సీసీఎస్ ఎన్నికల నామినేషన్లకు నేడు చివరి రోజు
Published Wed, Dec 7 2016 11:44 PM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
– 9న దరఖాస్తుల పరిశీలన
- అదే రోజు అభ్యర్థుల తుది జాబితా విడుదల
కర్నూలు(రాజ్‌విహార్): రోడ్డు రవాణ సంస్థలో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్) ఎన్నికల నామినేషన్లకు గురువారం గడువు ముగియనుంది. ఈనెల 2న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్న సీసీఎస్ డైరెక్టర్ల కాలపరిమితి 16వ తేదీ నాటికి ముగియనుండడంతో అదే రోజు కొత్త ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరుపనున్నారు. ఈ ఎన్నికల్లో గుర్తింపు కలిగిన నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒంటరిగా పోటీ చేస్తుండగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ సోదర సంఘం స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ మద్దతులో రంగంలోకి దిగుతోంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు 8వ తేదీ సాయంత్రం వరకు అవకాశం ఉంటుంది. 9న నామినేషన్ ఫారాల పరిశీలన అనంతరం అనర్హుల జాబితా అదే రోజు విడుదల చేస్తారు. ఉపసంహరణకు 13 వరకు గడువు ఉండగా బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను అదే రోజు సాయంత్రం ప్రకటిస్తారు. 16న ఉదయం నంచి సాయంత్రం వరకు ఎన్నికలు నిర్వహించి అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలను విడుదల చేస్తారు.
Advertisement
Advertisement