
కీవ్: రష్యా శుక్రవారం 501 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను ఆ దేశానికి అప్పగించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఆక్రమణ మొదలయ్యాక ఇంత పెద్ద సంఖ్యలో సైనికుల మృతదేహాలను అప్పగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
డొనెట్‌స్క్‌లోని అవ్‌డివ్కాపై పట్టుకోసం రష్యా ఆర్మీతో జరిగిన పోరులో వీరంతా వీరమరణం పొందారని వెల్లడించారు. మృతులను అధికారులు గుర్తించాక కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. ఇలా ఉండగా, గురువారం రాత్రి తమ భూభాగంపైకి రష్యా ఏకంగా 135 షహీద్ తదితర డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. చాలా వరకు డ్రోన్లను కూలి్చవేశామని పేర్కొంది. నష్టం, మృతుల వివరాలను మాత్రం తెలపలేదు