బెర్లిన్ : కరోనా వైరస్‌కు ఎదురొడ్డి ప్రజల ప్రాణాలు రక్షిస్తున్న తమ ప్రాణాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జర్మనీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తగినన్ని పీపీఈ కిట్లు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహింస్తోందంటూ బుధవారం జర్మనీలో డాక్టర్లు వైద్యపరికరాలను అడ్డుగా పెట్టి అర్థనగ్న నిరసన చేపట్టారు. వెంటనే తమకు అత్యవసరమై పీపీఈ కిట్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, గ్లోవ్స్, పీపీఈ కిట్లకు భారీగా డిమాండ్ పెరిగినందున కొరత నెలకొందని తెలిపింది. (జర్మన్ ఛాన్సలర్ సెల్ఫ్ క్వారంటైన్)
ఇప్పటికే 133 మిలియన్ మాస్కులను దేశవ్యాప్తంగా పంపిణీ చేశామని, వాటిలో 10 లక్షల మాస్కులను చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసినందున మరో 15 మిలియన్ మాస్కులను ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ఇంకా కొన్నాళ్లపాటు వైరస్‌తో మనం పోరాడాల్సి ఉందని హెచ్చరించారు. వినడానకి కష్టంగా ఉన్నా ఇంకొంత కాలం మనం కరోనాతో కలిసి జీవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశంలో 1.5 లక్షలుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 6000 మంది మరణించారు. (కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!)
Comments
Please login to add a commentAdd a comment