Arivazhagan
-
సిద్దార్థ్‌కు, నాకు పడేది కాదు.. 'బాయ్స్'లో నాకే ఎక్కువ పారితోషికం: తమన్
తెలుగు టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Thaman S) ఒకప్పుడు సినిమాలోనూ యాక్ట్ చేశాడు. సిద్దార్థ్‌తో కలిసి బాయ్స్ మూవీ (Boys Movie)లో నటించాడు. అయితే తనకు, సిద్దూకు అస్సలు పడేది కాదంటున్నాడు తమన్. అరివళగన్ దర్శకత్వంలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్ధం సినిమాకు తమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ ఫిబ్రవరి 28న విడుదల కానుంది.బాయ్స్ సినిమాలో నా రచ్చ అంతా ఇంతా కాదు!ఈ సినిమా ప్రమోషన్స్‌లో తమన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అతడు మాట్లాడుతూ.. బాయ్స్ సినిమాలో ఎక్కువ పారితోషికం అందుకుంది నేనే! సిద్దార్థ్(Siddharth)కు, నాకు అస్సలు పడేది కాదు. వాడు నేనే హీరో అంటే.. నువ్వు హీరో అయితే ఏంటి? హీరోయిన్ అయితే నాకేంటి? ఎక్కువ రెమ్యునరేషన్ అందుకుంటోంది నేను.. అనేవాడిని. చాలా టార్చర్ పెట్టేవాడిని. సినిమా షూటింగ్లో ఓసారి సిద్దార్థ్‌కు నైకీ సాక్స్ ఇచ్చి నాకు ఏదో మామూలు సాక్స్ ఇచ్చారు. నేనది తీసుకెళ్లి రత్నంగారి ముందు పడేశాను. సిద్దార్థ్‌కు నైకీ ఇచ్చి, నాకు నైలాన్ సాక్స్ ఇస్తే ఎలా? అని అడిగాను. ఇలాంటి చీప్ కొట్లాటలు చాలానే ఉన్నాయి. నాకది క్రేజీ ఎక్స్పీరియన్స్.చాలా పెంట చేశా..బాయ్స్ సినిమాకు అరివళగన్.. శంకర్ దగ్గర అసోసియేటివ్‌గా పని చేశాడు. నన్ను చూసుకోవడమే ఆయన పనైపోయింది. బాయ్స్ సెట్లో ఎవరి మాటా వినకుండా అందరినీ టార్చర్ పెట్టేవాడిని. క్యారవాన్‌లో ప్లగ్ తీసేసి కరెంట్ ఆపేవాడిని. బాత్రూమ్కు వెళ్లే నీళ్ల పైప్ కూడా కట్ చేసేవాడిని. ఇలా చాలా పెంటలు చేశాను. ఇవన్నీ అరివళగన్ కంట్రోల్ చేసేవాడు. సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో పడ్డాడు అని తమన్ నవ్వుతూ సరదాగా చెప్పుకొచ్చాడు.చదవండి: నాది రంగుల జీవితం కాదు.. ఎన్నో అవమానాలు..: హీరోయిన్ -
నా కెరీర్లో శబ్దం ప్రత్యేకం
‘‘వైశాలి’ చిత్రం తర్వాత డైరెక్టర్ అరివళగన్, నా కాంబినేషన్లో సినిమా చేయాలని అనుకున్నాం. అయితే సరికొత్త కథ, కాన్సెప్ట్ కుదరలేదు. ఇన్నేళ్లకు ‘శబ్దం’తో కుదిరింది. ఈ మూవీ ప్రేక్షకులకు మంచి అనుభూతినిస్తుంది. ఈ చిత్రం నా కెరీర్లో ప్రత్యేకమైనది’’ అన్నారు ఆది పినిశెట్టి. హీరో ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివళగన్ కాంబినేషన్లో తెరకెక్కిన తెలుగు–తమిళ చిత్రం ‘శబ్దం’. 7ఎ ఫిల్మ్స్‌పై శివ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఎన్ సినిమాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో, మైత్రీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నైజాంలో రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆది పినిశెట్టి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘శబ్దం’. మంచి కథా బలంతో పాటు భావోద్వేగాలున్న హారర్ మూవీ. రెగ్యులర్ హారర్ సినిమాలకి భిన్నంగా ఉంటుంది. ఆత్మలని సైంటిఫిక్ మెథడ్‌లో అన్వేషించే విధానం కొత్తగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ఆసక్తిగా ఉంటుంది. ఈ మూవీలో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ క్యారెక్టర్ నాది. శబ్దంతోనే ఆత్మలని పసిగడుతుంటాను. తమన్‌గారి మ్యూజిక్, నేపథ్య సంగీతం మా సినిమాకి చాలా ప్లస్. కెమేరామేన్ అరుణ్ అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. ‘శబ్దం’ని తెలుగులో హీరో నానీ గారికే తొలుత చూపించాను. సినిమా చాలా బాగుందని చెప్పారు. ‘నిన్ను కోరి’ మూవీ తర్వాత మేమిద్దరం కలిసి నటించే అవకాశం రాలేదు. ఆయన సినిమాలో మళ్లీ నటించే అవకాశం వస్తే కథ కూడా వినకుండా నటిస్తాను. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్ సినిమాస్ వారు మా సినిమాని తెలుగులో రిలీజ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాం. ఇక హీరోగా ‘డ్రైవ్’ అనే సినిమా చేశాను. ‘అఖండ 2’లో ఓ పాత్ర చేస్తున్నాను. అలాగే ‘మరకతమణి 2’ షూటింగ్ జరుగుతోంది. దేవా కట్టాగారి దర్శకత్వంలో ‘మయసభ’ అనే ఓటీటీ ప్రాజెక్ట్ చేస్తున్నాను’’ అని చెప్పారు. -
గబ్బిలాల శబ్దం వెనుక ఉన్న మర్మమేంటి?.. భయపెట్టిస్తోన్న తెలుగు ట్రైలర్
ఆది పినిశెట్టి (Aadhi Pinisetty) ,లక్ష్మీ మీనన్(Lakshmi Menon )జంటగా నటిస్తోన్న చిత్రం శబ్దం (Shabdham). ఈ మూవీకి అరివళగన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను 7జీ ఫిల్స్మ్స్ బ్యానర్‌పై శివ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్.ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ సైకలాజికల్ ఇన్స్టిగేటివ్ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. గబ్బిలాల శబ్ధంతో బాధపడతున్న ఓ మహిళ చుట్టే ఈ కథను రూపొందించినట్లు అర్థమవుతోంది. ట్రైలర్లో దృశ్యాలు చూస్తుంటే మరోవైపు హారర్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గబ్బిలాలు, దెయ్యం లాంటి సన్నివేశాలు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నఈ చిత్రంలో సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ బాస్కర్, రాజీవ్ మీనన్, వివేక్ ప్రసన్న కీలక పాత్రలు పోషించారు. కాగా.. ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతమందించారు.The thrill has a new face! 🎬🔥#Sabdham trailer is out now!🎧Link: https://t.co/FsVROFuRUnGet ready for a #SoundThriller ❤️🔥From the makers of #Vaishali #SabdhamTrailer #SabdhamFromFeb28Starring @AadhiOfficialAn @dirarivazhagan FilmA @MusicThaman Musical pic.twitter.com/FTt0HZ814g— Aadhi🎭 (@AadhiOfficial) February 19, 2025 -
Tamilrockerz Official Teaser: పైరసీ వెబ్‌సైట్‌పై వెబ్ సిరీస్.. ఆసక్తిగా టీజర్
Arun Vijay New Web Series On Tamil Rockers: సినిమా వేధించే ప్రధాన సమస్యల్లో పైరసీ ఒకటి. పైరసీ మహమ్మారీ కారణంగా అనేక సూపర్ హిట్ మూవీస్ కలెక్షన్లలో వెనుకపడ్డాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ సినిమా.. ఈ పైరసీ భూతానికి బలి అవుతూనే వస్తోంది. గతంలో చిత్రాలు నెలలు, వందల రోజులు ఆడి, సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకునేవి. కానీ ఈ పైరసీ ఎంట్రీ ఇచ్చాక సినిమాలు పట్టుమని నెల రోజులు కూడా కనిపించట్లేదు. ఇలాంటి పైరసీ వెబ్సైట్లో ప్రముఖంగా చెప్పుకునేది తమిళ్ రాకర్స్. దక్షిణాది సినిమాలకు ఇది అతిపెద్ద గండగా పరిణిమించిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని వాడుతూ పైరసీ ప్రింట్లను తీసుకువచ్చి దర్శకనిర్మాతలకు ముచ్చెటమలు పట్టేలా చేసింది ఈ వెబ్సైట్. తాజాగా ఈ తమిళ్ రాకర్స్‌పై ఓ వెబ్ సిరీస్ రానుంది. తమిళ్ రాకర్స్ వల్ల నిర్మాతలు ఎదుర్కొన్ని కష్టాలను ఈ వెబ్ సిరీస్‌లో చూపించనున్నారట. ఈ సిరీస్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్ శిష్యుడు అరివళగన్ డైరెక్షన్ చేయనున్నారు. ఇందులో అరుణ్ విజయ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకు కుట్రమ్ 23, బోర్డర్ సినిమాలు వచ్చి ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ కూడా మంచి విజయం సాధిస్తుందని చిత్రబృంద నమ్మకంగా ఉంది. తమిళ్ రాకర్స్ పేరుతోనే టైటిల్ ప్రకటన ఇచ్చి ఆసక్తి కలిగించారు. ఈ వెబ్ సిరీస్ టీజర్‌ను జులై 3న విడుదల చేశారు. ఈ వెబ్ సిరీస్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్ మిస్ ఇండియా కిరీటం.. 21 ఏళ్ల అందం సొంతం కమల్ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ? -
నయన ఆయనకు హ్యాండిచ్చిందా
తమిళసినిమా: అగ్ర కథానాయకిగా వెలుగొందుతున్న నటి నయనతార. సూపర్‌స్టార్ నుంచి, యువ స్టార్స్ వరకూ పాత్ర నచ్చితే నటించడానికి రెడీ అంటున్న ఈ బ్యూటీ మరోపక్క లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాల్లోనూ నటిస్తూ లేడీసూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. తమిళం, తెలుగు భాషా చిత్రాలతో బిజీగా ఉన్న నయనతార చాలా నెలల క్రితం దర్శకుడు అరివళగన్ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆయన ఈ సంచలన నటి కోసం ఒక మంచి పవర్ఫుల్ లేడీ ఓరియెంటెడ్ కథను తయారు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అప్పుడు చిత్ర వివరాలను వెల్లడించవద్దని నయనతార దర్శకుడితో చెప్పినట్లు టాక్. దీంతో ఆ తరువాత అరివళగన్ చిత్రానికి సంబంధించిన వివరాలేవీ మీడియాల్లో ప్రచారం కావడం లేదు. నయనతార కూడా ఆ చిత్రం గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. అంతే కాదు ఆ చిత్రాన్ని పెండింగ్‌లో పెట్టి ఇతర చిత్రాల్లో నటిస్తోంది. తాజాగా అరివళగన్ చిత్రంలో నటించడానికి నయనతార నిరాకరించినట్లు ప్రసారం సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. అయితే తను ఎందుకు ఈ చిత్రాన్ని దూరంగా పెట్టిందన్న విషయం తెలియలేదు. సుమారు ఏడాదికి పైగా దర్శకుడు అరివళగన్ను వెయిటింగ్లో పెట్టి ఇప్పుడు ఆయనకు హ్యాండ్ ఇవ్వడానికి కారణం ఏమై ఉంటుందన్నది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వార్త అధికారికంగా చిత్ర వర్గాలు వెల్లడించలేదన్నది గమనార్హం. -
ఆమెతో భార్య సంబంధం పెట్టుకుందని..
చెన్నై: మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భార్య తనకు దూరమవుతుందని భావించిన భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంటున్నాడు. అరివఝగన్ (35) చెన్నైలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఎస్ఐగా పనిచేస్తోంది. వీరిద్దరూ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇదే కాలేజీలో పనిచేస్తున్న మరో మహిళా ఎస్ఐతో తన భార్య సంబంధం కొనసాగిస్తోందని అరివఝగన్ చెప్పాడు. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందినవారని, స్నేహితులుగా ఉంటున్న వీరు పరిధి దాటి సంబంధం పెట్టుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడించాడు. వీరిద్దరి అసహజ సంబంధం గురించి పోలీసులు హేళనగా మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె తన భార్యకు చెప్పిందని తెలిపాడు. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు మహిళా ఎస్ఐ తీవ్రంగా అవమానించిందని, చెప్పుతో కొట్టిందని చెప్పాడు. వీరిద్దరి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపాడు. కాగా అరివఝగన్ తనను దూషించాడని మహిళ ఎస్ఐ ఉన్నతాధికారుల వద్ద ఆరోపించింది.