోగ్రఫి మరో ప్రధాన బలం. షూటింగ్ పెద్దగా లోకేషన్లు లేకపోయినా ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ప్రశాంత్ విహారి అందించిన సంగీతం బాగుంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం కొత్త అనుభూతి కలిగిస్తుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : కథా కథనం లీడ్ యాక్టర్స్ నటన కామెడీ మైనస్ పాయింట్స్ : ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్‌లో కొన్ని బోరింగ్ సీన్స్ - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
వాళ్లకు మళ్లీ టైమ్ వచ్చింది
‘‘సుశాంత్ హీరో అని ‘చి..ల..సౌ’ చిత్రంలో నేను భాగస్వామ్యం కాలేదు. సినిమా చూశా. నచ్చింది. సింపుల్ పాయింటే అయినా కట్టిపడేసేలా తెరకెక్కించారు. ఆర్టిస్ట్‌ల నటన, స్క్రీన్‌ప్లే, రైటింగ్ అన్నీ పక్కాగా కుదిరాయి’’ అని నాగార్జున అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా అన్నపూర్ణ స్టూడియోస్, సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్స్‌పై రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల..సౌ’. నాగార్జున, జస్వంత్ నడిపల్లి, భరత్‌కుమార్ మలశాల, హరి పులిజ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు. ► నాగచైతన్య ‘చి..ల..సౌ’ చూసి, బాగుందని నన్నూ చూడమంటే ఇంట్రెస్ట్ లేదు అన్నా. ఎందుకంటే.. డైరెక్టర్ రాహుల్, నిర్మాతలు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్.. అంతా కొత్తవారే. పైగా కథ తెలీదు. అందుకే నెగటివ్ మైండ్‌తో వెళ్లా. సినిమా స్టార్ట్ అయిన ఐదు నిమిషాలకే నెగటివ్ మైండ్ పోయింది. సినిమా చూశాక నాకు నేనే ఫ్రెష్‌గా అనిపించా. ► సినిమా చూశాక రాహుల్‌తో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం అన్నాను. తను హ్యాపీగా ఫీలయ్యాడు. మా బ్యానర్లో ‘చి..ల..సౌ’ విడుదల చేయడం గర్వంగా ఉంది. ► అందరూ కొత్తవాళ్లతో సినిమా చేయడం రిస్కే. నిర్మాతలు మంచి ఆకలితో ఈ సినిమా చేశారు. ఈ మధ్య ఫ్రెష్ సబ్జెక్ట్స్ బాగా ఆడుతున్నాయి. స్టోరీ రైటర్స్, డైలాగ్ రైటర్స్‌కి మళ్లీ టైమ్ వచ్చింది. ‘మహానటి, రంగస్థలం’ సినిమాల్లో నటన పక్కన పెడితే మంచి రైటింగ్ కనపడింది. ఈ మధ్య హిందీలో ‘రాజీ’ చూశాను. చాలా బాగుంది. ► సుశాంత్, రుహాని నటన సూపర్బ్. నా కోసం ఓ కథ రెడీ చేయమని రాహుల్‌కి చెప్పా. ‘చి..ల..సౌ’ రిజల్ట్ ఎలా ఉన్నా తన తర్వాతి సినిమా మా బ్యానర్లోనే ఉంటుంది. బ్యాకింగ్ లేక మంచి సినిమాలు చాలా వరకూ ఆగిపోతున్నాయి. అలాంటి సినిమాలకు అన్నపూర్ణలో బ్యాకింగ్ ఇవ్వనున్నాం. ► నేను బాలీవుడ్‌కి వెళ్లలేదు. వాళ్లే నా దగ్గరకు వచ్చారు (నవ్వుతూ). అయాన్ ముఖర్జీ, కరణ్ జోహార్ వచ్చి అడిగితే ‘బ్రహ్మాస్త్ర’ చేశా. తమిళంలో మంచి అవకాశం వచ్చిందని ‘ఊపిరి’ చేశా. మరో సినిమా చేయబోతున్నా. మంచి అవకాశాలొచ్చినప్పుడు ఇతర భాషల్లో నటిస్తాను. తెలుగు ప్రేక్షకులను వదిలి వెళ్లను. ఇటీవల ‘ఆర్ఎక్స్ 100’ సినిమా క్లైమాక్స్ రెండు రీల్స్ చూశా. బాగుంది. పూర్తిగా చూడాలనుకుంటున్నా. ► ‘దేవదాస్’ పది రోజులు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమా హిట్ అయితే సీక్వెల్ చేస్తాం. ‘బంగార్రాజు’ కథ రెడీ అవుతోంది. -
ఆ మాట విని సర్ప్రైజ్ అయ్యా
‘‘నిన్ను, నన్ను కలిసి రాహుల్ ఓ కథ చెబుతాడట అని సమంత నాతో చెప్పగానే.. రాహుల్ నటించబోయే సినిమా అనుకున్నా. కానీ, తను దర్శకత్వం చేస్తున్నాడని తెలిసి సర్ప్రైజ్ అయ్యా. కథ చాలా ఫ్రెష్‌గా అనిపించింది’’ అని నాగచైతన్య అన్నారు. సుశాంత్, రుహానీ శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చి..ల.. సౌ’. నాగార్జున, జస్వంత్ నడిపల్లి, భరత్‌కుమార్ మలశాల, హరి పులిజ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రెస్మీట్లో నాగచైతన్య మాట్లాడుతూ– ‘‘ఓ రాత్రిలో జరిగే కథ ఇది. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అనే సందేహం ఉండేది. నీవి, రాహుల్ సెన్సిబిలిటీస్ ఒకేలా ఉంటాయి. నువ్వు తనతో ఓ సినిమా చేయాలని సమంత అంది. ఎలాగైనా ‘చి..ల..సౌ’ లో భాగం అయితే బావుండు అనిపించి నాన్నగారితో (నాగార్జున) చెప్పా. ఆయనకూ సినిమా నచ్చి, భాగస్వామ్యం అయ్యారు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే... సమంత కోసం ఏడేళ్లు ట్రై చేశా. నా సిన్సియారిటీ, నా కష్టం చూసి తను ఆ తర్వాత ఓకే చెప్పారు (నవ్వుతూ). నాకు పెళ్లి కావడంతో రానా, సుశాంత్ హ్యాపీగా ఉన్నారు.. ఎందుకంటే పెళ్లి చేసుకోమని కొద్దిరోజులైనా వాళ్లని నేను వేధించకుండా ఉంటానని (నవ్వుతూ)’’ అన్నారు. ‘‘నేను, రాహుల్ కలసి చేసిన సినిమా సరిగ్గా ఆడలేదు కానీ, 11ఏళ్లుగా మేం మంచి ఫ్రెండ్స్ అయ్యాం. రాహుల్ హార్డ్‌వర్కర్. ‘చి..ల.. సౌ’ సినిమా చూస్తున్నప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి. రాహుల్ యాక్టర్‌గా నాకు కనెక్ట్ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్ అయ్యాడు. రుహానీ శర్మ ఫైర్ క్రాకర్‌గా పేరు తెచ్చుకుంటుంది’’ అన్నారు సమంత. ‘‘పెళ్లిచూపులప్పుడు అమ్మాయి, అబ్బాయి.. ఒకరికొకరు కరెక్టా? కాదా? అని అరగంటలో ఎలా నిర్ణయించుకుంటారు. దానికి ఎంత సమయం పడుతుంది? అనే కాన్సెప్ట్‌తో సాగే చిత్రమిది’’ అన్నారు రాహుల్ రవీంద్రన్. ‘‘చి..ల..సౌ’ లాంటి కథతో సినిమా చేసినందుకు ఆనందంగా ఉంది’’ అన్నారు సుశాంత్. ‘‘డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకొచ్చి, నిర్మాతనయ్యా. మంచి సినిమా చేశాం’’ అన్నారు నిర్మాత జస్వంత్ కుమార్. కథానాయిక రుహానీ శర్మ, గాయని, రాహుల్ రవీంద్రన్ సతీమణి చిన్మయి పాల్గొన్నారు. -
‘చి ల సౌ’ ప్రెస్‌మీట్
-
అందుకే హోమ్ బ్యానర్లో చేయలేదు
‘‘వరుసగా ఫార్ములా సినిమాలు చేయడం విసుగు తెప్పించింది. నాకు సరిపోయే క్యూట్ లవ్‌స్టోరీ చేయాలని ఫిక్స్ అయిన టైమ్‌లో రాహుల్ ఈ కథతో నా దగ్గరకు వచ్చారు. స్టోరీ బాగా నచ్చడంతో వెంటనే అంగీకరించాను’’ అన్నారు సుశాంత్. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో సుశాంత్, రుహానీ శర్మ జంటగా రూపొందిన చిత్రం ‘చి ల సౌ’. సిరుని సినీ కార్పొరేషన్ బ్యానర్‌పై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాలి, హరి పులిజల నిర్మించారు. ఈ సినిమా ఆగస్ట్ 3న విడుదల కానుంది. ఈ సందర్భంగా సుశాంత్ పంచుకున్న విశేషాలు. ► రిస్క్ తీసుకోవాలనే ఆలోచనతో హోమ్ బ్యానర్లో వర్క్ చేయకూడదు అనుకున్నాను. రాహుల్ కూడా నేను ప్రొడ్యూస్ చేస్తానని నాతో ఈ సినిమా చేయలేదు. సినిమా మొత్తం అయిపోయాక చూసిన నాగచైతన్య, సమంత అన్నపూర్ణ బ్యానర్ నుంచి రిలీజ్ చేయడానికి రెడీ అయి, మా ప్రొడ్యూసర్స్‌ని అడిగారు. వాళ్లు వెంటనే ఒప్పుకున్నారు. ► సినిమా చూశాక నాగ్ (నాగార్జున) మామ మా అమ్మగారితో చాలాసేపు మాట్లాడారు. ‘మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు, ఇలానే చేసుకుంటూ వెళ్తే కెరీర్ బావుంటుంది’ అన్నారట. ఆయన అలా అనడం పెద్ద సర్టిఫికెట్లా భావిస్తాను. మామ నుంచి అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ అదే అని ఫీల్ అవుతాను. ► నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. బయట ఎలా ఉంటానో సినిమాలో కూడా అలానే కనిపిస్తాను. దాని కోసం వర్క్ షాప్ కూడా చేశాం. సహజంగా ఉండటం కోసం మేకప్ కూడా వాడలేదు. ► రాహుల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయకపోయినా హీరోగా చాలా గమనించే ఉంటారు. స్టోరీ కూడా చాలా బాగా నరేట్ చేశారు. ముందుగా ఈ సినిమాకు ‘చిరంజీవి అర్జున్’ అనుకున్నాం కానీ ‘అర్జున్ రెడ్డి’ సూపర్ హిట్ అయింది. దాంతో ‘చి ల సౌ’ అని మార్చాం. ► ఈ సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. నెక్ట్స్ ఓ ఫన్ థ్రిల్లర్ జానర్లో సినిమా ఓకే చేశాను. -
ఆ కాంప్లిమెంట్ నాకు ఆస్కార్‌తో సమానం
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిందే డైరెక్టర్ అవుదాం అని. కానీ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరదాం అంటే ఒక్క డైరెక్టర్ అపాయింట్మెంట్ కూడా కుదర్లేదు. సడన్‌గా ఆడిషన్స్‌కి పిలిచారు. అసిస్టెంట్ డైరెక్టర్ని కూడా ఆడిషన్ చేస్తారేమో అనుకున్నాను. కట్ చేస్తే ఈ సినిమాలో హీరో నువ్వే అన్నారు. కొన్ని డబ్బులు వస్తాయి, సినిమా కూడా నేర్చుకోవచ్చు అని కంటిన్యూ అయిపోయాను’’ అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. సుశాంత్, రుహాని శర్మ జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘చి ల సౌ’. సిరుని సినీ కార్పరేషన్ పతాకంపై జశ్వంత్ నడిపల్లి నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై ఆగస్ట్ 3న అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు విశేషాలను రాహుల్ పంచుకున్నారు. ► నాలుగేళ్ల క్రితం ఇంక డైరెక్టర్‌గా సినిమా స్టార్ట్ చేద్దాం అని అనుకున్నాను. అప్పుడు కుదర్లేదు. ఈ లోపు కొన్ని సినిమాలు సైన్ చేసి హీరోగా బిజీ అయిపోయా. చైతన్య–సమంత వెడ్డింగ్ అప్పుడు సుశాంత్‌ని కలిశాను. ఆ తర్వాత ఓ రోజు ఫొన్ చేసి కథ వినాలి బ్రో అంటే ‘మల్టీస్టారర్ సినిమా చేస్తున్నామా?’ అన్నాడు సుశాంత్. కాదు నేనే డైరెక్టర్ అని చెప్పాను. నా దగ్గర ఉన్న రెండు కథలు చెప్పా, సుశాంత్ లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్నాడు. ► డైరెక్షన్ చేస్తున్నాను అని ఇండస్ట్రీలో ఎవ్వరికీ చెప్పలేదు. కేవలం నా క్లోజ్ ఫ్రెండ్స్‌కి తప్పా. ఒకవేళ డైరెక్షన్లో అనుకున్నట్టు జరగకపోతే యాక్టింగ్ కెరీర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది ఆలోచించుకో అని ‘వెన్నెల’ కిశోర్ చెప్పాడు. అలాగే ఈ సినిమా టైటిల్‌ను కూడా ‘వెన్నెల’ కిశోర్ చెప్పాడు. ► 24 గంటల్లో జరిగే కథ ఈ సినిమా. 27 ఏళ్ల అబ్బాయి, 24 ఏళ్ల అమ్మాయి ఇద్దరూ పెళ్లి ముందు జర్నీ స్టోరీ లైన్. ఈ జనరేషన్లో అందరూ ఇండివిండ్యువాలిటీ కోరుకుంటున్నారు. మనకు కాబోయే పార్టనర్ వీళ్లే అని ఎలా తెలుసుకోగలం? అనే పాయింట్ చుట్టూ కథ ఉంటుంది. సుశాంత్ బయట ఎలా ఉంటాడో సినిమాలోనూ అలానే చూపించాం. అసలు మేకప్ వాడలేదు. ► డైరెక్టర్ అవుతున్నానంటే నాకంటే సమంత బాగా టెన్షన్ పడిపోయింది. తనకే ఫస్ట్ సినిమా చూపించాను. తనకీ, చైతన్యకి సినిమా నచ్చింది. ‘నాన్నని కూడా చూడమని చెబుతాను’ అని చైతన్య అంటే అర్థం కాలేదు. ఆ తర్వాత నాగ్‌సార్ కూడా చూసి చాలా ఎంజాయ్ చేసి, రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. సినిమా చూసి వెళ్లిపోయేప్పుడు ‘నీకు మంచి ఫ్యూచర్ ఉంది నాన్న’’ అన్నారు. ఆ కాంప్లిమెంట్ నాకు ఆస్కార్ సాధించినట్టు అనిపించింది. ► హీరోయిన్ పాత్రకు నా భార్య చిన్మయి డబ్బింగ్ చెప్పింది. తనకు సినిమా బాగా నచ్చింది. మా పెళ్లి కాకముందే ఈ కథ రాసుకున్నాను. మా పర్సనల్ లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏమీ లేవు. ► మ్యూజిక్ ప్రశాంత్ విహారి, కెమెర సుకుమారన్ సార్ నెక్ట్స్ లెవెల్‌కి తీసుకువెళ్లారు. ప్రొడ్యూసర్ బాగా సపోర్ట్ చేశారు. ► ఆగస్ట్ 3న నా సినిమా శేష్ ‘గూఢచారి’ రిలీజ్ అవుతున్నాయి. ‘నా సినిమాని నువ్వు, నీ సినిమాను నేను ప్రమోట్ చేసుకుందాం’ అని శేష్‌తో అన్నా. నెక్ట్స్ సినిమా కూడా అన్నపూర్ణ బ్యానర్లోనే. హీరోగా ‘దృష్టి’, ‘యు టర్న్’ రిలీజ్‌కు రెడీగా ఉన్నాయి. -
ప్రతి ఒక్కడికీ కత్రినాకైఫ్ కావాలి.. కానీ!
హైదరాబాద్ : ‘ప్రతి ఒక్కడికీ కత్రినా కైఫ్ కావాలి.. కానీ ఎవ్వడూ రణ్‌బీర్‌లా ఉండడు’ అంటూ టాలీవుడ్ హీరోయిన్ రకుల్‌ప్రీత్ సింగ్ పోస్ట్ చేశారు. అదేంటీ రకుల్‌ను ఎవరైనా హర్ట్ చేశారా అనుకుంటున్నారా. అదేం లేదండీ.. విడుదలకు సిద్ధంగా ఉన్న ‘చి ల సౌ’ మూవీ ప్రమోషన్లో భాగంగా నటి రకుల్ ఓ డైలాగ్‌ను డబ్స్మాష్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రకుల్ పోస్ట్ చేసిన ఆ డబ్స్మాష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిలీజ్‌కు ముందే మూవీ చూడాలని ఉందా! హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ‘చి ల సౌ’ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నారు. ‘ఇక్కడ నా ఫెవరెట్ డైలాగ్ ఉంది. అమ్మాయిలు ఏమంటారు. మీరు విడుదలకు ముందే ఆ చిత్రాన్ని చూడాలనుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డబ్స్మాష్ వీడియోలను FunWithChiLaSow హ్యాష్ ట్యాగ్‌తో షేర్ చేయండి. మూవీ యూనిట్‌తో కలిసి సినిమా చూసే చాన్స్ రావచ్చు’ అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో రకుల్ చేసిన పోస్టుకు భారీగా స్పందన వస్తోంది. అయితే కొందరు మాత్రం రకుల్ మీరు గతంలోలాగ చబ్బీగా లేరు.. డైటింగ్ తగ్గించి మళ్లీ బొద్దుగా తయారవ్వాలంటూ కామెంట్లు చేస్తున్నారు. సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘చి ల సౌ’.. ఈ మూవీ ద్వారా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుశాంత్‌కు జోడీగా రుహాని శర్మ కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై మూవీ యూనిట్ ధీమాగా ఉంది. Here’s a dubsmash of my current fav dialogue. Totally love it ! 😂❤️ what say girls ?? cant wait to watch #ChiLaSow...If you wanna watch the the film before release with the team.. send your dubsmashes with #FunWithChiLaSow and you could win a chance:) @AnnapurnaStdios @SiruniCineCorp @iamSushanthA @iRuhaniSharma @rahulr_23 @23_rahulr A post shared by Rakul Singh (@rakulpreet) on Jul 18, 2018 at 2:11am PDT -
సమంత చేతుల మీదుగా ‘చిలసౌ’..?
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుశాంత్. కాళిదాసు సినిమాతో వెండితెరకు పరిచయమై సక్సెస్ సాధించారు. ఆ తరువాత ఆయన కెరీర్లో ‘కరెంట్’ సినిమా మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో ఏ మూవీ విజయం సాధించలేదు. సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న సుశాంత్‌కు చిలసౌ సినిమాతో విజయం వరించబోతున్నట్లే కనిపిస్తోంది. ఆ మధ్య విడుదల చేసిన టీజర్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి మూవీపై హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు జూలై 11న సాయంత్రం ఆరు గంటలకు పెళ్లి కూతురు (రుహాని శర్మ)కు సంబంధించిన టీజర్‌ను సమంత విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్రయూనిట్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జూలై 27న విడుదల కానుంది. -
‘చి ల సౌ’ రిలీజ్ డేట్ ఫిక్స్
సుశాంత్ హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చి ల సౌ’.. హృద్యమైన ప్రేమకథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను జూలై 27న అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ద్వారా విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల ఈ సినిమాను నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమా విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నట్లు హీరో సుశాంత్ తెలిపారు. -
బిగ్ బ్యానర్లో సెకండ్ ఛాన్స్
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన యువ నటుడు రాహుల్ రవీంద్రన్. తొలి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ తరువాత ఆ ఫాంను కొనసాగించలేకపోయాడు. ఒకటి రెండు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్‌లో కనిపించిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు రాహుల్. ఈ సినిమా సెట్స్‌మీద ఉండగానే మరో సినిమాకు ఓకె చెప్పాడు. అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి ప్రస్టీజియస్ బ్యానర్లో దర్శకుడిగా తన రెండో సినిమా తెరకెక్కనుందట వెల్లడించారు రాహుల్. నటీనటులు సాంకేతిక నిపుణులను ఫైనల్ చేయాల్సి ఉందని తెలిపారు. Here’s the other news am soooper happy to share with you all:) I have signed with @AnnapurnaStdios for my second directorial:) Will be an absolute honour and I will work hard to make it count:) Cast and other details yet to be finalised. — Rahul Ravindran (@23_rahulr) 6 July 2018 -
కమింగ్ సూన్
సుశాంత్ హీరోగా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘చి ల సౌ’. ఈ సినిమాతో రుహానీ శర్మ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి, భరత్ కుమార్ మలశాల, హరి పులిజల నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో చిత్రాన్ని విడుదల చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘‘రీసెంట్గా రిలీజైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. సుశాంత్, రుహానీ బాగా నటించారు. ప్రశాంత్ విహారి సంగీతం శ్రోతలను ఆకట్టుకుంటుంది. సినిమా ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. వెన్నెల కిశోర్, జయప్రకాశ్, సంజయ్ స్వరూప్, రోహిణి, అనూ హాసన్, రాహుల్ రామకృష్ణ, విద్యుల్లేఖా రామన్ తదితరులు నటించిన ఈ సినిమాకు ఎం. సుకుమార్ ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రానికి హరీష్ కోయాలగుండ్ల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ సంగతి ఇలా ఉంచితే నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్న రెండో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపైనే తెరకెక్కనుంది. ఈ విషయాన్ని రాహుల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. -
వేధింపులపై హీరో సుశాంత్ ఆవేదన
హైదరాబాద్: అక్కినేని కుటుంబం నుంచి టాలీవుడ్‌కు పరిచయమైన హీరో సుశాంత్ మంచి హిట్ కోసం చానాళ్లుగా ఎదురుచూస్తున్నారు. అనూహ్య రీతిలో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రతో సుశాంత్ ‘చిలసౌ’అనే సినిమా చేశారు. ఇప్పటికే విడుదలైన ‘చిలసౌ’ టీజర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో వీలైనంత తొందరగా సినిమాను విడుదల చేయాలని యూనిట్ భావిస్తోంది. కాగా, సుశాంత్ మరో కొత్త సినిమా ప్రారంభించారని, దాని టైటిల్ ‘గట్టిగా కొడతా..’ అని ఓ పోస్టర్, దాంతోపాటు వెకిలి కామెంట్లు సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. సదరు పోస్టర్లపై నటుడు సుశాంత్ గురువారం స్పందించారు. ‘‘ట్రోలింగ్ చేయడం వేరు. కానీ ఫేక్ న్యూస్ క్రియేట్చేసి మరీ ట్రోల్ చేయడమేంటో! ఏదేమైనా నాపై ధ్యాస ఉంచిన అందరికీ ధన్యవాధాలు’’ అని హీరో తన ట్విటర్లో రాసుకొచ్చారు. It’s one thing to troll... But to create fake news and then try to troll 👏 (slow clap) Thanks for all the attention 😎 — Sushanth A (@iamSushanthA) 7 June 2018 -
నీకొచ్చింది జ్వరం.. క్యాన్సర్ కాదు
సాక్షి, హైదరాబాద్: వరుసగా సినిమాలు చేస్తున్నా అక్కినేని యంగ్ హీరో సుశాంత్‌కు సక్సెస్ రేటు మాత్రం అంతగా లేదు. ఈ తరుణంగా అందాల రాక్షసి హీరో రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీసిన చిత్రంలో సుశాంత్ హీరోగా నటించాడు. అదే చి.ల.సౌ. ఈ చిత్ర టీజర్‌ను దగ్గుబాటి రానా కాసేపటిక్రితం విడుదల చేశాడు. సల్మాన్ ఖాన్ అభిమాని, ఆంజనేయస్వామి భక్తుడైన ఓ యువకుడు పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటాడు. కానీ, అతని తల్లి మాత్రం పెళ్లి చేసుకోవాలంటూ అతన్ని ఒత్తిడి చేస్తుంటుంది. ఆంజనేయుడి ముందు కొడుకు మనసు మార్చాలని తల్లి వేడుకోవటం, నీకొచ్చింది జ్వరం.. కాన్సర్ కాదని హీరో తన తల్లితో చెప్పే డైలాగులు. మొత్తానికి ఎంటర్టైనింగ్గా ఫస్ట్ టీజర్‌ను కట్ చేశారు. సుశాంత్ ఫ్రెండ్ క్యారెక్టర్లో వెన్నెల కిషోర్ నవ్వులు పంచినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో రుహని శర్మ హీరోయిన్గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. మేకర్లు త్వరలోనే ‘చి.ల.సౌ.’ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
చి.ల.సౌ. టీజర్ విడుదల
-
సుశాంత్‌కు రానా సహాయం!
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు సుశాంత్. కరెంట్ సినిమాతో విజయాన్ని సాధించినా, ఈ మధ్యకాలంలో సరైన హిట్ రాలేదు. సుశాంత్ చివరగా ‘ఆటాడుకుందాం రా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అది కూడా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం సుశాంత్, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో చి.ల.సౌ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పొస్టర్‌ను ఈ మధ్యే రిలీజ్ చేశారు. మే 7న టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. రానా దగ్గుబాటి ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది. హీరోగా ఉన్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. -
వరుడు అర్జున్.. వధువు?
సుశాంత్ కథానాయకుడిగా సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై జస్వంత్ నడిపల్లి నిర్మిస్తున్న చిత్రం ‘చి‘‘ ల‘‘ సౌ’. ఈ చిత్రం ద్వారా నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రుహాని శర్మ కథానాయిక. ఇవాళ సుశాంత్ పుట్టిన రోజు సందర్భంగా ‘వరుడి పేరు అర్జున్.. మరి వధువు పేరేంటి?’ అంటూ ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ– ‘‘సుశాంత్ హీరోగా చేస్తున్న ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. దర్శకుడు రాహుల్ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నాం. మే 11న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ సినిమాకు కెమెరా: యం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారీ. -
‘చి.ల.సౌ’ ఫస్ట్‌లుక్ రిలీజ్
అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయం అయిన రాహుల్ రవీంద్రన్ తొలిసారిగా దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘చి.ల.సౌ’ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా నటిస్తున్నాడు. రుహని శర్మ హీరోయిన్గా పరిచయం అవుతోంది. భరత్ కుమార్ మలసల, హరి పులిజల, జశ్వంత్ నాడిపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రశాంత్ విహారి సంగీత దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా రేపు (మార్చి 18న) రిలీజ్ చేయాలని భావించారు. కానీ, అభిమానులకు ఉగాది కానుకగా ఒకరోజు ముందుగానే ఫస్ట్ లుక్ లాంచ్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ యూనిట్. నిర్మాతలు త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
ఘనంగా 'జబర్దస్త్' కమెడియన్ హరీశ్ రిసెప్షన్
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల వివాహం చేసుకుని ఓ ఇంటివాడైన 'జబర్దస్త్' కమెడియన్ 'అల్లరి' హరీశ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. తీన్మార్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సహా పలు టాలీవుడ్ చిత్రాల్లో తనదైన శైలి హాస్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కమెడియన్ హరీశ్ కోయగండ్ల. ఈ అక్టోబర్ 5న హరీశ్ ఓ ఇంటివాడయ్యారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఇటీవల తన సంతోషాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు. కమెడియన్ హరీశ్ వివాహ రిసెప్షన్‌కు దర్శకులు వీఎన్ ఆదిత్య, జయంత్ సి పరాన్జీ, అవసరాల శ్రీనివాస్, టాలీవుడ్ నటులు సాయి ధరమ్ తేజ్, సుశాంత్, అశ్విన్, కాదంబరి కిరణ్, ఉత్తేజ్, నటి మోనాల్ గజ్జర్, కమెడియన్లు వెన్నెల కిషోర్, 'తాగుబోతు' రమేశ్ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. పలు షార్ట్ ఫిలింస్ తో అలరించిన హాస్యనటుడు హరీశ్ గతంలో జబర్దస్త్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. హరీశ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఈ సినిమా నాకు న్యూ చాప్టర్ – సుశాంత్
నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి, సుశాంత్ హీరోగా తెరకెక్కించనున్న ‘చి ల సౌ’ సినిమా బుధవారం మొదలైంది. తేజ్వీర్ నాయుడు సమర్పణలో సిరుని సినీ కార్పొరేషన్ పతాకంపై భరత్‌కుమార్ మలసాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి నిర్మిస్తున్నారు. రుహానీ శర్మ కథానాయిక. ముహూర్తపు సన్నివేశానికి మలసాల దానమ్మ కెమెరా స్విచాన్ చేయగా, ఎమ్మెల్యే పీల గోవింద్ సత్యనారాయణ క్లాప్ ఇచ్చారు. ఈ సందర్భంగా హీరో సుశాంత్ మాట్లాడుతూ– ‘‘నాకీ చిత్రం న్యూ చాప్టర్ వంటిది. స్వీట్ అండ్ ప్లేజెంట్ లవ్‌స్టోరీ మూవీ. నా మిగతా సినిమాలకంటే డిఫరెంట్‌గా ఉంటుంది’’ అన్నారు. రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ– ‘‘యాక్టర్‌గా నటనను ఎంజాయ్ చేశాను. అయితే డైరెక్టర్ కావాలన్న నా చిన్ననాటి కల ఇప్పటికి నేరవేరింది. డైరెక్టర్‌గా సక్సెస్ అయితే మరిన్ని చిత్రాలను తెరకెక్కించవచ్చు. అయితే నటుడిగా కొనసాగుతాను. ఈ సినిమాలో కొత్త సుశాంత్‌ను చూస్తారు. రెగ్యులర్ షూట్‌ను నవంబర్‌లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘కొత్తరకం లవ్‌స్టోరీతో ఈ సినిమా తీస్తున్నాం. హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది’’ అన్నారు భరత్. ‘‘హిందూ సంప్రదాయం జోడించి మంచి టైటిల్ పెట్టారు. సినిమా సూపర్‌హిట్ అవ్వాలి. హీరోగా సుశాంత్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు గోవింద్ సత్యానారాయణ. ‘‘తెలుగులో నాకిది మొదటి సినిమా’’ అన్నారు రుహానీ శర్మ. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ప్రశాంత్ విహారి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరీశ్, కెమెరామేన్ ఎమ్. సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆసక్తికరంగా 'చిll లll సౌll'
అందాల రాక్షసి, అలా ఎలా, శ్రీమంతుడు లాంటి చిత్రాల్లో నటుడిగా ఆకట్టుకున్న రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారుతున్న సంగతి తెలిసిందే. అక్కినేని వారసుడు సుశాంత్ హీరోగా సినిమాను ఎనౌన్స్ చేసిన రాహుల్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి బుధవారం సినిమాను ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర టైటిల్ లోగోను ఆవిష్కరించారు. వివాహ వేదిక మీద ఉన్న చిll లll సౌll అనే అక్షరాలనే దేవతలు ఆశీర్వదిస్తున్నట్టుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సిరుని సినిమా కార్పొరేషన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాను భరత్ కుమార్ మలసాల, హరి పులిజలలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రశాంత్ విహారి సంగీతం మందిస్తున్నారు. సుశాంత్ సరసన రుహాణి హీరోయిన్ గా పరిచయం అవుతోంది. Since we have an auspicious title for our film... we decided to announce it with an auspicious poster:) So here goes... #ChiLaSow pic.twitter.com/qUCs37irB2 — Rahul Ravindran (@23_rahulr) 11 October 2017 Wow! So much positivity! Just got done with our pooja. Thanks a million everyone. Ever grateful 😊🙏🏽 — Rahul Ravindran (@23_rahulr) 11 October 2017 -
రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి
ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటన్న తేజ సుశాంత్(19) ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ రోజు స్నేహితుడితో కలిసి బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సుశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
చైతూ పాత్రే మలుపు తిప్పుతుందట..
చాలా గ్యాప్ తర్వాత అక్కినేని హీరో సుశాంత్ 'ఆటాడుకుందా రా..' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో నాగచైతన్య, అఖిల్.. ఇద్దరూ మెరిసి అభిమానులను ఖుష్ చేయనున్నారు. వీరిలో చైతూ పాత్ర కథకు కనెక్ట్ అయ్యి ఉంటుందని టాక్. చైతన్య పాత్రతోనే కథ ఊహించని మలుపు తిరుగుతుందట, ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారని చెబుతోంది చిత్ర యూనిట్. యాక్షన్ ఎంటర్టెయినర్గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 19 న విడుదల కానుంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సుశాంత్ సరసన సోనమ్ బజ్వా కథానాయికగా నటిస్తోంది. సినిమా విజయంపై సుశాంత్ బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు. -
పండగ లాంటి సినిమా
‘‘కథను మలుపు తిప్పే అతిథి పాత్రలో నాగచైతన్య నటించారు. క్లైమాక్స్ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తూ అఖిల్ కనిపిస్తారు. సుశాంత్‌తో వీరిద్దరూ కలసి నటించిన ఆ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అక్కినేని అభిమానులకు పండగలాంటి సినిమా ఇది’’ అన్నారు నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు. సుశాంత్, సోనమ్ బజ్వా జంటగా శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై ఎ.నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఆటాడుకుందాం.. రా’ ఈ 19న విడుదల కానుంది. జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ సందర్భంగా చింతలపూడి శ్రీనివాసరావు చెప్పిన విశేషాలు... జి.నాగేశ్వరరెడ్డితో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో రచయిత శ్రీధర్ సీపాన ఈ కథ చెప్పాడు. మొదట తనే దర్శకత్వం వహిస్తానంటే సరేనన్నాను. కానీ, నాగేశ్వరరెడ్డి కథ కంటే శ్రీధర్ సీపాన కథ బాగా నచ్చింది. దాంతో శ్రీధర్ని అడగ్గానే కథ ఇవ్వడానికి అంగీకరించాడు. ఈ చిత్రంలో సుశాంత్ చాలా కొత్తగా, స్టైలిష్‌గా కనిపిస్తాడు. సుశాంత్ క్యారెక్టర్ గత సినిమాల కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. టైమ్ మిషన్ నేపథ్యంలో వచ్చే సీన్లు థ్రిల్‌కు గురి చేస్తాయి. సుశాంత్, బ్రహ్మానందం, పృథ్వీ, పోసాని కాంబినేషన్లో సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి. దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మంచి ప్లానింగ్‌తో, క్లారిటీగా సినిమా తీశారు. ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా ఉంటుంది. సుశాంత్ నుంచి డిఫరెంట్ యాక్టింగ్ రాబట్టుకున్నారు. కథ డిమాండ్ మేరకు ఖర్చుపెట్టాం. ఏఎన్నార్‌గారి ‘పల్లెకు పోదాం.. పారుని చూద్దాం..’ పాట అలనాటి మధుర స్మృతులను గుర్తుకు తెస్తుంది. కథకు సూటవుతుందని ‘సిసింద్రీ’లో నాగార్జునగారి పాట పల్లవి ‘ఆటాడుకుందాం.. రా’ని టైటిల్‌గా పెట్టాం. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. -
అఖిల్ ఆట..
‘మనం’లో తళుక్కున మెరిశాడు అఖిల్. మళ్లీ అత్తకొడుకు సుశాంత్ కోసం అతిథిగా సందడి చేయడానికి రెడీ అయ్యాడు. సుశాంత్, సోనమ్‌ప్రీత్ బజ్వా జంటగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎ.నాగసుశీల, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. ఇందులో అక్కినేని అన్నదమ్ములు నాగచైతన్య, అఖిల్ అతిథులుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ ఏడెకరాలలో ప్రత్యేకంగా వేసిన సెట్లో హీరో హీరోయిన్లతో పాటు అఖిల్ పాల్గొనగా ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు నృత్యరీతులు సమకూరుస్తున్నారు. రెండు రోజుల పాటు షూటింగ్ జరుగుతుందట. అక్కినేని ఫ్యామిలీలో అఖిల్, సుశాంత్ మంచి డ్యాన్సర్స్. ఇద్దరూ కలసి ఏ రేంజ్లో స్టెప్పులు ఇరగదీశారో ఈ నెల 19న విడుదలవు తున్న సినిమా చూస్తే తెలుస్తుంది. -
ఒకే సినిమాలో అఖిల్, నాగచైతన్య
మనం సినిమా తరువాత మరోసారి అక్కినేని అందగాళ్లు ఒకే సినిమాలో కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారు. మనం సినిమాలో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్‌లు కూడా ఒకేసారి తెర మీద కనిపించి అక్కినేని అభిమానులకు కనుల విందు చేశారు. ఇప్పుడు మరోసారి వెండితెర మీద ఒకేసారి కనిపించేందుకు రెడీ అవుతున్నారు. అయితే ఈ సారి నాగ్ లేకుండా వారసులిద్దరూ కలిసి ఓ సినిమాలో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచే వచ్చిన మరో యంగ్ హీరో సుశాంత్ సినిమాలో అఖిల్, నాగచైతన్యలు అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. నాగచైతన్య చిన్న పాత్రలో నటిస్తుండగా.., అఖిల్ ఓ పాటలో సుశాంత్‌తో కలిసి స్టెప్పేయనున్నాడు. చాలా రోజులుగా హీరోగా ప్రూవ్ చేసుకోవటం కోసం కష్టాలు పడుతున్న బావ కోసం అఖిల్, నాగచైతన్యలు ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి అక్కినేని అందగాళ్లు సుశాంత్‌కు సక్సెస్ ఇస్తారో లేదో చూడాలి. -
పల్లెకు పోయి.. పారుని చూసి...
నట జీవితాన్ని వారసత్వంగా ఇచ్చిన దిగ్గజాల జ్ఞాపకాలను తమతో పాటే ఉంచుకోవాలని అనుకుంటు న్నారు వారసులు. ఆ లెజెండరీ నటుల సినిమా సీక్వెల్స్‌లో నటించడం, వాళ్లు నటించిన అలనాటి క్లాసిక్ సాంగ్స్‌ని రీమిక్స్ చేయడం ఇవన్నీ... అలాంటి ఆలోచనల్లో భాగమే. ఇప్పుడు అక్కినేని కుటుంబ కథానాయకుడు సుశాంత్ కూడా తాత ఏయన్నార్ పాటలో ఆడిపాడాడు. ‘దేవదాసు’ సినిమాలోని ‘పల్లెకు పోదాం... పారును చూద్దాం ఛలో ఛలో..’ అనే ఎవర్ గ్రీన్ సాంగ్‌కి స్టెప్పులేశారు సుశాంత్. ఆయన హీరోగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల నిర్మిస్తున్న ‘ఆటాడుకుందాం రా’ కోసమే ఈ పాటను రీమిక్స్ చేశారు. ‘‘తాతగారి ‘దేవదాసు’ సినిమా పాట రీమిక్స్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ పాట చిత్రీకరిస్తున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యాను’’ అని సుశాంత్ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్. -
అక్కినేని వారసుడు కూడా అదే పని చేస్తున్నాడు
స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన యంగ్ హీరోలు సక్సెస్ కోసం ఫ్యామిలీ ఇమేజ్ను బాగానే వాడేసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ జనరేషన్ హీరోలు రీమిక్స్ పాటలతో తన వారసత్వాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్లు కూడా ఈ ప్రయత్నం చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ సక్సెస్‌లో రీమిక్స్ పాటల ప్రభావం కూడా బాగానే ఉంది. తాజాగా అక్కినేని వారసుడిగా పరిచయం అయిన యంగ్ హీరో సుశాంత్ కూడా ఇదే ఫార్ములాను నమ్ముకుంటున్నాడు. ఏకంగా ఏఎన్నార్ నటించిన ఆల్ టైం క్లాసిక్ దేవదాసు సినిమాలోని పాటను రీమిక్స్ చేస్తున్నాడు సుశాంత్. నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన పల్లెకు పోదాం పారును చూద్దాం పాటను తన లేటెస్ట్ సినిమా కోసం రీమిక్స్ చేస్తున్నాడు సుశాంత్. మరి ఈ సెంటిమెంట్ అయిన సుశాంత్‌కు వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి. -
కామెడీకి... 60 లక్షల సెట్!
‘‘ఓ యువకుడు తన లక్ష్యం కోసం కొంతమందితో సీరియస్‌గా ఆటాడేస్తాడు. ఇంతకూ అతని లక్ష్యం ఏంటి? అతనాడిన గేమ్ ఏంటి? అనేది తెలియాలంటే ‘ఆటాడుకుందాం రా’ చూడాల్సిందే’’ అంటున్నారు హీరో సుశాంత్. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీనాగ్ కార్పొరేషన్, శ్రీ జి ఫిలిమ్స్ సంయుక్త నిర్మాణంలో జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల నిర్మిస్తున్న చిత్రం ‘ఆటాడుకుందాం.. రా’. సుశాంత్, సోనమ్‌ప్రీత్ బజ్వా జంటగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పాటలు మినహా పూర్తయ్యింది. సుశాంత్ మాట్లాడుతూ - ‘‘మంచి కథ కోసం ఇన్నాళ్లు ఎదురుచూశా. ఈ కథ నచ్చింది’’ అని చెప్పారు. ‘‘ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్లో కామెడీ సీన్ కోసం స్పెషల్‌గా 60 లక్షల ఖర్చుతో టైమ్ మెషీన్ సెట్ వేశాం. కామెడీ సీన్ కోసం ఇంత ఖర్చు పెట్టి, సెట్ వేయడం ఇదే ఫస్ట్ టైమ్’’ అని జి. నాగేశ్వరరెడ్డి తెలిపారు. -
సుశాంత్ సినిమా షురూ
‘కాళిదాసు’, ‘కరెంట్’, ‘అడ్డా’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ హీరోగా మరో సినిమా ప్రారంభమైంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రీజీ ఫిలిమ్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో ఉగాది రోజున ప్రారంభమైంది. నాగార్జున పూజా కార్యక్రమాలు నిర్వహించి స్క్రిప్ట్‌ను దర్శకునికి అందించారు. హీరో సుశాంత్ ‘అందరికీ ఉగాది శుభాకాంక్షలు ’ అని డైలాగ్ చెప్పే సన్నివేశానికి అఖిల్ అక్కినేని కెమెరా స్విచాన్ చేయగా, నాగచైతన్య క్లాప్‌నిచ్చారు. సుమంత్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ -‘‘శ్రీధర్ సీపాన మంచి కథ ఇచ్చారు. ఈ చిత్రంతో సుశాంత్‌కు భారీ హిట్ రావడం ఖాయం. ఏప్రిల్ 10 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీధర్ సీపాన, ఫైట్స్: కనల్ కణ్ణన్, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎం.వి.ఎస్. వాసు -
గాంధీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నా
తిరుమల : ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో త్వరలో ఓ సిని మాలో నటించనున్నట్లు యువ హీరో సుశాంత్ తెలిపారు. సోమవారం ఉదయం నైవేద్య విరామసమయంలో ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన ఆలయం వెలుపల మీడి యాతో మాట్లాడారు. దర్శకుడు గాంధీ వివాహం సందర్భంగా తిరుపతికి వచ్చానన్నారు. అనంతరం తాను స్వామి ఆశీస్సులకోసం తిరుమలకు వచ్చానని తెలిపారు. అందరూ సంతోషంగా ఉండేలా చూడాలని స్వామిని ప్రార్థించానని చెప్పారు. కాగా, ఆలయం వెలుపల హీరో సుశాంత్‌ను చూడటానికి అభిమానులు ఉత్సాహం చూపారు. ఆయనతో కలిసి ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. అంతకుముందు ఆలయ డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ సుశాంత్‌కు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. -
కాయ్ రాజా కాయ్ మూవీ స్టిల్స్, పోస్టర్స్
-
కాయ్ రాజా కాయ్ మూవీ ట్రైలర్ లాంచ్