మిస్టరీ... థ్రిల్‌ | Sushanth Announces New Film On Birthday | Sakshi
Sakshi News home page

మిస్టరీ... థ్రిల్‌

Published Wed, Mar 19 2025 12:01 AM | Last Updated on Wed, Mar 19 2025 12:01 AM

Sushanth Announces New Film On Birthday

సుశాంత్‌ అనుమోలు హీరోగా పృథ్వీరాజ్‌ చిట్టేటి దర్శకత్వంలో ఓ సూపర్‌ నేచురల్‌ మిస్టరీ థ్రిల్లర్‌ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్‌ కుమార్, రాజ్‌ కుమార్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మంగళవారం (మార్చి 18) సుశాంత్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ మూవీ అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌లో రెండు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తున్నారు సుశాంత్‌.

‘‘తెలుగులో ఇదో కొత్త తరహా చిత్రం. ఇందులో ఎక్సార్సిస్ట్‌ (భూత వైద్యుడు)గా కనిపిస్తారు సుశాంత్‌. ఈ పాత్ర కోసం సుశాంత్‌ సరి కొత్తగా మేకోవర్‌ అయ్యారు. ఈ సినిమాకి అనిరుధ్‌ కృష్ణమూర్తి స్క్రీన్‌ప్లే రాయడంతో పాటు పృథ్వీరాజ్‌ చిట్టేటితో కలిసి డైలాగ్స్‌ అందిస్తున్నారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి  కెమేరా: వైవీబీ శివసాగర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement