ఆమెతో భార్య సంబంధం పెట్టుకుందని.. | Chennai cop attempts suicide over wife’s friendship with woman SI | Sakshi
Sakshi News home page

ఆమెతో భార్య సంబంధం పెట్టుకుందని..

Published Wed, Sep 28 2016 9:36 AM | Last Updated on Mon, Sep 4 2017 3:24 PM

ఆమెతో భార్య సంబంధం పెట్టుకుందని..

ఆమెతో భార్య సంబంధం పెట్టుకుందని..

చెన్నై: మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భార్య తనకు దూరమవుతుందని భావించిన భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంటున్నాడు.

అరివఝగన్ (35) చెన్నైలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఎస్ఐగా పనిచేస్తోంది. వీరిద్దరూ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇదే కాలేజీలో పనిచేస్తున్న మరో మహిళా ఎస్ఐతో తన భార్య సంబంధం కొనసాగిస్తోందని అరివఝగన్ చెప్పాడు. వీరిద్దరూ ఒకే బ్యాచ్కు చెందినవారని, స్నేహితులుగా ఉంటున్న వీరు పరిధి దాటి సంబంధం పెట్టుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడించాడు.  వీరిద్దరి అసహజ సంబంధం గురించి పోలీసులు హేళనగా మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె తన భార్యకు చెప్పిందని తెలిపాడు. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు మహిళా ఎస్ఐ తీవ్రంగా అవమానించిందని, చెప్పుతో కొట్టిందని చెప్పాడు. వీరిద్దరి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపాడు. కాగా అరివఝగన్ తనను దూషించాడని మహిళ ఎస్ఐ ఉన్నతాధికారుల వద్ద ఆరోపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement