కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఉదంతంలో బెంగాల్ ప్రభుత్వం, వైద్యలు మధ్య చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై నిరసన చేస్తున్న వైద్యులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి చర్చలకు ఆహ్వానించించారు.
కోల్‌కతాలోని సీఎం నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు అయిదోసారి/చివరి అవకాశంగా ఆందోళన చేస్తున్న వైద్యులను చర్చలకు పిలుస్తున్నట్లు బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.
‘పశ్చిమ బెంగాల్ ఎం మమతా బెనర్జీతో, వైద్య ప్రతినిధుల సమావేశం కోసం అయిదోసారి. అలాగే చివరిసారి సంప్రదిస్తున్నాం. ముందు రోజు చర్చల్లో నిర్ణయించుకున్నట్లుగా సోమవారం సాయంత్రం 5 గంటలకు కాళీఘాట్‌లోని సీఎం నివాసంలో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరపడానికి మిమ్మల్ని(నిరసనకారులను) మరోసారి ఆహ్వానిస్తున్నాము. చివరిసారి చర్చలకు వచ్చిన వైద్యుల బృందమే నేడు సాయంత్రం 4.45 నిమిషాలకు వేదిక వద్దకు రావాలని అభ్యర్థిస్తున్నాం.
ఈ కేసు సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నందును.. మీరు డిమాండ్ చేస్తున్నట్లు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం కానీ వీడియో గ్రఫీ కానీ ఉండదు. దానికి బదులు సమావేశాన్ని రెండు వర్గాలు రికార్డ్ చేసి సంతకాలు చేస్తాయి’ అంటూ మనోజ్ పంత్ పేరిట లేఖలో తెలిపారు.
అదే విధంగా సుప్రీకోర్టు ఆదేశాలను వైద్యులు పాటించాలని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరులగా, కోర్టు ఆదేశాలకు కట్టుబడి వైద్యలు విధుల్లోచేరాలని కోరుతున్నట్లు తెలిపారు. వైద్యుల నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఫలప్రదమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
కాగా వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ వైద్యులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు నాలుగు సార్లు వైద్యులను చర్చించేందుకు ఆహ్వానించగా.. లైవ్ టెలికాస్ట్ చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు చర్చలను తిరస్కరించారు.
ఇక శనివారం ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ‘స్వస్థ్ భవన్’ ఎదుట ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులనిరసన శిబిరానికి సీఎం మమతా బెనర్జీ వెళ్లారు. ఆమెను చూడగానే ‘న్యాయం కావాలి’ అంటూ జూనియర్ వైద్యులు నినాదాలు చేశారు. తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పడంతో సీఎం అక్కడినుంచి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment