doval
-
సౌదీలో ‘ఇండియా జేమ్స్ బాండ్’ ఏం చేస్తున్నారు?
భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలుత ఆయన జెడ్డాలో ప్రారంభమైన ఉక్రెయిన్ శాంతి సదస్సులో పాల్గొన్నారు. రష్యా హాజరు కాకుండానే ఈ రెండు రోజుల సుదీర్ఘ సదస్సు ప్రారంభమైంది. అమెరికా, చైనా సహా దాదాపు 40 దేశాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ‘చర్చల ద్వారా వివాదాల పరిష్కారం’ దోవల్ ఈ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకావడాన్ని చూస్తే.. భారత్ ఈ శాంతి ప్రయత్నాల్లో తన పాత్రను నొక్కి చెబుతోందన్న బలమైన సంకేతాన్ని పంపుతోంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో జరిగిన సమావేశాల్లో శాంతి, చర్చల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే సూచించారు. ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత తొలిసారిగా ఐక్యరాజ్యసమితిలో రష్యాకు వ్యతిరేకంగా భారత్ కూడా తన గళాన్ని వినిపించింది. అయితే భారత్ నిరసన ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించినది కాదు. ఇది బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌కు సంబంధించినది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్‌ను కొనసాగించడంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ చేస్తున్న ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇస్తుందని అన్నారు. గల్ఫ్ దేశాలతో రైలు నెట్వర్క్ అనుసంధానం చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ వ్యూహాన్ని రూపొందించే ప్రక్రియలో అజిత్ దోవల్ సౌదీ అరేబియా పర్యటన ఒక భాగం. గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని నివారించేందుకు భారత్, అమెరికాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ కూడా తరచూ సౌదీ అరేబియాను సందర్శిస్తున్నారు. గల్ఫ్ దేశాలపై చైనా ఆధిపత్యాన్ని తరిమికొట్టి, అమెరికా హవాను తిరిగి స్థాపించడమే ఈ సందర్శనల ప్రధాన లక్ష్యం. ఇందు కోసం సౌదీ అరేబియా- ఇజ్రాయెల్ మధ్య స్నేహం నెలకొల్పడంలో అమెరికా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. అమెరికా ప్రయత్నాల్లో భాగస్వామ్యం అమెరికా చేస్తున్న ఈ ప్రయత్నంలో భారత్ కీలక భాగస్వామిగా వ్యవహరిస్తోంది. గల్ఫ్ దేశాలను రైలు నెట్‌వర్క్‌తో అనుసంధానించడం ద్వారా తన వ్యూహాత్మక ఉనికిని బలోపేతం చేసుకునేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో రైలు మార్గం ఏర్పాటుపై భారత్ చర్చలు ప్రారంభించింది. అదే సమయంలో ఈ రైలు మార్గంలో సౌదీ అరేబియాను చేర్చాలనే దిశగా ఆలోచిస్తున్నారు. సౌదీ అరేబియా వరకు రైలు నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపధ్యంలో భారత రైలు నెట్‌వర్క్‌లో సౌదీ అరేబియాను చేర్చాలని అజిత్ దోవల్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్‌ను ‘జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణిస్తుంటారు. ఇది కూడా చదవండి: గొప్పగా ప్రారంభమై.. అంతలోనే కనుమరుగై.. పాకిస్తాన్ హిందూ పార్టీ పతనం వెనుక.. -
'బెంగాల్ విభజనను సమర్థించింది ఎవరో..?' ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్..
ఢిల్లీ:నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది. దేశ చరిత్రపై మాట్లాడుతూ ధోవల్ వంచకుల పక్షాన చేరిపోయాడని సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ఆరోపించారు. బెంగాల్ విభజనకు మద్ధతు తెలిపిన వ్యక్తుల్లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కూడా ఉన్నారని చెప్పారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ స్థాపకుడు. జనసంఘ్ తదనంతరం బీజేపీగా అవతరించింది. ధోవల్ వ్యాఖ్యలపై స్పందించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్..నేతాజీ గాంధీపై ఛాలెంజ్ చేశారా? బోస్ వామపక్షవాదా? లౌకికవాదా? అని ప్రశ్నలు సందిస్తూ బోస్ ఉంటే దేశం విడిపోకుండా ఉండేదా? ఎవరు చెప్పగలరు? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. నేతాజీ అన్నయ్య శరత్ చంద్ర బోస్ వ్యతిరేకిస్తున్నప్పటికీ బెంగాల్ విభజనను శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సమర్థించారని అన్నారు. నెహ్రూ, బోస్ జీవితాలపై రుద్రాంక్షు ముఖర్జీ రాసిన పుస్తకాన్ని ధోవల్‌కు పంపిస్తానని జైరాం రమేశ్ అన్నారు. ఆ విధంగానైనా ధోవల్ సరైన చరిత్రను తెలుసుకుంటారని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్మారక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో అజిత్ ధోవల్ మాట్లాడారు. బోస్ ధైర్య సాహసాల గురించి చెప్పే క్రమంలో.. నేతాజీ ఉండుంటే దేశం విడిపోయి ఉండేది కాదని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా దుమారం రేపాయి. Mr. Ajit Doval who doesn’t speak much has now joined the tribe of Distorians. 1. Did Netaji challenge Gandhi? Of course he did. 2. Was Netaji a leftist? Of course he was. 3. Was Netaji secular? Of course staunchly and stoutly so. 4. Would Partition not have happened if… pic.twitter.com/Uo8BZCQ51f — Jairam Ramesh (@Jairam_Ramesh) June 17, 2023 ఇదీ చదవండి:బోస్ ఉంటే దేశ విభజన జరిగేది కాదు -
పుతిన్‌తో దోవల్ భేటీ
న్యూఢిల్లీ: రష్యా పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. గురువారం మాస్కోలో ఈ భేటీ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఇకమీదటా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అఫ్గానిస్తాన్ అంశంపై పలు దేశాల అత్యున్నత స్థాయి ప్రతినిధులతో పుతిన్ భేటీ అవుతున్నారు. అందులోభాగంగా గురువారం ఐదవ జాతీయ భద్రతా మండలి/సలహాదారుల సమావేశంలో దోవల్, పుతిన్ మాట్లాడుకున్నారని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ తెలిపింది. ‘అఫ్గానిస్తాన్‌లో అనిశ్చితిని అవకాశంగా తీసుకుని కొన్ని ప్రాంతీయేతర శక్తులు అక్కడ మరింతగా విస్తరించేందుకు కుట్ర పన్నుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏమంత బాగోలేదు. మానవతాసాయం మరింతగా తగ్గిపోతోంది’ అని పుతిన్ అన్నారు. ‘ అఫ్గాన్ గడ్డ నుంచి ఉగ్రవాదాన్ని మరింతగా ఎగదోసే చర్యలను భారత్ ఏమాత్రం ఉపేక్షించదు. అఫ్గాన్ ప్రజలను కష్టాల్లో వదిలేయబోము’ అని దోవల్ అన్నారు. -
చైనా విదేశాంగమంత్రితో అజిత్ దోవల్ చర్చలు
-
చొరబాట్లకు సిద్ధంగా 100 మంది మిలిటెంట్లు
♦ సీసీఎస్‌కు వివరించిన దోవల్ ♦ శ్రీనగర్‌లో సుఖోయ్‌లు సిద్ధం న్యూఢిల్లీ: సర్జికల్ దాడులకు ప్రతీకారంగా భారత ఆర్మీపై, వివిధ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని.. నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు 100 మంది మిలిటెంట్లను సిద్ధం చేసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు. సర్జికల్ దాడుల తర్వాత ఎల్వోసీలో ఉగ్ర శిబిరాలకు పాక్ సైనికులు కాపలా కాస్తున్నారని.. అలాంటి 12 శిబిరాలను గుర్తించామన్నారు. శీతాకాలం లోపే వీలైనంత ఎక్కువ చొరబాట్లకు పాక్ యోచిస్తోందన్నారు. భేటీలో హోం మంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్, విదేశాంగ మంత్రి సుష్మ పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, పాకిస్తాన్‌కు గట్టిగా జవాబిచ్చేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. మిగ్ విమానాల ఎయిర్‌బేస్ అయినశ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో సుఖోయ్ విమానాలను భారత్ సిద్ధంగా ఉంచింది. -
దోవల్.. ది మాస్టర్ మైండ్!
♦ ఆర్మీ దూకుడు వెనుక జాతీయ భద్రతా సలహాదారు ♦ ఒక్క పాక్ బుల్లెట్‌కు రెండు బుల్లెట్లతో బదులివ్వండి న్యూఢిల్లీ: ‘శాంతి.. సహనం.. వ్యూహాత్మక మౌనం..’ సరిహద్దుల వెంట పాక్ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్నా భారత్ ఇన్నాళ్లూ జపించిన మంత్రాలివీ! కానీ వీటన్నింటికీ ఫుల్స్టాప్ పెట్టి గురువారం బెబ్బులిలా విరుచుకుపడింది. పీవోకేలోకి వెళ్లి ఉగ్రమూకల పీచ మణిచింది. అడ్డొచ్చిన ఇద్దరు పాక్ సైనికులనూ మట్టికరిపించింది! దీంతో ఇన్నాళ్లూ రక్షణాత్మక ధోరణిని అవలంబించిన భారత్ ఎదురుదాడి వ్యూహానికి పదును పెడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ వ్యూహానికి బీజాలు ఇప్పుడు కాదు.. రెండేళ్ల కిందటే పడ్డాయి!! దీనంతటి వెనుక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలకపాత్ర పోషించారు. ‘పాక్ ఒక్క బుల్లెట్ పేలిస్తే మీరు రెండు బుల్లెట్లతో సమాధానం చెప్పండి’ అంటూ రెండేళ్ల కిందటే అజిత్ దోవల్ సైన్యానికి స్పష్టంచేశారు. పాక్ ఏమాత్రం కవ్వించినా తగిన విధంగా బుద్ధి చె ప్పాలని, దీటుగా స్పందించాలని సూచించారు. కాల్పుల విషయంలో పై నుంచి ఆదేశాల కోసం ఎదురుచూడకుండా అప్పటికప్పుడు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలంటూ దిశానిర్దేశం చేశారు. 2014 అక్టోబర్ 7న బీఎస్ఎఫ్ డెరైక్టర్ జనరల్‌తో జరిగిన సమావేశంలో దోవల్ ఈ మేరకు పేర్కొన్నారు. ‘అటు వైపు నుంచి ఒక్క బుల్లెట్ వస్తే.. మీరు రెండు బుల్లెట్లతో బదులివ్వండి..’ అని ఆయన చెప్పినట్లు తెలిసింది. పాక్ రేంజర్లు కాల్పులు ఆపేంత వరకు ఒక క్రమ పద్ధతి ప్రకారం సరిహద్దుల వెంట వారి మౌలిక వసతులను టార్గెట్ చేసుకొని విరుచుకుపడాలని ఆ భేటీలో చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో పాక్ సైన్యంతో ఎలాంటి సమావేశాలు జరపకూడదని కూడా నిర్దేశించారు. అప్పట్నుంచి సరిహద్దుల వెంట పాక్ చిన్న కవ్వింపు చర్యకు పాల్పడ్డా.. భారత సైన్యం విరుచుకుపడింది. ముఖ్యంగా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పట్నుంచీ సైన్యం ఇలా దూకుడుగా వ్యవహరించడంతో సరిహద్దు ప్రాంతంలో పాక్‌కు భారీ నష్టమే మిగిలింది. కాల్పులు ఆపండి.. ప్లీజ్! కిందటి అక్టోబర్‌లో పాకిస్తాన్ రేంజర్స్(పంజాబ్) డెరైక్టర్ జనరల్ ఉమర్ ఫరూక్ బుర్కీ చర్చల కోసం ఢిల్లీకి వచ్చిన సమయంలో కూడా సరిహద్దుల వెంట పాక్ సైన్యం రెచ్చిపోయింది. బుర్కీ పాక్‌కు తిరిగి వెళ్లాక కూడా పెద్దఎత్తున కాల్పులు చోటుచేసుకున్నాయి. అయితే ఏమాత్రం తగ్గకుండా గట్టిగా బదులివ్వాలని దోవల్, హోంమంత్రి రాజ్‌నాథ్ బీఎస్ఎఫ్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మన సైన్యం ధాటికి పాక్ వైపు 26 మంది మరణించారు. దీంతో బుర్కీ... బీఎస్ఎఫ్ చీఫ్ డీకే పాఠక్‌ను ‘హాట్‌లైన్’ ద్వారా సంప్రదించి కాల్పులు ఆపాల్సిందిగా విన్నవించినట్లు తెలిసింది. గత జూలైలో భారత ఆర్మీ.. మియన్మార్ భూభాగంలోకి చొచ్చుకువెళ్లి తీవ్రవాదులను మట్టుబెట్టడం వెనుక కూడా దోవలే కీలక పాత్ర పోషించారు. మొత్తమ్మీద గత రెండేళ్లలో భారత్ వైఖరిలో వచ్చిన మార్పు.. ఇటు ఆర్మీలో స్థైర్యాన్ని పెంచగా అటు తమతో పెట్టుకుంటే భారీగా నష్టపోక తప్పదన్న స్పష్టమైన సంకేతాన్ని పాక్‌కు అందించింది. గురువారం కూడా పీవోకేలో మన కమెండోలు సర్జికల్ స్ట్రైక్స్ చేసి వచ్చిన తర్వాత పాక్ బలగాలు రాజౌరీ, బారాముల్లాలోని బీఎస్ఎఫ్ పోస్టుల వైపు కాల్పులు జరిపాయి. ‘బహుశా అసహనంతోనే పాకిస్తాన్ ఈ చర్యకు పాల్పడి ఉంటుంది. ఆ కాల్పులను కూడా మన సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది’ అని అధికారులు తెలిపారు.