CCS
-
రిమాండ్ రిపోర్టులోవిస్తుపోయే నిజాలు
-
ఏసీపీ ఉమామహేశ్వరరావు కేసులో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావును నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. అంతకు ముందు ఏసీబీ కార్యాలయంలో ఆయనను విచారించిన అధికారులు.. ట్యాబ్‌లో ఉన్న ఆస్తి వివరాలపై ఆరా తీశారు. బీనామీ ఆస్తులపై కూపీలాగుతున్నారు. సందీప్ అనే వ్యక్తి ఎవరు? అతనితో ఉన్న లావాదేవీలు ఏంటి? అనే కోణంలో విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తులు డాక్యుమెంట్స్ వివరాలను ఏసీబీ అధికారులు కోర్టుకు అందించారు. ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం మూడు కోట్ల ఆస్తులను ఏసీబీ గుర్తించింది.ఆస్తి విలువ అనధికారికంగా బహిరంగ మార్కెట్లో రూ. 50 కోట్ల వరకు ఉంటుందని అంచనా. పలుమార్లు సస్పెండయినా కానీ కీలక పోస్టింగ్‌లు దక్కించుకోవటంపై ఏసీబీ ఆరా తీస్తోంది. ఉమామహేశ్వరరావు వెనక ఉన్న అధికారుల అవినీతిపై ఏసీబీ విచారణ చేస్తోంది. కాగా, ఏసీబీ విచారణకు ఉమా మహేశ్వర రావు ఏమాత్రం సహకరించడం లేదని సమాచారం. ఉమామహేశ్వరరావు ఫిర్యాదుదారులనే బెదిరించి వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. ల్యాప్ టాప్‌లో దొరికిన సమాచారం ఆధారంగా ఏసీబీ విచారణ చేపట్టింది. కొందరు పోలీస్ అధికారులతో కలిసి బినామీ వ్యాపారాలు చేసినట్టు ఏసీబీ గుర్తించింది.ఉమామహేశ్వరరావుకు జ్యూడీషియల్ రిమాండ్ఉమామహేశ్వరరావుకు నాంపల్లి ఏసీబీ కోర్టు 14 రోజులు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. -
అసైన్డ్ అని తెలిసే ఆ భూమిని కొన్నారు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమి అసైన్డ్ ల్యాండ్ అని తెలిసే తెలుగుదేశం పార్టీ నేత, వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చిందని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత శుక్రవారం తెలిపారు. ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కనిష్క్‌తో పాటు మరో నిందితుడిని విచారించిన నేపథ్యంలో ఇవి వెలుగులోకి వచ్చాయని వివరించారు. దీంతో సీసీఎస్ పోలీసులు న్యాయస్థానం ఆదేశాలను పాటిస్తూ శివానందరెడ్డితో పాటు మరో నిందితుడు ఆరోగ్యం రెడ్డికి ఈనెల 10న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేసినట్టు వెల్లడించారు. మరిన్ని సాక్ష్యాధారాలు సేకరించడం కోసం కేసు దర్యాçప్తు చేస్తున్నామని శ్వేత వివరించారు. ఈ మేరకు ఆమె ఓ పత్రిక ప్రకటన విడుదల చేశారు. పలుకుబడితో పరిష్కరిస్తానని చెప్పి.. తొలుత అసైనీల నుంచి భూమిని చేజిక్కించుకోవాలని చూసిన రియల్టర్లు టీజే ప్రకాష్, గాంధీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్ ద్వారా మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన పరిచయాలు, పలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. చివరికి ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున (మార్కెట్ కంటే తక్కువ ధర) ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. ఆ అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో వివిధ స్థాయిల్లో లాబీయింగ్ చేశారు. దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గత ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా వీళ్లు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీస్‌లకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డికి రిజిస్ట్రేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రలోభాలకు గురిచేసి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములను లాక్కోవడానికి కుట్ర పన్నారు. పోలీసులను నెట్టేసి పరారు ఈ కేసుల విచారణ కోసం సీసీఎస్ పోలీసులు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులోని శివానందరెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన వీళ్లను తోసేసి పారిపోయిన ఉదంతంపై బ్రాహ్మణ కొట్కూరు ఠాణాలో కేసు నమోదైంది. మాండ్ర కనిష్క, మాండ్ర ఉమాదేవి, పైరెడ్డి ప్రశాంత్‌రెడ్డికి సీసీఎస్ పోలీసులు గత మంగళవారం నోటీసులు జారీ చేశారు. దీంతో వీళ్లు శుక్రవారం విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే వీళ్లు భూమి కొనుగోలుతో పాటు కంపెనీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన వ్యవహారాలను శివానందరెడ్డి చూసుకుంటున్నారని బయటపెట్టారు. బుద్వేల్లోని భూమి స్వభావంపై తమకు అవగాహన ఉందని కూడా అంగీకరించారు. ఈ భూములపై అప్పటికే ఎంవోయూలు ఉన్నాయని తెలిసినా, భారీ ప్రయోజనాలను పొందే ప్రణాళికతో భూములను కొనుగోలు చేయాలని భావించినట్లు పేర్కొన్నారు. శివానందరెడ్డి ఆదేశాల మేరకు వారికి నగదు, చెక్కులు అందించారని బయటపెట్టారు. కన్వేయన్స్ డీడ్ అమలు చేసిన రోజునే వారి నుంచి తమ పేర్లపై భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నామని పోలీసులకు తెలిపారు. -
బుద్వేల్ భూమి కోసం భారీ లాబీయింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమిని కాజేయడానికి వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి లాబీయింగ్ చేసినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత బుధవారం తెలిపారు. దాని ఫలితంగానే అప్పట్లో ఎమ్మార్వోకు సాధారణ మెమో జారీ అయిందని, దీని ద్వారానే ఆ భూముల కన్వర్షన్ జరిగిందని వివరించారు. తన అనుచరులతో కలిసి శివానందరెడ్డి చేసిన కుట్ర, అసైన్డ్ భూములు ఖరీదు చేయడం వంటి ఆరోపణలపై సీసీఎస్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీటిపై విచారించేందుకు సోమవారం అల్లూరు వెళ్లగా... శివానందరెడ్డి పారిపోయారని డీసీపీ వివరించారు. ఈ కేసులు, వాటి పూర్వాపరాలపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రియల్టర్ల కన్ను..అసైనీలకు దగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1994లో బుద్వేల్లోని సర్వే నం.282 నుంచి 299 వరకు ఉన్న 281 ఎకరాల భూములను 66 మందికి అసైన్ చేసింది. వీరికి రాజేంద్రనగర్ మండల అధికారులు అసైనీ పాస్ పుస్తకాలను సైతం జారీ చేశారు. ఆ తర్వాత మరో 82 మంది అక్కడ మిగిలి ఉన్న భూమిని ఆక్రమించారు. 2000లో అసైనీలు తమ భూములను ఎస్కే డెవలపర్స్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో రెవెన్యూ అధికారులు అసైన్మెంట్ పట్టాలు రద్దు చేశారు. చేవెళ్ల ఆర్డీఓ ఆ భూమిని నిబంధనల ప్రకారం హెచ్ఎండీఏ, పర్యాటక శాఖలకు అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు గుంటి నర్సింçహులు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి కేసు పరిష్కరించాలంటూ చేవెళ్ల ఆర్డీఓను కోర్టు ఆదేశించింది. దీంతో అసైనీలు ఆర్డీఓకు వివరణ ఇచ్చినా.. దాన్ని ఆయన తిరస్కరించారు. ఆర్డీఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2002లో అసైనీలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. అదే భూమిని అభివృద్ధి చేసి, తమకు ప్లాట్లు ఇవ్వాలంటూ అసైనీలు ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే దీన్ని క్యాష్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు టీజే ప్రకాష్, కోనేరు గాం«దీ, దశరథ రామారావు రంగంలోకి దిగారు. అసైనీలతో పాటు ఇతరులను సంప్రదించారు. అసైనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేలా తాము ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులను మ్యానేజ్ చేస్తా మని నమ్మబలికారు. ఇది నమ్మిన అసైనీలు వీరితో అగ్రిమెంట్లు, ఎంఓయూలు చేసుకున్నారు. వాటిని చూపించిన ఈ ముగ్గురూ ఆ స్థలం అమ్ముతామంటూ కొందరి నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రకా‹Ù, గాం«దీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్‌ను సంప్రదించి అసైనీలు ప్లాట్లు పొందేలా సహకరించాలని కోరారు. ఇతడి ద్వారానే టీజే ప్రకాష్ మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. రియల్టర్లకు శివానందరెడ్డి ఎర బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన çపలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. కన్వర్షన్ కోసం ముమ్మర యత్నం అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో లాబీయింగ్ చేశారు. దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గతేడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా అసైనీలు, ఆక్రమణదారులు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీలకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డిలకు రిజి్రస్టేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములు లాక్కోవడానికి కుట్ర పన్నారు. -
Rachakonda: ఉత్సవ విగ్రహంలా మారిన సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్
సాక్షి, హైదరాబాద్: రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఉత్సవ విగ్రహంలా మారింది. రోజురోజుకూ సైబర్ నేరాలు పెరిగిపోతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. రాచకొండ సైబర్ ఠాణాలో పనిచేసేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదు. ఇక్కడికి పోస్టింగ్ ఇచ్చినా పైరవీలతో ఒక ట్రెండు రోజుల్లోనే వేరే చోటుకు బదిలీ చేయించుకుంటున్నారు. పర్యవేక్షణ అధికారులు లేక కేసుల దర్యాప్తు అటకెక్కింది. దీంతో బాధితులు రోజు స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మిగిలింది ఒక్క ఇన్స్పెక్టరే.. రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్‌లో డీసీపీ నుంచి కానిస్టేబుల్ వరకు సుమారు 70 మంది సిబ్బంది ఉంటారు. కొత్త ప్రభుత్వ కొలువుదీరిన తర్వాత పోలీసు శాఖలో బదిలీల క్రమంలో అప్పటి మహిళా డీసీపీ వేరే చోటుకు బదిలీ అయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల పాటు ఖాళీగా ఉన్న ఈ పోస్టు ఇటీవలే భర్తీ అయింది. ఇదే సమయంలో ఏసీపీని సైతం భర్తీ చేశారు. కానీ, రెండు రోజులకే మల్టీజోన్–2కు తిరిగి బదిలీపై వెళ్లారు. దీంతో ఈ పోస్టు మళ్లీ ఖాళీ అయింది. ఇక ఇన్స్పెక్టర్లు మాకొద్దీ పోస్టింగ్ అంటూ పారిపోతున్నారు. ఒకప్పుడు రాచకొండ సైబర్ క్రైమ్ పీఎస్‌లో ఏడుగురు ఇన్స్పెక్టర్లు ఉండగా.. ప్రస్తుతం ఒక్కరే మిగిలారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. లోకసభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో బదిలీ అయిన ఇన్స్పెక్టర్ల స్థానంలో కొత్త వారిని నియమించారు. కానీ, రిపోర్ట్ కూడా చేయకుండానే పైరవీలతో ఒక ట్రెండు రోజుల్లోనే వేరే చోటుకు బదిలీ కావడం కొసమెరుపు. ఇక్కడ జేబుకు చిల్లే.. ఇతర రాష్ట్రాల్లో దాక్కున నిందితులను పట్టుకునేందుకు విచారణాధికారులు అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే రాచకొండలో ఈ ప్రక్రియ మూలనపడింది. ఇతర రాష్ట్రాలకు వెళ్లి నాలుగైదు రోజులు అక్కడ ఉండాలంటే జేబు గుళ్ల తప్ప ప్రయోజనం ఉండటం లేదని పలువురు పోలీసుల అధికారులు వాపోయారు. కష్టపడి నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలిస్తే ఉన్నతాధికారుల దృష్టిలో గుర్తింపు ఉంటుందా అంటే అదీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి బదులుగా ఇతర విభాగంలో డ్యూటీ చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు. మరోవైపు రోజురోజుకూ పెరిగిపోతున్న కేసులతో ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి, పనిభారం పెరిగింది. కేసుల దర్యాప్తు వేగంగా, పారదర్శకంగా చేసే క్రమంలో ఏ చిన్న పొరపాటు జరిగినా తమ కెరీర్‌కు ఇబ్బంది అవుతుందని ఇన్స్పెక్టర్లు భావిస్తున్నారు. కానిస్టేబుళ్ల తీరు వేరు.. రాచకొండ సైబర్ ఠాణాలోని కానిస్టేబుళ్ల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఐదారేళ్ల నుంచి ఇదే ఠాణాలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు పది మంది ఉన్నారు. కానిస్టేబుళ్ల నుంచి హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి లభించినా ఇక్కడే తిష్ట వేసుకు కూర్చున్నారు. వేరే చోటుకు వెళితే పని భారం పెరుగుతుందనో, లేక ఇక్కడి లొసుగులతో అమ్యామ్యాలు రావనే భావనలో ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల కోడ్ వీరికి వర్తించదా అని పలువురు వాపోతున్నారు. -
IPS నవీన్ కుమార్ కుమారుణ్ణి అదుపులోకి తీసుకున్న సీసీఎస్
-
IPS నవీన్ కుమార్‌ను అదుపులోకి తీసుకున్న సీసీఎస్
-
‘అట్లూరి’ మామూలోడు కాదు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో (సీసీఎస్) నమోదైన ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) కేసులో అరెస్టు అయిన తెలుగు సినీ నిర్మాత అట్లూరి నారాయణరావుకు తెలుగుదేశం పార్టీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నట్టు వెలుగులోకి వచ్చింది. సదరు నారాయణరావు అయితే ఏకంగా తనకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌లతో సైతం సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు చెప్పుకునే వాడని తెలిసింది. వందల మంది నుంచి డిపాజిట్ల రూపంలో రూ.540 కోట్లు వసూలు చేసి నిలువునా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్న ఈ స్కామ్‌లో గత వారం అరెస్టు అయిన నారాయణరావుని సీసీఎస్ పోలీసులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్నారు. బుధవారంతో కస్టడీ గడువు పూర్తవడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. సినీ రంగంలోకి ప్రవేశించాకే మోసగాడిగా... ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నారాయణరావు అప్లైడ్ మాథమేటిక్స్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేశాడు. బతుకుతెరువు కోసం హైదరాబాద్ వచ్చిన అతను కొన్నాళ్ళు ఓ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేశాడు. బంజారాహిల్స్‌లోని ఆదిత్య హిల్‌టాప్ అపార్ట్‌మెంట్స్‌లో నివసిస్తూ సినీ రంగంపై ఉన్న మోజుతో నిర్మాతగా మారాడు. 2018లో ‘నీది నాది ఒకే కథ’, 2022లో ‘నచ్చింది గర్ల్ ఫ్రెండు’చిత్రాలు తీశాడు. దీనికి అవసరమైన డబ్బు కోసమే మోసాలు చేయడం మొదలెట్టాడు. శేరిలింగంపల్లిలోని తారానగర్‌లో దేవాదాయ ధర్మాదాయ శాఖకు 3 ఎకరాల భూమి ఉంది. ఖాళీగా ఉన్న ఈ భూమిపై కన్నేసిన నారాయణ రావు దాన్ని ఎవరికైనా అంటగట్టి సొమ్ము చేసుకోవాలని పథకం వేశాడు. ఎన్.రామాచార్యులు అనే వ్యక్తిని దీనికి యజమానిగా మార్చాడు. ఆ మేరకు నకిలీ పత్రాలు సృష్టించిన నారాయణరావు వాటి ఆధారంగా ఖైరతాబాద్‌లో ఎస్ఎంహెచ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నిర్వహించే బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి సయ్యద్ మహమూద్ హుస్సేన్‌ను సంప్రదించి ఆయన నుంచి రూ.1,65,12,500 కాజేశాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు విచారణలో ఉంది. ’బాబు’ల వ్యవహారాలు చూసేవాడినంటూ.. నారాయణరావుకు తెలుగుదేశం నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ మేరకు నేతలతో దిగిన ఫొటోలను చూపించే వాడు. ఇక చంద్రబాబు, లోకేశ్‌తో సైతం తాను దగ్గరగా మెలుగుతుంటానని ప్రచారం చేసుకునేవాడు. తరచుగా చంద్రబాబు, లోకేశ్‌లను కలుస్తుంటాననీ, వారికి సంబంధించిన హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని వ్యవహారాలను పర్యవేక్షిస్తుంటానని చెప్పుకునే వాడని తెలిసింది. ఇతడి చేతిలో మోసపోయిన అనేక మంది బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయకపోవడానికి ఇదీ ఓ కారణమని తెలుస్తోంది. న్యాయ విభాగంలో పరిచయాలు ఉన్నాయంటూ... గడిచిన కొన్నాళ్ళుగా న్యాయ విభాగంలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయంటూ చెప్పి నారాయణ రావు అనేక మంది నుంచి డబ్బు గుంజాడనే ఆరోపణలు ఉన్నాయి. ఎఫ్ఎంసీజీ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రాంబాబు, కృష్ణంరాజుకు ఇలానే చెప్పి వారి నుంచి నగదు, రూ.కోటి విలువైన బంగారం తీసుకున్నాడు. విశాఖపట్నానికి చెందిన ఓ కంపెనీకి, కర్ణాటకకు చెందిన మరో కంపెనీకి మధ్య వివాదం నడుస్తోంది. విశాఖ కంపెనీ యజమానిని సంప్రదించిన నారాయణరావు తనకు న్యాయ విభాగంలో పలుకుబడి ఉందని నమ్మబలికాడు. ఆర్బిట్రేషన్ విధానంలో సమస్య పరిష్కరించడంతో పాటు నష్టం నివారిస్తానంటూ నమ్మించాడు. ఇలా వారి నుంచి భారీ మొత్తం తీసుకుని మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇతడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న విశాఖ కంపెనీ సంబం«దీకులు బయటకు వచ్చి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. ఆ డబ్బుతోనే మరో సినిమా.. ఎఫ్ఎంసీజీ కేసులో నారాయణరావును అరెస్టు చేసిన పోలీసులు ప్రాథమిక విచారణతో పాటు రెండు రోజుల పోలీసు కస్టడీ విచారణలో కీలక విషయాలు సేకరించారు. ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా రాంబాబుకు పరిచయమైన నారాయణరావు తన పలుకుబడి వినియోగించి కేసు లేకుండా చేస్తానని హామీ ఇచ్చాడు. ఇందుకు రూ.2 కోట్లు ఇవ్వాలంటూ అడ్వాన్స్‌గా రూ.10 లక్షలు, కోటి విలువైన బంగారు ఆభరణాలు తీసుకున్నాడు. కానీ ఆ కేసు విషయంలో ఎలాంటి సహాయం చేయలేకపోయాడు. దీంతో ఇన్సాల్వెన్సీ పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి బయటపడదామని రాంబాబుకు సలహా ఇచ్చి ఖమ్మం కోర్టులో అక్కడి న్యాయవాదితో దాఖలు చేయించే ప్రయత్నం చేశాడు. ఈలోగా బంగారు ఆభరణాలను పాతబస్తీలో కరిగించి రూ.90 లక్షలకు అమ్మేసి సొమ్ము చేసుకున్నాడు. ఈ డబ్బుతోనే మరో చిత్ర నిర్మాణం ప్రారంభించాడు. ఇది ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బుధవారం నారాయణరావుకు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఇతడి వ్యవహారాలను మ రింత లోతుగా ఆరా తీయాలని నిర్ణయించారు. -
TSRTC: సీసీఎస్ నిధులు వాడుకుని.. వడ్డీకి ఎసరు పెట్టిన ఆర్టీసీ!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల ఆర్థిక అవసరాలను తీర్చే ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను ఇన్నాళ్లూ ఎడాపెడా సొంతానికి వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం తీరా ఇప్పుడు తిరిగి చెల్లించాల్సి వచ్చేసరికి వాడుకున్న మొత్తంపై వడ్డీ ఎగ్గొట్టాలని చూస్తోంది. అందుకే వడ్డీని కలపకుండా సీసీఎస్ బకాయిలను చూపుతోంది. ఈ పరిణామం సీసీఎస్ నుంచి రుణాల కోసం దరఖాస్తు చేస్తున్న దాదాపు 9 వేల మంది కార్మికుల్లో గుబులు రేపుతోంది. అంత మేర నష్టపోవాల్సిందేనా.. రాష్ట్రం విడిపోవడానికి ముందు ఎండీగా పనిచేసిన ఓ అధికారి అత్యవసరం కింద సీసీఎస్ నుంచి కొంత మొత్తాన్ని వాడగా ఆ తర్వాత అది అలవాటుగా మారింది. రాష్ట్రం విడిపోయే నాటికి కొన్ని రూ. కోట్లను యాజమాన్యం వాడేసింది. అలా వాడిన మొత్తంపై లెక్కించిన వడ్డీలో విభజన తర్వాత టీఎస్ఆర్టీసీకి రూ. 7 కోట్లు పంచారు. 2014లో రూ. 7 కోట్ల వడ్డీ బకాయి ఉంటే ఆ తర్వాత రూ. వందల కోట్ల మొత్తాన్ని వాడుతూ కొంత మేర తిరిగి చెల్లిస్తూ, మళ్లీ వాడుతూ.. ఇలా రూ. 400 కోట్లకు వడ్డీ బకాయిలు చేరుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం నేపథ్యంలో సీసీఎస్‌కు చెల్లించాల్సిన బకాయిల్లో వడ్డీ మొత్తాన్ని చేర్చకుండానే నివేదిక రూపొందించడం పెద్ద చర్చకు దారితీస్తోంది. యాజమాన్యం తీరు వల్ల కొన్ని వందల మందికి కావాల్సిన రుణాలకు సరిపోయే రూ. 400 కోట్లను సీసీఎస్... తద్వారా తాము నష్టపోవాల్సిందేనా అన్న ఆవేదన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. వడ్డీ చెల్లించకుంటే ఊరుకోం.. కార్మికులు, ఉద్యోగులు వారి జీతాల నుంచి ప్రతి నెలా 7 శాతం మొత్తం జమ చేయడం ద్వారా ఏర్పడ్డ నిధి అది. ఆ నిధిని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకొని ఇప్పుడు దానిపై రూ. 400 కోట్ల వడ్డీ ఎగ్గొడతామంటే కార్మికలోకం ఊరుకోదు. దాన్ని నయాపైసాతో సహా చెల్లించాల్సిందే. – అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ చైర్మన్ కార్మికులను బలిపశువులను చేయటమే ఏదైనా కారణాలతో సీసీఎస్‌ను మూసేసి అందులోని మొత్తాన్ని కార్మికులకు వారి వాటా ప్రకారం పంచాల్సి వస్తే రూ. 400 కోట్లను ఎలా చూపుతారు? అంతమేర కార్మికులకు తక్కువగా చెల్లించడం తప్ప ఏముంటుంది. అంటే కార్మికులను బలిపశువు చేసినట్టే కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఆ వడ్డీ మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేయాల్సిందే. – వీఎస్ రావు, ఆర్టీసీ స్టాఫ్ అండ్ ,వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి -
ఇక అప్పు పుట్టడం కష్టమే! సీసీఎస్ దివాలా.. ఆర్టీసీ కార్మికులకు కష్టాలు
‘ఆర్టీసీ ఉద్యోగులు రుణం కోసం అందించే దరఖాస్తులను మీరు బ్యాంకులకు, రుణాలు అందించే ఆర్థిక సంస్థలకు ఫార్వర్డ్ చేయొద్దు.. ఉద్యోగుల వేతన బిల్లుల నుంచి రుణ రికవరీలకు వీలు కల్పించవద్దు’ – ఇటీవల యూనిట్ అధికారులకు ఆర్టీసీ జారీ చేసిన ఆదేశం ఇది. ఆర్టీసీ కార్మికులకు రుణం పుట్టడం కష్టంగా ఉన్న సమయంలో ఈ ఆదేశం ఉద్యోగులకు అశనిపాతంగా మారింది. వాస్తవానికి ఇది కొత్త సర్క్యులర్ కాదు. 2003లోనే దీనిపై నిర్ణయం తీసుకున్నా ఇప్పటివరకు పెద్దగా అమలు కాలేదు. పాత సర్క్యులర్‌ను కోట్ చేస్తూ దాన్ని ఇప్పుడు కచ్చితంగా అమలు చేసేలా తాజాగా మరో సర్క్యులర్‌ను ఆర్టీసీ ఉన్నతాధికారులు జారీ చేశారు. కాగా, ఇప్పుడు నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో ఈ ఆదేశాలు తమపై తీవ్ర ప్రభావం చూపుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకీ ఆదేశం.. ఏమిటా విపత్కర పరిస్థితి.. ఆర్టీసీ ఉద్యోగులు గతంలో స్వేచ్ఛగా బ్యాంకుల నుంచి రుణం పొందేవారు. కొంతకాలం క్రితం వరకు వేతనాల ఖాతాలున్న బ్యాంకు వారికి రుణాలు ఇచ్చే విషయంలో కొంత ఉదారంగా వ్యవహరించేది. ఇటీవలే వేతనాల ఖాతాలు మరో బ్యాంకుకు మార్చారు. రుణాలిచ్చే విషయంలో కొత్త బ్యాంకు రకరకాల కొర్రీలు, కఠిన నిబంధనలు పెడుతోందని, దీంతో రుణాలకు ఇబ్బందిగా మారిందని కార్మికులు పేర్కొంటున్నారు. దీంతో వేరే బ్యాంకుల నుంచి రుణాలు పొందేవారు. సాధారణంగా ఆర్టీసీ అధికారుల ద్వారా రుణ దరఖాస్తు వస్తే బ్యాంకులు సులభంగా రుణమిస్తాయి. ఒకవేళ కార్మికులు తిరిగి చెల్లించకున్నా, ఆర్టీసీ పూచీగా ఉంటుందన్న ధీమా బ్యాంకులకు ఉంటుంది. ఇప్పుడు రుణాలకు సిఫారసు చేయొద్దని, వేతనాల నుంచి రికవరీకి బ్యాంకులకు అవకాశం ఇవ్వవద్దని పేర్కొంటూ పాత ఆదేశాలను తిరిగి తెరపైకి తేవడం విశేషం. సీసీఎస్ దివాలాతో.. గతంలో ఆర్టీసీ కార్మికులకు బ్యాంకు రుణాల అంశం పెద్ద సమస్యగా ఉండేది కాదు. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) సుభిక్షంగా ఉండటంతో దాని ద్వారానే కావాల్సిన రుణాలు పొందేవారు. కొంతకాలంగా దాని నిల్వ నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకుని, దాదాపు వేయి కోట్లకుపైగా బకాయి (వడ్డీతో సహా) పడటం, నెలనెలా దానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించకపోవటంతో సీసీఎస్ దాదాపు దివాలా దశకు చేరిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి నుంచి రుణాలు నిలిచిపోవడం కార్మికులకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు బ్యాంకుల నుంచి సులభంగా రుణం పొందే వీలు లేకపోవటంతో వారికి ప్రైవేటు వడ్డీ వ్యాపారులే దిక్కయ్యారు. గతంలో బ్యాంకుల నుంచి రుణం తీసుకుని సమయానికి చెల్లించిన రికార్డు ఉన్న వారు పాత పరిచయాలతో రుణాలు పొందగలుగుతున్నా... మిగతా వారికి మాత్రం ఆర్టీసీ నుంచి సిఫారసు లేకుండా రుణం రాని పరిస్థితి నెలకొంది. ‘ఇదేం ఘోరం’ అటు సీసీఎస్‌ను నిర్విర్యం చేసి రుణాలు అందని పరిస్థితి తెచ్చి, ఇటు బ్యాంకుల నుంచి రుణ సిఫారసులు లేకుండా చేసి కార్మికులను ఇబ్బంది పెట్టడం ఏమాత్రం సరికాదని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఎస్‌ను పునరుద్ధరించే దాకా బ్యాంకుల నుంచి స్వేచ్ఛగా రుణాలు పొందే వీలు కల్పించాలని, తాజా సర్క్యులర్‌ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఆర్టీసీ ఎండీకి హైకోర్టు షోకాజ్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి నిధుల చెల్లింపుపై తాము ఆదేశించినా ఆ మేరకు ఎందుకు చెల్లింపులు చేయలేదో చెప్పాలని ఆర్టీసీ ఎండీకి, చీఫ్ మేనేజర్ (ఎఫ్అండ్ఏ)కు హైకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఒకవేళ ఎవరూ హాజరుగాని పక్షంలో ఎక్స్‌పార్టీగా పేర్కొంటామని చెప్పింది. సీసీఎస్‌కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి. ఈ సంఘంలో పొదుపు చేసుకున్న మొత్తానికి సంబంధించి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ విషయంలోనూ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించగా, మే 15వ తేదీలోగా రూ.50 కోట్లు, మరో రూ.100 కోట్లను నవంబర్ 25లోగా సీసీఎస్‌కు డిపాజిట్ చేయాలని ఏప్రిల్‌లో హైకోర్టు ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలిచి్చనా ఆర్టీసీ యాజమాన్యం పాటించడం లేదని, కావాలనే ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ ఉద్యోగులు జూన్‌లో ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్‌ను పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ పి.మాధవీ దేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎండీ, చీఫ్ మేనేజర్ హాజరుకావాలంటూ ఆదేశిస్తూ, విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. చదవండి: తెలంగాణలో భిన్నంగా ఓటరు నాడి.. ఆ పార్టీకే మెజారిటీ సీట్లు! -
రూ.2 వేల వాచీ.. రూ.59 వేలకు విక్రయం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఈ ఏడాది మార్చిలో జరిగిన అగ్నిప్రమాదం క్యూ–నెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) సంస్థ అక్రమ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురూ దీని ఉద్యోగులే. ఈ ఘటనపై నమోదైన కేసులను దర్యాప్తు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు.. ఈ సంస్థ సౌత్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ గుమ్మడిల్లి రాజేశ్ అలియాస్ రాజేశ్ ఖన్నాను బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ సంస్థ ఎంఎల్ఎం పేరిట తక్కువ ఖరీదైన వస్తువులను అత్యంత ఎక్కువ రేటుకు అమ్ముతోందని.. రూ.2 వేల వాచీని రూ.59 వేలకు విక్రయించినట్టు ఆధారాలు సేకరించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కేసులు నమోదవడంతో పేరు మార్చి.. హాంకాంగ్ కేంద్రంగా ఎంఎల్ఎం దందా చేస్తున్న క్యూ–నెట్‌పై అనేక కేసులు నమోదవడంతో.. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘వీ–ఎంపైర్’ పేర్లతో మళ్లీ దందా ప్రారంభించింది. ఈ సంస్థలో టెలీకాలర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ప్రమోటర్స్, టీమ్ లీడర్లుగా చాలామంది పనిచేస్తున్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 511లో దీని కార్యాలయం ఉంది. రాజేశ్ ఖన్నా, ఉపేందర్‌రెడ్డి, శివనాగ మల్లయ్య, కటకం మల్లేశ్, నాగమణి సహా 12 మంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించవచ్చంటూ ఎరవేయడం.. ఇప్పటికే ‘వీ–ఎంపైర్’లో చేరినవారు నెలకు రూ.50వేల నుంచి రూ.1.5లక్షల దాకా సంపాదిస్తున్నారని అమాయకులకు ఎర వేస్తున్నారు. మూడు కోట్లు వసూలు చేసి.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసు బృందం.. ఇప్పటివరకు హైదరాబాద్‌లోనే 159 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్టు గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంకా ఎంతో మంది బాధితులు ఉంటారని పోలీసులు తెలిపారు. రాజేశ్ ఖన్నా వద్ద లభించిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్ల నగదును ఫ్రీజ్ చేశామని.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. -
హైకోర్టు చెప్పినా అంతేనా!
ఆర్టీసీకి అనుబంధంగా ఉన్న సహకార పరపతి సంఘం (సీసీఎస్) పరిస్థితి దా’రుణం’గా తయారైంది. రుణాల కోసం దరఖాస్తు చేసుకుని ఎదురుచూస్తున్న వారు, రిటైర్ అయి సెటిల్మెంట్ల కోసం ఎదురు చూస్తున్న వారు సీసీఎస్ కార్యాలయానికి వచ్చి అక్కడి సిబ్బందిపై విరుచుకుపడుతున్నారు. నిత్యం గొడవలు, వాడోపవాదాలతో సీసీఎస్ కార్యాలయం గందరగోళంగా తయారవుతోంది. సీసీఎస్‌కు ఆర్టీసీ దాదాపు రూ.650 కోట్లు బకాయిపడింది. వడ్డీతో కలుపుకొంటే ఆ మొత్తం రూ.1050 కోట్లకు చేరింది. ఆ నిధులు సొంతానికి వినియోగించుకున్న ఆర్టీసీ, వాటిని చెల్లించేందుకు ససేమిరా అంటుండటంతో సీసీఎస్‌లో నిధులు లేకుండాపోయాయి. ఫలితంగా లోన్లకు దరఖాస్తు చేసి నెలలుగా ఎదురుచూస్తున్నవారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. రిటైర్ అయి నెలలు గడుస్తున్నా సెటిల్మెంట్లు చేయకపోవటంతో రిటైర్డ్ ఉద్యోగుల్లో ఆగ్రహావేశాలు పెరిగిపోతున్నాయి. ఇక పదవీ విరమణ పొంది, వారి సెటిల్మెంట్ డబ్బులను ఇందులో డిపాజిట్ చేసి వడ్డీ పొందలేకపోతున్న విశ్రాంత ఉద్యోగులూ ఆందోళనకు దిగుతున్నారు. కోర్టు ఆదేశాలను కూడా.. ఇటీవలే ఆ నిధుల ఇప్పించాలని సీసీఎస్ అధికారులు హైకోర్టును ఆశ్రయించగా, ప్రతినెలా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించే మొత్తాన్ని యథావిధిగా సీసీఎస్‌కు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. అలా చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.18 కోట్లు. ఆ నిధుల నుంచే సీసీఎస్ సభ్యులైన ఉద్యోగులకు రుణాలు అందిస్తారు. కానీ ఆర్టీసీ రూ.ఐదారు కోట్లకు మించి కట్టడం లేదు. దీంతో రుణాల కోసం దాదాపు ఏడు వేల దరఖాస్తులు పేరుకుపోయాయి. రూ.18 కోట్లను సీసీఎస్‌కు కట్టమని స్వయంగా హైకోర్టు చెప్పినా ఆర్టీసీ పట్టించుకోకపోవడంపై రిటైర్డ్ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఎన్ని మార్లు తిరగాలి? ఇక బకాయిలకు సంబంధించి ఈనెల 15 లోపు రూ.50 కోట్లు సీసీఎస్‌కు చెల్లించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. 13వ తేదీ వచ్చినా, ఆర్టీసీ నుంచి ఇప్పటి వరకు సీసీఎస్‌కు పిలుపు అందలేదు. ఈనెలాఖరులోగా మరో రూ.150 కోట్లు కూడా చెల్లించాలని ఆదేశించింది. ప్రతినెలా ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించుకునే సొమ్ములనే ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ బకాయిల చెల్లింపు విషయంలో ఎలా నమ్మకంగా ఉండగలమని ఓ రిటైర్డ్ ఉద్యోగి కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ‘కూతురి పెళ్లి పెట్టుకున్నా సర్, లోన్ కోసం దరఖాస్తు చేసి మూడు నెలలైంది. చిన్న జీతమున్నోడిని, ప్రైవేటుగా అప్పు తెచ్చి వడ్డీ కట్టగలనా. నా పైసల మీద లోనే కదా నేను అడిగేది.. ఎందుకియ్యరు.?’ – సిద్దిపేట జిల్లాకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆవేదన ఇది. ‘రిటైర్ అయిన వెంటనే సెటిల్మెంట్ చేసి పంపుతామన్నరు. నేను రిటైర్ అయి మూడు నెలలైంది. నాకు రావాల్సిన డబ్బులు ఇవ్వడానికి ఇంత తిప్పుతరా. మాలాంటోళ్ల బాధలు చూసి, బకాయిలు కట్టమని ఆర్టీసీకి కోర్టు చెప్పినా ఇవ్వకుంటే నాలోంటోళ్లు ఏం చేయగలుగుతరు’ –నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్టీసీ రిటైర్డ్ శ్రామిక్ ఆవేదన ఇది. -
నిధులు సీసీఎస్‌లో జమ చేయండి.. తెలంగాణ ఆర్టీసీకి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బంది వేతనం నుంచి ప్రతి నెలా తీసుకున్న నిధులను ఉద్యోగుల సహకార పరపతి సంఘానికి (సీసీఎస్) జమ చేయాలని.. యాజమాన్యం వాటిని తన సొంత అవసరాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడుకోకూడదని హైకోర్టు ఆదేశించింది. సొసైటీ తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటోందని, కోలుకోలేని నష్టాల్లో ఉందని గుర్తుంచుకోవాలని ఆర్టీసీ ఎండీ, చీఫ్ మేనేజర్‌కు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. సీసీఎస్‌కు జమ చేయాల్సిన నిధులను ఆర్టీసీ సొంతానికి వాడేసుకోవడంతో వడ్డీ సహా రూ.900 కోట్ల బకాయిలు ఏర్పడ్డాయి. ఫలితంగా ఉద్యోగులకు ఈ సంఘం ద్వారా మంజూరు చేయాల్సిన రుణాలు ఆగిపోయాయి. దీంతో బకాయిల్లో కొంత మొత్తం చెల్లించాలని ఆ సంఘం ఆర్టీసీని కోరుతున్నా స్పందన రాలేదు. దీంతో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి విచారణ చేపట్టారు. ప్రతినెలా జీతాల నుంచి కట్ చేస్తున్నా.. సీసీఎస్ తరఫున న్యాయవాది ఏకే జయప్రకాశ్‌రావు వాదనలు వినిపించారు. ‘ఉద్యోగుల నుంచి ప్రతి నెలా నిధులు సేకరిస్తున్నారు. సిబ్బంది జీతాల నుంచి కట్ చేసిన మొత్తాన్ని సీసీఎస్ ఖాతాలో జమ చేయాల్సి ఉంది. కానీ ఆర్టీసీ వాటిని సొంతానికి వాడుకుంటోంది. ఇది సరికాదు. ఆ నిధులన్నీ సీసీఎస్ ఖాతాలో జమ చేసేలా ఆదేశాలు జారీ చేయాలి..’అని కోరారు. ఆర్టీసీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిధుల విడుదల విషయంలో ప్రభుత్వంతో సంస్థ ఎండీ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ప్రతినెలా సీసీఎస్ ఖాతాల్లో నిధులు జమ చేయాలని ఆదేశించారు. కార్మిక శాఖకు నోటీసులు ఆర్టీసీ గుర్తింపు సంఘానికి ఎన్నికల నిర్వహణపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కార్మిక అధికారులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గుర్తింపు సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ హైకోర్టును ఆశ్రయించింది. కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, కార్మిక శాఖ కమిషనర్, ఆర్టీసీ ఎండీతో పాటు పలువురిని ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా మంగళవారం విచారణ చేపట్టారు. అనంతరం ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేశారు. -
రిటైరైనా ‘సెటిల్మెంటు’ జరగదాయె!
సాక్షి, హైదరాబాద్: సర్వీసులో ఉన్నంత కాలం ప్రతినెలా జీతం నుంచి సంస్థ మినహాయిస్తూ వచ్చి న సొమ్ముల కోసం ఇప్పుడు వందలాది మంది ఆర్టీసీ పూర్వ ఉద్యోగులు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ అయి ఉన్న ఆ మొత్తాన్ని ఆర్టీసీ వినియోగించుకోవటంతో ఈ దుస్థితి తలెత్తింది. ఆ ర్టీసీలో ఉద్యోగులు ప్రతినెలా 7 శాతం తమ జీతం నుంచి మినహాయించి సహకార పరపతి సంఘంలో డిపాజిట్ చేస్తారు. ప్రస్తుతం సీసీఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. దాని నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో సీసీఎస్ భవితవ్యమే గందరగోళమైంది. అయితే ఇప్పటివరకు సీసీఎస్‌కు సంబంధించి మిగతా వ్యవహారాల్లో ప్రతిష్టంభన ఉన్నా.. రిటైరైన ఉద్యోగులకు సెటిల్మెంట్ల విషయంలో మాత్రం లోటు రానివ్వలేదు. కానీ గత ఆగస్టు నుంచి ఈ సెటిల్మెంట్ల విషయంలో కూడా ఆర్టీసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఆ నెల నుంచి పదవీ విరమణ పొందిన వారికి ఇప్పటి వరకు ఆ డిపాజిట్ మొత్తాలను ఇవ్వలేదని అంటున్నారు. సగటున ఒక్కో ఉద్యోగికి కనిష్టంగా రూ.6 లక్షల వరకు చెల్లించాల్సి ఉంది. అలా దాదాపు 500 మంది ఉద్యోగులకు ఈ మొత్తాన్ని చెల్లించలేదని చెబుతున్నారు. అధిక వడ్డీ ఆశతో.. సర్వి సులో ఉన్న ఉద్యోగులకు జీతాల నుంచి వచ్చే ఈ మొత్తమే చివరి వరకు ఆయువు పట్టు. అలా ప్రతినెలా జమ అయ్యే నిధులతోనే ఆ సంస్థ ఉద్యోగులకు రుణాలు ఇస్తుంది. ఆ డిపాజిట్ మొత్తాలపై అధిక వడ్డీని ఉద్యోగులకు చెల్లిస్తుంది. దీంతో చాలామంది మధ్యలో డిపాజిట్ మొత్తాన్ని తీసుకోకుండా పదవీవిరమణ వరకు అలాగే కొనసాగిస్తారు. కొందరైతే, రిటైర్ అయిన తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తూ అధిక వడ్డీ పొందుతారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆగస్టు నుంచి ఆర్టీసీ సీసీఎస్‌కు పెద్దగా నిధులు విడుదల చేయకపోవటంతో పదవీవిరమణ పొందిన వారికి కూడా చెల్లించలేని దుస్థితి నెలకొంది. రిటైర్మెంట్ సెటిల్మెంట్లతో రకరకాల ప్రణాళికలు చేసుకుని, ఇప్పుడు ఆ మొత్తం అందని వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. -
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ‘ఆసరా’పై దెబ్బ
హైదరాబాద్‌లోని సీతాఫల్‌మండికి చెందిన ఆయన వయసు 73 సంవత్సరాలు.. ఆర్టీసీలో కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులను ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ చేయగా దానిపై నెలకు రూ.15 వేల వడ్డీ వస్తోంది. ఇప్పుడు ఆయన పూర్తిగా ఈ వడ్డీపైనే ఆధారపడి ఉన్నారు. కానీ మూడు నెలలుగా రాకపోతుండటంతో ఆయనకు దిక్కుతోచని దుస్థితి ఎదురైంది. వరంగల్ జిల్లాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ రిటైర్ అయి పదేళ్లయింది. తన రిటైర్మెంట్ బెనిఫిట్‌ను సీసీఎస్‌లో దాచుకోగా నెలకు రూ.9 వేల వడ్డీ వస్తోంది. చిన్నచిన్న పనులు చేసుకుంటూ తనకు వచ్చే వడ్డీ ఆసరాగా భార్యతో కలిసి బతుకీడుస్తున్నాడు. కానీ ఇప్పుడు వడ్డీ నిలిచిపోవటంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఇలా వీరిద్దరిదే కాదు.. చాలామంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల వేదన ఇది. సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ఖాళీ చేయటంతో ఇప్పుడు ఆ సంస్థ విశ్రాంత ఉద్యోగులకు దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. ఉద్యోగం చేస్తున్న కాలంలో నెలవారీ వాటాగా నమోదైనమొత్తం, పదవీ విరమణ సమయంలో వచ్చిన బెనిఫిట్ మొత్తాలను చాలా మంది సీసీఎస్‌లో పొదుపు చేసుకున్నారు. బ్యాంకు కంటే మెరుగైన వడ్డీ పొందే వీలుండటమే దీనికి కారణం. ఆర్థికంగా మెరుగ్గా ఉన్న వారి సంగతి పక్కన పెడితే, పేదరికంలో మగ్గుతున్నవారు మాత్రం ఈ డిపాజిట్లపై వచ్చే వడ్డీపైనే ఆధారపడుతున్నారు. కానీ సీసీఎస్ నిధులను ఆర్టీసీ వాడేసుకుని ప్రస్తుతం రూ.932 కోట్లు బకాయిపడింది. నెలవారీగా ప్రస్తుతం సీసీఎస్ కోసం ఉద్యోగుల జీతాల నుంచి మినహాయిస్తున్న రూ.19 కోట్లను ఆర్టీసీ సీసీఎస్‌కు పూర్తిగా చెల్లించటం లేదు. గత నెల కేవలం రూ.కోటి మాత్రమే ఇచ్చింది. దీంతో డిసెంబరు నుంచి విశ్రాంత ఉద్యోగులకు చెల్లించే వడ్డీ పంపిణీ నిలిచిపోయింది. దీంతో చాలా మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీసీఎస్ కార్యాలయం చుట్టూ తిరిగి ఫలితం లేక ఉస్సూరు మంటున్నారు. రూ.కోటి కూడా కష్టమేనా.. సీసీఎస్‌లో ప్రస్తుతం ఐదున్నర వేల మంది విశ్రాంత ఉద్యోగులు డిపాజిట్లు పెట్టుకున్నారు. వారి డిపాజిట్ల మొత్తం దాదాపు రూ. 150 కోట్లు. దీనిపై ప్రతినెలా రూ.కోటి వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు ఆ రూ.150 కోట్లు లేవు. నెలవారీ వడ్డీకి సరిపడా రూ.కోటి కూడా అందుబాటులో లేదు. దీంతో మూడు నెలలుగా వడ్డీ చెల్లింపు ఆపేశారు. గతంలో పది వేల మంది విశ్రాంత ఉద్యోగుల డిపాజిట్లు ఉండగా, సీసీఎస్ పరిస్థితి గందరగోళంగా మారటంతో సగం మంది డిపాజిట్లు వెనక్కు తీసుకున్నారు. తాజా గందరగోళంతో ఇప్పుడు కొత్తగా 150 మంది సభ్యత్వం రద్దుకు దరఖాస్తు చేసుకున్నారు. మందులకు కూడా డబ్బుల్లేవు ‘‘సీసీఎస్‌లో దాచుకున్న రిటైర్మెంట్ బెనిఫిట్ మొత్తం సహా ఇతర డిపాజిట్ల నుంచి నాకు నెలకు రూ.15 వేలు వస్తాయి. నాకు, హృద్రోగ బాధితురాలైన నా భార్యకు నెలకు మందులకే రూ.20 వేల ఖర్చవుతుంది. సీసీఎస్ వడ్డీ మమ్మల్ని ఆదుకుంటోంది. కానీ గత మూడు నెలలుగా వడ్డీ అందటం లేదు. ఒకప్పుడు ఆసియాలోనే గొప్ప పొదుపు సంస్థగా వెలిగిన సీసీఎస్‌కు మళ్లీ పూర్వవైభవం తెప్పించి నా లాంటి వారిని ఆదుకోవాలి.’’ – ప్రభాకరరావు, రిటైర్డ్ ఏడీసీ -
సొంతింటి కలను ‘సాహితి’ భగ్నం చేసింది
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): తమ సొంతింటి కలను ‘సాహి తి సర్వణి ఎలైట్’భగ్నం చేసిందని బాధితులు ఆరోపించారు. తమకు పోలీసుల ద్వారా న్యాయం చేయాలని, తమను మోసం చేసిన వ్యక్తులను తమ ఎదుటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ శనివారం సీసీఎస్ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. కార్యాలయం గేట్ వద్ద బ్యానర్లతో కూర్చుని నినాదాలు చేశారు. 1,700 మందిని నుంచి ఫ్రీలాంచ్ పేరుతో రూ.1,539 కోట్లు మోసం చేసిన ‘సాహితి సర్వణి ఎలైట్’ఎండీ లక్ష్మీనారాయణపై బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనేపథ్యంలో కేసులో పురోగతి లేదని, దోషులను శిక్షించడంలో, తమకు న్యాయం చేయడంలో ఆలస్యం జరుగుతోందనే కారణంతో 100 మందికి పైగా బాధితులు సీసీఎస్ కార్యాలయానికి వచ్చారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజరావు భూపాల్‌ను కలిసేందుకు బాధితులు ప్రయత్నించారు. తమవెంట తెచ్చుకున్న బ్యానర్లతో కార్యాలయం వద్ద ధర్నాను నిర్వహించి, ఆ ప్రాంతం అంతా హోరెత్తేలా నినాదాలు చేశారు. అమీన్‌పురాలో కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని తమకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేశారు. సొంతింటి కలను నిజం చేయాలని, లేనిపక్షంలో తమ డబ్బు తమకు ఇప్పించాలన్నారు. లేదంటే రోజూ సీసీఎస్ కార్యాలయానికి వచ్చి ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
ఆర్టీసీపై మళ్లీ కోర్టుకెక్కిన సీసీఎస్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీపై ఆ సంస్థకు చెందిన ఉద్యో గుల సహకార పర పతి సంఘం (సీసీ ఎస్) మరోసారి కోర్టుకెక్కింది. ఉద్యోగుల కుటుంబ అవసరాలకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా సీసీఎస్ నిధిని ఆర్టీసీ వాడేసుకోవడంతో సీసీఎస్ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి 7శాతాన్ని కోత పెడుతున్న ఆర్టీసీ యాజమాన్యం... ఆ సొమ్మును సీసీ ఎస్‌కు సరిగ్గా చెల్లించకపోవడం వల్ల వడ్డీతో కలిపి రూ. 903 కోట్ల మేర బకాయిలు పేరుకు పోయాయని.. అందులోంచి కనీసం రూ. 600 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది. ఆర్టీసీ తీరుతో సీసీఎస్ కొంతకాలంగా ఉద్యోగులకు రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెల కొంది. ఫలితంగా వారు బయట నుంచి అప్పులు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతు న్నారు. మరోవైపు జూలై నుంచి రిటైరైన సుమారు వెయ్యి మంది ఉద్యోగులతోపాటు వీఆర్ఎస్ తీసుకున్న 200 మంది ఉద్యోగులు ఇంతకాలం సీసీఎస్‌లో దాచుకున్న మొత్తం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది. ప్రస్తుతం రుణాల కోసం 6,800 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే అంశంపై 2019లో సీసీఎస్ తొలిసారి హైకోర్టును ఆశ్రయించగా రూ. 200 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్టీసీని న్యాయస్థా నం ఆదేశించింది. అయినా ఆర్టీసీ యాజమా న్యం స్పందించకపోవడంతో సీసీఎస్ 2020 జూన్‌లో కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీంతో దిగొచ్చిన ఆర్టీసీ... ఆ మొత్తాన్ని ఆర్టీసీ చెల్లించింది. -
నకిలీ పత్రాలతో రూ.95 లక్షల లోన్
సాక్షి, హైదరాబాద్: నకిలీ డాక్యుమెంట్లతో గ్రానైట్ కటింగ్ మిషన్ కోసం బ్యాంకు రుణం తీసుకొని ఎగ్గొట్టిన వారిపై సీసీఎస్‌లో కేసు నమోదయ్యింది. పోలీసుల కథనం ప్రకారం.. కెనరా బ్యాంకు నుంచి ఓమ్ సాయి ఎంటర్ప్రైజెస్ యజమాని అద్లురీ రాజు బాలానగర్ కెనరా బ్యాంకులో రూ. 95 లక్షల రుణం కోసం దరఖాస్తు చేశాడు. తన వ్యాపార కార్యాలయం పంజాగుట్ట ద్వారాకపూరి కాలనీలో శ్రీదేశి అపార్టుమెంట్లో ఉందని సంబంధింత పత్రాలు బ్యాంకుకు అందించాడు. అనంతరం రూ. 95 లక్షల రుణం బ్యాంకు మంజూరు చేసింది. తరువాత కొన్ని వాయిదాలు చెల్లించి చేతులెత్తేశాడు. వాయిదాలు సక్రమంగా రాకపోవడంతో ఎందుకు చెల్లించడం లేదని, కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ అతని కార్యాలయమే లేదని తేలింది. అతడి వ్యాపారానికి సంబంధించిన పత్రాలు, కోటేషన్లు కూడా నకిలీవని తేలాయి. ఒక పథకం ప్రకారం బ్యాంకును మోసం చేసి రూ. 89 లక్షల వరకు నష్టం చేశారంటూ కెనరా బ్యాంకు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సీసీఎస్ పోలీసుకు ఫిర్యాదు చేయడంతో అద్లురీ రాజుతో పాటు అతనికి సహకరించిన నరహరి గంటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. (చదవండి: ‘నీట్’గా దోచేశాడు... ఎంబీబీఎస్ సీటు పేరుతో గోల్మాల్ ) -
‘సొమ్ము’సిల్లుతున్న విశ్రాంత ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: వెంకటయ్య ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి.. పదేళ్ల కింద పదవీ విరమణ పొందారు. రిటైర్మెంట్ సమయంలో వచ్చిన మొత్తాన్ని వడ్డీ ఎక్కువ వస్తుందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో డిపాజిట్ చేశారు. ఇప్పుడు వెంకటయ్య దంపతులు ఆ డిపాజిట్‌పై వచ్చే వడ్డీతోనే రోజులు గడుపుతున్నారు. ఉన్నట్టుండి ఇప్పుడు వడ్డీ రావటం ఆగింది. సీసీఎస్ కార్యాలయానికి వెళ్లి వాకబు చేస్తే, ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి 7 శాతం చొప్పున మినహాయించి సీసీఎస్‌కు జమ చేయాల్సిన మొత్తం సరిగా రావటం లేదన్నారు. అందుకే వడ్డీ చెల్లించేందుకు డబ్బు లేదన్న సమాధానం వచ్చింది. తన డిపాజిట్ మొత్తం తిరిగి ఇమ్మంటే.. ఆర్టీసీ బకాయి పడ్డ మొత్తం చెల్లిస్తేగాని ఇవ్వలేమని చెప్పడంతో ప్రతినెలా నెట్టుకొచ్చేది ఎలా అన్న ఆందోళనలో పడిపోయారు. ఇది ఒక వెంకటయ్య దుస్థితే కాదు. ఆర్టీసీలో పదవీ విరమణ పొంది తమ రిటైర్మెంట్ సాయం మొత్తాన్ని సీసీఎస్‌లో దాచుకున్న దాదాపు 8 వేల మంది ఆవేదన. ఇందులో దాదాపు 4వేల మంది సీసీఎస్ అందించే వడ్డీ మీదే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆందోళనలో ఉన్న ఈ ఉద్యోగులు రోడ్డెక్కబోతున్నారు. విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ అందించే ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయాలంటూ సీసీఎస్ నుంచి బస్‌భవన్ వరకు ప్రదర్శన నిర్వహించాలని నిర్ణయించారు. రావాల్సిన రూ.25 కోట్లు రాకపోవడంతో.. ఆర్టీసీ ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత.. నెలనెలా సీసీఎస్‌లో జమ చేసుకున్న మొత్తంతో పాటు వడ్డీ పొందుతారు. దీన్ని చాలా మంది సీసీఎస్‌లోనే డిపాజిట్ చేసి వడ్డీ పొందుతుంటారు. దాన్నే పింఛన్లా భావిస్తుంటారు. ఇలా ప్రస్తుతం విశ్రాంత ఉద్యోగుల మొత్తం సీసీఎస్‌లో రూ.250 కోట్ల వరకు ఉంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతంలోంచి మినహాయించే 7 శాతం మొత్తం నెలకు రూ.25 కోట్లవుతుంది. దీన్ని ప్రతినెలా ఆర్టీసీ సీసీఎస్‌కు సరిగా చెల్లించలేకపోతోంది. దీంతో డిపాజిట్లపై వడ్డీగా చెల్లించాల్సిన నెలవారీ మొత్తం రూ.2.5 కోట్లు చెల్లించడం సీసీఎస్‌కు కష్టంగా మారి.. నిలిపివేసింది. విశ్రాంత జీవితంలో చీకూచింతా లేకుండా గడపాలనుకునే వారికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఏడాది క్రితం ఇలాంటి సమస్యే ఏర్పడి కొన్ని నెలల పాటు వీరికి వడ్డీ అందలేదు. సజ్జనార్ ఎండీగా వచ్చిన తర్వాత సమస్య పరిష్కారమైంది. మళ్లీ ఇప్పుడు ఎదురుకావటంతో విశ్రాంత ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. -
తిప్పి పంపడానికి తిప్పలెన్నో!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తూ పోలీసులకు పట్టుబడిన విదేశీయులను వారి దేశాలకు పంపడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి డిపోర్టేషన్ సెంటర్లో ఉంచుతారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ సెంటర్‌ను తాత్కాలిక ప్రాతిపదికన నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్) ఏర్పాటు చేశారు. సరైన వసతులు, సౌకర్యాలు లేకపోవడంతో ఇక్కడ ఉంటున్న విదేశీయులు ఇబ్బందులు పడుతున్నారు. వీరి వైఖరి పోలీసులకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే డిపోర్టేషన్ సెంటర్‌ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ నగర పోలీసుల దాదాపు ఏడాది క్రితం పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం స్పందించట్లేదు. నగరంలోనే బెడద ఎక్కువ.. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల కంటే నగరంలోనే ‘ఈ విదేశీయుల’ బెడద ఎక్కువగా ఉంటోంది. విద్య, వైద్య, వృత్తి, వ్యాపార, పర్యాటక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి నేపథ్యంలో, కల్చర్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమంలో భాగంగానూ అనేక మంది విదేశీయులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. స్టడీ, విజిట్, బిజినెస్, మెడికల్ వీసాలపై వచ్చిన వారిలో కొందరు ఇక్కడే అక్రమంగా ఉండిపోతున్నారు. ప్రధానంగా సూడాన్, సోమాలియా, నైజీరియా, యమెన్, కెన్యా, జిబౌటీ తదితర దేశాల నుంచి వస్తున్న వారితోనే ఇబ్బంది ఎక్కువగా ఉంటోంది. ఇలా అక్రమంగా నివసిస్తూ పట్టుబడిన విదేశీయులతో పాటు వివిధ నేరాల్లో చిక్కిన వారినీ పోలీసులు అరెస్టు చేయడం, తమ ఆధీనంలోకి తీసుకోవడం చేస్తారు. వీరిపై సంబంధిత కేసులు నమోదు చేసిన తర్వాత దాని తీరును బట్టి తదుపరి చర్యలు తీసుకుంటారు. వీరిని ఆయా దేశాలకు బలవంతంగా తిప్పి పంపడానికి (డిపోర్టేషన్) ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు డిపోర్టేషన్ సెంటర్‌గా పిలిచే చోట నిర్భంధించి ఉంచుతారు. ఉమ్మ డి రాష్ట్రంలో ఈ సెంటర్ విశాఖపట్నంలో ఉండేది. ఆపై తాత్కాలిక ప్రాతిపదికన హైదరాబాద్ సీసీఎస్ డిపోర్టేషన్ సెంటర్‌గా మా రింది. విదేశీయులు పట్టుబడితే వారిని వెంటనే వారి దేశాలకు పంపడం సాధ్యం కాదు. భాష అర్థం కాక.. ఆహారం అందించలేక.. చిక్కిన వారి వివరాలను ఫారినర్స్ రీజనల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కు (ఎఫ్ఆర్ఆర్ఓ) పంపి, అక్కడి నుంచి ఆయా దేశాలకు చెందిన ఎంబసీలకు సమాచారం ఇవ్వడం ద్వారా వివరాలు పొంది, వారి సాయంతోనే డిపోర్ట్ చేయాలి. అప్పటి వరకు డిపోర్టేషన్ సెంటర్లోనే ఉంచాలి. డిపోర్టేషన్ సెంటర్ ఏర్పాటుకు కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. ఆయా దేశీయుల భాష తర్జుమా చేయడానికి ట్రాన్స్‌లేటర్లు, వారికి అనువైన ఆహారం వండి ఇవ్వడానికి కుక్స్ ఉండాలి. సదరు సెంటర్ సైతం సువిశాల స్థలం మధ్యలో భవంతులతో నిర్మితం కావాలని మార్గదర్శకాలు చెబుతున్నాయి. ఇవేవీ లేకుండా సీసీఎస్‌లోని ఓ సెల్‌ను డిపోర్టేషన్ సెంటర్‌గా మార్చారు. దీంతో ఇక్కడి విదేశీయుల భాష అర్థం కాక, వారు అడిగిన ఆహారం అందించలేక, వసతుల లేమి నేపథ్యంలో వాళ్లు చేస్తున్న హంగామా భరించలేక పోలీసులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వీటిని గమనించిన ఉన్నతాధికారులు డిపోర్టేషన్ సెంటర్‌ను అనువైన ప్రాంతానికి మార్చాలంటూ దాదాపు ఏడాది క్రితమే ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపారు. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ సెంటర్ సీసీఎస్‌లోనే కొనసాగుతోంది. (చదవండి: 6 నెలల ముందే అభ్యర్థులు) -
ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: భాగస్వామ్య పింఛన్ పథకం (సీపీఎస్) రద్దు అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎస్‌పై సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియలో ఉద్యోగ సంఘాలనూ భాగ్వస్వామ్యం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. మంత్రుల బృందం, అధికారులు సంబంధిత సంఘాలకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభం కావాలని సీఎం తెలిపారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ పాల్గొన్నారు. -
ఆర్టీసీలో ‘సహకార ఎన్నికల’ పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మరోసారి ఎన్నికల లొల్లి మొదలైంది. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) పాలకమండలికి సంబంధించిన ఎన్నికల వ్యవహారం అధికారులకు తలనొప్పిలా తయారైంది. టీఎస్ఆర్టీసీ సీసీఎస్ టర్నోవర్ రూ.1500 కోట్లు. ప్రతినెలా దాదాపు రూ.25 కోట్లు ఇందులో జమచేస్తారు. ఆ మొత్తం నుంచి రుణాలను అందిస్తారు. ఈ నిర్వహణకోసం పాలకమండలి ఉంటుంది. సీసీఎస్‌కు 282 మంది ప్రతినిధులను వారి నుంచి పది మందితో మేనేజ్మెంట్ కమిటీని ఎంపిక చేస్తారు. ఇది ఐదేళ్లపాటు కొనసాగుతుంది. నవంబరుతో ఆ ఐదేళ్ల కాలం పూర్తయింది. దీంతో మళ్లీ ఎన్నికలు జరిపాల్సి ఉంది. ఇప్పుడు అక్కడే వివాదం మొదలైంది. ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా కార్మిక సంఘాల పేరుతో జరగనప్పటికీ, ఎన్నికలు ఆసాంతం కార్మిక సంఘాల కనుసన్నల్లోనే జరుగుతాయి. ఆర్టీసీ సమ్మె తరువాత 2019 నుంచి కార్మిక సంఘాల ఊసే లేదు. డిపో స్థాయిలో స్థానిక సిబ్బందితో సంక్షేమ మండళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు యూనియన్ పేరెత్తితేనే అధికారులు మండిపడుతున్నారు. వాటితో సఖ్యతగా ఉంటే ముఖ్యమంత్రికి కోపమొస్తుందన్న భయంతోనూ ఉన్నారు. ఈ ఎన్నికలను నిర్వహిస్తే మళ్లీ కార్మిక సంఘాలకు ప్రాణం పోసినట్టవుతుందన్న ఉద్దేశంతో.. ఎన్నికలు లేకుండా చూడాలని అధికారులు యత్నిస్తున్నారు. కానీ సహకార చట్టం ప్రకారం కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇదే విషయమై రెండు రోజుల క్రితం రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ వద్ద సీసీఎస్ అధికారులతో సమావేశం జరిగినట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఎన్నికలను వాయిదా వేసి, ప్రస్తుత పాలక మండలితోనే నెట్టుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. దీన్ని కార్మిక సంఘాలు తీవ్రంగా తప్పు పడుతున్నాయి. సీసీఎస్‌తోపాటు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కూడా నిర్వహించాలని పట్టుపడుతున్నాయి. మళ్లీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది రాజకీయ రంగు పులుముకునేలా కనిపిస్తోంది. ఇటీవలే తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన అశ్వత్థామరెడ్డి తాజాగా ఆ సంఘం సమావేశానికి హాజరై ఇలాంటి ప్రకటనే చేయటం, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈనెలలోనే సీసీఎస్ ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండటంతో వివాదం మరింత ముదురుతోంది. -
ఫోర్జరీ ఖరీదు రూ.30 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి సంబంధించిన రూ.64.5 కోట్లు కాజేయడానికి పథకం వేసిన సూత్రధారి సాయికుమార్ అందుకు నకిలీ లేఖలు, ఫిక్స్డ్ డిపాజిట్ (ఎఫ్డీ) బాండ్లు వినియోగించాడు. వీటిని తమిళనాడుకు చెందిన పద్మనాభన్ తయారు చేయగా.. అకాడమీ, బ్యాంకు అధికారుల సంతకాలను ఫోర్జరీ చేసింది మాత్రం మదన్ అని తేలింది. దీని నిమిత్తం ఇతడికి కుంభకోణం సొమ్ము నుంచి రూ.30 లక్షలు ముట్టింది. సాయి అనుచరుడు వెంకట రమణకు స్నేహితుడైన ఇతడిని కేసు దర్యాప్తు అధికారి కె.మనోజ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం షిర్డీలో అరెస్టు చేసి శుక్రవారం నగరానికి తరలించింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టు అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది. ఏపీ పోలీసులు అరెస్టు చేసిన యోహాన్ రాజును పీటీ వారెంట్‌పై తీసుకురావాల్సి ఉంది. టెన్త్ చదివిన మదన్ ఫోర్జరీలో దిట్ట మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన మదన్ పదో తరగతి వరకు చదివాడు. ఆపై అక్కడే వ్యవసాయం చేసేవాడు. 2019లో వెంకటరమణ షిర్డీ వెళ్లినప్పుడు ఇతడితో పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి రాకపోకలు, సంప్రదింపులు కొనసాగాయి. సంతకాలను ఫోర్జరీ చేయడంలో మదన్‌కు పట్టుండటంతో వెంకటరమణ అతన్ని సాయికి పరిచయం చేశాడు. తెలుగు అకాడమీ డబ్బు వివిధ బ్యాంకుల్లో ఎఫ్డీ చేయడానికి సాయి తన అనుచరులైన సోమశేఖర్ తదితరులను దళారుల అవతారం ఎత్తించాడు. డబ్బు కాజేయాలని ముందే పథకం వేసిన సాయి.. అకాడమీ నుంచి తన అనుచరుల ద్వారా ఆ మొత్తాలకు సంబంధించిన చెక్కులు, కవరింగ్ లెటర్లను తీసుకున్నాడు. తొలుత లేఖల్లో ఎఫ్డీ కాలాన్ని మారుస్తూ నకిలీవి సృష్టించాడు. వీటిని అకాడమీ ఇచ్చిన చెక్కులతో జత చేసి బ్యాంకుల కు పంపించాడు. ఈ లేఖల్లో సదరు మొత్తాన్ని 5 రోజుల నుంచి వారానికే ఎఫ్డీ చేయాలని కోరేవాడు. బ్యాంకులు ఈ కాలానికి ఎఫ్డీ చేస్తూ దానికి సంబంధించిన బాండ్లు అందించేవి. వీటిని తీసుకుని సాయి అనుచరులు కొండాపూర్‌లోని అడ్డాకు చేర్చేవాళ్లు. ఎఫ్‌డీల ఆధారంగా పద్మనాభన్ కంప్యూటర్ సాయంతో నకిలీవి తయారు చేసి ప్రింట్ తీసేవాడు. నకిలీ కవరింగ్ లెటర్లపై అకాడమీ అధికారుల సంతకాలు, నకిలీ ఎఫ్డీలపై బ్యాంకు అధికారుల సంతకాలను మదన్ ఫోర్జరీ చేసేవాడు. నకిలీ ఎఫ్డీలను అకాడమీకి ఇచ్చి 5 రోజులో, వారం రోజులో గడువు ముగిసిన తర్వాత తమ వద్ద ఉన్న ఒరిజనల్ ఎఫ్డీలు రద్దు చేసేవారు. కేవలం తెలుగు అకాడమీ కుంభకోణంలోనే కాకుండా ఏపీలో చోటు చేసుకున్న రెండు స్కాముల్లోనూ సాయి తదితరులతో పాటు మదన్ నిందితులుగా ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఏపీ ఆయిల్ ఫెడ్, ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ల నుంచీ సాయి గ్యాంగ్ రూ.14.6 కోట్లు కాజేశారు. అక్కడా నకిలీ లేఖలు, బాండ్లను పద్మనాభన్ తయారు చేయగా... బ్యాంకు, అధికారుల సంతకాలను మదన్ ఫోర్జరీ చేశాడని తేలింది. ఇతడిని సీసీఎస్ పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
తెలుగు అకాడమీ నిధుల స్కాం తో CCS దర్యాప్తు ముమ్మరం
-
ఎట్టకేలకు సీసీఎస్‌కు నిధులు
సాక్షి, హైదరాబాద్: మూతపడే దశలో ఉన్న ఆర్టీసీ సహకార పరపతి సంఘాని(సీసీఎస్)కి ఎట్టకేలకు రవాణా సంస్థ నిధులు కేటాయించింది. వేయి కోట్లకు పైగా సంఘం నిధులు సొంతానికి వాడుకుని, దాన్ని దివాలా దశకు చేర్చిన ఆర్టీసీ.. తాజాగా దానికి రూ.90 కోట్లు అందజేసింది. త్వరలో నేషనల్ క్రెడిట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి ప్రభుత్వ పూచీకత్తు ద్వారా సీసీఎస్‌కు రూ.400 కోట్ల నిధులు సమకూర్చాల్సి ఉంది. కానీ గతంలో బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలకు సంబంధించి సీసీఎస్ కొంత బకాయి పడింది. అవి మొండి బకాయిలుగా మారటంతో సంఘం ప్రస్తుతం ఎన్పీఏ జాబితాలోకి చేరింది. ఆ బకాయిలు తీరిస్తేగానీ ఎన్సీడీసీ నుంచి రుణం పొందే వీలులేదు. ఈ నేపథ్యంలోనే అందుకు కావాల్సిన నిధులు కేటాయించాల్సిందిగా సీసీఎస్ చాలాకాలంగా ఆర్టీసీని కోరుతోంది. కానీ పట్టించుకోలేదు. అయితే ఆర్టీసీ కొత్త ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో.. ఆ కసరత్తు వేగం అందుకుంది. నాలుగు రోజుల క్రితం రూ.90 కోట్లు సీసీఎస్‌కు అందాయి. వడ్డీ బకాయిలకు రూ.7.5 కోట్లు: తాజా నిధుల్లోంచి బ్యాంకు బకాయిల కిం ద రూ.80 కోట్లను చెల్లించిన సీసీఎస్, మిగతా మొత్తం నుంచి రిటైర్డ్ ఉద్యోగుల డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు చెల్లించనుంది. గత మూడు నెలలుగా రిటైర్డ్ ఉద్యోగులు వడ్డీ అందక ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద వచ్చిన మొత్తాన్ని సీసీఎస్‌లోనే డిపాజిట్ చేశారు. -
సీసీఎస్ బకాయిల కోసం రూ.500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగులు దాచుకున్న సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను పూర్తిగా వాడేసుకుని ఉద్యోగులకు రుణాలు, విశ్రాంత ఉద్యోగులకు వడ్డీ చెల్లించకుండా గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎట్టకేలకు ప్రభుత్వం పరిస్థితి చక్కదిద్దేందుకు సిద్ధపడింది. కేవలం సీసీఎస్ బకాయిలు చెల్లించేందుకు వీలుగా నేషనల్ కో–ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుంచి రూ.400 కోట్ల రుణం తీసుకుని ఆర్టీసీకి అందించాలని నిర్ణయించింది. ఈ రుణానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వనుంది. సీసీఎస్ నిల్వ మొత్తాన్ని వాడుకోవడం, ప్రతినెలా దానికి జమ చేయాల్సిన మొత్తాన్ని ఎగ్గొడుతున్న ఫలితంగా దానికి ఆర్టీసీ దాదాపు రూ.950 కోట్ల వరకు బకాయి పడింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించడం కష్టంగా మారడంతో ముందుగా రూ.500 కోట్లు చెల్లించాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. అప్పుడు వద్దనుకుని.. నిజానికి ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకునే అంశం దాదాపు మూడు నెలల క్రితమే చర్చకొచ్చింది. అప్పుడు ఆ కార్పొరేషన్‌తో అధికారులు చర్చించారు. సాధారణంగా ఎన్సీడీసీ వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు చెందిన సహకార సంస్థలకే రుణాలిస్తుంది. సీసీఎస్ కూడా సహకార సంస్థే కావటంతో రుణం ఇచ్చేందుకు అప్పట్లో అంగీకరించినట్లు తెలిసింది. అయితే రుణం నేరుగా సీసీఎస్‌కే ఇస్తామని, ఆర్టీసీకి ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు సమాచారం. తీసుకునే రుణంలో కొంత సీసీఎస్‌కు ఇచ్చి, మిగతాది తమ అవసరాలకు వాడుకోవాలన్న యోచనలో ఉన్న ఆర్టీసీ అందుకు అంగీకరించలేదు. ఫలితంగా అప్పట్లో ఆ రుణ అంశం అటకెక్కిందని తెలిసింది. ఇప్పుడు సీసీఎస్ పరిస్థితి దారుణంగా తయారు కావటంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందులో డబ్బు దాచుకుని నెలనెలా వడ్డీ పొందుతున్న విశ్రాంత ఉద్యోగులు ఇటీవల బస్‌భవన్ ఎదుట నిరసన ప్రదర్శన చేశారు. దీనికి సంబంధించి ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. సీసీఎస్‌లో సభ్యత్వం ఉండటం.. నెలనెలా జీతంలో కోత పడుతుండటంతో ఏకంగా సభ్యత్వాలనే మూకుమ్మడిగా రద్దు చేసుకోవాలని ఉద్యోగులు భావిస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సీసీఎస్ మూసివేతకు రంగం సిద్ధం అయిన తీరుపై ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. దీంతో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆర్టీసీ ఎండీ సునీల్‌శర్మ, ఈడీలు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు హాజరయ్యారు. గతంలో వద్దనుకున్న ఎన్సీడీసీ రుణాన్ని తిరిగి తీసుకోవాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు ఇవ్వాలనే విషయంపై చర్చించారు. దీనికి ఆర్థిక శాఖ అంగీకరించడంతో ఆ రుణం పొందేందుకు మార్గం సుగమమైంది. బడ్జెట్లో పేర్కొన్న రుణం అందినట్టే.. బడ్జెట్(2021–22)లో ఆర్టీసీకి రూ.1,500 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రభుత్వ బ్యాంకు నుంచి రూ.వేయి కోట్ల రుణంపై చర్చించగా, తొలుత రూ.500 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ మొత్తం దాదాపు నెలన్నర క్రితం అందింది. అది ఖర్చు చేశాక మరో రూ.500 కోట్ల రుణం ఇవ్వనున్నట్లు ఆ బ్యాంకు పేర్కొంది. వెరసి రూ.వేయి కోట్లు అక్కడి నుంచి రానుండగా, తాజాగా ఎన్సీడీసీ నుంచి మరో రూ.400 కోట్ల రుణం తీసుకోవాలని నిర్ణయించడంతో ప్రభుత్వ రుణం దాదాపు ఆర్టీసీకి అందినట్లు అవుతుంది. ఉద్యోగుల బకాయిలకు వినియోగం? దాదాపు నెలన్నర క్రితమే అందిన రూ.500 కోట్ల బ్యాంకు రుణాన్ని ఎలా ఖర్చు చేయాలనే విషయంలో ఓ నిర్ణయానికి రాలేక అలాగే ఉంచారు. ఇప్పుడు వాటిని ఉద్యోగుల బకాయిల కింద వాడాలని భావిస్తున్నట్లు సమాచారం. సీసీఎస్‌కు ఎన్సీడీసీ రుణాన్ని ఇవ్వనుండగా, ఉద్యోగులకు ఉన్న బాండ్ల బకాయిలు, వేతన సవరణ బకాయిలు, విశ్రాంత ఉద్యోగుల బకాయిలకు వాటిని వాడాలని భావిస్తున్నట్లు తెలిసింది. అద్దె బస్సు బకాయిలు కూడా చెల్లించాలని అనుకుంటున్నట్లు సమాచారం. వాటి వ్యయంపై ముఖ్యమంత్రి నుంచి స్పష్టత వచ్చాక వెల్లడించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. -
సొమ్ములివ్వకుంటే ఎలా బతకాలి?
సాక్షి, హైదరాబాద్: ‘పెన్షన్ లేదు, సెటిల్మెంట్ సొమ్ము పూర్తిగా చెల్లించట్లేదు. మరి మేం బతికేదెట్లా? తొలి, మలిదశ ఉద్యమాల్లో పాల్గొన్న మాకు రాష్ట్ర సాధన తర్వాత ఎందుకీ బాధలు?’అంటూ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తీరుతో సుమారు 20 వేల మంది రిటైర్ట్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయన్నారు. తమకు వెంటనే బకాయిలు చెల్లించాలనే డిమాండ్‌తో సోమవారం హైదరాబాద్‌లోని ‘బ స్ భవన్’వద్ద వందలాది మంది నిరసన చేపట్టారు. ఇన్చార్జి ఎండీ అందుబాటులో లేకపోవడంతో ఇతర అధికారులకు వినతిపత్రాలు సమర్పించి వెనుదిరిగారు. ఆర్టీసీ చరిత్రలో రిౖటెర్డ్ ఉద్యోగులు తొలిసారి ఆందోళనకు దిగడం గమనార్హం. నిరసన ఇందుకే... ► ఆర్టీసీలో 2018 ఏప్రిల్ తర్వాత రిటైరైన సుమారు 2 వేల మందికి పూర్తిగా సెటిల్మెంట్లు చేయట్లేదు. పెండింగ్‌లో ఉంచిన మొత్తాన్ని ఇప్పటివరకు చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. ► ఆర్టీసీలో పింఛన్ విధానం లేనందున రిటైరయ్యే ఉద్యోగులు తమకు అందిన మొత్తాన్ని ఆర్టీసీ ఆధ్వర్యంలోని సహకార పరపతి సంఘంలో డిపాజిట్లు చేశారు. ఎక్కువ వడ్డీ వస్తున్నందున ఎక్కువ మంది ఇందులోనే పెట్టారు. అయితే ఈ సంఘానికి ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించే నిర్ధారిత మొత్తం జమ కావట్లేదు. దాన్ని ఆర్టీసీ సొంతానికి వాడుకుంటోంది. ఫలితంగా రిటై ర్డ్ ఉద్యోగులకు డిపాజిట్లపై సంఘం వడ్డీ చెల్లించట్లేదు. అలా 10 వేల మందికి చెల్లింపులు నిలిచిపోయాయి. ► సర్వీసులో ఉన్నప్పుడే ఉద్యోగులకు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీం కింద ప్రతినెలా జీతంలో కొంత కోత పెట్టి ఓ నిధిగా చేసి దాన్నుంచి రిటైరైన వారికి నెలనెలా జరిపే చెల్లింపులూ నిలిచిపోయాయి. వాటితోపాటు సకల జనుల సమ్మె కాలంలో విధులకు రాని కాలాన్ని ప్రత్యేక సెలవుగా పరిగణిస్తూ జీతం చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సమయంలో సర్వీసులో ఉండి ఆ తర్వాత రిటైరైన వారికి ఆ మొత్తం కూడా ఇప్పటిదాకా చెల్లించలేదు. ఉద్యోగులదీ నిరసన బాటే... సీసీఎస్‌లోని కొందరు సభ్యులు కూడా సోమవారం బస్‌భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత సీసీఎస్ కార్యాలయం వద్ద కూడా ఆందోళన చేపట్టారు. గతంలో తమ జీతాల నుంచి ఏడు శాతం మినహాయించి సీసీఎస్‌కు జమ చేసేవారని, దాన్ని ఆర్టీసీ వినియోగించుకుంటున్న నేపథ్యంలో కేవలం ఒక శాతమే మినహాయించేలా తీర్మానం చేసినా ఏడు శాతం ఎందుకు కోత పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యంపై స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కారణం ఏమిటి? అసలే తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆర్టీసీ యాజమాన్యం ప్రతినెలా ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకే కటకటలాడుతోంది. ఈ పరిస్థితుల్లో రిటైరైన ఉద్యోగులకు పూర్తిస్థాయిలో సెటిల్మెంట్లు చేసే పరిస్థితి లేక చేతులెత్తేసింది. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి... గతంలో ఎన్నడూ లేనట్లుగా విశ్రాంత, ప్రస్తుత ఉద్యోగులు ఆందోళన బాట పట్టాల్సిన పరిస్థితులు రావటం దారుణం. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వారికి చెల్లింపులు జరపాలి – ఎన్ఎంయూ నేతలు కమాల్‌రెడ్డి, నరేందర్ నిపుణుల కమిటీ వేయాలి... ప్రస్తుతం ఆర్టీసీకి రుణాలు ఇచ్చేందుకు కూడా ఆర్థిక సంస్థ లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడేందుకు ఉన్న మార్గాలను సూచించేం దుకు ప్రభుత్వం వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలి. – ఆర్టీసీ బోర్డు మాజీ డైరక్టర్ నాగేశ్వరరావు -
ఆదర్శం నుంచి అధోగతికి!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్నో సహకార పరపతి సంఘాల ఆవిర్భావానికి ఆదర్శంగా నిలవడమే కాకుండా ఆసియాలోనే ఉన్నత పొదుపు సంస్థగా గుర్తింపు పొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం ప్రస్తుతం పతనం అంచుకు చేరుకుంది. ఆర్టీసీ స్వయంగా ఈ సహకార సంఘం పతనాన్ని లిఖిస్తోంది. ఉద్యోగుల వేతనాల్లోంచి పోగు చేసిన రూ. వేల కోట్ల నిధిని ఆర్టీసీ దిగమింగి తిరిగి కట్టకపోవటమే దీనికి కారణం. అత్యవసరాలకు రుణం అందించే నిధి మాయమవడంతో ఆర్టీసీ ఉద్యోగులు బ్యాంకుల నుంచి అధిక వడ్డీలకు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇక జీతంలో కోత లేకుండా చూసుకుంటే ఎక్కువ అప్పు పుడుతుందన్న ఉద్దేశంతో ఉద్యోగులు ‘అమ్మ’లాంటి సహకార సంఘంలో సభ్యత్వాన్ని వదులుకుంటున్నారు. 48 వేల మంది సభ్యులున్న ఆ పరపతి సంఘం నుంచి ఇప్పటికే 6 వేల మంది సభ్యత్వాలు ఉపసంహరించుకున్నారు. ప్రతినెలా కొత్తగా వందల సంఖ్యలో ఉపసంహరణ దరఖాస్తులందుతున్నాయి. చివరకు ఆర్టీసీలో అత్యున్నత పోస్టుగా భావించే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కూడా సహకార సంఘం నుంచి వైదొలుగుతున్నారు. ఎందుకీ దుస్థితి? రాష్ట్రం విడిపోయే వేళ ఈ సంఘంలో సాలీనా రూ. 3 వేల కోట్లకు పైచిలుకు నిధి జమయ్యేది. దాన్నుంచి లక్ష మందికి రుణాలు అందించేవారు. విభజన తర్వాత తెలంగాణ ఆర్టీసీ పరిధిలోని సీసీఎస్‌కు రూ. 1,500 కోట్ల వాటా వచ్చింది. ఇప్పుడా విలువ రూ. 2 వేల కోట్లను దాటాల్సి ఉంది. కానీ కొన్నేళ్లుగా దివాలా దిశలో సాగుతున్న ఆర్టీసీ.. సొంత ఖర్చులకు ఈ నిధిని వాడుకొని చేతులెత్తేసింది. అడపాదడపా కొంత మొత్తం తిరిగి చెల్లిస్తూ ప్రతినెలా పోగయ్యే కొత్త నిధిని వాడేసుకోవడం అలవాటు చేసుకుంది. గత రెండేళ్లుగా తిరిగి చెల్లింపు దాదాపు నిలిచిపోయింది. దీంతో సీసీఎస్ బ్యాలెన్స్ సున్నాగా మారిపోయింది. అప్పట్నుంచి రుణాలు ఇవ్వకపోవడంతో ప్రస్తుతం దాదాపు 10 వేల వరకు దరఖాస్తులు పేరుకుపోయాయి. మధ్యలో కోర్టు ఆదేశం మేరకు రూ. 200 కోట్లు తిరిగి జమ చేసిన ఆర్టీసీ... ఆ తర్వాత మళ్లీ మొహం చాటేసింది. ఆ రూ. 200 కోట్లతో కొంత మందికి లోన్లు అందాయి. మిగతా సుమారు 8 వేల దరఖాస్తులు దుమ్ము కొట్టుకుపోతున్నాయి. తొలిసారి సభ్యత్వాల రద్దు వైపు ఉద్యోగులు.. సీసీఎస్ నుంచి రుణాలు రాకపోవడంతో ఉద్యోగులు గత్యంతరం లేక బ్యాంకుల నుంచో లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచో అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయినా ప్రతి నెలా సీసీఎస్‌కు జమ కట్టే పేరుతో ఆర్టీసీ వారి జీతాల నుంచి 7.5 శాతాన్ని కట్ చేస్తోంది. కానీ ఆ మొత్తాన్ని సీసీఎస్‌కు ఇవ్వకుండా సొంతానికి వాడేసుకుంటోంది. దీంతో వారి జీతం తగ్గి బ్యాంకు రుణం కూడా తక్కువగా ఉంటోంది. అదే ఈ కోత లేకుంటే, అంతమేర రుణం కూడా పెరుగుతుంది. అలాగే తీసుకున్న అప్పు కిస్తీలు కట్టడానికి ఉపయుక్తంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతో ఉద్యోగులు సీసీఎస్ నుంచి సభ్యత్వాలు రద్దు చేసుకోవడం ప్రారంభించారు. అలా రద్దు చేసుకుంటే అప్పటివరకు దాచుకున్న మొత్తం కూడా పొందే వీలుంటుంది. చిరుద్యోగులకైతే ఆ మొత్తం రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు, పెద్ద ఉద్యోగులకు అంతకంటే ఎక్కువ ఉంటుంది. కానీ ఆ మొత్తం చెల్లించాలంటే కొత్తగా నిధి పోగు కాకపోతుండటంతో అదీ సాధ్యం కావటం లేదు. కానీ చూస్తుండగానే 6 వేల మంది సభ్యత్వం రద్దు చేసుకున్నారు. మరో 4–5 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రతినెలా ఆ సంఖ్య పెరుగుతోంది. ఉలుకూపలుకు లేని సంస్థ.. ఆర్టీసీ చరిత్రలో తొలిసారి ఈ విపరీత పరిణామం నెలకొనడంతో సంస్థ షాక్‌కు గురైంది. దీన్ని ఆపాలంటే మళ్లీ సీసీఎస్‌లో కొత్త నిధి ఏర్పడాలి. దానికి ఆర్టీసీ బకాయిపడ్డ రూ. 1800 కోట్ల మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. కానీ ప్రతినెలా జీతాలు చెల్లించేందుకు బడ్జెట్ కేటాయింపుల కోసం ఆర్థిక శాఖ వైపు చూసే ఆర్టీసీ... ఇంత భారీ బకాయి చెల్లించడం వల్ల కాక మిన్నకుండిపోయింది. కళ్ల ముందే సభ్యత్వాలు పెద్ద సంఖ్యలో రద్దవుతున్నా మిన్నకుండిపోయింది. ఇప్పటికే ఆర్టీసీ తీరుపై సీసీఎస్ పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. గతంలో కోర్టు సూచన మేరకు రూ. 200 కోట్లను కనాకష్టంగా ఆర్టీసీ చెల్లించింది. ఇప్పుడా కేసు ఇంకా కొనసాగుతోంది. ఆర్టీసీలో ఫైనాన్స్ వ్యవహారాలు చూసే విభాగానికి చెందిన ఓ ఉన్నతాధికారి, లీగల్ వ్యవహారాలు చూసే మరో ఉన్నతాధికారి, ఈడీలు కూడా సభ్యత్వం రద్దు చేసుకునేందుకు దరఖాస్తు చేసిన విషయం గుప్పుమనడంతో ఇక ఇంతకాలం అందులో పోగైన నిధులు కూడా భవిష్యత్తులో తిరిగి రావేమోనన్న భయంతో సాధారణ ఉద్యోగులు సైతం సభ్యత్వాల రద్దు కోసం పోటెత్తుతున్నారు. ఏమిటీ పొదుపు సంఘం? ఆర్టీసీ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా 7.5 శాతాన్ని సహకార పరపతి సంఘాని (సీసీఎస్)కి చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మినహాయించిన తర్వాతే వారికి జీతాలు అందుతాయి. అలా మినహాయించిన మొత్తాన్ని ఆర్టీసీ ఈ సీసీఎస్‌లో జమ చేయాలి. అలా పోగయ్యే మొత్తాన్ని సీసీఎస్ పాలకవర్గం బ్యాంకుల్లో పెట్టి వడ్డీ రూపంలో ఆదాయాన్ని పొందుతుంది. ఆ మొత్తం నుంచి కార్మికుల కుటుంబ అవసరాల కోసం తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవడం, చదువులు, ఆరోగ్యానకి సంబంధిం చిన ఖర్చులకు ఇస్తుంది. ఉద్యోగులు రిటైరైతే అప్పటి దాకా జమ అయిన మొత్తాన్ని బ్యాంకు రేట్ల స్థాయి వడ్డీతో కలిపి చెల్లిస్తుంది. నాడు వైభవం.. ఉత్తరాదికి చెందిన రైల్వే ఉద్యోగుల బృందం ఆ సంస్థ సందర్శనకు వచ్చి అంతర్గతంగా సహకార పరపతి సంఘం ఎలా ఉండాలో అధ్యయనం చేసింది. ఏడాదిలో రూ.3వేల కోట్లను పొదుపు రూపంలో సేకరించి లక్ష మందికి దరఖాస్తు చేసిన 3రోజుల్లోనే రుణాలు అందిస్తున్న తీరు చూసి అచ్చెరువొందింది. ఠంచన్‌గా రుణాల జమ, మళ్లీ కొత్త రుణాలు... నయాపైసా అవినీతి లేకుండా సాగుతున్న ఆ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయింది. నేడు ప్రశ్నార్థకం.. అంత సమున్నత సంస్థ నిలువునా కూలిపోతోంది. దివాలాకు దగ్గరై మూతపడే దిశగా కదులుతోంది. ఆ సంస్థకు వెన్నెముకగా ఉండే సభ్యులు క్రమంగా సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటున్నారు. ఇప్పటికే 6 వేల సభ్యత్వాలు రద్దవగా సగటున ప్రతి నెలా 350 మంది ఉససంహరణ దరఖాస్తులు అందజేస్తున్నారు. వెరసి.. ఆసియాలోనే ఉత్తమ సహకార సంఘాల్లో ఒకటిగా వెలుగొందిన ఆ సంస్థ ఉనికే ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. కూతురు పెళ్లి లోన్ కోసం సభ్యత్వం వదులుకున్నా నా కూతురు పెళ్లి కోసం ఏడాది కింద సీసీఎస్‌కు దరఖాస్తు చేశా. నిధులు లేక ఇవ్వలేదు. దీంతో ప్రైవేటుగా అప్పు తెచ్చా. ఇందుకు ప్రతినెలా రూ. 20 వేల కిస్తీ కడుతున్నా. జీతంలో సీసీఎస్ కోత ఉంటే ఇబ్బందిగా ఉంటోందని దాన్ని రద్దు చేసుకున్నా. ఏడు నెలలు గడుస్తున్నా నాకు అందులో ఉన్న నా సొమ్ము ఇవ్వట్లేదు. – వెంకటేశ్వర్లు, కంట్రోలర్, నల్లగొండ అప్పు తీర్చేందుకు సభ్యత్వం రద్దు చేసుకుంటున్నా పిల్లల చదువుకు రూ. లక్షన్నర, ఇంటి కోసం రూ. లక్షన్నర కోసం రెండు దరఖాస్తులు సమర్పించా. ఏడాదిగా అవి పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో రూ. 2 లక్షలు బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకున్నా. సకాలంలో జీతం రాక చెక్ బౌన్స్ అవుతుండటంతో కిస్తీల మందం ఉంచేందుకు ప్రైవేటుగా కొంత అప్పు తెచ్చా. అవి కట్టేందుకు జీతం సరిపోక, సీసీఎస్ కటింగ్ లేకుండా ఉండేందుకని సభ్యత్వమే రద్దు చేసుకునేందుకు దరఖాస్తు పెట్టా. – జియాఉద్దీన్, డ్రైవర్ ఇబ్రహీంపట్నం ఇది రైఫీజన్ చిత్రంతో ఉన్న పురస్కారం. సహకార పరపతి సంఘం విధానాలకు ఆద్యుడైన ఈ జర్మనీ మేధావి ఆశయాన్ని సుసంపన్నం చేస్తోందన్న ఉద్దేశంతో ఆర్టీసీ సహకార పరపతి సంఘం ఆయన చిత్రంతో కూడిన ఈ పురస్కారాన్ని పొందింది. ఇప్పుడు సీసీఎస్ గోడకు వేళ్లాడుతూ దాని దయనీయ స్థితికి మూగ సాక్ష్యంగా నిలిచింది. -
అప్పు పుట్టేదెట్లా?
శ్రీహరి.. ఆర్టీసీలో డ్రైవర్.. కూతురు పెళ్లి కోసం గతేడాది ఆర్టీసీ సహకార పరపతి సంఘం(సీసీఎస్)లో పొదుపు చేసుకున్న మొత్తం నుంచి రుణం ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. సీసీఎస్‌లో నిధులు లేక రుణమివ్వలేదు. దీంతో గత్యంతరం లేక ప్రైవేటు వడ్డీ వ్యాపారి వద్ద రూ.3 లక్షలు అప్పు తీసుకున్నాడు. లోన్ సకాలంలో అందక అప్పు తీర్చకపోవటంతో వడ్డీ వ్యాపారి వేధింపులు తీవ్రమయ్యాయి. దీంతో మధ్యవర్తి ద్వారా బ్యాంకులో రుణం తీసుకుని అప్పు తీర్చాడు. బ్యాంకు రుణం ఇప్పించిన పేరుతో మధ్యవర్తి లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్ వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు బ్యాంకు అప్పు గొంతుమీద ఉంది. దాని కిస్తీలు కట్టేందుకు నానాఇబ్బంది పడాల్సి వస్తోంది. సురేందర్.. హైదరాబాద్‌లో కండక్టర్.. తన కుమారుడికి ఐఐటీ మద్రాస్‌లో సీటొచ్చింది. అందుకు వెంటనే రూ.లక్షన్నర చెల్లించాలి. విద్యా రుణం కోసం ఆర్టీసీ సహకార పరపతి సంఘంలో దరఖాస్తు చేసుకుంటే డబ్బులు లేవన్నారు. దీంతో గత్యంతరం లేక వడ్డీవ్యాపారి నుంచి రూ.2 లక్షలు అప్పు తెచ్చాడు. మూడు నెలల్లో తీర్చేస్తానన్న హామీతో అప్పు పుట్టింది. కానీ ఇప్పటికీ పరపతి సంఘం లోన్ రాకపోవటంతో ఆ అప్పు తీర్చలేక, వడ్డీ వ్యాపారి ఒత్తిడి భరించలేక సతమతమవుతున్నాడు. సాక్షి, హైదరాబాద్: ఇదీ ప్రస్తుతం ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) పరిస్థితి. అందులో కార్మికులు పొదుపు చేసుకున్న మొత్తాన్ని ఆర్టీసీ యాజమాన్యం వాడేసుకోవటంతో రెండేళ్లుగా నిధులు లేకుండా పోయాయి. కుటుంబ అత్యవసరాల కోసం ఉద్యోగులు రుణం పొందాలంటే వీల్లేకుండా పోయింది. ప్రస్తుతం సీసీలో కుటుంబ అత్యవసరాలకు సంబంధించి రుణాల కోసం ఉద్యోగులు చేసుకున్న దరఖాస్తులు ఏకంగా 11,800లకు చేరుకున్నాయి. ఈ దరఖాస్తులన్నింటికీ సంబంధించి రుణాలు ఇవ్వాలంటే రూ.300 కోట్లు కావాలి. సీసీఎస్‌కు ఆర్టీసీ బకాయిపడ్డ రూ.776 కోట్లలో భాగంగా వాటిని చెల్లించాల్సి ఉంది. ఆర్టీసీ ఆ నిధులను పెండింగులో పెట్టడం ఉద్యోగులకు శాపంగా మారింది. ఇదీ జరిగింది.. ఆర్థిక పరిస్థితి సరిగా లేక చాలాకాలంగా అందుబాటులో ఉన్న నిధులన్నింటినీ ఆర్టీసీ వాడుకుంటోంది. ఈ క్రమంలో ఉద్యోగుల (కార్మికుల)కు సంబంధించిన సహకార పరపతి సంఘం (సీసీఎస్) నిధులను కూడా వాడేసుకుంది. డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్‌లు వారి జీతాల నుంచి ప్రతినెలా సీసీఎస్‌కు 7.5 శాతం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని మినహాయించిన తర్వాతే వారికి ఆర్టీసీ జీతాలు చెల్లిస్తుంది. అలా మినహాయించిన మొత్తాన్ని సీసీఎస్‌లో జమ చేయాలి. అలా పోగయ్యే మొత్తాన్ని సీసీఎస్ పాలకవర్గం కారి్మకుల కుటుంబ అవసరాలకు రుణాలు మంజూరు చేస్తుంది. పిల్లల పెళ్లిళ్లు, ఇళ్లు కట్టుకోవటం, చదువులు, ఆరోగ్య సంబంధిత ఖర్చులకు వాడతారు. ఈ నిధులన్నింటినీ ఆర్టీసీ వాడేసుకోవటంతో సీసీఎస్ ఖజానా ఖాళీ అయింది. దీంతో గతేడాది జనవరి నుంచి ఆ రుణాలు ఇవ్వటం ఆపేశారు. తొలుత 18 వేల దరఖాస్తులు పేరుకుపోగా, ఇటీవల కొంత మందికి అతి కష్టమ్మీద రుణాలిచ్చారు. జూన్ నుంచి 11,800 దరఖాస్తులు పెండింగులో ఉండిపోయాయి. (చదవండి: ఆర్టీసీ నిధులన్నీ హాంఫట్! ) ఆదాయం పెరిగితేనే.. ఇటీవల కార్గో బస్సులు ప్రారంభించిన ఆరీ్టసీ.. సరుకు రవాణా ద్వారా నిత్యం రూ.10 లక్షలకు పైగా ఆదాయం పొందుతోంది. పెట్రోల్ బంకులు సొంతంగా ఏర్పాటు చేసి రూ.25 లక్షల ఆదాయం సమకూర్చుకుంటోంది. అయితే సీసీఎస్‌కు ఉన్న బకాయి పెద్దది కావటంతో ప్రభుత్వం సాయం చేస్తేనే తీరే పరిస్థితి కని్పస్తోంది. గత జనవరిలో ప్రభుత్వ పూచీకత్తుపై రూ.650 కోట్ల బ్యాంకు రుణం వచ్చినా అది కరోనా సమయంలో ఉద్యోగుల జీతాలకే ఖర్చయింది. దీంతో సీసీఎస్ బకాయిలు ఉండిపోయాయి. సీసీఎస్ దాఖలు చేసిన కోర్టు కేసులో కంటెమ్ట్ రావటంతో ఇటీవల రెండు దశలుగా ఆర్టీసీ రూ.50 కోట్లు, రూ.85 కోట్లు సీసీఎస్‌కు చెల్లించి చేతులెత్తేసింది. పెండింగులో ఉన్న కోర్టు ధిక్కార కేసు కొట్టేయాల్సిందిగా హైకోర్టులో ఆర్టీసీ తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఇంకా పెద్ద మొత్తం లో బకాయిలు పెండింగులో ఉన్నందున మిగతా మొత్తం చెల్లించే లా ఆదేశించాలంటూ సీసీఎస్ కూడా అఫిడవిట్ దాఖలు చేసింది. మధ్యవర్తుల దందా.. సీసీఎస్‌లో నిధులు లేకపోవటంతో కొందరు దళారులు అక్కడే తిష్టవేసి దందాకు పాల్పడుతున్నారు. మధ్య వర్తిత్వం నెరిపి బ్యాంకుల నుంచి రుణం ఇప్పిస్తూ లక్షకు రూ.10 వేలు చొప్పున కమీషన్ దండుకుంటున్నారు. ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా వసూలు చేసుకుంటుండటం విశేషం. (చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ రవాణాకు వజ్ర?) చిల్లిగవ్వ లేదు ఆరీ్టసీ సీసీఎస్ పరిస్థితి దుర్భరంగా మారింది. నయా పైసా నిల్వ లేదు. రుణాల కోసం 11 వేలకు పైగా దరఖాస్తులు పేరుకుపోయి ఉన్నాయి. ఉద్యోగులు నిత్యం మా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. బకాయిల కోసం మేం ఆర్టీసీ చుట్టూ తిరుగుతున్నాం. –బి.మహేశ్, ఆర్టీసీ సహకార పరపతి సంఘం కార్యదర్శి నిధులు రాగానే ఇస్తాం కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బస్సులు తిరుగుతూ క్రమంగా ఓఆర్ పెరుగుతోంది. దీంతో రోజువారీ ఆదాయం కూడా మెరుగవుతోంది. రుణం కోసం ప్రభుత్వాన్ని కూడా కోరాం. అవి రాగానే సీసీఎస్‌కు బకాయిలు చెల్లిస్తాం’అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. -
దిగొచ్చిన ఆర్టీసీ, సీసీఎస్ నిధులు జమ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు భయంతో ఎట్టకేలకు ఆర్టీసీ దిగి వచ్చింది. ఉద్యోగుల సహకార పరపతి సంఘం(సీసీఎస్) నిధులు జమ చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం రూ.50 కోట్లు జమ చేసింది. మిగతా మొత్తానికి నాలుగు వారాల గడువు ఇస్తూ తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వాటిని కూడా చెల్లించాల్సి ఉంది. దీంతో అయోమయంగా మారిన పొదుపు సంఘం వ్యవహారం గాడిన పడే అవకాశం కనిపిస్తోంది. కోర్టు చెప్పాకే... ఆర్టీసీ కార్మికులు ప్రతినెలా వేతనం నుంచి 7 శాతం మొత్తాన్ని సీసీఎస్‌కు జమ చేస్తారు. దీన్ని సంస్థనే వేతనం నుంచి మినహాయించి సీసీఎస్‌కు బదిలీ చేస్తుంది. దీంట్లోంచి కార్మికుల అవసరాలకు రుణాలు ఇచ్చేవారు. మిగతా మొత్తాన్ని పెట్టుబడి పెట్టి వడ్డీ రూపంలో ఆదాయాన్ని సీసీఎస్ పొందేది. కానీ, కొంతకాలంగా ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి దిగజారటంతో ఈ నిధులను వాడేసుకుంది. దీంతో ఉద్యోగుల రుణాలు, పదవీ విరమణ పొందినవారు దాచుకున్న డబ్బుకు ఇచ్చే వడ్డీ చెల్లింపు అయోమయంలో పడింది. మృతి చెందిన కార్మికుల తాలూకు డబ్బులు చెల్లించటమూ నిలిచిపోయింది. దీంతో సీసీఎస్ పాలకమండలి హైకోర్టును ఆశ్రయించింది. ఆ డబ్బులు చెల్లించాలంటూ గతేడాది సమ్మె సమయంలో కోర్టు ఆర్టీసీని ఆదేశిస్తూ గడువు విధించింది. అప్పటికి రూ.400 కోట్లు వాడేసుకుని ఉండటంతో.. అందులో రూ.200 కోట్లు ముందు చెల్లించాలని ఆదేశించింది. అయితే గడువులోపు ఈ మొత్తాన్ని చెల్లించకపోవటంతో సీసీఎస్ పాలకవర్గం కోర్టు ధిక్కార కేసు దాఖలు చేసింది. దీంతో మంగళవారం విచారణకు హాజరయ్యే ముందే ఆర్టీసీ రూ.50 కోట్లు సీసీఎస్‌కు చెల్లించింది. మిగతా మొత్తం చెల్లించేందుకు తమకు కొంత గడువు కావాలని కోరటంతో కోర్టు నాలుగు వారాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రతినెలా చెల్లించాల్సిందే.. ప్రతినెలా దాదాపు రూ.35 కోట్ల మొత్తాన్ని (ఇది స్థిరం కాదు) సీసీఎస్‌కు ఉద్యోగుల వేతనాల నుంచి మళ్లించాల్సి ఉంటుంది. కొంతకాలంగా ఆర్టీసీ ఉద్యోగుల వేతనాల నుంచి మినహాయిస్తున్నా సీసీఎస్‌లో జమ చేయడం లేదు. ఇక నుంచి ప్రతినెలా కచ్చితంగా ఆ మొత్తాన్ని సీసీఎస్‌కు బదిలీ చేయాల్సిందేనని కోర్టు ఆదేశించడం విశేషం. దీంతో ఉద్యోగులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా, గతంలో కోర్టు ఆదేశించిన మేరకు రూ.200 కోట్లు చెల్లించాల్సి ఉంది. అప్పట్లో వాడుకున్న మొత్తం డబ్బు రూ.400 కోట్లు మాత్రమే. ఇప్పుడది రూ.830 కోట్లకు చేరుకుంది. దీంతో రూ.200 కోట్లు చెల్లించాలా?, రూ.830 కోట్లు చెల్లించాలా? అన్న విషయంలో కొంత అయోమయం నెలకొంది. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. చదవండి: చీటీలు వేసినవారి పనేనా! -
సొమ్ము చెల్లించేదేలా?
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులు దాచుకున్న పొదుపు మొత్తాన్ని సొంత అవసరాలకు వాడుకున్న ఆర్టీసీ ఇప్పుడు ఆ డబ్బులు తిరిగి చెల్లించలేక హైకోర్టు బోనులో నిలబడాల్సి వచ్చింది. ఇప్పటికే ఓ సారి న్యాయస్థానం విధించిన గడువులోపు ఆ మొత్తాన్ని చెల్లించకపోవటంతో హైకోర్టు ఆర్టీసీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 6న కోర్టుకు వెళ్లి సమాధానం చెప్పాల్సి వస్తోంది. కోర్టు ధిక్కార కేసును ఎదుర్కొంటున్న రవాణా సంస్థ ఇప్పుడు ఏం సమాధానం చెప్పాలో పాలుపోక హైరానా పడుతోంది. ఇదీ సంగతి.. ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్). ఉద్యోగులు తమ జీతాల నుంచి ప్రతినెలా 7 శాతం మొత్తాన్ని కోత పెట్టుకుని దీంట్లో పొదుపు చేసుకుంటారు. అలా జమయ్యే వాటి నుంచి పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఇళ్ల నిర్మాణం, వైద్య ఖర్చు.... ఇలా పలు అవసరాలకు రుణంగా తీసుకుంటారు. దీనికి వడ్డీ చెల్లిస్తారు. ఇలా పెద్ద ఎత్తున రుణాలు అందించే సంస్థగా ఆసియా ఖండంలోనే సీసీఎస్‌కు రికార్డు ఉంది. అయితే.. రానురాను ఆర్టీసీ పూర్తిగా కుదేలు కావడం.. అప్పు కూడా పుట్టని స్థితిలో ఈ సీసీఎస్ నిధిని వాడేసుకుంది. ఫలితంగా సిబ్బంది ఇంతకాలం దాచుకున్న డబ్బులు అవసరాలకు తీసుకోలేని దుస్థితి నెలకొంది. గతేడాది అక్టోబర్‌లో జరిగిన ఆర్టీసీ సమ్మె సందర్భంలో ఇది పెద్ద రభసగా మారింది. ఏడాదిపాటు ఆ డబ్బులు తిరిగి జమ చేయాలంటూ అడుగుతూ వచ్చిన సీసీఎస్ పాలక వర్గం.. సమ్మె సమయంలో హైకోర్టు తలుపుతట్టింది. ఆ సమయంలో సీసీఎస్‌కు ఆర్టీసీ దాదాపు రూ.400 కోట్లు బకాయిపడి ఉంది. దీంతో ఆరువారాల్లో అందులో కనీసం సగం.. అంటే రూ.200 కోట్లు చెల్లించాలంటూ హైకోర్టు ఆదేశించింది. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి ఇవ్వనున్నట్టు సీసీఎస్ పాలకవర్గానికి స్పష్టం చేసింది. అలా ఈ సంవత్సరం మార్చిలో బ్యాంకుల నుంచి ప్రభుత్వ పూచీకత్తుతో రూ.600 కోట్ల అప్పు తెచ్చుకుంది. అందులో నుంచి రూ.200 కోట్లు సీసీఎస్‌కు చెల్లించాల్సిన తరుణంలో కోవిడ్ లాక్డౌన్ మొదలైంది. దీంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయి రోజువారీ టికెట్ ఆదాయం కూడా రాని పరిస్థితి ప్రారంభమైంది. సిబ్బందికి జీతాలు చెల్లించటం కూడా కష్టంగా మారటంతో అధికారులు ఆ రూ.600 కోట్ల అప్పు మొత్తాన్ని జీతాల ఖాతాకు బదలాయించటంతో అది కూడా వ్యయమైపోయింది. ఎన్నిసార్లు అడిగినా ఆర్టీసీ డబ్బులు చెల్లించకపోయేసరికి సీసీఎస్ పాలకవర్గం ఇటీవల హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది. దాన్ని స్వీకరించిన కోర్టు.. ఆర్టీసీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆర్టీసీ ఎండీ, సంస్థ ఫైనాన్ ్స అడ్వైజర్ (లేదా వారి న్యాయవాది) కోర్టుకు హాజరు కావాల్సిందిగా అందులో పేర్కొంది. ఆ మేరకు 6వ తేదీన వారు హాజరు కావాల్సి ఉంది. రెట్టింపు చెల్లించాలి.. గతేడాది సమ్మె సమయంలో ఆర్టీసీ రూ.200 కోట్లు సీసీఎస్‌కు చెల్లించాలని కోర్టు పేర్కొన్నప్పటికీ, ఇప్పుడా మొత్తాన్ని కనీసం రెట్టింపు చేయాలని సీసీఎస్ తాజాగా కోర్టును కోరింది. అప్పట్లో బకాయి మొత్తం రూ.400 కోట్లు ఉండగా, ఇప్పుడా మొత్తం రూ.800 కోట్లకు చేరింది. అందులో సగం మొత్తం అంటే రూ.400 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోర్టును కోరింది. ఇంత పెద్ద మొత్తం ఇప్పటికిప్పుడు చెల్లించటం ఆర్టీసీకి పెద్ద సమస్య. సొంత భూములు తనఖా పెట్టి అప్పు తేవడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు. లేదా ప్రభుత్వం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వెరసి అక్టోబర్ 6ను తలుచుకుంటూ ఆర్టీసీ హైరానా పడుతోంది. -
ఆర్టీసీ నిధులన్నీ హాంఫట్!
ఆయన ఆర్టీసీలో కండక్టర్. పదేళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ఐదేళ్ల క్రితం చనిపోయారు. పదవీ విరమణ సమయంలో వచ్చిన మొత్తాన్ని ఆర్టీసీకి అనుబంధంగా ఉండే సహకార పరపతి సంఘం (సీసీఎస్)లో డిపాజిట్ చేశారు. దానిపై రూ.10వేల వడ్డీ ప్రతినెలా ఆయన భార్యకు అందుతోంది. ఆమెకు అదే జీవనాధారం. ఇప్పుడు ఉన్నట్టుండి నిధులు లేవని వడ్డీ ఇవ్వటం మానేశారు. మరి ఆమెకు పూట గడిచేదెలా? డ్రైవర్‌గా పనిచేసి రిటైర్ అయిన ఓ వ్యక్తి కుటుంబంలో ఇద్దరికి కోవిడ్ సోకింది. చికిత్సకు భారీగా ఖర్చయింది. తాను సీసీఎస్‌లో దాచుకున్న డబ్బులోంచి అంత మొత్తం ఇవ్వాలని వేడుకున్నా.. నిధులు లేకపోవటంతో చిల్లిగవ్వ కూడా అందలేదు. సాక్షి, హైదరాబాద్: ఈ ఇద్దరి పరిస్థితే కాదు.. ఆర్టీసీలో పదవీ విరమణ చేసి, అప్పుడు వచ్చిన డబ్బును సీసీఎస్‌లో దాచుకున్న 15 వేల మంది దీనగాథ. ఉద్యోగుల నెల జీతాల్లోంచి కొంత మొత్తం మినహాయిస్తూ కూడిన మొత్తంతో సీసీఎస్ నడుస్తుంది. ఆ నిధుల్లోంచి ఉద్యోగులు కుటుంబ అవసరాలకు రుణాలు తీసుకుంటారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, సొంతింటి నిర్మాణం, ఆస్పత్రుల ఖర్చులు.. ఇలా అన్నింటికి అదే దిక్కు. ఇక రిటైర్ అయిన సమయంలో వచ్చిన మొత్తాన్ని చాలా మంది ఇందులోనే డిపాజిట్ చేసుకుంటారు. ఇక్కడ కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తారు. ఆ వడ్డీని పింఛన్ తరహాలో నెలనెలా పొందుతారు. ఇప్పటి వరకు వడ్డీ చెల్లింపులో జాప్యం లేకుండా సీసీఎస్ చెల్లిస్తూ వచ్చింది. కానీ, ఈ నెల వడ్డీ చెల్లించలేక చేతులెత్తేశారు. దీంతో ఈ వడ్డీనే ఆధారంగా చేసుకుని బతుకీడుస్తున్నవారు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వడ్డీ సంగతి దేవుడెరుగు, అసలు అందుతుందా అన్న భయం మొదలైంది. ఎందుకీ పరిస్థితి?.. ఉద్యోగి జీతంలో 7 శాతం మొత్తాన్ని ఆర్టీసీ.. సీసీఎస్‌కు చెల్లిస్తుంది. ఆ మొత్తాన్ని రుణాల రూపంలో ఉద్యోగులకు ఇచ్చి.. వచ్చే వడ్డీతో సీసీఎస్ పాలకవర్గం నిధిని పెంపు చేస్తుంది. అలాగే మిగతా మొత్తాన్ని వేరే సంస్థల్లో పెట్టుబడి పెట్టి ఆదాయాన్ని పొందుతుంది. రుణాలు తీసుకున్న ఉద్యోగుల కిస్తీలను ఆర్టీసీనే ప్రతినెలా వారి జీతం నుంచి మినహాయించి సీసీఎస్‌కు చెల్లిస్తుంది. అలా ప్రతినెలా దాదాపు రూ.40 కోట్లు సీసీఎస్‌కు జమవుతాయి. కానీ గత 19 నెలలుగా ఆర్టీసీ యాజమాన్యం సీసీఎస్‌కు జమ చేయడం మానేసింది. ఇక సీసీఎస్ నిధుల నుంచి రూ.740 కోట్లను ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. దానికి సంబంధించి రూ.140 కోట్ల వడ్డీ పేరుకుపోయింది. ఇక సీసీఎస్ నుంచి ఉద్యోగులు ఇప్పటికే తీసుకున్న రుణాల మొత్తం రూ.800 కోట్లు. వెరసి సీసీఎస్ వద్ద ప్రస్తుతం చిల్లి గవ్వ కూడా లేదు. ఫలితంగా ఆగస్టు నెలకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన వడ్డీ ఇవ్వలేకపోయింది. ఇదే విషయాన్ని పాలక వర్గం ఆర్టీసీ యాజమాన్యాన్ని అడిగితే, మా వద్ద డబ్బు లేదని చేతులెత్తేసింది. కరోనా వేళ బయట అప్పు పుట్టడం కష్టంగా ఉన్న సమయంలో సీసీఎస్ వడ్డీ రాక విశ్రాంత ఉద్యోగులు అల్లాడుతున్నారు. ఇదీ లెక్క.. విశ్రాంత ఉద్యోగులు దాచుకున్న మొత్తం డబ్బు: రూ.370 కోట్లు దీనిపై నెలకు చెల్లించాల్సిన వడ్డీ: రూ.4.5 కోట్లు డబ్బు దాచుకున్న రిటైర్ట్ ఉద్యోగుల సంఖ్య: 15,000 సీసీఎస్ వడ్డీ చెల్లింపు ఇలా... రిటైర్మెంట్ బెనిఫిట్ డబ్బులో 50 శాతానికి వడ్డీ: 14% మిగతా 50 శాతానికి వడ్డీ: 10% అదనంగా డిపాజిట్ చేస్తే దానిపై ఇచ్చే వడ్డీ: 8.5% ఈనెల సరుకులకు డబ్బుల్లేవ్ రంగారావు, విశ్రాంత ఉద్యోగి నా రిటైర్మెంట్ డబ్బంతా సీసీఎస్‌లో ఉంచాను. నెలకు రూ.13వేల వడ్డీ వస్తుంది. ఈ నెల వడ్డీ అందలేదు. దీంతో సరుకులు కొనేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాం. వెంటనే నా డిపాజిట్ డబ్బు మొత్తం ఇవ్వాలని కోరుతున్నా. మా అబ్బాయి వద్ద చేయి చాచాల్సి వచ్చింది చంద్రారెడ్డి, విశ్రాంత ఉద్యోగి సీసీఎస్ వడ్డీ డబ్బులతో ఇంతకాలం ఇల్లు గడిచింది. ఈ నెల వడ్డీ రాలేదు. డబ్బులు చాలక మా అబ్బాయి వద్ద చేయి చాచాల్సి వచ్చింది. 72 ఏళ్ల వయసులో నాకు ఎందుకీ ఇబ్బంది. వెంటనే ప్రభుత్వం ఆ డబ్బు చెల్లించేలా సహకరించాలి. -
సీఎం వైఎస్ జగన్‌పై పెరిగిన ప్రజామద్దతు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హవా మరింత పెరిగింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆ పార్టీ మళ్లీ భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించడం ఖాయం. ఏడాదిగా ముఖ్యమంత్రి అమలుచేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి తిరుగులేని మద్దతు లభిస్తోంది. వైఎస్ జగన్ ఏడాది పాలనపై ‘సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్’ (సీసీఎస్) జూన్ 2 నుంచి 8 వరకూ రాష్ట్రంలోని 13 జిల్లాలు.. 44 నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వేలో జగన్ నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు జేజేలు పలుకుతున్నట్లు వెల్లడైంది. మొత్తం 2,881 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. వీరిలో 55.2 శాతం గ్రామీణ, 44.8 శాతం మంది పట్టణ ప్రాంత ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 133–135 అసెంబ్లీ స్థానాలను గెల్చుకుంటుందని సీపీఎస్ తన సర్వేలో చెప్పింది. కాగా, సీపీఎస్ తాజా సర్వే ప్రకారం.. రాష్ట్రంలో 55.8 శాతం మంది ప్రజలు వైఎస్సార్సీపీ అధికారంలో ఉండాలని కోరుకుంటుండగా.. 38.3 శాతం మంది టీడీపీని కోరుకుంటున్నారు. బీజేపీ, జనసేన రెండు పార్టీలకూ కలిపి 5.3 శాతం ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఇంగ్లీషు మీడియంకు జైజై ఇక ఇంగ్లీషు మీడియంను ప్రవేశపెట్టాలన్న జగన్ సంకల్పానికి 71.6 శాతం మంది జైకొట్టారు. 19.5 శాతం మంది మాత్రమే విభేదించారు. (అయితే ఈ అంశంపై మాత్రం సర్వేను గత ఏడాది నవంబర్ 23 నుంచి డిసెంబర్ 12 మధ్య కాలంలో నిర్వహించారు). ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రుల్లో 95 శాతం మంది ఇంగ్లిష్ మీడియం కావాలన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు బాగున్నాయని 75.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని 63.9 శాతం.. నెరవేర్చడంలేదని 35 శాతం మంది చెప్పారు. అన్ని ప్రాంతాల్లోనూ అత్యధిక శాతం మంది ప్రజలు హామీలు అమలవుతున్నాయని అంటే.. ప్రతిపక్షాలు మాత్రం వైఎస్ జగన్ ఏడాది పాలన ఏమాత్రం బాగోలేదని విమర్శించాయి. సంక్షేమానికి అపూర్వ మద్దతు ఆర్థిక ఒడుదుడుకుల్లో కూడా సర్కారు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజల నుంచి అపూర్వమైన మద్దతు లభిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. జగన్ సంక్షేమ పథకాలు బాగున్నాయని రాష్ట్రంలో 65.3 శాతం ప్రజలు అభిప్రాయపడుతుండగా.. 33.7 శాతం మంది బాగోలేవన్నారు. అమరావతి ప్రాంతంలో సైతం సంక్షేమ పథకాలు బాగున్నాయని 59.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎస్ జగన్ పనితీరు బాగుందని 62.6% మంది ప్రజలు అభిప్రాయపడగా 36.1 శాతం మంది బాగోలేదన్నారు. ప్రతి అడుగులోనూ నాన్నే నాకు స్ఫూర్తి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘నాన్నే నా బలం. ప్రతి అడుగులోనూ ఆయనే నాకు స్ఫూర్తి. తండ్రులు పడే తపన.. వారు చేసే పోరాటం.. చూపించే ప్రేమ.. మద్దతు అంతా తమ పిల్లల అభివృద్ధిని కళ్లారా చూడ్డం కోసమే. తండ్రి మనకు మొట్టమొదటి మంచి స్నేహితుడు. మనలను తీర్చిదిద్దే వ్యక్తి.. మన హీరో.. అలాంటి వ్యక్తితో మనమెన్నో మధురమైన క్షణాలను పంచుకుంటాం. తండ్రులందరికీ తండ్రుల దినోత్సవ శుభాకాంక్షలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ట్వీట్ చేశారు. యోగాకు విశిష్టమైన శక్తి ఉంది ‘మనిషికి ప్రశాంతతను, బలాన్ని ఇచ్చే విశిష్టమైన శక్తి యోగాకు ఉంది. అది మనిషి శారీరక రుగ్మతలను మాన్పడమే కాదు.. ఒక స్ఫూర్తినిస్తుంది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తరాలుగా వస్తున్న ఈ పురాతనమైన ప్రక్రియను మన జీవితంలో అంతర్భాగంగా చేసుకుందామని ప్రతినబూనుదాం’ అని అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో ట్వీట్ చేశారు. -
హీరా కేసులో సుప్రీంకు సీసీఎస్!
సాక్షి, హైదరాబాద్: స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేసులో నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. స్కామ్‌కు సంబంధించిన కేసులు అన్నింటి నీ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌కు (ఎస్ఎఫ్ఐఓ) అప్పగించాల్సిందిగా ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అనుమతి మంజూరు చేయడంతో సీసీఎస్ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలుకు సన్నాహాలు చేస్తున్నారు. గతంలో కొన్ని చిన్నచిన్న వ్యాపారాలు చేసిన నౌహీరా షేక్ 2010–11లో హీరా ఇస్లామిక్ బిజినెస్ గ్రూప్ పేరుతో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేశారు. ఈ గ్రూప్‌లో ఉన్న 15 సంస్థలకూ నౌహీరా నే నేతృత్వం వహిస్తున్నారు. తన సంస్థల వ్యాపార లావాదేవీలకు సంబంధించి నౌహీరా షేక్ ఏ విభాగానికీ సరైన రికార్డులు సమరి్పంచలేదు. అయినప్పటికీ ఈమెపై నమోదైన కేసు దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ పోలీసులు అనేక మార్గాల్లో సమాచారం సేకరించారు. దీని ప్రకారం హీరా గ్రూప్ వార్షిక టర్నోవర్ ఆరేళ్లల్లో కొన్ని వందల రెట్లు పెరిగిందని గుర్తించారు. 2010–11లో రూ.27 లక్షలుగా ఉన్న గ్రూప్ టర్నోవర్... 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. ఇప్పటి వరకు దాదాపు రూ.6 వేల కోట్ల వ్యాపారం చేసినట్లు నివేదికలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి రికార్డులు ఎక్కడా లేవు. సర్కార్ గ్రీన్‌సిగ్నల్... హీరా గ్రూప్ భారీగా డిపాజిట్లు సేకరించి మోసం చేసినట్లు, ఆ నిధుల్ని సొంత అవసరాలకు వినియోగించుకున్నట్లు సీసీఎస్ పోలీసులు తేల్చారు. ఈ గ్రూప్‌పై మొత్తం 8 కేసులు నమోదు కాగా.. హీరా గ్రూప్ లావాదేవీలపై ఈడీకి సమాచారం ఇవ్వడంతో కేసు నమోదైంది. గతంలో దాఖలైన ఓ పిటి షన్ను విచారించిన రాష్ట్ర హైకోర్టు హీరా గ్రూప్‌పై నమోదైన కేసుల్ని ఎస్‌ఎఫ్‌ఐఓకు బదిలీ చేయాలం టూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసులను ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు చేయజాలదని, దర్యాప్తు పూర్తి చేసిన 7 కేసుల్లో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుందని సీసీఎస్ పోలీసులు చెప్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల్ని సుప్రీంకోర్టులో సవాల్‌కు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశారు. సర్కారు ఈ మేరకు సోమవారం అనుమతి మంజూరు చేసింది. -
సంక్రాంతికి ‘సహకారం’ లేనట్లేనా?
సాక్షి, అమరావతి బ్యూరో: ఆపదలో అక్కరకొస్తుందనే ఉద్దేశంతో ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు వారి సొంత నగదుతో ఏర్పాటు చేసుకున్న క్రెడిట్ కో–ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్)కి ఆర్టీసీ యాజమాన్యం వాత పెడుతోంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి కోత విధిస్తున్న నగదును సీసీఎస్‌కు చెల్లించకుండా సొంత అవసరాలకు వాడుకుంటోంది. ఫలితంగా ఉద్యోగులకు సకాలంలో సీసీఎస్ రుణాలు అందక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏం జరుగుతుందంటే.. ఆసియాలో అతిపెద్ద రవాణా రంగ సంస్థగా గుర్తింపు ఉన్న ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల మూలవేతనం నుంచి 8 శాతం కోత విధించి సీసీఎస్‌లో జమ చేస్తారు. ఇలా దశాబ్దాల కాలంగా సొసైటీ నిర్వహణ జరుగుతుంది. సుమారు రూ.1200 కోట్ల టర్నోవర్‌తో నడిచే ఈ సొసైటీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 54 వేల మందికి పైగా ఆర్టీసీ ఉద్యోగులు ఆర్థిక అవసరాలు తీర్చుకుంటున్నారు. కుటుంబ అవసరాలకోసం నగదు అవసరమైనప్పుడు దరఖాస్తు చేసుకుంటే గతంలో 24 గంటల లోపే రుణం మంజూరు చేసేవారు. దీంతో ఉద్యోగులు నెలవారీగా చెల్లింపులు చేసుకునేవారు.ఇలా సీసీఎస్ లాభాల బాటలో నడుస్తూ ఉద్యోగుల అవసరాలు తీరుస్తోంది. ఆర్టీసీ అప్పుల వల్ల.. నాలుగేళ్లుగా ఆర్టీసీ సంస్థ తీవ్ర నష్టాల్లో నడుస్తోంది. ప్రభుత్వ పరంగా సరైన ఆర్థిక తోడ్పాటు ఇవ్వకపోవడం, పెరుగుతున్న డీజిల్ ఖర్చులతో నష్టాల ఊబిలో కూరుకుపోతోంది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం సంస్థ అవసరాల కోసం ప్రతినెలా ఉద్యోగుల నుంచి సేకరించే నగదును సీసీఎస్‌కు జమచేయకుండా వాడుకుంటోంది. ఇప్పటికే సంస్థ దాదాపు రూ.215 కోట్లను సీసీఎస్‌కు జమ చేయలేదు. అలాగే దాదాపు రూ.7 కోట్లు వడ్డీ రూపంలో కూడా జమ చేయాల్సి ఉంది. మొత్తం మీద సీసీఎస్‌కు రూ.222 కోట్లు సంస్థ బకాయి పడింది. నష్టాల పాలవుతున్న సొసైటీ.. ఆర్టీసీ యాజమాన్యం ప్రతినెలా సీసీఎస్‌కు జమ చేయాల్సిన నగదు ఇవ్వకపోవడంతో ప్రతినెలా వడ్డీ రూపంలో రూ.1.5 కోట్లు నష్టం వాటిల్లుతోంది. దశాబ్దాల కాలంగా లాభాల్లో నడిచే సీసీఎస్ ఆర్టీసీ తీరు వల్ల నష్టాల బాట పడుతుందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పండుగ ఎలా జరుపుకోవాలి? ప్రతినెలా ఉద్యోగుల నుంచి సేకరించే నగదు జమకాక పోవడంతో నష్టాల్లో ఉన్న సీఎసీఎస్ ఉద్యోగుల సొంత అవసరాల కోసం రుణాలను సకాలంలో అందివ్వలేకపోతుంది. గతంలో దరఖాస్తు చేసుకుంటే 24 గంటల్లోపే రుణం సౌకర్యం కల్పించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో గతేడాది డిసెంబర్ 13 నుంచి రుణాలు ఇవ్వలేకపోయారు. దీంతో సంక్రాంతి పండుగ సమయంలో కుటుంబ అవసరాల కోసం రుణం కోసం దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులు సతమతమవుతున్నారు. సొసైటీని కాపాడుకునేందుకు ఉద్యమం సీసీఎస్‌కు ప్రతి నెలా జమ చేయాల్సిన నగదును యాజమాన్యం సొంత అవసరాలకోసం వాడుకుంటోంది. దీనివల్ల ఉద్యోగులకు రుణాలు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే యాజమాన్యం సీసీఎస్‌కు జమ చేయాల్సిన నగదు చెల్లించి నష్టాలు రాకుండా చూడాలి. లేని పక్షంలో సొసైటీని కాపాడుకునేందుకు ఉద్యమం చేపట్టాల్సి వస్తుంది. –పలిశెట్టి దామోదరరావు, ఈయూ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
జిల్లాల్లో సీసీఎస్‌లపై నజర్
సాక్షి, హైదరాబాద్: నేరాల నియంత్రణ, నేరస్థుల కదలికలపై నిఘాపెట్టడం, నేర రహస్యాల ఛేదనపై రాష్ట్ర పోలీసు శాఖ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా కొత్త జిల్లాల వారీగా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ల (సీసీఎస్)ను అందుబాటులోకి తేవాలను కుంటోంది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంతో పాటుగా నేరస్థులపై నిఘా పెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రతీ జిల్లాకు క్లూస్‌టీం: ఉమ్మడి జిల్లాల్లో బలంగా ఉన్న సీసీఎస్‌లను నూతన జిల్లాల్లోనూ ఆధునీకరించేందుకు క్లూస్ టీంలను రంగంలోకి దించనున్నారు. ఏదైనా హత్య జరిగితే ఉమ్మడి జిల్లానుంచే నూతన జిల్లాలకు క్లూస్ టీం రావాల్సి ఉంటోంది. దీనివల్ల కేసులో దర్యాప్తు ఆలస్యమవడం, అనుకున్న సమయంలో నిందితులను పట్టుకోవడం సాధ్యపడటంలేదు. ఈ నేపథ్యంలో జిల్లాకో క్లూస్ టీం, మొబైల్ ఫోరెన్సిక్ ల్యాబ్, సంబంధిత బృందాలను ఏర్పాటుచేస్తే దర్యాప్తు వేగవంతమవడంతో పాటు అప్పటికప్పుడు కేసులో పురోగతి చూపడం సాధ్యమవుతుంది. అదేవిధంగా నూతన జిల్లాల్లో ప్రతీ సీసీఎస్ ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ విభాగం ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. ఈమేరకు ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బందితో టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని గుర్తించి వారికి సైబర్ టెక్నాలజీ, ఆ నేరాల నియంత్రణ, ట్రాకింగ్ తదితరాలపై శిక్షణ ఇస్తున్నారు. కీలకమైన కేసుల్లో కాల్‌డేటా అనాలసిస్, లొకేషన్ ట్రాకింగ్, ఫేస్ రికగ్నైజేషన్ టూల్స్ విస్తృత వినియోగం, టీఎస్ కాప్ యాప్ డేటా బేస్ వినియోగంపై పూర్తిస్థాయి శిక్షణ ఇస్తున్నారు. దీనివల్ల మారుమూల జిల్లాల్లో కేసుల దర్యాప్తును కూడా పూర్తిస్థాయి టెక్నాలజీతో చేయాలని పోలీస్ శాఖ ఈ చర్యలు చేపట్టింది. కొత్త జిల్లాల్లోని సీసీఎస్‌లకు సీనియర్ ఇన్స్పెక్టర్లతో పాటు ముగ్గురు సబ్ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్లను కేటాయించనుంది. -
భార్యలకు బ్యాంకు ఖాతాలు తెరుస్తూ...
సాక్షి, సిటీబ్యూరో: నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు ఒడిశా నుంచి తీసుకువ్చన మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) కేసు నిందితుడు మీర్ షహీరుద్దీన్ గ్రీన్ రే ఇంటర్నేషనల్ లిమిటెడ్ (గ్రిల్) ముసుగులో దేశ వ్యాప్తంగా పాల్పడిన స్కామ్ రూ.1000 కోట్లు ఉంటుందని సీబీఐ నిర్థారించింది. గతేడాది భువనేశ్వర్‌కు చెందిన సీబీఐ యూనిట్ అతడిని అరెస్టు చేసిన విషయం విదితమే. 2015లో కాలాపత్తర్‌లో నమోదై, తమకు బదిలీ అయిన కేసు దర్యాప్తులో భాగంగానే సీసీఎస్ పోలీసులు మీర్ షహీరుద్దీన్తో పాటు సంస్థ డైరెక్టర్ అయూబ్‌లను నగరానికి తీసుకువచ్చారు. ఎంఎల్ఎం దందాతో పాటు చిట్‌ఫండ్ వ్యాపారంతో లక్షల మందికి టోకరా వేయడంతో వీరిపై దేశ వ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. షహీరుద్దీన్ ఇలా సంపాదించిన సొమ్మును హవాలా రూపంలో దుబాయ్, నైజీరియాలకు పంపినట్లు సీబీఐ అనుమానిస్తోంది. ఇతడికి అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతోనూ సంబంధాలు ఉన్నట్లు గతేడాది అరెస్టు సమయంలో ఆరోపించింది. ఏడాదిలో కేసుల నమోదు... ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, జలేశ్వర్‌కు చెందిన మీర్ షాహిరుద్దీన్ బాలాసోర్ కేంద్రంగా 2012లో గ్రిల్ సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు కైలాష్ సాహ, అయూబ్ సాహ, మీర్ తహీరుద్దీన్ డైరెక్టర్లుగా ఉన్నారు. నగరంలోని కాలాపత్తర్‌తో పాటు దేశ వ్యాప్తంగా 108 బ్రాంచ్‌లను ఏర్పాటు చేసిన ‘గ్రిల్’ తక్కువ ధరకు బంగారం పేరుతో ఎంఎల్ఎం, చిట్‌ఫండ్స్ వ్యాపారం నిర్వహించారు. వీటితో పాటు భారీగానూ ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించిన ఈ సంస్థ ఆ మొత్తాలను తిరిగి చెల్లించడంతో విఫలమైంది. దీంతో 2013 నుంచి గ్రిల్‌పై కేసులు నమోదు కావడం ప్రారంభమైంది. కాలాపత్తర్‌లో 2015లో కేసు రిజిస్టరై సీసీఎస్‌కు బదిలీ అయింది. పోలీసుల వేట ప్రారంభం కాగానే షాహిరుద్దీన్ తన ముగ్గురు భార్యలతో కలిసి నైజీరియాకు పారిపోయాడు. ఈ కేసులకు ఉన్న తీవ్రత దృష్ట్యా 2014 మేలో ఒడిశాలో నమోదైన కేసుల దర్యాప్తు బాధ్యతలను సీబీఐ చేపట్టింది. నైజీరియా నుంచి షాహిరుద్దీన్, అతడి భార్యలు దుబాయ్, సౌదీ అరేబియాలకు తిరుగుతూ అరెస్టు నుంచి తప్పించుకోగా, ముగ్గురు డైరెక్టర్లను సీబీఐ అరెస్టు చేసింది. షాహిరుద్దీన్పై లుక్ ఔట్ సర్క్యులర్స్ (ఎల్ఓసీ) జారీ చేసింది. మారుపేరుతో బంగ్లాదేశ్ పాస్‌పోర్ట్... గ్రిల్ ద్వారా సంపాదించిన సొమ్ముతో షాహిరుద్దీన్ నైజీరియాలో ఓ ఐరన్ ఓర్ మైన్‌ను లీజుకు తీసుకున్నట్లు సీబీఐ గుర్తించింది. చాలా ఏళ్లుగా విదేశాల్లో ఉన్న అతడిని హవాలా ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నాడనే అభియోగంపై నైజీరియాకు చెందిన అధికారిక సంస్థ స్టేట్ సెక్యూరిటీ సర్వీస్ (ఎస్ఎస్ఎస్) 2015 జూలై 15న అరెస్టు చేసింది. ఏడాదికి పైగా అక్కడి జైల్లో ఉన్న షాహిరుద్దీన్ బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ కేసు నేపథ్యంలో గత ఏడాది భారత్‌కు తిరిగి రావాలని భావించాడు. అయితే తనపై ఎల్ఓసీ జారీ అయి ఉండటంతో మరో దేశం నుంచి మా రు పాస్‌పోర్ట్ పొంది భారత్‌లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నైజీరియా నుంచి దుబాయ్ మీదుగా బంగ్లాదేశ్‌కు చేరుకున్న షాహిరుద్దీన్, అతడి ముగ్గురు భార్యలు అక్కడ కొన్ని రోజులు బస చేశారు. అక్కడే ఓ దళారి ద్వారా షాహిరుద్దీన్ తన పేరును హమీద్ హుస్సేన్‌గా పేర్కొంటూ మ రో పాస్‌పోర్ట్ పొందాడు. దీని ఆధారంగా పశ్చిమ బెంగాల్ మీదుగా భారత్‌లోకి అడుగుపెట్టాడు. భార్యలకు బ్యాంకు ఖాతాలు తెరుస్తూ... ఈ విషయాన్ని గుర్తించిన సీబీఐ షాహిరుద్దీన్‌ను పట్టుకునేందుకు నిఘా ముమ్మరం చేసింది. కోల్‌కతాలో కొన్ని రోజుల పాటు షెల్డర్ తీసుకున్న అతను తన భార్యల పేరుతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు గాను గత ఫిబ్రవరిలో రాజర్‌హత్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంక్‌కు వెళ్లాడు. దీనిపై సమాచారం అందడంతో సీబీఐ అధికారులు దాడి చేసి షాహిరుద్దీన్‌ను పట్టుకున్నారు. గ్రిల్ స్కామ్ నేపథ్యంలో ‘సెబీ’ గతేడాది సదరు సంస్థపై రూ.కోటి పెనాల్టీ విధించింది. ఎండీ, డైరెక్టర్లు సహా అంతా జైలులో ఉండటంతో ఈ మొత్తాన్ని ఎవరూ చెల్లించలేదు. సీబీఐ కంటే ముందే ఈ కేసును దర్యాప్తు చేసిన ఒడిశా పోలీసులు 13 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి భారీగా నగదు, స్థిరచరాస్తులు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్న కేసులో బాధితులుగా ఉన్న వారికి న్యాయం చేయాలంటే సీబీఐతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. -
ఐదేళ్ల సర్వీసు ఉంటే బదిలీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలు, పదవీ విరమణ వయస్సు పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) రద్దు వంటి ప్రధాన అంశాల్లో ప్రభుత్వం ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ విన్నవించింది. వాటి పై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోకపోతే పోరాట కార్యాచరణను ప్రకటిస్తామని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం జేఏసీ నేతలు రవీందర్‌రెడ్డి, మమత, మధుసూదన్‌రెడ్డి, రాజేందర్, సత్యనారాయణ తదితరులు సీఎస్‌ను సచివాలయంలో కలసి వినతిపత్రం సమర్పించారు. గతంలోనే ఉద్యోగులకు సంబంధించిన 18 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచిన జేఏసీ.. ఆయా అంశాల వారీ వివరాలను, వాటికి సంబంధించిన ఉత్తర్వుల కాపీలను సీఎస్‌కు మంగళవారం అందజేశారు. సీపీఎస్ రద్దుపై పట్టు ప్రధానంగా సీపీఎస్‌ను రద్దు చేయాలని జేఏసీ సభ్యులు సీఎస్‌ను కోరారు. సీపీఎస్‌లో చేరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించాలని, సీపీఎస్ నుంచి వైదొలుగుతున్నట్లు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని, పాత పెన్షన్ స్కీంను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. అలాగే ఐదేళ్ల సర్వీసున్న ప్రతి ఉద్యోగి బదిలీకి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్నట్లుగా 20 శాతం మందికే బదిలీలు కాకుండా అర్హత ఉన్న అందరి బదిలీలకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. రెండేళ్ల సర్వీసున్న వారికి కూడా బదిలీకి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ బదిలీలను కూడా పాత పది జిల్లాల ప్రాతిపదికనే చేపట్టాలని, ఇందుకు కౌన్సెలింగ్ విధానం తెచ్చి, ఉద్యోగుల అభిప్రాయాల మేరకు బదిలీలు చేయాలని సూచించారు. అలాగే పదోన్నతులు ఇవ్వాలని, ఇందుకు రెండేళ్ల సర్వీసును ప్రాతిపదికగా తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్లకు పెంచాలని, వెంటనే 11వ పీఆర్సీని ఏర్పాటు చేయాలని కోరారు. డిమాండ్లపై సీఎం కేసీఆర్‌తో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని సీఎస్ చెప్పినట్లు జేఏసీ నేతలు వివరించారు. -
‘మురుగు స్కామ్’లో 12 మంది కాంట్రాక్టర్ల అరెస్టు
- వీరిలో ఆరుగురు గతంలో వేరే కేసులో కటకటాల్లోకి - అభియోగపత్రాలు దాఖలుకు సన్నాహాలు చేస్తున్న సీసీఎస్ సాక్షి, హైదరాబాద్: నాలాల పూడికతీత ముసుగులో జీహెచ్ఎంసీలో చోటు చేసుకున్న భారీ స్కామ్ కేసుల్లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సోమవారం మరో 12 మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేశారు. ఈ కేసుల దర్యాప్తు చేపట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) అధికారులు మే, జూన్ నెలల్లో 18 మంది కాంట్రాక్టర్లు, 19 మంది ఏఈలను అరెస్టు చేశారు. తాజాగా అరెస్టయిన వారిలో ఆరుగురు గతంలో వేరే కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లివచ్చినవారు కాగా... మరో ఆరుగురు తొలిసారిగా కటాకటాల్లోకి చేరారు. దీంతో అరెస్టు అయిన కాంట్రాక్టర్ల సంఖ్య 24కు చేరింది. తాజాగా అరెస్టయిన కాంట్రాక్టర్లలో వరికుప్పల శ్రీనివాస్, సామ శ్రీనివాస్‌రెడ్డి, తాడూర్ రామ్చంద్రారెడ్డి, తూముకుంట వసంత్‌రెడ్డి, నాగిళ్ళ రాజశేఖర్‌రెడ్డి, వరికుప్పల కృష్ణ, ఇ.వేణుగోపాల్, గండికోట జనార్థన్, ఎక్కల విజయ్‌కుమార్, అనకర్ల యశ్వంత్, గండికోట రమేష్, గండికోట లక్ష్మణ్‌లు ఉన్నారు. వీరంతా స్థానికంగా వివిధ పార్టీలకు చెందిన వారని తెలుస్తోంది. మరోపక్క ఈ స్కామ్ కేసుల్లో నిందితులపై చార్జిషీట్లు దాఖలు చేయడానికి సీసీఎస్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అరెస్టు అయిన ఏఈలకు సంబంధించి ప్రాసిక్యూషన్ అనుమతి కోరాలని నిర్ణయించారు. -
డిపాజిట్‌దారులకు భారీ ఊరట!
- టీఎస్‌పీడీఎఫ్ చట్టంలో కీలక సవరణ - చార్జ్‌షీట్ దాఖలుకు ఇన్స్పెక్టర్లూ అర్హులే సాక్షి, హైదరాబాద్: బోగస్ ఆర్థిక సంస్థల్ని నమ్మి, డిపాజిట్లు పెట్టి నిండా మునిగిన డిపాజిట్‌దారులకు పెద్ద ఊరటే లభించింది. ఈ కేసుల దర్యాప్తులో ప్రధాన అడ్డంకిగా ఉన్న ‘చార్జ్‌షీట్ అధికారాల’సమస్యకు హైదరాబాద్ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసులు మార్గం కనిపెట్టారు. ఇన్స్పెక్టర్ కంటే తక్కువ స్థాయి కాని వారు అభియోగపత్రాలు దాఖలు చేయవచ్చంటూ తెలంగాణ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (టీఎస్‌పీడీఎఫ్) రూల్స్‌కు కీలక సవరణకు తీసుకువచ్చారు. సీసీఎస్ అధికారులు రూపొందించిన సవరణ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఇవి కేవలం నగరానికే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ వర్తిస్తాయని సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతి ‘సాక్షి’కి తెలిపారు. ఆస్తుల స్వాధీనానికి ఆస్కారం... ఆర్థికాంశాలు ముడిపడి ఉన్న ప్రతి కేసులోనూ టీఎస్‌పీడీఎఫ్ చట్టాన్ని ప్రయోగించడానికి ఆస్కారం లేదు. ఏఏ ఉదంతాల్లో అయితే నిందితులు బాధితుల నుంచి డిపాజిట్ల రూపంలో డబ్బు సేకరిస్తారో వాటిలో మాత్రమే ఈ చట్టాన్ని ప్రయోగించవచ్చు. మిగిలిన చట్టాల కింద నమోదైన కేసుల్లో నిందితుల్ని అరెస్టు చేసినప్పుడు వారి ఆస్తులు మొత్తాన్ని స్వాధీనం చేసుకునే ఆస్కారం లేదు. కేవలం ఆ నేరానికి సంబంధించిన డబ్బుతో సమీకరించుకున్న వాటినే సీజ్ చేయాలి. అయితే టీఎస్‌పీడీఎఫ్ చట్టం కింద నమోదైన కేసుల్లో మాత్రం నిందితులతో వారి సన్నిహితుల ఆస్తుల్ని సైతం స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు ఉంటుంది. ఇలా సీజ్ చేస్తున్న ఆస్తుల జాబితాను ప్రభుత్వానికి పంపడం ద్వారా ఆమోదం పొందాల్సి ఉంటుంది. స్వాధీనం చేసుకున్న ఆస్తుల్ని పోలీసు విభాగం న్యాయస్థానానికి అప్పగిస్తుంది. నిందితులపై నేరం రుజువై, దోషులుగా తేలిన తర్వాత వేలం వేసి, అలా వచ్చిన డబ్బును బాధితులకు పంచే ఆస్కారం ఉంటుంది. సవరణ ప్రతిపాదించిన సీసీఎస్... గతంలో ఈ తరహా కేసుల్లో పోలీసు కమిషనర్/జిల్లా కలెక్టర్ మాత్రమే అభియోగపత్రాలు దాఖలు చేసే ఆస్కారం ఉంది. అలా కాకుండా దర్యాప్తు అధికారులు అభియోగపత్రాలు దాఖలు చేస్తే నిబంధనలకు విరుద్ధం కావడంతో న్యాయస్థానాల్లో వీగిపోతున్నాయి. దీంతో ఏళ్లుగా అనేక కేసులు పెండింగ్‌లో ఉండిపోయి బాధితులకు ఊరట లభించట్లేదు. ఒక్క సీసీఎస్‌లోనే దాదాపు 50 కేసులో ఈ కారణంగా పెండింగ్‌లో ఉండిపోయాయి. నగర నేర పరిశోధన విభాగం డీసీపీగా అవినాష్ మహంతి బాధ్యతలు స్వీకరించిన తరువాత టీఎస్‌పీడీఎఫ్ చట్టం కింద నమోదైన కేసులు అనేకం పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీయగా... అభియోగపత్రాలు దాఖలు అధికారం అంశం బయటపడింది. దీంతో ఇన్స్పెక్టర్ కంటే తక్కువ స్థాయి కాని అధికారి ఎవరైనా అధీకృతులే అని, వారు అభియోగపత్రాలు దాఖలు చేయవచ్చంటూ సవరణకు ప్రతిపాదించారు. దీనికి ఆమోదముద్ర వేసిన ప్రభుత్వం గత నెల 24న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో సీసీఎస్‌లో ఉన్న టీఎస్‌పీడీఎఫ్ కేసుల్లో అభియోగపత్రాలు దాఖలుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. -
ఈయూ గెలుపు
ముగిసిన ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలు – ఈయూ, మిత్రులకు 11, ఎన్ఎంయూకు 6 స్థానాలు – గుర్తింపు ఎన్నికల తరహాలో హోరాహోరీ – 12 డిపోల్లో 17 డెలిగేట్స్ పోస్టులు – ప్రశాతంగా ముసిగిన పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థ కర్నూలు రీజియన్‌లో నిర్వహించిన క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ విజయకేతనం ఎగురవేసింది. మిత్ర సంఘాలతో కలిసి పోటీ చేసి అధిక స్థానాల్లో గెలుపొందింది. రాష్ట్రంలో గుర్తింపులోని నేషనల్ మజ్దూర్ యూనియన్‌కు పరాభవం ఎదురవడంతో నిరాశ తప్పలేదు. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగింది. జిల్లా వ్యాప్తంగా 12 డిపోల్లో 17 డెలిగేట్ స్థానాలకు పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ మిత్ర సంఘ సభ్యులతో కలిసి పోటీకి దిగి 11 స్థానాల్లో గెలువగా నేషనల్ మజ్దూర్ యూనియన్ 6 స్థానాలతో సరిపెట్టుకుంది. గెలుపు కోసం డబ్బును వెదజల్లి మద్యాన్ని పారించిన తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం కార్మిక పరిషత్ ఒక్క చోట కూడా గెలవలేదు. ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ సొమ్మును దాచుకోవడంతో పాటు రుణాలు పొందే వీలుతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ల కాలపరిమితి శుక్రవారంతో ముగిసింది. దీంతో కొత్త ప్రతినిధులను ఎన్నుకునే క్రమంలో నవంబర్ 16న ఎన్నికలకు నోటిఫికేషన్, షెడ్యూల్‌ను సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మాలకొండయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఎన్నికైన డెలిగేట్లు ఐదేళ్లపాటు కొనసాగుతారు. ఈయూ ఆధిపత్యం గుర్తింపు సంఘం ఎన్నికలను తలపించేలా జరిగిన ఈ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈయూకు 9 స్థానాలు రాగా మిత్ర సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు రెండు స్థానాలొచ్చాయి. ఎన్ఎంయూ మాత్రం 6 స్థానాలతో సరిపెట్టుకుంది. ఈ సంఘానికి కంచుకోటలా ఉన్న కర్నూలు–1 డిపోను సైతం కోల్పోయింది. డెలిగేట్ల ఎన్నికలు గుర్తింపు ఎన్నికల తరహాలో బ్యాలెట్ పేపరులో 'గుర్తు'కు బదులుగా వరుస సంఖ్య, అభ్యర్థి పేరు మీదుగానే జరిగాయి. ఓటర్లు ఎన్ఎంయూ వైఫల్యాలను ఎండగడుతూ ఈయూకు పెద్దపీట వేశారు. కర్నూలు రీజియన్(జిల్లా)లో 12డిపోలు ఉండగా ఇందులో 17 డిలిగేట్ పోస్టులు ఉన్నాయి. కర్నూలు–1డిపోతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, కర్నూలు–2 డిపోల్లో రెండేసి పోస్టులుండగా ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, బనగానపల్లె, పత్తికొండ, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ డిపోలకు ఒక్కో పోస్టు ఉంటుంది. ఈ స్థానాల్లో పోటీకి 35 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నేషనల్ మజ్దూర్ యూనియన్ 17 డెలిగేట్ పోస్టులకు ఒంటరిగా పోటీ చేస్తుండగా.. ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సహకారంతో 17 మంది అభ్యర్థులను బరిలో దించింది. మరో 20 మంది ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. గెలిచిన అభ్యర్థులు త్వరలో రాష్ట్ర సొసైటీ డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. గెలుపు సంఘాల సంబరాలు సీసీఎస్ ఎన్నికల్లో గెలిచి సంఘాలు ఆయా డిపోల వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించాయి. కర్నూలులోని కొత్త బస్టాండ్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. పారని 'పచ్చ' పాచిక సీసీఎస్ ఎన్నికల్లో తమ అనుబంధ సంఘాన్ని గెలిపించుకునేందుకు తెలుగుదేశం తమ్ముళ్లు చేసిన కుట్రలు ఫలించలేదు. గురువారం రాత్రి ప్రలోభాలకు తెరలేపి డ్రైవర్, కండక్టర్లతో పాటు వివిధ కార్మికులు, ఉద్యోగులను రహస్యంగా కలసి డబ్బు పంపిణీ చేసినట్లు సమాచారం. ఓటరుకు రూ.2 వేల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మద్యం బాటిళ్లు, బిర్యానీ పాకెట్లు అందించి తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేక ఆ సంఘం జిల్లా వ్యాప్తంగా ఘోరంగా ఓడిపోయింది. -
ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలకు సర్వం సిద్ధం
నేడు ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు కదిరి : ఆర్టీసీలో సీసీఎస్ (క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ) డెలిగేట్స్ స్థానాలకు శుక్రవారం నిర్వహిస్తున్న ఎన్నికలకు సబంధించి గురువారం జిల్లాలోని అన్ని డిపోల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు. కడప జోన్ పరిధిలో అనంతపురం, కడప, కర్నూలు రీజియన్లు వస్తాయి. అనంతపురం రీజియన్‌లో 18 స్థానాలకు, కడప 19, కర్నూలు రీజియన్‌లో 17 స్థానాలకు కలిపి మొత్తం 54 సీసీఎస్ డెలిగేట్ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 దాకా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ అనంతరం ఫ్రీ బ్యాలెట్ ఓట్లను వాటితో కలిపి లెక్కిస్తారు. పోలింగ్ కేంద్రలోకి పోటీ చేస్తున్న అభ్యర్థులతో పాటు ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తారు. పోలింగ్ బూత్‌లలోకి సెల్ఫోన్లు, పెన్నులు తీసుకెళ్లడం, యూనియన్ బ్యాడ్జీలు ధరించి వెళ్లడాన్ని నిషేధించారు. ఓటు కూడా రహస్య బ్యాలెట్ పద్దతిన వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులు అన్ని డిపోల వద్ద ఇప్పటికే గట్టి బందోబస్త్ చర్యలు చేపట్టారు. పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఓట్ల లెక్కింపు ప్రారంభించి, రాత్రి 8 గంటలకల్లా అన్ని డిపోల ఫలితాలు వెలువడవచ్చు. ఫలితాల వివరాలను క్రెడిట్ కో ఆపరేటివ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్వీ రాఘవరెడ్డికి ఈ నెల 17న పంపుతారు. ఈ నెల 30న ఎంసీ మెంబర్ల ఎంపిక జరగనుంది. యూనియన్ల బలపరీక్ష... రీజియన్‌లోని 13 డిపోల్లో సీసీఎస్ జరిగే ఎన్నికల్లో నాలుగు యూనియన్ల మద్దతుదారులు బరిలో దిగుతున్నారు. గుర్తింపు ఎన్‌ఎంయూతో పాటు వైఎస్సార్ మజ్దూర్ యూనియన్, కార్మిక పరిషత్ తమ బలాన్ని నిరూపించుకోనున్నారు. ఎన్నికల ప్రొసీడింగ్ అధికారిగా ఆయా డిపో మేనేజర్లు, పోలింగ్ బూత్ అధికారులుగా సూపర్వైజర్లు వ్యవహరిస్తారని పీఓ ఎస్పీ కృష్ణవేణి తెలియజేశారు. డిపోల్లో రెండు బూత్‌లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఓ బూత్‌లో డ్రైవర్లు, కండక్టర్లు, మరో బూత్‌లో గ్యారేజ్ సిబ్బంది ఓటును వినియోగించుకుంటారన్నారు. జిల్లాలోని 13 డిపోల్లో 89 మంది గురువారం పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకున్నారు. -
సీసీఎస్ ఎన్నికల నామినేషన్లకు నేడు చివరి రోజు
– 9న దరఖాస్తుల పరిశీలన - అదే రోజు అభ్యర్థుల తుది జాబితా విడుదల కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణ సంస్థలో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) ఎన్నికల నామినేషన్లకు గురువారం గడువు ముగియనుంది. ఈనెల 2న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న సీసీఎస్ డైరెక్టర్ల కాలపరిమితి 16వ తేదీ నాటికి ముగియనుండడంతో అదే రోజు కొత్త ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుపనున్నారు. ఈ ఎన్నికల్లో గుర్తింపు కలిగిన నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒంటరిగా పోటీ చేస్తుండగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సోదర సంఘం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మద్దతులో రంగంలోకి దిగుతోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు 8వ తేదీ సాయంత్రం వరకు అవకాశం ఉంటుంది. 9న నామినేషన్ ఫారాల పరిశీలన అనంతరం అనర్హుల జాబితా అదే రోజు విడుదల చేస్తారు. ఉపసంహరణకు 13 వరకు గడువు ఉండగా బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారు. 16న ఉదయం నంచి సాయంత్రం వరకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు. -
ఆర్టీసీలో ఎన్నికల సందడి
సాక్షి,అమరావతి బ్యూరో : రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఎన్నికల సందడి మొదలయింది. గుర్తింపు ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారిగా ఆర్టీసీలో కో–ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 16న జరిగే ఎన్ని కలకు నామినేషన్ల పర్వం ఊపందుకుంది. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్ల దాఖలు, 9న పరిశీలన, 10 నుంచి 13వ తేదీ వరకు ఉపసంహరణ జరుగు తుంది. ఈ ఎన్నికల్లో విజయం కోసం యూనియ¯ŒS నేతలు వ్యూహప్రతివ్యూహా లతో ఎన్నికల వేడి పెంచారు. ఐదేâýæ్లకోసారి జరిగే ఈ ఎన్నికల్లో ఈయూ, ఎస్‌డబ్యూఎఫ్ మిత్రపక్షంగా, ఎ¯ŒSఎంయూ యూనియ¯ŒS స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నాయి. టీఎ¯ŒSటీయూసీ అనుబంధ కార్మిక సంఘం కార్మికపరిషత్ మాత్రం అటూ ఈయూతో, ఇటు ఎ¯ŒSఎంయూలతో అవసరమైన ప్రాతిపదికన పొత్తులు పెట్టుకుంటోంది. ఈ ఎన్నికలను ఆ యూనియన్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 127 డిపోలు, 5 వర్క్ షాపులు, ఒక అడ్మినిసే్ట్రటివ్ ఆఫీసు పరిధిలోని 245 కేంద్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్ల పరిధిలో ఎన్నికల వేడి పుంజుకొంది. 58 మంది డెలిగేట్స్ ఎన్నిక కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి రీజియన్ల పరిధిలో సీసీఎస్ సభ్యులుగా ఉన్న 14,337 మంది ఈ ఎన్నికల్లో పాల్గొని 58మంది డెలిగేట్స్‌ను ఎన్నుకోవాలి. అమరావతి పరిధిలో ఉన్న కృష్ణా రీజియ¯ŒS పరిధిలో 26 మంది, గుం టూరు రీజియ¯ŒS పరిధిలో 22 మందిని డెలిగేట్స్‌ను ఎన్నుకోవాలి. విజయవాడ జో¯ŒS పరిధిలో ఉన్న పశ్చిమ గోదావరి రీజియ¯ŒS పరిధిలో 10 మందిని ఎన్నుకోవాలి. ఈ డెలిగేట్స్ అంతా కలిసి 9 మందితో కూడిన పాలకవర్గాన్ని ఈనెల 30వ తేదీన ఎన్నుకుంటారు. ప్రస్తుతం ఎంప్లాయీస్ యూనియ¯ŒS (ఈయూ) నేతృత్వంలో పాలకమండలి పనిచే స్తోంది. ఆర్టీసీ కార్మికుల కోసం పనిచేసే ఈ సొసైటీ వెయ్యికోట్ల రూపాయల టర్నోవర్‌తో పనిచేస్తుంది. పూర్తి స్థాయి ఆర్థిక లావాదేవీలు ముడిపడి ఉన్న కో– ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (సీసీఎస్) ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు వ్యక్తిగత, విద్య, ఇంటి నిర్మాణం, తదితర అవసరాలకు అవసరమైన రుణాలు అందిస్తారు. ఆ రెండు యూనియన్ల మధ్యే పోటీ ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికల్లో ఈయూ, ఎస్‌డబ్యూఎఫ్, కార్మిక పరిషత్‌తో కూటమికట్టి బరిలోకి దిగుతున్నాయి. గత గుర్తింపు ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గుర్తింపు తెచ్చుకున్న ఎ¯ŒSఎంయూ స్వతంత్రంగా బరిలోకి దిగుతోంది. అటు కూటమితో ఎలాగైనా సీసీఎస్‌ను కైవసం చేసుకోవాలని ఈయూ ఉవ్విళ్లూరుతోంది. 31 నామినేషన్లు దాఖలు కృష్ణా రీజయ¯ŒS పరిధిలో 26 మంది డెలిగేట్స్ ఎన్నికకు రెండు రోజులుగా 17 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో ఎ¯ŒSఎంయూ తరుఫున 12, ఎంప్లాయీస్ యూనియ¯ŒS తరుఫున 5 నామినేషన్లు వేశారు. గుంటూరు రీజియ¯ŒS పరిధిలో 22మంది డెలిగేట్స్‌కు 14 నామినేషన్లు దాఖలుచేశారు. ఎ¯ŒSఎంయూ నుంచి 10, ఎంప్లాయీస్ యూనియ¯ŒS నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. -
సీసీఎస్‌లో టీఎంయూ హవా
ఆదిలాబాద్ కల్చరల్ : ఆర్టీసీ సీసీఎస్(క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ) ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ డెలిగేట్ల హవా కనిపించింది. తెలంగాణ మజ్దూర్ యూనియన్ నుంచి ట్రాఫికల్ నుంచి ఎస్.విలాస్, జీఆర్ మౌళీ, రవీందర్ పోటీ పడ్డారు. స్వతంత్ర అభ్యర్థిగా మనోహన్ పోటీ చేశారు. ఎస్‌డబ్ల్యూఎఫ్ నుంచి ఎస్.ఊశన్న, ఈయూ నుంచి సత్యనారాయణ, హిరాజీ, సురేందర్, మెరుుంటనెన్స్కు టీఎంయూ నుంచి ఊరే ఆశన్న, ఈయూ నుంచి గట్టయ్య పోటీ చేశారు. కాగా 543 ఓట్లు ట్రాఫికల్కు ఉండగా, మెంటనెన్స్ ఓట్లు 98 ఉన్నాయి. ఈ ఎన్నిలను ఆర్టీసీ డీఎం సాయన్న ప్రొసిడింగ్ ఆఫీసర్‌గా, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ రాజెందర్, ట్రాఫికల్ ఆఫీసర్ జానాబాయిలు ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. సీసీఎస్‌లో ట్రాఫికల్ హవా... ఆర్టీసీ సీసీఎస్ ప్రతినిధుల ఎన్నికల్లో టీఎంయూ మరోసారి హవా నిరూపించుకుంది. టీఎంయూ నుంచి ట్రాఫికల్లో ముగ్గురు పోటీ చేయగా టీఎంయూ నుంచి ఎస్.విలాస్ 390 ఓట్లు, జీఆర్ మౌళీ 382 ఓట్లు, స్వతంత్య్ర అభ్యర్థి 286 ఓట్లతో విజేతలుగా నిలిచారు. టీఎంయూ అభ్యర్థి 235 ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఈయూ అభ్యర్థి నారాయణ 133 ఓట్లతో పరాజయం పాలయ్యారు. కాగా ఎస్‌డబ్ల్యూఎఫ్‌కు ఊశన్నకు 71 ఓట్లు, ఈయూ నాయకుడు హిరాజీకి 11 ఓట్లు, సురేందర్‌కు 9 ఓట్లు పొలయ్యాయి. గ్యారెజ్ సెక్షన్ మెరుుంటనెన్స్ విభాగంలో టీఎంయూ అభ్యర్థి ఊరే ఆశన్న 82 ఓట్ల మెజార్జీతో ఘనవిజయం సాదించారు. కాగా పోటీ అభ్యర్థులు ఇద్దరు కె.గట్టయ్య(ఈయూ) 13 ఓట్లు, బి.నాందేవ్(ఎస్‌డబ్ల్యూఎఫ్) 0 ఓట్లతో పరాజయం పాలయ్యారు. దీంతో టీఎంయూ విజయకేతనం ఎగురవేసింది. స్వతంత్ర అభ్యర్థి గెలుపు ఉట్నూర్ : ఉట్నూర్ ఆర్టీసీ బస్సు డిపో సహకారం సంఘం ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బుధవారం డిపో ఆవరణలో సహకార సంఘం ఎన్నికలు నిర్వహించగా సంతోష్‌కుమార్, సి.సతీష్, విద్యాసాగర్, సాయబ్రావ్, ధర్మేందర్, నాందెవ్ బరిలోకి దిగారు. డిపోలో మొత్తం 158 ఓట్లు ఉండగా 150 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సి.సతీష్ 64 ఓట్లు సాధించి సమీప అభ్యర్థి తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు చెందిన సంతోష్‌కుమార్‌పై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ బస్సు డిపోలో విధులు నిర్వర్తిస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారంపై దృషి సారిస్తానన్నారు. తనను గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలకు మోగిన నగారా
డిసెంబర్ 16న క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు – 2 నుంచి నామినేషన్లు.. ఉపసంహరణకు 13న అవకాశం – 12 డిపోల్లో 17 డెలిగేట్ పోస్టులు కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణా సంస్థలో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) ఎన్నికల నిర్వహణకు నగారా మోగింది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు తమ సొమ్మును దాచుకోవడంతో పాటు రుణాలు పొందే వీలుతో ఈ సొసైటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న డైరెక్టర్ల కాలపరిమితి డిసెంబర్ 16వ తేదీన పూర్తి కానుండడంతో అదే రోజు కొత్త ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికైన డెలిగేట్లు ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. సొసైటీలో సభ్యులను చేర్పించడం, డిపాజిట్ల సేకరణ, రుణాల మంజూరు ప్రక్రియను, ఉద్యోగుల సందేహాలను తీర్చడం, అవసరమైన సలహాలు ఇవ్వడం ప్రతినిధుల విధిగా ఉంటుంది. ఇదిలాఉంటే ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాల్సిన బాధ్యత డిపో మేనేజర్లదేనని నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.మధుసూదన్ ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు. నోటిఫికేషన్ ఇలా.. సీసీఎస్ ఎన్నికల నిర్వహణకు ఈనెల 16న నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ సంస్థ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కార్మిక శాఖతో సంబంధం లేకుండా సంబంధిత డిపో మేనేజర్ ఈ ఎన్నికలను పర్యవేక్షిస్తారు. సభ్యులు, ఇతర అంశాలపై అభ్యంతరాలు ఉంటే ఈనెల 25వ తేదీలోపు తెలియజేయాలి. డిపోకు ఒక సీసీఎస్ ప్రతినిధి(డెలిగేట్) పోస్టు ఉంటుంది. పోటీ చేసేందుకు డిసెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. పోటీ చేసే వారిలో అనర్హులు ఉంటే 9న జాబితా విడుదల చేస్తారు. 13న ఉపసంహరణ(విత్‌డ్రా)కు అవకాశం ఉంటుంది. తుది జాబితాను అదే రోజు విడుదల చేస్తారు. 16వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను విడుదల చేస్తారు. 12డిపోలు.. 17 మంది డెలిగేట్లు కర్నూలు రీజియన్(జిల్లా)లో 12 డిపోలు ఉండగా.. 17 డెలిగేట్ పోస్టులు ఉన్నాయి. కర్నూలు–1 డిపోతో పాటు ఆదోని, నంద్యాల, ఎమ్మిగనూరు, కర్నూలు–2 డిపోల్లో రెండేసి పోస్టులు ఉంటాయి. ఆత్మకూరు, నందికొట్కూరు, డోన్, బనగానపల్లె, పత్తికొండ, కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ డిపోలకు ఒక్కో పోస్టు ఉంటుంది. ఈ స్థానాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థులకు రాష్ట్ర సొసైటీ డైరెక్టర్లను ఎంపిక చేసే వీలుంటుంది. -
పనితీరు మార్చుకోండి
- సీసీఎస్ పోలీసులపై ఎస్పీ ఆకె రవికృష్ణ ఆగ్రహం కర్నూలు: ‘సీసీఎస్ అంటే పునరావాస కేంద్రం కాదు... మీ పనితీరు బాగా లేదు... అనుకున్న ఫలితాలు సాధించడం లేదు.. ఎవరెవరు ఏమి పని చేస్తున్నారో నాకు తెలియాలి. కొంతమంది విధులకే రావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా అయితే శాఖాపరమైన చర్యలు తప్పవు’ అని ఎస్పీ ఆకె రవికృష్ణ సీసీఎస్ సిబ్బందిని తీవ్రంగా హెచ్చరించారు. బుధవారం ఉదయం ఆయన నేర పరిశోధన విభాగాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాపర్టీ, డెకాయిటీ, సైబర్ నేరాలను విభజించి వాటికి బాధ్యులుగా నియమించుకొని ఫలితాలను సాధించాలని ఆదేశించారు. చురుగ్గా పనిచేస్తూ దొంగతనాలను అరికట్టాలన్నారు. పెండింగ్ కేసులు, సై»బర్ నేరాలు, వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాలను, స్టేషన్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. ఇటీవల కాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని నేరగాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచి చోరీలను అరికట్టాలని సూచించారు. నేరాల వారీగా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, టాస్క్‌లను ఏర్పాటు చేసుకొని వాటిని ఛేదించాలని సూచించారు. సీసీఎస్ స్టేషన్‌ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. నేరగాళ్లపై నిరంతరం నిఘా ఉంచి నేరాల సంఖ్యను తగ్గించడానికి కృషి చేయాలన్నారు. సై»బర్ నేరాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన ఛేదించాలన్నారు. ఈ వివరాలను వారానికోసారి నివేదిక రూపంలో డీఎస్పీకి అందించాలన్నారు. నెలకోసారి సీసీఎస్‌ను తనిఖీ చేస్తానని హెచ్చరించారు. సీఐలు సురేంద్రబాబు, లక్ష్మయ్య, చక్రవర్తి, శ్రీనివాసులు, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లతో సమావేశమై నేరాలపై చర్చించారు. విధి నిర్వహణలో తలెత్తుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. -
చొరబాట్లకు సిద్ధంగా 100 మంది మిలిటెంట్లు
♦ సీసీఎస్‌కు వివరించిన దోవల్ ♦ శ్రీనగర్‌లో సుఖోయ్‌లు సిద్ధం న్యూఢిల్లీ: సర్జికల్ దాడులకు ప్రతీకారంగా భారత ఆర్మీపై, వివిధ ప్రాంతాల్లో దాడులు చేసేందుకు పాక్ ప్రయత్నిస్తోందని.. నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడేందుకు 100 మంది మిలిటెంట్లను సిద్ధం చేసిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) భేటీలో ఈ విషయాన్ని వెల్లడించారు. సర్జికల్ దాడుల తర్వాత ఎల్వోసీలో ఉగ్ర శిబిరాలకు పాక్ సైనికులు కాపలా కాస్తున్నారని.. అలాంటి 12 శిబిరాలను గుర్తించామన్నారు. శీతాకాలం లోపే వీలైనంత ఎక్కువ చొరబాట్లకు పాక్ యోచిస్తోందన్నారు. భేటీలో హోం మంత్రి రాజ్‌నాథ్, రక్షణ మంత్రి పరీకర్, విదేశాంగ మంత్రి సుష్మ పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, పాకిస్తాన్‌కు గట్టిగా జవాబిచ్చేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. మిగ్ విమానాల ఎయిర్‌బేస్ అయినశ్రీనగర్ ఎయిర్‌పోర్ట్‌లో సుఖోయ్ విమానాలను భారత్ సిద్ధంగా ఉంచింది. -
సీపీఎస్ విధానం రద్దుకు సహకరించండి
జగన్‌కు సీపీఎస్ ఉద్యోగుల వినతి గుత్తి రూరల్ : ఉపాధ్యాయులకు గుదిబండలా మారిన సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్) విధానాన్ని రద్దు చేసేందుకు తమకు బాసటగా నిలవాలని సీపీఎస్ఎస్ఈఏ ప్రభుత్వ ఉపాధ్యాయుల నాయకులు ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్.జగన్మోహన్రెడ్డికి వినతి పత్రం అందజేశారు. రైతు భరోసా యాత్రలో భాగంగా పెద్దవడుగూరు మండలం ది మ్మగుడికి వె ళ్తున్న జగన్‌ను జిల్లా సరిహద్దు ఊ బిచెర్ల వద్ద గుత్తి, పెద్దవడుగూరు వైఎస్సార్టీఫ్ నాయకులతో కలిసి వినతి పత్రం అందజేశారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఓబుళపతి, ఉపాధ్యక్షుడు హరినాథ్ ఆధ్వర్యంలో సీపీఎస్ ఉద్యోగుల సంఘం గుత్తి మం డల అధ్యక్షుడు బి.నాగరాజు, ప్రధాన కార్యదర్శి మహబూబ్ ఉల్లా, ఉపాధ్యక్షులు జయకుమార్, పెద్దవడుగూరు మండల ప్రధాన కార్యదర్శి ఇలియాజ్‌లు సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగులకు జరిగే నష్టాలను జగన్‌కు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2004 నుంచి అమలు చేయుచున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ సిస్టమ్ వల్ల ఉద్యోగులకు భవిష్యత్‌లో ఎలాం టి ఆర్థిక భరోసా లేకుండా పోతుందన్నారు. సీపీఎస్ అమలు వల్ల పెన్షన్, గ్రాట్యుటీ, కమ్యూడేషన్ సదుపాయాలు లేకపోవడం వలన ఉద్యోగులు ఇబ్బందులకు గురి అవుతారన్నారు. ఒక వేళ సీపీఎస్ ఉద్యోగి మరణిస్తే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం అందదని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. 30 ఏళ్ల పాటు ప్రభుత్వానికి సేవ చేసి పదవీవిరమణ చేసినా ఒక్క రూపాయి కూడా ఉద్యోగికి అందదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సానుకూలంగా స్పం దించిన వైఎస్. జగన్ వచ్చే అ సెంబ్లీ సమావేశాల్లో ఈ సమస్యను ప్రస్తావించి ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా పోరాడుతానని హామీ ఇ చ్చారు. యూనియన్ నాయకులు దాదా ఖలందర్, కార్యదర్శులు ఓబుళేసు, చంద్రశేఖర్‌రెడ్డి నూర్ మహమ్మద్, రాఘవేంద్ర, కష్ణారెడ్డి, రా జ్‌కుమార్, మల్లేష్, రామచంద్ర, నారాయణస్వామి, పాల్గొన్నారు. -
కార్మిక నిధిని కొల్లగొట్టిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్: జీతాలు చెల్లించలేని స్థితిలో ఉన్న ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల సంక్షేమ నిధులను సొంతానికి వినియోగించుకుంది. దాదాపు రూ.60 కోట్లు మింగేసింది. దీంతో రుణాలు లేక ఆర్టీసీ కార్మికులు అల్లాడుతున్నారు. పిల్లల చదువులు, పెళ్లిళ్లు, ఆరోగ్య అవసరాలు, ఇంటి నిర్మాణం... ఇలా అతిముఖ్యమైన అవసరాలకు రుణాలు మంజూరు చేయాలంటూ పెట్టుకున్న నాలుగువేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఆదాయాన్ని మించి ఖర్చు వచ్చిపడటం, ఉద్యోగుల ఫిట్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం తనవంతుగా చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవ టంతో ఆర్టీసీ యాజమాన్యానికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. దీంతో కనిపించిన నిధులనల్లా వాడేసుకుంటోంది. ఆ క్రమంలో ఆర్టీసీ కార్మికుల కుటుంబ అవసరాలకు రుణాలు అందించే కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) నిధులను యాజమాన్యం సొంతానికి వినియోగించుకుంది. ఇదీ సంగతి: ఆర్టీసీ యాజమాన్యం ప్రతినెలా కార్మికుల మూలవేతనంపై 5 శాతం మొత్తాన్ని మినహాయించుకుని దాన్ని సీసీఎస్‌కు జమ చేస్తుంది. సీసీఎస్‌ను గుర్తింపు కార్మిక సంఘం నిర్వహిస్తుంది. ఇలా టీఎస్ఆర్టీసీ పరిధిలో ప్రతినెలా దాదాపు రూ.25 కోట్ల మొత్తం జమ అవుతోంది. వాటిని కార్మికుల కుటుంబ అవసరాలకు రుణంగా అందజేస్తారు. సీసీఎస్‌కు చెందిన రూ.60 కోట్ల మొత్తాన్ని వాడేసుకున్న ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు రుణాలు లేకుండా చేసింది. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా 43 శాతం ఫిట్మెంట్ కావాలని కార్మికులు సమ్మె చేయగా విచిత్రంగా ప్రభుత్వం 44 శాతం ప్రకటించింది. ఆర్టీసీపై తీవ్ర భారం పడుతుందని యాజమాన్యం పేర్కొనటంతో ఆదుకుంటానని హామీ ఇచ్చింది. కానీ ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. అవి వస్తేకాని కార్మికులకు రుణాలందే పరిస్థితి లేదు. భవిష్యత్తులో సీసీఎస్ నిధులను సొంత అవసరాలకు వినియోగించుకోనంటూ ఇటీవల సమ్మె సమయంలో ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు హామీ కూడా ఇచ్చింది. గతంలో ఈ నిధులను స్వాహా చేయటంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. సీసీఎస్ నిధులను వాడుకోవద్దంటూ సమ్మెకాలంలో కార్మికులు డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇచ్చి మళ్లీ విస్మరించి ఆ నిధులను కొల్లగొట్టడంపట్ల కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
చౌకగా బంగారమని ఎర!
నకిలీ బంగారంతో మోసం చేస్తున్న రాజస్థానీ బృందాలు సాక్షి, హైదరాబాద్ : కుర్తా...దోతీ ధరించి, తలపై పాగా పెట్టుకొని... రాజస్థానీ సంస్కృతిని ప్రతిబింబించేలా వస్త్రధారణ చేసుకొని కొందరు కేటుగాళ్లు... వ్యాపారులు, అమాయక ప్రజలను టార్గెట్‌గా చేసుకొని చౌకగా బంగారం అంటూ నకిలీ బంగారం అంటగట్టి పెద్ద మొత్తంలో డబ్బు కొల్లగొడుతున్నారు. ‘భారీ మొత్తంలో మా పొలాల్లో బంగారం బిస్కెట్లు దొరికాయి...వాటిని మా రాష్ట్రంలో అమ్మితే సమస్యలు ఎదురవుతాయని ఇక్కడకు వచ్చాం. మీకు అసలు ధర కంటే తక్కువగా ఇస్తాం. ఏ పన్ను చెల్లించకుండానే పసిడి మీ సొంతమవుతుంది... భారీగా లాభాలు ఆర్జించవచ్చు ’అని ఈ గ్యాంగ్ సభ్యులు నమ్మబలుకుతుంది. అనంతరం అసలు బంగారం బిస్కెట్ ముక్కలను శాంపిల్‌గా ఇచ్చి అమాయకులను తమ ఉచ్చులోకి లాగుతున్నారు. వారిచ్చిన బంగారం ముక్కలను పరీక్షించుకుంటే వంద శాతం ఫర్ఫెక్ట్ పసిడేనని తేలుతుంది. బహిరంగ మార్కెట్లో ఉన్న ధరకు 40 శాతం తక్కువ ధరగా బంగారం ఇస్తామని చెబుతారు. ఉదహరణకు 750 గ్రాముల బంగారు బిస్కెట్కు బహిరంగ మార్కెట్లో రూ. 25 లక్షలు ఉంటే వీళ్లు రూ. 15 లక్షలకు బేరానికి పెడతారు. ఒకసారి భారీ మొత్తంలో డబ్బులు చెల్లించని వారు కాస్త సమయం తీసుకొని డబ్బు సర్దుతారు. అప్పుడే ఈ గ్యాంగ్ అంతకు ముందు శాంపిల్ బిస్కెట్ కట్‌చేసిన మాదిరిగానే ఇప్పుడు నకిలీ బిస్కెట్లను కట్‌చేసి ఇచ్చి పరీక్ష చేయించుకోమంటుంది. అయితే, అంతకు ముందే కదా పరీక్ష చేయించుకున్నాం.. మళ్లీ ఎందుకులే అని కొందరు ఆ బంగారం ముక్కలను పరీక్షించుకోకుండా డబ్బు చెల్లించి బంగారు బిస్కెట్లను తీసుకుంటున్నారు. తర్వాత అవి నకిలీ బిస్కెట్లు అని తెలిసి లబోదిబోమంటున్నారు. మేవాడ్ వాళ్లే ఎక్కువ... ఈ దొంగల ముఠాలో రాజస్థాన్‌లోని మేవాడ్‌కు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ఎక్కువగా ఫలక్‌నుమా ప్యాలెస్ సమీప ప్రాంతాలు, గోల్కొండలోని ఫతే దర్వాజా వద్ద చక్కర్లు కొడుతున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ వీరు దందా కొనసాగిస్తున్నారు. హిందువులు, ముస్లింలతో కలిసిపోయినట్టుగా నటిస్తారు. వీరు చూసేందుకు అమాయకంగా కనబడుతున్నా పదుల సంఖ్యలో ముఠాలుగా ఏర్పడి ప్రజలను బంగారం బిస్కెట్ల ఆశ చూపి మోసం చేస్తున్నారు. కొందరిని మోసం చేశాక ఒక్కో గ్రూప్ నుంచి సభ్యులు మరో ముఠాలోకి మారుతుంటారు. ఇలా ఎవరికీ అనుమానం రాకుండా బంగారం పేరుతో కాసులు కొల్లగొడుతున్నారు. సీపీ చొరవతో... ఫలక్‌నుమాకు చెందిన ఓ వ్యాపారి రాజస్థానీ గ్యాంగ్ చేతిలో మోసపోయి స్థానిక పోలీసులకు ఫిర్యాదుచేశాడు. మూడేళ్లు పూర్తయినా కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సదరు వ్యక్తి ఇటీవల హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. వెంటనే ఆ కేసును సీసీఎస్‌కు బదిలీ చేశారు. సదరు ముఠాలను సాధ్యమైనంత తొందరగా పట్టుకోవాలని అధికారులను ఆదేశించినట్టు సమాచారం. ఇతనొక్కడే కాదు...ఇలా మోసపోయినవారు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. -
ఎనీ టైం అప్రమత్తం!
నేరగాళ్లు తెలివిమీరి వ్యవహరిస్తున్నారు. సులువుగా సొమ్మును సంపాదించడానికి అలవాటు పడిన చాలామంది ఏదో ఒకలా జనాన్ని మోసం చేస్తున్నారు. ఇలాంటి వారి మాయలో పడి చాలామంది తమ కష్టార్జితాన్ని చేజేతులా వారికి అప్పగించేస్తున్నారు. ప్రధానంగా బ్యాంకు ఏటీఎం కేంద్రాల వద్ద చాలామంది మోసాలకు గురవుతున్నారు. ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు జిల్లా పోలీసులు నడుం బిగించారు. ఏటీఎంలకు మరింత రక్షణ కల్పించే దిశగా పోలీస్‌శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: జిల్లాలో కొద్ది నెలల్లో ఏటీఎం కేంద్రాల వద్ద చాలామంది మోసగాళ్ల వలలో పడి డబ్బులను పోగొట్టుకున్నారు. ఇలాంటి కేసులు సుమారు 19 నమోదు కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరక్షరాస్యత, అమాయకత్వం కారణంగా మాయగాల ఉచ్చులో ఏటీఎం లబ్ధిదారులు పడుతున్నారు. ఏటీఎం కార్డుల ద్వారా నిందితులు పాస్వర్డ్ కనిపెట్టడం, కార్డుల్ని క్షణాల్లో మార్చేయడం, బాధితులకు సంబంధించిన డే టాను సేకరించి మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. శివారు ప్రాంతాల్లో ఉన్న ఏటీఎంల్లో సెక్యూరిటీ గార్డులు పూర్తిస్థాయిలో లేకపోవడం, ఉన్నా లోపల ఏం జరుగుతుందో పరిశీలించకపోవడం, వారిలోనూ నిరక్షరాస్యులే ఉండడం తదితర కారణాల వల్ల చాలామంది కష్టార్జితం పరుల పాలవ్వడానికి దోహదపడుతోంది. బ్యాంకు సిబ్బందికి పోలీసులు ఎన్నిమార్లు జాగ్రత్తలు సూచిస్తున్నా ఫలితాలు కనిపించడం లేదు. ఏటీఎం సెంటర్లలో సీసీ కెమెరాల్ని పనిచేయకుండా చేసిన తరువాతే నిందితులు మోసాలకు పాల్పడుతుండడంతో నేరాన్వేషణకు ఆటంకం కలుగుతోంది. గత ఏడాది కొత్తూరులో దొంగలు ఏకంగా ఏటీఎం యంత్రాన్నే దొంగిలించేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పిన్ నంబర్లను తరచూ మార్చుకుంటే మోసాల్ని అరికట్టొచ్చని పోలీసులు, బ్యాంకు అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నా ఖాతాదారులకు ఇది కాస్త ఇబ్బందిగా ఉండడంతో ఆ ప్రయత్నం చేయడం లేదు. దీంతో మోసాలు మరింత పెరిగిపోతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ ఏటీఎం కార్డుల పిన్ నంబర్లను కూడా పౌచ్పైనో, కార్డుపై చాలామంది రాసుకుంటున్నారు. ఇది దొంగలకు అవకాశంగా మారుతుంది. ఆ నంబర్లను కనిపెట్టి నకిలీ కార్డులు, ఇతర మార్గాల్లో క్షణాల్లో డబ్బు మాయం చేసేస్తున్నారు. మరికొన్ని చోట్ల తాము బ్యాంకుల కాల్ సెంటర్ల నుంచి మాట్లాడుతున్నామని, ఏటీఎం కార్డు నంబర్, పిన్ నంబర్ చెప్పాలని ఫోన్లలో అడుగుతుండడం, వీటిని నిజమని నమ్మి నంబర్లు చెప్పేస్తుండడంతో చాలామంది మోసపోతున్నారు. ఇలాంటి ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఆన్లైన్ ఫండ్ ట్రాన్స్పర్ పద్ధతి అమల్లోకి వచ్చిందని, వ్యక్తిగతంగా నగదు డ్రా చేయాలనుకున్నప్పుడు బ్యాంకుల ద్వారా డ్రా చేసుకోవచ్చంటున్నారు. అన్ని ఏటీఎం సెంటర్ల వద్దా కంట్రోల్ రూం, స్థానిక పోలీస్స్టేషన్ల నంబర్లతో పాటు ఆయా బ్యాంకుల కాల్ సెంటర్ల వివరాలు కూడా అందుబాట్లో ఉంటున్నా కొన్ని చోట్ల నేరాలు జరుగుతుండడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. పట్టణ పరిధిలోని సీసీఎస్ (సెంటల్ ్రక్రైం స్టేషన్) సిబ్బంది, స్థానిక పోలీసులు, బ్యాంకు సిబ్బందితో కలిసి ఈ నెలాఖరు వరకు స్పెషల్‌డ్రైవ్, అవగాహన సదస్సులు, ఏటీఎం సెంటర్ల నిర్వహకులతో చర్చించడం మొదలెట్టారు. ఖాతాదారులకు బ్యాంకు సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు సలహాలూ, సూచనలు అందించడం వల్ల నేరాల్ని నియంత్రించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఖాతాదారులు తమ కష్టార్జితం పరుల పాలవుకుండా ఉండేందుకు బ్యాంకు సిబ్బంది సహాయంతో ఏటీఎం సెంటర్ల వద్ద అవగాహన, సూచనలతో కూడుకున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను ప్రదర్శించాలని పోలీసులు బ్యాంకు సిబ్బందికి ఆదేశించారు. -
సీసీఎస్‌లో ఐదుగురిపై వేటు
సాక్షి, హైదరాబాద్: రాజధానిలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఎస్)లో అక్రమాలను వెలుగులోకి తెస్తూ ‘సాక్షి’లో వచ్చిన కథనాలపై నగర పోలీస్ కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. అవినీతికి పాల్పడిన సీసీఎస్‌లోని ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. సస్పెండైన వారిలో ఇద్దరు ఇన్స్పెక్టర్లు, సబ్ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్, హెడ్‌కానిస్టేబుల్ ఉన్నారు. సీసీఎస్‌కు చెందిన ఆటో మొబైల్ టీం(ఏటీఎం) ఇన్స్పెక్టర్ తుమ్మపూడి శ్రీనివాస ఆంజనేయప్రసాద్, సబ్ఇన్స్పెక్టర్ జి.శ్రీనివాస్, అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ ఆర్.ఎం.గురునాథుడు, హెడ్‌కానిస్టేబుల్ ఎ.మోహన్లతో పాటు సీసీఎస్ వైట్ కాలర్ అఫెన్స్ టీం ఇన్స్పెక్టర్ మధుమోహన్ అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. విచారణాధికారులు బుధవారం సాయంత్రం కమిషనర్ మహేందర్‌రెడ్డికి నివేదిక సమర్పించారు. దీంతో వారిపై ఆయన సస్పెన్షన్ వేటు వేశారు. నెల రోజుల క్రితమే ఇన్‌కమ్‌ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌ను బెదిరించి అతని ఆస్తులను బలవంతంగా మరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించిన వ్యవహారంలో ఇదే సీసీఎస్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ను కూడా కమిషనర్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీసులు రికవరీ చేసిన వాహనాల మాయంపై ‘సాక్షి’లో వచ్చిన వరుస కథనాలపై ఆయన స్పం దించారు. 60 ఠాణాల పరిధిలో రికవరీ వాహనాలపై ఆరా తీయడంతో పలువురు పోలీసులు అక్రమంగా వాడుతున్న 140 వాహనాలు తిరిగి ఠాణాలకు చేరుకున్నాయి. -
పంపకాలపై విచారణ షురూ..!
114 వాహనాలు ‘రీ’ రికవరీ ఐదుగురిపై వేటు పడే అవకాశం సాక్షి, సిటీబ్యూరో : నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో అక్రమాలపై ఎట్టకేలకు కదలికవచ్చింది. సీసీఎస్‌లో జరుగుతున్న అక్రమ బాగోతాలపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై ఉన్నతాధికారులు స్పందించారు. చీటింగ్ కేసు నుంచి 16 మంది నిందితులను తప్పించిన తాజా కథనంపై కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో సదరు శాఖకు చెందిన ఐదురుగురు అధికారులపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు సీసీఎస్ డీసీపీ రవివర్మ క్రైమ్ నెంబర్ 289/2014 ఫైల్‌ను తిరగదోడుతున్నారు. ఇందులో భాగంగా శనివారం కేసు దర్యాప్తు అధికారిని పిలిపించి విచారించారు. పోలీసులు తప్పించిన నిందితుల్లో ఓ రౌడీషీటర్ కూడా ఉండడంపై ఉన్నతాధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఒకపక్క వాహనాలను ఇష్టం వచ్చినట్లు పంచుకోవడం, మరోపక్క గుట్టుచప్పుడు కాకుండా ఫైనాన్స్ కంపెనీలకు తరలించడంపై ఇప్పటికే విచారణ ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సీసీఎస్‌లోని ఆయా కేసులకు సంబందించిన ఫైళ్లను స్వాధీనం చేసుకోవడమేగాకుండా అక్రమంగా తరలిపోయిన సుమారు 114 వాహనాలను తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఇక అలీషా కేసులో రాకేష్‌రెడ్డికి చెందిన కేఏ 02 ఎంఏ 9311 బొలెరో వాహనాన్ని గత డిసెంబర్లో సీజ్ చేసిన సీసీఎస్ ఆటోమొబైల్ టీం అధికారులు నగరంలో విధులు నిర్వహిస్తున్న ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్కు కానుకగా ఇచ్చినట్లు తాజాగా చేపట్టిన విచారణలో వెలుగులోకి వచ్చింది. వేటుకు రంగం సిద్ధం... అక్రమాలకు పాల్పడిన సీసీఎస్ ఏసీపీ, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్, ఏఎస్ఐ తదితరులపై శాఖపరమైన చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులు సిద్దమవుతున్నారు. ఆయా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడి కావడంతో వారిపై వేటు వేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్రమంగా వాహనాలను తీసుకెళ్లిన ఫైనాన్స్ కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు గల అకాశాలపై ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. పై నలుగురు అధికారులే కాకుండా మరో ఇద్దరు అధికారుల వద్ద ఉన్న వాహనాలను కూడా సీజ్ చేసినట్లు సమాచారం. -
అక్రవూల పుట్ట పగిలింది
♦ సీసీఎస్ లో అక్రవూల బాగోతం ♦ సాక్షి పరిశోధనలో వెల్లడైన నిజాలు ♦ తవ్వేకొద్దీ అక్రమాలు ♦ 420 కేసులో 16 మంది నిందితుల పేర్లు తొలగింపు ♦ అధికారులకు రూ.80 లక్షలు నజరానా సాక్షి, సిటీబ్యూరో : నగర సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో తవ్విన కొద్దీ ఖాకీల అక్రమ భాగోతాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకు దొంగ వాహనాలను పంచుకున్న ఖాకీల భాగోతం.. సీజ్ చేసిన మరో 54 కార్లను గోల్మాల్ చేసిన వైనంపై ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. తాజాగా ఓ చీటింగ్ కేసులో ఏకంగా 16 మంది నిందితులను తప్పించిన వైనం తెరపైకి వచ్చింది. ఇందుకుగాను నిందితుల నుంచి అందిన కాడికి దండుకుని వారి పేర్ల ఎఫ్ఐఆర్ నుంచి తొలగించారు. 17 మంది నిందితులుగా ఉన్న ఈ కేసులో కేవలం ఒక్కడిని మాత్రమే చార్జిషీట్లో చూపిస్తూ మిగతా వారినందరినీ కేసు నుంచి తప్పించారు. ఇందుకు అధికారులకు దాదాపు రూ.80 లక్షలు నజరానా అందినట్లు సమాచారం. వివరాల్లోకి వెళితే..కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి స్నేహితులు. వీరికి ట్విట్టర్లో పశ్చిమ గోదావరి జిల్లా, ముచ్చర్లవారి తోటకు చెందిన షేక్ ఉమర్ అలీషా (30) పరిచయం అయ్యాడు. రాకేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలను ఆర్థిక స్తోమతపై కన్నేసిన ఆలీషా వారితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. ఆ తరువాత వారి డబ్బుతో‘7 క్యాబ్స్ ప్రైవేటు లిమిటెడ్’ పేరుతో ట్రావెల్స్ కంపెనీని ప్రారంభిన అద్దెకు వచ్చిన కార్లకు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని విక్రయించడం, వాటిపై తిరిగి ఫైనాన్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాడు. అలీషా మోసాన్ని పసిగట్టిన మెహదీపట్నానికి చెందిన ఫైనాన్స్ కంపెనీ మేనేజర్ మీర్జాఫర్వేజ్బేగ్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోలీసులు డిసెంబర్ 16న అతనిపై క్రైమ్ నెంబర్ 289/2014 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఖాకీలకు వాటాలు.. దీనిపై దర్యాప్తు చేపట్టిన సీసీఎస్ ఆటోమొబైల్ టీం అలీషాను అరెస్టు చేసి అతని వాంగ్మూలం మేరకు మరో 16 మంది నిందితులుగా చేర్చారు. అలీషాతో పాటు శ్రీనివాస్‌రెడ్డి అలియాస్ బిచ్చు, వీరు, మధుగౌడ్, నర్సింహ్మా, శ్రీనివాస్‌రెడ్డి, మహ్మద్, ఇఫ్తఖార్, జగన్, అలిషా భార్య మానస, కంతకాడి మధుసూదన్, ప్రియదర్శిని, శివయ్యలతో పాటు మరో ముగ్గురిని నిందితులుగా పేర్కొంటూ కోర్టుకు సైతం ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. అయితే అలీషాను రిమాండ్‌కు పంపిన అధికారులు మిగిలిన 16 మందిని అరెస్టు చేయకుండా వారితో బేరం కుదుర్చుకుని వారి పేర్లను నిందితుల జాబితాలోంచి తొలగించారు. ఇందుకుగాను ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షలు తీసుకున్నట్లు సమాచారం. ఆ తరువాత ఆలీషా మినహా మిగిలిన వారికి ఈ కేసుతో సంబంధం లేనట్లుగా పేర్కొంటూ కోర్టుకు చార్జిషీట్ అందజేయడం గమనార్హం. ఇదిలా ఉండగా అరెస్టుకు ముందే అలీషా హైకోర్టు నుంచి ఐపీ తీసుకోవడం గమనార్హం. అందరూ కలిసి మోసగించారు... అలీషాను నమ్మి వ్యాపారంలోకి దిగడంతో తాము రూ.20 లక్షలు మోసపోయామని రాకేష్‌రెడ్డి,శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అలీషాకు తాము ఏడు కార్లు ఇచ్చామని అందులో కేవలం నాలుగు కార్లను మాత్రమే పోలీసులు రికార్డులో రాశారని, మిగిలిన మూడు కార్లు రికార్డుల్లో చూప లేదన్నారు. ఈ కార్లు ఎక్కడ ఉన్నాయో ఫోటోలతో సహా పోలీసులకు ఆధారాలు ఇచ్చినా పట్టించుకోలేదన్నారు, కేసులో తమ ప్రయేయం లేకున్నా ఓ పోలీసు అధికారి బలవంతంగా ఎఫ్ఐఆర్లో చేర్చారని, పేరు తొలగించేందుకు తమను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఠాణాల్లో విచారణ షురూ.. సీసీఎస్‌లో అక్రమ భాగోతాలపై ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాలపై నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. కార్లు పంచుకున్న ఖాకీలపై విచారణకు ఆదేశిస్తూ శుక్రవారం కమిషనరేట్ పరిధిలోని 60 పోలీసు స్టేషన్లలో రికవరీ చేసిన వాహనాల రికార్డులను సమర్పించాలని ఆదేశించారు. ఇందుకుగాను డీసీపీ నేతృత్వంలో ఒక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందం అన్ని స్టేషన్లలో పదేళ్ల నుంచి రివకరీ చేసిన వాహనాల రికార్డులను పరిశీలించనుంది. అంతేగాకుండా గోషామహల్ పోలీసు స్టేడియంలో కుప్పలు పడి ఉన్న వాహనాల రికార్డులను సైతం తిరిగి తోడనున్నారు. కేవలం ఈ ఒక్క సీసీఎస్‌లోనే గత ఏడాది కాలంలో 200 కార్లు సీజ్ చేసినట్లు విచారణలో తేలింది. ఆ కార్లు ఎక్కడ ఉన్నాయో నివేదిక ఇవ్వాలని కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
సీసీఎస్‌కు రూ.85 కోట్లను జమ చేసిన ఆర్టీసీ
ఆర్టీసీ కార్మికుల క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ నుంచి సొంత అవసరాలకు వాడుకున్న రూ.85 కోట్లను యాజమాన్యం తిరిగి సొసైటీకి జమ చేసింది. ఈ మొత్తం అందుబాటులో లేకపోవడంతో రుణాలందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనాన్ని ‘సాక్షి’ ఇటీవల వెలుగులోకి తేవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.85 కోట్లను యాజమాన్యం మంగళవారం సీసీఎస్‌కు జమ చేసింది. -
పెళ్ళి ప్రకటనే పెట్టుబడిగా..!
-
'విచారణకు ముందే మాళవిక విషం తాగింది'
హైదరాబాద్ : సీసీఎస్ కార్యాలయంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దాంతో ఆమెను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే ఎన్ఆర్ఐని మోసం చేసిన కేసులో మాళవిక అనే మహిళను నిన్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే పోలీసులు విచారిస్తుండగానే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు మాళవికను హుటాహుటీన చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చారు. ఆమె విషం తాగినట్లు వైద్యులు వెల్లడించారు. కాగా వెబ్సైట్లో వరుడు కావాలని ప్రకటనలు ఇస్తూ మాళవిక మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఓ ఎన్ఆర్ఐని ఆమె మోసం చేయటంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ వ్యవహారంపై సీసీఎస్ డీసీపీ పాలరాజు మాట్లాడుతూ విచారణకు ముందే మాళవిక విషం తాగి సీసీఎస్‌కు వచ్చినట్లు తెలిపారు. ఆమో వద్ద సూసైడ్ నోట్ లభించినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా ఓ ఎన్ఆర్ఐని మోసం చేసినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో మాళవికను విచారణకు పిలిచినట్లు డీసీపీ చెప్పారు. -
కార్మికుల సీసీఎస్‌కు నిధులు జమ చేసిన ఆర్టీసీ
ఎట్టకేలకు సిబ్బందికి రుణాలు హైదరాబాద్: కార్మికుల పొదుపు సొమ్ము ను మింగేసిన ఆర్టీసీ ఎట్టకేలకు ఆ మొత్తాన్ని తిరిగి జమ చేసింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రూ.250 కోట్లు చొప్పున పాత బకాయిలు చెల్లిం చడంతో అందులోంచి రూ.223 కోట్లను కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఆర్టీసీ యాజమాన్యం జమచేసింది. ఆగస్టు 31 వరకు పెండింగులో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు ఇవి సరిపోతాయని అధికారులు చెబుతున్నారు. ప్రతినెలా రూ.53 కోట్లను యాజమాన్యం సీసీఎస్‌కు జమచేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం నుంచి కుటుంబావసరాలకు కార్మికులు రుణంగా పొందుతారు. కానీ 5 నెలలుగా వాటి ని జమచేయకుండా ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. ఫలితంగా రుణాల కోసం కార్మికులు చేసుకున్న 20 వేల దరఖాస్తులు పేరుకుపోయా యి. ఆగస్టు 31 తర్వాత అందిన దరఖాస్తులు మరో 300 వరకు పెండింగ్‌లో ఉంటాయి. -
చంచల్‌గూడ జైలు నుంచి సీసీఎస్‌కు 'దేశద్రోహి'
-
దిగొచ్చిన పోలీసులు
- అంకన్నగూడెం బాధితులకు ఎట్టకేలకు విముక్తి - ఆస్పత్రిలో ఒకరు.. ఏలూరు సీసీఎస్‌లో ముగ్గురు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు పోలీ సులు దిగొచ్చారు. అంకన్నగూడెం బాధితులను తమ అదుపులో ఉంచుకుని.. వాళ్లెక్కడున్నారో తమకు తెలి యదంటూ చెప్పుకొచ్చిన పోలీసులు చివరకు వారికి విముక్తి కల్పిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిలో ఒకరైన ఎం.గోపాలరావు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను తీసుకువెళ్లాల్సిందిగా అత ని బంధువులకు పోలీసులు సూచిం చారు. కేసులో పురోగతి సాధించేందుకు మరికొద్ది రోజులు పడుతుందని, అప్పటివరకు తమకు అందుబాటులో ఉండాల్సిందిగా కోరారు. పోలీసులు అనుమతిచ్చిన వెంటనే గోపాలరావును ఆయన బంధువులు నూజివీడు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మధుమేహం, గుండెపోటు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ లేదా విజయవాడ ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిందిగా నూజి వీడు ఆస్పత్రి వైద్యవర్గాలు సూచిం చాయి. ఇదిలావుండగా, పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని కూడా పంపించేందుకు వైఎస్సార్ సీపీ సీని యర్ నేతలతో పోలీసులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. భద్రత ఇవ్వడం కోసమే అదుపులోకి తీసుకున్నామే తప్ప వారిని అక్రమంగా నిర్బం ధించలేదని పోలీసు అధికారులు వైఎస్సార్ సీపీ నేతలతో చెబుతున్నట్టు సమాచారం. గత నెల 30న రాత్రి పెదవేగి మండలం అంకన్నగూడెం సర్పం చ్, టీడీపీ నేత చిదిరాల రాజేష్ రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఆయనపై హత్యాయత్నం జరి గిందంటూ వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై అల్లరిమూకలు దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపర్చడం తెలిసిందే. ఈ ఘటన దరిమిలా ఈనెల 1న ఉదయం వైఎస్సార్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 12రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింస లకు గురి చేశారు. తొలుత వారిని ఏలూరు సీసీఎస్ స్టేషన్లోనే ఉంచినా తరువాత స్టేషన్లు మారుస్తూ ఇబ్బందులకు గురిచేశారు. పోలీసుల తీరుపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు పోలీసు అధికారులు తమ అదుపులో ఉన్న వారిని ఒక్కొక్కరిగా విడుదల చేస్తున్నారు. -
బొమ్మాడిస్తున్న ‘బొమ్మరిల్లు’
సాక్షి, విశాఖపట్నం: ‘బొమ్మరిల్లు’ చేతుల్లో దారుణంగా మోసపోయిన బాధితులు ఫిర్యాదులు చేయడానికి పోలీస్స్టేషన్ల వద్ద క్యూలు కడుతున్నారు. సంస్థ దివాలా తీసిన నేపథ్యంలో ఆ సంస్థపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సంస్థ ప్రధాన కార్యాలయం గల విశాఖ నగరంలో ఇప్పటికే 300 మందికిపైగాబాధితులు సెంట్రల్ క్రైం స్టేషన్ (సీసీఎస్)కు ఫిర్యాదు చేశారు. బుధవారం ఒక్కరోజే 50కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. విశాఖనగరం మొత్తానికి బాధితులంతా సీసీఎస్‌లోనే ఫిర్యాదుచేసే ఏర్పాటు ్లచేయడంతో రోజురోజుకూ ఇక్కడకొచ్చే బాధితుల సంఖ్య మరింత పెరుగుతోంది. ఫిర్యాదుల తాకిడిని తట్టుకోలేక పోలీసులు మూడురోజులు గా బాధితులకు టోకెన్లు జారీచేస్తున్నారు. రోజుకు 50 మందికి మాత్రమే టోకెన్లు జారీచేసి, మిగిలినవారి నుంచి మరుసటిరోజు తీసుకుంటున్నారు. దీంతో టోకెన్ల కోసం స్టేషన్ ఎదుట తోపులాట చోటుచేసుకుంటోంది. ఇదిలా ఉండగా, బొమ్మరిల్లు యాజమాన్యంపై ఇతర జిల్లాల్లోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 15, కరీంనగర్, నల్లగొండ జిల్లాలోనూ 5కి పైగా నమోదయ్యాయని సమాచారం. నయా మోసం... బొమ్మరిల్లు ఫైనాన్స్ అండ్ రియల్ ఎస్టేట్ సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కరీంనగర్ జిల్లాలో శాతావాహన వెంచ ర్ పేరుతో కోట్లు కొల్లగొట్టినట్టు తాజాగా తేలింది. ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలోనూ సంస్థ మోసాలు చేసినట్లు పోలీ సులు అనుమానిస్తున్నారు. ఆర్.ఆర్.రాజా కాల్‌లిస్ట్ సేకరణ: బొమ్మరిల్లు పూర్వపు ఎండీ ఆర్.ఆర్. రాజా కోసం పోలీసులు వివిధ రాష్ట్రాల్లో గాలిస్తున్నారు. ఈ మేరకు రాజావాడిన సెల్‌ఫోన్‌కు సంబంధించిన కాల్డేటాలిస్ట్ కూడా సేకరించారు. అయితే, పోలీసు నిఘా నేపథ్యంలో ప్రస్తుత సెల్‌ఫోన్ గాక కొత్త సిమ్ వాడుతున్నట్లు గుర్తిం చారు. ఆ నంబర్ ఒక్కోసారి బెంగళూరు, మరికొన్నిసార్లు అనంతపురం జిల్లా హిందూపురం సిగ్నల్స్ చూపుతున్నాయని కేసు దర్యాప్తుచేస్తున్న పోలీసులు ‘సాక్షి’కి వివరించారు. బొమ్మరిల్లు ద్వారా కోట్లకుకోట్లు గడించి తెలివిగా బయటపడ్డ రాజా 2014 అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. కాగా, అనుహ్యంగా ఫైనాన్స్ కంపెనీ దివాలా వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో ఏదోలా కేసునుంచి తప్పించుకునేందుకు పార్టీలోని కొందరు ప్రముఖులద్వారా ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెరుగుత్ను అప్పుల చిట్టా బొమ్మరిల్లు 40 వేల మంది ఖాతాదారుల నుంచి రూ.100 కోట్లకుపైగా వసూళ్లు చేసిందని పోలీసుల దర్యాప్తులో తేల్చింది. సంస్థ ప్రధాన కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న వివిధ డాక్యుమెంట్ల ద్వారా రూ.30 కోట్ల విలువచేసే ఆస్తులను గుర్తించారు. పలు జిల్లాల్లో 300 ఎకరాల వరకు భూములు ఉన్నట్లు గుర్తించారు. అయితే బొమ్మరిల్లు ఆస్తులు, అప్పులు, ఖాతాదారులను ఏ విధంగా మోసం చేసిందనే దానిపై కోర్టు పోలీసులకు గడువు విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంస్థ ఆస్తులపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఖాతాదారులకు ఇంకా రూ.60 కోట్ల వరకు చెల్లించాల్సి ఉందని మొదట్లో అనుకున్నా అది రూ. 70 కోట్లకుపైగా ఉండవచ్చని భావిస్తున్నారు. ఎక్కువగా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భూములు కొనుగోలు చేశారని, కొన్నింటికి డాక్యుమెంట్లు లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. {పసుత్తం బొమ్మరిల్లుపై కోర్టులో మరిన్ని ఆధారాలతో కేసు వేయా ల్సి ఉన్నందున ఖాతాదారుల సమాచారం, వారిని ఏ విధంగా మోసం చేసిందనే వివరాలను తయారుచేస్తున్నారు. -
నిద్దరోతున్న నిఘా
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగరంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట చోరీలు జరుగుతూనే ఉన్నాయి. వివిధ రూపాల్లో వస్తున్న దొంగలు ఒంటరిగా మహిళ కనిపించినా.. తాళమేసిన ఇల్లు కనిపించినా అంతే. దర్జాగా దోపిడీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కొద్ది నెలలుగా దొంగలు రెచ్చిపోతున్నా వారిని పోలీసులు మాత్రం ఏమీచేయలేకపోతున్నారు. నగరంలో నాలుగు పోలీస్స్టేషన్లు, క్రైం కంట్రోల్ స్టేషన్ (సీసీఎస్)కూడా ఉంది. నేరాలు, చోరీలను నివారించి దొంగలను పట్టుకునేందుకే ప్రత్యేకంగా సీసీఎస్ ఏర్పాటైంది. నేరాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. సీసీఎస్ ఏం చేస్తోంది.. 2008లో ఏర్పాటైన సీసీఎస్ పోలీస్‌స్టేషన్ ప్రా రంభంలో బాగానే పనిచేసింది. ఎందరో నేరగాళ్లను పట్టుకుంది.పోలీసులులపై ఆధారపడకుండా దొంగల కదలికలపై ప్రత్యేక నిఘావేసి చోరీ జరిగిన తీరు పరిశీలించి నిందితులు ఎవ రో చేయగల నిపుణులు ఇక్కడ ఉన్నారు. అంతరాష్ట్ర దొంగల అలవాట్లు, చోరీలు చేసే విధానంపైనా వీరికి పట్టు ఉంటుంది. దొంగిలించిన బంగారం అమ్మకాలు, వారి స్థావరాలు వీరికి దాదాపు తెలిసే ఉంటుంది. కొంతకాలంగా సీసీఎస్ అనుకున్న స్థాయిలో పనిచేయకపోవడంతో నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. అసమర్థులను కేటాయిం చడం.. యువకులకు బదులు విరమణకు సమీపంలో ఉన్నవారిని ఇక్కడకు పంపుతుండడంతో ఈ పరిస్థితి నెలకొందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ సీఐతోపాటు 50 మంది సిబ్బంది ఉండాలి. కానీ.. 19 మంది మాత్రమే ఉన్నారు. 20 మంది కానిస్టేబుళ్లకు 9 మంది, ఎనిమిది మంది హెడ్‌కానిస్టేబుళ్లకు ఆరుగురు, 16 మంది ఎస్సైలకు ఇద్దరు ఉన్నారు. వీరిలో ఒకరే అందుబాటులో ఉన్నారు. నలుగురు సీఐలకు ఇద్దరిని మహిళా పీఎస్, వన్‌టౌన్‌కు అటాచ్డ్ చేశారు. నిఘా వ్యవస్థల తీరు జిల్లాలో ఎక్కడ ఏం జరిగిన క్షణాల్లో సమాచారం సేకరించే స్పెషల్ బ్రాంచ్ కూడా వెనుకబడుతోందనే ఆరోపణలున్నాయి. నక్సల్స్ ప్రభావం ఉన్న సమయంలో రాష్ట్రంలోనే ప్రశంసలు అందుకున్న ఎస్బీ ఇప్పుడు ఆ స్థాయిలో పని చేయడం లేదు. వీరిలో కొందరు సిబ్బంది పోలీస్స్టేషన్ల పైరవీలు, వినని వారిపై ఉన్నతాధికారుల వద్ద ఆరోపణలు చేయడం, వ్యాపారాలు, సెటిల్మెంట్లు చేస్తూ పోలీస్‌శాఖకే కొరకరాని కొయ్యగా మారారు. జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై కనీసం సమాచారం కూడా ఉండడం లేదని, ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇవ్వాలన్నా.. కనీసం ఫోన్లలోనైనా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంటెలిజెన్స్, ఐడీ పార్టీ పోలీసులూ అదనపు భారం, పనులతో ఇబ్బందులు పడుతున్నారు. చివరకు వీరిని బందోబస్తులకు సైతం వినియోగిస్తుండడంతో నేరాలపై దృష్టి సారించలేకపోతున్నారనే ఆరోపణలున్నాయి. రెండు రోజుల క్రితం శంకరపట్నం మండలం మొలంగూర్, జగిత్యాలలో మేడిపెల్లి ఏఎస్సై ఇంట్లో జరిగిన చోరీ ఘటనలు పోలీసులకు సవాల్ విసురుతున్నాయి.