- అంకన్నగూడెం బాధితులకు ఎట్టకేలకు విముక్తి
- ఆస్పత్రిలో ఒకరు.. ఏలూరు సీసీఎస్‌లో ముగ్గురు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎట్టకేలకు పోలీ సులు దిగొచ్చారు. అంకన్నగూడెం బాధితులను తమ అదుపులో ఉంచుకుని.. వాళ్లెక్కడున్నారో తమకు తెలి యదంటూ చెప్పుకొచ్చిన పోలీసులు చివరకు వారికి విముక్తి కల్పిస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిలో ఒకరైన ఎం.గోపాలరావు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఆయనను తీసుకువెళ్లాల్సిందిగా అత ని బంధువులకు పోలీసులు సూచిం చారు. కేసులో పురోగతి సాధించేందుకు మరికొద్ది రోజులు పడుతుందని, అప్పటివరకు తమకు అందుబాటులో ఉండాల్సిందిగా కోరారు. పోలీసులు అనుమతిచ్చిన వెంటనే గోపాలరావును ఆయన బంధువులు నూజివీడు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
మధుమేహం, గుండెపోటు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఆయనను హైదరాబాద్ లేదా విజయవాడ ఆస్పత్రులకు తీసుకెళ్లాల్సిందిగా నూజి వీడు ఆస్పత్రి వైద్యవర్గాలు సూచిం చాయి. ఇదిలావుండగా, పోలీసుల అదుపులో ఉన్న ముగ్గురిని కూడా పంపించేందుకు వైఎస్సార్ సీపీ సీని యర్ నేతలతో పోలీసులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. భద్రత ఇవ్వడం కోసమే అదుపులోకి తీసుకున్నామే తప్ప వారిని అక్రమంగా నిర్బం ధించలేదని పోలీసు అధికారులు వైఎస్సార్ సీపీ నేతలతో చెబుతున్నట్టు సమాచారం.
గత నెల 30న రాత్రి పెదవేగి మండలం అంకన్నగూడెం సర్పం చ్, టీడీపీ నేత చిదిరాల రాజేష్ రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడం, ఆయనపై హత్యాయత్నం జరి గిందంటూ వైఎస్సార్ సీపీ నేతల ఇళ్లపై అల్లరిమూకలు దాడులు చేసి వారిని తీవ్రంగా గాయపర్చడం తెలిసిందే. ఈ ఘటన దరిమిలా ఈనెల 1న ఉదయం వైఎస్సార్ సీపీ నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు 12రోజులుగా అక్రమ నిర్బంధంలో ఉంచి చిత్రహింస లకు గురి చేశారు. తొలుత వారిని ఏలూరు సీసీఎస్ స్టేషన్‌లోనే ఉంచినా తరువాత స్టేషన్లు మారుస్తూ ఇబ్బందులకు గురిచేశారు. పోలీసుల తీరుపై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు పోలీసు అధికారులు తమ అదుపులో ఉన్న వారిని ఒక్కొక్కరిగా విడుదల చేస్తున్నారు.
దిగొచ్చిన పోలీసులు
Published Sat, Jul 12 2014 1:42 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement