ఈ మధ్య కాలంలో తమన్నా గురించి మాట్లాడుకున్నంతగా మరే హీరోయిన్ కోసం మాట్లాడుకుని ఉండరు. ఎందుకంటే ఇక ఈమె కెరీర్ అయిపోయిందని అందరూ అనుకుంటున్న టైంలో వెబ్ సిరీసులతో తన గురించి మాట్లాడుకునేలా చేసింది. ముద్దులు, శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి మరీ నటించడమే దీనికి కారణం. త్వరలో 'జైలర్', 'భోళా శంకర్' సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. అయితే ఇప్పుడు ఈ బ‍్యూటీ గురించిన ఓ విషయం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది.
(ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!)
సాధారణంగా హీరోహీరోయిన్‌గా నటిస్తే, వేరే రిలేషన్ ఉండే పాత్రలు చేయడానికి పెద్దగా సాహసించరు. కానీ కొందరు హీరోయిన్లు మాత్రం ఈ విషయం భయపడట్లేదు. నయనతారని తీసుకుంటే.. 'సైరా'లో చిరుకు భార్యగా నటించింది. 'గాడ్‌ఫాదర్'లో వరసకు చెల్లెలి అయ్యే పాత్రలో నటించి, ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు నయనతార తర్వాత ఈ లిస్ట్‌లోకి మిల్కీబ్యూటీ తమన్నా కూడా చేరిపోయింది.
తమన్నా హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. ఇందులో చిరంజీవికి జోడీగా నటించింది. అయితే ఇదే సినిమాలో చిరుకు చెల్లెలిగా కీర‍్తి సురేశ్ యాక్ట్ చేయగా, ఆమెకి బాయ్ ఫ్రెండ్‌లా యంగ్ హీరో సుశాంత్ కనిపించబోతున్నాడు. దీన్నిబట్టి చూస్తే తమన్నా, సుశాంత్.. అన్నచెల్లిగా కనిపిస్తున్నట్లే. అయితే గతంలో వీళ్లిద్దరూ 'కాళిదాసు' చిత్రంలో హీరోహీరోయిన్‌గా చేశారు. అంటే కెరీర్ ప్రారంభంలో ప్రేమికులుగా, ఇప్పుడు తోబుట్టువులుగా నటిస్తున్నారు. మరి ఇది విశేషమే కదా!
(ఇదీ చదవండి: ధోనీ తొలి సినిమా టాక్ ఏంటి? హిట్టా ఫట్టా?)
Comments
Please login to add a commentAdd a comment