woman si
-
మహిళా ఎస్ఐ కొడుకు అఘాయిత్యం
కర్ణాటక: మహిళా ఎస్ఐ కుమారుడు ద్విచక్రవాహనంతో అతి వేగంగా వీలింగ్ చేస్తూ ఢీకొట్టడంతో ఒక వృద్ధుడు చనిపోగా, మరొక యువకుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మైసూరు జిల్లాలోని నంజనగూడు గ్రామీణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హిమ్మావు వద్ద ఆదివారం జరిగింది. నిందితుడు సయ్యద్ ఐమాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. నంబర్ ప్లేట్ లేని బైక్‌తో.. సయ్యద్ ఐమాన్ నంబర్ ప్లేటు లేని ప్లాటినా బైక్‌పై వీలింగ్ చేస్తూ వచ్చి హిమ్మావు గ్రామంలో పశువులను మేపుతూ కూర్చుని ఉన్న సిద్దప్ప(68), గోవిందరాజు (25)లను ఢీకొన్నాడు. సిద్ధప్ప తీవ్ర గాయాలతో చనిపోగా గోవిందరాజును స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. నిందితున్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు. తాను నంజనగూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యాస్మిన్ తాజ్ కొడుకునని చెప్పాడు. చిన్నపాటి గాయాలైన అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతుని కుమారుడు మహాదేవస్వామి నంజనగూడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. గతంలోనూ అరెస్టయి ఇంతకు ముందు కూడా సయ్యద్ ఐమాన్ చోరీ చేసిన స్కూటర్ మీద ప్రమాదకరంగా వీలింగ్ చేస్తూ ఉంటే ప్రజలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి వదిలిపెట్టారు. ఇంతలోనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు నంజనగూడు ఆస్పత్రి మార్చురి వద్ద ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. శవాన్ని ఊరికి తీసుకెళ్లబోమని, పోలీసు అధికారి కొడుకునంటూ దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉంటే ఏం చేయాలని ప్రశ్నించారు. అతనితో పాటు తల్లిని కూడా అరెస్టు చేయాలని ధర్నా చేశారు. ఈ విషయం రచ్చ కావడంతో జిల్లా ఎస్పీ సీమా లాట్కర్ సదరు ఎస్ఐని ఏ పోస్టింగ్ లేకుండా బదిలీ చేసినట్లు తెలిసింది. -
‘రియల్’ క్రైం స్టోరీ: లేడీ ఎస్ఐ.. మహిళా మేజిస్ట్రేట్.. విస్తుపోయే షాకింగ్ నిజాలు
ఎంవీపీకాలనీ(విశాఖ తూర్పు): బాధితుడికే అనుమానాలు లేని కేసు ఇది. తనంటే పడనివారెవరో తనపై దాడిచేసుంటారన్నదే అతని అనుమానం. గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతను దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తొలుత అందించిన సమాచారం కూడా ఇదే. అయితే సాధారణ ఘటనగా మొదలైన ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. ఒక మహిళ ఎస్ఐ, మేజిస్ట్రేట్ల ప్రమేయం బయటపడటంతో సంచలనాలకు కేంద్రమైంది. నిందితుల వేటలో విశాఖ పోలీసులకు సరికొత్త సవాళ్లు విసిరింది. చట్టం ముందు ఎంతటివారైనా సమానమంటూ పోలీసులు చేసిన దర్యాప్తు వారి నిబద్ధతకు అద్దం పట్టింది. చదవండి: బంగారం ధర పెరుగుతుందా..? తగ్గుతుందా?.. విశ్లేషకులు ఏం చెబుతున్నారు? మూడో వ్యక్తి విచారణతో.. జూన్ 19న రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్‌పై బీచ్‌రోడ్డు కోస్టల్ బ్యాటరీ సమీపంలో దాడి జరిగింది. ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి రాజేష్ తలపై సుత్తితో కొట్టి పరారయ్యారు. అనంతరం రాజేష్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. తనంటే పడనివారు ఎవరో ఈ దాడి చేసుంటారని రాజేష్ పోలీసులకు తెలపడంతో ఆ దిశగా దర్యాప్తు ప్రారంభమైంది. మొదట్లో రోటీన్‌గా కేసు విచారణ ప్రారంభమైంది. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు గనగల్ల రాజు, కూర్మాన రామస్వాములను జూలై 1న అదుపులోకి తీసుకుని విచారించగా తరుణ్ అనే మూడో వ్యక్తి ప్రమేయం బయటపడింది. అతన్ని విచారించగా విస్తుపోయే వాస్తవాలు బయటపట్డాయి. హత్యకు రెండు బృందాలు? బాధ్యత గల వృత్తిలో ఉన్న భీమిలి మేజిస్ట్రేట్ జయలక్ష్మి, ఆమె సోదరి భీమిలి క్రైం ఎస్ఐ నాగమణిలే ఈ హత్యాయత్నానికి ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. మేజిస్ట్రేట్ జయలక్ష్మికి రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీలే ఈ హత్యాయత్నానికి కారణంగా నిలిచాయి. మేజిస్ట్రేట్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న అప్పలరెడ్డి.. రాజేష్‌ను హత్య చేయాల్సిందిగా తరుణ్‌కు సూచించాడు. తరుణ్ ఆరిలోవ, జాలరిపేటకు చెందిన మరో ఇద్దరు యువకులను ఇందుకు పురమాయించగా.. వారు రాజేష్‌పై దాడి చేశారు. వారిని పట్టుకుని విచారించగా మేజిస్టేట్ ప్రమేయంతో పాటు రాజేష్‌ను హత్యచేసేందుకు మరో బృందాన్ని సిద్ధం చేసిన ఎస్ఐ నాగమణి, కానిస్టేబుల్ ప్రమోద్‌ల వ్యవహారం బయటపడింది. ఎస్ఐ సూచనతో ప్రమోద్ ఓ రౌడీషీటర్‌తో పాటు మరో ముగ్గురిని రాజేష్‌ను హత్య చేసేందుకు పురమాయించాడు. వారి వాట్సాప్ డేటా ఆధారంగా పోలీసులు ఈ వ్యవహారాన్ని గుర్తించారు. పోలీసులకు చుక్కలు చూపించారు? పోలీసు చర్యలను ముందుగానే పసిగట్టిన ఎస్ఐ నాగమణి, మేజిస్ట్రేట్ జయలక్ష్మి, ఆమె డ్రైవర్ అప్పలరెడ్డి పరారయ్యారు. ఎస్ఐ నాగమణికి పోలీసుల క్రైం దర్యాప్తుపై ముందుగానే అవగాహన ఉండటంతో మూడు నెలలుగా పోలీసులకు చుక్కలు చూపించారు. ప్రత్యేక బృందాలకు దొరకకుండా తప్పించుకుని తిరిగారు. హైకోర్టు, సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌కు ఎస్ఐ భర్తతో పాటు కొందరు కుటుంబ సభ్యులు ప్రయత్నిస్తుండగా.. వారు పోలీసులకు చిక్కకుండా కర్నాటక, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఏపీలోని పలు నగరాల్లో సంచరించారు. ఒక్కో ప్రాంతంలో రెండు నుంచి నాలుగు రోజులు ఉంటూ నిత్యం సిమ్‌కార్డులు మార్చేసేవారు. వాట్సాప్ కాల్స్‌లో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ ఉండేవారు. అయినా వెనక్కి తగ్గని విశాఖ పోలీసు బృందాలు వారి ఆచూకీపై నిరంతరం నిఘా ఉంచడంతో ఎట్టకేలకు శనివారం విజయనగరంలో పట్టుబడ్డారు. చింతలవలసలో ఇంటికి వచ్చి వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. డ్రైవర్‌ను హైవేపై అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎస్ఐ నాగమణితో పాటు డ్రైవర్ అప్పలరెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ద్వారకా ఏసీపీ, కేసు దర్యాప్తు అధికారి ఆర్వీఎస్ఎన్ మూర్తి వెల్లడించారు. మేజిస్ట్రేట్‌ను అరెస్ట్ చేసేందుకు శాఖపరమైన మరికొన్ని చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. అవి పూర్తయిన వెంటనే అరెస్ట్ చేయడం చేస్తామన్నారు. ఈ ఘటనలో తొలుత ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన ఆయన తర్వాత కానిస్టేబుల్ ప్రమోద్‌తో పాటు రౌడీషీటర్, మరో వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. శనివారం ఎస్ఐతో పాటు మేజిస్ట్రేట్ డ్రైవర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో ఒక్కోక్క అంశం బయటపడిన విధానంపై ఆయన స్పందిస్తూ చట్టం ఎదుట ఎంతటివారైనా సమానమే అన్నారు. బాధ్యత గల ఉద్యోగాల్లో ఉండి చట్ట వ్యతిరేకంగా నేరపూరిత విధానాలకు పాల్పడిన ఎస్ఐ నాగమణి, మేజిస్ట్రేట్ జయలక్ష్మి ఇందుకు అతీతులు కారన్నారు. -
ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి.. మృగాడి ఆట కట్టించిన మహిళా ఎస్సై
న్యూఢిల్లీ: నిత్యం ఫేస్బుక్లో గడపడమే అతగాడి పని. అమ్మాయి పేరు మీద ఎఫ్బీ అకౌంట్ కనిపిస్తే చాలు.. అతడి చేతులు ఫ్రెండ్ రిక్వెస్ట్‌ని పంపిస్తాయి. దురదృష్టం కొద్ది అవతలి వైపు అమ్మాయి ఆ రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేసిందంటే.. ఇక ఆమె జీవితం నాశనం అయినట్లే. మెల్లగా మాటలు చెప్పి.. ప్రేమిస్తున్నాంటూ నమ్మబలికి.. యువతిని లోబర్చుకుంటాడు. అవసరం తీరాక ముఖం చాటేస్తాడు. ఆ తర్వాత కాంటాక్ట్ చేయడానికి ఎలాంటి సమాచారం ఉండదు. కొంతకాలంగా ఇలా అడ్రెస్లు మార్చి.. యువతులను ఏమారుస్తున్న మృగాడికి విభిన్న రీతిలో బుద్ధి చెప్పింది మహిళా పోలీసు అధికారి. ముల్లును ముల్లుతోనే తీయాలన్న చందంగా.. నిందితుడి దారిలోనే వెళ్లి.. ఫేస్బుక్ వేదికగా వల వేసి పట్టుకున్నారు. ఢిల్లీలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలు.. ఢిల్లీకి చెందిన 16 ఏళ్ల మైనర్ బాలికకు నిందితుడు అవినాష్ ఫేస్బుక్లో పరియచం అయ్యాడు. ముందు మంచిగా నటిస్తూ.. ప్రేమించానని నమ్మబలికాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి నిందితురాలిని పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. ఈ క్రమంలో అతడి కారణంగా గర్భం దాల్చిన బాధితురాలు చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అమ్మాయి అత్యాచారానికి గురయిందని గుర్తించారు. ఈ క్రమంలో సదరు మైనర్ బాలిక, అవినాష్ దారుణాల గురించి పోలీసులకు తెలిపింది. ఇక అతడు ఎక్కడుంటాడు.. కుటుంబ వివరాలేవి తనకు తెలియదని చెప్పింది. అతడి ఫోన్ నంబర్ కూడా పని చేయడం లేదని వెల్లడించింది. నిందితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాన్ని చేధించేందుకు ఫేస్‌బుక్‌నే ఎన్నుకున్నారు. ఈ క్రమంలో అవినాష్ పేరుతో ఫేస్బుక్లో సర్చ్ చేశారు. అలా వచ్చిన అకౌంట్లలో ఓ దానిలో బాధితురాలితో కలిసి ఉన్న ఓ వ్యక్తి అకౌంట్ వారికి కనిపించింది. బాధితురాలిని పిలిచి దాన్ని చూపించగా.. అతడే అవినాష్ అని ఆమె తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళా ఎస్సై సోషల్ మీడియా ద్వారా అమ్మాయిల్ని మోసం చేస్తున్న అవినాష్‌కు, దాని ద్వారానే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. అతడిని సాక్ష్యాలతో పట్టుకోవాలని అదే దారిని ఎంచుకున్నారు. ఓ నకిలీ ప్రొఫైల్ క్రియోట్ చేసిన మహిళా ఎస్ఐ.. నిందితుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది. సాధారణంగా అమ్మాయిలంటే పడిచచ్చేపోయి నిందితుడు.. వెంటనే ఎస్సై ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు. అప్పటి నుంచి కొద్ది రోజుల పాటు వాడితో చాటింగ్ చేసింది. ఆ తర్వాత నెమ్మదిగా అవినాష్ ఫోన్ నంబర్ సంపాదించింది. ఆ తర్వాత వ్యక్తిగతంగా కలుద్దామని చెప్పి.. ఓ ప్రదేశానికి రావాలని కోరింది మహిళా ఎస్సై. తాను చెప్పిన ప్రదేశానికి రాగానే అవినాష్‌ను అరెస్ట్ చేసింది. పోలీసుల విచారణలో నిందితుడు పలు విషయాలను వెల్లడించాడు. పదిహేను నెలల్లో ఆరుగురిపై లైంగిక దోపిడీకి పాల్పడినట్టు చెప్పాడు. అందుకే తన అడ్రస్ దొరకకుండా తరచూ ఇళ్లు మారుతుంటానని పేర్కొన్నాడు. అమ్మాయిలకు నకిలీ పేర్లు చెప్పి పరిచయం పెంచుకుని శారీరక వాంఛ తీరిన తర్వాత వదిలేస్తానని అంగీకరించాడు. -
పెళ్లి కావడం లేదని మహిళా ఎస్సై ఆత్మహత్య
అమ్మాయికి 20 ఏళ్లు వచ్చాయంటే చాలు పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలనే చాలామంది తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బునంతా కూతురు చదువుకు పెట్టి అప్పటి వరకు ఏ లోటు లేకుండా చూసుకున్న పేరేంట్స్ ఆమె మంచి స్థాయిలో స్థిరపడ్డాక పెళ్లి పేరుతో తన జీవితానికి సంకేళ్లు వేస్తుంటారు. దీనికి తోడు మీ అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా అంటూ చుట్టుపక్కల వాళ్లు, బంధువుల సూటిపోటి మాటలు ఒకటి. దీంతో తన ఆశలను అటు తల్లిదండ్రులకు చెప్పలేక, ఇటు తనలో తాను కుమిలిపోయి చివరికి ఆత్మహత్య శరణమనుకునే యువతులు కోకొల్లలు. ఈ కోవలోకి అందరూ రాకపోయినా ఎక్కడో ఒక్కచోట నిత్యం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. చూస్తూనే ఉన్నాం. తాజాగా పెళ్లి కావడం లేదన్న బాధను తట్టుకోలేక ఎస్సైగా పని చేసే యువతి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రత్లామ్ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్లో కవితా సోలంకి అనే మహిళ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ఒక బాధ్యతాయుతమైన పోలీసు ఆఫీసర్. ఎంతో కష్టపడితే గానీ ఆ కొలువును సాధించలేము. ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఆమెకు 35 సంవత్సరాలు. సెలవుల్లో ఇంటికి వెళ్లిన ఆమెకు ఓ ఘటన ఎదురైంది. పెళ్లి ఎప్పుడంటూ ఇంటి దగ్గర ఉన వాళ్లంతా ప్రశ్నించడం మెదలు పెట్టారు..ఇప్పుడే కాదు ఇంటికి వెళ్లిన ప్రతీ సారి ఇదే అడగుతుండటంతో ఆవేదన చెందింది. దీంతో ఇంటి నుంచి బయలుదేరి తిరిగి డ్యూటీలో జాయిన్ అయింది. బుధవారం రాత్రి అధికార నివాసంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. తర్వాత తన స్నేహితురాలికి ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పడంతో ఆమె హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దురదృష్టవశాత్తు గురువారం ఆమె మరణించింది. మృతురాలి ఇంట వద్ద నుంచి సుసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో.. తనకు పెళ్లి కావడం లేదని ఆందోళన చెందుతున్నట్లు, వివాహంపై ఇరుగుపొరుగు వారి మాటలకు సమాధాన చెప్పలేక అలసి పోయానని రాసుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. -
రూ.35 లక్షల లంచం.. మహిళా ఎస్ఐ అరెస్ట్
అహ్మదాబాద్ : అత్యాచార నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం తీసుకున్నారనే అభియోగంపై ఓ మహిళా ఎస్ఐను గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిపై సంఘ వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు కాకుండా చేసేందుకు లంచం డిమాండ్ చేసిందనే ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అహ్మదాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీ పని చేసే ఇద్దరు మహిళలు తమపై కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనాల్ షా అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019లో ఈ కేసు నమోదు కాగా, దర్యాప్తు కొనసాగుతూ వస్తోంది. కాగా, ఇటీవల ఈ కేసు విచారణ అహ్మదాబాద్ మహిళా పోలీసు స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తోన్న శ్వేతా జడేజాకు అప్పగించారు. కేసు విచారణ ప్రారంభించిన శ్వేత.. నిందితుడి నుంచి రూ.35 లక్షల లంచం డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిందితుడి సోదరుడు భావేష్‌ను హెచ్చరించారు. భావేష్ ఓ మధ్యవర్తి ద్వారా 20లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకొని, అ మొత్తాన్ని అప్పజెప్పాడు. కొద్ది రోజుల తర్వాత మరో 15లక్షలు ఇవ్వాలని ఎస్ఐ నుంచి ఒత్తిడి రావడంతో సిటీ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిర్యాదు రాగా, విచారణ చేసి శుక్రవారం శ్వేతను అరెస్ట్ చేశారు. రూ.20లక్షల లంచం తీసుకుని, మరో 15లక్షలు డిమాండ్ చేసినట్లు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. శనివారం ఆమెను సెషన్స్ కోర్టు హాజరు పర్చగా, కోర్టు 3 రోజుల రిమాండ్‌ను విధించింది. ఈ మొత్తం కేసు దర్యాప్తును స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఏసీపీ బీసీ సోలంకికి అప్పగించినట్లు క్రైమ్ బ్రాంచ్ జాయింట్ పోలీస్ కమిషనర్ అజయ్ తోమర్ చెప్పారు. -
మహిళా ఎస్ఐకి తాళి కట్టేందుకు యత్నం హోంగార్డు అరెస్ట్
చెన్నై ,టీ.నగర్: మహిళా ఎస్ఐకు బలవంతంగా తాళి కట్టేందుకు ప్రయత్నించిన హోంగార్డును పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. నుంగంబాక్కం పోలీసు స్టేషన్లో మహిళా ఎస్ఐగా విల్లుపురం జిల్లా, తిరుక్కోవిలూరుకు చెందిన మణిమేగలై (24) పనిచేస్తున్నారు. ఈమె 2016లో వేలూరు కాట్పాడి పోలీసు స్టేషన్లో ఎఎస్ఐగా పనిచేశారు. ఆ సమయంలో కాట్పాడికి చెందిన బాలచంద్రన్ (25) హోంగార్డుగా పనిచేస్తూ వచ్చాడు. అతనితో మణిమేగలై చనువుగా ఉండేదని తెలిసింది. దీన్ని ప్రేమగా భావించిన బాలచంద్రన్ మణిమేగలైను ఒన్‌సైడ్‌గా ప్రేమించాడు. ఇలా ఉండగా శనివారం రాత్రి చెన్నైకు చేరుకున్న బాలచంద్రన్ ఎగ్మూరులోని ఉడుపి హోటల్ వద్ద మణిమేగలైతో మాట్లాడాడు. ఆ సమయంలో తాను ఆమెను గాఢంగా ప్రేమిస్తున్నట్లు తనను వివాహం చేసుకొమ్మని కోరాడు. ఇందుకు మణిమేగలై నిరాకరించింది. అయినప్పటికీ తాను సిద్ధంగా తెచ్చుకున్న తాళిబొట్టును మణిమేగలై మెడలో ప్రజల సమక్షంలోనే కట్టేందుకు ప్రయత్నించాడు. దీన్ని ఊహించని మణిమేగలై అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించింది. ప్రజలు బాలచంద్రన్‌ను పట్టుకుని ఎగ్మూరు పోలీసు స్టేషన్లో అప్పగించారు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ఆమెతో భార్య సంబంధం పెట్టుకుందని..
చెన్నై: మరో మహిళతో సంబంధం పెట్టుకున్న భార్య తనకు దూరమవుతుందని భావించిన భర్త విషం తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంటున్నాడు. అరివఝగన్ (35) చెన్నైలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఎస్ఐగా పనిచేస్తోంది. వీరిద్దరూ పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇదే కాలేజీలో పనిచేస్తున్న మరో మహిళా ఎస్ఐతో తన భార్య సంబంధం కొనసాగిస్తోందని అరివఝగన్ చెప్పాడు. వీరిద్దరూ ఒకే బ్యాచ్‌కు చెందినవారని, స్నేహితులుగా ఉంటున్న వీరు పరిధి దాటి సంబంధం పెట్టుకున్నారని పోలీసుల విచారణలో వెల్లడించాడు. వీరిద్దరి అసహజ సంబంధం గురించి పోలీసులు హేళనగా మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె తన భార్యకు చెప్పిందని తెలిపాడు. ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు మహిళా ఎస్ఐ తీవ్రంగా అవమానించిందని, చెప్పుతో కొట్టిందని చెప్పాడు. వీరిద్దరి వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపాడు. కాగా అరివఝగన్ తనను దూషించాడని మహిళ ఎస్ఐ ఉన్నతాధికారుల వద్ద ఆరోపించింది. -
మహిళా ఎస్ఐ ఆత్మహత్యా యత్నం
బెంగళూరు: నగరంలో ఓ మహిళా ఎస్ఐ మంగళవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. డీఎస్పీలైన కల్లప్ప, గణపతిల బలవన్మరణాలు ఘటనలు మరిచిపోవడానికి ముందే ఈ ఘటన చోటు చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సహచర ఉద్యోగులు చెబుతున్న వివరాల ప్రకారం...స్థానిక విజయనగర పోలీస్‌స్టేషన్‌లో రెండేళ్లుగా ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న రూపా మొదటి నుంచి సున్నిత మనస్కురాలు. దీని వల్ల కేసుల పరిష్కారం సరిగా జరిగేది కాదని తెలుస్తోంది. అయితే పోలీస్‌శాఖలో కొంత కఠినంగా వ్యవహరించాలని, అప్పుడే విధులుసజావుగా సాగుతాయని ఉన్నతాధికారులు చెబుతూ వచ్చేవారు. అయితే రూపా తన ఆలోచన విధానాన్ని మార్చుకోలేదు. ఈ నేథ్యంలోనే మంగళవారం సాయంత్ర స్టేషన్‌లోని ఉన్నతాధికారులకు, రూపాకు మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అటుపై ఆవేశంతో ‘మీకు సరైన గుణపాఠం చెబుతా. డీఎస్పీ గణపతి మాదిరి నేను కూడా...’ అంటూ ఉన్నతాధికారులు ఉన్న గది నుంచి బయటికి వచ్చి వేగంగా యూనిఫాంలోనే తన ఇంటి వైపు వెళ్లారు. ఆ సమయంలో ఆమె నిద్రమాత్రలు మింగారు. కంగుతిన్న అధికారులు అక్కడే ఉన్న కానిస్టేబుల్స్ రూపాను అనుసరించాల్సిందిగా కానిస్టేబుల్స్‌కు సూచించారు. కొంత దూరం వెళ్లిన తర్వాత రూపా కిందపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. వెంటనే కానిస్టేబుల్స్ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి రూపాను స్థానికుల సహకారంతో దగ్గర్లోని సుగుణ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నామని ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆసుపత్రి వైద్యాధికారి రవీంద్ర తెలిపారు. ఇదిలా ఉండగా మొబైల్ దొంగతనం విషయం పైన రూపా ఆత్మహత్య యత్నం ఘటనలో మరో వాదన కూడ వినిపిస్తుంది. స్టేషన్ పరిదిలో ఇటివల జరిగిన ఓ అతి ఖరీదైన మొబైల్ దొంగతనం జరిగింది. రెండు రోజుల ముందు ఆ మొబైల్ రికవరీ కూడ అయింది. అయితే మొబైల్ బాధితుడికి ఆ మొబైల్ ఇవ్వ కుండా రూపా తన వద్ద పెట్టుకుంది. ఈ విషయం ఉన్నతాధికారులకు కూడ తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారి రూపను ప్రశ్నించడమే కాకుండ స్టేషన్ డైరిలో ‘‘రూపా రికవరి మొబైల్‌ను దుర్వినియోగం చేసింది’’ అని లిఖిత పూర్వకంగా రాశారు. దీంతో మనోవేదనకు గురైన రూపా ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. కాగా పోలీసు ఉన్నతాధికారులు చరణ్‌రెడ్డి, సందీప్ పాటిల్ ఆస్పత్రికి వెళ్లి రూపను పరామర్శించారు. ఘటన ఎలా జరిగిందని సిబ్బందిని ఆరా తీశారు. -
పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చింది
-
పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చింది
తన భార్య పోలీసు అన్న పదానికే మచ్చ తెచ్చిందని, ఇంతకు ముందు కూడా ఇలాగే కొన్నిసార్లు ఇంటికి ఆలస్యంగా రావడం లాంటి సంఘటనలు జరిగాయని మహిళా ఎస్ఐ భర్త సునీల్ వాపోయారు. కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామితో కలిసి తన భార్యను పట్టుకున్నఅనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత సునీల్ మీడియాతో మాట్లాడారు. ఇంతకుముందు కొన్నిసార్లు తన భార్య ఆలస్యంగా ఇంటికి వచ్చేదని, ఎందుకని అడిగితే బస్సు ఫెయిలైనట్లు చెప్పేదని అన్నారు. ఇంతకుముందు కూడా అనుమానం వచ్చినా, ఇప్పుడు మాత్రం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని చెప్పారు. తాను హోటల్ గది తలుపు కొట్టినప్పుడు ఎవరు అని అడిగిందని, మూడు సార్లు తలుపు కొట్టిన తర్వాత అప్పుడు నైటీ సర్దుకుంటూ వచ్చి తలుపు తీసిందని, తనను లోపలకు రావద్దని కూడా అడ్డుకుందని అన్నారు. తీరా తాను లోపలకు వెళ్లేసరికి లోపలి నుంచి సీఐ పరుగున బయటకు వచ్చారని తెలిపారు. కాగా, ఈ కేసులో కరీంనగర్ త్రీటౌన్ సీఐ స్వామితో పాటు వరంగల్ జిల్లాకు చెందిన మహిళా ఎస్ఐని కూడా బదిలీ చేశారు. వారిద్దరినీ డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. వారిద్దరిపైన 407, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
దొరికిపోయిన సీఐ, ఎస్ఐలపై బదిలీ వేటు
హైదరాబాద్ : కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ, వరంగల్ మహిళా ఎస్ఐ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈ సంఘటనపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. మరోవైపు సీఐ స్వామితో పాటు మహిళా ఎస్ఐపై బదిలీ వేటు పడింది. వారిద్దర్ని డీఐజీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కాగా ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసుల నుంచి ఫిర్యాదు వివరాలు సేకరించాలని వరంగల్ డీఐజీ మల్లారెడ్డి శనివారం కరీంనగర్ జిల్లా ఎస్పీని ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని డీఐజీ తెలిపారు. -
ఒకే హోటల్ గదిలో సీఐ, మహిళా ఎస్ఐ
-
ఒకే హోటల్ గదిలో సీఐ, మహిళా ఎస్ఐ
హైదరాబాద్ : గుంటూరు జిల్లాలో ఓ వ్యక్తి కోసం ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు కొట్టుకున్న ఘటన మరవక ముందే... పోలీస్ శాఖలోనే ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అబిడ్స్‌లోని హోటల్లో ఒకే గదిలో ఉన్న సీఐ, మహిళా ఎస్ఐని పోలీసులు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే తెలంగాణ అసెంబ్లీ బందోబస్తు కోసం కరీంనగర్ జిల్లాకు చెందిన సీఐ స్వామి హైదరాబాద్ వచ్చారు. ఆయనకు లకడీకా ఫూల్ లోని ద్వారక హోటల్లో రూమ్ కేటాయించారు. అయితే సీఐ ద్వారకా హోటల్లో కాకుండా బృందావనం హోటల్లో దిగారు. అదే హోటల్లో వరంగల్ జిల్లాకు చెందిన ఓ మహిళా ఎస్ఐ ఉన్నారు. వీరిద్దరూకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మహిళా ఎస్ఐ భర్త నగరానికి వచ్చాడు. సీఐ...తన భార్య ఇద్దరు కలిసి ఉండటాన్ని గమనించి అబిడ్స్ పోలీసులను ఆశ్రయించాడు. కాగా సీఐ స్వామి, మహిళా ఎస్ఐ ఒకే గదిలో ఉన్న సమయంలో ...మహిళా ఎస్ఐ భర్త సునీల్...గత రాత్రి 11 గంటల సమయంలో అబిడ్స్ పోలీసులకు పట్టించాడు. వారిద్దరూ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అబిడ్స్ పోలీసులు శనివారం తెల్లవారుజామున 3 గంటలకు కేసు నమోదు చేశారు. సీఐ, ఎస్ఐలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
మహిళా ఎస్ఐపై లారీ ఎక్కించి చంపేందుకు యత్నం
చెన్నై : తమిళనాడు తిరునెల్వేలి సమీపంలో మహిళా ఎస్ఐపై లారీ ఎక్కించి చంపేందుకు ప్రయత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునెల్వేలి సమీపంలోగల గంగైకొండాన్ సిట్రారు ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం మేరకు గంగైకొండాన్ ఎస్ఐ ధనలక్ష్మి ఆధ్వర్యంలో పోలీసు బృందం నిన్న తెల్లవారుజామున మూడు గంటల సమయంలో సిప్కాట్ ప్రాంతంలో తనిఖీలు జరిపారు. ఆ సమయంలో ఒక టిప్పర్ లారీని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ లారీని ఆపకుండా ఎస్ఐ ధనలక్ష్మిపై లారీ ఎక్కించేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో సహ పోలీసులు సినిమా ఫక్కీలో లారీని జీపులో వెంబడించారు. లారీని డ్రైవర్ ఒకచోట నిలిపి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. సీవలప్పేరికి చెందిన కరుప్పస్వామి, పాలయంకోట్టైకు చెందిన మురుగున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
మహిళా ఎస్ఐపై సీనియర్ అధికారి లైంగిక వేధింపులు
ఆమె సాక్షాత్తు పోలీసు అధికారిణి. అయినా ఆమెకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. అదికూడా తమ శాఖకే చెందిన ఓ ఉన్నతాధికారి చేతుల్లో!! మహిళలకు ఏమాత్రం భద్రత లేదని భావిస్తున్న కోల్‌కతా నగరంలో ఈ సంఘటన జరిగింది. బల్లిగంజ్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి తనను వేధించాడంటూ ఆమె తన సీనియర్ అధికారులకు ఫిర్యాదుచేసింది. ఉజ్జల్ ముఖర్జీ అనే ఆ అధికారి గురువారం రాత్రి తనను గదికి పిలిపించుకుని, లైంగికంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆమె ఓ ఫిర్యాదు దాఖలుచేసింది. దీంతో డీసీ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించారు. ఫిర్యాదు దాఖలు కావడంతో ముఖర్జీ సెలవులో వెళ్లిపోయాడు. గడిచిన నెల రోజల్లో పశ్చిమ బెంగాల్లో ఓ మహిళా పోలీసు అధికారికి లైంగిక వేధింపులు ఎదురుకావడం ఇది రెండోసారి.