6 జిల్లాల్లో 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Covid Situation In AP On June 25th | Sakshi
Sakshi News home page

జాతీయ సగటు కంటే అధికంగా రికవరీ రేటు: సీఎం జగన్‌

Published Fri, Jun 25 2021 3:55 PM | Last Updated on Fri, Jun 25 2021 4:52 PM

CM YS Jagan Review Meeting On Covid Situation In AP On June 25th - Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో కోవిడ్‌ యాక్టివ్‌ కేసులు 50 వేల దిగువకు తగ్గాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పాజిటివిటీ రేటు 5.23 శాతంగా ఉందన్నారు. కోవిడ్ నియంత్రణ, నివారణ వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోవిడ్‌ నియంత్రణ, నివారణ చర్యలపై ముఖ్యమంత్రికి అధికారులు వివరాలు అందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. 6 జిల్లాల్లో (కడప, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు) 5 శాతం కంటే తక్కువ పాజిటివిటీ రేటు ఉందని తెలిపారు. జాతీయ సగటు కంటే అధికంగా రాష్ట్రంలో రికవరీ రేటు ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు సగటు 96.59శాతం, ఏపీలో 96.67శాతంగా ఉందన్నారు. 

ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్యుపై అయిన పడకల్లో 76.51 శాతం పడకల్లో రోగులకు ఆరోగ్య శ్రీ కింద చికిత్స అందిస్తున్నామని తెలిపారు. 104కు గణనీయంగా కాల్స్‌ తగ్గాయని, జూన్‌ 25న కేవలం 1021 కాల్స్‌ వచ్చాయని తెలిపారు. ప్రభుత్వాస్పత్రుల్లో మందులు జీఎమ్‌పీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలతో ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు తెలిపారు. అలాగే ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లోకూడా జీఎంపీ మరియు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఉండాలన్నారు. 

ఆస్పత్రుల్లో శానిటేషన్, రోగులకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని, నిరంతరం మానిటరింగ్‌ చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి భవనాల నిర్వహణ, వైద్య పరికరాల నిర్వహణపై ప్రత్యేక ఎస్‌ఓపీలను తయారు చేయారు చేయాలని తెలిపారు. మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్యం, రోగులకు ఆహారంపై పర్యవేక్షణ ఉండాలన్నారు. అలాగే వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది హాజరుపై పర్యవేక్షణ ఉండాలన్నారు. దీని కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని పేర్కొన్నారు. 

చదవండి: ఏపీ ప్రభుత్వానికి యూఎస్‌ కాన్సులేట్ అభినందనలు

హెల్త్‌హబ్స్‌తో ఆరోగ్యరంగం బలోపేతం
ఆస్పత్రుల్లో శానిటేషన్‌, పేషెంట్లకు అందించే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆస్పత్రుల భవనాలు, వైద్య పరికరాల నిర్వహణపై ఎస్‌ఓపీలు తయారు చేయాలన్నారు.

బ్లాక్‌ ఫంగస్‌
రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 3148 ఉండగా.. 1095 మందికి సర్జరీలు చేశారని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌తో 237 మరణించగా.. 1398 మంది డిశ్చార్జి అయ్యారు. మిగిలిన వారికి కొనసాగుతున్న చికిత్స కొనసాగుతోందని పేర్కొన్నారు

ఆక్సిజన్‌ ప్లాంట్లు
రాష్ట్ర వ్యాప్తంగా 134 ఆక్సిజన్‌ జనరేషన్‌(పీఎస్‌ఎ) ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు అన్నారు. 50 అంతకంటే ఎక్కువ పడకలున్న ఆస్పత్రుల్లో జనరేషన్‌ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సెప్టెంబరు నాటికి 97 ప్లాంట్లు ఏర్పాటవుతాయని, మిగిలిన 37 ప్లాంట్లు రానున్న మార్చి నాటికి పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఆస్పత్రుల్లో నాడు – నేడు
ఆస్పత్రుల్లో నాడు – నేడు కార్యక్రమాలు చేపట్టిన తర్వాత వాటి  నిర్వహణకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం తెలిపారు.. రోగులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందాలని, 21 రోజులలో కచ్చితంగా ఆరోగ్యశ్రీ, 104, 108 బిల్లులు చెల్లించాలని ఆదేశించారు

హెల్త్‌ హబ్స్‌
జిల్లాల్లో హెల్త్‌ హబ్స్‌పై సీఎంకు అధికారులు వివరాలు అందించారు.  ఏయే చికిత్సల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నదానిపై తెలిపారు. క్యాన్సర్, గుండెజబ్బులు, చిన్నపిల్లల సర్జరీలకోసం అధికంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారన్నారు. ఈ వ్యాధులకు వైద్యసేవలు ఇక్కడ హబ్స్‌లో అందేలా.. ఆ రకమైన స్పెషాల్టీ ఆస్పత్రుల ఏర్పాటుకు హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చే దిశగా చూస్తున్నామని తెలిపారు. 

రాష్ట్రంలో కొత్తగా వస్తున్న 16 మెడికల్‌కాలేజీలు, ఆధునీకరిస్తున్న 11 పాత వైద్య కళాశాలలు,  ఈ హెల్త్‌హబ్స్‌తో ఆరోగ్యరంగం బలోపేతం అవుతుందని సీఎం జగన్‌ ఆకాక్షించారు. హెల్త్‌హబ్స్‌కు స్థలాలు.. ఆవాసాలకు దగ్గరగానే ఉండేలా చూడాలని, అప్పుడే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని తెలిపారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు అందాలన్నదే ప్రధాన లక్ష్య అధికారులకు సీఎం నిర్దేశించారు.

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతం సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌ రెడ్డి, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెండ్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఎ.బాబు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్,  ఆరోగ్యశ్రీ సీఈఓ డాక్టర్‌ ఎ మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి విజయరామరాజు, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జెవిఎన్‌ సుబ్రమణ్యం, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement