పండగ లాంటి సినిమా | Sushanth Aatadukundam Raa Releases On August 19 | Sakshi
Sakshi News home page

పండగ లాంటి సినిమా

Published Tue, Aug 16 2016 11:10 PM | Last Updated on Fri, Jul 12 2019 4:35 PM

పండగ లాంటి సినిమా - Sakshi

పండగ లాంటి సినిమా

 ‘‘కథను మలుపు తిప్పే అతిథి పాత్రలో నాగచైతన్య నటించారు. క్లైమాక్స్ సాంగ్‌లో డ్యాన్స్ చేస్తూ అఖిల్ కనిపిస్తారు. సుశాంత్‌తో వీరిద్దరూ కలసి నటించిన ఆ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అక్కినేని అభిమానులకు పండగలాంటి సినిమా ఇది’’ అన్నారు నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావు. సుశాంత్, సోనమ్ బజ్వా జంటగా శ్రీనాగ్ కార్పోరేషన్, శ్రీజి ఫిలింస్ పతాకాలపై ఎ.నాగ సుశీల, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఆటాడుకుందాం.. రా’ ఈ 19న విడుదల కానుంది.  జి.నాగేశ్వరరెడ్డి దర్శకుడు. ఈ సందర్భంగా చింతలపూడి శ్రీనివాసరావు చెప్పిన విశేషాలు...
 
 జి.నాగేశ్వరరెడ్డితో ఓ సినిమా తీయడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో రచయిత శ్రీధర్ సీపాన ఈ కథ చెప్పాడు. మొదట తనే దర్శకత్వం వహిస్తానంటే సరేనన్నాను. కానీ, నాగేశ్వరరెడ్డి కథ కంటే శ్రీధర్ సీపాన కథ బాగా నచ్చింది. దాంతో శ్రీధర్‌ని అడగ్గానే కథ ఇవ్వడానికి అంగీకరించాడు.  ఈ చిత్రంలో సుశాంత్ చాలా కొత్తగా, స్టైలిష్‌గా కనిపిస్తాడు. సుశాంత్ క్యారెక్టర్ గత సినిమాల కంటే డిఫరెంట్‌గా ఉంటుంది. టైమ్ మిషన్ నేపథ్యంలో వచ్చే సీన్లు థ్రిల్‌కు గురి చేస్తాయి. సుశాంత్, బ్రహ్మానందం, పృథ్వీ, పోసాని కాంబినేషన్‌లో సీన్లు కడుపుబ్బా నవ్విస్తాయి.
 
 దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మంచి ప్లానింగ్‌తో, క్లారిటీగా సినిమా తీశారు. ప్రతి ఫ్రేమ్ చాలా కొత్తగా ఉంటుంది. సుశాంత్ నుంచి డిఫరెంట్ యాక్టింగ్ రాబట్టుకున్నారు. కథ డిమాండ్ మేరకు ఖర్చుపెట్టాం.  ఏఎన్నార్‌గారి ‘పల్లెకు పోదాం.. పారుని చూద్దాం..’ పాట అలనాటి మధుర స్మృతులను గుర్తుకు తెస్తుంది. కథకు సూటవుతుందని ‘సిసింద్రీ’లో నాగార్జునగారి పాట పల్లవి ‘ఆటాడుకుందాం.. రా’ని టైటిల్‌గా  పెట్టాం. అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement