ukrain
-
అమెరికా.. ఉక్రెయిన్ మధ్య సయోధ్య ఎలా?
లండన్: అధినేతలు డొనాల్డ్ ట్రంప్, జెలెన్స్కీ వాగ్యుద్ధంతో అమెరికా, ఉక్రెయిన్ సంబంధాలు అకస్మాత్తుగా దెబ్బతిన్న వైనం యూరప్‌ను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. వాటిని తిరిగి చక్కదిద్దే మార్గాల కోసం అవి మల్లగుల్లాలు పడుతున్నాయి. ఈ అంశంపై చర్చించేందుకు యూరప్ దేశాధినేతలు ఆదివారం లండన్‌లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇందుకు బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ చొరవ తీసుకున్నారు. ‘సురక్షిత యూరప్ కోసం’ పేరిట జరిగిన ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చంతా అమెరికా, ఉక్రెయిన్ సంబంధాల చుట్టే తిరిగినట్టు సమాచారం. ఉక్రెయిన్‌కు మరిన్ని నిధులు అందించాలని నేతలు నిర్ణయానికి వచ్చారు. అవసరమైతే యూరప్ దేశాలన్నీ తమ సైన్యాన్ని కూడా ఉక్రెయిన్‌కు పంపేందుకు సిద్ధంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ కీలక భేటీలో జెలెన్స్కీతో పాటు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా పాల్గొన్నారు. తరానికోసారే! యూరప్ భద్రత కోసం ఖండంలోని దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాల్సిన అవసరముందని స్టార్మర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇలాంటి అవసరం, అవకాశం తరానికి ఒక్కసారి మాత్రమే వస్తాయని అన్నారు. ‘‘రష్యా బారి నుంచి ఉక్రెయిన్‌కు శాశ్వత రక్షణ కల్పించాలి. యూరప్‌లోని ప్రతి దేశం భద్రతకూ ఇది చాలా కీలకం’’ అని చెప్పారు. ‘‘ఇందుకు మూడంచెల మార్గముంది. ఉక్రెయిన్ను సాయుధంగా పటిష్టపరచాలి. దాని భద్రతకు యూరప్ మొత్తం పూచీగా ఉండాలి. ఇక ఉక్రెయిన్‌తో కుదిరే ఒప్పందాలను రష్యా అధ్యక్షుడు పుతిన్ మళ్లీ తుంగలో తొక్కకుండా చూసే బాధ్యతను అమెరికా తీసుకోవాలి’’ అని ప్రతిపాదించారు. అంతకుముందు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో స్టార్మర్ విడిగా భేటీ అయ్యారు. అందులో జెలెన్స్కీ కూడా పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్ కాల్పుల విరమణకు నిర్దిష్ట కార్యారణ ప్రణాళిక రూపొందించి అమెరికా ముందుంచాలని వారు నిర్ణయానికి వచ్చారు. ఈ ప్రయత్నంలో మిగతా యూరప్ దేశాలన్నింటినీ కలుపుకుని వెళ్తామని చెప్పారు. అంతకుముందు ఉక్రెయిన్‌కు 3.1 బిలియన్ డాలర్ల రుణం అందించేందుకు బ్రిటన్ అంగీకరించింది.ట్రంప్‌తోనూ మాట్లాడా: స్టార్మర్ శిఖరాగ్రం అనంతరం నేతలు మీడియాతో మాట్లాడారు. వీలైనంత త్వర లో మరోసారి సమావేశమై అన్ని అంశాలపైనా లోతుగా చర్చించుకోవాలని నిర్ణయించినట్టు స్టార్మర్ వెల్లడించారు. అమెరికా నమ్మదగ్గ భాగస్వామి కాదన్న విమర్శలను తోసిపుచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం యూరప్ భద్రతకు చాలా కీలకమని పునరుద్ఘాటించారు. ఈ విషయమై ట్రంప్‌తో శనివారం రాత్రి ఫోన్లో సుదీర్ఘంగా మాట్లాడినట్టు వివరించారు. ‘‘యూరప్ ఒకరకంగా నాలుగు రోడ్ల కూడలిలో నిలిచింది. కనుక ప్రతి అడుగూ ఆచితూచి వేయాల్సిన సమయమిది. పరిస్థితులన్నీ పూర్తిగా అదుపు తప్పేందుకు ఒకే ఒక్క తప్పుడు నిర్ణయం చాలు’’ అని హెచ్చరించారు. -
యుద్ధభూమిలో ఉక్రెయిన్.. మూడేళ్ళలో జరిగిన నష్టాలు
ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రారంభమై.. మూడేళ్లు పూర్తయ్యాయి. ఈ రోజుకి (సోమవారం) నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతోంది. ప్రస్తుతం ఆ దేశ (ఉక్రెయిన్) ఆర్థిక వ్యవస్థ తిరోగమన సంకేతాలను సూచిస్తోంది. అలసిపోయిన దళాలు సైతం.. తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి పోరాడుతూనే ఉన్నాయి.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా, రష్యాతో శాంతి ఒప్పందాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ చర్చలలో ఉక్రెయిన్ భాగం కాకపోవడంతో.. కైవ్ దాని యూరోపియన్ మిత్రదేశాలు సైత షాక్‌కు గురయ్యాయి. అయితే యూరప్, కెనడా ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్నాయి.సోమవారం.. యూరప్, కెనడా నుంచి అగ్ర నాయకులు ఉక్రెయిన్‌కు తమ నిరంతర మద్దతును చూపించడానికి కైవ్ చేరుకున్నారు. యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో.. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా రాజధాని రైల్వే స్టేషన్లో ఉక్రేనియన్ అధికారులను కలిశారు.ఉక్రెయిన్ మనుగడ కోసం కాదుఈ పోరాటం.. కేవలం ఉక్రెయిన్ మనుగడ కోసం మాత్రమే కాదు, యూరప్ భవిష్యత్తు కోసం అని.. వాన్ డెర్ లేయన్ యూరప్ వైఖరిని స్పష్టం చేశారు. ముఖ్యంగా రష్యాతో ట్రంప్ శాంతి ప్రయత్నం.. కైవ్ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉన్న ఒప్పందం గురించి ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సమయంలో, ఉక్రెయిన్ రక్షణను ఎలా బలోపేతం చేయాలనే దానిపై నాయకులు, అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో చర్చలు జరిపారు.యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తోంది, మాస్కోతో ప్రత్యక్ష చర్చలకు ఒత్తిడి తెస్తోంది. వారాంతంలో.. రష్యా ఉప విదేశాంగ మంత్రి సెర్గీ ర్యాబ్కోవ్, రాబోయే రోజుల్లో అమెరికా, రష్యా అధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు కొనసాగుతాయని ధృవీకరించారు. ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలో ముఖాముఖి సమావేశం నిర్వహించే అవకాశం ఉందని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.వ్లాదిమిర్ జెలెన్స్కీని.. ట్రంప్ నియంత అని అభివర్ణించారు. ట్రంప్ చర్యను ఎదుర్కోవడానికి యూరోపియన్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే.. యూరోపియన్ యూనియన్ మార్చి 6న బ్రస్సెల్స్‌లో తన ఉక్రెయిన్ విధానాన్ని చర్చించడానికి అత్యవసర శిఖరాగ్ర సమావేశానికి పిలుపునిచ్చింది. ఉక్రెయిన్ నష్టాలుయుద్ధభూమిలో, ఉక్రెయిన్ భారీ నష్టాలను చూసింది. ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ ప్రకారం.. 2022 నుంచి ఉక్రెయిన్ తన భూమిలో దాదాపు 11% కోల్పోయింది. 2014 నుంచి ఇప్పటి వరకు కోల్పోయిన మొత్తం భూమి 18 శాతం అని తెలుస్తోంది. ఇందులో క్రిమియా, డాన్‌బాస్‌లోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి.దేశ జీడీపీ కూడా గణనీయంగా పడిపోయింది. రష్యాలో ధరల పెరుగుదల 9.5 శాతం ఉంటే.. ఉక్రెయిన్‌లో 12 శాతంగా ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ప్రకారం, యుద్ధం ప్రారంభంలో రష్యా స్థూల దేశీయోత్పత్తి (GDP) -1.3 శాతానికి పడిపోయింది. కానీ ఆ తర్వాత గత రెండు సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 3.6 శాతానికి చేరుకుంది. కానీ ఇప్పుడు అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కారణంగా వివిధ రంగాలలో అమ్మకాలు మరియు ఆర్డర్లు పడిపోవడంతో రష్యన్ ఆర్థిక వ్యవస్థ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఉక్రెయిన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా ప్రకారం, ఈ సంవత్సరం GDP వృద్ధి 2.7 శాతానికి మందగించవచ్చని అంచనా.ఇదీ చదవండి: రోజుకు రూ.27 కోట్లు విరాళం ఇచ్చిన వ్యక్తి.. ఈయన గురించి తెలుసా?యుద్ధం కారణంగా.. 60 లక్షల కంటే ఎక్కువమంది ఉక్రేనియన్లు యూరప్‌కు పారిపోయారు. జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్ అత్యధిక సంఖ్యలో ఆతిథ్యం ఇస్తున్నాయి. మరో 10 లక్షల అకంటే ఎక్కువమంది ఉక్రెయిన్లు రష్యాలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రకారం.. యుద్ధంలో గాయపడిన, మరణించిన వారి సంఖ్య 40,000 కంటే ఎక్కువే. ఇందులో చాలామంది వైమానిక దాడులు, ఫిరంగి దాడులలో కన్నుమూశారు. మృతులలో 6,203 మంది పురుషులు, 669 మంది పిల్లలు ఉన్నారు. -
చెర్నోబిల్ రియాక్టర్‌పై రష్యా డ్రోన్ దాడి
కీవ్: తమ రాజధాని కీవ్ ప్రాంతంలో ఉన్న చెర్నోబిల్ అణువిద్యుత్ ప్లాంట్ రక్షణ కవచంపై రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. శక్తివంతమైన పేలుడు పదార్థాలతో గురువారం రాత్రి జరిపిన ఈ దాడితో ప్రొటెక్టివ్ కంటెయిన్మెంట్ షెల్ దెబ్బతిందని, మంటలు చెలరేగాయని ఆయన చెప్పారు. అయితే, ఈ ఘటనతో ఆ ప్రాంతంలో రేడియో ధార్మిక స్థాయిలు సాధారణంగానే ఉన్నాయన్నారు. మంటలను అదుపు చేశామన్నారు. పుతిన్ చర్చలకు సిద్ధంగా లేరన్న విషయం దీనినిబట్టి అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఘటనకు రష్యాను బాధ్యురాలిగా చేయాలన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమవనున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దాడి సమాచారాన్ని అమెరికాతో పంచుకుంటామని జెలెన్స్కీ చెప్పారు. ఈ ఘటనను అంతర్జాతీయ అణు శక్తి ఏజెన్సీ(ఐఏఈఏ) ధ్రువీకరించింది. అయితే, దాడిలో రక్షణ కవచం దెబ్బతిన్నట్లుగా ఎటువంటి ఆనవాళ్లు కనిపించలేదని వివరించింది. అణు రియాక్టర్‌కు బయటివైపు రక్షణగా 2016లో అత్యంత భారీ కాంక్రీట్ నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద 1986 చెర్నోబిల్ దుర్ఘటన జరిగినప్పుడే లోపలి వైపు రక్షణ ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. వీటివల్ల ప్రమాదకరమైన రేడియో ధార్మికత బయటకు లీక్ అయ్యేందుకు అవకాశం లేదు. కాగా, జెలెన్స్కీ ఆరోపణలపై రష్యా తీవ్రంగా స్పందించింది. అణు వ్యవస్థలు, అణు విద్యుత్ ప్లాంట్లపై దాడులు జరిగాయంటూ ఉక్రెయిన్ చెప్పేదంతా అబద్ధమని కొట్టిపారేసింది. తమ సైన్యం ఇలాంటివి చేయదని రష్యా అధ్యక్ష భవనం ప్రతినిధి దిమిత్రీ పెష్కోవ్ స్పష్టం చేశారు. శాంతి ఒప్పందం కోసం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో చర్చలకు అవరోధం కలిగించేందుకు ఉక్రెయినే ఇలాంటివి చేయిస్తోందని ఆరోపించారు. -
‘కిమ్’ సైనికులు కొందరు చనిపోయారు: జెలెన్స్కీ
కీవ్: రష్యా తరపున తమపై యుద్ధంలో పాల్గొన్న ఉత్తరకొరియా సైనికుల్లో కొందరు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా పెద్దమొత్తంలో సైనికులను రష్యాకు పంపిన విషయం తెలిసిందే.తమపై యుద్ధానికి కుర్స్క్లో 11వేల మంది ఉత్తరకొరియా సైనికులను మోహరించినట్లు గతంలో జెలెన్స్కీ చెప్పారు. ఈనేపథ్యంలోనే తాజాగా అక్కడ జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆ సైనికుల్లో కొందరు ఉక్రెయిన్ దళాల చేతుల్లో మరణించినట్లు తెలిపారు. తాము ఈ తరహా కఠిన చర్యలు తీసుకోకపోతే ఉత్తరకొరియా మరిన్ని బలగాలను పంపే అవకాశం ఉందన్నారు. కాగా, రెండేళ్ల నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా తాజాగా ఎంటరైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్జోంగ్ఉన్కు సత్సంబంధాల వల్లే ఉత్తర కొరియా తమ సైనికులను రష్యాకు పంపిందని ఆరోపణలున్నాయి. యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామలుంటాయని ఉక్రెయిన్ ఇప్పటికే హెచ్చరించింది.ఇదీ చదవండి: కెనడాలో ఆ మీడియాపై నిషేధం -
500 మంది సైనికుల మృతదేహాలు.. ఉక్రెయిన్‌కు అప్పగించిన రష్యా
కీవ్: రష్యా శుక్రవారం 501 మంది ఉక్రెయిన్ సైనికుల మృతదేహాలను ఆ దేశానికి అప్పగించింది. 2022 ఫిబ్రవరిలో రష్యా ఆక్రమణ మొదలయ్యాక ఇంత పెద్ద సంఖ్యలో సైనికుల మృతదేహాలను అప్పగించడం ఇదే మొదటిసారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. డొనెట్స్క్లోని అవ్డివ్కాపై పట్టుకోసం రష్యా ఆర్మీతో జరిగిన పోరులో వీరంతా వీరమరణం పొందారని వెల్లడించారు. మృతులను అధికారులు గుర్తించాక కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు. ఇలా ఉండగా, గురువారం రాత్రి తమ భూభాగంపైకి రష్యా ఏకంగా 135 షహీద్ తదితర డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. చాలా వరకు డ్రోన్లను కూలి్చవేశామని పేర్కొంది. నష్టం, మృతుల వివరాలను మాత్రం తెలపలేదు -
అణువిద్యుత్ కేంద్రంపై దాడి రష్యా పనే: జెలెన్స్కీ
కీవ్: తమ దేశంలోని జపోర్జియా అణువిద్యుత్ కేంద్రంపై రష్యా దళాలు పేలుళ్లకు పాల్పడ్డాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. తమను బ్లాక్ మెయిల్ చేసేందుకే వారు ఈ చర్యకు పాల్పడ్డారన్నారు. మరోవైపు రష్యా మాత్రం ఉక్రెయిన్ సైన్యం జరిపిన దాడుల వల్లే మంటలు వ్యాపించాయని చెబుతోంది. యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్ కేంద్రాల్లో ఒకటైన జపోర్జియా న్యూక్లియర్ పవర్‌ప్లాంటులో ప్రస్తుతం మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే ఇక్కడ ఎలాంటి రేడియేషన్ లీక్ కాలేదని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సిబ్బంది తెలిపారు. మంటలు వ్యాపించిన ప్రదేశానికి తమను అనుమతించాలని వారు కోరుతున్నారు.కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైన 2022లోనే ఈ అణువిద్యుత్ కేంద్రాన్ని రష్యాదళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అప్పటి నుంచి ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. తాజాగా ఈ విద్యుత్కేంద్రం కూలింగ్టవర్లపై డ్రోన్ దాడి జరిగింది. -
ఉక్రెయిన్ రాజధానిపై మిసైల్ దాడులు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై శనివారం(ఆగస్టు10) అర్ధరాత్రి రష్యా మిసైల్ దాడులకు దిగింది. రష్యా నుంచి వచ్చిన బాలిస్టిక్ మిసైళ్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకుంది. దాడుల విషయాన్ని కీవ్ నగర మేయర్ కిట్ష్కో నిర్ధారించారు. కీవ్‌పై ఎయిర్ రెడ్ అలర్ట్ కొనసాగుతుందని తెలిపారు. కీవ్ శివార్లలో రెండు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు ప్రత్యక్షసాక్షులు చెప్పారు. దాడుల్లో ప్రాణ, ఆస్తి నష్టమేమైనా జరిగిందా లేదా అనేది తెలియరాలేదు. కాగా, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం 2022 నుంచి జరుగుతోంది. -
రష్యా చేసిన నష్టానికి రష్యా నిధులే వాడతారట.!
యుద్ధంతో అతలాకుతలమైన ఉక్రెయిన్ ఆదుకునేందుకు G7 దేశాలు కొత్త వ్యూహం అనుసరిస్తున్నాయి. వేర్వేరు దేశాల్లో స్తంభింపజేసిన రష్యా నిధులను ఉక్రెయిన్‌కు కేటాయించాలని ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి 50 బిలియన్ డాలర్లు సాయం చేయాలని నిర్ణయించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభించిన తర్వాత.. 300 బిలియన్ యూరోల రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులను G7 దేశాలు స్తంభింపజేశాయి. దీనిపై వచ్చిన వడ్డీలో 50 బిలియన్ డాలర్లను రుణం కింద అందించాలని ఈయూ ప్రతిపాదించింది.యుద్ధంలో ధ్వంసమైన ఉక్రెయిన్ను పునర్ నిర్మించాలంటే 486 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ ఆస్తులనే కాకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులైన ఒలిగార్చ్ ఆస్తులను కూడా EU, G7 దేశాలు స్తంభింపజేశాయి. పడవలు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఆస్తుల మొత్తం విలువ 397 బిలియన్ డాలర్లుగా యుక్రేనియన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లెజిస్లేటివ్ ఐడియాస్ అంచనా వేసింది.ఇక రష్యాకు చెందిన మెజార్టీ ఆస్తులను ఈయూ దేశాలు స్తంభింపచేశాయి. దాదాపు 185 బిలియన్ యూరోలు బెల్జియంలోని అంతర్జాతీయ డిపాజిట్ సంస్థ అయిన యూరోక్లియర్ జప్తు చేయగా.. మిగతా ఆస్తులను బ్రిటన్, ఆస్ట్రియా, జపాన్, స్విట్జర్లాండ్, యూఎస్ దేశాలు సీజ్ చేశాయి. ఇప్పుడు వీటిని ఎలా ఉపయోగించాలనే విషయంలో ఈయూ దేశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. నిజానికి.. రష్యన్ సెంట్రల్ బ్యాంక్ డబ్బును పశ్చిమ దేశాలు జప్తు చేయకుండా అంతర్జాతీయ చట్టం నిషేధిం విధించింది. ఇప్పుడు దీని నుంచి తప్పించుకునేందుకు సీజ్ చేసిన రష్యా ఆస్తుల నుంచి వచ్చే వడ్డీని ఉక్రెయిన్‌కు రుణం కింద అందించాలని భావిస్తున్నాయి.ఉక్రెయిన్‌కు రుణం అందించే విషయంలో పలు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఇంతకుముందు యూఎస్ రుణాలు అందిస్తుందని భావించగా.. ఇప్పుడు G7 దేశాలు కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాయి. ఈ దేశాల నుంచి ఎవరు రుణాన్ని అందిస్తారనే విషయంపై క్లారిటీ లేకుండా పోయింది. రుణం మంజూరు చేయాలంటే ఈయూ సభ్య దేశాలన్నింటి నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ఒకవేళ యుద్ధం నుంచి రష్యా విరమించుకొని ఆస్తులను తిరిగి ఇవ్వాల్సి వస్తే ఏం జరుగుతుందనే దానిపై కూడా ఆయా దేశాల మధ్య స్పష్టత లేన్నట్లు తెలుస్తోంది. చైనా వంటి దేశాలు పశ్చిమ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలంటే ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. -
Russia-Ukraine war: రష్యాపై డ్రోన్లతో దాడి
కీవ్: రష్యా భూభాగంపై ప్రతి దాడులను ఉక్రెయిన్ ముమ్మరం చేసింది. శుక్రవారం సరిహద్దుల్లోని రష్యాకు చెందిన రోస్టోవ్ ప్రాంతంపైకి ఉక్రెయిన్ పదుల సంఖ్యలో డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మొరొజొవ్‌స్కీ ఎయిర్ ఫీల్డ్‌లోని ఆరు సైనిక విమానాలు ధ్వంసం కాగా, మరో ఎనిమిదింటికి నష్టం వాటిల్లిందని ఉక్రెయిన్ తెలిపింది. 20 మంది సిబ్బంది చనిపోయినట్లు ప్రకటించుకుంది. మొరొజొవ్‌స్కీ ప్రాంతంపైకి వచ్చిన 44 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. వైమానిక స్థావరంపై దాడి, యుద్ధ విమానాలకు జరిగిన నష్టంపై రష్యా స్పందించలేదు. దాడుల్లో ఒక విద్యుత్ ఉపకేంద్రం మాత్రం ధ్వంసమైందని పేర్కొంది. సరటోవ్, కుర్స్క్, బెల్గొరోడ్, క్రాస్నోడార్లపైకి వచ్చిన డ్రోన్లను అడ్డుకున్నట్లు రష్యా ఆర్మీ తెలిపింది. -
Russia Ukrain War: అణుయుద్ధంపై పుతిన్ సంచలన వ్యాఖ్యలు
మాస్కో: దేశంలో సాధారణ ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికా గనుక తన సేనలను పంపితే తాము అణు యుద్ధానికి వెనకాడబోమని స్పష్టం చేశారు. మార్చ్ 15 నుంచి 17 వరకు దేశంలో ఎన్నికలు జరగనున్న సందర్భంగా ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో పుతిన్ మాట్లాడారు. ప్రస్తుతానికి అణుయుద్ధం చేయాల్సిన పరిస్థితులు లేవని, ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలు వాడాల్సిన అవసరం తనకు కనిపించడం లేదన్నారు. అయితే మిలిటరీ, సాంకేతిక కోణంలో తాము అణుయుద్ధం చేసేందుకు అన్ని విధాలా సంసిద్ధంగా ఉన్నామని పుతిన్ బాంబు పేల్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో చర్చలకు పుతిన్ సిద్ధంగా లేరని అమెరికా ప్రకటించిన తర్వాత అణుయుద్ధంపై రష్యా అధ్యక్షుడు స్పందించడం గమనార్హం. 1962 క్యూబన్ మిసైల్ సంక్షోభం తర్వాత మళ్లీ ప్రస్తుత ఉక్రెయిన్ యుద్ధం తర్వాతే రష్యా, పశ్చిమ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2022 ఫిబ్రవరిలో వేలాది మంది రష్యా సైనికులను ఉక్రెయిన్‌కు పంపి ఆ దేశంతో పూర్తిస్థాయి యుద్ధానికి పుతిన్ తెరలేపారు. కాగా, అమెరికా సేనలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశిస్తే యుద్ధం తీవ్రస్థాయికి చేరుతుందని, తాము అణ్వాయుధాలు వాడాల్సి వస్తుందని పుతిన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. ఇదీ చదవండి.. దాదాపు 70 ఏళ్ల తర్వాత రీ మ్యాచ్ -
US: మళ్లీ నాలుక మడతబెట్టిన బైడెన్
వాషింగ్టన్: బైడెన్ మళ్లీ నాలుక మడతేశారు. ఒకటి చెప్పాలనుకుని మరొకటి చెప్పి ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులకు మళ్లీ దొరికిపోయారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెమొక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్ ముందున్నారు. అయితే బైడెన్ వయసు చాలా ఎక్కువని, రెండోసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆయన పనికిరారని ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ డెమొక్రాట్లలో కూడా కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్ తన మతిమరుపు, వృద్ధాప్యాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకోవడం ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోంది. తాజాగా శుక్రవారం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో వైట్‌హౌజ్‌లో బైడెన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా ఇక నుంచి పాలస్తీనాలోని గాజాలో ఆహారపొట్లాలు విమానాల ద్వారా జారవిడుస్తుందని చెప్పబోయి ఉక్రెయిన్‌కు ఆహారం సప్లై చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే అది ఉక్రెయిన్ కాదని, గాజా అని కొద్దిసేపటి తర్వాత వైట్‌హౌజ్ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. గత నెల మొదటి వారంలో కూడా ఈజిప్ట్ ప్రధాని అబ్దిల్ ఫట్టా పేరును ప్రస్తావిస్తూ ఆయనను మెక్సికో అధ్యక్షుడిగా పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. అయితే బైడెన్ డాక్టర్లు మాత్రం ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైన ఫిట్నెస్తో ఉన్నారని స్పష్టం చేయడం గమనార్హం. ఇదీ చదవండి.. కరువు కోరల్లో గాజా.. బైడెన్ కీలక ప్రకటన -
రష్యాలోని భారతీయులకు కేంద్రం కీలక సూచన
న్యూఢిల్లీ: రష్యాలోని భారతీయులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి దూరంగా ఉండాలని కేంద్ర విదేశాంగశాఖ సూచించింది. ఈ మేరకు ఒక అడ్వైజరీని జారీ చేసింది. ఈ విషయమై శుక్రవారం విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కొందరు భారతీయులు రష్యాలో సైనికులకు సహాయకులుగా ఉండేందుకు అంగీకరిస్తూ కాంట్రాక్టులపై తెలియక సంతకాలు చేశారని జైస్వాల్ చెప్పారు. తాము ఈ విషయమై రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. రష్యాలో ఆర్మీ హెల్పర్లుగా పనిచేస్తున్న భారతీయులను విడుదల చేయించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. కాగా, ఇప్పటికే ఎంఐఎం చీఫ్,ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ అంశాన్ని ఇప్పటికే విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకొచ్చారు. భారత్ నుంచి మొత్తం 12 మంది యువకులు దళారుల మాటలు విని మోసపోయి రష్యాకు వెళ్లారని తెలిపారు. వీరిలో తెలంగాణ వాసులు ఇద్దరు ఉన్నట్లు తెలిపారు. మిగిలినవారు కర్ణాటక, గుజరాత్, కశ్మీర్, యూపీలకు చెందినవారన్నారు. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరందరినీ ఏజెంట్లు మోసం చేశారని ఆరోపించారు. బాధిత కుటుంబాలు తనకు మొరపెట్టుకోవడంతో విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌తో పాటు రష్యాలో భారత రాయబారికి కూడా లేఖలు రాశానన్నారు. ప్రభుత్వం చొరవ చూపి వారిని స్వస్థలాలకు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇదీ చదవండి.. ప్రధాని మోదీపై గూగుల్ జెమిని వివాదాస్పద సమాధానం -
కుప్పకూలిన రష్యా యుద్ధ విమానం.. 65 మంది మృతి
మాస్కో: రష్యా యుద్ధ విమానం కుప్పకూలింది. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఈ ఘోర ప్రమాదం జరిగింది. 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలు దుర్మరణం చెందారు. ఆరుగురు సిబ్బంది, మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని రక్షణ మంత్రిత్వ శాఖను వెల్లడించింది. ప్రమాదానికి కారణాలు ఇంకా సమాచారం లేదు. Video | Russian Military Plane Carrying 65 Ukrainian Prisoners Of War Crashes Read More: https://t.co/87kc55f1PP pic.twitter.com/8gFgajhX5C — NDTV (@ndtv) January 24, 2024 రష్యాకు చెందిన ఇల్యుషిన్ Il-76 సైనిక రవాణా విమానంగా అధికారులు గుర్తించారు. బెల్గోరోడ్ నగరానికి ఈశాన్య ప్రాంతంలో ఈ ఘటన సంభవించిందని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ మాట్లాడారు. తాను ఆ స్థలాన్ని పరిశీలించబోతున్నానని చెప్పారు. అత్యవసర సహాయ సిబ్బంది ఇప్పటికే సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఇదీ చదవండి: 21 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతి -
రష్యాలో మిస్టరీ డెత్స్.. ఎక్కువ మరణాలు వారివే
మాస్కో: ఉక్రెయిన్‌తో 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాలో వరుసగా సంభవిస్తున్న ప్రముఖుల మరణాలు సంచనం కలిగిస్తున్నాయి. ఇటీవల దేశంలో వరుసగా జర్నలిస్టులు మృతి చెందుతుండడంపైనా చర్చ జరుగుతోంది. తాజాగా రష్యా అధికారిక టీవీ చానల్‌కు చెందిన ఇంటర్నెట్ గ్రూపు హెడ్ కుబాన్ జోయా(48) అనుమానాస్పద స్థితిలో ఇంట్లో మృతి చెందారు. ఆమె ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని ఆమెపై విష ప్రయోగం జరిగి ఉండవచ్చని రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే న్యూస్ ఏజెన్సీ ఆర్ఐఏ నొవోస్తీ వెల్లడించింది. ఇటీవలే మరో రష్యా జర్నలిస్టు అలెగ్జాండర్ రైబిన్ కూడా ఓ హైవేపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అలెగ్జాండర్ మరణానికి కారణాలు తెలియవని అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు చెబుతున్నారు. గత నెలలో ఓ న్యూస్ పేపర్ డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పనిచేస్తున్న అన్యా సరేవా రాజధాని మాస్కో నగరంలోని తన అపార్ట్మెంట్లో మృతి చెందడం సంచలనం కలిగించింది. ఇదీచదవండి..ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం భారత్ కీలక వ్యాఖ్యలు -
Russia Ukrain War: మళ్లీ తీవ్రమవుతున్న యుద్ధం !
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా తాజాగా మరోసారి బాంబుల వర్షం కురిపించింది. సోమవారం ఉదయం జరిగిన ఈ దాడులు నివాసాలతో పాటు పరిశ్రమల భవనాలు లక్ష్యంగా సాగాయి. ఈ దాడుల్లో పలువురు పౌరులు గాయపడ్డారు. ‘శత్రువు ప్రశాంత ప్రదేశాలను కూడా వదిలిపెట్టడం లేదు’అని దేశంలోని ప్రధాన పట్టణం కీవ్ మేయర్ తెలిపారు. ‘రష్యన్లు దేనిని టార్గెట్ చేస్తున్నారో తెలియడం లేదు. ఈ దాడుల్లో పారిశ్రామిక వాడలు లక్ష్యంగా మిసైళ్లు పేల్చారు’అని కార్కివ్ మేయర్ తెలిపారు. మరోవైపు సోమవారం ఉక్రెయిన్ జరిపిన దాడుల కారణంగా తమ తమ దేశంలోని బెల్గార్డ్ పట్టణంలోని 300 మంది స్థానికులను అక్కడి నుంచి వేరే ప్రదేశాలకు తరలించినట్లు రష్యాలోని బెల్గార్డ్ గవర్నర్ తెలిపారు. బెల్గార్డ్ పట్టణం ఉక్రెయిన్ సరిహద్దులోనే ఉండటం గమనార్హం. 2022 ఫిబ్రవరి 14న ప్రారంభమైన రెండవ దశ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అప్పటి నుంచి కొనసాగుతోంది. నిజానికి ఉక్రెయిన్ భూ భాగంపై వెళుతున్న మలేషియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని కూల్చివేసిన తర్వాత 2014లోనే రష్యా, ఉక్రెయిన్ల మధ్య తొలిదశ యుద్ధం ప్రారంభమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరప్ దేశంపై సుదీర్ఘ దాడి జరగడం ఇదే తొలిసారని పరిశీలకులు చెబుతున్నారు. ఇదీచదవండి..అమెరికాలో రోడ్డు ప్రమాదం ఖమ్మం యువకుడు మృతి -
Russia Ukrain war: సొంత గ్రామంపైనే బాంబులు వేసుకున్న రష్యా
మాస్కో: ఉక్రెయిన్‌పై దాడి చేయబోయి దేశంలోని సొంత గ్రామంపైనే రష్యా ప్రమాదవశాత్తు బాంబులు వేసుకుంది. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ నిర్ధారించింది. మంగళవారం(జనవరి 2) ఉదయం తొమ్మిది గంటలకు రష్యా దక్షిణాన ఉన్న వొరొనెజ్ ప్రాంతంలోని ఓ గ్రామంపై రష్యా సైన్యం బాంబులు వేసింది. అయితే ఈ బాంబు దాడుల్లో ఎవరూ చనిపోలేదు. దాడుల్లో 6 ఇళ్లు మాత్రం దెబ్బతిన్నట్లు రష్యా మీడియా రిపోర్టు చేసింది. ‘బాంబు దాడి ఘటనపై విచారణ ఇప్పటికే ప్రారంభమైంది. బాంబు దాడిలో జరిగిన నష్టంపై అంచనాకు ఒక కమిషన్ వేశాం. బాంబు దాడులు జరిగిన ప్రాంతం నుంచి కొంత మందిని వేరే చోటికి తరలించాం’ అని వొరొనెజ్ ప్రాంత గవర్నర్ ఓల్గా స్కబెయెవా తెలిపారు. అంతకు ముందు ఈ దాడిపై గవర్నర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టులను తొలగించారు. ఈ దాడులు ఉక్రెయిన్ ఉగ్రవాదుల పనేనని ఆమె తన పోస్టుల్లో పేర్కొంది. అయితే బాంబులు వేసింది రష్యా సైన్యమేనని నిర్ధారణ అయిన తర్వాత ఆమె పోస్టులను తొలగించారు. కొంత కాలం నుంచి కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో భాగంగా ఉక్రెయిన్‌లోని నగరాలపై రష్యా తాజాగా బాంబులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో అయిదుగురు చనిపోగా 100 మంది దాకా గాయపడ్డారు.ఈ బాంబు దాడుల్లో భాగంగానే రష్యా తన సొంత ప్రాంతంపై తానే బాంబులు వేసుకోవడం గమనార్హం. ఇదీచదవండి..ఎయిర్‌పోర్టులో ఘోర ప్రమాదం.. రెండు విమానాలు ఢీ -
కెనడా ప్రధాని క్షమాపణలు
ఒట్టావా: కెనడా పార్లమెంట్లో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న వ్యక్తిని ప్రశంసించడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో క్షమాపణలు తెలిపారు. ఆ వ్యక్తి గురించి తెలుసుకోకుండా సభలో సభ్యులు ప్రశంసలు కురిపించారని వెల్లడించిన ట్రూడో.. నాజీల దురాఘాతంలో నష్టపోయినవారికి ఇబ్బందికరమైన అంశంగా ఆయన పేర్కొన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కెనడాలో పర్యటించారు.ఈ క్రమంలో హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో ఆయన ప్రసంగించారు. ఇదే సమయంలో నాజీల తరుపున యుద్ధంలో పాల్గొన్న యారోస్లావ్ హుంకా(98)ను స్పీకర్ ఆంథోనీ రోటా ఆహ్వానించారు. సభలో సభ్యులందరూ హుంకాకు చప్పట్లతో ఆహ్వానం పలికి ప్రశంసించారు. స్పీకర్ రోటా.. హుంకాను హీరోగా అభివర్ణించారు. ఇది కాస్త వివాదంగా మారింది. ఎందుకు వివాదం..? యారోస్లావ్ హుంకా రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ నాయకత్వంలో పనిచేసిన నాజీల ప్రత్యేక సైన్యంలో పోరాడారు. ఈ యుద్ధంలో యూదులను అంతం చేయడానికి హిట్లర్ భయంకరమైన హింసకు పాల్పడ్డాడు. అయితే.. ఈ యుద్ధ సమయంలో ఉక్రెయిన్ నాజీల ఆధీనంలో ఉండేది. స్వయంగా జెలెన్స్కీ కూడా తన యూదు బంధువులను ఎందరినో కోల్పోయారు. ఇలాంటి రాక్షస క్రీడ జరిపిన యుద్ధ పక్షాన నిలపడిన హుంకాను కామన్స్ సభలో సత్కరించడం వివాదంగా మారింది. యారోస్లావ్ హుంకా ఒకప్పుడు ఉక్రెయిన్ దేశస్థుడు. కెనడాకు వలస వచ్చి.. ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ వివాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడారు. క్షమాపణలు కోరినట్లు స్పష్టం చేశారు. ప్రతిపక్షాల ఒత్తిడితో హౌజ్ ఆఫ్ కామన్స్ స్పీకర్ ఆంథోనీ రోటా కూడా ఇప్పటికే తన పదవికి రాజీనామా చేశారు. అటు.. ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఓ దేశ అధ్యక్షుని పర్యటనలో ఇలాంటి ఘటనలు జరగడం దేశానికి అవమానంగా పేర్కొన్నారు. అయితే.. స్పీకర్ రోటా హుంకాను ఆహ్వానించే అంశాన్ని ప్రభుత్వంతో పంచుకోరని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ వివాదంపై రష్యా కూడా స్పందించింది. యుద్ధంలో ప్రేరేపించి ఉక్రెయిన్ను అంతం చేసే దిశగా పశ్చిమ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయని పుతిన్ ఆరోపించారు. కెనడాలో జరిగిన ఈ సంఘటన ఇందుకు ఉదాహారణగా పేర్కొన్నారు. ఇదీ చదవండి: పన్నూపై కెనడా హిందూ సంఘాల ఆగ్రహం -
సౌదీలో ‘ఇండియా జేమ్స్ బాండ్’ ఏం చేస్తున్నారు?
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలుత ఆయన జెడ్డాలో ప్రారంభమైన ఉక్రెయిన్ శాంతి సదస్సులో పాల్గొన్నారు. రష్యా హాజరు కాకుండానే ఈ రెండు రోజుల సుదీర్ఘ సదస్సు ప్రారంభమైంది. అమెరికా, చైనా సహా దాదాపు 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ‘చర్చల ద్వారా వివాదాల పరిష్కారం’ దోవల్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడాన్ని చూస్తే.. భారత్ ఈ శాంతి ప్రయత్నాల్లో తన పాత్రను నొక్కి చెబుతోందన్న బలమైన సంకేతాన్ని పంపుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన సమావేశాల్లో శాంతి, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే సూచించారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ కూడా తన గళాన్ని వినిపించింది. అయితే భారత్ నిరసన ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించినది కాదు. ఇది బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌కు సంబంధించినది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌ను కొనసాగించడంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని అన్నారు. గల్ఫ్ దేశాలతో రైలు నెట్వర్క్ అనుసంధానం చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యూహాన్ని రూపొందించే ప్రక్రియలో అజిత్ దోవల్ సౌదీ అరేబియా పర్యటన ఒక భాగం. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని నివారించేందుకు భారత్, అమెరికాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా తరచూ సౌదీ అరేబియాను సందర్శిస్తున్నారు. గల్ఫ్ దేశాలపై చైనా ఆధిపత్యాన్ని తరిమికొట్టి, అమెరికా హవాను తిరిగి స్థాపించడమే ఈ సందర్శనల ప్రధాన లక్ష్యం. ఇందు కోసం సౌదీ అరేబియా- ఇజ్రాయెల్ మధ్య స్నేహం నెలకొల్పడంలో అమెరికా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా ప్రయత్నాల్లో భాగస్వామ్యం అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నంలో భారత్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గల్ఫ్ దేశాలను రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా తన వ్యూహాత్మక ఉనికిని బలోపేతం చేసుకునేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో రైలు మార్గం ఏర్పాటుపై భారత్ చర్చలు ప్రారంభించింది. అదే సమయంలో ఈ రైలు మార్గంలో సౌదీ అరేబియాను చేర్చాలనే దిశగా ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియా వరకు రైలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపధ్యంలో భారత రైలు నెట్‌వర్క్‌లో సౌదీ అరేబియాను చేర్చాలని అజిత్ దోవల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్‌ను ‘జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణిస్తుంటారు. ఇది కూడా చదవండి: గొప్పగా ప్రారంభమై.. అంతలోనే కనుమరుగై.. పాకిస్తాన్ హిందూ పార్టీ పతనం వెనుక.. -
ఉక్రెయిన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడు
కీవ్: రష్యా దురాక్రమణకు లోనైన తమ భూభాగాలను తిరిగి దక్కించుకునేందుకు సర్వం ఒడ్డుతున్న ఉక్రెయిన్‌కు మద్దతు పలుకుతున్న దేశాల సంఖ్య పెరుగుతుంది. శనివారం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్ ఉక్రెయిన్‌లో పర్యటించారు. నాటో భేటీ కోసం లిథువేనియాకు వచి్చన యూన్ సతీసమేతంగా ఉక్రెయిన్ వెళ్లారు. ఉక్రెయిన్ సేనల తీవ్ర ప్రతిఘటనలతో వెనుతిరుగుతూ రష్యా మూకలు సృష్టించిన నరమేథానికి సాక్షిగా నిలిచిన బుచా, ఇరి్పన్ నగరాల్లోని ఘటనాస్థలాలను యూన్ సందర్శించి మృతులకు నివాళులరి్పంచారు. యుద్ధంలో తలమునకలైన ఉక్రెయిన్‌కు మానవీయ, ఆర్థికసాయం అందిస్తూ ద.కొరియా తనవంతు చేయూతనందిస్తోంది. కానీ ఆయుధసాయం మాత్రం చేయట్లేదు. యుద్ధంలో మునిగిన దేశాలకు ఆయుధాలు అందించకూడదనే తన దీర్ఘకాలిక విధానాన్ని ద.కొరియా ఇంకా కొనసాగిస్తోంది. అయితే మందుపాతరలను గుర్తించి నిరీ్వర్యంచేసే ఉపకరణాలు, అంబులెన్సులు, సైనికయేతర వస్తువులను మాత్రం అందించేందుకు తమ సమ్మతి తెలిపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోనూ యూన్ భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. యుద్ధ తీవ్రంకాకుండా ఆపగలిగే పరిష్కార మార్గాలను అన్వేíÙంచాలని నిర్ణయించారు. -
Petro Prices : త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు ?
మరోసారి భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధలరకు రెక్కలు రానున్నాయా ? అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరగకపోయినా సరే ....ఇండియాలో క్రూడాయిల్ ధరలు ఎందుకు పెరుగబోతున్నాయి ? మొన్నటి వరకు భారత్‌కు చమురు దిగుమతుల్లో డిస్కౌంట్స్ ఇచ్చిన ఆ దేశం ఒక్కసారిగా ధరలు పెంచడమే ఇందుకు కారణమా ? ముడిచమురు కోసం ఒకటి రెండు దేశాలపై ఆధారపడటమే భారత్‌కు శాపంగా మారిందా ? డిస్కౌంట్ ఫట్.. రేట్లు అప్ మరికొద్ది రోజుల్లో పెట్రోల్, డీజిల్ ధరలుకు రెక్కలు రాబోతున్నాయన్న అంచనాలు వస్తున్నాయి. ఇప్పటి దాకా ఒపెక్ దేశాల మీద ఆధారపడి చమురును దిగుమతి చేసుకున్న భారత్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తరువాత రష్యా నుంచి ముడిచమురు దిగుమతిని చేసుకోవడం ప్రారంభించింది. అది కూడా ఇతర చమురు దేశాల నుంచి దిగుమతి చేసుకునే రేటు కంటే దాదాపుగా బ్యారెల్ 30 డాలర్లకే భారత్‌కు ముడిచమురు దొరికేది. కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ పై డిస్కౌంట్‌ను డిస్కనెక్ట్ చేసింది రష్యా దీంతో ఈ భారం ఇండియాపై పడనుంది. The rest of Europe needs cheap and plentiful amount of food, to feed their welfare parasites. No Russian sanctions on their grain trade. I think Russia's goal with Ukraine has larger implications for eastern trade alliances developing in the energy markets without the petro$$$$$$ pic.twitter.com/tBTNS5McTq — Snuff Trader (@SnuffTrader) July 6, 2023 మన వాటా ఎంత? ఎంతకు కొంటున్నాం? ఉక్రెయిన్ వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్ క్రూడ్‌ను చాలా తక్కువ రేటుకు ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్‌ను రష్యా బ్యారెల్‌పై 4 డాలర్ల వరకు మాత్రమే పరిమితం చేసింది. అదీకాక రవాణా ఛార్జీలను కూడా ఇంతకు ముందున్న దానికంటే రెట్టింపు వసూలు చేస్తోంది. ఇంతకు ముందు మన చమురు అవసరాల్లో కేవలం 2శాతం మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళం కానీ యుద్ధం తరువాత తక్కువ ధరకే చమురు లభించడంతో ఇపుడు మన చమురు దిగుమతుల్లో రష్యా వాటా 44శాతానికి పెరిగింది. పశ్చిమ దేశాల ఆంక్షలెందుకు? 2022లో పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌పై బ్యారెల్‌కు 60 డాలర్ల ప్రైస్ లిమిట్‌ను విధించాయి. అయినప్పటికీ అదే ఆయిల్‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేయడమే ఇపుడు చమురు ధరలు భారీగా పెరిగేందుకు కారణంగా కనపబడుతోంది. క్రూడాయిల్‌ను బాల్టిక్, బ్లాక్ సముద్రాల నుంచి మన దేశంలోని వెస్ట్రన్ కోస్ట్‌కు డెలివరీ చేయడానికి ఈ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. Ruble surrendered long before the rest of Russia, has lost 40% of its worth since the 2022 invasion. This would be difficult for any country, far more shocking for a petro-state. Russia is Venezuela w/ bigger army. pic.twitter.com/Uf7F8yumMs — steve from virginia (@econundertow) July 6, 2023 అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరలు రష్యా ఉక్రేయిన్ పై దాడి చేస్తున్న సమయంలో బ్రెంట్ క్రూడాయిల్‌ధర 80-100 డాలర్ల దగ్గర ఉంది. అయినప్పటికీ మనకు రష్యా అతి తక్కువ ధరకే ముడిచమురును అందించడంతో ఇండియన్ రిఫైనరీ కంపెనీలు రష్యా నుంచి భారీగా ఆయిల్‌ను దిగుమతి చేసుకోవడం మొదలుపెట్టాయి. ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్, హెచ్‌పీసీఎల్ మిట్టల్ ఎనర్జీ వంటి ప్రభుత్వ కంపెనీలు, రిలయన్స్, నయారా వంటి ప్రైవేట్ కంపెనీలు రష్యన్ కంపెనీలతో సపరేట్గా డీల్స్ కుదుర్చుకుంటుండడంతో రష్యన్ క్రూడ్‌పై ఇస్తున్న డిస్కౌంట్ భారీగా తగ్గిందని కొంత మంది చమురు రంగ నిపుణులు చెబుతున్నారు. మనకెంత ధర? రష్యాకు ఎంత ఖర్చు? ప్రస్తుతం బ్యారల్ బ్రెంట్ ముడిచమురు ధర 77 డాలర్ల దగ్గర ఉంది ఈ లెక్కన రష్యా నుంచి దిగుమతి చేసుకునే ముడిచమురు ధర రవాణా ఛార్జీలతో కలిపితే ఇంచు మించు అంతే మొత్తంలో ఖర్చు అవుతుండటంతో ఇపుడు భారత్ మరోసారి ప్రత్యామ్నయ మార్గాలను అన్వేశిస్తోంది. అదీకాక మరోసారి రష్యా కంపెనీలతో బేరమాడేందుకు ఇండియాకు ఛాన్స్ ఉంది. ఎందుకంటే చైనా ఐరోపాల నుంచి రష్యా చమురుకు ప్రస్తుతం డిమాండ్ తగ్గింది సో.. ఇది భారత ప్రభుత్వానికి కలిసివచ్చే అవకాశం. సామాన్యుడి పరిస్థితేంటీ? మన ప్రభుత్వ ఆధీనంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు రష్యా నుంచి రోజుకు 2 మిలియన్ బ్యారెళ్ళ ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. సో మనం కనుక మరోసారి రష్యాతో బేరమాడితే మనకూ తక్కువ ధరలో చమురు లభించే అవకాశం ఉంది. అయినప్పటికీ మన ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఉన్న నష్టాలతో రిటైల్ మార్కెట్లో కామన్ మ్యాన్‌కు మాత్రం ఆ ప్రయోజనాలు అందడం లేదనేది నిజం. అంతర్జాతీయంగా ఎలా ముడిచమురు ధరలు ఉన్నా సామాన్యుడికి మాత్రం ప్రయోజనం శూన్యం అనేది నిపుణులు చెపుతున్నమాట. రాజ్ కుమార్, బిజినెస్ కరస్పాండెంట్ -
ఉక్రెయిన్ రెస్టారెంట్‌పై రష్యా క్షిపణి దాడి
కీవ్: తూర్పు ఉక్రెయిన్‌లో పాపులర్ పిజ్జా రెస్టారెంట్‌పై రష్యా జరిపిన క్షిపణి దాడిలో 11 మంది మరణించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ దాడిలో మరో 61 మందికి గాయాలయ్యాయి. ఇటీవల కాలంలో ఉక్రెయిన్‌పై రష్యా జరిపిన దాడుల్లో ఇదే పెద్దది. అయితే ఈ క్షిపణి రెస్టారెంట్ వైపు వెళ్లేలా ప్రయోగించడానికి ఉక్రెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి రష్యా మిలటరీకి సాయం చేశాడన్న ఆరోపణలపై ఉక్రెయిన్ అధికారులు ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. రష్యాలో ప్రైవేటు సైన్యం వాగ్నర్ సంస్థ చీఫ్ ప్రిగోజిన్ తిరుగుబాటు తర్వాత రాజకీయంగా, మిలటరీ పరంగా అంతర్గత సంక్షోభం ఉన్నప్పటికీ ఆ దేశం ఉక్రెయిన్‌పై ఇంకా దాడులు కొనసాగిస్తూనే ఉంది. -
కొనసాగుతున్న భీకర పోరు
కీవ్: ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఖేర్సన్ దక్షిణ ప్రాంతం, జపోరిజియా పరిధిలో రష్యా సేనలు స్వీయ రక్షణలో పడ్డాయని ఉక్రెయిన్ సైన్యం శనివారం ప్రకటించింది. ఇరాన్ తయారీ షాహీద్ డ్రోన్లు, క్షిపణులు, శతఘ్ని, మోర్టార్ దాడులు పెరిగాయని ఉక్రెయిన్ తెలిపింది. పలు చోట్ల జరిగిన దాడుల్లో శనివారం నలుగురు మరణించారని వెల్లడించింది. ఒడెసాలోని నౌకాశ్రయం వద్ద జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు. 24 మంది గాయపడ్డారు. 20కిపైగా షాహీద్ డ్రోన్లు, ఎనిమిది క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్ తెలిపింది. మరోవైపు యూరప్‌లోనే అతిపెద్ద అణువిద్యుత్కేంద్రం జపోరిజియా న్యూక్లియర్పవర్ ప్లాంట్‌లో చివరి రియాక్టర్‌ను అధికారులు షట్‌డౌన్ చేశారు. ప్లాంట్ సమీపంలో బాంబుదాడుల బెడద ఎక్కువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్రెయిన్ అణుఇంథన సంస్థ ఎనర్జియాటమ్ తెలిపింది. కేంద్రక విచ్ఛిత్తి చర్య, అత్యధిక ఉష్ణోద్భవం, పీడనాలను ఆపేందుకు ఆరింటిలో చిట్టచివరిదైన ఐదో రియాక్టర్లో కూలింగ్ రాడ్లను కోర్లోకి దింపేశామని తెలిపింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థకు సరఫరా చేసే విద్యుత్ లైన్లు దాడుల కారణంగా దెబ్బతిన్నాయి. దీంతో ప్లాంట్ నుంచి బయటకు విద్యుత్ సరఫరా అసాధ్యం. రియాక్టర్ షట్డౌన్కు ఇదీ ఒక కారణమేనని ఎనర్జియాటమ్ వివరించింది. ఈ ప్రాంతాన్ని ఆక్రమించాక ప్లాంట్ నిర్వహణ బాధ్యత రష్యా చేతికొచ్చింది. మరోవైపు కఖోవ్కా డ్యామ్ పేల్చివేతతో వరదమయమైన ఖేర్సన్లో ఇంకా నీరు 4.5 మీటర్ల ఎత్తులో నిలిచే ఉంది. ఈ వారంలో భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ముంపు ప్రజలకు సహాయక చర్యలకు విఘాతం కలగొచ్చని ఆ ప్రాంత గవర్నర్ ఒలెక్సాండర్ ప్రొకుడిన్ హెచ్చరించారు. దాదాపు 7 లక్షల మంది తాగునీటి కోసం అల్లాడుతున్నారని ఐక్యరాజ్యసమితి సహాయక విభాగం అధిపతి మార్టిన్ ఆందోళన వ్యక్తంచేశారు. -
ఉక్రెయిన్‌కు జర్మనీ భారీ సాయం
బెర్లిన్: ఉక్రెయిన్‌కు యుద్ధ ట్యాంకులు, విమాన విధ్వంసక వ్యవస్థలు, మందుగుండు సామగ్రి సహా సుమారు రూ.24 వేల కోట్ల విలువైన అదనపు సైనిక సాయం అందించాలని జర్మనీ నిర్ణయించింది. ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో తాము నిజాయితీతో ఉన్నామని రక్షణ మంత్రి బోరిస్ పిస్టోరియస్ తెలిపారు. రష్యాతో యుద్ధం మొదలయ్యాక మొట్ట మొదటిసారిగా జెలెన్స్కీ ఆదివారం జర్మనీకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ క్రమంలోనే జర్మనీ తాజా నిర్ణయం వెలువరించడం గమనార్హం. రష్యా ఇంధనంపై ఆధారపడిన జర్మనీని ఉక్రెయిన్ మొదటి నుంచి అనుమానిస్తోంది. అయితే, ఎంజెలా మెర్కెల్ స్థానంలో ఒలాఫ్ షోల్జ్ చాన్సెలర్‌గా బాధ్యతలు చేపట్టాక ఉక్రెయిన్–జర్మనీల మధ్య సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రస్తుతం ఇటలీలో ఉన్నారు. -
ఉక్రెయిన్‌కు నాటో భారీ ఆయుధ సాయం
కీవ్: రష్యాపై ఎదురుదాడి ప్రయత్నాల్లో ఉన్న ఉక్రెయిన్ బలగాలకు నాటో భారీ సాయం లభించింది. నాటోలోని మొత్తం 31 సభ్య దేశాలు కలిపి ఉక్రెయిన్‌కు 1,550 పోరాట వాహనాలు, 230 ట్యాంకులు, ఇతర పరికరాలతోపాటు పెద్దమొత్తంలో మందుగుండు సామగ్రిని అందించాయి. దీంతో ఉక్రెయిన్‌కు ఇచ్చిన హామీల్లో 98% వరకు నెరవేర్చినట్లయిందని నాటో సెక్రటరీ–జనరల్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ చెప్పారు. అంతేకాకుండా, కొత్తగా ఏర్పాటైన9 ఉక్రెయిన్ బ్రిగేడ్లకు చెందిన 30 వేల బలగాలకు ఆయుధ, శిక్షణ సాయం కూడా ఇచ్చామని చెప్పారు. ఇవన్నీ కలిపితే ఆక్రమిత ప్రాంతాల నుంచి రష్యాను వెళ్లగొట్టేందుకు జరిగే పోరులో ఉక్రెయిన్ పైచేయిగా నిలుస్తుందన్నారు. శాంతి చర్చల్లోనూ ఆ దేశం పటిష్ట స్థానంలో ఉంటుదన్నారు. ఇలా ఉండగా, బుధ, గురువారాల్లో రష్యా కాలిబర్ క్రూయిజ్ మిస్సైళ్ల దాడిలో ఉక్రెయిన్‌లోని మైకోలైవ్ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని అధికారులు చెప్పారు.. కనీసం ఏడుగురు చనిపోగా, మరో 33 మంది గాయపడ్డారు. దాడుల్లో 22 బహుళ అంతస్తుల భవనాలు, 12 ప్రైవేట్ ఇళ్లు, ఇతర నివాస భవనాలు దెబ్బతిన్నాయి. -
లీకుల సుడిగుండంలో అమెరికా
ఈ ప్రపంచంలో మూడింటిని దాచిపెట్టడం అసాధ్యమని బుద్ధుడు చెబుతాడు. అవి–సూర్యుడు, చంద్రుడు, సత్యం! ఏ దేశమైనా అంతర్జాతీయంగా తనవారెవరో, కానివారెవరో తెలుసుకోవటానికి నిత్యం ప్రయత్నిస్తుంటుంది. ఎలాంటి వ్యూహాలు పన్నాలో, ఏ ఎత్తుగడలతో స్వీయప్రయోజనాలు కాపాడుకోవాలో అంచనా వేసుకుంటుంది. అందుకు తన వేగుల్ని ఉపయోగిస్తుంది. పరస్పర దౌత్య మర్యాదలకు భంగం లేకుండా చాపకింద నీరులా ఈ పని సాగిపోతుంటుంది. ఈ విషయంలో అమె రికాది అందె వేసిన చేయి. నిఘా నిజమైనప్పుడు అది ఎన్నాళ్లు దాగుతుంది? తాజాగా బజారున పడిన అత్యంత రహస్యమైన పత్రాలు అమెరికాను అంతర్జాతీయంగా ఇరకాటంలో పడేశాయి. శత్రువులు సరే...దక్షిణ కొరియా, ఇజ్రాయెల్, ఉక్రెయిన్‌లాంటి దేశాలు సైతం తమపై అమెరికా నిఘా పెట్టిందన్న సంగతిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇక దాని ప్రధాన ప్రత్యర్థి రష్యా గురించి చెప్పేదేముంది? ఆ దేశ రక్షణశాఖలోకి అమెరికా నిఘా విభాగం ఎలా చొచ్చుకుపోయిందో ప్రస్తుతం వెల్లడైన రహస్యపత్రాలు తెలియజెబుతున్నాయి. అలా సేకరించిన సమాచారం ఆధారంగా ఉక్రెయి న్కు సలహాలిస్తూ రష్యాపై దాని యుద్ధవ్యూహాలను పదునెక్కిస్తున్న వైనం బయట పడింది. ఉక్రె యిన్ వ్యూహాలపై, అది తీసుకుంటున్న నిర్ణయాలపై అమెరికాకు ఎలాంటి అభి ప్రాయాలున్నాయో ఈ పత్రాలు వివరిస్తున్నాయి. ఇటీవల ఉక్రెయిన్‌లో రష్యాకు వరస అపజయాలు ఎదురయ్యాయి. గతంలో స్వాధీనమైన నగరాల నుంచి అది తప్పుకోక తప్పనిస్థితి ఏర్పడింది. వీటన్నిటి వెనుక అమెరికా మార్గదర్శకం ఉన్నదని పత్రాలు చెబుతున్నాయి. ఇవన్నీ నకిలీ పత్రాలని ఉక్రెయిన్ సైని కాధికారులు దబాయిస్తున్నా పెంటగాన్ మాత్రం ఆ పని చేయలేకపోతోంది. ఉక్రెయిన్‌లోని ఏ ప్రాంతంపై ఏ రోజున ఎన్ని గంటలకు రష్యా సైన్యం దాడి చేయదల్చుకున్నదో అమెరికా నిఘా సంస్థ ఎప్పటికప్పుడు ఆ దేశాన్ని హెచ్చరించిన వైనాన్ని ఈ పత్రాలు బయటపెట్టాయి. అయితే సందట్లో సడేమియాలా లీకైన ఈ పత్రాల్లో ఫొటోషాప్ ద్వారా తనకు అనుకూలమైన మార్పులు చేర్పులూ చేసి ప్రత్యర్థులను గందరగోళపరచడానికి రష్యా ప్రయత్నిస్తోంది. ఎవరి ప్రయోజనం వారిది! సరిగ్గా పదమూడేళ్లక్రితం జూలియన్ అసాంజ్ వికీలీక్స్ ద్వారా అమెరికాకు సంబంధించిన లక్షలాది కీలకపత్రాలు వెల్లడించాడు. ఆ తర్వాత సైతం ఆ సంస్థ అడపా దడపా రహస్య పత్రాలు వెల్లడిస్తూ అమెరికాకు దడపుట్టిస్తోంది. తాజా లీక్‌లు ఎవరి పుణ్యమో ఇంకా తేలాల్సివుంది. సాధా రణ పరిస్థితుల్లో ఇలాంటి లీక్‌లు పెద్దగా సమస్యలు సృష్టించవు. గతంలో అసాంజ్ బయటపెట్టిన పత్రాలు అంతక్రితం నాలుగైదేళ్లనాటివి. అవి గతించిన కాలానివి కనుక నిఘా బారిన పడిన దేశం చడీచప్పుడూ లేకుండా తన వ్యవస్థలో అవసరమైన మార్పులు చేసుకుంటుంది. ఆ పత్రాల్లో ప్రస్తావనకొచ్చిన ఉదంతాల తీవ్రత కూడా చల్లబడుతుంది. కానీ ఈ పత్రాలు ఇటీవల కాలానివి. కేవలం 40 రోజులనాటివి. ఉక్రెయిన్ ఇంకా రష్యాతో పోరు సాగిస్తూనే ఉంది. సైన్యం బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో అది తీసుకుంటున్న దిద్దుబాటు చర్యలూ, అందుకోసం అనుసరిస్తున్న వ్యూహాలూ ఇంత వెనువెంటనే బట్టబయలు కావటం దాన్ని దెబ్బతీస్తాయనటంలో సందేహం లేదు. ముఖ్యంగా వైమానిక యుద్ధంలో ఉక్రెయిన్ బలహీనంగా ఉన్న వైనం బయటపడటం ఆ దేశానికి ముప్పు కలిగించేదే. అమెరికా నిఘా సంస్థ సీఐఏ పనితీరు కూడా ఈ పత్రాల ద్వారా బయటపడింది. రష్యా రక్షణ శాఖలోని ముఖ్యవ్యక్తుల ఫోన్ సంభాషణలు ఆ సంస్థ వేగులు వింటున్నారని, వారి మధ్య బట్వాటా అయ్యే సందేశాలు సంగ్రహిస్తున్నారని, వీటి ఆధారంగానే దాని రోజువారీ నివేదికలు రూపొందుతున్నాయని ఈ పత్రాలు తేటతెల్లం చేశాయి. అయితే ఉక్రెయిన్‌పై ఏడాదిగా సాగుతున్న యుద్ధంలో పెద్దగా పైచేయి సాధించలేకపోయిన రష్యాకూ ఈ లీక్‌లు తోడ్పడతాయి. ఉక్రెయిన్ విజయం సాధించటానికి దారితీస్తున్న పరిస్థితులేమిటో, ఇందులో తమ వైపు జరుగుతున్న లోపాలేమిటో తెలి యటం వల్ల రష్యా తన వ్యూహాలను మార్చుకోవటం సులభమవుతుంది. అంతేకాదు...తన రక్షణ వ్యవస్థలోని ఏయే విభాగాల్లో అమెరికా నిఘా నేత్రాలు చొరబడ్డాయో ఈ లీక్లద్వారా గ్రహించి సొంతింటిని చక్కదిద్దుకునేందుకు రష్యాకు అవకాశం దొరికింది. అయితే అదే సమయంలో తల్చుకుంటే ప్రత్యర్థి శిబిరంలోకి అమెరికా ఎంత చురుగ్గా చొచ్చుకు పోగలదో, ఎలాంటి కీలక సమాచారం సేకరించగలదో ఈ వ్యవహారం తేటతెల్లం చేసింది. దాని సంగతెలావున్నా ఇజ్రాయెల్‌లో ప్రధాని నెతన్యాహూ తలపెట్టిన న్యాయసంస్కరణలకు వ్యతిరేకంగా పెల్లుబికిన ఉద్యమం వెనుక ఆ దేశ గూఢచార సంస్థ మొసాద్ హస్తమున్నదని అమెరికా అంచనా కొచ్చిన తీరు దిగ్భ్రాంతి కలిగిస్తుంది. ఈ అభిప్రాయం తప్పని ఇజ్రాయెల్ చెబుతున్నా నిజమేమిటో మున్ముందు బయటపడక తప్పదు. కానీ నిఘాలో ఇంతటి చాకచక్యాన్ని ప్రదర్శించే అమెరికాను సైతం బోల్తా కొట్టించగల అరివీర భయంకరులున్నారని తాజా లీకులు చెప్పకనే చెబుతున్నాయి. ఇవి ఎక్కడినుంచో కాదు...సాక్షాత్తూ పెంటగాన్ కార్యాలయం నుంచే బయటికొచ్చాయని పత్రాల్లోని సమాచారం చూస్తే అర్థమవుతుంది. ఇతర దేశాలపై నిఘా మాట అటుంచి స్వగృహ ప్రక్షాళనకు నడుం కట్టకతప్పదని అమెరికాను తాజా లీకులు హెచ్చరిస్తున్నాయి. అభిప్రాయాలు, అంచనాలు ఏవైనా...మస్తిష్కంలో ఉన్నంత వరకే వాటికి రక్షణ. అవి రహస్యపత్రాలుగా అవతారమెత్తిన మరుక్షణం ఎక్కడెక్కడికి ఎగురుకుంటూ పోతాయో చెప్పటం అసాధ్యమని తాజా వ్యవహారం తేటతెల్లం చేస్తోంది. అగ్రరాజ్యం ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండకతప్పదు. -
పోలండ్‌పైకి క్షిపణులు... రష్యా దాడి కాదు
షెవాడో (పోలండ్): పోలండ్ సరిహద్దుల్లోని పంట పొలాల్లో మంగళవారం ఇద్దరిని బలిగొన్న క్షిపణి దాడులు రష్యా పనేనంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలానికి దారితీశాయి. దీని ఫలితంగా ఉక్రెయిన్‌కు బాసటగా నాటో రంగంలోకి దిగొచ్చని, దాంతో రష్యా 9 నెలలుగా చేస్తున్న యుద్ధం రూపురేఖలే మారిపోవచ్చని ఒక దశలో ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ దాడితో రష్యాకు సంబంధం లేదని పోలండ్‌తో పాటు నాటో కూటమి కూడా బుధవారం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘అది ఉద్దేశపూర్వక దాడి ఎంతమాత్రమూ కాదనిపిస్తోంది. బహుశా తమ విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం చేస్తున్న భారీ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణులు దురదృష్టవశాత్తూ సరిహద్దులు దాటి ఉండొచ్చు’’ అని పోలండ్ అధ్యక్షుడు ఆంద్రే డూడ అభిప్రాయపడ్డారు. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ కూడా బ్రసెల్స్‌లో జరిగిన నాటో భేటీలో అదే అన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్ను తప్పుబట్టలేం. యుద్ధానికి కారణమైన రష్యాయే ఈ క్షిపణి దాడులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అంటూ నిందించారు. ఈ ఉదంతంలో కచ్చితంగా ఏం జరిగిందో త్వరలోనే తేలుస్తామన్నారు. రష్యా క్షిపణిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు ఈ క్షిపణులను ప్రయోగించినట్టు ప్రాథమికంగా తేలిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. -
రష్యాను పూర్తిగా తరిమేస్తాం: జెలెన్స్కీ
మైకోలైవ్ (ఉక్రెయిన్): ఖెర్సన్ నుంచి రష్యా వైదొలగడాన్ని ఉక్రెయిన్ పండుగ చేసుకుంటోంది. ఆ ప్రాంత వాసులంతా తమ సైనికులను హర్షాతిరేకాల నడుమ స్వాగతిస్తూ వారిని ఆలింగనం చేసుకుంటూ, ముద్దులు పెట్టుకుంటున్నారు. ఖెర్సన్‌లో నగరమంతా కలియదిరుగుతూ ఉల్లాసంగా గడుపుతున్నారు. ఈ విజయోత్సాహాన్ని ఇలాగే కొనసాగిస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. ‘‘రష్యా సేనలను దేశమంతటి నుంచీ తరిమేసి తీరతాం. అనేక ప్రాంతాల్లో మా సేనలకు సొంత పౌరుల నుంచి త్వరలో ఇలాంటి మరెన్నో స్వాగతాలు లభించనున్నాయి’’ అన్నారు. పడిపోయిన కరెంటు స్తంభాలు, ధ్వంసమైన తాగునీరు తదితర మౌలిక వసతులు. ఎక్కడ పడితే అక్కడ మృత్యుఘంటికలు విన్పిస్తున్న మందుపాతరలు. ఇవీ... ఖెర్సన్‌కు వెళ్లే ప్రాంతాల్లో దారి పొడవునా కన్పిస్తున్న దృశ్యాలు. రష్యా సేనల విధ్వంసకాండకు ఇవి అద్దం పడుతున్నాయి. నగరవాసులు తిండి, నీరు, మందులకు అల్లాడుతున్నారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఉక్రెయిన్ అధికార వర్గాలు శాయశక్తులా శ్రమిస్తున్నాయి. మరోవైపు ఖెర్సన్ బాటలోనే ఖఖోవా జిల్లా నుంచి కూడా రష్యా తప్పుకుంటోంది. అక్కడి నుంచి తమ అధికారులు తదితరులను మొత్తంగా వెనక్కు పిలిపిస్తున్నట్టు స్థానిక రష్యా పాలక వర్గం పేర్కొంది. ఉక్రెయిన్ దాడులకు లక్ష్యం కారాదనే ఈ చర్య తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. -
ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలు విలీనం.. రష్యా కీలక ప్రకటన
కీవ్: ఇటీవల రెఫరెండం చేపట్టిన ఉక్రెయిన్‌లోని నాలుగు ప్రాంతాలను తాము కలిపేసుకుంటామని రష్యా గురువారం ప్రకటించింది. ఈ రెఫరెండంలో దక్షిణ, తూర్పు ఉక్రెయిన్ ప్రాంతాలైన జపొరిఝియాలో 93%, ఖేర్సన్లో 87%, లుహాన్స్క్లో 98%, డొనెట్స్క్లో 99% మంది రష్యాకు అనుకూలంగా ఓటేశారని క్రెమ్లిన్ అనుకూల పరిపాలనాధికారులు మంగళవారం ప్రకటించారు. శుక్రవారం క్రెమ్లిన్ కోటలోని సెయింట్ జార్జి హాల్లో జరిగే కార్యక్రమంలో విలీనం విషయాన్ని అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ప్రకటిస్తారని అధికార ప్రతినిధి పెష్కోవ్ చెప్పారు. విలీనానికి సంబంధించిన పత్రంపై ఈ నాలుగు ప్రాంతాల అధికారులు సంతకాలు చేస్తారన్నారు. రష్యా చర్యను ఉక్రెయిన్, అమెరికా, జర్మనీ ఇతర పశ్చిమ దేశాలు ఖండించాయి. రష్యా చేపట్టిన రెఫరెండంను, విలీనం చేసుకోవడాన్ని గుర్తించబోమన్నాయి. ఈ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఉక్రెయిన్ ప్రతిజ్ఞ చేసింది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌లో ద్నీప్రో ప్రాంతంపై రష్యా జరిపిన రాకెట్ దాడిలో చిన్నారి సహా 8 మంది చనిపోయినట్లు అధికారులు చెప్పారు. ఈశాన్య ప్రాంత లెమాన్ నగరంపై పట్టు కోసం ఉక్రెయిన్, రష్యా బలగాల మధ్య భీకర పోరు సాగుతోందని బ్రిటిష్ నిఘా వర్గాలు వెల్లడించాయి. -
ఉక్రెయిన్‌లోని రష్యా సైనికులపై విష ప్రయోగం!
మాస్కో: గత ఏడు నెలలుగా ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు. ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రసాయన విష ప్రయోగం జరగటం వల్ల ఉక్రెయిన్‌లోని తమ సైనికులు ఆసుపత్రుల పాలైనట్లు ఆరోపించింది రష్యా రక్షణ శాఖ. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ బీ’ అనే సేంద్రియ విషం నమూనాలను సైనికుల్లో గుర్తించినట్లు పేర్కొంది. కీవ్ కెమికల్ టెర్రరిజానికి పాల్పడుతోందని ఆరోపించింది. ‘జులై 31న జపోరోఝీ ప్రాంతంలోని వసిలియేవ్కా గ్రామం సమీపంలోని రష్యా సైనికులు తీవ్ర విష ప్రయోగంతో ఆసుపత్రుల పాలయ్యారు. రష్యా సైనికులు, పౌరులపై జెలెన్స్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెర్రరిస్టులు విషంతో నిండిన వాటితో దాడులకు పాల్పడుతున్నారు.’ అని పేర్కొంది రష్యా రక్షణ శాఖ. సైనికులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైన క్రమంలో వారి నుంచి సేకరించిన విష నమూనాలను అంతర్జాతీయ ‘రసాయన ఆయుధాల నిషేధ సంస్థ’(ఓపీసీడబ్ల్యూ)కు పంపించేందుకు సిద్ధమవుతోంది రష్యా. బోటులినమ్ టాక్సిన్ అనేది సైన్స్‌లో అత్యంత విషపూరితమైనదిగా గుర్తింపు పొందినట్లు పేర్కొంది మాస్కో. దీనిని క్లోస్ట్రిడియమ్ బోటులినియమ్ బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి చేస్తారని, ఇది ఎసిటైల్కోలిన్ న్యూరోట్రాన్స్మిటర్ విడుదలను అడ్డుకుంటుందని తెలిపింది. దాని ద్వారా కండరాల పక్షవాతం వస్తుందని స్పష్టం చేసింది. ‘బోటులినమ్ టాక్సిన్ టైప్ ఏ’ను కొన్నేళ్ల క్రితం కండరాల సమస్యల చికిత్స ఔషధాల్లో ఉపయోగించేవారు. దీనిని కాస్మెటోలజీలో బొటాక్స్గా పిలిచేవారు. అయితే, బోటులినమ్ టాక్సిన్ సులభంగా ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం వల్ల దానిని జీవ ఆయుధంగా ఉపయోగించే ప్రమాదం అధికంగా ఉంది. దీనిని ప్రయోగిస్తే మరణాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ విష ప్రయోగం బారినపడిన వారు దీర్ఘకాలం పాటు ఐసీయూలో చికిత్స తీసుకుంటేనే ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉంటాయి. ఇదీ చదవండి: పుతిన్‌కు షాక్.. బాంబు దాడిలో ఉక్రెయిన్ యుద్ధ వ్యూహకర్త కుమార్తె దుర్మరణం! -
Russia-Ukraine war: ఖర్కీవ్ నుంచి రష్యా సేనలు ఔట్!
కీవ్/హెల్సింకీ: ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్ నుంచి రష్యా బలగాలు వెనక్కు మళ్లుతున్నాయి. ఉక్రెయిన్ ప్రతిఘటనను తట్టుకోలేకే రష్యా వెనుకడుగు వేస్తున్నట్లు ఇంగ్లండ్ పేర్కొంది. ఖర్కీవ్‌లో ఉక్రెయిన్‌దే పై చేయి అని చెప్పింది. తూర్పు ప్రాంతంలో రష్యా ఆధీనంలో ఉన్న ఆరు పట్టణాలను, గ్రామాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. యుద్ధ ఫలితం యూరప్, మిత్రదేశాల మద్దతుపై ఆధారపడి ఉంటుందన్నారు. అమెరికా రిపబ్లికన్ నేత మిచ్ మెక్కానెల్ నేతృత్వంలో సెనేట్ సభ్యులు ఆయనతో భేటీ అయ్యారు. పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్లో హోరాహోరీ పోరు జరుగుతోంది. ‘నాటో’కు దరఖాస్తు చేస్తాం: ఫిన్లండ్ నాటోలో చేరేందుకు దరఖాస్తు చేయాలని నిర్ణయించినట్టు ఫిన్లండ్ అధ్యక్షుడు సౌలీ నీనిస్టో స్పష్టం చేశారు. శనివారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్లో ఈ విషయం చెప్పారు. స్వీడన్ కూడా నాటోలో చేరాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. పుతిన్‌కు ఆగస్టులో పదవీ గండం!: పుతిన్‌ను గద్దె దించడానికి రష్యాలో ఇప్పటికే ప్రయత్నాలు మొదలైనట్టు ఉక్రెయిన్ నిఘా విభాగం చీఫ్ మేజర్ జనరల్ కైరిలో బడానోవ్ చెప్పారు. ఆయనపై తిరుగుబాటు జరుగనుందన్నారు. యుద్ధంలో ఈ ఏడాది ఆఖరుకల్లా రష్యా ఓడిపోతుందన్నారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న పుతిన్ తీవ్రమైన అనారోగ్యం పాలైనట్టు రష్యా ప్రతినిధి ఒకరు తెలిపారు. ఆయన పార్కిన్సన్తోనూ బాధపడుతున్నట్లు వార్తలొచ్చాయి. -
ఉక్రెయిన్‌లో ఆకస్మికంగా పర్యటించిన అమెరికా ప్రథమ మహిళ
కీవ్: అమెరికా ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఆదివారం పశ్చిమ ఉక్రెయిన్‌లో పర్యటించారు. ముందస్తు ప్రకటన లేకుండానే ఆమె ఇక్కడికి రావడం గమనార్హం. స్లొవేకియాలోని చిట్టచివరి గ్రామం వద్ద సరిహద్దును దాటి 10 నిమిషాలపాటు వాహనంలో ప్రయాణించి ఉక్రెయిన్‌లోని ఉజ్హొరోత్ పట్టణానికి చేరుకున్నారు. అక్కడ రెండు గంటలపాటు గడిపారు. ఉక్రెయిన్ ప్రథమ పౌరురాలు ఒలెనా జెలెన్స్కీతో సమావేశమయ్యారు. మాతృ దినోత్సవం సందర్భంగా అక్కడికి వచ్చినట్లు చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న క్రూరమైన యుద్ధం తక్షణమే ఆగిపోవాలని ఆకాంక్షించారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా ప్రజలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూనే ఉంటారని పునరుద్ఘాటించారు. జిల్ బైడెన్, ఒలెనా జెలెన్స్కీ ఓ పాఠశాలలో కలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సంభాషించారు. యుద్ధం వల్ల తాము ఎదుర్కొంటున్న కష్టనష్టాలు వివరిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని జిల్ బైడెన్ ఓదార్చారు. అనంతరం జిల్ బైడెన్, ఒలెనా మీడియాతో మాట్లాడారు. యుద్ధ సమయంలో జిల్ రాక సాహసోపేతమైన చర్య అని ఒలెనా కొనియాడారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ కూడా ఆదివారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పర్యటించారు. అధ్యక్షుడు జెలెన్స్కీతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. కెనడా ప్రధాని కూడా... రష్యా దాడులతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్‌కు పశ్చిమ దేశాల అధినేతలు నైతిక మద్దతునిస్తున్నారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆదివారం ఉక్రెయిన్‌లోని ఇర్పిన్ పట్టణాన్ని సందర్శించారు. స్థానికులతో మాట్లాడారు. రష్యా దాడుల్లో ఈ పట్టణం ఇప్పటికే చాలావరకు ధ్వంసమయ్యింది. జస్టిన్ ట్రూడో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ కానున్నారు. -
మా గడ్డపై రష్యా ఆటలు సాగవ్
కీవ్: తమ భూభాగంలో రష్యా ఆటలు సాగవని ఉక్రెయిన్ సైన్యం తేల్చిచెప్పింది. ఉక్రెయిన్ దక్షిణాదిన రష్యా ఆక్రమించుకున్న కొన్ని ప్రాంతాలను తాము మళ్లీ స్వాధీనం చేసుకున్నామని గురువారం ప్రకటించింది. తూర్పు ప్రాంతంలోనూ పుతిన్ సేనల దాడులను సమర్థంగా తిప్పికొట్టామంది. రష్యా సరిహద్దుల్లో ఉన్న ఖేర్సన్, మైకోలైవ్‌లో పలు ప్రాంతాలు తమ అధీనంలోకి వచ్చాయని, డొనెట్స్క్, లుహాన్స్క్లో రష్యా దాడులను తిప్పికొట్టామని వెల్లడించింది. మరోవైపు మారియూపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్ ప్లాంట్‌లో ఇరువర్గాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. అయితే, అజోవ్‌స్టల్ ఉక్కు కర్మాగారంలోప్రతిఘటన ఎదురుకావడం లేదని రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై దండయాత్ర ప్రారంభించి ఏడు వారాలు దాటినా కీలకమైన పారిశ్రామిక ప్రాంతం డోన్బాస్‌పై రష్యాకు పూర్తిగా పట్టుచిక్కలేదు. పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలు, సామగ్రి ఉక్రెయిన్ను రాకుండా నిరోధించడానికి రైలు, రోడ్డు మార్గాలను రష్యా ధ్వంసం చేస్తోంది. అత్యాధునిక రష్యా యుద్ధట్యాంకు టి–90ఎంను ఉక్రెయిన్ దళాలు పేల్చివేశాయి. ఈ ట్యాంకు విలువ రూ.37కోట్ల్లని అంచనా. రష్యాకు చెందిన థర్మోబారిక్ మల్టిపుల్ రాకెట్ సిస్టమ్‌ను కూడా ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. ఉక్రెయిన్‌కు విరాళాల వెల్లువ ఉక్రెయిన్ కోసం వార్సాలో గురువారం ఇంటర్నేషనల్ డోనర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 6.5 బిలియన్ డాలర్ల(రూ.49 వేల కోట్లు) మేర విరాళాలు అందినట్లు పోలండ్ ప్రధాని మొరావీకీ ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి ప్రతినిధులతో పాటు గూగుల్ వంటి ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు ఈ కాన్ఫరెన్స్ హాజరై భారీగా విరాళాలు ప్రకటించారని చెప్పారు ‘యునైటెడ్24’ పేరిట నిధుల సేకరణను ప్రారంభిస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. ఇక ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్’ ఉక్రెయిన్‌లోని కీలక నగరాలపై రష్యా క్షిపణుల వర్షం కురిపిస్తూనే ఉంది. డోన్బాస్ ప్రాంతంలోని నగరాలు, పట్టణాల్లో గత 24 గంటల్లో రష్యా దాడుల్లో ఐదుగురు మరణించారని, మరో 25 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్ శివార్లతోపాటు చెర్కాసీ, జాపొరిజాజియాలో బాంబు మోతలు వినిపించాయి. డినిప్రోలో రష్యా దాడుల్లో రైల్వే స్టేషన్ దెబ్బతింది. పశ్చిమ దేశాలు చేరుకోవడానికి ముఖద్వారం లాంటి లెవివ్లోనూ దాడులు కొనసాగాయి. మరోవైపు ఈ నెల 9న ‘విక్టరీ డే’ జరుపుకొనేందుకు రష్యా బలగాలు సిద్ధమవుతున్నాయి. నాజీ జర్మనీపై సోవియట్ యూనియన్ విజయానికి గుర్తుగా ఏటా ఈ వేడుక నిర్వహిస్తుంటారు. 9న రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఉక్రెయిన్ను పూర్తిగా లొంగదీసుకోవడానికి ‘ప్రత్యేక మిలటరీ ఆపరేషన్’కు పిలుపునిచ్చే సూచనలు కనిపిస్తున్నాయంటున్నారు. బెలారస్ సైనిక విన్యాసాలు ప్రారంభం ఉక్రెయిన్‌లో రష్యా సేనలు తీవ్రంగా చెమటోడుస్తున్నా ఆశించిన ఫలితం కనిపించడం లేదని వాషింగ్టన్కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ ద స్టడీ ఆఫ్ వార్’ ప్రకటించింది. రష్యా మిత్రదేశమైన బెలారస్ సైనిక విన్యాసాలు ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. అయితే, వీటితో ఉక్రెయిన్‌కు ముప్పు ఉంటుందనుకోవడం లేదని బ్రిటన్ వివరించింది. ఉక్రెయిన్‌కు అమెరికా నిఘా సాయం! ఉక్రెయిన్‌లో పెద్ద సంఖ్యలో రష్యా సైనిక జనరల్స్ అంతం కావడంలో అమెరికా హస్తం ఉందా? అమెరికా అందించిన కీలక నిఘా సమాచారంతోనే ఉక్రెయిన్ సైన్యం రష్యా జనరల్స్‌ను మట్టుబెట్టిందా? అవుననే అంటోంది న్యూయార్క్ టైమ్స్ పత్రిక. అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఓ కథనం ప్రచురించింది. రష్యా సైనికాధికారులపై దాడిచేయడంలో ఉక్రెయిన్‌కు నిఘా సమాచారం చేరవేయడం వాస్తవమేనని సదరు అధికారులు అంగీకరించారు. అమెరికాతోపాటు బ్రిటన్, ఇతర నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సహకరిస్తున్న సంగతి బహిరంగ రహస్యమేనని రష్యా ఉద్ఘాటించింది. ఎవరు ఎన్ని విధాలుగా అండగా నిలిచినా తమ లక్ష్యం సాధించితీరుతామని పేర్కొంది. యుద్ధరంగంలో 12 మంది రష్యా జనరల్స్‌ను హతమార్చామని ఉక్రెయిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
Russia-Ukraine war: లొంగిపోతే ప్రాణభిక్ష
మాస్కో/కీవ్: ఉక్రెయిన్‌లోని కీలక రేవు నగరం మారియుపోల్‌పై రష్యా సైన్యం దాదాపుగా పట్టు బిగించింది. అక్కడ మిగిలిఉన్న కొద్దిపాటి ఉక్రెయిన్ సైనికులు మధ్యాహ్నంలోగా ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని రష్యా రక్షణ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ ఆదివారం హెచ్చరించారు. లొంగిపోతే ప్రాణాలకు గ్యారంటీ ఇస్తామన్నారు. అంటే ఆయుధాలు వీడి లొంగిపోతే ప్రాణభిక్ష పెడతామని పరోక్షంగా సూచించారు. అజోవ్‌స్టల్ స్టీల్ ఫ్యాక్టరీలో తలదాచుకున్న ఉక్రెయిన్ సైనికులంతా లొంగిపోవాలన్నారు. ఉక్రెయిన్‌కు రష్యా ఇలాంటి ఆఫర్ ఇవ్వడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇంకా తమకు ఎదురు తిరగాలని చూస్తే చావు తప్పదని ఉక్రెయిన్ సైన్యానికి రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ అల్టిమేటం జారీ చేశారు. మిగిలింది స్టీల్ ఫ్యాక్టరీనే మారియూపోల్‌ను పూర్తిగా స్వాధీనం చేసుకుంటే రష్యాకు అది అతిపెద్ద విజయం అవుతుందనడంలో సందేహం లేదు. దీనిపై రష్యా మొదటి నుంచే కన్నేసింది. ఈ నగరాన్ని జేజిక్కించుకుంటే క్రిమియాకు రష్యా నుంచి భూమార్గం ఏర్పడుతుంది. తద్వారా పారిశ్రామిక ప్రాంతమైన డోన్బాస్లో పాగా వేయడం సులభతరం అవుతుంది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో 11 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన అజోవ్‌స్టల్ స్టీల్ ఫ్యాక్టరీ ఒక్కటే ఉక్రెయిన్ దళాల ఆధీనంలో ఉంది. ఈ ఫ్యాక్టరీలో 2,500 మంది ఉక్రెయిన్ జవాన్లు ఉన్నట్లు సమాచారం. రష్యా నియంత్రణలోకి వచ్చిన మారియుపోల్‌లో ఇప్పటివరకు 21,000 మంది మృతిచెందినట్లు అంచనా. ఈ నగరంలో గతంలో 4.50 లక్షల జనాభా ఉండగా, ప్రస్తుతం కేవలం లక్ష మంది ఉన్నారు. యుద్ధం ప్రారంభమయ్యాక చాలామంది వలసబాట పట్టారు. ఖర్కీవ్‌లో ఐదుగురు బలి ఉక్రెయిన్ సైన్యాన్ని చావుదెబ్బ కొట్టడమే లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు ఉధృతం చేస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని బ్రొవరీ ఆయుధాగారాన్ని నేలమట్టం చేశామని రష్యా రక్షణ శాఖ ప్రతినిధి మేజర్ జనరల్ ఇగోర్ కొనాషెంకోవ్ ఆదివారం చెప్పారు. క్షిపణులతో దాడి చేశామని తెలిపారు. అలాగే సీవీరోడోంటెస్క్ సమీపంలో ఉక్రెయిన్‌కు చెందిన ఎయిర్ డిఫెన్స్ రాడార్లను ధ్వంసం చేశామన్నారు. అలాగే కొన్ని ఆయుధ డిపోలపైనా దాడులు చేసినట్లు పేర్కొన్నారు. డోన్బాస్ సమీపంలోని జొలోట్ పట్టణంపై రష్యా దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. రెండో అతిపెద్ద నగరం ఖర్కీవ్‌లో ఆదివారం రష్యా బాంబు దాడుల్లో ఐదుగురు పౌరులు మరణించారు, 13 మంది గాయపడ్డారు. లొంగిపోయే ఉద్దేశం లేదు: ఉక్రెయిన్ ప్రధాని రష్యా హెచ్చరికలను ఉక్రెయిన్ ప్రధానమంత్రి డెనిస్ షమీహల్ కొట్టిపారేశారు. ఈ యుద్ధంలో ఆఖరిఘట్టం దాకా పోరాడుతామని స్పస్టంచేశారు. విజయం సాధించేదాకా తమ పోరాటం ఆగదన్నారు. సాధ్యమైనంత వరకు దౌత్య మార్గాల ద్వారానే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు చెప్పారు. అంతేతప్ప రష్యాకు లొంగిపోయే ఉద్దేశం ఎంతమాత్రం లేదన్నారు. మారియుపోల్ నగరం తమకు రక్షణ కవచంగా ఉపయోగపడుతోందని ఉక్రెయిన్ రక్షణశాఖ ఉపమంత్రి హన్నా మాల్యార్ చెప్పారు. మతిలేని యుద్ధాన్ని ఆపండి: పోప్ ఫ్రాన్సిస్ ఉక్రెయిన్‌లో రష్యా సాగిస్తున్న బీభత్సకాండపై పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన వ్యక్తంచేశారు. మతిలేని యుద్ధాన్ని వెంటనే ఆపాలని రష్యాకు సూచించారు. ఈస్టర్ సండే సందర్భంగా వాటికన్ సిటీలో పోప్ సందేశమిచ్చారు. శాంతికి చొరవచూపాలని రష్యాకు హితవు పలికారు. దయచేసి యుద్ధంలో ఎవరూ భాగస్వాములు కావొద్దని పిలుపునిచ్చారు. ఉక్రెయిన్‌లో త్వరగా శాంతి నెలకొనాలని పోప్ ఆకాంక్షించారు. ► నల్లసముద్రంలోని తమ రేవుల్లోకి రష్యా నౌకల ప్రవేశాన్ని బల్గేరియా నిషేధించింది. ► తమకు 50 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుని ఆర్థిక సలహాదారు జీ7 దేశాలను కోరారు. చర్చలకు విఘాతం: జెలెన్స్కీ మారియుపోల్‌ను గుప్పిటపెట్టే ప్రయ త్నాలు చర్చలకు విఘాతం కలిగిస్తాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. అక్కడి పౌరులను సైన్యం పొట్టనపెట్టుకుంటోందని మండిపడ్డారు. అమరవీరుల స్మారకం నిర్మిస్తామన్నారు. రష్యా అణుదాడులకు ప్రపంచం సిద్ధంగా ఉండాలన్నారు. -
నాటో, తూర్పు ఐరోపా దేశాలపై పరోక్ష దాడులకు దిగిన రష్యా..!
గత కొన్ని వారాల నుంచి ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య దాడులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంకా, రెండూ దేశాల మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. అయితే, ఇలాంటి సమయంలో రష్యా పరోక్షంగా నాటోపై దాడులు చేసేందుకు సిద్ద పడినట్లు సమాచారం. రష్యా హ్యాకర్లు ఇటీవల నాటో నెట్వర్క్, కొన్ని తూర్పు ఐరోపా దేశాల సైనిక దళాలలకి చెందిన భద్రత వ్యవస్థపై దాడులు చేసేందుకు ప్రయత్నించారని గూగుల్ థ్రెట్ అనాలిసిస్ గ్రూప్ బుధవారం ప్రచురించిన ఒక నివేదికలో తెలిపింది. "కోల్డ్ రివర్/కాలిస్టో" అనే రష్యన్ హ్యకర్ గ్రూప్ ఏ దేశ మిలిటరీని లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగారు అని "Credential Phishing Campaigns" నివేదిక స్పష్టంగా పేర్కొనలేదు. హ్యాకర్లు కొత్తగా క్రియేట్ చేసిన జీమెయిల్ ఖాతాలను ఉపయోగించి నాన్-గూగుల్ ఖాతాలకు ఈ ప్రచారాలను పంపారని, అందువల్ల ఈ ప్రచారాలు ఎంత వరకు విజయవంతం అయ్యాయో అనేది పూర్తిగా తెలియదని ఈ నివేదిక తెలిపింది. ఈ నివేదికపై నాటో ఇంకా స్పందించలేదు. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ను ఆక్రమించుకోవాలని రష్యా నిర్ణయం తీసుకున్న తర్వాత పాశ్చాత్య దేశాలు రష్యాపై భారీగా ఆర్థిక ఆంక్షలు విధించాయి. అయితే, అప్పటి నుంచి పాశ్చాత్య దేశాలపై రోజు రోజుకి పెరుగుతున్న సైబర్ దాడుల ఆరోపణలను ఖండించింది. నాటో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను కూడా ఈ బృందం లక్ష్యంగా చేసుకున్నట్లు నాటి గూగుల్ నివేదిక తెలిపింది. (చదవండి: రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, భారత్ వృద్ధికి ఇండియా రేటింగ్స్ కోత!) -
Russia-Ukraine war: డోన్బాస్‌పై రాజీకి రెడీ
లివీవ్: యుద్ధానికి తెర దించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఉక్రెయిన్ కీలక ప్రతిపాదనలు చేసింది. ఆయన డిమాండ్ చేస్తున్నట్టు ఉక్రెయిన్ను తటస్థ దేశంగా ప్రకటించేందుకు సిద్ధమని ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. అంతేగాక ఎనిమిదేళ్లుగా రష్యా అనుకూల వేర్పాటువాదుల అధీనంలో ఉన్న తూర్పు ప్రాంతం డోన్బాస్ హోదాపై రాజీకి కూడా సిద్ధమన్నారు. ‘‘రష్యా సేనలు మా దేశాన్ని పూర్తిగా వీడటం అసాధ్యమని అర్థమైంది. అందుకే అవి వెనక్కు తగ్గి డోన్బాస్కు పరిమితం కావాలి’’ అని కోరారు. తద్వారా, ఆ ప్రాంతాన్ని రష్యాకు వదులుకుంటామనే సంకేతాలిచ్చారు. తక్షణం యుద్ధం ఆపి శాంతిని నెలకొల్పితే పుతిన్ కోరుతున్నట్టుగా అణ్వస్త్రరహిత దేశ హోదాకు ఒప్పుకోవడంతో పాటు ఇతర భద్రతా హామీలు కూడా ఇస్తామన్నారు. యుద్ధం ముగిశాక ఈ డిమాండ్లపై రిఫరెండం నిర్వహించి జనాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామంటూ ముక్తాయించారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య మంగళవారం టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో మరో దఫా చర్చలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్ర రష్యా మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్, తాను ముఖాముఖీ చర్చిస్తేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. నాటోలో చేరొద్దన్న డిమాండ్‌కు అంగీకరిస్తామని జెలెన్స్కీ ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అయితే కీలకాంశాలన్నింటి మీదా ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే పుతిన్–జెలెన్స్కీ భేటీ సాధ్యమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ పునరుద్ఘాటించారు. నిలిచిన రష్యా దళాలు రష్యా దళాలు గత 24 గంటల్లో ఉక్రెయిన్‌లో ఏ ప్రాంతంలోనూ పెద్దగా ముందుకు చొచ్చుకుపోలేదు. ఆహారం, ఇంధనం తదితర నిత్యావసరాల తీవ్ర కొరత, అతిశీతల పరిస్థితులు, ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనతో ఎక్కడివక్కడే రక్షణాత్మక పొజిషన్లలో ఉండిపోయినట్టు ఇంగ్లండ్ పేర్కొంది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యా దళాలను చాలావరకు డోన్బాస్ కేసి మళ్లిస్తున్నట్టు ఆ దేశ అత్యున్నత సైనికాధికారి ఒకరు చెప్పారు. రష్యాపై యుద్ధనేరాల ఆరోపణలను విచారించేందుకు సంయుక్త విచారణ బృందం ఏర్పాటుకు పోలండ్, లిథువేనియా, ఉక్రెయిన్లకు సాయపడ్డట్టు యూరోపియన్ యూని యన్ సమన్వయ సమితి యూరోజస్ట్ పేర్కొంది. మరోవైపు పుతిన్ ఇంకెంతమాత్రమూ అధికారంలో ఉండొద్దన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నట్టు రష్యా పేర్కొంది. రూబుల్ చెల్లింపులు చేయం: జీ7 గ్యాస్ ఎగుమతుల చెల్లింపులను రూబుల్స్‌లోనే చేయాలన్న రష్యా డిమాండ్‌ను తిరస్కరించాలని జీ7 బృందం నిర్ణయించినట్టు జర్మనీ ఇంధన మంత్రి రాబర్ట్ హెబక్ ప్రకటించారు. ‘‘ఇది ఒప్పందాలకు విరుద్ధం. మాకెవరికీ అంగీకారయోగ్యం కాదు’’ అని చెప్పారు. నెదర్లాండ్స్‌కు చెందిన బ్రూవరీ దిగ్గజం హెన్‌కెన్ కూడా రష్యా నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది. రష్యాపై ఆంక్షలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చైనా మరోసారి చెప్పింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్ వచ్చే వారం భారత్‌లో పర్యటించే అవకాశముంది. భారత్‌కు సరఫరా చేస్తున్న ఇంధనానికి, మిలటరీ హార్డ్‌వేర్‌కు చెల్లింపులు రష్యా కరెన్సీ రూబుల్స్‌లో చేయాలని ఈ సందర్భంగా కోరవచ్చంటున్నారు. ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి లిజ్ ట్రుస్ కూడా గురువారం భారత్ రానున్నారు. -
SK20: ఉక్రెయిన్ బ్యూటీతో శివకార్తికేయన్ రొమాన్స్
కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ అప్‌కమింగ్ మూవీ నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. శివ కార్తీకేయన్ హీరోగా ‘జాతీరత్నాలు’ ఫేం అనుదీప్ కేవీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. ఎస్కే20 అనే వర్కింగ్ టైటిల్ ఇటీవల చెన్నైలో ఈ మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. ఈ మూవీతో ఉక్రెయిన్ నటి, మోడల్ ఇండియన్ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరియా ర్యాబోషాప్క శివకార్తికేయన్‌తో సరసన ఈ ఉక్రెయిన్ బ్యూటీ సందడి చేయబోతున్నట్లు తాజాగా అధికారిక ప్రకటన ఇచ్చారు. అలాగే హీరో శివకార్తీకేయన్ కూడా ‘వెల్కమ్ మరియా ర్యాబోషాప్క’ అంటూ ట్వీట్ చేశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఫుల్ లెన్త్ కామెడీతో సాగే ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లో సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై నారాయణ్ దాస్ కె నారంగ్ పుస్కూర్ రామ్మోహన్ రావు డి. సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. A Beautiful Angel👼has just Landed to Mesmerise✨ Team #SK20 Welcomes Actress #MariaRyaboshapka On Board as Female Lead 🎬@Siva_Kartikeyan @anudeepfilm @MusicThaman @sureshProdns @SVCLLP @ShanthiTalkies #NarayanDasNarang@SBDaggubati @puskurrammohan @iamarunviswa pic.twitter.com/75cKykYk1Z — Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) March 21, 2022 -
ఆ రంగానికి కలిసొస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న యుద్ధం భారత ఉక్కు పరిశ్రమకు కొత్త అవకాశాలను సృష్టించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ దాడుల వల్ల కలిగిన సరఫరా అంతరాన్ని భర్తీ చేయడానికి భారతదేశంలోని ఉక్కు తయారీదారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, భారతదేశం ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగా ఉంది. కానీ, ఎగుమతి పరంగా మన దేశ వాటా చాలా తక్కువ. రష్యా, ఉక్రెయిన్ రెండు దేశాలు యూరప్ దేశాలకు ఎక్కువగా ఉక్కును ఎగుమతి చేస్తాయి. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య యుద్దం కొనసాగుతుండటం వల్ల ఉక్కు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ లోటును భర్తీ చేసేందుకు దేశీయ ఉక్కు తయారీ కంపెనీలు సిద్దంగా ఉన్నాయి. జిందాల్ స్టీల్ & పవర్ లిమిటెడ్(జెఎస్పీఎల్) తెలిపిన వివరాల ప్రకారం.. సరఫరా అంతరాయం వల్ల గత నెలలో ఉక్కు ధరలు 20 శాతం పెరగడంతో ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా కంపెనీలు మన దేశం వైపు చూస్తున్నాయి. ఐరోపా, మధ్య ప్రాచ్య & ఆఫ్రికా ప్రాంతంలో ఉక్కు కొరత ఉంది. ఆ సరఫరాను భారతదేశం, పాక్షికంగా చైనా పూడ్చుతుంది" అని వి.ఆర్. శర్మ బ్లూమ్ బెర్గ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ కలిపి ఏడాదికి 44-45 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తాయని బ్రోకింగ్ అండ్ రీసెర్చ్ కంపెనీ మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. రష్యా ఒక్కటే యూరప్‌కు 14-15 మిలియన్ టన్నుల ఉక్కును ఎగుమతి చేస్తోంది. బెంచ్‌మార్క్ ధర మార్కెట్లో ఫిబ్రవరి 18 నాటికి హాట్ రోల్డ్ కాయిల్ స్టీల్ టన్నుకు 947 డాలర్లు ఉండేది. కానీ, మార్చిలో ఆ ధర టన్నుకు 1205 డాలర్లకు చేరుకుంది.. యూరప్‌లోని చాలా కంపెనీలు స్టీల్ ధరను పెంచడం ప్రారంభించాయి. దీంతో ఎగుమతి ధర పెరిగింది. భారతీయ కంపెనీలు టన్నుకు 1150 డాలర్ల ధరతో యూరప్‌కు ఉక్కును సులభంగా పంపగలవని, ఇది యూరప్‌లో నడుస్తున్న ధర కంటే దాదాపు 100 డాలర్లు తక్కువ అని వి.ఆర్. శర్మ చెప్పారు. ప్రస్తుతం భారత ఉక్కు పరిశ్రమ టన్నుకు దాదాపు 1000 డాలర్ల రేటుతో ఉక్కును ఎగుమతి చేస్తోందని ఆయన చెప్పారు. గత సంవత్సరం మన దేశ ఉక్కు & ఇనుప ఖనిజం ఎగుమతులలో దాదాపు మూడవ వంతు ఐరోపా దేశాలకు కంపెనీలు ఎగుమతి చేశాయి. ప్రధానంగా ఇటలీ, బెల్జియం, నేపాల్ & వియత్నాంలకు భారతదేశం 2021లో 20.63 మిలియన్ టన్నులను ఎగుమతి చేసింది. ఉక్కు సరఫరా కొరతను తీర్చడానికి భారతీయ ఉక్కు తయారీదారులు ఐరోపాకు రవాణాను పెంచాలని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రష్యా - ఉక్రెయిన్ యుద్దం వల్ల ఏర్పడిన సరఫరా కొరత వల్ల ప్రస్తుతం దేశీయ అమ్మకాలు 25 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. (చదవండి: మార్కెట్లోకి మరో ఒకినావా ఎలక్ట్రిక్ స్కూటర్.. అదిరిపోయే రేంజ్!) -
ఉక్రెయిన్-రష్యా ఎఫెక్ట్.. ఇక వాటి ధరలు కూడా పెరగనున్నాయా?
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ - రష్యా మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో వివిధ దేశాల ద్రవ్యోల్బణం రోజు రోజుకి పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ దాడులతో ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్రతి సరుకు ధర ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రతి వస్తువు ధర పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఫ్యాన్స్, వాటర్ హీటర్లు, పంపులు, కుట్టు యంత్రాలు వంటగది ఉపకరణాలను తయారు చేసే ఉషా ఇంటర్నేషనల్ కంపెనీ ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల గత 15 నెలల్లో వివిధ ఉత్పత్తుల ధరలు 15% నుంచి 20% పెరిగినట్లు తెలిపింది. "ప్రస్తుతం, ఐరోపాలో పరిస్థితి చాలా అస్థిరంగా ఉంది కాబట్టి, ఖర్చు పెరుగుదల మళ్ళీ పెద్ద సవాలు ఉంది" అని ఉషా ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రోహిత్ మాథుర్ అన్నారు. ప్రత్యక్ష కమోడిటీ ధరల ద్రవ్యోల్బణం & ఇంధన ఖర్చుల పరోక్ష ప్రభావం కారణంగా ఉషా ఇంటర్నేషనల్ ఉత్పత్తుల ధరలు మరోసారి 10-12 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంఘర్షణ ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తోంది అని ఆయన అన్నారు. "ఈ సమస్య ముడి చమురు ధరల కారణంగా వస్తుంది. ఇప్పుడు బ్యారెల్ బ్రెంట్ ఆయిల్ ధర 130 డాలర్లు దాటింది. దేశంలో ఇంధన ధరలు పెరిగితే అది ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ఇది రవాణా రంగా ఖర్చులను పెంచుతుంది" అని ఆయన అన్నారు. అల్యూమినియం, స్టీల్, రాగి & అధిక సాంద్రత కలిగిన పాలిథిలిన్ వంటి కీలక ముడి పదార్థాల ధరలు 44.2%, 25.4%, 14.6% & 8.3% 2022 నాల్గవ త్రైమాసికంలో పెరిగాయి అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషకులు తెలిపారు. కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ముడి చమురు ధరల పెరుగుదల, ఇతర సరుకుల ద్రవ్యోల్బణానికి దారితీసాయి అని వారు తెలిపారు. (చదవండి: ఆపిల్ తయారీ కంపెనీతో జట్టు కట్టిన ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ..!) -
దయచేసి క్రిప్టోకరెన్సీలు విరాళం ఇవ్వండి: ఉక్రెయిన్ పోలీసులు
14 రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యన్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. బాంబు దాడుల కారణంగా ఇటు ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరులు సైతం మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రేనియన్ ప్రభుత్వం, కమ్ బ్యాక్ అలైవ్ అనే స్వచ్చంద సంస్థలు విరాళాల సేకరణ చేపట్టాయి. కమ్ బ్యాక్ అలైవ్ అనేది ఉక్రేనియన్ ప్రభుత్వేతర ఎన్జిఓ సంస్థ. ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నగదును రుస్సో-ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొన్న ఉక్రెయిన్ మిలిటరీ, వాలంటీర్లు & వారి కుటుంబాలకు సహాయం చేస్తుంది. ఉక్రెయిన్ పోలీసులు కూడా ఇతర దేశాల నుంచి క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. మార్చి 6న ట్విటర్ వేదికగా చేసిన పోస్టులో ఉక్రేనియన్ సైబర్ పోలీసులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి క్రిప్టోకరెన్సీలను విరాళం ఇవ్వాలని ప్రపంచాన్ని కోరారు. వివిధ క్రిప్టోకరెన్సీలు అయిన బిట్ కాయిన్(బీటీసీ), ఈథర్ (ఇటిహెచ్), యుఎస్ డిటి టెటర్(యుఎస్ డిటి), ట్రాన్ (టిఆర్ఎక్స్), పాలిగాన్ (మాటిక్), బినాన్స్ ఎక్స్ఛేంజ్ టోకెన్(బిఎన్ బి)లను విరాళ రూపంలో తీసుకుంటున్నట్లు తెలిపింది. సేకరించిన క్రిప్టోకరెన్సీలను నేషనల్ పోలీస్, నేషనల్ గార్డ్, స్టేట్ బోర్డర్ గార్డ్ సర్వీస్, స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం వినియోగిస్తామని ఉక్రెయిన్ పోలీసులు పేర్కొన్నారు. అలాగే, ఈ నిధులను ఔషధం & ఇతర ఎమర్జెన్సీ అవసరాల కోసం, ఇంకా రష్యా దాడుల బాధితులకు వైద్య సేవలు అందించడానికి వినియోగిస్తామని తెలిపింది. రష్యన్ ఆక్రమణ నుంచి బయటపడటానికి కైవ్ అధికారులు వివిధ మార్గాల్లో ఆర్థిక సహాయం కోరుతున్నారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ఇప్పటికే క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరించడంలో విజయవంతమైంది. ఇప్పటికే బిట్ కాయిన్, ఈథర్, యుఎస్ డీటీ టీథర్, పోల్కాడాట్, డాగీకాయిన్ వంటి ఇతర క్రిప్టోకరెన్సీల రూపంలో $60.5 మిలియన్లను సేకరించింది. ఇంకా ఉక్రెయిన్ జెండాను ఎన్ఎఫ్టీ రూపంలో వేలం వేయడం ద్వారా కూడా $6.5 మిలియన్లను సేకరించింది. (చదవండి: ఈవీ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ మోపెడ్.. కి.మీ.కు 25 పైసలు మాత్రమే!) -
సామాన్యులకు మరో కొత్త టెన్షన్.. ఇక మనం వాటిని కొనలేమా?
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి అన్నీ పెట్రోల్, బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా సరఫరాలో అంతరాయం వల్ల దేశీయ ఉక్కు తయారీదారులు హాట్-రోల్డ్ కాయిల్(హెచ్ఆర్సీ), టీఎంటీ బార్ల ధరలను టన్నుకు రూ.5,000 వరకు పెంచారు. పరిశ్రమ వర్గాల ప్రకారం.. రెండు దేశాల మధ్య సంక్షోభం తీవ్రతరం కావడంతో వల్ల రాబోయే వారాల్లో మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ధరల సవరణ తర్వాత, ప్రస్తుతం ఒక టన్ను హెచ్ఆర్సీ ధర సుమారు 66,000 రూపాయలు లభిస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి."రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం అంతర్జాతీయ స్థాయిలో సరఫరా గొలుసును ప్రభావితం చేస్తోంది. దీంతో, అనేక వస్తువుల ధరల ఇన్ పుట్ ఖర్చులు పెరుగుతున్నాయి. కోకింగ్ బొగ్గు టన్నుకు 500 అమెరికన్ డాలర్లుగా ట్రేడవుతోంది" అని ఒక పరిశ్రమ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. కొన్ని వారాల క్రితం రేట్లతో పోలిస్తే కోకింగ్ బొగ్గు ధర సుమారు 20 శాతం పెరిగింది అని ఆయన అన్నారు. ఉక్కుతో సహా దేశీయ రంగాలపై ఈ రెండు దేశాల సంఘర్షణ ప్రభావం ఎంతో ఉంది అని అడిగినప్పుడు టాటా స్టీల్ సీఈఓ,ఎండి టీవీ నరేంద్రన్ మాట్లాడుతూ.. "రష్యా, ఉక్రెయిన్ దేశాలు రెండూ బొగ్గు & సహజ వాయువుతో సహా ముడి పదార్థాల సరఫరాదారులుగా ఉండటమే కాకుండా ఉక్కు తయారు చేయడంతో పాటు ఎగుమతి కూడా చేస్తున్నట్లు" ఆయన పేర్కొన్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం సరఫరా-డిమాండ్ డైనమిక్స్, ఇన్పుట్ ఖర్చులతో సహ మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఆటో, ఉపకరణాలు & నిర్మాణం, రియల్ ఎస్టేట్ వంటి రంగాలకు ఉక్కు ముడిపదార్థం కాబట్టి, ఉక్కు ధరలు పెరగడం వల్ల ఇళ్లు, వాహనాలు, వినియోగ వస్తువుల ధరలు ప్రభావితం కావలసి ఉంటుందని ఒక నిపుణుడు తెలిపారు. (చదవండి: ఆహా! ఏమి అదృష్టం.. పెట్టుబడి రూ.లక్ష లాభం రెండున్నర కోట్లు) -
ఏపీ భవన్లో తెలుగు విద్యార్థులను కలిసిన ఎంపీ సత్యవతి
సాక్షి, ఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు విడతల వారీగా స్వదేశానికి చేరుకుంటున్నారు. గురువారం.. ప్రత్యేక విమానాలలో 86 మంది ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి చేరుకున్న వారికి ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ (పీ.ఆర్.సీ) ప్రవీణ్ ప్రకాశ్ ఆధ్వర్యంలో భవన్ ఉద్యోగులు వసతి, భోజన, రవాణా సదుపాయాలు ఏర్పాటు చేశారు. చదవండి: ‘అమరావతి.. చంద్రబాబు పెట్టుబడుల రాజధాని’ విద్యార్థులు తమ స్వస్థలాలు చేరుకునేలా ఏపీ భవన్ ఉద్యోగులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఎంపీ, కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ కమిటీ సభ్యురాలు బి.వి.సత్యవతి.. ఏపీ భవన్లో ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులను కలిసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. -
రష్యా-ఉక్రెయిన్ ఎఫెక్ట్.. స్వదేశీ కంపెనీ మెడ మీద వేలాడుతున్న కత్తి..!
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే, ఆ దాడుల ప్రభావం ఇప్పుడు ఇతర రంగాల మీద కూడా పడుతుంది. ఈ దాడుల వల్ల లో ఎర్త్ ఆర్బిట్(లియో) బ్రాడ్ బ్యాండ్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ కంపెనీ వన్ వెబ్ దీనికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. రష్యా 24 టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యన్ అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ అధిపతి డిమిత్రి రోగోజిన్ మాట్లాడుతూ.. వన్ వెబ్ తన ఉపగ్రహాలను సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని హామీ ఇవ్వకపోతే, మార్చి 4న దాని ఉపగ్రహ ప్రయోగాన్ని నిలిపి వేయనున్నట్లు తెలిపారు. ఈ వన్ వెబ్ కంపెనీలో ఎయిర్‌టెల్‌కు చెందిన భారతి గ్లోబల్ గ్రూప్‌కు ఎక్కువ వాటా ఉంది. కజకస్తాన్ నుంచి రష్యా అద్దెకు తీసుకున్న బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి 36 ఉపగ్రహాలను మార్చి 4న ప్రయోగించడానికి వన్ వెబ్ ప్రణాళికలు వేసింది. అయితే, మార్చి 4న మాస్కో సమయం 21:30 వరకు వన్ వెబ్ సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని హామీ ఇవ్వకపోతే ఉపగ్రహాలను ప్రయోగించడానికి వినియోగిస్తున్న సోయుజ్-2.1బీ అంతరిక్ష వాహన నౌక వాడకాన్ని అంతరిక్ష సంస్థ అనుమతించదని రోగోజిన్ తెలిపారు. తన ఉపగ్రహాలను రష్యాకు వ్యతిరేకంగా సైనిక అవసరాల కోసం ఉపయోగించబోమని వన్ వెబ్ హామీలను అందించాలని తన ఏజెన్సీ కోరుకుంటున్నట్లు రోగోజిన్ తెలిపినట్లు ఇంటర్ ఫ్యాక్స్ వార్తా సంస్థ నివేదించింది. ❗️ В связи с враждебной позицией Великобритании в отношении России еще одним условием запуска космических аппаратов OneWeb 5 марта является выход британского правительства из состава акционеров компании OneWeb. 🔗 Подробнее: https://t.co/HHbGC0DY12 pic.twitter.com/M6FnQeKC4K — РОСКОСМОС (@roscosmos) March 2, 2022 నవంబర్ 2020లో దివాలా అంచున ఉన్న వన్ వెబ్ కంపెనీలో యుకె ప్రభుత్వం, భారతి గ్లోబల్ కన్సార్టియం కలిసి 650 లియో ఉపగ్రహాల ద్వారా బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ సేవలను అందించడానికి సంస్థలో 1 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టుబడి పెట్టాయి. వన్ వెబ్ ఇప్పటికే 400కు పైగా ఉపగ్రహలను కక్ష్యలో ప్రవేశ పెట్టింది. ఉపగ్రహ ప్రయోగాన్ని రద్దు చేస్తే రష్యా-ఉక్రెయిన్ దాడి వల్ల ప్రత్యక్ష పర్యవసానాన్ని ఎదుర్కొన్న మొదటి భారతీయ కార్పొరేట్ కంపెనీగా భారతి గ్రూప్ నిలవనుంది. గత ఏడాది జూన్ నెలలో అతిపెద్ద వాటాదారుగా మారడానికి వన్ వెబ్ సంస్థలో అదనంగా 500 మిలియన్ డాలర్లు(రూ.3,700 కోట్లకు పైగా) పెట్టుబడి పెట్టనున్నట్లు భారతి గ్రూప్ తెలిపింది. $550 మిలియన్ పెట్టుబడితో వన్ వెబ్'లో భారతి గ్రూప్ 38.6 శాతం వాటా కలిగి ఉంది. యుకె ప్రభుత్వం, యూటెల్‌శాట్, సాఫ్ట్ బ్యాంక్ ఒక్కొక్కటి 19.3 శాతం వాటా కలిగి ఉన్నట్లు వన్ వెబ్ ఒక ప్రకటనలో తెలిపింది. (చదవండి: సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న బంగారం ధర..!) -
శభాష్ ఎలన్ మస్క్.. బాధితులకు అండగా టెస్లా కంపెనీ..!
ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగినప్పటి నుంచి అక్కడి విదేశీ పౌరులతో సహ స్వదేశీ పౌరులు ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు. ఉక్రెయిన్ నుంచి తరలి వెళ్తున్న ప్రజల కోసం టెస్లా ఉక్రెయిన్‌తో పాటు ఆ దేశం చుట్టూ ఉన్న అనేక దేశాలలో ఎలక్ట్రిక్ వాహనాలకు ఉచితంగా ఛార్జింగ్ సేవలను అందించడం ప్రారంభించింది. స్థానిక యజమానులకు పంపిన ఈమెయిల్లో టెస్లా & టెస్లా యేతర ఎలక్ట్రిక్ వాహనాలు ఉచితంగా ఛార్జింగ్ ఉపయోగించడానికి ఉక్రేనియన్ సరిహద్దులకు సమీపంలో అనేక సూపర్ ఛార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేయలని టెస్లా ప్రకటించింది. సోమవారం నుంచి ఉక్రెయిన్‌లో ఇటీవల పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. క్షిపణి దాడులకు ప్రభావితమైన ప్రాంతాల్లో టెస్లా & నాన్-టెస్లా వాహనాలకు ఉచిత సూపర్ ఛార్జింగ్ సేవలను తాత్కాలికంగా ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ట్ర్జెబునోవిస్కో(పోలాండ్), కోసీఐస్(స్లోవేకియా), మిస్కోల్క్(హంగరీ), డెబ్రెసెన్ (హంగరీ) ప్రాంతాల్లో ఉచిత ఛార్జింగ్ సేవలు ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. "మీరు సురక్షితమైన ప్రదేశానికి చేరుకోవడానికి, మేము తీసుకున్న ఈ చర్య మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుందని ఆశిస్తున్నాము" అని కూడా అది తెలిపింది. టెస్లా ఇలా ఉచితంగా ఛార్జింగ్ సేవలు అందించడం ఇదే మొదటి సారి కాదు. గతంలో ప్రకృతి వైపరీత్యాలతో దక్షిణ అమెరికా ప్రాంతంలో హరికేన్ల సమయంలో అనేక సందర్భాల్లో యజమానులకు ఉచిత సూపర్ ఛార్జింగ్ సేవలను టెస్లా అందించింది. టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ తీసుకున్న ఈ కీలక నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారు. (చదవండి: చేసింది ఇక చాలు!! మా'స్టారు' మీ టైమ్ అయిపోయింది!) -
రష్యాకు భారీ షాక్ ఇచ్చిన యాపిల్ కంపెనీ..!
ప్రముఖ టెక్ దిగ్గజం, ప్రీమియం మొబైల్ తయారీ సంస్థ యాపిల్ కంపెనీ రష్యాకు భారీ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్-రష్యా మధ్య ఇంకా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యాపిల్ కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యాలో యాపిల్ కంపెనీకి చెందిన అన్నీ ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు అమెరికన్ టెక్నాలజీ కంపెనీ యాపిల్ ప్రకటించింది. ఒక ప్రకటనలో యాపిల్ "మేము రష్యాలో అన్ని ఉత్పత్తి అమ్మకాలను నిలిపిచేసాము. గత వారం, ఆ దేశానికి మా కంపెనీ ఉత్పత్తుల ఎగుమతులను నిలిపివేశాము" అని పేర్కొంది. అలాగే, ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా ఆపిల్ కంపెనీ రష్యాలో ఆపిల్ పే, ఇతర సేవలను పరిమితం చేసినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌పై దాడి రష్యా చేస్తున్న దాడుల కారణంగా పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై దాడి రష్యా దాడి చేసినప్పటి నుంచి అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య దేశాలు ఆ దాడిని ఆపడానికి మాస్కోపై అనేక ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్ రష్యన్ విమానాల రాకపోకలపై నిషేధాన్ని విధించాయి. కెనడా & స్వీడన్ కూడా రష్యా నుంచి వస్తున్న విమానాలకు తమ గగనతలాన్ని మూసివేశాయి. పాశ్చాత్య మిత్రదేశాలు సమిష్టిగా రష్యాను ఒంటరి చేయడానికి ఆర్థిక ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. ఈ చర్యలలో భాగంగానే ఆ దేశ విదేశీ కరెన్సీ నిల్వలను స్తంభింపజేశాయి. ఇంకా రష్యన్ బ్యాంకులను స్విఫ్ట్ నెట్ వర్క్ నుంచి తొలిగించాయి. ఇలా ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడుల కారణంగా చాలా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. (చదవండి: ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు!) -
రష్యా-ఉక్రెయిన్ వార్: తాలిబన్ల స్పందన ఇదే..
కాబూల్: ఉక్రెయిన్‌పై రష్యా అత్యాధునిక బాంబులు, క్షిపణులతో భీకర దాడికి పాల్పడుతోంది. ఉక్రెయిన్ రాజధాని కైవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు హై స్పీడ్ వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా తీరుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌పై సైనిక చర్యలకు దిగిన రష్యాపై ఐరోపా, అమెరికా సహా పలు ఆసియా పసిఫిక్ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై తాలిబన్లు సైతం స్పందించారు. ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. యుద్ధం విషయంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని సూచించారు. అలాగే.. హింసాత్మక ఘటనలను ప్రేరేపించే చర్యల నుంచి ఇరు దేశాలు వెనక్కి తగ్గాలని కోరారు. యుద్దం పరిష్కారం కాదని.. ఈ సమస్యను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని తాలిబన్లు సూచించారు. అనంతరం ఉక్రెయిన్‌లో ఉన్న ఆప్ఘనిస్తాన్ ప్రజలు సురక్షితంగా, జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy — Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022 -
ఉక్రెయిన్ సంక్షోభంలో భారతీయులు.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా సైనిక దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం నెలకొంది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. అయితే, యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేసిన విషయం తెలిసిందే. దీంతో అక్కడి నుంచి వివిధ దేశాలను వెళ్లాల్సిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయుల కోసం ప్రత్యేక విమానాలను నడుపనున్నట్టు వెల్లడించింది. కాగా, వారి కోసం విమాన ఛార్జీలను సైతం కేంద్రమే భరించనున్నట్టు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం రాత్రి రెండు ప్రత్యేక విమానాలు ఉక్రెయిన్ సమీప దేశాల నుంచి బయలుదేరనున్నాయి. రుమేనియా దేశం మీదుగా ఈ విమానాలు తిరిగి స్వదేశానికి రానున్నాయి. కాగా, భారతీయ అధికారుల బృందాలు విద్యార్థులను హంగేరి, పోలాండ్ దేశాల మీదుగా ఉక్రెయిన్ సరిహద్దులకు పంపిస్తారు. అక్కడ్నుంచి విద్యార్థులను స్వదేశానికి తీసుకురానున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్, పోలాండ్, హంగేరి దేశాల్లోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. విద్యార్థులకు అప్డేట్స్ ఇస్తున్నారు. ఉక్రెయిన్‌లో సుమారు 16వేల మంది భారతీయులు చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు యుద్దం కారణంగా గురువారం ఉక్రెయిన్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం తిరిగి ఢిల్లీకి వచ్చిన విషయం తెలిసిందే. -
పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ఆవేదన ఇదే..
కైవ్: రష్యా ధాటికి ఉక్రెయిన్‌లో భయానక వాతావరణం చోటుచేసుకుంది. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు. పుతిన్ సైన్యం అత్యాధునిక ఆయుధాలతో ఉక్రెయిన్ను లక్ష్యంగా చేసుకుని దాడులను కొనసాగిస్తోంది. రష్యా సైనిక దాడుల్లో 137 మంది ఉక్రెయిన్ సైనికులు వీర మరణం పొందారు. మరోవైపు రష్యాపై ప్రపంచ దేశాలు ఆంక్షలను విధిస్తున్నాయి. ఇదిలా ఉండగా శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడియర్ జెలెన్స్కీ సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యాను ఎదుర్కొనేందుకు తాము ఒంటిరిగానే పోరాటం చేస్తున్నామని వెల్లడించారు. కానీ, మా దేశం నుండి రష్యా దళాలను వెనక్కి పంపడానికి మా బలం, బలగం సరిపోదు. దృఢమైన సంకల్పంతోనే అది సాధ్యమవుతుందని దేశ ప్రజలు, సైనికుల్లో ధైర్యం నింపారు. ప్రపంచ దేశాలన్నీ ఉక్రెయిన్‌లోని ఘటనలను గమనిస్తున్నాయని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక కార్యకలాపాలను తగ్గించడానికి మాస్కోపై విధించిన ఆంక్షలు సరిపోవని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, రష్యా బలగాలు కైవ్‌ను సమీపిస్తున్నాయన్న తరుణంలో ఉక్రెయిన్ సైనికులు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీని ఓ బంకర్లో దాచిపెట్టారు. పుతిన్ హెచ్చరిక.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్‌పై దాడులను కొనసాగిస్తూనే మరోసారి దాని మిత్ర దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్‌కు సపోర్ట్ చేస్తూ రష్యాకు వ్యతిరేకంగా ఏ దేశమైన చర్యలకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ ప్రజలపై దాడి చేయడం తమ లక్ష్యం కాదని, తమ పౌరులను, సైనికులను రక్షించుకునేందుకే దాడులు చేస్తున్నట్టు పుతిన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. యూకే, అమెరికా, కెనడా, యూరోపియన్ యూనియన్‌తో సహా అనేక దేశాలు ఉక్రెయిన్‌లో రష్యా సైనిక దాడులను ఖండించాయి. ఈ క్రమంలోనే రష్యాపై తీవ్ర ఆర్ధిక ఆంక్షలను సైతం విధించాయి. నాటో సభ్య దేశాల జోలికి వస్తే ఊరుకునేది లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. రష్యాను హెచ్చరించారు. -
‘అహంకార ఉక్రెయిన్.. వాస్తవం తెలుసుకోండి’
సోషల్ నెట్ వర్కింగ్ వెబ్సైట్లు ఫేస్బుక్, ట్విట్టర్లలో సెలబ్రిటీల ‘మనసులోని మాట’లు తాజాగా ఇలా...! ఉక్రెయిన్ కోసం ప్రజాస్వామ్యంలో బతకాలన్న అతి మామూలు కోరికతో ఒక ఫాసిస్ట్ దురాక్రమణదారుకు వ్యతిరేకంగా నిలబడిన జనానికి నేను మద్దతుగా నిలుస్తున్నాను. జీవితంలోని చాలా విషయాలు అస్పష్టంగా ఉంటాయి. కానీ ఇది మాత్రం కాదు. – నీరా టాండన్, అమెరికా ఉదారవాది అహంకార ఉక్రెయిన్ శ్వేత దురహంకార నియో నాజీలతో కూడిన ఉక్రెయిన్ ప్రభుత్వానికి స్వీయాభిమానం ఉన్న ఒక నల్ల జాతీయుడు ఎలా మద్దతివ్వగలడు? – అజము బరాకా, అమెరికా యాక్టివిస్ట్ వాస్తవం తెలుసుకోండి ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను తరలించడం భారత ప్రభుత్వ నైతిక బాధ్యత మాత్రమే. అది న్యాయపరమైన బాధ్యత కాదు. ప్రభుత్వాన్ని అనవసరంగా విమర్శించడం మానండి. ఉక్రెయిన్ ఒక సార్వభౌమ దేశం. మనం ఏం చేయగలిగినా వారి అనుమతి, ప్రాథమ్యాలను బట్టే చేయాల్సి ఉంటుంది. ప్రమాదంలో ఉన్న వారి విమానాశ్రయాలను వాడటంలో మనకు ప్రాథమ్యం ఇవ్వమని ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం నైతికంగా డిమాండ్ కూడా చేయలేము. – ఎన్.సి. ఆస్థానా, మాజీ ఐపీఎస్ అధికారి ఇంటి సంగతి తెలియదు నమ్మలేనిదే గానీ ముమ్మాటికీ నిజం. ఇండియాలోని టీవీ న్యూస్ చానల్స్‌కు... మన సరిహద్దు లద్దాఖ్‌లో చైనా సైన్యపు ఉనికి కంటే, ఎక్కడో ఉన్న ఉక్రెయిన్‌లో రష్యా బలగాల మోహరింపు, వారి కదలికల గురించి ఎక్కువ తెలుసు. – సుశాంత్ సింగ్, సీనియర్ ఫెలో మీరేం చేశారు? ఉక్రెయిన్ మీద రష్యా దాడి కచ్చితంగా ఆ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించడమే. ఇది యుద్ధోన్మాద చర్య. కానీ అమెరికా, యూరప్ కూడా ఇటీవలి చరిత్రలో సరిగ్గా ఇలానే వ్యవహరించాయి... ఇరాక్, సిరియా, కొసావో, అఫ్గానిస్తాన్ అన్నింటా ఇదే కథ. ఇరాక్ మీద దాడి చట్టవిరుద్ధం, దానికి ఐక్యరాజ్యసమితి అనుమతి లేదు, పైగా అది ఒక అబద్ధం మీద ఆధారపడి చేసినది. ఉనికిలోనే లేని మానవ హనన ఆయుధాలు అన్న సాకుతో ఆ దాడి జరిగింది. – మిన్హాజ్ మర్చంట్, రచయిత నిద్ర పోలేకపోతున్నాం ఇప్పుడు అర్ధరాత్రి రెండున్నర అవుతోంది. అయినా ఉక్రెయిన్‌లో మేము ఇంకా నిద్ర పోలేకపోతున్నాం. – ఐరీనా మాత్వియిషీన్, జర్నలిస్ట్ -
పుతిన్‌కు ప్రధాని మోదీ ఫోన్ కాల్!.. యుద్ధం ఆగేనా..?
సాక్షి, న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా సంక్షోభంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ విషయంలో ప్రపంచ దేశాలు మాట్లాడకూడదని, జోక్యం చేసుకోకూడదని పుతిన్ అన్ని దేశాలకు ముక్కు సూటిగా చెప్పేశారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్‌లో రక్తపాతం సృష్టిస్తున్న సందర్బంగా గురువారం రాత్రి భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడనున్నారన్న విషయం ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ మారింది. కాగా, ఉక్రెయిన్‌పై రష్యా మరణాహోమాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ దేశ రాయబారి ఇగోర్ పోలిఖా.. ప్రధాని మోదీని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో పుతిన్‌తో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. మోదీ మాట్లాడిన తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయోనని అన్ని దేశాలు వేచి చూస్తున్నాయి. మరోవైపు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో మోదీ లోక్ కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కీలక సమావేశానికి హోం శాఖ, రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖల మంత్రులతో పాటు క్యాబినెట్ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో భారతీయుల తరలింపు, ముడి చమురు ధరలపై దీని ఎఫెక్ట్‌పై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. -
రష్యా వార్: ప్రమాదంలో ఇండియన్స్.. మోదీ సర్కార్ అలర్ట్
కీవ్: ఉక్రెయిన్‌లో భీకర యుద్దం కొనసాగుతోంది. రష్యా సైనిక దళాలు ఉక్రెయిన్‌పై బాంబులు, మిస్సెల్స్‌తో దాడిని కొనసాగిస్తున్నాయి. ఈ దాడిలో ఇప్పటికే ఏడుగురు ఉక్రెయిన్ పౌరులు మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కాగా, ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ ఉన్న భారత పౌరులకు, విద్యార్థులకు ఎంబసీ కీలక సూచనలు అందించింది. దాడులు కొనసాగుతున్న కారణంగా ఉక్రెయిన్ నుంచి అన్ని విమానాలు రద్దయ్యాయి. ప్రత్యేక విమానాలు సైతం రద్దు చేయబడినట్టు ఎంబసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో భారతీయులను తరలించేందుకు తాము ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్టు తెలిపింది. ప్రజల తరలింపునకు సంబంధించి ప్రణాళిక సిద్ధం కాగానే భారత ఎంబసీ సమాచారం అందిస్తుందని వెల్లడించింది. (ఇది చదవండి: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 18 వేల మంది భారతీయులు ?హెల్ప్ లైన్ నంబర్లు ఇవే..) ఈ క్రమంలోనే భారతీయులు వారి పాస్‌పోర్ట్, ఇతర అత్యవసర పత్రాలను ఎల్లప్పుడు తమ వద్దే భద్రపరుచుకోవాలని సూచించింది. భారత పౌరులు ఎంబీసీకి సంబంధించిన వెబ్సైట్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్టులను ఫాలో అవుతూ ఉండాలని పేర్కొంది. ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపింది. కాగా, అంతకు ముందు భారత పౌరులు ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని కోరింది. ఇళ్లు, హాస్టల్స్‌ను వీడి బయటకు రావద్దని హెచ్చరించింది. @IndiainUkraine issues a fresh advisory for all Indian Nationals/Students in Ukraine. Alternative arrangements are being made for evacuation of our citizens. 📞 Additional 24*7 helplines: +38 0997300428 +38 0997300483 +38 0933980327 +38 0635917881 +38 0935046170 pic.twitter.com/95EHCPSOKy — Arindam Bagchi (@MEAIndia) February 24, 2022 -
బంగారం కొనేవారికి భారీ షాక్.. భగ్గుమన్న ధరలు..!
Gold Prices Surge To Highest in a Year: మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. నేడు బంగారం ధరలు భగ్గుమన్నాయి. ఉక్రెయిన్ మీద రష్యా దాడికి దిగడంతో అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో బంగారం ధర 2022లో గరిష్ట స్థాయికి పెరిగింది. ఎంసీఎక్స్'లో 10 గ్రాముల స్వచ్చమైన బంగారం ధర ఈ రోజు ₹1,400కు పైగా పెరగడంతో ₹51,750 ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. స్పాట్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1950 డాలర్లకు చేరుకుంది. సుమారు 13 నెలలో ఇదే గరిష్టం. ఔన్స్ (28.3495 గ్రాములు) బంగారం ధర త్వరలో $1950-$2000 వరకు వెళ్ళవచ్చని మార్కెట్ నిపుణులు తెలిపారు. బులియన్ జేవెల్లర్స్ ప్రకారం.. దేశ రాజధాని న్యూఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల(బిస్కెట్ గోల్డ్ 999) బంగారం ధర సుమారు రూ.1300కి పైగా పెరిగి రూ.51,419కు చేరుకుంది. ఇక ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల(916) బంగారం ధర రూ.45,870 నుంచి రూ.47,100కు చేరుకుంది. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. నిన్నటితో పోలిస్తే నేడు 22 క్యారెట్ల(916) పసిడి ధర రూ.46000 నుంచి రూ.46,850కు పెరిగింది. అంటే ఒక్కరోజులో రూ.850 పెరిగింది అన్నమాట. ఇక బిస్కెట్ గోల్డ్ బంగారం ధర రూ.930 పెరిగి రూ.51,110కి చేరుకుంది. ఇక పసిడి బాటలోనే వెండి ధర కూడా భారీగా పెరిగింది. వెండి ధర రూ.2300కి పైగా పెరిగి రూ.66,501కి చేరుకుంది. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి. (చదవండి: మరో ప్రమాదం అంచున ఉక్రెయిన్, ఇది రష్యా పనేనా?!) -
ఉక్రెయిన్ ఎంబసీ దగ్గర పరిస్థితి
-
ఉక్రెయిన్ నుంచి ఢిల్లీ చేరుకున్న ప్రత్యేక విమానం.. వారు ఏమన్నారంటే..?
సాక్షి, న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల మధ్య భారత పౌరులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. 242 మంది ప్రయాణికులతో ఉక్రెయిన్ నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే, ఉక్రెయిన్‌లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో భారత ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఆ దేశంలో ఉన్న భారత పౌరులను, విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు చర్యలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే మంగళవారం ఉక్రెయిన్‌కు వెళ్లిన ప్రత్యేక విమానంలో భారత్‌కు చెందిన 242 మంది ప్రయాణికులు సురక్షితంగా ఢిల్లీకి చేరుకున్నారు. కాగా, ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తరలించేందకు మరిన్ని విమానాలను అందుబాటులో ఉంచుతామని విదేశాంగశాఖ సహాయమంతి మురళీధరన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. (ఇది చదవండి: ఉక్రెయిన్‌లో రష్యా దూకుడు.. పుతిన్ సవాల్ చేస్తున్నారా అంటూ..) #WATCH | Air India special flight carrying around 242 passengers from Ukraine reaches Delhi pic.twitter.com/ctuW0sA7UY — ANI (@ANI) February 22, 2022 ఈ సందర్భంగా విద్యార్ధులు మాట్లాడుతూ.. యుద్ధ వాతావరణం నుంచి బయటపడి స్వదేశానికి చేరుకోవడంఎంతో ఉపశమనంగా ఉందని తెలిపారు. ఈ క్రమంలోనే వారు ఆనందం వ్యక్తం చేశారు. #WATCH | Air India special flight carrying around 242 passengers from Ukraine landed at Delhi airport as tensions escalate pic.twitter.com/HHryuWt7i9 — ANI (@ANI) February 22, 2022 -
దూకుడు పెంచిన రష్యా.. పుతిన్ తీరుపై ఫుల్ ఫైర్
మాస్కో: ఉక్రెయిన్‌పై రష్యా దూకుడు క్రమంగా ప్రత్యక్ష సైనిక ఆక్రమణగా మారుతోంది. ఈ పరిణామాలపై అమెరికా, యూరప్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు మండిపడ్డాయి. అంతర్జాతీయ ఒప్పందాలను రష్యా అతిక్రమిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఐరాస భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమై, రష్యా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించింది. రష్యా చర్యలపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. తూర్పు ఉక్రెయిన్‌లోని ఈ సమస్యను మిన్స్క్ ఒప్పందానికి లోబడి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని రష్యాకు సూచించారు. తన సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునేందుకు ఉక్రెయిన్ చేసే అన్ని ప్రయత్నాలకూ ఐరాస పూర్తి మద్దతిస్తుందని చెప్పారు. బలప్రయోగం ద్వారా ఏమైనా చేయొచ్చని పుతిన్ భావిస్తున్నారని, తన దుందుడుకు చర్యల ద్వారా అంతర్జాతీయ వ్యవస్థలనే సవాలు చేస్తున్నారని ఐరాసలో అమెరికా ప్రతినిధి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్ విమర్శించారు. ఆయనకు గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. జర్మనీ, ఫ్రాన్స్, టర్కీ, డెన్మార్క్, ఫిన్లాండ్, బెల్జియం, ఆస్ట్రియా తదితర దేశాలన్నీ రష్యా చర్యను తీవ్రంగా తప్పుబట్టాయి. 15 దేశాలతో కూడిన భద్రతా మండలి ఉక్రెయిన్ సంక్షోభంపై భేటీ కావడం ఇటీవలి కాలంలో ఇది మూడోసారి. కాగా, రష్యాకు దగ్గరవుతున్న చైనా మాత్రం, సంక్షోభ నివారణకు మరిన్ని చర్చలు మేలంటూ ఆచితూచి స్పందించింది. (ఇది చదవండి: రష్యాకు షాకిచ్చిన అమెరికా.. బైడెన్ కీలక నిర్ణయం) -
రష్యా- ఉక్రెయిన్ వివాదం.. ఊహించని షాకిచ్చిన అమెరికా
వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా బలగాలను మోహరించి సైనిక విన్యాసాలు చేస్తోంది. ఈ క్రమంలో రష్యా వ్యవహార శైలిపై ప్రపంచ దేశాలు ఆందోళనతో పాటుగా ఆగ్రహం సైతం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్ర రాజ్యం అమెరికా.. రష్యాను హెచ్చరిస్తూ ఆర్థిక ఆంక్షలు విధించింది. మంగళవారం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శ్వేతసౌథంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రష్యాను కబ్జాదారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటి నుంచి రష్యా చర్యకు ప్రతి చర్య ఉంటుందని హెచ్చరించారు. రష్యాకు చెందిన రెండు అతిపెద్ద ఆర్థిక సంస్థలు వెబ్, సైనిక బ్యాంకుపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్నట్టు బైడెన్ తెలిపారు. రష్యాలోని ప్రముఖులపై కూడా ఆంక్షలు విధిస్తాం. నార్డ్ స్ట్రీమ్ 2 పైపులైన్ ప్రాజెక్టును వెంటనే నిలిపివేసేందుకు జర్మనికి సహకరిస్తామని వెల్లడించారు. పశ్చిమ దేశాలతో రష్యాకు ఉన్న వ్యాపార, వాణిజ్య సంబంధాలను కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లోని భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు పుతిన్ ప్రయత్నిస్తున్నాడని బైడెన్ మండిపడ్డారు. రష్యా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. జెనీవా వేదికగా రష్యా విదేశాంగ మంత్రితో జరుగనున్న సమావేశాన్ని రద్దు చేస్తున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో దౌత్యపరమైన అంశాలను రష్యా సీరియస్‌గా తీసుకోవడంలేదని ఆయన అన్నారు. ఈ క్రమంలోనే రెండు దేశాల మధ్య చర్చలను రద్దు చేస్తున్నట్టు బ్లింకెన్ పేర్కొన్నారు. (ఇది చదవండి: ఉక్రెయిన్‌లో టెన్షన్.. భారతీయులకు కీలక సూచనలు చేసిన ప్రభుత్వం) -
ఉక్రెయిన్‌లో ఉద్రిక్తతలు.. విద్యార్ధులను హెచ్చరించిన భారత్
కైవ్: ఉక్రెయిన్‌లో ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనిక బలగాలు యుద్ధ వినాస్యాలను ప్రదర్శించడం యుద్ద వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. మంగళవారం ఉదయం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత విద్యార్థులు, పౌరుల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల భద్రత కోసం ఉక్రెయిన్‌లో ఉన్న కైవ్‌లోని భారత రాయబార కార్యాలయం తాజాగా ఓ సలహాను జారీ చేసింది. ఉక్రెయిన్‌లో చదువుతున్న భారతీయ విద్యార్ధులు తాత్కాలికంగా అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి రావాలని పేర్కొంది. ఆన్లైన్ క్లాసుల్లో నమోదుకు సంబంధించి వారి కళాశాలల నుండి నిర్ధారణ కోసం వేచి ఉండవద్దని కోరింది. అంతకు ముందు ఉక్రెయిన్‌లోని వైద్య విశ్వవిద్యాలయాల నుంచి తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని ఎంబసీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను తరలించేందకు కేంద్రం మంగళవారం ప్రత్యేక విమానాలను అక్కడికి పంపించింది. ఈ విమానాలు ఈరోజు రాత్రికి స్వదేశానికి చేరుకోనున్నట్టు అధికారులు తెలిపారు. ADVISORY TO INDIAN STUDENTS IN UKRAINE.@MEAIndia @PIB_India @IndianDiplomacy @DDNewslive @PTI_News @IndiainUkraine pic.twitter.com/7pzFndaJpl — India in Ukraine (@IndiainUkraine) February 22, 2022 -
ఉక్రెయిన్-రష్యా సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. భారత్ ఆందోళన
వాషింగ్టన్: కొద్దిరోజులగా రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. లక్షకు పైగా రష్యా బలగాలు సరిహద్దుల్లో మోహరించి యుద్ధ విన్యాసాలు సైతం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తాజాగా ఈ పరిణామాలపై భారత్ సైతం కీలక వ్యాఖ్యలు చేసింది. సరిహద్దుల్లో నెలకొన్న ఈ పరిణామాలు శాంతికి భంగం కలిగించేలా ఉన్నాయాని వ్యాఖ్యానించింది. మంగళవారం ఉక్రెయిన్ అంశంపై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నిర్వహించిన అత్యవసర సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని పక్షాలు శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని కోరారు. ఈ ఉద్రిక్తతల అంశంపై వీలైనంత త్వరగా రెండు దేశాల మధ్య చర్చలు ప్రారంభించాలని సూచించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌లో 20వేల మందికి పైగా ఉన్న భారత పౌరులు, విద్యార్థుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. వారి రక్షణే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. కాగా, అన్ని దేశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలన్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించడం సాధ్యమవుతుందన్నారు. ఉద్రిక్తతలను తగ్గించేందుకు ట్రైలేటరల్ కాంటాక్ట్ గ్రూప్ ద్వారా ప్రయత్నిస్తున్న దేశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు. Safety&security of civilians essential. More than 20,000 Indian students& nationals live&study in different parts of Ukraine, incl in its border areas. The well-being of Indians is of priority to us: India's Permanent Rep to United Nations TS Tirumurti, at UNSC meet on Ukraine pic.twitter.com/kRcAdVAtuI — ANI (@ANI) February 22, 2022 -
మార్చిలో లిస్టింగ్‌కు సన్నాహాలు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీని మార్చిలో లిస్టింగ్ చేసేందుకు సన్నద్ధమై ఉన్నట్లు కంపెనీ చైర్మన్ ఎంఆర్ కుమార్ తాజాగా పేర్కొన్నారు. అయితే ఇటీవల రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ఆరి్థక సంవత్సరం(2021–22) ముగిసేలోగా ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూని పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేయనున్న అంచనాలతో అమెరికా అప్రమత్తమైన నేపథ్యంలో కుమార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక, రాజకీయ అనిశి్చత పరిస్థితులు తలెత్తడంతో స్టాక్ మార్కెట్లు ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. మరోపక్క యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపులో సాగనున్న సంకేతాలు ఇస్తోంది. దీంతో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 1–18 మధ్య నికరంగా రూ. 18,856 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. వెరసి వరుసగా ఐదో నెలలోనూ అమ్మకాలకే అధిక ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితులను సునిశితంగా గమనిస్తున్న ట్లు కుమార్ తాజాగా పేర్కొన్నారు. కాగా.. ఐపీఓ ద్వారా దాదాపు రూ. 63,000 కోట్ల సమీకరణతో సరికొత్త రికార్డును సృష్టించే అవకాశం ఉంది. వీళ్లకూ డిస్కౌంట్..: ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి యోజన(పీఎంజేజేబీవై) సబ్‌్రస్కయిబర్లకు సైతం ఎల్ఐసీ ఐపీవో ధరలో డిస్కౌంటును అందించనున్నట్లు కుమార్ వెల్లడించారు. పాలసీదారులకు ఇస్తున్నట్లే వీరికీ తగ్గింపును ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 2015లో ప్రారంభమైన పీఎంజేజేబీవై పొదుపు ఖాతా కలిగిన 18–50 ఏళ్ల వయసులోపు వారికి రూ. 330 వార్షిక ప్రీమి యంతో రూ. 2 లక్షల బీమా కవరేజీ అందిస్తోంది. ఎల్ఐసీ.. ద లీడర్ బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్ఐసీ ప్రభుత్వ రుణ సాధనాలలో అత్యధిక స్థాయిలో ఇన్వెస్ట్ చేసిన కంపెనీగా నిలుస్తున్నట్లు స్వీస్ బ్రోకరేజీ యూబీఎస్ సెక్యూరిటీస్ తాజాగా పేర్కొంది. మొత్తం జీసెక్యూరిటీస్‌లో 19 శాతాన్ని కలిగి ఉన్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా ఈక్విటీలలోనూ అతిపెద్ద వాటాదారు, ఫండ్ మేనేజర్‌గానూ నిలుస్తున్నట్లు తెలియజేసింది. 520 బిలియన్ డాలర్ల విలువైన నిర్వహణలోని ఆస్తులను కలిగి ఉన్నట్లు నివేదికలో యూబీఎస్ పేర్కొంది. మొత్తం ఈక్విటీలలో 4 శాతం వాటాతో ప్రభుత్వం(ప్రమోటర్) తదుపరి ఒకేఒక అతిపెద్ద వాటాదారుగా రికార్డును నెలకొలి్పనట్లు వివరించింది. 2021 డిసెంబర్‌కల్లా బ్లూచిప్ కంపెనీలు రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 10 శాతం, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐటీసీలలో 5 శాతం చొప్పున వాటాలను కలిగి ఉంది. వీటితోపాటు బ్యాంకింగ్ దిగ్గజాలు ఐసీఐసీఐ, ఎస్బీఐలో 4 శాతం వాటా ఉంది. ఇక డైవర్సిఫైడ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీలోనూ 4 శాతం వాటాను పొందింది. ప్రతిఏటా కుటుంబ పొదుపు రూ. 100లో రూ. 10 వరకూ ఎల్ఐసీకి చేరుతున్నట్లు తెలియజేసింది. -
రష్యా–ఉక్రెయిన్; ఎవరిదెంత బలం.. ఎవరిదెంత వ్యయం?
Military Strengths Of Russia And Ukraine: ట్యాంకుల నుంచి శతఘ్నుల వరకు పదాతి దళం నుంచి మారణాయుధాల వరకు యుద్ధ విమానాల నుంచి నౌకల వరకు ఉక్రెయిన్‌పై మూడువైపులా రష్యా పకడ్బందీగా బలగాలను మోహరించింది. రష్యా, బెలారస్‌లు సంయుక్తంగా పది రోజులుగా చేస్తున్న సైనిక విన్యాసాలతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులకు దిగుతుందన్న ఆందోళన నెలకొంది. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత రష్యా పకడ్బందీగా ఒక దేశంపై యుద్ధ సన్నాహాలు చేయడం ఇదే మొదటి సారి. రష్యాకి చెందిన సకల రక్షణ వ్యవస్థలు గత కొద్ది రోజులుగా ఉక్రెయిన్ చుట్టూ మోహరించి ఉన్నాయి. రష్యాకు చెందిన 100 బెటాలియన్ టాక్టికల్ గ్రూప్స్ (బిటిజి) సరిహద్దుల్లో మాటువేశాయి. ఒక్కో గ్రూప్‌లోని వెయ్యిమందికి పైగా సైనికులు ఉన్నారు. వివిధ ప్రాంతాలలో దాదాపు 2 లక్షల మంది సైనికులు మోహరించి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాల కోసం వేచి చూస్తున్నారు. 2014లో జరిగిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో డజను కంటే తక్కువ బిటిజిలను మోహరించిన రష్యా ఇప్పుడు వాటి సంఖ్య ఏకంగా 100కి పెంచింది. యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంటుందని చెప్పడానికి రష్యా దగ్గర కంబైన్డ్ ఆర్మీస్ 11 ఉంటే వాటిలో 10 ఉక్రెయిన్ సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఏ క్షణంలో ఏ అవసరం వస్తుందేమోనని వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేశారు. యుద్ధ సన్నాహాల్లో భాగంగా ఫిబ్రవరి 10 నుంచి రష్యా–బెలారస్ సంయుక్తంగా సైనిక విన్యాసాలు, క్షిపణి పరీక్షల్ని నిర్వహిస్తోంది. వీటిని చూస్తుంటే రష్యా సమరశంఖాన్ని పూరించినట్టేనని అమెరికా జాతీయ భద్రతా సలహాదారుడు జేక్ సలివాన్ హెచ్చరించారు. రష్యా ఉత్తరం, మధ్య, దక్షిణం దిశల్లో ఎటు వైపు నుంచైనా దాడులకి దిగే అవకాశముంది. ఉత్తరం వైపు నుంచి వస్తే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది. సెంట్రల్ రూట్ అయిన డోంటెస్క్ నుంచి, లేదంటే దక్షిణవైపు నుంచి అంటే సముద్ర మార్గం ద్వారా దాడులు చేయడానికి స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తోంది. రష్యా మిలటరీ సత్తాపై అధ్యయనం చేసిన రాండ్ కార్పొరేషన్‌కు చెందిన విశ్లేషకుడు స్కాట్ బాస్టన్ ఇరు దేశాల ఉద్రిక్తతల గురించి మాట్లాడుతూ ‘‘అధినేత నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే దాడులు చేయడానికి సైనిక బలగాలు సిద్ధంగా ఉన్నాయి. ఉద్రిక్తతలు చల్లారతాయనడానికి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఆధారాలు లేవు. అయితే మిలటరీని సన్నద్ధం చేసిన స్థాయిలో రష్యా వాస్తవంగా యుద్ధానికి దిగుతుందని భావించడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఎవరిదెంత వ్యయం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మిలటరీ ఉన్న దేశాల్లో రష్యా అయిదో స్థానంలో ఉంది. రక్షణ రంగానికి ఆ దేశం మొత్తం బడ్జెట్లో 11.4 శాతం ఖర్చు చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ తమ బడ్జెట్లో 8.8శాతం ఖర్చు చేస్తోంది. 2020లో రష్యా రక్షణపై 6170 కోట్ల డాలర్లు ఖర్చు చేస్తే, అదే ఏడాది ఉక్రెయిన్ 590 డాలర్లు ఖర్చు చేసినట్టుగా స్టాక్‌హోమ్ ఇంటర్నేనషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. రష్యా–ఉక్రెయిన్ బలాబలాలు రష్యా, ఉక్రెయిన్ మిలటరీ బలాబలాలను చూస్తే ఎక్కడా పొంతన కుదరదు. రష్యా మిలటరీని ఉక్రెయిన్ నామమాత్రంగా కూడా ఢీ కొనలేదు. అయినప్పటికీ అమెరికా, బ్రిటన్ అండదండలతో ఆ దేశం ధీమాగా ఉంది. అగ్రరాజ్యాలు తమ రక్షణ కోసం నాటో బలగాల్ని తరలిస్తారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఆశతో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 12 దేశాలు సభ్యులుగా మొదలైన నాటోలో ప్రస్తుతం 30 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, ఇటలీ, డెన్మార్క్ వంటి దేశాలతో కూడిన నాటో బలగాలు ఉక్రెయిన్‌కి అండగా నిలిస్తే ఇరు పక్షాల మధ్య భీకర పోరు జరుగుతుంది. రష్యా, ఉక్రెయిన్ సైనిక శక్తిలో ఎంత అసమతుల్యత ఉందో ఇది చూస్తే అర్థమవుతుంది. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ఉక్రెయిన్ సరిహద్దుల్లో కాల్పుల మోత.. సైనికుల ఎదురుకాల్పులు!
కైవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం ఇంకా సద్దుమణగలేదు. గురువారం తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పుల మోత ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. సరిహద్దు ప్రాంతంలో గ్రనేడ్లు, భారీ ఆయుధాలతో రష్యా మద్దతు కలిగిన వేర్పాటువాదులు కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైనికుల కూడా ఎదురుకాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మరోవైపు ఉక్రెయిన్ ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపినట్లు రష్యా వేర్పాటువాదులు ఆరోపించారు. అయితే ఈ కాల్పుల్లో ప్రాణనష్టం జరగలేదు. కానీ, ఇద్దరు పౌరులు గాయపడినట్టు ప్రాథమిక సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ ఎదురుకాల్పులపై అగ్ర రాజ్యం అమెరికా స్పందించింది. రష్యావి రెచ్చగొట్టే చర్యలు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో రష్యా.. సరిహద్దుల్లో మోహరించిన తన దేశ సైనికులను వెనక్కి రప్పించినట్టు పేర్కొంది. -
ఉద్రిక్తతలకు కారణం నాటో పీటముడి?!
ఒకప్పుడు కలిసిఉన్న దేశానికి వ్యతిరేకంగా ఏర్పడిన కూటమిలో చేరాలని ఉక్రెయిన్ ఉబలాటపడుతోంది. ఎలాగైనా ఈ చేరికను అడ్డుకోవాలని రష్యా యత్నిస్తోంది. రష్యాను తిరస్కరించి ఉక్రెయిన్ను నాటోలో చేర్చుకోవాలని యూఎస్, మిత్రపక్షాలు ఆశపడుతున్నాయి. అసలేంటీ నాటో? ఎందుకు ఇందులో చేరడానికి ఉక్రెయిన్‌కు తొందర? దీనివల్ల రష్యాకు నష్టమేంటి? అమెరికాకు లాభమేంటి? నాటో కూటమే ఉక్రెయిన్ ఉద్రిక్తతలకు కారణమా? ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా లక్షకు పైగా బలగాలను మోహరించింది. పరిస్థితి చూస్తే ఏ క్షణమైనా యుద్ధం కమ్మే సూచనలు కనిపిస్తున్నాయి. ఉక్రెయిన్ను ఆక్రమించే ఉద్దేశం లేదని రష్యా చెబుతున్నా, అటు పాశ్చాత్య దేశాలు, ఇటు ఉక్రెయిన్ నమ్మడం లేదు. రష్యా, యూఎస్ కూటమికి మధ్య ఈ ఉద్రిక్తతలకు అసలు కారణం నాటో కూటమేనంటున్నారు నిపుణులు. ఉక్రెయిన్ సంక్షోభం సమసిపోవాలంటే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకూడదని రష్యా షరతు పెడుతోంది. అయితే యూఎస్ మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. నాటోలో ఉక్రెయిన్ చేరిక అన్ని పక్షాలకు ఎందుకు ఇంత ప్రాధాన్యాంశంగా మారిందంటే నాటో చరిత్రను, ఉక్రెయిన్ ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సిందే! ఏంటీ నాటో? రెండో ప్రపంచ యుద్ధానంతరం రష్యాకు వ్యతిరేకంగా అమెరికా, యూకే, ఫ్రాన్స్‌తో పాటు మరో ఎనిమిది యూరోపియన్ యూనియన్ దేశాలు 1949లో నాటో ( ద నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్)ను ఏర్పాటు చేశాయి. అనంతరం అనేక దేశాలు ఈ కూటమిలో చేరుతూ వచ్చాయి. తాజాగా 2020లో ఉత్తరమాసిడోనియా నాటోలో చేరింది. ఈ కూటమి ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో ఉంది. కేవలం యుద్ధ పరిస్థితులు ఎదురైతే కలిసికట్టుగా ఎదుర్కొనేందుకు ఈ కూటమి ఏర్పడింది. ఐరాస లాగా ఇతర అభివృద్ధి తదితర కార్యక్రమాల్లో నాటో పాల్గొనదు. నాటోలో చేరిన దేశాలకు మాత్రమే కూటమి రక్షణ ఉంటుంది. కనుక ఒకవేళ రష్యా ఉక్రెయిన్ను ఆక్రమిస్తే, ఉక్రెయిన్ కూటమిలో సభ్యురాలు కాదు కనుక నాటో నేరుగా స్పందించలేదు. అందుకే ఎలాగైనా ఉక్రెయిన్ను కూటమిలో చేర్చుకునేందుకు యూఎస్, మిత్రదేశాలు తొందరపడుతున్నాయి. ఉక్రెయిన్ అవసరాలు 1992 నుంచి నాటోతో ఉక్రెయిన్ సంబంధం కొనసాగుతోంది. 1997లో ఉక్రెయిన్– నాటో కమిషన్ ఏర్పాటైంది. అయితే అధికారికంగా నాటోలో ఇంతవరకు ఉక్రెయిన్ చేరలేదు. రష్యా తమను ప్రత్యేకంగా మిగల్చదని ఉక్రెయిన్ రాజకీయనాయకుల భావన. నాటోలో చేరడం ద్వారా నేరుగా నాటో కూటమి రక్షణ పొందవచ్చని వీరి ఆలోచన. సభ్యదేశాలు కానివాటి రక్షణపై నాటోకు పరిమితులున్నాయి. అందువల్ల రష్యా ఇప్పటికిప్పుడు ఉక్రెయిన్‌పై దండెత్తితే నాటో స్పందన భిన్నంగా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా కూటమిలో చేరాలని ఉక్రెయిన్ భావిస్తోంది. అలాగే నాటోలో చేరడం ద్వారా యూరోపియన్ యూనియన్‌లో కూడా సభ్యత్వం పొందవచ్చని ఉక్రెయిన్ నేతల ఆలోచన. దీనివల్ల యూఎస్ తదితర దేశాలతో మరింత బలమైన సంబంధాలు ఏర్పడడంతో పాటు పాశ్చాత్య దేశాల ఆర్థిక అండదండలు లభిస్తాయి. అయితే నాటోలో సభ్యత్వం పొందడం అంత సులువు కాదు. కూటమిలో అన్ని దేశాలు విస్తరణకు ఆమోదం తెలపాలి. నాటోలో కొత్తగా చేరబోయే దేశం మెంబర్షిప్ యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయాలి. 2008లో ఉక్రెయిన్ ఈ ప్లాన్‌కు దరఖాస్తు చేసుకుంది. అయితే 2010లో రష్యా అనుకూల నేత ఉక్రెయిన్ అధిపతి కావడంతో ప్రక్రియ అటకెక్కింది. 2014 క్రిమియా ఆక్రమణ అనంతరం ఉక్రెయిన్‌కు నాటోలో చేరాలన్న కోరిక పెరిగింది. 2017లో నాటో సభ్యత్వం కోసం ఆ దేశం రాజ్యాంగ సవరణ కూడా చేసింది. రష్యా బాధలు నాటో విస్తరణపై రష్యా తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చుతోంది. ఈ కూటమి విస్తరణ తమకు హాని కలిగిస్తుందని రష్యా వాదన. అలాంటి కూటమిలో తమ సరిహద్దులోని, తమతో ఒకప్పుడు భాగమైన దేశం సభ్యత్వం తీసుకుంటే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని రష్యా నాయకత్వం భావిస్తోంది. అందుకే నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వవద్దని డిమాండ్ చేస్తోంది. యూఎస్, మిత్రదేశాలు ఈ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో వాటిపై ఒత్తిడి తెచ్చేందుకు యుద్ధసన్నాహాలు చేస్తోంది. నాటో వద్ద తమ దరఖాస్తు చాలా కాలంగా పెండింగ్‌లో ఉందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి గతేడాది వ్యాఖ్యానించారు. దీంతో అప్రమత్తమైన రష్యా ఈ బంధం బలపడకుండా చూసేందుకు యత్నిస్తోంది. అలాగే నాటోలో చేరబోయే దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, సరిహద్దు సమస్యలుండకూడదు. అప్పుడే సభ్యదేశాలు నూతన సభ్యత్వాన్ని పరిశీలిస్తాయి. ప్రస్తుతం ఉక్రెయిన్ సరిహద్దుల్లో బలగాలను మోహరించడం ద్వారా ఉక్రెయిన్ సభ్యత్వ పరిశీలనకు రష్యా అడ్డంపడుతోంది. కోల్డ్‌వార్ టైమ్‌లో కీలకపాత్ర ‘సంయుక్త సంరక్షణ’(కలెక్టివ్ డిఫెన్స్) అనేది నాటో ప్రధాన ఉద్దేశం. అంటే కూటమిలో సభ్యులెవరిపై దాడి జరిగినా కూటమిపై దాడి జరిగినట్లు భావించి ఎదురుదాడి చేస్తారు. నాటో చరిత్రలో ఒక్కసారి మాత్రమే సంయుక్త సంరక్షణ సూత్రాన్ని వాడారు. 2001 అమెరికాపై దాడుల అనంతరం నాటో దేశాల మిలటరీ విమానాలన్నీ యూఎస్ ఆకాశవీధుల్లో కాపలా తిరిగాయి. యూగోస్లోవియా, ఇరాక్, అఫ్గాన్ యుద్ధాల్లో నాటో రాజకీయ కారణాలతో పాల్గొన్నది. రష్యాతో ప్రచ్ఛన్నయుద్ధ సమయంలో అమెరికా, మిత్రపక్షాలకు నాటో చాలా ఉపయోగపడింది. అయితే రష్యా ప్రభ కోల్పోయి, అమెరికా ఏకైక సూపర్ పవర్‌గా మిగిలిన తర్వాత నాటోకు ప్రాధాన్యం తగ్గింది. ప్రస్తుతం మరలా ఉక్రెయిన్ విషయంలో నాటో గురించి చర్చ ఆరంభమైంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
హైఅలర్ట్: ఏ క్షణంలోనైనా యుద్ధట్యాంకర్ పేలొచ్చు!
High Alert At Ukrain Border Amid Forces Deploy: అగ్రరాజ్యాల మధ్య వైరం.. ఎక్కడో చిన్న దేశం మీద అగ్గి కురిపించేందుకు సిద్ధమైంది. అమెరికా-నాటో, రష్యా దళాల మోహరింపు నడుమ ఉక్రెయిన్ సరిహద్దు రణరంగాన్ని తలపిస్తోంది. ఉక్రెయిన్ ఆక్రమణ రష్యా సిద్ధమైంది(ఆ ఉద్దేశం లేదని వ్లాదిమిర్‌పుతిన్ బుకాయిస్తుండడం తెలిసిందే) . తన సైన్య బలగాల్లో మెజార్టీని పశ్చిమ వైపున మోహరించింది. సుమారు లక్ష మంది సైనికులు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు శాటిలైట్ ద్వారా తీసిన చిత్రాలు కొన్నిబయటకు లీక్ అయ్యాయి. బెలారస్‌లోని బ్రెస్ట్స్కై శిక్షణ కేంద్రం దగ్గర రష్యా దళాలు, వాళ్ల టెంట్లకు సంబంధించిన ఫొటోలు సైతం బయటకు పొక్కాయి. మరోవైపు అమెరికా 8,500 సైనికులను మోహరించడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు NATO బలగాలను పంపుతూనే.. మరికొన్ని బలగాలను సిద్ధంగా ఉంచింది. ఈ రెండు వర్గాల విస్తరణ.. పొరుగున ఉన్న క్రిమియా, బెలారస్ పొడవునా ఉంది. కేవలం దళాల మోహరింపు మాత్రమే కాకుండా.. భారీ ఆయుధాలు, కవచాలు ఫిరంగిలతో యుద్ద వాతావరణం నెలకొంది. ఈ ఎక్విప్మెంట్ మొత్తాన్ని చాలా వరకు దూరప్రాంతాల నుండి రైలులో రవాణా చేయబడినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఐరోపాలో బహిరంగ సంఘర్షణను నివారించడానికి.. పాశ్చాత్య దేశాలు దౌత్యపరమైన చర్చల దిశగా అగ్రరాజ్యాలపై ఒత్తిడి తెస్తున్నాయి. ఈ తరుణంలో రష్యా, అమెరికా సోమవారం UN భద్రతా మండలిలో చర్చలు నిర్వహించాయి. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సరిహద్దులో పోటాపోటీ బలగాలను మోహరించడం ద్వారా ప్రపంచానికి యుద్ధ సంకేతాలు పంపడం ఆపాలని, తమ పౌరుల భయాందోళనలను రెట్టింపు చేయొద్దంటూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ.. ఈ వేదిక నుంచి అగ్రరాజ్యాలకు పిలుపు ఇవ్వడం విశేషం. చెక్క తుపాకులతో శిక్షణ!! Ukrainian Civilians.. రష్యా ఆక్రమణ భయాందోళనల నడుమ.. ఎలాంటి కేవలం అమెరికా-నాటో దళాల్ని నమ్ముకోకూడదని ఉక్రెయిన్ బలంగా ఫిక్స్ అయ్యింది. సరిహద్దులో ఇప్పటికే లక్షా ముప్ఫైవేలమంది సైనికులను మోహరించింది. అందుకే సాధారణ పౌరులకు యుద్ధ శిక్షణను ఆఘమేఘాల మీద ఇస్తోంది. ఈ మేరకు ఢిపెన్స్ ఫోర్స్ అధికారులు.. యువత, వయో వృద్ధులను సైతం రంగంలోకి దించుతోంది. ఈమేరకు చెక్కు తుపాకులతో శిక్షణ ఇస్తున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి కూడా. యుద్ధం తమదాకా వచ్చేసిందని బలంగా నమ్ముతున్న పౌరులు శిక్షణకు ఆసక్తి చూపిస్తున్నారు. సంబంధిత వార్త: ఉక్రెయిన్ కేంద్రంగా.. అగ్రరాజ్యాల కొట్లాటకు కారణం ఇదే.. -
ఉక్రెయిన్ ఉద్రిక్తత.. భారతీయులకు అలర్ట్
Alert For Indians In Ukraine: ఉక్రెయిన్‌కు రష్యా ముప్పు పెరిగిపోతుండడంతో.. ఆ దేశంలో నివసిస్తున్న భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఈ తరుణంలో భారత ప్రభుత్వం స్పందించి.. రాయబార కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది. ఉక్రెయిన్ సరిహద్దులో రష్యా సైన్యం, ప్రతిగా నాటో బలగాల మోహరింపుతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో.. రాజధాని కియెవ్లోని భారత రాయబార కార్యాలయం భారత పౌరులకు కీలక సూచన చేసింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, భారత పౌరులంతా ఎప్పటికప్పుడు అప్డేట్ల కోసం ఎంబసీ అధికారిక వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా ఫాలో అవ్వాలని కోరింది. ఈ మేరకు తమ క్షేమసమాచారాల్ని ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లోని ఫామ్‌లలో అప్డేట్ చేయాలంటూ భారత పౌరులను కోరింది. ‘‘భారత పౌరులతో వేగంగా సమన్వయం కావాలన్న ఉద్దేశంతో భారత రాయబార కార్యాలయం ఉంది. కాబట్టి, పౌరులు ముఖ్యంగా ఉక్రెయిన్ సరిహద్దులోని విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులు ఫామ్‌ను నింపండి. ఒకవేళ ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఆప్షన్‌తో భారత్‌కి వెళ్లిపోయిన విద్యార్థులు మాత్రం ఈ ఫామ్ నింపాల్సిన అవసరం లేదు.. అని ఆ ప్రకటనలో స్పష్టం చేసింది ఎంబసీ. మరింత అప్డేట్స్ కోసం ఎంబసీ వెబ్‌సైట్‌తో పాటు ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో కావాలని, ఏవైనా సాయం కావాలంటే సోషల్ మీడియాలోనూ సంప్రదించవచ్చని సూచించింది. ఒకవైపు రష్యా ఆక్రమణ కోసం ప్రయత్నిస్తోందంటూ ఉక్రెయిన్‌తో పాటు అమెరికా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సరిహద్దులో సైన్యాన్ని మోహరిస్తూనే తమకు అలాంటి ఉద్దేశం లేదంటూ రష్యా బుకాయిస్తోంది. అసలు కథ.. సుమారు మూడు దశాబ్ధాల కిందట రష్యా నుంచి విడిపోయింది ఉక్రెయిన్. అటుపై కొన్నేళ్లకు(2014లో) యూరప్‌తో ఒప్పందాలను తెంచుకొని రష్యాతో బంధం బలపరుచుకోవాలని భావించింది. కానీ, అది కుదర్లేదు. పైగా ఆ ప్రయత్నాలు వెనక్కి వెళ్లడంతో రష్యా ఆగ్రహంతో ఉక్రెయిన్‌లోని క్రిమియాను ఆక్రమించింది. ఆ సమయంలో జరిగిన హింసాకాండతో రష్యాపై వ్యతిరేకత కారణంగా పాశ్చాత్య దేశాల ఉక్రెయిన్ ఆకర్షితురాలైంది. ఈ నేపథ్యంలో 2024లో యూరోపియన్ యూనియన్‌లో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకుంటామని, నాటోలో చేరాలన్న కోరికను కూడా వ్యక్తం చేసింది. ఇది రష్యాకు మరింత కోపం తెప్పించింది. సాంస్కృతికంగా రష్యాతోనే ఉక్రెయిన్‌కు మంచి సంబంధాలున్నాయని చెబుతూ.. నాటో, ఈయూలో చేరడం కన్నా తమతో కలిసిపోవడం మేలంటున్నారు రష్యా అధ్యక్షుడు పుతిన్. అందుకే సరిహద్దులో సైన్యం మోహరింపు ద్వారా కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఈ తరుణంలో ఉక్రెయిన్ విషయంలో తాము తొందరపడకూడదంటే అమెరికా, మిత్రపక్షాలు కొన్ని హామీలివ్వాలని.. ముఖ్యంగా నాటోలో ఉక్రెయిన్‌కు సభ్యత్వం ఇవ్వకుండా ఉండడం, తూర్పు యూరప్‌లో నాటో బలగాల ఉపసంహరణ లాంటి డిమాండ్లు చేస్తోంది. కానీ, అగ్రరాజ్యం అందుకు అంగీకరించడం లేదు. చదవండి: ఉక్రెయిన్‌లో ఏం జరుగుతోంది?! -
నాడు ప్రపంచంలోనే అత్యంత బలమైన బాలుడు... పిన్న వయసు బాడీబిల్డర్... ఐతే ఇప్పుడు!!
చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో అందర్నీ ఆశ్చర్యచకితులను చేసి పేరుగాంచిన చిన్నారుల గురించి విని ఉన్నాం. కొంతమంది ఆ ప్రతిభను తమ జీవితాంతం కొనసాగిస్తే. మరికొందరికి పెద్దయ్యాక చిన్నప్పటి ప్రతిభ కనుమరగవుతుందో లేక వాళ్లకి ఇక ఆసక్తి తగ్గిపోతుందో తెలియదుగాను వారిలో కొన్ని తేడాలు కనిపిస్తూ ఉంటాయి. అచ్చం అలానే ఉక్రెయిన్‌కి చెందిన బాలుడు చిన్న వయసులోనే బాడీబిల్డర్‌గా పేరుగాంచాడు. కానీ ఇప్పడూ ఆ బాలుడిని చూస్తే కచ్చితంగా ఆశ్చర్యపోతారు. (చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!) అసలు విషయంలోకెళ్లితే.....ఉక్రేనియాకి చెందిన రిచర్డ్ సాండ్రాక్ 1992లో జన్మించాడు. అతను 2000 సంవత్సరం నుండి అతని పేరు మారు మ్రోగిపోయింది. కేవలం ఆరేళ్ల ప్రాయం నుండే 85 కిలోలు బరువులు ఎత్తాడు. ఇక ఎనిమిదేళ్లకు 95 కిలోలు వరకు బరువులు ఎత్తి ప్రపంచంలోనే బలమైన బాలుడిగా పేరుగాంచాడు. అంతేకాదు ఆ బాలుడికి 'లిటిల్ హెర్క్యులస్' అని పేరు కూడా పెట్టారు. అతి చిన్న వయసులో బాల సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్నాడు. కానీ ఈ పేరు ప్రఖ్యాతుల వెనుకు ఆ బాలుడి కఠోర శ్రమ అసాధారణమైనది. అంతేకాదు ఆ చిన్న వయసులో ఆ బాలుడు తన తండ్రితో కలిసి రోజుకి ఏడు గంటలు వ్యాయమం చేసేవాడు. పైగా రోజుకు 600 పుష్అప్లు, 300 స్క్వాట్లు చేసేవాడు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్‌తో మంచి దేహదారుఢ్యాని సొంత చేసుకుని పేరు ప్రఖ్యాతులు పొందాడు. అయితే ఈ వ్యాయమాల వల్ల ఆ బాలుడి శరీరంలో కొవ్వు స్థాయిలు పడిపోయి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీంతో అతని తల్లిదండ్రుల పై సర్వత్రా విమర్శలు రావడమే కాదు ఈ మేరకు అతని పై ఒక డాక్యుమెంటరీని కూడా విడుదల చేశారు. అయితే ట్విస్ట్ ఏంటంటే ఇది అప్పటి సంగతి కానీ ఇప్పుడు అతన్ని చూస్తే మాత్రం ఆ బాలుడేనా అనే సందేహం కలగకమానదు. అయితే ఆ బాలుడికి ఇప్పుడు 29 ఏళ్లు. తాను ఇప్పుడు ఎటువంటి బరువులు ఎత్తడం లేదని చెప్పాడు. ప్రస్తుతం అతను హాలీవుడ్ స్టంట్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. బరువులు ఎత్తడం బోరు కొట్టేసిందని ఇప్పుడూ తాను నాసా సంబంధించిన క్వాంటం శాస్త్రవేత్త కావలన్నదే తన ధ్యేయమని చెప్పాడు. (చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్ క్రీమ్‌లు) -
హైదరాబాద్ చేరుకున్న తారక్, చరణ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ చిత్రం ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే రెండు పాటల బ్యాలెన్స్ ఉండగా ఆ పాటల చిత్రీకరణలో భాగంగా ఇటీవల ఆర్ఆర్ఆర్ టీం ఉక్రెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ రామచరణ్, ఎన్టీఆర్‌లతో తీసే ఈ పాటల చిత్రీకరణ పూర్తి కావడంతో బుధవారం రాత్రి ఆర్ఆర్ఆర్ బృందం ఇండియాకు చేరుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో నుంచి చరణ్, తారక్‌లు బయటకు వస్తున్న ఫొటోలను కొంతమంది తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అవి వైరల్‌గా మారాయి. అంతేగాక షూటింగ్ పూర్తి కావడంతో ఉక్రెయిన్‌లో ఆర్ఆర్ఆర్ టీం సెలబ్రెషన్స్ చేసుకున్న ఫొటోలు, వీడియోలు కూడా హల్చల్ చేస్తున్నాయి. చివరి షెడ్యూల్ పూర్తి కావడంతో దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర బృందం కేక్ చేశారు. ఈ మూవీలో చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ సీత పాత్రలో కనిపించనుండగా.. హాలీవుడ్ నటి ఒలివియా ఎన్టీఆర్ సరసన నటిస్తోంది. శ్రియా శరణ్, అజయ్ దేవగన్‌లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్ 13న ఆర్ఆర్ఆర్ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇక మరో విశేషం ఎంటంటే ఉక్రెయిన్ నుంచి ఇంటికి వచ్చిన తారక్ బిగ్ సర్ప్రైజ్ అందింది. ఇటివల ఆయన బుక్ చేసిన లంబోర్గిని ఉరుస్ కారు నిన్ననే ఇంటికి చేరుకుంది. దీంతో ఆయన ఉక్రెయిన్ వచ్చిన తారక్‌కు ఇంటి ముందుకు ఆయన ఇష్టంగా బుక్ చేసుకున్న ఈ కారు దర్శనం ఇవ్వడంతో సర్ప్రైజ్ అయినట్లు తెలుస్తోంది. -
కరోనా లేదన్నాడు, దానికే బలయ్యాడు
కైవ్: కరోనా వైరస్ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది మరణిస్తున్నారు. అయితే ఇప్పటికి చాలా మందిలో కరోనా వైరస్‌కు సంబంధించి అపోహలు ఉన్నాయి. ఇది ఆరోగ్య ఉన్న వారిని ఏం చేయలేదని, ఫిట్‌గా ఉన్న వారి దరిదాపుల్లోకి కూడా రాదని భావిస్తున్నారు. వచ్చిన వారంలో కోలుకోవచ్చని కూడా చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అయితే ఈ వైరస్ సోకి యుక్త వయసులో ఉన్నవారు కూడా చాలామంది మరణించిన ఉదంతాలు కోకొల్లలు. తాజాగా ఉక్రేన్కు చెందిన 33 ఏళ్ల ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్, దిమిత్రి స్టుజుక్ కోవిడ్ -19 బారిన పడి మరణించారు. ఒకప్పుడు ఆయన తన అనుచరులకు కరోనా వైరస్ లేదని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేశారు. అయితే ఆయనే కరోనా మహమ్మారి సోకి మరణించారు. ఈ విషయాన్ని దిమిత్రి మాజీ భార్య సోఫియా తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో స్టుజుక్ మరణ వార్తను ధ్రువీకరించింది. ఇక కరోనా బారిన పడిన దిమిత్రి తాను కరోనా బారిన పడేంత వరకు అది ఉందని అసలు నమ్మలేదని చనిపోయే ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కరోనా వైరస్ ఇప్పట్లో అంతం కాదని, అది చాలా బలమైందని పేర్కొన్నారు. టర్కీకి వెళ్లినప్పుడు దిమిత్రికి తీవ్రమైన కడుపునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. అనంతరం తన దేశానిక తిరిగి రాగానే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆయన డిశార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. తరువాత ఉన్నట్టుండి ఆయన పరిస్థితి విషయం కావడంతో మళ్లీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. దిమిత్రికి 1.1 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: ఐజీని కబళించిన కరోనా మహమ్మారి -
‘మానవ తప్పిదం వల్లే ఆ 176 మంది మృతి’
టెహ్రాన్: ఈ ఏడాది జనవరిలో ఇరాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. 176 మంది ప్రాణాలు బలి తీసుకున్న ఈ ప్రమాదానికి గల కారణాలను ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. మానవ తప్పిదం వల్ల వాయు రక్షణ విభాగం రాడార్ సిస్టమ్ విఫలమయయ్యిందని తెలిపింది. రాడార్‌ను సమలేఖనం చేయడంలో వైఫల్యం తలెత్తిందని.. ఫలితంగా వ్యవస్థలో 107 డిగ్రీల లోపం ఏర్పడిందని ఇరాన్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. ఈ తప్పిదం వల్ల వరుస ప్రమాదాలు సంభవించి చివరకు విమానం కూలిపోయిందని అధికారులు ఒక వాస్తవిక నివేదికను విడుదల చేశారు. ఇరాన్, అమెరికాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలోనే టెహ్రాన్ విమానాశ్రయానికి సమీపంలో ఉక్రేయిన్‌కు చెందిన ఈ బోయింగ్ 737 విమానం కుప్ప కూలింది. అందులో ప్రయాణిస్తున్న 167 మంది ప్రయాణికులతో పాటు మరో 9 మంది ఫ్లైట్ సిబ్బంది కలిపి మొత్తం 176 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ విమానం టెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమేని విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. అయితే ఆ విమానాన్ని తమ రెండు ‘టార్ ఎం1’ క్షిపణులు కూల్చేశాయని ఇరాన్ అప్పట్లోనే ప్రకటించింది. (ఆ విమానాన్ని మా రెండు క్షిపణులు కూల్చాయి: ఇరాన్) ఈ క్రమంలో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘ఈ ప్రమాదం జరిగిన నాడు ఇరాన్, అమెరికా దళాలపై దాడులు జరిపింది. ఇందుకు ప్రతీకారంగా అమెరికా తిరిగి మా దళాలపై దాడులు చేస్తుందనే హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ఈ క్రమంలో డిఫెన్స్ యూనిట్ ఆపరేటర్ ఆకాశంలో ఎయిర్ క్రాఫ్ట్‌ను గుర్తించాడు. దాంతో ఎలాంటి సమాచారం లేకుండానే రెండు రాడార్లను ఎయిర్‌క్రాఫ్ట్ మీదకు ప్రయోగించాడు. ఫలితంగా ప్రమాదం సంభవించింది’ అన్నాడు. -
ఇరాన్‌కు ట్రంప్ మరో హెచ్చరిక
వాషింగ్టన్: ఇరాన్లో జరుగుతున్న ఆందోళనలపై హింసాత్మక చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఇరాన్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్ విమానాన్ని గత బుధవారం పొరపాటున కూల్చేశామని ఇరాన్ ప్రకటించిన నేపథ్యంలో.. ఆ ప్రమాద మృతులకు నివాళిగా టెహ్రాన్‌లోని ఆమిర్ కబీర్ వర్సిటీలో శనివారం ఒక కార్యక్రమం చేపట్టారు. అందులో పాల్గొ న్న ఇరాన్‌లోని బ్రిటన్ రాయబారి రాబ్ మెకెయిర్ని అధికారులు కొద్దిసేపు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై బ్రిటన్ మండిపడింది. ఆమిర్ కబీర్ యూనివర్సిటీలో జరిగిన నిరసనల్లో విద్యార్థులు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారని, ఇటీవల అమెరికా దాడిలో చనిపోయిన జనరల్ సులైమానీ పోస్టర్లను చింపేశారని ఇరా న్ మీడియా తెలిపింది. మరోవైపు, ఆందోళనలను అణచేయడంపై ట్రంప్ పలు ట్వీట్లు చేశారు. గత నవంబర్‌లో నిరసనకారులపై ఉక్కుపాదం మోపడాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ ‘శాంతియుత నిరసనకారులపై మరో ఊచకోత జరగకూడదు. ఇంటర్నెట్పై ఆంక్షలను సహించం. ఇరాన్ ప్రజలారా! మీకు నా సహకారం కొనసాగుతుంది’ అన్నారు. ఆందోళనలు తలెత్తే అవకాశమున్న ప్రాంతాల్లో ఇరాన్ బలగాలను మోహరించింది. కాగా ఉక్రెయిన్ విమాన ప్రమాదానికి తమదే బాధ్యతని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. ఆ విమానాన్ని క్షిపణిగా భావించడంతో తమ మిస్సైల్ ఆపరేటర్ సొంతంగా నిర్ణయం తీసుకుని కూల్చేశాడని పేర్కొంది. సమాచార వ్యవస్థలో 10 సెకండ్ల పాటు అడ్డంకి ఏర్పడటంతో ఉన్నతాధికా రుల నుంచి ఆ ఆపరేటర్ ఆదేశాలు తీసుకోలేకపోయాడని, సొంతంగా నిర్ణయం తీసుకుని ఆ పొరపాటు చేశాడని వివరించారు. -
కూలిన విమానం
టెహ్రాన్: అగ్రరాజ్యం అమెరికాతో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో ఇరాన్లో ఓ విమానం కుప్పకూలింది. ఉక్రెయిన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన పౌర విమానం టెహ్రాన్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన రెండు నిమిషాలకే కూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 176 మంది మృతి చెందారు. బోయింగ్ 737 విమానం టెహ్రాన్ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు వెళ్లాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. విమాన ప్రమాదంలో మృతి చెందినవారిలో ఇరాన్, కెనడా దేశస్తులే అత్యధికంగా ఉన్నారు. ఇరాన్‌కి చెందినవారు 82 మంది, కెనడా దేశస్తులు 63 మంది ఉన్నారు. ప్రయాణికుల్లో 15 మంది చిన్నారులు కూడా ఉన్నారు. రెండు నిమిషాల్లోనే రాడార్ నుంచి అదృశ్యం ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు (యూఐఏ) చెందిన పీఎస్ 752 విమానం టెహ్రాన్ విమానాశ్రయంనుంచి ఉదయం 6:10 గంటలకి టేకాఫ్ అయింది. ఆ తర్వాత రెండు నిమిషాలకే రాడార్‌తో సంకేతాలు తెగిపోయాయి. టెహ్రాన్ విమానాశ్రయానికి వాయవ్య దిశగా 45 కి.మీ. దూరంలో షారియార్లోని పంట పొలాల్లో విమాన శిథిలాలు కనిపించినట్టు ఇరాన్ మీడియా వెల్లడించింది. విమానంలో ప్రయాణిస్తున్న 176 మందిలో ఎవరూ జీవించే అవకాశమే లేదు. ఇరాన్ మీడియా ప్రసారం చేసిన వీడియోలో విమానం కూలిన ప్రాంతంలో మంటలు, దట్టమైన పొగ అలము కొని ఉన్నాయి. సహాయ సిబ్బంది మృతదేహాలను, ప్రయాణికుల వస్తువులను మోసుకొస్తున్న దృశ్యాలు అందరి హృదయాల్ని కలిచివేశాయి. కూలిపోయిందా ? కూల్చేశారా ? ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ఈ విమానాన్ని కూల్చివేశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇరాన్ దేశానికి చెందిన క్షిపణి పొరపాటున విమానాన్ని కూల్చేసిందని సోషల్ మీడియా వేదికగా ప్రచారం మొదలైంది. విమానం ప్రమాదవశాత్తూ కూలిపోకుండా, వేరే ఏదైనా కుట్ర కోణం ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాడిమిర్ జెలెంస్కీ హెచ్చరించారు. సందేహాలు ► ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో దాడి చేసిన కొద్ది సేపటికే విమానం ప్రమాదానికి గురైంది. ఇరాన్ క్షిపణులకి పొరపాటున తగలడం వల్లే విమానం ప్రమాదానికి గురైందన్న అనుమానాలున్నాయి. ► బోయింగ్ 737 విమానం 2016లో తయారు చేశారు. ప్రమాదానికి గురైన రెండు రోజుల ముందే దానిని తనిఖీ చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చెందిన ఈ ఎయిర్‌లైన్స్ విమానం ప్రమాదానికి గురికావడం ఇదే మొదటి సారి. విమానం పూర్తిగా పనిచేసే సామర్థ్యంలోనే ఉందని యూఐఏ అధ్యక్షుడు యెవగనీ వెల్లడించారు. తాము నడిపే విమానాల్లో ఇదే అత్యుత్తమమైనదనీ కన్నీళ్ల మధ్య చెప్పారు. ► విమానం కుప్పకూలాక మంటల్లో చిక్కుకుం దని ఇరాన్ మీడియా వెల్లడించింది. కానీ గాల్లోనే విమానం మంటల్లో చిక్కుకున్నట్టుగా ప్రమాద దృశ్యాల్లో కనిపిస్తోంది. ► విమానంలో టిక్కెట్ బుక్ చేసుకొని ఆఖరి నిముషంలో ఇద్దరు ప్రయాణికులు రద్దు చేసుకున్నారని ఉక్రెయిన్ జాతీయ భద్రతా మండలి చీఫ్ ఒలెక్సీ డేనిలవ్ అంటున్నారు. ► ప్రమాద స్థలిలో దొరికిన బ్లాక్ బాక్స్‌లను తయారీ కంపెనీ బోయింగ్ సంస్థకు కానీ, అమెరికాకి కానీ ఇరాన్ ఇంకా ఇవ్వలేదు. విమాన ప్రమాదంపై విచారణ ఏ దేశం చేస్తుందో స్పష్టత లేదని అందుకే ఇవ్వలేదని ఇరాన్ అధికారులు చెబుతున్నారు. ► ఈ విమాన ప్రమాదంలో మానవ తప్పిదం ఉన్నట్టుగా తాము భావించడం లేదని బోయింగ్ సంస్థ చెబుతోంది. అంతకు ముందు ఇరాన్లో ఉక్రెయిన్ దౌత్యకార్యాలయం తన వెబ్సైట్లో ఈ ప్రమాదం వెనుక ఎవరి హస్తం లేదని, ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే ఇంజిన్ వ్యవస్థ పనిచేయకపోవడమే కారణమని భావిస్తున్నట్టు వెల్లడించింది. -
డీహైడ్రేషన్ వల్ల అలా అయిందంతే..
బెర్లిన్ : తన ఆరోగ్యం గురించి వస్తోన్న పుకార్లను ఖండిచారు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మార్కెల్. కేవలం వేడి ఎక్కువగా ఉండటం మూలనా డిహైడ్రేషన్కు గురయినట్లు పేర్కొన్నారు. మంగళవారం ఓ అధికారిక కార్యక్రమంలో భాగంగా మార్కెల్ ఉక్రేయిన్ అధ్యక్షుడు వోలోడైమిర్ జెలెన్స్కీని సందర్శించారు. ఈ క్రమంలో మిట్ట మధ్యాహ్నం ఎండలో నిల్చుని గౌరవ వందనం స్వీకరించారు మార్కెల్. దాంతో ఆమె డీహైడ్రేషన్‌కు గురై వణకడం ప్రారంభించారు. పరిస్థితి గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను నీడకు చేర్చి మంచి నీళ్లు అందించి ప్రథమ చికిత్స చేశారు. ఈ క్రమంలో ఏంజెలా ఆరోగ్యం గురించి వదంతలు వ్యాప్తి చేందడం ప్రారంభించాయి. దాంతో ఈ విషయం గురించి ఆమె వివరణ ఇస్తూ.. ‘వేడి ఎక్కువగా ఉండటంతో డీహైడ్రేషన్‌కు గురయ్యానంతే. ఓ మూడు గ్లాసుల మంచి నీళ్లు తాగాను. దాంతో అంతా సర్దుకుంది’ అన్నారు మార్కెల్. 2014 ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న మార్కెల్ ఉన్నట్లుండి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. రక్తపోటు పెరగడంతో హుటాహుటిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ తర్వాత 2021 వరకూ రాజకీయాల నుంచి వైదొలగుతానని ప్రకటించారు మార్కెల్. వయసు పైబటమే కాక ఆరోగ్యం కూడా సహకరించనందున ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. -
ఫారిన్లో ఆటాపాటా
‘ఖాకి, చినబాబు’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత తమిళ హీరో కార్తీ నటిస్తోన్న తాజా చిత్రం ‘దేవ్’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ యూరప్‌లోని ఉక్రెయిన్‌లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో మొదలైన ఈ షెడ్యూల్లో ముందు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ శుక్రవారం ‘దేవ్’ టీమ్‌తో రకుల్ జాయిన్ అవ్వగానే పాట అందుకున్నారు టీమ్. అదే సాంగ్ షూట్ స్టార్ట్ చేశారని చెప్తున్నాం. పాట పూర్తయిన తర్వాత అక్కడి లొకేషన్స్‌లోనే హీరో, హీరోయిన్లలపై కొన్ని సీన్స్‌ను చిత్రీకరిస్తారట. ఇందులో కార్తీక్, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నారు. మరో రెండు నెలల్లో షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టి ఈ ఏడాది డిసెంబర్లో ‘దేవ్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని కోలీవుడ్ సమాచారం. -
చలో ఉక్రెయిన్
లండన్‌కు బై బై చెప్పారు కథానాయిక రకుల్‌ప్రీత్ సింగ్. నెక్ట్స్ ఉక్రెయిన్‌కు వెళ్తారామె. అకివ్ అలీ దర్శకత్వంలో అజయ్ దేవగన్, రకుల్‌ప్రీత్ సింగ్, టబు ముఖ్య తారలుగా హిందీలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా నెల రోజుల లాంగ్ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లారు రకుల్. ‘‘లండన్ షెడ్యూల్ పూర్తయింది. ‘దేవ్’ సినిమా కోసం ఉక్రెయిన్ వెళ్తున్నాను. హిందీ టు తమిళ్’’ అని పేర్కొన్నారు రకుల్. కార్తీ హీరోగా రజత్ రవిశంకర్ దర్శకునిగా పరిచయం అవుతున్న తమిళ చిత్రం ‘దేవ్’. ఇందులో రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడానికే రకుల్ ఉక్రెయిన్ వెళ్తున్నారు. ‘దేవ్’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందని సమాచారం. -
8 గంటల్లో ఇంటిని ప్రింట్ చేసే రోబో
ఇళ్లు కట్టి చూడు..పెళ్లి చేసి చూడు అని పెద్దవాళ్లు ఎప్పుడూ ఓ సామెత చెబుతారు. ఎందుకంటే రెండిటికీ అయ్యే ఖర్చు, శ్రమ అంతా ఇంతా కాదు. పెళ్లి విషయం పక్కనే పెడితే ఇళ్లును మాత్రం గంటల్లోనే నిర్మించి ఇస్తానంటోంది ఉక్రెయిన్ కు చెందిన గృహనిర్మాణ స్టార్టప్ పాసివ్డోమ్. 2017లోనే ప్రారంభమైన పాసివ్డోమ్కు అమెరికాలో ఇప్పటికే 8000 ముందస్తు ఆర్డర్లు వచ్చాయి. మొదటి 100 ఆర్డర్లను ఈ నెలలోనే(జనవరి) డెలివరీ ఇవ్వడం ప్రారంభించారు. 410 చదరపు అడుగల విభాగంలో ఈ గృహాల ధరలు 64 వేల డాలర్ల నుంచి 97 వేల డాలర్ల వరకు ఉన్నాయని డిజైనర్ మారియా సోరోకినా తెలిపారు. 3డీ ప్రింటింగ్ రోబోతో గోడలు, ఇంటి పైకప్పు, నేలను ప్రింట్ చేస్తారు. 410 చదరపు అడుగుల డిజైన్ ఇంటికి రోబో తీసుకునే సమయం కేవలం 8 గంటలు మాత్రమే. అయితే రోబోతో పని ముగిసిన తర్వాత కిటికీలు, తలుపులు, ప్లంబింగ్, విద్యుత్ వ్యవస్థలను మనిషి బిగిస్తే సరిపోతుంది. ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత విద్యుత్ కోసం బయటి నుంచి కనెక్షన్లు గానీ, నీటి కోసం బోర్లు లేక సంపుల సాయం కూడా అవసరం లేదు. పూర్తిగా స్వయం ప్రతిపత్తిగల ఇళ్లు అన్నమాట. సౌర శక్తిని ఉపయోగించడానికి శక్తివంతమైన బ్యాటరీలను ఉపయోగించి, అక్కడి నుంచి నేరుగా ఇంటి అవసరాలకు ఉపయోగిస్తారు. గాలిలోని తేమను నీటిగా మార్చే పరికరం అందులో ఉంటుంది. అంతేకాకుండా మురికి నీటి శుద్ధి కోసం ఇంట్లోనే స్వతంత్ర వ్యవస్థ ఉంది. ఇంటి తలుపు తెరిచి చూస్తే పై ఫోటోలో చూపిన విధంగా కనిపిస్తుంది. పాసివ్ డోమ్ ఇంట్లో కిచెన్తోపాటూ విశాలమైన ఖాళీ స్థలం ఉంటుంది. నేలను పైకప్పును కలిపేలా భారీ గాజు కిటికీలు ఉంటాయి. ఈ మోడల్ నిర్మాణాల్లో ప్రత్యేక బెడ్ రూంలు ఉండవు. కిచెన్ పక్కనే ఒక బాత్ రూం ఉంటుంది. పట్టణాలకు, కాంక్రీటునిర్మాణాలకు దూరంగా నివాసం ఉండాలంటే చాలా కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అన్ని సౌకర్యాలు లభించే ఇళ్లు లభించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ టెక్నాలజీతో నిర్మించిన గృహాలు సముద్రతీరాల్లో, పర్వతాల్లో, అడవుల్లో, పల్లెల్లో ఎక్కడైనా నిర్మించుకొని అన్ని సౌకర్యాలు ఉపయోగించుకోవచ్చు అని సోరోకినా పేర్కొన్నారు. 775 చదరపు అడుగుల విభాగంలో ఇంటి ధరలు 97 వేల డాలర్ల నుంచి 147 వేల డాలర్లు వరకు ఉన్నాయి. ఈ గృహాలను నిర్మించడానికి, ఉక్రెయిన్, కాలిఫోర్నియాలోని పాసివ్డోమ్ టీమ్ సభ్యలు ముందుగా 3డీ ప్రింటర్ కోసం ఓ బ్లూ ప్రింట్ ను తయారు చేస్తారు. ఒక్కో పొరను ఒకదాని తర్వాత ఒకటి రోబో ప్రింట్ చేస్తుంది. ఇంటి పైకప్పు, నేల, 20 సెంటీ మీటర్ల మందంతో ఉండే గోడలు( కార్బన్ ఫైబర్స్, పాలీరిథేన్, రిసిన్స్, బాసాల్ట్ ఫైబర్స్, ఫైబర్ గ్లాస్ లను ఉపయోగించి) నిర్మిస్తుంది. 3డీ ప్రింటింగ్ పద్దతిలో తక్కువ ధరల్లోనే ఎక్కువ సమర్థవంతమైన ఇళ్లను నిర్మించవచ్చని సోరోకినా అభిప్రాయపడ్డారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంకా నివసించడానికి ఇళ్లులేని వారు చాలా మంది ఉన్నారని, వారందరికి సమర్ధవంతమై ఇళ్లు తక్కువ సమయంలోనే నిర్మించి ఇవ్వాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. -
ఎయిర్పోర్ట్ పార్కింగ్ నుంచి దూకి..
ముంబయి: ముంబయి విమానాశ్రయంలో ఓ వ్యాపార వేత్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం ఉక్రెయిన్‌కు చెందిన యువ వ్యాపారవేత్త మిఖైల్ చెక్రీన్(32) ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలోగల సెకండ్ లెవల్ పార్కింగ్ స్థలం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. రక్తపు మడుగులో ఉన్న అతడిని కూపర్ ఆసుపత్రికి తరలించగా అక్కడే ప్రాణాలుకోల్పోయాడు. ఎందుకు తన ప్రాణాలు బలితీసుకున్నాడనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. -
ఆ నగరం రెండు రోజుల్లో ఖాళీ..!
నగరం అంటే.. వందల సంఖ్యలో అపార్ట్మెంట్లు, పదుల సంఖ్యలో పాఠశాలలు, రవాణా సదుపాయాలు, కళాశాలలు, క్రీడా స్థలాలు, ఆసుపత్రులు, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు, షాపింగ్‌మాల్స్, వినోద పార్కులు.. ఇలా సదుపాయాలన్నీ ఉండితీరాల్సిందే. ఇవి మాత్రమే ఉంటే సరిపోతుందా..! వీటన్నిటినీ మించి వేల సంఖ్యలో ప్రజలు ఉండాలి. అయితే, ఉక్రెయిన్‌లోని ప్రిప్యత్ నగరంలో ఒక్క మనిషి కూడా కనిపించడు. మరి, సదుపాయాల మాటేమిటి అనేగా మీ సందేహం..? అవి కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇంతకీ ప్రిప్యత్ కథేంటి..?! 1970, ఫిబ్రవరి 4న ఉక్రెయిన్‌లోని ‘చెర్నోబైల్ అణు విద్యుత్ కేంద్రం’ సమీపంలో ప్రిప్యత్ నగరాన్ని ప్రారంభించారు. చెర్నోబైల్లో పనిచేసే కార్మికులు, పరిశోధకులు, ఇతర సిబ్బంది వసతి కోసం ఈ నగరాన్ని సృష్టించారు. చెర్నోబైల్ ఉద్యోగులు తమ కుటుంబాలతో సహా నివసించేందుకు వీలుగా 13 వేలకు పైగా అపార్ట్మెంట్లు నిర్మించారు. వారి చిన్నారుల చదువుల కోసం 15 ప్రాథమిక, 5 ఉన్నత పాఠశాలలు, ఒక వృత్తి విద్యా కళాశాలను ఏర్పాటు చేశారు. ఆసుపత్రి, రవాణా సదుపాయం, క్రీడా మైదానం.. ఇలా అన్నిటినీ సమకూర్చారు. భారీ ప్రణాళిక.. సోవియట్ యూనియన్ నలుమూలల నుంచీ 75-80 వేల మందిని ఈ నగరానికి తరలించాలనుకున్నారు. దానికి తగ్గట్టుగా అధికారులు చర్యలు చేపట్టడంతో 1979 నాటికి అధికారికంగా ‘ప్రిప్యత్’కు నగర హోదా లభించింది. దీంతో ఉద్యోగులు కూడా నెమ్మది నెమ్మదిగా అపార్ట్మెంట్లలోకి చేరుకోవడం మొదలుపెట్టారు. అలా ఓ దశలో నగర జనాభా 50 వేలకు చేరుకుంది. తొలుత అణువిద్యుత్ కేంద్రం సమీపంలో నివాసం అంత మంచిది కాదని వారు భావించారు. అయితే, ఎలాంటి చీకూచింతా లేకుండా పదహారేళ్లు గడిచిపోయాయి. ప్రమాదం.. అంతా సజావుగానే సాగుతుందనుకున్న సమయంలో 1986, ఏప్రిల్ 26న జరిగిన ప్రమాదం నగర వాసులను తీవ్ర భయభ్రాంతులను చేసింది. చెర్నోబైల్ అణు విద్యుత్ కేంద్రం నాలుగో రియాక్టర్లో భారీ పేలుడు సంభవించింది. దీన్ని చూసేందుకు ప్రజలు సమీపంలోని రైల్వే బ్రిడ్జిపైకి పరుగులెట్టారు. అణు రియాక్టర్‌పైన చెలరేగిన మంటలను చూసిన కొందరు దాన్ని చిన్న ప్రమాదమేనంటూ కొట్టి పారేశారు. అణు విద్యుత్ కేంద్రంలో ఇటువంటివి సహజమేనంటూ తేలికగా తీసుకున్నారు. రేడియేషన్.. అణు రియాక్టర్ లీకవ్వడంతో రేడియేషన్ ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే, తొలుత దీన్ని గుర్తించడంలో వారు కూడా విఫలమయ్యారు. రేడియేషన్ సాధారణ స్థాయిలోనే ఉందని, భయపడాల్సిన అవసరం లేదనీ అన్నారు. అయితే, అక్కడి రేడియేషన్ అప్పటికే ప్రమాదకర స్థాయిని మించిపోవడంతో మంటలను అదుపుచేసేందుకు వెళ్లిన సహాయక బృందాలు, అధికారులు, సమీపంలోని ప్రజలు మృత్యు ఒడిలోకి చేరుకున్నారు. మరికొందరు స్పృహ కోల్పోయారు. నిర్మానుష్యం.. దీంతో సోవియట్ ప్రభుత్వం ప్రిప్యత్ వాసులను అక్కడి నుంచి ఆగమేఘాల మీద తరలించడం మొదలుపెట్టింది. పనులు చేసుకుంటున్న వారు, చదువుతున్న చిన్నారులు, గృహిణులు.. ఇలా ప్రజలంతా ఎక్కడి వస్తువులు అక్కడే విడిచిపెట్టి నగరాన్ని ఖాళీ చేశారు. దాదాపు 50 వేల మంది ప్రిప్యత్ను విడిచిపెట్టడంతో నగరం నిర్మానుష్యంగా మారింది. కొన్ని వందల ఏళ్ల పాటు ఆ నగరం నివాసయోగ్యం కాదని అధికారులు తేల్చడంతో ప్రజలు తిరిగి వచ్చే సాహసం చేయలేదు. దీంతో కేవలం రెండు రోజుల్లోనే పూర్తిగా ఖాళీ అయిన నగరంగా ప్రిప్యత్ ప్రపంచ చరిత్రలో నిలిచిపోయింది. భయంకర నగరం.. గత 29 ఏళ్లుగా జనసంచారం లేని ప్రిప్యత్ నగరం ప్రస్తుతం భయంకర నగరంగా పేరొంది పర్యాటకులను ఆకర్షిస్తోంది. చిందరవందరగా పడేసి ఉన్న సామగ్రి, చిన్నారుల ఆటవస్తువులు, పుస్తకాలు, ఆసుపత్రిలోని మందులు, అమ్యూజ్మెంట్ పార్కులోని జెయింట్‌వీల్, మోడుబారిన గోడలు సందర్శకులను భయపెడుతున్నాయి. కొందరు ఔత్సాహిక పరిశోధకులు నేటికీ పరిశోధనల పేరుతో నగరాన్ని చూసి వెళ్తుంటారు.