యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్! | Bullet Bhaskar Troll Rashmi Jabardasth Latest Promo | Sakshi
Sakshi News home page

Rashmi Bullet Bhaskar: చిరు సినిమా పేరు చెప్పి మరీ ట్రోల్ చేశాడు!

Published Tue, Sep 12 2023 6:43 PM | Last Updated on Tue, Sep 12 2023 7:08 PM

Bullet Bhaskar Troll Rashmi Jabardasth Latest Promo - Sakshi

తెలుగు ప్రేక్షకులు కామెడీని ఎక్కువగా ఆదరిస్తారు. అది సినిమా అయినా, టీవీ ప్రోగ్రామ్ అయినా బాగుంటే కచ్చితంగా చూసేస్తారు. అయితే ఒకప్పుడు బాగా గుర్తింపు తెచ్చుకున్న 'జబర్దస్త్'కి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోయింది. ప్రోమాలు తప్పితే షో ఎవరూ చూడట్లేదనిపిస్తుంది. సరే అది పక్కనబెడితే ఇప్పుడు అదే షోలో యాంకర్ రష్మీని ఓ కమెడియన్ సరదాగా ట్రోల్ చేశాడు.

20 ఏళ్ల క్రితం తెలుగు ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన రష్మీ.. ఒకటి రెండు సినిమాల్లో పెద్దగా గుర్తింపు లేని పాత్రలు చేసింది. ఎప్పుడైతే యాంకర్ అయిందో ఆమె ఫేట్ మారిపోయింది. హీరోయిన్‌గా సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొన్నాళ్ల క్రితం పలు మూవీస్ చేసింది గానీ ఇప్పుడు కేవలం షోల్లో మాత్రమే కనిపిస్తుంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' రెండో వారం నామినేషన్స్.. లిస్టులో తొమ్మిది మంది!)

తాజాగా రిలీజైన ఓ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్ మాట్లాడుతూ.. రష్మీని చూసేందుకని 'భోళా శంకర్' సినిమాకు వెళ్లానని.. కానీ కర్చీఫ్ పడిపోయిందని దాన్ని తీసుకునేలోపు రష్మీ యాక్ట్ చేసిన సీన్ వచ్చి వెళ్లిపోయిందని అన్నాడు. అయితే భాస్కర్ టీజ్ చేసినా సరే.. ఇది సరదాగా కావడంతో రష్మీ.. లైట్ తీసుకుంది. ఏదేమైనా సరే నవ్వుతూనే రష్మీ పరువు తీసేశాడు బుల్లెట్ భాస్కర్.

మెగాస్టార్ చిరంజీవి 'భోళా శంకర్' సినిమా ఆగస్టు 11న థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే ఫ్లాప్ టాక్ బయటకొచ్చింది. ఇందులో చిరు ఎంట్రీ సాంగ్ లో రష్మీ.. కాసేపు కనిపిస్తుంది. అలానే శ్రీముఖితోనూ చిరు... 'ఖుషి' నడుము సీన్ చేయడంపై అప్పట్లోనే ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉండగా సెప్టెంబరు 15 నుంచి 'భోళా శంకర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement