భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలుత ఆయన జెడ్డాలో ప్రారంభమైన ఉక్రెయిన్ శాంతి సదస్సులో పాల్గొన్నారు. రష్యా హాజరు కాకుండానే ఈ రెండు రోజుల సుదీర్ఘ సదస్సు ప్రారంభమైంది. అమెరికా, చైనా సహా దాదాపు 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.
‘చర్చల ద్వారా వివాదాల పరిష్కారం’
దోవల్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడాన్ని చూస్తే.. భారత్ ఈ శాంతి ప్రయత్నాల్లో తన పాత్రను నొక్కి చెబుతోందన్న బలమైన సంకేతాన్ని పంపుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన సమావేశాల్లో శాంతి, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే సూచించారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ కూడా తన గళాన్ని వినిపించింది. అయితే భారత్ నిరసన ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించినది కాదు. ఇది బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌కు సంబంధించినది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌ను కొనసాగించడంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని అన్నారు.
గల్ఫ్ దేశాలతో రైలు నెట్‌వర్క్ అనుసంధానం
చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యూహాన్ని రూపొందించే ప్రక్రియలో అజిత్ దోవల్ సౌదీ అరేబియా పర్యటన ఒక భాగం. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని నివారించేందుకు భారత్, అమెరికాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా తరచూ సౌదీ అరేబియాను సందర్శిస్తున్నారు. గల్ఫ్ దేశాలపై చైనా ఆధిపత్యాన్ని తరిమికొట్టి, అమెరికా హవాను తిరిగి స్థాపించడమే ఈ సందర్శనల ప్రధాన లక్ష్యం. ఇందు కోసం సౌదీ అరేబియా- ఇజ్రాయెల్ మధ్య స్నేహం నెలకొల్పడంలో అమెరికా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది.
అమెరికా ప్రయత్నాల్లో భాగస్వామ్యం
అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నంలో భారత్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గల్ఫ్ దేశాలను రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా తన వ్యూహాత్మక ఉనికిని బలోపేతం చేసుకునేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో రైలు మార్గం ఏర్పాటుపై భారత్ చర్చలు ప్రారంభించింది. అదే సమయంలో ఈ రైలు మార్గంలో సౌదీ అరేబియాను చేర్చాలనే దిశగా ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియా వరకు రైలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపధ్యంలో భారత రైలు నెట్‌వర్క్‌లో సౌదీ అరేబియాను చేర్చాలని అజిత్ దోవల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్‌ను ‘జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణిస్తుంటారు.
ఇది కూడా చదవండి: గొప్పగా ప్రారంభమై.. అంతలోనే కనుమరుగై..
పాకిస్తాన్ హిందూ పార్టీ పతనం వెనుక..
Comments
Please login to add a commentAdd a comment