గబ్బిలాల శబ్దం వెనుక ఉన్న మర్మమేంటి?.. భయపెట్టిస్తోన్న తెలుగు ట్రైలర్ | Aadhi Pinisetty latest Movie Shabdham Telugu Official Trailer Out Now | Sakshi
Sakshi News home page

Shabdham Telugu Official: 'వెయ్యి గబ్బిలాలు చెవిలో అరిస్తే'.. భయపెడుతోన్న ట్రైలర్

Published Wed, Feb 19 2025 7:58 PM | Last Updated on Wed, Feb 19 2025 8:20 PM

Aadhi Pinisetty latest Movie Shabdham Telugu Official Trailer Out Now

ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ,లక్ష్మీ మీనన్(Lakshmi Menon )జంటగా నటిస్తోన్న చిత్రం శబ్దం (Shabdham). ఈ మూవీకి అరివళగన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను 7జీ ఫిల్స్మ్స్ బ్యానర్‌పై శివ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి  28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.


ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ సైకలాజికల్ ఇన్‌స్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గబ్బిలాల శబ్ధంతో బాధపడతున్న ఓ మహిళ చుట్టే ఈ కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్‌లో దృశ్యాలు చూస్తుంటే మరోవైపు హారర్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గబ్బిలాలు, దెయ్యం లాంటి సన్నివేశాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ బాస్కర్, రాజీవ్ మీనన్, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement