ఆర్టీసీ కార్మికుల క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ నుంచి సొంత అవసరాలకు వాడుకున్న రూ.85 కోట్లను యాజమాన్యం తిరిగి సొసైటీకి జమ చేసింది.
ఈ మొత్తం అందుబాటులో లేకపోవడంతో రుణాలందక కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న వైనాన్ని ‘సాక్షి’ ఇటీవల వెలుగులోకి తేవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.85 కోట్లను యాజమాన్యం మంగళవారం సీసీఎస్‌కు జమ చేసింది.