చొరబాట్లకు సిద్ధంగా 100 మంది మిలిటెంట్లు
♦ సీసీఎస్‌కు వివరించిన దోవల్
♦ శ్రీనగర్‌లో సుఖోయ్‌లు సిద్ధం
న్యూఢిల్లీ: సర్జికల్ దాడులకు ప్రతీకారంగా భారత ఆర్మీపై, వివిధ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని.. నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు 100 మంది మిలిటెంట్లను సిద్ధం చేసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు. సర్జికల్ దాడుల తర్వాత ఎల్వోసీలో ఉగ్ర శిబిరాలకు పాక్ సైనికులు కాపలా కాస్తున్నారని.. అలాంటి 12 శిబిరాలను గుర్తించామన్నారు.
శీతాకాలం లోపే వీలైనంత ఎక్కువ చొరబాట్లకు పాక్ యోచిస్తోందన్నారు. భేటీలో హోం మంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్, విదేశాంగ మంత్రి సుష్మ పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, పాకిస్తాన్‌కు గట్టిగా జవాబిచ్చేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. మిగ్ విమానాల ఎయిర్‌బేస్ అయినశ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో సుఖోయ్ విమానాలను భారత్ సిద్ధంగా ఉంచింది.