సాక్షి, అమరావతి: భాగస్వామ్య పింఛన్ పథకం (సీపీఎస్) రద్దు అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎస్‌పై సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియలో ఉద్యోగ సంఘాలనూ భాగ్వస్వామ్యం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
మంత్రుల బృందం, అధికారులు సంబంధిత సంఘాలకు ప్రెజెంటేషన్ ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలని అధికారులకు సూచించారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభం కావాలని సీఎం తెలిపారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్ శర్మ, ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment