doctors protest
-
RG Kar Hospital: 50 మంది డాక్టర్ల మూకుమ్మడి రాజీనామా
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీఆర్ ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచారం కేసులో వైద్యుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా జూనియర్ డాక్టర్ల నిరసనకు మద్దతుగా ఆర్జీకర్ ఆసుపత్రికి చెందిన 50 మంది సీనియర్ ఫ్యాకల్టీ సభ్యులు మంగళవారం మూకుమ్మడి రాజీనామా చేశారు.కాగా హాస్పిటల్లో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్‌కున్యాయం చేయాలని, ఆసుపత్రిలో వైద్యులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ పలువురు జూనియర్ డాక్టర్లు గత శనివారం సాయంత్రం నుంచి'ఆమరణ నిరాహార దీక్ష' చేపట్టిన విషయం తెలిసిందే. రోజురోజుకీ వీరి నిరసనలకు వైద్యుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఈ క్రమంలోనే నిరసనలు చేస్తున్న డాక్టర్లకు మద్దతుగా 50 మంది సీనియర్ వైద్యులు రాజీనామా చేశారు. దీంతో అక్కడున్న విద్యార్ధులు చప్పట్లు కొట్టి వారిని అభినందించారు.కాగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులు, వైద్య కళాశాలలకు కేంద్రీకృత రెఫరల్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, పడకల ఖాళీల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. పని ప్రదేశాల్లో సీసీటీవీ ఆన్-కాల్ రూమ్‌లు వాష్‌రూమ్‌ల కోసం అవసరమైన నిబంధనలను నిర్ధారించడానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు, ఆసుపత్రుల్లో పోలీసు రక్షణను పెంచాలని, పర్మినెంట్ మహిళా పోలీసు సిబ్బందిని నియమించాలని, వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య కార్యకర్తల విషయంలో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.ఇదిలా ఉండగా వైద్యురాలిపై హత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సీబీఐ కోల్‌కతాలోని ప్రత్యేక కోర్టులో సోమవారం 45 పేజీల చార్జిషీట్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. స్థానిక పోలీసుల దగ్గర పౌర వలంటీరుగా పనిచేస్తున్న సంజయ్ రాయ్ ఆగస్టు 9న ఈ నేరానికి పాల్పడ్డాడని పేర్కొంది. ఆస్పత్రి సెమినార్ హాల్లో ట్రెయినీ డాక్టర్ తన బ్రేక్ సమయంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఈ ఘటన జరిగినట్లు పేర్కొంది. అయితే చార్జిషీటులో గ్యాంగ్‌రేప్ గురించి ప్రస్తావించలేదు. అలాగే విచారణ ముగిసినట్లూ పేర్కొనలేదు. దాదాపు 200 మంది స్టేట్మెంట్లను సీబీఐ తన చార్జిషీటులో పేర్కొంది. సుమారు 100 మంది సాక్షులను విచారించింది. ఇవన్నీ రాయ్‌నే ప్రధాన నిందితుడుగా పేర్కొంటున్నాయని సీబీఐ వర్గాల సమాచారం. -
Kolkata: వెనక్కి తగ్గని వైద్యులు.. ఆగని నిరసనలు
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచార ఘటనపై ఆగ్రహాజ్వాలలు, నిరసనలు చల్లారడం లేదు. బాధితురాలికి న్యాయ చేయాలని, నిందితులను కఠినంగాశిక్షించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది చేపట్టిన ఆందోళనలు నిరంతరంగా కొనసాగుతూనేఉన్నాయి. నిరసన చేస్తున్న వైద్యులతో బెంగాల్ ప్రభుత్వం చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైద్యులు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు.మమతా బెనర్జీ సర్కార్ ఇప్పటికే కోల్‌కతా కమిషనర్‌తో సహాల పలువురు అధికారులను బదిలీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం తమ డిమాండ్లను అన్నీంటినీ నెరవేర్చేవరకు సమ్మె కొనసాగిస్తామని వైద్యులు స్పష్టం చేశారు. ఇంకా నెరవేర్చాల్సిన డిమాండ్లను వినిపించేందుకు దీదీ సర్కారుతో మరోసారి చర్చలు జరుపుతామని తెలిపారు.అయితే తమ నిరసనల ఉద్యమాన్ని కించపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్ల ఫ్రంట్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సమ్మె ఒత్తిడి కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కమిషనర్, డిప్యూటీ కమిషనర్ నార్త్, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లను తొలగించాల్సి వచ్చిందని తెలిపారు. అయితే ఇది తమ ఉద్యమానికి లభించిన పాక్షిక విజయం మాత్రమేనని పేర్కొన్నారు.కోల్‌కతా సీపీగా మనోజ్ వర్మసోమవారం ముఖ్యమంత్రితో జరిగిన సమావేశంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ తొలగించాలన్న తమ డిమాండ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వైద్యులు తెలిపారు. ముఖ్యమంత్రి మౌఖిక హామీ ఇచ్చారని.. ఇప్పటి వరకు ఆ దిశగా అడుగులు వేయలేదన్నారు. అంతేగాక ప్రభుత్వ ఆసుపల్లో సురక్షిత వాతావరణం కల్పించాలని కోరారు. ఆసుపత్రుల వద్ద భద్రతను పెంచి, హెల్త్‌కేర్ సేవలు మెరుగుపరిచే వరకు వైద్యుల భద్రతకు భరోసా ఉండదని చెప్పారు. ఆసుపత్రులలో ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, కౌన్సెలింగ్ సేవలను మరింత నియమించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రి బెడ్ల కేటాయింపులో అవినీతి, ప్రాణాధార మందుల కొరత కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలని కోరుతున్నామని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా మహిళా వైద్యులు నైట్ డ్యూటీలు చేయొద్దన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నిర్దేశాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. అలా చెప్పే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ‘‘పైలట్లుగా, సైనికులుగా మహిళలు రాత్రి విధులు నిర్వహించడం లేదా? మీ నిర్దేశాలు మహిళా వైద్యుల కెరీర్‌పై ప్రభావం చూపుతాయి. రాత్రి విధుల్లో సమస్యలు ఎదుర్కోకుండా వారికి అవసరమైన భద్రత కల్పింపంచడం ప్రభుత్వ బాధ్యత. అంతే తప్ప వాటిని మానుకోవాలని చెప్పడం సరికాదు’’ అంటూ సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం మందలించింది. దాంతో సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంటామని బెంగాల్ సర్కారు విన్నవించింది. -
ఇదే చివరిసారి.. వైద్యులను చర్చలకు ఆహ్వానించిన సీఎం మమత
కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఉదంతంలో బెంగాల్ ప్రభుత్వం, వైద్యలు మధ్య చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనపై నిరసన చేస్తున్న వైద్యులను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి చర్చలకు ఆహ్వానించించారు. కోల్‌కతాలోని సీఎం నివాసంలో సోమవారం సాయంత్రం 5 గంటలకు అయిదోసారి/చివరి అవకాశంగా ఆందోళన చేస్తున్న వైద్యులను చర్చలకు పిలుస్తున్నట్లు బెంగాల్ చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ వైద్యులకు రాసిన లేఖలో పేర్కొన్నారు.‘పశ్చిమ బెంగాల్ ఎం మమతా బెనర్జీతో, వైద్య ప్రతినిధుల సమావేశం కోసం అయిదోసారి. అలాగే చివరిసారి సంప్రదిస్తున్నాం. ముందు రోజు చర్చల్లో నిర్ణయించుకున్నట్లుగా సోమవారం సాయంత్రం 5 గంటలకు కాళీఘాట్‌లోని సీఎం నివాసంలో ఓపెన్ మైండ్‌తో చర్చలు జరపడానికి మిమ్మల్ని(నిరసనకారులను) మరోసారి ఆహ్వానిస్తున్నాము. చివరిసారి చర్చలకు వచ్చిన వైద్యుల బృందమే నేడు సాయంత్రం 4.45 నిమిషాలకు వేదిక వద్దకు రావాలని అభ్యర్థిస్తున్నాం.ఈ కేసు సుప్రీంకోర్టులో పరిధిలో ఉన్నందును.. మీరు డిమాండ్ చేస్తున్నట్లు సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం కానీ వీడియో గ్రఫీ కానీ ఉండదు. దానికి బదులు సమావేశాన్ని రెండు వర్గాలు రికార్డ్ చేసి సంతకాలు చేస్తాయి’ అంటూ మనోజ్ పంత్ పేరిట లేఖలో తెలిపారు.అదే విధంగా సుప్రీకోర్టు ఆదేశాలను వైద్యులు పాటించాలని పేర్కొన్నారు. చట్టాన్ని గౌరవించే పౌరులగా, కోర్టు ఆదేశాలకు కట్టుబడి వైద్యలు విధుల్లోచేరాలని కోరుతున్నట్లు తెలిపారు. వైద్యుల నుంచి సానుకూల స్పందన వస్తుందని, ఫలప్రదమైన చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు.కాగా వైద్యురాలిపై హత్యాచారాన్ని నిరసిస్తూ.. బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ వైద్యులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటి వరకు నాలుగు సార్లు వైద్యులను చర్చించేందుకు ఆహ్వానించగా.. లైవ్ టెలికాస్ట్ చేయాలనే డిమాండ్‌తో నిరసనకారులు చర్చలను తిరస్కరించారు. ఇక శనివారం ఆరోగ్యశాఖ ప్రధాన కార్యాలయం ‘స్వస్థ్ భవన్’ ఎదుట ఆందోళన చేస్తున్న జూనియర్ వైద్యులనిరసన శిబిరానికి సీఎం మమతా బెనర్జీ వెళ్లారు. ఆమెను చూడగానే ‘న్యాయం కావాలి’ అంటూ జూనియర్ వైద్యులు నినాదాలు చేశారు. తమ డిమాండ్లపై చర్చ జరిగేవరకు రాజీకొచ్చే ప్రసక్తే లేదని వైద్యులు తేల్చిచెప్పడంతో సీఎం అక్కడినుంచి వెళ్లిపోయారు. -
RG Kar Incident: వైద్యులకు మమతా బెనర్జీ బుజ్జగింపులు
కోల్‌కతా: ఆర్జీకర్ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార ఘటనపై జూనియర్ వైద్యుల నిరసనలు ఇంకా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు ముందుకు సాగకపోవడంతో వైద్యులు ఆందోళనల విషయంలో వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇవాళ కోల్‌కతాలో వైద్యులు నిరసనలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ వైద్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ముందు తను మాటను వినాలని, ఆ తర్వాత నినాదాలు చేయాలంటూ వైద్యులకు సూచించారు. #WATCH | RG Kar Medical College and Hospital rape-murder case: West Bengal CM Mamata Banerjee reaches Swasthya Bhawan in Kolkata to meet the protesting doctors. pic.twitter.com/AbtdOAisKh— ANI (@ANI) September 14, 2024‘దయచేసి ఐదు నిమిషాలు నా మాట వినండి. ఆ తర్వాత నినాదాలు చేయండి. ఆందోళనలు చేయడం ప్రజాస్వామ్యంలో మీ హక్కు. నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నా భద్రతా అధికారులు వద్దని వారించినా.. నేను ఇక్కడకు వచ్చాను. మీ నిరసనలకు నా సెల్యూట్. నేను కూడా విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నదాన్నే. ఇంత కంటే నా పదవి పెద్ద విషయం కాదని నాకూ తెలుసు. రాత్రంతా వర్షంలోనూ మీరు నిరసనలు చేశారు. ఎంతో బాధపడి ఉంటారు. నాకు కూడా బాదేసింది. రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేకపోయాను.ఈ సమస్యను పరిష్కరించడానికి ఇదే తన చివరి ప్రయత్నం. ఇక్కడికి నేను ముఖ్యమంత్రిగా రాలేదు. మీ దీదీ (సోదరి)గా వచ్చా. నాకు సీఎం పదవి ముఖ్యం కాదు. నేను డిమాండ్లను అధ్యయనం చేస్తాను, నేనేం ఒంటరిగా ప్రభుత్వాన్ని నడపడం లేదు కదా. ప్రధాన కార్యదర్శి, హోం సెక్రటరీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్తో చర్చించాలి. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాను. నేను తిలోత్తమ (హత్యాచారానికి గురైన బాధితురాలికి పెట్టిన పేరు). మీ డిమాండ్లను పరిశీలిస్తాను’’ అని ఆమె వైద్యులకు హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: కోల్‌కతా అభయ కేసులో బిగ్ ట్విస్ట్.. కాగా కోల్‌కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో గత నెలలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య జరిగినప్పటి నుండి వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం స్వాస్త్య భవన్ వెలుపల ఆందోళన చేపట్టిన అనతరం రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. అయితే చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయాలనే నిరసనకారుల డిమాండ్‌పై అవి నిలిచిపోయాయి.మరోవైపు జూనియర్ వైద్యులు- రాష్ట్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతోన్న ఈ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని జూనియర్ వైద్యులు కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. పశ్చిమ బెంగాల్ జూనియర్ డాక్టర్స్ ఫ్రంట్ తరఫున రాసిన నాలుగు పేజీల లేఖను ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు సైతం పంపారు. -
Kolkata: ప్రధాని మోదీ, రాష్ట్రపతికి వైద్యుల లేఖ
కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ వైద్యులు చేపట్టిన ఆందోళనలు ఇంకా కొనసాగుతున్నాయి. వెంటనే విధుల్లో చేరాలని అటు సుప్రీంకోర్టు ఆదేశించినా, ఇటు చర్యలకు బెంగాల్ ప్రభుత్వం ఆహ్వానించినా.. వైద్యులు వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో తాజాగా నిరసనలు చేస్తున్న జూనియర్ వైద్యులు, వైద్య సిబ్బంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఈ ఘటనపై జోక్యం చేసుకొని ప్రతిష్టంభను ముగించేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్ఖర్, వైద్యారోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన నాలుగు పేజీల లేఖలో.. ‘‘కామాంధుడి చేతిలో బలైన మా సహోద్యోగికి త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. దీనివల్ల మేము(వైద్యులు), ఆరోగ్య కార్యకర్తలు బెంగాల్ ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఎలాంటి భయం లేకుండా మా విధులు నిర్వర్తించగలం. మేము నిరసనలు ప్రారంభించినప్పటి నుంచి మాపై బెదిరింపులు, హింసలు, ఆసుపత్రులు ధ్వంసం చేయడం వంటి ఘటనలు పెరిగాయి. ఈ క్లిష్ట సమయాల్లో మీ జోక్యం మా అందరికీ వెలుగుగా పనిచేస్తుంది. మేము ధైర్యంగా ముందుకు నడిచే మార్గాన్ని చూపుతుంది. మా చుట్టూ అలుముకున్న చీకటి నుంచి బయట పడేందుకు తోడ్పడుతుంది.’ అని పేర్కొన్నారు.చదవండి: కోల్‌కతా అభయ కేసులో కీలక మలుపు.. సీబీఐ సంచలన నిర్ణయం!కాగా ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసినప్పటి నుంచి వైద్యులు ఆందోళనకు దిగారు. ఇటీవల తాజాగా వైద్యులు మంగళశారం సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరి రోగులకు సేవలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరసనలు ఆపని వైద్యులపై చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉందని తెలిపింది.అయితే అదే రోజు సాయంత్రం 5 గంటల వరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని వైద్యులు బెంగాల్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్‌తోపాటు.. వైద్యశాఖలో పలువురి ఉన్నతాధికారుల రాజీనామా కోరుతూ వైద్యులు అయిదు డిమాండ్లను దీదీ సర్కార్ ముందు ఉంచారు.ఈ విషయంపై పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ముందడుగు వేసింది. మూడుసార్లు వైద్యులను చర్చలకు ఆహ్వానించింది. కానీ చర్చల భేటీని లైవ్ టెలికాస్ట్ చేస్తేనే తాము వస్తామని నిరసన కారులు తేల్చి చెబుతున్నారు. దీంతో వైద్యుల తీరుపై అసహనం వ్యక్తం వ్యక్తం చేసిన దీదీ.. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. వైద్యులతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు. నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. -
మా పోరాటం ఆగదు..
-
కోల్ కతా ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా డాక్టర్ల ధర్నా
-
వైద్యులు రోడ్డెక్కి.. గుండెలు బరువెక్కి!
కర్నూలు: కొన్ని దృశ్యాలను చూస్తే మాటలు రావు. ఆ బాధ, ఆవేదన కన్నీళ్లకు మాత్రమే అర్థమవుతుంది. రేయింబవళ్లు రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్రయతించే వైద్యుల మాన, ప్రాణాలకే రక్షణ లేకుండాపోతుంది. ఇందుకు పశ్చిమ బెంగాల్ లో ఓ మానవ మృగం వైద్య విద్యార్థినిపై హత్యాచారానికి పాల్పడిన ఘటనతో రుజువైంది. ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఘటనలు ఇదివరలో కోకొల్లలు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు మంగళవారం విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కుటుంబంలో ఒకరికి ప్రాణాల మీదకు వస్తే ఆవేదన వర్ణనాతీతం. కళ్లెదుట ప్రాణం పోతుందంటే, నిన్న మొన్నటి వరకు మనతో పాటు ఉన్న బంధం వీడి వెళ్లిపోతుందంటే ఎవరికైనా గుండె బరువెక్కుతుంది. ఇలాంటి రెండు దృశ్యాలకు ఈ ఫొటో అద్దం పడుతుంది. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో న్యాయం కోసం జూనియర్ వైద్యులు ప్లకార్డులు చేతపట్టుకొని ర్యాలీగా వెళ్తుండగా.. అదే సమయంలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని బంధువులు స్ట్రెచ్చర్‌పై అత్యవసర వైద్యానికి తీసుకెళ్తున్న దృశ్యం అందరి హృదయాలను కదిలించింది. -
డ్యూటీలో ఉన్న డాక్టర్‌పై ఊడిపడిన ఫ్యాన్.. హెల్మెట్ డాక్టర్స్!
సాక్షి, అప్జల్‌గంజ్: రోగులకు ప్రాణం పోసే వైద్యులు వారు. కానీ.. తమ ప్రాణాలకే దిక్కులేకుండా పోయిందని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు తమ తలలకు హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. అంతకు ముందు అవుట్ పేషెంట్ బ్లాకు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో విధులు నిర్వర్తించాలంటే భయంగా ఉందని, తమ ప్రాణాలకు రక్షణ లేదంటూ ఆవేదన చెందారు. చదవండి: ఆరుగురు కూతుళ్లు అందరూ డాక్టర్లు సోమవారం డెర్మటాలజీ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ భువనశ్రీ తలపై ఫ్యాన్ ఊడి పడడంతో ఆమె గాయాల పాలయ్యారు. ఈ నేపథ్యంలో తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని జూనియర్ డాక్టర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే నూతన భవన నిర్మాణ దిశగా అడుగులు వేయాలని కోరారు. చదవండి: హుజురాబాద్ ఉప పోరు: ఈ కొన్ని గంటలే కీలకం! -
రామ్‌దేవ్ వ్యాఖ్యలు: దేశవ్యాప్తంగా వైద్యుల బ్లాక్ డే
సాక్షి, ఢిల్లీ/ హైదరాబాద్: కరోనా వైరస్ నియంత్రణలో అల్లోపతి వైద్యం పని చేయడం లేదని.. వైద్యులు విఫలమయ్యారని యోగా గురువు రామ్‌దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వ్యాఖ్యలు చేసిన రామ్‌దేవ్‌ను అరెస్ట్ చేయాలని వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా మంగళవారం నల్ల దినంగా (బ్లాక్ డే) వైద్యులు రెసిడెంట్ డాక్టర్ల సంఘాల సమాఖ్య (ఎఫ్‌వోఆర్‌డీఏ) ప్రకటించింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన రాందేవ్ బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్–1897 ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేపట్టారు. పీపీఈ కిట్లు ధరించి.. నల్లబ్యాడ్జీలు పెట్టుకుని విధులకు ఆటంకం కలిగించకుండా పని ప్రదేశాల్లోనే నిరసన తెలిపారు. ఈ వ్యాఖ్యలు చేసిన రాందేవ్‌పై ఉత్తరాఖండ్ ఐఎంఏ రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఢిల్లీతోపాటు కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, చెన్నె తదితర ప్రాంతాల్లో వైద్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. సోషల్ మీడియాలో కూడా రామ్‌దేవ్ బాబాకు వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. #ArrestRamdev అనే హ్యాష్‌ట్యాగ్ చేస్తూ ట్విటర్, ఫేసుబుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ప్రధానమంత్రి, వైద్యారోగ్య మంత్రులను విజ్ఞప్తులు పంపుతున్నారు. చదవండి: బాబా సారీ చెప్పు.. లేకుంటే వెయ్యి కోట్లు ఇవ్వు చదవండి: రామ్‌దేవ్ బాబా ఇది ‘తమాషా’ కాదు: ఆరోగ్యశాఖ మంత్రి -
ప్రధానికి వీపు చూపిస్తూ వైద్యుల నిరసన
బ్రసెల్స్: కరోనా కాలంలోనూ నిర్విరామంగా విధులు నిర్వర్తిస్తున్న వైద్యులకు ఏమిచ్చినా తక్కువే. అలాంటిది ఓ దేశంలో మాత్రం వైద్యులకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదు. దీంతో ప్రభుత్వ విధానాలతో విసిగి వేసారిన వైద్యులు ప్రధానికి వినూత్న నిరసన తెలిపి షాక్ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే బెల్జియం ప్రధాని సోఫీ విల్మ్స్ బ్రస్సెల్స్‌లోని సెయింట్ పీటర్ ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు సహా సిబ్బంది రోడ్డుకిరువైపులా నిల్చుని ఉన్నారు. ఘన స్వాగతం కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్లే.. ప్రధాని విల్మ్స్ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రధానికి వీపు చూపిస్తూ నిలబడ్డారు. బడ్జెట్లో వీరికి తగినంతగా నిధులు కేటాయించకపోవడం, వేతనాల్లో కోత విధించడంతో ఇప్పటికే అసహనంతో ఊగిపోతున్నారు. (కరోనా విలయం : ఈమె త్యాగం మహోన్నతం) మరోవైపు ఎలాంటి అర్హతలు లేనివారిని కూడా ప్రభుత్వం నర్సులుగా నియమించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ క్రమంలో తమ వ్యతిరేకతను దేశాధ్యక్షురాలికి తెలియజెప్పేందుకు ఇలా వినూత్నంగా నిరసన తెలిపారు. కొన్నిసార్లు నిశ్శబ్ధ నిరసనే అన్నింటికన్నా ఉత్తమం అని సదరు ఆసుపత్రి వైద్యులు పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అవుతోంది. "వారి నిరసనలో ఆవేదన కనిపిస్తోంద"ని, "ప్రాణాలకు తెగించి కరోనాతో యుద్ధం చేస్తున్న వైద్యులకు ప్రభుత్వాలు అండగా ఉండాల"ని పలువురు నెటిజన్లు వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతున్నారు. (కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందడుగు) -
జర్మనీలో వైద్యుల అర్థనగ్న నిరసన
బెర్లిన్ : కరోనా వైరస్‌కు ఎదురొడ్డి ప్రజల ప్రాణాలు రక్షిస్తున్న తమ ప్రాణాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జర్మనీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తగినన్ని పీపీఈ కిట్లు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహింస్తోందంటూ బుధవారం జర్మనీలో డాక్టర్లు వైద్యపరికరాలను అడ్డుగా పెట్టి అర్థనగ్న నిరసన చేపట్టారు. వెంటనే తమకు అత్యవసరమై పీపీఈ కిట్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, గ్లోవ్స్, పీపీఈ కిట్లకు భారీగా డిమాండ్ పెరిగినందున కొరత నెలకొందని తెలిపింది. (జర్మన్ ఛాన్సలర్ సెల్ఫ్ క్వారంటైన్) ఇప్పటికే 133 మిలియన్ మాస్కులను దేశవ్యాప్తంగా పంపిణీ చేశామని, వాటిలో 10 లక్షల మాస్కులను చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసినందున మరో 15 మిలియన్ మాస్కులను ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ఇంకా కొన్నాళ్లపాటు వైరస్‌తో మనం పోరాడాల్సి ఉందని హెచ్చరించారు. వినడానకి కష్టంగా ఉన్నా ఇంకొంత కాలం మనం కరోనాతో కలిసి జీవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశంలో 1.5 లక్షలుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 6000 మంది మరణించారు. (కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!) -
సీఎం అల్టిమేటం; లెక్కచేయని వైద్యులు
కోల్‌కతా/న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం 2 గంటల్లోపు ఆందోళన విరమించకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెచ్చరించినా వైద్యులు వెనక్కి తగ్గలేదు. ప్రతి మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో తమ రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు జూనియర్ వైద్యుల బృందం గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కలిసింది. జూన్ 10న ఎన్ఆర్ఎస్ ఆస్పత్రిలో వైద్యులపై దాడి చేసిన వారిన తగిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసింది. తమ డిమాండ్లను ఒప్పుకుంటే ఆందోళన విరమిస్తామని తెలిపింది. కాగా, వైద్యుల సమ్మెపై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. బెంగాల్ వైద్యులకు సంఘీభావంగా ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)లో రెసిడెంట్ డాక్టర్లు వినూత్న నిరసన చేపట్టారు. హెల్మెట్లు ధరించి విధులకు హాజరైయ్యారు. తలకు, చేతులకు బ్యాండెజ్‌లు ధరించి నిరసన తెలిపారు. రోగులను కాపాడే వైద్యులపై దాడులు వద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. (చదవండి: బీజేపీ, సీపీఎం దోస్తీపై దీదీ ఫైర్) -
చెట్టు కింద డాక్టర్
పాడుబడి, పెచ్చులూడుతూ ప్రమాదకరంగా ఉన్న ఉస్మానియా ఆస్పత్రి భవనాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక్కడి వైద్యులు వినూత్న నిరసనకు దిగారు. శిథిల భవనం స్థానంలో కొత్త భవనం నిర్మించాలని కొన్నాళ్లుగా వైద్యులు కోరుతున్నా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో గురువారం చెట్ల కిందే రోగులకు సేవలు అందించారు. సాక్షి, సిటీబ్యూరో: కొత్త భవన నిర్మాణం కోసం ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు గురువారం వినూత్న పద్ధతిలో నిరసనకు దిగారు. ఇప్పటికే గత కొంత కాలంగా రకరకాల పద్ధతుల్లో నిరసన తెలిపిన వైద్యులు తాజాగా భవనం నుంచి బయటికి వచ్చి బయటి రోగులకు చెట్లకిందే వైద్యసేవలు అందించారు. ప్రస్తుతం ఉన్న భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు రోజుకో ప్రాంతంలో పెచ్చులూడి పడుతున్నాయి. ఇప్పటికే పలువురు రోగులు గాయాలపాలై ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఆస్పత్రి పాతభవనం దుస్థితి..ఎదరవుతున్న ఇబ్బందులపై వైద్యాధికారులు అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం నుంచి స్పందన లభించలేదు. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ చివరకు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు సైతం చేశారు. రోగులకే కాదు వైద్యుల ప్రాణాలకు రక్షణ కల్పించలేని పాత భవనంలో చికిత్సలు అందించలేమని స్పష్టం చేస్తూ గురు వారం ఓపీ ప్రధాన ద్వారం బయటే చెట్ల కింద రోగులకు సేవలు అందించి నిరసన తెలిపారు. ఇదే సమయంలో ఔట్‌పేషెంట్ విభాగంలో ఓపీ టోకెన్లు జారీ చేసే కంప్యూటర్ మెరాయించడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వచ్చింది. -
గాంధీలో సమ్మె విరమించిన వైద్యులు
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో వైద్యులు సమ్మె విరమించారు. వైద్య ప్రొఫెసర్ల వయోపరిమితి పెంపును వ్యతిరేకిస్తూ.. గాంధీ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్లు ధర్నాకు దిగారు. ప్రొఫెసర్ల వయో పరిమితిని 60 ఏళ్లకు పెంచొద్దంటూ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు ఆందోళన చేపడుతున్నారు. దీంతో స్పందించిన వైద్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి డాక్టర్లతో చర్చలు జరిపారు. వయోపరిమితి పెంపుపై ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తుందని, సమ్మె విరమించాలని కోరారు. వైద్యులు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి మరోసారి ప్రకటన చేస్తామని తెలిపారు. వైద్యులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైద్యుల సమస్యలపై పునరాలోచన చేస్తామన్న మంత్రి హామీతో వైద్యులు సమ్మె విరమించారు. ఈ సందర్బంగా డాక్టర్లు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం ఉందన్నారు. మంత్రి హామీ ఇచ్చారని, పదవీ విరమణ వయస్సు పెంపుపై పునరాలోచన చేస్తామని భరోసా ఇవ్వడంతో విధుల్లో పాల్గొంటున్నామని తెలిపారు. ప్రభుత్వం మాట తప్పితే మళ్ళీ సమ్మె చేస్తామని వైద్యుల వెల్లడించారు. -
పాత భవనంలో పనిచేయలేం..
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలో పనిచేయలేమంటూ వైద్యులు ఆందోళనకు దిగారు. ఈ మేరకు వైద్య, ఉద్యోగ సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. వైద్యులు, ఉద్యోగులు తొలిరోజు సోమవారం ఉదయం గంటపాటు ఔట్‌పేషంట్ (ఓపీ) సేవలను నిలిపివేశారు. నల్లబ్యాడ్జీలు ధరిం చి పరిపాలనా భవనం ముందు ధర్నా చేశారు. ఆస్పత్రి భవనం శిథిలావస్థకు చేరుకుందని, తరచూ పైకప్పు పెచ్చులూడుతున్నాయని వైద్యులు తెలిపారు. బిక్కుబిక్కుమంటూ సేవలందించలేమని స్పష్టం చేశా రు. రోగులకు ఈ భవనం ఏమాత్రం సురక్షితం కాదని, వెంటనే కొత్త భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు. ప్రభు త్వం హామీ వచ్చేవరకు నిరసన కొనసాగుతుందన్నారు. వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది నిరసన లో పాల్గొనడంతో వైద్యసేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. రోగులు ఇబ్బందిపడ్డారు. వందేళ్ల చరిత్ర ఉన్న ఈ భవనం నిర్వహణాలోపంతో శిథిలావస్థకు చేరుకుంది. వైద్యచికిత్సలకు ఈ భవ నం సురక్షితం కాదని, వెంటనే ఖాళీ చేయాలని పదేళ్ల క్రితమే ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. -
గాంధీ ఆస్పత్రిలో వైద్యుల ఆందోళన
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులు ఆందోళన బాటపట్టారు. యూజీసీ స్కేల్ ప్రకారం వేతనాలు పెంచి.. అర్హులైన వైద్యులకు ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. తమ సమస్యలను తక్షణం పరిష్కరించకపోతే ఈ నెల 16 నుంచి అత్యవసర సేవలు నిలిపివేస్తామని వైద్యులు హెచ్చరించారు. నెల రోజులుగా రోజుకు గంట చొప్పున నిరసన తెలుపుతున్నామని మంత్రి లక్ష్మారెడ్డి ఇచ్చిన గడువు పూర్తయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యల తీసుకోకపోవడంపై వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
సమ్మె విరమించిన వైద్యులు
ముంబై: మహారాష్ట్రలో ఆందోళనకు దిగిన ప్రభుత్వ వైద్యులు శుక్రవారం అర్ధరాత్రి సమ్మె విరమించి విధుల్లో చేరారు. తమ డిమాండ్లన్నింటినీ ప్రభుత్వం నెరవేర్చిందని అందుకే తిరిగి విధుల్లోకి చేరామని వైద్యులు తెలిపారు. భవిష్యత్తులో డాక్టర్లపై దాడులు జరగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. 'వైద్యులపై దాడులు అరికడతామని సీఎం, ముంబై హైకోర్టు ఇచ్చిన హామీని విశ్వసిస్తున్నాం. డాక్టర్ల దాడులు చేసిన వారిని భవిష్యత్తులో కఠినంగా శిక్షిస్తారని ఆశిస్తున్నాం' అని డాక్టర్ల అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. ముంబైలో విధుల్లో ఉన్న వైద్యుల దాడి ఘటన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులు సోమవారం నుంచి ముకుమ్మడి సెలవులు పెట్టి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బొంబాయి హైకోర్టు జోక్యం చేసుకొని రోగుల కష్టాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే విధుల్లోకి చేరాలని వైద్యులను ఆదేశించింది. డాక్టర్లకు తగిన భద్రత కల్పించేందుకు ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని సూచించింది. వైద్యులు నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తమకు తగిన భద్రత కల్పిస్తే పనిచేసేందుకు సిద్ధమని మహారాష్ట్ర రెసిడెంట్ వైద్యుల సంఘం(ఎంఏఆర్డీ) కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హామీ ఇవ్వడంతో వైద్యులు సమ్మె విరమించారు. -
వైద్యులు తక్షణమే సమ్మె విరమించాలి
ముంబై: మహారాష్ట్రలో ఆందోళనకు దిగిన వైద్యులు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. డాక్టర్లకు తగిన భద్రత కల్పించేందుకు ప్రభుత్వానికి తగిన సమయం ఇవ్వాలని సూచించింది. వైద్యులు నిర్భయంగా పనిచేసే వాతావరణాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మళ్లీ 15 రోజుల తర్వాత మళ్లీ విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. ప్రభుత్వం తమకు తగిన భద్రత కల్పిస్తే పనిచేసేందుకు సిద్ధమని మహారాష్ట్ర రెసిడెంట్ వైద్యుల సంఘం(ఎంఏఆర్డీ) కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. విధుల్లో ఉన్న వైద్యుల దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులు సోమవారం నుంచి ముకుమ్మడి సెలవులు పెట్టి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. కాగా, వైద్యులు వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు. -
వైద్యమేది మహాప్రభో!
ముంబై: మూకుమ్మడి సెలవు పేరిట ప్రభుత్వ వైద్యులు బుధవారం సైతం విధులకు గైర్హాజరు కావడంతో ముంబైలో రోగులు అష్టకష్టాలు పడుతున్నారు. గత నాలుగురోజులుగా ముంబైలోని ప్రభుత్వ, మున్సిపాలిటీ ఆస్పత్రులలో కనీస వైద్య చికిత్స అందించేందుకు సైతం ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో లేకపోవడంతో పేదరోగుల పరిస్థితి నరకప్రాయంగా మారింది. ఔట్ పేషంట్ విభాగం మొదలుకొని అత్యవసర సేవల వరకు అన్నింటినీ డాక్టర్లు బహిష్కరించడంతో ప్రభుత్వ ఆస్పత్రులనే నమ్ముకున్న నిరుపేద రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ’వైద్యుల ముకుమ్మడి సెలవు వల్ల ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నాం. అనారోగ్యంతో ఉన్న రోగులను ఇలా వారి ఖర్మకు వారిని వదిలేయడం భావ్యం కాదు. వైద్యులు తమ వృత్తిధర్మాన్ని నిర్వర్తించాలి’ అని ఓ రోగి బంధువు పేర్కొన్నారు. ’నా భార్యకు కాలిన గాయాలయ్యాయి. నాలుగురోజుల నుంచి ఆమెకు చికిత్స అందించడం లేదు. ఆమె పరిస్థితి దయనీయంగా ఉంది’ అని మరో వ్యక్తి ముంబైలోని సియాన్ ఆస్పత్రి వద్ద విలపిస్తూ కనిపించాడు. రోగుల బంధువుల విధుల్లో ఉన్న వైద్యుల దాడి చేసిన ఘటన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులు ముకుమ్మడి సెలవులు పెట్టి ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. సీనియర్ వైద్యుల మూకుమ్మడి సెలవుపై తీవ్రంగా స్పందించిన బొంబాయి హైకోర్టు వెంటనే విధుల్లో చేరాలని వారిని ఆదేశించింది. అయినా బుధవారం వైద్యులు విధుల్లో చేరకపోవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. విధులకు రాని సీనియర్ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీచేసి.. చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలుపాలంటూ ఆదేశించింది. -
జీజీహెచ్‌లో కొనసాగుతున్న ఆందోళన
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. జూనియర్ డాక్టర్ సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మిని వెంటనే అరెస్టు చేయాలని వారు కొన్ని రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న విషయం విదితమే. అయితే, కొద్దిరోజులుగా అజ్ఞాతంలో ఉన్న ప్రొఫెసర్ లక్ష్మి ముందస్తు బెయిల్ కోసం గుంటూరు జిల్లా న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకుంటున్నారు. -
కొనసాగుతున్న మెడికోల ఆందోళన
-
కొనసాగుతున్న మెడికోల ఆందోళన
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికోల నిరసనల పర్వం కొనసాగుతోంది. ప్రొఫెసర్ లక్ష్మీ వేధింపులు తాళలేక సంధ్యారాణి అనే ఓ మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పటి వరకు ప్రొఫెసర్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా.. ఈ రోజు కూడా ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు, వైద్య సిబ్బంది ఆందోళన నిర్వహించారు. ఘటన జరిగి ఆరు రోజులైనప్పటికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడానికి నిరసనగా విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. -
నిజామాబాద్ లో స్తంభించిన వైద్య సేవలు
నిజామాబాద్: హాజరు నమోదు కోసం ప్రవేశపెట్టిన నూతన విధానం తమను అవమానపరిచేదిగా ఉందంటూ నిజామాబాద్ జిల్లా కేంద్రం ఆస్పత్రి వైద్యులు, ప్రొఫెసర్లు సోమవారం విధులు బహిష్కంచారు. ఆస్పత్రిలో వైద్యాధికారులు సరిగ్గా విధులకు హాజరు కావటం లేదంటూ కలెక్టర్‌కు ఇటీవల ఫిర్యాదులు అందాయి. ఇందుకు స్పందించిన కలెక్టర్ ఆస్పత్రిలో పంచింగ్ విధానాన్ని అమలు చేయాలని ఉత్తర్వులిచ్చారు. ఇందుకు నిరసనగా సోమవారం వైద్యులు, ప్రొఫెసర్లు విధులు బహిష్కరించారు. దీంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
‘కింగ్‌కోఠి’కి ఉస్మానియా రోగులు
* తొలి విడతగా 24 మంది రోగులు.. పలువురు వైద్య సిబ్బంది తరలింపు * దశలవారీగా మిగిలిన విభాగాలు.. క్యాజువాలిటీ, ఓపీ ఉస్మానియాలోనే.. * రోగుల తరలింపుపై వైద్యుల మధ్య భేదాభిప్రాయాలు * రెండు వర్గాలుగా విడిపోయి.. వాగ్వాదానికి దిగిన వైద్యులు సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి నుంచి రోగుల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతగా బుధవారం సాయంత్రం 24 మంది రోగులను రెండు అంబులెన్సుల్లో కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా పాత భవనంలో 130 ఆర్థోపెడిక్ పడకలుండగా.. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పురుషులు, 12 మంది మహిళలను తరలించారు. వీరితో పాటు ముగ్గురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఏడుగురు స్పెషలిస్టులు, ఆరుగురు జూనియర్ డాక్టర్లు, ఒక డీఎస్వో, 14 మంది స్టాఫ్ నర్సులను కూడా తరలించారు. మిగిలిన వారిని దశలవారీగా తరలించనున్నట్లు వైద్యులు స్పష్టం చేశారు. కాగా, శిథిలావస్థలో ఉన్న పాత భవనాన్ని కూల్చి మరో భవనం కట్టాలని కొంతమంది వైద్యులు వాదిస్తుంటే.. పాతభవనం ఉన్న రెండెకరాల స్థలాన్ని వదిలేసి, మిగిలిన ప్రాంతంలో భవన నిర్మాణం చేపట్టవచ్చని మరికొందరు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఒకరిద్దరితో మాట్లాడి ఏకపక్షంగా రోగులను తరలించడం ఎంత వరకు సమంజసమని కార్డియో థొరాసిక్ విభాగానికి చెందిన డాక్టర్ శ్రీనివాస్ ప్రశ్నించగా.. తెలంగాణ వైద్యుల సంఘం గౌరవాధ్యక్షుడు బొంగు రమేష్ అడ్డుతగలడంతో వాగ్వాదం చోటు చేసుకుని.. ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో వైద్యుల నిరసన ఉస్మానియా పాత భవనంలో 875 పడకలున్నాయి. వీటిలో 130 పడకల ఎముకల విభాగాన్ని కింగ్‌కోఠి ఏరియా ఆస్పత్రిలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనరల్ మెడిసిన్‌లోని 8 యూనిట్లు, జనరల్ సర్జరీలోని 8 యూనిట్లు, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీలోని ఒక యూనిట్, గ్యాస్ట్రో ఎంటరాలజీలోని ఒక యూనిట్‌ను సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో సర్దుబాటు చేయాలని భావించింది. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలను పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వార్డుల్లో సర్దుబాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రక్రియ పూర్తై తర్వాతే ఉస్మానియా రోగులను తరలించాలని నిర్ణయించింది. అయితే తమ ఆస్పత్రిని తరలించవద్దంటూ సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో వైద్యులు బుధవారం ఆందోళనకు దిగారు. క్యాజువాలిటీ, ఓపీ ఉస్మానియాలోనే.. ఉస్మానియా పాత భవనం ప్రమాదకరంగా మారడంతో దానిని ఖాళీ చేయడం అనివార్యమైంది. అయితే క్యాజువాలిటీ సహా అన్ని విభాగాలకు సంబంధించిన ఓపీ సేవలు మాత్రం ఉస్మానియాలోనే అందించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చే క్షతగాత్రులకు ఇక్కడే చికిత్స లభించనుంది. ఎమర్జెన్సీ రోగులను కాక ఎలక్టివ్ పేషెంట్లను మాత్రమే నిర్దేశిత ఆస్పత్రులకు తరలించనున్నారు. ఇందుకోసం ప్రతిరోజూ ఆయా ఆస్పత్రులకు ప్రత్యేక అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. ఓపీ సేవలతోపాటు ఇన్‌పేషెంట్ల అడ్మిషన్ ప్రక్రియంతా ఉస్మానియా నుంచే జరుగుతుందని ఆస్పత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ రఘురామ్ తెలిపారు. -
తాంబూలంలో పెట్టి ఇచ్చేయటం లేదు
⇒ ఆస్పత్రుల్లో ప్రైవేటు భాగస్వామ్యం ఉంటేనే మెరుగైన సేవలు ⇒ వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి సుబ్రహ్మణ్యం వ్యాఖ్యలు ⇒ చిత్తూరు ఆస్పత్రిని అపోలోకు ఇవ్వడంపై సమర్థన చిత్తూరు(అర్బన్): ‘ప్రభుత్వ ఆస్పత్రులను అడిగిన వెంటనే తాంబూలంలో పెట్టి ఇచ్చేయడంలేదు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడే అపోలో సంస్థలకు లీజుకు ఇస్తున్నాం. ఇందు లో ఏదో జరిగిపోతోందని పాత్రికేయులు ఊహాజనిత కథనాలు రాస్తున్నారు. అయినా ఇక్కడ (చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో) వైద్య సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా మీరే చెప్పండి? ఉంటే నేను మధ్యాహ్న భోజనం తినడం మానేస్తా..’ అని రాష్ట్ర వైద్యశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎల్వీ.సుబ్రహ్మణ్యం వ్యాఖ్యానించారు. అపోలో వైద్య సంస్థలకు లీజుకు ఇవ్వడం కోసం ఏర్పాటైన కమిటీ శుక్రవారం చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా సుబ్రమణ్యం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రైవేటు భాగస్వామ్యం ఉండటం వల్ల పేదలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. ప్రస్తుతం ఆస్పత్రిలో 320 పడక లు ఉంటే భవిష్యత్తులో 1,200 పడకలుగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీని సాధ్యాసాధ్యాలపై ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఆస్పత్రిలో పెట్టుబడులు, ఆధునికీకరణ తో పాటు వైద్య వృత్తికి సంబంధించిన అనేక కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. నంద్యాల, విజయనగనం ప్రభుత్వాస్పత్రుల్లో కూడా డీమ్డ్ కోర్సులను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు వెళ్లాయని స్పష్టం చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల సమక్షంలో చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలోని మౌలిక సదుపాయాలు, భవనాల వివరాలపై జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సీపీఐ నాయకుల ఆందోళన చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ప్రైవేటుపరం చేయడాన్ని నిరసిస్తూ సీపీఐ నాయకులు ధర్నా చేశారు. అనంతరం ఆస్పత్రి వద్ద ఎల్వీ.సుబ్రమణ్యానికి వినతిపత్రం అందజేశారు. మురకంబట్టులో అపోలో వైద్య కళాశాలకు సేకరించిన స్థలాలకు పరిహారం ఇవ్వలేదంటూ బాధితులు ఆందోళనకు దిగారు. కమిటీ సమావేశం జరుగుతుండగా ప్రభుత్వానికి, అపోలో ఆస్పత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
సమైక్యాంధ్ర కోరుతూ KGH వైద్యులు ఆందోళన