Angela Merkel
-
13 ఏళ్లు రాజకీయాలకు దూరం.. రీఎంట్రీలో అదిరే విజయం
ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో పార్టీ ఓడింది. ఆ మాత్రానికే అంతర్జాతీయ మీడియా సంస్థలు ఆయన్నో ఫెయిల్డ్ పొలిటీయన్గా అభివర్ణించాయి. మరోవైపు సొంత అధిష్టానం సైతం ఆయన నాయకత్వంపై బలమైన విమర్శలు చేసింది. వాటిని ఆయన తట్టుకోలేక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈలోపు దేశాన్ని తీవ్ర సంక్షోభాలు వచ్చి పడ్డాయి. అనూహ్యంగా.. మళ్లీ ఆయనకే నాయకత్వ పగ్గాలు అప్పజెప్పింది. అధికార పక్షంపై ప్రజా వ్యతిరేకత.. అదే సమయంలో ఆయన విధానాలు ప్రజలను ఆకర్షించగలిగాయి. అద్భుత విజయంతో జర్మనీ ఛాన్స్లర్ పీఠంపై ఫ్రెడరిక్ మెర్జ్‌ను కూర్చోబెట్టబోతున్నాయి. 69 ఏళ్ల ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ. క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(CDU) తరపున అక్కడి ప్రభుత్వంలో ఎలాంటి కీలక పదవులు, బాధ్యతలు చేపట్టిన దాఖలాలు లేవు. మరి అలాంటి వ్యక్తికి నేరుగా.. జర్మనీ ఛాన్స్‌లర్‌గా అవకాశం ఎందుకు దక్కబోతోంది?. 👉ఫ్రెడరిక్ మెర్జ్(Fedrich Merz).. 1955, నవంబర్ 11న బ్రిలన్లో జన్మించారు. వాళ్లది న్యాయవాద నేపథ్యం ఉన్న కుటుంబం. బోన్, మార్బర్గ్ యూనివర్సిటీల్లో న్యాయవిద్య పూర్తి చేశారు. 1975 నుంచి 76 దాకా మిలిటరీలో పని చేశారు. న్యాయమూర్తిగా, ఆపై కార్పొరేటర్ లాయర్గానూ పని చేశారు👉1972లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్(CDU Party)లో చేరారు. 1989లో తొలిసారి యూరోపియన్ పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. 1994లో హోచ్సౌర్లాండ్క్రీస్ నియోజకవర్గం నుంచి జర్మనీ ముఖ్య సభ బుండెస్టాగ్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. జర్మనీ పార్లమెంట్లో బుండెస్టాగ్, బుండెస్రాట్ సభలు ఉంటాయి. ఇవి మన లోక్‌సభ, రాజ్యసభలను పోలి ఉంటాయి.👉2000 సంవత్సరంలో ఆయన రాజకీయ ప్రస్థానం కీలక మలుపు తిరిగింది. అప్పటి సీడీయూ అధినేత్రి.. జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్(Angela Merkel) సీడీయూ పార్లమెంటరీ నేతగా మెర్జ్‌కు బాధ్యతలు అప్పజెప్పారు. అయితే.. రెండేళ్ల తర్వాత మెర్కెల్ ఆయన్ని పక్కనపెట్టారు. అందుకు కారణాలు లేకపోలేదు. 👉2002లో జరిగిన జనరల్ ఫెడరేషన్ ఎన్నికల్లో సీడీయూపై స్వల్ప ఆధిక్యంతో సోషల్ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది. ఈ ఓటమిని ఏంజెలా మెర్కెల్ జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు.. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఫ్రెడరిక్ మెర్జ్‌ను విఫల నాయకుడిగా ఏకిపారేశాయి. అదే టైంలో.. 👉ఒకే పార్టీ అయినప్పటికీ ఏంజెలా మెర్కెల్‌కు ఫ్రెడరిక్ మెర్జ్ నడుమ రాజకీయ సిద్ధాంతాలపరంగా బేధాలున్నాయి. పదహారేళ్ల పాటు(2005 నుంచి 2021) జర్మనీ ఛాన్సలర్‌గా పని చేసిన మెర్కెల్ సెంట్రిస్ట్ కావడం.. మెర్జ్ సంప్రదాయ రాజకీయవాది, పైగా అతిమితవాద పార్టీ మద్ధతుదారుడు కావడం గమనార్హం. ఈ క్రమంలో.. జనరల్ ఫెడరేషన్ ఎన్నికల ఓటమిని సాకుగా చూపించి ఆయన్ని పార్లమెంటరీ నేత పదవి నుంచి తప్పించారని అప్పట్లో ఆమెపై సీడీయూలోనే విమర్శలు వచ్చాయి. 👉కొన్నాళ్ల సీడీయూలోనే క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన.. 2009లో రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు. తిరిగి న్యాయవాది వృత్తిలో కొనసాగుతూనే.. మరోవైపు లాబీయిస్ట్ అవతారం ఎత్తారు. జర్మనీ బ్లాక్‌రాక్ సూపర్వైజరీ బోర్డు చైర్మన్‌గానూ వ్యహరించారు.👉ఈలోపు ఏంజెలా మెర్కెల్ రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించే టైంలో.. సీడీయూకి నాయకత్వం వహించేది ఎవరనే చర్చ జోరుగా చర్చ నడిచింది. 2018, 2021 రెండుసార్లు సీడీయూ నాయకత్వం మారగా.. ఆ రెండుసార్లు ఫ్రెడరిక్ మెర్జ్ పేరే వినిపించింది. కానీ, 👉అన్నెగ్రెట్ క్రాంప్(2018-21), అర్మిన్ లాస్చెట్(2021-22)లు ఆ అవకాశం దక్కించుకున్నారు. చివరకు.. 2022లో ఫ్రెడరిక్ మెర్జ్‌కు ఉన్న రాజకీయ అనుభవం పరిగణనలోకి తీసుకుని, ఆయన కన్జర్వేటివ్ విధానాలకే ఓటేస్తూ నాయకత్వ బాధ్యతలను సీడీయూ అప్పగించింది.👉2022లో రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఫ్రెడరిక్ మెర్జ్.. బుండెస్టాగ్‌లో ప్రతిపక్ష నేతగా దూకుడుతనం ప్రదర్శించారు. అదే సమయంలో.. ప్రస్తుత ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్ నేతృతంలోని సోషల్ డెమొక్రటిక్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబికింది. ఈ క్రమంలో.. ప్రజాకర్ష విధానాలను ప్రదర్శించారు మెర్జ్. 👉దశాబ్దాలుగా జర్మనీ ఆర్థిక, దౌత్యపరమైన సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి తరుణంలో మెర్జ్ అక్కడి ప్రజలకు ఓ ఆశాకిరణంగా కనిపించారు. 👉 తాజాగా ఆదివారం జరిగిన జర్మనీ పార్లమెంటరీ ఎన్నికల్లో..ఫ్రెడరిక్ మెర్జ్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ కూటమి సీడీయూ+సీఎస్‌యూ(Christian Social Union in Bavaria) విజయం ఖాయంగా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ విషయాన్ని ఖరారు చేశాయి. విశ్వసనీయుడిచేత జర్మనీ పాలించబడబోతోంది అని ఆయన మద్ధతుదారులు సంబురాలు చేస్తున్నారు. అయితే.. ఎన్నికల ఫలితాలు ఇవాళే వెల్లడి కానున్నాయిఅయితే మెర్జ్ విధానాలపై విమర్శలు లేకపోలేదుశరణార్థులను వెనక్కి తిప్పి పంపాలన్నది ఆయన అభిమతం. అయితే ఆయన ఇమ్మిగ్రేషన్ పాలసీని ఏంజెలా మెర్కెల్ లాంటి వాళ్లే బహిరంగంగా వ్యతిరేకిస్తున్నారు. అతి మితవాద మద్దతుదారుడిగా ఉన్న మెర్జ్.. అల్టర్నేటివ్ ఫర్ జెర్మనీ(AfD) పార్టీతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాన్ని సీడీయూలో కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు మెర్జ్ రూపొందిచిన ఆర్థిక విధానాలు.. ధనవంతులకు.. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసేలా ఉండడం మరో మైనస్అన్నింటికి మంచి.. వ్యాపార ధోరణితో కూడిన ఆయన నాయకత్వ లక్షణంపై అటు విమర్శలతో పాటు ఇటు పొగడ్తలూ వినిపిస్తుంటాయిఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ ఛాన్సలర్ కావడం ఏంజెలా మెర్కెల్ ఇప్పుడు ఏమాత్రం ఇష్టం లేదు. అయితే ఓ సీనియర్ నేతగా సీడీయూ ఆమె అభిప్రాయం మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది అంతే.:: సాక్షి వెబ్‌డెస్క్ -
నన్ను క్షమించండి ఏంజిలా మెర్కల్ : పుతిన్
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. జర్మనీ మాజీ ఛాన్సలర్ (ప్రధాని) ఏంజిలా మెర్కల్‌కు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. 17 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘటనను ఆయన తాజాగా గుర్తు చేసుకున్నారు. 17ఏళ్ల క్రితం ఏం జరిగిందంటే?పుతిన్‌కు శునకాలంటే మహా ప్రాణం. అందుకే దేశాది నేతలతో జరిగే సమావేశాల్లో సైతం శునకాలు పుతిన్‌తో దర్శనమిస్తుంటాయి. అయితే, 17ఏళ్ల క్రితం అంటే 2007 సోచి నగరంలో పుతిన్- అప్పటి జర్మనీ ప్రధాని ఏంజిలా మెర్కల్ మధ్య ఓ సమావేశం జరిగింది. అయితే ఆ మీటింగ్‌కు పుతిన్‌తో పాటు ఆయన పెంపుడు శునకం లాబ్రడార్ కోని కూడా తీసుకువచ్చారు. సమావేశంలో జరుగుతున్నంత సేపు మెర్కల్తో పాటు పుతిన్ చుట్టూ తచ్చాడుతూ కనిపించింది. దీంతో స్వతహాగా శునకాలంటే భయపడే మెర్కల్ లాబ్రడార్ కోని చూసి ఆందోళనకు గురయ్యారు. నాటి ఘటనపై తాను రాసిన పుస్తకంలో మెర్కల్ ‘ఫ్రీడమ్’ అనే టైటిల్‌తో ప్రస్తావించారు. అందులో పుతిన్ తనని భయపెట్టాలని తన శునకాన్ని సమావేశానికి తెచ్చారని అర్ధం వచ్చేలా రాశారు. తాజాగా విడుదల మెర్కల్ పుస్కకంలో 2007 నాటి ఘటనపై వ్లాదిమిర్ పుతిన్ బహిరంగంగానే స్పందించారు. మెర్కల్‌కు మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. -
మెర్కెల్ కూటమికి ఎదురుదెబ్బ
బెర్లిన్: జర్మనీ ఎన్నికల్లో చాన్సెలర్ ఏంజెలా మెర్కెల్‌కు చెందిన యూనియన్ కూటమి ఓట్ల వేటలో వెనుకబడింది. సోషల్ డెమోక్రాట్ పార్టీ స్వల్ప మెజారిటీ సాధించింది. మొత్తం 735 నియోజకవర్గాల్లో సోమవారం ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి సోషల్ డెమోక్రాట్లకు 25.7% ఓట్లు(206 సీట్లు), యూనియన్ కూటమికి 24.1%ఓట్లు(196 సీట్లు) పడ్డాయని ఎన్నికల అధికారులు చెప్పారు. తర్వాతి స్థానాల్లో ఉన్న గ్రీన్ పార్టీ 14.8%(118 సీట్లు), ఫ్రీ డెమోక్రాట్లు 11.5% ఓట్లు(92 సీట్లు)సాధించాయి. వైస్ చాన్సెలర్, ఆర్థిక మంత్రి సోషల్ డెమోక్రాట్ పార్టీ చాన్సెలర్ అభ్యర్థి ఒలాఫ్ షోల్జ్ ‘జర్మనీలో తాము ఒక మంచి, ఆచరణాత్మక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది ప్రజలిచ్చిన తీర్పు’అని అన్నారు. అయితే, చిన్న పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము కూడా ప్రయత్నిస్తామని యూనియన్ కూటమి పేర్కొంది. సోషల్ డెమోక్రాట్లు, యూనియన్ కూటమి కూటమి నేతలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పుడు గ్రీన్ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్లతో చర్చలు జరుపుతున్నారు. అయితే, గ్రీన్ పార్టీ సోషల్ డెమోక్రాట్లవైపు, ఫ్రీ డెమోక్రాట్లు యూనియన్ కూటమి వైపు మొగ్గు చూపడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో మాదిరిగా యూనియన్, సోషల్ డెమోక్రాట్లు కలిసి ‘గ్రాండ్ కూటమి’ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గతంలో మెర్కెల్ పాలనలో 12 ఏళ్లపాటు ఈ కూటమి ప్రభుత్వమే ఉంది. -
సాధికారతకు నిలువెత్తు రూపం
ఒకటిన్నర దశాబ్దంపైగా జర్మనీ చాన్స్‌లర్‌గా ఉన్న ఏంజెలా మెర్కెల్ ఈనెలలో పదవీ విరమణ చేయనున్నారు. తన వాస్తవికమైన, ఏకీకరణ రాజకీయాల కారణంగా ప్రపంచ నేతల్లో ఒకరిగా పేరుపొందారు. దేశ అత్యున్నత పదవిని అలంకరించిన మొదటి మహిళా చాన్స్‌లర్‌గా, తొలి తూర్పు జర్మనీ వ్యక్తిగా చరిత్రలో నిలిచి ఉంటారు. సాధికారతకు ఆమె నిలువెత్తు రూపం. ఆమె వ్యక్తిత్వం, రాజకీయాలు, ఆమె కనిపించే తీరు ఈ సాధికారతకు ప్రతిబింబమై నిలిచాయి. వ్యక్తిత్వపరంగా ఎలాంటి ఆకర్షణా లేని ఒక మహిళ ప్రతీ ఒక్క ప్రతిపక్ష పార్టీని తోసిరాజని, ఎన్నిక తర్వాత ఎన్నికలో ఓటర్ల విశ్వాసాన్ని పొందుతూ రావడం అరుదైన విషయం. మెర్కెల్ హయాంలో భారత్‌కి జర్మనీ మద్దతు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. జర్మనీ నాయకత్వం భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకోనుందని మన దేశం నిశితంగా పరిశీలిస్తోంది. పాశ్చాత్య ప్రపంచంలో సుదీర్ఘకాలం కొనసాగిన రాజకీయ నేతల్లో ఒకరైన ఏంజెలా మెర్కెల్ ఈ నెలలో పదవీ విరమణ చేయనున్నారు. అత్యంత ప్రజాదరణ పొందిన ఈ మహిళా చాన్స్‌లర్ 21వ శతాబ్ది జర్మన్ రాజకీయాల్లో నిర్వహించిన పాత్రను రెండు దశలుగా విభజించాలి. 67 సంవత్సరాల వయసున్న మెర్కెల్ దేశ అత్యున్నత పదవిని అలంకరించిన మొదటి మహిళా చాన్స్‌లర్‌గా, తొలి తూర్పు జర్మనీ వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు. తన రాజకీయ గురువు హెల్మెట్ కోల్ తర్వాత ఆధునిక యుగంలో సుదీర్ఘ కాలం జర్మనీ అధినేతగా పనిచేసిన రెండో వ్యక్తి ఈమే. ఒక మహిళా నేతగా, సైంటిస్టుగా, సాధారణ గృహిణిగా మెర్కెల్‌ని వర్ణిస్తూ ఇదివరకే ఎన్నో పుస్తకాలు, డాక్యుమెంటరీలు వచ్చాయి. డజన్లకొద్దీ వ్యాసాలు రాశారు. కానీ జర్మనీకి చెందిన అత్యంత ప్రభావిత చాన్స్‌లర్‌గా ఆమె నాయకత్వం గురించి ఎవరూ సరిగా వర్ణించలేకపోయారు. ఆమె సమకాలీన నేతలు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి డబ్లు్యబుష్ క్రియాశీలక రాజకీయాలనుంచి తప్పుకున్నారు. ఆమె సమకాలిక నేతల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక్కరే ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. జర్మనీ, యూరప్‌ని మెర్కెల్ ఎలా నడిపించారు! మెర్కెల్ శక్తియుక్తులు అసామాన్యం. సంక్లిష్టమైన పరిస్థితుల్లో ఆమె తీసుకున్న సాహసోపేత నిర్ణయాలు, ఆమె నాయకత్వ నైపుణ్యాలను జర్మనీ ఇక చూడలేదు. అనేక ప్రాంతాల నుంచి అనేక కారణాలతో వస్తున్న వలస ప్రజలను ఆహ్వానిస్తూ జర్మనీ సరిహద్దులను తెరిచిన సాహస నాయకత్వం ఆమెది. అంతేకాకుండా 2000 సంవత్సరంలో ముంచుకొచ్చిన ఆర్థిక మాంద్యం నుంచి యూరోపియన్ యూనియన్ని బయటపడేయడంలో మెర్కెల్ నిర్ణయాత్మక ప్రభావం వేశారు. అంతర్జాతీయ సంబంధాలను, భౌగోళిక వ్యూహాత్మక, రాజకీయాలను అర్థం చేసుకోవడంలో ఆమె ప్రతిభ ప్రశంసనీయం. అయితే అతి సంక్లిష్టమైన అంతర్జాతీయ సంక్షోభాల పొడవునా ఆమె పాటించిన వాస్తవికవాద ఆచరణ ఆమెను ఆధునిక జర్మనీ రాజకీయాల్లో సమున్నతంగా నిలబెట్టింది. జర్మన్లు తొందరపాటు స్వభావం కలిగినవారు. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడంలో జర్మనీని నాయకురాలిగా ప్రపంచం చూస్తుండగా, జర్మన్లు మాత్రం తమ నాయకత్వంపై అనుమానాలు పెట్టుకున్నారు. కానీ భారత్ వంటి దేశాల్లో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో చూసిన తర్వాత మెర్కెల్ నేతృత్వంలోని జర్మనీ పరిస్థితి మరీ అంత తీసికట్టుగా లేదని జర్మన్లు అభిప్రాయానికొచ్చారు. జర్మన్లు తమ నేతను ఎలా చూస్తారు అనేందుకు ఇది ఒక ఉదాహరణ కూడా. గత 16 సంవత్సరాలలో మెర్కెల్ జనామోద రేటింగులు ప్రారంభంలో విమర్శలకు దారితీశాయి. కానీ ఈరోజు జర్మనీ ప్రజలు మెర్కెల్కి దన్నుగా ఉన్నారు. ఇప్పుడామె అయిదోసారి చాన్స్‌లర్ పదవికి పోటీ చేసినా జర్మన్లు ఆమెనే గెలిపిస్తారంటే సందేహమే లేదు. గత సంవత్సరం కూడా ఆమెను 57 శాతం రేటింగుతో జర్మన్లు ఆమోదించడమే దీనికి తార్కాణం. స్వదేశంలోనే కాదు, యూరోపియన్ పౌరులు సైతం మెర్కెల్ పట్ల విశేషాదరణ చూపారు. విదేశీ సంబంధాలపై యూరోపియన్ కౌన్సిల్ నిర్వహించిన సర్వే ప్రకారం, ఈయూ అధ్యక్షుడు కావడానికి మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్లలో ఎవరికి అవకాశం ఉంది అనే ప్రశ్నకుగాను మెర్కెల్‌కే ఎక్కువమంది ఓటేశారు. ఈయూ సభ్యదేశాల్లో ఆమెకు 52 నుంచి 58 శాతం ఆమోదం లభించగా మెక్రాన్‌కి కేవలం 6 నుంచి 11 శాతం మాత్రమే ఆమోదం లభించడం గమనార్హం. అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ పాలనా విధానాలకు వ్యతిరేకంగా నిలబడిన మెర్కెల్ ప్రపంచ నాయకుల ప్రశంసలందుకున్నారు. అలాగే సమీకృత అభివృద్ధికి, బహుళ సంస్కృతికి ఆమె నిర్వచనంగా నిలి చారు. అత్యంత మితవాద పక్షమైన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ పార్లమెంటులో మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం లభించిన వాతావరణంలోనూ ఆమె తన విధానాలను కొనసాగించారు. ప్రపంచక్రమాన్ని సమతుల్యం చేయడం వైపుగా ప్రపంచ నాయకత్వం స్పందించడానికి ఆమె ఒక కాంతిరేఖలా మారారు. ఒక మత బోధకుడి కుమార్తెగా సిగ్గును అలంకారంగా చేసుకున్న మెర్కెల్ ఆధునిక యూరప్ సాధికారికమైన నేతల్లో ఒకరుగా వెలుగొందారు. తన సొంత క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ పార్టీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె తన పంథానుంచి వెనుదిరగలేదు. కొంతమంది జర్మన్లు ఆమెను నిరాసక్తత కలిగిన మహిళగా పిలిచారు. జర్మనీలోని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆమెకు వ్యతిరేకంగా జనాకర్షక నేతను ఎందుకు నిలబెట్టలేదని కొందరు ప్రశ్నిం చారు. కానీ జర్మనీలో గణనీయ సంఖ్యలో ప్రజలు ఆమెను విశ్వసిం చారు. ఎందుకంటే జర్మన్లకు ఒకరకమైన భద్రతను ఆమె కలిగించారు. ఆమెకు సరిసమాన స్థాయిలో నిలిచే నేతలు ఎవరూ లేరని ఒక తరం ఓటర్లు భావించారు. ఈ జర్మనీ మాత.. సామాజిక, రాజకీయ ప్రభావాలతో పనిచేసే మీడియాను తనకు అనుకూలంగా మార్చుకుని సామరస్యత సాధించారు. సాధికారతకు నిలువెత్తు రూపమై ఆమె నిలి చారు. ఆమె వ్యక్తిత్వం, రాజకీయాలు, ఆమె కనిపించే తీరు ఈ సాధికారతకు ప్రతిబింబమై నిలిచాయి. చివరకు ఆమె వేషధారణ, ఫ్యాషన్ కూడా స్థిరంగా కొనసాగుతూ వచ్చింది. వ్యక్తిత్వపరంగా ఎలాంటి ఆకర్షణా లేని ఒక మహిళ ప్రతీ ఒక్క ప్రతిపక్ష పార్టీని తోసిరాజని, ఎన్నిక తర్వాత ఎన్నికలో ఓటర్ల విశ్వాసాన్ని పొందుతూ రావడం అరుదైన విషయం. ఒక దశలో హెల్మెŠట్ కౌల్ ‘చిన్నమ్మాయి’గా ఈసడింపునకు గురైన మెర్కెల్ ప్రపంచంలోనే అత్యంత ప్రభావిత నేతల్లో ఒకరుగా ప్రసిద్ధి చెందారు. మెర్కెల్ అనంతరం ఇండో–జర్మన్ సంబంధాలు భారత ప్రధాని నరేంద్రమోదీ, జర్మనీ చాన్స్‌లర్ మధ్య మిత్రుత్వం గురించి ఇప్పటికే చాలా చెబుతూ వచ్చారు. భారత్‌కి సంబంధించి నంత వరకు ఆరవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన జర్మనీ నాయకత్వం భవిష్యత్తులో ఎలా రూపుదిద్దుకోనుందని మన దేశం నిశి తంగా పరిశీలిస్తోంది. మెర్కెల్ హయాంలో భారత్‌కి జర్మనీ మద్దతు గణనీయంగా పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా సాంకేతిక, సహకార పథకాల్లో భారత్‌కి సహాయం చేస్తున్న అగ్రదేశాల్లో జపాన్‌తోపాటు జర్మనీ కూడా చేరిపోయింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం జర్మనీ మద్దతును భారత్ పొందగలి గింది. ఆసియా ప్రాంతంలో సమీకరణల రీత్యా భారత్‌కు ఇక ముందు కూడా జర్మనీ మద్దతు కొనసాగించవచ్చు. ఆసియా ప్రాంతంలో చైనా ఆధిపత్యాన్ని, దాని దూకుడు ఆర్థిక విధానాలను మెర్కెల్ అదుపు చేయలేకపోయింది. తాజాగా జర్మనీ విడుదల చేసిన ఇండో–పసిఫిక్ విధాన పత్రం సరైన దిశలోనే ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది ఊహాజనితంగానే ఉంటుంది. యూరోపియన్–భారత్ మధ్య ఎఫ్‌టీఏ చర్చలు దశాబ్ద కాలంగా అసంపూర్తిగా సాగుతున్నాయి. భారత్, జర్మనీలు తమ మధ్య 70 ఏళ్లపాటు సాగుతున్న దౌత్య సంబంధాలకు ఇటీవలే వేడుక చేసుకున్నాయి కానీ ఇరుదేశాల మధ్య లోతైన సంబంధాలు ఇంకా ఏర్పడలేదు. భారత్‌తో కుదుర్చుకున్న పి.75–1 సబ్‌మెరైన్ ప్రోగ్రాం నుంచి బయటకు వచ్చింది. దీంతో జర్మనీ రక్షణరంగ కంపెనీలు దాదాపుగా భారత్‌లో లేకుండాపోయాయి. సెప్టెంబర్ 26న జర్మనీ తన తదుపరి నేతను ఎంపిక చేసుకోవడానికి సిద్ధపడుతోంది. తనకు ఎంతో అవసరమైన విరామానికి సిద్ధమవుతున్నట్లు ఎంజెలా మెర్కెల్ ఇప్పటికే స్పష్టంచేసి ఉన్నారు. దీంతో, ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన మహిళా నేత బెర్లిన్‌లో తన నివాసానికి సమీపంలోని సూపర్ మార్కెట్లో సరుకులు కొనుగోలు చేస్తూ కనిపించవచ్చు. సునందారావు ఎర్డెమ్ సీఈఓ, సెరఫిమ్ కమ్యూనికేషన్స్ ఎల్ఎల్పీ (ది క్వింట్ సౌజన్యంతో...) -
రెండు వేర్వేరు టీకాలు తీసుకోనున్న ఏంజెలా
బెర్లిన్: రెండు వేర్వేరు కరోనా టీకాలు తీసుకోవడంపై ఇప్పటి వరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. నిపుణులు మాత్రం ఇలా రెండు వేర్వేరు టీకాలను తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఇక మన దేశంలో అక్కడక్కడా రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు తీసుకున్నవారు ఉన్నారు. అయితే వీరంతా వైద్య సిబ్బంది తప్పిదం వల్ల ఇలా రెండు వేర్వేరు కంపెనీలు వ్యాక్సిన్లు తీసుకున్నారు కానీ.. కావాలని కాదు. ఈ క్రమంలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఈ సాహసం చేయడానికి ముందుకు వచ్చారు. ఏంజెలా రెండు వేర్వేరు కోవిడ్ టీకాలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే మొదటి డోస్‌లో భాగంగా ఆస్ట్రాజెనికా తీసుకున్న ఏంజెలా రెండో డోసులో భాగంగా మోడర్న టీకా తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. మూడేళ్ల క్రితం ఏంజెలా అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆమెకు ఉన్నట్లుండి కళ్లు తిరగడంతో వెంటనే లోపలికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె తిరిగి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 16ఏళ్ల పాటు అధికారంలో ఉన్న మెర్కెల్ ఈ ఏడాది పదవీవిరమణ చేయనున్నారు. ఇక గత రెండు వారాల నుంచి జర్మనీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగతుంది. చదవండి: రెండు వేర్వేరు టీకాలు కలిపి తీసుకోవచ్చా..! -
Narendra Modi: వన్ ఎర్త్.. వన్ హెల్త్!
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడానికి ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం (వన్ ఎర్త్.. వన్ హెల్త్)’ అనే సమష్టి భావనతో ప్రపంచం ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జీ7 సదస్సులో ‘‘బిల్డింగ్ బ్యాక్ స్ట్రాంగర్ హెల్త్’’ పేరిట నిర్వహించిన చర్చాగోష్టిలో శనివారం మోదీ ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారులను నివారించడానికి ప్రపంచమంతా ఏకతాటిపైకి రావాలని, ప్రపంచస్థాయి నాయకత్వం, సంఘీభావం అవసరమని పేర్కొన్నారు. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనడంలో ప్రజాస్వామ్య దేశాలు, పారదర్శక సమాజాలపై ప్రత్యేక బాధ్యతలు ఉంటాయని ఉద్ఘాటించారు. వ్యాక్సిన్లపై తాత్కాలికంగా మేధో హక్కులను (పేటెంట్లను) రద్దు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో భారత్, దక్షిణాఫ్రికాలు ఉమ్మడిగా చేసిన ప్రతిపాదనకు మద్దతుగా నిలవాలని మోదీ జీ7 దేశాధినేతలను కోరారు. ప్రపంచ ఆరోగ్య పరిరక్షణలో సమష్టి కృషికి భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పారు. ఒకే భూమి, ఒకే ఆరోగ్యం (వన్ ఎర్త్, వన్ హెల్త్) అనేది అందరి మంత్రం కావాలని, జీ7 సమావేశం ఈ సందేశాన్ని ప్రపంచదేశాలకు ఇవ్వాలని ఆయన ఆకాంక్షించారు. జీ7లో యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. భారత్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నాయి. మెర్కెల్ మద్దతు మోదీ అభిప్రాయానికి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నుంచి గట్టి మద్దతు లభించింది. ప్రధాని ప్రతిపాదించిన వన్ ఎర్త్ వన్ హెల్త్‌కు ఆమె అండగా నిలిచారు. ప్రధాని మోదీతో పలు అంశాలపై తాను జరిపిన చర్చలను ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ గుర్తు చేసుకున్నారు. ఇండియా లాంటి భారీ వ్యాక్సిన్ ఉత్పత్తిదేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ముడిపదార్ధాలు సరఫరా చేయాలని ఫ్రాన్స్ అధినేత మాక్రాన్ సూచించారు. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు జీ7దేశాలు అందించిన సాయానికి ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం సైతం జీ7 సదస్సులో ప్రధాని ఆన్లైన్ ద్వారా ప్రసంగించనున్నారు. కరోనా నేపథ్యంలో ప్రధాని నేరుగా ఈ సమావేశానికి హాజరు కాలేదు. -
ట్రంప్ ట్విట్టర్ బ్యాన్.. స్పందించిన డోర్సే
వాషింగ్టన్: గత వారం క్యాపిటల్ హిల్ భవనంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం ట్విట్టర్ ట్రంప్ అకౌంట్‌ని శాశ్వతంగా బ్యాన్ చేసింది. మరోసారి ఇలాంటి విధ్వంసకర చర్యలు జరగకూడదనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా చర్యగా ట్రంప్ ట్విట్టర్ అకౌంట్‌ని బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే ట్రంప్ అకౌంట్ బ్యాన్పై స్పందించారు. ఈ నిర్ణయం సరైనదే కానీ ఇందుకు తానేం గర్వపడటం లేదని.. పైగా ఇలాంటి చర్యలతో మాట్లాడే స్వేచ్ఛను హరించినట్లే అని అభిప్రాయపడ్డారు. ‘స్పష్టమైన మినహాయింపులు ఉన్నప్పటికీ.. చివరకు నిషేధం విధించాల్సి వచ్చింది అంటే మేం ఆరోగ్యకరమైన సంభాషణను ప్రోత్సహించడంలో విఫలమయ్యామని నేను భావిస్తున్నాను అన్నారు’ డోర్సే. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్స్ చేశారు. (చదవండి: ట్రంప్ బ్యాన్ : ట్విటర్ నష్టం ఎంతో తెలుసా? ) ‘ఆన్లైన్ ప్రసంగం వల్ల ఆఫ్‌లైన్‌లో హానీ కలగడం అనేది వాస్తవం. అందువల్ల బ్యాన్ విధించడం కరెక్టే. కానీ అది ప్రజా సంభాషణని విచ్ఛిన్నం చేస్తుంది. విభజన, స్పష్టత, విముక్తి, అభ్యాసం సామర్థ్యాన్ని పరిమితం చేస్తాయి.. ఇలాంటి ముందస్తు చర్యలు ప్రమాదకరమైనవని నేను భావిస్తున్నాను’ అన్నారు డోర్సే. అంతేకాక ఇలాంటి చర్యల వల్ల ఒపెన్ ఇంటర్నెట్ ఉద్దేశం, ప్రయోజనాలు దెబ్బతింటాయని డోర్సే ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ట్రంప్ సోషల్ మీడియా అకౌంట్‌పై నిషేధం విధించడాన్ని పలువురు రిపబ్లికన్లు తప్పు పట్టారు. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కూడా వీరి జాబితాలో ఉన్నారు. ఈ మేరకు మెర్కెల్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పరిమితులను శాసనసభ సభ్యులు నిర్ణయించాలి తప్ప ప్రైవేటు సంస్థలు కాదు’ అన్నారు మెర్కెల్. (చదవండి: అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్) I do not celebrate or feel pride in our having to ban @realDonaldTrump from Twitter, or how we got here. After a clear warning we’d take this action, we made a decision with the best information we had based on threats to physical safety both on and off Twitter. Was this correct? — jack (@jack) January 14, 2021 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ విజయాన్ని సవాలు చేస్తూ ట్రంప్ పదేపదే నిరాధారమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయాన్ని ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సమావేశం అయ్యింది. ఇదే సమయంలో ట్రంప్ మద్దతుదారలు క్యాపిటల్ హిల్ భవనంపై దాడి చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ట్రంప్ అభిశంసనను ఎదుర్కొన్నారు. ఇక అమెరికా చరిత్రలో రెండుసార్లు అభిశంసనకు గురైన మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. -
ఈసారి లాక్డౌన్.. మరింత కఠినం!
బెర్లిన్: కరోనా మహమ్మారి విజృంభణ మొదలయ్యి ఏడాది పూర్తయ్యింది. వైరస్ మాత్రం ఇంకా అదుపులోకి రాలేదు.. ప్రపంచ దేశాలన్ని వ్యాక్సిన్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కానీ పూర్తిస్థాయిలో సమర్థవంతమైన వ్యాక్సిన్ మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. పైగా ప్రస్తుతం పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ మొదలయ్యింది. కొన్ని దేశాలు మరోసారి లాక్డౌన్ విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జర్మనీలో బుధవారం నుంచి లాక్డౌన్ అమల్లోకి రానుంది. ఈ సారి నియమాలు మరింత కఠినంగా ఉండనున్నాయి. ఈ మేరకు జర్మనీ చాన్సిలర్ ఏంజెలా మెర్కెల్ ఉత్తర్వులు జారీ చేశారు. డిసెంబర్ 16 నుంచి వచ్చే ఏడాది జనవరి 10 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని తెలిపారు. గత ఆరు వారాలుగా జర్మనీలో పాక్షిక లాక్డౌన్ అమల్లో ఉంది. కానీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ క్రమంలో ఆదివారం ఒక్క రోజు 20,209 కేసులు నమోదు కాగా.. 321 మంది మరణించారు. దాంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో.. మరింత కఠినంగా లాక్డౌన్ విధించాలని భావిస్తోంది. జర్మనీతో పాటు ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు రెండోసారి లాక్డౌన్ విధించాయి.. ఆ దేశాలేవంటే... కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావడంతో జర్మనీతో పాటు ఫ్రాన్స్, బెల్జియం, గ్రీకు, బార్సిలోనా, యూకే, ఆస్ట్రియా, స్కాట్లాండ్, బెల్జియం, ఇజ్రాయెల్, స్పెయిన్, నెదర్లాండ్స్, అమెరికా వంటి దేశాల్లో రెండో సారి లాక్డౌన్ విధించారు. కొన్ని దేశాల్లో మొత్తం అంతటా కాకుండా.. తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రల్లోనే లాక్డౌన్ విధించారు. వ్యాక్సిన్ వచ్చాక కూడా లాక్డౌన్ ఎందుకు? కరోనాని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలన్ని తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫైజర్ ఎన్ బయోటెక్, స్పూత్నిక్ వి అందుబాటులోకి రాగా.. మరి కొద్ది రోజుల్లో ఆక్స్ఫర్డ్, కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్లు రానున్నాయి. ఒకటి, రెండు నెలల వ్యవధిలో వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయి. అయినప్పటికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం దేశాలు లాక్డౌన్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్‌లన్ని కరోనాను సమర్థవంతంగా ఎందుర్కొగలవనే గ్యారంటీ లేదు. స్వయంగా డబ్ల్యూహెచ్ఓనే కోవిడ్ -19 సమర్థవంతంగా కట్టడి చేయగల వ్యాక్సిన్ రావడానికి సుమారు ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పడుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం రానున్న వ్యాక్సిన్‌లన్ని 6-12 నెలల వ్యవధి గడువులోనే తయారయ్యాయి. చాలా తక్కువ మంది మీదనే ట్రయల్స్ జరిపారు. అది కూడా చాలా తక్కువ రోజులపాటే. (చదవండి: కోటిన్నర మంది చనిపోయినా... ఒక్క టీకా పడలేదు ) వ్యాక్సిన్ ప్రభావంపై జనాల్లో పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీకా ప్రభావం ఒకవేళ 70 శాతమే ఉన్నప్పుడు... మిగతా 30 శాతం మందిలో అది పనిచేయనప్పుడు దాన్ని తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసుల తర్వాత 95 శాతం రక్షణ ఇస్తుందని ఆ కంపెనీ వారు చెబుతున్నారు. అలాగే మన దేశంలోని కో–వ్యాక్సిన్ నుంచి 70 శాతం రక్షణ కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీన్నిబట్టి వ్యాక్సిన్ వేసిన వాళ్లలో కరోనా అస్సలు రాకుండా ఉండాలనే నియమం ఏమీ లేదు. కొంతమందిలో వ్యాక్సిన్ వేసిన తర్వాతా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సుమారు 95% ప్రొటెక్షన్ ఉంది అంటే వందలో ఐదుగురికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం అభివృద్ధి చేస్తోన్న వాటిల్లో ఏ వ్యాక్సిన్ కూడా 100 శాతం సమర్థవంతైనది లేదు. దాంతో చాలా దేశాలు వ్యాక్సిన్ కంటే ఎక్కువగా లాక్డౌన్, మాస్క్ ధరించడం, శుభ్రత పాటించడం, సామాజిక దూరం పాటించే అంశాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. కేసుల పెరుగుదల-శీతాకాలం కొన్ని నెలలుగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్డౌన్ ఆంక్షలు సడలించారు. ప్రజలు మాములుగా రోజువారి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. కానీ సడెన్‌గా ఓ రెండు నెలల నుంచి కోవిడ్ కేసులు భారీగా పెరుగుతూ వచ్చాయి. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్ మరింత తీవ్రంగా ఉంది. అయితే వేసవి కారణంగా కేసుల సంఖ్య తగ్గిందని.. ప్రస్తుతం శీతకాలం కావడంతో వైరస్ విజృంభిస్తోంది. సాధారణంగా శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతాయి. ఈ పరిస్థితులు వైరస్‌కు ఎంతో అనుకూలంగా ఉండటమే కాక వైరస్ ఎక్కువ కాలం మనుగడ సాగించేందుకు అవకాశ ఉంటుంది. శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ ఎక్కువ వేధిస్తుంటుంది. ఫ్లూ వైరస్, కరోనా వైరస్ లక్షణాలు ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి. ఈ రెండు రకాల వైరస్లు ఒకరి నుంచి మరొకరికి శ్వాసకోశ బిందువులు, దగ్గు, కఫం ద్వారా వ్యాప్తి చెందుతూ ఇబ్బంది పెడతాయి. జలుబే కదా అని లైట్ తీసుకోవడంతో ఇతరులకు త్వరగా వ్యాప్తి చెందుతుంది. (చదవండి: చలికాలంలో కరోనా పంజా) భారత్‌లో సెకండ్‌వేవ్.. ఇప్పటికే పలు ప్రపంచ దేశాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. భారత్‌లో కూడా ఢిల్లీ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయ్యింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఏకంగా థర్డ్ వేవ్ ప్రారంభమయ్యింది. కారణాలు మన దగ్గర కరోనా ఫస్టవేవ్ అక్టోబర్ వరకు కొనసాగింది. ఇక అక్టోబర్ మాసం చివర్లో కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో భారత్‌లో పండగల సీజన్ ప్రారంభమయ్యింది. అప్పటికే జనాలు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటి అంశాల గురించి లైట్ తీసుకున్నారు. ఇక పండుగల కాలంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినప్పటికి జనాలు పెద్దగా పట్టించుకోలేదు. గుంపులు గుంపులుగా చేరడం వంటివి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబర్, జనవరి నెలల్లో దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం కావచ్చని నిపుణులు హెచ్చరించారు. ఇక కరోనా కాలంలో కూడా పలు రాష్ట్రాల్లో వివిధ ఎన్నికలు జరిగాయి.. జరుగుతున్నాయి. ఇది కూడా దేశంలో కరోనా సెకండ్ వేవ్‌కు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.. (చదవండి: మళ్లీ లాక్డౌన్.. 3 కోట్ల మందికి ముప్పు?) ఇండియాలో మరో మారు లాక్డౌన్..? కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా ఈ ఏడాడి మార్చి 25 నుంచి దాదాపు 68 రోజుల పాలు పూర్తి స్థాయిలో లాక్డౌన్ విధించారు. ఆయితే ఆశ్చర్య ఏంటంటే అన్‌లాక్ కాలంలో దేశంలో గరిష్ట సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే మొదటి సారి లాక్డౌన్ ఎఫెక్ట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుంటుపడింది. కేంద్ర ఉద్దీపనల ప్యాకేజీ ప్రకటించినప్పటికి ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పేమి రాలేదు. ఇప్పటికి పర్యాటక, విద్యా, రియల్ ఎస్టెట్, అసంఘటిత రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని నిపుణలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో సెకండ్ వేవ్ మొదలైనప్పటికి పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించే అవకాశాలు లేవంటున్నారు నిపుణులు. కేసుల తీవ్రతను బట్టి రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని భావిస్తున్నారు. -
శక్తివంతమైన మహిళగా నిర్మల
న్యూఢిల్లీ: ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ఈ లిస్ట్‌లో 41వ స్థానంలో నిలిచారు ఆర్థిక మంత్రి. నిర్మలా సీతారామన్‌తో పాటు హెచ్‌సీఎల్ కార్పొరేషన్ సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రోషిణీ నాడార్ మల్హోత్రా, బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్‌షా ఈ జాబితాలో నిలిచిన మిగతా భారతీయ మహిళలు. ఇక ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ వరుసగా పదో సారి ప్రథమ స్థానంలో నిలవగా.. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్రిస్టిన్ లగార్డ్ వరుసగా రెండో సారి రెండో స్థానంలో నిలిచారు. ఇక అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉపాధ్యాక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ తొలసారి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. మొదటిసారే ఆమె ఏకంగా మూడో స్థానంలో నిలిచారు. (చదవండి: సూపర్ కుమార్) Announcing the World's 100 Most Powerful Women of 2020: https://t.co/fSEkDPz9Nh #PowerWomen pic.twitter.com/8u6uB1LTYI — Forbes (@Forbes) December 8, 2020 ఇక గతేడాది కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమితురాలైన నిర్మలా సీతారామన్ ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో రోషిణీ నాడార్ 55 స్థానంలో నిలవగా.. కిరణ్ మజుందార్ షా 68వ స్థానంలో నిలిచారు. ఇక ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన వారిలో 10 మంది దేశాధినేతలు, 38 మంది సీఈఓలు, ఐదుగురు ఎంటర్టైనర్లు ఉన్నారు. వీరందరి వయస్సు, జాతీయత, ఉద్యోగ వివరణలో విభిన్నంగా ఉన్నప్పటికి.. వారు 2020 లో తలెత్తిన ప్రత్యేకమైన సవాళ్లను పరిష్కరించడానికి వారు తమ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తున్నారు "అని ఫోర్బ్స్ తెలిపింది. -
కరోనా ఎఫెక్ట్.. దండం పెట్టేస్తున్నారు
పారిస్: కరోనా మనందరి జీవితాల్లో పెను మార్పులు తెచ్చిందనండంలో ఎలాంటి సందేహం లేదు. మనతో పాటు ప్రపంచ దేశాల ప్రజలకు భారతీయ అలవాట్ల గొప్పతనం గురించి కరోనా సమయంలో బాగా తెలిసి వచ్చింది. ఈ నేపథ్యంలో స్వాగత పలకరింపుల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కరోనాకు ముందు విదేశీ పలకరింపుల్లో కరచాలనం, ఆలింగనం తప్పని సరిగా ఉండేవి. కానీ ప్రస్తుతం ఈ పరిస్థితి మారింది. ఇప్పుడు మనతో పాటు విదేశీయులు కూడా చక్కగా చేతులు జోడించి నమస్కారం, నమస్తే అంటూ స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో జర్మనీ చాన్సలర్ ఏంజెల్ మార్కెల్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ మధ్య జరిగని నమస్తే స్వాగత పలకరింపుకు సంబంధించిన ఫోటోలు, వీడియో తెగ వైరలవుతున్నాయి. కరోనా మహమ్మారి, బెలారస్లో ఎన్నికల అనంతర తలెత్తిన అశాంతి, టర్కీతో పెరుగుతున్న ఉద్రిక్తతలతో సహా పలు విషయాల గురించి చర్చించడానికి ఇరువురు నాయకులు ఫ్రెంచ్ అధ్యక్షుడి వేసవికాల విడిదిలో సమావేశమవుతున్నారు. ఆ సమయంలో ఇలా ఒకరికొకరు నమస్తే చెప్పుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని) Willkommen im Fort de Brégançon, liebe Angela! pic.twitter.com/lv8yKm6wWV — Emmanuel Macron (@EmmanuelMacron) August 20, 2020 వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి, సామాజిక దూరం పాటించడం కోసం పలువురు ప్రపంచ దేశాధ్యక్షులు కరచాలనానికి స్వస్తి చెప్పి.. నమస్తేను ఎంచుకున్నారు. వీరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఉన్నారు. నమస్తేను మొదట ఆమోదించిన విదేశీ నేత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి. ‘హ్యాండ్‌షేక్‌ను మర్చిపొండి. భారతీయ పద్దతి నమస్తేను అనుసరించండి. లేదంటే షాలోమ్ అని చెప్పండి’ అంటూ జనాలకు సూచించారు నెతన్యాహు. మార్చిలో, డొనాల్డ్ ట్రంప్ ఐరిష్ ప్రధాన మంత్రి లియో వరద్కర్‌ను చేతులు జోడించి నమస్కారం చెబుతూ పలకరించారు. ‘మేము ఈ రోజు కరచాలనం చేయలేదు. మేము ఒకరినొకరు చూసుకున్నాము. చూపుల ద్వారానే మేం ఏం చేయబోతున్నామో చెప్పుకున్నాము. ఇది ఒక విచిత్రమైన అనుభూతి’ అని ట్రంప్ విలేకరులతో అన్నారు. -
జర్మనీలో వైద్యుల అర్థనగ్న నిరసన
బెర్లిన్ : కరోనా వైరస్‌కు ఎదురొడ్డి ప్రజల ప్రాణాలు రక్షిస్తున్న తమ ప్రాణాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ జర్మనీ వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తగినన్ని పీపీఈ కిట్లు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహింస్తోందంటూ బుధవారం జర్మనీలో డాక్టర్లు వైద్యపరికరాలను అడ్డుగా పెట్టి అర్థనగ్న నిరసన చేపట్టారు. వెంటనే తమకు అత్యవసరమై పీపీఈ కిట్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై స్పందించిన ప్రభుత్వం.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మాస్కులు, గ్లోవ్స్, పీపీఈ కిట్లకు భారీగా డిమాండ్ పెరిగినందున కొరత నెలకొందని తెలిపింది. (జర్మన్ ఛాన్సలర్ సెల్ఫ్ క్వారంటైన్) ఇప్పటికే 133 మిలియన్ మాస్కులను దేశవ్యాప్తంగా పంపిణీ చేశామని, వాటిలో 10 లక్షల మాస్కులను చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసినందున మరో 15 మిలియన్ మాస్కులను ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. దేశంలో కరోనా ఇంకా ప్రారంభదశలోనే ఉందని, ఇంకా కొన్నాళ్లపాటు వైరస్‌తో మనం పోరాడాల్సి ఉందని హెచ్చరించారు. వినడానకి కష్టంగా ఉన్నా ఇంకొంత కాలం మనం కరోనాతో కలిసి జీవించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటివరకు దేశంలో 1.5 లక్షలుపైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా, 6000 మంది మరణించారు. (కరోనా: చైనాకు భారీ బిల్లు పంపిన జర్మనీ!) -
స్వీయ నిర్బంధంలో జర్మన్ ఛాన్సలర్
బెర్లిన్ : జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ (65) తనకు తాను నిర్బంధంలోకి వెళ్లాలని నిశ్చయించుకున్నారు. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యుడికి ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్-19 వైరస్ సోకినట్టు నిర్ధారణైన నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయానికి వచ్చారు. దీంతో మెర్కెల్ స్వీయ నిర్బంధంలోకి వెళుతున్నట్లు ప్రకటించారు. ఇంటినుంచే ఆమె తన అధికారిక కార్యకలాపాలను నిర్వహించనున్నారని అధికార ప్రతినిధి స్టెఫెన్ సీబర్ట్ ఒక ప్రకటనలో తెలిపారు. క్రమం తప్పకుండా మెర్కెల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు. శుక్రవారం న్యుమోనియాకు వ్యతిరేకంగా మెర్కెల్‌కు సదరు వైద్యుడు టీకాలు వేసినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. కరోనాపై పోరులో భాగంగా బహిరంగ సభలపై నిషేధాన్ని, ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి తిరగడానికి వీల్లేదంటూ మెర్కెల్ నిషేధం విధించారు. కరోనా నివారణకు చర్యలను ప్రకటించిన కొన్ని నిమిషాల్ల వ్యవధిలోనే మెర్కెల్ సెల్ఫ్ క్వారంటైన్ ప్రకటన వచ్చింది. అలాగే 822 బిలియన్ యూరోల ప్యాకేజీపై సంతకం చేయడానికి సోమవారం నాటి కేబినెట్ సమావేశానికి ఆమె నేతృత్వం వహించాల్సి వుంది. తాజా పరిణామం నేపథ్యంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ వైస్-ఛాన్సలర్, ఆర్థిక మంత్రి ఓలాఫ్ స్కోల్జ్ దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు తీవ్రమైన జలుబుతో బాధపడిన స్కోల్జ్ గత వారం సెల్ఫ్ క్వారంటైన్ విధించుకున్నారు. అయితే కరోనా వైరస్ నెగటివ్ వచ్చిందని ఆ తరువాత ట్విటర్ ద్వారా వెల్లడించారు. కాగా జర్మనీలో 24వేల మందికి పైగా కరోనావైరస్ బారిన పడగా, దేశంలో ఇప్పటివరకు 94 మరణాలు సంభవించాయి. -
కరోనా వ్యాప్తి: ఏంజెలా మెర్కెల్ సంచలన వ్యాఖ్యలు
బెర్లిన్: కరోనా దెబ్బకు అన్ని దేశాలు విలవిలలాడుతున్న వేళ జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత కరోనా వైరస్ రూపంలో జర్మనీ అతిపెద్ద సవాలును ఎదుర్కొంటుందని మెర్కెల్ ఓ టీవీషోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మెర్కెల్ మాట్లాడుతూ.. కరోనా రాకుండా దేశ పౌరులు పరిశుభ్రత పాటించాలని కోరారు. ప్రజలందరు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే కరోనాను విజయవంతంగా జయించవచ్చని తెలిపారు. ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని, కరచాలనం చేసుకోకుండా కేవలం కళ్ల ద్వారా మాత్రమే పలకరించుకోవాలని ఆమె ఇటీవల సూచించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో పౌరులకుండే ప్రయాణ హక్కును కాదనడం భావ్యం కాదని.. కానీ ఈ చర్యలన్ని పౌరులను కాపాడడం కోసమేనని పేర్కొన్నారు. కరోనా ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెర్కెల్ భరోసా కల్పించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను నివారించేందుకు అన్ని దేశాలు కీలక చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా 15 ఏళ్లు పదవిలో ఉన్న మెర్కెల్ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నారు. 2015లో శరణార్థుల సమస్య, బ్రెగ్జిట్, ఆర్థిక మందగమనం వంటి ఎన్ని సంక్షోభాలు ఎదురయినా ఆమె ఏనాడు ప్రజలకు నేరుగా సూచనలు ఇవ్వలేదు. -
ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవాలి
న్యూఢిల్లీ: భారత్, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ప్రధాని మోదీ మరిన్ని చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మెర్కెల్ శుక్రవారం మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించారు. వ్యూహాత్మక భాగస్వామ్యంతో సాగే పలు రంగాలైన రక్షణ, ఇంధనం, కృత్రిమ మేధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఒక అవగాహనకు వచ్చారు. అయిదవ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులకు (ఐజీసీ) నేతృత్వం వహించిన ఇరువురు పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలే పంపారు. ఇతర దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి తమ భూభాగాన్ని వాడుకుంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జర్మనీ చాన్స్‌లర్‌తో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయాలి : మోదీ నరేంద్రమోదీ, ఏంజెలా మెర్కెల్ చర్చలు పూర్తయ్యాక ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ దేశాలకు ఒక శాపంలా మారిన ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇరు దేశాలు ఉమ్మడి పోరాటం చేస్తాయని, ప్రపంచ దేశాలన్నీ తమతో చేతులు కలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి ప్రపంచదేశాలన్నీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కుల చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలను, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను, వారి నెట్‌వర్క్‌లను, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే సంస్థలను సర్వనాశనం చేయాలన్నారు. జర్మనీ వంటి సాంకేతిక, ఆర్థిక పరిపుష్టి కలిగిన దేశాల సహకారంతోనే భారత నవనిర్మాణం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాలు అంతరిక్షం, పౌరవిమానయానం, విద్య, వైద్యం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వంటి 17 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక సహకారం మరింత బలోపేతం కావాలి : మెర్కెల్ 5జీ, కృత్రిమ మేధ వంటి రంగాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఇరు దేశాలు మరింతగా సహకరించుకోవాలని ఏంజెలా మెర్కెల్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావాలన్నారు. మేకిన్ ఇండియా కోసం భారత్ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ సర్కార్ ఎంత కష్టపడుతోందో తెలుస్తుందని ఆమె కొనియాడారు. భారత్ జర్మనీ సహకారం తీసుకోవడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. -
భారత పర్యటనలో జర్మనీ ఛాన్సలర్
న్యూఢిల్లీ : జర్మనీ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేశారు. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆమెకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీలు ఘన స్వాగతం పలికారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌కు విచ్చేసిన ఆమె భారత్, జర్మనీ సత్సంబంధాలపై మాట్లాడారు. అనంతరం రాజ్‌ఘట్‌లో జాతిపిత మహాత్మ గాంధీకి నివాళులర్పించారు. నేటి పర్యటనలో భాగంగా మెర్కెల్ ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరగనుంది. దాదాపు 20 ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. రేపటి (శనివారం) పర్యటనలో భాగంగా మెర్కెల్ పలువురు వ్యాపారవేత్తలతో చర్చలు జరపనున్నారు. చివరగా ద్వారకా సెక్టార్ 21 మెట్రో స్టేషన్‌ను ఆమె సందర్శించనున్నారు. -
‘మరేం పర్లేదు.. బాగానే ఉన్నాను’
బెర్లిన్ : జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మార్కెల్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం జపాన్‌లోని ఒసాకాలో ప్రారంభమైన జీ 20 సమావేశాల్లో పాల్గొనేందుకు ఏంజెలా సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విమానం ఎక్కడానికి కొన్ని గంటల ముందు జర్మనీ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆమె హాజరయ్యారు. ఈ వేడుకలో అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టెర్ పక్కన నిల్చున్న ఏంజెలా వణకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆమె దగ్గరికి వచ్చి మంచినీళ్లు అందించబోయారు. కానీ ఏంజెలా సున్నితంగా వారి సహాయాన్ని నిరాకరించారు. కాసేపటి తర్వాత తనకు తానుగా నడుచుకుంటూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. కాగా గత మంగళవారం కూడా ఏంజెలా ఇలాగే అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఛాన్స్లర్ ఆరోగ్య విషయంలో ఆందోళన వ్యక్తమైన నేపథ్యంలో.. ఏంజెలా పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని ఆమె కార్యాలయ వర్గాలు తెలిపాయి. జీ 20 సమావేశంలో ఏంజెలా పాల్గొంటారని.. ఆమె పర్యటనలో ఎటువంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశాయి. కాగా ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఏంజెలా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అదే విధంగా యూరోపియన్ దేశాల్లో అత్యంత ప్రభావశీల నేతగా ఖ్యాతికెక్కిన ఏంజెలా.. 2021 వరకూ రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించిన విషయం విదితమే. వయసు పైబడటమే కాకుండా ఆరోగ్యం కూడా సహకరించనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక వచ్చే నెలలో ఆమె 65వ పడిలో అడుగుపెట్టనున్నారు. -
డీహైడ్రేషన్ వల్ల అలా అయిందంతే..
బెర్లిన్ : తన ఆరోగ్యం గురించి వస్తోన్న పుకార్లను ఖండిచారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్. కేవలం వేడి ఎక్కువగా ఉండటం మూలనా డిహైడ్రేషన్కు గురయినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఓ అధికారిక కార్యక్రమంలో భాగంగా మార్కెల్ ఉక్రేయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీని సందర్శించారు. ఈ క్రమంలో మిట్ట మధ్యాహ్నం ఎండలో నిల్చుని గౌరవ వందనం స్వీకరించారు మార్కెల్. దాంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురై వణకడం ప్రారంభించారు. పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను నీడకు చేర్చి మంచి నీళ్లు అందించి ప్రథమ చికిత్స చేశారు. ఈ క్రమంలో ఏంజెలా ఆరోగ్యం గురించి వదంతలు వ్యాప్తి చేందడం ప్రారంభించాయి. దాంతో ఈ విషయం గురించి ఆమె వివరణ ఇస్తూ.. ‘వేడి ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్‌కు గురయ్యానంతే. ఓ మూడు గ్లాసుల మంచి నీళ్లు తాగాను. దాంతో అంతా సర్దుకుంది’ అన్నారు మార్కెల్. 2014 ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న మార్కెల్ ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. రక్తపోటు పెరగడంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2021 వరకూ రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించారు మార్కెల్. వయసు పైబటమే కాక ఆరోగ్యం కూడా సహకరించనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. -
‘వరల్డ్ వార్ వన్’ విస్మరించిన జర్మనీ
బెర్లిన్ : ‘జర్మనీ జీవించేందుకు మేము చనిపోయాం. జర్మనీ జీవించడంలో మేము బతికుంటాం’ అన్న నినాదం బెర్లిన్‌లోని కొలంబియాడామ్ శ్మశానంలో నేల కొరిగిన ఓ సైనికుడి విగ్రహం పక్కన రాసి ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఏడువేల మంది జర్మనీ సైనికులు సంస్మరణార్థం ఈ విగ్రహాన్ని 1925లో అప్పటి జర్మనీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పిడికిలి మాత్రమే బయటకు కనిపించేలా బ్లాంకెట్ కప్పిన అమరసైనికుడి విగ్రహం నెత్తిన టోపీ, పక్కన తుపాకీ ఉన్నట్లుగా చెక్కిన ఈ రాతి విగ్రహం వద్ద మొదట్లో ప్రభుత్వ పెద్దలు, ప్రజలు పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించేవారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం అమర సైనికులను జర్మనీ దాదాపు విస్మరించింది. మొదటి సంవత్సరం యుద్ధం ముగిసి ఆదివారం నాటికి సరిగ్గా వందేళ్లు పూర్తియిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతోపాటు పారిస్‌లో వివిధ దేశాధినేతల సమక్షంలో భారీ ఎత్తున స్మారక కార్యక్రమాలు జరిగాయి. పారిస్ ఆహ్వానాన్ని అందుకున్నప్పటికీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. దేశంలో కూడా పెద్దగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఒక్క పార్లమెంట్ హాలులో స్మారక ఉపన్యాసంతో మొక్కుబడిగా నూరేళ్ల స్మారక దినాన్ని ముక్తిసరిగా ముగించింది. ఎందుకు? మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన నష్టం కంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువ నష్టం వాటిల్లడం. మొదటి ప్రపంచ యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధానికి కారణం కావడం కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా దేశం రాజరిక వ్యవస్థ నషించి రిపబ్లికన్ వ్యవస్థ ఏర్పడడం, ఆ రిపబ్లికన్ వ్యవస్థ నియంత హిట్లర్, నాజిజిం పుట్టుకకు కారణం అయింది. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి బెర్లిన్‌తోపాటు, దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారక భవనాలు, మ్యూజియంలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి అతి తక్కువ స్మారక మ్యూజియంలు ఉన్నాయి. కొలంబియాడామ్ శ్మశానంలోని అమర వీరుల సమాధాల వద్దగానీ, వారి స్మారక విగ్రహం వద్దకుగానీ పుష్మ నివాళులర్పించేందుకు ఈ మధ్య ఎవరూ రావడం లేదని స్థానికులు తెలిపారు. 2017లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలినా మార్కెల్ సైనిక స్మారక విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే ఈసారి ఆమె అక్కడికి కూడా పోలేదు. నాటి యుద్ధానికి కారణమైన దేశాల్లో జర్మనీ ఒకటి అవడమే కాకుండా ఆ యుద్ధంలో ఓటమిని అంగీకరించమనే ఆత్మన్యూనతా భావం వల్ల కూడా జర్మనీ నూరేళ్ల కార్యక్రమాన్ని పట్టించుకోక పోవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమం కోసం పలు దేశాలు ఏడాది ముందుగానే చరిత్రకారులతో, ఉన్నతాధికారులతో కమిటీలు వేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం, ప్రపంచంపై దాని ప్రభావం, ఫలితాలు అంశాలపై చరిత్రకారులతో పుస్తకాలు రాయించి ప్రచురించడంతోపాటు తమ దేశాల్లో పలు స్మారక భవనాలను కూడా నిర్మించాయి. సెమినార్లు, సదస్సులను నిర్వహించాయి. -
మోదీకి గట్టి షాకిచ్చిన కెనడియన్లు
ఒట్టావా : ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విదేశీ పర్యటనకు వెళ్లిన సందర్భాల్లో అక్కడ ఆయన క్రేజ్ గురించి తరచూ వార్తల్లో చూస్తుంటాం. అయితే కెనడియన్లు మాత్రం ఈ విషయంలో మోదీకి గట్టి షాకే ఇచ్చారు. అసలు మోదీ ఎవరో తమకు తెలీదంటూ ఓ సర్వేలో వారు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంగుస్ రెయిడ్ ఇన్స్టిట్యూట్(ఏఆర్ఐ) అనే సంస్థ కెనడియన్లపై ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 75 శాతం మంది కెనడియన్లు అసలు నరేంద్ర మోదీ అంటే ఎవరో తమకు తెలియదని చెప్పారు. జీ7 దేశాల సమావేశం నేపథ్యంలో జీ7, బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాధినేతల గురించి ప్రజల్లో ఏ మాత్రం అవగాహన ఉందని తెలుసుకోవటానికి ఈ సర్వే నిర్వహించారు. ‘మోదీ ఎవరు?’ ఈ విషయమై ఏఆర్ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షాచి కర్ల్ మాట్లాడుతూ.. ‘మా దగ్గర సరైన గణాంకాలు లేవు గానీ.. మోదీ ఎప్పుడూ ఇంగ్లీష్‌లో మాట్లాడలేదు. అందుకే పశ్చిమ దేశాల మీడియాను, ప్రజలను ఆయన అంతగా ఆకట్టుకోలేకపోయారనుకుంటా. ఇండియాతో ఉన్న వాణిజ్య సంబంధాల గురించి కెనడా ప్రజలకు అవగాహన ఉంది. కానీ మోదీకి ఇక్కడి ప్రజల్లో పాపులారిటీ లేదన్నది ఈ సర్వేతో స్పష్టమైంది. కెనడాలో ఆయనేమంత బిగ్ సెలబ్రిటీ కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ప్రభావంతమైన, వ్యూహాత్మకమైన, బలమైన నాయకత్వం కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందిన దేశాధినేతలు అనే మూడు అంశాల్లో మాత్రం కొంతమంది నరేంద్ర మోదీ తమకు తెలుసని కొందరు చెప్పారంటూ షాచి పేర్కొన్నారు. ‘ట్రంప్ ఓ దురహంకారి’ 24 పదాలతో ఓ జాబితాను తయారు చేసిన నిర్వాహకులు.. ఆయా దేశాల అధినేతలకు ఏ పదం సరిపోతుందో తెలపాలంటూ సూచించారు. అయితే ఈ సర్వేలో అత్యధికంగా 74 శాతం మంది కెనడియన్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అత్యంత దురహంకారిగా పేర్కొన్నారు. ‘అబద్దాలకోరు, నిజాయితీలేని వ్యక్తి, అవినీతిపరుడు’ అనే పదాలు ట్రంప్‌కు చక్కగా సరిపోతాయంటూ వారు అభిప్రాయపడ్డారు. ఈ జాబితాలో తమ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడోపై కెనడియన్లు మిశ్రమ అభిప్రాయాలను వ్యక్తం చేయటం కొసమెరుపు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్‌కు సర్వేలో టాప్ ర్యాంకు లభించగా.. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అత్యంత శక్తివంతమైన నేతగా, అత్యంత ప్రభావంతమైన వ్యక్తిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు కెనడియన్లు ఓటు వేశారు. -
మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారు...!
న్యూయార్క్ : ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులైన వ్యక్తుల జాబితా- 2018ను ఫోర్బ్స్ విడుదల చేసింది. 75 మందితో కూడిన ఈ జాబితాలో చైనా అధ్యక్షుడు మొదటి స్థానం దక్కించుకోగా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ 9వ స్థానంలో నిలిచారు. వివిధ రంగాల నుంచి శక్తిమంతులైన వ్యక్తుల జాబితా రూపొందించడానికి నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఎక్కువ మంది వ్యక్తులకు ప్రాతినిథ్యం వహించే దక్షత కలిగి ఉండటం, ఆర్థిక వనరులను నియంత్రించగలగడం, భిన్న రంగాలలో తమ ముద్ర వేయగలగడం, అధికారాన్ని చురుగ్గా వినియోగించుకోగలగడం వంటి అంశాల ఆధారంగా 75 మంది వ్యక్తులను ఎంపిక చేసినట్లు పేర్కొంది. భూగ్రహం మీద ఉన్న 7.5 బిలియన్ల జనాభా ఉందని.. తమ సామర్థ్యంతో ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉన్న75 మంది(మహిళలు, పురుషులు కలిపి)ని ఎంపిక చేశామని ఫోర్బ్స్ తెలిపింది. ఈ జాబితా సిద్ధం చేయడానికి 100 మిలియన్ వ్యక్తులకు ఒకరి చొప్పున ఎంపిక చేశామని పేర్కొంది. ఆయన ప్రపంచ నాయకుడు.. భారత ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రపంచ నాయకుడిగా ఎదిగారని ఫోర్బ్స్ ప్రశంసించింది. డొనాల్డ్ ట్రంప్, జిన్ పింగ్‌తో జరిపిన చర్చల్లో తనదైన ముద్ర వేశారని కొనియాడింది. అంతర్జాతీయ అంశాల్లో మోదీ కీలక వ్యక్తిగా మారారని, తన దేశంలోని గ్రామీణ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు ప్రవేశ పెట్టారని ప్రశంసలు కురిపించింది. 2016లో నోట్ల రద్దు ద్వారా గుణాత్మక మార్పులు చేపట్టి, అవినీతిని తొలగించేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని మోదీ తీసుకున్నారని ప్రశంసించింది. కాగా ‘జియో’తో టెలికాం రంగంలో సంచలన మార్పులు తీసుకువచ్చిన భారత కుబేరుడు ముఖేశ్ అంబానీ ఈ జాబితాలో 32వ స్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల 40వ స్థానాన్ని ఆక్రమించుకున్నారు. కొత్తగా ఎంపికైన వారు.. కాగా గతేడాది మొదటి స్థానం పొందిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది రెండో స్థానంతో సరిపెట్టుకోగా.. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మోర్కెల్ నాల్గో, అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ ఐదో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి అత్యంత శక్తిమంతుల జాబితాలో 17 మంది కొత్తగా స్థానం సంపాదించుకున్నట్లు ఫోర్బ్స్ పేర్కొంది. వీరలో సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్(8), అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పోవెల్(11), ఎగ్జాన్ మొబైల్ సీఈవో డారెన్ వుడ్స్(34), దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్(54), జస్టిస్ రాబర్ట్ మ్యూల్లర్(72) తదితరలు ఉన్నారు. -
20న మెర్కెల్‌తో ప్రధాని మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 20న జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో సమావేశం కానున్నారు. స్వీడన్, బ్రిటన్లలో పర్యటన అనంతరం తిరుగుప్రయాణంలో ఆయన బెర్లిన్‌లో కొద్ది సేపు ఆగనున్నారని విదేశాంగ శాఖ తెలిపింది. చాన్స్‌లర్ మెర్కెల్ సూచన మేరకు మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ సమావేశంలో ఇద్దరు నేతలు పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారని తెలిపింది. ఈనెల 16, 17వ తేదీల్లో ప్రధాని మోదీ స్వీడన్లో పర్యటించనున్నారు. స్వీడన్లో జరిగే నార్డిక్ దేశాల డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ ప్రధానమంత్రుల సమావేశంలో మోదీ పాల్గొంటారు. అనంతరం బ్రిటన్‌లో జరిగే కామన్వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొంటారు. -
ముస్లింలు కూడా మా వాళ్లే : మెర్కల్
బెర్లిన్ : ముస్లింలు తమ దేశానికి చెందినవారు కాదంటూ తన అంతర్గత వ్యవహారాల మంత్రి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కల్ జాగ్రత్త పడ్డారు. ముస్లింలు కూడా తమ దేశానికి చెందిన వారేనని, వారు కూడా ఇక్కడ మిగితా వారి మాదిరిగా హాయిగా జీవించొచ్చని చెప్పారు. ప్రస్తుతం స్వీడన్ పర్యటనలో ఉన్న ఆ దేశ ప్రధాని స్టీఫాన్ లాఫ్వెన్తో కలిసి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. 'మా దేశ సంస్కృతిలో ఇస్లాం కూడా ఒక భాగమే. క్రిస్టియానిటీ, జుడాయిజం మాదిరిగా మా దేశంలో ముస్లిం మతం కూడా ఉంది. జర్మనీలో నాలుగు మిలియన్ల మంది ముస్లింలు జీవిస్తున్నారు. వారి మతాన్ని పాటిస్తున్నారు. వారంతా ముమ్మాటికి జర్మనీకి చెందిన వారే.. వారి ఇస్లాం కూడా జర్మనీకి చెందినదే' అని ఆమె చెప్పారు. జర్మనీకి కొత్తగా వచ్చిన అంతర్గత వ్యవహారాల మంత్రి హాస్ట్ సీహోఫర్ ఓ జర్మనీ డెయిలీకి ఇంటర్వ్యూ ఇస్తూ ముస్లింలు జర్మనీకి చెందినవారు కాదని, దేశ సంప్రదాయాలు, సంస్కృతిలో వారు భాగం కాదని వేరు చేసి మాట్లాడారు. -
జర్మనీ అధినేత్రిగా మరోసారి ఆమెకే పట్టం!
న్యూఢిల్లీ: జర్మనీ అధినేత్రిగా నాలుగోసారి ఏంజెలా మెర్కెల్ పగ్గాలు చేపట్టబోతున్నారు. జర్మన్ పార్లమెంటు సభ్యులు బుధవారం మరోసారి దేశ చాన్స్‌లర్‌గా ఏంజెలాను ఎన్నుకున్నారు. ఇది ఆమెకు నాలుగో పర్యాయం. చివరిది అని కూడా భావిస్తున్నారు. 364 సభ్యులు ఉన్న జర్మనీ దిగువ సభలో 315 మంది ఆమెకు ఓటు వేశారు. తొమ్మిది మంది గైర్హాజరయ్యారు. 63 ఏళ్ల ఏంజెలాకు ఈసారి ప్రభుత్వాన్ని కొనసాగించడం అతిపెద్ద సవాలే కానుంది. పెద్దగా తన పార్టీకి పట్టులేని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏంజెలా నడిపించబోతున్నారు. తనను ఎన్నుకుంటూ చట్టసభ సభ్యులు వేసిన ఓటింగ్‌ను ఆమోదిస్తున్నట్టు ఏజెంగా బుధవారం పార్లమెంటు దిగువ సభలో పేర్కొన్నారు. -
ఫోర్బ్స్ నారీమణుల్లో మనోళ్లు 5
న్యూఢిల్లీ/న్యూయార్క్: ఫోర్బ్స్ పత్రిక ఈ సంవత్సరానికి గాను విడుదల చేసిన ప్రపంచపు వంద మంది అత్యంత శక్తివంతమైన మహిళల్లో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె ఈ స్థానాన్ని దక్కించుకోవటం ఇది 12వ సారి. అంతేకాక... మధ్యలో ఎక్కడా మిస్ కాకుండా ఏడేళ్లుగా వరసగా మెర్కెల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నారు. మన దేశం నుంచి చూస్తే ఐదుగురు మహిళలకు ఈ జాబితాలో స్థానం దక్కింది. వీరిలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ అగ్రస్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే ఈమె 32వ స్థానంలో ఉన్నారు. హెచ్‌సీఎల్ కార్ప్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా 57వ స్థానాన్ని, బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా 71వ స్థానాన్ని దక్కించుకున్నారు. హిందుస్తాన్ టైమ్స్‌ను ప్రచురించే హెచ్‌టీ మీడియా చైర్పర్సన్, ఎడిటోరియల్ డైరెక్టర్ శోభన భర్తియా 92వ స్థానంలో నిలవగా... హాలీవుడ్ కూడా వెళ్లిన బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా 97వ స్థానంలో ఉన్నారు. భారతీయ సంతతికి చెందిన పెప్సికో సీఈవో ఇంద్రా నూయి 11వ స్థానంలో నిలిచారు. ఇండో–అమెరికన్ నిక్కీ హేలీ 43వ స్థానంలో ఉన్నారు. టాప్‌లో థెరెసా మే, మిలిందా గేట్స్ ఫోర్బ్స్ ప్రపంచపు వంద మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఏంజెలా మెర్కెల్ తరవాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా యూకే ప్రధాని థెరెసా మే, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ నిలిచారు. ఇక ఫేస్బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ 4వ స్థానంలో, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా ఐదో స్థానంలో నిలిచారు. జాబితాలోకి కొత్తగా 23 మంది ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఇవాంకా ట్రంప్ కూడా(19వ స్థానం) ఉన్నారు. -
మళ్లీ మెర్కెల్‌దే పీఠం
బెర్లిన్: జర్మనీ పార్లమెంటు దిగువసభ బుందేస్టాగ్‌కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఏంజిలా మెర్కెల్ వరసగా నాలుగోసారి చాన్స్‌లర్ పదవి చేపట్టేందుకు అర్హత పొందారు. అయితే 33 శాతం ఓట్లు, 246 సీట్లు గెలిచిన ఆమె నేతృత్వంలోని క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్ (సీడీయూ)–క్రిస్టియన్ సోషల్ యూనియన్ (సీఎస్‌యూ) కూటమి... సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం పొందలేకపోయింది. దీంతో ఫ్రీ డెమోక్రాటిక్ పార్టీ (ఎఫ్డీపీ), గ్రీన్ పార్టీలతో కలసి ఆమె అధికారం చేపట్టే అవకాశం ఉంది. ఎఫ్డీపీ 10.7% ఓట్లతో 80 సీట్లను, గ్రీన్ పార్టీ 8.9% ఓట్లతో 67 స్థానాలను గెలుచుకున్నాయి. సీడీయూ–సీఎస్‌యూ కూటమితోపాటు ఈ రెండు పార్టీల సీట్లను కలిపితే మెర్కెల్‌కు పూర్తి ఆధిక్యం లభిస్తుంది. మరోవైపు ఇన్నాళ్లూ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, ఈ ఎన్నికల్లో మహా సంకీర్ణం నుంచి బయటకొచ్చి పోటీ చేసిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్పీడీ) 20.5 శాతం ఓట్లు, 153 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది. ప్రజలు తమను ప్రతిపక్షానికి పరిమితం చేసినందున ఆ పాత్రనే పోషిస్తామని మళ్లీ మెర్కెల్‌కు మద్దతిచ్చి ప్రభుత్వంలో చేరే ప్రశ్నే లేదని ఎస్పీడీ అధినేత మార్టిన్ షుల్జ్ చెప్పారు. అలాగే 12.6% ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచిన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టనుంది. ‘జమైకా’ సంకీర్ణానికే అవకాశం మెర్కెల్‌తో కలసి సాగడానికి ఎస్పీడీ, ఏఎఫ్‌డీ, లెఫ్ట్ పార్టీలు విముఖత చూపుతున్నందున ప్రభుత్వంలో చేరడానికి అవకాశం ఉన్న పార్టీలు ఎఫ్డీపీ, గ్రీన్స్ మాత్రమే. సీడీయూ–సీఎస్‌యూ కూటమి, ఎఫ్డీపీ, గ్రీన్స్...ఈ మూడు పార్టీల రంగులు జమైకా జాతీయ జెండాలో ఉంటాయి. ఈ మూడు కలసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానిని జమైకా సంకీర్ణం అంటారు. అయితే ఎఫ్డీపీ, గ్రీన్స్ పార్టీలు పరస్పర శత్రువులు. దీంతో వారిని బుజ్జగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మెర్కెల్‌కు కొంత సమయం పట్టనుంది. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని మెర్కెల్ ఫలితాల అనంతరం చెప్పారు. ఎన్నికల్లో ప్రజలు తమకు అనుకూలంగా ఓటేశారనీ, తమను కాదని మరే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆమె అన్నారు. ఈసారి సభ్యులెంత మంది... జర్మనీ ఫెడరల్ దిగువసభ బుందేస్టాగ్ సభ్యుల సంఖ్య స్థిరంగా ఉండదు. ప్రతి ఎన్నికల్లో వివిధ పార్టీలకు లభించే ఓట్ల ఆధారంగా స్థిర సీట్లకు కొన్ని సీట్లు కలుపుతారు. గత బుందేస్టాగ్‌లో మొత్తం 631 మంది సభ్యులుండగా, ఈసారి ఆ సంఖ్య 709కి పెరుగుతుంది. ఈ లెక్కన చాన్స్‌లర్‌గా ఎన్నికవడానికి మెర్కెల్‌కు 355 మంది సభ్యుల మద్దతు అవసరమౌతుంది. బుందేస్టాగ్‌లోని మొత్తం సభ్యుల్లో 299 మంది నియోజకవర్గాల నుంచి ఎన్నికైనవారైతే, దామాషా పద్ధతిలో మరో 299 మంది సభ్యులుగా నియమితులైనవారుంటారు. వారినే (598 మంది) రెగ్యులర్ సభ్యులంటారు. వారేగాక వివిధ పార్టీలకు మొదటి ఓటు(నియోజకవర్గాల్లో) సీట్లలో వచ్చిన ఓట్లు, రెండో ఓట్ల(దామాషా ఓట్లు) వివరాల ఆధారంగా హేంగోవర్, బ్యాలెన్స్ సీట్ల ప్రతినిధులుగా మరి కొంత మంది సభ్యులుగా చేరతారు. ఈ నాలుగు పద్ధతుల్లో బుందేస్టాగ్ సభ్యులయ్యేవారి సంఖ్య ఈసారి 709 ఉంటుంది. చాన్స్‌లర్‌గా దేశాధ్యక్షుడు నియమించాలంటే కనీసం 312 మంది సభ్యుల మద్దతు అవసరం. నియామకం తర్వాత కొత్త చాన్సలర్‌కు మెజారిటీ (355) ఉన్నదీ లేనిదీ తేల్చడానికి ఓటింగ్ జరుగుతుంది. ప్రస్తుత పాలక కూటమి పార్టీలు సీడీయూ, సీఎస్యూలకు గత ఎన్నికలతో పోల్చితే 65 సీట్లు తగ్గాయి. పాలక కూటమి నుంచి వైదొలగుతున్న ప్రధాన ప్రతిపక్షం ఎస్పీడీ(సోషల్ డెమొక్రాట్లు) 40 సీట్లు కోల్పోయింది. కిందటిసారి ఒక్క సీటూ సాధించని ఏఎఫ్‌డీ 94 సీట్లు కైవసం చేసుకుంది. ప్రతిపక్షంలోనే కొనసాగుతున్న లెఫ్ట్ పార్టీకి అదనంగా 5 సీట్లు లభించగా, గ్రీన్ పార్టీ మరో నాలుగు సీట్లు సంపాదించింది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
జర్మనీ చాన్స్‌లర్‌గా మెర్కెల్!
సాక్షి నాలెడ్జ్ సెంటర్: ఐరోపాలో అతిపెద్ద దేశమైన జర్మనీ పార్లమెంటులో దిగువ సభ బుందేస్టాగ్‌కు ఆదివారం ఎన్నికల పోలింగ్ ముగిసింది. ప్రస్తుత చాన్స్‌లర్ ఏంజిలా మెర్కెల్ (63) వరుసగా నాలుగోసారి అధికారం చేపడతారని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. అలాగే ఇస్లాంను, వలసలను వ్యతిరేకించే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (ఏఎఫ్‌డీ) పార్టీ తొలిసారిగా బుందేస్టాగ్‌లో అడుగుపెట్టనుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పోటీచేసిన సోషల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎస్పీడీ) ప్రస్తుత పాలక కూటమిలో భాగస్వామిగా ఉండటం విశేషం. జర్మనీలో రెండు ప్రధాన రాజకీయపక్షాలైన క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్ (సీడీయూ), ఎస్పీడీ కలిసి ప్రభుత్వాన్ని నడిపితే దాన్ని ‘మహా సంకీర్ణం’ (గ్రాండ్ కొయెలేషన్) అని పిలుస్తారు. ప్రస్తుత మహాసంకీర్ణం సజావుగా నడవడం లేదనీ, భవిష్యత్తులో దీనిని కొనసాగించకూడదని భావించిన ఎస్డీపీ ఈ ఎన్నికల్లో అధికారం కోసం సొంతంగా పోటీపడింది. చాన్స్‌లర్ పదవికి ఎస్పీడీ అభ్యర్థిగా 61 ఏళ్ల మార్టిన్ షూల్జ్ రంగంలోకి దిగారు. ఐరోపా కూటమి పార్లమెంటు అధ్యక్షునిగాను 2012, 2014లో షూల్జ్ ఎన్నికయ్యారు. ప్రతి నాలుగేళ్లకు ఓసారి బుందేస్టాగ్‌కు ఎన్నికలు జరుగుతాయి. తాజా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం మెర్కెల్ పార్టీకి 32.5–33.5 శాతం, ఎస్పీడీకి 20–21%, ఏఎఫ్‌డీకి 13–13.5% ఓట్లు వచ్చాయి. 2005లో తొలిసారిగా ఏంజిలా చాన్స్‌లర్ పదవి చేపట్టారు. ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ)–క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో ఆధిక్యం సాధించడంతో పన్నెండేళ్లుగా ఏంజిలానే చాన్స్‌లర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈసారి గెలిస్తే 16 ఏళ్లు అధికారంలో ఉండి, హెల్ముల్ కోల్ రికార్డును మెర్కెల్ సమం చేస్తారు. రెండు ఓట్లు–దామాషా పద్ధతి! జర్మనీలో ఓటు హక్కు కలిగినవారు ఆరు కోట్ల పదిహేను లక్షలమంది ఉన్నారు. బుందేస్టాగ్‌లో మొత్తం 598 మంది సభ్యులుంటారు. అందులో సగం మంది సభ్యులను(299 మంది) అంతే సంఖ్యలో ఉండే నియోజకవర్గాల నుంచి ఎన్నుకుంటారు. మిగిలిన సగం సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం(దామాషా పద్ధతి) ద్వారా ఎంపిక చేస్తారు. పోలింగ్ రోజు ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేస్తారు. ఒక ఓటు బుందేస్టాగ్‌లో తమ నియోజకవర్గ ప్రతినిధికి, రెండో ఓటు తమ కిష్టమైన రాజకీయ పార్టీకి వేసే హక్కు పౌరులకు ఉంది. మొదటి ఓటు ద్వారా 299 మంది బుందేస్టాగ్ సభ్యులు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికవుతారు. రెండో ఓటు ద్వారా మిగిలిన సగం మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు. కనీసం 5 శాతం ఓట్లు దక్కించుకున్న ప్రతి రాజకీయపక్షం అదే నిష్పత్తిలో సభ్యులను (299లో వాటా కింద) బుందేస్టాగ్ సభకు నామినేట్ చేసుకుంటుంది. 5% ఓట్లు కూడా రాని పార్టీకి ఈ పద్ధతిలో సభ్యులను పంపే అర్హత ఉండదు. -
మెర్కల్ నాలుగో గెలుపు ఖాయం?
-
గెలుపుబాటలో మెర్కెల్
‘ఉదారవాద పాశ్చాత్య ప్రపంచ ఆఖరి సంరక్షకురాలి’గా అందరి ప్రశంసలూ అందుకుంటున్న ఏంజెలా మెర్కెల్ ఆదివారం జరగబోయే జర్మనీ ఎన్నికల్లో ఆరు కోట్లమంది ఓటర్ల తీర్పు కోరబోతున్నారు. వరసగా నాలుగోసారి కూడా చాన్సలర్ పీఠం ఆమెదేనని వివిధ సర్వేలు ఇప్పటికే ప్రకటించడంతో ఒక్క జర్మనీ మాత్రమే కాదు, యావత్తు యూరప్ ఖండమే ఊపిరి పీల్చుకుంటోంది. ఆమె నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్(సీడీయూ)కు 37 శాతం ఓట్లు లభిస్తాయని, మెర్కెల్ ప్రధాన ప్రత్యర్థి మార్టిన్ షుల్జ్‌కు చెందిన సోషల్ డెమొక్రాట్స్(ఎస్పీడీ)కి 20 శాతం ఓట్లు మించవని ఆ సర్వేలంటున్నాయి. ఈ రెండు పక్షాలూ 2013 నుంచి దేశాన్నేలుతున్న సంకీర్ణ కూటమిలో భాగస్వామ్య పక్షాలు కావడం విశేషం. 2005లో తొలిసారి అధికార పగ్గాలు స్వీకరించినప్పటినుంచి తిరుగులేని నాయకురాలిగా గుర్తింపు పొందుతూ వస్తున్న మెర్కెల్... రెండేళ్లక్రితం సిరియా, అఫ్ఘానిస్తాన్, ఇరా క్ల నుంచి వెల్లువెత్తిన వలసల తర్వాత బలహీనపడిన జాడలు కనబడ్డాయి. చెప్పా లంటే వలసలొక్కటే కాదు... జర్మనీతోపాటు వివిధ యూరప్ దేశాల్లో ఇటీవల పెరి గిన ఉగ్రవాద దాడులు కూడా ఆమె ఉదారవాద వ్యవహారశైలిని తప్పుబట్టేందుకు కారణమయ్యాయి. ఇతర దేశాలతో పోలిస్తే జర్మనీలో జరిగిన ఉగ్రవాద దాడుల సంఖ్య లేదా వాటిల్లో ప్రాణనష్టం చాలా స్వల్పం. అయినా సరే జర్మనీ ప్రజానీకాన్ని అవి ఆలోచనలో పడేశాయి. వీటికితోడు ఫ్రాన్స్‌లో ఆమధ్య బలంగా వీచిన తీవ్ర మితవాద, జాతీయవాద భావాలు కూడా జర్మనీని ప్రభావితం చేశాయి. ఫ్రాన్స్ లోని బెర్లిన్‌లో ఉగ్రవాద దాడి జరిగినప్పుడు యూరప్కొచ్చిపడుతున్న వలసలకూ, ఈ దాడులకూ మధ్య సంబంధం ఉన్నదని స్వయంగా మెర్కెల్ చేసిన వ్యాఖ్య చివ రికి ఆమెనే చుట్టుకుంది. ఒకపక్క జర్మనీకి వలస వచ్చిన 10 లక్షలమంది పౌరులకు సాదర స్వాగతం పలికిన మెర్కెలే ఈ మాదిరి విశ్లేషణ చేయడం తీవ్ర మితవాద పక్షమైన ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ(ఏఎఫ్‌డీ) పార్టీకి అందివచ్చింది. యూరప్ యూని యన్(ఈయూ) నుంచి బయటకు రావాలన్న మితవాదులదే బ్రిటన్‌లో పైచేయి కావడం, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోట్రంప్ విజయం సాధించడంలాంటి ధోరణులు జర్మనీలోని తీవ్ర మితవాద పక్షాలకు మరింత ఊతమిచ్చాయి. అయితే ఈ క్రమాన్నంతటినీ మెర్కెల్ జాగ్రత్తగా గమనిస్తూ తన ఆలోచనల్ని సవరించుకున్నారు. వలసలపై తన విధానాన్ని మార్చుకుని టర్కీతో వలస వ్యతిరేక ఒప్పందం కుదుర్చుకున్నారు. కఠినమైన వలస చట్టాలను తీసుకొచ్చారు. కీలకమైన విభాగాల్లో పనిచేసే మహిళా సిబ్బంది బుర్ఖాలు ధరించడాన్ని నిషేధిస్తూ పార్లమెంటులో చట్టం తెచ్చారు. చట్టవిరుద్ధమైన శరణార్ధుల్ని తిప్పి పంపే ప్రక్రి యను ప్రారంభించారు. నేర చరిత్ర ఉన్న 50మంది అఫ్ఘాన్ దేశస్తులను ప్రత్యేక విమానంలో కాబూల్‌కు తిప్పి పంపారు. భద్రతా విభాగాలకు ప్రాధాన్యం పెంచారు. నిఘా సంస్థల అధికారాలను పెంచారు. రెండేళ్లక్రితం పారిస్ ఉగ్రవాద దాడి జరిగాక తమ దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఫ్రాన్స్ అప్పటి అధ్య క్షుడు హొలాండ్ స్థాయిలో తీవ్ర చర్యలు తీసుకోలేదుగానీ మెర్కెల్ విధించిన పరిమితులు కూడా తక్కువేం కాదు. తీవ్ర మితవాద పక్షాల ప్రచారానికి బెదిరి మెర్కెల్ అటువైపు అడుగులేస్తున్నారని వామపక్షాలు విమర్శించినా ఆమె ఎప్పటికప్పుడు సవరణలు చేసుకుంటూనే వచ్చారు. తాను గెలిస్తే స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత తీసుకొస్తానని ఎస్డీపీ నాయకుడు మార్టిన్ షుల్జ్ ప్రకటించిన మర్నాడే మెర్కెల్ సైతం అందుకు తానూ అనుకూలమేనంటూ ప్రకటన చేశారు. జర్మనీకి ఉగ్రవాద బెడద ఒక్కటే కాదు... మరికొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వార్షిక వృద్ధి రేటు సంతృప్తికరంగానే ఉన్నా సంపద స్వల్ప సంఖ్యలో ఉన్న సంపన్నుల వద్దే కేంద్రీకరణ అవుతున్నదన్న అభియోగం ఉంది. ధనిక–పేద అంతరాలు బాగా పెరిగాయి. దేశంలో ప్రజాస్వామిక వాతావరణం కుంచిం చుకుపోతున్నదన్న అభిప్రాయం ఉంది. అయితే నిరుద్యోగం కనిష్ట శాతానికి పడి పోవడం, ఉపాధి అవకాశాల్లోగానీ, మాంద్యాన్ని నియంత్రించడంలోగానీ యూరప్ లోని ఇతర దేశాలతో పోలిస్తే జర్మనీ మెరుగైన స్థితిలో ఉండటం మెర్కెల్‌కు బలమైన అనుకూలాంశాలయ్యాయి. 2005లో తొలిసారి ఆమె చాన్సలర్ అయి నప్పుడు సంకీర్ణ కూటమిలోని క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ)తో కలిసి సాధించిన ఓట్ల శాతం 35.2 అయితే 2009 ఎన్నికల్లో అది 40.9 శాతానికి చేరింది. 2013లో 45.3 శాతం సాధించి సోషల్ డెమొక్రటిక్ పార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటినుంచి ఒడుపుగా బయటపడటమెలాగో మెర్కెల్‌కు తెలిసినంతగా ఆమె ప్రత్యర్థులకు తెలియదు. అయితే ఈ ఎన్నికలను మెర్కెల్ తేలిగ్గా తీసుకోలేదు. ప్రతి ఘట్టంలోనూ అప్రమత్తంగా ఉంటూ, లోటుపాట్లను సరిదిద్దుకున్నారు. అమెరికా ఎన్నికలను రష్యా హ్యాకర్లు ప్రభావితం చేసిన తీరును, ఓటర్ల మనోభావాలను మలిచిన తీరును నిపుణులతో చర్చించి అలాంటి పరిస్థితులు జర్మనీలో పునరావృతంకాకుండా తీసు కోవాల్సిన వ్యూహాలను రచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను చలామణి చేసే గ్రూపులను ఎప్పటికప్పుడు గమనించి ప్రతిదాడి చేసేం దుకు పార్టీ తరఫున ప్రత్యేక బృందాలు నియమించారు. అదే సమయంలో ప్రజల్ని పక్కదోవ పట్టించే చట్టవిరుద్ధమైన అంశాలను ఫిర్యాదు వచ్చిన వెంటనే తొల గించని ఫేస్బుక్ వంటి సంస్థలకు భారీ జరిమానా వేసే విధంగా చట్టం తీసు కొచ్చారు. జర్మనీ ఓటర్లు ఎటూ ఒక పార్టీకే గుత్తగా అధికారం ఇవ్వరు. అయితే ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్న ఎస్డీపీతోనే ఎన్నికల అనంతరం మెర్కెల్ కలిసి నడు స్తారా లేక కొత్త మిత్రుల్ని వెదుక్కుంటారా అన్నది ఆసక్తికరం. జర్మనీకి మాత్రమే కాదు... మొత్తం యూరప్‌కే నేతగా ఎదిగిన మెర్కెల్ ఈసారి విజేతయ్యాక జర్మన్‌గా కాక యూరపియన్గా ఆలోచించి నడుచుకోవాల్సి ఉంటుంది. -
మెర్కల్ నాలుగో గెలుపు ఖాయం?
జర్మనీ చాన్సలర్ ఏంజిలా మెర్కల్ (63) వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టడానికి ఓటర్లు అనుకూలంగా ఉన్నారని తాజా ఎన్నికల సర్వేలు చెబుతున్నాయి. ఆదివారం ఐరోపాలో అతి పెద్ద దేశమైన జర్మనీ దిగువసభ బుందేస్టాగ్‌కు ఎన్నికలు జరుగుతాయి. 598 మంది సభ్యులుండే బుందేస్టాగ్‌లోని సగం మంది సభ్యులను(299) అంతే సంఖ్యలో ఉండే నియోజకవర్గాల నుంచి ఎన్నుకుంటారు. మిగిలిన సగం సభ్యులను నైష్పత్తిక ప్రాతినిధ్య విధానం(దామాషా పద్ధతి) ద్వారా ఎంపిక చేస్తారు. 2005లో తొలిసారి ఏంజిలా చాన్సలర్ పదవి చేపట్టారు. ప్రతి నాలుగేళ్లకు జరిగే బుందేస్టాగ్ ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ)-క్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ) కూటమి 2009, 2013 ఎన్నికల్లో మెజారిటీ సాధించడంతో పన్నెండేళ్లుగా చాన్సలర్ పదవిలో కొనసాగుతున్నారు. ఈ నెల 24 ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా పోటీచేస్తున్న సోషల్ డెమొక్రాటిక్ పార్టీ(ఎస్పీడీ) ప్రస్తుత పాలక కూటమి సభ్యులైన సీడీయూ-సీఎస్‌యూతో కలిసి అధికారంలో ఉండడం విశేషం. జర్మనీలో రెండు ప్రధాన రాజకీయపక్షాలు (సీడీయూ, ఎస్పీడీ) కలిసి ప్రభుత్వాన్ని నడిపితే దాన్ని మహా సంకీర్ణం అని పిలుస్తారు. ప్రస్తుత మహాసంకీర్ణం సజావుగా నడవడం లేదనీ, భవిష్యత్తులో వద్దని భావించిన సోషల్ డెమోక్రాట్లు అధికారం కోసం సొంతంగా పోటీపడుతున్నారు. చాన్సలర్ పదవికి ఎస్పీడీ అభ్యర్థిగా 61 ఏళ్ల మార్టిన్ షూల్జ్ రంగంలోకి దిగారు. ఆయన యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షునిగా 2012లో, మళ్లీ 2014లో ఎన్నికయ్యారు. ఇంకా వామపక్షాలు, గ్రీన్ పార్టీ కూడా ఎన్నికల్లో పోటీచేస్తున్నాయి. రెండు ఓట్లు-దామాషా పద్ధతి! 18 ఏళ్లు నిండి ఓటేసే అర్హత ఉన్న జనం జర్మనీలో ఆరు కోట్ల పదిహేను లక్షలమంది ఉన్నారు. పోలింగ్ రోజు ప్రతి ఓటరూ రెండు ఓట్లు వేసే వీలు కల్పించారు. ఒక ఓటు పార్లమెంటులో(బుందేస్టాగ్) తమ నియోజకవర్గ ప్రతినిధికి, రెండో ఓటు తమ కిష్టమైన రాజకీయ పార్టీకి వేసే హక్కుంది. మొదటి ఓటు ద్వారా 299 మంది బుందేస్టాగ్ సభ్యులు ఆయా నియోజకవర్గాల నుంచి ఎన్నికౌతారు. రెండో ఓటు ద్వారా మిగిలిన సగం మందిని దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు. కనీసం 5శాతం ఓట్లు దక్కించుకున్న ప్రతి రాజకీయపక్షం అదే నిష్పత్తిలో సభ్యులను(299లో వాటా కింద) బుందేస్టాగ్ సభకు నామినేట్ చేసుకుంటుంది. ఐదు శాతం ఓట్లు రాని పార్టీకి ఈ పద్ధతిలో ఒక్క సభ్యుడిని కూడా పంపుకునే అర్హత ఉండదు. అంటే సగం సీట్లకు ఇండియాలోని లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో (మాదిరిగా మిగిలినవారి కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి గెలిచే విధానం) పద్ధతిని, మిగిలిన సగం సీట్లకు దామాషా పద్ధతిని జర్మనీలో అనుసరిస్తున్నారు. ఈ కారణంగా బుందేస్టాగ్‌లో ఏ ప్రధాన రాజకీయ పక్షానికి సంపూర్ణ మెజరిటీ సాధించే అవకాశాలు లేవు. 1954లో పూర్వపు కమ్యూనిస్ట్ తూర్పు జర్మనీ(జీడీఆర్) జన్మించి అక్కడే పెరిగిన ఏంజిలా మెర్కల్ యువ కమ్యూనిస్ట్‌గా కొంతకాలం ఉన్నారు. 1990 జర్మనీ ఏకీకరణ తర్వాత నెమ్మదిగా సీడీయూలో చేరి మొదట బుందేస్టాగ్‌కు ఎన్నికయ్యారు. 1991లో చాన్సలర్ హెల్మట్ కోల్ కేబినెట్లో మహిళలు, యువజన శాఖ మంత్రిగా చేరారు. 2000లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని, 2002లో బుందేస్టాగ్‌లో సీడీయూ నాయకత్వాన్ని చేపట్టారు. 51 ఏళ్ల వయసులో ఆమె మూడేళ్ల తర్వాత జర్మనీ చాన్సలర్‌గా ఎన్నికయ్యారు. 2009, 2013 తర్వాత వరుసగా నాలుగోసారి చాన్సలర్‌గా ఎన్నికవడం ఖాయమని రాజకీయ పండితులు అంచనావేస్తున్నారు. (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
పుతిన్‌ది సోదని మెర్కల్ కళ్లు గిర్రున తిప్పేశారు
హాంబర్గ్: ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ 20 శిఖరాగ్ర సమావేశాల్లో చాలా విచిత్రమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్య హావభావాలు దర్శనమివ్వడంతోపాటు, డైలాగ్‌లు పేలుతున్నాయి. అదీకాకుండా ఈ సదస్సులో తొలుత కెమెరాలన్నీ కూడా ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులపై ఫోకస్ చేశాయి. ఆ ఇద్దరిలో ఒకరు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కాగా మరొకరు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్. వీరిద్దరి మధ్య గోప్యంగా సంబంధాలు ఉన్నాయని ఇప్పటికే మీడియాలో కథనాలు వచ్చిన నేపథ్యంలో కెమెరాలన్నీ వారి వైపే తిరిగాయి. అయితే, అదే పనిలో ఉన్న మీడియా కెమెరాలు అనూహ్యంగా పుతిన్ వైపు జర్మనీ ఛాన్స్లర్ ఎంజెలా మెర్కల్ వైపు మళ్లాయి. ఆ సమయంలో ఒక విచిత్రమైన సన్నివేశం కనిపించింది. మెర్కల్ ఏదో విషయాన్ని పుతిన్‌తో చాలా సీరియస్‌గా చెబుతోంది. అది విన్న పుతిని దానికి అడ్డు చెబుతూ తన అభిప్రాయాన్ని వివరిస్తుండగా అబ్బో చెప్పావులో బహుబాగు అన్నట్లుగా ఆమె తన కళ్లను గిర్రున తిప్పారు. ఈ సీన్ మీడియా కళ్లలో పడగానే సోషల్ మీడియాలో పెట్టగా భారీగా చక్కర్లు కొడుతోంది. -
ఉగ్ర స్థావరాల అంతమే లక్ష్యం
► జీ 20 దేశాల ఉమ్మడి ప్రకటన.. ► హాంబర్గ్‌లో కూటమి సదస్సు ప్రారంభం హాంబర్గ్: ఉగ్రవాదంపై పోరు, వాతావరణ మార్పులు, స్వేచ్ఛా వాణిజ్య విస్తరణే లక్ష్యంగా జర్మనీలోని హాంబర్గ్‌లో శుక్రవారం జీ20 దేశాల సదస్సు ప్రారంభమైంది. మొత్తం 19 దేశాల అధినేతలతో పాటు యూరోపియన్ యూనియన్ ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు. జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సభ్య దేశాల అధినేతలకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య చర్చలు ఈ సదస్సులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు చేయాలని, అదే సమయంలో ఉగ్రసాయానికి చెక్ పెట్టేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని జీ20 సదస్సు తీర్మానించింది. శుక్రవారం తొలి రోజు భేటీ అనంతరం జీ20 దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ.. ప్రపంచంలో ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలన్నింటినీ అంతమొందించాలని నిర్ణయించినట్లు అందులో పేర్కొన్నాయి. ‘ఉగ్రవాదుల్ని చట్టం ముందు నిలబెట్టాలి. అందుకోసం భద్రత, ప్రయాణం, వలసలు, ఇంటర్‌పోల్ తదితర విభాగాల్లో ప్రస్తుతమున్న అంతర్జాతీయ సమాచార వ్యవస్థను మెరుగుపర్చాలి. ఉగ్రవాదుల విదేశీ ప్రయాణ ఉద్దేశ్యాన్ని ముందుగానే గుర్తించేలా నిఘా విభాగాలు తమ మధ్య సహకారాన్ని పెంపొందించుకోవాలి. ఉగ్రవాదుల లక్ష్యమేంటి.. వారి గమ్యస్థానం ఏమిటి? అన్న సమాచారం పంచుకోవాలి. ప్రపంచంలో ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలు ఉండకూడదు. విమానయాన రంగంలో భద్రతా వ్యవస్థలకు పొంచి ఉన్న ముప్పు, ఇతర ప్రమాదాల్ని గుర్తించేందుకు ఒకరికొకరు సహకరించుకోవాలి. ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అడ్డుకునేందుకు కట్టుబడి ఉన్నాం. ఉగ్రవాదులకు చేరే నిధులకు అడ్డుకట్ట వేసేలా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలి. ఐసిస్, అల్‌కాయిదా, డాయేష్ తదితర ఉగ్రవాద సంస్థలకు అందుతున్న ఆర్థిక సాయాన్ని అడ్డుకునేందుకు చర్యల్ని బలోపేతం చేయాలి. ఉగ్రసాయం విషయంలో ప్రపంచంలో ఎలాటి సురక్షిత ప్రదేశాలు ఉండకుండా చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులు తమ లక్ష్యాల కోసం ఇంటర్నెట్, సోషల్ మీడియా వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయాల’ని ఉమ్మడి ప్రకటనలో జీ 20 దేశాలు వెల్లడించాయి. సదస్సు ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు కరచాలనంతో ఒకరినొకరు పలకరించుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరిపారు. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ.. ‘పుతిన్, నేను అనేక అంశాలపై సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిపామ’ని పేర్కొన్నారు. జీ20 సదస్సు సందర్భంగా జపాన్, దక్షిణ కొరియా, కెనడా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, వియత్నాం దేశాధినేతలతో మోదీ విడిగా చర్చించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, బ్రిటన్ ప్రధాని మే, జర్మనీ చాన్సలర్ మెర్కెల్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రన్‌తో కొద్దిసేపు ముచ్చటిస్తూ కనిపించారు. పెట్రో బాంబులతో దాడి సదస్సుకు వ్యతిరేకంగా హాంబర్గ్‌లో ఆందోళనలు, హింసాఘటనలు జరిగాయి. కొందరు పెట్రోల్ బాంబులతో కార్లకు నిప్పుపెట్టారని.. పరిస్థితిని అదుపులోకి తెచ్చామని పోలీసులు తెలిపారు. ఆందోళనకారులు పలు దుకాణాల అద్దాల్ని పగులకొట్టడంతో పాటు, పోలీసు హెలికాప్టర్ల సమీపంలో మంటలతో కలకలం రేపారు. -
‘పెళ్లి స్త్రీ, పురుషుడికి మధ్యే జరగాలి.. కానీ’
బెర్లిన్: జర్మనీలో స్వలింగ సంపర్కులు విజయం సాధించారు. వారు పెళ్లిళ్లు చేసుకునేందుకు జర్మనీ పార్లమెంటు ఓకే చెప్పింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు శుక్రవారం తెరపడింది. స్వలింగ సంపర్కుల వివాహం అంశంపై ప్రవేశపెట్టిన బిల్లుకు జర్మనీ పార్లమెంటు ఆమోదం తెలిపింది. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్‌తో సహా ఆమె పార్టీలోని పలువురు ఈ బిల్లును వ్యతిరేకించినా అది చట్టంగా రూపుదాల్చడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంజెలా మెర్కెల్ మాట్లాడుతూ ‘నేను గేల పెళ్లిళ్లకు వ్యతిరేకంగా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇది నా వ్యక్తిగతం. నా దృష్టిలో పెళ్లి అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్యే జరగాలి. పార్లమెంటు సమాజంలో మరింత మార్పును ఆశించిందేమో’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జర్మనీ చట్టంలో కొత్తగా మార్పు చేసిన ప్రకారం ‘ఒక స్త్రీ పురుషుడు, లేదా స్వలింగ వ్యక్తుల జీవితాల్లోకి వివాహం అడుగుపెట్టింది’ అని కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఈ బిల్లుకు లెప్టిస్ట్ పార్టీలు బాగా మద్దతిచ్చాయి. తాజాగా చేసిన చట్టం ద్వారా స్వలింగ సంపర్కులకు కేవలం వివాహ అవకాశం మాత్రమే కాకుండా పిల్లలను కూడా దత్తత తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇదివరకే జర్మనీ ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించగా తాజాగా దిగువ సభలో ఈ బిల్లు 393/226 ఓట్లతో పాసయి చట్టంగా రూపుదాల్చనుంది. ఈ ఏడాది చివరినాటికి ఈ చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. -
మనం మేడ్ ఫర్ ఈచ్ అదర్: మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కలిసి ఎనిమిది ప్రధాన ఒప్పందాల మీద సంతకాలు చేశారు. భారత జర్మనీ ఒప్పందాల్లో ఫలితాలు రాబట్టే విషయాలపైనే ఎక్కువగా దృష్టిపెట్టామని, ప్రధానంగా ఆర్థిక బంధాలను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చెప్పారు. ఈ రెండు దేశాలు 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' అని ఆయన అభివర్ణించారు. భారతదేశం చాలా నమ్మదగ్గ భాగస్వామి అని ఏంజెలా మెర్కెల్ ప్రశంసించారు. జర్మనీ ఇక ఎంతో కాలం పాటు అమెరికా, బ్రిటన్ లాంటి సంప్రదాయ భాగస్వాముల మీద ఆధారపడటం కుదరదని ఆమె చెప్పారు. ఈయూ-ఇండియా స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందాలపై ప్రధాని మోదీ, మెర్కెల్ చర్చించారు. చైనా ప్రతిపాదిస్తున్న సిల్క్ రోడ్ వాణిజ్యంపై తమకున్న అసంతృప్తిని మోదీ స్పష్టంగా చెప్పారు. వచ్చే నెలలో హాంబర్గ్‌లో జరిగే జి20 సదస్సులో వీరిద్దరూ మరోసారి భేటీ కానున్నారు. అప్పుడు దక్షిణ చైనా సముద్రం, హిందూ మహా సముద్రంలో చైనా సైనిక విస్తరణ గురించి చర్చ జరిగే అవకాశం ఉంది. భారత్, జర్మనీలు చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశాలని, పెద్ద ఆర్థిక వ్యవస్థలని, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలలో కీలక భాగస్వాములని మోదీ అభివర్ణించారు. జర్మనీ పర్యటన ముగిసిన తర్వాత ఆయన స్పెయిన్, ఫ్రాన్స్, రష్యాలలో కూడా పర్యటించనున్నారు. -
బెర్లిన్ చేరుకున్న ప్రధాని మోదీ
బెర్లిన్ : విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం బెర్లిన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన జర్మనీ ఛాన్సులర్ ఏంజెలా మెర్కెల్‌లో సమావేశం కానున్నారు. ఆరురోజుల పర్యటనలో భాగంగా మోదీ నాలుగు దేశాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆయన జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటన సాగనుంది. ఆర్థిక పరమైన సహకారం, రక్షణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూక్లియర్, వాణిజ్య రంగాలకు సంబంధించి ఆయా దేశాలతో మోదీ పరస్పర చర్చలు జరుపుతారు. దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత ప్రధాని స్పెయిన్‌లో పర్యటించడం ఇదే ప్రథమం ఈ పర్యటనలో భాగంగా మోదీ కొత్తగా ఎన్నికైన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువల్ మెక్రాన్‌తో భేటీ కానున్నారు. మోదీతో పాటు మంత్రులు హర్షవర్థన్, పియూష్ గోయిల్, నిర్మలా సీతారామన్‌తో పాటు ఎంజే అక్బర్ కూడా విదేశీ పర్యటనలో ఉన్నారు. -
తలపై స్కార్ఫ్ కప్పుకోకుండానే పర్యటన!
రియాద్: జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ తలపై స్కార్ఫ్ కప్పుకోకుండానే సౌదీ అరేబియా పర్యటనకు రావడం గమనార్హం. పశ్చిమ నగరం జెడ్డాలో ఆమెకు సౌదీ రాజు సల్మాన్, ఇతర అధికారులు సోమవారం స్వాగతం పలికారు. ఇంధన సంపన్న దేశమైన సౌదీతో ద్వైపాక్షిక చర్చల నిమిత్తం మెర్కెల్ సౌదీ పర్యటనకు వచ్చారు. ఇటీవల సౌదీకి వచ్చిన పలువురు విదేశీ మహిళా ప్రముఖులు తలపై స్కార్ఫ్ కప్పుకొని దేశ సంప్రదాయాన్ని పాటించారు. ఇస్లామిక్ సంప్రదాయవాద దేశమైన సౌదీలో మహిళలపై కఠినమైన ఆంక్షలు ఉంటాయి. మహిళలు బయటకు వచ్చినప్పుడు తలనుంచి అరికాళ్ల వరకు కనిపించకుండా దుస్తులు లేదా, బురఖా ధరించాలి. వెంట్రుకలు కనిపించకుండా తలపై స్కార్ఫ్ ధరించాలి. సంరక్షకుడు లేకుండా బయటకు వెళ్లకూడదు. వాహనాలు నడపడంపై నిషేధం ఉంటుంది. అయితే, విదేశీ సందర్శకులకు ఈ ఆంక్షలు వర్తించబోవు. గతంలో సౌదీ పర్యటనకు వచ్చిన థెరిస్సా మే, హిల్లరీ క్లింటన్, మిషెల్లీ ఒబామా సైతం తలపై స్కార్ఫ్ ధరించలేదు. సౌదీలో అణచివేతకు గురవుతున్న మహిళలకు మద్దతుగా తాను స్కార్ఫ్ ధరించడం లేదని గతంలో ఆ దేశ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని మే పేర్కొన్నారు. -
ట్రంప్‌కు వినిపించలేదేమో...
మెర్కెల్‌కు షేక్‌హ్యాండ్ తిరస్కరణపై వైట్‌హౌస్ ప్రతినిధి వివరణ బెర్లిన్: గతవారం శ్వేతసౌధంలో మీడియా సమావేశం సందర్భంగా జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మెర్కెల్‌తో కరచాలనం చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరాకరించలేదని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. షేక్‌హ్యాండ్ కోసం మెర్కెల్ చేసిన సూచనను ట్రంప్ వినకపోయి ఉండొచ్చని ఆయన ఆదివారం ఓ జర్మనీ పత్రికతో చెప్పారు. శుక్రవారం మెర్కెల్ అమెరికా పర్యటన సుహృద్భావ వాతావరణంలో ప్రారంభమైంది. శ్వేతసౌధం ప్రవేశం వద్ద ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. అయితే ఓవల్ కార్యాలయంలో మీడియా ముందు మరోసారి కరచాలనం చేయాలన్న మెర్కెల్ సూచనను ట్రంప్ పట్టించుకోకపోవడం చర్చనీయాంశమైంది. దాదాపు 30 నిమిషాలు జరిగిన ఆ మీడియా సమావేశంలో వారిరువురు నాటో, రక్షణ వ్యయం, స్వేచ్ఛా వాణిజ్యం గురించి మాట్లాడినా ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది తక్కువే. వైట్‌హౌస్‌లో మెర్కెల్‌తో చర్చల సందర్భంగా ట్రంప్ ఒక్కసారి కూడా ఆమె కళ్లలోకి చూసి మాట్లడలేదని జర్మన్ పత్రిక బిల్డ్ తెలిపింది. -
ఏంజెలాతో భేటీలో ట్రంప్ కంపు ప్రవర్తన!
కరచాలనం చేయాల్సిందిగా కోరిన మెర్కెల్ అయినా నిరాకరించిన ట్రంప్.. ఆమె వైపు కన్నెత్తి కూడా చూడని అధ్యక్షుడు న్యూయార్క్: అంతర్జాతీయ నాయకులతో కరచాలనానికి ఎప్పుడూ ముందుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జర్మన్ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో మాత్రం ఒకింత వికృతంగా వ్యవహరించారు. విలేకరుల సమావేశంలో ఆనవాయితీ ప్రకారం ఏంజెలా-ట్రంప్ కరచాలనం చేయాల్సిందిగా విలేకరులు కోరారు. దీంతో ఉత్సాహంతో 'మీరు నాతో కరచాలన చేస్తారా' అని మెర్కెల్ ట్రంప్‌ను అడిగారు. ట్రంప్ ఆ మాట వినిపించుకోనట్టే వ్యవహరించారు. ఆమె వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ట్రంప్ తీరుతో బిత్తరపోయిన ఆమె ఏం చేయాలో తెలియక ఒకింత తికమకపడ్డారు. ట్రంప్ ఇచ్చిన ఈ షాక్‌తో ఆమె ఇబ్బందికి లోనైనట్టు ఆమె హవాభావాల్లో స్పష్టంగా కనిపించింది. అమెరికా పర్యటనకు వచ్చిన సందర్భంగా ట్రంప్‌తో ఏంజెలా భేటీ అయ్యారు. ఓవల్ కార్యాలయంలో వారి భేటీ అనంతరం విలేకరులతో ఫొటో పోజ్ సందర్భంగా ఈ వికృత ఘటన చోటుచేసుకుంది. ట్రంప్ గతంలో అమెరికా పర్యటనకు వచ్చిన జపాన్ ప్రధాని షింజో అబే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడోలతో భేటీ అయిన సందర్భంగా వారితో కరచాలనం చేశారు. అయితే, ప్రవాసులు, శరణార్థుల విషయంలో విభేదాల కారణంగానే ఏంజెలాతో ట్రంప్ అయిష్టంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె గురించి ఒక్క ప్రశంస కూడా చేయకపోగా.. ప్రవాసులు విషయంలో ఆమెకు ట్రంప్ క్లాస్ ఇచ్చినట్టు సమాచారం. -
ట్రంప్ వద్దకు మెర్కెల్.. టెన్షన్ టెన్షన్
బెర్లిన్: జర్మనీ చాన్సలర్ ఎంజెలా మెర్కెల్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను మంగళవారం శ్వేతసౌదంలో కలవనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సర్దుమణుగుతాయా లేక మరింత పెరుగుతాయా అనే టెన్షన్ మొదలైంది. వాణిజ్యపరమైన అంశాలతోపాటు, వలస విధానం విషయంలో కూడా ఇప్పటికే ట్రంప్‌ను జర్మనీ విమర్శించడంతోపాటు యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోతున్న బ్రిటన్‌కు ట్రంప్ మద్దతు తెలపడం వంటి చర్యల నేపథ్యం రేపు జరగనున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకోనుంది. ఒక్క జర్మనీ ఛాన్సలర్‌గా మాత్రమే కాకుండా యూరోపియన్ యూనియన్ ప్రతినిధిగా మెర్కెల్ అమెరికా అధ్యక్షుడి వద్దకు రేపు వెళుతున్నారని జర్మనీ మీడియా చెబుతోంది. తన వ్యక్తిగత ముఖ్యమైన సైనికులతోపాటు పలువురు వ్యాపారవేత్తలతో ఆమె ట్రంప్ వద్దకు వెళుతున్నారట. వాస్తవానికి యూరోపియన్ యూనియన్‌కు, గ్లోబలైజేషన్‌కు మెర్కెల్ పూర్తి మద్దతుగా ఉంటారు. అదే సమయంలో ట్రంప్ మాత్రం బ్రిటన్ ఆలోచనకు అనుకూలంగా ఉంటారు. ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగడంపట్ల ట్రంప్ సంతోషం కూడా వ్యక్తం చేశారు. -
జర్మన్ చాన్స్‌లర్ హత్యకు కుట్ర
-
జర్మన్ చాన్స్‌లర్ హత్యకు కుట్ర
జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఆమె వాహనశ్రేణిలోకి చొరబడేందుకు ప్రయత్నించిన సాయుధుడిని చెక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పోలీసు అధికార ప్రతినిధి జోసెఫ్ బోకన్ తెలిపారు. ఆ నిందితుడు నేరం చేయడానికి ప్రయత్నించినట్లు తెలిసిందని అన్నారు. ఈ కేసును ప్రేగ్ డిటెక్టివ్లు విచారిస్తున్నట్లు చెప్పారు. చెక్ ప్రధానమంత్రి బొహుస్లవ్ సొబొట్కాను కలిసేందుకు జర్మన్ చాన్స్‌లర్ మెర్కెల్ వచ్చారు. ఆమె విమానాశ్రయం నుంచి నగరానికి వెళ్తుండగా నిందితుడి నల్ల మెర్సిడెస్ కారు ఆమె వాహనశ్రేణిలోకి ప్రవేశించింది. మెర్కెల్ వాహనాన్ని అనుసరిస్తున్న పోలీసుకార్లు చేసిన హెచ్చరికలను ఆ డ్రైవర్ పట్టించుకోలేదు. పైగా తనను ఆపేందుకు ప్రయత్నించిన పోలీసు కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించాడు. కాల్చిపారేస్తామని పోలీసులు హెచ్చరించి తుపాకులు బయటకు తీసిన తర్వాత మాత్రమే అతడు ఆగాడు. గడిచిన ఏడాది కాలంగా వరుసగా యూరోపియన్ దేశాల్లో ఉగ్రవాద దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ కుట్రను కూడా పోలీసులు సీరియస్‌గానే తీసుకుంటున్నారు. ఫ్రాన్స్, జర్మనీ, బెల్జియం దేశాల్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జరిపిన దాడుల్లో వందలాది మంది మరణించారు. -
నోబెల్ 'శాంతి' రేసులో ట్రంప్
టాల్లిన్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి కోసం రికార్డు స్థాయిలో 376 నామినేషన్లు అందాయని నార్వే నోబెల్ కమిటీ వెల్లడించింది. అందులో 228 మంది వ్యక్తులు కాగా, 148 మంది సంస్థలు ఉన్నాయని మంగళవారం తెలిపింది. ఇంతకుముందు 2014లో 278 నామినేషన్లు వచ్చాయి. ఈసారి కొత్త రికార్డు నమోదైంది. విజేతను ఎంపిక చేసే ప్రక్రియను నోబెల్ కమిటీ త్వరలో ప్రారంభించనుంది. వివిధ దేశాల ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు, విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, గతంలో శాంతి బహుమతి అందుకున్న వాళ్లు, ఇతరులు ఈ నామినేషన్లు పంపిస్తారు. బహుమతి రేసులో ఉండే అభ్యర్థుల వివరాలను నోబెల్ కమిటీ 50 ఏళ్ల వరకూ రహస్యంగా ఉంచుతుంది. అయితే.. కొన్నిసార్లు అభ్యర్థుల తరఫున నామినేషన్లు పంపిన వారు తాము ఎవరిని సూచించామన్న విషయాన్ని ప్రజలకు వెల్లడిస్తుంటారు. ఈ ఏడాది శాంతి బహుమతి రేసులో ఉన్న వారిలో అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్, ఐసిస్ చేతిలో అత్యాచారానికి గురైన బాధితురాలు, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కల్, పోప్ ఫ్రాన్సిస్, అమెరికా నటి, హక్కుల కార్యకర్త సుసాన్ సరాండన్, కొలంబియా శాంతి చర్చల సంప్రదింపుల బృందం, అఫ్ఘానిస్తాన్ మహిళా సైక్లింగ్ టీమ్‌ల పేర్లు బహిర్గతమయ్యాయి. -
మెర్కెల్ వలస విధానాలపై నిరసన
లీప్జిగ్: కొత్త విధానాలతో జర్మనీలోకి వలసలను ప్రోత్సహిస్తున్న చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌పై తూర్పు జర్మనీలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. గతేడాది తూర్పు జర్మనీలోకి శరణార్థులుగా (ఇస్లాం దేశాలనుంచి) వచ్చిన 11 లక్షల మంది.. కొత్త ఏడాది వేడుకల సందర్భంగా స్థానిక మహిళలపై లైంగిక దాడులకు దిగారని.. వారిని దేశం నుంచి పంపించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. యూరప్‌ను ఇస్లాంగా మార్చేందుకు పాశ్చాత్యదేశాలు ఒప్పుకోవంటూ లీప్జిగ్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. -
జర్మనీలో ఒకే రోజు మాస్ రేప్‌లు
-
జర్మనీలో ఒకే రోజు మాస్ రేప్‌లు
బెర్లిన్: జర్మనీలో రెండువేల సంవత్సరాల చరిత్ర కలిగిన కొలోగ్నీ నగరం నాజీల కాలం నాటి పైశాచికత్వాన్ని మళ్లీ కళ్లారా చూసింది. కెథడ్రెల్ చర్చి కూడలి వద్ద ఒళ్లు గగురుపొడిచే ఘోరం జరిగింది. ఒకర్ని కాదు, ఇద్దర్ని కాదు ఏకంగా 120 మంది అమ్మాయిలను అల్లరి మూకలు గ్యాంగ్ రేప్‌లు చేశాయి. దాదాపు వెయ్యిమంది ఉన్న ఓ ముఠా ఐదుగురు నుంచి 30 వరకు బృందాలుగా విడిపోయి అమ్మాయిలను పశువుల్లా తరుముతూ వెంటబడి, వెంటాడి.. వెంటాడి లైంగికంగా వేధించాయి. సెల్ఫోన్లు, పర్సులను ఎత్తుకెళ్లాయి. లైంగికంగా సామూహిక దాడులకు పాల్పడిన మృగాళ్లలో సగం మంది పీకలదాకా తాగి ఉండగా, మిగతా వాళ్లు డ్రగ్స్ మత్తులో ఉన్నారట. ఇలాంటి ఘోరం ఈ ఒక్కనగరానికే పరిమితం కాలేదు. ఆ రోజున జర్మనీ లోని స్టట్గార్ట్, డస్సెల్‌డార్ఫ్, హంబర్గ్, మ్యూనిచ్, బెర్లిన్ నగరాల్లో కూడా అమ్మాయిలపై పాశవికంగా లైంగిక దాడులు జరిగాయి. ఒక్కో నగరంలో 10 నుంచి 50 వరకు అమ్మాయిలు లైంగిక దాడులు ఎదుర్కొన్నట్టు జర్మనీ పోలీసులకు ఫిర్యాదులందాయి. డిసెంబర్ 31వ తేదీన కొత్త సంవత్సరం వేడుకల్లో జనం మునిగిపోయినప్పుడు జరిగిన ఈ ఘోర లైంగిక కాండ గురించి ప్రపంచానికి ఆలస్యంగా తెల్సింది. వారం పదిరోజులుగా ఈ దారుణాలపై మౌనం వహించిన జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మొదటి సారిగా బుధవారం నాడే నోరు విప్పడంతో మెల్ల మెల్లగా రేప్‌ల సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలు కూడా ఈ వార్తలకు పెద్దగా ప్రాచుర్యం కల్పించలేదు. సిరియా, ఇరాక్, అఫ్ఘానిస్తాన్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా వచ్చిన వలసదారుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయకూడదనే సదుద్దేశంతోనే తాము ఆ వార్తలకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదని మీడియా అంటోంది. వలసదారులను స్వయంగా దేశంలోకి సాదరంగా ఏంజెలా మెర్కెల్ ఆహ్వానించారని, అలా వలస పేరుతో వచ్చిన వారిపై నిందమోపడం సమంజసం కాదనే ఉద్దేశంతోనే తామూ మౌనం వహించామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఆ రోజు కోలోగ్ని కూడలి వేడుకల వద్ద కేవలం 190 మంది పోలీసులు మాత్రమే ఉండడం వల్ల వెయ్యి మంది ముఠా చేసిన లైంగిక దాడులను అరికట్టలేకపోయామని వారు తెలిపారు. అరబ్‌లో మాట్లాడిన వారు, ఉత్తర అమెరికాకు చెందిన వారే తమపై లైంగిక దాడులకు పాల్పడ్డారని బాధితుల్లో ఎక్కువ మంది ఆరోపించారు. జర్మనీకి చెందిన మిషెల్ అనే 18 యువతి కూడా తనపై అరబ్‌లో మాట్లాడిన దుండగులే లైంగిక దాడికి పాల్పడ్డారని బుధవారం సాయంత్రం ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అలాగే తన మిత్రులతో కలసి ఓ నైట్ క్లబ్ నుంచి ఓ రెస్టారెంట్‌కు వెళుతుండగా తమపై లైంగిక దాడి జరిగిందని లొట్టా అనే 19 ఏళ్ల అమ్మాయి మీడియాకు తెలిపింది. సామూహిక లైంగిక దాడికి గురైన బాధితుల్లో ప్రతిఒక్కరూ నిందితులంతా విదేశీయులేనని చెప్పడం అనుమానాలకు దారితీస్తోంది. బాధితుల నుంచి తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఇప్పటి వరకు 30 మంది నిందుతులను అరెస్ట్ చేశామని, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిలో ఇద్దరిని విడిచి పెట్టామని పోలీసు అధికారులు తెలిపారు. మాస్ రేప్‌ల వెనకనున్న ముఠా డ్రగ్ మాఫియా కావచ్చని పోలీసులు అనుమానిస్తుండగా, నేరానికి పాల్పడ్డవారు ఏ దేశస్థులైనా, ఏ జాతీయులైన జర్మనీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్ ప్రకటించారు. అసలు మోర్కెల్ అనుసరించిన వలస విధానం వల్ల ఈ ఘోరాలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. మధ్యప్రాచ్య సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు జర్మనీకి వలసవచ్చిన వారి సంఖ్య 11 లక్షలకు చేరిందని ఇటీవలే జర్మనీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈజిప్టు రాజధాని కైరోలోని తహ్రీర్ స్క్వేర్ వద్ద 2011లో కూడా ఇలాంటి మాస్ రేప్‌లు జరిగాయి. -
జర్మనీ చాన్స్‌లర్ కార్యాలయానికి సీల్
జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయం సమీపంలో అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దాంతో వెంటనే కార్యాలయానికి సీల్ వేశారు. పసుపు రంగులో ఉన్న నాలుగు ప్లాస్టిక్ క్రేట్లు మెర్కెల్ కార్యాలయం సమీపంలో ఉండటంతో వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని సీజ్ చేసి.. తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అత్యవసర బృందాలు అక్కడకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
హిట్లర్ మళ్లీ తిరిగొస్తే..!
తన యుద్ధోన్మాదంతో ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ నేత అడాల్ఫ్ హిట్లర్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని.. నేటికి దాదాపు 70 ఏండ్లు. గడిచిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో జర్మనీ ఎన్నో మార్పులు చవిచూసింది. సరికొత్త రూపును, గుర్తింపును సంతరించుకుంది. హిట్లర్ జర్మనీ దురభిమానం, హింసకు ప్రతీకగా నిలబడితే.. ఆధునిక జర్మనీ హేతుబద్ధత, పునరుత్పాదకతకు ప్రతీకగా నిలబడింది. ఒకవేళ హిట్లర్ బతికిఉంటే ప్రస్తుత జర్మనీ ఎలా తయారయ్యేది? అన్నింటికంటే ముఖ్యంగా ప్రస్తుత జర్మన్లు హిట్లర్‌ను ఎలా మార్చేవారు?.. ఈ ఆసక్తికరమైన ప్రశ్నలతో తెరకెక్కిన చిత్రం 'లుక్ వూ హీజ్ బ్యాక్'. తిముర్ వెర్మస్ 2012లో రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల 'లుక్ వూ హీజ్ బ్యాక్'ను అదేపేరుతో తాజాగా సినిమాగా తెరకెక్కించారు. నవలను యథాతథంగా తెరకెక్కించిన ఈ సినిమాను చూస్తే.. కొంత ఆశ్చర్యం, కొంత విభ్రమ కలుగకమానదు. సాధారణ కథనంతో సినిమా ప్రారంభమవుతుంది. తాను ఆత్మహత్య చేసుకున్న బంకర్‌కు కొద్దిదూరంలో.. తూర్పు బెర్లిన్‌లోని ఓ హౌసింగ్ ప్రాజెక్టులో ఆశ్చర్యకరంగా హిట్లర్ మళ్లీ దర్శనమిస్తాడు. ఆ తర్వాత ఓ టీవీ నిర్మాతతో పరిచయం పెంచుకొని.. వెంటనే మీడియా స్టార్ అయిపోయేందుకు ఒక వ్యూహాన్ని పన్నుతాడు. అయితే 1945 తర్వాత ప్రపంచం ఎంతగా మారిపోయిందో చూసి హిట్లర్ ఆశ్చర్యపోవడమే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తంగా ముందుకు సాగుతుంది. ప్రజాస్వామిక ఆధునిక జర్మనీని చూసి సహజంగానే హిట్లర్ ఉడికిపోతాడు. జర్మనీ చాన్స్‌లర్ ఎంజెలా మోర్కెల్‌ను తిట్టిపోస్తాడు. జర్మనీ సంప్రదాయక భావాలకు మద్దతునిస్తున్న గ్రీన్ పార్టీ పట్ల మాత్రం హిట్లర్ కొంత సానుభూతి చూపిస్తాడు. అదేవిధంగా ప్రస్తుతం టీవీ చానెళ్లు సొంతంగా వండి వారుస్తున్న వార్తాకథనాలను చూసి.. 'ఔరా.. దీనిని గ్లోబెల్స్ కూడా చూడలేదే' అని హిట్లర్ బిత్తరపోతాడు. సెటైరికల్ కామెడీ తరహాలో సాగిన ఈ సినిమాలో హిట్లర్ పాత్రలో నటుడు ఒలివర్ మసుస్సి ఒదిగిపోయాడు. దర్శకుడు డేవిడ్ నెండెట్ తెరకెక్కించిన తీరు బాగుందని ప్రశంసలు లభిస్తున్నాయి. -
‘నోబెల్ శాంతి’ రేసులో మెర్కెల్
ఓస్లో: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి రేసులో జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీ ముందంజలో ఉన్నారు. నోబెల్ అవార్డులన్నింటిలోనూ ఓస్లోలో ప్రదానం చేసే ఏకైక అవార్డైన శాంతి బహుమతి ఎవరిని వరిస్తుందనేది ఉత్కంఠగా మారనుంది. శుక్రవారం ప్రకటించనున్న ఈ అవార్డుకు నామినీల పేర్లను ఎప్పటిలాగే రహస్యంగా ఉంచారు. శాంతి బహుమతి కోసం ఈ ఏడాది 273 మంది పేర్లను పరిశీలించినట్లు సమాచారం. ఈ ఏడాది ప్రపంచాన్ని తీవ్రంగా కుదిపేసిన వలసల సంక్షోభాన్ని నివారించేందుకు కృషి చేసిన వారికి అవార్డు దక్కుతుందని పరిశీలకుల అంచనా. పశ్చిమాసియా, ఆఫ్రికాల నుంచి ఐరోపాకు 6 లక్షల 30 వేల మంది వలస వెళ్లారు. వీరిని ఆదుకోవటానికి నైతిక నాయకత్వం వహించిన మెర్కెల్‌కు శాంతి బహుమతి దక్కే అవకాశాలున్నాయని ఓస్లో శాంతి పరిశోధన సంస్థ చీఫ్ హార్ప్వికెన్ అన్నారు. ఇరాన్‌తో అణు ఒప్పందం ఖరారులో విజయం సాధించిన జాన్ కెర్రీ, ఇరాన్ విదేశాంగ మంత్రి జావద్ జరీఫ్‌లకు కూడా అవకాశాలున్నాయి. -
మోదీ, మెర్కెల్‌తో వాణిజ్య దిగ్గజాలు
బెంగళూరు: ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు మరిం తగా మెరుగుపర్చుకునే దిశగా భారత పర్యటనలో ఉన్న జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఆమె బృందానికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విందు నిర్వహించారు. పలువురు భారతీయ వ్యాపార దిగ్గజాలు కూడా ఇందులో పాల్గొన్నారు. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్, ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్, ఎల్అండ్టీ చీఫ్ ఏఎం నాయక్ తదితరులు వీరిలో ఉన్నారు. అందుబాటులో ఉన్న అపార వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడంపైనా, పరస్పరం సహకరించుకోవడంపై ఇరు వర్గాలు ఆశావహంగా ఉన్నట్లు టీసీఎస్ సీఈవో ఎన్ చంద్రశేఖరన్ ఈ సందర్భంగా చెప్పారు. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితుల్లో భారత్ కాంతికిరణంగా కనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. భారత్ చాలా కీలకమైన మార్కెట్ అని, పెట్టుబడులకు అనువైన పరిస్థితుల కల్పన కోసం పలు చర్యలు తీసుకుంటోందని జర్మనీ గుర్తిస్తోందని ఐసీఐసీఐ సీఈవో చందా కొచర్ తెలిపారు. అంతకు ముందు భారత ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ నిర్వహించిన కార్యక్రమంలో మోదీ, మెర్కెల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య అయిదు ఒప్పందాలు కుదిరాయి. -
'భారత్‌లో ఐటీ విప్లవం మొదలైంది'
బెంగళూరు : 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యాన్ని సుసాధ్యం చేసి 125 కోట్ల భారతీయుల కలలను నెరవేర్చుతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్‌తో కలిసి ప్రధాని మోదీ వివిధ కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంగళవారం కర్నాటక వచ్చారు. తమ పర్యటనలో భాగంగా బెంగళూరులోని బాష్ ఇంజినీరింగ్ సెంటర్‌ను వీరు సందర్శించారు. ప్రత్యేక విమానంలో మోదీ, మోర్కెల్‌లు బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగి, అనంతరం బాష్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సుమారు 77వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలపై మోర్కెల్, మోదీలు సంతకాలు చేయనున్నారు. జర్మనీకి చెందిన పది ప్రముఖ సంస్థలు కర్ణాటకలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. మోదీ ప్రసంగంలోని అంశాలు: అంతర్జాతీయ తయారీ కేంద్రంగా భారత్‌ని తీర్చిదిద్దడం భారత్-జర్మనీ ఆర్థిక సంబంధాలు స్థిరంగా ఉండాలి గత 15 నెలలుగా వ్యాపారానికి అణువైనదిగా భారత్‌ని చేయడానికి తీవ్రంగా కృషిచేశాం విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన తరుణం.. మంచి అవకాశం ఇక్కడ భారీగా వస్తువుల, ఉత్పత్తుల తయారీ చేపట్టి 'మేక్ ఇన్ ఇండియా'కి న్యాయం చేస్తాం జీఎస్టీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాం. వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశం ఉంది. పరిశ్రలకు కావాల్సిన లైసెన్స్ కాలవ్యవధిని పెంచుతాం భారత్‌లో ఐటీ విప్లవం వచ్చింది. 125 కోట్ల భారతీయుల లక్ష్యాలను సాంకేతిక పరిజ్ఞానంతో సాధిస్తాం -
బెంగళూరు వచ్చిన మోదీ, ఏంజెలా మోర్కెల్
-
జర్మనీ, భారత్ ‘సౌర’బంధం
-
జర్మన్ ఛాన్సలర్ మోర్కెల్ మూడు రోజుల పర్యటన
-
జర్మనీ, భారత్ ‘సౌర’బంధం
భారత్‌లో ప్రాజెక్టులకు రూ.7,300 కోట్లు ♦ సాగు, రైల్వేల్లో సహకారం ♦ జర్మనీతో 18 ఒప్పందాలు ♦ మోదీ-మెర్కెల్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ♦ మహిషాసుర మర్దిని విగ్రహం భారత్‌కు అప్పగింత న్యూఢిల్లీ: భారత్‌తో వ్యాపార బంధం బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలకమైన ముందడుగు వేసింది. ప్రధానంగా సౌర ఇంధన రంగంలో పెద్ద ఎత్తున భారత్‌కు సహకరించటానికి జర్మనీ ముందుకొచ్చింది. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో 18 ఒప్పందాలు కుదుర్చుకోవటంతో పాటు.. వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారంపై అవగాహనకు వచ్చారు. 28 మంది ప్రతినిధులతో భారత్‌కు వచ్చిన మెర్కెల్ బృందం మోదీ నేతృత్వంలోని భారత బృందంతో పలు అంశాలపై చర్చలు జరిపింది. రక్షణ, భద్రత, నిఘా, రైల్వేలు, పెట్టుబడులు, స్వచ్ఛ ఇంధనం వంటి వివిధ కీలకమైన రంగాలపై ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ‘‘భారత ఆర్థిక పునర్వికాసంలో జర్మనీ సహజ భాగస్వామిగా ఉంటుంది. మా దృష్టి ప్రధానంగా ఆర్థిక సంబంధాలపై ఉన్నా.. ఇరు దేశాలూ సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని నిర్ణయించాం’’ అని చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టే జర్మనీ కంపెనీలకు వేగంగా అనుమతులివ్వటంతో పాటు, సౌర ఇంధన నిధికి వచ్చే ఐదేళ్లలో రూ. 7,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని జర్మనీ ప్రకటించింది. అయితే నేర వ్యవహారాల్లో పరస్పర సహకారానికి భారత నేర శిక్షాస్మృతిలోని ఉరిశిక్ష ప్రధాన అడ్డంకిగా మారింది. ఇరు దేశాల మధ్య నేర వ్యవహారాల్లో పరస్పర న్యాయ సహాయ ఒప్పందంపై 2007 నుంచి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం జరిగిన చర్చల్లోనూ భారత్‌లో ఉరిశిక్ష అమల్లో ఉండటం వల్ల ఒప్పందం కుదరలేదు. పర్యటనలోని మరికొన్ని ముఖ్యాంశాలు స ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీ మెర్కెల్‌కు సంప్రదాయ స్వాగతం పలికారు. భారత సైనిక వందనాన్ని మెర్కెల్ స్వీకరించారు. స మహాత్మాగాంధీ సమాధి వద్ద మెర్కెల్ నివాళులు అర్పించారు. స ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో 18 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. స వంకాయ, పొట్లకాయ, కాకరకాయ, ఆల్ఫాన్సో మామిడిపై యురోపియన్ యూనియన్ నిషేధం ఎత్తివేతకు సాయం చేయాలని జర్మనీని భారత్ కోరింది. స వ్యవసాయంలో అభివృద్ధికి భారత వ్యవసాయ నైపుణ్య మండలితో జర్మనీ వ్యవసాయ వ్యాపార కూటమి సహకారం. స భారత్‌లో సౌర ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి రూ. 7,300 కోట్ల జర్మనీ ఆర్థిక సాయం స వాతావరణ మార్పునకు సంబంధించి పారిస్ ఒప్పందంలోని ముఖ్యభాగాన్ని అమలు చేసేందుకు జర్మనీ నిర్ణయం. 2020 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హరిత పరిజ్ఞానం, పరిశుభ్రమైన వాతావరణం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు రూ. 6 వేల కోట్ల ఆర్థిక సాయం. స భారత్‌లో జర్మన్ భాషకు, జర్మనీలో.., సంస్కృతంతో సహా భారత ఆధునిక భాషలకు విదేశీ భాషలుగా ప్రాచుర్యం కల్పించాలని ఒప్పందం. స ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని కలసి కట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయం. స {పపంచంలో అణ్వస్త్ర నిరోధక చర్యలను పటిష్టం చేసే ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయం. స కశ్మీర్లో దొంగతనం జరిగిన 10వ శతాబ్దం నాటి మహిషాసుర మర్దిని విగ్రహం భారత్‌కు అప్పగింత. స దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు పెరగటంపై ఆందోళన. స జర్మన్ కంపెనీల కోసం ఫాస్ట్‌ట్రాక్ సిస్టమ్ 2016 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం. స పెట్టుబడుల ఆకర్షణకు మార్కెట్ ద్వారాలు తెరిచిపెట్టాలని నిర్ణయం. స స్మార్ట్ సిటీలు, గంగ శుద్ధి కార్యక్రమాలకు జర్మనీ సాయం. స ఆహార భద్రత, పౌరవిమానయానం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, రైల్వేలు వంటి రంగాల్లో పరస్పర సహకారం. -
నమస్తే.. ఛాన్సలర్ మోర్కెల్!
న్యూఢిల్లీ: సహచర క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు సహా బడా వ్యాపారవేత్తలతో కూడిన భారీ బృందంతో జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మోర్కెల్ భారత్ కు విచ్చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న మోర్కెల్ బృందానికి కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఘనస్వాగతం పలికారు. 'నమస్తే.. ఛాన్సలర్ మోర్కెల్! మీకు, మీ బృందానికి హృదయపూర్వక ఆహ్వానం. మీ పర్యటనతో భారత్- జర్మనీల మైత్రి మరింత ఫలప్రదం అవుతుందని ఆశిస్తున్నా' అంటూ ఏంజెలా రాకను స్వాగతిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రేపు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మోర్కెల్ భేటీ కానున్నారు. ఆరు మాసాల వ్యవధిలో రెండోసారి జరగనున్న ద్వైపాక్షిక చర్చల్లో పలు వాణిజ్య, రక్షణ ఒప్పందాలతోపాటు భారత్- యూరోపియన్ యూనియన్ వ్యాపార ఒప్పందాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఏంజిలా మోర్కెల్ బెంగళూరునూ సందర్శిస్తారు. Namaste Chancellor Merkel! Warm welcome to you & the delegation. I look forward to fruitful discussions & strengthening India-Germany ties. — Narendra Modi (@narendramodi) October 4, 2015 -
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
-
ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు
భారత్, జర్మనీ ప్రతిన ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్న దేశాలపై ఒత్తిడి తేవాలి అలాంటి దేశాలను ఒంటరి చేయాలి బెర్లిన్‌లో మోదీ వ్యాఖ్యలు మెర్కెల్‌తో ద్వైపాక్షిక చర్చలు బెర్లిన్: పాకిస్తాన్ అనుసరిస్తున్న ఉగ్రవాద అనుకూల వైఖరిని అన్యాపదేశంగా ప్రస్తావిస్తూ.. ప్రభుత్వాలే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై అంతర్జాతీయ సమాజం కలసికట్టుగా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అణ్వాయుధ వ్యాప్తి ఎంత ప్రమాదకరమో.. ఉగ్రవాదమూ అంతే ప్రమాదకరమన్నారు. అణ్వాయుధ వ్యాప్తిపై మాదిరే ఉగ్రవాదంపైనా కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఐక్యరాజ్య సమితిలో ‘అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందం(కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టైజం-సీసీఐటీ)’పై ఒక నిర్ణయానికి రావాలని ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. ఉగ్రవాదంపై పోరులో ప్రపంచదేశాల పరస్పర సహకారాన్ని మరింత దృఢతరం చేయడమే చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీసీఐటీ ప్రధాన లక్ష్యం. జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌తో ఉగ్రవాదం తదితర అంశాలపై ద్వైపాక్షిక చర్చల అనంతరం.. ఇరువురు నేతలు మంగళవారం బెర్లిన్‌లో సంయుక్తంగా మీడియా సమావేశంలో పాల్గొన్నారు. శాశ్వత సభ్యత్వంతోనే భారత్‌కు న్యాయం ప్రపంచ శాంతికి ఎంతో కృషి చేసిన భారత్‌కు ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించడంలో జరిగిన జాప్యాన్ని మోదీ ప్రశ్నించారు. ఐరాస ఏర్పడి 70 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ.. ‘బుద్ధుడు, మహాత్మాగాంధీ జన్మించిన నేల.. శాంతి తమ డీఎన్ఏలోనే ఉన్న దేశం.. శాశ్వత సభ్యత్వంకోసం 70 ఏళ్లుగా ఎందుకు ఎదురుచూడాల్సి వస్తోంది? మండలిలో శాశ్వత సభ్యత్వమిచ్చి భారత్‌కు న్యాయం చేయాల్సిన సమయం వచ్చింది’ అన్నారు. ‘మొదటి ప్రపంచ యుద్ధంపై ఎలాంటి ఆసక్తి లేకుండానే.. ఆ యుద్ధంలో 14 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు.. 75 వేల మంది అమరులయ్యారు’ అని గుర్తుచేస్తూ ప్రపంచవ్యాప్తంగా భారత శాంతి పరిరక్షక దళం అందించిన సేవలు అనేక దేశాల ప్రశంసలందుకున్నాయన్నారు. భారత్, జర్మనీలు భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాలు కావాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. ‘ఉగ్ర’ దేశాలను కట్టడిచేయాలి ‘ఉగ్రవాదం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రమాదం. మానవత్వంపై నమ్మకమున్న ప్రతీ ఒక్కరు ముక్తకంఠంతో ఉగ్రవాదాన్ని వ్యతిరేకించాలి. ఆ మహమ్మారిపై పోరులో సహకరించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు. ‘ఉగ్రవాదులకు ఆయుధాలు అందిస్తున్నవారిని కట్టడి చేయడమెలాగో.. ఉగ్రవాదులకు ప్రభుత్వాలే ఆశ్రయం కల్పిస్తున్న దేశాలపై ఒత్తిడి తేవడమెలాగో అందరం కలిసి ఆలోచించాల్సి ఉంది. అలాంటి దేశాలను ఒంటరి చేయాల్సిన అవసరముంది’ అని అన్నారు. ఇటీవల ముంబై దాడుల సూత్రధారి లఖ్వీని పాకిస్తాన్ కోర్టు విడుదల చేసిన నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అనంతరం ఎంజెలా మెర్కెల్ మాట్లాడుతూ.. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్, జర్మనీలు అంగీకరించాయన్నారు. మెర్కెల్‌కు మోదీ గిఫ్ట్ భౌతిక శాస్త్రంలో నోబెల్ పురస్కార గ్రహీత సర్ సీవీ రామన్‌కు చెందిన రాతప్రతులు, ఇతర పత్రాలను మళ్లీ రూపొందించి జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్‌కు మోదీ బహుమతిగా ఇచ్చారు. అనంతరం ‘రామన్ ఎఫెక్ట్, రామన్ స్పెక్ట్రమ్ పదాలను సృష్టించింది జర్మన్ శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ ప్రింగ్శీమ్. నోబెల్ పురస్కారానికి రామన్‌ను నామినేట్ చేసింది జర్మన్ శాస్త్రవేత్తలే. జర్మనీతో సర్ రామన్‌కు అంత అనుబంధం ఉంది. జర్మనీ చాన్సెలర్ మెర్కెల్ కూడా క్వాంటమ్ కెమిస్ట్రీలో డాక్టరేట్ సాధించారు’ అని మోదీ ట్వీట్ చేశారు. మోదీ విమానంలో సాంకేతిక సమస్య న్యూఢిల్లీ: మూడు దేశాల పర్యటనకు మోదీని తీసుకువెళ్లిన ‘ఎయిర్ ఇండియా వన్’ బోయింగ్ విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఢిల్లీ నుంచి బయల్దేరి పారిస్, తౌలౌజ్, హనోవర్లలో ఆగి.. అనంతరం బెర్లిన్‌కు మోదీ ఈ విమానంలోనే వెళ్లారు. అనంతరం అందులో సాంకేతిక సమస్య తలెత్తడంతో ముంబై నుంచి మరో ఎయిర్ ఇండియా వన్’ మంగళవారం తెల్లవారు జామున బెర్లిన్ బయల్దేరి వెళ్లింది. కాగా, బుధవారం నుంచి మూడ్రోజులపాటు మోదీ కెనడాలో పర్యటించనున్నారు. ప్రధానితో నేతాజీ మనవడి భేటీ నేతాజీ కుటుంబంపై నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టిందన్న వివాదం నేపథ్యంలో ఆయన సోదరి మనవడు సూర్యకుమార్ బోస్ సోమవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బెర్లిన్‌లోని భారత రాయబార కార్యాలయంలో సూర్యకుమార్ మోదీతో భేటీ అయ్యారు. నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టాలని, నిజాలు వెలుగుచూడాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. దీనికి ప్రధాని కూడా సానుకూలంగా స్పందించినట్లు సూర్య తెలిపారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని, ప్రజలకు నిజం తెలియాల్సిన అవసరముందని మోదీ వ్యాఖ్యానించినట్లు చెప్పారు. మోదీ గౌరవార్థం జర్మనీలోని భారత రాయబారి విజయ్ గోఖలే ఇచ్చిన విందులో ఇండో-జర్మన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సూర్యకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానితో సమావేశమయ్యారు. కాగా, దీనిపై ప్రధాని కార్యాలయం స్పందిస్తూ.. విదేశాలతో సంబంధాలను దృష్టిలో ఉంచుకొని నేతాజీకి సంబంధించిన రహస్య పత్రాలను బయటపెట్టడానికి వీల్లేదని పేర్కొంది. ప్రకృతి రక్షణలో మాకే పాఠాలా!?: మోదీ గ్లోబల్ వార్మింగ్‌పై భారత్‌ను తప్పుబడుతున్న అభివృద్ధి చెందిన దేశాలపై ప్రధానమంత్రి మోదీ విరుచుకుపడ్డారు. తలసరి కాలుష్య ఉద్గారాల స్థాయి ప్రపంచంలోనే అత్యంత కనిష్టంగా ఉన్నప్పటికీ.. గ్లోబల్ వార్మింగ్ విషయంలో భారత్‌ను వేలెత్తి చూపడాన్ని తప్పుపట్టారు. సెప్టెంబర్‌లో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో జరగనున్న అంతర్జాతీయ వాతావరణ మార్పు సదస్సు ఎజెండాను భారతే రూపొందిస్తుందని స్పష్టం చేశారు. జర్మనీ పర్యటనలో భాగంగా బెర్లిన్‌లో ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ భారత సంప్రదాయంలోనే ఉందని పునరుద్ఘాటించారు. ‘పర్యావరణాన్ని నాశనం చేసినవారే.. మనల్ని ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు లేదు. ప్రకృతిని నాశనం చేసింది మీరేనని వారికి స్పష్టం చేద్దాం. ప్రకృతికి సేవ చేసినవారెవరైనా ఉన్నారంటే వారు భారతీయులే అని చెబుదాం’ అని తేల్చి చెప్పారు. భారతీయులు నదులను నదీమ తల్లులుగా భావిస్తారని, వృక్షాలను పూజిస్తారన్నారు. -
‘జర్మన్’పై మెర్కెల్ ప్రస్తావన
బ్రిస్బేన్: భారత్‌లోని కేంద్రీయ విద్యాలయాల్లో తృతీయ భాషగా జర్మన్‌ను తొలగించి సంస్కృతాన్ని చేర్చిన అంశాన్ని జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్.. ప్రధాని మోదీతో ప్రస్తావించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. భారతీయ విధానాలకు లోబడి తృతీయ భాష అంశంపై దృష్టి సారించగలనని హామీ ఇచ్చారు. జీ 20 సదస్సుకు హాజరైన ఇద్దరు నేతలు ఆదివారం భేటీ అయ్యారు. జర్మనీని సందర్శించాల్సిందిగా మెర్కెల్ మోదీని ఆహ్వానించారు. కాగా, సౌదీ ఉప ప్రధాని అల్ సౌద్ మోదీతో సమావేశమై భారత్‌కు అన్ని రంగాల్లో సహకరిస్తామని హామీ ఇచ్చారు. -
మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం: మోడీ
బ్రిస్బేన్: ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతున్నాయి. మీ పర్యటన కోసం ఎదురు చూస్తున్నాం అని జర్మన్ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్ తో భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. జీ20 సమావేశాల సందర్బంగా మార్కెల్ తో మోడీ భేటి అయ్యారు. ప్రధాని వ్యాఖ్యలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. రెండవ రోజు సమావేశాల్లో ఆస్త్రేలియా ప్రధాని టోని అబాట్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కలిసి ఫోటోకు ఫోజిచ్చారు. ఈ సమావేశాల్లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సమావేశం కానున్నారు. రెండవ రోజు కూడా మోడీ సమావేశాల్లో, ఇతర నేతలతో బిజీ బిజీగా ఉన్నారు. -
టైప్ రైటర్లు మళ్లీ వచ్చేస్తున్నాయోచ్!
కంప్యూటర్లు, లాప్ టాప్ లు, టాబ్ ల యుగంలో టైప్ రైటర్లకు పనేంటి అనుకుంటున్నారా? ఆధునిక లైఫ్ లో డైనోసార్ల లాంటి మెషిన్ అవసరం ఏమిటి అనుకుంటున్నారా? అవసరం ఉందంటున్నారు జర్మన్లు. అందుకే జర్మనీలో ఇప్పుడు టైప్ రైటర్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అమెరికా గూఢచర్యం నుంచి తప్పించుకునేందుకు ఇప్పుడు జర్మన్లు టైప్ రైటర్లపైనే ఆధారపడుతున్నారు. ఎందుకంటే అమెరికా జాతీయ భద్రతా సంస్థ ఎన్ ఎస్ ఏ ఏకంగా జర్మనీ చాన్స్‌లర్ ఎంజిలా మెర్కెల్ ఫోన్ నే ట్యాప్ చేసింది. చాలా మంది రాజకీయనాయకుల ఫోన్లను, ఈ మెయిల్ ఎకౌంట్లను, వెబ్ సైట్లను కూడా అమెరికా నిఘావేసి చూస్తోంది. దీంతో ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా గూఢచర్యం చేయడం సులువని జర్మన్లు గుర్తించారు. అందుకే టైప్ రైటర్ల యుగానికి వెళ్లిపోదాం అని వారు నిర్ణయించుకున్నారు. ఒలింపియా, బాందెర్మాన్ కంపెనీల టైప్ రైటర్లకు ఇప్పుడు భారీగా గిరాకీ పెరిగింది. తమకు 10000 కి పైగా ఆర్డర్లున్నాయని ఆ కంపెనీలు చెబుతున్నాయి. టైప్ రైటర్ ను బగ్ చేయడం, ట్యాప్ చేయడం అసాధ్యం కాబట్టి దీన్నే వాడమని జర్మన్ రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారట. అందుకే జర్మనీలో టైప్ రైటర్లు వచ్చేశాయోచ్! -
ఆటగాళ్లకు ఆమె అందించిన స్ఫూర్తి ఎంతో..!
సాకర్ ప్రపంచకప్‌ను గెలిచిన జర్మనీ జట్టు శక్తియుక్తుల గురించి అనేకమంది ప్రశంసిస్తున్నారు. జర్మనీ వ్యూహాల గురించి అనేకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆటగాళ్ల ప్రతిభ అద్భుతమని సాకర్ విశ్లేషకులు అంటున్నారు. మరి ఇటువంటి సమయంలో జర్మన్ టీమ్ విజయం గురించి చర్చిస్తే.. అందులోప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన వ్యక్తి ఏంజెలా మెర్కెల్. జర్మన్ ఛాన్సరల్ అయిన మెర్కెల్ తమ జాతీయ జట్టును అడుగడుగునా ప్రోత్సహించారు. ఆటగాళ్లతో స్నేహితురాలిగా మెలుగుతూ వారిలో స్ఫూర్తిని నింపారు. మెర్కెల్ స్థాయి వ్యక్తి తమను అంతగా అభిమానించడం, అండగా నిలవడం తమకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందని, గెలవాలనే తపనను, బాధ్యతను పెంచిందని జర్మన్ ఆటగాళ్లు వ్యాఖ్యానించారు. ప్రపంచకప్‌ను గెలుచుకొచ్చిన టీమ్‌ను అభినందిస్తూ వారితో సరదాగానో, హుందాగానో గడిపే దేశాధ్యక్షులు, ప్రధానమంత్రులు ఎంతోమంది ఉంటారు. అయితే మెర్కెల్ అందరిలాంటి నాయకురాలు కాదు. మొన్నటి ఆదివారం జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో జర్మన్ ఫుట్‌బాల్ టీ మ్ఏకైక గోల్సాధించగానే మెర్కెల్ ఒక సాధారణ ఫుట్‌బాల్ అభిమానిలా గంతులేశారు. ఇక మ్యాచ్‌లో జర్మనీ విజేతగా నిలవగానే ప్రోటోకాల్ నిబంధనలను పక్కనపెట్టి మరీ ఆటగాళ్లతో ఒక స్నేహితురాలిలా కలిసిపోవడం చర్చనీయాంశమైంది. కేవలం తమ జట్టు గెలిచినప్పుడు మాత్రమే కాదు, ప్రపంచ కప్‌లో జర్మనీజట్టు ఆటను ప్రతిమ్యాచ్‌లోనూ సమీక్షించినట్టుగా కనిపిస్తోంది మెర్కెల్. ఆమె సాకర్ వరల్డ్‌కప్ ప్రారంభోత్సవానికే హాజరైంది. ఇక తొలి మ్యాచ్‌లో జర్మనీ జట్టు తమ తొలిమ్యాచ్‌లో పోర్చగల్ను ఓడించి శుభారంభం చేసినప్పుడయితే ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది. అప్పుడే ఆమె తమ ఆటగాళ్ల డ్రెస్సింగ్ రూమ్ వరకూ వెళ్లి అభినందించి వచ్చారు. దీన్నిబట్టి ఆమె తమ టీమ్‌కు ఎంత అండగా నిలిచారో అర్థం చేసుకోవచ్చు. ఆటగాళ్లతో సన్నిహితంగా గడపడం ద్వారా ఏంజెలా ఆటతోబాటు అభిమానుల మనసులను కూడా గెలిచింది! -
మసిబారిన ‘పొదుపు రాణి’ ప్రాభవం!
ఈయూ ఎన్నికల్లో యూరప్ ప్రజలు ‘పొదుపు చర్యల’కు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దీంతో యూరప్‌పై మర్కెల్ ఆధిపత్యానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ బడ్జెట్ లోటు, రుణాలపై పరిమితులను విధించే ‘స్టెబిలిటీ ప్యాక్ట్’ను సరళతరం చేయాలని ఒత్తిడి పెరుగుతోంది. నిన్నటి వరకు ‘యూరో సామ్రాజ్ఞి’గా వెలుగొందిన ఏంజెలా మర్కెల్ హఠాత్తుగా అన్ని వైపుల నుంచి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది. యూరోపియన్ యూనియన్ అధ్యక్షునిగా జీన్ క్లాడ్ జంకర్ అభ్యర్థిత్వాన్ని అయిష్టంగానే సమర్థించాల్సిన దుస్థితి అందులో ఒకటి. లక్సెంబర్గ్ మాజీ ప్రధాని జంకర్ కూడా మర్కెల్లాగే మధ్యేవాద మితవాద నేత. కానీ ఈయూ సంక్షోభానికి పరిష్కారంగా మర్కెల్ యూరప్‌పై రుద్దుతున్న ఆస్టిరిటీ (పొదుపు) కార్యక్రమాల విషయంలో మాత్రం ఆయన ఆమెకు బద్ధ వ్యతిరేకి. మేలో జరిగిన ఈయూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రభుత్వ వ్యయాల తగ్గింపు పేరిట సంక్షేమ వ్యయాలపై కోతలు, ఉద్యోగాలు, వేతనాలలో కత్తిరింపుల పొదుపు చర్యలను వ్యతిరేకించే పార్టీలకే ఆధిపత్యం లభించింది. ఈయూ స్వభావానికి తగ్గట్టే దాని పార్లమెంటులోని ప్రజాస్వామ్యం కూడా నేతి బీరలోని నెయ్యే. ఈయూ అధ్యక్షుణ్ణి యూరప్ ప్రజా ప్రతినిధులు ఎన్నుకోరు. 28 సభ్య దేశాల అధినేతలు, ప్రభుత్వాలే నియమిస్తాయి. మర్కెల్ ఎవరిని బలపరిస్తే వారే అధ్యక్షుడని అంతా అనుకున్నట్టే ఆమె అనుకున్నారు. జంకర్ అభ్యర్థిత్వాన్ని ఆమె తీవ్రంగానే వ్యతిరేకించారు. విరుద్ధ ధృవాల మధ్య ఆకర్షణలాగా మర్కెల్‌కు, ఈయూ సమావేశాల్లో ఎప్పుడూ శిరోభారమై నిలిచే బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌కు జంకర్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించడంలో ఐక్యత కుదిరింది. కాకపోతే బ్రిటన్‌కు అల వాటుగా మారిన ‘ఈయూ నుంచి నిష్ర్కమణ’ బ్లాక్‌మెయిలింగ్ టెక్నిక్‌ను కామెరాన్ సందర్భశుద్ధి లేకుండా జంకర్ అభ్యర్థిత్వంపై ప్రయోగించారు. దీంతో జంకర్ పరిస్థితి తంతే బూరెల గంపలో పడ్డట్టయింది. ఈయూను విచ్ఛిన్నం చేసే శక్తులతో మర్కెల్ కలుస్తున్నారంటూ జర్మనీలో గగ్గోలు రేగింది. చాన్సలర్ మర్కెల్ మొట్టమొదటిసారిగా తన వైఖరిని తలకిందులు చేసి జంకర్‌కు మద్దతు ప్రకటించక తప్పింది కాదు. జంకర్ అధ్యక్ష పీఠానికి చేరువయ్యారే తప్ప దక్కించుకోలేదు. జంకర్ తలనొప్పి అలా ఉండగా ‘ఆస్టిరిటీపైనే పూర్తిగా దృష్టిని కేంద్రీకరించే విధానాలు విఫలమయ్యాయి’ అంటూ జర్మనీ వైస్ చాన్సలర్, ఆర్థిక మంత్రి సిగ్మార్ గాబ్రియెల్ బాంబు పేల్చారు. అధికార కూటమిలోని ఈ తిరుగుబాటు ధోరణికి మీడియా నోళ్లు తెరవాల్సి వచ్చింది. మధ్యేవాద వామపక్షమైన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ నేత గాబ్రియెల్ గాలివాటం కనిపెట్టారు. ఈయూ ఎన్నికల్లో యూరప్ అంతటా వీచిన అస్టిరిటీ వ్యతిరేక పవనాలు మర్కెల్ ఆధిపత్యాన్ని బలహీనపరచాయని గ్రహించారు. ప్రత్యేకించి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హాలెండె, మర్కెల్‌పై మండిపడుతున్నారు. ఈయూ ఎన్నికల్లో ఫ్రాన్స్‌లోని పచ్చి మితవాద కూటమి ‘ఫ్రంట్ నేషనల్’ 25 శాతం ఓట్లు దక్కించుకుంది. అందుకు ఫ్రాన్స్‌పై రుద్దిన ద్రవ్య సంస్కరణలే కారణమని ఆయన అక్కసు. ఈయూ ‘స్టెబిలిటీ అండ్ గ్రోత్ ప్యాక్ట్’ (సుస్థిరత, వృద్ధి ఒప్పందం) నిబంధనలను సరళతరం చేయాలని ఆయన గట్టిగా డిమాండు చేస్తున్నారు. ఈ ఒప్పందాన్ని అనుసరించే ఈయూ సభ్య దేశాల ప్రభుత్వ బడ్టెట్ లోటు జీడీ పీలో 3 శాతం కంటే, రుణం జీడీపీలో 60 శాతం కంటే తక్కువగా ఉండాలని పరిమితులను విధించారు. ఒకప్పుడు జర్మనీ సహా ఈయూ ప్రధాన శక్తులు వాటిని యథేచ్ఛగా ఉల్లంఘించినవే. మర్కెల్ హయాంలోనే అవి దాటరాని లక్ష్మణ రేఖలుగా మారాయి. వాటిని సరళతరం చేయడమంటే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను, ఈయూపై మర్కెల్ పట్టును బలహీనపరచడమే. దీన్ని మర్కెల్ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కానీ జర్మనీ అధికార కూటమిలోనే ఈ చర్చ జోరుగా సాగుతోంది. గాబ్రియెల్ చొరవతో ఈ నెల 22న వివిధ ఈయూ దేశాల మధ్యేవాద వామపక్ష నేతలంతా సమావేశమై వృద్ధిని మరచిన స్టెబిలిటీ ప్యాక్ట్ నిబంధనలను సడలించడమే సం క్షోభం నుంచి బయటపడటానికి మార్గమంటూ ఏకగ్రీవంగా తీర్మానించారు. మర్కెల్ ఆస్టిరిటీ విధానాలకు గట్టి మద్దతుదార్లుగా నిలిచిన హాలెండ్, ఫిన్లాండ్లు కూడా అదే పాట పాడటం ప్రారంభించాయి. ప్రత్యేకించి ఇటలీ ప్రధాని మాటియో రెంజి ఆమెకు మరింత తీవ్ర ప్రత్యర్థిగా తయారయ్యారు. ఈయూ సంస్కరణల కత్తి పీక మీద ఉన్న ఆయన జీడీపీలో 133 శాతం ప్రభుత్వ రుణం, 12.6 శాతం నిరుద్యోగం ఎదుర్కొంటున్నారు. ఆస్టిరిటి విమర్శకులు కోరుతున్నట్టు ఈయూ పొదుపు విధానాలను సవరిస్తే జర్మనీ ప్రజలపైనే భారం పడుతుందని మర్కెల్ గగ్గోలు పెడుతున్నారు. ఈయూ ఎన్నికల్లో ‘సౌహార్ద్రత’ నినాదానికి బదులుగా ఈయూ పొదుపు చర్యలను విడనాడితే మూల్యాన్ని చెల్లించాల్సింది జర్మన్లే అంటూ ప్రచారాన్ని సాగించాల్సిందని ఆమె ఇప్పుడు విచారిస్తున్నారు. -పి. గౌతమ్ -
నయా పేదల దేశంలో ‘నాజీల’ హవా!
పరిష్కారం కనుచూపు మేరలో కనిపించని గ్రీస్ సంక్షోభం దేశంలో సగం జనాభాను నయా పేదలుగా దిగజారుస్తోంది. విపరీతంగా పెరిగిన నిరుద్యోగం, పేదరికాలను ఆసరాగా చేసుకోని జాతీయోన్మాద ‘గోల్డెన్ డాన్’ మూడో అతిపెద్ద రాజకీయ పక్షంగా అవతరించింది. గ్రీస్ ఎంతటి ఘన చరిత్ర గలిగిన దేశమైనా నేడు మాత్రం అది యూరోపియన్ యూనియన్ సంక్షోభాన్ని కొలిచే థర్మామీటరు, బారోమీటరు. గ్రీస్‌లో ఫ్యాక్టరీ ఉత్పత్తి గత ఏడేళ్లలో మొట్టమొదటిసారిగా తల పెకైత్తి చూసిందని సంబరపడిపోతున్న వారు లేకపోలేదు. అలాంటి వారిని ఉద్దేశించే గామోసు ఈయూ మకుటం లేని మహారాణి ఏంజెలా మర్కెల్ గత నెల 29న ఇది ‘తుపాను ముందటి ప్రశాంతత’ అని వ్యాఖ్యానించారు. యూరో రుణ సంక్షోభం ప్రమాద తీవ్రత ఏమీ తగ్గలేదని హెచ్చరించారు. ‘తుపాను’ తాకిడికి గురయ్యే మొదటి దేశంగా గ్రీస్‌కు ఇప్పుడు తక్షణమే మరో బెయిలవుట్ అవసరమని యూరో విశ్లేషకులు ఎప్పుడో తేల్చేశారు. తేల్చాల్సిన జర్మనీ ఛాన్స్లర్ మర్కెల్ పెదవి విప్పలేదు. జర్మన్ ఆర్థిక శాఖ గ్రీస్ కోసం రూపొందించిన మూడో బెయిలవుట్ విషయం వారం క్రితం బయటపడింది. గ్రీస్ కోసం ఒకటి నుంచి రెండు వేల కోట్ల డాలర్ల రుణాన్ని సిద్ధం చేశారు. కాకపోతే అది మరింత కఠినమైన పొదుపు చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ‘క్యారట్లు కావాలిగానీ, కట్టె మాత్రం వద్దంటే ఎట్లా కుదురుతుంది?’ అని ఈయూ అధ్యక్షుడు హెర్మన్ వాన్ రోంపీ బుధవారం మరో సందర్భంగా ఉన్న విషయాన్ని నిర్భయంగా చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) నిపుణులు కొందరు వారితో విభేదిస్తున్నారు. ‘గ్రీస్‌కు ఇప్పుడు కావాల్సింది బెయిలవుట్ రుణ ప్యాకేజీ కాదు. రుణ పునర్వ్యవస్థీకరణ. ప్రభుత్వ వ్యయంలో ఇంకా కోతలు విధించడం గానీ, ప్రజలపై ఇంకా పన్నులు విధించడం గానీ అసాధ్యం’ అని వారి వాదన. గ్రీస్ రుణాన్ని మాఫీ చేయడం తప్ప గత్యంతరం లేదని వారు అంటున్నారు. ‘ధార్మికత’తో సంక్షోభాలు పరిష్కారం కావని మర్కెల్ దృఢ విశ్వాసం. గ్రీస్, స్పెయిన్, సైప్రస్‌ల వంటి దేశాలకు ఇచ్చిన రుణాలను ముక్కు పిండి, వడ్డీతో సహా వసూలు చేయకపోతే... అక్కడి సంక్షోభానికి కాళ్లొచ్చి స్వదేశంలోకే ప్రవేశిస్తుందని ఆమె ఆందోళన. పైగా ఆధునిక యుగంలో రుణాన్ని మించిన ఆధిపత్య సాధనం ఇంకేముంది? గ్రీస్ వచ్చే రెండేళ్లలో ప్రభుత్వ వ్యయంలో 15 వందల కోట్ల యూరోల కోతలు విధించాలి. కానీ జనాభాలో 28 శాతం, యువతలో 60 శాతం నిరుద్యోగులుగా ఉన్న దేశంలో పన్నులను ఎంతగా పెంచినా పన్నుల రాబడి మాత్రం తగ్గిపోతూనే ఉంది. అసలు ఉద్యోగమే లేకపోతే పన్నులు ఎక్కడి నుంచి కడతారు? అందుకే ప్రభుత్వం ఆస్తిపన్నుల రూపంలో ఇంత ఇల్లో, స్థలమో ఉన్న చిన్న ఆస్తిపరులను దివాలా తీయిస్తోంది. ఆదాయపు పన్ను, దానిపై విధించే సౌహార్ద్రతాపన్ను, వృత్తి పన్నులుగాక ఆస్తి యాజమాన్యంపై కనీసం 40 రకాల పన్నులు విధిం చారు. కాబట్టే 2010-13 మధ్య ఆస్తి పన్ను రాబడి 5 కోట్ల యూరోల నుంచి 350 కోట్ల యూరోలకు పెరిగింది. గ్లోరియా అలియియాన్ని గోడు వింటే నయా పేదలుగా దిగజారుతున్న భద్రజీవుల బాధలు అర్థమవుతాయి. ఆమె చిన్నప్పుడే తల్లిదండ్రులు దక్షిణ ఆఫ్రికాకు వెళ్లి, జీవితాంతం రాగి గనుల్లో పని చేశారు. వారు కొన్న ఇల్లూ, స్థలమే కాదు ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ కూడా పన్ను బకాయిలకు గానూ ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఆస్తుల విలువ కంటే పన్నుల బకాయిలు ఎక్కు గా ఉంటే జైలు శిక్షలు కూడా వేస్తామంటున్నారు. అందుకోసం తాజాగా పన్ను బకాయిలను క్రిమినల్ నేరంగా మార్చేశారు. దీంతో ఆర్థిక భద్రతగా భావించిన ఆస్తులు గుదిబండలుగా మారుతున్నాయి. పన్నుల బకాయిల కోసం ప్రజలను వీధులపాలు చేసి ప్రభుత్వం సంపాదించిన ఆస్తులను కొనేవారెవరు? గత ఏడాది కాలంలో వంద ఆస్తులు కూడా వేలంలో అమ్ముడుపోలేదు. మరి ఎందుకీ దౌర్జన్యం? ప్రభుత్వం పేరున ఆస్తులుంటే విదేశీ రుణాలకు హామీలవుతాయని సమాధానం. ఇలాంటి ఆధిపత్య ధోరణులే రెండు ప్రపంచ యుద్ధాలకు దారితీశాయని సుప్రసిద్ధ జర్మన్ సామాజిక శాస్త్రవేత్త, తత్వవేత్త జూజెన్ హాబర్మాన్ బుధవారం హెచ్చరించారు. ‘‘మర్కెల్ పెట్టుబడి అనుకూల విధానాలు ప్రజాస్వామ్యాన్ని లోతుగా గాయపరుస్తున్నాయి. సంక్షోభ దేశాలకు ఆమె చేస్తున్న విపరీతపు చికిత్స చెప్పనలవిగాని సామాజిక దుష్పర్యవసానాలకు, యూరప్ అంతటా జాతీయోన్మాదపు సరికొత్త వెల్లువకు దారి తీస్తోంది’’ అని అన్నారు. కమ్యూనిజాన్ని వ్యతిరేకించే ఆచరణాత్మకవాద తత్వవేత్త హాబర్మాన్ చెప్పినదే గ్రీస్‌లో అక్షరాలా జరుగుతోంది. పచ్చి మితవాద జాతీయోన్మాద పక్షం ‘గోల్డెన్ డాన్’ వలస వచ్చిన విదేశీయులపై దాడులు సాగిస్తోంది. అధికారంలోకి వస్తే విదేశీయులను పారదోలేసి నిరుద్యోగం, పేదరికం, తదితర సకల రోగాలను చిటికెలో మటు మాయం చేస్తానంటూ ఊదరగొడుతుంది. హిట్లర్ స్వస్తిక గుర్తును తలపించే జెండా పట్టిన ఆ నియో-నాజీ పార్టీ అప్పుడే గ్రీస్‌లో మూడో అతి పెద్ద రాజకీయ పక్షంగా మారింది. - పిళ్లా వెంకటేశ్వరరావు -
వ్యభిచారం డిస్కౌంట్ ఆఫర్లపై నిషేధం!
దేశంలో వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళలకు ప్రభుత్వం తరఫున అందిస్తున్న డిస్కాంట్లను నిలుపుదల చేయాలని జర్మనీలోని రాజకీయ పార్టీలు నిర్ణయించాయి. అందుకు సంబంధించిన ప్రణాళికులు సిద్ధం చేసినట్లు సెంటర్ లెఫ్ట్ సోషల్ డెమెక్రటిక్స్ పార్టీ అధికార ప్రతినిధి అంజ స్ట్రయిడర్ ఇక్కడ వెల్లడించారు. త్వరలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ కలసి ఆ విషయంపై సంప్రదింపులు జరుపుతామని తెలిపారు. 2002 వ సంవత్సరంలో దేశంలో వ్యభిచారాన్ని జర్మనీ ప్రభుత్వం చట్టబద్దం చేసింది. దాంతో వ్యభిచారం పేరుతో నిర్వహకులు దోపిడి పాల్పడుతున్నారని, ఆ క్రమంలో వ్యభిచార గృహాల నిర్వహకులు ఆగడాలు శృతి మించుతున్నాయని దేశ్యవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. వారి ఆగడాలకు అడ్డుకట్ట వేసే క్రమంలో రాజకీయపార్టీలు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో సోమవారం సమావేశమైనాయి. దాంతో దేశం వ్యభిచారానికి ప్రభుత్వం అందిస్తున్న రాయితీ (డిస్కోంట్) నిలిపివేయాలని ఆ పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. ఆ ఆమోదాన్ని సాధ్యమైనంత త్వరలో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌కు అందజేయనున్నాయి. -
మెర్కెల్‌కు ఇందిర శాంతి బహుమతి
న్యూఢిల్లీ: యూరప్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్(59)కు ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. 2013 ఏడాదికి గాను ‘ఇందిరాగాంధీ నిరాయుధీకరణ, అభివృద్ధి శాంతి బహుమతి’కి ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఆమెను ఎంపిక చేసింది. ప్రపంచ ఆర్థిక సుస్థిరత, శాంతి కోసం చేసిన కృషికి గాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఇందిరా మెమోరియల్ ట్రస్టు మంగళవారం తెలిపింది. భారత్, ఇతర వర్ధమానదేశాలతో సంబంధాల బలోపేతానికి ఆమె కృషి చేశారని కొనియాడింది. -
ఎన్నికల్లో మెర్కెల్ హ్యాట్రిక్
బెర్లిన్: జర్మనీ పార్లమెంట్ ఎన్నికల్లో చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ నేతృత్వంలోని క్రిస్టియన్ డెమొక్రాటిక్ యూనియన్(సీడీయూ) హ్యాట్రిక్ సాధించింది. గడచిన రెండు దశాబ్దాల ఫలితాల కన్నా అధిక సీట్లు కైవసం చేసుకుని విజయ దుందుభి మోగించింది. అయినప్పటికీ, అధికార పగ్గాలు చేపట్టేందుకు అవసరమైన పూర్తిస్థాయి మెజారిటీకి 4 సీట్లు తగ్గడం గమనార్హం. సోమవారం వెల్లడించిన అధికారిక ఫలితాల్లో సీడీయూ దాని భాగస్వామ్య క్ట్రిస్టియన్ సోషల్ యూనియన్(సీఎస్‌యూ)లు 41.7 శాతం ఓట్లతో భారీ విజయం నమోదు చేసుకున్నాయి. యూరో జోన్లో ప్రస్తుతం నెలకొన్న పెను ఆర్థిక సంక్షోభం నేపథ్యంలోనూ ప్రజలందరూ 59 ఏళ్ల మెర్కెల్ నాయకత్వానికే మద్దతు పలకడం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. -
జర్మనీ పీఠం మళ్లీ మెర్కెల్‌దే?
బెర్లిన్: జర్మనీ పార్లమెంటుకు ఆదివారం జరిగిన ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. 6.2 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య పోటీ తీవ్రంగా ఉందని ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నాయకత్వంలోని సీడీయూ-సీఎస్‌యూ -ఎఫ్డీపీ కూటమి మూడోసారి విజయం సాధించే అవకాశాలున్నాయి. ఆమె నాయకత్వంలోని సంప్రదాయ, ఉదారవాద కూటమికి 45 శాతం ఓట్లు దక్కే సూచనలున్నాయి. ప్రతిపక్ష కూటమి (ఎస్డీపీ-గ్రీన్పార్టీ-లెఫ్ట్ పార్టీ)కి 44 శాతం ఓట్లు లభించే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి.