
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమై.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజుకి (సోమవారం) నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం ఆ దేశ (ఉక్రెయిన్) ఆర్థిక వ్యవస్థ తిరోగమన సంకేతాలను సూచిస్తోంది. అలసిపోయిన దళాలు సైతం.. తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడుతూనే ఉన్నాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, రష్యాతో శాంతి ఒప్పందాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ చర్చలలో ఉక్రెయిన్ భాగం కాకపోవడంతో.. కైవ్ దాని యూరోపియన్ మిత్రదేశాలు సైత షాక్‌కు గురయ్యాయి. అయితే యూరప్, కెనడా ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి.
సోమవారం.. యూరప్, కెనడా నుంచి అగ్ర నాయకులు ఉక్రెయిన్‌కు తమ నిరంతర మద్దతును చూపించడానికి కైవ్ చేరుకున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా రాజధాని రైల్వే స్టేషన్‌లో ఉక్రేనియన్ అధికారులను కలిశారు.
ఉక్రెయిన్ మనుగడ కోసం కాదు
ఈ పోరాటం.. కేవలం ఉక్రెయిన్ మనుగడ కోసం మాత్రమే కాదు, యూరప్ భవిష్యత్తు కోసం అని.. వాన్ డెర్ లేయన్ యూరప్ వైఖరిని స్పష్టం చేశారు. ముఖ్యంగా రష్యాతో ట్రంప్ శాంతి ప్రయత్నం.. కైవ్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉన్న ఒప్పందం గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సమయంలో, ఉక్రెయిన్ రక్షణను ఎలా బలోపేతం చేయాలనే దానిపై నాయకులు, అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు.
యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తోంది, మాస్కోతో ప్రత్యక్ష చర్చలకు ఒత్తిడి తెస్తోంది. వారాంతంలో.. రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్, రాబోయే రోజుల్లో అమెరికా, రష్యా అధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతాయని ధృవీకరించారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ముఖాముఖి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.
వ్లాదిమిర్ జెలెన్‌స్కీని.. ట్రంప్ నియంత అని అభివర్ణించారు. ట్రంప్ చర్యను ఎదుర్కోవడానికి యూరోపియన్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే.. యూరోపియన్ యూనియన్ మార్చి 6న బ్రస్సెల్స్‌లో తన ఉక్రెయిన్ విధానాన్ని చర్చించడానికి అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చింది.
ఉక్రెయిన్ నష్టాలు
యుద్ధభూమిలో, ఉక్రెయిన్ భారీ నష్టాలను చూసింది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ ప్రకారం.. 2022 నుంచి ఉక్రెయిన్ తన భూమిలో దాదాపు 11% కోల్పోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు కోల్పోయిన మొత్తం భూమి 18 శాతం అని తెలుస్తోంది. ఇందులో క్రిమియా, డాన్‌బాస్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.
దేశ జీడీపీ కూడా గణనీయంగా పడిపోయింది. రష్యాలో ధరల పెరుగుదల 9.5 శాతం ఉంటే.. ఉక్రెయిన్‌లో 12 శాతంగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం, యుద్ధం ప్రారంభంలో రష్యా స్థూల దేశీయోత్పత్తి (GDP) -1.3 శాతానికి పడిపోయింది. కానీ ఆ తర్వాత గత రెండు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 3.6 శాతానికి చేరుకుంది. కానీ ఇప్పుడు అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కారణంగా వివిధ రంగాలలో అమ్మకాలు మరియు ఆర్డర్లు పడిపోవడంతో రష్యన్ ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉక్రెయిన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం, ఈ సంవత్సరం GDP వృద్ధి 2.7 శాతానికి మందగించవచ్చని అంచనా.
ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?
యుద్ధం కారణంగా.. 60 లక్షల కంటే ఎక్కువమంది ఉక్రేనియన్లు యూరప్‌కు పారిపోయారు. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్ అత్యధిక సంఖ్యలో ఆతిథ్యం ఇస్తున్నాయి. మరో 10 లక్షల అకంటే ఎక్కువమంది ఉక్రెయిన్లు రష్యాలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. యుద్ధంలో గాయపడిన, మరణించిన వారి సంఖ్య 40,000 కంటే ఎక్కువే. ఇందులో చాలామంది వైమానిక దాడులు, ఫిరంగి దాడులలో కన్నుమూశారు. మృతులలో 6,203 మంది పురుషులు, 669 మంది పిల్లలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment