ఆమె సాక్షాత్తు పోలీసు అధికారిణి. అయినా ఆమెకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదు. అదికూడా తమ శాఖకే చెందిన ఓ ఉన్నతాధికారి చేతుల్లో!! మహిళలకు ఏమాత్రం భద్రత లేదని భావిస్తున్న కోల్కతా నగరంలో ఈ సంఘటన జరిగింది. బల్లిగంజ్ పోలీసు స్టేషన్ ఇన్చార్జి తనను వేధించాడంటూ ఆమె తన సీనియర్ అధికారులకు ఫిర్యాదుచేసింది.
ఉజ్జల్ ముఖర్జీ అనే ఆ అధికారి గురువారం రాత్రి తనను గదికి పిలిపించుకుని, లైంగికంగా వేధించాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆమె ఓ ఫిర్యాదు దాఖలుచేసింది. దీంతో డీసీ పర్యవేక్షణలో విచారణకు ఆదేశించారు. ఫిర్యాదు దాఖలు కావడంతో ముఖర్జీ సెలవులో వెళ్లిపోయాడు. గడిచిన నెల రోజల్లో పశ్చిమ బెంగాల్లో ఓ మహిళా పోలీసు అధికారికి లైంగిక వేధింపులు ఎదురుకావడం ఇది రెండోసారి.
మహిళా ఎస్ఐపై సీనియర్ అధికారి లైంగిక వేధింపులు
Published Sat, Nov 2 2013 2:58 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM
Advertisement
Advertisement