సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీపై ఆ సంస్థకు చెందిన ఉద్యో గుల సహకార పర పతి సంఘం (సీసీ ఎస్) మరోసారి కోర్టుకెక్కింది. ఉద్యోగుల కుటుంబ అవసరాలకు రుణాలు ఇచ్చే పరిస్థితి లేకుండా సీసీఎస్ నిధిని ఆర్టీసీ వాడేసుకోవడంతో సీసీఎస్ పాలకవర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా ఉద్యోగుల జీతాల నుంచి 7శాతాన్ని కోత పెడుతున్న ఆర్టీసీ యాజమాన్యం... ఆ సొమ్మును సీసీ ఎస్‌కు సరిగ్గా చెల్లించకపోవడం వల్ల వడ్డీతో కలిపి రూ. 903 కోట్ల మేర బకాయిలు పేరుకు పోయాయని.. అందులోంచి కనీసం రూ. 600 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టును కోరింది.
ఆర్టీసీ తీరుతో సీసీఎస్ కొంతకాలంగా ఉద్యోగులకు రుణాలు ఇవ్వలేని పరిస్థితి నెల కొంది. ఫలితంగా వారు బయట నుంచి అప్పులు తెచ్చుకుంటూ ఇబ్బందులు పడుతు న్నారు. మరోవైపు జూలై నుంచి రిటైరైన సుమారు వెయ్యి మంది ఉద్యోగులతోపాటు వీఆర్‌ఎస్ తీసుకున్న 200 మంది ఉద్యోగులు ఇంతకాలం సీసీఎస్‌లో దాచుకున్న మొత్తం చెల్లించే పరిస్థితి లేకుండా పోయింది.
ప్రస్తుతం రుణాల కోసం 6,800 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఇదే అంశంపై 2019లో సీసీఎస్ తొలిసారి హైకోర్టును ఆశ్రయించగా రూ. 200 కోట్లు చెల్లించాల్సిందిగా ఆర్టీసీని న్యాయస్థా నం ఆదేశించింది. అయినా ఆర్టీసీ యాజమా న్యం స్పందించకపోవడంతో సీసీఎస్ 2020 జూన్‌లో కోర్టు ధిక్కార పిటిషన్ వేసింది. దీంతో దిగొచ్చిన ఆర్టీసీ... ఆ మొత్తాన్ని ఆర్టీసీ చెల్లించింది.
Comments
Please login to add a commentAdd a comment