బెర్లిన్ : తన ఆరోగ్యం గురించి వస్తోన్న పుకార్లను ఖండిచారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్. కేవలం వేడి ఎక్కువగా ఉండటం మూలనా డిహైడ్రేషన్‌కు గురయినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఓ అధికారిక కార్యక్రమంలో భాగంగా మార్కెల్ ఉక్రేయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీని సందర్శించారు. ఈ క్రమంలో మిట్ట మధ్యాహ్నం ఎండలో నిల్చుని గౌరవ వందనం స్వీకరించారు మార్కెల్. దాంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురై వణకడం ప్రారంభించారు. పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను నీడకు చేర్చి మంచి నీళ్లు అందించి ప్రథమ చికిత్స చేశారు.
ఈ క్రమంలో ఏంజెలా ఆరోగ్యం గురించి వదంతలు వ్యాప్తి చేందడం ప్రారంభించాయి. దాంతో ఈ విషయం గురించి ఆమె వివరణ ఇస్తూ.. ‘వేడి ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్‌కు గురయ్యానంతే. ఓ మూడు గ్లాసుల మంచి నీళ్లు తాగాను. దాంతో అంతా సర్దుకుంది’ అన్నారు మార్కెల్. 2014 ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న మార్కెల్ ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. రక్తపోటు పెరగడంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2021 వరకూ రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించారు మార్కెల్. వయసు పైబటమే కాక ఆరోగ్యం కూడా సహకరించనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment